కుటుంబానికి రూ.10 వేలకే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ | Narayana Health Insurance launches its first insurance product Aditi | Sakshi
Sakshi News home page

కుటుంబానికి రూ.10 వేలకే హెల్త్‌ ఇన్సూరెన్స్‌

Published Mon, Jul 8 2024 5:51 AM | Last Updated on Mon, Jul 8 2024 8:09 AM

Narayana Health Insurance launches its first insurance product Aditi

నారాయణ హెల్త్‌ వినూత్న పాలసీ

న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా ప్రీమియం సామాన్యులకు భారంగా మారిన తరుణంలో.. ప్రముఖ వైద్యసేవల సంస్థ ‘నారాయణ హెల్త్‌’ చౌక ప్రీమియంతో ఒక ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ఆరోగ్య బీమా పాలసీకి ‘అతిథి’ పేరు పెట్టింది. దంపతులు, ఇద్దరు పిల్లలు (గరిష్టంగా) కలిగిన నలుగురు సభ్యుల కుటుంబానికి ఏడాదికి ప్రీమియం కేవలం రూ.10,000గా నిర్ణయించింది. ఇంటిపెద్ద వయసు 45ఏళ్లకు మించకుండా ఉంటేనే ఈ ప్రీమియం. 

ఇంతకంటే అధిక వయసులోని వారికి ప్రీమియం (అది కూడా ఇతర బీమా సంస్థల కంటే తక్కువే) వేరుగా ఉంటుంది. నలుగురు సభ్యుల కుటుంబానికి ఒక ఏడాదిలో రూ.కోటి రూపాయల వరకు సర్జరీలకు ఈ పాలసీలో చెల్లింపులు లభిస్తాయి. ఇతర హాస్పిటల్‌ చికిత్సలకు (జ్వరం, ఇన్ఫెక్షన్‌ తదితర) రూ.5లక్షల వరకు కవరేజీ ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి ఈ పాలసీ కింద సేవలు నారాయణ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లోనే లభిస్తాయి. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 21 హాస్పిటళ్లు ఉన్నాయి. బెంగళూరులో ఏడు ఆస్పత్రులతోపాటు, మూడు క్లినిక్‌లు ఉన్నాయి.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement