Narayana Health City Hospital
-
కుటుంబానికి రూ.10 వేలకే హెల్త్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా ప్రీమియం సామాన్యులకు భారంగా మారిన తరుణంలో.. ప్రముఖ వైద్యసేవల సంస్థ ‘నారాయణ హెల్త్’ చౌక ప్రీమియంతో ఒక ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ఆరోగ్య బీమా పాలసీకి ‘అతిథి’ పేరు పెట్టింది. దంపతులు, ఇద్దరు పిల్లలు (గరిష్టంగా) కలిగిన నలుగురు సభ్యుల కుటుంబానికి ఏడాదికి ప్రీమియం కేవలం రూ.10,000గా నిర్ణయించింది. ఇంటిపెద్ద వయసు 45ఏళ్లకు మించకుండా ఉంటేనే ఈ ప్రీమియం. ఇంతకంటే అధిక వయసులోని వారికి ప్రీమియం (అది కూడా ఇతర బీమా సంస్థల కంటే తక్కువే) వేరుగా ఉంటుంది. నలుగురు సభ్యుల కుటుంబానికి ఒక ఏడాదిలో రూ.కోటి రూపాయల వరకు సర్జరీలకు ఈ పాలసీలో చెల్లింపులు లభిస్తాయి. ఇతర హాస్పిటల్ చికిత్సలకు (జ్వరం, ఇన్ఫెక్షన్ తదితర) రూ.5లక్షల వరకు కవరేజీ ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి ఈ పాలసీ కింద సేవలు నారాయణ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే లభిస్తాయి. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 21 హాస్పిటళ్లు ఉన్నాయి. బెంగళూరులో ఏడు ఆస్పత్రులతోపాటు, మూడు క్లినిక్‌లు ఉన్నాయి. -
రూ.10 వేలకు కోటి ఆరోగ్య బీమా
బెంగుళూరుకు చెందిన హాస్పిటల్ చైన్ నారాయణ హెల్త్ కొత్త వెంచర్ నారాయణ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (NHIL) తన మొదటి బీమా ఉత్పత్తిని ప్రకటించింది. 'అదితి' పేరుతో తీసుకొచ్చిన ఈ బీమా శస్త్రచికిత్సలకు రూ. 1 కోటి, వైద్య నిర్వహణ ఖర్చుల కోసం రూ. 5 లక్షలు హామీతో కుటుంబానికి సమగ్ర కవరేజీని అందిస్తుంది.తక్కువ ప్రీమియంకే సమగ్ర కవరేజీని అందించడం ద్వారా దేశంలోని ప్రజలకు ఆరోగ్య సంరక్షణ పొందడంలో ఉన్న అంతరాన్ని తగ్గించడం ఈ ప్లాన్ లక్ష్యం అని డాక్టర్ దేవి శెట్టి నేతృత్వంలోని ఈ హెల్త్‌కేర్ మేజర్ పేర్కొంది. ఈ కొత్త బీమాను సంవత్సరానికి రూ. 10,000 ప్రీమియంతో పొందవచ్చు. సాధారణంగా ఇలాంటి బీమాకు ప్రీమియం అధికంగా ఉంటుంది. గరిష్టంగా నలుగురు సభ్యులున్న కుటుంబం ఈ బీమా ప్లాన్ తీసుకునేందుకు అవకాశం ఉంది.నారాయణ హెల్త్ దేశంలో బీమా కంపెనీని కలిగి ఉన్న మొదటి హాస్పిటల్ చైన్‌గా నిలిచింది. దేశం అంతటా దాదాపు 21 హాస్పిటల్ నెట్‌వర్క్‌లు, అనేక క్లినిక్‌లను కలిగి ఉంది. బెంగళూరులో ఇది దాదాపు 7 ఆసుపత్రులు, 3 క్లినిక్‌లను కలిగి ఉంది. ఎన్హెచ్ఐ వెంచర్ కింద ‘అదితి’ పైలట్ ప్లాన్ మొదట మైసూరు, బెంగళూరులో తర్వాత కోల్‌కతా, ఢిల్లీలో అందుబాటులోకి రానుంది. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల మార్పిడితో సహా శస్త్ర చికిత్సలకు కోటి రూపాయల వరకు, వైద్య చికిత్సల కోసం రూ. 5 లక్షల వరకు అదితి కవరేజీని అందజేస్తుంది.కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించిన డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి కార్డియాక్ సర్జన్. ఆయన లక్షకు పైగా గుండె ఆపరేషన్లు చేశారు. వైద్య రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం దేవి శెట్టిని 2004లో పద్మశ్రీ , 2012లో పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. -
పాక్ బాలికకు అరుదైన క్యాన్సర్ చికిత్స
బెంగళూరు వైద్యుల ఘనత సాక్షి, బెంగళూరు: ప్రాణాంతక క్యాన్సర్‌తో బాధపడు తున్న పాక్ బాలికకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి భారతీయ వైద్యులు తమ గొప్పదనాన్ని చాటారు. పాకిస్తాన్‌కు చెందిన జీనియా అనే బాలికకు బెంగళూరులోని నారాయణ హెల్త్ సిటీ ఆస్పత్రిలో అరు దైన బోన్ మారో (ఎముక మూలుగ మార్పిడి) శస్త్రచికిత్స నిర్వహించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న జీనియాను ఆమె తల్లిదండ్రులు చికిత్స కోసం బెంగళూరు తీసుకొచ్చారు. పరిశీలించిన వైద్యులు ఆమెకు బోన్ మారో చికిత్స అ వసరమని నిర్ధారించారు. మూలుగ కోసం ఆమె కుటుంబంలో అందరికీ వైద్య పరీక్షలు జరిపి ఎనిమిది నెలల వయసున్న ఆమె తమ్ముడు రియాన్ మూలుగ జీనియాకు సరిపోవడంతో వైద్యులు బోన్ మారో చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. బాలిక కోలుకున్నట్లు శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు.