Reservation
-
‘సుప్రీం’ తీర్పుతో తెలంగాణకు నష్టం
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్ల రిజర్వేషన్లలో 50 శాతం స్థానిక కోటా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తీర్పుతో మెడికల్ కాలేజీల ఏర్పాటులో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో స్థానిక విద్యార్థులు ఉన్నత వైద్య విద్యను చదివే అవకాశం కోల్పోతారని తెలిపారు. సుప్రీం తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ధర్మాసనాన్ని ఆశ్రయించాలని సూచించారు. కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ చొరవతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో వాటి సంఖ్య 34కు చేరింది. ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో పాటు పీజీ సీట్లలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలోని 2,924 పీజీ మెడికల్ సీట్లలో 50 శాతం స్థానిక రిజర్వేషన్ కింద 1,462 సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేవి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో అన్ని సీట్లు ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తాయి. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోబోతున్నారు. దక్షిణాది రాష్ట్రాలు గడిచిన 77 ఏండ్లుగా ప్రత్యేక దృష్టి సారించి వైద్య విద్యను ప్రోత్సహించాయి’అని హరీశ్‌రావు తెలిపారు. రిజర్వేషన్లు కూడా దెబ్బతినే ప్రమాదం సుప్రీంతీర్పు రిజర్వేషన్లను కూడా ప్రభావితం చేస్తుందని హరీశ్‌రావు అన్నారు. ‘ఈ తీర్పుతో రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా దెబ్బతి నే ప్రమాదం ఉంది. పీజీలో ఇన్‌సర్వీస్ కోటా ప్రశ్నార్థకంగా మారి, గ్రామీణ ప్రాం తాల్లో వైద్య సేవలకు విఘాతం కలుగుతుంది. వైద్య సేవలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. పీజీ విద్యార్థులకు స్టైఫెండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ తీర్పుతో నష్టం జరుగుతుందని భావించిన తమిళనాడు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం కూ డా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్లి స్టే తీసుకురావాలి. అవసరమైతే దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా రాజ్యాంగ సవరణకు పట్టుబట్టాలి’అని హరీశ్ సూచించారు. -
ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 3 శాతానికి పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న కొత్త ‘స్పోర్ట్స్ పాలసీ’ అన్నిరాష్ట్రాల కంటే మిన్నగా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం సీఎం అధ్యక్షతన నూతన స్పోర్ట్స్ పాలసీపై సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు స్పోర్ట్స్ ఫర్ ఆల్, నర్చర్ టాలెంట్, స్పోర్ట్స్ ఎకో సిస్టం, గ్లోబల్ విజిబిలిటీ ప్రాతిపదికగా పాలసీని రూపొందించామన్నారు. గ్రామస్థాయి నుంచి క్రీడల ప్రోత్సాహకానికి ప్రణా ళిక పొందుపరిచినట్టు చెప్పారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్ 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. శాప్‌లో గ్రేడ్–3 కోచ్‌ల కోసం ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు ప్రకటించారు. ఒలింపిక్స్ విజేతలకు భారీ ప్రోత్సాహకాలుఒలింపిక్స్లో బంగారు పతకానికి ప్రస్తుతం రూ.75 లక్షలు ఇస్తుండగా, ఇకపై రూ.7 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు సీఎం ప్రకటించారు. రజత పతకానికి రూ.50 లక్షలు నుంచి రూ.5 కోట్లు, కాంస్యానికి రూ.30 లక్షల నుంచి రూ.3 కోట్లు, పాల్గొన్న వారికి రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని ఆదేశించారు. ఏషియన్ గేమ్స్ బంగారు çపతకానికి రూ.4 కోట్లు, రజత పతకానికి రూ.2 కోట్లు, కాంస్య పతకానికి రూ.కోటి, పాల్గొన్న వారికి రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు. వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతానికి రూ.35 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతానికి రూ.5 లక్షలు, కాంస్య పతకానికి రూ.3 లక్షలు ఇవ్వాలన్నారు. ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.2.50 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.2 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, అధికారులు పాల్గొన్నారు.సాగు ఖర్చులు తగ్గాలిసాగును మరింత ప్రోత్సహించేందుకు అవసరమైనన్ని నూతన విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని సీఎం చంద్రబాబు వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. సాంకేతికతను వినియోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవచ్చని చెప్పా రు. ఆయన సోమవారం వ్యవసాయశాఖపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రాను న్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయం గేం చేంజర్ అవుతుందని చెప్పారు. ప్రకృతి సేద్యంలో ఏపీ పయనీర్‌గా నిలవాలన్నారు. పంట ల సాగులో డ్రోన్ల వాడకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. కేబినెట్ సబ్ కమి టీ సూచనల ప్రకారం ఈ రబీ నుంచి పాత పద్ధతిలో పంటల బీమాను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. జూలైలో జరిగిన పంట నష్టానికి రూ.37 కోట్లు రైతులకు పరి హారం కింద చెల్లించేందుకు సీఎం అంగీకా రం తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. -
తెల్ల ‘కోట్లు’!.. నీట్ ర్యాంకర్ల నిర్వేదం
‘ఏడాదిపాటు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని నీట్ యూజీ–2024లో 595 స్కోర్ చేశా. గతేడాదితో పోలిస్తే మెరుగైన స్కోర్ చేసినా కన్వీనర్ కోటాలో సీటు వస్తుందన్న నమ్మకం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది మరో 5 కొత్త వైద్య కళాశాలలను ప్రారంభిస్తే మనకు అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూరేవి. దీనికి తోడు టీడీపీ తన హామీ మేరకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తే మరో 319 సీట్లు కన్వీనర్ కోటాలో పెరిగేవి. కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు ఎన్ఎంసీ అండర్ టేకింగ్ కోరినా ప్రైవేట్‌కు కట్టబెట్టే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంఎన్సీ సీట్లు మంజూరు చేస్తే మేం నిర్వహించలేమంటూ ప్రభుత్వమే లేఖ రాసి నాలాంటి విద్యార్థులకు తీవ్ర నష్టం తలపెట్టింది. ఇప్పటికే లాంగ్‌టర్మ్ కోచింగ్ రూపంలో రెండేళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈసారి కూడా సీటు రాకుంటే నా భవిష్యత్ అంధకారమే. తెలంగాణలో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు ఈసారి సీట్లు వస్తున్నాయి. అక్కడ 8 వైద్య కళాశాలల్లో 400 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరగడమే దీనికి కారణం. ఏపీలో మాత్రం వచ్చిన సీట్లు సైతం వద్దంటూ ప్రభుత్వమే లేఖ రాసింది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుపై చిత్తశుద్ధి లేని జీవో ఇచ్చి చేతులు దులుపుకొంది...!’ విశాఖకు చెందిన నీట్ ర్యాంకర్ సాయి ఆక్రోశం ఇదీ!సాక్షి, అమరావతి: వైద్య విద్యపై ఎంతో ఆశ పెట్టుకుని లాంగ్ టర్మ్ శిక్షణతో ఏడాదంతా సన్నద్ధమై మంచి స్కోర్ సాధించిన పలువురు ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కాలేజీలు అందుబాటులోకి రాకపోవడంతో ఉసూరుమంటున్నారు. ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో ఈ ఏడాది 700, వచ్చే ఏడాది 1,050 చొప్పున మొత్తం 1,750 సీట్లు కోల్పోవడంతో తమ ఆశలు గల్లంతవుతున్నాయని నీట్ ర్యాంకర్లు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే వైద్య విద్యా వ్యాపారం చేస్తానంటే ఎలా? అని ఆక్రోశిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతే ఇక ‘కోట్లు’న్న వారికే తెల్లకోటు భాగ్యం దక్కుతుందని పేర్కొంటున్నారు.మంచి స్కోరైనా..సీట్ కష్టంనీట్ యూజీలో అర్హత సాధించిన 13,849 మంది ఈసారి రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం నీట్లో 500–550 స్కోర్ చేసినా రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీటు కష్టమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఓసీ విద్యార్థులైతే దాదాపు 600 స్కోర్ చేసినప్పటికీ అసలు సీటు వస్తుందో? లేదో? అనే ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు తెలంగాణలో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో సీట్లు దక్కుతున్నాయని, ఏపీలో మాత్రం ప్రతిభ ఉన్నప్పటికీ వైద్య విద్య చదివే అదృష్టం లేదని వాపోతున్నారు. గత పదేళ్లలో తెలంగాణలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు గణనీయంగా పెరగడం, ఈ విద్యా సంవత్సరంలో 8 కళాశాలలకు ఏకంగా 400 సీట్లు అదనంగా మంజూరవడం అక్కడి విద్యార్థులకు కలిసి వస్తోంది.సీట్లు పెరిగింది గత ఐదేళ్లలోనే⇒ ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఒంగోలు, శ్రీకాకుళం, కడప రిమ్స్‌లను నెలకొల్పడంతో పాటు నెల్లూరు ఎసీఎస్ఆర్ కళాశాల ఏర్పాటుకు బీజం వేశారు. ⇒ 2004కు ముందు, 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు కాలేదు. దీంతో వైద్య విద్యపై తీవ్ర ప్రభావం పడింది. ⇒ గత ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ⇒ వీటిలో ఐదు కొత్త కళాశాలలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమై 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరడంతో వైద్య విద్యపై ఆశలు చిగురించాయి. ⇒ ఈ క్రమంలో ఈ ఏడాది మరో ఐదు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించాల్సి ఉండగా వాటిని ప్రైవేట్‌పరం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.⇒ దీంతో ఈ ఏడాది 750 సీట్లు సమకూరాల్సి ఉండగా కేవలం పాడేరు వైద్య కళాశాలలో కేవలం 50 సీట్లు అది కూడా గత ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు వాటికి అనుమతులు రాకుండా ప్రభుత్వమే అడ్డుపడింది. ⇒ ఇదే విషయం ఎంఎన్సీ (జాతీయ వైద్య కమిషన్) రాసిన లేఖ ద్వారా ఇప్పటికే బహిర్గతమైన సంగతి తెలిసిందే. ⇒ ఈ ఏడాది మెడికల్ కాలేజీలు పెరిగితే తమ పిల్లలకు కచ్చితంగా సీటు వస్తుందనే అంచనాతో సగటున రూ.3 లక్షలకుపైగా ఖర్చు చేసి నీట్ శిక్షణ ఇప్పించామని, అయితే స్కోర్ 500 దాటినా దక్కని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. ⇒ పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంఎన్సీ సీట్లు మంజూరు చేయడం విస్మయం కలిగించిందంటూ ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వమే వ్యాఖ్యానించడంపై నివ్వెరపోతున్నారు.మా ఆశలను కాలరాశారుగతేడాది నీట్లో 515 స్కోర్ చేశా. ఓసీ కేటగిరీలో 543 స్కోర్‌కు కన్వీనర్ కోటాలో చివరి సీట్ వచ్చింది. దీంతో లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నా. ఈసారి 555 స్కోర్ సాధించినా పోటీ తీవ్రంగా ఉంది. ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమైతే నాకు సీటు దక్కేది. కనీసం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసినా మాకు న్యాయం జరిగేది. ప్రభుత్వమే మా ఆశలను కాలరాసింది. మేనేజ్మెంట్ కోటాలో చేరాలంటే మా తల్లిదండ్రులకు తలకు మించిన భారం. ఇప్పటికే నాతోపాటు మా సోదరుడి లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం రూ. లక్షల్లో ఖర్చు పెట్టారు. – ఎన్. సుచేతన, రాజంపేట, అన్నమయ్య జిల్లాఅప్పుడు అదృష్టం.. ఇప్పుడు!నాకు ఇద్దరు కుమార్తెలు. 2023లో పెద్దమ్మాయి నీట్లో 530 మార్కులు సాధించి ఏలూరు కాలేజీలో సీట్ దక్కించుకుంది. ఆ విద్యా సంవత్సరంలో 5 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించడం, అదనంగా 750 సీట్లు పెరగడం మాకు కలిసి వచ్చింది. ఇప్పుడు రెండో అమ్మాయి 543 మార్కులు సాధించినా ప్రభుత్వ సీట్ రావటం లేదు. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఐదు కొత్త కళాశాలలు ప్రారంభం అయితే అదృష్టం కలసి వస్తుందని ఆశపడ్డాం. ప్రభుత్వమే వసతులు కల్పించలేమని చేతులెత్తేస్తే మాలాంటి వాళ్ల పరిస్థితి ఏమిటి? అదే మా అమ్మాయి పక్క రాష్ట్రంలో ఉంటే మొదటి రౌండ్లోనే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చేది. – సీహెచ్.ఉమామహేశ్వరరావు, పోలాకి మండలం, శ్రీకాకుళంప్రభుత్వమే వ్యాపారం చేస్తానంటే ఎలా?సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ దాన్ని నెరవేర్చకపోగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్వహిస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వం ఉచితంగా వైద్య విద్య అందించడానికి కృషి చేయాలి. అంతేగానీ వైద్య విద్యా వ్యాపారం చేస్తానంటే ఎలా? గతేడాది కొత్త వైద్య కళాశాలలు ప్రారంభమై అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు రావడంతో ఎంతో సంతోషించాం. ఈ ఏడాది మరో ఐదు కొత్త కాలేజీల ద్వారా అదనంగా 750 సీట్లు వస్తాయని భావిస్తే పీపీపీ విధానం పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర నిరాశకు గురి చేశారు. – జి.ఈశ్వరయ్య, ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి -
వైద్య విద్య సీట్లపై ‘ప్రైవేటు’ కన్ను!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పేదలకు అందే కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లను కొల్లగొట్టేందుకు వ్యూహం పన్నుతున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీలుగా హోదా తెచ్చుకుని.. ప్రభుత్వ నియంత్రణ లేకుండా తమదైన నిబంధనలు అమలు చేసుకునేందుకు ప్రయతి్నస్తున్నాయి. కనీ్వనర్ కోటా సీట్లను మేనేజ్మెంట్ సీట్లుగా మార్చుకోవడమేకాదు.. ఫీజులను ఇష్టారీతిన పెంచుకోవడం, రిజర్వేషన్లు ఎత్తేయడం, సొంతంగానే పరీక్షలు పెట్టుకోవడం వంటి చర్యల ద్వారా అంతా సొంత రాజ్యాలుగా మార్చుకునేందుకు ఈ మార్గం ఎంచుకుంటున్నాయి. ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)’నుంచి డీమ్డ్ వర్సిటీలుగా అనుమతులు తెచ్చుకుంటాయి. ప్రతిభ ఉన్న పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్ కావాలన్న కలలకు ఈ తీరు దెబ్బకొట్టనుంది. ఇప్పటికే రెండు కాలేజీలకు.. ఇటీవలే మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు యూజీసీ డీమ్డ్ యూనివర్సిటీ హోదాను మంజూరు చేసింది. అపోలో, సీఎంఆర్ మెడికల్ కాలేజీలు కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. మున్ముందు మరికొన్ని కాలేజీలు ఇదే బాటన నడిచేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలిసింది. ఈ పరిణామాలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా యూజీసీకే దరఖాస్తు చేసుకుంటూ పోతే ఎలాగని.. దీనిపై తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఇష్టారాజ్యంగా సీట్ల భర్తీ కోసం.. రాష్ట్రంలో మొత్తం 64 మెడికల్ కాలేజీలున్నాయి. అందులో 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాగా.. 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,090 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వంలోని ఎంబీబీఎస్ సీట్లన్నీ కూడా కనీ్వనర్ కోటాలోనే భర్తీ చేస్తారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో సగం కనీ్వనర్ కోటా కింద భర్తీ చేస్తారు. వాటి ఫీజు ఏడాదికి రూ.60 వేలు మాత్రమే. డీమ్డ్ వర్సిటీలుగా మారిన మెడికల్ కాలేజీల్లో ఈ కనీ్వనర్ కోటా సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటాలోకి మారిపోతాయి. మొత్తం సీట్లన్నీ కాలేజీల చేతిలోకే వెళ్లిపోతాయి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో 400 ఎంబీబీఎస్ సీట్లుండగా... అందులో 200 సీట్లు కనీ్వనర్ కోటాలోకి రావాలి.కానీ వాటికి డీమ్డ్ వర్సిటీ హోదా రావడంతో.. అవన్నీ మేనేజ్మెంట్ కోటాలోకే వెళ్లిపోయాయి. ఇక డీమ్డ్ వర్సిటీ కాలేజీల్లో స్థానిక అభ్యర్థులకు కోటా ఉండదు. దేశంలోని ఏ రాష్ట్ర విద్యార్థులైనా వచ్చి చేరవచ్చు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉండవు. ఫీజులు నిర్ణయించుకునే అధికారం కూడా యాజమాన్యాలకే ఉంటుంది. పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల మూల్యాంకనం కూడా యాజమాన్యాలే నిర్వహించుకుంటాయి. అంటే ఆ మెడికల్ కాలేజీలు పూర్తిగా యాజమాన్యాల సొంత రాజ్యాలుగా మారిపోతాయి. కనీ్వనర్ కోటా సీట్లలో చాలా వరకు ప్రతిభ ఉన్న పేద విద్యార్థులే దక్కించుకుంటారు. ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిపోతుండటంతో వారికి అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకూ నష్టదాయకమేకావడం ఆందోళనకరం. -
అప్పుడే రిజర్వేషన్లు తీసేయాలి: రాహుల్
వాషింగ్టన్: పారదర్శకతతో భారతీయ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభించిన పరిస్థితుల్లో దేశంలో రిజర్వేషన్లను తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ అక్కడి జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో మాట్లాడారు. ‘‘ ఆర్థిక ప్రయోజనాలు గిరిజనులు, ఓబీసీలు, దళితులకు సరిగా దక్కట్లేవు. ప్రతి 100 రూపాయల్లో గిరిజనులు పొందేది కేవలం 10 పైసలు. దళితులు, ఓబీసీలకు చెరో ఐదు పైసలు దక్కుతున్నాయి. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కిన పరిస్థితుల్లో రిజర్వేషన్ల రద్దు అంశాన్ని కాంగ్రెస్ ఆలోచిస్తుంది. అయితే అలాంటి నిష్పక్షపాత పరిస్థితులు భారత్‌లో చాలా కష్టం. ఎందుకంటే భారత్‌లో 90 శాతం జనాభాకు ఎలాంటి ప్రాధాన్యత దక్కట్లేదు. బడా పారిశ్రామికవేత్తల్లో గిరిజనులు, దళితులు, ఓబీసీలు దాదాపు లేరు. మీరు టాప్ 200 భారతీయ వాణిజ్యవేత్తల జాబితా చూడండి. అందులో ఒక్కరు కూడా గిరిజనులు, దళితులు ఉండరు. ఉంటే ఒకే ఒక్క ఓబీసీ వ్యాపారి ఉండొచ్చేమో’’ అని అన్నారు. ‘‘ ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) తెస్తామని బీజేపీ ప్రభుత్వం చెబుతోంది. అసలు బీజేపీ ఏ రకంగా యూసీసీని అమలుచేయాలనుకుంటోంది. వాళ్ల ప్రాధాన్యాలేమిటో చెప్పమనండి. తర్వాత మేం స్పందిస్తాం’’ అన్నారు.మోదీ భయం మటుమాయం ‘‘జనాల్లో మోదీ సృష్టించిన భయం లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పోయింది. మోదీని ఢీకొట్టలేరన్న భయాన్ని జనాల్లో కలి్పంచేందుకు ఎంతో ధనం ధారపోశారు. ప్రణాళికలు వేశారు. కానీ రాజ్యాంగంపైనే దాడి చేస్తున్న బీజేపీకి మెజారిటీ రాకుండా ఓటర్లు వాత పెట్టారు. దాంతో మోదీ భయం ఒక్క సెకన్లో మటుమాయమైంది. 56 అంగుళాల ఛాతీ, దైవంతో అనుసంధానం వంటివన్నీ ఇప్పుడు ఒట్టిమాటలు. మోదీని నేను శత్రువులా చూడను. ద్వేషించను. కానీ ఆయన దృక్పథంతో ఏకీభవించను’’ అని రాహుల్ అన్నారు. -
నెల తర్వాత తెరుచుకున్న బంగ్లా బడులు
ఢాకా: బంగ్లాదేశ్‌లో నెల రోజులకు పైగా మూతబడిన విద్యాసంస్థలు ఆదివారం మళ్లీ తెరుచుకున్నాయి. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడం, ప్రధాని హసీనా గద్దె దిగడం వంటి పరిణామాల మధ్య దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు సహా అన్ని విద్యాసంస్థలు జూలై 17వ తేదీ నుంచి మూతబడ్డాయి. ప్రధాన సలహాదారు మహ్మద్ యూనుస్ సారథ్యంలో ఇటీవల తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెల్సిందే. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో..‘ప్రధాన సలహాదారు యూనుస్ ఆదేశాల మేరకు ఆగస్ట్ 18వ తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాలని సంబంధిత వర్గాలను కోరుతున్నాం’అంటూ 15వ తేదీన విద్యాశాఖ డిప్యూటీ కార్యదర్శి మొసమ్మత్ రహీమా అక్తర్ పేరిట ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆదివారం ఉదయం యూనిఫాం ధరించిన స్కూలు విద్యార్థులు విద్యాసంస్థలకు చేరుకోవడం కనిపించింది. రాజధాని ఢాకాలోని చాలా ప్రాంతాల్లో ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగిపోయింది. బంగ్లాదేశ్‌లో పాఠశాలలు ఆదివారం నుంచి గురువారం వరకు పనిచేస్తాయి. -
‘క్రీమీ లేయర్’పై బీజేపీ ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ క్రీమీ లేయర్‌కు రిజర్వేషన్ల ఫలాలు వర్తింపజేయకూడదని, క్రీమీ లేయర్‌ను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై బీజేపీ ఎస్సీ, ఎస్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. వారంతా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాదటిని అమలు చేయొద్దంటూ వినతి పత్రం సమరి్పంచారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎవరికీ నష్టం జరగదని మోదీ హామీ ఇచ్చినట్టు అనంతరం వారు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, సాధికారతకు తాము కట్టుబడి ఉన్నామని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. -
బీసీల గణనతోనే.. బీసీ కోటా సాధ్యం!
స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలును రాజ్యాంగంలోని లోపాలను చూపిస్తూ కోర్టులు అడ్డుకుంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యం కానప్పుడు, 42 శాతం అమలు సాధ్యం కాదనే విషయం వారికి తెలియక కాదు. ఓట్ల కోసం ఆ విధంగా వాగ్దానం చేశారు.కేంద్ర ప్రభుత్వం 1993/ 94లో స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు కనీస భాగస్వామ్యం కల్పించాలనే ముఖ్యోద్దేశంతో 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 243ని చేర్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశ పెట్టింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు వారి జనాభా దామాషా పద్ధతిలో, మహిళలకు ఒకటిలో మూడో వంతును, వెనుకబడిన పౌరులకు (బీసీలకు) మాత్రం నిర్దిష్టమైన కోటాను నిర్ధారించకుండా వీటిని ప్రవేశ పెట్టారు. స్థానిక సంస్థల్లో బీసీ కోటా అమలుపై సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం 2010లో కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసులో బీసీ కోటా అమలు ట్రిపుల్ ట్రస్ట్ ద్వారా మాత్రమే చేయాలని ఆదేశించింది.అందులో (1) బీసీ కోటా అమలుకు ప్రత్యేకంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. (2) అట్టి బీసీ కమిషన్ ద్వారా బీసీ లెక్కలు తీయాలి. (3) మొత్తం నిలువు రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా, అందులో ఎస్సీ, ఎస్టీ వారికి జనాభా దామాషా పద్ధతిలో పోగా మిగిలిన కోటాను బీసీలకు అమలు చెయ్యాలని ప్రభుత్వాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం 2022లో మరో సంచలనా త్మకమైన తీర్పును వెలువరిస్తూ సురేష్ మహజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో దేశంలోని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలను ఆదేశిస్తూ, స్థానిక సంస్థల ఎన్ని కలను ప్రతి ఐదు సంవత్సరాలకు తూచా తప్పకుండా నిర్వహించాలనీ, బీసీ గణాంకాలు లేనట్లయితే బీసీ రిజ ర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనీ ఆదేశించింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 1994 నుండి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు 2010లో స్థానిక సంస్థల బీసీ కోటాపై తీర్పు వెలువరించిన తర్వాత మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిలో భాగంగా బీసీ కోటాను 34 నుండి 24 శాతానికి తగ్గించాలని 2013 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వన్ని ఆదేశించింది. ఆ తీర్పుపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్టే తీసు కొని యధావిధిగా బీసీ రిజర్వేష న్లను 34 శాతం అమలు చేసింది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో స్థానిక సంస్థల్లో బీసీ కోటాను 34 నుండి 24 శాతానికి తగ్గించి ఎన్నికలు నిర్వహించింది.ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ లెక్కలు లేకుండా ఎన్నిక లకు వెళ్ళినట్లయితే 24 శాతం రిజర్వేషన్లు కూడా దక్కే అవ కాశం లేదు. ఎవరైనా ఎన్నికల ప్రకటనను సవాల్ చేసినట్ల యితే, బీసీ గణాంకాలు శాస్త్రీయబద్ధంగా లెక్కించనందున బీసీ రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలు నిర్వహించుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక బీసీ కమిషన్ ద్వారా సాధారణ పరిపా లన శాఖ సమన్వయంతో కులగణన చేసి, ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ కులాలకు 42 శాతం రిజర్వే షన్లను అమలు చేయాలి.– కోడెపాక కుమార స్వామి, వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు, మొబైల్: 94909 59625 -
ఎస్సీల ఉపవర్గీకరణపై సుప్రీం జస్టీస్ మిత్తల్ కీలక వ్యాఖ్యలు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పచ్చజెండా ఊపింది. అత్యంత వెనుకబడిన ఉప కులాలకు ఊతమిచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు ఆయా రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని 14వ, 341వ ఆర్టికల్లు ఈ ఉప కోటాకు అడ్డంకి ఏమీ కాదని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం (ఆగస్ట్1న) చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.ఈ తీర్పును వెలువరించే సమయంలో ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ పంకజ్ మిత్తల్ 51 పేజీల ప్రత్యేక తీర్పులో కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల విధానానికి తాజా పునఃపరిశీలన అవసరమని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల అభ్యున్నతికి కొత్త పద్ధతులు అవసరమని అన్నారు.రాజ్యాంగ పాలనలో కుల వ్యవస్థ లేదని, అణగారిన వర్గాలకు, అణగారిన ఎస్సీ,ఎస్టీ,ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశ్యంతో తీర్పును వెలువరించినట్లు చెప్పారు. దేశం కుల రహిత సమాజంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పైన పేర్కొన్నవర్గాలకు చెందిన వ్యక్తుల ప్రమోషన్, లేదా ఇతర ప్రయోజనాలు, ప్రత్యేకాధికారం వంటివి కులం ప్రాతిపదికన కాకుండా నివాసం స్థితి, ఆర్థిక కారకాలు, జీవన స్థితి,వృత్తి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న సౌకర్యాల ఆధారంగా ప్రమాణాలై ఉండాలని జస్టిస్ పంకజ్ మిత్తల్ తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేయవచ్చు : సుప్రీంకోర్టు తీర్పు
-
వర్గీకరణ అమల్లో ముందుంటాం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును దేశంలోనే అందరికన్నా ముందు భాగాన నిలబడి అమలు చేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణ అమలుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.దీనికోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం చేశారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గురువారం రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. వర్గీకరణపై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ‘వర్గీకరణ కోసం గతంలో ఇదే శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చాం. ఆ సందర్భంగా అప్పటి ప్రభుత్వం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సంపత్‌కుమార్‌నూ సభ నుంచి బహిష్కరించింది. వర్గీకరణపై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ అంశంపై ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఈ దిశగా ఏ ప్రయత్నమూ చేయకుండా మాదిగ సోదరులను మోసం చేసింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన మేరకు మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో శాసనసభ్యులు, అడ్వొకేట్ జనరల్‌ను ఢిల్లీకి పంపాం.న్యాయ కోవిదులతో చర్చించి వర్గీకరణపై సుప్రీంకోర్టులో బలమైన వాదన విని్పంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఈ నేపథ్యంలో మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయం..’అని సీఎం పేర్కొన్నారు. మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందించాలని అన్ని పక్షాలను కోరారు. రాజ్యాంగ ధర్మాసనానికి సభా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ ప్రకటన నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ సభ్యులు ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 50 ఏళ్ల కల నెలవేరింది: రాజనర్సింహఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో హర్షం వ్యక్తం చేశారు. యాభై ఏళ్ల కల నెరవేరిందని, ఇది చారిత్రక దినమని అన్నారు. వర్గీకరణ అంటే మరో వర్గానికి వ్యతిరేకం కాదని చెప్పారు.వర్గీకరణకు వైఎస్సార్ మద్దతిచ్చారు కాంగ్రెస్ సభ్యుడు వేముల వీరేశం మాట్లాడుతూ.. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. మంద కృష్ణమాదిగను జైల్లో పెట్టించింది కేసీఆరే అన్నారు. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.. మాదిగ బిడ్డ స్పీకర్ అవడంతో కేసీఆర్ సభకు రావడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ తరపున అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మందుల సామ్యూల్ కూడా మాట్లాడారు. సుప్రీం తీర్పును బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ స్వాగతించారు. ఈ దిశగా ప్రధాని నరేంద్రమోదీ కృషి చేశారని తెలిపారు.ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కూడా తీర్పును స్వాగతించారు. కంభంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సీఎల్పీ నాయకుడిగా గతంలో భట్టి విక్రమార్కను నియమిస్తే, ఆయన నాయకత్వంలో పనిచేయలేక సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లిపోయారని అన్నారు. బీఆర్ఎస్ సభ్యులకు సుప్రీంకోర్టు తీర్పు పట్ల వ్యతిరేకత ఉన్నట్లుగా భావించాల్సి వస్తోందని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ద్వారా దళిత జాతులకు సమన్యాయం చేసే చక్కటి అవకాశం లభించిందన్నారు. ‘తీర్పునకు అనుగుణంగా రాబోయే నోటిఫికేషన్లలో వర్గీకరణను అమలు చేస్తామని, ఆర్డినెన్స్ తెస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినందుకు దళిత జాతుల పక్షాన ధన్యవాదాలు’ అని ఆయన అన్నారు. అంతకుముందు ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని కలసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.బీఆర్ఎస్ మనఃస్ఫూర్తిగా స్వాగతిస్తోంది: హరీశ్‌రావు అసెంబ్లీ కౌరవ సభను తలపిస్తోందని, ఏది ఏమైనా అంతిమ విజయం పాండవులదేనని బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏదైనా ఒక ముఖ్యమైన అంశంపై ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడతారని అడిగి అవకాశం ఇచ్చే సాంప్రదాయం సభలో ఉందని.. అయితే అధికార పక్షం సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కడంపై తాను నిరసన వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ప్రజలే కాంగ్రెస్ పారీ్టకి సరైన బుద్ధి చెబుతారని అన్నారు.ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును తాము స్వాగతిస్తున్నామంటూ.. మాదిగలకు ద్రోహం చేసింది కాంగ్రెస్సేనని విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆనాటి సీఎం కేసీఆర్ 2014 నవంబర్ 29న వర్గీకరణ వెంటనే చేయాలని సభలో తీర్మానం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆనాటి ఉప ముఖ్యమంత్రులు, దళిత నాయకులతో కలిసి వెళ్లి కేసీఆర్ స్వయంగా తీర్మానం కాపీని ప్రధానికి అందజేశారని గుర్తుచేశారు.అంతేకాకుండా వర్గీకరణ ప్రాధాన్యతను ప్రధానికి కేసీఆర్ వివరించారని.. ప్రధాని కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాండ్ అని, దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామంటూ సానుకూలంగా స్పందించారని చెప్పారు. వర్గీకరణ పోరాటం సుదీర్ఘమైనదని, ఎన్నో త్యాగాలు జరిగాయని, ఎంతోమంది ప్రాణాలు అరి్పంచిన సంగతి మన కు తెలుసని అన్నారు. అమరులైన కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వమే ఆదుకున్నదని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ద్రోహం చేసిందని చెప్పా రు.గాంధీభవన్ దగ్గర పెట్రోల్ పోసుకుని కొందరు మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే.. అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్లను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఏదిఏమైనా ఇది చాలా సంతోషకరమైన సందర్భమని, దశాబ్దాల కల నెరవేరిన రోజని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు తీర్పును మనఃస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లుకు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. -
మూడు దశాబ్దాల వర్గీక‘రణం’
సాక్షి, అమరావతి: ఒకే సామాజిక వర్గంలోని ఉప కులాలకు సమ న్యాయం జరగడం లేదంటూ దాదాపు ఆరు దశాబ్దాల క్రితం వారిలో అంతరాలకు బీజం పడింది. అన్నదమ్ముల్లా మెలిగే వారిలో అంతరాలు తొలగించి జనాభా ప్రాతిపదికన (దామాషా) రిజర్వేషన్ల అమలును సరిచేసి, వాటి ఫలాలు అందించాలని ఐదు దశాబ్దాల క్రితం విజ్ఞాపనలతో మొదలైంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ చేయాల్సిందేనంటూ మూడు దశాబ్దాల క్రితం ఉద్యమం మొదలైంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అటు మీడియాలో, ఇటు సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలీ వర్గీకరణ ఏమిటి? ఎక్కడ తేడా వస్తోంది? భావోద్వేగాలను పురిగొల్పేలా ఉద్యమం ఎందుకు జరిగింది? వంటి అనేక ప్రశ్నలకు బదులు దొరకాలంటే 6 దశాబ్దాల పరిణామాలను ఒకసారి పరికించాల్సిందే. ఎస్సీ రిజర్వేషన్లలో న్యాయమైన వాటా దక్కడం లేదని, రిజర్వేషన్ల ఫలాలు అందుకోవడంలో ఎస్సీ కులాల్లో అసమానతలు పొడచూపడంతోనే వర్గీకరణ అంశం ఉద్యమ రూపానికి దారి తీసిందని అనేక మంది సామాజిక కార్యకర్తలు, మేథావులు పలుమార్లు స్పష్టం చేశారు.ఎస్సీల్లోని 59 ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలు జనాభా నిష్పత్తి ప్రకారం అందడం లేదని ఎస్సీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం 1965లో లాల్ బహదూర్‌శాస్త్రి ప్రభుత్వం నియమించిన లోకూర్ కమిషన్ నివేదించింది. ఇదే అంశంపై 1972 నుంచి మొదలుకుని ఉమ్మyì ఏపీలో మారిన ప్రతి సీఎంకు విజ్ఞప్తుల వెల్లువ మొదలైంది. ఎస్సీని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో న్యాయం చేయాలనే డిమాండ్‌తో 1994లో మొదలైన ఉద్యమం రాష్ట్రమంతటా విస్తరించింది. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994 జూలై 7న వర్గీకరణే ప్రధాన డిమాండ్‌గా సభ జరిపి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రిజర్వేషన్ వర్గీకరణ ఇలా..1996లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా ఏబీసీడీ వర్గీకరణ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 15% ఎస్సీ కోటాను విభజిస్తూ 1997 జూన్ 6న ఆనాటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ’ఏ’ గ్రూపులో రెల్లి, దాని అనుబంధ కులాలతో సహా మొత్తం 12 కులాలను అట్టడుగు స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించి ఒక శాతం కోటాను కేటాయించారు. ’బీ’ గ్రూపులో మాదిగ, దాని ఉప కులాలతో సహా మొత్తం 18 కులాలను చేరుస్తూ వారికి 7% కోటాను కేటాయించారు. ’సీ’లో మాల, దాని ఉప కులాలతో సహా మొత్తం 25 కులాలను చేరుస్తూ వారికి 6% కోటా ఇచ్చారు. ’డీ’లో ఆది ఆంధ్రులతో పాటు మొత్తం 4 కులాలను చేర్చి 1% కోటా నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.న్యాయస్థానం తలుపుతట్టిన ‘వర్గీకరణ’ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మాల మహానాడు కోర్టును ఆశ్రయించింది. ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధికి మించిందని, రాజ్యాంగ విరుద్ధమైందని ఏపీ హైకోర్టు ప్రకటించింది. ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారం, ఈ వర్గీకరణ చేయడానికి ముందు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను సంప్రదించాల్సి ఉందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఆ రిజర్వేషన్ వర్గీకరణ కాస్తా రద్ధైంది. దీనిపై తొలుత అభ్యంతరాలతో ముందుకొచ్చింది మాల మహానాడు . పీవీ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన మాల మహానాడు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది.మాదిగల వర్గీకరణ డిమాండ్‌పై మొట్ట మొదట మాలలు అభ్యంతరం చెప్పారు. సబ్–కేటగిరైజేషన్ సామాజిక వైషమ్యాలకు దారి తీస్తుందన్నారు. ఇది ప్రాంతీయ వ్యత్యాసమే తప్ప మాదిగలకు అన్యాయం ఏమీ జరగలేదనే వాదనను పీవీ రావు తెరమీదకు తెచ్చారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్సీల ఐక్యతను దెబ్బతీసే కుట్రతో సృష్టించిందే వర్గీకరణ ఉద్యమం అని ఆరోపించారు. అప్పట్లో రాష్ట్రంలో మాలలు ఎక్కువగా కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి, మాదిగల్ని తన వైపు తిప్పుకొనే వ్యూహంతోనే చంద్రబాబు వర్గీకరణ చిచ్చు పెట్టారనే విమర్శలు చేశారు. ‘చట్టాన్ని’ కొట్టేసిన సుప్రీంకోర్టుఎస్సీలను వర్గీకరిస్తూ 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అనే చట్టాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఆ చట్టంలో ఎస్సీలను ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరిస్తూ.. వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాలను నిర్ణయించారు. కాగా, 2004 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని కొట్టి వేసింది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్ వర్గీకరణ వంటివి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని ప్రకటించింది. దీంతో వర్గీకరణ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. 2000 నుంచి 2004 మధ్య దాదాపు ఐదేళ్లపాటు రిజర్వేషన్ల అమలుతో మాదిగలకు దాదాపు 22 వేల వరకు ఉద్యోగాలు వచ్చినట్టు అప్పట్లో మంద కృష్ణ ప్రకటించారు.రాజ్యాంగ సవరణ కోరిన వైఎస్సార్ఎస్సీ వర్గీకరణ వివాదం జటిలం కావడంతో దానికి సామరస్యంగా పరిష్కారం చూపే దిశగా దివంగత సీఎం వైఎస్సార్ గట్టి ప్రయత్నం చేశారు. వర్గీకరణ విషయంలో జాతీయ స్థాయిలో పరిష్కారం చూపేలా రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీనిపై స్పందించిన అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ.. ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేసింది. 2008 మే లో కేంద్ర మంత్రి మీరాకుమార్‌కు ఉషా మోహ్రా కమిషన్ నివేదికను సమర్పించింది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు సవరణ చేయాలని, ఆ ఆర్టికల్‌లో 3వ క్లాజును చేర్చడం ద్వారా, రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంట్ ఆమోదించవచ్చని ఈ కమిషన్ సిఫార్సు చేసింది. 2014 ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.అయితే దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నా, మరో ప్రధాన వర్గానికి చెందిన ఓటు బ్యాంకు దూరమవుతుందనే భావనతో పదేళ్లుగా దానికి పరిష్కారం చూపలేదు. ఇటీవల హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో మంద కృష్ణ నిర్వహించిన మాదిగ విశ్వరూప మహాసభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై కమిటీ వేసి న్యాయం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఐదుగురితో కమిటీ వేశారు. ఎస్సీ ఉప వర్గీకరణ.. పరిణామక్రమం» రాష్ట్రంలోని ఎస్సీ కులాల వర్గీకరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 1997లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రామచంద్ర రాజు నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయగా.. కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ఎస్సీ కులాలను వర్గీకరించాలని ప్రతిపాదించగా ఈ నివేదికను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. â ఎస్సీలను ఏ, బీ, సీ, డీ ఉప కులాలుగా వర్గీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎస్సీలకు ఉన్న మొత్తం 15% రిజర్వేషన్లలో ఏ ఉప కులానికి 1%, బీ ఉప కులానికి 7%, సీ ఉప కులానికి 6%, డీ ఉప కులానికి 1 % మేర రిజర్వేషన్లు కల్పించింది. » ఈ ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఆర్డినెన్స్‌పై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే, ఆర్డినెన్స్ స్థానంలో ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం 2000లో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కులాల (రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) చట్టం పేరుతో ఓ చట్టాన్ని తె చ్చింది. ఈ చట్టాన్ని కూడా హైకోర్టులో సవాలు చేశారు. ఈ చట్టంపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం తీసుకొ చ్చిన ఉప వర్గీకరణ చట్టాన్ని సమర్థించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు ధర్మాసనం చెప్పింది. ప్రభుత్వ చట్టంతో రాష్ట్రపతి ఉత్తర్వులకు వ చ్చిన నష్టం ఏమీ లేదంది. చట్టాలు చేయకుండా రాష్ట్రాలను రాష్ట్రపతి ఉత్తర్వులు నిరోధించజాలవంది. » ఈ తీర్పును సవాలు చేస్తూ డాక్టర్ ఈవీ చిన్నయ్య, మాల మహానాడులతో పాటు పలువురు 2000లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి 2004లో తీర్పునిస్తూ ఏపీ హైకోర్టు ధర్మాసనం తీర్పును తప్పుపట్టింది. â 2006లో పంజాబ్, హర్యానా హైకోర్టు ధర్మాసనం ఈ సర్క్యులర్‌ను రద్దు చేసింది. పంజాబ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో పంజాబ్ ప్రభుత్వం 2006లో పంజాబ్ రిజర్వేషన్ ఇన్ సర్వీసెస్ చట్టం తీసుకురాగా ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసన పంజాబ్ తీసుకొ చ్చిన చట్టాన్ని కొట్టేస్తూ 2010లో తీర్పుని చ్చింది. â పంజాబ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు అప్పీళ్లు దాఖలయ్యాయి. ఈ అప్పీళ్లపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. â జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 2020లో తీర్పునిస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి నివేదించింది. డాక్టర్ ఈవీ చిన్నయ్య కేసులో ఐదుగురు న్యాయమూర్తుల నేతృత్వంలోని ధర్మాసనమే తీర్పు చెప్పిందని, తమది కూడా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనమే కాబట్టి, చిన్నయ్య కేసులో తీర్పును తాము సమీక్షించజాలమంది. అయితే చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పును కూడా ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. » దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తన నేతృత్వంలో ఏడుగురు న్యాయమూర్తులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తూ పాలనాపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఉప వర్గీకరణపై ఈ రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి గురువారం తీర్పు వెలువరించింది.ఇది దోపిడీ, అణచివేతలకు సంబంధించిన అంశం కాదు. ఇది అణచి వేయబడ్డ సమూహంలోనే అసమానతలకు సంబంధించిన అంశం. దీనికి మూలాలు హిందూ వర్ణ వ్యవస్థలో, దానిలో ప్రధాన భాగమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలోనే ఉన్నాయి. – వర్గీకరణపై గతంలోమానవ హక్కుల కార్యకర్త బాలగోపాల్ -
Smita Sabharwal: ‘ఏఐఎస్‌కు దివ్యాంగులెందుకు?’
సాక్షి, హైదరాబాద్: ‘వైకల్యం కలిగిన పైలట్‌ను ఏదైనా విమానయాన సంస్థ ఉద్యోగంలో తీసుకుంటుందా? వైకల్యం కలిగిన శస్త్రచికిత్స నిపుణుడిపై మీరు నమ్మకం ఉంచుతారా? మరీ అత్యంత ప్రతిష్టాత్మకమైన అఖిల భారత సేవల (ఏఐఎస్) (ఐఏఎస్/ఐపీఎస్/ఐఎఫ్ఎస్ తదితర) ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల కోటా ఎందుకు?’అని సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ ‘ఎక్స్’వేదికగా ఆదివారం ప్రశ్నించారు. ఉద్యోగ స్వభావ రీత్యా అఖిలభారత సేవల అధికారులు క్షేత్రస్థాయిలో గంటల తరబడి పనిచేయాల్సి ఉంటుందని, ప్రజల విన్నపాలను నేరుగా వింటూ పనిచేయాల్సి ఉంటుందని, దీనికి శారీరక ఆరోగ్యం అవసరమని స్పష్టం చేశారు. స్మితా వ్యాఖ్యలు సరికాదు.. వైకల్యాలు శక్తిసామర్థ్యాలు, మేధోశక్తిపై ప్రభావం చూపవని సీనియ ర్ సుప్రీంకోర్టు న్యాయవాది కరుణ, బ్యూరోక్రాట్లు తమ సంకుచిత స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారని శివసేన ఎంపీ ప్రియాంక చతు ర్వేది విమర్శించారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సరికాదని ఆమె వారికి క్షమాపణ చెప్పాలని, వికలాంగుల కమిషన్ ఆమెపై కేసు నమోదు చేయాలని తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, తెలంగాణ వికలాంగుల సంఘాల జేఏసీ కనీ్వనర్ నారా నాగేశ్వరరావు ఆదివారం ప్రకటనలో వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. -
బంగ్లాదేశ్‌లో కోటా కట్
ఢాకా: బంగ్లాదేశ్‌ను అగ్నిగుండంగా మార్చిన రిజర్వేషన్ల వివాదానికి ముగింపు పలికే దిశగా సుప్రీంకోర్టు ఆదివారం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. 1971లో బంగ్లా విముక్తి ఉద్యమంలో పాల్గొన్నవారి వారసులకు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇప్పటిదాకా కలి్పస్తున్న 30 శాతం కోటాలో భారీగా కోత విధించింది. కేవలం 5 శాతానికి పరిమితం చేసింది. వెనుకబడిన జిల్లాల ప్రజలకు, మహిళలకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు అమల్లో ఉండగా, న్యాయస్థానం వాటిని రద్దు చేసింది. గిరిజనులు/మైనార్టీలకు కల్పిస్తున్న 5 శాతం రిజర్వేషన్లను ఒక శాతానికి తగ్గించింది. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు అమల్లో ఉన్న ఒక శాతం రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు చేయలేదు. మొత్తంగా 56 శాతం ఉన్న కోటాను ఏకంగా 7 శాతానికి కుదించడం గమనార్హం. 93 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను కేవలం ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేసి, ప్రతిభావంతులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా తీవ్రంగా పోరాడుతున్న విద్యార్థులకు పాక్షిక విజయమే దక్కినట్లయ్యింది. రిజర్వేషన్లకు షేక్ హసీనా అనుకూలం ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అధికారంలో ఉన్న అవామీ లీగ్ పార్టీ బంగ్లా విముక్తి ఉద్యమానికి సారథ్యం వహించింది. సహజంగానే ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానంతో లబ్ధి చేకూరుతోంది. ఈ రిజర్వేషన్లను ప్రధానమంత్రి షేక్ హసీనా పరోక్షంగా సమరి్థస్తున్నారు. సొంతదేశం కోసం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో త్యాగాలు చేసిన సమరయోధుల కుటుంబాలకు సమున్నత గౌరవం ఇవ్వాలని ఆమె వాదిస్తున్నారు. అయితే, ఇది పూర్తిగా వివక్షతో కూడిన విధానమని విద్యార్థులు మండిపడుతున్నారు. రిజర్వేషన్లు పూర్తిగా పక్కనపెట్టి, కేవలం ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపట్టాలని పట్టుబడుతున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు క్రమంగా తగ్గిపోతుండడం, అందుబాటులో ఉన్న కొద్దిపాటి ఉద్యోగాలు రిజర్వేషన్ల పేరిట కొన్ని కుటుంబాలకే దక్కుతుండడం, తమకు అన్యాయం జరుగుతుండడంతో విద్యార్థుల్లో అసహనం మొదలైంది. అదే చివరకు రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటంగా మారింది. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్టు పారీ్ట(బీఎన్పీ) సైతం విద్యార్థులకు అండగా నిలిచింది. ఎందుకీ ఆందోళనలు? 1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఆస్తులు పోగొట్టుకున్నారు. ప్రాణత్యాగాలు సైతం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రిజర్వేషన్ల విధానం తీసుకొచి్చంది. విముక్తి ఉద్యమంలో భాగస్వాములైన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కలి్పంచింది. 2018లో ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా అలజడి సృష్టించారు. దాంతో అప్పటి ప్రభుత్వం దిగివచి్చంది. రిజర్వేషన్లను నిలిపివేసింది. స్వాతంత్య్ర సమరయోధుల బంధువుల విజ్ఞప్తి మేరకు రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ ఈ ఏడాది జూన్‌లో బంగా>్లదేశ్ హైకోర్టు తీర్పు ప్రకటించడంతో విద్యార్థులు మళ్లీ భగ్గుమన్నారు. రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలంటూ పోరుబాట పట్టారు. వీధుల్లోకి వచ్చి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వంలో కలవరం మొదలైంది. ఘర్షణల్లో విద్యార్థులు మరణిస్తుండడం, శాంతి భద్రతలు అదుపు తప్పుతుండడంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిజర్వేషన్లపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయకుండా, అన్ని రకాల రిజర్వేషన్లను 7 శాతానికి పరిమితం చేస్తూ తీర్పు వెల్లడించింది. ఇందులో 5 శాతం బంగ్లా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు, 2 శాతం ఇతరులకు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆందోళనలు ఆపేదిలేదన్న విద్యార్థులు తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకూ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నేతలు తేలి్చచెప్పారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, హింసకు కారణమైన అధికారులను సస్పెండ్ చేయా లని వారు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత బంగ్లాదేశ్‌లో పరిస్థితి కొంత అదుపులోకి వచి్చంది. కర్ఫ్యూ నిబంధనలను ఇంకా సడలించలేదు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించలేదు. ఈ ఘటనలో మృతిచెందినవారు 150కి చేరినట్లు సమాచారం. ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లు (శాతాల్లో) గతంలో ఇప్పుడు సమరయోధుల కుటుంబాలకు 30 5 వెనుకబడిన జిల్లాల ప్రజలకు 10 – మహిళలకు 10 – గిరిజనులు/మైనారీ్టలకు 5 1 దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు 1 1 -
కన్నడనాట స్థానిక రగడ!
సాక్షి బెంగళూరు: కర్నాటకలో మరోసారి స్థానిక, స్థానికేతర రగడ రాజుకుంది. రాష్ట్రంలో ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా స్థానికులకే ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమైంది. రాష్ట్రంలోని పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇతర ప్రైవేటు సంస్థలన్నింట్లోనూ కన్నడిగులకు రిజర్వేషన్ కలి్పంచాలని ప్రభుత్వం తీర్మానించింది. ప్రైవేట్ రంగంలో మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 50 శాతం, నాన్ మేనేజ్మెంట్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన ఉద్యోగ బిల్లు–2024కు కేబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే రూ 25 వేల దాకా జరిమానా కూడా విధిస్తారు. అంతేగాక గ్రూప్ సి, డి తరహా చిరుద్యోగాల్లో ప్రైవేట్ కంపెనీలు విధిగా నూటికి నూరు శాతం స్థానికులనే తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు చట్టం చేసేందుకు వీలుగా ఒకట్రెండు రోజుల్లో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. కానీ ఐటీ తదితర పరిశ్రమలు, ప్రైవేటు రంగ సంస్థల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ప్రస్తుతానికి దీనిపై వెనకడుగు వేసింది. బిల్లును పక్కన పెడుతున్నామని, మరింత అధ్యయనం చేస్తామని సీఎం కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఇదీ నేపథ్యం... కర్నాటకవ్యాప్తంగా ప్రైవేటు ఉద్యోగాల్లో ఉత్తరాది వారికే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయంటూ కొన్నాళ్లుగా కర్నాటకలో ఆందోళనలు జరుగుతున్నాయి. స్థానిక వనరులు, మౌలిక వసతులు ఉపయోగించుకుంటున్న ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు అందుకు తగ్గట్టుగా స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉద్యోగాల బిల్లుకు రూపకల్పన చేసింది. 100 % స్థానికులకేనంటూ సిద్ధు పోస్టుబిల్లుకు మంత్రివర్గ ఆమోదం అనంతరం మంగళవారం సీఎం సిద్ధరామయ్య ఎక్స్‌లో పెట్టిన పోస్టు వివాదానికి దారితీసింది. ‘‘మాది కన్నడ ప్రభుత్వం. కన్నడిగుల భద్రత, సంక్షేమానికి పాటుపడటమే మా బాధ్యత. కానీ కన్నడిగులు కన్నడనాడులోనే ఉద్యోగాలు పొందడంలో వెనకబడుతున్నారు. దీన్ని నివారించేందుకు ఈ బిల్లు ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. ఇకపై రాష్ట్రంలో అన్ని ప్రైవేటు రంగ పరిశ్రమలు, కర్మాగారాల్లో గ్రూప్ సి, డి ఉద్యోగాలు వంద శాతం కన్నడిగులకే ఇవ్వాల్సిందే’’ అని పోస్టులో సిద్ధు పేర్కొన్నారు. తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు.తీవ్ర వ్యతిరేకతసిద్ధు సర్కారు నిర్ణయాన్ని కర్ణాటకలోని ప్రైవేటు రంగ సంస్థలు, పరిశ్రమలు ము ఖ్యంగా ఐటీ తదితర కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పారిశ్రామిక దిగ్గజం, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా దీనిపై తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. టెక్ కంపెనీలకు స్థానికత కంటే ప్రతిభే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ బిల్లుతో కంపెనీలు కర్నాటకకు రావాలంటే భయపడే పరిస్థితి తలెత్తుతుందని సాఫ్ట్వేర్ పరిశ్రమల జాతీయ సంఘం నాస్కామ్ విమర్శించింది. దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇది వివక్షా పూరితమైన బిల్లంటూ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ విమర్శించారు. ‘‘ఇది రాజ్యాంగవిరుద్ధం. టెక్ రంగానికి గొడ్డలిపెట్టు వంటి ఈ ఫాసిస్టు బిల్లును వెంటనే వెనక్కు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. అసోచామ్ కర్నాటక సహధ్యక్షుడు ఆర్కే మిశ్రా తదితరులు కూడా ఇది దూరదృష్టి లేని బిల్లంటూ తీవ్రంగా తప్పుబట్టారు. విపక్ష బీజేపీ కూడా బిల్లును తీవ్రంగా తప్పుబట్టింది. కర్నాటకలో కన్నడిగుల స్వాభిమానాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కన్నడ నేమ్ప్లేట్లు, కన్నడ ధ్వజం, భాష, సంస్కృతి, పరంపర విషయంలో వెనుకంజ ఉండదు. రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్ కలి్పస్తూ బిల్లు తేవడం అందులో భాగమే– బిల్లును తాత్కాలికంగా పక్కన పెట్టిన అనంతరం కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు -
అగ్నివీర్లకు పోలీస్, మైనింగ్ గార్డు ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి సంబంధించి హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పదవికాలం ముగిసిన అగ్నివీర్లకు (హర్యానాకు చెందిన వారు) పోలీసు, మైనింగ్ గార్డు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తన్నట్లు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ బుధవారం ప్రకటించారు. అగ్నివీర్ పథకంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని సీఎం మండిపడ్డారు. నైపుణ్యం కలిగిన యువతకు ఇది మంచి అవకాశమని ప్రధాని నరేంద్ర మోదీనే పేర్కొన్నారని చెప్పారు. కాగా హర్యానాలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. కాగా అగ్నిపథ్ పథకంపై కేంద్రం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొన్న సంగతి తెలిసిందే.అగ్నిపథ్ పథకాన్ని కేంద్రంలోని మోదీ సర్కార్ 2022 సెప్టెంబర్ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా త్రివిధ దళాల్లో ఆఫీసర్ల కంటే దిగువ స్థాయి సైనికుల నియామకాలు జరుపుతారు. సైనిక బలగాల్లోకి నియమాకాలు జరిపే ఏకైక పద్ధతి ఇదే. ఈ పథకం ద్వారా నియమితులైనవారిని అగ్నివీరులు అంటారు. వీరి ఉద్యోగ కాలం 4 సంవత్సరాలు. ఈ పథకంలో పాత విధానంలో ఉన్న దీర్ఘకాలిక పదవీకాలం, పెన్షన్ వంటి ఇతర ప్రయోజనాలు ఉండవు.ఈ పథకంపై దేశంలో నిరసనలూ చెలరేగాయి. దేశం లోని పలు ప్రాంతాల్లో ఈ నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. కొత్త పథకంతో కోపంగా ఉన్న ఆర్మీ ఆశావహులు దీనిని వెనక్కి తీసుకోవాలని పిలుపునిచ్చారు. బస్సులు, రైళ్లతో సహా ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు ఈ పథకాన్ని విమర్శిస్తూ దానిలోని లోపాలను ఎత్తిచూపాయి. ఈ పథకాన్ని ప్రస్తుతానికి నిలిపివేసి, పార్లమెంటులో చర్చించేవరకు ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరాయి. -
‘100 శాతం ఉద్యోగాలు కన్నడిగులకే’.. పోస్టు డిలీట్ చేసిన సీఎం
ప్రైవేటు రంగంలో స్థానికులకు రిజర్వేషన్ తప్పనిసారి చేస్తూ కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం కొత్త బిల్లును ఆమోదించింది. అయితే కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ఆయన ట్వీట్ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పరిశ్రమల్లోని గ్రూప్ సీ, డీ గ్రేడ్ ఉద్యోగాల్లో వంద శాతం కన్నడిగుల నియామకాన్ని తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లును రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించిందని సీఎం పేర్కొన్నారు.కన్నడిగులు తమ రాష్ట్రంలో సంతోషంగా జీవించేందుకు అవకాశం కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్ధేశ్యమని సీఎం పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగానికి వారు దూరం కాకూడదని తెలిపారు. కన్నడిగుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. అయితే పోస్టుపై అనేక విమర్శలు వెల్లువెత్తడంతో.. తరువాత ఆయన దానిని డిలీట్ చేశారు. అనంతరం మళ్లీ సరిచేసి ట్వీట్ చేశారు.ರಾಜ್ಯದ ಖಾಸಗಿ ಕೈಗಾರಿಕೆಗಳು ಹಾಗೂ ಇತರೆ ಸಂಸ್ಥೆಗಳಲ್ಲಿ ಕನ್ನಡಿಗರಿಗೆ ಆಡಳಿತಾತ್ಮಕ ಹುದ್ದೆಗಳಿಗೆ ಶೇ.50 ಹಾಗೂ ಆಡಳಿತಾತ್ಮಕವಲ್ಲದ ಹುದ್ದೆಗಳಿಗೆ ಶೇ.75 ಮೀಸಲಾತಿ ನಿಗದಿಪಡಿಸುವ ವಿಧೇಯಕಕ್ಕೆ ಸೋಮವಾರ ನಡೆದ ಸಚಿವ ಸಂಪುಟ ಸಭೆಯು ಒಪ್ಪಿಗೆ ನೀಡಿದೆ.ಕನ್ನಡಿಗರು ಕನ್ನಡದ ನೆಲದಲ್ಲಿ ಉದ್ಯೋಗ ವಂಚಿತರಾಗುವುದನ್ನು ತಪ್ಪಿಸಿ, ತಾಯ್ನಾಡಿನಲ್ಲಿ… pic.twitter.com/Rz6a0vNCBz— Siddaramaiah (@siddaramaiah) July 17, 2024 తాజాగా దీనిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీల్లోని నాన్ మెనేజ్మెంట్ ఉద్యోగాల్లో స్థానికులకు (కన్నడిగులకు) 70 శాతం.. మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 50 శాతం స్థానికులకు రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ లాడ్ పేర్కొన్నారు. అయితే బిల్లులో గ్రూప్ సీ, డీ పోస్టుల్లో మొత్తం 100 శాతం స్థానికులకే కేటాయిస్తున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు.అదే విధంగా ఉద్యోగానికి అర్హతలు, నైపుణ్యం ఉన్న స్థానికులు లేకపోతే.. కంపెనీలు.. ఇతర రాష్ట్రాల వారిని నియమించుకోవచ్చిని పేర్కొన్నారు. ‘ఉద్యోగానికి తగిన నైపుణ్యాలు కలిగిన కన్నడిగులలో లేకపోతే వాటిని అవుట్సోర్సింగ్ ఇవ్వవచ్చు. నైపుణ్యం కలిగిన కార్మికులలను వెలికి తీసీ..స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చే చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ప్రతిభకు కొదవలేదని మంత్రి వెల్లడించారు. "కర్ణాటకలో తగినంత నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ ఉందని.. చాలా ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయన్నారు. కన్నడిగులకు 70 శాతం పని ఇవ్వాలని తాము కంపెనీలను అడుగుతున్నామని ఒకవేళ ఇక్కడ తగిన ప్రతిభ లేకపోతే బయట నుంచి తీసుకోవచ్చని అన్నారు.అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు పారిశ్రామిక వేత్తలు తప్పుబడుతున్నారు. ఈ బిల్లు వల్ల అనేకమంది ప్రతిభ, నైపుణ్యం కలిగిన కార్మికులు అందుబాటులో ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. కర్ణాటకలో ఐటీ సహా ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కర్మాగారాల్లో ఇక ఇతర రాష్ట్రాలవారికి ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.ఈ బిల్లు వివక్షాపూరితమైనది, తిరోగమనపూరితమైనది, ఫాసిస్ట్ బిల్లు అంటూ మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఛైర్మన్ మోహన్‌దాస్ పాయ్ ఎక్స్‌లో అన్నారు. మరోవైపు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తూనే.. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం మంచిదే అని, కానీ నైపుణ్యం ఉన్న వారిని ఇతరులను ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఎవరు స్థానికులు?కర్ణాటకలో జన్మించినవారు.. 15 ఏళ్లుగా ఆ రాష్ట్రంలోనే నివసిస్తున్నవారు.. కన్నడ భాషలో మాట్లాడే, చదివే, రాసే నైపుణ్యం ఉండి.. రాష్ట్ర నోడల్ ఏజెన్సీ నిర్వహించే అర్హత పరీక్షలో నెగ్గినవారిని స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. కన్నడం ఓ భాషగా ఉన్న ఎస్‌ఎ్‌ససీ సర్టిఫికెట్‌ను ఉద్యోగార్థులు కలిగి ఉండాలి. లేదంటే ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ నిర్వహించే కన్నడ ప్రావీణ్య పరీక్షలో పాసవ్వాలి. అర్హతలున్న స్థానిక అభ్యర్థులు దొరక్కపోతే.. చట్ట నిబంధనల సడలింపునకు ప్రైవేటు పరిశ్రమలు, సంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. తగు విచారణ తర్వాత ప్రభుత్వం సముచిత ఉత్తర్వులు జారీచేస్తుంది. -
ప్రైవేట్ సంస్థల్లో వారికి 100 శాతం రిజర్వేషన్లు..కర్ణాటక కేబినెట్ గ్రీన్ సిగ్నల్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సంస్థల్లో గ్రూప్ సీ,గ్రూప్ డీ పోస్టుల్లో కన్నడిగులకు (కన్నడ ప్రజలు) 100 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన బిల్లును కేబినెట్ ఆమోదం తెలిపింది.సోమవారం (జులై 15)న జరిగిన కేబినెట్ సమావేశంలో కన్నడిగులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చ జరిగింది. ఆ భేటీ తర్వాత రిజర్వేషన్ బిల్లుపై కేబినెట్ సభ్యులు ఆమోదం తెలిపారు’ అని సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ರಾಜ್ಯದ ಎಲ್ಲಾ ಖಾಸಗಿ ಕೈಗಾರಿಕೆಗಳಲ್ಲಿ "ಸಿ ಮತ್ತು ಡಿ" ದರ್ಜೆಯ ಹುದ್ದೆಗಳಿಗೆ ನೂರಕ್ಕೆ ನೂರರಷ್ಟು ಕನ್ನಡಿಗರ ನೇಮಕಾತಿಯನ್ನು ಕಡ್ಡಾಯಗೊಳಿಸುವ ವಿಧೇಯಕಕ್ಕೆ ನಿನ್ನೆ ನಡೆದ ಸಚಿವ ಸಂಪುಟ ಸಭೆಯು ಒಪ್ಪಿಗೆ ನೀಡಿದೆ.ಕನ್ನಡಿಗರು ಕನ್ನಡದ ನೆಲದಲ್ಲಿ ಉದ್ಯೋಗ ವಂಚಿತರಾಗುವುದನ್ನು ತಪ್ಪಿಸಿ, ತಾಯ್ನಾಡಿನಲ್ಲಿ ನೆಮ್ಮದಿಯ ಬದುಕು ಕಟ್ಟಿಕೊಳ್ಳಲು… pic.twitter.com/UwvsJtrT2q— Siddaramaiah (@siddaramaiah) July 16, 2024తమ ప్రభుత్వం కన్నడ ప్రజలు సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం కల్పించాలని, వారికి అన్నీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు. తమది కన్నడ అనుకూల ప్రభుత్వమని, కన్నడిగుల సంక్షేమమే మా ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి అన్నారు.ఈ బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. -
మరాఠా కోటా.. ‘జూలై 20 నుంచి మళ్లీ నిరాహారదీక్ష చేపడతా’
ముంబై: మరాఠా రిజర్వేషన్ సమస్యకు రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, మంత్రి ఛగన్ భుజ్‌బల్ ఒత్తిడి కారణంగా పరిష్కారం లభించటం లేదని మరాఠా ఉద్యమ నాయకుడు మనోజ్ జరాంగే పాటిల్ ఆరోపణలు చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘ప్రభుత్వం మారాఠా రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వటంలేదు. మేము పెట్టిన డెడ్‌లైన్ జూలై 13 కూడా దాటిపోయింది. మరాఠా రిజర్వేషన్లకు పరిష్కారం లభించకుండా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, మరో మంత్రి ఛగన్ భుజ్‌బల్ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రి, మారాఠా సబ్ కోటా కమిటీ మెంబర్ శంభూరాజ్ దేశాయ్ మమ్మల్ని సంప్రదించటం లేదు. మాకు ఆయనపై పూర్తి నమ్మకం ఉంది. కానీ, ఇప్పటికి ఆయన మమ్మల్ని సంప్రదించలేదు. ఆయనపై కూడా మారాఠా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసే కార్యకర్తలను కలవకూడదని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. మారాఠా రిజర్వేషన్ల కార్యకర్తలము జూలై 20న సమావేశం అవుతాము. తదుపరి కార్యచరణపై నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వం నుంచి స్పష్టత వెలువడకపోతే వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 మంది కార్యకర్తలు పోటీ చేస్తాం లేదా ముంబై పెద్ద ఎత్తును నిరసన మార్చ్ చేపడతాం. మా హక్కులను సాధించుకోవడానికి మేము ముంబై వెళ్తాం. శాంతియూతంగా నిరసన తెలపటం మాకు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు’’ అని అన్నారు.మరోవైపు.. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే జూలై 20 నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపడతామని మనోజ్ జరాంగే పాటిల్ శనివారం ప్రకటించారు. ఫిబ్రవరిలో మరాఠా రిజర్వేషన్ బిల్లకు మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మరాఠా సామాజికవర్గానికి విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏక్నాథ్ షిండే ప్రభుత్వం అసెంబ్లీలో సంబంధిత బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసింది. సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించే బిల్లు-2024 అమలులోకి వస్తే.. దశాబ్దం తర్వాత సమీక్షించబడుతుంది. -
PM Narendra Modi: ‘ఇండియా’ కూటమి గెలిస్తే... హిందువులు రెండో తరగతి పౌరులే..
మీర్జాపూర్/దేవరియా: దేశంలో మతపరంగా మెజార్టీగా ఉన్న ప్రజలను(హిందువులు) రెండో తరగతి పౌరులుగా మార్చేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని పారీ్టలు కుట్ర పన్నుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఓటు బ్యాంక్‌కు మతపరంగా రిజర్వేషన్లు కట్టబెట్టడమే లక్ష్యంగా రాజ్యాంగాన్ని మార్చేందుకు పథకం రచిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్, ఘోసీ, దేవరియాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రతిపక్షాలు దేశంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయని మండిపడ్డారు. వేర్వేరు కులాలు పరస్పరం కొట్టుకొనేలా చేయడమే ఇండియా కూటమి ధ్యేయంగా మారిపోయిందన్నారు. కులాలను బలహీనపర్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. బహిరంగ సభల్లో మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. రాజ్యాంగాన్ని మళ్లీ రాస్తారు.. ‘‘ప్రతిపక్షాలు సాగిస్తున్న కుట్రల గురించి ప్రజలను హెచ్చరించడానికే ఈ రోజు పూర్వాంచల్‌కు వచ్చా. విపక్ష కూటమికి అధికారం కట్టబెడితే మొదట రాజ్యాంగాన్ని మార్చేస్తారు. మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలుగా రాజ్యాంగాన్ని మళ్లీ రాస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారు. మొత్తం రిజర్వేషన్లు ముస్లింలకే కట్టబెడతారు. ముస్లింలను రాత్రికి రాత్రే ఓబీసీ కేటగిరీలో చేరుస్తారు. ఓబీసీ కేటగిరీ కింద వారికి రిజర్వేషన్లు కలి్పస్తారు. మెజార్టీ ప్రజలను రెండో తరగతి పౌరులుగా మార్చేయాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలు భావిస్తున్నాయి. ఇంతకంటే అన్యాయం ఉంటుందా? 2014 కంటే ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి రాత్రే చట్టాన్ని మార్చేసింది. పలు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను మైనార్టీ విద్యాసంస్థలుగా గుర్తించింది. దాంతో ఆయా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు దక్కడం లేదు. అక్కడ కేవలం ముస్లింలకే ప్రవేశాలు లభిస్తున్నాయి. గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతుల బిడ్డలకు ఇంతకంటే అన్యాయం ఇంకేదైనా ఉంటుందా? మాడోసారీ మాదే విజయం ఒక మంచి ఇల్లు కట్టించాలంటే 10 మంది తాపీ మేస్త్రీలను నియమించుకుంటారా? అలా ఎవరూ చేయరు. ఒక్కరికే అప్పగిస్తారు. విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు వస్తారట! ఏడాదికొకరు అధికారంలో ఉంటారట! ఇదెక్కడి చోద్యం. ఇలా జరగడం ఏక్కడైనా ఉందా? పదవి కాపాడుకోవడానికి ఆరాటపడే ప్రధానమంత్రి ఇక ప్రజలకేం చేస్తారు. దేశాన్ని బలోపేతం చేయగలరా? బలమైన దేశం కోసం బలమైన ప్రధాని కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. మాకు రెండుసార్లు అధికారం అప్పగించారు. మూడోసారి కూడా మమ్మల్ని గెలిపించబోతున్నారు. ఓడిపోయేవారికి ఓటు వేసి ఓటు వృథా చేసుకోవద్దని ప్రజలు నిర్ణయానికొచ్చారు’’ అని మోదీ స్పష్టం చేశారు. ఛాయ్ కప్పులు కడుగుతూ... బాల్యంలో ఛాయ్ కప్పులు, ప్లేట్లు కడుగుతూ, కస్టమర్లకు ఛాయ్‌లు అందిస్తూ పెరిగానని ప్రధాని మోదీ అన్నారు. ఛాయ్‌కి, తనకు మధ్య లోతైన అనుబంధం ఉందని చెప్పారు. -
జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు !
సాక్షి, హైదరాబాద్: జిల్లా జడ్జి పోస్టుల నియా మకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. 9 జిల్లా జడ్డి పోస్టు (ఎంట్రీ లెవల్)లను వర్టికల్ పద్ధతిలో నియమించేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వగా, పూర్తిస్థాయి(డిటెయిల్డ్) నోటిఫికేషన్ ఈనెల 14వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచ నున్నట్టు అధికారులు వెల్లడించారు.ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 9 ఉద్యో గాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లను ప్రకటించింది. అయితే ఈ రోస్టర్ వర్టికల్ రిజర్వేషన్ల పద్ధతిలో ఉండడం గమనార్హం. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా జిల్లాజడ్జి పోస్టుల భర్తీలో వర్టికల్ రిజర్వేషన్ విధానం ఉండడంతో అయోమయం నెలకొంది.జిల్లా జడ్జి పోస్టుల భర్తీలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనున్నట్టు అందులో వివరించారు. మే 13వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ పూర్తవుతుందని, ఈ ఏడాది ఆగస్టు 24, 25 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రాథమికంగా ప్రకటించారు. అయితే 9 జిల్లా జడ్జి పోస్టుల్లో మహిళలకు నాలుగు పోస్టులు రిజర్వు చేసింది. ఖాళీ పోస్టులు, రోస్టర్ పాయింట్ల వారీగా ఎలా ఉంటుందో ప్రభుత్వం వెల్లడించింది. -
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ ఆసిఫాబాద్: మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని.. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే, మతపరమైన (ముస్లిం) రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆ స్థానంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను పెంచుతామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ ఉన్నంతకాలం దేశంలో ఎవరూ రిజర్వేషన్లను తొలగించకుండా చూస్తామని.. ఇది మోదీ గ్యారెంటీ అని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ఆర్ఆర్ (రాహుల్‌గాం«దీ, రేవంత్‌రెడ్డి) టాక్స్ వసూలు చేసి దేశవ్యాప్తంగా ఎన్నికల కోసం ఖర్చు చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను కాంగ్రెస్‌కు ఏటీఎంగా మార్చేశారని విమర్శించారు. బీజేపీని అత్యధిక ఎంపీ సీట్లలో గెలిపిస్తే ఆ ఏటీఎంలో డబ్బుల్లేకుండా చూసుకుంటామని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి.. వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కలి్పస్తామని నేను ఇటీవల ఓ సభలో చెప్పాను. ఆ వీడియోను ఎడిట్ చేసి మోదీ రిజర్వేషన్లు తొలగిస్తారని అన్నట్టుగా ప్రజల్లో దు్రష్పచారం చేశారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రిజర్వేషన్లు తొలగించలేదు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10శాతం రిజర్వేషన్లతో విద్యా, ఉద్యోగ అవకాశాలు కలి్పంచింది. మోదీ ఆరి్టకల్ 370ను రద్దు చేశారు, ట్రిపుల్ తలాక్ రద్దు చేశారు. రామమందిర నిర్మాణం చేశారు. ఆర్టికల్ 370ను రద్దుచేస్తే కశీ్మర్లో రక్తపుటేరులు పారుతాయని రాహుల్‌గాంధీ అడ్డుపడే ప్రయత్నం చేశారు. అది చేసి ఐదేళ్లు గడిచిపోయాయి రక్తపుటేరులు కాదు.. కనీసం రాళ్ల దాడి చేసే ధైర్యం కూడా ఎవరూ చేయలేకపోయారు. పుల్వామా ఘటన జరిగిన 10 రోజుల్లోనే.. పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి, ఉగ్రవాదులను మట్టుపెట్టిన ఘనత మోదీ ప్రభుత్వానిది. వారివి ఓటు బ్యాంకు రాజకీయాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పారీ్టలు సంతుïÙ్టకరణ రాజకీయాలకు పెట్టింది పేరు. ఏ అంటే అసదుద్దీన్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్.. ఈ మూడు పారీ్టలు ఓటుబ్యాంకు కోసం రామనవమి యాత్రకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టాయి. బీజేపీ గెలిస్తే.. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. కేంద్రంలో 70 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. అయోధ్య సమస్యను పరిష్కరించలేదు. మోదీ ఐదేళ్లలో పరిష్కరించి, రామమందిర నిర్మాణం పూర్తి చేశారు. రామాలయ ప్రారం¿ోత్సవానికి ఆహ్వానించినా.. ఒకవర్గం ఓట్ల కోసమే రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గే అయోధ్యకు రాలేదు. ఇండియా కూటమికి నాయకత్వమేది? ఇప్పుడు ఎన్నికల్లో ఒకవైపు ఎన్డీఏ, మరోవైపు ఇండియా కూటమి ఉన్నాయి. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రూ.12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీ కావాలా? 23 ఏళ్లు సీఎం, పీఎంగా ఉన్నా ఒక్క అవినీతి మరకలేని మోదీ కావాలా? ప్రజలు తేల్చుకోవాలి. దీపావళి నాడు కూడా సెలవు లేకుండా దేశ సైనికులతో కలసి పండుగ జరుపుకునే మోదీ ఓవైపు ఉంటే.. నోట్లో బంగారు స్పూన్‌తో పుట్టి, ఎండ పెరగగానే బ్యాంకాక్, థాయ్‌లాండ్‌కు చెక్కేసే రాహుల్ గాంధీ మరోవైపు ఉన్నారు.. ఎవరు కావాలి? ఒకవేళ ఇండియా కూటమి గెలిస్తే.. ప్రధాన మంత్రి ఎవరు? అంటే ఒక్కొక్కరు ఒక్కో ఏడాది ఉంటారని అంటున్నారు. అలాంటి ఇండియా కూటమి భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారి ఏదైనా వస్తే కాపాడగలదా? ఆ మోదీకే ఉంది. యావత్ భారతానికి ఉచితంగా, వేగంగా వ్యాక్సినేషన్ చేయించారు. ఆ ముందు చూపుతోనే మనమంతా బతికిపోయాం. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో చేసింది తెలంగాణలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టింది. అన్నిరకాలుగా ఆదుకుంటోంది. ఇక్కడి ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ మోదీ ప్రభుత్వమే సంపూర్ణంగా నిధులిచి్చంది. పసుపు బోర్డు ఇచి్చంది. 5 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు, రూ.20వేల కోట్లతో రీజనల్ రింగ్‌రోడ్డు, రూ.1,100 కోట్లతో ఎంఎంటీఎస్ మంజూరు చేశాం. పీఎంజీఎస్‌వై కింద రూ.6 వేల కోట్లు ఇచ్చాం. బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటు, హసన్–చర్లపల్లి ఎల్పీజీ గ్యాస్ పైప్‌లైన్, రూ.2 వేల కోట్లతో కృష్ణపట్నం–హైదరాబాద్ పెట్రోల్ పైప్‌లైన్, రూ.1,300 కోట్లతో రామగుండం ఎరువుల ఫాక్టరీ పునఃప్రారంభం వంటి చేపట్టాం. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ నుంచి నాలుగు వందే భారత్ రైళ్లు ప్రారంభించాం. అవినీతిమయ కాంగ్రెస్‌ను తరిమికొట్టేందుకు, దేశవ్యాప్తంగా బీజేపీకి 400 సీట్లతో మోదీని మూడోసారి ప్రధాని చేసేందుకు అందరూ ముందుకురావాలి. తెలంగాణలో 12 సీట్లలో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా మారుస్తాం..’’ అని అమిత్ షా పేర్కొన్నారు. నిజామాబాద్‌లోనే పసుపు బోర్డు.. షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తాం.. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేస్తాం. ఎంపీ అరి్వంద్ వెంటపడి మరీ పసుపు బోర్డు ఏర్పాటును సాధించుకున్నారు. మరోసారి అరి్వంద్‌ను గెలిపిస్తే మరిన్ని ప్రయోజనాలు చేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల కారణంగానే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మేం వాటిని రైతుల భాగస్వామ్యంతో సహకార పద్ధతిలో తెరిపిస్తాం. బీడీ కారి్మకుల కోసం నిజామాబాద్‌లో ప్రత్యేక ఆస్పత్రి నిర్మిస్తాం.రిజర్వేషన్లపై సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం: కె.లక్ష్మణ్ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు, ప్రచారాన్ని తిప్పికొట్టడం ద్వారా బీజేపీ దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవబోతోందని చెప్పారు.మోదీ మళ్లీ ప్రధాని కావాలి: ఈటల రాజేందర్ దేశం సుభిక్షంగా ఉండాలంటే.. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయాలని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమంతా వట్టి బూటకమన్నారు. -
చంద్రబాబు పచ్చి మోసగాడు..
సాక్షి, హైదరాబాద్: ‘తెలుగుదేశం అధినేత చంద్రబాబు పచ్చి మోసగాడు.. రాజకీయ లబ్ధికోసం యూటర్న్ తీసుకోవడంలో మొనగాడు. 1994లో నేను ఎమ్యెల్యేగా పనిచేసినప్పటి నుంచి చూస్తున్నా.. స్థిరత్వంలేని ఆయన పదవి కోసం ఎంతకైనా బరితెగిస్తాడు. అప్పట్లో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఎలా మోసం చేశాడో చూశా. అతనికి పదవులే ముఖ్యం. అభివృద్ధి, ప్రజల సంక్షేమం చంద్రబాబుకు అస్సలు పట్టదు’.. అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. ‘సాక్షి’తో శనివారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..అధికారమే బాబు లక్ష్యం..చంద్రబాబు కేవలం అధికారం చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తాడు. రాజకీయ లబ్ధికోసం 1996లో వాజ్‌పేయితో జతకట్టాడు. ఆ తర్వాత బయటకొచ్చాడు. 2014లో మోదీతో కలిసి పనిచేశాడు. మళ్లీ విడిపోయాడు. మోదీని అనరాని మాటలు అన్నాడు. ఇది అందరికీ తెలుసు.. మళ్లీ మోదీతో కలిసి పనిచేస్తున్నాడు. కానీ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అలా కాదు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తుంటాడు. దివంగత నేత వైఎస్సార్ ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లను జగన్ అమలుచేస్తున్నారు. తిరిగి అధికారంలోకొచ్చి వాటిని కొనసాగించడం ఖాయం. జగన్ అంటే ఒక విశ్వాసం. అదే చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వగలడు? ముస్లిం రిజరేషన్లపై చిత్తశుద్ధి ఉంటే.. మోదీ, అమిత్ షాతో చెప్పించగలడా? అతను మోదీ చేతిలో కీలుబొమ్మ. చంద్రబాబును నమ్మలేం. కాబట్టి భవిష్యత్తులో ముస్లిం రిజర్వేషన్లకు ముప్పు కలగకుండా చంద్రబాబు, ఆయన కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పాలి. మరోవైపు.. ప్రధాని మోదీ గ్యారంటీలంటే రాజ్యాంగంలో మార్పులు చేయడం, రిజర్వేషన్లను రద్దుచేయడం, మైనారిటీలకు వ్యతిరేకంగా విషం చిమ్మడమే. బీజేపీది హిందూత్వమే ఏకైక ఎజెండా. భారత్‌ను హిందూత్వ దేశంగా మార్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. వెనుకబాటుతనంపైనేముస్లింలకు రిజర్వేషన్లు..అసలు ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించింది మతప్రాతిపదికన కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ రిజర్వేషన్లను సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు కారణంగా అందిస్తున్నారు. ముస్లింలలో అనేక వెనుకబడిన కులాలున్నాయి. వారికి ప్రభుత్వ మద్దతు అవసరం. కానీ, బీజేపీకి వీరి అభివృద్ధి గిట్టడంలేదు. అందుకే.. ముస్లిం రిజర్వేషన్ల రద్దుచేస్తామంటున్నారు.అభివృద్ధికి సహకరిస్తాంతెలంగాణలో అభివృద్ధికి సహకారం అందిస్తామని అసద్ పునరుద్ఘాటించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్దే తమ లక్ష్యమన్నారు. తమ పనితీరే తమకు గుర్తింపని చెప్పారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో గవర్నర్‌గా రాజ్యాంగబద్ధ్ద బాధ్యతలు నిర్వహించి రాజీనామా చేసిన తమిళిసై తిరిగి ఎన్నికల ప్రచారానికి రావడం రాజకీయంగా అనైతికమన్నారు. -
4% ముస్లిం రిజర్వేషన్ల తొలగింపుపై.. అసదుద్దీన్ రియాక్షన్
-
నాడు వ్యతిరేకించి.. ఇప్పుడు సమర్థిస్తున్నారు
డామన్/కటక్: రిజర్వేషన్లను ఆర్ఆర్ఎస్ మొదట్నుంచీ సమర్థిస్తూ వస్తోందంటూ ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతంలోని డామన్ పట్టణంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ ఇప్పుడేమో రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదని భాగవత్ చెబుతున్నారు. మరి అప్పుడేమో తాను రిజర్వేషన్లకు పూర్తి వ్యతిరేకినని ఘంటాపథంగా చెప్పేవారు.రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్లే బీజేపీతో చేరేవారు. వాళ్లకే బీజేపీ స్వాగతం పలికి అక్కున చేర్చుకుంది. తీరా ఎన్నికల వేళ ఇప్పుడొచ్చి మళ్లీ రిజర్వేషన్లకు మా మద్దతు అంటూ భాగవత్ కొత్త రాగం ఆలపిస్తున్నారు’’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఈసారి ఎన్నికలు కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్–బీజేపీ మధ్య సైద్ధాంతిక పోరు. రాజ్యాంగ విత్తనం నుంచే దేశంలోని అనేక విభాగాలు ఉద్భవించాయి. పూర్వకాలంలో మాదిరి రాజ్యపాలన సాగించాలని మోదీజీ, ఆర్ఎస్ఎస్ ఆశ. వీటిని నాశనం చేసి ఆర్ఎస్–బీజేపీ రాజుల్లాగా దేశాన్ని పాలించాలనుకుంటున్నారు’’ అని ఆరోపించారు. ‘‘ ఆర్ఎస్ఎస్–బీజేపీ వాళ్లకు ఒకే దేశం, ఒకే భాష, ఒక్కడే నేత ఉండే వ్యవస్థ కావాలి. పశి్చమబెంగాల్ ప్రజలు బెంగాలీ మాట్లాడతారు. అలాగే గుజరాత్ వాళ్లు గుజరాతీ, తమిళులు తమిళమే మాట్లాడతారు. అలాంటపుడు ఒకే భాష, ఒకే నేత విధానంలో హేతుబద్ధత ఎక్కడుంది?’’ అని నిలదీశారు. ‘‘డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంత అడ్మిని్రస్టేటర్ పదవిలో మోదీ ప్రఫుల్ పటేల్‌ను ‘రాజు’లాగా నియమించారు. ప్రజాభీష్టంతో ప్రఫుల్‌కు పనిలేదు. ఆయన ఏమనుకున్నారో అదే చేస్తారు’’ అని ఆరోపించారు. -
రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్లపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్పై స్వార్థంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రచారం అంతా అసత్యం, అబద్దమని పేర్కొన్నారు.రిజర్వేషన్లను ఆర్ఎస్స్ పూర్తిగా సమర్తిస్తుందని, ఎవరికోసం అయితే కేటాయించబడ్డాయో వారి అభివృద్ది జరిగే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని తెలిపారు. రిజర్వేషన్లపై వివాదం సృష్టించి లబ్ది పొందాలని అనుకుంటున్నారని, వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.ఇక... 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం 2025 నాటి కల్లా రిజర్వేషన్లు సమూలంగా రద్దు చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్పై వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. -
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మళ్లీ అధికారంలోకి రాగానే ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలులో ఉన్న ముస్లిం రిజర్వేషన్లను తప్పకుండా రద్దు చేస్తామని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటరీబోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్లు తప్ప.. మరే రిజర్వేషన్లు రద్దు చేయబోమని, అలాగే రాజ్యాంగాన్ని కూడా మార్చేది లేదని ఆయన వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు మినహా.. కుల, మతం పేరిట రిజర్వేషన్లు ఇవ్వడానికి తాము వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. కులాల ప్రతిపాదికన రిజర్వేషన్లు ఇవ్వొద్దన్నదే రాజీవ్‌గాంధీ అని గుర్తు చేశారు. రంగనాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయని కాంగ్రెస్.. మండల్ కమిషన్‌ను కూడా రాజీవ్‌గాంధీ వ్యతిరేకించారన్న విషయాన్ని రాహుల్‌గాం«దీ, రేవంత్‌రెడ్డి తెలుసుకోవాలని డాక్టర్ లక్ష్మణ్ సూచించారు. ముస్లిం సంతుష్టీకరణ పేరిట హిందూ సమాజంపై విషం చిమ్ముతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో లక్ష్మణ్ పార్టీ నాయకులు ప్రకాశ్‌రెడ్డి, సుభాష్ రవి కిషోర్‌తో కలిసి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ముస్లింలను సంతృప్తిపర్చేందుకు కాంగ్రెస్ విచ్చిన్నకర రాజకీయాలు చేస్తోందని, బీసీల రిజర్వేషన్లును తగ్గించి ముస్లింలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.బీజేపీ దేవుళ్లను అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తోందంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎక్కడకు వెళ్తే అక్కడ దేవుళ్లపై ఒట్లు పెడుతూ.. అదే దేవుళ్లను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని ఆయన ప్రశ్నించారు. కులగణనకు మేం వ్యతిరేకం కాదు కానీ.. కుల గణనకు తాము వ్యతిరేకం కాదని, అయితే అది శాస్త్రీయంగా, పరిశోధనాత్మకంగా జరగాల్సిన అవసరం ఉందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తే.. ఈ కూటమి తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ తెస్తామంటున్నారని, సీఏఏపై కూడా దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా సీఏఏను అమలు చేస్తామని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము వికసిత్ భారత్ అంటుంటే.. కాంగ్రెస్ విభజించు భారత్ అంటూ విచ్చిన్నకర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అక్షింతలు, కాషాయంతో తిండి లభిస్తుందా అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై లక్ష్మణ్ స్పందిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చర్మాన్ని ప్రజలు వొలిచిన విషయం గుర్తుంచుకోవాలని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. -
రైలు ప్రయాణికులకు అలర్ట్.. రిజర్వేషన్ సేవలకు బ్రేక్!
ఢిల్లీ, చుట్టుపక్కల రాష్ట్రాలలో నడిచే రైళ్లకు రిజర్వేషన్ చేయాలనుకుంటున్న ప్రయాణికులు శుక్రవారం రాత్రికి ముందే చేసేయండి. ఎందుకంటే ఢిల్లీ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)కు సంబంధించిన అన్ని సేవలు శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు పనిచేయవు. అయితే, సర్వీసులు నిలిచిపోయిన సమయంలో చాలా తక్కువ మంది మాత్రమే అసౌకర్యానికి గురవుతారని రైల్వే పేర్కొంది. చాలా కొద్ది మంది మాత్రమే ఈ సేవలను ఉపయోగిస్తున్నారని రైల్వే చెబుతోంది. పీఆర్ఎస్ దేశవ్యాప్తంగా ఐదు నగరాల నుండి పనిచేస్తుంది. వీటిలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, గౌహతి ఉన్నాయి. ఢిల్లీ పీఆర్ఎస్ వ్యవస్థను శుక్రవారం రాత్రి తాత్కాలికంగా మూసివేయనున్నారు. అంటే ఢిల్లీ పీఆర్ఎస్ ద్వారా నిర్వహించే అన్ని రైళ్లలో రిజర్వేషన్, రద్దు, విచారణ (139, కౌంటర్ సర్వీస్), ఇంటర్నెట్ బుకింగ్‌తో సహా అన్ని రకాల సేవలు ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 11.45 గంటల నుండి ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 04.15 గంటల వరకు దాదాపు 04.30 గంటల పాటు నిలిచిపోతాయి. ఈ సమయంలో ఢిల్లీ పీఆర్ఎస్కు సంబంధించిన ఏ పనిని మరే ఇతర నగరంలోని పీఆర్ఎస్ నుండి చేయలేము. రిజర్వేషన్ లేదా మరేదైనా పనిని పూర్తి చేయాలనుకుంటే, శుక్రవారం రాత్రికి ముందే పూర్తి చేయండి.. లేకపోతే మీరు శనివారం ఉదయం మాత్రమే పూర్తి చేయగలుగుతారు. -
మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయడం మోదీ వల్ల కాదు
సాక్షి, హైదరాబాద్: ‘ బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అన్నారు. మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేసే సత్తా అమిత్ షాకు లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా సాధ్యం కాదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రంజాన్ ఉప వాస దీక్షల సందర్భంగా శుక్రవారం మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ‘మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగుశాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. వైఎస్ హయాంలో కాంగ్రెస్ ఎంతో మంది న్యాయ నిపుణులతో చర్చించి రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు అన్ని రంగాల్లో అవకాశాలను మెరుగుపర్చాం. అదనపు అడ్వొకేట్ జనరల్, మైనారిటీ సలహాదారు, ముఖ్యమంత్రి కార్యాలయం, వక్ఫ్‌బోర్డు చైర్మన్, టీఎస్పీఎస్సీ సభ్యుడిగా మైనారిటీలను నియమించాం. మైనారిటీల సంక్షేమానికి మా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ఒక యూని వర్సిటీకి వీసీగా మైనారిటీలకు అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాతబస్తీని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. నిజానికి అది ఓల్డ్ సిటీ కాదు..ఒరిజినల్ సిటీ..అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. మైనారిటీ గురుకులాలకు అత్యాధునిక హంగులతో శాశ్వత భవనాలను నిర్మిస్తాం. ప్రభుత్వ ఉద్యోగ నియామ కాల ప్రక్రియ ఎల్బీస్టేడియం వేదికగా నిర్వహి స్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది ఎల్బీ స్టేడియం నుంచే. అదే స్ఫూర్తితో ఇక్కడి నుంచే పలు కార్యక్రమాలు అమలు చేస్తు న్నాం’ అని సీఎం వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. -
మహారాష్ట్రలో మళ్లీ రిజర్వేషన్ ‘మంటలు’
మహారాష్ట్రలో మరోమారు రిజర్వేషన్ ‘మంటలు’ రాజుకున్నాయి. అంబాద్ తాలూకాలోని తీర్థపురి పట్టణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద మరాఠా నిరసనకారులు రాష్ట్ర రవాణా బస్సును తగులబెట్టారని ఒక అధికారి తెలిపారు. దీనిపై మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్టీసీ) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపధ్యంలో జల్నా ప్రాంతంలో బస్సు సేవలను నిలిపివేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మరాఠా ఆందోళనకారులు బస్సును తగులబెట్టారని ఆరోపిస్తూ ఎంఎస్ఆర్టీసీ అంబాద్ డిపో మేనేజర్ స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మరాఠా రిజర్వేషన్ బిల్లును మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ప్రకారం మరాఠాలకు 50 శాతం పరిమితిని మించి అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఫిబ్రవరి 20న అసెంబ్లీలో కోటా బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ తన దీక్షను విరమించలేదు. పైగా ఈ ఆర్డినెన్స్ నోటిఫికేషన్‌ను రెండు రోజుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 24న రాష్ట్రంలో మరో ఉద్యమం ప్రారంభమయ్యింది. తాజాగా మనోజ్ జరంగే మాట్లాడుతూ మరాఠా కమ్యూనిటీకి అందిస్తాన్న రిజర్వేషన్ సంతృప్తికరంగా లేదని అన్నారు. -
మహిళలకు రిజర్వేషన్లు.. ప్రతి కేటగిరీలో 33.3%
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామ కాల్లో మహిళలకు హారిజాంటల్ (సమాంతర) పద్ధతిలో 33 1/3 శాతం (33.333%) రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, ఆ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తాజాగా ఉత్తర్వులు జారీ (జీఓ.ఎంఎస్.3) చేశారు. వీటి ప్రకారం మహిళలకు ఓపెన్ కాంపిటీషన్ (ఓసీ)తో పాటు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ, దివ్యాంగులు, ఎక్స్ సర్విస్‌మెన్, క్రీడాకారుల కోటాలో హారిజాంటల్ పద్ధతి (రోస్టర్ పట్టికలో ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్ లేకుండా)లో 33 1/3 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఇప్పటివరకు వర్టీకల్ పద్ధతి (పట్టికలోని పోస్టుల్లో కొన్నిటిని ప్రత్యేకంగా మహిళలకంటూ మార్కింగ్ ఇచ్చేవారు)లో ఉద్యోగ నియామ కాలు చేయగా.. ఇకపై ఎలాంటి మార్కింగ్ చేయకుండా 33 1/3శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం సూచించిన మెథడాలజీ ప్రకారం అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్ల అమలుకు గతంలో ఇచ్చిన జీవో నం.41/1996, జీవో నం. 56/1996 ఉత్తర్వులు రద్దు చేసింది. ఈ పద్ధతిని ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, రాజ్యాంగ నియామక సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు, స్థానిక సంస్థల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేకంగా జీవో జారీ చేయనుందని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. మెమోకు అనుగుణంగా ఉత్తర్వులు మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సాధారణ పరిపాలన శాఖ తరపున ఒక మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ మెమోను అన్ని నియామక సంస్థలకు పంపించారు. ఈ విషయంలో న్యాయ వివాదాలు తలెత్తకుండా మహిళా శిశు సంక్షేమశాఖ 33 1/3 శాతం రిజర్వేషన్ల అమలు కోసం 1996లో జారీ చేసిన జీవో నం.41కు, రాష్ట్ర సబార్డినేట్ సర్విసు నిబంధనలు రూల్.22కు సవరణలు చేయాలని పేర్కొంటూ టీఎస్పీఎస్సీ ఈనెల 8న మహిళా శిశు సంక్షేమ శాఖకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆ శాఖ మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ చేసింది. -
‘డిగ్రీ’లో క్రీడా రిజర్వేషన్ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు డిగ్రీ సీట్లలో రిజర్వేషన్ కల్పించాలన్న నిబంధన కార్యరూపం దాల్చకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. దీనివల్ల ఏటా 9 వేల మంది క్రీడాకారులు నష్టపోతున్నారని క్రీడారంగ నిపుణులు చెపుతున్నారు. ఈ అంశాన్ని ఉన్నత విద్యా మండలి దృష్టికి తెచ్చినా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,080 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4.68 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా కింద 2 శాతం రిజర్వేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో అమలు చేస్తోంది. కానీ ఉన్నత విద్యామండలి అమలు చేస్తున్న ‘దోస్త్’ప్రవేశాల విధానంలో మాత్రం క్రీడాకారులకు కనీసం ఒక్క సీటూ కేటాయించలేదు. అసలు ఆ కాలమే ఎత్తివేయడంపై క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యమేనా..? దోస్త్‌లో దివ్యాంగులు, ఎన్సీసీ నేపథ్యం ఉన్న వారికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించారు. వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కేంద్రాలూ నిర్వహిస్తున్నారు. అయితే క్రీడాకారుల విషయానికొచ్చే సరికి మాత్రం ప్రభుత్వం జీవో ఇవ్వకపోవడం వల్లే దోస్త్‌లో స్పోర్ట్స్ కోటా పెట్టలేదని అధికారులు చెబుతున్నారు. కాగా, క్రీడారంగ విద్యార్థులు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారుల అసోసియేషన్లు కూడా ఉన్నత విద్యామండలికి అనేక సార్లు విజ్ఞప్తి చేశాయని, అయినా పట్టించుకోవడంలేదని అంటున్నారు. అన్నివిభాగాలతో పాటు క్రీడాకారులకూ 2 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పుడు మళ్లీ ప్రత్యేకంగా జీవో ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఉన్నత విద్యామండలి అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతోందని చెబుతున్నారు. న్యాయం జరిగేనా..? డిగ్రీ కోర్సుల్లో తమకు రిజర్వేషన్ కల్పించాలని ఇటీవల కొంతమంది క్రీడాకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏటా తమకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నతాధికారుల నుంచి సీఎం కార్యాలయం సమాచారం సేకరిస్తోంది. డిగ్రీలో క్రీడాకారుల కోటా అమలుకు జీవో ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అధికారుల వాదన మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించింది. త్వరలో దీనిపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. -
SC: ఎస్సీ వర్గీకరణకు కేంద్ర కమిటీ ఏర్పాటు
ఢిల్లీ: ఎస్సీల(Scheduled Castes communities) వర్గీకరణ విషయంలో కేంద్రం ముందడుగు వేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోం, న్యాయ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో..పరేడ్ గ్రౌండ్స్‌లో ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ సమయంలో కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నెల 22న కమిటీ తొలిసారి భేటీ కానున్నట్లు సమాచారం. On the directions of PM, a Committee of Secretaries constituted under the Chairmanship of Cabinet Secretary to examine the administrative steps that can be taken to safeguard the interests of Scheduled Castes communities, like the Madigas and other such groups, who have… — ANI (@ANI) January 19, 2024 -
దళిత వర్గమే కానీ... రిజర్వేషన్లు మాత్రం వద్దన్నారు!
ఆమె రాజ్యాంగసభలోని సభ్యురాలైనప్పటికీ కుల ప్రాతిపదికన కేటాయించే రిజర్వేషన్‌ను వ్యతిరేకించారు. మహిళలకూ ప్రత్యేకమైన రిజర్వేషన్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఆమె మరెవరో కాదు.. రిజర్వేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన నాటి ఏకైక దళిత మహిళా రాజ్యాంగ సభ సభ్యురాలు దాక్షాయణి వేలాయుధన్. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభలోని మొత్తం 389 మంది సభ్యులలో 15 మంది మహిళలున్నారు. నాడు రాజ్యాంగ పరిషత్‌లో జరిగిన చర్చలలో ఒకరిద్దరు మహిళా సభ్యులు రిజర్వేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే వీరు మహిళలకు ఎలాంటి రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేయలేదు. జర్నలిస్ట్ నిధి శర్మ రచించిన పుస్తకం 'షీ ది లీడర్: ఉమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’లో మహిళా రాజకీయ నేతల గురించి లోకానికి అంతగా తెలియని కథనాలను అందించారు. పుస్తకం ప్రారంభంలో 1947, ఆగస్టు 28న షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజక వర్గం అంశంపై చర్చిస్తున్నప్పుడు.. రిజర్వేషన్‌ను వ్యతిరేకించిన ఏకైక దళిత మహిళా సభ్యురాలు దాక్షాయణి వేలాయుధన్ అని పేర్కొన్నారు. నాడు సభలో దాక్షాయణి వేలాయుధన్ ఇలా అన్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ‘వ్యక్తిగతంగా నేను ఎటువంటి రిజర్వేషన్లకు అనుకూలంగా లేను. దురదృష్టవశాత్తూ బ్రిటీష్ సామ్రాజ్యవాదం మనపై కొన్ని మచ్చలు మిగిల్చింది. మనం హెచుతగ్గులను చూసి భయపడుతున్నాం. అందుకే ఈ అంశాలన్నింటినీ అంగీకరించవలసి వచ్చింది. ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపును తొలగించలేం. సీట్ల రిజర్వేషన్ కూడా ఒక రకమైన ప్రత్యేక ఎంపిక వంటిదే. అయినా మనం దీనిని సహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది అవసరమైన పరిణామం అని మేం భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. దాక్షాయణి వేలాయుధన్ ఎవరు? దక్షిణాయణి వేలాయుధన్ 1912, జూలై 15న నేటి ఎర్నాకులం(కేరళ) జిల్లాలోని చిన్న ద్వీపమైన ముళవుకడ్లో జన్మించారు. ఆమె పులయ సమాజానికి చెందినవారు. కుల వ్యవస్థలో వీరి సమాజం అట్టడుగున ఉండేది. ఈ సమాజంలోని వారు వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు. అంటరానితనం కారణంగా వారు బహిరంగ రహదారులపై నడవడాన్ని కూడా నిషేధించారు. దీనికితోడు ఈ సమాజానికి చెందిన స్త్రీలు తమ శరీరపు పైభాగాన్ని దుస్తులతో కప్పుకోవడాన్ని నిషేధించారు. ఈ విధంగా పులయ సమాజానికి చెందిన మహిళలు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దళితులకు సంబంధించిన కాయాల్ సమావేశం 1913లో కొచ్చిలో జరిగినప్పుడు వేలాయుధన్ కుటుంబసభ్యులతో పాటు తరలివచ్చారు. అక్కడ వారి సమాజానికి తీవ్రమైన అవమానాలు ఎదురయ్యాయి. ఇటువంటి సంఘటనలు వేలాయుధన్ జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. శాసనోల్లంఘన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ వేలాయుధన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1945లో దాక్షాయణి కొచ్చిన్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున నామినేట్ అయ్యారు. ఈ కౌన్సిల్ ద్వారా 1946లో భారత రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు మరోవైపు ఆమె ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌సీఎఫ్)వారపత్రిక ‘జై భీమ్’లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తూవుండేవారు. డాక్టర్ అంబేద్కర్‌ను విమర్శించడానికి కూడా ఆమె వెనుకాడలేదు. అంబేద్కర్ రాజకీయాలను, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం ఆయన చేసిన డిమాండ్‌ను ఆమె తీవ్రంగా విమర్శించారు. దాక్షాయణి వేలాయుధన్ 1978 జూలై 20న తన 66 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: ఐదుగురు ప్రియురాళ్లు... సరిహద్దులు దాటి, చిక్కుల్లో పడి.. -
కశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకు 24 సీట్లు!
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతానికి 24 సీట్లు రిజర్వు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది! పీఓకే కూడా మన భూభాగమే కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ), రిజర్వేషన్ (సవరణ) బిల్లులను బుధవారం ఆయన లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆరు గంటల పై చిలుకు చర్చ అనంతరం సభ వాటిని ఆమోదించింది. అసెంబ్లీలో సీట్లను పెంచడంతో పాటు పలు కీలక అంశాలు ఈ బిల్లుల్లో ఉన్నాయి. గతంలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో 83 స్థానాలుండగా వాటిని 90కి పెంచాలని ప్రతిపాదించారు. కశ్మీర్ డివిజన్లో స్థానాలను 46 నుంచి 47కు, జమ్మూ డివిజన్లో 37 నుంచి 43కు పెంచారు. ‘‘పాక్ ఆక్రమిత కశ్మర్ కూడా భారత్‌లో అంతర్భాగమే. కనుక అక్కడ కూడా 24 స్థానాలను అసెంబ్లీలో రిజర్వు చేశాం’’ అని అమిత్ షా సభకు వెల్లడించారు. అన్యాయాన్ని సరిదిద్దేందుకే బిల్లులు 70 ఏళ్లుగా తమ హక్కులన్నింటినీ కోల్పోయి అన్నివిధాలా అన్యాయానికి గురైన కశ్మీరీలకు పూర్తిగా న్యాయం చేయడమే ఈ బిల్లుల ఉద్దేశమని అమిత్ షా చెప్పారు. కశ్మీర్లో ఉగ్రవాదానికి ఇప్పటిదాకా 45 వేల మంది బలయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమివ్వకుండా మొదట్లోనే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి ఉంటే పండిట్లు లోయను వీడాల్సిన అవసరమే వచ్చేది కాదన్నారు. ‘‘కశ్మీర్లో 1947లో 31,789 కుటుంబాలు 1965–71 మధ్య 10,065 కుటుంబాల వారు నిర్వాసితులయ్యారు. ఇక 1980ల్లో ఉగ్రవాదం వల్ల మరెన్నో వేల మంది స్వదేశంలోనే శరణార్థులయ్యారు. వారందరికీ తిరిగి గుర్తింపుతో పాటు హక్కులు, అన్నిరకాల ప్రాతినిధ్యం కలి్పంచడమే తాజా బిల్లుల లక్ష్యం’’ అని వివరించారు. 2024లోనూ కేంద్రంలో మోదీ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మాకుంది. అనంతరం రెండేళ్లలో జమ్మూ కశ్మీర్‌ను పూర్తిగా ఉగ్రవాద విముక్తం చేసి తీరతాం’’ అని చెప్పారు. ‘‘కశ్మీరీల్లో ఎంతోమంది శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. బిల్లుతో వారికి హక్కులు సమకూరుతాయి. విద్య, ఉద్యోగావకాశాలు వస్తాయి. ఎన్నికల్లో నిలబడి గెలిచే ఆస్కారముంటుంది’’ అని తెలిపారు. బిల్లుల విశేషాలు.. ► జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 90కి పెరుగుతుంది. ►ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు అసెంబ్లీలో తొలిసారిగా 9 స్థానాలు రిజర్వు చేశారు. ►కశ్మీర్ నుంచి వలస వెళ్లిన వారి కుటుంబాలకు 2 స్థానాలు కేటాయించారు. వీటిలో ఒక మహిళకు అవకాశమిస్తారు. ►పీఓకే నుంచి నిర్వాసితులై వచ్చి స్థిరపడిన వారికి ఒక స్థానం కేటాయించారు. ►రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలు, వృత్తి విద్యా సంస్థల్లో పలు కేటగిరీల వారికి జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ బిల్లు ప్రకారం రిజర్వేషన్లు కలి్పస్తారు. ►ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు కూడా రిజర్వేషన్లు అందుతాయి. ►ప్రస్తుత రిజర్వేషన్ చట్టంలోని ‘బలహీన, గుర్తింపునకు నోచని వర్గాలు (సామాజిక కులాలు)’ అనే పదబంధాన్ని ‘ఇతర వెనకబడ్డ’గా మారుస్తారు. ►జమ్మూ కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రాన్ని లద్దాఖ్, కశ్మీర్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తారు. -
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్
సాక్షి, కామారెడ్డి: కులగణన, బీసీ కమిషన్ నివేదికల ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇ చ్చింది. ఈ రిజర్వేషన్లను ప్రస్తుతమున్న 23శాతం నుంచి 42శాతానికి పెంచడం ద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీలలో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని తెలిపింది. శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించిన సభలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ‘బీసీ డిక్లరేషన్’ను ప్రకటించగా.. ముఖ్య అతిథిగా హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అందులోని అంశాలను వివరించారు. డిక్లరేషన్‌లోని అంశాలివీ.. ♦ మహాత్మా జ్యోతిరావు పూలే పేరిట బీసీ సబ్‌ప్లాన్‌కు అసెంబ్లీ తొలిసెషన్‌లోనే చట్టబద్ధత కల్పిస్తాం. బీసీ సంక్షేమానికి ఏటా రూ.20వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తాం. ♦ ఎంబీసీ కులాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధి కోసం కార్పొరేషన్లు. బీసీ యువత ఉన్నత చదువుల కోసం, చిరు వ్యాపారాలు చేసుకునేందుకు రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీలేని రుణాలు. ♦ అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.50 కోట్లతో ఓ కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాల నిర్మాణం. బీసీ ఐక్యతా భవన్‌లోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు. ♦ ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం. ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కాలేజీ. రూ.3 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న బీసీ విద్యార్థులకు ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. ♦ వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం. అందులో మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతివృత్తుల వారికి ఉచితంగా షాపులు పెట్టుకునే స్థలం. ♦ గీత కార్మికులు, చేనేతలకు ఉన్నట్టుగా 50ఏళ్ల వృద్ధాప్య పింఛన్ వయోపరిమితి అన్ని చేతివృత్తుల వారికి వర్తింపు. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ, రూ.10 లక్షల ఆర్థిక సాయం. కులాల వారీగా ప్రత్యేక పథకాలు, హామీలు ♦ జీవో నం.19/02/2009ను పునరుద్ధరించి.. ముదిరాజ్, ముత్రాసు, తెనుగోళ్లు తదితర కులా లను బీసీ డీ నుంచి బీసీ ఏ గ్రూపులోకి మార్చడం. ♦ గంగపుత్రులకు సంబంధించి మత్స్యకార హక్కులకు.. ఇతర మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం. ఇందుకోసం తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు. ఆక్వాకల్చర్‌కు ప్రోత్సాహం. క్యాప్టివ్ సీడ్, నర్సరీలు, మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ఏర్పాట్లు. ♦ గొల్లకురుమలకు అధికారంలోకి వ చ్చిన వంద రోజుల్లో రెండో దశ గొర్రెల పంపిణీ. ♦ గౌడ్ కులస్తులకు ఈతచెట్ల పెంపకం కోసం ప్రతి గ్రామంలో ఐదెకరాల భూమి. ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ వాల్ నిర్మాణాలపై 90శాతం సబ్సిడీ. మద్యం దుకాణాల లైసెన్సుల్లో గౌడ్లకు ప్రస్తుతమున్న రిజర్వేషన్ 15శాతం నుంచి 25శాతానికి పెంపు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్నగౌడ్ జనగాం జిల్లాగా పేరు మార్పు. ♦ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు. ♦ పద్మశాలీలకు జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలలో మెగా పవర్‌లూం క్లస్టర్ల ఏర్పాటు. పవర్‌లూమ్స్, పరికరాలపై 90 శాతం సబ్సిడీ. ♦ విశ్వకర్మలకు 90శాతం సబ్సిడీతో టూల్కిట్లు. పట్టణ ప్రాంతాల్లో దుకాణాల ఏర్పాటుకు భూమి కేటాయింపు. ♦ రజక యువతకు పట్టణాల్లో లాండ్రోమెట్స్ ఏర్పాటు కోసం రూ.10 లక్షల ఆర్థిక సాయం. రాష్ట్రవ్యాప్తంగా ధోబీఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు కేటాయింపు. -
మరాఠా రిజర్వేషన్‌కు అనుకూలమే: ఏక్నాథ్ షిండే
ముంబయి: సీఎం ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. మరాఠా ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. రిజర్వేషన్లు కల్పించడానికి చట్టపరమైన విధానాలు పాటించడానికి ప్రభుత్వానికి సమయం అవసరమని చెప్పారు. మరాఠా రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో నేడు రాష్ట్రంలో సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారుడు మనోజ్ జరాండే నిరవధిక నిరాహార దీక్షను విరమించాలని అఖిలపక్ష నేతలు కోరారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలను ఆకాంక్షించారు. ఈ అఖిలపక్ష భేటీలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన(యూబీటీ) నాయకుడు అనిల్ పరాబ్, శాసనసభా ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ తదితరులు పాల్గొన్నారు. మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్రంలో కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో చాలాచోట్లు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఐదు మరాఠా జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ప్రభుత్వ బస్సులను రద్దు చేశారు. ఆందోళనలు వ్యాప్తి చెందకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. బుధవారం నుంచి దీక్షను మరింత తీవ్రతరం చేస్తామని నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న మనోజ్ జరాండే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించింది. మరాఠా రిజర్వేషన్లపై మంగళవారం తీవ్రస్థాయికి చేరాయి. ముంబయి-బెంగళూరు జాతీయ రహదారిని ఆందోళనకారులు అడ్డగించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో రైలు పట్టాలను దిగ్బంధించారు. పట్టాలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు, మరాఠా రిజర్వేషన్లకు మద్దతు కోరుతూ నిరసనకారులు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇదీ చదవండి: Wine Capital of India: దేశంలో మద్యం రాజధాని ఏది? -
APPSC: ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, ప్రమోషన్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్‌ను ఏపీపీఎస్సీ ఈ ఏడాది రానున్న నోటిఫికేషన్ల నుంచి అమలు చేయనున్నట్లు కమిషన్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ తెలిపారు. గతంలో దివ్యాంగులకు 3 శాతం ఉన్న రిజర్వేషన్లను నాలుగు శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. -
దేశంలో ఎవరికి అత్యధిక రిజర్వేషన్లు? మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?
గతకొంతకాలంగా మరాఠా రిజర్వేషన్ ఆందోళనలతో మహారాష్ట్ర అట్టుడుకుతోంది. ఇదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రిజర్వేషన్లకు సంబంధించి అనేక ఉద్యమాలు నడుస్తున్నాయి. రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం రిజర్వేషన్ల అంశాన్ని అనువుగా మలచుకుంటున్నాయి. ఇటువంటి ప్రస్తుత పరిస్థితిలో దేశంలో అత్యధిక రిజర్వేషన్లు ఎవరికి లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి దేశంలో రిజర్వేషన్లకంటూ ఒక పరిమితి ఉంది. చట్ట ప్రకారం రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించకూడదు. అయితే చాలా రాష్ట్రాలు ఈ పరిమితిని దాటాయి. వివిధ వర్గాల ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు, ఇతర అంశాలలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. ఈ విషయమై సుప్రీంకోర్టులో చర్చ కూడా నడుస్తోంది. దేశంలో కుల ఆధారిత రిజర్వేషన్ల పరిమితి విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ప్రతి వర్గానికీ వేర్వేరు రిజర్వేషన్లను నిర్ణయించింది. దీని ప్రకారం ఇతర వెనుకబడిన తరగతులకు అంటే ఓబీసీకి 27శాతం, షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) 15శాతం, షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) 7.5శాతం మేరకు గరిష్ట రిజర్వేషన్లు కల్పించారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన వారికి అంటే ఈడబ్ల్యుఎస్ వర్గానికి 10శాతం రిజర్వేషన్లు కల్పించారు. జాతీయ స్థాయిలో ఏ ఉద్యోగానికైనా ఇదే రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తారు. ఇక మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ విషయానికొస్తే, మహారాష్ట్ర మొత్తం జనాభాలో దాదాపు మరాఠా జనాభా 33 శాతం. పలువురు ముఖ్యమంత్రులు కూడా ఈ వర్గానికి చెందినవారే. ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే కూడా మరాఠా వర్గానికి చెందినవారే. తమ జనాభాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని మరాఠాలు డిమాండ్ చేస్తున్నారు. మరాఠాలు తమకు ఓబీసీ హోదా ఇవ్వాలని చాలాకాలంగా కోరుతున్నారు. ఇది కూడా చదవండి: అత్యంత క్రూరమైన ‘ఉగాండా కసాయి’ ఎవరు? మృతదేహాలతో ఏం చేసేవాడు? -
మహిళా కోటాను సమాంతరంగా అమలు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ–2023లో సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు లేవనెత్తిన ఇతర అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ, విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది. డీఎస్సీ ద్వారా 5,089 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, అయితే మహిళా కోటాలో సమాంతర రిజర్వేషన్ కాకుండా వర్టికల్ రిజర్వేషన్ పాటిస్తోందంటూ బోడ శ్రీనివాసులు సహా 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘డీఎస్సీలో మహిళలకు 33.33 శాతానికి బదులు 51శాతం పోస్టులను కేటాయించారు. గ్రూప్–1, గ్రూప్–2 తదితర పోస్టుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను విద్యా శాఖ పాటించడం లేదు. ఉపాధ్యాయ నియామకాల్లో కూడా మహిళలు, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలి. ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి’అని పిటిషన్లో కోరారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. సమాంతర రిజర్వేషన్ పాటించాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
ఉమెన్‌కు పవర్ పరిమితమే
రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇలా.. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 మంది మహిళలే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారిలో కాంగ్రెస్ నుంచి జె.గీతారెడ్డి, డీకే అరుణ విజయం సాధించగా టీఆర్ఎస్ నుంచి అజ్మీరా రేఖ, బొడిగె శోభ, గొంగిడి సునీత, కొండా సురేఖ, కోవా లక్ష్మి, పద్మాదేవేందర్‌రెడ్డి గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన మహిళల సంఖ్య ఆరుకు తగ్గింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సీతక్క (అనసూయ), సబితారెడ్డి, బానోత్ హరిప్రియ గెలుపొందగా, టీఆర్ఎస్ నుంచి అజ్మీరా రేఖ, గొంగిడి సునీత, పద్మాదేవేందర్‌రెడ్డి విజయం సాధించారు. సాక్షి, హైదరాబాద్: ఆకాశంలో సగభాగం అంటూ మహిళలను పొగడటం తప్ప అవకాశాలపరంగా వెనుకబాటులో ఉన్నారు. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు దాదాపు 71 ఏళ్ల కాలంలో మహిళలు ప్రాతినిధ్యం వహించని అసెంబ్లీ నియోజకవర్గాలు అనేకం ఉన్నాయి. 1952లో అసెంబ్లీ ఎన్నికలు మొదలు 2018 ఎన్నికల వరకు రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళల ప్రాతినిధ్యం పరిశీలిస్తే కేవలం 51 సెగ్మెంట్లలోనే అడపాదడపా కనిపించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో 70 స్థానాల్లో ఇప్పటివరకు మహిళల ప్రాతినిధ్యమే లేకపోవడం గమనార్హం. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు బరిలోకి దిగిన సందర్భాలు అత్యంత పరిమితంగానే ఉన్నాయి. మహిళా రిజర్వేషన్లతోనే.. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలనే డిమాండ్ కొన్నేళ్లుగా వినిపిస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్లో మహిళా బిల్లు కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. తాజాగా మహిళా బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనేది ఈ చట్టం సారాంశం. అన్ని స్ధానాల్లో మహిళలకు అవకాశం లభించేలా రొటేషన్ పద్ధతిని ఈ చట్టంలో పొందుపరిచారు. 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో సగానికిపైగా అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు ఇప్పటివరకు అవకాశం దక్కకపోగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో మహిళా రిజర్వేషన్లు అమలైతే వారి ప్రాతినిధ్యం అమాంతం పెరగనుంది. ఒక్కసారి కూడా మహిళా ప్రాతినిధ్యం లేని స్థానాలు..: చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముథోల్, బోధన్, నిజామాబాద్ అర్బన్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, రామగుండం, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, వేములవాడ, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్, సిద్దిపేట, నారాయణఖేడ్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, వికారాబాద్, తాండూరు, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చారి్మనార్, చాంద్రాయణగుట్ట, యాఖుత్‌పుర, కొడంగల్, నారాయణపేట్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, సూర్యాపేట, మునుగోడు, జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, వరంగల్ వెస్ట్, వర్దన్నపేట, భూపాలపల్లి, పినపాక, పాలేరు, మంథని, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, సనత్‌నగర్, బహదుర్‌పురా. తొలి ఓటరు రంభాబాయి కాగజ్‌నగర్ రూరల్: కుమురం భీం జిల్లా సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్ మండలం మాలిని గ్రామ పంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్రంలో మొదటి పోలింగ్ కేంద్రంగా గుర్తించారు. ఫలితంగా ఈ గ్రామానికి చెందిన ఆత్రం రంభాబాయికి తొలి ఓటరుగా అవకాశం దక్కింది. గతంలో సుర్పం మారుబాయి తొలి ఓటరుగా ఉండగా, ఇటీవల ఎన్నికల అధికారులు ఇంటి నంబరు ఆధారంగా ఓటరు జాబితాను సవరించగా రంభాబాయి రాష్ట్రంలో తొలి ఓటరుగా మారారు. ఈ పోలింగ్ కేంద్రంలో 430 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 208, మహిళలు 222 మంది ఉన్నారు. మాలిని పోలింగ్ కేంద్రం కాగజ్‌నగర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో గుట్టల మధ్యలో ఉంటుంది. అక్కడికి వెళ్లాలంటే సిర్పూర్(టీ) మండల కేంద్రం నుంచి చీలపెల్లి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సమస్యలతో సతమతం ..: మాలినిగ్రామానికి సరైన రోడ్డు లేదు. రాళ్లురప్పలతో కంకర తేలిన రోడ్డు ఉండడంతో జనం అవస్థలకు గురవుతున్నారు. సిర్పూర్(టీ) నుంచి మాలిని గ్రామానికి వెళ్లే మార్గమధ్యంలో రెండు ఒర్రెలపై కల్వర్టులు లేకపోవడంతో వర్షాకాలంలో వాహనాలు వెళ్లలేని పరిస్థితి.. మిషన్ భగీరథ పైపులు వేసినప్పటికీ నల్లాల్లో నీరు రావడం లేదు. గ్రామంలోని చేదబావికి మోటార్లు బిగించుకుని దాహార్తి తీర్చుకుంటున్నారు. అడవి మధ్యలో ఉన్న ఈ గ్రామంలో సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో ఫోన్లు కూడా పనిచేయవు. ప్రతీసారి ఓటు వేస్తున్నా... నాకు ఓటుహక్కు వచ్చినప్పటి నుంచి వినియోగించుకుంటున్నా. రాష్ట్రంలో తొలి ఓటరుగా చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. అయితే మా ఊరిలో కనీస సౌకర్యాలు లేక బాధపడుతున్నాం. అధికారులు, నాయకులు పట్టించుకుని సౌకర్యాలు కల్పించాలి. – రంభాబాయి, మాలిని -
మహిళా బిల్లుకు ఆమోదం.. పార్లమెంటు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. నారీ శక్తికి పార్లమెంటు సగౌరవంగా ప్రణమిల్లింది. నూతన భవనంలో తొట్టతొలిగా మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి సరికొత్త చరిత్ర లిఖించింది. ఈ చరిత్రాత్మక ఘట్టానికి రాజ్యసభ వేదికైంది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన నారీ శక్తి విధాన్ అధినియమ్ బిల్లుకు గురువారం పెద్దల సభ సైతం జై కొట్టింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన మొత్తం 214 మంది సభ్యులూ పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతిచ్చారు. దాంతో అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. మహిళా బిల్లు బుధవారమే లోక్‌సభలో మూడింట రెండొంతులకు పైగా మెజారిటీతో పాస్ అవడం తెలిసిందే. 454 మంది ఎంపీలు మద్దతివ్వగా ఇద్దరు మజ్లిస్ సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. ఈ రిజర్వేషన్లు 15 ఏళ్లపాటు అమల్లో ఉంటాయని కేంద్రం ప్రకటించింది. అనంతరం వాటి కొనసాగింపుపై అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది పార్టీలకతీతంగా మద్దతు అంతకుముందు బిల్లుపై జరిగిన చర్చలో రాజ్యసభ సభ్యులంతా ముక్త కంఠంతో మద్దతు పలికారు. కొందరు విపక్షాల సభ్యులు మాత్రం దీన్ని బీజేపీ ఎన్నికల గిమ్మిక్కుగా అభివరి్ణంచారు. తాజా జన గణన, నియోజకవర్గాల పునర్విభజన కోసం ఎదురు చూడకుండా బిల్లు అమలు ప్రక్రియను వీలైనంత వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. బిల్లును తక్షణం అమలు చేయాలని కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్) డిమాండ్ చేశారు. ఈ బిల్లు అంశాన్ని తొమ్మిదేళ్లుగా పట్టించుకోకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. ఓబీసీ మహిళలకూ దీన్ని వర్తింపజేయాలన్నారు. 2014, 2019ల్లో కూడా మహిళా బిల్లు తెస్తామని బీజేపీ వాగ్దానం చేసి మోసగించిందని ఎలమారం కరీం (సీపీఎం) ఆరోపించారు. మహిళలంటే మోదీ సర్కారుకు ఏ మాత్రమూ గౌరవం లేదన్నారు. మణిపూర్ హింసాకాండపై ప్రధాని మోదీ నిర్లిప్తతే ఇందుకు రుజువన్నారు. ఎన్నికల వేళ బిల్లు తేవడంలో ఆంతర్యం ఏమిటని రామ్‌నాథ్ ఠాకూర్ (జేడీయూ) ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా తక్షణం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కె.కేశవరావు (బీఆర్ఎస్), వైగో (ఎండీఎంకే) డిమాండ్ చేశారు. తక్షణం డీ లిమిటేషన్ కమిషన్ వేయాలని వారన్నారు. మహిళా బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని ఆ పార్టీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను రాజ్యసభకు, రాష్ట్రాల శాసన మండళ్లకు కూడా వర్తింపజేయాలని కోరారు. కర్ణాటక సీఎంగా, ప్రధానిగా మహిళా రిజర్వేషన్ల కోసం తాను తీసుకున్న చర్యలను జేడీ (ఎస్) సభ్యుడు దేవెగౌడ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడేం జరుగుతుంది? రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే మహిళా బిల్లు చట్ట రూపం దాలుస్తుంది. తర్వాత మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నూతన జన గణన, నియోజకవర్గాల పునరి్వభజన అనంతరం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. ఇది 2029 కల్లా జరిగే అవకాశముందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారమే పరోక్షంగా తెలిపారు. ఏమిటీ బిల్లు? ► ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును నారీ శక్తి విధాన్ అధినియమ్‌గా పేర్కొంటున్నారు. ► దీని కింద లోక్‌సభ, ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు, అంటే 33 శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు. ► ప్రధానంగా పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగే రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తించవు. చరిత్రాత్మక క్షణాలివి! ప్రధాని మోదీ భావోద్వేగం మహిళా బిల్లు రాజ్యసభ ఆమోదం పొందిన క్షణాలను చరిత్రాత్మకమైనవిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. బిల్లు పెద్దల సభ ఆమోదం పొందిన సమయంలో ఆయన సభలోనే ఉన్నారు. ‘భారత మహిళలకు మరింత ప్రాతినిధ్యం, సాధికారత లభించే నూతన శకంలోకి మనమిక సగర్వంగా అడుగు పెట్టనున్నాం. ఇది కేవలం చట్టం మాత్రమే కాదు. మన దేశాన్ని నిరంతరం ఇంత గొప్ప స్థాయిలో తీర్చిదిద్దుతున్న, అందుకోసం తమ సర్వస్వాన్నీ నిరంతరం త్యాగం చేస్తూ వస్తున్నా సంఖ్యాకులైన మహిళామణులకు, మన మాతృమూర్తులకు మనం చేస్తున్న వందనమిది. వారి సహనశీలత, త్యాగాలు అనాదిగా మన గొప్ప దేశాన్ని మరింత సమున్నతంగా తీర్చిదిద్దుతూ వస్తున్నాయి‘ అంటూ మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఉభయ సభల్లోనూ బిల్లుపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. అవన్నీ పూర్తిగా విజయవంతమయ్యాయి. ఈ చర్చలు భవిష్యత్తులోనూ మనందరికీ ఎంతగానో ఉపకరిస్తాయి. బిల్లుకు మద్దతి చి్చన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ స్ఫూర్తి భారతీయుల ఆత్మ గౌరవాన్ని సరికొత్త ఎత్తులకు చేరుస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభ, మండళ్లలో అసాధ్యం: నిర్మల చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకోవడం ద్వారా పార్లమెంటు నూతన భవనానికి శుభారంభం అందించే నిమిత్తమే ఈ సమావేశాలను ఏర్పాటు చేసినట్టు ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. బిల్లుపై చర్చలో ఆమె మాట్లా డుతూ రాజ్యసభ, శాసన మండళ్లకు జరిగేవి పరోక్ష ఎన్నికలు గనుక మహిళలకు రిజర్వేషన్లు ఆచరణసాధ్యం కాదన్నారు. పార్లమెంటు నిరవధిక వాయిదా చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన అనంతరం పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. నిజానికి 18న మొదలైన ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు షెడ్యూల్ ప్రకారం 22వ తేదీ దాకా జరగాల్సి ఉంది. రాజ్యసభకు ఇది 261 సెషన్. కాగా, 17వ లోక్‌సభకు బహుశా ఇవే చివరి సమావేశాలని భావిస్తున్నారు. -
Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ మోదీ సర్కారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు కాంగ్రెస్ పూర్తిగా మద్దతిస్తుందని ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించారు. అయితే జన గణన, డీ లిమిటేషన్ వంటివాటితో నిమిత్తం లేకుండా బిల్లును తక్షణం అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. అలాగే మూడో వంతు రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా వర్తింపజేయాలన్నారు. బుధవారం లోక్‌సభలో మహిళా బిల్లుపై చర్చను విపక్షాల తరఫున ఆమె ప్రారంభించారు. రిజర్వేషన్ల అమలులో ఏ మాత్రం ఆలస్యం చేసినా అది భారత మహిళల పట్ల దారుణ అన్యాయమే అవుతుందని అన్నారు. ‘కుల గణన జరిపి తీరాల్సిందే. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. ఇందుకోసం తక్షణం కేంద్రం చర్యలు చేపట్టాలి‘ అని పునరుద్ఘాటించారు. రాజకీయాలతో పాటు వ్యక్తిగతాన్నీ, భావోద్వేగాలను కూడా రంగరిస్తూ సాగిన ప్రసంగంలో సోనియా ఏమన్నారంటే... ‘దేశాభివృద్ధిలో మహిళల పాత్రను సముచితంగా గుర్తుంచుకునేందుకు, కృతజ్ఞతలు తెలిపేందుకు ఇది సరైన సమయం. అందుకే, నారీ శక్తి విధాన్ అధినియమ్‌కు కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా మద్దతిస్తుంది. దాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలి. ఆ దారిలో ఉన్న అడ్డంకులను తలగించాలి‘. వంటింటి నుంచి అంతరిక్షం దాకా... ‘మసిబారిన వంటిళ్ల నుంచి ధగధగా వెలిగిపోతున్న స్టేడియాల దాకా, అంతరిక్ష సీమల దాకా భారత మహిళలది సుదీర్ఘ ప్రయాణం. అటు పిల్లలను కని, పెంచి, ఇటు ఇల్లు నడిపి, మరోవైపు ఉద్యోగాలూ చేస్తూ అంతులేని సహనానికి మారుపేరుగా నిలిచింది మహిళ. అలాంటి మహిళల కష్టాన్ని, గౌరవాన్ని, త్యాగాలను సముచితంగా గుర్తించినప్పుడు మాత్రమే మానవతకు సంబంధించిన పరీక్షలో మనం గట్టెక్కినట్టు‘. స్వాతంత్య్ర పోరులోనూ నారీ శక్తి ‘దేశ స్వాతంత్య్ర సంగ్రామంలోనూ, అనంతరం ఆధునిక భారత నిర్మాణంలో కూడా భారత మహిళలు పురుషులతో భుజం కలిపి సాగారు. కుటుంబ బాధ్యతల్లో మునిగి సమాజం, దేశం పట్ల తమ బాధ్యతలను ఎన్నడూ విస్మరించలేదు. సరోజినీ నాయుడు, సుచేతా కృపాలనీ, అరుణా అసఫ్ అలీ, విజయలక్ష్మీ పండిట్, రాజ్ కుమార్ అమృత్ కౌర్, ఇంకా ఎందరెందరో మహిళామణులు మనకు గర్వకారణంగా నిలిచారు. గాం«దీ, నెహ్రూ, పటేల్, అంబేడ్కర్ తదితరుల ఆకాంక్షలు నెరవేర్చడంలో తమ వంతు పాత్ర పోషించారు‘. రాజీవ్ కల.. అప్పుడే సాకారం ‘చట్ట సభల్లో మహిళలకు సముచిత ప్రాతి నిధ్యం దక్కాలన్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కల సగమే నెరవేరింది. బిల్లు ఆమోదం పొందినప్పుడే అది పూర్తిగా సాకారవుతుంది. నేనో ప్రశ్న అడగాలనుకుంటున్నా. భారత మహిళలు తమ రాజకీయ బాధ్యతలను తలకెత్తుకునేందుకు 13 ఏళ్లుగా వేచిచూస్తున్నారు. ఇప్పుడు కూడా వారిని ఇంకా ఆరేళ్లు, ఎనిమిదేళ్లు... ఇలా ఇంకా ఆగమంటూనే ఉన్నారు. భారత మహిళల పట్ల ఇలాంటి ప్రవర్తన సరైనదేనా?‘ మహిళా శక్తికి ప్రతీక ఇందిర... ఇక దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వ్యక్తిత్వం భారత మహిళల శక్తి సామర్థ్యాలను తిరుగులేని ప్రతీకగా ఇప్పటికీ నిలిచి ఉంది. వ్యక్తిగతంగా నా జీవితంలో ఇది చాలా ముఖ్యమైన సందర్భం. మహిళలకు స్థానిక సంస్థల్లో మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ నా జీవిత భాగస్వామి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తొలిసారిగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. కానీ రాజ్యసభలో ఆ బిల్లును కేవలం ఏడు ఓట్లతో ఓడించారు. అనంతరం పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పాస్ చేయించింది. ఫలితంగా నేడు 15 లక్షలకు పైగా మహిళలు దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ప్రతినిధులుగా రాణిస్తున్నారు‘. -
మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్ణం: రాహుల్ గాంధీ
ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్తిగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఓబీసీలను బీజేపీ గాలికొదిలేస్తోందని ఆరోపించారు. ఇప్పుడున్న వ్యవస్థలో ఓబీసీలకు ప్రభుత్వం ఏం ప్రాధాన్యత ఇస్తుందో చెప్పాలని కేంద్రాన్ని రాహుల్ ప్రశ్నించారు. మహిళా బిల్లులో ఓబీసీ ప్రస్తావనే లేదని అన్నారు. మద్దతు ఇస్తున్నాం.. కానీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాను మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్న రాహుల్ గాంధీ.. కుల గణన చేపట్టి అత్యధిక జనాభా ఉన్న వర్గాలవారికి సముచిత స్థానం కల్పించాలని కోరారు. పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి మారేప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించకపోవడంపై రాహుల్ ప్రశ్నించారు. 90లో ముగ్గురు మాత్రమే.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 90 సెక్రటరీల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీ జాబితాలో ఉన్నారని రాహుల్ చెప్పారు. బడ్జెట్లో కేవలం 5 శాతం మాత్రమే వారి ఆధీనంలో ఉందని అన్నారు. కుల గణన చేయడంతోపాటు మహిళా బిల్లులో ఓబీసీలకు ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. తక్షణమే అమలు చేయండి.. పంచాయతీ రాజ్ వ్యవస్థే మహిళలకు అధికారం ఇచ్చిందని, అన్నాళ్ల తర్వాత ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లు మరో కీలక పరిణామం అని ఆయన అన్నారు. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి తీసుకురావడంపై రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నేటి నుంచి ఈ బిల్లు అమలులోకి రావాలని డిమాండ్ చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలని అన్నారు. ఇదీ చదవండి: కొత్త పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్ స్థానంలో కూర్చున్న తొలి తెలుగు ఎంపీగా మిథున్ రెడ్డి రికార్డు. -
ఆ బిల్లులు ఆమోదించాలి
మహిళలకు సమానావకాశాలతోనే అభివృద్ధి మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకా శాలు లభించినపుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని బీఆర్ఎస్పీపీ పేర్కొంది. మహిళా సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తీరుపై సమావేశంలో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర మొదటి అసెంబ్లీ సమావేశా ల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశా రు. వచ్చే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మరో తీర్మానాన్ని కూడా బీఆర్ఎస్పీపీ ఆమోదించింది. సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులు (ఓబీసీ), మహిళలకు పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన బిల్లులను ఆమోదించాలని కోరుతూ భారత్ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ (బీఆర్ఎస్ పీపీ) సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్ల మెంటు ప్రత్యేక సమావేశాల్లోనే వీటిని ఆమోదించాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు సమావేశా లు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బీఆర్ఎస్పీపీ సంయుక్త సమావేశం జరిగింది. పార్లమెంటు, శాసన సభల్లో ఓబీసీలు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టే దిశగా బీఆర్ ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించింది. మహిళా సంక్షేమం, వెనుక బడిన తరగతుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ కట్టుబడి ఉందని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వారి హక్కులు కాపాడేందుకు దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుంద న్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీ డిమాండ్లను ఎంపీలు లేవనెత్తాలని, అందుకు అవసరమైన సమాచారంతో సిద్ధం కావాలని సూచించారు. దేశ సంపదలో ఓబీసీల కీలక భాగస్వామ్యం తమ వృత్తుల ద్వారా దేశ సంపదను సృష్టించడంలో కీలక భాగస్వాములైన ఓబీసీలకు చట్టసభల్లో సముచిత ప్రాధాన్యత కల్పించేలా 33 శాతం రిజర్వే షన్లు అమలు చేయాలని బీఆర్ఎస్పీపీ ఏకగ్రీవంగా తీర్మానించింది. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నుగా ఉంటున్న ఓబీసీ కులాలను సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉందనే అభి ప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ధి సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు, కార్యాచరణ మంచి ఫలితాలు ఇస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయ ని ఎంపీలు అన్నారు. రాజకీయ అధికారంలో ఓబీసీ ల భాగస్వామ్యం మరింత పెంచడం ద్వారానే వా రు పూర్తి స్థాయిలో అభివృద్ది చెందుతారని బీఆర్ ఎస్పీపీ పేర్కొంది. పార్లమెంటు ప్రత్యేక సమావే శాల్లో ఓబీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి చిత్తశు ద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలోనే (14 జూన్ 2014) ఓబీసీ రిజర్వే షన్ బిల్లుపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయాన్ని గుర్తు చేసింది. తొమ్మిదేళ్లు కావస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. 17న కేంద్రం ఏమంటుందో చూద్దాం ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంటు సమా వేశాల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకానికి సంబంధించిన బిల్లుతో పాటు ఇతర బిల్లులు చర్చకు వస్తాయని కేంద్రం రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఎజెండాలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సీఎం కేసీఆర్ బీఆర్ఎస్పీపీ భేటీలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ‘ఈ నెల 17న కేంద్రం అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించే అంశాల ఆధారంగా తదుపరి కార్యాచరణపై వ్యూహాన్ని రూపొందించుకుందాం. ఒకవేళ జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌర స్మృతి వంటి అంశాలు ప్రస్తావనకు వస్తే మన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేద్దాం. ఈడీ నోటీసులు జారీ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నందున ఓ వైపు న్యాయ పోరాటం చేస్తూనే, మరోవైపు రాజకీయంగా ఎదుర్కొనేందుకు కూడా వెనుకాడేది లేదు. మహిళలు, ఓబీసీల రిజర్వేషన్ బిల్లులపై ఒత్తిడి చేయడం ద్వారా బీజేపీ అసలు స్వరూపం పడుతుంది..’ అని కేసీఆర్ అన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, పార్టీ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. వారికి 33% రిజర్వేషన్ కల్పించండి ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖలు చట్టసభల్లో మహిళలు, ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరారు. ఈ మేరకు రెండు వేర్వేరు లేఖలు రాశారు. వచ్చే పార్లమెంటు సమావేశా ల్లో బిల్లులు ప్రవేశ పెట్టాలని శుక్రవారం బీఆర్ఎస్పీపీ తీర్మానించిన నేపథ్యంలో ముఖ్య మంత్రి ఈ లేఖలు రాశారు. ‘శతాబ్దాలుగా మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమా పేందుకు ముందుచూపుతో రాజ్యాంగంలో కొన్ని వెసులుబాట్లు కల్పించిన విషయం మీకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. పార్లమెంటు, శాసనసభల్లోనూ మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు తెలంగాణ శాసనసభ 2014లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కానీ కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి చొరవను తీసుకోలేదు. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనైనా బిల్లు ఆమోదానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాను..’ అని ఒక లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ఓబీసీలకు కోటాపై సీఎం మరో లేఖ రాశారు. ‘విద్య, ఉద్యోగ రంగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్ ఫలాలు కొంతమేర దక్కినా చట్టసభల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేదు. ఇప్పటికైనా కేంద్రం 33 శాతం కోటా బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించాలి..’ అని కోరారు. -
తుది ఉత్తర్వుల మేరకే ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్ల అంశంపై తుది తీర్పునకు లోబడే సీట్ల కేటాయింపు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి పిటిషనర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. అలాగే వారి సర్టిఫి కెట్లను వెరిఫికేషన్ చేయించాలని అధికారులకు చెప్పింది. విభజన తర్వాత ఏపీ విద్యార్థులకు తెలంగాణలో రిజర్వేషన్ ఎలా ఇస్తారని న్యాయ స్థానం సందేహం వ్యక్తం చేసింది. పూర్తి వాదనలు విన్న తర్వాత తేలుస్తామని చెప్పింది. కొత్త మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లను తెలంగాణ విద్యార్థుల కే రిజర్వు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జూలై 3న ఇచ్చిన జీవో 72ను కొట్టివేయాలంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తెలంగాణ వైద్య కళాశాలల అడ్మిషన్ నిబంధనలకు సవరణ చేస్తూ ప్రభుత్వం వారం కిత్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2014, జూన్ 2 తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ కానున్నాయి. అంతకుముందు 85 శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం అన్‌రిజర్వుడుగా ఉండేది. ఇందులో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా పోటీ పడేవారు. తాజా జీవోతో ఏపీ విద్యార్థులకు పోటీపడే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన పి.సాయిసిరిలోచనతో పాటు మరో ఇద్దరు తెలంగాణ హైకోర్టులో పిటిష న్లు దాఖలు చేశారు. వాదనల అనంతరం హైకో ర్టు విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది. -
ప్రయాణికులకు శుభవార్త.. ఛార్జీలను తగ్గిస్తూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం..
తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త తెలిపింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ ఛార్జీలను తగ్గిస్తూ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయమున్న ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ఛార్జీలు ఈ మేరకు తగ్గనున్నాయి. ఎక్స్ ప్రెస్, డీలక్స్ సర్వీసుల్లో 350 కిలో మీటర్ల లోపు రూ.20గా, 350 ఆపై కిలోమీటర్లకు రూ.30గా ఛార్జీని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే రూ.30 వసూలు చేయనుంది. "టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు మంచి స్పందన ఉంది. ప్రతి రోజు సగటున 15 వేల వరకు తమ టికెట్లను ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ చార్జీలను తగ్గించడం జరిగింది. ఈ సదుపాయాన్ని ప్రయాణికులందరూ ఉపయోగించుకుని.. సంస్థను ఆదరించాలి." అని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. ఇదీ చదవండి: ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా లింబాద్రి నియామకం -
అగ్నివీర్లకు రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్!
న్యూఢిల్లీ: సాయుధ బలగాల్లో నాలుగు సంవత్సరాలు విధులు నిర్వర్తించాక త్రివిధ బలగాల్లో ఉద్యోగం నుంచి బయటికొచ్చిన అగ్నివీర్లకు తమ ఉద్యోగ భర్తీల్లో వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పిస్తామని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ వివరాలను సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వేర్వేరు రైల్వే విభాగాల్లో నేరుగా రిక్రూట్మెంట్కు సంబంధించి నాన్–గెజిటెడ్ పోస్టుల్లో వారికి 15 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఆయా ఉద్యోగాలకు అర్హత వయసులో సడలింపు అవకాశం ఇవ్వనున్నారు. దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు కల్పిస్తారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)లో అగ్నివీర్లకు రిజర్వేషన్ విధానాన్ని తెచ్చే యోచనలో ఉన్నారు. నాన్–గెజిటెడ్ పోస్టుల్లో లెవల్ 1లో 10 శాతం , లెవల్ 2లో 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. దివ్యాంగులు, మాజీ సైనికులు, అప్రైంటీస్ల రెగ్యులరైజేషన్ విధానాలకు అనుగుణంగా వీరి నియామకం ఉంటుంది. తొలి బ్యాచ్ అగ్నివీర్లకు ఐదేళ్ల వయసు సడలింపు, రెండో బ్యాచ్ వారికైతే మూడేళ్ల వయోపరిమితి సడలింపు వర్తింపజేస్తారు. -
శాశ్వత అంగవైకల్యం ఉంటేనే రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతులకు సంబంధించి వికలాంగ (దివ్యాంగ) రిజర్వేషన్ల అమలులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాశ్వత అంగవైకల్యం ఉన్న వారికి మాత్రమే దివ్యాంగ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇదివరకు తాత్కాలిక వైకల్య ధ్రువీకరణ(టెంపరరీ డిజేబుల్డ్ సర్టిఫికెట్)తో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో, పదోన్నతుల్లో అవకాశం కల్పించగా... ఇప్పుడు ఆ ప్రయోజనాలను నిలిపివేసింది. తాత్కాలిక వైకల్యంతో ఉన్న వ్యక్తికి కొంత కాలం తర్వాత వైకల్య స్థితిలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పు తాలుకు ఫలితం వైకల్యం నయమవ్వడం లేదా శాశ్వత వికలాంగుడిగా మారడంలాంటి సంఘటనలు అనేకం ఉంటాయి. ఈ క్రమంలో వికలత్వ నిర్ధారణ విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. శాశ్వత నిర్ధారణ సర్టిఫికెట్లే పరిగణించాలని.. ► శాశ్వత వికలత్వ నిర్ధారణ సర్టిఫికెట్లను మాత్రమే పరిగణించాలని, ఇతరత్రా సర్టిఫికెట్లను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వికలాంగుల సాధికారత, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రూపొందించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ అందుకు అనుగుణంగా జీఓ 41 జారీ చేసింది. 40శాతం దాటితేనే... వికలాంగ రిజర్వేషన్ల అమలులో వికలత్వ శాతమే కీలకం. కనీసం 40శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరిస్తేనే రిజర్వేషన్ల వర్తింపును ప్రభుత్వం అనుమతిస్తుంది. ప్రతి వికలాంగుడు తప్పకుండా వైకల్య ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. అందులో శాశ్వత ప్రాతిపదిక వైకల్యం ఉన్నట్లయితేనే రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈమేరకు జీఓ 41లో స్పష్టత ఇచ్చింది. తాత్కాలిక వైకల్యం(టెంపరరీ డిజబులిటీ) ధ్రువీకరణ పత్రాన్ని ఇదివరకు అంధ విభాగంలోనే జారీ చేస్తుండగా... ప్రస్తుతం అన్ని కేటగిరీల్లోనూ ఈ ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం జారీ చేస్తోంది. మొదటిసారి ధ్రువీకరణ పత్రం కోసం సంప్రదించే ప్రతి వికలాంగుడికి టెంపరరీ సర్టిఫికెట్ ఇస్తున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ నియామకాలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు నియామక సంస్థలు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి అర్హత పరీక్షలు సైతం నిర్వహిస్తున్నాయి. అతి త్వరలో పరీక్షల నిర్వహణ ప్రక్రియ వేగం పుంజుకోగా... వెనువెంటనే ఫలితాలను ప్రకటించి నియామకాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాయి. ఈ సమయంలో వికలాంగ రిజర్వేషన్ల అమలులో మరింత పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. వికలాంగ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన జీఓ 41 ప్రతులను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక సంస్థలకు ప్రత్యేకంగా పంపింది. జీఓ 41లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇది వికలాంగులపై కక్షసాధింపు చర్యః ముత్తినేని వీరయ్య తాత్కాలిక ధ్రువీకరణను రిజర్వేషన్ల అమలులో పరిగణించమంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర అన్యాయం. ప్రస్తుతం సదరమ్ ద్వారా జారీ చేస్తున్న సర్టిఫికెట్లన్నీ టెంపరరీ సర్టిఫికెట్లే. కొందరికి రెండు, మూడేళ్లుగా ఇవే సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగ నియామకాల సమయంలో ఈ అంశాన్ని తీసుకురావడంతో అసలైన లబ్ధిదారులు నష్టపోయే అవకాశాలున్నాయి. జీఓ 41 జారీ ప్రక్రియ వికలాంగులపై కక్షసాధింపు చర్యగా భావిస్తున్నాం. ఈ ఉత్తర్వులను రద్దు చేసేందుకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. -
కన్నడనాట రిజర్వేషన్ల రగడ
అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ సర్కారు రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. ఓబీసీ కోటాలో ముస్లింలకు అందుతున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గత వారం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఆ 4 శాతాన్ని బీజేపీకి గట్టి ఓటు బ్యాంకైన వక్కలిగలు, లింగాయత్‌లకు సమానంగా పంచడంపై కలకలం రేగుతోంది. ఈ పరిణామం విపక్ష కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. ఇవి ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శిస్తూనే, తాము అధికారంలోకి వస్తే ముస్లింల కోటాను పునరుద్ధరిస్తామంటూ హస్తం పార్టీ తాజాగా ఎన్నికల హామీ ఇచ్చింది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లను ఉప కులాలవారీగా విభజించిన తీరుతో తమకు అన్యాయం జరిగిందంటూ బంజారాలు, ఆదివాసీలు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు... ఏం జరిగింది? కర్ణాటకలో ముస్లింలను ఓబీసీ జాబితాలోని 2బీ కేటగిరీ నుంచి తొలగిస్తూ బొమ్మై ప్రభుత్వం వారం క్రితం నిర్ణయం తీసుకుంది. ఓబీసీ కోటాలో భాగంగా విద్య, ఉద్యోగాల్లో వారికి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. వాటిని లింగాయత్‌లు, వక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ముస్లింలను ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల) జాబితాకు మారుస్తున్నట్టు సీఎం బొమ్మై చెప్పుకొచ్చారు. ‘‘మతాధారిత రిజర్వేషన్లకు రాజ్యాంగంలో చోటు లేదు. ముస్లింలకు ఇకనుంచి 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి’’అన్నారు. కాంగ్రెస్ ఏమంటోంది? ముస్లింలను ఓబీసీ జాబితా నుంచి ఏ ప్రాతిపదికన తొలిగించారంటూ కాంగ్రెస్ మండిపడింది. ఇది మతాల మధ్య మంటలు రాజేసే యత్నమంటూ దుయ్యబట్టింది. ముస్లింల 4 శాతాన్ని తమకు పంచడంపై లింగాయత్‌లు, వక్కలిగలు కూడా సంతోషంగా లేరని చెప్పుకొచ్చింది. ‘‘ముస్లింలను ఓబీసీ నుంచి ఈడబ్ల్యూఎస్ కోటాకు మార్చడం రాజ్యాంగవిరుద్ధం. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఏ మతానికి, కులానికి చెందిన వారైనా జనరల్ కేటగిరీ అయిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులే అవుతారు. అలాంటి కోటాకు ముస్లింలను మార్చి, వారికేదో కొత్తగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు బీజేపీ చెప్పుకోవడం విడ్డూరం’’అంటూ మండిపడింది. తాము అధికారంలోకొస్తే వారికి 4 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. భగ్గుమన్న బంజారాలు, ఆదివాసీలు విద్య, ఉద్యోగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి, ఎస్టీలకు 4 నుంచి 7 శాతానికి బీజేపీ సర్కారు గత డిసెంబర్లో పెంచింది. అయితే వారిలో అణగారిన ఉప కులాల వారికి రిజర్వేషన్ల ఫలాలు అందకుండా బలవంతులైన కొన్ని ఉప కులాల వాళ్లే వాటిని అత్యధికంగా చేజిక్కించుకుంటున్నారన్న ఫిర్యాదు చాలాకాలంగా ఉంది. ఈ అసమానతలను సరిచేయాలన్న వారి చిరకాల డిమాండ్‌పై బొమ్మై ప్రభుత్వం ఇటీవలే రంగంలోకి దిగింది. 101 ఎస్సీ కులాల వారికి సమ న్యాయం చేసేందుకు అంతర్గత రిజర్వేషన్లను నిర్ణయించింది. ► ఆ మేరకు రాజ్యాంగంలోని 341(2) ఆర్టికల్ ప్రకారం ఎస్సీలను 4 విభాగాలుగా వర్గీకరించారు. ఎస్సీ (లెఫ్ట్)కు 6 శాతం రిజర్వేషన్లు కేటాయించింది. ఆ జాబితాలోకి మాదిగ, ఆది ద్రవిడ, బాంబి ఉపకులాలు వస్తాయి. ► ఎస్సీ (రైట్)కు 5.5 శాతం కేటాయించింది. ఆది కర్ణాటక, హోలెయా, చలవాది ఉప కులాలు దీని కిందికి వస్తాయి. బంజారా, భోవి, కొరచ, కొరమలకు 4.5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ► మిగిలిన ఒక్క శాతం సంచార, ఆదివాసీ జాతులైన అలెమరి, ఆరె అలెమరిలకు దక్కుతుంది. ► దీన్ని బంజారా, భోవి కులాలవాళ్లు తీవ్రంగా నిరసిస్తున్నారు. తమకు తీరని అన్యాయం జరిగిందంటూ ఆందోళనలకు దిగారు. తాజాగా మాజీ సీఎం యడ్యూరప్ప నివాసంపై రాళ్లు రువ్వడం అందులో భాగమే. వక్కలిగ, లింగాయత్... బలీయమైన ఓటు బ్యాంకులు వక్కలిగలు, లింగాయత్‌లు కర్ణాటకలో బలమైన సామాజిక వర్గాలు. బలీయమైన ఓటు బ్యాంకులు కావడంతో ఎన్నికల్లో వాటి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. బెంగళూరు నగర నిర్మాత కెంపె గౌడది వక్కలిగ సామాజిక వర్గమే. రాష్ట్రంలో గత, ప్రస్తుత రాజకీయ ప్రముఖుల్లో చాలామంది ఈ కులాలకు చెందినవారే. ► పలు నివేదికల ప్రకారం రాష్ట్ర జనాభాలో లింగాయత్‌లు 17 శాతం ఉంటారు. ► మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 100 చోట్ల వీరు ఫలితాలను శాసించే స్థితిలో ఉన్నారు. ► లింగాయత్‌లు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉంటూ వస్తున్నారు. ► ఇక వక్కలిగలు జనాభాలో 11% ఉన్నట్టు అంచనా. కానీ తాము నిజానికి 16 శాతం దాకా ఉంటామన్నది వీరి వాదన. ► తొలుత ప్రధానంగా వ్యవసాయదారులైన వక్కలిగలు స్వాతంత్య్రానంతరం పలు రంగాలకు విస్తరించి పట్టు సాధించారు. ► తమకు రిజర్వేషన్లు పెంచాలంటూ ఈ రెండు సామాజిక వర్గాలూ కొద్ది నెలలుగా బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. లేదంటే ఈసారి బీజేపీకి ఓటేసేది లేదంటూ భీష్మించుకున్నాయి. ► తాజాగా ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను వీరికి పంచడంతో వక్కలిగల రిజర్వేషన్లు 4 నుంచి 6 శాతానికి, లింగాయత్‌లకు 5 నుంచి 7 శాతానికి పెరిగాయి. -
ట్రైన్ జర్నీ వాయిదా, తేదీని మార్చుకోవాలా?.. ఇలా చేస్తే క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉండవు!
ప్రజలు సాధారణంగా ఫలానా తేదీన ట్రైన్ జర్నీఅనుకున్నప్పుడు టికెట్లను ముందుగానే రిజర్వేషన్ చేసిపెట్టుకుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్లు అనుకున్న ప్రయాణ తేదీని వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. అనగా మందనుకున్న ప్రయాణం తేదీని ముందుగా లేదా తర్వాత రోజులకు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడచ్చు. గతంలో అయితే ఈ తరహా ఘటనలు ఎదురైతే టికెట్ రద్దు (క్యాన్సిల్) చేసుకోవాలి. అందువల్ల రైల్వే శాఖ క్యాన్సిలేషన్ ఛార్జిని మినహాయించుకుని మిగిలిన నగదును మాత్రమే ప్రయాణికుడికి ఇస్తుంది. ఇలా చేయడం వల్ల ప్యాసింజర్ కొంత డబ్బును నష్టపోవాల్సి ఉంటుంది. ఇటీవల దీనికి పరిష్కారంగా భారతీయ రైల్వే కొత్త సేవలను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రయాణికుడికి ఏ నష్టం రాకుండా ప్రయాణా టికెట్‌ను మార్చుకోవచ్చు. అయితే, ఈ సదుపాయం కేవలం ఆఫ్‌లైన్ టిక్కెట్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇ-టికెటింగ్ విభాగం ఆన్లైన్ బుకింగ్ తేదీని మార్చుకునే సదుపాయం లేదు. క్యాన్సిల్ చేసిన.. ఛార్జీలు పడవు కావు తెరపైకి వచ్చిన కొత్త సేవలో.. ప్యాసింజర్ బుక్ చేసుకున్న ప్రయాణ తేదీని మార్చుకునే వెసలుబాటు ఉంది. అది కూడా క్యాన్సిలేషన్ ఛార్జీలు లేకుండానే ఆ టికెట్లను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా ... మనం ముందుగా బుక్ చేసుకున్న రైలు ప్రయాణం ప్రారంభమయ్యే కనీసం 48 గంటల ముందే రిజర్వేషన్ కౌంటర్‌కు (పనివేళల్లో) వెళ్లి మీ టికెట్‌ను సంబంధిత రైల్వే ఉద్యోగికి సరెండర్ చేయాలి. అదే సమయంలో మీరు ఏ రోజున ఏ సమయంలో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నారో రిజర్వేషన్ కౌంటర్లోని ఉద్యోగులకు తెలియజేయాలి. అంతేకాకుండా ఇందులో మరో సౌకర్యం ఏమనగా.. ఆ సమయంలో ప్యాసింజర్లు ప్రయాణపు తరగతిని కూడా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ కౌంటర్ అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి మీరు కోరిన రోజున ప్రయాణానికి అందుబాటులో ఉంటే సర్దుబాటు చేస్తారు. ఇందుకోసం అదనపు ఛార్జీలు తీసుకోరు. మీ కోచ్ తరగతిని అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే అందుకు తగిన టికెట్ ధరను మాత్రం తీసుకుంటారు. ఈ సదుపాయం కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారితో పాటు, ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారు సైతం ఒకసారి ఉపయోగించుకోవచ్చు. బోర్డింగ్ స్టేషన్నూ మార్చుకోవచ్చు.. ప్రయాణికులు ఒరిజినల్ బోర్డింగ్ స్టేషన్‌లోని స్టేషన్ మేనేజర్‌కి వ్రాతపూర్వక అభ్యర్థనను సమర్పించడం ద్వారా లేదా ఏదైనా కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా బోర్డింగ్ స్టేషన్‌ను మార్చవచ్చు. అయితే అందుకోసం రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు సమాచారం తెలపాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ టిక్కెట్లకు కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. చదవండి : భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు భారీ షాక్! -
అది అత్యంత ముఖ్యమైనది: తొలి ట్రాన్స్ జెండర్ జడ్జి
ఇండోర్: ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం అత్యంత ముఖ్యమని తొలి ట్రాన్స్ జెండర్ జడ్జి జోయిత్ మోండల్ నొక్కి చెప్పారు. అంతేగాదు ట్రాన్స్ జెండర్లు పోలీస్ ఫోర్స్, రైల్వే వంటి విభాగాల్లో పనిచేయడం వల్ల వారిపట్ల సమాజ దృక్పథం కూడా మారుతుందని మోండల్ అన్నారు. ఈమేరకు లిట్ చౌక్ అనే సాంస్కృతి సాహిత్య ఫెస్టివల్లో పాల్గొన్న అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జోయితా మోండల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే తన కమ్యూనిటీ సభ్యులు, వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అధికారులు చాలా సున్నితంగా వ్యవహరించాలని అన్నారు. ట్రాన్స్ జెండర్ల కమ్యునిటీలకు సరైన వసతి లేదని, అందుకోసం ఒక పథకాన్ని ప్రవేశ పెట్టాలని అన్నారు. ఇదిలా ఉండగా జోయితా మోండల్ 2017లో పశ్చిమ బెంగాల్ ఇస్లాంపూర్ లోక్ అదాలత్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశంలో అలాంటి పదవిని అలంకరించిన తొలి ట్రాన్స్ జెండర్‌గా జోయితా మోండల్ నిలిచారు. ఆమె తర్వాత 2018లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లోక్ అదాలత్‌లో న్యాయమూర్తిగా విద్యాకాంబ్లే, ఆమె తర్వాత గౌహతి నుంచిస్వాతి బిధాన్ బారుహ్ ఇలాంటి అత్యున్నత పదవిని అలకరించిన ట్రాన్స్ జెండర్లుగా నిలిచారు. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లు కూడా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫిబ్రవరి 2023 కల్లా ఫిజికల్ టెస్టులకు ప్రమాణాలు నిర్దేశిస్తామని బొంబే హైకోర్టుకు తెలపడం గమనార్హం. (చదవండి: ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు చేయండి ) -
AP: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు..
సాక్షి, అమరావతి: హోంగార్డులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీపికబురు అందించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలు సవరించి మరీ హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్(ఏఆర్), ఏపీఎస్పీ, ఎస్ఏఆర్ సీపీఎల్, కానిస్టేబుళ్ల పోస్టులతోపాటు పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్, ఫిట్టర్ – ఎలక్ట్రీషియన్, మెకానిక్స్, డ్రైవర్ పోస్టుల నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్స్ విభాగాల్లో మహిళా, పురుష కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు వర్తింపజేశారు. ఏపీఎస్పీ, ఎస్ఏఆర్ సీపీఎల్, ఫిట్టర్ ఎల్రక్టీషియన్, మెకానిక్స్, డ్రైవర్ కేటగిరీల్లో పురుష కానిస్టేబుల్ పోస్టులే భర్తీ చేస్తారు. కాబట్టి ఆ విభాగాల పోస్టుల భర్తీలో పురుష హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. కానిస్టేబుల్ నియామకాల్లో కేటగిరీలవారీగా 5 శాతం నుంచి 25% వరకు హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం. ఈమేరకు ‘ఆంధ్రప్రదేశ్ పోలీస్ రూల్స్ 1999’కి సవరణ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఇక నుంచి కానిస్టేబుల్ నియామకాల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తారు. త్వరలో 6,500 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమవుతున్న తరుణంలో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీనివల్ల రాష్ట్రంలో 15 వేల మంది హోంగార్డులకు ప్రయోజనం కలగనుంది. హోంగార్డులకు ముఖ్యమంత్రి వరం హోంగార్డులకు ప్రయోజనం కలిగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తగిన సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలంగా పని చేస్తున్నప్పటికీ పోలీసు శాఖలో హోంగార్డులు తగిన గుర్తింపునకు నోచుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హోంగార్డుల జీతాలు పెంచింది. అప్పటివరకు నెలకు రూ.18 వేలు మాత్రమే ఉన్న హోంగార్డుల జీతాన్ని రూ.21,300కి పెంచుతూ 2019 అక్టోబరులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు వారికి మరింత మేలు చేకూరుస్తూ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పోలీసు నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది. అంతకంటే ముందే హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చట్ట సవరణ చేయడం వారికి వరంగా మారనుంది. చదవండి: ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్ గేమ్.. ఇంకెన్ని దారుణాలు చూడాలో.. -
రైల్వే ప్యాసింజర్లకు ఇది తెలుసా.. రిజర్వేషన్ టికెట్ లేకపోయిన ప్రయాణించవచ్చు!
ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేరుస్తోంది ఇండియన్ రైల్వేస్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చవకైన ప్రయాణాన్ని ప్రజలకు అందిస్తు రైల్వే శాఖ ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ప్రభుత్వ సంస్థగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త సేవలతో అందిస్తూ ప్రయాణికులకు పెద్ద పీట వేస్తూ దూసుకోపోతోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్న కొందరు అకస్మాత్తుగా ప్రయాణించవలసి రిజర్వేషన్ టికెట్ దొరకకపోవచ్చు. అటువంటి సమయంలో వారికి రిజర్వేషన్ టికెట్ దొరకపోవచ్చు. అయినా ఏం ఫర్వాలేదు రిజర్వేషన్ టికెట్ లేకున్నా ప్యాసింజర్లు వారి గమ్యస్థానానికి ఇలా ప్రయాణించవచ్చు. ఎలా అంటారా? ప్లాట్‌ఫాం టికెట్‌తో ప్రయాణం ఎలా.. ప్యాసింజర్ తన వద్ద రిజర్వేషన్ టికెట్ లేదని కంగారుపడాల్సిన పనిలేదు. అటువంటి పరిస్థితుల్లో సదరు ప్రయాణికుడు ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌తో రైలులో ప్రయాణించవచ్చు. అయితే మీరు వెంటనే టికెట్ కలెక్టర్ (TTE) సంప్రదించాల్సి ఉంటుంది. ఆపై మీ గమ్యస్థానాన్ని అతనికి చెప్పి అందుకు తగ్గ డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా మీరు టిక్కెట్ తీసుకుని ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ రూల్స్ కూడా తెలుసుకోండి.. రిజర్వేషన్ లేకుండా ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకున్న ప్యాసింజర్ ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. రైలులో ఒక్కోసారి రద్దీ కారణంగా బెర్త్ మాత్రమే కాదు సీటు ఖాళీగా లేని సందర్భాలు బోలెడు ఉంటాయి. అటువంటి సమయంలో టీటీఈ ప్రయాణికుడికి రిజర్వ్ సీటు ఇవ్వలేకపోవచ్చు. కానీ, ప్యాసింజర్ ప్రయాణాన్ని మాత్రం ఆపలేరు. అటువంటి సమయంలో మీరు నిబంధనల ప్రకారం రిజర్వేషన్ టికెట్ లేకుండా రిజరేషన్ బోగీలో ప్రయాణించాలనుకుంటే .. రూ. 250 అపరాధ రుసుముతో (ఫైన్) పాటు ప్రయాణానికి సంబంధించిన మొత్తం ఛార్జీని చెల్లించాలి. ఆపై టీటీఈ నుంచి సంబంధిత టికెట్ తీసుకోవాలి. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
సుప్రీంకోర్టులో మరోసారి సవాల్ చేస్తాం
ముషీరాబాద్ (హైదరాబాద్): ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన మెజార్టీ తీర్పు విచారకరమని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో మరోసారి రివ్యూ పిటిషన్ వేస్తామని ప్రకటించారు. 15 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపాలన్నారు. హైదరాబాద్‌లోని బీసీ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...అగ్ర కులాల్లోని పేదలకు ఆర్థిక పరమైన స్కీములు పెట్టి అభివృద్ధి చేయాలి తప్ప విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదని, ఆర్థిక అభివృద్ధి పథకం అంతకంటే కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి కులానికి తమతమ జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, అధికార పదవులలో వాటా ఇవ్వాలని కోరారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విరుద్ధమని ఇది రాజ్యాంగ పరంగా చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. -
మతం మారితే రిజర్వేషన్లు వద్దు: వీహెచ్‌పీ
ధన్తోలి: మతం మార్చుకున్న ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందరాదని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అభిప్రాయపడింది. మతం మారిన వారు కుల ఆధారిత రిజర్వేషన్‌తోపాటు మైనారిటీ హోదాల్లోనూ ప్రయోజనం పొందుతున్నారని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి విజయ్ శంకర్ తివారీ అన్నారు. శుక్రవారం నాగ్‌పూర్(మహారాష్ట్ర) ధన్తోలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ఇలా రెండు ప్రయోజనాలు పొందటాన్ని తాము అడ్డుకుంటామని తివారీ చెప్పారు. ఈ ప్రయోజనాలను ఆశించే చాలా మంది మతం మారుతున్నారన్నారు. కేంద్రం కూడా ఈ దిశగా రిజర్వేషన్లు అందకుండా చూసే ప్రణాళిక రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మత మార్పిడుల కోసం పలు ప్రయత్నాలు ఊపందుకున్నాయని, అలాంటి కార్యకలాపాలను ఎదుర్కోవడానికి వీహెచ్‌పీ తరపున ఒక కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: మత విద్వేష ప్రసంగాలపై సుప్రీం సీరియస్ -
వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మెడిసిస్ చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వెయ్యికిపైగా ఎంబీబీఎస్ బీ-కేటగిరి సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇచ్చేలా సవరణలు చేశారు. ఎంబీబీఎస్ బీ-కేటగిరి సీట్లలో 85శాతం లోకల్ రిజర్వేషన్ల(తెలంగాణకు చెందినవారికే) కింద ఉండేలా మార్పులు చేశారు. ఇకపై కేవలం 15 శాతం మాత్రమే ఓపెన్ కోటా కింద సీట్లు ఇవ్వనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి హారీష్ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం జీవో నెంబర్ 129, 130 లను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్-బీ కేటగిరీ సీట్లలో కేటాయించే 35శాతం సీట్లలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. దీంతో, రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభించనున్నాయి. -
‘ఓపెన్’లో ఖాళీలు తగ్గవా?
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలు, ప్రభుత్వోద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బుధవారం పలు ప్రశ్నలు సంధించింది. ఈ కోటా వల్ల ఓపెన్ కేటగిరీలో అందుబాటులో ఉండే సీట్లు, ఖాళీలు 40 శాతానికి తగ్గిపోతాయన్న వాదనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తావించింది. ఓపెన్ కేటగిరీలోని 50 శాతం ఖాళీలను తగ్గించడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను గుర్తు చేసింది. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లోని పేదలను కులం ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి నహాయించడం వాస్తవమేనా? ఈ కోటా వల్ల ఓబీసీల్లోని క్రీమీ లేయర్‌కు అందుబాటులో ఉండే ఖాళీలు కూడా 40 శాతానికి తగ్గుతాయన్నది నిజమేనా? మెరిట్ ఉన్న వారందరికీ ఓపెన్ కేటగిరీలో పోటీపడేందుకు అవకాశం ఉండాలి కదా’’ అంటూ ప్రశ్నించింది. ఓపెన్ కేటగిరీ ఖాళీలకు ఏ విధంగానూ కోత పడని రీతిలోనే ఈడబ్ల్యూఎస్ కోటాను రూపొందించినట్టు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. ఓపెన్, రిజర్వుడు కేటగిరీలు ప్రత్యేకమైన విభాగాలు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 50 శాతం రిజర్వుడు కేటగిరీలో తగిన ప్రాతినిధ్యం దక్కిందని వేణుగోపాల్ వివరించారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ఈడబ్ల్యూఎస్ వర్గానికి కూడా ఎన్నికల్లో కొన్ని స్థానాలు రిజర్వు చేయగలరా అని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ గురువారం కూడా కొనసాగనుంది. ఇక ప్రత్యక్ష ప్రసారాలు సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కీలక కేసుల విచారణ ప్రక్రియ ఇకపై ప్రత్యక్షప్రసారం కానుంది. తొలుత రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు 27వ తేదీ నుంచి ప్రసారం కానున్నాయి. ప్రస్తుతానికి యూట్యూబ్ ద్వారా ప్రసారాలు ఉంటాయని సమాచారం. త్వరలో సుప్రీంకోర్టు సొంత ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తుందని కోర్టు వర్గాలు తెలిపాయి. గుజరాత్, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్, పట్నా, మధ్యప్రదేశ్ హైకోర్టులు ఇప్పటికే తమ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. -
సూర్యాపేటలో గిరిజనుల భారీ ర్యాలీ
భానుపురి (సూర్యాపేట): గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ల పెంపుతోపాటు గిరిజన బంధు, పోడు భూముల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం గిరిజనులు సంబురాలు చేసుకున్నారు. ఖమ్మం క్రాస్ రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం నుంచి చర్చి కాంపౌండ్ రోడ్డు, పొట్టిశ్రీరాములు సెంటర్, పూలసెంటర్, కల్నల్ సంతోష్‌బాబు చౌరస్తా మీదుగా రైతుబజార్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వరకు డీజే మోతలు, నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహంతో పాటు సీఎం కేసీఆర్, విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. -
సుప్రీం కోర్టులో సీఎం స్టాలిన్‌కు ఎదురు దెబ్బ...
-
స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్
న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గట్టి షాకిచ్చింది. వన్నియార్ కమ్యూనిటీకి కేటాయించిన 10.5 శాతం అంతర్గత రిజర్వేషన్ చెల్లదని, ఇందుకోసం రూపొందిచిన చట్టాన్ని రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందంటూ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది బెంచ్. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో వన్నియార్ కమ్యూనిటీకి 10.5 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ప్రభుత్వం. ఇందుకోసం స్టాలిన్ ప్రభుత్వం 2021లో ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చింది. అయితే ఓబీసీ కోటాలో ఈ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అత్యంత వెనుకబడిన తరగతుల(MBC) కోసం 20 శాతం కోటా ఉండగా.. అందులో 10.5 శాతం వన్నియార్ కమ్యూనిటీకి వర్తింపజేస్తూ 2021 తమిళనాడు యాక్ట్‌ను తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలో అభ్యంతరాలు వ్యక్తంకాగా.. తమిళనాడు యాక్ట్ 2021ను కొట్టేస్తూ ఇంతకు ముందు మద్రాస్ హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. తాజాగా చట్టాన్ని రద్దు చేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులనే సమర్థించింది సుప్రీం కోర్టు. జస్టిస్ ఎల్ నాగేశ్వరావు, బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. MBCలలో వన్నియార్లను ప్రత్యేక సమూహంగా పరిగణించాల్సిన డేటాను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, తద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 16లకు ఈ చట్టం వ్యతిరేకంగా ఉంది, అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నామని ఈ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. చట్టాలు చేసుకునే హక్కు చట్ట సభలకు ఉన్నా.. కుల ఉప తరగతులను ప్రభావితం చేసే విధంగా రాష్ట్రాలకు ఉండబోదని బెంచ్ పేర్కొంది. -
రిజర్వేషన్ డ్రా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు
-
గుడ్‌న్యూస్: సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
TSRTC Offers To Travelers: దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న సర్వీసు వద్దకు చేరే వరకు సిటీలో రెండు గంటల పాటు ఫ్రీగా ప్రయాణించే గొప్ప అవకాశం టీఎస్ ఆర్టీసీ కల్పించిందని భెల్ డిపో మేనేజర్ సత్యనారాయణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, తిరుపతి, చెన్నై, విశాఖపట్టణం, కాకినాడ, భద్రాచలం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు, 250 కిలోమీటర్ల దూరం మించి ఉన్న ప్రాంతాలకు ఆన్లైన్ లేదా బుకింగ్ కేంద్రాల వద్ద రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ అవకాశం పొందవచ్చన్నారు. ముందుగా బుక్ చేసుకున్న బస్సు బయలుదేరే టైం వరకు రెండు గంటల ముందు నగరంలో ఏ ప్రాంతం నుంచైనా బస్సు ఉన్న చోటుకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. నాన్ ఏసీ బుక్ చేసుకున్న ప్రయాణికులు నాన్ ఏసీ సిటీ సర్వీసుల్లో, ఏసీ బస్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఏసీ సర్వీస్‌ల్లోనూ, నాన్ ఏసీ బస్సుల్లోను ప్రయాణించే వెసులుబాటు ఉందని తెలిపారు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు వచ్చే ప్రయాణికులకు కూడా వారు షెడ్యూల్డ్ టైం నుంచి 2 గంటలలోపు వారి గమ్యస్థానాలకు చేరుకునే వరకు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. టీఎస్ ఆర్టీసీ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చదవండి: (నిలోఫర్‌లో ఇద్దరు చిన్నారుల మృతి? ఉద్రిక్తత) -
ఫారెస్ట్రీ విద్యకు ఉజ్వల భవిష్యత్తు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో ఫారెస్ట్రీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడ్డాయి. అటవీ శాఖలో ఉద్యోగాలకు ఇక్కడ ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన వారికి ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించడంతో ఇదివరకు ఇక్కడ చదువుకున్నవారు, ప్రస్తుతం కోర్సుల్లో ఉన్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అడవులు, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న క్రమంలో అటవీ నిర్వహణను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రత్యేక విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2016లో అటవీ కళాశాల, పరిశోధన సంస్థను ప్రారంభించింది. తొలుత సొంత భవనం లేకపోవడంతో హైదరాబాద్‌లోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో సంస్థను ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట జిల్లా ములుగు సమీపంలో 52 హెక్టార్ల విస్తీర్ణంలో నూతన భవనాన్ని నిర్మించారు. 2019 నుంచి ములుగులోని నూతన భవనంలో తరగతులు ప్రారంభమయ్యాయి. కళాశాల విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు.. ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన వారికి అటవీ శాఖకు సంబంధించిన ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎఫ్ఆర్ఓ (ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్) ఉద్యోగానికి 50 శాతం, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్) ఉద్యోగానికి 25 శాతం, ఫారెస్టర్స్ ఉద్యోగాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన వారిలో ఎక్కువ మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై అటవీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడంతో ఈ కోర్సుకు మరింత డిమాండ్ పెరగనుంది. బీఎస్సీ ఫారెస్ట్రీ.. నాలుగేళ్ల కోర్సు ములుగు కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ నాలుగేళ్లు, ఎంఎస్సీ ఫారెస్ట్రీ రెండేళ్ల కోర్సులు కొనసాగుతున్నాయి. బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సుకు తొలి రెండు సంవత్సరాలు ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించారు. 2018 నుంచి ఎంసెట్ (బీపీసీ)లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌లలో 97 మంది విద్యార్థులు నాలుగేళ్ల కోర్సును పూర్తి చేయగా మరో 214 మంది విద్యార్థులు ఈ కోర్సును అభ్యసిస్తున్నారు. 2020లో ఎంఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును ప్రారంభించారు. ఏఐఈఈఏ ఎంట్రెన్స్ ఉత్తీర్ణులు అయిన వారు ఎంఎస్సీ కోర్సులో చేరేందుకు అర్హులు. ఎంఎస్సీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ఈ సంవత్సరం విద్య పూర్తికానుంది. ఇందులో ఒక్కో సంవత్సరం 17 మందికి అడ్మిషన్ ఇస్తున్నారు, ఇప్పటి వరకు 34 మందికి ప్రవేశాలు కల్పించారు. -
నీట్ పీజీ కౌన్సిలింగ్‌కు గ్రీన్‌సిగ్నల్
-
నీట్ పీజీ కౌన్సిలింగ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: నీట్ పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా 2021-22 ఏడాదికి సంబంధించి నీట్-పీజీ కౌన్సిలింగ్‌కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఓబీసీలకు 27 శాతం,ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్ల కోటా సబబే అని సుప్రీంకోరర్ట పేర్కొంది. గతంలో మాదిరిగానే క్రిమిలేయర్.. సంవత్సర ఆదాయం 8 లక్షలలోపు ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింప చేయాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి నీట్లో 10 శాతం రిజర్వేషన్లు పొందే అవకాశం లభించింది. -
ఇంజనీరింగ్ యాజమాన్య కోటాలోనూ రిజర్వేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య సీట్లలో రిజర్వేషన్ అమలు చేయాలని, ఈ దిశగా విస్తృత చర్చ చేపట్టాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి తల్లోజు అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఛైర్మన్‌కు ఇటీవల లేఖరాశారు. ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా సీట్ల పంపిణీలో రిజర్వేషన్ అమలవుతోందని, ఆర్టికల్ 74 ఇందుకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. అయితే, యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్ల భర్తీలో ఈ అవకాశం లేకపోవడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. యాజమాన్యాలు బీ కేటగిరీ సీట్లను ఇష్టానుసారం అధిక రేట్లకు అమ్ముకుంటున్నాయని, డబ్బున్న వాళ్లకే సీట్లు వస్తున్నాయని తెలిపారు. ఈ విధానంలో మార్పు కోసం దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరముందని ఆచారి తెలిపారు. (చదవండి: వైద్య విద్య కఠినతరం .. ‘ఎగ్జిట్’ దాటితేనే ఎంట్రీ) -
రూ.8 లక్షల వార్షికాదాయంపై పునఃసమీక్ష
న్యూఢిల్లీ: నీట్–పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ఆలిండియా కోటా సీట్ల భర్తీలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్) కింద రిజర్వేషన్ పొందడానికి వార్షికాదాయ పరిమితి రూ.8 లక్షల లోపు ఉండాలన్న నిబంధనను పునఃసమీక్షించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి ఎవరెవరు వస్తారన్నది తేల్చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీని తేల్చే ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేస్తామన్నారు. కోర్టు అనుమతి మేరకు నీట్–పీజీ కౌన్సెలింగ్‌ను నాలుగు వారాలపాటు వాయిదా వేసినట్లు తెలిపారు. కేంద్ర సర్కారు, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) జూలై 29న జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నీట్–పీజీ మెడికల్ కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్ల భర్తీలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ఎంసీసీ గతంలో తెలిపింది. కేంద్రీయ విద్యా సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 15 శాతం సీట్లు, పీజీ కోర్సుల్లో 50 శాతం సీట్లు అఖిల భారత కోటాకు కిందకు వస్తాయి. పీజీ కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్ల భర్తీలో కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద రిజర్వేషన్లు పొందడానికి అర్హులని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ‘జాతీయ జీవన వ్యయ సూచిక’ ఆధారంగా ఈ పరిమితి విధించినట్లు స్పష్టం చేసింది. దీనిపై పలువురు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈడబ్ల్యూఎస్ కోటా అమలును వాయిదా వేయడం సాధ్యం కాదని తుషార్ మెహతా అన్నారు. తుషార్ మెహతా వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి ఆరవ తేదీకి వాయిదావేసింది. -
యూపీలో 40% టికెట్లు మహిళలకే
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. ఆ ఎన్నికల్లో 40% టికెట్లను మహిళలకు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మంగళవారం ప్రకటించారు. దీంతో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పక్షాన 161 మంది మహిళా అభ్యర్థులు బరిలో ఉంటారు. ప్రియాంక మంగళవారం లక్నోలో మీడియాతో మాట్లాడారు. మహిళలు రాజకీయాల్లో చేరాలని ఈ సందర్భంగా ప్రియాంక పిలుపునిచ్చారు. బరిలో నిలవాలనుకునే వారు నవంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మహిళలకు ఉత్తరప్రదేశ్‌లో హక్కు లభిస్తే, ఇదే హక్కును కేంద్రంలో కూడా పొందుతారని ఆమె పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళలకు కేటాయించే సీట్ల సంఖ్య మరింత పెరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ మహిళా అభ్యర్థులకు పూర్తి సాయం అందుతుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో గళం వినిపించలేని వారి తరఫున తాను పోరాడుతున్నానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 40% మహిళా అభ్యర్థులను బరిలో నిలబెట్టడం ద్వారా కులం, మతం, వర్గంతో సంబంధం లేకుండా మహిళల మద్దతును కాంగ్రెస్ పొందగలదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు, ఓట్ల శాతం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. చదవండి: Punjab: కెప్టెన్ సొంత పార్టీ! -
కులగణనకు... భయమెందుకు?
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారు చేసిన జనగణనలో దేశంలో సమారు నాలుగు వేల కులాలు ఉన్నట్లు తేలింది. తర్వాత జరిగిన సర్వేలు ఈ సంఖ్యను ఆరు వేలుగా తేల్చాయి. అయితే నలభై ఆరు లక్షల కులాలు, ఉపకులాలు ఉన్నాయనీ, వీరిని లెక్కించడం సంక్లిష్టమైన ప్రక్రియ అనీ కేంద్రం వాదిస్తోంది. పైగా కులతత్వం పెరుగుతుందని చెబుతోంది. కులం పునాదుల మీద నిర్మాణమైన భారత సమాజంలో కులం ఏమిటో తెలిస్తే కులతత్వం పెరుగుతుందనడం అసంబద్ధ వాదన. కులాల వారీ జనగణన బీసీల అభివృద్ధికి అత్యవశ్యం. జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో రిజర్వేషన్లు పొందడం వారి హక్కు. ఈ లెక్కలు తేలితే చిక్కులు వస్తాయనే భయంతోనే కేంద్రం దీనికి నిరాకరిస్తోంది. జనాభా గణనలో ‘కులగణన’ చేపట్టాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ఇప్పటికే బిహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిషా, జార్ఖండ్ ముఖ్య మంత్రులు అసెంబ్లీలలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బీసీ కులగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. బీఎస్పీ అధినేత మాయావతి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా అన్ని జాతీయ రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కులగణనకు అనుకూలంగా ప్రకటనలు జారీ చేశాయి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ బీసీ ఫ్రంట్, మహా రాష్ట్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయాలని సుప్రీంకోర్టులో కేసు వేశాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ– కులగణన సంక్లిష్టమైన ప్రక్రియ అనీ, ఆచరణలో సాధ్యం కాదనీ వితండవాదం చేస్తోంది. 2011లో జరిపిన సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేలో 46 లక్షల కులాలు/ఉప కులాల పేర్లు ప్రజలు చెప్పారని ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు. 1931లో బ్రిటిష్ వారు జరిపిన జనగణనలో దేశంలో 4,147 కులాలు ఉన్నట్లు తేలింది. కేంద్ర ప్రభుత్వం చెప్పే 46 లక్షల కులాలు/ ఉపకులాల వాదన సరికాదు. ప్రస్తుతం కేంద్ర ఓబీసీ జాబితాలో 2,642 కులాలు ఉన్నాయి. రాష్ట్రాల జాబితాలో 2,892 బీసీ కులాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్ర కులాలు అన్నీ కలిసినా ఆరు వేలకు మించవు. గతంలో అనేక సర్వే లలో కూడా దేశంలో 6 వేల కులాలు ఉన్నాయని తేల్చారు. జనాభా గణనలో కులగణన చేపట్టాలని 2010లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ డిమాండ్ చేసింది. 2018 ఆగస్టు 31న అప్పటి హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ దఫా జరిగే జనగణనలో కులాల వారీ వివరాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తు న్నట్లు? 1953లో నియమించిన కాక కాలేల్కర్ కమిషన్, 1979లో నియమించిన మండల్ కమిషన్ కులగణన చేయాలని కేంద్రానికి సిఫారసు చేశాయి. వివిధ రాష్ట్రాలలో నియమించిన మొత్తం 246 బీసీ కమిషన్లు కూడా దాన్నే సిఫారసు చేశాయి. రిజర్వేషన్ల కేసులు వచ్చిన ప్రతిసారీ సుప్రీంకోర్టు, హైకోర్టులు కులగణన చేపట్టాలని ఆదేశాలు జారీ చేశాయి. జనాభా గణన పట్టికలో 35 కాలమ్స్ ఉన్నాయి. ఇంకో కాలమ్ పెడితే నష్టమేమిటి? ఒక్క రూపాయి అదనపు ఖర్చు లేకుండా దేశంలోని కులాల వివరాలన్నీ వస్తాయి కదా. కులగణన చేపడితే హిందువుల ఓట్లలో చీలిక వస్తుందని బీజేపీ భయపడుతోంది. ఇది అర్థం లేని వాదన. కుల ప్రస్తావన లేకుండా రోజువారీ వ్యవహారాలు జరగడం లేదు. కులం పునాదుల మీదనే భారతీయ సమాజం నిర్మాణం జరిగింది. కాబట్టి ఒక్కరోజు కులం ఏమిటో అడిగితే కులతత్వం పెరుగుతుందన్నది ఊహాజనితమైన ఆలోచన. కులపరమైన సమాచారాన్ని సేకరించినట్లయితే ఆయా కులాల మధ్యన ఘర్షణ జరిగే ప్రమాదముందని చెబుతోంది ప్రభుత్వం. మరి 1881 నుంచి 1931 వరకు బ్రిటిషు వారి హయంలో 6 సార్లు కుల జనగణన చేయలేదా! ప్రతి కుల గణనలో మతపరమైన, భాషా పరమైన వివరాలు సేకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలను లెక్కిస్తు న్నారు. ఇవన్నీ చేసినప్పుడు జరగని ఘర్షణలు బీసీల సమాచారం సేకరిస్తే జరుగుతాయనడం అహేతుకం. అణచివేతకు గురైన కులాలు అన్ని రంగాలలోనూ– విద్య, ఉపాధి, చట్ట సభలతో సహా– తమ జనాభా ప్రకారం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తారేమో అని పాలకవర్గాలు భయపడుతున్నట్లు కనిపిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు కులగణన జరుగుతున్నందున వారి వారి జనాభా ప్రకారం అన్ని రంగాలలో రిజర్వేషన్లు పొందుతున్నారు. కేంద్రంలో, రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేశారు. బడ్జెట్ కేటాయిం పులు జరుగుతున్నాయి. కానీ బీసీ కులాల లెక్కలు లేనందున జనాభా ప్రకారం రిజర్వేషన్లు పొందడం లేదు. సబ్ ప్లాన్ లేదు. బీసీల జనాభా 56 శాతం ఉంటే కేవలం 25 శాతం రిజర్వేషన్లు పొందుతున్నారు. కులాల వారీ లెక్కలు లేనప్పటికీ బ్రిటిష్ వారు 1931లో తీసిన జనాభా గణన ఆధారంగా బీసీలు మన రాష్ట్రంలో గత 47 సంవత్స రాలుగా అనంతరామన్ కమిషన్ రిపోర్టు ప్రకారం 25 శాతం రిజర్వే షన్లు పొందుతున్నారు. కేంద్రంలో మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారం 29 సంవత్సరాల నుంచి ఉద్యోగ, విద్యా రంగంలో 27 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈ కాలంలో ఏయే కులాలు రిజ ర్వేషన్ల ఫలాలు పొందాయి, ఇంకా రిజర్వేషన్ ఫలాలు పొందని కులాలు ఏవి అనే వివరాలకు కులాల వారీ లెక్కలు అవసరం. రిజ ర్వేషన్ వలన లాభం పొందిన కులాలు, పొందని కులాల వివరాలు తెలిస్తే కొత్త మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంటుంది. కేంద్రంలో, అనేక రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్లను నాలుగు గ్రూపు లుగా వర్గీకరణ చేయలేదు. ఈ బీసీ కులాల మధ్య సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. వీటి వర్గీకరణ జరగాలంటే ప్రతికులం జనాభా తెలియాలి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేసిన పిదప కేంద్రంలో బీసీ రిజర్వేషన్లను నాలుగు గ్రూపులుగా వర్గీకరణ చేయడానికి నాలుగేళ్ల క్రితం జస్టిస్ రోహిణి కమిషన్‌ను నియమించింది. కుల వివరాలు లేకపోవడంతో, జనాభా శాతం తెలియక ఆయా గ్రూపుల శాతం నిర్ణయించలేక కమి షన్ తుది రిపోర్టు ఇవ్వలేకపోతోంది. కుల గణన వివరాలు కావాలని కేంద్ర ప్రభుత్వానికి కమిషన్ ఆరు లేఖలు రాసింది. బీసీలకు స్థానిక సంస్థలలో 34 శాతం రిజర్వేషన్లు గత 34 ఏళ్లుగా అమలుచేస్తున్నారు. చట్టబద్ధమైన కులగణన వివరాలు లేక తాత్కా లికంగా ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి, లేదా లాటరీ పద్ధతిలో బీసీ స్థానాలు కేటాయిస్తున్నారు. ఏయే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలను బీసీలకు కేటాయించాలి, ఎంత శాతం కేటా యించాలనే విషయంలో సరైన లెక్కలు లేక కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదు రవుతున్నాయి. కేంద్రంలో జాతీయ బీసీ కార్పొరేషన్, రాష్ట్రాలలో బీసీ కార్పొరేషన్‌తో పాటు ఆయా కులాలకోసం ప్రత్యేక ఫెడరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ జనాభా వివరాలు లేక ఎంత బడ్జెట్ కేటాయించాలనే విషయంలో ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకసారి కులగణన చేస్తే 74 ఏళ్ల స్వతంత్ర భారత సాంఘిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రం బయటకు వస్తుంది. స్వాతంత్య్ర ఫలాలు, ప్రజాస్వామ్య ఫలాలు ఏయే కులాలు ఎంత శాతం పొందా యనే వాస్తవాలు బయటకు వస్తాయి. రాజకీయ, ఉద్యోగ, విద్యా, వ్యాపార, పారిశ్రామిక రంగాలలో ఏయే కులాలకు ఎంత ప్రాతినిధ్యం ఉంది; ఎవరి ఆధీనంలో పరిశ్రమలు, ఆస్తులు, దేశ సంపద కేంద్రీ కృతమై ఉంది; ఇంతవరకు ఈ రంగాలలో అసలు ప్రాతినిధ్యం లేని కులాలు ఎన్ని అనేది గుర్తించి వాటిని ఎలా పైకి తేవాలనే పథకాలు రూపొందించడానికి కులాల వారీ జనగణన ఉపయోగపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద కులాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా బలహీన వర్గాల గృహ నిర్మాణం, భూముల కేటాయింపు, కులవృత్తులు, చేతివృత్తుల వారికి సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నాయి. కులగణన ఉంటే జనాభా ప్రకారం వీరికి ఎంత శాతం కేటాయించాలనే శాస్త్రీయమైన ఆధారాలు లభిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పాలన సౌలభ్యం కోసం, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కోసం, అభివృద్ధి ఫలాలు అందరికీ అంద జేయడం కోసం కులగణన అవరసరం. ఈ వాస్తవాలను గుర్తించ కుండా కులతత్వం పెరుగుతుందనే సాకుతో, జనాభా ప్రకారం అన్ని రంగాలలో వాటా అడుగుతారనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం కులాల వారీ జనగణనకు అంగీకరించడం లేదనేది బహిరంగ రహస్యం. ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొబైల్: 90000 09164 -
తమిళనాడు సీఎం సంచలన నిర్ణయం, వారికి ఊరట
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు ఊరటనిచ్చారు. ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కోటా కల్పిస్తూ స్టాలిన్ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. మరోవైపు ప్రతిపక్ష అన్నాడీఎంకే కూడా ఈ బిల్లును స్వాగతించడం విశేషం. చదవండి: వరుస పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్, 13 మంది మృతి ప్రభుత్వం యూనివర్సిటీల్లో వెటర్నరీ సైన్సెస్, ఇంజినీరింగ్, అగ్రికల్చర్, లా, ఫిషరీస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో అన్ని కేటగిరీలలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ 7.5శాతం రిజర్వేషన్ ఇవ్వనుంది. ఈ మేరకు రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు ప్రైవేట్ పాఠశాల విద్యార్ధులతో పోటీ పడుతూ సామాజిక-ఆర్థిక అసమానతల కారణంగా వారు కోరుకున్న కోర్సులలో ప్రవేశం పొందలేకపోయారని వ్యాఖ్యానించారు. గ్రామాలకు చెందిన వారు, డబ్బుల్లేని వారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారని, వారికి మంచి అవకాశాలు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా మన్నారు. చదవండి: తిప్ప తీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ ఉపయోగాలు తెలుసా!? కాగా ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలు అలాగే ప్రభుత్వ-ఎయిడెడ్ కళాశాలల్లో రిజర్వేషన్లపై జస్టిస్ (రిటైర్డ్)డీ మురుగేశన్ కమిటీ సిఫారసుల మేరకు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర మంత్రివర్గం గతంలో నిర్ణయించింది. -
విభజిత రాష్ట్రాల్లో ఒక్కచోటే రిజర్వేషన్!
న్యూఢిల్లీ: ఒక రాష్ట్రంలో రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న వ్యక్తి సదరు రాష్ట్రం విభజనైతే ఏర్పడే రాష్ట్రాల్లో వేటిలోనైనా అదేవిధమైన రిజర్వేషన్‌కు అర్హుడని, కానీ ఏర్పడిన అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ పొందడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. బిహార్ విభజన అనంతరం ఏర్పడిన బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించి కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. జార్ఖండ్‌కు చెందిన పంకజ్ కుమార్ ఎస్సీ వర్గానికి చెందినవారు. ఆయన 2007 రాష్ట్ర సివిల్ సర్వీసు పరీక్షల్లో నెగ్గారు. అయితే ఆయన అడ్రస్ ప్రూఫ్ పట్నాలో ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఆయన జార్ఖండ్‌లో రాష్ట్ర సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశారు. కానీ ఆయన ప్రూఫ్ పట్నాలో ఉన్నందున రిజర్వేషన్ వర్తించదని ప్రభుత్వం తిరస్కరించింది. ప్రభుత్వ తీరుపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా, వ్యతిరేకంగానే తీర్పువచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.దీనిపై విచారణ జరిపిన కోర్టు, సదరు పిటీషనర్ అటు బిహార్‌లోకానీ, ఇటు జార్ఖండ్‌లో కానీ రిజర్వేషన్ పొందవచ్చని, కానీ ఒకేసారి రెండు రాష్ట్రాల్లో రిజర్వేషన్‌కు అర్హుడు కాడని తీర్పునిచ్చింది. ఒక రాష్ట్రంలో ఉంటూ మరో రాష్ట్రంలో పరీక్ష రాసిన అభ్యర్ధి ఎవరైనా ఓపెన్ క్యాటగిరీలో రాసినట్లేనని పేర్కొంది. అయితే పంకజ్ కేసులో ఆయన రాష్ట్ర విభజనకు పూర్వమే రిజర్వేషన్ కోటాలో టీచర్ ఉద్యోగం పొంది జార్ఖండ్ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నట్లు కోర్టు గుర్తించింది. అందువల్ల విభజన చట్టం ప్రకారం ఆయన కొత్తగా ఏర్పడిన ఝార్ఖండ్‌లో సైతం రిజర్వేషన్ కేటగిరీలోకే వస్తాడని పేర్కొంది. ఆయన తండ్రి నివాసం పట్నాలో ఉన్నప్పటికీ, విభజన సమయంలో జార్ఖండ్‌ను ఎంచుకున్నందున ఆయన రిజర్వేషన్ కొనసాగుతుందని అభిప్రాయపడుతూ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. పంకజ్‌ను 6 వారాల్లో ఉద్యోగంలో నియమించాలని, ఇతర వసతులు వర్తింప జేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసిన కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ: వైద్య విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం 2021-22కి గాను వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లను కేంద్రం ఖరారు చేసింది. మెడికల్ అండ్ డెంటల్ ఎడ్యుకేషన్ (యూజీ, పీజీ) లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఆల్ ఇండియా కోటా కింద ఓబీసీ విద్యార్ధులకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ విద్యార్ధులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 5,550 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని, ఓబీసీలకు, ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు రిజర్వేషన్లను కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది నుంచి ఆర్థికంగా వెనకబడిన వారికి విద్యా రిజర్వేషన్లను కల్పిస్తున్నట్టు పేర్కొంది. దీంతో ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్‌లో దాదాపు 1500 మంది ఓబిసి విద్యార్థులకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 2500 మంది ఓబిసి విద్యార్థులకు, ఎంబీబీఎస్‌లో 550 మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 1000 మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడించింది. తమ ప్రభుత్వం మైలురాయిలాంటి నిర్ణయం తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. తద్వారా ప్రతి సంవత్సరం వేలాదిమంది యువత అవకాశాలు పొంద నున్నారని పేర్కొన్నారు, మన దేశంలో సామాజిక న్యాయకల్పనలో ఇదొక కొత్త అధ్యాయంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం కల్పించాలని ప్రధాని మోదీ జూలై 26న సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలను ఆదేశించిన సంగతి తెలిసిందే. Our Government has taken a landmark decision for providing 27% reservation for OBCs and 10% reservation for Economically Weaker Section in the All India Quota Scheme for undergraduate and postgraduate medical/dental courses from the current academic year. https://t.co/gv2EygCZ7N — Narendra Modi (@narendramodi) July 29, 2021 -
సింగరేణి బోర్డు కీలకనిర్ణయాలు : ఉద్యోగులకు గుడ్ న్యూస్
-
రాష్ట్రం విడిపోతే రిజర్వేషన్ వర్తించదా?
