రూ.10 వేలకు కోటి ఆరోగ్య బీమా | Narayana Health launches Rs 1 crore health insurance at a premium of Rs 10000 per year | Sakshi
Sakshi News home page

రూ.10 వేలకు కోటి ఆరోగ్య బీమా

Published Tue, Jul 2 2024 10:41 PM | Last Updated on Tue, Jul 2 2024 10:41 PM

Narayana Health launches Rs 1 crore health insurance at a premium of Rs 10000 per year

బెంగుళూరుకు చెందిన హాస్పిటల్ చైన్ నారాయణ హెల్త్ కొత్త వెంచర్ నారాయణ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (NHIL) తన మొదటి బీమా ఉత్పత్తిని ప్రకటించింది.  'అదితి' పేరుతో తీసుకొచ్చిన ఈ బీమా శస్త్రచికిత్సలకు రూ. 1 కోటి, వైద్య నిర్వహణ ఖర్చుల కోసం రూ. 5 లక్షలు హామీతో కుటుంబానికి సమగ్ర కవరేజీని అందిస్తుంది.

తక్కువ ప్రీమియంకే సమగ్ర కవరేజీని అందించడం ద్వారా దేశంలోని ప్రజలకు ఆరోగ్య సంరక్షణ పొందడంలో ఉన్న అంతరాన్ని తగ్గించడం ఈ ప్లాన్ లక్ష్యం అని డాక్టర్‌ దేవి శెట్టి నేతృత్వంలోని ఈ హెల్త్‌కేర్ మేజర్ పేర్కొంది. ఈ కొత్త బీమాను సంవత్సరానికి రూ. 10,000 ప్రీమియంతో పొందవచ్చు. సాధారణంగా ఇలాంటి బీమాకు ప్రీమియం అధికంగా ఉంటుంది. గరిష్టంగా నలుగురు సభ్యులున్న కుటుంబం ఈ బీమా ప్లాన్‌ తీసుకునేందుకు అవకాశం ఉంది.

నారాయణ హెల్త్ దేశంలో బీమా కంపెనీని కలిగి ఉన్న మొదటి హాస్పిటల్ చైన్‌గా నిలిచింది. దేశం అంతటా దాదాపు 21 హాస్పిటల్ నెట్‌వర్క్‌లు, అనేక క్లినిక్‌లను కలిగి ఉంది. బెంగళూరులో ఇది దాదాపు 7 ఆసుపత్రులు, 3 క్లినిక్‌లను కలిగి ఉంది. 
ఎన్‌హెచ్‌ఐ వెంచర్ కింద ‘అదితి’ పైలట్ ప్లాన్‌ మొదట మైసూరు, బెంగళూరులో తర్వాత కోల్‌కతా, ఢిల్లీలో అందుబాటులోకి రానుంది. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల మార్పిడితో సహా శస్త్ర చికిత్సలకు కోటి రూపాయల వరకు, వైద్య చికిత్సల కోసం రూ. 5 లక్షల వరకు అదితి కవరేజీని అందజేస్తుంది.

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించిన డాక్టర్‌ దేవి ప్రసాద్‌ శెట్టి కార్డియాక్ సర్జన్‌. ఆయన లక్షకు పైగా గుండె ఆపరేషన్లు చేశారు. వైద్య రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం దేవి శెట్టిని 2004లో పద్మశ్రీ , 2012లో పద్మభూషణ్‌ పురస్కారాలతో గౌరవించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement