low cost
-
వాడిన విరులూ పరిమళిస్తాయి
అమ్ముడుపోని పూలు ఏమవుతాయి? కొనేవాళ్ల కోసం ఎదురు చూసే సహనం పూలమ్మాయికి ఉంటుంది, కానీ పూలకు ఉండదు. రెక్కలు విచ్చుకోవడం, ఆ రెక్కలు వాలిపోవడంలో అవి వాటి సమయాన్ని క్రమం తప్పనివ్వవు. మార్పుకు నాంది పూలసాగు రైతుల జీవితాలను సువాసనభరితం చేస్తోందా? మొక్కనాటి, నీరు పెట్టి, ఎరువు వేసి పెంచిన మొక్కలు మొగ్గతొడిగితే ఆనందం. ఆ మొగ్గలు విచ్చేలోపు కోసి మార్కెట్‌కు చేర్చాలి. తెల్లారేటప్పటికి నగరంలోని మార్కెట్‌కు చేరాలంటే పూలను కోసే పని అర్ధరాత్రి నుంచి మొదలవ్వాలి. ఆ సమయంలో ΄పొలంలో పనికి వచ్చే వాళ్లు ఉండరు. వచ్చినా రెండింతల కూలి ఇవ్వాలి. సాగు ఖర్చులు, రవాణా ఖర్చులు, తన శ్రమ కలిపి ధర నిర్ణయించుకోవాలి. చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. మార్కెట్లో పూలు ఎక్కువై΄ోయి డిమాండ్ తగ్గిన రోజుల్లో పూలు కోయడానికిచ్చే కూలి కూడా గిట్టదని ఆ పూలను చెట్లకే వదిలేస్తుంటారు. ఇంజనీరింగ్ టెక్నాలజీతో పరిమళాలను మట్టిపాలు కాకుండా కాపాడుతున్నారు కేజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ సంయుక్త. తక్కువ ఖర్చులో ఆటోమేటిక్ ఇన్సెన్స్ మేకింగ్ మెషీన్‌కు రూపకల్పన చేశారామె. ఇంజనీర్ సమాజంలో మార్పు తీసుకువచ్చే చేంజ్‌మేకర్ కావాలనే ఆశయాన్ని ఆచరణలో పెట్టారామె. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో పరిశోధన చేస్తున్న సంయుక్త పర్యావరణహితమైన ఆవిష్కరణ కోసం గ్రామాల బాట పట్టారు. ఈ మెషీన్ రూపకల్పనకు దారి తీసిన కారణాలను సాక్షితో పంచుకున్నారామె.మహిళలతో ముందడుగు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను ‘‘2020లో స్థాపించాం. సమాజంలో అవసరమైన ఇంజనీరింగ్ ఆవిష్కరణల గురించి అధ్యయనం చేయడానికి 72 గ్రామాల్లో పర్యటించాం. మహిళలు, మగవాళ్లు, రైతులు, ఇతర వృత్తుల్లోని వారు, పిల్లలు, వృద్ధులు... ఇలా అన్ని కేటగిరీల వ్యక్తులతో మాట్లాడాం. అక్కడి సమస్యలు తెలిశాయి, అవసరాలు అర్థమయ్యాయి. వాటిని పరిష్కరించడానికి ఏం చేయాలనే స్పష్టత కూడా వచ్చింది. అన్నింటినీ మేం పరిష్కరించలేం, ప్రభుత్వాలు మాత్రమే చేయగలిగిన వాటిని వదిలేసి, మా స్థాయిలో పరిష్కరించగలిగే పన్నెండు ప్రాజెక్టుల జాబితా తయారు చేసుకున్నాం. వాటిలో మొదటిది అగరువత్తి తయారీ యంత్రం. అప్పటికి మార్కెట్లో ఉన్న అగరువత్తి మేకింగ్ మెషీన్ల ధర నాలుగైదు లక్షల్లో ఉంది. మేము అరవై వేలలో తయారు చేశాం. రైతుల దగ్గర వృథా అయ్యే పూలు, ఆలయాల దగ్గర అమ్ముడు కానివి, దేవునికి పెట్టి తీసిన పూలను సేకరించి అగరువత్తి, సాంబ్రాణి కడ్డీలు తయారు చేస్తున్నాం. స్థానిక మహిళలకు శిక్షణనిచ్చాం. వారే స్వయంగా నిర్వహించుకుంటున్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు వస్తే శిక్షణనిచ్చి, వాళ్లకు తగినట్లు మెషీన్ తయారు చేసిస్తాం’’ అన్నారు ్ర΄పొఫెసర్ సంయుక్త.తయారీ ఇలాగ...సేకరించిన పూల నుంచి రెక్కలను వేరు చేసి ఉప్పు నీటిలో కడిగి ఓ గంటసేపు ఎండలో పెడతారు. ఆ పూలను ΄పొడి చేస్తారు. పది కేజీల పూల నుంచి కేజీ ΄పొడి వస్తుంది. ఆటోమేటిక్ మెషీన్ కాబట్టి మెటీరియల్ పెట్టి సెట్ చేసి ఆ మహిళలు మరొక పని చేసుకోవచ్చు. గంటకు అగరువత్తులు 900, సాంబ్రాణి కడ్డీలైతే మూడు వందల వరకు చేయవచ్చు. రా మెటీరియల్ లభ్యత, మార్కెట్ అవసరాలను బట్టి ఇప్పుడు ఈ మహిళలు రోజుకో గంట పని చేస్తున్నారు. వర్షాకాలంలో పూలను ఎండబెట్టడం కష్టం, కాబట్టి ఆ రోజుల్లో గోమయం కడ్డీలను చేస్తారు. గ్రామాల్లో మహిళలు గోమయాన్ని వేసవిలో సేకరించి ఎండబెట్టి నిల్వ చేసి ఉంచుతారు. ఆసక్తి ఉన్న మహిళలు ఇంట్లోనే రోజుకో గంటసేపు పని చేసుకుని తాము ఉంటున్న అపార్ట్మెంట్, ఇరుగు΄పొరుగు ఇళ్లు, దగ్గరున్న ఆలయాలకు సప్లయ్ చేయవచ్చు. ఇందులో భారీ లాభాలను ఇప్పుడే ఆశించలేం. కానీ పర్యావరణహితమైన పని చేస్తున్నామనే సంతోషం ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యాపకంతో ఎకో వారియర్‌గా గుర్తింపు ΄పొందవచ్చు. – సంయుక్త, ఇన్సెన్స్ స్టిక్స్ మెషీన్ ఆవిష్కర్త -
తక్కువ ధరలో కార్లు.. దిగ్గజ కంపెనీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉంది. ఎక్కువమంది ప్రజలు సరసమైన కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి ఇండియా బడ్జెట్ కార్లను తయారు చేయడానికి సన్నద్ధమవుతోందని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు.మార్కెట్లో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సంస్థ సిద్ధంగా ఉంది. దేశ ఆర్థిక స్థితిని తీర్చడానికి.. పౌరులు సురక్షితమైన & సౌకర్యవంతమైన కారును కలిగి ఉండాలనే లక్ష్యంతో తక్కువ ధరలో చిన్న కార్లను తయారు చేయడానికి కంపెనీ నిరంతరం కృషి చేస్తుందని భార్గవ పేర్కొన్నారు.ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ ప్రస్తుతం మంచి వృద్ధిని కనపరిచింది. అయినప్పటికీ ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో ఈ విభాగంలో మారుతి సుజుకి విక్రయాలు 2,22,193 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడైన కార్లు 2,54,973 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే అమ్మకాలు 12.8 శాతం తగ్గుదల కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నట్లు భార్గవ పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలకు చేరుకోవడంలో మారుతి సుజుకి గణనీయమైన వృద్ధి సాధించింది. కంపెనీ సర్వీస్ కూడా అద్భుతంగా ఉందని సంస్థ చైర్మన్ పేర్కొన్నారు. మా అమ్మకాలు మొత్తంలో 46 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నాయని అన్నారు.మారుతి సుజుకి ఇప్పటి వరకు దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయలేదు. కానీ త్వరలోనే కంపెనీ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. ఈ విభాగంలో కూడా సంస్థ గట్టి పోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది. ఈ విభాగంలో లాంఛ్ అయ్యే మొదటికారు ఈవీఎక్స్ (eVX) అని తెలుస్తోంది. -
2024లో ప్రపంచంలో బెస్ట్ లో కాస్ట్ ఎయిర్‌లైన్స్ ఇవే (ఫోటోలు)
-
కుటుంబానికి రూ.10 వేలకే హెల్త్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా ప్రీమియం సామాన్యులకు భారంగా మారిన తరుణంలో.. ప్రముఖ వైద్యసేవల సంస్థ ‘నారాయణ హెల్త్’ చౌక ప్రీమియంతో ఒక ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ఆరోగ్య బీమా పాలసీకి ‘అతిథి’ పేరు పెట్టింది. దంపతులు, ఇద్దరు పిల్లలు (గరిష్టంగా) కలిగిన నలుగురు సభ్యుల కుటుంబానికి ఏడాదికి ప్రీమియం కేవలం రూ.10,000గా నిర్ణయించింది. ఇంటిపెద్ద వయసు 45ఏళ్లకు మించకుండా ఉంటేనే ఈ ప్రీమియం. ఇంతకంటే అధిక వయసులోని వారికి ప్రీమియం (అది కూడా ఇతర బీమా సంస్థల కంటే తక్కువే) వేరుగా ఉంటుంది. నలుగురు సభ్యుల కుటుంబానికి ఒక ఏడాదిలో రూ.కోటి రూపాయల వరకు సర్జరీలకు ఈ పాలసీలో చెల్లింపులు లభిస్తాయి. ఇతర హాస్పిటల్ చికిత్సలకు (జ్వరం, ఇన్ఫెక్షన్ తదితర) రూ.5లక్షల వరకు కవరేజీ ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి ఈ పాలసీ కింద సేవలు నారాయణ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే లభిస్తాయి. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 21 హాస్పిటళ్లు ఉన్నాయి. బెంగళూరులో ఏడు ఆస్పత్రులతోపాటు, మూడు క్లినిక్‌లు ఉన్నాయి. -
కొత్త ఈ-కామర్స్ కంపెనీ.. చవకా.. వీక్నెస్ పట్టేశారు!
దేశంలో సగటు కస్టమర్ల బలహీనతను కంపెనీలు పట్టేస్తున్నాయి. ఇలాంటి కస్టమర్ల కోసం ప్రత్యేక ఈ-కామర్స్ విభాగాలను తెరుస్తున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా "బజార్" అనే పేరుతో కొత్త చవక ఉత్పత్తుల విభాగాన్ని పరిచయం చేసింది. ఈ వినూత్న విభాగం కస్టమర్లకు అతి తక్కువ ధరలలో అన్‌బ్రాండెడ్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను అందిస్తుంది. భారతీయ వినియోగదారుల విభిన్న అవసరాలు, ప్రాధాన్యతలను తీరుస్తుంది. ఈ కొత్త వెంచర్ ఇప్పుడు అమెజాన్ ఇండియా ఆండ్రాయిడ్ యాప్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ‘ది ఎకనామిక్ టైమ్స్’ ప్రకారం.. ఈ-కామర్స్ దిగ్గజం రూ. 600లోపు ధర కలిగిన దుస్తులు, వాచీలు, బూట్లు, ఆభరణాలు, బ్యాగ్‌లతో సహా బ్రాండెడ్ ఉత్పత్తులను జాబితా చేయడానికి విక్రేతలను ఆన్‌బోర్డింగ్ చేసింది. వీటిని ఆర్డర్ చేసే ప్రైమ్ సభ్యులకు 4-5 రోజుల్లోనే డెలివరీ చేయనుంది. సాధారణంగా చవకైన ఉత్పత్తుల డెలివరీకి ఎక్కువ సమయం పడుతుంది. ‘బజార్’ పరిచయాన్ని అమెజాన్ ఇండియా ప్రతినిధి ధ్రువీకరించారు. ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, భారతదేశం అంతటా ఉన్న తయారీ కేంద్రాల నుండి విక్రేతలు అందించే ఫ్యాషన్, ఇతర వస్తువులను తక్కువ ధరలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు అని కంపెనీ పేర్కొంది. దేశంలో ఇప్పటికే ఇలాంటి లోకాస్ట్ ఈ-కామర్స్ సంస్థలు కొన్ని ఉన్నాయి. చవక ధర ఉత్పత్తులను విక్రయించడానికి మరో దిగ్గజ ఆన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) కూడా షాప్సీ (Shopsy) పేరుతో వేరే యాప్‌ని నిర్వహిస్తుంది. దీంతోపాటు లోకాస్ట్ ఈ-కామర్స్ మార్కెట్లో పురోగతి సాధిస్తున్న సాఫ్ట్‌బ్యాంక్-మద్దతు గల మీషోతోనూ అమెజాన్ బజార్ పోటీపడనుంది. -
మన నేలమీదే రాస్ప్బెర్రీ, బ్లాక్‌బెర్రీ, బ్లూ బెర్రీ: న్యాయవాది కియా సక్సెస్ స్టోరీ
విదేశీయుల వ్యాపా రహస్యం మార్కెట్ మాయాజాలం ఒకటి ఉంటుంది. ఒక ఉత్పత్తి మార్కెట్లోకి విడుదలయ్యే లోపు దాని గురించి ఒక సదభిప్రాయాన్ని కలిగించే ప్రచారం మొదలవుతుంది. ఆ ప్రమోషన్ ఆధారంగా సదరు ఉత్పత్తికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుంది. వాళ్ల బుట్టలో పడేవరకు మనకు ఆ మాయాజాలం అర్థం అయ్యేది కాదు. అర్థమయ్యేలోపు సదరు ఉత్పత్తిని వాడడానికి అలవాటు పడిపోయేవాళ్లం. ఆలా ఆయా ఉత్పత్తుల దిగుమతికి రహదారి పడుతుంటుంది. నిజానికి భారతదేశం నేల మీద పండని పంట ఉంటుందా అనుకుంది కేయా సాలోత్. అమెరికా, రష్యా, మెక్సికో, పోలండ్ దేశాల్లో పండే రాస్ప్బెర్రీ, బ్లాక్‌బెర్రీ, బ్లూ బెర్రీ, క్రాన్బెర్రీ... పంటలను మన నేల మీద పండించి చూపించాలనుకుంది. ఆ పంటలకు అనుగుణమైన ఉష్ణోగ్రతలను మెయింటెయిన్ చేసింది. మంచి దిగుబడిని సాధిస్తోంది. హై బుష్ కౌన్సిల్ ప్రకటన! ‘‘మన దేశం నుంచి ఇండియా దిగుమతి చేసుకున్న కూరగాయలు, పండ్ల విలువ ఏడాదికి ముప్పై శాతం చొప్పున తగ్గిపోతోంది. మనకిది ఏ మాత్రం అభిలషణీయమైన లావాదేవీ కానేరదు. ఇండియా మార్కెట్ అవసరాలను పెంచడానికి ప్రయత్నించడం వల్ల ప్రయోజనం కూడా ఉండదు. ఎందుకంటే ఇండియా తనంతట తానుగా ఈ పంటలను పండించుకుంటోంది. స్థానికంగా పండించుకోవడం వల్ల బయటి దేశాలనుంచి దిగుమతి చేసుకుంటే అయ్యే ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ ధరకు దొరుకు తున్నాయి’’ అని యూఎస్ హైబుష్ బ్లూ బెర్రీ కౌన్సిల్ ప్రతినిధి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పంటలను పండించడంలో కేయా సాలోత్, ఆమె బాటలో మరికొంత మంది చిన్నరైతులు విజయవంతమైనట్లు చెప్పడానికి ఈ ప్రకటనే నిదర్శనం. దిగుబడికి ముందే ఆర్డర్లు! ఇంతకీ కేయాసాలోత్ అనతికాలంలోనే సక్సెస్ సాధించడానికి ఆమెకు వ్యవసాయ నేపథ్యం ఏ మాత్రం లేదు. ఆమె ముంబయిలో పుట్టి పెరిగింది. న్యాయశాస్త్రం చదివి లాయర్‌గా ప్రాక్టీస్ చేసింది. తన జ్ఞానాన్ని క్లయింట్లను కాపాడడం కోసం వినియోగించడం కంటే అంతకంటే మెరుగైన కారణం కోసం పని చేస్తే బావుణ్నని కోరుకుంది. అప్పుడు ఆమె దృష్టి మనదేశంలోకి అమెరికా, రష్యా, పోలండ్, మెక్సికో, సెర్బియా వంటి శీతల దేశాల నుంచి మనదేశానికి వస్తున్న రాస్ప్బెర్రీ, బ్లూ బెర్రీల మీద కేంద్రీకృతమైంది. మనం తినడానికి ఇష్టపడుతున్న పండ్లను మనం పండించుకోలేమా అని ప్రయోగం మొదలు పెట్టింది. ఇందుకోసం ఆమె మహారాష్ట్రలో ఏ ప్రదేశమైతే ఈ పంటలకు అనువుగా ఉంటుందోనని అధ్యయనం చేసింది. ఈ పంటలు పండే దేశాలకు వెళ్లి వారు అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించింది. తిరిగి ఇండియాకి వచ్చి ఇరవై ఎకరాల పొలంలో వ్యవసాయం మొదలుపెట్టింది. ఎండ, వర్షాలను తట్టుకునే విధంగా తెల్లటి పై కప్పుతో షెడ్ వేసింది. మొదటగా మైక్రోగ్రీన్స్‌తో మార్కెట్లోకి ప్రవేశించింది. కొత్తిమీర, మెంతి ఆకు వంటి స్పల్పకాల పంటలను రసాయన ఎరువులు లేకుండా పండించి రెస్టారెంట్లకు సప్లయ్ చేయడంతో అనతికాలంలోనే 50 మంది క్లయింట్లు వచ్చారు. రాబోయే కాలంలో తమ పొలం నుంచి ఫలానా పంటలు అందుబాటులోకి వస్తాయని క్లయింట్లకు సమాచారం ఇవ్వడంతో ఆమెకు అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలయ్యాయి. ఈ పండ్లు దిగుబడి సాధించేలోపు ఆమె మార్కెట్ వేదికను ఏర్పాటు చేసుకుందన్నమాట. రైతులందరూ వ్యవసాయం చేస్తారు. పంట పండించి కొనుగోలు దారుల కోసం ఎదురు చూస్తారు. దళారుల చేతిలో మోస పోతుంటారు. 32 ఏళ్ల కేయా సాలోత్ అనుసరించిన సక్సెస్ ఫార్ములా రైతులకు మార్గదర్శనం. -
చవక నగరాల్లో అహ్మదాబాద్, చెన్నై
ప్రపంచంలో తక్కువ ఖర్చుతో బతుకు వెళ్లదీయగల పెద్ద నగరాల్లో మన దేశానికి చెందిన రెండు సిటీలు అహ్మదాబాద్, చెన్నైలకు చోటు దక్కింది. ప్రఖ్యాత ‘ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లోని పెద్ద నగరాలను ఎంపిక చేసి, సర్వే నిర్వహించి ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ఆయా నగరాల్లో నిత్యావసరాల నుంచి ఇంటి అద్దెల దాకా వివిధ ధరలను పరిశీలించి.. జీవించడానికి అయ్యే ఖర్చును తేల్చామని పేర్కొంది. ఇందులో సింగపూర్, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరాలు అత్యధిక జీవన వ్యయంలో టాప్‌లో నిలిచాయి. నిత్యావసరాలు, వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం గణనీయంగా ఉండటంతో యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లోని నగరాల్లో జీవన వ్యయం పెరుగుతోందని తెలిపింది. ఇక తక్కువ వ్యయం ఉండే నగరాల్లో ఆసియా ఖండానికి చెందినవే ఎక్కువగా ఉన్నా యని నివేదిక వెల్లడించింది. – సాక్షి సెంట్రల్‌డెస్క్ -
సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్! ధర రూ. 3.47 లక్షలే..
ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజు రోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు కూడా ఈ విభాగం వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే చాలామంది వాహన కొనుగోలుదారులు తక్కువ ధర వద్ద ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో షావోమ (Xiaoma) కంపెనీ సరసమైన ధరకే ఈవీ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షావోమ కంపెనీ బెస్టూన్ బ్రాండ్ కింద చిన్న ఎలక్ట్రిక్ కారు (Bestune Xiaoma)ని చైనాలో లాంచ్ చేసింది. దీని ధర 30వేల నుంచి 50వేల యూవన్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 3.47 లక్షల నుంచి రూ. 5.78 లక్షలు. ఇప్పటికీ ఈ కారు కోసం ఫ్రీ బుకింగ్స్ మొదలైనట్లు.. ఈ నెలలోనే సేల్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బెస్టూన్ షావోమ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న వుల్లింగ్ హాంగుయంగ్ మినీ ఈవీకి ప్రత్యర్థిగా ఉండనుంది. ఈ కారు గత ఏప్రిల్ నెలలో షాంఘై ఆటో షోలో కనిపించింది. కాగా త్వరలో రోడ్డు మీదికి రానుంది. డ్యూయెల్ టోన్ కలర్లో చూడముచ్చటగా ఉన్న ఈ కారు మంచి డిజైన్.. ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇదీ చదవండి: ఈవీ ఛార్జింగ్ కోసం ఏ దేశం ఎంత డబ్బు వసూలు చేస్తుంది? వివరాలు షావోమ బెస్టూన్ ఎలక్ట్రిక్ కారు FME ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైంది. ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైన కార్లు 800 కిమీ నుంచి 1200 కిమీ రేంజ్ అందిస్తాయి. కావున 20 కిలోవాట్ మోటార్ కలిగిన బెస్టూన్ 800కిమీ రేంజ్ అందిస్తుందని భావిస్తున్నారు. కాగా ఖచ్చితమైన రేంజ్ తెలియాల్సి ఉంది. -
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: తక్కువ ధరకే మందులు!
దేశంలో అతిపెద్ద ప్రజా ప్రయాణ వ్యవస్థ రైల్వేలు. దేశవ్యాప్తంగా రోజూ లక్షల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్నిసార్లు ప్రయాణికుల ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కొంత మంది ముందు జాగ్రత్తగా కొన్ని మందులు తమ వెంట తెచ్చుకున్నా చాలా మంది మందులు దొరక్క, ఒకవేళ దొరికినా అధిక ధరల కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి ఇబ్బందుల పరిష్కారానికి రైల్వే చర్యలు చేపట్టింది. ప్రయాణికుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ దేశంలోని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకు మందులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాల పేరుతో మెడికల్ స్టాల్స్ ప్రారంభించనుంది. ఇక్కడ ప్రయాణికులకు అవసరమైన వివిధ రకాల మందులు తక్కువ ధరకు విక్రయిస్తారు. ఈ అవుట్లెట్లు రైల్వేస్టేషన్లలోని రద్దీ ప్రదేశాలలో, కాన్కోర్స్‌లలో ఏర్పటు చేస్తారు. దీని వల్ల వచ్చీపోయే ప్రయాణికులందరికీ ప్రయోజనం కలుగుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. మొదట 50 స్టేషన్లలో.. పైలట్ ప్రాజెక్ట్ కింద మొదట ఎంపిక చేసిన 50 రైల్వే స్టేషన్లలో ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ జాబితాలో ఆనంద్ విహార్, దర్భంగా, శ్రీనగర్, మైసూర్, లక్నో తదితర ప్రధాన స్టేషన్లతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఇదీ చదవండి: Water Bottles in Trains: రైళ్లలో వాటర్ బాటిల్ కొంటున్నారా.. ఏ బ్రాండ్ అమ్మాలి.. రూల్స్ ఏంటి? రైల్వే డివిజన్ల ద్వారా గుర్తించిన ప్రదేశాలలో ఈ మందుల కేంద్రాలను లైసెన్సుల ద్వారా ఏర్పాటు చేసి నిర్వహిస్తారు. సంబంధిత రైల్వే డివిజన్ల ఆధ్వర్యంలో ఈ-వేలం ద్వారా ఈ స్టాల్స్ ను కేటాయిస్తారు. వీటిని ఎన్ఐడీ అహ్మదాబాద్ డిజైన్ చేస్తుంది. -
మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల
Lava launches Yuva 2 smartphone: స్వదేశీ బ్రాండ్ లావా చాలా తక్కువ ధరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ యువ 2 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటరోలా (Motorola Moto G14), షావోమీ (Xiaomi Redmi 12) కంపెనీలు చవక ఫోన్లను విడుదల చేసిన మరుసటి రోజే లావా కూడా తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మూడు ఫోన్లూ రూ. 10,000 కంటే తక్కువ ధరల విభాగంలో ఒకదానితో ఒకటి పోటీపడతాయి. గ్లాస్ బ్యాక్ ఫినిషింగ్, క్లీన్ అండ్ బ్లోట్‌వేర్ ఫ్రీ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందించే లావా యువ 2 స్మార్ట్‌ఫోన్ 3జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ.6,999. గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్, గ్లాస్ గ్రీన్ రంగుల్లో లభ్యమవుతుంది. ఆగస్టు 2 నుంచి తమ రిటైల్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. మరో విశేషం ఏంటంటే ఈ ఫోన్‌కు వారంటీ వ్యవధిలోపు ఏవైనా సమస్యలు వస్తే ఇంటి వద్దే సర్వీస్ అందిస్తారు. ఇదీ చదవండి ➤ Expensive TV: వామ్మో రూ. 1.15 కోట్లు.. మార్కెట్లోకి అత్యంత ఖరీదైన టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 90Hz 6.5 అంగులాల హెచ్డీ ప్లస్ సింక్ డిస్ప్లే 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 3జీబీ వరకు వర్చువల్ మెమొరీ 8-కోర్ Unisoc T606 చిప్సెట్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 13ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా 10W USB టైప్-C ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ -
బరువైన ఫోన్లతో విసిగిపోయారా? ఈ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్లు ట్రై చేయండి..
స్మార్ట్ఫోన్లు మన దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. కస్టమర్లు తమ బడ్జెట్‌కు అనుగుణంగా ప్రీమియం, మిడ్-రేంజ్ లేదా లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. హార్డ్‌వేర్, ప్రీమియం గ్లాస్, అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ సామర్థ్యాలను మెరుగుపరచడంతో ఈ రోజుల్లో ఫోన్లు చాలా బరువుగా మారాయి. ప్రీమియమ్ బిల్డ్, పెద్ద బ్యాటరీలు ఉండటం మంచిదే అయినప్పటికీ కొంతమంది ఫోన్లు తేలికగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారి కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని తేలికపాటి ఫోన్ల గురించి సమాచారం ఇక్కడ అందిస్తున్నాం. రియల్ మీ నార్జో ఎన్ 53 (Realme Narzo N53) బరువు 182 గ్రాములు. 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ Unisoc T612 SoC ప్రాసెసర్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 12GB వరకు డైనమిక్ ర్యామ్ సపోర్ట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ LED ఫ్లాష్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా 4GB + 64GB వెర్షన్ ధర రూ. 8,999, 6GB + 128GB మోడల్ ధర రూ. 10,999. మోటో జీ13 (Moto G13) బరువు 184.25 గ్రా 6.5-అంగుళాల IPS LCD డిస్ప్లే MediaTek Helio G85 ప్రాసెసర్ 4GB LPDDR4X ర్యామ్ 64GB/128GB స్టోరేజీ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డ్యూయల్ లెన్స్‌లు, 8MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ 4GB + 64GB మోడల్ రేటు రూ. 9,499, 4GB + 128GB వెర్షన్ ధర రూ. 9,999. వివో వై 02 (Vivo Y02) బరువు 186 గ్రాములు. 6.51-అంగుళాల HD+ డిస్ప్లే మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 3GB ర్యామ్, 32GB స్టోరేజీ, 1TB వరకు విస్తరించవచ్చు Funtouch OS 12తో Android 12 Go ఎడిషన్ 8MP రియర్ కెమెరా 5MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ 2GB + 32GB మోడల్ ధర రూ. 8,999. రెడ్మీ 10ఎ (Redmi 10A) బరువు 194 గ్రాములు 6.53-అంగుళాల HD+ డిస్ప్లే MediaTek Helio G25 ప్రాసెసర్ 3GB/4GB LPDDR4x ర్యామ్, 32GB/ 64GB eMMC 5.1 స్టోరేజ్. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ 13MP ప్రైమరీ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ 3GB + 32GB మోడల్ ధర రూ. 8,499, 4GB + 64GB వెర్షన్ ధర రూ. 9,499. -
బంఫర్ ఆఫర్: ‘ఉద్యోగులకు’ తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించడానికి రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అవేరా ముందుకొచ్చింది. ఈ మేరకు నెడ్‌క్యాప్‌తో అవేరా ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం నెడ్‌క్యాప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ ఎండీ రమణా రెడ్డి, అవేరా ఫౌండర్ సీఈవో వెంకట రమణలు ఒప్పందం పత్రాలను మార్చుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ‘గ్రీన్ ఆంధ్రా’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రత్యేక ధరలకు అందించే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం అవేరా రెటోరోసా–2 స్కూటర్‌పై రూ.10,000, రెటోరోసా లైట్ వాహనంపై రూ.5,000 వరకు ప్రత్యేక తగ్గింపు ఇవ్వనున్నట్లు వెంకట రమణ తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 7,000 వాహనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. చదవండి: Fact Check: కుంగుతున్నది రామోజీ బుద్ధే -
ONDC తక్కువ రేట్లతో దూకుడు: స్విగ్గీ, జొమాటోకు దబిడి దిబిడే!
సాక్షి,ముంబై: ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోకు పోటీగా ప్రభుత్వ సంస్థ దూసుకుపోతోంది. తక్కువ ధరలతో ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్డీసీ జొమాటో, స్విగ్గీలకు సవాల్ విసురుతోంది. చిన్న స్థాయి సంస్థలకు టెక్నాలజీ పరంగా ఆశించిన స్థాయిలో సేవలు అందకపోవడంతో కేంద్రం ఓపెన్ సోర్స్డ్ మెథడాలజీతో ఈ నూతన ఒపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూర్ ఢిల్లీ సహా 240 నగరాల్లో తన సేవల్లో దూసుకుపోతోంది. ఆహారంతోపాటు నిత్యావసర సరుకుల రోజువారీ డెలివరీల సంఖ్య 10 వేల దాటేసింది. డిజిటల్ కామర్స్ ఇన్ ఇండియాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే లక్క్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం ప్రారంభించింది. ఓఎన్డీసీ ప్రత్యేకత ఏంటి? వాణిజ్య మంత్రిత్వ శాఖకు కెందిన పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం (DPIIT) ప్రవేశపెట్టిన ఓపెన్ ఇ-కామర్స్ ప్రోటోకాల్. థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా నెట్‌వర్క్‌లోని క్రయ విక్రయ దారులు చేసుకోవచ్చు. వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకారం, ఓఎన్డీసీ చిన్న రిటైల్ సంస్థలు పెద్ద టెక్-ఆధారిత ఇ-కామర్స్ కంపెనీల దాడిని తట్టుకుని నిలబడేలా సహాయం చేస్తుంది. అలాగే పేమెంట్ సిస్టంలో సంచలనాలకు యూపీఐ ఎలా ఉపయోగపడిందో ఇ-కామర్స్ రంగంలో ఇది పెను మార్పులకు దారితీయనుంది. కొనుగోలుదారులు వివిధ బ్రాండ్లు, లోకల్ వ్యాపారవేత్తలనుంచి విస్తృత ఉత్పత్తులను సెర్చ్ చేయవచ్చు. కొనుగోలు చేయవచ్చు. ఆహారం, పానీయాలు, బ్యూటీ, వ్యక్తిగత సంరక్షణ, హోం డెకరేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫ్యాషన్‌తో సహా పలు ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. పేటీఎం మీషో, స్పైస్ మనీ, క్రాఫ్ట్స్విల్లా మేజిక్ పిన్, పిన్‌కోడ్, లాంటి ఇతర ఆన్లైన్ స్టోర్లనుండి కూడా కస్టమర్లు ONDC ద్వారా ఆర్డర్ చేయవచ్చు. ప్లాట్‌ఫారమ్‌కు ప్రస్తుతం అంతర్గత డెలివరీ భాగస్వాములు లేరు. eKart, Dunzo, Delhivery మొదలైన థర్డ్ పార్టీల ద్వారా డెలివరీ చేస్తుంది. సోషల్‌మీడియాలో కస్టమర్ల పోస్ట్‌లు చక్కర్లు స్విగ్గీ, జొమాటోతో పోలిస్తే ఓఎన్డీసీ 3 శాతం కమీషన్‌ను వసూలు చేస్తుంది. స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ యాప్‌లు 25 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు ఓఎన్డీసీని ఎంచుకుంటున్నారు. దీంతో గత వారం రోజులుగా ఓఎన్డీసీ ఫుడ్ ఆర్డర్ల ధరలను పోల్చుతూ అనేక పోస్ట్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పోస్ట్‌లలో చాలా వరకు, ఫుడ్ డెలివరీ యాప్‌లతో పోలిస్తే, తక్కువకే, కొన్ని సందర్భాల్లో సగం రేటుకే లభిస్తోందంటూ యూజర్లు సంబర పడుతున్నారు. సేమ్ ఆర్డర్, సేమ్ ప్లేస్, సేమ్ టైం అంటూ ధరలను కంపేర్ చేస్తుండటం గమనార్హం. ఇది లాభాపేక్ష లేని ప్లాట్‌ఫారమ్ అని మధ్యవర్తి లేకపోవడం దీనికి పెద్ద ఎసెట్ అని ఇన్ఫోసిస్ కోఫౌండర్, ఓఎన్డీసీ సలహా మండలి సభ్యుడు నందన్ నీలేకని గతం లోనే ప్రకటించారు. నేరుగా విక్రేతకు చెల్లించడం గొప్పవిషయం, యాప్ కమీషన్ లేకపోవడంతో తక్కువ చార్జీలతో కస్టమర్ల ఆదరణ లభస్తుందన్నారు. There are over 29,000+ Merchants from 236 Cities in India on ONDC Seller Network Currently You can search for the Listed Merchants & City here - https://t.co/xelXMQJYTx pic.twitter.com/dZ6JJt4LNq — Ravisutanjani (@Ravisutanjani) May 8, 2023 Now you know the ONDC impact! Same order, same place and same time. The difference are clearly visible. pic.twitter.com/JG7xpjN8NB — Ankit Prakash (@ankitpr89) May 4, 2023 A very interesting find. Same pizza store but one is 20% cheaper. ONDC 👇 Zomato 👇 pic.twitter.com/pWWPjvHJFt — Udit Goenka (@iuditg) May 3, 2023 -
ప్రపంచంలో బెస్ట్ సిటీ ‘వెలెన్సియా’.. టాప్ 10 నగరాలివే..
న్యూయార్క్: మూడు ఖండాల నుంచి మూడు నగరాలు ఇంటర్నేషన్స్ సంస్థ తాజా సర్వేలో అత్యుత్తమ సిటీల జాబితాలో నిలిచాయి. ప్రవాసులు నివసించడానికి 2022లో ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో స్పెయిన్‌లోని వెలెన్సియా టాప్‌లో నిలిచింది. అద్భుతమైన జీవన ప్రమాణాలుంటాయని జీవన వ్యయం భరించే స్థాయిలో ఉంటుందని, ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారని సర్వేలో అత్యధికులు వెలెనికా నగరానికి ఓటు వేశారు. ఆ తర్వాత స్థానంలో దుబాయ్, మూడో స్థానంలో మెక్సికో సిటీ నిలిచాయి. 181 దేశాల్లో నివసిస్తున్న 11,970 మంది ప్రవాసుల అభిప్రాయాలను తెలుసుకొని ఈ జాబితాకు రూపకల్పన చేశారు. టాప్ 10 నగరాలివే.. 1. వెలెన్సియా (స్పెయిన్): జీవన ప్రమాణాలు, అల్ప జీవన వ్యయం, మంచి వాతావరణం. 2. దుబాయ్: పని చేయడానికి అనుకూలం, ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేయొచ్చు. 3. మెక్సికో సిటీ: ఫ్రెండ్లీ నగరం. 4. లిస్బన్ (పోర్చుగల్): అద్భుత వాతావరణం. 5. మాడ్రిడ్ (స్పెయిన్): సాంస్కృతిక అద్భుతం. 6. బాంకాక్: సొంత దేశంలో ఉండే ఫీలింగ్. 7. బాసిల్ (స్విట్జర్లాండ్): ఆర్థికం, ఉపాధి, జీవన ప్రమాణాల్లో ప్రవాసుల సంతృప్తి 8. మెల్బోర్న్ (ఆస్ట్రేలియా): అన్నింటా బెస్ట్. 9. అబుదాబి: ఆరోగ్యం రంగట్లో టాప్. ప్రభుత్వోద్యోగుల పనితీరు అద్భుతం. 10. సింగపూర్: మంచి కెరీర్. రోమ్ (ఇటలీ), టోక్యో (జపాన్), మిలన్ (ఇటలీ), హాంబర్గ్ (జర్మనీ), హాంగ్‌కాంగ్ ప్రవాసుల నివాసానికి అనుకూలంగా ఉండవని సర్వే పేర్కొంది. -
చౌక తయారీ కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: చైనా, వియత్నాం దేశాలను వెనక్కి నెట్టేసి.. భారత్ ప్రపంచంలోనే అత్యంత చౌక తయారీ కేంద్రంగా అవతరించింది. ఈ విషయాన్ని యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ప్రకటించింది. మొత్తం 85 దేశాలకు గాను, మెరుగైన దేశంగా భారత్ 31వ ర్యాంకును సొంతం చేసుకుంది. వ్యాపార స్వేచ్ఛ విషయంలో 37వ స్థానాన్ని ఆక్రమించింది. తయారీ వ్యయాల పరంగా భారత్ 100 స్కోరు సాధించింది. పన్నుల పరంగా అనుకూలతలో 100కు గాను 16.2 స్కోరు లభించింది. అవినీతి రహితంలో 18.1 స్కోరు, పారదర్శక ప్రభుత్వ విధానాల విషయంలో 3.5 స్కోరు మాత్రమే సాధించింది. ఆదాయం సమానత్వంలో 1.9, భద్రతలో 4.3 శాతం స్కోరు లభించింది. -
తక్కువ ధర చైనా ఫోన్లపై భారత్‌లో నిషేధం!