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ తరగతి(ఎస్సీ)కి చెందిన వ్యక్తి ఒక రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందుతుండగా, ఆ రాష్ట్రం రెండుగా విడిపోతే.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రిజర్వేషన్ కోరే హక్కు అతనికి ఉంటుందా? ఉండదా? ఇప్పుడు ఇదే ప్రశ్న సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. ఇది అసాధారణ, వింతైన ప్రశ్న అని న్యాయస్థానం మంగళవారం వ్యాఖ్యానించింది. దీన్ని తాము లోతుగా, క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. ఇలాంటి ప్రశ్న తమ వద్ద తలెత్తడం ఇదే మొదటిసారి అని తెలిపింది. సాధ్యాసాధ్యాలను తేల్చేయడానికి ఇప్పటిదాకా దీనికి సంబంధించిన చట్టాలు లేవని గుర్తుచేసింది. ఈ విషయంలో తమకు సహకరించాలని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్‌కు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ధర్మాసనం విజ్ఞప్తి చేసింది. అయితే, రాష్ట్రం విడిపోయినంత మాత్రాన రిజర్వేషన్లు మారవని కె.కె.వేణుగోపాల్ స్పష్టం చేశారు. వెనుకబాటుతనం ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీ వర్గానికి చెందిన పంకజ్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ అజయ్ రస్తోగితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారిస్తుండగా రిజర్వేషన్లపై కొత్త ప్రశ్న తెరపైకి వచ్చింది. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పంకజ్‌కు ఎస్సీ రిజర్వేషన్ సౌకర్యం లభించదంటూ జార్ఖండ్ హైకోర్టు 2020 ఫిబ్రవరి 24న తీర్పునిచ్చింది. స్టేట్ సివిల్ సర్వీసు పరీక్ష రాయడానికి అతడు అర్హుడు కాదని పేర్కొంది. దీన్ని సవాలు చేస్తూ పంకజ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
విద్యతోపాటు ఉద్యోగాల్లోనూ ‘ఈడబ్ల్యూఎస్’ రిజర్వేషన్లు
-
ఉత్తరాది శూద్రులలో వినూత్న మార్పు
ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన జాట్లు హరిత విప్లవ ప్రధాన ఏజెంట్లుగా అవతరించారు కానీ పారిశ్రామికవేత్తలు కాలేకపోయారు. ఉత్తరాది శూద్రకులాలు చాలావరకు భారీగా వృద్ధిచెందిన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థనుంచి ప్రయోజనాలు పొందలేకపోయాయి. సంఘటితమైన, ఆధునిక విద్యా కృషి లోపించిన కారణంగానే ఢిల్లీలోని అత్యున్నత స్థానాల్లో తమకు ఎలాంటి వాటా లేదని, ఢిల్లీ చుట్టుపక్కల జాతీయ ఆధికార వ్యవస్థలను నిర్వహిస్తున్న జాట్లు, గుజ్జర్లు అర్థం చేసుకున్నారు. భారీస్థాయి ప్రయివేటీకరణ ఎజెండా ముఖ్య ఉద్దేశం ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు కేటాయిస్తూ వస్తున్న ఉద్యోగాలను తీసివేయడమేనని రైతునేత టికాయత్ స్పష్టంగా గుర్తించినట్లుంది. ఇది ఉత్తరాది శూద్రుల్లో వినూత్న మార్పునకు చిహ్నం. ‘ది శూద్రాస్–విజన్ ఫర్ ఎ న్యూ పాత్’ అనే పుస్తకాన్ని ఉత్తర భారతీయ రైతునేత రాకేష్ టికాయిత్ తన రెండుచేతులతో గుండెకు హత్తుకుని కనిపించిన దృశ్యం భారతీయ, ప్రత్యేకించి ఉత్తర భారత వ్యవసాయ కుల సామాజిక, రాజకీయ చైతన్యంలో ఒక కొత్త మార్పును సూచిస్తోంది. మండల్ రాజ కీయ మేధోమథనం అనంతరం ఉత్తర భారతీయ శూద్రులు.. ప్రత్యేకించి జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు మితవాద మానవ శక్తికి, ఓటు శక్తికి వెన్నెముకగా మారారు. జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, మరాఠాలు తదితర శూద్రులందరినీ ఇతర వెనుకబడిన వర్గాలుగా మండల్ కమిషన్ నివేదిక నిర్వచించింది. తద్వారా శూద్ర అనే చారిత్రక వర్గీకరణను రాజ్యాంగ వర్గీకరణగా మార్చివేసింది. ఆధునిక విద్యకు దూరమవడం ఓ శాపం కానీ ఇతర ఆధిపత్య వ్యవసాయ కులాలు ప్రత్యేకించి ఢిల్లీ చుట్టుపట్ల ఉంటున్న జాట్లు, గుజ్జర్లు ఓబీసీ కేటగిరీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కారణం ఓబీసీలు సామాజిక ఉన్నతి వైపు కాకుండా అధోగతి వైపు పయనిస్తున్నట్లు వీరు భావించారు. 1990ల ప్రారంభంలో వ్యవసాయ కమ్యూనిటీలకు చెందిన గ్రామీణ మేధావులు తమకు క్షత్రియ ప్రతిపత్తిని కోరుకున్నారు.. ఎందుకంటే క్షత్రియులు చారిత్రకంగా పాలకులుగా ఉండేవారు. అయితే ఒక్కో శూద్ర కులం నుంచి మేధో వర్గాన్ని ఉత్పత్తి చేస్తున్న రిజర్వేషన్ల పాత్రను వీరు అర్థం చేసుకోలేకపోయారు. యూనివర్సిటీ, కాలేజీ విద్య అందులోనూ ఇంగ్లిష్ మాధ్యమంలో కొనసాగే విద్య, ఉన్నతాధికార బలం కలిసిన ఫలితం గణనీయమైన సంఖ్యలో గుజ్జర్లు, జాట్ల హస్తగతం అవుతూ వచ్చింది. ఒక్కో కులంలోని నూతన ఇంగ్లిష్ విద్యాధిక వర్గం ఢిల్లీ అధికార వ్యవస్థను నిర్వహించడంలో ముఖ్యమైన పాత్రను పోషించడమే కాకుండా, దళితులు, ఇతర మైనారిటీల పట్ల వారి వైఖరిని కూడా మార్చేసింది. తమకున్న బలమైన వ్యవసాయ పునాది అధికారాన్ని, జ్ఞానాన్ని తమకు కట్టబెడుతుందని, ఆవిధంగా క్షత్రియ ప్రతిపత్తిని తాము సాధించవచ్చని జాట్లు భావించారు. ఆవిధంగా తమ పునాది తనంతటతానుగా జాతీయ స్థాయిలో రాజకీయాధికారాన్ని తమకు కట్టబెడుతుందని వారు తలిచారు. కానీ వారి అంచనా పూర్తిగా తప్పని రుజువైపోయింది. ఉన్నత విద్యాలయాల్లోనూ స్థానం కరువే జాట్లు, గుజ్జర్లు వంటి రిజర్వేషన్ పరిధిలో లేని శూద్రకులాలు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో, పరిశోధనా సంస్థల్లో కీలక పాత్ర పోషించగలిగే స్థాయి మేధావులను ఉత్పత్తి చేశాయి. అయితే ఈ కులాలు జాతీయ, అంతర్జాతీయ దార్శనికతతో కూడిన రాజకీయ నేతలను ఉత్పత్తి చేయలేకపోయాయి. దీనికి ముఖ్యమైన కారణం ఉంది. ద్విజులలాగా జాట్లు, గుజ్జర్లు ఇంగ్లిష్ విద్యాధిక మేధావులను రూపొందించలేకపోయారు. ఇప్పుడు, అధికార చట్రాల్లో జాట్, గుజ్జర్ లేక ఇతర శూద్ర వ్యవసాయ కులాల పాత్ర పెద్దగా లేకుండానే ఢిల్లీ పాలనా యంత్రాంగాలను మితవాద శక్తులు నిర్వహిస్తూండటంతో ఒక సరికొత్త జాగరూకత ఏర్పడింది. విషాదకరమైన విషయం ఏమిటంటే ఆలిగర్, జామియా మిలియా ఇస్లామియా వంటి ముస్లిం మైనారిటీలు నిర్వహిస్తున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సైతం శూద్ర ఫ్యాకల్టీ సభ్యులు చాలా పరిమితంగా ఉండటమే. శూద్రుల్లో పారిశ్రామికవేత్తలు శూన్యం మైనారిటీ వ్యతిరేక ఎజెండా కోసం శూద్రులను ఉపయోగించుకుంటూ వచ్చారు తప్పితే జాతీయ స్థాయి వ్యవస్థల్లో అధికారాన్ని పంచుకోవడానికి కొద్దిపాటి శూద్ర మేధావులను కూడా అనుమతించకుండా వచ్చారు. ద్విజులు అధికారంలోకి వచ్చాక శూద్రులను మరింతగా వెనక్కి నెట్టేస్తూ వచ్చారు. ఈ రచయిత సంపాదకత్వంలో వచ్చిన ‘ది శూద్రాస్ –విజన్ ఫర్ ఎ న్యూ పాత్’ పుస్తకం.. బ్రాహ్మణులు, బనియాలు, కాయస్థులు, ఖాత్రిలు, క్షత్రియులను ద్విజులుగా నిర్వచించింది. ఈ కులాల్లో ఎవరికీ ఆహారధాన్యాలు లేక ఇతర వ్యవసాయ సంబంధ ఉత్పత్తులలో ఎలాంటి పాత్రా లేదు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన జాట్లు హరిత విప్లవ ప్రధాన ఏజెం ట్లుగా అవతరించారు. కానీ వీరు పారిశ్రామికవేత్తలు కాలేకపోయారు. ఈ పుస్తకంలోని క్యాస్ట్ అండ్ పొలిటికల్ ఎకానమీ అనే అధ్యాయంలో, శూద్ర టీమ్ అధ్యయనం అత్యంత స్పష్టంగా చిత్రించినట్లుగా, దేశంలోని శూద్రకులాలు చాలావరకు భారీగా వృద్ధిచెందిన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థనుంచి ప్రయోజనాలు పొందలేకపోయారు. సంఘటితమైన, ఆధునిక విద్యా కృషి లోపించిన కారణంగానే ఢిల్లీలోని అత్యున్నత స్థానాల్లో తమకు ఎలాంటి వాటా లేదని, ఢిల్లీ చుట్టుపక్కల జాతీయ ఆధికార వ్యవస్థలను నిర్వహిస్తున్న జాట్లు, గుజ్జర్లు అర్థం చేసుకున్నారు. చివరకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ వంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కూడా జాట్లకు తగినంత ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ద్విజుల ఆధిపత్యంపై పోరాడేందుకు వీరికి శూద్ర అస్తిత్వం ఒక కొత్త మార్గాన్ని అందిస్తుంది. ఇక్కడే ఈ పుస్తకం ప్రాధాన్యతను రైతు నేత రాకేష్ టికాయత్ గుర్తించినట్లు కనబడుతోంది. రిజర్వేషన్ అనుకూల వైఖరి సరికొత్త మార్పు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం చివరలో తీసుకొచ్చిన నూతన వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో జాట్లు అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. భారీస్థాయి ప్రయివేటీకరణ ఎజెండా ముఖ్య ఉద్దేశం ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు కేటాయిస్తూ వస్తున్న ఉద్యోగాలను తీసివేయడమే (డీ–రిజర్వ్)నని రైతునేత టికాయత్ స్పష్టంగా గుర్తించినట్లుంది. అందుకే జాట్ ప్రజలు తమ కులాన్ని కూడా రిజర్వేషన్ జాబితాలో చేర్చాలని ఇప్పుడు బలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో ఆధిపత్యస్థానంలో ఉన్న మితవాద శక్తులు రిజర్వేషన్ వ్యవస్థనే తొలగించే ప్రయత్నంలో ఉన్నారు. గుండెకు హత్తుకున్న శూద్ర చైతన్యం ఈ పుస్తకం దేశంలోని శూద్రులందరిలో తీవ్రమైన చర్చను ప్రేరేపిస్తోంది. వీరందరూ తమ శూద్రమూలాలను ఇకనుంచీ హుందాతో, గౌరవంతో స్వీకరించక తప్పదు. ‘ది శూద్రాస్–విజన్ ఫర్ ఎ న్యూ పాత్’ అనే పుస్తకాన్ని రైతు నేత రాకేష్ టికాయిత్ తన రెండుచేతులతో గుండెకు హత్తుకుని కనిపిస్తున్న దృశ్యం ఉత్తర భారతీయ శూద్రులలో ఒక నూతన మానసికస్థితిని సూచిస్తోంది. వ్యాసకర్త: ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
వామ్మో.. కరోనా ఎఫెక్ట్.. మేం జర్నీచేయం!
సాక్షి, సిటీబ్యూరో: వేసవి వచ్చిందంటే చాలు రైళ్లు కిటకిటలాడుతాయి. ప్రయాణికుల రాకపోకలు రెట్టింపవుతాయి. రైల్వేస్టేషన్లలో సందడి నెలకొంటుంది. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. గతేడాది వేసవిలో కోవిడ్ ఉధృతి దృష్ట్యా రైల్వే సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈసారి వేసవిలో అన్ని రూట్లలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినప్పటికీ రెండో దశ కోవిడ్ విజృంభణతో ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. గత 15 రోజులుగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య తగ్గినట్లు రైల్వే వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సుమారు 25 శాతానికి పైగా ప్రయాణికుల రద్దీ తగ్గినట్లు అంచనా. నెల రోజుల క్రితం వరకు సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజు లక్ష మందికి పైగా రాకపోకలు సాగించగా ఇప్పుడు 60 వేల నుంచి 70 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు వేసవిలో ఏసీ బోగీలకు ఉండే డిమాండ్ కూడా తగ్గింది. కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని చాలా మంది ప్రయాణికులు స్లీపర్ కోచ్‌లను ఎంపిక చేసుకోవడం గమనార్హం. రైళ్లన్నింటినీ పునరుద్ధరించాక ఇలా... ►ఈ ఏడాది సంక్రాంతి నుంచి రైళ్ల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేశారు. గత సంవత్సరం కోవిడ్ దృష్ట్యా లాక్డౌన్ నిబంధనల అనంతరం మొదట 22 రైళ్లను అందుబాటులోకి తెచ్చిన దక్షిణమధ్య రైల్వే అధికారులు ఆ తరువాత ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లను పెంచారు. ► అన్ని రైళ్లను ‘ప్రత్యేకం’ పేరిట నడుపుతున్నారు. సాధారణ చార్జీలను ‘తత్కాల్’కు పెంచేశారు. సంక్రాంతి నాటికి సుమారు 75 రైళ్లు అందుబాటులోకి రాగా ప్రస్తుతం వాటి సంఖ్య వంద దాటింది. ► సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ, ముంబయి, పట్నా, దానాపూర్, అహ్మదాపూర్, రెక్సాల్, లక్నో, కోల్కత్తా, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖ, తిరుపతి, కడప, తదితర అన్ని రూట్లలో రైళ్ల రాకపోకలు పెరిగాయి. ► ఈ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 22 రైళ్లను కొత్తగా పునరుద్ధరించారు. మొదట్లో కేవలం 25 వేల మంది ప్రయాణం చేశారు. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. సంక్రాంతి నాటికి అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు భారీగా నమోదైంది. కొన్నింటిలో ఏకంగా 250 నుంచి 300కు చేరుకుంది. వీకెండ్స్‌లో 1.10 లక్షల మంది వరకు ప్రయాణం చేశారు. కానీ రెండో దశ కోవిడ్ విజృంభణతో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. ‘ఇప్పటికే రిజర్వ్ చేసుకున్నవాళ్లు తమ ప్రయాణాలను యథావిధిగా కొనసాగిస్తున్నప్పటికీ కొత్తగా బుక్ చేసుకొనేవాళ్ల సంఖ్య మాత్రం తగ్గింది’ అని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. పర్యాటకులు బంద్ సాధారణంగా వేసవి రోజుల్లో పర్యాటకుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరాన్ని సందర్శించేందుకు ఎక్కువ మంది వస్తారు. కానీ ఈసారి పర్యాటకులకు బదులు వలస కూలీల రాకపోకలు కొద్దోగొప్పో ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. లాక్డౌన్ కాలంలో సొంత ఊళ్లకు వెళ్లిన కూలీలు సడలింపు అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో తరచుగా సొంత ఊళ్లకు వెళ్లి వచ్చే వాళ్ల సంఖ్య పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గడమే కాకుండా నగరం నుంచి కేరళ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు వెళ్లే వారి సంఖ్య కూడా తగ్గింది. -
పెట్టుబడుల ఉపసంహరణ ఎవరికి చేటు?
ఆర్థిక అభివృద్ధి మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థల లక్ష్యం కాదు. ఇంతవరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుగబడిన కులాలు, ఇటీవల ఆర్థికంగా వెనుకబడిన సెక్షన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది ప్రజలకు ప్రభుత్వరంగ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వచ్చాయి. ఈ అర్థంలో పీఎస్‌యూలు సామాజిక న్యాయానికి ఉపకరణాలుగా వ్యవహరించాయి. కానీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోవడంతో ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం అంటే తొలిదశలో రిజర్వేషన్లను తప్పనిసరి చేసిన ఆ ’చారిత్రక అన్యాయా’న్ని పునరుద్ధరించడమే అవుతుంది కదా. భారతదేశంలో ప్రభుత్వ రంగం అనేది ప్రధానంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలకే (పీఎస్‌యూ) ప్రాతినిధ్యం వహిస్తుంటుంది. ఆర్థిక వృద్ధి, పెరుగుదలలో పీఎస్‌యులు పోషించే కీలకపాత్ర కారణంగా.. ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచి ప్రభుత్వ గుత్తాధిపత్యం క్రమేణా ముగుస్తున్న కాలం లోనూ ప్రభుత్వరంగ సంస్థలు శిఖరస్థాయిలోనే ఉంటూ వచ్చాయి. 1991 తర్వాత రెండో తరం సంస్కరణలు ప్రభుత్వరంగ సంస్థలలో మొదలయ్యాయి. దీంతో పీఎస్‌యూలను మహారత్న, నవరత్న, మినీ రత్న అనే భాగాలుగా వర్గీకరించారు. పాలనాపరమైన, ఆర్థిక స్వయంప్రతిపత్తికి సంబంధించిన సంస్కరణలు, అవగాహనా ఒప్పందాల ద్వారా స్వీయ బాధ్యత వంటివి ప్రభుత్వం పీఎస్‌యూల ద్వారా సొంతంగా బిజినెస్ నిర్వహించాలనే భావనను ముందుకు తీసుకొచ్చాయి. ఈ పంథాలో తొలి లక్ష్యం నష్టాలు తెస్తున్న పీఎస్‌యూలను పునర్ వ్యవస్థీకరించడం. నష్టాలతో నడుస్తున్న పీఎస్‌యూలను వదిలించుకోవడానికి మొదటగా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణలను ఒక ఐచ్ఛికంగా తీసుకొచ్చారు. రెండోది.. లాభదాయకంగా నడుస్తున్న పీఎస్‌యూలకు ఆర్థిక, పాలనాపరమైన స్వయంప్రతిపత్తిని అందించడమే. అయితే నష్టాలతో నడుస్తున్న పీఎస్‌యూలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు గానే చలామణి అవుతూ వచ్చాయి. దీనికి పరిష్కారం ఏమిటంటే ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో ప్రోత్సహించినట్లుగా, కీన్సియన్ తరహా సంస్థలను పరిత్యజించడాన్ని ఒక ప్రత్యామ్నాయంగా ప్రోత్సహించడమే. అంటే సంక్షేమ రాజ్యంగా ఉంటున్న భారతదేశాన్ని నయా ఉదారవాద దేశంగా మార్చివేయడంలో ఇది ఒక భాగం. మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడమే లక్ష్యం అయినప్పటికీ, లాభదాయకంగా నడుస్తున్న పీఎస్‌యూల విషయంలో ఇది సమర్థనీయంగా ఉండదు. పైగా పీఎస్‌యూలనుంచి పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వ ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి అంటే సామాజిక సంక్షేమ ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి అని చెబుతూ రాజకీయంగా భాష్యం చెప్పారు. పెట్టుబడుల ఉపసంహరణకు ఇది కొత్త భాష్యం అన్నమాట.సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెబినార్ ద్వారా పాల్గొన్న సదస్సులో ‘ప్రైవేటీకరణ, సంపదపై రాబడి’ అనే పేరుతో చేసిన ప్రసంగం యావత్తూ నయా ఉదారవాద ఎజెండాకు సంగ్రహరూపంగానే కనబడుతుంది. నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకు పైకి లేవనెత్తడానికి పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగపరుస్తున్నామని నరేంద్రమోదీ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాలతో నడిచే పీఎస్‌యూలకు వెచ్చించే డబ్బును సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చని కూడా ఆయన సూచించారు. అలాగే మానవ వనరుల సమర్థ నిర్వహణ వాదాన్ని కూడా ప్రధాని తీసుకొచ్చారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ప్రభుత్వోద్యోగులు తాము శిక్షణ పొందిన రంగంలో నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించలేకపోతున్నారని, అది వారి ప్రతిభకు అన్యాయం చేయడమే అవుతుందని ప్రధాని పేర్కొన్నారు. అయితే ప్రధాని చేసిన వెబినార్ ప్రసంగంలో నష్టాలతో నడుస్తున్న పీఎస్‌యూలను మాత్రమే ప్రైవేటీకరిస్తామనే చెప్పలేదు. వ్యూహాత్మక రంగంలోని అతి కొద్ది పీఎస్‌యూలను మినహాయించి తక్కిన మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఈ ప్రైవేటీకరణ భావనను ఆయన విస్తరించడం విశేషం. వ్యాపారంలో కొనసాగడం ప్రభుత్వం పని కాదనే పచ్చి నయా ఉదారవాద వాదనను ప్రధాని ఈ సందర్భంగా ముందుకు తీసుకొచ్చారు. ఈ వాదన పరిమితమైన ప్రభుత్వం, సత్పరిపాలన భావనకు సంబంధించింది.ఇక్కడ సత్పరిపాలన అంటే భాగస్వామ్యం, జవాబుదారీతనం, పారదర్శకం, బాధ్యతాయుతం, సమర్థవంతం, న్యాయబద్ధత, సమీకృతం, చట్టబద్ధత అనేటటువంటి భావజాలపరంగా తటస్థంగా ఉండే లక్షణాలను ముందుకు తీసుకురావడమే తప్ప మరేమీ కాదు. పరిమిత ప్రభుత్వం, అపరిమిత పాలన అనే నయా ఉదారవాద ఎజెండాను ఇది ముందుకు నెడుతుంది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఈ సత్పరిపాలనా భావనే కేంద్ర స్థానంలో ఉంటోంది.ఇది సంక్షేమవాదం, నయా ఉదారవాదం భావనలపై భావజాలపరమైన చర్చలో భాగం కావచ్చు. కానీ ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం ఆర్థికాభివృద్ధిని సాధించడం, పబ్లిక్ సెక్టర్ని సంస్కరించడం అనే లక్ష్యాల సాధనలో తన హక్కులను కాపాడుకోగలగాలి.మెజారిటీ ప్రజల ఎంపికద్వారా ఏర్పడిన ప్రభుత్వం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలోనే నయా ఉదారవాద ఎజెండాను ముందుకు తీసుకురావడానికి కలలు కంటున్న పరిస్థితి ఇప్పుడు రాజ్యమేలుతోంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ప్రభుత్వ రంగ సంస్థల్లో నయా ఉదారవాదాన్ని అమలు చేయడం ద్వారా కలిగే ఫలితాలు ఎలా ఉండబోతాయన్నదే.ఈ నయా ఉదారవాదంలోనూ సంక్షేమవాదం కొనసాగుతుంది. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ ద్వారా సేకరించిన నిధులను సరిగా ఉపయోగించడం ద్వారా ప్రధాని సూచించినట్లుగా పేదలకు ఇళ్లు, గ్రామాల్లో రహదారుల నిర్మాణం, పాఠశాలలు తెరవడం, పేదలకు పరిశుభ్రమైన నీటిని కల్పించడం వంటి సంక్షేమ చర్యలు చేపట్టవచ్చు. మొదటగా ప్రభుత్వ రంగ సంస్థలను సంస్కరించడం ద్వారా ప్రభుత్వ గుత్తాధిపత్యానికి ముగింపు పలకవచ్చు. కానీ ఒక్క శాతంమంది అతి సంపన్నుల చేతిలో 40 శాతం దేశ సంపద పోగుపడి ఉన్న దేశంలో కొద్ది మంది బడా పెట్టుబడిదారుల చేతిలో అధికారాన్ని కేంద్రీకరించడం నుంచి ప్రైవేటీకరణను ఏది నిరోధించగలుగుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఈ గుత్తాధిపతులు కేవలం పరిశ్రమ రంగంతో పాటు ఇతర రంగాల్లో విధాన నిర్ణయాలను కూడా వీరు విశేషంగా ప్రభావితం చేయగలరు.రెండోది, ఆర్థిక అభివృద్ధి మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థల లక్ష్యం కాదు. ఇంతవరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుగబడిన కులాలు, ఇటీవల ఆర్థికంగా వెనుకబడిన సెక్షన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది ప్రజలకు ప్రభుత్వరంగ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వచ్చాయి. ఈ అర్థంలో పీఎస్‌యూలు సామాజిక న్యాయానికి ఉపకరణాలుగా వ్యవహరించాయి. కానీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోవడంతో ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం అంటే తొలిదశలో రిజర్వేషన్లను తప్పనిసరి చేసిన ఆ ’చారిత్రక అన్యాయా’న్ని పునరుద్ధరించడమే అవుతుంది కదా.మూడోది. ప్రైవేటీకరణ ఒక ప్రభుత్వానికే పరిమితమైనది కాదు. పరిమిత ప్రభుత్వం అనేది ఉండదు. నయా ఉదారవాద ప్రభుత్వం అనేది వాస్తవంగా ఒక రెగ్యులేటరీ ప్రభుత్వం. పాలించడానికి అది నియంత్రణా వ్యవస్థలను రూపొందించి, చట్టాల అనువర్తనం, ప్రామాణిక ఆచరణలు లేదా సేవలకు హామీ ఇస్తుంది. పైగా తనదైన జాప్యందారీ వ్యవస్థలను రూపొందించుకుంటుంది. వీటిని సేవించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు తమ వృత్తికి న్యాయం చేకూర్చలేరు. బ్యాంకింగ్, విమానయాన రంగాల్లో దివాలాకు సంబంధించిన పలు కేసుల కారణంగా నష్టాల పాలవుతున్న ప్రైవేట్ కంపెనీల జాబితా మరింతగా పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదు. ప్రభుత్వం వ్యాపార సామర్థ్యంతోటే ఉండాలి: ప్రభుత్వం కేవలం ఖర్చుపెట్టే సంస్థగానే ఉండిపోవలసిన అవసరం లేదు. సంపాదించే సంస్థగా కూడా ఉండాలి. వ్యాపారంలో కొనసాగినప్పుడు ఇది సాధ్యపడుతుంది. దీనికి చేయవలసిందల్లా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉత్తమ పాలనను అమలు చేయడమే. లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఇతర పీఎస్‌యూలకు నమూనాగా ఉండాలి. నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సంస్కరించినట్లయితే, లాభాలబాట పట్టే ఆ సంస్థలు తిరిగి సాధికారత సాధించగలవు. ఉత్తమపాలన అనేది ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా సమర్థతకు, ఆర్థికానికి, సామర్థ్యానికి, జవాబుదారీతనానికి హామీపడగలదు. జుబేర్ నజీర్ వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ -
రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లను కొనసాగిస్తారని ప్రశ్నించింది. మరాఠా రిజర్వేషన్ కేసు విచారణ సందర్భంగా శుక్రవారం సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగాలు, విద్యకు సంబంధించి ఇంకా ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లు కొనసాగుతాయో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది. అంతేకాక రిజర్వేషన్లలో ప్రస్తుతం అమలు చేస్తోన్న 50 శాతం పరిమితిని తొలగించాల్సి వస్తే తలెత్తే అసమానతలపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ రిజర్వేషన్లపై పరిమితి విధించిన ‘మండల్ తీర్పు’ 1931 జనాభా లెక్కల ప్రకారం ఉన్నందున మారిన పరిస్థితుల దృష్ట్యా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతేగాక రిజర్వేషన్ కోటాలను పరిష్కరించడానికి కోర్టులు ఆయా రాష్ట్రాలకు వదిలివేయాలని వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం మీరు చెబుతున్నట్లు 50 శాతం కోటా పరిమితిని తొలగిస్తే ఆ తరువాత తలెత్తే అసమానతల పరిస్థితేంటి? అంతిమంగా మేం ఏం తేల్చాల్సి ఉంది. ఈ అంశంపై మీ వైఖరేంటి? ఇంకా ఎన్ని తరాలపాటు దీన్ని కొనసాగిస్తారు’ అని ధర్మాసనం ప్రశ్నించింది.‘‘స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచాయి. రాష్ట్ర ప్రభ్వుతాలు ఎన్నో పథకాలను అమలుచేస్తున్నాయి అయినా. వెనుకబడిన సామాజిక వర్గంలో ఏ మాత్రం అభివృద్ధి లేదన్న విషయాన్ని మనం అంగీకరించగలమా’ అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అభివృద్ధి అనుకున్నంత స్థాయిలో జరగలేదు అభివృద్ధి జరిగింది కానీ, వెనుకబడి తరగతులు 50 శాతం నుంచి 20 శాతానికి తగ్గిపోలేదు. ఈ దేశంలో ఇప్పటికీ ఆకలి చావులు కొనసాగుతున్నాయి.. ఇందిరా సాహ్నీ తీర్పు పూర్తిగా తప్పని, దానిని చెత్తబుట్టలో వేయాలని అనడం లేదు.. ఈ తీర్పు వచ్చి 30 ఏళ్లు దాటింది.. చట్టాలు పూర్తిగా మారాయి, జనాభా పెరగడంతో సమాజంలో వెనుబడిన వర్గాలు సంఖ్య పెరుగుతోంది. మండల్ తీర్పును పునఃసమీక్షించడానికి అనేక కారణాలు ఉన్నాయి’ అని ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించారు. మరాఠా కోటా అంశానికి వస్తే మహారాష్ట్రలోని ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఆ వర్గం వారే 40శాతం వరకు ఉంటారన్నారు. రాష్ట్రంలోని అధిక శాతం భూములు వారి ఆధీనంలోనే ఉన్నాయన్నారు. ఈ కేసులో వాదనలు ఇంకా కొనసాగుతున్ననేపథ్యంలో సోమవారానికి వాయిదా వేశారు. మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాలలో మరాఠాలకు కోటా మంజూరు చేయడాన్ని సమర్థించిన బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వేసిన పిటీషన్‌ను ఉన్నత న్యాయస్థానం స్వీకరించిన విషయం తెలిసిందే. (చదవండి : మరాఠాలు వెనుకబడిన వర్గం కాదు ) -
సీట్ల పెంపు 10 శాతమా.. 20 శాతమా?
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా ప్రవేశాల్లో 10 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) కోటా అమలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జాతీయ స్థాయిలో కేంద్రం అమలు చేస్తున్న విధానాన్ని అనుసరించాలా? లేదా ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రా ల్లో అనుసరిస్తున్న విధానాన్ని అమల్లోకి తేవాలా? అన్న దానిపై ఆలోచనలు చేస్తోంది. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నతవిద్యా మండలి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయా లని భావిస్తోంది. 2021–22 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యాకోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సం గతి తెలిసిందే. ప్రవేశాల నాటికి మార్గదర్శకాలను జారీ చేయాలని భావిస్తోంది. జాతీయ స్థాయిలో... జాతీయ స్థాయిలో కేంద్రం ఈడబ్ల్యూఎస్ అమలు కు ప్రత్యేక విధానం తెచ్చింది. ప్రస్తుత రిజర్వేషన్లకు నష్టం వాటిల్లకుండా, ఓపెన్ కోటాను తగ్గించకుం డా చర్యలు చేపట్టింది. ఉదాహరణకు ఏదేని ఒక విద్యాసంస్థలో 100%సీట్లు ఉంటే వాటికి అదనంగా 20% సీట్లను (సూపర్ న్యూమరీ) పెంచింది. అం దులో 10 శాతం సీట్లను ఈడబ్ల్యూఎస్‌కు కేటాయిం చింది. మిగతా 10 శాతం సీట్లను అన్ని రిజర్వేషన్ల వారికి విభజించింది. అదే విధానాన్ని అన్ని ఉన్నత విద్యాకోర్సుల్లో అమలు చేస్తోంది. 20 శాతం సీట్లను పెంచితే మౌలిక సదుపాయాల సమస్య తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఏపీలో ఇలా... మరోవైపు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో విధానం అమలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే అదనంగా 10 శాతం (సూపర్ న్యూమరీ) సీట్లను పెంచింది. వాటిని ఈడబ్ల్యూఎస్ కోటా కింద కేటాయిస్తోంది. వీటిల్లో ఏ విధానాన్ని అమలు చేయాలన్న దానిపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. -
ఏడాదైనా కౌంటర్ వేయరా?
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏడాది గడిచినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుకు ఏడాది గడువు సరిపోలేదా అని ప్రశ్నించింది. మూడు నెలల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని బడంగ్‌పేట మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి జనవరి 4న ప్రకటించిన రిజర్వేషన్లను సవాల్ చేస్తూ అదే ప్రాంతానికి చెందిన బండారి కొమరేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఇప్పటికే ఎన్నికలు జరిగి ఏడాది గడిచిందని, రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల నాటికి మారుతాయని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ విచారణార్హం కాదని ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ సంజీవ్‌కుమార్ నివేదించారు. రెండు పర్యాయాలకు ఒకసారి రిజర్వేషన్లు మారుతాయని మున్సిపల్ శాఖ జారీచేసిన ఉత్తర్వుల్లో ఉందని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను విచారించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం...ప్రతివాదులు మూడు నెలల్లో కౌంటర్ దాఖలు చేయాలని, దానిపై రెండు నెలల్లో రిప్లై దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఓఎంసీ కేసు నుంచి నా పేరు తొలగించండి : శ్రీలక్ష్మి సాక్షి, హైదరాబాద్: అక్రమ మైనింగ్ ఆరోపణలపై ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)పై సీబీఐ నమోదు చేసిన కేసులో తనను అక్రమంగా ఇరికించారని, ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. మైనింగ్ లీజుల మంజూరులో నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరించానని తెలిపారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 25కు వాయిదా వేసింది. -
ప్రైవేట్ కాలేజీల్లోనూ పక్కాగా రిజర్వేషన్లు
సాక్షి, అమరావతి: ఇంటర్, డిగ్రీ కోర్సులు నిర్వహించే ప్రైవేట్ కాలేజీల్లోనూ రిజర్వేషన్ల ప్రకారమే పేద విద్యార్థులకు సీట్లు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇష్టారాజ్యంగా ప్రవేశాలు కల్పిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల మాయాజాలానికి ఆన్లైన్ అడ్మిషన్ల ద్వారా అడ్డుకట్ట పడనుంది. 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్ విధానంలో అడ్మిషన్లకు శ్రీకారం చుడుతుండడంతో ప్రైవేట్ విద్యా సంస్థల్లోనూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పక్కాగా అమలు కానుంది. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలపై ఉన్నత విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఇప్పటికే జీవో 34 జారీ చేసిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లను పాటిస్తూ మెరిట్ ప్రాతిపదికన సీట్లను భర్తీ చేయనున్నారు. బోర్డు వెబ్సైట్లో అడ్మిషన్ల వివరాలు.. ఇంటర్ కాలేజీలకు అనుమతులతో సహా ప్రవేశాలను ఆన్లైన్లోనే నిర్వహించేలా బోర్డు సన్నాహాలు పూర్తిచేసింది. ఆన్లైన్ ప్రవేశాల విధి విధానాలను సోమవారం రాత్రి వెబ్సైట్లో పొందుపరిచింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు ఆన్లైన్లో ప్రవేశాలు చేపట్టనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. రిజర్వేషన్ల వారీగా సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. స్టూడెంట్ లాగిన్ ద్వారా వివరాలను పూరించి ప్రాధాన్యత క్రమంలో ఐదు కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. సీటు లభించిన కాలేజీ వివరాలను సూచిస్తూ వెబ్సైట్లోనే అలాట్మెంట్ లెటర్ వస్తుంది. నిర్ణీత ఫీజు చెల్లించి కాలేజీలో చేరవచ్చు. ఇక సెక్షన్‌కు 40 మంది మాత్రమే.. ఇన్నాళ్లూ ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను పట్టించుకోకుండా ప్రైవేట్ కాలేజీలు ఇష్టానుసారంగా ప్రవేశాలు నిర్వహిస్తూ విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. సీబీఎస్ఈ నిబంధనల ప్రకారం ఇక సెక్షన్‌కు 40 మందిని మాత్రమే చేర్చుకోవాలి. పక్కాగా రిజర్వేషన్లు.. తాజా నిబంధనల ప్రకారం ఆయా కాలేజీల్లోని మొత్తం సీట్లలో ఎస్సీ విద్యార్థులకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం సీట్లు కేటాయించాలి. వెనుకబడిన తరగతులకు 29 శాతం సీట్లు కేటాయించాల్సి ఉండగా అందులో బీసీ ‘ఏ’ 7 శాతం, బీసీ ‘బీ’ 10 శాతం, బీసీ ‘సీ’ 1 శాతం, బీసీ ‘డి’ 7 శాతం, బీసీ ‘ఈ’ విద్యార్థులకు 4 శాతం చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగులకు 3 శాతం, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా కింద 5 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం సీట్లు కేటాయించాలి. అంతేకాకుండా ఆయా కేటగిరీల్లోని సీట్లలో 33.33 శాతం సీట్లు బాలికలకు కేటాయించాలి. ఇంటర్ బోర్డు ఆన్లైన్లో ప్రవేశాలను నిర్వహిస్తుండడంతో నిబంధనల ప్రకారం ఆయా వర్గాల విద్యార్థులకు సీట్లు దక్కనున్నాయి. -
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు..
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని యూనిట్‌గా పరిగణించి రిజర్వేషన్లు ఖరారు చేశామని మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కార్పొరేషన్లలో 672 డివిజన్లు, మున్సిపాలిటీల్లో 2,123 వార్డులకు కోర్టు తీర్పును అనుసరించి రిజర్వేషన్లు ప్రకటించామని పేర్కొన్నారు. 33 శాతానికిపైగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చామని పేర్కొన్నారు. 16 కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు చేయగా.. 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. మూడు కార్పొరేషన్లకు కోర్టు వివాదాలు ఉన్నాయని చెప్పారు. 103 మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు పూర్తయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 74 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని, 29 మున్సిపాలిటీల్లో విలీన, కోర్టు సమస్యల వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయని విజయ్‌కుమార్ తెలిపారు. (ఏపీలో మోగిన స్థానిక ఎన్నికల నగారా) ఏపీలో 103 మున్సిపల్/నగరపంచాయతీ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రిజర్వేషన్లలో బీసీలు, మహిళలకు పెద్దపీట వేశారు. ►ఎస్టీ మహిళలకు రెండు స్థానాలు, ఎస్టీ జనరల్ ఒక స్థానం ►ఎస్సీ జనరల్ ఏడు స్థానాలు, ఎస్సీ మహిళ ఏడు స్థానాలు ►బీసీ జనరల్ 17 స్థానాలు, బీసీ మహిళ 17 స్థానాలు ►జనరల్ మహిళ 26 స్థానాలు, జనరల్ 26 స్థానాలు శ్రీకాకుళం: ఆమదాలవలస-బీసీ మహిళ, ఇచ్చాపురం-జనరల్ మహిళ పలాస- బీసీ జనరల్, పాలకొండ(నగరపంచాయతీ)- ఎస్సీ మహిళ విజయనగరం: బొబ్బిలి- బీసీ జనరల్, పార్వతీపురం- బీసీ మహిళ సాలూరు- జనరల్ మహిళ, నెల్లిమర్ల(నగరపంచాయతీ)- ఎస్సీ మహిళ విశాఖ: నర్సీపట్నం- ఎస్సీ మహిళ, యలమంచిలి- బీసీ మహిళ తూర్పుగోదావరి: అమలాపురం- జనరల్ మహిళ, మండపేట- బీసీ మహిళ పెద్దాపురం- బీసీ మహిళ, పిఠాపురం- జనరల్ మహిళ రామచంద్రపురం- జనరల్ మహిళ, సామర్లకోట- జనరల్ మహిళ తుని- జనరల్ మహిళ, గొల్లప్రోలు(నగరపంచాయతీ)- జనరల్ మహిళ ముమ్మిడివరం(నగరపంచాయతీ)- ఎస్సీ జనరల్ ఏలేశ్వరం(నగరపంచాయతీ)- బీసీ మహిళ పశ్చిమగోదావరి: భీమవరం- బీసీ మహిళ, నర్సాపురం- బీసీ మహిళ పాలకొల్లు- జనరల్, తాడేపల్లిగూడెం- జనరల్ మహిళ కొవ్వూరు- ఎస్సీ మహిళ, నిడదవోలు- జనరల్, తణుకు- జనరల్ మహిళ, ఆకివీడు(నగరపంచాయతీ)- బీసీ మహిళ జంగారెడ్డిగూడెం(నగరపంచాయతీ)- జనరల్ మహిళ కృష్ణా: గుడివాడ- జనరల్, జగ్గయ్యపేట- బీసీ జనరల్ నూజివీడు- జనరల్ మహిళ, పెడన- బీసీ మహిళ కొండపల్లి- బీసీ జనరల్, ఉయ్యూరు(నగరపంచాయతీ)- జనరల్ నందిగామ(నగరపంచాయతీ)- జనరల్ మహిళ తిరువూరు(నగరపంచాయతీ)- ఎస్సీ జనరల్ గుంటూరు: బాపట్ల- జనరల్ మహిళ, చిలకలూరిపేట- జనరల్ మాచర్ల- బీసీ జనరల్, మంగళగిరి- బీసీ మహిళ నర్సరావుపేట- జనరల్, పిడుగురాళ్ల- జనరల్ పొన్నూరు- ఎస్సీ మహిళ, రేపల్లె- ఎస్టీ మహిళ గుంటూరు: సత్తెనపల్లి- జనరల్ మహిళ, తాడేపల్లి- ఎస్సీ జనరల్ తెనాలి- జనరల్ మహిళ, వినుకొండ- బీసీ జనరల్ దాచేపల్లి(నగరపంచాయతీ)- జనరల్ మహిళ గురజాల(నగరపంచాయతీ)- జనరల్ మహిళ ప్రకాశం: చీరాల- జనరల్, కందుకూరు- జనరల్ మహిళ మార్కాపురం- జనరల్, దర్శి(నగరపంచాయతీ)- జనరల్ అద్దంకి(నగరపంచాయతీ)- ఎస్సీ మహిళ చీమకుర్తి(నగరపంచాయతీ)- బీసీ జనరల్ గిద్దలూరు(నగరపంచాయతీ)- బీసీ జనరల్ కనిగిరి(నగరపంచాయతీ)- బీసీ జనరల్ నెల్లూరు: ఆత్మకూరు- ఎస్టీ జనరల్, గూడూరు- జనరల్ కావలి- జనరల్ మహిళ, సూళ్లురుపేట- జనరల్ వెంకటగిరి- బీసీ మహిళ, నాయుడుపేట- ఎస్సీ జనరల్ బుచ్చిరెడ్డిపాలెం(నగర పంచాయతీ)- బీసీ మహిళ చిత్తూరు: మదనపల్లె- జనరల్ మహిళ, పుంగనూరు- జనరల్ పలమనేరు- బీసీ మహిళ, నగరి- బీసీ జనరల్ శ్రీకాళహస్తి- ఎస్టీ జనరల్, పుత్తూరు- ఎస్సీ జనరల్, కుప్పం- జనరల్ అనంతపురం: ధర్మవరం- బీసీ మహిళ, గుత్తి- జనరల్ మహిళ గుంతకల్- జనరల్ మహిళ, హిందూపురం- జనరల్ కదిరి- జనరల్ మహిళ, కల్యాణదుర్గం- బీసీ మహిళ రాయదుర్గం- బీసీ మహిళ, తాడిపత్రి- జనరల్ పుట్టపర్తి- జనరల్, మడకశిర(నగరపంచాయతీ)- ఎస్సీ జనరల్ పామిడి(నగరపంచాయతీ)- బీసీ జనరల్, పెనుకొండ(నగరపంచాయతీ)- జనరల్ కర్నూలు: ఆదోని- బీసీ మహిళ, నందికొట్కూరు- జనరల్ నంద్యాల- జనరల్ మహిళ, ఎమ్మిగనూరు- బీసీ మహిళ గూడూరు- ఎస్సీ జనరల్, ఆళ్లగడ్డ- జనరల్ ఆత్మకూరు(నగరపంచాయతీ)- జనరల్ మహిళ డోన్(నగరపంచాయతీ)- బీసీ జనరల్ వైఎస్ఆర్ జిల్లా: బద్వేల్- జనరల్, మైదుకూరు- జనరల్ పొద్దుటూరు- బీసీ జనరల్, పులివెందుల- బీసీ జనరల్ రాయచోటి- జనరల్, జమ్మలమడుగు- బీసీ మహిళ రాజంపేట- జనరల్, యర్రగుంట్ల- జనరల్ కమలాపురం(నగరపంచాయతీ)- ఎస్సీ మహిళ -
బాబు తీరును ఎండగట్టిన మంత్రులు
సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరును మంత్రులు ఎండగట్టారు. చంద్రబాబు నక్కబుద్ధి, దొంగ వ్యవహారాన్ని ప్రజల దృష్టికి తీసుకువస్తున్నట్టు మంత్రులు మోపిదేవి వెంకటరమణ, గుమ్మనూరు జయరాం, ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఈ మేరకు మంత్రులు మంగళవారం పత్రికా ప్రకటనలో పలు అంశాలను ప్రస్తావించారు. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వం 2018 సెప్టెంబరులో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తుచేశారు. ఈ అఫిడవిట్ ద్వారా బీసీ వర్గాలకు మేలు జరగకుండా చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లోని ముఖ్య అంశాలను మంత్రులు ప్రజలకు వివరించారు. మంత్రులు చెప్పిన అంశాలు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్, రూరల్‌డెవలప్‌మెంట్ డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీలు చంద్రబాబు ప్రభుత్వం తరఫున ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఇందులోని పాయింట్ నంబర్ 25లో 50శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో దాటరాదన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు, విభజన తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కూడా వర్తిస్తుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం 2018 సెప్టెంబరులో దాఖలు చేసిన అఫిడవిట్‌లోని 26వ పాయింటులో సుప్రీంకోర్టు 2016 ఫిబ్రవరి 8న ఇచ్చిన తీర్పులో ఏం చెప్పిందో కూడా రాశారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిపోయినందున 60.55శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ప్రశ్నలకు ఇప్పుడు తాము సమాధానం చెప్పదలుచుకోలేదని, కాబట్టి పిటిషన్లు డిస్మిస్ చేస్తున్నామంటూ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. ఆ అఫిడవిట్‌లోని 27వ పాయింటులో ఈ అంశాన్ని మరింత వివరంగా చెప్పారు. 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాత్రమే రిజర్వేషన్లు 50శాతం మించడాన్ని అంటే, 60.55శాతం ఉండటాన్ని సుప్రీంకోర్టు అనుమతించింది తప్ప భవిష్యత్తులో మరే ఎన్నికలకూ దీన్ని వర్తింపచేసే అవకాశం లేదని 27వ పాయింటు చివరి వాక్యంలో చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇంగ్లిషులో చెప్పాలంటే ఇట్ కెనాట్ బీ ఎక్స్టెండెడ్ ఫ్యూచర్ ఎలక్షన్స్ అంటూ సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. కాబట్టే..స్పెషల్‌ఆఫీసర్లను నియమించుకోక తప్పడంలేదంటూ ఎన్నికలు నిర్వహించకుండా తప్పించుకుని చేతులు ఎత్తేసింది. ఇప్పుడు ఈ నెపాన్ని వారిచ్చిన అఫిడవిట్‌కు భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వంమీద నెడుతోంది. యాభైశాతం రిజర్వేషన్లు మించడానికి హైకోర్టు, సుప్రీంకోర్టు అనుమతించడంలేదంటూ సాక్షాత్తూ మరోసారి హైకోర్టుకు తెలిపిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఏ ముఖం పెట్టుకుని 59.75శాతం రిజర్వేషన్లు కావాలని దొంగ డిమాండ్లు చేయడం ఎంతవరకూ సహేతుకం. ఈ అఫిడవిట్ చంద్రబాబు దొంగ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తోంది. -
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పు
-
టీడీపీ.. బీసీ వ్యతిరేకి
టీడీపీ నిర్వాకం వల్ల బీసీలు 9.85 శాతం మేర రిజర్వేషన్లు నష్టపోతున్నారు. తద్వారా వారికి దక్కాల్సిన నాలుగు జెడ్పీ చైర్మన్ పదవుల్లో ఒకటి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 65 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు, 65 జెడ్పీటీసీ పదవులతో పాటు సర్పంచి పదవులు, వార్డు సభ్యుల పదవులతో కలిపి మొత్తంగా 15,000కు పైగా పదవులు బీసీల చేజారాయి. సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ వెనుకబడిన తరగతుల (బీసీ) వారికి వ్యతిరేకమని మరోమారు నిరూపించుకుంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మొత్తంగా 58.95 శాతం రిజర్వేషన్ల అమలుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ కోర్టుకు వెళ్లి మోకాలొడ్డింది. రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటుతున్నాయని కోర్టుకు వెళ్లింది టీడీపీ నాయకుడే. టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ గౌరవాధ్యక్షుడుగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ (ఏపీపీసీ – ఇది ప్రైవేట్ సంఘం) ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న బిర్రు ప్రతాప్‌రెడ్డి రిజర్వేషన్ల తగ్గింపు కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. చంద్రబాబు ప్రభుత్వం సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇతనికి ఓ నామినేటెడ్ పదవిని కూడా కట్టబెట్టింది. ఉపాధి హామీ పథకం అమలు తీరు పర్యవేక్షించే రాష్ట్ర కౌన్సిల్(ఏపీఎస్‌ఈజీసీ) సభ్యుడిగా నియమిస్తూ 2019 మార్చి 9వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ రిజర్వేషన్ల కథాకమామిషు.. పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో డిసెంబర్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఎస్సీలకు 2013లో ఉన్న 18.30 శాతం రిజర్వేషన్లు 19.08 శాతానికి పెరగగా, బీసీలకు 2013లో అమలు చేసిన 34 శాతం రిజర్వేషన్లనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విభజన తర్వాత ఏపీలో ఎస్టీల జనాభా తగ్గడంతో వారి రిజర్వేషన్లు 9.15 శాతం నుంచి 6.77 శాతానికి తగ్గించారు. ఈ ఏడాది జనవరిలో రిజర్వేషన్ల కేసును విచారించిన హైకోర్టు 59.85 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు అభ్యంతరం తెలపలేదు. దీంతో జనవరి 17వ తేదీన పంచాయతీ రాజ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పట్లో అన్ని ఏర్పాట్లు చేసింది. అంతలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉన్నాయంటూ బిర్రు ప్రతాప్‌రెడ్డి జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల నిర్వహణకు స్టే ఇచ్చింది. తిరిగి ఈ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర హైకోర్టులో నిర్ణయం జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు సూచనతో తిరిగి విచారణ చేపట్టిన హైకోర్టు సోమవారం రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. బీసీలకే ఎందుకు తగ్గుతున్నాయంటే.. 59.82 శాతం ఉండే రిజర్వేషన్లు 50 శాతానికి తగ్గించడం వల్ల 9.85 శాతం మేర బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు తగ్గించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం జనాభా నిష్పత్తిన రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉన్నందున వారి రిజర్వేషన్లు తగ్గించే వీలు లేనందున బీసీల రిజర్వేషన్లలో కోత పడుతుందని వివరించారు. -
రిజర్వేషన్లు 50% మించొద్దు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను చట్ట విరుద్ధంగా ప్రకటించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని, అలా జరగడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 డిసెంబర్ 28న ప్రభుత్వం జారీ చేసిన జీవో 176ను రద్దు చేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఎన్నికలు నిర్వహించ వచ్చని చెప్పింది. (చదవండి: టీడీపీ.. బీసీ వ్యతిరేకి) ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. స్థానిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 176, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను సవాలు చేస్తూ కర్నూలుకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం గత నెల 6న తీర్పును వాయిదా వేసింది. తీర్పు వెలువరించే దశలో పలు సందేహాలు రావడంతో వాటి నివృత్తి కోసం అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలను విన్న ధర్మాసనం తాజాగా సోమవారం తీర్పు వెలువరించింది. అసాధారణ పరిస్థితుల్లో 50 శాతం దాటొచ్చు రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని ధర్మాసనం తెలిపింది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే 50 శాతం దాటొచ్చునని ఇందిరా సహాని, రాకేష్ కుమార్ తదితర కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9 (1ఏ), 15(2), 152(1ఏ), 153(2ఏ), 180(1ఏ), 181(2)(బీ)ల గురించి ధర్మాసనం తన తీర్పులో సవివరంగా చర్చించింది. ఈ సెక్షన్ల వల్ల బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని, అది చెల్లదని తీర్పులో పేర్కొంది. (చదవండి: బడుగుల ద్రోహి చంద్రబాబు) బీసీలకు 34 శాతం తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాలని చెబుతున్న పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9 (1ఏ) చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ తీర్పునకు అనుగుణంగా బీసీల రిజర్వేషన్లను నేటి నుంచి నెలలోపు తిరిగి ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే స్థానిక సంస్థల కాల పరిమితి ముగిసి ఏడాదిన్నర అవుతోందని ధర్మాసనం గుర్తు చేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఇటీవల తాము ఇచ్చిన ఆదేశాలు.. ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, మార్చి 3 కల్లా గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి చేస్తామంటూ ఎన్నికల సంఘం దాఖలు చేసిన కౌంటర్ గురించి ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. కాగా, ఈ తీర్పుపై బీసీ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. (చదవండి: చంద్రబాబు వల్లే బీసీలకు అన్యాయం..) -
కోటా రక్షణకు పటిష్ట చట్టం
దళిత, గిరిజన సామాజిక తరగతుల సంక్షేమానికి సంబంధించిన రిజర్వేషన్లపై తరచుగా వివాదాలు, వాదో పవాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రజా ప్రాతినిధ్య పదవు ల్లోని రిజర్వేషన్ల కంటే ఉద్యోగాల్లో రిజర్వేషన్లపైనే ఆందోళనకర, ప్రమాదకర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నవి. ప్రజా ప్రాతినిధ్య పదవుల్లో కొందరు దళిత, గిరిజన నాయకులు ఉండడం కంటే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వల్లే ఎంతోకొంత సామాజిక న్యాయం నెరవేరుతోంది. అందువల్లనే ఉద్యోగాల్లో రిజర్వేషన్లపైనే అస హనం, కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నవి. రాజ్యాంగం అమల్లోకొచ్చిన ఏడాదిలోపే ఎస్సీ, ఎస్టీలకు లభిస్తున్న విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషనుపై హైకోర్టు, సుప్రీం కోర్ట్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులిచ్చాయి. ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చొర వతో రాజ్యాంగం ఆర్టికల్ 15కి చేసిన సవరణతో మొదటి ప్రమాదం తప్పింది. గడిచిన ఏడు దశాబ్దాల కాలంలో కూడా వివిధ సందర్భాల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు యిచ్చిన తీర్పుల వలన మరికొన్నిసార్లు రాజ్యాంగానికి స్వల్పమైన సవరణలు చేయాల్సివచ్చింది. కాగా జార్ఖండ్ ప్రభుత్వం 2012లో కొన్ని ఉద్యోగ ఖాళీలను రిజర్వేషన్లు పాటించకుండా యిచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ ఈనెల ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టు యిచ్చిన తీర్పుతో రిజర్వేషన్లు మరోసారి ప్రమాదంలో పడే పరిస్థితి దాపురించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపనుల శాఖలోని అసిస్టెంట్ ఇంజనీర్ల ప్రమోషన్లలో ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం లేదని 2012 సెప్టెంబర్ 5న ఇచ్చిన ఉత్తర్వులను వినోద్ కుమార్ మరో ఇద్దరు ఎస్సీ తరగతికి చెందిన ఉద్యోగులు ఆ రాష్ట్ర హైకోర్టులో చాలెంజ్ చేయడం జరిగింది. దానిపైన తీర్పు చెప్పిన హైకోర్టు పదోన్న తుల్లో రిజర్వేషన్లు పాటించాలా అక్కర్లేదా అనేది నిర్ణయించడానికి సదరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆయా సామాజిక తరగతుల ప్రాతినిధ్యం ఏ మేరకు ఉన్నదనే విషయమై నాలుగు నెలల్లో సమాచారం సేకరించాలని, దాని ఆధారంగా ప్రాతినిధ్యం తక్కువగా వున్న సామాజిక తరగతుల వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తీర్పులో ఒక ముఖ్యమైన విషయం ఇమిడివుంది. రిజర్వేషన్లు ఇంకా ఎంతకాలం అనే ప్రశ్నలకు కూడా అది సమా ధానం కావచ్చు. దాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ కేసును విచారించిన జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హేమంత్ గుప్తాల సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వేషన్లు ప్రాధమిక హక్కు కాదు అంటూ ఇచ్చిన తీర్పుతో ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. ఇరువురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన తీర్పు సారాంశం ఇలా ఉంది. పబ్లిక్ సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడాల్సిన అవసరం లేదు. ప్రమోషన్లలో రిజర్వేషన్ కోరడానికి ఎవరికీ ప్రాథమిక హక్కేమీ కాదు. రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాలను ఆదేశించే అధికారం సుప్రీంకోర్టుకు కూడా లేదు. రిజర్వేషన్లు ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణాధికారం. రాజ్యాంగం ఆర్టికల్ 16(4) మరియు ఆర్టికల్ 16(4ఏ) ఆధారంగా ఈ తీర్పు చెప్పాల్సి వస్తుందని న్యాయ మూర్తులు చెప్పారు. ఆర్టికల్ 16(4)– ప్రభుత్వ సర్వీసుల్లో వెనకబడిన తరగతుల ప్రాతినిధ్యం తగినంత లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే సంబంధిత తరగతుల వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఆర్టికల్ 16(4ఏ)– ప్రభుత్వ సర్వీసుల్లోని ఏ తరగతి పోస్టులకైనా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తరగతుల వారికి ప్రమోషన్లలో తగినంత ప్రాతినిధ్యం లేదని భావిస్తే వారికి ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఏదేమైనా సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రిజర్వేషన్ల ప్రయోజనం ప్రమాదంలో పడే పరిస్థితి దాపురించింది. సహజంగానే దీనిపైన రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు తమ వంతు ఆందోళన వ్యక్తం చేసినవి. కేంద్ర ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో జరిగిన చర్చలో జోక్యం చేసుకుంటూ సున్నితమైన రిజర్వేషన్ల విషయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని నిందించారు. సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ సమ స్యకు సరైన పరిష్కారం కొరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేస్తుంది అని ప్రకటించారు. కాగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర ఆజాద్ ఈ తీర్పును సమీక్షిం చాలని కోరుతూ ఫిబ్రవరి 11న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిసింది. మరికొంతమంది కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రివ్యూ పిటిషన్ వేయాలని కోరుతున్నారు. రాజ్యాంగం ఆర్టికల్స్ 16(4) మరియు 16(4ఏ)లోని పదాలు అలాగే ఉన్నంత కాలం ధర్మాసనాలు మారినా రిజర్వేషన్లకు గ్యారెంటీ ఉంటుందని ఆశించలేము. జ్యుడీషియరీ ఉన్నత స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ తరగతుల ప్రాతినిధ్యం వుంటే మంచిదే, కానీ ఒకరో ఇద్దరో ఉన్నంత మాత్రాన సానుకూల తీర్పులు వస్తాయని ఆశించలేము. ఒకవేళ వచ్చినా పక్షపాతంగా యిచ్చారని ఆక్షేపించే అవకాశమూ ఉంటుంది. కనుక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తరగతుల సామాజిక రిజర్వేషన్ల రక్షణకు స్పష్టమైన చట్టం అనివార్యం, అత్యవసరం. నాగాటి నారాయణ: ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు, మొబైల్ : 94903 00577 -
పదోన్నతుల కోటాలోనూ అన్యాయమే!
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కానీ, వాటి అమలులో నిర్లక్ష్యం వహించడం కానీ చాలా తీవ్రమైన తప్పులుగా భావించాలి. ఉద్యోగాల్లో ప్రమోషన్ల అంశం ప్రాథమిక హక్కు కాదనీ, ఈ విషయంలో జోక్యం చేసుకోబోమంటూ వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా విస్మరించిందనే చెప్పాలి. పైగా రిజర్వేషన్లు అనేవి కొన్ని వర్గాలను, కులాలను సంతృప్తిపరిచే చర్యగా చాలా మంది భావిస్తున్నారు. ఇదేరకమైన అభిప్రాయం న్యాయనిపుణులలో కూడా ఉండడం విచారకరం. ఇప్పుడు భారతదేశంలో ఎస్సీ, ఎస్టీలకు అమలు జరుగుతున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు స్వాతంత్య్రం ముందునుంచే అమలులో ఉన్నాయి. తరతరాలుగా సమాజ వృద్ధిలో రక్తం, చెమటను ధారపోసిన దళితుల పట్ల ఇలాంటి తీర్పులను వెలువరించడం బాధాకరమైన విషయం. ‘మీరు ఇస్తున్న తీర్పుల పట్ల నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. మీరు ఇచ్చే తీర్పులను అంగీకరించవచ్చు. కానీ గౌరవించలేననే విషయాన్ని నేను చాలాసార్లు కరాఖండిగా చెప్పాను. అదే సమయంలో ప్రతి న్యాయవాదికీ అట్లా చెప్పే స్వేచ్ఛ ఉండాలని నేను విశ్వసిస్తున్నాను. సరిగ్గా అదే అభిప్రా యాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపైన వ్యాఖ్యానించదల్చుకు న్నాను’ అంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగానికి జరిగిన మొదటి సవరణపై 1951, మే 18వ తేదీన పార్లమెంటులో ప్రసం గిస్తున్న సందర్భంలో చేసిన వ్యాఖ్యలివి. అప్పటికి ఆయన కేంద్ర న్యాయశాఖా మంత్రిగా ఉన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం పునాదిగా ఏర్పర్చుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడాది దాటక ముందే ఎస్సీ, ఎస్టీలకు అందిస్తున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు, సుప్రీంకోర్టులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులిచ్చాయి. రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 29ని ఉల్లంఘిస్తున్నాయని న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. అయితే అప్పటికే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టికల్ 15కు సవరణ చేయాలని భావించింది. ఆ సంద ర్భంలోనే బాబాసాహెబ్ అంబేడ్కర్ పైవిధంగా మాట్లాడారు. ఇది నేటి పరిస్థితులకు నూటికి నూరుపాళ్లూ వర్తిస్తుందని నా భావన. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన ప్రతీసారీ, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేయాల్సి వచ్చింది. అయితే వారం క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరింత ఆందోళనకరంగా ఉన్నది. ఎస్సీ,ఎస్టీల ఉద్యోగాలలో ప్రమోషన్ల విష యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోబోదనీ, అయితే ఉద్యోగాల్లో ప్రమోషన్ల అంశం అసలు ప్రాథమిక హక్కు కాదనీ, రాష్ట్ర ప్రభు త్వాలకు తాము ఆదేశాలివ్వలేమనీ, రాష్ట్రాలు తమకు తాముగా నిర్ణ యాలు తీసుకోవచ్చనీ సుప్రీంకోర్టు ఒక అనూహ్యమైన తీర్పు నిచ్చింది. ఇందులో రెండు విషయాలున్నాయి. ప్రమోషన్ల విషయం పేర్కొన్న ఆర్టికల్ 16(4)ఎ ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ప్రభుత్వ సర్వీసులలో తగినంత ప్రాతినిధ్యం లేదని ప్రభుత్వం భావించినట్లయితే అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకొని తగువిధమైన నిబంధనలు రూపొందించడానికి ప్రభుత్వానికి ఎటు వంటి ఆటంకాలు ఉండకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులుగా పరిగణిస్తున్నాం. ఇందులో ఆర్టికల్ 32 ప్రకారం, పౌరులెవరికైనా పైన పేర్కొన్న ఆర్టికల్స్ అమలు చేసే విష యంలో ప్రభుత్వాలు విఫలమైనా, నిర్లక్ష్యం వహించినా జోక్యం చేసుకునే హక్కు హైకోర్టు, సుప్రీంకోర్టులకు ఉంటుందనే విషయం న్యాయశాస్త్రం చదివిన ఎవరికైనా అర్థం అవుతుంది. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కానీ, వాటి అమలులో నిర్లక్ష్యం వహించడం కానీ చాలా తీవ్రమైన తప్పు లుగా భావించాలి. అయితే వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయాలను పూర్తిగా విస్మరించిందనే చెప్పాలి. అసలు రిజర్వేషన్లు అనేవి కొన్ని వర్గాలను, కులాలను సంతృప్తి పరిచే చర్యగా చాలా మంది భావిస్తున్నారు. ఇదేరకమైన అభిప్రాయం సాధారణ వ్యక్తులతోపాటు, న్యాయనిపుణులలో కూడా ఉండడం విచారకరం. భారతదేశంలో ఎస్సీ, ఎస్టీలకు అమలు జరుగుతున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు స్వాతంత్య్రం ముందునుంచే అమలులో ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేడ్కర్ 1942లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో కార్మిక శాఖామంత్రిగా ఉన్నప్పుడు, అప్పటి ప్రభుత్వా ధినేతలను ఒప్పించి, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. కానీ ఆరంభం నుంచి ఇప్పటి దాకా ఎస్సీ, ఎస్టీల విద్య, ఉద్యోగ అవకాశాల విషయంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత, ద్వేషం సమాజంలో నెలకొని వుంది. దాని ప్రభావం అధికారయంత్రాంగం, న్యాయవ్యవస్థ మీద పడుతున్నది. అందువల్లనే ఇప్పటికీ ఎన్నో తీర్పులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రావడం మనం చూడవచ్చు. నిజానికి ఏ దేశంలోనైనా కొన్ని వర్గాలకు, తెగలకు ప్రత్యేకమైన రాయితీలు ఉంటాయి. ఇవన్నీ కూడా సామాజిక వివక్షను రూపుమాప డానికి చేసిన, చేస్తున్న ప్రయత్నాలు. వాటి వల్ల ప్రజల మధ్య అంత రాలు తగ్గుతాయన్న ఆశాభావంతో ఆనాటి నుంచి ఈనాటి వరకూ సమాజం ఉంది. అదే ఉద్దేశ్యంతో భారతదేశంలో కూడా అంటరాని కులాలైన ఎస్సీలకూ, అడవుల్లో, కొండల్లో నివసించే ఆదివాసీలైన ఎస్టీలకూ రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కొన్ని పథకాలను రూపొందించారు. అయితే సమాజంలో ఆధిపత్య కులాల్లో ఉన్నవాళ్ళకు అంటరాని కులాల కోసం అమలు చేస్తున్న రిజర్వేషన్ల పట్ల చాలా ఆగ్రహం ఉన్నది. తమ ఉద్యోగాలను, తమ చదువులు, సీట్లనూ, తమ అవకాశాలనూ వీళ్ళు కొల్లగొడుతున్నారని వారు భావి స్తున్నారు. ముఖ్యంగా గత ఇరవై, ముప్ఫై ఏళ్లలో వచ్చిన యువతరం ఇటువంటి భావాన్ని కలిగి ఉన్నారు. అంతకన్నా ముందుతరం చాలా వివక్షను ప్రదర్శించింది. అప్పుడు ఉద్యోగాల్లో అంత ఎక్కువ మంది కనిపించలేదు. ఇప్పుడు ఉద్యోగాల్లో విద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీలు ఎదిగి వస్తున్నారు. ఇదే కొందరికి మింగుడుపడడంలేదు. సమాజ పరిణామక్రమంపట్ల అవగాహన లేకపోవడం, ఒకవేళ తెలిసినా దానిని అంగీకరించే స్థాయిలేకపోవడం, వాళ్ళ ప్రవర్తనకు కారణం కావచ్చు. ప్రపంచంలో మరెక్కడాలేని విధంగా, ఒక మనిషిని అంటు కోకూడదనే భావన మన దేశంలోనే ఉన్నది. వాళ్ళను ముట్టుకుంటే మైలపడతామనే భావన అందరికీ నరనరానా వ్యాపించి ఉన్నది. ఇప్పటికే గ్రామాల్లో దేవాలయాల్లోకి రానివ్వకపోవడం, దళితులు వంట చేసినా, వస్తువులు అమ్మినా తీసుకోకపోవడం, ఎవరైనా అమ్మా యిలు, అబ్బాయిలు కులాంతర వివాహాలు చేసుకుంటే కూతుళ్ళని కూడా చూడకుండా హత్యచేయడం రోజూ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇవి వేల ఏళ్ళుగా సాగుతున్న అత్యాచారాలు, అంతేకాకుండా వేలమందిని అమానుషంగా హత్యలు చేసిన సమాజం ఇది. అయితే ఇన్ని ఘోరాలకు బలవుతూ కూడా వేల ఏళ్ళ నుంచి సమాజాభివృద్ధికి తమ ప్రాణాలను ధారపోశారు. యాంత్రీకరణ జర గక ముందు అన్ని రకాల వృత్తులకు తోలు పరికరాలను అందించింది అంటరానివారే. చెరువులను నిర్మించి, నిర్వహించి, ప్రాణాలకు తెగించి చెరువులను రక్షించిన వాళ్లూ అంటరానివాళ్ళే. దహన కార్య క్రమాలూ, ఖనన కార్యక్రమాలూ చేసింది వారే. వీధులనూ, వాకి ళ్ళనూ శుభ్రంచేసి యావత్ సమాజం ఆరోగ్యాన్ని కాపాడి, మానవ జాతి మనుగడకు కారణమైందీ ఈ అంటరానివారే. అంటే వ్యవసాయ యుగంలో ప్రాణాలను, ఆరోగ్యాలను ఫణంగా పెట్టింది కూడా ఈ అంటరానివారే. పైగా, పారిశ్రామిక రంగానికి ప్రథమ అవసరాలైన రైల్వేలు, గనులలో ఎండనకా, వాననకా, రక్తాన్ని చెమటగా ధారపో సింది కూడా ఈ అంటరానివారే. 1938లో ఇల్లందు బొగు ్గగనిలో ప్రమాదం జరిగి 42 మంది మరణిస్తే, అధికారులు మినహా మిగతా 37 మంది అంటరానివారే. ఇప్పటికీ మల మూత్రాలను ఒంటినిండా పులుముకొని, ప్రాణాలకు తెగించి మ్యాన్‌హోల్స్‌లో దిగుతున్నది కూడా వాళ్లే. నిజానికి వాళ్లు సమాజానికి చేసిన సేవతో పోలిస్తే ప్రస్తుతం అమలుచేస్తున్న రిజర్వేషన్లు ఏ మూలకూ సరిపోవు. ఒకవైపు సమాజ వృద్ధిలో రక్తం, చెమటను ధారపోసిన వీళ్ళను వేల ఏళ్ళుగా పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు. అభివృద్ధిపథంలో దూసుకెళు తున్నామనుకుంటోన్న ఈ ఆధునిక, నవీన యుగంలో కూడా ఇలాంటి తీర్పులను వెలువరించడం బాధాకరం. ‘హీరోషీమా, నాగసాకిలపై బాంబులు వేసి, మారణహోమం సృష్టించినందుకు జపాన్ వెళ్ళిన ప్రతి అమెరికా అధ్యక్షుడూ, ఆప్రాంతానికి వెళ్ళి జపాన్ ప్రజలకు క్షమాపణ చెప్పడం ఆనవాయితీ, అమృ త్‌సర్‌లోని స్వర్ణదేవాలయం మీద భారత సైన్యం చేసిన దాడిపట్ల పశ్చాత్తాపంతో స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రతిప్రధాని విచారం వ్యక్తం చేస్తారు. కానీ రెండువేల ఏళ్ళకుపైగా నూటికి 25 శాతం మంది మీద అమానుషమైన వివక్ష, హత్యలను, అత్యాచారాలను చేస్తున్న హిందూ సమాజంలో మాత్రం ఎటువంటి సానుభూతి కనిపించక పోవడం, కనీసం విచారం వ్యక్తం చేయకపోవడం బాధకలిగిస్తున్నది. ఒక హిందువుగానే నేను తలవంచి దళితులకు క్షమాపణలు చెబు తాను’ అన్న మాజీ ఐఏఎస్ అధికారి కె.ఆర్. వేణుగోపాల్‌గారి మాట లను హిందూ సమాజం ఒకసారి అవలోకనం చేసుకుంటే యావత్ సమాజం దళితులు, అంటరానివారిపట్ల గౌరవాన్ని ప్రదర్శించగలుగుతుంది. తమ ప్రవర్తన పట్ల పునరాలోచించుకోగలుగుతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్‌లో ఆశ్చర్యకర ఘటన
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్‌లో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా రాజకీయ నేతలు, ప్రముఖుల కోటాలో రైలు టికెట్లను కేటాయిస్తారు. కానీ కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్ రైలులో మాత్రం ఏకంగా దేవుడికే ఓ సీటును రిజర్వు చేశారు. అంతేకాదు శివుడి పేరుతో ప్రత్యేక బెర్త్ కూడా ఏర్పాటు చేశారు. బి5 కోచ్‌లోని సీట్ నెంబర్ 64 పూర్తిగా దేవుడికే కేటాయించారు. అంతటితో ఆగిపోకుండా అందులో శివుడి చిత్రపటాన్ని పెట్టి సీటును పూలతో డెకరేట్ చేశారు. ప్రయాణికులు ఎవ్వరు ఈ సీట్ పైకి ఎక్కకూడదు అంటూ బోర్డు పెట్టారు. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినప్పటికీ దీన్ని ఎంత కాలం వరకు దేవుడి పేరుతో కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలిసి ప్రయాణికులంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా యూపీలో కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆదివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలు ఇండోర్ నుంచి కాశీకి ప్రతి రోజూ రాకపోకలను జరుపుతుంది. మార్గంలో మధ్యలోని మూడు జోతిర్లాంగాల క్షేత్రాలైన.. ఓంకారేశ్వర్, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్‌ని చుట్టుకుంటూ కాశీని చేరుకుంటుంది. సుమారు 1131 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ మూడు జోతిర్లాంగాల క్షేత్రాలను చుట్టేస్తుంది. ప్రతి కోచ్ లో భక్తి సంగీతం చిన్నగా వినిపిస్తూ ఉంటుంది. ప్రయాణికులకు పూర్తి భక్తి భావం కలిగేలా ఇలాంటి సదుపాయం ఏర్పాటు చేశారు. దీంతో పాటు శాకాహార భోజనం కూడా అందించే ఏర్పాట్లు చేశారు. కాగా భారతీయ రైల్వే కాకుండా పూర్తిగా ప్రైవేటు సంస్థ తయారు చేసిన మూడో రైలు కాశీ మహాల్ ఎక్స్ ప్రెస్ కావడం విశేషం. -
రిజర్వేషన్ల ఆంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకోవట్లేదు
-
రిజర్వేషన్ల అంశంపై లోక్‌సభలో రగడ
-
రైళ్లు.. బస్సులు.. ఖాళీల్లేవ్!
తణుకు: సంక్రాంతి వచ్చేస్తోంది... మిగిలిన పండుగలు ఎలా ఉన్నా సంక్రాంతి వచ్చిందంటే మాత్రం సొంతూరు రావాలని అనుకునే వారికి మాత్రం చుక్కలు చూస్తున్నారు. సంక్రాంతికి ఊరు వెళదామనుకున్నా.. యాత్రలకు వెళ్లాలనుకున్నా రిజర్వేషన్ చేయించుకునేందుకు వెళ్లే వారికి మాత్రం చుక్కెదురవుతోంది. ప్రధాన నగరాల నుంచి బయలుదేరే అన్ని ప్రధాన రైళ్లలో బెర్తుల రిజర్వేషన్ పూర్తయిపోయింది. రెండు నెలలు ముందుగానే రిజర్వేషన్ చేయించుకునేందుకు అవకాశం ఉండటంతో ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తికావడంతో తర్వాత ప్రయత్నించిన వారికి నిరాశే మిగులుతోంది. రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే బెర్తులన్నీ భర్తీ అవుతున్నాయి. మరోవైపు వెయిటింగ్ లిస్టు సైతం నిండిపోవడంతో ఒక్కో రైలులో నో రూం అని వస్తోంది. జనవరి 25 వరకు ప్రధాన రైళ్లు అన్నింటిలో బెర్తులు నిండిపోయాయి. వేలాది మందిపై ప్రభావం జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్ల మీదుగా సుమారు 25 వరకు ప్రధాన రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఉద్యోగులు ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్, విశాఖ, ముంబై, చెన్నై వంటి నగరాలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు. సాధారణ రోజుల్లోనే రెండు, మూడ్రోజుల పాటు వరుస సెలవులు వస్తే సొంతూరుకు రావాలని ఉవ్విళ్లూరుతుంటారు. అయితే సంక్రాంతికి ఈసారి విద్యాసంస్థలకు పది రోజులపాటు సెలవులు రావడంతో స్వస్థలాలకు చేరుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన నగరాల నుంచి వచ్చే రైళ్లన్నీ నిండిపోవడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో ప్రధాన పట్టణాలైన ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, నరసాపురం, నిడదవోలు పట్టణాల మీదుగా నిత్యం ఐదు వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. పండుగ సమయాల్లో అయితే ఈ సంఖ్య నాలుగు రెట్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే రైళ్లలో పరిస్థితి రిగ్రీట్ స్థాయికి చేరుకోవడంతో కనీసం టికెట్ తీసుకునే స్థితి లేకుండాపోయింది. దీంతో తాత్కాల్‌పై గంపెడాశలు పెట్టుకుంటున్నారు. బస్సులదీ అదే దారి.. రైళ్లన్నీ నిండుకోవడంతో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కొందరు బస్సు ఆపరేటర్లు టికెట్లు బ్లాక్ చేస్తుండంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ పేరు చెప్పి ప్రయాణికులపై అదనపు భారం మోపేందుకు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించేవారు ఎక్కువగా ప్రైవేట్ బస్సులపై ఆధారపడాల్సి ఉంది. దీనిని ముందుగా గుర్తించిన ప్రైవేట్ ఆపరేటర్లు సెలవురోజుల్లో టికెట్ల అమ్మకాలు నిలిపివేశారు. బ్లాక్ చేయడం ద్వారా సీజన్లో రద్దీని బట్టి టికెట్ ధర రెండు, మూడు రెట్లు పెంచి అమ్మాలని నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లా నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ ట్రావెల్స్ రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీలో హైదరాబాదు నుంచి జిల్లాకు వచ్చే బస్సుల్లో యాభై శాతం చార్జీలు పెంచగా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సుల్లో నలభై శాతం రాయితీ కల్పిస్తున్నారు. రైళ్లల్లో సైతం ప్రీమియం చార్జీల పేరుతో ప్రయాణికులపై బాదేస్తున్నారు. అదనంగా సర్వీసులు పండుగ రద్దీకు అనుగుణంగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా జిల్లా నుంచి అదనంగా సర్వీసులు పెంచాం. హైదరాబాద్ నుంచి జిల్లాకు 245, జిల్లా నుంచి హైదరాబాద్‌కు 270 సర్వీసులు చొప్పున అదనంగా నడుపుతున్నాం. ఈనెల 10 నుంచి 13 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే బస్సుల్లో చార్జీలు పెంచగా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సుల్లో మాత్రం రాయితీ కల్పిస్తున్నాం.–ఎ.వీరయ్యచౌదరి, ఆర్టీసీ ఆర్ఎం, ఏలూరు -
బీసీలకు 31 శాతం!
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై కొంత స్పష్టత వచ్చింది. బీసీలకు 30–31 శాతం, ఎస్సీలకు 13–14 శాతం, ఎస్టీలకు 4–5 శాతం మేయర్, చైర్మన్ స్థానాలు రిజర్వుకానున్నాయి. మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వుకానున్న చైర్మన్/మేయర్ల స్థానాలను రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఆదివారం ఉదయం తన కార్యాలయంలో డ్రా పద్ధతిలో ఎంపిక చేసి ప్రకటించనున్నారు. దీంతో మున్సిపాలిటీలు యూనిట్‌గా, మున్సిపల్ కార్పొరేషన్లు యూనిట్‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వుకానున్న చైర్మన్, మేయర్ స్థానాలకు సంబంధించిన కచ్చితమైన రిజర్వేషన్ల లెక్కలపై స్పష్టత రానుంది. నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నింటినీ యూనిట్‌గా తీసుకుని చైర్మన్ స్థానాలకు, మున్సిపల్ కార్పొరేషన్లన్నింటినీ యూనిట్‌గా తీసుకుని మేయర్ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్/మేయర్ స్థానాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనుండగా, 16–18 స్థానాలు ఎస్సీలకు, 4–5 స్థానాలు ఎస్టీలకు, 37–39 స్థానాలు బీసీలకు, మిగిలిన స్థానాలు జనరల్‌కు రిజర్వు కానున్నాయి. అదే విధంగా 10 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనుండగా, ఎస్సీ లకు 1–2, ఎస్టీలకు 1, బీసీలకు 3–4 మేయర్ స్థానాలు రిజర్వయ్యే అవకాశాలున్నాయి. వార్డులు/డివిజన్లవారీగా రిజర్వేషన్లు... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వుకానున్న వార్డులు, డివిజన్ల సంఖ్యను ప్రకటిస్తూ శనివారం శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీని యూనిట్‌గా పరిగణించి స్థానిక వార్డుల రిజర్వేషన్లను, మున్సిపల్ కార్పొరేషన్‌ను యూనిట్‌గా తీసుకుని డివిజన్ల రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఒక్కో పురపాలికలో స్థానికంగా నివసించే ఎస్సీ, ఎస్టీ జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో కలుపుకుని మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా మిగిలిన స్థానాలను బీసీలకు కేటాయిస్తారు. ఎన్నికలు జరగనున్న 120 మున్సిపాలిటీల్లో మొత్తం 2,727 వార్డులుండగా, ఎస్సీలకు 386, ఎస్టీలకు 159, బీసీలకు 802 వార్డులను కేటాయించారు. ఎన్నికలు జరుగనున్న 10 మున్సిపల్ కార్పొరేషన్లలో 385 డివిజన్లుండగా, ఎస్సీలకు 49, ఎస్టీలకు 12, బీసీలకు 131 స్థానాలు వచ్చాయి. చాలా పురపాలికల్లో ఎస్టీలు ఒకరిద్దరు మాత్రమే ఉన్నా నిబంధనల ప్రకారం వారికి కనీసం ఒక వార్డు/డివిజన్‌ను కేటాయించారు. దీంతో ఎస్టీలకు సగటున 4.50 శాతం వరకు వార్డు/డివిజన్ స్థానాలు రిజర్వయ్యాయని అధికారవర్గాలు తెలిపాయి. అదే విధంగా సగటున బీసీలకు 31 శాతం, ఎస్సీలకు 14 శాతం వార్డు/డివిజన్ స్థానాలు రిజర్వయ్యాయని ఓ అధికారి ‘సాక్షి’కి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు కానున్న వార్డులు/డివిజన్లను స్థానిక జిల్లా కలెక్టర్లు ఆదివారం ఉదయం డ్రా పద్దతిలో ఎంపిక చేయనున్నారు. ఈ నెల 7న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండగా, 22న పోలింగ్ జరుగనుంది. 25న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. -
‘పురపాలక మొదటి దశ రిజర్వేషన్లు పూర్తి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పురపాలక రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తైంది. ఆయా వర్గాలవారీగా మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు పుర్తి అయ్యాయి. రిజర్వేషన్ల వివరాలను శనివారం తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు పంపించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు మున్సిపల్ వార్డుల పదవుల్లో రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించింది. ఎస్టీల జనాభా ఒక్కశాతం తక్కువగా ఉన్నా కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లోనూ ఒక వార్డు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. 50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లను కల్పించారు. రేపు( ఆదివారం) వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. -
రాష్ట్రంలోనూ 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటా అమలు చేయడానికి ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఆయా సంస్థల్లో 10 శాతం సీట్లను పెంచి ఈ కోటాను అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర విద్యా సంస్థల్లో గతేడాది నుంచి ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తున్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ).. వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2020–21) అన్ని రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో ఈ కోటా అమలు చేయాలని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ కాలేజీలకు ప్రయోజనం ఈడబ్ల్యూఎస్ కోటా అమల్లోకి వస్తే రాష్ట్రంలోని వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో సీట్లు పెరగనున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, లా, పీజీ కాలేజీల్లో సీట్లు పెరుగుతాయి. 15 ఏళ్లుగా ఒక్క సీటు కూడా పెరగని ప్రభుత్వ కాలేజీల్లో 10 శాతం సీట్లు కొత్తగా అందుబాటులోకి వస్తే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 300కు పైగా సీట్లు అదనంగా లభిస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 14 ఇంజనీరింగ్ కాలేజీల్లో 3,071 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లోనూభారీ పెరుగుదల కోటా అమలుతో ప్రైవేటు కాలేజీల్లో కూడా భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ నిబంధనను ప్రైవేటు విద్యా సంస్థల్లో అమలు చేయాలా.. వద్దా అనేది సర్కారు తేల్చాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నత విద్యా కోర్సుల్లో మొత్తం 6,52,178 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో డిగ్రీలోనే 4,43,269 సీట్లు ఉండగా.. వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో 2,08,909 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం డిగ్రీ కోర్సులకు సంబంధించిన సీట్లు సగం కూడా భర్తీ కావడం లేదు. ఈ నేపథ్యంలో డిగ్రీ సీట్ల పెంపు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఇక వృత్తి విద్యా కోర్సుల్లో 10 శాతం సీట్లను పెంచితే అదనంగా 20,890 సీట్లు అందుబాటులోకి వస్తాయి. -
రిజర్వేషన్లు ఫుల్!
