తక్కువ ధరలో విమాన టికెట్లు కావాలంటే...
గమనింపు
బయల్దేరడానికి కనీసం ఎనిమిది రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాలి.
రిజర్వేషన్ సమయానికి టికెట్ బుకింగ్ బిజీ/లీజర్‌గా ఉన్నదా అనే విషయాన్ని పరిశీలించాలి. సాధారణంగా లేట్ నైట్స్, తెల్లవారుఝాము ఫ్లైట్స్‌కి తక్కువ ధరలో టికెట్స్ ఉంటాయి.
వారం మధ్యలో ఫ్లైట్ టికెట్ ఖరీదులో తగ్గింపు ఉంటుంది.
సాధారణంగా దేశీయ ఫ్లైట్స్ (ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, జెట్ ఎయిర్‌వేస్, గో ఎయిర్, ఇండిగో... మొదలైనవి) టికెట్ ధరలలో డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. వాటిని పరిశీలిస్తూ ఉండాలి.
రోజువారీ సమాచారం తెలుసుకోవాలంటే ఈ-మెయిల్ అలెర్ట్ సరైన సూచిక. సంబంధిత ఎయిర్ వేస్ ఫ్లైట్ బుకింగ్స్ సమాచారం ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తాయి.