Health insurance premium
-
70 ఏళ్లు నిండిన వారికి ఉచిత బీమా!
ఒక్కసారి ఆస్పత్రి పాలైతే.. కొన్నేళ్ల పాటు కూడబెట్టుకున్నదంతా కరిగిపోయే పరిస్థితి. ఖరీదైన వైద్యం కారణంగా అప్పుల పాలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కరోనా అప్పుడు ఇదే చూశాం. ఈ పరిస్థితి రాకూడదంటే ముందస్తుగా బీమా రక్షణ కలి్పంచుకోవడమే మార్గం. కానీ, వృద్ధాప్యంలో ఆరోగ్య బీమా ప్రీమియం పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 70 ఏళ్లు నిండిన వృద్ధులు అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన’ (ఏబీ–పీఎంజేఏవై) కింద ఉచితంగా ఆరోగ్య బీమా అందిస్తున్నట్టు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద పేదలు, తక్కువ ఆదాయ వర్గాలకే ఉచిత ప్రయోజనం అందుతోంది. ఇకపై ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పీఎం జేఏవై కింద రూ.5 లక్షల హెల్త్ కవరేజీ లభించనుంది. అతి త్వరలోనే అమల్లోకి రానున్న ఈ పథకం గురించి అవగాహన కల్పించే కథనమే ఇది. పీఎంజేఏవై పథకం కింద రూ.5,00,000 సమగ్రమైన కవరేజీ లభిస్తుంది. ఆస్పత్రిలో చేరడానికి మూడు రోజుల ముందు వరకు అయ్యే వైద్య పరమైన ఖర్చుల (డాక్టర్ ఫీజులు, డయాగ్నోస్టిక్స్ పరీక్షలు)కు సైతం కవరేజీ ఉంటుంది. చికిత్సా సమయంలో ఔషధాలు, కన్జ్యూమబుల్స్ కూడా ఉచితమే. చికిత్సలో భాగంగా వేసే స్టెంట్లు, పేస్మేకర్ల వంటి వాటికీ కవరేజీ లభిస్తుంది. ఐసీయూ, జనరల్ వార్డ్‌లో ఉండి తీసుకునే చికిత్సలకు పరిహారం అందుతుంది. రోగికి చికిత్సా సమయంలో ఉచితంగానే ఆహారం అందిస్తారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 15 రోజుల పాటు చికిత్సకు సంబంధించిన వ్యయాలకు చెల్లింపులు లభిస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, ఎంపిక చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో కవరేజీ లభిస్తుంది. ఈ పథకంలో చేరిన మొదటి రోజు నుంచే అన్ని రకాల (ఎంపిక చేసిన) చికిత్సలకు ఉచితంగా కవరేజీ అమల్లోకి వస్తుంది. అంటే ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు సైతం ఈ పథకం కింద చికిత్స తీసుకోవచ్చు. వెయిటింగ్ పీరియడ్, కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనే షరతుల్లేవు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ కింద ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,350 మెడికల్ ప్యాకేజీలకు కవరేజీ లభిస్తోంది. 70 ఏళ్లు నిండిన వృద్ధులకు సంబంధించి పథకంలో భాగంగా ఏఏ చికిత్సలకు కవరేజీ లభిస్తుందన్నది ప్రభుత్వ నోటిఫికేషన్‌తోనే స్పష్టత వస్తుంది.అర్హత? 70 ఏళ్లు నిండి, ఆధార్ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద రూ.5 లక్షల హెల్త్ కవరేజీకి అర్హులే. పీఎంజేఏవై కింద ఇప్పటికే రూ.5 లక్షల కవరేజీ కలిగిన కుటుంబాల విషయానికొస్తే.. ఆయా కుటుంబాల్లోని 70 ఏళ్లు నిండిన వారు అదనంగా రూ.5 లక్షల హెల్త్ టాపప్ (కవరేజీ)ను పొందేందుకు అర్హులు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్), ఎక్స్ సరీ్వస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) కింద కవరేజీ ఉన్న వారు ఎప్పటి మాదిరే అందులో కొనసాగొచ్చు. లేదా వాటి నుంచి పీఎంజేఏవైకు మారొచ్చు. ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నవారు, ఈఎస్ఐ కింద కవరేజీ కలిగిన వారు, వీటితోపాటు అదనంగా పీఎంజేఏవై కవరేజీకి సైతం అర్హులే.దరఖాస్తు ఎలా..? పీఎంజేఏవై డాట్ జీవోవీ డాట్ ఇన్ పోర్టల్ లేదా ఆయుష్మాన్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, 70 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. అతి త్వరలోనే ఇది ఆరంభం కానుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించి, అనంతరం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రణాళికగా ఉంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ/ఆభా) కలిగి ఉంటే, ఈ బీమా ఉచితమని అనుకోవద్దు. ఆభా అన్నది డిజిటల్ రూపంలో హెల్త్ రికార్డులు భద్రపరుచుకునేందుకు ఉపయోగపడే ఖాతా. తమ హెల్త్ రిపోర్ట్‌లను ఈ ఖాతాలోకి ఉచితంగా అప్లోడ్ చేసుకుని, వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు వాటిని డిజిటల్ రూపంలోపంచుకోవచ్చు. అవసరమైన సందర్భాల్లో డిజిటల్ హెల్త్ రికార్డులను పొందొచ్చు. ఆభాతో సంబంధం లేకుండా పీఎంజేఏవై కింద రూ.5 లక్షల కవరేజీకి విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 70 ఏళ్లు నిండిన వారు, పీఎంజేఏవై కింద ఇప్పటికే హెల్త్ కవరేజీ పొందుతున్న 70 ఏళ్లు నిండిన వృద్ధులు విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే.అందరికీ అనుకూలమేనా?70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఆరోగ్య బీమా సరిపోకపోవచ్చు. ఆస్పత్రి బిల్లులు ∙రూ.5 లక్షలకే పరిమితం కావాలని లేదు. విడిగా తమ ఆరోగ్య చరిత్ర ఆధారంగా, వాటికి కవరేజీతో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం అవసరం. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ పరిధిలోని ప్యాకేజీ వివరాలు సమగ్రంగా తెలుసుకోవాలి. అప్పుడు అందులో లేని చికిత్సలకు కవరేజీనిచ్చే ప్లాన్‌ను విడిగా తీసుకోవచ్చు. వృద్ధులు ఆయుష్మాన్ భారత్ కవరేజీని అదనపు రక్షణగానే చూడాలన్నది నిపుణుల సూచన. అంటే విడిగా మరో హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. అప్పుడు సమగ్రమైన రక్షణతో నిశ్చి తంగా ఉండొచ్చన్నది నిపుణుల సూచన. ఆయుష్మాన్ భారత్ 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితం కనుక.. పథకం కింద చికిత్సలకు ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో రద్దీ ఎక్కువగా ఉండొచ్చు. మన దేశంలో ఆస్పత్రి పడకల సగటు చాలా తక్కువ. కనుక తమవంతు చికిత్స కోసం వేచి చూడాల్సి రావచ్చు. ఇది నచ్చని వారు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు విడిగా హెల్త్ ప్లాన్ వీలు కలి్పస్తుంది. ప్రభుత్వ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పరిధిలో సింగిల్ ప్రైవేటు రూమ్‌కు అవకాశం ఉండదు. ఎందుకంటే పన్ను చెల్లింపుదారుల డబ్బులతో అందిస్తున్న ఉచిత ఆరోగ్య పథకంలో ప్రీమియం సదుపాయాల కల్పన కష్టం. ఒకవేళ ప్రైవేటు రూమ్ తీసుకునేట్టు అయితే, తమ జేబు నుంచి పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది.ఆర్థిక భారం పడకుండా..ఉన్నట్టుండి అత్యవసర వైద్యం అవసరమైతే సమీపంలోని ప్చైవేటు ఆస్పత్రిలో చేరి్పంచాల్సి రావచ్చు. అప్పుడు విడిగా హెల్త్‌ప్లాన్ లేకుంటే ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల చికిత్సలకు ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతుంటారు. అలా ఎంపిక చేసుకునే హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ నెట్వర్క్ పరిధిలో లేకపోవచ్చు. విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇందుకు పరిష్కారం చూపుతుంది. ప్రైవేటు హెల్త్ ప్లాన్‌లో నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నా, తర్వాత రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ కింద రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం లేదు. కేవలం నగదు రహిత వైద్యమే అందుతుంది. టాప్ రేటెడ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు, ప్రభుత్వ పథకంలో కవరేజీ లేని మరిన్ని రకాల చికిత్సలకు విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో అవకాశం లభిస్తుంది. ప్రైవేటు బీమా సంస్థలు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో హాప్పిటల్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తుంటాయి. ‘‘దీర్ఘకాలిక వ్యాధులు లేదా సర్జరీలు, కేన్సర్ తదితర చికిత్సల్లో అధిక సమ్ ఇన్షూర్డ్ (బీమా రక్షణ) ఉండటం వృద్ధులకు ఎంతో కీలకం. వ్యాధులతో బాధపడే వారు స్వతంత్రంగా హెల్త్ కవరేజీ కలిగి ఉండాలి. వృద్ధాప్యంతో అనారోగ్యాలకు ప్రత్యేకమైన చికిత్స అవసరం. అందుకు రూ.5 లక్షల కవరేజీ సరిపోదు. వయసుమీద పడడం వల్ల వచ్చే అనారోగ్యాలకు కొన్సి సందర్భాల్లో ఖరీదైన చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. ఆ సమయంలో ఆరి్థక భారం పడుతుంది’’ అని పాలసీబజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అమిత్ చాబ్రా వివరించారు. 30,000 ఆస్పత్రులు ఎంప్యానెల్పీఎంజేఏవై కింద దేశవ్యాప్తంగా 30,000 ఆస్పత్రులు ఎంప్యానెల్ అయ్యాయి. ఇందులో 13,466 ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఉన్నాయి. కానీ, అన్నీ యాక్టివ్‌గా లేవు. యాక్టివ్ హాస్పిటల్ అంటే గడిచిన 45 రోజుల్లో ఆయా ఆస్పత్రుల నుంచి కనీసం ఒక పేషెంట్ అయినా డిశ్చార్జ్ అయి ఉండాలి. యాక్టివ్ ఆస్పత్రులు కేవలం 3,000 మాత్రమే ఉన్నాయి. పైగా ఎంప్యానెల్ అయిన ఆస్పత్రులు అన్నీ కూడా అన్ని రకాల చికిత్సలను ఆఫర్ చేయడం లేదన్నది గుర్తు పెట్టుకోవాలి. అంటే పీఎం జేఏవై కింద ఎంపిక చేసిన ప్యాకేజీలలో కొన్నింటినే ఆఫర్ చేసే వెసులుబాటు ఆస్పత్రులకు ఉంటుంది.మరో మార్గం? పీఎం జేఏవై కింద రూ.5 లక్షల కవరేజీ తీసుకున్న వారు.. విడిగా మరో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ప్రీమియం చెల్లించే స్థోమత లేకపోతే ప్రత్యామ్నాయం ఒకటి ఉంది. ఇండివిడ్యువల్ హెల్త్ ప్లాన్‌కు బదులు సూపర్ టాపప్ మంచి ఆలోచన అవుతుంది. రూ.5 లక్షలు డిడక్టబుల్‌తో సూపర్ టాపప్ హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. ఏదైనా ఒక సంవత్సరంలో ఆస్పత్రి బిల్లు రూ.5 లక్షలకు మించితే అప్పుడు సూపర్ టాపప్ చెల్లింపులు చేస్తుంది. ఒక్కసారి అడ్మిషన్లో రూ.5 లక్షలకు మించి బిల్లు రావాలని లేదు. రెండు మూడు సార్లు చేరి చికిత్స తీసుకుని, మొత్తం బిల్లులు రూ.5 లక్షలు దాటినా సరే సూపర్ టాపప్ కింద పరిహారం పొందొచ్చు. పైగా బేసిక్ హెల్త్ ప్లాన్‌తో పోలి్చతే, సూపర్ టాపప్ ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తమ ఆరోగ్య సమస్యలకు మెరుగైన రక్షణ దిశగా వృద్ధులు ప్రణాళిక రూపొందించుకోవాలి. –సాక్షి, బిజినెస్‌డెస్క్ -
కుటుంబానికి రూ.10 వేలకే హెల్త్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా ప్రీమియం సామాన్యులకు భారంగా మారిన తరుణంలో.. ప్రముఖ వైద్యసేవల సంస్థ ‘నారాయణ హెల్త్’ చౌక ప్రీమియంతో ఒక ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ఆరోగ్య బీమా పాలసీకి ‘అతిథి’ పేరు పెట్టింది. దంపతులు, ఇద్దరు పిల్లలు (గరిష్టంగా) కలిగిన నలుగురు సభ్యుల కుటుంబానికి ఏడాదికి ప్రీమియం కేవలం రూ.10,000గా నిర్ణయించింది. ఇంటిపెద్ద వయసు 45ఏళ్లకు మించకుండా ఉంటేనే ఈ ప్రీమియం. ఇంతకంటే అధిక వయసులోని వారికి ప్రీమియం (అది కూడా ఇతర బీమా సంస్థల కంటే తక్కువే) వేరుగా ఉంటుంది. నలుగురు సభ్యుల కుటుంబానికి ఒక ఏడాదిలో రూ.కోటి రూపాయల వరకు సర్జరీలకు ఈ పాలసీలో చెల్లింపులు లభిస్తాయి. ఇతర హాస్పిటల్ చికిత్సలకు (జ్వరం, ఇన్ఫెక్షన్ తదితర) రూ.5లక్షల వరకు కవరేజీ ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి ఈ పాలసీ కింద సేవలు నారాయణ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే లభిస్తాయి. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 21 హాస్పిటళ్లు ఉన్నాయి. బెంగళూరులో ఏడు ఆస్పత్రులతోపాటు, మూడు క్లినిక్‌లు ఉన్నాయి. -
ఏ వయసు వారికైనా.. ఆరోగ్య బీమా! 65 ఏళ్ల పరిమితి లేదిక..
వైద్య ఖర్చులు గణనీయంగా పెరిగిపోయిన నేటి రోజుల్లో ఆరోగ్య బీమా ఎన్నో కుటుంబాలకు మెరుగైన రక్షణ కలి్పస్తుందనడంలో సందేహం లేదు. కానీ, మన దేశంలో సగం మంది ఇప్పటికీ ఆరోగ్య బీమా రక్షణ పరిధిలో లేరన్నది వాస్తవం. 2047 నాటికి అందరికీ బీమాను చేరువ చేయాలన్న లక్ష్యంలో భాగంగా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలే నిబంధనల్లో కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో పాలసీదారులకు ప్రయోజనం కలిగించే మార్పులకు శ్రీకారం చుట్టింది. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ‘65 ఏళ్ల’ పరిమితిని తొలగించింది. ముందస్తు వ్యాధుల కవరేజీకి వేచి ఉండాల్సిన కాలాన్ని తగ్గించింది. క్లెయిమ్ తిరస్కరణ నిబంధనలను మరింత అనుకూలంగా మార్చింది. వీటివల్ల పాలసీదారులకు ఒరిగే ప్రయోజనం, ప్రీమియం భారం గురించి తెలుసుకుందాంహెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు సమయంలో తమ ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికే ఏదైనా అనారోగ్యం బారిన పడ్డారా?, ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని బీమా సంస్థ పాలసీ దరఖాస్తులో అడుగుతుంది. అప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, అవి ముందస్తు వ్యాధుల కిందకు వస్తే (పీఈడీ) నిర్ణీత కాలం పాటు ఆయా వ్యాధుల కవరేజీ కోసం వేచి ఉండాలి.ఈ వెయిటింగ్ పీరియడ్ ముగిసే వరకు వాటికి సంబంధించిన క్లెయిమ్‌లకు బీమా సంస్థ చెల్లింపులు చేయదు. పాలసీదారులు సొంతంగా చెల్లించుకోవాలి. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది గరిష్టంగా 48 నెలలు (నాలుగేళ్లు) ఉండగా, దీనిని ఐఆర్డీఏఐ తాజాగా 36 నెలలకు (మూడేళ్లు) తగ్గించింది. కాకపోతే ఒక్కో బీమా సంస్థలో ఈ కాలం ఒక్కో మాదిరిగా ఉండొచ్చు. అదనపు ప్రీమియం చెల్లిస్తే ఈ వెయిటింగ్ కాలాన్ని కొన్ని బీమా సంస్థలు తగ్గిస్తున్నాయి కూడా. మరి అదనపు ప్రీమియం భరించలేని వారికి తాజా నిబంధన సంతోషాన్నిచ్చేదే.తాజా పరిణామంతో బీమా సంస్థలు ముందు నుంచి ఉన్న వ్యాధులకు మూడేళ్లకు మించి కొర్రీలు పెట్టడం కుదరదు. ఇది బీమా వ్యాప్తిని పెంచుతుందని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం బిజినెస్ హెడ్ సిద్థార్థ్ సింఘాల్ అభిప్రాయపడ్డారు. ‘‘ముందస్తు వ్యాధులకు మూడేళ్లకంటే తక్కువ వెయిటింగ్ పీరియడ్‌తో పాలసీలను కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. కానీ, తక్కువ వెయిటింగ్ పీరియడ్ పాలసీని ఎంపిక చేసుకోవడం పాలసీదారుల అవసరం, అవగాహనపైనే ఆధారపడి ఉంటోంది.తక్కువ వెయిటింగ్ పీరియడ్ పాలసీదారులకు అనుకూలం’’అని నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, క్లెయిమ్‌లు, అండర్‌రైటింగ్ డైరెక్టర్ బసుతోష్ మిశ్రా చెప్పారు. ఒక ఏడాది తగ్గించడం వల్ల ముందస్తు వ్యాధుల పేరుతో బీమా సంస్థల నుంచి క్లెయిమ్ తిరస్కరణలు తగ్గిపోతాయని నిపుణుల విశ్లేషణ.మొదటి రోజు నుంచే..అదనపు ప్రీమియం చెల్లిస్తే మొదటి రోజు నుంచే ముందస్తు వ్యాధులకు కవరేజీ ఇచ్చే పాలసీలు కూడా ఉన్నాయి. ‘‘మధుమేహం, రక్తపోటు, ఉబ్బసం, కొలె్రస్టాల్ తదితర ముందు నుంచి ఉన్న వ్యాధులకు పాలసీదారులు మొదటి రోజు నుంచే కవరేజీ పొందొచ్చు. కాకపోతే ఇందు కోసం 10–15 శాతం అదనపు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది’’అని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ తెలిపారు.ముందు నుంచి అంటే ఎంత కాలం..?పాలసీ తీసుకునే తేదీ నాటి నుంచి దానికి ముందు 36 నెలల కాలంలో డాక్టర్ ఏదైనా సమస్యని నిర్ధారించడం.. అందుకు గాను చికిత్స లేదా ఔషధాలు సూచించినా అది పీఈడీ కిందకు వస్తుందిన నిజానికి ఇప్పటి వరకు ఇది 48 నెలలుగా ఉండేది. అంటే పాలసీ తీసుకునే నాటికి ముందు నాలుగేళ్ల కాలంలో ఏదైనా ప్రత్యేక ఆరోగ్య సమస్య ఎదుర్కొంటే దాన్ని పీఈడీగా పరిగణించే వారు. ఇప్పుడు మూడేళ్లకు ఐఆర్డీఏఐ తగ్గించింది. దశాబ్దం క్రితం ఐదారేళ్ల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉండేది. బీమా రంగంలో పోటీ పెరగడం, పాలసీ కొనుగోలుదారులు విస్తరించడంతో గణనీయంగా తగ్గుతూ వస్తోంది. భవిష్యత్తులోనూ మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదు. ఈ తప్పు చేయొద్దు..పాలసీ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ పీఈడీల గురించి వెల్లడించాల్సిందే. ఉదాహరణకు ఒక వ్యక్తి చిన్న డోస్‌తో రక్తపోటును నియంత్రించుకోవచ్చు. ఇవి పరీక్షల్లో బయటపడేవి కావని చెప్పి చాలా మంది తమకు ఈ సమస్యలు ఉన్నట్టు పాలసీ దరఖాస్తులో వెల్లడించరు. కానీ, ఇది పెద్ద తప్పు. తాము ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నదీ, వాటికి ఏవేవి మందులు వాడుతున్నది తప్పకుండా వెల్లడించాలి. దీనివల్ల పాలసీ డాక్యుమెంట్లో మీ ఆరోగ్య సమస్యలు నమోదు అవుతాయి. దీనివల్ల ఆ తర్వాతి కాలంలో క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు చెల్లింపుల పరంగా వివాదాలు తగ్గిపోతాయి.కానీ, ఆరోగ్య సమస్యలను బయట పెడితే కంపెనీలు పాలసీ జారీకి నిరాకరిస్తారయన్న భయంతో కొందరు వెల్లడించరు. కానీ, థైరాయిడ్, కొలె్రస్టాల్, అధిక రక్తపోటు, గుండె జబ్బులకు సైతం అండర్‌రైటింగ్ విషయంలో (పాలసీ జారీ) బీమా సంస్థలు సౌకర్యంగానే ఉంటాయి. కనుక నిజాయితీగా వెల్లడించడమే మంచిదని నిపుణుల వ్యాఖ్య.వ్యాధుల వారీగా వెయిటింగ్..కొన్ని ఆనారోగ్యాలకు చికిత్స కవరేజీని బీమా సంస్థలు మొదటి రోజు నుంచే ఆఫర్ చేయవు. వీటి కోసం ‘ప్రత్యేకమైన వెయిటింగ్ పీరియడ్’ను అమలు చేస్తుంటాయి. నిబంధల ప్రకారం ఈ కాలాన్ని గరిష్టంగా 4 సంవత్సరాలకు మించి అమలు చేయకూడదు. ఇప్పుడు ఈ కాలాన్ని మూడేళ్లకు ఐఆర్డీఏఐ తగ్గించింది. నిజానికి కొన్ని బీమా సంస్థలు రెండేళ్లకే ఈ వెయిటింగ్ పీరియడ్‌ను అమలు చేస్తున్నాయి.పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్లో ఈ వ్యాధుల వివరాలు పూర్తిగా ఉంటాయి. నిరీ్ణత వెయిటింగ్ కాలం ముగిసిన తర్వాతే వీటికి సంబంధించిన క్లెయిమ్‌కు అర్హత లభిస్తుంది. క్యాటరాక్ట్, సైనసైటిస్, అడినాయిడ్స్, టాన్సిలైటిస్ చికిత్సలు, కిడ్నీలో రాళ్ల తొలగింపు, కీళ్ల మార్పిడి చికిత్సలకు సాధారణంగా వెయిటింగ్ పీరియడ్ అమలవుతుంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ తగ్గింపు కొత్త వారికే కాకుండా పాత పాలసీదారులకూ వర్తిస్తుంది. ఐదేళ్లు పూర్తయితే చాలు!మారటోరియం పీరియడ్‌ను 8 సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు తగ్గించడం మరో ముఖ్యమైన నిర్ణయం. పాలసీ తీసుకుని, క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే.. ఆ తర్వాతి కాలంలో ఎలాంటి కారణం చూపుతూ బీమా సంస్థ క్లెయిమ్ తిరస్కరించడం కుదరదు. పాలసీదారు మోసం చేసినట్టు నిరూపిస్తే తప్పించి క్లెయిమ్‌ను ఆమోదించాల్సిందే. ఒకేసారి 8 ఏళ్ల నుంచి 5ఏళ్లకు తగ్గించడం వల్ల పాలసీదారులకు ఎంతో వెసులుబాటు లభించినట్టయింది.దరఖాస్తులో ఆరోగ్య సమాచారం పూర్తిగా వెల్లడించలేదనో, తప్పుడు సమాచారం ఇచ్చారనే పేరుతో బీమా సంస్థలు కొన్ని సందర్భాల్లో క్లెయిమ్‌లకు చెల్లింపులు చేయకుండా నిరాకరిస్తుంటాయి. ఉదాహరణకు మధుమేహం, ఆస్తమా తదితర వ్యాధులు ముందు నుంచి ఉన్నా కానీ వెల్లడించలేదంటూ క్లెయిమ్‌లు తిరస్కరించిన కేసులు ఎన్నో ఉన్నాయి. కానీ, పాలసీదారు మోసపూరితంగా సమాచారం వెల్లడించిన సందర్భాల్లోనే ఐదేళ్లు ముగిసిన తర్వాత కూడా క్లెయిమ్ తిరస్కరించడానికి ఇక మీదట కూడా బీమా సంస్థలకు అధికారం ఉంటుంది.ఈ ఐదేళ్లు అన్నది సదరు వ్యక్తి ఆ పాలసీ మొదటి సంవత్సరం నుంచి వర్తిస్తుంది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పోర్టబులిటీ ద్వారా మారినప్పటికీ, అంతకుముందు సంస్థల్లోని కాలం కూడా కలుస్తుంది. అలాగే, ఈ మారటోరియం అన్నది మొదట తీసుకున్న బీమా కవవరేజీకే ఐదేళ్లు వర్తిస్తుంది. ఇది ఎలా అంటే ఉదాహరణకు ఆరంభంలో రూ.5 లక్షలకు తీసుకున్నారని అనుకుందాం. ఐదేళ్ల తర్వాత రూ.10 లక్షలకు పెంచుకున్నారని అనుకుందాం.అప్పుడు ఐదేళ్లు ముగిసిన మొదటి రూ.5 లక్షల కవరేజీకి మారటోరియం తొలగిపోతుంది. పెంచుకున్న కవరేజీ అప్పటి నుంచి ఐదేళ్లు ముగిసిన తర్వాతే మారటోరియం పరిధిలోకి వస్తుంది. ‘‘ఇది పాలసీదారుల అనుకూల నిర్ణయం. ఎనిమిదేళ్లు మారటోరియం అన్నది చాలా సుదీర్ఘమైనది. పాలసీ తీసుకునే ముందే ఏవైనా వ్యాధులు ఉంటే అవి బయట పడేందుకు ఐదేళ్లు సరిపోతుంది. ఏదైనా మోసం ఉంటే దాన్ని నిరూపించాల్సిన బాధ్యత బీమా సంస్థపైనే ఉంటుంది’’అని ఇన్సూరెన్స్ సమాధాన్ సంస్థ సీఈవో శిల్పా అరోరా పేర్కొన్నారు. ప్రీమియం భారం..వృద్ధులకూ ఆరోగ్య బీమా కవరేజీని విస్తతం చేయడమే ఐఆర్డీఏఐ తాజా చర్య వెనుక ఉద్దేశ్యం. దీంతో బీమా సంస్థలు ఇప్పుడు ఏ వయసు వారికైనా బీమా పాలసీలను ఆఫర్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో పోటీ ఎలానూ ఉంటుంది. కనుక ఇక మీదట వృద్ధుల కోసం బీమా సంస్థలు మరిన్ని నూతన ఉత్పత్తులను తీసుకురానున్నాయి. అదే సమయంలో వీటి ప్రీమియం 10–15 శాతం వరకు పెరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు.అంతేకాదు, ఇతర పాలసీదారులపైనా ప్రీమియం భారం పడనుంది. వెయిటింగ్ పీరియడ్ తగ్గించడం వల్ల బీమా సంస్థలకు క్లెయిమ్‌లు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా అన్ని పాలసీల ప్రీమియంను బీమా సంస్థలు సవరించొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం సామాన్య, మధ్యతరగతి వాసులకు భరించలేని స్థాయికి చేరగా, ఇప్పుడు మరో విడత పెంపుతో ఈ భారం మరింత అధికం కానుంది. 65 ఏళ్ల పరిమితి లేదిక.. 2016 నాటి ఆరోగ్య బీమా మార్గదర్శకాల ప్రకారం బీమా సంస్థలు 65 ఏళ్లలోపు వారికి తప్పనిసరిగా హెల్త్ కవరేజ్ ఆఫర్ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక కారణాలు ఉంటే తప్పించి ఈ వయసులోపు వారికి కవరేజీని తిరస్కరించరాదన్నది నిబంధనల్లోని ఉద్దేశ్యం. 65 ఏళ్లు దాటిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఇవ్వడం, ఇవ్వకపోడం బీమా కంపెనీల అభీష్టంపైనే ఆధారపడి ఉండేది. అంతేకానీ, 65 ఏళ్లు నిండిన వారికి సైతం ఆరోగ్య బీమా కవరేజీ ఇవ్వాలని బీమా సంస్థలపై ఇప్పటి వరకు ఎలాంటి ఒత్తిడి లేదు.తాజా నిబంధనల్లో 65 ఏళ్లను ఐఆర్డీఏఐ ప్రస్తావించలేదు. అంటే వృద్ధుల విషయంలో బీమా కంపెనీలకు మరింత స్వేచ్ఛనిచి్చనట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వివిధ వయసుల వారి అవసరాలకు తగ్గట్టు ప్రత్యేకమైన ఫీచర్లతో పాలసీలను బీమా సంస్థలు తీసుకురావచ్చంటున్నారు. 65 ఏళ్లకు మించిన వారికి సైతం హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ఐఆర్డీఏఐ అనుమతించిందన్న వార్తలు వాస్తవం కాదు. నిబంధనల్లో 65 ఏళ్ల పరిమితిని తొలగించింది అంతే.ఈ ఏడాది మార్చి వరకు అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం కూడా 65 ఏళ్లు దాటిన వారికి ఆరోగ్య బీమా ఆఫర్ చేయడంపై ఎలాంటి నిషేధం లేదు. అందుకే 65 ఏళ్లు దాటిన వారికి సైతం కొన్ని బీమా సంస్థలు ప్రత్యేక ఆరోగ్య బీమా పాలసీలను ఇప్పటికే మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ‘‘ఇప్పటి వరకు ఉన్న 65 ఏళ్ల పరిమితిని ఆసరాగా తీసుకుని.. అంతకుమించిన వయసు వారికి ఆరోగ్య బీమా కవరేజీ ప్రతిపాదనలను కొన్ని బీమా సంస్థలు నిరాకరించేవి.ఇప్పుడు దీన్ని తొలగించడం వల్ల ఇక మీదట అలా చేయడం కుదరదు. వివిధ వయసుల వారికి అనుగుణమైన బీమా ఉత్పత్తులను రూపొందించి, ప్రీమియం నిర్ణయించాల్సిందే’’అని రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సనూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నిఖిల్ ఆప్టే పేర్కొన్నారు. సాధారణంగా వృద్ధులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇతరులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వయసులో అనారోగ్యాల ముప్పు ఎక్కువగా ఉండడం ఇందుకు కారణం. -
ఆరోగ్య బీమా భారం తగ్గేదెలా..?
రమణ్‌సింగ్ (68)కు ఇటీవలే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పాలసీ రెన్యువల్ నోటీస్ వచి్చంది. చూస్తే ప్రీమియం గతేడాది కంటే గణనీయంగా పెరిగిపోయింది. ఏకంగా 30 శాతం అధికంగా చెల్లించాల్సి రావడంతో దీన్ని ఎలా అధిగమించాలా? అనే ఆలోచనలో పడ్డాడు. రమణ్‌సింగ్‌కు మాత్రమే ఈ అనుభవం పరిమితం కాదు. దాదాపు అన్ని బీమా సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఇటీవలి కాలంలో పెంచేశాయి. దీంతో సగటు మధ్యతరగతి వాసులపై హెల్త్ ఇన్సూరెన్స్ రూపంలో భారం పెరిగిపోయింది. కరోనా విపత్తు తర్వాత నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు గణనీయంగా పెరగడం పాలసీదారులకు తెలిసిన అనుభవమే. దీనికి క్లెయిమ్‌లు భారీగా పెరిగిపోవడమే కారణమని బీమా సంస్థలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో వృద్ధులకు హెల్త్ కవరేజీ విషయంలో కొన్ని బీమా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. అధిక ప్రీమియంకు తోడు, పలు షరతులు పెడుతున్నాయి. వృద్ధులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారంగా మారుతున్న తరుణంలో దీన్ని తగ్గించుకునే మార్గాల గురించి చర్చించే కథనమే ఇది. బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) తాజా వార్షిక నివేదిక ప్రకారం.. హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 2020–21లో 94 శాతంగా ఉంటే, అది 2021–22 సంవత్సరానికి 109 శాతానికి పెరిగింది. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 100 శాతానికి దిగువన ఉంటేనే బీమా సంస్థలకు లాభం ఉన్నట్టు. 100 అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే, తమకు వస్తున్న ప్రీమియానికి మించి అవి చెల్లింపులు చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ‘‘గడిచిన కొన్ని సంవత్సరాలుగా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు పెరిగిపోయాయి. కరోనా తర్వాత అన్ని వయసుల వారి నుంచి క్లెయిమ్‌లు 10–30 శాతం వరకు ఎక్కువయ్యాయి. దీనివల్ల వృద్ధులపై భారం పెరిగిపోయింది. వీరు అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. పైగా వృద్ధుల్లో క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే సదుపాయం అందరికీ ఉండదు’’ అని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ తెలిపారు. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ. దీంతో ఈ వయసులోని వారికి సహజంగానే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు ఇటీవలి కాలంలో క్లెయిమ్‌లు పెరగడంతో బీమా సంస్థలు ప్రీమియంను మరింత పెంచాయి. ‘‘వృద్ధులకు సహజంగా హెల్త్ రిస్క్‌లు ఎక్కువ. దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వీరు హెల్త్ కవరేజీ ఎక్కువగా వినియోగించుకుంటూ ఉంటారు. కనుక క్లెయిమ్‌ల రిస్క్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బీమా సంస్థలు ప్రీమియంను నిర్ధారిస్తుంటాయి. 30 ఏళ్ల వయసు వారి ప్రీమియంతో పోలిస్తే 60 ఏళ్లకు పైబడిన వారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం 2.5 రెట్ల నుంచి 4 రెట్ల వరకు అధికంగా ఉంటుంది’’ అని గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ సేల్స్ హెడ్ వివేక్ చతుర్వేది తెలిపారు. సీనియర్ సిటిజన్లలో కొందరికి బీమా సంస్థలు పాలసీలు ఇచ్చేందుకు నిరాకరిస్తుంటాయి. వారికి ముందస్తుగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో వచి్చన ఫలితాలే దీనికి కారణమని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘాల్ పేర్కొన్నారు. కోపేమెంట్.. కోపేమెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే, ప్రతి క్లెయిమ్‌లో పాలసీదారు తన వంతు కొంత భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయి. సాధారణంగా ఈ కోపేమెంట్ అనేది బీమా కవరేజీలో 10 శాతం నుంచి 50 శాతం వరకు ఉంటుంది. 20 శాతం కోపేమెంట్ ఎంపిక చేసుకుంటే, క్లెయిమ్ మొత్తంలో పాలసీదారు 20 శాతం, మిగిలిన 80 శాతం బీమా సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. క్లెయిమ్‌లో తన వైపు భారం తగ్గుతుంది కనుక బీమా సంస్థ ప్రీమియంలో తగ్గింపును ఇస్తుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కోపేమెంట్తో ప్రీమియంలో ఆదా అయిన మొత్తం కంటే, క్లెయిమ్ వచి్చనప్పుడు పాలసీదారు తన వంతు వాటాగా చెల్లించే మొత్తమే అధికంగా ఉంటుంది. అయినా సరే భారీ ప్రీమియం చెల్లించడం కష్టమనుకునే వారు కోపేమెంట్ ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. దీనివల్ల పాలసీ ప్రీమియంలో 30–40 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ‘‘వృద్ధులకు అదనపు వైద్య సంరక్షణ అవసరం ఉంటుంది. కనుక వారు ఆసుపత్రిలో చేరితే ఎక్కువ రోజుల పాటు ఉండాల్సి రావచ్చు. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎంపిక చేసుకునే వారు ఇన్ పేషెంట్ (ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందే వారు)లో గరిష్ట కవరేజీని ఆఫర్ చేసే ప్లాన్‌ను పరిశీలించాలి. వ్యాధుల వారీగా ఎవైనా మినహాయింపులు, ఉప పరిమితులు, కోపేమెంట్ ఉన్నాయేమో పరిశీలించాలి’’ అని తపన్ సింఘాల్ సూచించారు. డిడక్టబుల్.. పాలసీదారులు ప్రీమియం తగ్గించుకునేందుకు ఉన్న మార్గాల్లో మరొకటి డిడక్టబుల్ క్లాజ్. ఇది కూడా కోపేమెంట్ మాదిరే పనిచేస్తుంది. ఉదాహరణకు రూ.50,000 డిడక్టబుల్ అనే క్లాజ్ ఉందనుకుంటే.. రూ.50,000 మించిన క్లెయిమ్‌లకే బీమా సంస్థలు చెల్లింపులు చేస్తాయి. కోపేమెంట్ అలా కాదు. 10 శాతం కోపే ఉంటే రూ.50,000 క్లెయిమ్‌లో పాలసీహోల్డర్ రూ.5,000 చెల్లించాల్సి వస్తుంది. బీమా సంస్థ రూ.45,000 చెల్లిస్తుంది. కోపేమెంట్ అనేది ప్రతి క్లెయిమ్‌కు వర్తిస్తుంది. అదే డిడక్టబుల్ అనేది ఏడాది మొత్తానికి (కొన్ని బీమా సంస్థల్లో) స్థిరంగా ఉంటుంది. డిడక్టబుల్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే, ప్రీమియం అంత మేర తగ్గుతుంది. క్లెయిమ్‌లలో ఆ మేర భారం పాలసీదారులపై పడుతుంది. మరొక ఉదాహరణలో.. ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకుంటే రూ.2,00,000 బిల్లు వచి్చంది. డిడక్టబుల్ రూ.20,000 ఉంటే, అప్పుడు పాలసీదారు ఈ మొత్తాన్ని చెల్లించాలి. ఆ తర్వాత మిగిలిన రూ.1,80,000 కోసం బీమా సంస్థ వద్ద క్లెయిమ్ చేసుకోవచ్చు. డిడక్టబుల్లో ఇప్పటి వరకు చెప్పుకున్నది స్వచ్చందమైనది. రూమ్ రెంట్ ఆస్పత్రిలో చేరిప్పుడు పొందే రూమ్ వసతి కూడా ప్రీమియంను నిర్ణయిస్తుంది. ఎలాంటి పరిమితులు లేని ప్లాన్‌తో పోలిస్తే సింగిల్ రూమ్, షేరింగ్ రూమ్ ఆప్షన్‌తో కూడిన పాలసీల ప్రీమియం తక్కువగా ఉంటుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో అన్ని రకాల వసతులు ఉంటాయి. అన్నింటిలోకి షేరింగ్ తక్కువగా ఉంటుంది. కనుక షేరింగ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవడం ద్వారా ప్రీమియం తగ్గేలా చూసుకోవచ్చు. ఒకవేళ షేరింగ్ ఎంపిక చేసుకుంటే.. ఆస్పత్రిలో చేరినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ షేరింగ్ వసతికే పరిమితం కావడం మంచిది. ఖరీదైన వసతి తీసుకుంటే ఆస్పత్రి బిల్లులో కొంత పాలసీదారు చెల్లించాల్సి వస్తుంది. ఇది కేవలం రూమ్ రెంట్ వరకే పరిమితం కాదు. ఎందుకంటే ఖరీదైన వసతిలో ఉండి పొందే వైద్యం సాధారణ షేరింగ్ రూమ్‌లో పొందే వైద్యంతో పోలిస్తే అధిక వ్యయాలతో ఉంటుంది. కనుక పాలసీ క్లాజ్‌లో ఉన్న వసతికి మించి ఖరీదైన వసతిలో ఉంటే బిల్లులో కొంత మొత్తాన్ని పాలసీదారు చెల్లించాలి. ఫిట్‌గా ఉంటే ప్రయోజనం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం ద్వారా ప్రీమియంలో తగ్గింపు పొందే అవకాశం ఉంది. రోజువారీ వ్యాయామం చేసే పాలసీహోల్డర్లకు బీమా సంస్థలు రివార్డు పాయింట్లు కేటాయిస్తున్నాయి. ఒక ఏడాది మొత్తం మీద ఇలా పొందిన రివార్డు పాయింట్లను, మరుసటి ఏడాది రెన్యువల్ ప్రీమియంలో తగ్గింపునకు వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు రోజువారీ 10,000 అడుగులు నడవడం. లేదంటే రోజులో కనీసం 4,000 అడుగులు నడవడం వంటివి. లేదా జాగింగ్ చేయడం ద్వారా హెల్త్ రివార్డులు సంపాదించుకోవచ్చు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ రివార్డులతో ప్రీమియంలో నూరు శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. పోర్టింగ్ మొబైల్ నంబర్ పోర్టబులిటీ మాదిరే, హెల్త్ ఇన్సూరెన్స్‌ను కూడా ఒక బీమా సంస్థ నుంచి మరో బీమా సంస్థకు పోర్టింగ్ పెట్టుకోవచ్చు. బీమా సంస్థ సేవలు నచ్చకపోయినా, ప్రీమియం భారం అనిపించినా.. కారణం ఏదైనా పోర్టింగ్ సదుపాయం ఉంది. పోర్టింగ్ వల్ల పూర్వపు బీమా సంస్థలో పొందిన ప్రయోజనాలు క్యారీ ఫార్వార్డ్ (బదిలీ) అవుతాయి. పోర్టింగ్ వల్ల నో క్లెయిమ్ బోనస్ ఒక్కటి నష్టపోవాల్సి రావచ్చు. పాత సంస్థలో ముందు నుంచి ఉన్న వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ పూర్తి చేసి ఉంటే, కొత్త సంస్థలో మొదటి రోజు నుంచే కవరేజీ పొందొచ్చు. పాలసీ రెన్యువల్ గడువుకు 60 రోజుల నుంచి 45 రోజుల్లోపు కొత్త సంస్థ వద్ద పోర్టింగ్ అభ్యర్థన దాఖలు చేసుకోవాలి. ప్రస్తుత పాలసీలోని కవరేజీ ఫీచర్లతో పోలిస్తే, మెరుగైన సదుపాయాలతో తక్కువ ప్రీమియంతో ఆఫర్ చేస్తున్న సంస్థకు మారిపోవడం వల్ల కొంత ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంది. సూపర్ టాపప్ వృద్ధాప్యంలో నామమాత్రపు కవరేజీ చాలకపోవచ్చు. మెరుగైన కవరేజీతోనే తగినంత రక్షణ లభిస్తుంది. కానీ, మెరుగైన కవరేజీ కోసం ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెగ్యులర్ ఇండెమ్నిటీ ప్లాన్‌ను పరిమిత కవరేజీతో తీసుకోవాలి. దీనివల్ల ప్రీమియం తగ్గించుకోవచ్చు. దీనికి అదనపు కవరేజీతో సూపర్ టాపప్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకే పాలసీని అధిక కవరేజీతో తీసుకోవడంతో పోలిస్తే ప్రీమియం చాలా వరకు తగ్గుతుంది. ఉదాహరణకు రూ.5 లక్షలకు బేసిక్ ప్లాన్ తీసుకుని, దీనికి రూ.20 లక్షల సూపర్ టాపప్ చేసుకున్నారని అనుకుందాం. క్లెయిమ్ రూ.5 లక్షలు దాటినప్పుడు, అదనపు మొత్తానికి సూపర్ టాపప్ ఇచి్చన బీమా సంస్థ నుంచి చెల్లింపులు వస్తాయి. రెగ్యులర్ ప్లాన్‌తో పోలిస్తే ఇలా చేయడం వల్ల ప్రీమియంను 30 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ఇక్కడ టాపప్ ప్లాన్లు కూడా ఉన్నాయి. కానీ టాపప్, సూపర్ టాపప్ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. టాపప్ ప్లాన్‌లో ఒక పాలసీ సంవత్సరంలో ప్రతి క్లెయిమ్‌కు విడిగా నిర్ణీత మొత్తం దాటినప్పుడే చెల్లింపులు లభిస్తాయి. సూపర్ టాపప్ ప్లాన్‌లో అలా కాదు. ఏడాది మొత్తం మీద నిర్ధేశిత డిడక్టబుల్ ఒక్కటిగానే ఉంటుంది. అంటే బేస్ ప్లాన్ రూ.5 లక్షలు తీసుకున్నారు. దీనికి టాపప్ జోడించుకుంటే, ప్రతి క్లెయిమ్‌లోనూ రూ.5 లక్షలు మించినప్పుడే, రూ.5 లక్షలు మినహాయించి (డిడక్టబుల్) మిగిలినది టాపప్ నుంచి చెల్లింపులు వస్తాయి. అదే సూపర్ టాపప్‌లో.. ఒక ఏడాదిలో మూడు పర్యాయాలు ఆస్పత్రిలో చేరి (రూ.3లక్షలు, రూ.3 లక్షలు, రూ.4 లక్షలు) రూ.10 లక్షలు బిల్లు వచి్చ నా, రూ.5 లక్షలు డిడక్టబుల్ పోను, మిగిలిన రూ.5 లక్షలను క్లెయిమ్ చేసుకోవచ్చు. బేస్ ప్లాన్ పరిమిత కవరేజీతో తీసుకుని, సూపర్ టాపప్ జోడించుకోలేని వారు.. చిన్న వాటికి క్లెయిమ్ చేసుకోకుండా ఉంటే మంచిది. దీనివల్ల నో క్లెయిమ్ బోనస్ రూపంలో బీమా కవరేజీని ఎలాంటి అదనపు ప్రీమియం లేకుండా నూరు శాతం వరకు పెంచుకోవచ్చు. వీటిని అనుసరించొచ్చు.. హెల్త్ ఇన్సూరెన్స్‌ను చిన్న వయసులోనే తీసుకోవాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆ వయసులో ఉండవు. దీంతో ప్రీమియం తక్కువగా ఉంటుంది. నేరుగా 60 ఏళ్ల తర్వాత పాలసీ తీసుకునే వారితో పోలిస్తే, ముందు నుంచే హెల్త్ కవరేజీలో ఉన్న వారికి ప్రీమియం కొంత తక్కువ ఉంటుంది. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ మందిలో కనిపిస్తుంటాయి. వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని అధిక ప్రీమియాన్ని కంపెనీలు చార్జ్ చేస్తుంటాయి. ► హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఆన్లైన్ ద్వారా నేరుగా బీమా సంస్థ పోర్టల్ నుంచి కొనుగోలు చేస్తే ప్రీమియం 5–10% తక్కువగా ఉంటుంది. కమీషన్లు, ఇతర వ్యయాల భారం తగ్గుతుంది కనుక బీమా సంస్థలు డిస్కౌంట్ ఇస్తాయి. పైగా ఆన్లైన్లో అన్ని బీమా సంస్థల ప్లాన్ల ఫీచర్లు, ప్రీమియంను పోల్చి చూసుకునే వెసులుబాటు పాలసీబజార్ వంటి వేదికలు కలి్పస్తున్నాయి. ఈ విధంగానూ ప్రీమియం భారం తగ్గవచ్చు. ► విడిగా ప్లాన్ తీసుకోవడానికి బదులు కుటుంబం అంతటికీ ఒక్కటే ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే ప్రీమియం తగ్గుతుంది. ► అవసరం లేని కవరేజీలకు దూరంగా ఉండాలి. అవసరం లేని యాడాన్‌లను జోడించుకుంటే ప్రీమియం భారం పెరుగుతుంది. ► రూ.5 లక్షల బేసిక్ కవరేజీతో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.20–50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకుంటే ప్రీమియం ఆదా అవుతుంది. ► తమ పిల్లలు కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తుంటే, వారి కార్యాలయం తరఫున తల్లిదండ్రులు కవరేజీ కల్పించుకోవడం ఒక మార్గం. గ్రూప్ ప్లాన్ కావడంతో ప్రీమియం తగ్గుతుంది. ► ఇక ప్రీమియంలో ఆదా కోరుకునే వారు ఒక ఏడాదికి కాకుండా మూడేళ్లకు ఒకేసారి ప్రీమియం చెల్లించడాన్ని పరిశీలించొచ్చు. దీనివల్ల ప్రీమియంలో 10 శాతం వరకు ఆదా అవుతుంది. -
ప్రస్తుత మార్కెట్లో ఆ పాలసీలదే హవా!!
హైదరాబాద్, బిజనెస్ బ్యూరో: కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో జీవిత బీమా, ఆరోగ్య సంరక్షణ పాలసీలకు సంబంధించి తగినంత కవరేజీ ఉండాల్సిన అవసరంపై అవగాహన పెరిగిందని ప్రైవేట్ రంగ బీమా సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ వెంకటాచలం అయ్యర్ తెలిపారు. అలాగే జీవిత బీమా పథకాల్లో హెల్త్ రైడర్లు కూడా కీలకమని పాలసీదారులు గుర్తిస్తున్నారని తెలిపారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా జీవిత బీమా, ఆరోగ్య బీమా కవరేజీతో పాటు పెట్టుబడులపై రాబడులు కూడా అందించే పాలసీలకు ఆదరణ మరింత పెరుగుతుందని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఆయన వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. టర్మ్ పాలసీలకు, దీర్ఘకాలికంగా గ్యారంటీ ఆదాయాన్నిచ్చే పాలసీలకు డిమాండ్ మెరుగుపడింది. రాబోయే రోజుల్లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చు. వీటితో పాటు పెన్షన్, యాన్యుయిటీ పథకాలపైనా ఆసక్తి కనిపిస్తోంది. ఇక జీవిత బీమా పథకాల్లో హెల్త్ రైడర్లు చాలా కీలకంగా ఉంటున్నాయి. అనుకోని విధంగా ఆస్పత్రి పాలైనా, తీవ్ర అనారోగ్యాల బారిన పడినా ఇవి ఆదుకుంటాయి. నామమాత్రమైన అదనపు ప్రీమియంతో ఇవి గణనీయంగా ప్రయోజనం చేకూర్చగలవు. వ్యాధి బైటపడిన పక్షంలో దానికి సంబంధించి తీసుకున్న రైడర్‌కు అనుగుణంగా సమ్ అష్యూర్డ్ మొత్తం పాలసీదారుకు అందుతుంది. మిగతా హెల్త్ కవర్ ఆప్షన్లలాగా కాకుండా.. సమ్ అష్యూర్డ్‌ను క్లెయిమ్ చేయడానికి చికిత్స బిల్లులు మొదలైనవి సమర్పించాల్సిన బాదరబందీ ఉండదు. హెల్త్ రైడర్లతో పలు రిస్క్ కవరేజీలను పాలసీదారులు ఎంచుకోవచ్చు. అందుకే జీవిత బీమా, సేవింగ్స్ పథకాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా హెల్త్, ఇతర ప్రయోజనాలు అందించే రైడర్లు కూడా పరిశీలించాలని పాలసీదారులకు మేము సూచిస్తున్నాం. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు..కొత్త పాలసీలు జీవిత బీమా ప్రీమియంల పెరుగుదల విషయానికొస్తే.. ఇది రీఇన్సూరెన్స్ వ్యయాలు మొదలైన పలు అంశాలపై ఆధారపడి ఉంటాయి. మాతో సహా పరిశ్రమలోని మిగతా సంస్థలు కూడా వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే ప్రీమియంలను నిర్ణయిస్తాయి. మేము సాధ్యమైనంతవరకూ విలువకు తగ్గ స్థాయిలో సమగ్రంగా ప్రయోజనాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కొత్త పాలసీల విషయానికొస్తే ఇటీవలే టాటా ఏఐఏ లైఫ్ ఫార్చూన్ గ్యారంటీ పెన్షన్ పేరిట సరళతరమైన యాన్యుటీ ప్లాన్ ప్రవేశపెట్టాం. పాలసీదారులు తమ అవసరాలకు అనుగుణమైన యాన్యుటీని పొందే విధంగా దీన్ని ఎంచుకోవచ్చు. అలాగే లైఫ్ ఇన్స్ట్రాపొటెక్ట్ అనే మరో కొత్త పాలసీలో లైఫ్ కవరేజీతో పాటు ఆస్పత్రి వ్యయాలు, క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ మొదలైన వాటికి సంబంధించిన ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుత వ్యాపార పరిమాణం.. లక్ష్యాలు.. 2021 మార్చి 31 నాటికి నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 47 శాతం పెరిగింది. రూ. 31,450 కోట్ల నుంచి రూ. 46,281 కోట్లకు చేరింది. మార్నింగ్ స్టార్ అనే రీసెర్చ్ సంస్థ అంచనాల ప్రకారం మా ఏయూఎంలో 99.93 శాతం మొత్తానికి 4 స్టార్ లేదా 5 స్టార్ రేటింగ్ ఉంది. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం. -
ఎస్బీఐ ఆఫర్, రూ.342తో రూ.4 లక్షల బెన్ఫిట్
దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంలపై కీలక ప్రకటన చేసింది. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు పథకాల్లోని ఇన్స్యూరెన్స్ పాలసీలపై రూ. 342 ప్రీమియం చెల్లిస్తే రూ.4 లక్షలు బెనిఫిట్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఎస్బీఐ చెప్పింది. కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో ఇన్స్యూరెన్స్ పాలసీలకు డిమాండ్ పెరిగింది. మహమ్మారి నుంచి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు పాలసీ దారులు పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించి ఆయా ఇన్స్యూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన (పీఎంఎస్బీవై), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన( పీఎంజేజేబీవై) స్కీమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. Get the insurance that suits your need and live life worry-free.#PMSBY #PMJJBY #SBI #Insurance pic.twitter.com/n7DC4eTlOV — State Bank of India (@TheOfficialSBI) October 2, 2021 అయితే తాజాగా ఎస్బీఐ ఈ స్కీములకు సంబంధించిన ప్రీమియం అంశంపై ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సున్న పాలసీదారులు ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన పథకం కింద సంవత్సరానికి రూ.12 ప్రమియం చెల్లిస్తే యాక్సిడెంట్లో మరణించినా, పూర్తిగా వికలాంగులైనా రూ. 2 లక్షల పరిహారం అందిస్తున్నట్లు ట్వీట్ చేసింది. పాక్షికంగా లేదా శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే అతను/ఆమె రూ.1 లక్ష వరకు ప్రయోజనం పొందవచ్చని తెలిపింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన పథకంలో 18 నుంచి 50ఏళ్ల లోపు వయస్సున్న సభ్యులు పాలసీ కొనుగోలు చేస్తే రూ.2 లక్షల వరకు పరిహారాన్ని అందిస్తున్నట్లు ఎస్బీఐ ట్వీట్లో పేర్కొంది. ఇక ఈ ప్రీమియం ధర సంవత్సరానికి రూ.330గా ఉందని చెప్పింది. -
హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఇలా చేస్తే మరింత బెటర్!
కరోనా క్లెయిమ్‌ల రూపంలో రానున్న రెండు మూడు నెలల్లో బీమా సంస్థలు పెద్ద మొత్తాలే చెల్లించుకోవాల్సి రావచ్చని అంచనా. ఈ భారాన్ని దింపుకునేందుకుగాను ఆరోగ్య బీమా ప్రీమియంను ఇప్పటికే పలు కంపెనీలు పెంచగా.. మిగిలినవీ అతి త్వరలోనే వడ్డించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సామాన్యులకు బీమా ప్రీమియం భారంగా మారింది. రానున్న రోజుల్లో వడ్డనలతో ఆ భారం మరికాస్త పెరగనుంది. ఇందుకు పాలసీదారులు సిద్ధం కావాల్సిందే. సాధారణంగా ప్రతీ నాలుగేళ్లకు ఒక పర్యాయం తమ ఖర్చులు, వైద్య ద్రవ్యోల్బణం (చికిత్సల వ్యయాలు పెరగడం), ఇతర అంశాల ఆధారంగా ఆరోగ్య బీమా ప్లాన్ల ప్రీమియంలను సవరించేందుకు బీమా కంపెనీలకు అనుమతి ఉంది. సవరణ తర్వాత ప్రస్తుత పాలసీదారులపై ఆ మేరకు పెంపును అమలు చేయడంతోపాటు, కొత్త పాలసీలను ప్రవేశపెడుతుంటాయి. పాలసీదారుల వయసు, ఆరోగ్య సమస్యలు, క్లెయిమ్‌ల చరిత్ర ఈ అంశాలన్నీ నాలుగేళ్లకోసారి ప్రీమియం సవరణలో కీలక పాత్ర పోషించే ఇతర అంశాలు. మొత్తానికి ప్రీమియం భారంగా మారితే.. పాలసీదారుల ముందు పలు మార్గాలున్నాయి. ప్రీమియం తగ్గించుకునేందుకు వీటిల్లో ఒక్కొక్కరికి ఒక్కోటి ఉపయోగకరంగా ఉండొచ్చు.. టాపప్ చేసుకోవడం.. ఆరోగ్య బీమా ప్రీమియంను తగ్గించుకునే మార్గాల్లో.. బేసిక్ పాలసీకి బూస్టర్ ప్లాన్‌ను జోడించుకోవడం ఒకటి. టాపప్, సూపర్ టాపప్ పేరుతో ఉండే ప్లాన్‌ను బేసిక్ ప్లాన్‌కు తోడుగా తీసుకోవచ్చు. ‘‘మీకు బేసిక్ ప్లాన్ ఉండి.. కవరేజీని మరింత పెంచుకునేందుకు మరో బేసిక్ ప్లాన్‌ను తీసుకుంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు బేసిక్, బూస్టర్ ప్లాన్‌ను కలిపి తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ప్రసూన్ సిక్దర్ సూచించారు. ఈ విధానంలో ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.5 లక్షల కవరేజీతో ఇండెమ్నిటీ పాలసీ తీసుకున్నారని అనుకుందాం. అలాగే, మరో రూ.5 లక్షలకు టాపప్ ప్లాన్‌ను దీనికి అదనంగా తీసుకున్నారని అనుకుంటే.. ఆస్పత్రిలో చేరి చికిత్సా వ్యయం రూ.5 లక్షలు దాటిపోయిన సందర్భంలో టాపప్ ప్లాన్ అక్కరకు వస్తుంది. క్లెయిమ్ రూ.5 లక్షల వరకు బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ నుంచే చేసుకోవాలి. రూ.5 లక్షలు మించిపోయిన సందర్భాల్లోనే టాపప్ ఫోర్స్‌లోకి వస్తుంది. కానీ, బేసిక్ పాలసీకి, టాపప్ ప్లాన్‌కు మధ్య ప్రీమియం వ్యత్యాసం ఎంతో ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తికి రూ.5 లక్షల హెల్త్ కవరేజీకి కోసం ప్రీమియం రూ.6,621గా ఉంటే.. మరో రూ.5లక్షలకు మరో కంపెనీ నుంచి బేసిక్ ప్లాన్ తీసుకోవాలంటే ప్రీమియం రూపంలో మొత్తం మీద రూ.10 లక్షల కవరేజీకి రూ.13,242 చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు టాపప్‌ను ఎంపిక చేసుకున్నట్టయితే రెండింటికీ కలిపి చెల్లించాల్సిన ప్రీమియం రూ.9,156 అవుతుంది. ఇందులో సూపర్ టాపప్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. బేసిక్ ప్లాన్, టాపప్ ప్లాన్ కుడా చాలని వారు సూపర్ టాపప్‌తో కవరేజీని మరింత పెంచుకోవచ్చు. ‘‘ఈ తరహా హెల్త్ కవరేజీ ప్లాన్ల కలయికతో ఉంటే.. అవయవ మార్పిడి లేదా శస్త్రచికిత్సల వంటి సందర్భాల్లో మంచిగా ఉపయోగపడుతుంది’’ అని ఐసీఐసీఐ లాంబార్డ్ అండర్‌రైటింగ్ క్లెయిమ్స్ చీఫ్ సంజయ్‌దత్తా పేర్కొన్నారు. బేసిక్ ప్లాన్ రూ.5–10 లక్షలు కలిగిన వారు.. అదనంగా రూ.10 లక్షల నుంచి టాపప్ ప్లాన్‌ను ఎంచుకోవడం నేటి పరిస్థితుల్లో కొంచెం అర్థవంతంగా ఉంటుందని నిపుణుల సూచన. ఇక్కడ టాపప్‌కు, సూపర్ టాపప్‌కు మధ్య వ్యత్యాసం ఉంది. టాపప్‌లో రూ.5–10 లక్షలు డిడక్టబుల్ (మినహాయింపు) ఉందనుకుంటే.. బిల్లు రూ.5–10 లక్షలు దాటిన సందర్భాల్లోనే టాపప్ అక్కరకు వస్తుంది. సూపర్ టాపప్ అలా కాదు. ఒక ఏడాదిలో ఒక వ్యక్తి మూడు సార్లు ఆస్పత్రిలో చేరాల్చి వచ్చి మొత్తం రూ.13లక్షలు బిల్లు అయ్యిందనుకుందాం. అప్పుడు రూ.13 లక్షల నుంచి డిడక్టబుల్ రూ.5–10 లక్షలు అమలవుతుంది. మిగిలిన మొత్తాన్ని సూపర్ టాపప్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుకే టాపప్‌తో పోలిస్తే సూపర్ టాపప్ ప్రీమియం కాస్త ఎక్కువ. కో–పే, డిడక్టబుల్ కో–పే, డిడక్టబుల్(నిర్ణీత శాతం మేర మినహాయించి) ఆప్షన్లు హెల్త్ ప్లాన్లలో సాధారణంగా అందుబాటులో ఉంటుంటాయి. కో–పే అంటే సహ చెల్లింపు అని. ప్రతీ క్లెయిమ్‌లోనూ పాలసీదారు నిర్ణీత శాతాన్ని కో–పే కింద భరించాల్సి వస్తుంది. అప్పుడు మిగిలిన శాతం మేర బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఈ కో–పే 10–30 శాతం మధ్య ఉంటుంది. కో–పే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల ప్రీమియం తగ్గుతుంది. ఉదాహరణకు రూ.30 ఏళ్ల వ్యక్తికి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ రూ.5 లక్షలకు ప్రీమియం రూ.7,283. 20 శాతం కో–పే ఎంపిక చేసుకుంటే ఇదే వ్యక్తికి ప్రీమియం రూ.6,548 అవుతుంది. ప్రీమియం రూ.735 తగ్గింది. ‘‘కో–పే అన్నది క్లెయిమ్‌లో నిర్ణీత శాతం మేర ఉంటుంది. పాలసీదారు తన జేబు నుంచి నిర్ణీత శాతం మేర చెల్లించిన తర్వాతే బీమా సంస్థ మిగిలిన మేర చెల్లిస్తుంది’’ అని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం చీఫ్ అమిత్ ఛబ్ర తెలిపారు. ఉదాహరణకు రూ.5 లక్షల ప్లాన్‌లో 20 శాతం కోపే కింద ఎంపిక చేసుకున్నారనుకుంటే.. ఆస్పత్రిలో బిల్లు రూ.2లక్షలు అయ్యిందనుకోండి.. అప్పుడు పాలసీదారు 20 శాతం కింద రూ.40,000ను స్వయంగా భరించాలి. మిగిలిన రూ.1.60 లక్షలను నిబంధనలకులోబడి బీమా సంస్థ చెల్లిస్తుంది. ప్రీమియం చెల్లించలేని పరిస్థితుల్లోనే కో–పే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వెల్నెస్ రాయితీలు పాలసీదారులకు ఆరోగ్యకరమైన జీవనంపై బీమా సంస్థలు పలు ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. రివార్డులు, ప్రీమియంలో రాయితీలను పాలసీదారులు పొందొచ్చు. ఇలా కూడా ప్రీమియం భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివ్ హెల్త్ ప్లాన్ అయితే 100 శాతం ప్రీమియాన్ని రివార్డులతో సర్దుబాటును ఆఫర్ చేస్తోంది. పాలసీదారులు రోజూ ఎన్ని అడుగులు నడిస్తే అంత మేరకు రివార్డులను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ‘యాక్టివ్డేజ్’ కార్యక్రమం కింద ఆదిత్య బిర్లా హెల్త్ యాక్టివ్ ప్లాన్‌లో రోజూ 10,000 అడుగులు నడిచినా లేదా 30 నిమిషాలు జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేసి 300 కేలరీలను కరిగించుకుంటే గణనీయమైన హెల్త్ రివార్డులను పోగు చేసుకోవచ్చు. ఈ రివార్డులను ప్రీమియం చెల్లింపుల కోసం వినియోగించుకోవచ్చు. ప్రీమియం భారం చాలా వరకు తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోకీ ఇదే అత్యుత్తమైనది. మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్ రీఅష్యూర్ ప్లాన్ కూడా ఇదే తరహా రివార్డులను ఆఫర్ చేస్తోంది. రోజూ ఎన్ని అడుగుల మేర నడిచారన్న దాని ఆధారంగా రివార్డులు సమకూర్చుకుని.. ప్రీమియంలో గరిష్టంగా 30 శాతం తగ్గింపులను ఈ పాలసీలో పొందడానికి అవకాశం ఉంది. ఇందుకోసం బీమా సంస్థకు చెందిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అదే విధంగా ఫార్మసీ కొనుగోళ్లపై తగ్గింపులు, ఉచిత వైద్యుల సంప్రదింపులు, హెల్త్ చెకప్‌లను కూడా ఈ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ‘‘చాలా వరకు బీమా సంస్థలు ఇప్పుడు జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు సమస్యల ఆధారంగా అండర్‌రైటింగ్ పాలసీని పాటిస్తున్నాయి. దీంతో ఆరోగ్యంగా ఉండే పాలసీదారు అధిక ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు’’ అని టాటాఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ వైస్ ప్రెసిడెంట్ పరాగ్వేద్ తెలిపారు. కుటుంబ పాలసీ ఎవరికివారు విడిగా కవరేజీ తీసుకోకుండా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను తీసుకోవడం వల్ల ప్రీమియం భారాన్ని కొంత తగ్గించుకోవచ్చు. ఒకే ప్లాన్‌లో రెండు, అంతకుమించి సభ్యులు ఉంటే బీమా సంస్థలు ప్రీమియంలో 15 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. ‘‘ఎక్కువ మంది కుటుంబ సభ్యులను చేర్చడం వల్ల బీమా సంస్థలకు నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి. దీంతో తగ్గిన మేర పాలసీదారులకు ప్రయోజనాలను బదిలీ చేయడం జరుగుతుంది’’ అని టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్‌కు చెందిన వేద్ తెలిపారు. ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలకు కలిపి ఒకే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను తీసుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. కానీ, అదే ప్లాన్‌లో వృద్ధులైన తల్లిదండ్రులను సభ్యులుగా చేర్చవద్దు. దీనివల్ల ప్రీమియం తగ్గకపోగా భారీగా పెరిగిపోతుంది. ఎందుకంటే ప్రీమియం అన్నది ప్లాన్‌లో ఎక్కువ వయసున్న వ్యక్తి ఆధారంగా నిర్ణయమవుతుంది. వృద్ధులైన తల్లిదండ్రుల కోసం ఇండివిడ్యువల్ ప్లాన్లను తీసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. కుటుంబ సభ్యులు అందరూ ఒకే విడత ఆస్పత్రిలో చేరడం అన్నది చాలా అరుదు. కనుక ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అన్నది చాలా మందికి సరిపోతుంది. పైగా చాలా బీమా కంపెనీలు నేడు రీస్టోరేషన్ సదుపాయాన్ని ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఏడాదిలో కనీసం ఒక పర్యాయం బీమా కవరేజీ పూర్తిగా అయిపోతే తిరిగి అంతే కవరేజీని పునరుద్ధరిస్తున్నాయి. కొన్ని బీమా సంస్థలు అయితే పాక్షికంగా కవరేజీని వినియోగించుకున్నా కానీ పూర్తిస్థాయి కవరేజీని రీస్టోర్ చేస్తుండడాన్ని గమనించాలి. గ్రూపు ప్లాన్‌లో తక్కువ గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను కూడా బీమా కంపెనీలు ఆఫర్ చేస్తుంటాయి. సాధారణంగా కార్పొరేట్ టైఅప్‌లో భాగంగా వీటిని ఇస్తుంటాయి. ఇలాంటివి ఎంపిక చేసుకోవడం వల్ల స్టాండలోన్ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ కంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ ప్లాన్లలో ఎక్కువ మంది సభ్యులుగా ఉంటారు. కనుక మొత్తం సభ్యులపై ప్రీమియం భారం సమానంగా ఉంటుంది. రెండు మూడేళ్లకు ఒకేసారి.. ఒకే విడత రెండు, మూడేళ్లకు కలిపి ప్రీమియం చెల్లించడం ద్వారా కొంత ఆదా చేసుకోవచ్చు. ఇలా ఒకే పర్యాయం రెండు మూడేళ్ల చెల్లింపులపై 7.5–15 శాతం మధ్య బీమా సంస్థలు తగ్గింపునిస్తున్నాయి. కాకపోతే బీమా సంస్థ సేవలు, తీసుకున్న పాలసీలోని సదుపాయాల పట్ల మీకు సంతృప్తి అనిపిస్తేనే ఇలా మల్టీ ఇయర్ ఆప్షన్ తీసుకోవడం సరైనది అవుతుంది. ‘‘ఒకే సారి అధిక ప్రీమియం చెల్లింపులపై బీమా సంస్థ వడ్డీ ఆదాయం సమకూర్చుకుంటుంది. దీన్నే పాలసీదారులకు తగ్గింపు రూపంలో ఆఫర్ చేస్తుంది’’ అని ఛాబ్రా తెలిపారు. ‘‘గతంలో ఇలా ఒకే సారి ఎక్కువ సంవత్సరాలకు ప్రీమియం చెల్లింపులపై ఒకటికి మించిన సంవత్సరాల్లో పన్ను ఆదాకు అవకాశం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు ప్రీమియం చెల్లింపులను ఆయా సంవత్సరాల మధ్య వేరు చేసి క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంది’’అని మిశ్రా పేర్కొన్నారు. పైగా పాలసీ ప్రీమియం భారాన్ని ఈ విధానంలో కొంత కాలం పాటు వాయిదా వేసుకునేందుకు అవకాశం ఉంటుందని సిక్దర్ వివరించారు. ‘‘ఒక వ్యక్తి మూడేళ్లకు ఒకేసారి ప్రీమియం చెల్లించారనుకోండి. నాలుగు సంవత్సరాల తర్వాత ప్రీమియం పెంపు ఉంటుంది. దీంతో ఈ పెంపునకు ముందే తిరిగి మూడేళ్లకు ఒకే సారి ప్రీమియం చెల్లించడం వల్ల రెండేళ్ల పాటు ప్రీమియం భారం పడకుండా చూసుకోవచ్చు’’ అని సిక్దర్ తెలిపారు. నోక్లెయిమ్ బోనస్‌ల వినియోగం కంపెనీలు ఒక ఏడాది లో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే నో క్లెయిమ్ బోనస్‌ను ఆఫర్ చేస్తుంటాయి. క్యుములేటివ్ బోనస్ ఆప్షన్లో బీమా కవరేజీ పెరుగుతుంది. మరో విధానంలో బోనస్ కింద బీమా కవరేజీని పెంచకుండా ప్రీమియంలో తగ్గింపులను ఆఫర్ చేస్తున్నవీ ఉన్నాయి. తగ్గింపు అయితే 20–50 శాతం మధ్య ఉంటుంది. ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ.. పాలసీదారు మొదటి కొన్నేళ్లలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయకపోతే ఆ తర్వాత రెన్యువల్ ప్రీమియంలో 80% వరకు తగ్గింపు ఇస్తోంది. హెల్త్ సూపర్‌సేవర్ 1ఎక్స్, 2ఎక్స్ ప్లాన్ల రూపంలో ఇది అందుబాటులో ఉంది. క్యుములేటివ్ బోనస్ కింద బీమా సంస్థలు 10% నుంచి 100% వరకు బీమా కవ రేజీ (సమ్ ఇన్సూరెన్స్)ని పెంచుతున్నాయి. చౌక పాలసీకి మారడమే చివరిగా ఉన్న మార్గం.. చౌక ప్రీమియంతో కూడిన పాలసీకి మారిపోవడం. మీరు పాలసీ ఎంపిక చేసుకున్న సమయంలో ప్రీమియం సరసంగానే అనిపించి ఉండొచ్చు. కానీ, కొన్నేళ్ల తర్వాత కంపెనీ ఆఫర్ చేస్తున్న సేవలతో పోలిస్తే ప్రీమియం ఎక్కువగా ఉందనిపిస్తే.. తొలుత తక్కువకు ఆఫర్ చేసి, తర్వాత ప్రీమియం పెంచడం వల్ల భారంగా అనిపించినప్పుడు మార్కెట్లో మెరుగైన ఇతర ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం భారం తగ్గించుకునేందుకు ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీపడొద్దు. ఇప్పటికే ఉన్న పాలసీలో ఉన్న ప్రయోజనాలన్నీ కూడా కొత్తగా ఎంపిక చేసుకున్న ప్లాన్‌లోనూ ఉండాలి. ఇంకా అదనపు ప్రయోజనాలతో కూడిన పాలసీ తక్కువ ప్రీమియంతో వస్తుంటే పోర్ట్ పెట్టేసుకుని ఆ కంపెనీకి మారిపోవచ్చు. రూమ్‌రెంట్ లిమిట్ అన్నది ప్రస్తుత పాలసీలో ఉందనుకోండి. పాలసీ తీసుకుని ఇప్పటికే 5–10 ఏళ్లు అయి ఉంటే.. ఈ నిబంధన ఇక మీదట ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. రూమ్మెంట్ క్యాప్‌ను సమ్ ఇన్సూరెన్స్‌లో 1 శాతంగా కంపెనీలు అమలు చేస్తున్నాయి. దీంతో రూ.5లక్షల పాలసీ కలిగిన వారు ఆస్పత్రిలో చేరితే రూ.5,000కు మించిన రూమ్‌లో చేరినట్టయితే పెరిగిన మేర పాలసీదారే తన జేబు నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆస్పత్రుల్లో చార్జీలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ తరహా నిబంధనలు కలిగిన పాలసీల నుంచి మెరుగైన పాలసీలోకి మారిపోవడం కూడా ప్రయోజనకరమేనని మర్చిపోవద్దు. గత కొన్నేళ్లలో చాలా కంపెనీలు ప్రీమియంలను భారీగా పెంచేశాయి. కానీ, సేవలు, ప్రయోజనాల విషయంలో అంత మెరుగుదల లేదు. కనుక ఈ పాలసీల నుంచి మారిపోవడాన్ని కూడా పరిశీలించొచ్చు. -
సాధారణ బీమా పరిశ్రమ ప్రీమియంలో 16 శాతం వృద్ధి
ముంబై: ముగిసిన ఏప్రిల్ నెలలో సాధారణ బీమా పరిశ్రమ ప్రీమియం వసూళ్లలో 16 శాతం వృద్ధి సాధించింది. ఇది గతేడాది ఇదేనెలలో పోలిస్తే రూ. 10,500 కోట్ల నుంచి రూ. 12,206 కోట్లకు పెరిగినట్లు ఐఆర్డీఏ డేటా వెల్లడిస్తోంది. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రీమియం వసూళ్లు 30 శాతం వృద్ధిచెందాయి. అయితే ఏప్రిల్ నెల గణాంకాల్లో పంట బీమా విభాగం లేనందున వృద్ధి తక్కువగా కన్పిస్తోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం నుంచి రూ. 18,000 కోట్ల ప్రీమియం వసూళ్లు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ మొదలయ్యాక, పంట బీమా ప్రీమియం వసూళ్లు జరుగుతాయి. ఇక ఏప్రిల్ నెల ప్రీమియం వసూళ్లకు సంబంధించి ప్రైవేటు రంగ సాధారణ బీమా కంపెనీల వృద్ధి ప్రభుత్వ కంపెనీలను దాటింది. ముగిసిన నెలలో ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ప్రీమియం వసూళ్లు 5.42 శాతం వృద్ధితో రూ. 5,906 కోట్లకు చేరగా, ప్రైవేటు రంగ కంపెనీల వసూళ్లు 27.88 శాతం వృద్ధిచెంది రూ. 6,302 కోట్లకు పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి థర్డ్‌పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగిన నేపథ్యంలో ఈ వసూళ్లు అత్యధికంగా 23 శాతం వృద్ధిచెందాయి. ఆరోగ్య బీమా ప్రీమియం వసూళ్లు 9 శాతం పెరగ్గా, ఏవియేషన్, మెరైన్ విభాగాలు ప్రతికూల వృద్ధిని నమోదుచేసినట్లు ఐఆర్డీఏ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
appకీ కహానీ...గెట్ ప్రోయాక్టివ్
పాలసీదారులు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తూ.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు తగ్గించుకునేలా ప్రోత్సహించడానికి ఆరోగ్య బీమా సంస్థ సిగ్నా టీటీకే తాజాగా ‘గెట్ ప్రోయాక్టివ్’ పేరిట ఫిట్నెస్ ట్రాకింగ్ యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేస్తుంది. ‘గెట్ ప్రోయాక్టివ్’ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ⇔ నిర్దిష్ట వేరబుల్ పరికరాలకు గెట్ ప్రోయాక్టివ్ ను అనుసంధానించి సిగ్నా టీటీకే పాలసీదారులు వ్యాయామ సరళిని ట్రాక్ చేసుకోవచ్చు. ⇔ అదే సమయంలో ఒక్కో యాక్టివిటీకి పాయిం ట్లూ పొందొచ్చు. వాకింగ్ చేస్తే వేల అడుగులకు 0.25 పాయింటు, 10 వేల అడుగులకు 1 పాయిం టు చొప్పున రివార్డు పాయింట్లు ఉంటాయి. ⇔ సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వాటికి మరిన్ని పాయింట్లు లభిస్తాయి. ⇔ ఒక్కో హెల్తీ రివార్డ్ పాయింటు విలువ రూ. 1కి సమానం. ⇔ వీటిని రెన్యువల్ ప్రీమియంలో డిస్కౌంటుకు లేదా ఇతరత్రా హెల్త్ మెయింటెనెన్స్ ప్రయోజనాలు క్లెయిమ్ చేయడానికి వాడొచ్చు. -
ఉద్యోగుల ఆశలపై నీళ్లు
⇒ ఆదాయ పన్ను బేసిక్ లిమిట్ జోలికెళ్లని ఆర్థిక మంత్రి ⇒ ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపు పెంపు ⇒ వృద్ధులు, వికలాంగులకు మరిన్ని పన్ను రాయితీలు ⇒ అనాదిగా వస్తున్న సంపద పన్ను రద్దు సాక్షి, బిజినెస్ విభాగం: కోట్ల మంది నెల జీతంపైనే ఆధారపడ్డ మన దేశంలో ప్రతి ఏటా బడ్జెట్‌కు ముందు ప్రధానంగా చర్చకు వచ్చేది ఆదాయపు పన్ను గురించే. ‘‘ఈ సారి బేసిక్ లిమిట్ పెంచుతారా?’’ ప్రతి వ్యక్తీ బడ్జెట్‌కు ముందు అడిగే ప్రశ్న ఇదొక్కటే. ఎందుకంటే బేసిక్ లిమిట్ పెంచితే జీతం డబ్బుల్లో కొంత జేబులో మిగిలే అవకాశముంటుంది. అలా కాకుండా పన్ను మినహాయింపులు పొందేందుకు వీలుగా పొదుపు పరిమితులను పెంచినా, పన్ను లేని బాండ్లు ప్రవేశపెట్టినా... ఇలాంటివెన్ని చేసినా సామాన్యుడి నుంచి ప్రతిస్పందన ఉండదు. ఎందుకంటే అవన్నీ జేబులో డబ్బులుండి అదనంగా ఖర్చు చేయగలిగిన వారికే కనక. కాకుంటే ఈ సారి బడ్జెట్లో బేసిక్ లిమిట్‌ను ప్రస్తుతం ఉన్న 2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచవచ్చని ఎందరు అంచనా వేసినా... ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం ఆ జోలికెళ్లలేదు. అయితే నెలకు కోటి రూపాయల ఆదాయం దాటిన వారికి మాత్రం 2 శాతం సర్‌చార్జి వడ్డించారు. ఇప్పటిదాకా 10 శాతంగా ఉన్న సర్‌చార్జీని 12 శాతానికి పెంచారు. మధ్య తరగతి వేతన జీవులకు జైట్లీ ఇచ్చిన ఉపశమనాలు ఒకటిరెండే. వాటిలో మొదటిది జీతంలో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్‌గా చెల్లించే మొత్తంలో పన్ను మినహాయింపు లభించే మొత్తం ఇప్పటిదాకా నెలకు రూ.800గా ఉంది. దీన్ని రెట్టింపు చేశారు. ఇకపై రవాణా భత్యంగా కంపెనీ ఎంత చెల్లించినా గరిష్టం గా నెలకు రూ.1600 వరకు పన్ను మినహాయింపు లభిస్తుందన్న మాట. రెండోది... హెల్త్ ఇన్సూరెన్స్‌లపై కట్టే ప్రీమియానికిచ్చే మినహాయింపు పరిమితిని పెంచారు. దీనివల్ల అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారని, దేశంలో అందరికీ ఆరోగ్య భద్రత లభిస్తుందని చెప్పారు. ఆ పెంపు ఏ మేరకు చేశారంటే... ష ఆరోగ్య బీమా కోసం ఎంత మొత్తాన్ని ప్రీమియంగా చెల్లించినా ఇప్పటిదాకా రూ.15,000కు మాత్రమే పన్ను మినహాయింపు వర్తించేది. దీన్నిపుడు రూ.25,000కు పెంచారు. ష 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్ల విషయంలో ఈ మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న రూ.20,000 నుంచి రూ.30,000కు పెంచారు. ష 80 ఏళ్లు దాటిన వృద్ధులు గనక హెల్త్ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయని పక్షంలో వారికి రూ.30,000 వరకు వివిధ చికిత్సలకయ్యే వ్యయానికి మినహాయింపు వర్తింపజేస్తారు. ష 80 ఏళ్లు దాటిన వారు కొన్ని ప్రత్యేక వ్యాధులకు చేసే చికిత్స వ్యయాన్ని ప్రస్తుతం రూ.60,000 వరకు మినహాయింపునకు అనుమతిస్తున్నారు. దీన్నిపుడు రూ.80,000కు పెంచారు. ష వికలాంగులకు ప్రస్తుతమనున్న మినహాయింపు పరిమితిని మరో రూ. 25,000 పెంచారు. పెన్షన్ ఫండ్ మినహాయింపు పెంపు.. ఆరోగ్య బీమాతో పాటు పెన్షన్ ఫండ్‌లో గానీ, కొత్త పింఛను పథకంలో గానీ ఇన్వెస్ట్ చేస్తే ఇచ్చే మిన హాయింపు మొత్తాన్ని రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు. ఇది కాక అదనంగా కొత్త పింఛను పథకంలో గనక ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80సీసీడీ కింద మరో రూ.50,000 మినహాయింపు ఇస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. అదే వృద్ధులకైతే వరిష్ట బీమా యోజన కింద సేవా పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఇక ఇటీవలే బాలికల కోసం ప్రవేశపెట్టిన సుకన్య-సమృద్ధి పథకానికి ఇప్పటికే పన్ను మినహాయింపు ఉంది. అయితే ఇకపై లబ్ధిదారులకు చేసే చెల్లింపులు, సదరు డిపాజిట్లపై వడ్డీకి కూడా మినహాయింపు లభిస్తుంది. మొత్తంగా వివిధ సెక్షన్ల కింద తాను రూ.4,44,200 మినహాయిస్తున్నట్లు తెలియజేశారు. సంపద పన్ను రద్దు... సర్‌చార్జీ వడ్డన సంపద పన్నును (వెల్త్ ట్యాక్స్) జైట్లీ రద్దు చేశారు. నిజానికి ఇదో చిత్రమైన పన్ను. ఏళ్ల తరబడి సవరించకుండా కొనసాగుతున్న అర్థం లేని పన్ను. దీనిప్రకారం ఏ వ్యక్తయినా రూ.30 లక్షలకన్నా ఎక్కువ విలువైన ఆస్తిని కలిగి ఉంటే దానిపై ఒక శాతం సంపద పన్ను చెల్లించాలి. నిజానికిది ఎప్పుడో భూముల విలువలు పాతాళంలో ఉన్నపుడు తెచ్చిన పన్ను. కానీ ఇపుడు పల్లెటూళ్లలో సైతం ఎకరా రూ.30 లక్షలపైనే పలుకుతోంది. మరి రైతులు తమ భూముల విలువలపైనా పన్నులు చెల్లించాలా? చట్ట ప్రకారం నిజానికి చెల్లించాల్సి ఉన్నా... ఇది అర్థం లేని పన్ను కనకనే అధికారులు కూడా మామూలు వ్యక్తుల విషయంలో దీన్ని విధించే సాహసమేదీ చెయ్యలేదు. అందుకే ఈ పన్నును తొలగిస్తున్నట్లు జైట్లీ స్పష్టం చేశారు. దీని బదులు నెలకు రూ.కోటికన్నా ఎక్కువ ఆదాయం ఉండే వ్యక్తులు, హిందూ కుటుంబాలు, సంస్థలు, కో-ఆపరేటివ్ సొసైటీలు, స్థానిక సంస్థల ఆదాయంపై 2 శాతం సర్‌ఛార్జీ విధించారు. ప్రస్తుతం ఈ సర్‌ఛార్జీ 10 శాతంగా ఉంది. నిజానికి రూ.కోటి దాటి ఆదాయం ఉంటోంది కనక వీరు అత్యధిక శాతం... అంటే 30 శాతం శ్లాబ్‌లో ఉంటారు. ఆ 30పై 10 శాతం సర్‌ఛార్జీ చెల్లిస్తున్నారు. ఇపుడది 12 శాతం అయినట్లన్న మాట. బాబోయ్.. ఎంత పన్ను! రూ.10 వేల పన్ను కట్టాలంటేనే మనం బాబోయ్ అంటాం..! ఆ మొత్తాన్ని మిగిల్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటాం. మరి కోట్లు కోట్లు ట్యాక్స్ కట్టాల్సి వస్తే..? అవును మన దేశంలో కొన్ని కంపెనీలు వేల కోట్లలోనే పన్నులు చెల్లిస్తుంటాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్నులు కట్టిన టాప్-10 కంపెనీలను ఓసారి చూస్తే... డీటీసీ అటకెక్కినట్లే... డెరైక్ట్ ట్యాక్స్ కోడ్. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం ముద్దుబిడ్డ. ఏడేళ్ల కిందట ఆయన ప్రతిపాదించిన ఈ చట్టం ఇప్పటిదాకా చర్చల్లోనే ఉంది. యూపీఏ ప్రభుత్వం దీన్ని గతేడాది సవరించి... సరికొత్త ముసాయిదాను తెచ్చింది కూడా. ఇది గనక అమల్లోకి వస్తే ఆదాయపు పన్ను బేసిక్ లిమిట్ రూ.2 లక్షలుగా ఉండాలి. పెపైచ్చు ఇపుడున్న మూడు శ్లాబులతో పాటు రూ.10 కోట్ల ఆదాయం దాటిన శ్రీమంతుల కోసం 35 శాతంతో మరో శ్లాబు కూడా దీన్లో ఉంది. నిజానికి ప్రస్తుతం ఆదాయపు పన్ను బేసిక్ లిమిట్ రూ.2.5 లక్షలుగా ఉంది. అరుణ్ జైట్లీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. డీటీసీ తీసుకురావాల్సిన అవసరం ఇక లేదన్నారు. -
ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్య బీమా ప్రీమియం వసూళ్లు డౌన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత మూడేళ్లలో ఆరోగ్య బీమా ప్రీమియం వసూళ్లు తగ్గిన ఏకైక రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిల్చింది. 2009-10లో రూ. 800 కోట్ల ప్రీమియం వసూళ్లు నమోదు కాగా 2012-13లో 13% క్షీణించి రూ. 695 కోట్లకు పరిమితమయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బీమా సంస్థల స్థూల ప్రీమియం ఆదాయాల ఆధారంగా పరిశ్రమల సమాఖ్య అసోచాం రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.