Swiggy
-
స్విగ్గీ ‘లాభాల’ డెలివరీ
ముంబై: ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ షేరు లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు 17% లాభాలు డెలివరీ చేసింది. ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.390)తో పోలిస్తే 8% ప్రీమియంతో రూ.420 వద్ద లిస్టయ్యింది. నష్టాల మార్కెట్లో ఈ షేరుకు డిమాండ్ లభించింది. ఇంట్రాడేలో 19.50% పెరిగి రూ.466 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 17% లాభంతో రూ.456 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1.03 లక్షల కోట్లుగా నమోదైంది. → ఐపీఓ లిస్టింగ్‌తో స్విగ్గీ కంపెనీలో 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. పబ్లిక్ ఇష్యూ కంటే ముందే స్విగ్గీ తన 5,000 మంది ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈ–సాప్స్) కింద పెద్ద మొత్తంలో షేర్లు కేటాయించింది. ఐపీఓ గరిష్ట ధర శ్రేణి రూ.390 ప్రకారం వీటి విలువ రూ.9,000 కోట్లుగా ఉంది. దలాల్ స్ట్రీట్‌లో షేరు రూ.420 వద్ద లిస్ట్ కావడంతో ఉద్యోగులకు కేటాయించిన షేర్ల విలువ అమాంతం పెరిగింది. దీంతో సుమారు 500 మంది ఉద్యోగులు ఒక్కొక్కరి దగ్గర షేర్ల విలువ రూ. కోటికి పైగా చేరింది. → స్విగ్గీ షేర్లు మార్కెట్లోకి లిస్ట్ కావడంపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ శుభాకాంక్షలు తెలిపారు. స్విగ్గీ, జొమాటోకు సంబంధించిన ఒక ఫొటోను ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేస్తూ ‘నువ్వు, నేను ఈ అందమైన ప్రపంచంలో..’ అంటూ రాసుకొచ్చారు. 5 ఏళ్లలో పటిష్ట వృద్ధి: సీఈఓ శ్రీహర్ష వచ్చే 3–5 ఏళ్లలో పటిష్ట వృద్ధి పథంలో దూసుకెళ్తామని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్‌స్టామార్ట్ నెట్‌వర్క్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. పెద్ద డార్క్ స్టోర్లను ప్రారంభిస్తామని చెప్పారు. పెద్ద నగరాల్లో సగటు డెలివరీ సమయం 17 నిమిషాల నుంచి 12 నిమిషాలకు తగ్గిందన్నారు. -
పోటీ లేకుండా చేస్తున్న స్విగ్గీ, జొమాటో
ముంబై: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీలు పోటీతత్వ చట్టాలను ఉల్లంఘించినట్లు కాంటిషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తులో తేలింది. కొన్ని రెస్టారెంట్ల భాగస్వాములతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకొని ఇరు సంస్థలు అనైతిక వ్యాపారాలకు పాల్పడినట్లు పేర్కొంది.‘తక్కువ కమీషన్ తీసుకుంటూ జొమాటో ఒప్పందం కుదుర్చుకుంది. తన ఫ్లాట్‌ఫామ్‌పై నమోదైతే, వ్యాపారాభివృద్ధికి తోడ్పాడతామంటూ స్విగ్గీ హామీలిస్తోంది. తద్వారా ఇరు సంస్థలు తమకు పోటీ లేకుండా పొటీతత్వ చట్టాలను అతిక్రమించాయి’ అని సీసీఐ పత్రాలు స్పష్టం చేశాయి. -
స్విగ్గీ ఐపీవో ‘డెలివరీ’ ఓకే
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్‌కామర్స్ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూకి మెరుగైన స్పందన లభించింది. చివరి రోజు శుక్రవారానికల్లా 3.6 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీ 16.01 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 57.53 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు అందాయి. క్విబ్ విభాగంలో 6 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 0.41 రెట్లు చొప్పున బిడ్స్ లభించాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు 1.14 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. రూ. 371–390 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 11,327 కోట్లు సమకూర్చుకుంది. మంగళవారం (5న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,085 కోట్లు సమీకరించిన విషయం విదితమే. రూ. 95,000 కోట్ల విలువలో కంపెనీ ఐపీవోకు రావడం గమనార్హం! ఆక్మే సోలార్... 2.75 రెట్లు స్పందన పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ ఏసీఎంఈ (ఆక్మే) సోలార్ పబ్లిక్ ఇష్యూకి బాగానే ఆదరణ దక్కింది. చివరి రోజు శుక్రవారానికల్లా 2.75 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. కంపెనీ 5.82 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 16 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 3.54 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 0.97 రెట్లు చొప్పున బిడ్స్ నమోదయ్యాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు 3.1 రెట్లు అధికంగా దరఖాస్తు చేయడం గమనార్హం! రూ. 275–289 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 2,900 కోట్లు సమకూర్చుకుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,300 కోట్లు లభించాయి. -
నేటి నుంచి స్విగ్గీ ఐపీవో
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్‌కామర్స్ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ నేడు(6న) ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకి రూ. 371–390 ఆఫర్ ధరలో వస్తున్న ఇష్యూ శుక్రవారం(8న) ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ. 4,499 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 6,828 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. తద్వారా రూ. 11,327 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. వెరసి 11.3 బిలియన్ డాలర్ల(రూ. 95,000 కోట్లు) విలువను ఆశిస్తోంది. ఇప్పటికే (2021 జూలై) లిస్టయిన ప్రత్యర్ధి కంపెనీ జొమాటో విలువ ప్రస్తుతం రూ. 2.13 లక్షల కోట్లకు చేరింది.నిధుల వినియోగమిలా...2014లో ఏర్పాటైన స్విగ్గీ 2024 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 611 కోట్ల నష్టం ప్రకటించింది. ఈక్విటీ జారీ నిధులను టెక్నాలజీ, క్లౌడ్ ఇన్ఫ్రా, బ్రాండ్ మార్కెటింగ్, రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వినియోగించనుంది.ఆఫర్ ధర: రూ. 371–390 సమీకరణ: రూ. 11,327 కోట్లురిటైలర్లకు కనీస లాట్: 38 షేర్లు ఆఫర్ ముగింపు: శుక్రవారం (8న)షేర్ల అలాట్మెంట్: 11న లిస్టింగ్: 13న -
స్విగ్గీకి రూ.35,453 జరిమానా!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.35,453 జరిమానా విధించింది. డెలివరీ దూరాలను పెంచి, కస్టమర్ల నుంచి అధికంగా ఛార్జీలు వసూలు చేసినట్లు కన్జూమర్ కోర్టు తెలిపింది. స్విగ్గీ వన్ మెంబర్షిప్ కొనుగోలుదారులకు కొంత దూరం వరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా డెలివరీ అందించాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా ఓ కస్టమర్ నుంచి డెలివరీ ఛార్జీలు వసూలు చేసినట్లు కోర్టు పేర్కొంది.‘హైదరాబాద్‌కు చెందిన సురేష్‌బాబు అనే కస్టమర్ స్విగ్గీ వన్ మెంబర్షిప్ కొనుగోలు చేశాడు. కొంత దూరం లోపు ఉచితంగా డెలివరీ చేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. నవంబర్ 1, 2023న అతను ఈ మెంబర్షిప్ కార్డును వినియోగించి ఫుడ్ ఆర్డర్ చేశాడు. నిబంధనల ప్రకారం స్విగ్గీ నిర్దిష్ట పరిధిలో ఉన్న కస్టమర్లకు ఉచితంగా డెలివరీ అందించాలి. సురేష్ ఆర్డర్ చేసిన డెలివరీ పరిధి కంపెనీ నిబంధనలకు లోబడి ఉంది. కానీ డెలివరీ దూరం 9.7 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్లకు సంస్థ పెంచిందని, దీని వల్ల రూ.103 అదనంగా డెలివరీ ఛార్జీ చెల్లించాడు’ అని కమిషన్ తెలిపింది.ఇదీ చదవండి: ఒక్కరోజులో రూ.7.5 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలు..సురేష్ అందించిన గూగుల్ మ్యాప్స్ స్క్రీన్షాట్లతో సహా ఇతర సాక్ష్యాలను కోర్టు సమీక్షించింది. డెలివరీ దూరంలో గణనీయమైన మార్పును గుర్తించింది. ఈ అంశంపై స్విగ్గీ విచారణకు హాజరు కాకపోవడం గమనార్హం. రూ.103 డెలివరీ ఛార్జీతో పాటు ఫిర్యాదు దాఖలు చేసిన తేదీ నుంచి 9 శాతం వడ్డీతో రూ.350.48ని తిరిగి చెల్లించాలని కమిషన్ తన తీర్పులో స్విగ్గీని ఆదేశించింది. కస్టమర్ అసౌకర్యానికి సంబంధించి రూ.5,000 చెల్లించాలని, ఫిర్యాదు ఖర్చుల కింద మరో రూ.5,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అదనంగా రూ.25,000 నష్టపరిహారాన్ని రంగారెడ్డి జిల్లా కమిషన్ వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని తెలిపింది. కోర్టు ఆదేశాలను పాటించేందుకు కంపెనీకి 45 రోజుల గడువు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. -
ఉద్యోగం కోసం పాత పద్దతి.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
సాధారణంగా ఉద్యోగం కోసం అప్లై చేయాలంటే.. ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు. టెక్నాలజీ బాగా పెరిగిన తరుణంలో జాబ్ కోసం లెటర్స్ పంపించడం వంటివి ఎప్పుడో కనుమరుగైపోయాయి. కానీ ఇటీవల ఓ వ్యక్తి ఉద్యోగం కోసం లెటర్ పంపించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఏఐను ఉపయోగించి రెజ్యూమ్‌లు తయారు చేస్తున్న ఈ కాలంలో.. ఒక వ్యక్తి పోస్ట్ ద్వారా డిజైనర్ ఉద్యోగానికి అప్లై చేస్తూ ఓ లెటర్ రాసి స్విగ్గీ డిజైన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ 'సప్తర్షి ప్రకాష్'కు పంపించారు. లేఖను అందుకున్న తరువాత ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. లెటర్ ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.ఫోటోలను ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. భౌతికంగా ఒక లేఖను స్వీకరించాను. డిజిటల్ యుగంలో స్కూల్ డేస్ గుర్తు చేశారు. ప్రస్తుతం డిజైనర్ ఉద్యోగానికి సంస్థలో ఎటువంటి ఓపెనింగ్స్ లేదు. కానీ దయ చేసిన నాకు ఈమెయిల్ చేయండి. నేను మీ ఆలోచనను చూడాలనుకుంటున్నాను. డిజైన్ ఓపెనింగ్స్ గురించి ఎవరికైనా తెలిస్తే.. తెలియజేయండి అంటూ స్విగ్గీ డిజైన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: రూ.123 కోట్లు విరాళం: ఎవరీ షన్నా ఖాన్..ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లలో కొందరు ఉద్యోగార్ధుల సృజనాత్మకత & నిబద్ధతను తెగ పొగిడేస్తున్నారు. ఈ డిజిటల్ యుగంలో కాగితాన్ని ఉపయోగించి ఉద్యోగానికి పోస్ట్ చేయడం.. చూడటానికి రిఫ్రెష్‌గా ఉందని ఒకరు వెల్లడించారు. ఇలా ఒక్కొక్కరు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.Received a physical letter from a designer wanting to join @Swiggy with a concept. In a digital age, this old-school approach stood outTo the sender: We may not have a role now, but please email me—I’d love to see your idea! 😄If anyone knows of design openings, please share! pic.twitter.com/WSGDaX0fsP— Saptarshi Prakash (@saptarshipr) October 30, 2024 -
10 నిమిషాల్లో బంగారు, వెండి నాణేల డెలివరీ..
నిత్యావసర వస్తువులను డెలివరీ చేసే ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌లు 'ధన త్రయోదశి' సందర్భంగా బంగారం, వెండి నాణేలను డెలివరీ చేయడానికి సిద్దమయ్యాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ వంటివి కేవలం 10 నిమిషాల్లో కస్టమర్లకు నాణేలను అందించనున్నట్లు సమాచారం.ధన త్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలును చాలామంది శుభప్రదంగా భావిస్తారు. అయితే జ్యువెలరీకి వెళ్లి షాపింగ్ చేసే ఓపిక, సమయం లేనివారు.. ఇప్పుడు గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బంగారం, వెండి నాణేలను డెలివరీ చేయడానికి జోయాలుక్కాస్, మలబార్ గోల్డ్ & డైమండ్స్, తనిష్క్ మొదలైనవి ఈ యాప్‌లతో జతకట్టాయి.ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 24 క్యారెట్ల 0.1 గ్రా, 0.25 గ్రా, 1 గ్రా సాధారణ గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో 5గ్రా, 11.66 గ్రా, 20 గ్రా స్వచ్ఛమైన వెండి నాణేలను కూడా ఈ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌లలో బుక్ చేసుకోవచ్చు. 24 క్యారెట్ల లక్ష్మీ గణేష్ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్లు కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.ఇదీ చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో..ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్ ద్వారా బంగారు, వెండి నాణేలను కొనుగోలు చేసే సమయంలో కస్టమర్లు ఏ జ్యువెలరీ ఎలాంటి నాణేలను అందిస్తుంది, ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకోవడానికి యాప్‌లని తనిఖీ చేయవచ్చు. కస్టమర్లు తప్పకుండా అధికారిక యాప్‌లను మాత్రమే తనిఖీ చేయాలి. లేకుంటే నకిలీ యాప్‌లు మోసం చేసే అవకాశం ఉంటుంది. -
నవంబర్ 6న స్విగ్గీ ఐపీవో!
న్యూఢిల్లీ: నిత్యావసరాలు, ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్రతిపాదిత రూ. 11,300 కోట్ల పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నవంబర్ 6న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందుకోసం ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ. 371 నుంచి 390 వరకు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇష్యూ నవంబర్ 8న ముగుస్తుందని, యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ తేదీ నవంబర్ 5గా ఉంటుందని వివరించాయి.ఐపీవో కింద రూ. 4,500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో రూ. 6,800 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రారంభ దశలో ఇన్వెస్ట్ చేసిన యాక్సెల్, ఎలివేషన్ క్యాపిటల్, నార్త్‌వెస్ట్ వెంచర్స్ వాటాలను విక్రయించడం ద్వారా తమ పెట్టుబడులపై 35 రెట్లు రాబడులు పొందనున్నట్లు తెలిపాయి.తాజా ఇష్యూ ద్వారా సేకరించిన నిధుల్లో రూ. 137 కోట్ల మొత్తాన్ని అనుబంధ సంస్థ స్కూట్నీ రుణాలను తీర్చేందుకు, రూ. 982 కోట్లను క్విక్ కామర్స్ సెగ్మెంట్లో డార్క్ స్టోర్ నెట్వర్క్ విస్తరణకు కంపెనీ వినియోగించనుంది. 2014లో ఏర్పాటైన స్విగ్గీ వేల్యుయేషన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో 13 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2023 మార్చి 31 నాటికి వార్షికాదాయం 1.09 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
విదేశాల నుంచి కూడా స్విగ్గీలో ఆర్డర్లు
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసిస్తున్న వారు భారత్‌లో తమ వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు వీలుగా స్విగ్గీ కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ’ఇంటర్నేషనల్ లాగిన్’ను ప్రవేశపెట్టింది. అమెరికా, కెనడా, జర్మనీ, బ్రిటన్, కెనడా తదితర దేశాల్లో నివసిస్తునవారికి ఇది అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ యూజర్లు ఇక్కడి వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు, స్విగ్గీలో భాగమైన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టామార్ట్‌లో షాపింగ్ చేసేందుకు, డైన్అవుట్ ద్వారా హోటల్స్‌లో టేబుల్స్‌ను బుక్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్‌లు లేదా అందుబాటులో ఉన్న యూపీఐ ఆప్షన్ల ద్వారా చెల్లించవచ్చని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ తెలిపారు. -
స్విగ్గీ కొత్త ఫీచర్: విదేశాల్లో ఉంటూనే..
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని స్విగ్గీ 'ఇంటర్నేషనల్ లాగిన్' పేరుతో సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. ఇది యునైటెడ్ స్టేట్స్, కెనడా, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, యూఏఈతో సహా 27 దేశాలలోని వినియోగదారులు ఫుడ్ డెలివరీ, కిరాణా షాపింగ్ వంటి వంటివి చేయడానికి అనుమతిస్తుంది.భారతదేశంలోని కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు అవసరమైన వస్తువులు లేదా బహుమతులను ఆర్డర్ చేయడానికి లేదా పంపడానికి స్విగ్గీ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్‌లు, యూపీఐ ఎంపికలతో డబ్బు చెల్లించవచ్చు.స్విగ్గీ ఇంటర్నేషనల్ లాగిన్ ఫీచర్ ద్వారా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కిరాణా లేదా నిత్యావసర వస్తువులను ఇంటికి పంపించడానికి పనికొస్తుంది. అంతే కాకుండా.. కుటుంబ సమావేశాలకు, ముఖ్యంగా పండుగల సమయంలో ఫుడ్, గిఫ్ట్స్ వంటివి చాలా అవసరం. అయితే విదేశాల్లో నివసిస్తున్న వారు నేరుగా గిఫ్ట్స్, ఫుడ్ ఇవ్వలేరు. కాబట్టి ఇంటర్నేషనల్ లాగిన్ ద్వారా ప్రత్యేక సందర్భాలలో తమ ప్రియమైన వారికి ఇలాంటివి స్విగ్గీ ద్వారా అందించి ఆశ్చర్యపరచవచ్చు.ఇదీ చదవండి: యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గంస్విగ్గీ గురించి2014లో ప్రారంభమైన స్విగ్గీ ప్రస్తుతం లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఫుడ్ డెలివరీలో అగ్రగామిగా ఉంటూ సుమారు 600 కంటే ఎక్కువ నగరాల్లో రెండు లక్షల కంటే ఎక్కువ రెస్టారెంట్లతో సహకరిస్తోంది. 43 నగరాల్లో పనిచేస్తున్న స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కేవలం 10 నిమిషాల్లో 20 కంటే ఎక్కువ కిరణా, ఇతర నిత్యావసర వస్తువులను డెలివరీ చేస్తోంది. వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించడమే లక్ష్యంగా స్విగ్గీ ముందుకు సాగుతోంది. -
మొన్న జొమాటో.. నేడు స్విగ్గీ: పెరిగిన ప్లాట్‌ఫామ్ ఫీజు
జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచిన తరువాత.. స్విగ్గీ కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. ఇప్పటికే 7 రూపాయలుగా ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 10లకు చేసింది. అంటే మూడు రూపాయలు పెంచిందన్నమాట. కాబట్టి ఇకపైన స్విగ్గీ ప్రతి ఆర్డర్ మీద రూ. 10 ఫీజు వసూలు చేస్తుంది.జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచిన తరువాత స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇప్పటికే యాప్‌లో కనిపిస్తున్నాయి. పండుగ సమయంలో సేవలను నిర్వీరంగా అందించడానికి ఈ ఫీజులను పెంచినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఇప్పుడు జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు కూడా రూ. 10లకు చేరింది.ఫుడ్ డెలివరీ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచడంతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫుడ్ ఆర్డర్ ఉచిత డెలివరీతో ప్రారంభమైంది, ఇప్పుడు జీఎస్టీ, డెలివరీ, ప్యాకింగ్ ఛార్జీలు, ప్లాట్‌ఫారమ్ ఫీజు ఇలా భారీగా పెంచేశారు అని వెల్లడించారు. డెలివరీ చార్జీలకంటే కూడా ప్లాట్‌ఫారమ్ ఫీజు భవిష్యత్తులో ఎక్కువవుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.🚨 Swiggy Also Increased Platform Fee To ₹10This Happened Right After Zomato’s HikeFood Ordering Started With Free Delivery, Now GST, Delivery & Packing Charges, Platform FeeZomato & Swiggy Does 3.5 Million Orders Daily— Ravisutanjani (@Ravisutanjani) October 23, 2024 -
ఆహార శుభ్రతకు ‘స్విగ్గీ సీల్’
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ తన వినియోగదారులకు కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. నిత్యం డెలివరీ చేసే ఆహారం పరిశుభ్రత, నాణ్యతను ధ్రువపరిచేలా ‘స్విగ్గీ సీల్’ పేరిట కొత్త సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం పుణెలో ఈ సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను 650 నగరాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.రెస్టారెంట్లలో తయారు చేస్తున్న ఆహారం శుభ్రత పట్ల అనుమానాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు పరిశుభ్రత పట్ల హామీ ఇచ్చేలా ‘స్విగ్గీ సీల్’ ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, మెరుగైన ప్యాకింగ్ ప్రమాణాలు అనుసరించే రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్‌కోర్టులకు ఈ స్విగ్గీసీల్ బ్యాడ్జ్‌ను జారీ చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుంటామన్నారు. పరిశుభ్రతకు సంబంధించి రెస్టారెంట్లో ఆడిట్ నిర్వహించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) గుర్తింపు పొందిన ఏజెన్సీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని చెప్పారు. రెస్టారెంట్లకు అందుబాటు ధరలోనే ఈ ఆడిట్ సేవలు ఉంటాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: దేశంలో మరో ‘యాపిల్’ తయారీదారు!వివిధ రెస్టారెంట్లలో పరిశుభ్రతకు సంబంధించి 70 లక్షల మంది యూజర్ల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ సేవలు ప్రారంభించినట్లు స్విగ్గీ తెలిపింది. ఈ సీల్ గుర్తింపు తీసుకున్న ఫుడ్ తయారీదారులు నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ఒకవేళ భవిష్యత్తులో కస్టమర్ల నుంచి సదరు రెస్టారెంట్ సేవలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు వస్తే బ్యాడ్జ్‌ను తొలగిస్తామని కంపెనీ తెలిపింది. ఈ సేవల వల్ల వినియోగదారులకు, రెస్టారెంట్లకు మేలు జరుగుతుందని వివరించింది. -
గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం పన్ను?
కర్ణాటక ప్రభుత్వం గిగ్ వర్కర్ల(షార్ట్‌టర్మ్, ఫ్లెక్సిబుల్ సమయాల్లో పని చేసేవారు) సంక్షేమం కోసం చర్యలు తీసుకోనుంది. వీరి భద్రత కోసం స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఉబెర్ వంటి ఆన్లైన్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లపై కర్ణాటక ప్రభుత్వం 1-2 శాతం పన్ను విధించాలని యోచిస్తోంది. ఈమేరకు సబ్‌కమిటీని ఏర్పాటు చేసి ఈ అంశంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు అధికారులు తెలిపారు.ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ (సామాజిక భద్రత, సంక్షేమం) బిల్లు, 2024కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనిపై వచ్చే వారం చర్చ జరగనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. ముసాయిదా బిల్లు ప్రకారం..రాష్ట్ర ప్రభుత్వం ‘ది కర్ణాటక గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ఫండ్’ పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేస్తుంది. దీని కోసం ఆన్లైన్ అగ్రిగేటర్ల నుంచి ‘ప్లాట్‌ఫారమ్ ఆధారిత గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫీజు’ వసూలు చేయాలని భావిస్తుంది. ఈ ఫీజును ప్రతి త్రైమాసికం చివరిలో రాష్ట్ర ప్రభుత్వానికి చేరేలా ముసాయిదా బిల్లులో ప్రతిపాదనలు చేర్చినట్లు అధికారులు చెప్పారు.ఈ విషయం తెలిసిన టెక్ స్టార్టప్ కంపెనీలు, ఇప్పటికే ఈ విభాగంలో సేవలందిస్తున్న సంస్థలు ఒక గ్రూప్‌గా చేరి తమ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్), ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వంటి వివిధ వాణిజ్య సంస్థల ద్వారా ఈ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి తమ వినతులు సమర్పించింది. ఈ బిల్లు వల్ల తమ వ్యాపారానికి నష్టాలు తప్పవని చెబుతున్నాయి. సంస్థల కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ సంస్థల ఎగుమతులు పెంపురూ.2 ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.6కు పెంపు..స్విగ్గీ ఏప్రిల్ 2023లో, జొమాటో ఆగస్టు, 2023లో ప్లాట్‌ఫామ్ రుసుమును రూ.2గా ప్రవేశపెట్టారు. అయినా కంపెనీలకు వచ్చే ఆర్డర్లు తగ్గకపోవడంతో కస్టమర్లు ఛార్జీల పెంపును అంగీకరిస్తున్నారని భావించారు. దాంతో క్రమంగా ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతూ రూ.6 వరకు తీసుకొచ్చారు. జొమాటో రోజూ సుమారు 22-25 లక్షల ఆర్డర్లను డెలివరీ ఇస్తోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గతంలో జొమాటో తన ప్లాట్‌ఫారమ్ ఫీజును ఆర్డర్‌కు రూ.9కి పెంచింది. స్విగ్గీ బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ఇతర నగరాల్లోని నిర్దిష్ట కస్టమర్లకు రూ.10 వసూలు కూడా వసూలు చేసిన సంఘటనలున్నాయి. -
‘సింగం ఎగేన్’ టీమ్‌తో కలిసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఒకే ఆర్డర్లో ఏకంగా 11,000 వడాపావ్‌ను డెలివరీ చేసి ఈ రికార్డ్ నెలకొల్పింది. ఈ ఘనత సాధించేందుకు ‘సింగం ఎగేన్’ సినిమా బృందంతోపాటు ‘రాబిన్‌హుడ్ ఆర్మీ’ అనే ఎన్జీఓతో కలిసి పని చేసినట్లు అధికారులు తెలిపారు.స్విగ్గీ ఇటీవల భారీ ఆర్డర్ల కోసం ప్రారంభించిన ‘స్విగ్గీ ఎక్స్ఎల్’ సదుపాయంతో ఈ డెలివరీలు అందించినట్లు చెప్పారు. ఇందుకోసం ‘సింగం ఎగేన్’ ఫేమ్ అజయ్ దేవగన్, ఆ సినిమా దర్శకుడు రోహిత్ శెట్టితో భాగస్వామ్యం అయ్యామని తెలిపారు. ముంబైలోని ఎంఎం మిఠాయివాలా తయారు చేసిన వడా పావ్లను ‘రాబిన్ హుడ్ ఆర్మీ’ ఎన్జీఓ సాయంతో బాంద్రా, జుహు, అంధేరీ ఈస్ట్, మలాడ్, బోరివాలిలోని పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు. విలే పార్లేలోని ఎయిర్పోర్ట్ హైస్కూల్, జూనియర్ కాలేజీలో ఈ ఈవెంట్ ప్రారంభమైంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ సేవలకు డేట్ ఫిక్స్ఈ సందర్భంగా స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ మాట్లాడుతూ..‘గడిచిన పదేళ్లలో స్విగ్గీ ముంబైతోపాటు ఇతర నగరాల్లో మిలియన్ల కొద్దీ వడా పావ్లను డెలివరీ చేసింది. కానీ గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం డెలివరీ చేసిన ఈ వడాపావ్ చాలా ప్రత్యేకమైంది. ఈమేరకు సింగం ఎగేన్ సినిమా టీమ్‌తోపాటు రాబిన్‌హుడ్ ఆర్మీతో జట్టుకట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ డెలివరీకి స్విగ్గీ ఎక్స్ఎల్ ఎంతో ఉపయోగపడింది’ అన్నారు. -
స్విగ్గీ ఐపీవో సన్నాహాలు
న్యూఢిల్లీ: ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సవరించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 3,750 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 18.52 కోట్ల(అంచనా విలువ రూ. 6,665 కోట్ల) షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి రూ. 10,000 కోట్లకుపైగా సమీకరించే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతక్రితం స్విగ్గీ దాఖలు చేసిన రహస్య దరఖాస్తుకు ఈ వారం మొదట్లో సెబీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కాని్ఫడెన్షియల్ విధానంలో స్విగ్గీ ఏప్రిల్ 30న సెబీకి తొలుత దరఖాస్తు చేసింది. దీని తదుపరి తిరిగి అప్డేటెడ్ ఫైలింగ్ చేయవలసి ఉంటుంది. మూడు వారాలపాటు వీటిపై పబ్లిక్ నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఆపై మరోసారి అప్డేటెడ్ సమాచారంతో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఈ బాటలో రెండోసారి దరఖాస్తు చేశాక ఐపీవో చేపట్టేందుకు వీలుంటుందని మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. నిధుల వినియోగమిలా ఐపీవో ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 137 కోట్లను అనుబంధ సంస్థ స్కూట్సీ రుణ చెల్లింపులకు, మరో రూ. 982 కోట్లు క్విక్ కామర్స్ విస్తరణలో భాగంగా డార్క్ స్టోర్ నెట్వర్క్ విస్తరణకు స్విగ్గీ వినియోగించనుంది. ఈ బాటలో రూ. 586 కోట్లు టెక్నాలజీ, క్లౌడ్ మౌలికసదుపాయాలకు, రూ. 930 కోట్లు బ్రాండ్ మార్కెటింగ్‌పైనా వెచి్చంచనుంది. 2014లో ఏర్పాటైన స్విగ్గీ 2024 ఏప్రిల్‌కల్లా 13 బిలియన్ డాలర్ల విలువను సాధించింది. -
ఫుడ్ డెలివరీ వేగంగా రావాలంటే?.. ఇలా చేయండి
ఈ రోజుల్లో ఫుడ్ కావాలంటే ముందుగా గుర్తొచ్చేది స్విగ్గీ, జొమాటో. అయితే ఈ ఫ్లాట్‌ఫామ్‌లలో ఫుడ్ ఆర్డర్ చేస్తే కొన్నిసార్లు డెలివరీ చేయడంలో ఆలస్యం అవుతుంది. అలాంటి ఆలస్యానికి స్వస్తి చెప్పడానికి ఓ మార్గం ఉందంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఆర్డర్ పెట్టినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ ఎంచుకోవాలి. ఆ సమయంలో మీకు డెలివరీ వేగంగా వస్తుంది. నిజం చెప్పాలంటే డెలివరీ ఏజెంట్స్ గోల్డ్ కస్టమర్ల కంటే కూడా ముందుగా మీకే డెలివరీ చేస్తారు. డెలివరీ మీకు ఆలస్యంగా వస్తే.. మీరు నేరుగా కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడవచ్చు. అంతే కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నప్పటికీ డెలివరీ ఏజెంట్‌కు మీరు యూపీఐ లేదా వాలెట్ నుంచి కూడా డబ్బు చెల్లించవచ్చు.ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!ఈ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇందులో ఒకరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నానని, డెలివరీ సకాలంలో వచ్చేసిందని పేర్కొన్నారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు మాట్లాడటానికి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అందుబాటులో ఉంటారని.. డబ్బు కూడా రీఫండ్ వచ్చేదని మరొకరు వివరించారు. -
బాహు‘బుల్’ ఐపీఓలొస్తున్నాయ్!
ఇప్పటిదాకా వచ్చినవి ఒక రేంజ్.. ఇకపై వచ్చేవి వేరే లెవెల్! అడుగుపెడితే మార్కెట్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే!! ఇప్పటికే సెపె్టంబర్లో ఇన్వెస్టర్లు ఐపీఓల వర్షంలో ముద్దవుతుండగా.. రాబోయే రెండు నెలల్లో బాహుబలి ఆఫర్లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. దేశంలో రెండో బడా కార్ల కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా అతిపెద్ద ఇష్యూగా రికార్డు బ్రేక్ చేయనుంది. ఇక ఫుడ్–గ్రాసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రెండో మెగా స్టార్టప్ ఆఫర్‌గా నిలవనుంది. ఈ రెండింటికీ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక మెగా ఐపీఓల జాతరకు రంగం సిద్ధమైంది. దక్షిణకొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్ ఐపీఓకు సెబీ తాజాగా ఆమోదం తెలపడంతో పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ కనీసం 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరించనుంది. హ్యుందాయ్ ఇండియా మాతృ సంస్థ (ప్రమోటర్) హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో కొంత వాటాను, అంటే 14.22 కోట్ల షేర్లను విక్రయిచనుంది. తాజా ఈక్విటీ షేర్లు ఏవీ జారీ చేయడం లేదు. ఈ ఇష్యూ పూర్తయితే ఎల్ఐసీ రికార్డును బద్దలవుతుంది. 2022లో ఎల్ఐసీ ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్లను సమీకరించింది. ఇప్పటిదాకా ఇదే దలాల్ స్ట్రీట్‌లో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్.రెండు దశాబ్దాల తర్వాత... దేశీ వాహన పరిశ్రమలో ఇదో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. 2003లో జపాన్ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ లిస్టింగ్ అయిన రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ దేశీయంగా ఒక కార్ల కంపెనీ ఐపీఓకు వస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అమ్మకాల పరంగా దేశంలో రెండో అతిపెద్ద కార్ల కంపెనీగా నిలుస్తున్న హ్యుందాయ్ ఇండియా మార్కెట్ క్యాప్ (విలువ) 18–20 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం మారుతీ మార్కెట్ విలువ దాదాపు 48 బిలియన్ డాలర్లు. కాగా, అక్టోబర్‌లో హ్యుందాయ్ ఐపీఓ వస్తుందని సమాచారం. 1996లో భారత్‌లోకి అడుగుపెట్టిన హ్యుందాయ్.. వివిధ కార్ల విభాగాల్లో 13 మోడల్స్ విక్రయిస్తోంది. గత నెలలో ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐపీఓ ద్వారా రూ.6,145 కోట్ల సమీకరించడంతో పాటు బంపర్ లిస్టింగ్ నేపథ్యంలో హ్యుందాయ్ మెగా ఇష్యూపై ఇన్వెస్టర్లు గురిపెడుతున్నారు. స్విగ్గీ డెలివరీ రెడీ...ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి కూడా సెబీ నుంచి ప్రాథమిక ఆమోదం లభించింది. సెబీ కొన్ని మార్పుచేర్పులు సూచించడంతో తుది డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను కంపెనీ త్వరలో దాఖలు చేయనుంది. ఏప్రిల్‌లో వాటాదారుల ఆమోదం ప్రకారం ఈ మెగా ఇష్యూ ద్వారా రూ.10,414 కోట్లను స్విగ్గీ సమీకరించనుంది. ఇందులో రూ.3,750 కోట్లను తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా కంపెనీ సమీకరించనుంది. మిగతా మొత్తాన్ని ప్రస్తుత ఇన్వెస్టర్లు కొంత వాటాను విక్రయించి సొమ్ము చేసుకోనున్నారు. తుది ఆమోదం మేరకు ఇష్యూ సైజు 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11,700 కోట్లు) ఉండొచ్చని అంచనా. 2014లో ఆరంభమైన స్విగ్గీ ప్రస్తు తం ఫుడ్ డెలివరీతో పాటు క్విక్ కామర్స్ (ఇన్‌స్టామార్ట్), హైపర్ లోకల్ లాజిస్టిక్స్ విభాగాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ 13 బిలియన్ డాలర్లుగా అంచనా. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1.09 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. 4,700 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, జొమాటో 2021లో బంపర్ లిస్టింగ్‌తో బోణీ చేసింది. రూ.9,375 కోట్లు సమీకరించింది. రూ.76 ఇష్యూ ధర కాగా, 60% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయింది. రెండేళ్లలో జొమాటో షేరు రూ.46 కనిష్ట స్థాయి నుంచి 520 శాతం (ప్రస్తుత ధర 286) ఎగబాకడం విశేషం. కాగా, స్విగ్గీ ఐపీఓ నవంబర్‌లో ఉండొచ్చనేది మార్కెట్ వర్గాల సమాచారం.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మొన్న బిగ్‌బీ.. నేడు మాధురీ దీక్షిత్: అవే షేర్స్ కొంటున్న సెలబ్రిటీలు
ప్రముఖ నటి 'మాధురీ దీక్షిత్' (Madhuri Dixit) ఇటీవల ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీలో రూ. 1.5 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ షేర్లను ఇన్నోవ్8 వ్యవస్థాపకులు 'రితేష్ మాలిక్' నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.మాధురీ దీక్షిత్, రితేష్ మాలిక్ ఇద్దరూ రూ. 3 కోట్ల విలువైన షేర్స్ కొనుగోలు చేసి స్విగ్గిలో వాటాదారులయ్యారు. వీరిరువురు ఒక్కో షేరుకు రూ. 345 చొప్పున చెల్లించినట్లు సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కాగా ఇప్పటికే స్విగ్గిలో అమితాబ్ బచ్చన్ కూడా ఇన్వెస్ట్ చేసారు.ఇదీ చదవండి: వాటా కొనుగోలు చేసిన బిగ్‌బీ కుటుంబంబెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్విగ్గీ.. త్వరలోనే ఐపీఓకు రానుంది. ఈ ఐపీఓ ద్వారా సుమారు ఒక బిలియన్ డాలర్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. అయితే ఈ ఐపీఓకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ ఆదాయం 36 శాతం పెరిగి రూ. 11,247 కోట్లకు చేరుకుంది. -
బెంగళూరు కర్ణాటకలో ఉందా .. పాకిస్థాన్‌లో ఉందా?
బెంగళూరు కర్ణాటకలో ఉందా .. పాకిస్థాన్‌లో ఉందా? అని ప్రశ్నిస్తూ ఓ మహిళ చేసిన ట్వీట్ చర్చకు దారి తీసింది.బెంగళూరు కేంద్రంగా నివసిస్తున్న ఓ మహిళ తాను ఫుడ్ ఆర్డర్ పెట్టానని, డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్‌కి కన్నడ రాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘బెంగళూరు కర్ణాటకలో ఉందా లేదా పాకిస్థాన్‌లో ఉందా? అని ప్రశ్నిస్తూ మీ డెలివరీ ఉద్యోగికి కన్నడ,ఇంగ్లీష్ కూడా మాట్లాడలేకపోతున్నారు. కనీసం అర్థం చేసుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. హింది మేం కూడా నేర్చుకోవాలని మీరు ఆశిస్తున్నారా? భాషని మాపై రుద్దడం ఆపండి. మీ డెలివరీ పార్ట్నర్లు కన్నడ నేర్చుకునేలా చూడండి’ అని సదరు మహిళ ట్వీట్ చేశారు.Bengaluru is in Karnataka or Pakistan @Swiggy ?Your delivery guy is neither speaking nor understanding #kannada ,not even #English. Do you expect us to learn his state language #Hindi in our land? Stop imposing things on us and make sure your delivery persons know #Kannada. pic.twitter.com/smzQ6Mp7SV— Rekha 🌸 (@detached_98) September 12, 2024అయితే, ఆమె చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వినియోగ దారుడు భారత్‌లో ప్రతి 50 కిలోమీటర్లకు భాష మారుతుంది. కానీ భాష విషయంలో తమిళ, కన్నడిగులు అంత కఠినంగా ఉండరు. అలా ఉండకూడదు. భారతదేశం వైవిధ్యం, అనేక భాషలతో కూడిన దేశం, అన్ని భాషలను గౌరవించాలి.మరొకరు మీరు డెలివరీ చేసే వ్యక్తితో ఎందుకు మాట్లాడాలి? అని ఓ నెటిజన్ ప్రశ్నిస్తుంటే.. డెలివరీ సకాలంలో జరిగినంత కాలం డెలివరీ బాయ్ భాషా నైపుణ్యాల గురించి ఎవరు పట్టించుకుంటారు? అని మరోకరు అండగా నిలుస్తున్నారు. మీరు నిజంగా డెలివరీ చేసే వ్యక్తితో ఎందుకు మాట్లాడాలి? మీ ఆహారాన్ని తీసుకోండి. రేటింగ్ ఇవ్వండి అది చాలు’ అని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి : ప్రధానిగా నాకు అవకాశం వచ్చింది -
స్విగ్గీలో ‘సీక్రెట్’ ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్, డెలివరీ కంపెనీ స్విగ్గీ పరిశ్రమలో తొలిసారిగా వినూత్న ఫీచర్‌ను పరిచయం చేసింది. ఫుడ్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఇన్‌కాగ్నిటో మోడ్ ద్వారా వినియోగదార్లు ప్రైవేటుగా ఆర్డర్ చేయవచ్చు. అంటే ఆర్డర్ వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంటాయి. ఇన్‌కాగ్నిటో మోడ్ యాక్టివేట్ చేస్తే చాలు. యాప్ హిస్టరీలో ఆర్డర్ వివరాలు ఎక్కడా కనిపించవు. ఆర్డర్ వివరాలను మాన్యువల్‌గా డిలీట్ చేసే అవసరం లేదని కంపెనీ చెబుతోంది. ఆర్డర్ తాలూకు ఉత్పత్తులు డెలివరీ అయ్యాక ఏవైనా సమస్యలు ఉంటే మూడు గంటలపాటు ట్రాక్ చేసేందుకు వీలు ఉంటుంది. -
ఒకప్పుడు ఫుడ్ డెలివరీ ఏజెంట్..నేడు మోడల్‌గా..!
ఒక వ్యక్తి ఫుడ్ డెలివరీ స్థాయి నుంచి మోడల్‌గా ఎదిగి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. తన కలను సాకారంచేసుకునేందుకు అతను పడిన కష్టాలు, అవమానాలు ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అతనెవరు? ఎలా తన కలను సాకారం చేసుకున్నాడంటే..ముంబైకి చెందిన సాహిల్ సింగ్ మోడల్‌గా తన సక్సెస్ జర్నీ ఎలా సాగిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. తాను రెండేళ్లు స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసినట్లు తెలిపారు. ఆ తర్వాత బర్గర్ కింగ్‌లో ఒక ఏడాది చెఫ్ పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. తన తొలి మోడలింగ్ ప్రదర్శనకు ముందు ఎనిమిది నెలలు పాటు మ్యాంగో మార్ట్‌లో పనిచేసినట్లు వివరించాడు. అంతేగాదు పాఠశాల విద్య పూర్తి అయిన తర్వాత నుంచే పలు రకాల ఉద్యోగాలు చేసినట్లు తెలిపాడు. అయితే స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా నెలకు రూ. 18,000 నుంచి రూ. 22,000 సంపాదించినట్లు తెలిపాడు. 2009లో ఓ మోడల్ పోస్టర్ చూసిన తర్వాత తాను ఏం చేయాలనేది తెలిసిందన్నాడు. ఆ తర్వాత మోడల్ అయ్యేందుకు కావాల్సిన పరిజ్ఞానంపై దృష్టిసారించినట్లు తెలిపాడు. అందుకోసం రోడ్డుపక్కనే వాలెట్లు వంటివి అమ్మేవాడినని కూడా చెప్పుకొచ్చాడు. అంతేగాదు దాదాపు 200 ఆడిషన్స్ చేసినట్లు తెలిపాడు. అలా ఈ ఏడాది చివరికి ర్యాంప్‌పై నడిచే అవకాశాన్ని దక్కించుకోగలిగాని ఆనందంగా చెప్పాడు. తనను మోడల్‌గా స్ట్రీక్స్ అనే ఫ్యాషన్ సంస్థ ఎంపిక చేసినట్లు వెల్లడించాడు. తనలోని లోపాలను గురించి కూడా నిజాయితీగా వివరించాడు. తన ఎత్తు కేవలం 5 అడుగుల 10 అంగుళాలని, ఇది బెస్ట్ మోడల్‌గా ఎంపికయ్యేందుకు కావాల్సిన అర్హత కాదని చెప్పాడు. తాను ర్యాంప్‌పై నడిచేలా అనుమతించమని పదేపదే అభ్యర్థించాల్సి వచ్చేదని అన్నారు. అయితే స్ట్రీక్స్ తనను హీల్స్ ధరించాలనే షరతుపై వారు అందుకు అంగీకరించినట్లు తెలిపారు. అంతేగాదు మోడల్ అయ్యేందుకు ఎలాంటి టెక్నీక్స్ ఫాలో అవ్వాలో సూచించాడు. అంతేగాదు ఈ ఫీల్డ్‌లోకి కొత్తగా వెళ్తున్నవారికి మార్గదర్శకత్వం వహించేలా ఇన్‌స్టాగ్రాంలో కొత్త సిరిస్ ప్రారంభించాడు. అలాగే మోడలింగ్ రంగంలో రాణించాలంటే ఫోటోగ్రాఫర్లు, స్టైలిస్ట్‌లు, డిజైనర్లు, మంచి స్టూడియో వ్యక్తులు వంటి నెట్వర్క్ ఉండాలి. అప్పుడే ఈజీగా మోడల్ అవ్వగలరని చెబుతున్నాడు. ఈ నెట్వర్క్ కోసం సోషల్ మీడియా వంటి సాయంతో అలాంటి వ్యక్తులకు టచ్‌లో ఉండేలా నేరుగా మెసేజ్‌లు పెట్టడం, ఇమెయిల్స్ పంపడం వంటివి చేయాలని సూచించాడు. నిజంగా ఇతడి కథ ఎందరికో స్పూర్తి కదూ..!. View this post on Instagram A post shared by Sahil Singh | fashion & grooming tips | (@fashiontipssahil) (చదవండి: ప్రపంచ కొబ్బరి దినోత్సవం: కొబ్బరితో చేసే ప్రసిద్ధ వంటకాలివే..!) -
ప్రముఖ కంపెనీ వాటా కొనుగోలు చేసిన బిగ్‌బీ కుటుంబం?
బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కుటుంబం ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో కొంత వాటాను కొనుగోలు చేసింది. అలాగే, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ రామ్‌డియో అగర్వాల్ స్విగ్గీతో పాటు జెప్టోలో వాటాను కొనుగోలు చేసినట్లు ఈ వ్యవహరంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.స్విగ్గీ ఐపీఓ ద్వారా నిధులు సేకరిస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే క్విక్ కామర్స్ బిజినెస్‌కు పబ్లిక్ మార్కెట్లో పెట్టుబడిదారుల నుంచి ఆసక్తి పెరుగుతోంది. చాలామంది ప్రముఖులు ఈ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసి లాభాలు గడించాలని చూస్తున్నారు. తాజాగా బిగ్‌బీ కుటుంబానికి చెందిన కార్యాలయం స్విగ్గీలో కొంత వాటాను కొనుగోలు చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ రామ్‌డియో అగర్వాల్ కూడా స్విగ్గీతో పాటు జెప్టోలోనూ వాటాను కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: ఈ ఆఫర్ ఓ తుఫాన్!రెవెన్యూ ఎలా అంటే..స్విగ్గీ దేశీయంగా దాదాపు 580 నగరాల్లో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తోంది. రెస్టారెంట్లు, ఆహారప్రియుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కస్టమర్లు తమకు ఇష్టమైన రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ఒక వేదికను అందిస్తుంది. దాంతోపాటు వినియోగదారుల నుంచి ఆర్డర్లను స్వీకరించడానికి రెస్టారెంట్లుకు అవకాశం కల్పిస్తోంది. అయితే అందుకోసం కంపెనీ ప్లాట్‌ఫామ్ ఫీజు, ఇతర ఛార్జీలను వసూలు చేస్తోంది. ఆన్లైన్ ప్రకటనల వల్ల కూడా రెవెన్యూ సంపాదిస్తోంది. స్విగ్గీ కేవలం ఆన్లైన్ ఫుడ్ డెలివరీకే పరిమితం కాకుండా ఇన్‌స్టామార్ట్ ద్వారా క్విక్ కామర్స్ సేవలందిస్తోంది. -
ఒక్కరోజులో సరికొత్త రికార్డ్!.. రాఖీ వేళ నిమిషానికి..
అన్నా చెల్లల్ల అనుబంధానికి గుర్తుగా చేసుకునే పండుగ 'రక్షా బంధన్' (రాఖీ). ఈ పండుగ వేళ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ గణనీయమైన అమ్మకాలను నివేదించాయి. 2023లో జరిగిన మొత్తం అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు భారీగా పెరిగాయి.రాఖీ పండుగ వేళ నిమిషాల వ్యవధిలో ఆల్-టైమ్ హై ఆర్డర్లను ఒక రోజులో అధిగమించామని బ్లింకిట్ సీఈఓ 'అల్బీందర్ దిండ్సా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో పేర్కొన్నారు. ఇందులో చాక్లెట్స్ అమ్మకాలు కూడా చాలానే ఉన్నట్లు వెల్లడించారు. బ్లింకిట్‌లో నిమిషానికి 693 రాఖీలు విక్రయించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.రక్షా బంధన్ సమయంలో బ్లింకిట్ తన కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. దీంతో అమెరికా, కెనడా, జర్మనీతో సహా ఆరు దేశాల నుంచి ఆర్డర్లను స్వీకరించినట్లు ధిండ్సా వెల్లడించారు.స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కూడా రాఖీ రోజు అమ్మకాలు బాగా పెరిగాయని కంపెనీ కో ఫౌండర్ 'ఫణి కిషన్' వెల్లడించారు. మేము ఏడాది పొడవునా విక్రయించే రాఖీల కంటే.. రాఖీ పండుగ రోజు ఎక్కువ విక్రయించగలిగాము. ఈ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువని ఆయన అన్నారు. ముంబైలో ఒక వ్యక్తి తన సోదరికి 11000 రూపాయల విలువైన బహుమతులను కూడా ఇచ్చినట్లు.. ఇది ఇప్పటివరకు తాము చూసిన వాటిలో ఇదే అతిపెద్ద ఆర్డర్ అని కిషన్ వెల్లడించారు. ఈ ఆర్డర్లో హామ్లీస్, చాక్లెట్లు, పువ్వులు, కొన్ని బ్యూటీ కాస్మొటిక్స్ ఉన్నట్లు సమాచారం. -
నిశ్చితార్థానికి జంట ‘క్రేజీ డీల్’ : వెడ్డింగ్ డీల్ కూడా మాదే అంటున్న స్విగ్గీ
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు నిమిషాల్లో వేడి వేడి ఫుడ్‌ను మన కాళ్ల దగ్గరకు తెచ్చిపెడుతున్నాయి. పార్టీ మూడ్ లోనో, ఓపికలేనపుడో, వర్షం వచ్చినపుడో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం దాదాపుఅందరికీ అలవాటే. అందరిలాగా తానూ చేస్తే కిక్ ఏముంది అనుకున్నారో ఏమోగానీ, ఒక జంట తమ ఎంగేజ్మెంట్ సెర్మనీకి వచ్చిన అతిథులకు ఏకంగా స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను ఒక వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై మీమ్స్ ఫన్సీ కామెంట్స్ వైరల్‌గా మారాయి.ఒక జంట వారి నిశ్చితార్థ వేడుకలో సాంప్రదాయ క్యాటరింగ్‌కు బదులుగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్‌ను ఎంచుకున్నారు. ఈ వేడుకు హాజరైన వ్యక్తి ఈ విషయాన్ని గమనిం చాడు. డెలివరీ బాయ్. ఫంక్షన్లో ఉన్న ఒక టేబుల్‌పై ప్లాస్టిక్ ఫుడ్ బాక్స్‌ల వరుసలను పేర్చుతున్న చిత్రాన్ని షేర్ చేసారు. ఇది వైరల్‌గా మారడంతో స్విగ్గీ కూడా స్పందించింది.ఈ కుర్రాళ్ల కంటే ఉపయోగించినట్టుగా, క్రేజీ డీల్‌ను ఇంకెవరూ ఇలా వాడలేదు.. పెళ్లి భోజనాలు కూడా మా దగ్గరే ఆర్డర్ చేసుకోండి’’ అంటూ రిప్లయ్ ఇచ్చింది. భోజనాలు వాళ్లింట్లో, చదివింపులు(జీపే) మాకు అంటూ ఒకరు, వాళ్ల యూపీఐ క్యూఆర్ పెడతారు అని ఒక కోడ్‌ని ఉంచుతారు. మరో యూజర్, వాళ్ల నిశ్చితార్థం, వాళ్ల పైసలు, వాళ్ల ఇష్టం..ఇక్కడ సమస్య కనిపించడం లేదు’’ అంటూ మరొకరు పన్నీగా కమెంట్ చేశారు.no one has used our Crazy Deals better than these guys 😭😭 shaadi ka khana bhi humse mangwa lena 🥰 https://t.co/XIo2z2TnYX— Swiggy Food (@Swiggy) August 4, 2024 -
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సీవోవోగా సాయిరామ్ కృష్ణమూర్తి
క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నియమితులయ్యారు. తమసీనియర్ వైస్ ప్రెసిడెంట్, అలాగే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా సాయిరామ్ కృష్ణమూర్తిని నియమించినట్లు కంపెనీ తెలిపింది.కృష్ణమూర్తి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఆపరేటింగ్ యూనిట్లను పర్యవేక్షిస్తారని, ఇందులో డార్క్ స్టోర్ కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల కార్యకలాపాలు, నగర వృద్ధి, విస్తరణ వంటివి ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ టెక్, రిటైల్‌లో సాయిరామ్ కృష్ణమూర్తికి 18 సంవత్సరాల నాయకత్వ అనుభవం ఉంది.సాయిరామ్ కృష్ణమూర్తి గతంలో మోర్ రిటైల్‌లో సూపర్ మార్కెట్ బిజినెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. అక్కడే చీఫ్ మర్చండైజింగ్ ఆఫీసర్‌గానూ వ్యవహరించారు. ఓలా మొబిలిటీలో ఇండియా సప్లై హెడ్‌గా, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్‌లో 14 ఏళ్లు సేల్స్, మార్కెటింగ్, ఇన్నోవేషన్లలో పనిచేశారు.