చిన్నకర్రనైనా పెద్ద పాముతో కొట్టాలంటారు పెద్దలు. చైనా ఫోన్ల విషయంలో భారత్ ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో కాబోతోంది. చైనా ఫోన్లపై నిషేధం విధించాలని భారత్ కోరుతోంది. అదీ రూ. 12,000 కంటే తక్కువ ధర కలిగిన చైనీస్ ఫోన్ల అమ్మకాలను నిషేధించాలనుకుంటోంది. తద్వారా తడబడుతున్న దేశీయ పరిశ్రమకు బలం ఇవ్వాలని భావిస్తోంది. తక్కువ రేటు చైనా ఫోన్ల అమ్మకాలను భారత్‌లో నిషేధించాలన్న భారత ప్రభుత్వ తాజా నిర్ణయం ద్వారా షావోమీలాంటి చైనీస్ బ్రాండ్లతో సహా చాలావాటికి దెబ్బ పడనుంది. ముఖ్యంగా ప్రపంచంలోని రెండవ అతిపెద్ద మొబైల్ మార్కెట్ అయిన భారత్.. తద్వారా దిగువ విభాగం నుండి చైనీస్ కంపెనీలను బయటకు గెంటేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ ప్రవేశ-స్థాయి(ఎంట్రీ లెవల్) మార్కెట్ నుంచి తప్పించడం ద్వారా షావోమీ, మరికొన్ని సహచర కంపెనీలను నిలువరించడమే భారత వ్యూహమని నిపుణులు చెప్తున్నారు. చైనాలో కరోనా, లాక్డౌన్ ప్రభావంతో అక్కడి మార్కెట్ ఘోరంగా దెబ్బతింటోంది. దీంతో ఎక్కువగా భారతదేశంపైనే ఆధారపడుతోంది ఆ మార్కెట్. మార్కెట్ ట్రాకర్ కౌంటర్‌పాయింట్ ప్రకారం, జూన్ 2022 వరకు త్రైమాసికంలో $150(12వేలరూపాయల) లోపు స్మార్ట్ఫోన్లు.. భారతదేశ విక్రయాలకుగానూ మూడింట ఒక వంతుకు దోహదపడ్డాయి. చైనా కంపెనీలు ఆ షిప్మెంట్లలో 80% వరకు ఉండడం గమనార్హం. ఇప్పటికే షావోమీ, ఒప్పో , వివో వంటి చైనీస్ సంస్థలు భారత్‌లో ఆర్థిక సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ట్యాక్సుల ఎగవేతతో పాటు ఏకంగా మనీల్యాండరింగ్ ఆరోపణలు చుట్టుముట్టాయి కూడా. అయితే చైనీస్ ఫోన్లు, ఉత్పత్తులను నేరుగా నిషేధించేందుకు ఇబ్బందులు ఎదురయ్యే చాన్స్ ఉన్నందున.. గతంలో హువాయ్, జెడ్‌టీఈ లాంటి దిగ్గజాల టెలికాం పరికరాలను నిషేధించడానికి అనధికారిక మార్గాలను ఉపయోగించింది. చైనా ఫోన్ల విషయంలో అలాంటి స్ట్రాటజీనే పాటించాలని భావిస్తోంది. మరోవైపు.. భారత్‌లో యూనిట్ల ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం చైనా కంపెనీలపై ఒత్తిడి చేస్తోంది. స్థానికంగా సప్లయ్ చెయిన్లు ఏర్పాటు చేయాలని, భారీగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలని, భారత్ నుంచే ఎగుమతి చేయాలని కోరుతూ వస్తోంది. తద్వారా చైనా ఫోన్లకు మేడ్ ఇన్ ఇండియా మార్క్‌తో పాటు స్థానికంగా ఉపాధి కల్పన కూడా ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. ఇదీ చదవండి: 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లు ఇవే! -
మెడికల్ టూరిజం హబ్‌గా భారత్
భోపాల్: ప్రపంచదేశాల్లో భారత్‌లోనే తక్కువ ధరకి వైద్య చికిత్స లభిస్తోందని, అందుకే, ఇరుగు పొరుగు దేశాల వారు మన దేశంలో చికిత్స చేయించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. భారత్‌లో మెడికల్ టూరిజం శరవేగంగా విస్తరిస్తోందన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో శనివారం ఆరెస్సెస్ మద్దతు సంస్థ ఆరోగ్య భారతి ఒకే దేశం–ఒకే ఆరోగ్య వ్యవస్థ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే మన దేశంలో ఆస్పత్రుల్లోనే చవగ్గా వైద్య చికిత్స చేస్తున్నారని చెప్పారు. ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందే రోగుల్లో స్థానికుల కంటే విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య ఎక్కువ ఉందని చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడడానికి త్వరితగతిన వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చిన శాస్త్రవేత్తలు, వైద్యుల కృషిని రాష్ట్రపతి ప్రశంసించారు. ఇటీవల తాను పర్యటించిన దేశాల్లో నాయకులందరూ భారత్ వైద్య రంగం పట్ల ఎక్కువ ఆసక్తిని ప్రదర్శించారని, వివరాలు అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. మన దేశంలో అత్యంత సులభంగా వైద్య చికిత్సలు అందుబాటులో ఉండడంతో మెడికల్ టూరిజం హబ్‌గా మారుతోందని అన్నారు. -
‘మిడిల్ క్లాస్ మెలోడీస్‘.. ఈ హోటల్లో ఏది కొన్నా రూ.10!
రెండు ఇడ్లీ..రెండు పూరి..దోశ..ఉగ్గాని..ఏ అల్పాహారమైనా పది రూపాయలే. ఎక్కడో పల్లె ప్రాంతంలో కాదు.. జిల్లా కేంద్రమైన కర్నూలులో..నమ్మశక్యంగా లేదా? నిజమేనండి! ఒకటి కాదు..రెండు కాదు..తొమ్మిదేళ్లుగా ఇదే ధరతో ఓ హోటల్ యజమాని పొద్దున్నే పేదల ఆకలి తీరుస్తున్నాడు. ఆ వివరాలేమిటో చూద్డామా.. కర్నూలు (ఓల్డ్‌సిటీ): కార్మికులు, కూలీలు ఎక్కువగా ఉండే రోజా వీధిలో 2012లో రేణుక టిఫిన్ సెంటర్ వెలిసింది. ఇక్కడ పది రూపాయలకే అల్పాహారాన్ని అందిస్తున్నారు. హోటల్ యజమాని నాగేశ్వరరెడ్డితో పాటు పది మంది పనిచేస్తున్నారు. ప్రతి రోజూ వెయ్యి మంది వరకు ఇక్కడ ఆకలి తీర్చుకుంటున్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా పది రూపాయలకే అల్పాహారాన్ని అందిస్తుండడంతో ఈ హోటల్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. హాటల్ సర్వర్ నుంచి యజమానిగా.. నాగేశ్వరరెడ్డి సొంత ఊరు నందికొట్కూరు మండలం కొణిదెల. తండ్రి రామిరెడ్డి రైతు కూలి. తల్లి సూర్యలక్ష్మీదేవి గేదెలను పోషిస్తూ పాలు అమ్మి జీవనం సాగించేవారు. పదో తరగతి వరకు చదువుకున్న నాగేశ్వరరెడ్డి ఆస్తిపాస్తులు లేకపోవడంతో జీవనోపాధి కోసం కర్నూలు వచ్చాడు. కొన్ని రోజులు ఓ హోటల్లో సర్వర్‌గా పనిచేశాడు. అక్కడ అతనికి హోటల్ వ్యాపారంలో మెలకువలు తెలిశాయి. ప్రజల అభి‘రుచి’ని గమనించాడు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చిన తనలాంటి పేదల కోసం హోటల్‌ను ఏర్పాటు చేయాలని తలంచాడు. ఇందుకు మామ జొన్నగిరి హనుమంతరెడ్డి సహకారం తీసుకున్నాడు. కూలీలు ఎక్కువగా ఉండే రోజా వీధిలో టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించాడు. ప్రారంభంలో వంద మంది వరకు వచ్చేవారు. తక్కువ ధరకు నాణ్యమైన అల్పాహారం దొరకుతుందని తెలిసిన తర్వాత ఆ సంఖ్య వెయ్యి వరకు పెరిగింది. తక్కువ లాభంతో.. వ్యాపారం ఎవరు చేసినా లాభాలు చూస్తారు. అయితే నాగేశ్వరరెడ్డి మాత్రం తక్కువ లాభంతో ఎక్కువ మందికి మేలు చేస్తున్నాడు. హోల్‌సేల్‌గా సరుకులు కొనుగోలు చేస్తున్నాడు. దీంతో కొంత ఖర్చు తగ్గుతోంది. ధరలు పెరిగినా..తాను మాత్రం అల్పాహారం ధర పెంచడం లేదని చెప్పాడు. ఎక్కువ మంది కస్టమర్లు ఉండడంతో తనకు నష్టం రావడం లేదని వివరించాడు. వ్యాపారం పెరిగితే మరో ముగ్గురికి అదనంగా ఉపాధి కల్పిస్తానని చెప్పాడు. తాను పేదరికంలో ఎన్నో కష్టాలను అనుభవించానని, తన లాంటి పేదల కోసం వ్యాపారం చేస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. చాలా దూరం నుంచి వస్తున్నా మేం సుంకేసుల రోడ్డులో ఉన్న మాసామసీదులో ఉంటాం. ఇక్కడ తక్కువ ధరకు నాణ్యమైన అల్పాహారం దొరుకుతుంది. మా పిల్లాడు వీటిని బాగా తింటాడు. అందుకే చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తుంటాను. నేనూ తిని ఇంటికీ తీసుకెళుతుంటా. – షేక్రఫిక్ రుచిగా ఉంటుంది నేను సంతోష్‌నగర్‌లో ఉంటాను. ప్రతిరోజు పొద్దున్నే పనికి వెళ్లాల్సి ఉంటుంది. నేను వెళ్లే సమయానికి ఇంట్లో టిఫిన్ రెడీ అయి ఉండదు. ఎలాగూ ఇక్కడి టిఫిన్ రుచిగా ఉంటుందని ఇంత దూరం వస్తుంటా. పైగా ధర తక్కువగా ఉంటుంది. బయట రెండు ఇడ్లీలకు రూ. 40, దోశకు రూ.30 వసూలు చేస్తున్నారు. –ఈశ్వరరెడ్డి ఇంట్లో చేసే వంటల్లా ఉంటాయ్ ఇక్కడి టిఫిన్లు అచ్చం ఇంట్లో చేసిన వాటిలా ఉంటాయి. బయట చట్నీలో కారం ఎక్కువగా వాడుతుంటారు. ఇక్కడ ప్రతిదీ మోతాదు వరకే వేస్తుంటారు. నేను మున్సిపల్ ఆఫీస్ వద్ద పనిచేస్తుంటా. ఇంతదూరం వచ్చి టిఫిన్ చేసి వెళతా. – సురేష్ -
వన్‌ప్లస్ నుంచి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ భారతీయ మార్కెట్లో పాగవేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది. భవిష్యత్తులో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. రూ. 20 వేల కంటే తక్కువ ధరల్లో లాంచ్ చేయాలని వన్‌ప్లస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2022 రెండో త్రైమాసికంలో ఈ బడ్జెట్ ఫోన్లను భారత మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు వన్‌ప్లస్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒప్పోతో విలీనం చెందిన తరువాత వన్‌ప్లస్ తన ఆక్సిజన్‌ఓఎస్‌ను ఓప్పో కలర్ఓఎస్తో వీలినం చేస్తోన్నట్లు ప్రకటించింది. చదవండి: Gmail: జీమెయిల్ యూజర్లకు గుడ్‌న్యూస్...! ప్రముఖ డేటా ఇంజనీర్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ యోగేష్ బ్రార్ వన్‌ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ట్విటర్లో వెల్లడించారు. ప్రస్తుతం వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్స్ రూ. 20 వేలపైనే ఉన్నట్లు తెలిపారు. నార్డ్ సిరీస్‌లో భాగంగా మార్కెట్లోకి సరసమైన ధరలకు (రూ. 20 వేల కంటే తక్కువ) స్మార్ట్ఫోన్లను తీసుకురావడంతో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లను శాసించాలని వన్‌ప్లస్ చూస్తోందని యోగేష్ బ్రార్ అభిప్రాయపడ్డారు. ఇటీవలి వన్‌ప్లస్ నార్డ్ ఎన్ 200-5 జీ వంటి ఫోన్లను కంపెనీ యుఎస్ , కెనడా వంటి మార్కెట్లలో ప్రవేశపెట్టింది. అయితే ఈ మోడల్స్‌ను ఇంకా భారత్‌లోకి తీసుకురాలేదు. చదవండి: Google Photos: మీ స్మార్ట్ఫోన్లలో డిలీటైనా ఫోటోలను ఇలా పొందండి...! -
యూఓహెచ్ ఘనత.. మరింత చౌకగా ఫావిపిరవిర్
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(యూఓహెచ్)లోని ఆస్పైర్ టీబీఐలో ఏర్పాటైన స్టార్టప్ కంపెనీ ఆప్టస్ థెరప్యూటిక్స్ కోవిడ్ చికిత్సకు ఉపయోగిస్తున్న మందు ఫావిపిరవిర్‌ను మరింత చౌకగా ఉత్పత్తి చేసేందుకు కొత్త పద్ధతిని ఆవిష్కరించింది. కృత్రిమ రసాయన శాస్త్రం, కెమో ఎంజమాటిక్ రసాయన శాస్త్రాలపై పరిశోధనలు చేసే ఆప్టస్ థెరప్యూటిక్స్ ఫావిపిరవిర్తోపాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగించే ఓ మందును కూడా మరింత సమర్థంగా, చౌకగా, పర్యావరణ అనుకూల మార్గాల్లో ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ పద్ధతి ద్వారా ఫావిపిరవిర్‌ను కావాల్సినంత మోతాదులో సులువుగా తయారు చేసుకొనే అవకాశం ఏర్పడటం గమనార్హం. ఈ పద్ధతిలో తక్కువ రసాయనాలను వాడటం, కావాల్సిన అణువులను సులువుగా వేరు చేసే అవకాశం ఉండటం దీనికి కారణం. (33 రూపాయలకే కరోనా ట్యాబ్లెట్) హైదరాబాద్‌లోని ఫ్లెమింగ్ లేబొరేటరీస్ సహకారంతో వాణిజ్యస్థాయి ఉత్పత్తిపై కూడా ప్రయోగాలు పూర్తి చేసినట్లు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఫావిపిరవిర్‌ను భారీగా సరఫరా చేసేందుకు ఫ్లెమింగ్ లేబొరేటరీస్ ఇప్పటికే ఓ రష్యా కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు వివరించింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పొదిలి అప్పారావు మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయంలో ఏర్పాటైన ఆప్టస్ లేబొరేటరీస్ సాధించిన ఘనతను కొనియాడారు. వర్సిటీకి ఇదో చరిత్రాత్మక ఘట్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్టస్ లేబొరేటరీస్‌కు చెందిన డాక్టర్ కోటిరెడ్డి, ఫ్లెమింగ్ లేబొరేటరీస్‌కు చెందిన డాక్టర్ ప్రకాశ్ పాల్గొన్నారు. -
అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో వెంటిలేటర్
సాక్షి, చెన్నై : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తోంది, శరవేగంగా విస్తరిస్తూ వేలాది మందిని పొట్టన పెట్టుకుంటోంది. మరోవైపు రోగులకు అందిస్తున్న చికిత్స లో కీలకమైన వెంటిలేటర్ల తీవ్ర కొరత మరింత ఆందోళన రేపుతోంది. ఈ సమయంలో అతితక్కువ ఖరీదుకే తయారు చేస్తామని ఒక స్టార్టప్ సంస్థ చెబుతోంది. అంతేకాదు దేశ, విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను తీర్చగల సామర్థ్యాన్ని కలిగి వుందని చెబుతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన విద్యార్థి-స్టార్టప్ జేకే దజ్తా సిస్టమ్స్ దీన్నిఅభివృద్ధి చేసింది. అంతర్జాతీయ ఓపెన్ సోర్స్ వెంటిలేటర్ ప్రాజెక్ట్ ఆధారంగా, రీ-ఇంజనీరింగ్ డిజైన్‌తో తాము ఈ వెంటిలేటర్‌ను తయారుచేసినట్లు జేకే దజ్తా సిస్టమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 22న ప్రాజెక్టును ప్రారంభించిన తాము కేవలం నాలుగు రోజుల్లోనే ఒక నమూనాతో ముందుకు వచ్చామని పేర్కొంది. స్థానిక ఈఎస్ఐ ఆసుపత్రి అనుమతితో పాజిటివ్ ప్రెజర్ బ్రీతింగ్ వెంటిలేటర్ (ఐపీపీవీ) ఇప్పుడు పరీక్షకు సిద్ధంగా ఉందని చెప్పారు. తాము రూపొందించిన ఈ కొత్త పరికరం దేశవిదేశాల్లో వెంటిలేటర్లకున్న భారీ డిమాండ్‌ను తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. అన్ని ఎలక్ట్రానిక్ ఫీచర్లతో, కొత్తగా రీడిజైన్ చేసిన వెంటిలేటర్ల నమూనాను కేవలం రూ.25 వేల కన్నా తక్కువ ధరకే అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. దీన్ని త్వరలోనే ఇక్కడి ప్రభుత్వ ఈఎస్ఐ ఆసుపత్రిలో పరీక్షించనున్నామని చెప్పారు. రాతినం కాలేజీకి చెందిన బయో మెడికల్, కంప్యూటర్ సైన్స్ విభాగం సహకారంతో కార్తీక్ ఎస్, గౌతమ్, సంతకుమార్ బృందం ఈ వెంటిలేటర్ రూపకర్తలు. టైడల్ వాల్యూమ్, నిమిషంలో తీసుకునే శ్వాస రేటు, తదితర అన్ని వివరాలను పర్యవేక్షిస్తూ, నియంత్రిస్తుందన్నారు. దీంతోపాటు రోగికి అందుతున్న ఆక్సిజన్ స్థాయిలను కూడా పర్యవేక్షించేలా మెరుగుపర్చినట్టు తెలిపారు. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో తయారు చేసిన ఈ వెంటిలేటర్ చాలా మంది రోగులకు సహాయం చేస్తుందని ఆశాభావం ఈ బృందం వ్యక్తం చేసింది. పరీక్షల అనంతరం అధిక సంఖ్యలో వాణిజ్య ఉత్పత్తి కోసం ప్రభుత్వ లైసెన్స్ తీసుకుంటాని తెలిపింది. -
బడా కంపెనీలూ ఆన్‘లైనే’
చెన్నై: ఇప్పటిదాకా చిన్నాచితకా బ్రాండ్లు, స్మార్ట్ఫోన్ల వంటి ఉత్పత్తులకు మాత్రమే పరిమితమైన ఆన్లైన్ ఈ–కామర్స్ పోర్టల్స్ వైపు ఇప్పుడు బడా కంపెనీలు కూడా చూస్తున్నాయి. నెస్లే, శాంసంగ్ మొదలుకుని మారికో, హిందుస్తాన్ యూనిలీవర్ వంటి సంస్థల దాకా ఆన్లైన్ బాట పడుతున్నాయి. ఆహారోత్పత్తుల నుంచి సౌందర్య సాధనాలు, లక్షల రూపాయల ఖరీదు చేసే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల బ్రాండ్స్‌ను కూడా ఆవిష్కరిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ సంస్థ నెస్లే ఇండియా ఇటీవలే తమ పాపులర్ మ్యాగీ బ్రాండ్‌లో కొత్త వేరియంట్‌ను ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఆవిష్కరించింది. అటు కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తమ అంతర్జాతీయ ఫ్రిజ్ బ్రాండ్ ’ఫ్యామిలీ హబ్’ ను అమెజాన్‌లోనూ, ఇతరత్రా ఎక్స్‌క్లూజివ్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ప్రవేశపెట్టింది. దీని ధర దాదాపు రూ.2,80,000. అటు హర్మన్ ఇంటర్నేషనల్ సంస్థ తమ ఆడియో బ్రాండ్ జేబీఎల్ కోసం ఆన్లైన్ స్టోర్ ప్రారంభించింది. హిందుస్తాన్ యూనిలీవర్ ఇండియా, మారికో వంటి సంస్థలు కేవలం ఆన్లైన్లోనే విక్రయించే పురుషుల గ్రూమింగ్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాయి. హ్యుందాయ్ ఇండియా వంటి ఆటోమొబైల్ సంస్థలు వాహనాల అప్‌గ్రేడెడ్ మోడల్స్‌ను ఆవిష్కరించేందుకు డిజిటల్ మాధ్యమాలనే ఉపయోగించుకుంటున్నాయి. ఆన్‌లైన్‌కు అనేక కారణాలు.. కొంగొత్త ఉత్పత్తులను ఆఫ్‌లైన్ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి ముందుగానే ఆన్లైన్లో ఆవిష్కరించడం వల్ల అనేక ప్రయోజనాలున్నట్లు ఆయా కంపెనీలు చెబుతున్నాయి. సదరు ఉత్పత్తి విషయంలో అత్యంత వేగంగా కస్టమర్ల స్పందనను తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతోందని నెస్లే ఇండియా వర్గాలు వెల్లడించాయి. ‘‘ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రవేశపెట్టిన మ్యాగీ స్పెషల్ మసాలా నూడుల్స్‌కి మంచి స్పందన వచ్చింది. మూడు రోజుల్లోనే ఏకంగా 1,00,000 పైచిలుకు సింగిల్ యూనిట్ ప్యాక్స్‌ని విక్రయించాం’’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మరో ఎఫ్ఎంసీజీ సంస్థ మారికో.. ప్రత్యేకంగా స్టూడియో ఎక్స్ పేరిట డిజిటల్ బ్రాండ్‌ను ఆవిష్కరించింది. పురుషుల గ్రూమింగ్ ఉత్పత్తుల విభాగం సెట్ వెట్ కింద దీన్ని ప్రవేశపెట్టింది. ఏడాది వ్యవధిలో మరో 5–6 డిజిటల్ ఉత్పత్తులు ఆవిష్కరించే అవకాశం ఉందని సంస్థ వర్గాలు తెలిపాయి. అటు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ కూడా తమ బ్రిల్ క్రీమ్ శ్రేణికి ఆన్లైన్ లేబుల్ కింద కొత్త రూపురేఖలిస్తోంది. చాలా సరళమైనది, తక్కువ వ్యయాలతో కూడుకున్నదే కాకుండా అవసరమైనంత మేర విస్తరించుకోవడానికి అనువైనది కూడా కావడమే డిజిటల్ మాధ్యమంతో ప్రయోజనమని హ్యుందాయ్ ఇండియా సీనియర్ అధికారులు తెలిపారు. కంపెనీ ఇటీవలే క్రెటా కారుకు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ఆన్లైన్లోనే ఆవిష్కరించింది. అంతక్రితమే గ్రాండ్ ఐ10ను కూడా ప్రవేశపెట్టింది. తేలిగ్గానే బ్రాండ్ సృష్టి.. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టేటప్పుడు అనేక రిస్కులుంటాయి. వాటికి స్పందన ఎలా ఉంటుందో ముందుగా తెలియదు. ఒకవేళ డిమాండ్ ఉంటుందనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఉత్పత్తి చేసినా.. కొనుగోలుదారులు ఇష్టపడకపోతే అప్పటిదాకా పెట్టిన పెట్టుబడి వృథా అవుతుంది. కొనుగోలుదారుల నాడి తెలుసుకునేందుకు ఇప్పటిదాకా వ్యయాలతో కూడుకున్న ఆఫ్‌లైన్ మార్కెట్ ఒక్కటే మార్గంగా ఉండేది. కానీ, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి, ఆన్లైన్ షాపింగ్‌పై అవగాహన పెరుగుతున్న కొద్దీ కంపెనీలు తమ తమ ఉత్పత్తులకుండే డిమాండ్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించుకునేందుకు డిజిటల్ మాధ్యమం కూడా తోడవుతోంది. ఏదైనా బ్రాండ్‌ను సృష్టించడానికి ఇది చాలా చౌకైన మాధ్యమం అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఉత్పత్తికి స్పందన సరిగ్గా లేకపోయిన పక్షంలో అక్కడితో ఆగిపోవచ్చని.. బోలెడు ఖర్చు పెట్టి ఆఫ్‌లైన్ మార్కెట్లోకి వెళ్లనక్కర్లేదని పేర్కొన్నాయి. పెరుగుతున్న ఆన్లైన్ కొనుగోళ్లు.. అంతర్జాతీయ బ్రాండ్లు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు కూడా ఆన్లైన్ మాధ్యమానికి గణనీయంగా ఉపయోగపడుతోంది. గడిచిన కొన్నేళ్లుగా ఆన్లైన్లో టీవీల కొనుగోళ్లకు సంబంధించి బిల్లింగ్ పరిమాణం సగటున 50 శాతం దాకా పెరిగింది. గత ఏడాది వ్యవధిలో స్మార్ట్ఫోన్లు, ఇతరత్రా గృహోపకరణాల బిల్లింగ్ పరిమాణం 20 శాతం మేర పెరిగింది. రూ.30,000 పైగా ఖరీదు చేసే తమ స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో సింహభాగం వాటా ఆన్‌లైన్‌దే ఉంటోందని చైనాకి చెందిన స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ వెల్లడించింది. మొత్తం అమ్మకాల్లో ఈ సంస్థ వాటా 11%. దీన్లో ఆఫ్‌లైన్ స్టోర్స్ వాటా నాలుగు కాగా ఆన్లైన్ వాటా ఏడు శాతం మేర ఉంటోంది. మరో చైనా స్మార్ట్‌ఫోన్స్ సంస్థ షావోమీ ఇటీవలే పోకో పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ను (ధర రూ.20,999 పైగా) ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఏకంగా లక్ష యూనిట్లు అమ్ముడైపోయినట్లు సంస్థ వెల్లడించింది. నోకియా బ్రాండ్‌ను రీ లాంచ్ చేసిన హెచ్ఎండీ గ్లోబల్ అనుభవం కూడా ఇలాంటిదే. నోకియా 6 ఫోన్‌కు అమెజాన్‌లో ఏకంగా పది లక్షల పైగా రిజిస్ట్రేషన్స్ వచ్చినట్లు సంస్థ పేర్కొంది. ఇక ఫ్లిప్‌కార్ట్, నోకియా డాట్‌కామ్‌లో విక్రయించిన నోకియా 6.1 ప్లస్‌కు కూడా భారీ స్పందన వచ్చిందని, నిమిషాల్లోనే స్టాక్ అంతా అమ్ముడైపోయిందని సంస్థ తెలియజేసింది. మరోవైపు తమ జేబీఎల్ బ్రాండ్ అమ్మకాల్లో దాదాపు సగభాగం వాటా ఆన్‌లైన్‌దే ఉంటోందని హర్మన్ ఇంటర్నేషనల్ తెలిపింది. -
తక్కువ ఖర్చు.. వెంటనే నీటి భద్రత!
