ప్రముఖ ఫుడ్ ఆగ్రిగేటర్ జొమాటో కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇటీవల జొమాటో ప్రో అండ్ ప్రో ప్లస్ స్కీమ్‌ను నిలిపివేసింది. తాజాగా ఆఫర్ స‍్కీమ్ స్థానంలో ‘లాయల్టీ ప్రోగ్రామ్’ను అందించనున్నట్లు జొమాటో సీఎఫ్‌వో అక్షాంత్ గోయల్ తెలిపారు.
ఇటీవల జొమాటో జులై - సెప్టెంబర్ వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా..యాప్‌లో ఆర్డర్ ఫీచర్‌పై యూజర్ల నుంచి ఫిర్యాదులు అందాయని అక్షాంత్ గోయల్ చెప్పారు.అందుకే కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా యాప్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకోసం జొమాటో ప్రో అండ్ ప్రో ప్లస్ స్కీమ్‌ను నిలిపివేసి.. ఆ స్థానంలో కస్టమర్లకు డిస్కౌంట్ ఇచ్చేలా లాయల్టీ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. మరి ఆ లాయల్టీ ప్రోగ్రాం వల్ల కస్టమర్లు ఎలాంటి లబ్ధి పొందనున్నారు? ఆ స్కీమ్ ఎలా ఉంటుందనే అంశంపై జొమాటో ప్రతినిధులు స్పష్టత ఇవ్వలేదు.
స్విగ్గీలో
మరో ఫుడ్ ఆగ్రిగేటర్ స్విగ్గీ లాయల్టీలో స్కీమ్ కింద స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ ఆర్డర్లపై కస్టమర్లకు సంస్థ నిర్దేశించిన దూరం వరకు అన్ లిమిటెడ్ ఫ్రీ డెలివరీలు అందించనుంది. దీంతో పాటు పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ కోసం అదనపు సౌకర్యాలు అందించేందుకు 3నెలల సబ్‌స్క్రిప్షన్ కింద రూ.399, 12నెలల సబ్ స్క్రిప్షన్ కింద రూ. 899 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే సబ్ స్క్రిప్షన్ మోడల్‌ను ( జొమాటో ప్రో అండ్ ప్రో ప్లస్ స్కీమ్) జొమాటో తొలగించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment