ఈ రోజుల్లో ఫుడ్ కావాలంటే ముందుగా గుర్తొచ్చేది స్విగ్గీ, జొమాటో. అయితే ఈ ఫ్లాట్‌ఫామ్‌లలో ఫుడ్ ఆర్డర్ చేస్తే కొన్నిసార్లు డెలివరీ చేయడంలో ఆలస్యం అవుతుంది. అలాంటి ఆలస్యానికి స్వస్తి చెప్పడానికి ఓ మార్గం ఉందంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఆర్డర్ పెట్టినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ ఎంచుకోవాలి. ఆ సమయంలో మీకు డెలివరీ వేగంగా వస్తుంది. నిజం చెప్పాలంటే డెలివరీ ఏజెంట్స్ గోల్డ్ కస్టమర్‌ల కంటే కూడా ముందుగా మీకే డెలివరీ చేస్తారు. డెలివరీ మీకు ఆలస్యంగా వస్తే.. మీరు నేరుగా కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడవచ్చు. అంతే కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నప్పటికీ డెలివరీ ఏజెంట్‌కు మీరు యూపీఐ లేదా వాలెట్ నుంచి కూడా డబ్బు చెల్లించవచ్చు.
ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
ఈ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇందులో ఒకరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నానని, డెలివరీ సకాలంలో వచ్చేసిందని పేర్కొన్నారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు మాట్లాడటానికి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అందుబాటులో ఉంటారని.. డబ్బు కూడా రీఫండ్ వచ్చేదని మరొకరు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment