సాక్షి,ముంబై: ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోకు పోటీగా ప్రభుత్వ సంస్థ దూసుకుపోతోంది. తక్కువ ధరలతో ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్‌డీసీ జొమాటో, స్విగ్గీలకు సవాల్ విసురుతోంది. చిన్న స్థాయి సంస్థలకు టెక్నాలజీ పరంగా ఆశించిన స్థాయిలో సేవలు అందకపోవడంతో కేంద్రం ఓపెన్ సోర్స్డ్ మెథడాలజీతో ఈ నూతన ఒపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్‌డీసీ)ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూర్ ఢిల్లీ సహా 240 నగరాల్లో తన సేవల్లో దూసుకుపోతోంది. ఆహారంతోపాటు నిత్యావసర సరుకుల రోజువారీ డెలివరీల సంఖ్య 10 వేల దాటేసింది. డిజిటల్ కామర్స్ ఇన్ ఇండియాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే లక్క్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం ప్రారంభించింది.
ఓఎన్‌డీసీ ప్రత్యేకత ఏంటి?
వాణిజ్య మంత్రిత్వ శాఖకు కెందిన పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం (DPIIT) ప్రవేశపెట్టిన ఓపెన్ ఇ-కామర్స్ ప్రోటోకాల్. థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా నెట్‌వర్క్‌లోని క్రయ విక్రయ దారులు చేసుకోవచ్చు. వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకారం, ఓఎన్‌డీసీ చిన్న రిటైల్ సంస్థలు పెద్ద టెక్-ఆధారిత ఇ-కామర్స్ కంపెనీల దాడిని తట్టుకుని నిలబడేలా సహాయం చేస్తుంది. అలాగే పేమెంట్ సిస్టంలో సంచలనాలకు యూపీఐ ఎలా ఉపయోగపడిందో ఇ-కామర్స్ రంగంలో ఇది పెను మార్పులకు దారితీయనుంది.
కొనుగోలుదారులు వివిధ బ్రాండ్‌లు, లోకల్ వ్యాపారవేత్తలనుంచి విస్తృత ఉత్పత్తులను సెర్చ్ చేయవచ్చు. కొనుగోలు చేయవచ్చు. ఆహారం, పానీయాలు, బ్యూటీ, వ్యక్తిగత సంరక్షణ, హోం డెకరేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫ్యాషన్‌తో సహా పలు ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. పేటీఎం మీషో, స్పైస్ మనీ, క్రాఫ్ట్స్‌విల్లా మేజిక్ పిన్, పిన్‌కోడ్, లాంటి ఇతర ఆన్‌లైన్ స్టోర్‌లనుండి కూడా కస్టమర్‌లు ONDC ద్వారా ఆర్డర్ చేయవచ్చు. ప్లాట్‌ఫారమ్‌కు ప్రస్తుతం అంతర్గత డెలివరీ భాగస్వాములు లేరు. eKart, Dunzo, Delhivery మొదలైన థర్డ్ పార్టీల ద్వారా డెలివరీ చేస్తుంది.
సోషల్‌మీడియాలో కస్టమర్ల పోస్ట్‌లు చక్కర్లు
స్విగ్గీ, జొమాటోతో పోలిస్తే ఓఎన్‌డీసీ 3 శాతం కమీషన్‌ను వసూలు చేస్తుంది. స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ యాప్‌లు 25 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు ఓఎన్‌డీసీని ఎంచుకుంటున్నారు. దీంతో గత వారం రోజులుగా ఓఎన్‌డీసీ ఫుడ్ ఆర్డర్‌ల ధరలను పోల్చుతూ అనేక పోస్ట్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పోస్ట్‌లలో చాలా వరకు, ఫుడ్ డెలివరీ యాప్‌లతో పోలిస్తే, తక్కువకే, కొన్ని సందర్భాల్లో సగం రేటుకే లభిస్తోందంటూ యూజర్లు సంబర పడుతున్నారు. సేమ్ ఆర్డర్, సేమ్ ప్లేస్, సేమ్ టైం అంటూ ధరలను కంపేర్ చేస్తుండటం గమనార్హం.
ఇది లాభాపేక్ష లేని ప్లాట్‌ఫారమ్ అని మధ్యవర్తి లేకపోవడం దీనికి పెద్ద ఎసెట్ అని ఇన్ఫోసిస్ కోఫౌండర్, ఓఎన్‌డీసీ సలహా మండలి సభ్యుడు నందన్ నీలేకని గతం లోనే ప్రకటించారు. నేరుగా విక్రేతకు చెల్లించడం గొప్పవిషయం, యాప్ కమీషన్ లేకపోవడంతో తక్కువ చార్జీలతో కస్టమర్‌ల ఆదరణ లభస్తుందన్నారు.
There are over 29,000+ Merchants from 236 Cities in India on ONDC Seller Network Currently
— Ravisutanjani (@Ravisutanjani) May 8, 2023
You can search for the Listed Merchants & City here - https://t.co/xelXMQJYTx pic.twitter.com/dZ6JJt4LNq
Now you know the ONDC impact!
Same order, same place and same time.
The difference are clearly visible. pic.twitter.com/JG7xpjN8NB
— Ankit Prakash (@ankitpr89) May 4, 2023
A very interesting find. Same pizza store but one is 20% cheaper.
ONDC 👇 Zomato 👇 pic.twitter.com/pWWPjvHJFt
— Udit Goenka (@iuditg) May 3, 2023
Comments
Please login to add a commentAdd a comment