మెట్ట భూముల్లో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో.. మీటరు లోతు మీటరు వెడల్పున.. కందకాలు తవ్వుకోవడం వల్ల.. అతి తక్కువ ఖర్చు (ఎకరానికి రూ. 2–3 వేల)తో తవ్విన కొద్ది నెలల్లోనే సాగు నీటి భద్రత సాధించవచ్చని నల్లగొండ మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన రైతు, విశ్రాంత ప్రిన్సిపల్ పాలవరపు భగవంతరెడ్డి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. రైతుల సంక్షేమం కోసం భారీగా ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు చిన్న రైతుల మెట్ట భూముల్లో కందకాలు తవ్విస్తే ఎంతో మేలు జరుగుతుందని ఆయన సూచిస్తున్నారు. నల్లగొండకు 5 కి.మీ. దూరంలోని తమ 13 ఎకరాల ఎర్ర భూమిలో తవ్విన రెండు బోర్లకు నీటి లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)లను 2016 జూన్‌లో భగవంతరెడ్డి సంప్రదించారు. వారు స్వయంగా పొలానికి వచ్చి వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. 13 ఎకరాలకు కలిపి రూ. 30 వేలకన్నా తక్కువే ఖర్చయింది. 2016 వర్షాకాలంలో కందకాలు 4,5 సార్లు నిండాయి. కందకాలు తవ్విన 3,4 నెలల్లోనే భూగర్భ జలమట్టం బాగా పెరిగిందని భగవంతరెడ్డి తెలిపారు. 2017 వర్షాకాలంలో కూడా కందకాలు 2,3 సార్లు నిండాయి. దీంతో ఎండాకాలం కూడా నీరు పుష్కలంగా ఉండటంతో నిశ్చింతగా కూరగాయ తోటలను సాగు చేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పక్కన పొలంలో వరి సాగు చేస్తున్న రైతుల బోర్లలో నీరు రాక పొలం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. రెండు నెలల పాటు తమ బోర్ల నుంచే నీటిని ఉచితంగా ఇచ్చామని, ఆ రైతుకు మంచి దిగుబడి రావడం తమకూ సంతోషాన్నిచ్చిందని వివరించారు. ఈ ఏడాది తమ ఇరుగు పొరుగు రైతుల బోర్లలో కూడా నీటి లభ్యత పెరిగిందని ఆయన సంతోషంగా చెప్పారు. ఇది తమ పొలంలో తవ్విన కందకాల వల్ల భూగర్భంలోకి ఇంకిన వర్షపు నీటి వల్లనే సాధ్యపడిందన్నది నూటికి నూరు శాతం వాస్తవమన్నారు. అయితే, రైతులకు కందకాలతో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన లోపించిందని, చిన్న రైతుల భూముల్లో ప్రభుత్వమే కందకాలు తవ్వించడం చాలా అవసరమని భగవంతరెడ్డి(94404 05082) సూచిస్తున్నారు. భగవంతరెడ్డి -
అమెరికా ఇళ్లు... కేవలం 2.6 లక్షలు
అమెరికా : అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా మందికి సొంత గృహాలు ఉండవు. అలాంటి వారికోసం అతి తక్కువ ఖర్చుతో, అత్యంత వేగంగా కేవలం 24 గంటల్లోనే అందమైన ఇంటిని నిర్మించడానికి టెక్సాస్ రాజధాని ఆస్టిన్ నగరంలో గల ఐకాన్ అనే సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది. న్యూస్టోరీ అనే మరో సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుని మధ్యతరగతి వారి సొంతింటి కలను నిజం చేయనుంది. ఈ ఇళ్లను అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం త్రీడి ప్రింటింగ్‌తో నిర్మించనున్నారు. ఐకాన్-న్యూస్టోరీ భాగస్వామ్యంలో ఒక సర్వే నిర్వహించింది. అందులో 1.2 బిలియన్ మంది జనాభాకు గృహ సదుపాయం లేదన్న విషయం తేలింది. దాంతో తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించాలని ఐకాన్ సంస్థ నిర్ణయించుకుంది. టెక్సాస్ నగరంలో జరుగుతున్న ఎస్ఎక్స్ ఎస్‌డబ్య్లూ ఫెస్టివల్లో వీరు నిర్మించిన ఇంటి నమునాను ప్రదర్శించారు. కేవలం రూ.2.6 లక్షలతోనే ఈ 3డీ ప్రింటెడ్ ఇళ్లు నిర్మిస్తామని, వాటికి సంబంధించి అన్ని ప్రమాణాలను పాటిస్తున్నట్టు ఐకాన్ సంస్థ తెలిపింది. తక్కువ నీరు, పవర్‌ను వాడి ఇళ్లు నిర్మిస్తామని సంస్థ తెలిపింది. ఇతర కాలనీ వాసులతో కూడా సంప్రదించి ఇందులో ఉండాల్సిన సౌకర్యాల గురించి సలహాలు స్వీకరిస్తున్నట్టు, భద్రత, పటిష్టత, పునర్ధురణ వంటి వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కూడా సంస్థ పేర్కొంది. అయితే 2014లో కూడా ఇలాంటి త్రీడి టెక్నాలజీతో 24 గంటల్లోనే నిర్మించిన విషయం తెలిసిందే. కాకపోతే దాని నిర్మాణ వ్యయం ఎక్కువ. -
ఉల్లి ధరతో రైతుల గుండెల గుభేల్
-
చౌక వ్యాక్సిన్ పేరుతో టోకరా
-
పేరు లేని లుమియా ఫోన్
న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ కంపెనీ నోకియా పేరు లేకుండా మైక్రోసాఫ్ట్ లుమియా బ్రాండ్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్, లుమియా 535ను మంగళవారం ఆవిష్కరించింది. నోకియా పేరు లేకుండా వస్తోన్న తొలి లుమియా ఫోన్ ఇది. ఈ 3జీ ఫోన్ సింగిల్, డ్యుయల్ సిమ్ వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ ఒక బ్లాగులో పేర్కొంది. ధర 110 యూరోలు(రూ.8,400)అని, ధరలు ఆయా దేశాలను బట్టి మారతాయని వివరించింది. మైక్రోసాఫ్ట్ లోగోతో ఉన్న ఈ ఫోన్లో విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్, 5 అంగుళాల డిస్ప్లే, 1.2 గిగా హెర్ట్స్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 15 జీబీ ఉచిత వన్‌డ్రైవ్ స్టోరేజ్, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, అంతే మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1,905 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. హై-ఎండ్ ఫోన్లలో ఉండే ఫీచర్లు-స్కైప్ వీడియో కాల్స్, ఆఫీస్ యాప్స్, వర్చువల్ అసిస్టెంట్ కోర్టాన వంటివి కూడా ఈ ఫోన్లో ఉన్నాయని వివరించింది. ఈ నెలలోనే వీటిని ఎంపిక చేసిన దేశాల్లో విక్రయిస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. -
తక్కువ ధరలో విమాన టికెట్లు కావాలంటే...
గమనింపు బయల్దేరడానికి కనీసం ఎనిమిది రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాలి. రిజర్వేషన్ సమయానికి టికెట్ బుకింగ్ బిజీ/లీజర్‌గా ఉన్నదా అనే విషయాన్ని పరిశీలించాలి. సాధారణంగా లేట్ నైట్స్, తెల్లవారుఝాము ఫ్లైట్స్‌కి తక్కువ ధరలో టికెట్స్ ఉంటాయి. వారం మధ్యలో ఫ్లైట్ టికెట్ ఖరీదులో తగ్గింపు ఉంటుంది. సాధారణంగా దేశీయ ఫ్లైట్స్ (ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, జెట్ ఎయిర్వేస్, గో ఎయిర్, ఇండిగో... మొదలైనవి) టికెట్ ధరలలో డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. వాటిని పరిశీలిస్తూ ఉండాలి. రోజువారీ సమాచారం తెలుసుకోవాలంటే ఈ-మెయిల్ అలెర్ట్ సరైన సూచిక. సంబంధిత ఎయిర్ వేస్ ఫ్లైట్ బుకింగ్స్ సమాచారం ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తాయి.