-
‘ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు ఉండాలి’
ముషీరాబాద్: ప్రైవేటు రంగ పరిశ్రమలు, కంపెనీలు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగాల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ భవన్లో బీసీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు ఉండేలా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. -
పండగకు ముందే ఫుల్!
సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి పండగకు ముందే రైళ్లలో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్టు 180 నుంచి 250 వరకు చేరింది. ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి. గౌతమి, గోదావరి, విశాఖ, నర్సాపూర్ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ‘నో రూమ్’ దర్శనమిస్తోంది. దీంతో సంక్రాంతికి సొంత ఊరెళ్లేందుకు రిజర్వేషన్లు చేసుకోవాలనకునే వారికి నిరాశే మిగులుతోంది. సంక్రాంతి సందర్భంగా ఏటా లక్షలాది మంది సొంత ఊళ్లకు తరలి వెళ్తారు. జనవరి మొదటి వారం నుంచే పిల్లలకు సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీ మొదలవుతుంది. కానీ ఇందుకు తగినవిధంగా రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌నుంచి తరలి వెళ్లే లక్షలాది మంది అయ్యప్ప భక్తులు కూడా అదనపు రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే జంటనగరాల నుంచి శబరికి కొన్ని రైళ్లను ప్రకటించారు. కానీ అవి అరకొరగానే ఉన్నాయి. డిమాండ్ తగ్గ రైళ్లేవీ.... సాధారణ రోజుల్లోనే హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే 1.93 లక్షల మంది పయనిస్తారు. సంక్రాంతి రోజుల్లో ఈ రద్దీ అధికంగా ఉంటుంది. సంక్రాంతి సెలవుల్లో రోజుకు 50 వేల నుంచి లక్ష మంది ప్రయాణికులు అదనంగా రైళ్లపైన ఆధారపడి బయలుదేరుతారు. ప్రతి సంవత్సరం ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ డిమాండ్‌కు తగినవిధంగా రైళ్లు మాత్రం అందుబాటులో ఉండడం లేదు. కనీసం 20 లక్షల మంది సొంత ఊళ్లకు వెళ్తారు. కానీ దక్షిణమధ్య రైల్వే వేసే అదనపు రైళ్లు 50 దాటడడం లేదు. పైగా పండుగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా ప్రకటించవలసి ఉండగా, అందుకు భిన్నంగా తీరా పండుగ సమీపించాక అదనపు రైళ్లు వేస్తున్నారు. దీంతో అప్పటికే ప్రయాణికులు బస్సులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించవలసి వస్తుంది. పైగా పండుగ ముందు అప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లు వేయడం వల్ల ఎక్కువ శాతం సీట్లు దళారులే ఎగురేసుకు పోతున్నారు. సాధారణంగా శబరిమల ప్రత్యేక రైళ్లలో ఏటా ఇలాగే దళారుల దందా కొనసాగుతుంది. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తుగా ప్రత్యేక రైళ్లను ప్రకటించకపోవడం వల్ల సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌లోనూ దళారులు పాగా వేసే అవకాశం ఉంది. జనవరి, ఫిబ్రవరి రెండు నెలల కోసం అన్ని రైళ్లలో ఇప్పటికే బెర్తులు భర్తీ అయ్యాయి. చాలామంది నిరీక్షణ జాబితాలో ఎదురు చూస్తున్నారు. స్లీపర్, ఏసీ బోగీలన్నీ నిండిపోయాయి. విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూర్, తదితర ప్రాంతాలకు అదనపు రైళ్లు వేస్తేనే ఊరెళ్లడం సాధ్యం . ఒక్క రైలే దిక్కు... ఏటా కనీసం ఐదారు లక్షల మంది అయ్యప్ప భక్తులు హైదరాబాద్ నుంచి శబరికి వెళ్తారు. జనవరి మాసంలో ఈ డిమాండ్ మరింత పెరుగుతుంది. కానీ హైదరాబాద నుంచి శబరికి వెళ్లేందుకు మాత్రం శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే అందుబాటులో ఉంది. ఇది రెగ్యులర్ ట్రైన్. ఇక ఏటా భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు వేస్తున్నారు. ఈసారి కూడా 80 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను రూపొందించింది. కానీ హైదరాబాద్ నుంచి బయలుదేరే రైళ్ల సంఖ్య తక్కువగానే ఉంది. శబరి ఎక్స్‌ప్రెస్‌లో జనవరి నాటికి బెర్తులు బుక్ అయ్యాయి. -
చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలి
-
రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై మీ వైఖరేంటి?
సాక్షి, అమరావతి: పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో రిజర్వేషన్లు గరిష్టంగా 50 శాతం దాటకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. 50 శాతంపైగా రిజర్వేషన్లను ఎలా సమర్ధించుకుంటారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు శుక్రవారం వివరణ కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిలుపుదలకు ఉత్తర్వులివ్వలేం.. పంచాయతీ ఎన్నికల్ని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 5 శాతం, బీసీలకు 34 శాతం మేర అమలు చేస్తున్న రిజర్వేషన్లతో మొత్తం 50 శాతం దాటుతున్నాయని, ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధమంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన కె.నవీన్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. 50 శాతం దాటి రిజర్వేషన్లు కల్పించేందుకు అనుమతిస్తున్న పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను సవాలు చేశారు. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసేంత వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, పంచాయతీ ఎన్నికలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, సుప్రీంకోర్టు నిర్ధేశించిన రిజర్వేషన్ల పరిమితి మేర ఎన్నికలు ఎలా నిర్వహించాలో రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ, ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్నారు. ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉందని, ఈ విషయాన్ని గురువారం దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొన్నామని చెప్పారు. -
రిజర్వేషన్లకు లోబడే మెడికల్ అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది రెండో విడత ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు చట్టబద్ధంగా జరిగాయని, రిజర్వేషన్ల అమల్లో తప్పులు జరగలేదని హైకోర్టు తీర్పు చెప్పింది. నిబంధనల మేరకే ప్రవేశాలు జరిగాయని, రిజర్వేషన్ల అమలు వల్ల ఎవరికీ నష్టం జరగలేదని న్యాయమూర్తులు జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ పి.కేశవరావుల ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. రెండో విడత వైద్య విద్య ప్రవేశాలను జీవోలు 550, 114 ప్రకారం జరగలేదని పేర్కొంటూ ఆదిలాబాద్ జిల్లా ఎన్.భావన మరో నలుగురు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో గతంలో హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల అమలు రద్దయింది. తొలి విడత ప్రవేశాల్లో వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన సీట్లను ఓపెన్ కేటగిరీ ద్వారా భర్తీ చేశాకే రిజర్వేషన్ కోటా భర్తీ చేయాలని జీవోలు స్పష్టం చేస్తున్నాయని, అయితే కాళోజీ వర్సిటీ అధికారులు రెండో విడత సీట్లను ముందుగా రిజర్వేషన్ కేటగిరీ సీట్లను భర్తీ చేసిన తర్వాత ఓపెన్ కోటా సీట్లను భర్తీ చేశారనే వాదన సరికాదని తేల్చింది. అయితే కౌన్సెలింగ్‌లో చట్ట నిబంధనల అమలు విషయంలో వర్సిటీ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘రెండు విడతల ప్రవేశాలు జరిగాక వర్సిటీ ఇచ్చిన వివరాల్ని పరిశీలిస్తే రిజర్వేషన్ కేటగిరీకి అన్యాయం జరగలేదని స్పష్టం అవుతోంది. 2,487 సీట్ల భర్తీ తర్వాత 1,800 సీట్లు రిజర్వ్డ్ అభ్యర్థులకు లభించాయి. ఓసీలకు 687 సీట్లు వచ్చాయి. ఓపెన్ కోటాలో 137, మిగిలిన 1,663 సీట్లు రిజర్వేషన్ కోటాలో రిజర్వేషన్ వర్గాలకు సీట్లు దక్కాయి. ఓపెన్ కోటాలో ప్రతిభావంతులైన రిజర్వేషన్ వర్గాలకు చెందిన 440 సీట్ల భర్తీలోనూ తప్పులేమీ కన్పించలేదు’ అని ధర్మాసనం వివరించింది. స్పష్టం చేసి ఉండాల్సింది: జీవో 550ను 2001లో జారీ చేశారు. ఆ జీవోను పేరా 5 ప్రకారం ఓపెన్ కేటగిరీ సీటు ఎంపిక చేసుకున్న రిజర్వ్డ్ కోటా అభ్యర్థి తర్వాత దాన్ని వదులుకుని రిజర్వేషన్ కోటాలో సీటు పొందితే.. ఓపెన్ కోటాలో వదిలిన సీటును రిజర్వ్డ్ కోటా అభ్యర్థితోనే భర్తీ చేయాలి. దీనినే ప్రభుత్వం జీవో 114లో పేర్కొంది. ఫలితంగా జీవో 550 రద్దు అయినట్లే. జీవో 114 గురించి ప్రభుత్వం హైకోర్టు, సుప్రీం కోర్టులకు నివేదించింది. దీని గురించి వర్సిటీ సీట్ల భర్తీకి నిర్వహించే కౌన్సెలింగ్‌లో అభ్యర్థులకు స్పష్టం చేయలేదు. దీంతో జీవో 550 వినియోగంలో ఉందనే ఆశల్లో పలువురు ఉండిపోయారు. ఈ విషయంలో కాళోజీ వర్సిటీ స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేదని ధర్మాసనం తప్పుపట్టింది. -
ఈబీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ
-
పొలిటికల్.. హీట్!
సాక్షి, నల్లగొండ : మరోమారు జిల్లా రాజకీయంగా వేడెక్కుతోంది. మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం తెర లేపడంతో ఆయా పార్టీల రాజకీయ కార్యాచరణ కూడా షురూవైంది. మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన తదితర పనులతో మున్సిపల్ అధికార యంత్రాంగం తీరిక లేకుండా గడుపుతోంది. మరోవైపు అధికార టీఆర్ఎస్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా ఆయా మున్సిపాలిటీల్లో అధికారిక కార్యక్రమాలు చేపడుతోంది. ఇంకా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకపోవడం, ఎన్నికల నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి రాకపోవడంతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొనగా రెండు రోజులపాటు వివిధ పనుల పేర సాధ్యమైనన్ని వార్డుల్లో కార్యక్రమాలు చేపట్టారు. ఫలితంగా పట్టణాల్లో ఒక్కసారిగా రాజకీయ సందడి పెరిగిపోయింది. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపాలిటీలతో పాటు కొత్తగా ఏర్పాటైన నందికొండ, హాలియా, చండూరు, చిట్యాల మున్సిపాలిటీల్లో సైతం ఆయా పార్టీల కార్యక్రమాలు మొదలవుతున్నాయి. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో అధికార టీఆర్ఎస్ పార్టీ చేరికలకు తెర తీసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యులు కొందరు ఆ పార్టీని వీడి గులాబీ కండువాలు కప్పుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం కాంగ్రెస్‌కు షాకివ్వగా, టీఆర్ఎస్కు అదనపు బలం చేకూర్చినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు టీఆర్ఎస్ వేగంగా అడుగులు వేస్తోంది. పునర్విభజన కిరికిరి! మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. దీంతో అన్ని మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన అనివార్యమైంది. అధికార పార్టీ తనకు అనుకూలంగా వార్డులను పునర్విభజించిందని కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ తదితర పార్టీలు మండిపడుతున్నాయి. వార్డులకు సరిహద్దులు ఖరారు చేయకుండానే డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఎలా చేస్తారన్న ప్రశ్నకు అధికారులనుంచి సమాధానమే లేదు. వార్డుల్లో ఓటర్ల తారుమారు, వందల సంఖ్యలో ఓట్లు గల్లంతు కావడం, సంబంధం లేకుండా వార్డులను కలపడం, లేదా కొత్తవాటిని తయారు చేయడం వంటి అంశాలపై విపక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి. దీంతో మున్సిపల్ అధికారులు రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశాలు రసాభాస అయ్యాయి. అధికారులు ప్రస్తుతం చేసిన తప్పులను సరిదిద్దే పనిలో ఉన్నారని చెబుతున్నారు. రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులు ఆయా మున్సిపాలిటీల్లో అన్ని పార్టీలూ వార్డుల రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. పాత మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లుగా పనిచేసిన వారు మరోమారు కౌన్సిల్లో అడుగు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో తమ పాత వార్డులో రిజర్వేషన్ అనుకూలంగా వస్తుందా..? లేదా, పక్క వార్డులోకో, మరో చోటుకు మారాల్సి ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. వార్డుల రిజర్వేషన్లు తేలితే రాజకీయ కార్యక్రమాలు మరింతగా జోరందుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటే మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లపైనా ఆసక్తి నెలకొంది. మొదలవుతున్న నేతల పర్యటనలు ఆగస్టు నెల ముగిసే లోపు మున్సిపల్ ఎన్నికలను ముగించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉండడం, ఆ దిశలో ఎన్నికల నిర్వహణ పనులనూ మొదలు పెట్టడంతో అన్ని పార్టీలు ఎన్నికలకు తయారవుతున్నాయి. మున్సిపాలిటీల వారీగా కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నాయి. టీఆర్ఎస్ ఇప్పటికే అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాలతో వార్డుల్లో ఎన్నికల వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఆ పార్టీ కార్యకర్తలు దీనికి ముందస్తు ప్రచారంగానే భావిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ స్థానిక నాయకులు ఎక్కడికక్కడ పనిచేసుకుంటున్నారు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో మరింతగా బలపడేందుకు, పాగా వేసేం దుకు వ్యూహాలు రచిస్తున్న బీజేపీ మున్సిపల్ ఎన్నికలను సీరియస్‌గానే తీసుకుంటోంది. అదే సమయంలో ప్రస్తుతం ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుండడంతో ముఖ్య నేతలు పర్యటించి వెళుతున్నారు. ఇప్పటికే దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పర్యటించి వెళ్లారు. ఆదివారం జిల్లా కేంద్రానికి మాజీ మంత్రులు, బీజేపీ నేతలు డీకే అరుణ, బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి పర్యటనకు వస్తున్నారు. మొత్తంగా జిల్లాలో ఏడు మున్సిపాలిటీల పరిధిలో ఇప్పుడు రాజకీయ హడావిడి మొదలైంది. -
అగ్రవర్ణ పేదలకు ‘మెడికల్’లో రిజర్వేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 2019–20 వైద్య విద్యా సంవత్సరంలో భర్తీ చేయబోయే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలుచేస్తారు. దీనికి సంబంధించి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, అందుకు అవసరమైన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి జారీచేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచే తప్పనిసరిగా ఈడబ్లు్యఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినందున ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లల్లో అమలు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ రిజర్వేషన్ల అమలు కోసం ప్రత్యేకంగా మంజూరయ్యే సీట్లలోనే అమలు చేస్తామని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలోనూ ఆర్మీ, ఎన్సీసీ, దివ్యాంగులు, మహిళలకు కూడా కోటా కల్పిస్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలను కేవలం తెలంగాణలోనే ఉన్న కులాలకే అమలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు కూడా ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంసీఐకి ప్రతిపాదించింది. కానీ దానిపై స్పష్టత రాకపోవడంతో కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీల్లోనే అమలు చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. 200 సీట్లు అదనంగా పెరిగే అవకాశం... వాస్తవంగా తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,550 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. పది శాతం రిజర్వేషన్ల అమలుకు ఇతర రిజర్వేషన్ల స్ఫూర్తి దెబ్బతినకుండా ఉండాలంటే 25 శాతం అదనంగా సీట్లు పెంచాలి. ఆ ప్రకారం తెలంగాణలో ఏకంగా 387 సీట్లు పెరగాలి. కానీ ఉస్మానియా మెడికల్ కాలేజీలో 250 ఎంబీబీఎస్ సీట్లున్నాయని, అది గరిష్ట పరిమితి వరకు ఉండటంతో అక్కడ మాత్రం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు కాదని అంటున్నారు. ఇక ఈఎస్ఐలోని సీట్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలోవి కాబట్టి వాటిపై నిర్ణయం తీసుకునే అధికారం ఇక్కడి ప్రభుత్వానికి లేదు. ఇక నల్లగొండ, సూర్యాపేటలో ఈ ఏడాది నుంచి ప్రారంభం కాబోయే మెడికల్ కాలేజీలకు కూడా ఈడబ్ల్యూఎస్ సీట్లకు అనుమతి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే అక్కడ మంజూరైన సీట్ల మేరకు కూడా ఫ్యాకల్టీ లేదు. ఈ నేపథ్యంలో అదనపు సీట్లకు అనుమతి రావడం కష్టమని అంటున్నారు. అంటే మిగిలిన కాలేజీల్లోని సీట్ల ఆధారంగా చూస్తే అదనపు సీట్లు వచ్చే అవకాశముంది. ఆ ప్రకారం దాదాపు 200 ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశముందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. ఐదెకరాలకుపైగా వ్యవసాయ భూమి ఉంటే రిజర్వేషన్ వర్తించదు... ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అగ్రకులాల్లోని పేదల ఆదాయం రూ.8 లక్షల లోపు మాత్రమే ఉండాలి. ఇక ఐదెకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంటే అటువంటి వారికి ఈ రిజర్వేషన్ వర్తించదు. ఇంటి స్థలం వెయ్యి చదరపు అడుగులున్నా, నిర్దారించిన మున్సిపాలిటీల్లో 200 చదరపు గజాల స్థలమున్నా అనర్హులే. ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జారీచేయాలని ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వీటికి కూడా ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తారు. -
ఇక మున్సిపోరు
సాక్షి, మహబూబాబాద్: అసెంబ్లీ, సర్పంచ్, ఎంపీ, పరిషత్ ఎన్నికలు విజయవంతంగా పూర్తిచేసిన అధికార యంత్రాంగం త్వరలో మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వార్డుల వారీగా బీసీ, ఎస్టీ, ఎస్సీ జనభా గణన పూర్తిచేసి ఉన్నాతాధికారులకు నివేదికలు పంపారు. సోమవారం జరిగిన కేబినేట్ మీటింగ్ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ జూలై నెలలోనే ఎన్నికలు నిర్వహించి పూర్తిచేస్తాం అని ప్రకటించటంతో పట్టణాల్లో ఎన్నికల సందడి నెలకొంది. జిల్లాలో మహబూబాబాద్‌తో పాటు కొత్తగా ఏర్పాటైన మరిపెడ, డోర్నకల్, తొర్రూర్ పురపాలక సంఘాలు ఉన్నాయి. గ్రామాలు, తండాల విలీనాల నేపథ్యంలో వార్డుల విభజన, రిజర్వేషన్లకు సంబంధించి ఉన్నతాధికారుల మార్గదర్శకాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. కొత్త పురపాలక సంఘాల్లో ఇదివరకే వార్డుల విభజన జరిగినా మళ్లీ స్పల్ప మార్పులు, చేర్పులు చేపట్టే అవకాశం ఉంది. వార్డుల పునర్విభజన తప్పదా.. పురపాలక చట్టం మారితే వార్డులు పునర్విభజన చేసే అవకాశం ఉంది. అలాగే రిజర్వేషన్లు సైతం మారనున్నాయి. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీల్లో తక్కువగా 9 వార్డులే ఉన్నాయి. మహబూబాబాద్‌లో 28 వార్డులు ఉన్నాయి. కొత్త చట్టం అమలైతే ఎన్నికలు జూలై నెలలో నిర్వహించటం కష్టమవుతుందని, దానికి చాలా సమయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ జూలై నెలలోనే ఎన్నికలు పూర్తిచేయాలంటే ప్రస్తుతం ఉన్న వార్డుల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అలా అయితే కొత్త మునిసిపాలిటీల్లో 9వార్డులే ఉండటం వల్ల అక్కడ పోటీ తీవ్రంగా ఉండనుంది. అక్కడ వార్డుల సంఖ్య పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది. శాస్త్రీయ పద్ధతిలో.. పురపాలక ఎన్నికల నిర్వహణకు ముందు వార్డుల విభజన కీలకం కానుంది. వార్డుల విభజన సరిగా నిర్వహించకపోవడంతో వివిధ పురపాలక సంఘాల పరిధిలోని వార్డుల్లో ఓటర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఒక వార్డులో దాదాపు మూడు వేల మంది ఓటర్లు ఉంటే, మరో చోట వెయ్యి లోపే ఉన్నారు. కొత్త చట్టం అమలులోకి వస్తే అన్ని వార్డుల్లో కొంచెం అటు ఇటు సమానంగా ఓటర్లు ఉండేలా శాస్త్రీయ పద్ధతిలో వార్డుల విభజన చేపట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రిజర్వేషన్లపై నేతల దృష్టి రాష్ట్రంలో కొత్త పురపాలకలు ఏర్పాటు కావటంతో గతంలో ఉన్న రిజర్వేషన్లనే రోటేషన్ పద్ధతిలో కొనసాగిస్తారా, లేక పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల వలే మొత్తం పురపాలకలను పరిగణలోకి తీసుకుని మళ్లీ రిజర్వేషన్లు ప్రకటిస్తారా అనే ఆంశం ఎన్నికల్లో పోటీచేసే ఆశవాహుల్లో ఉత్కంఠను రేపుతుంది. మునిసిపల్ చైర్మెన్ పదవికి గతంలో మాదిరి ప్రరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారా, లేక కొత్త చట్టం ఆమోదం పొందితే ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించే అవకాశం లేకపోలేదని నేతలు గుబులు పడుతున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తే ఎన్నికల బరిలో నిలవటానికి బడా నేతలు సిద్ధమవుతున్నారు. సిద్ధమవుతున్న ఆశావహులు జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా మునిసిపాలిటీల్లో వార్డుల నుంచి కౌన్సిలర్లుగా పోటీచేయాలనుకుంటున్న ఆశావహులు తమతమ వార్డుల్లో జనాన్ని మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలకు అవసరమైన పనులు చేసి పెడుతూ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీలకు చెందిన నేతలతో ఇప్పటికే తాను అభ్యర్థిగా పోటీలో ఉంటూననే సంకేతాలు అందిస్తున్నారు. ఇప్పటి దాకా రిజర్వేషన్లు అనుకూలిస్తే చాలని వారు అనుకున్నారు. వార్డుల విభజన పరిధి, ఓటర్ల సంఖ్యలో మార్పులు జరగుతాయని తెలిసి ఒకింత అయోమయానికి గురవుతున్నారు. ఇది ఎంత వరకు అనుకూలిస్తుందో, ఇబ్బందికరంగా మారుతుందోనని లోలోన ఆందోళన చెందుతున్నారు. -
3 భాగాలుగా ఓబీసీ కోటా?
దేశంలో విద్య, ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)కు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్ అమలులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. దేశంలో ఓబీసీ కోటా అమలు తీరుతెన్నుల అధ్యయనానికి ఏర్పాటైన జస్టిస్ రోహిణి కమిషన్ ఓబీసీ కులాల్లో ఎవరెవరికి ఈ రిజర్వేషన్ వల్ల ఏ మేరకు లబ్ధి కలుగుతోందన్న అంశాన్ని పరిశీస్తోంది. ప్రస్తుతం ఓబీసీలో 2,633 కులాలున్నాయి. ఈ కులాలన్నిటీకీ ఉమ్మడిగా 27శాతం రిజర్వేషను అమలవుతోంది. వీటిలో కొన్ని కులాల వారు రిజర్వేషన్ వల్ల ఎక్కువ లబ్ధి పొందుతోంటే, మరికొన్ని కులాల వారికి ప్రయోజనం కలగడం లేదని కమిషన్ అభిప్రాయ పడినట్టు తెలిసింది. తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ 27 శాతాన్ని మూడు భాగాలు చేయాలని, లబ్ధి స్థాయిని బట్టి ఆయా కులాలకు రిజర్వేషన్ అమలు చేయాలని కమిషన్ సిఫారసు చేయనున్నట్టు తెలిసింది. 27శాతంలో రిజర్వేషన్ వల్ల గరిష్టస్థాయిలో లబ్ధి పొందుతున్న కులాలకు 7శాతం, అసలేమీ ప్రయోజనం పొందని కులాలకు 10 శాతం, కొంత లబ్ధి కులాలకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కమిషన్ ప్రతిపాదించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. జూలై 31లోపు నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు జస్టిస్ రోహిణి తెలిపారు. పది కులాలకే ఎక్కువ లబ్ధి ఓబీసీ జాబితాలో ఉన్న వేల కులాల్లో కేవలం 10 ఉప కులాల వారే 25 శాతం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందుతున్నారని, 983 ఉప కులాల వారికి ఒక్క శాతం లబ్ధి కూడా చేకూరడం లేదని కమిషన్ తన సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1931 చేపట్టిన జనాభా లెక్కల్లో ఓబీసీల గణన జరిగింది. ఆ తర్వాత ఇంత వరకు ఓబీసీల గణన జరగలేదు. ఓబీసీ జనాభాపై కచ్చితమైన లెక్కలు అందుబాటులో లేనందున రోహిణి 1931నాటి ఓబీసీ లెక్కలనే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సంప్రదాయకంగా రాళ్లను పాలిష్ చేసే కలైగర్లు, కత్తులు సానపట్టే సిక్లిగర్లు,సరనియాలు వంటి వృత్తిపరమైన కులాలలో పాటు అనేక వెనకబడిన కులాలకు ఓబీసీ రిజర్వేషన్ ఫలాలు ఎంత మాత్రం అందడం లేదని కమిషన్ పేర్కొంది. ‘ఈ కులాల జనాభా తక్కువేం కాదు. అయినా వారికి ఓబీసీ ప్రయోజనాలు అందడం లేదు. రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేదు’అని కమిషన్ సభ్యుడు డా.జేకే బజాజ్ అన్నారు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్‌లో భిక్షాటన చేసే బుద్బుదీలు, గోసాయన కులాల వారు కూడా ఓబీసీ వల్ల లాభం పొందలేకపోతున్నారని, అయితే ఈ కులాలకు చెందిన ఒకరిద్దరు ఐఐటీ వంటి సంస్థల్లో విద్యార్థులుగా కనిపిస్తున్నారని ఆయన వివరించారు. ఓబీసీ రిజర్వేషన్ వల్ల ఏ కులాలు ఎక్కువ లబ్ధి పొందాయి, ఏవి పొందలేదు అన్నది నిర్థారించడం కోసం కమిషన్ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ సహా దేశంలోని విద్యా సంస్థలు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో గత మూడేళ్లుగా ఈ కోటా కింద పొందిన లక్ష అడ్మిషన్లను, ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వంలో ఈ కోటా కింద పొందిన 1,30,000 ఉద్యోగాలను పరిశీలించింది. కమిషన్ ప్రతిపాదనలు అమల్లోకి రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనిపై కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ స్పందిస్తూ ‘ముందు కమిషన్ నివేదిక రానివ్వండి. దాన్ని అధ్యయనం చేసి ఏం చెయ్యాలో నిర్ణయిస్తాం’ అన్నారు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దేశంలో రాజకీయ సమీకరణాలు కూడా మారుతాయని పరిశీలకులు అంటున్నారు. ఉత్తరాదిన రాష్ట్రీయ జనతా దళ్, సమాజ్‌వాదీ పార్టీ, దక్షిణాన డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలు ఓబీసీల ఓటు బ్యాంకులు కలిగి ఉన్నాయి. -
అర్హత పరీక్షల్లో రిజర్వేషన్‌కు వీల్లేదు
న్యూఢిల్లీ: అర్హత పరీక్షల్లో రిజర్వేషన్లు ఉండటానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటీఈటీ–(సీటెట్)–2019లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జడ్జీలు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నాల వెకేషన్ బెంచ్ సోమవారం విచారించింది. ఎవరికైనా రిజర్వేషన్ అనేది అడ్మిషన్ల వేళ మాత్రమే పరిశీలనలోకి వస్తుందంది. అర్హత పరీక్షలకు రిజర్వేషన్ అనేది అర్ధరహితమని పేర్కొంది. సీటెట్ అనేది అర్హత పరీక్ష మాత్రమేనని, రిజర్వేషన్ అంశం అడ్మిషన్ల సమయంలోనే తెరపైకి వస్తుందని తెలిపింది. జూలై 7వ తేదీన జరగనున్న సీటెట్ పరీక్ష నోటిఫికేషన్ గురించి పిటిషనర్ తరఫు లాయర్ ప్రస్తావించగా ధర్మాసనం స్పందించింది. ఈ పరీక్ష నోటిఫికేషన్ ఎస్సీలకు కానీ, ఎస్టీలకుగానీ రిజర్వేషన్ ఇవ్వడం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో తొలుత పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు..ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా లాయర్ మరోసారి అభ్యర్థించడంతో తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. సీటెట్–2019 నిర్వహణ కోసం సీబీఎస్ఈ జనవరి 23వ తేదీన పత్రికా ప్రకటన జారీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్‌పై విచారణ 2018 బ్యాచ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేడర్ కేటాయింపులు చెల్లవంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు అంగీకరించింది. జస్టిస్ ఇందిర, జస్టిస్ సంజీవ్‌ల బెంచ్ సోమవారం ఈ పిటిషన్‌ను విచారించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ తన వాదనలు వినిపిస్తూ.. 2018 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు శిక్షణ పూర్తి చేసుకుని, కేటాయించిన కేడర్లలో ఈ నెల 10వ తేదీన వారు జాయిన్ కావాల్సి ఉందన్నారు. ఈ సమయంలో అధికారుల కేటాయింపుల ప్రక్రియను మళ్లీ చేపట్టాలంటూ హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌పై 17న వాదనలు వింటామని కోర్టు తెలిపింది. కేడర్ కేటాయింపులు అన్యాయంగా ఉన్నాయంటూ నలుగురు ఐపీఎస్ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతోకేటాయింపుల ప్రక్రియను మళ్లీ చేపట్టాలంటూ హైకోర్టు ఆదేశించడం తెల్సిందే. కాగా, తీవ్రమైన ఎండలు, రంజాన్ నెల కారణంగా ఆఖరి దశ లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌ను ఉదయం 7కు బదులు 5.30గంటలకే మొదలయ్యేలా ఈసీను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలు చేయాలి
-
నేడో, రేపో పరిషత్ షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల షెడ్యూల్ శుక్ర లేదా శనివారాల్లో విడుదల కానుంది. కొన్ని జిల్లాల గెజిట్లు గురువారం రాత్రికి, శుక్రవారం ఉదయం ప్రచురించే అవకాశాలున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ, ఏర్పాట్లు దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో షెడ్యూల్ జారీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సన్నాహాలు చేస్తోంది. శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం కారణంగా షెడ్యూల్ విడుదలకు అవకాశం లేకపోతే శనివారం వెలువడనుంది. రాష్ట్రంలోని మూడు జిల్లాల పరిధిలో కొత్తగా నాలుగు మండలాలు చేర్చడంతో, మండలాలు, జెడ్పీటీసీ స్థానాల సంఖ్య 539కు చేరింది. అయితే ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ స్థానం రిజర్వేషన్ వివాదం కారణంగా హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలు జరగడం లేదు. 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం 32 జిల్లాల పరిధిలో 1.57 కోట్ల ›గ్రామీణ ఓటర్లున్నా రు. పరిషత్ నోటిఫికేషన్ వెలువడే వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదయ్యే వారిని కూడా ఓటర్లుగా పరిగణనలోకి తీసుకోనున్నారు. దీంతో ఈ సంఖ్య 1.60 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయి. 32 జిల్లాల పరిధిలో 32,007 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. కలెక్టర్లు, ఎస్పీలతో నాగిరెడ్డి సమీక్ష... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం మ్యారియట్ హోటల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి నిర్వహించిన సమావేశానికి సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పీఆర్ ముఖ్యకార్యదర్శి (ఎప్ఏసీ) సునీల్‌శర్మ, పీఆర్ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై ఎస్ఈసీ సంతృప్తి వ్యక్తం చేసింది. తమ జిల్లాల పరిధిలో 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలంటూ నాగిరెడ్డిని పలువురు ఎస్పీలు కోరినట్లు సమాచారం. దీంతో 26 జిల్లాల్లో 3 విడతల్లో, 5 జిల్లాల్లో 2 విడతల్లో, కేవలం ఒక్క జిల్లాలో (మేడ్చల్–మల్కాజిగిరి) మాత్రం ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కొత్తగా 4 మండలాలు, 4 జెడ్పీటీసీలు... రాష్ట్రంలోని 3 జిల్లాల పరిధిలో కొత్తగా 4 మండలాలు అంటే 4 జెడ్పీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో వర్ని మండలం పరిధిలోని కొన్ని గ్రామాలను విడదీసి విడిగా మోస్రా, చండూరు మండలాలుగా ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం నుంచి కొన్ని గ్రామాలను విడదీసి నారాయణరావుపేట, మేడ్చల్ జిల్లాలో శామీర్‌పేట మండలంలోని కొన్ని గ్రామాలతో మూడు చింతలపల్లి మండలం ఏర్పాటు చేశారు. ఈ 4 చోట్ల జెడ్పీటీసీ స్థానాలను కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ 4 ఎంపీపీ స్థానాలకు ఫలితాలు వెలువడ్డాక పరోక్ష పద్ధతిలో మండలాధ్యక్షులను ఎన్నుకుంటారు. మూడు చింతలపల్లి జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్ స్థానానికి రిజర్వు చేయగా... ఎంపీపీ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. మంగపేట జెడ్పీటీసీ ఎన్నిక వాయిదా... ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ జెడ్పీటీసీ స్థానం షెడ్యూల్డ్ ఏరియాలోకి వస్తుందా లేదా అన్న వివాదం నేపథ్యంలో హైకోర్టు దీని ఎన్నిక విషయంలో స్టే ఇచ్చింది. ఈ స్థానాన్ని ఎస్టీగానా లేదా జనరల్గానా ఎలా పరిగణించాలన్న వివాదంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ స్థానంలో ఎన్నిక నిర్వహించాలా? వద్దా? అన్నది ఎస్ఈసీని ములుగు కలెక్టర్ స్పష్టత కోరారు. హైకోర్టు స్టే విధించినందున ఇక్కడ ఎన్నిక నిర్వహించరాదని నిర్ణయించారు. ఎన్నికల ఏర్పాట్లు భేష్: వి.నాగిరెడ్డి జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై చర్చించాం. జిల్లాల్లో పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు బాగున్నాయి. ఎన్నికల నిర్వహణకు అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉంది. తాము చేసిన ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వివరించారు. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తాం. పరిషత్ ఎన్నికల నిర్వహణకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్కడా ఇబ్బందులు లేవన్నారు. భద్రతాపరమైన అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాం. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగడంతో ఈ ఎన్నికల్లో ఎడమ చేతి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలని నిర్ణయించామన్నారు. 22న తొలి నోటిఫికేషన్ పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక... ఈ నెల 22న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల తొలి నోటిఫికేషన్‌ను ఎస్ఈసీ విడుదల చేయనుంది. దీనికి అనుగుణంగా వచ్చే నెల 6న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలుంటాయి. 26న రెండో నోటిఫికేషన్‌ను విడుదల చేశాక.. మే 10న ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 30న తుది విడత నోటిఫికేషన్‌ను జారీచేయనుంది. వచ్చేనెల 14న తుది విడత ఎన్నికలతో పోలింగ్ ముగియనుంది. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రకటించాకే పరిషత్ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాతే 32 జెడ్పీ చైర్పర్సన్లు, 5,187 ఎంపీపీ అధ్యక్షులను పరోక్ష పద్ధతుల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నుకుంటారు. -
నేడో, రేపో పరిషత్ షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల షెడ్యూల్ శుక్ర లేదా శనివారాల్లో విడుదల కానుంది. కొన్ని జిల్లాల గెజిట్లు గురువారం రాత్రికి, శుక్రవారం ఉదయం ప్రచురించే అవకాశాలున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ, ఏర్పాట్లు దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో షెడ్యూల్ జారీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సన్నాహాలు చేస్తోంది. శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం కారణంగా షెడ్యూల్ విడుదలకు అవకాశం లేకపోతే శనివారం వెలువడనుంది. రాష్ట్రంలోని మూడు జిల్లాల పరిధిలో కొత్తగా నాలుగు మండలాలు చేర్చడంతో, మండలాలు, జెడ్పీటీసీ స్థానాల సంఖ్య 539కు చేరింది. అయితే ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ స్థానం రిజర్వేషన్ వివాదం కారణంగా హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలు జరగడం లేదు. 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం 32 జిల్లాల పరిధిలో 1.57 కోట్ల ›గ్రామీణ ఓటర్లున్నా రు. పరిషత్ నోటిఫికేషన్ వెలువడే వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదయ్యే వారిని కూడా ఓటర్లుగా పరిగణనలోకి తీసుకోనున్నారు. దీంతో ఈ సంఖ్య 1.60 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయి. 32 జిల్లాల పరిధిలో 32,007 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. కలెక్టర్లు, ఎస్పీలతో నాగిరెడ్డి సమీక్ష... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం మ్యారియట్ హోటల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి నిర్వహించిన సమావేశానికి సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పీఆర్ ముఖ్యకార్యదర్శి (ఎప్ఏసీ) సునీల్‌శర్మ, పీఆర్ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై ఎస్ఈసీ సంతృప్తి వ్యక్తం చేసింది. తమ జిల్లాల పరిధిలో 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలంటూ నాగిరెడ్డిని పలువురు ఎస్పీలు కోరినట్లు సమాచారం. దీంతో 26 జిల్లాల్లో 3 విడతల్లో, 5 జిల్లాల్లో 2 విడతల్లో, కేవలం ఒక్క జిల్లాలో (మేడ్చల్–మల్కాజిగిరి) మాత్రం ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కొత్తగా 4 మండలాలు, 4 జెడ్పీటీసీలు... రాష్ట్రంలోని 3 జిల్లాల పరిధిలో కొత్తగా 4 మండలాలు అంటే 4 జెడ్పీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో వర్ని మండలం పరిధిలోని కొన్ని గ్రామాలను విడదీసి విడిగా మోస్రా, చండూరు మండలాలుగా ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం నుంచి కొన్ని గ్రామాలను విడదీసి నారాయణరావుపేట, మేడ్చల్ జిల్లాలో శామీర్‌పేట మండలంలోని కొన్ని గ్రామాలతో మూడు చింతలపల్లి మండలం ఏర్పాటు చేశారు. ఈ 4 చోట్ల జెడ్పీటీసీ స్థానాలను కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ 4 ఎంపీపీ స్థానాలకు ఫలితాలు వెలువడ్డాక పరోక్ష పద్ధతిలో మండలాధ్యక్షులను ఎన్నుకుంటారు. మూడు చింతలపల్లి జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్ స్థానానికి రిజర్వు చేయగా... ఎంపీపీ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. మంగపేట జెడ్పీటీసీ ఎన్నిక వాయిదా... ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ జెడ్పీటీసీ స్థానం షెడ్యూల్డ్ ఏరియాలోకి వస్తుందా లేదా అన్న వివాదం నేపథ్యంలో హైకోర్టు దీని ఎన్నిక విషయంలో స్టే ఇచ్చింది. ఈ స్థానాన్ని ఎస్టీగానా లేదా జనరల్గానా ఎలా పరిగణించాలన్న వివాదంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ స్థానంలో ఎన్నిక నిర్వహించాలా? వద్దా? అన్నది ఎస్ఈసీని ములుగు కలెక్టర్ స్పష్టత కోరారు. హైకోర్టు స్టే విధించినందున ఇక్కడ ఎన్నిక నిర్వహించరాదని నిర్ణయించారు. ఎన్నికల ఏర్పాట్లు భేష్: వి.నాగిరెడ్డి జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై చర్చించాం. జిల్లాల్లో పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు బాగున్నాయి. ఎన్నికల నిర్వహణకు అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉంది. తాము చేసిన ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వివరించారు. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తాం. పరిషత్ ఎన్నికల నిర్వహణకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్కడా ఇబ్బందులు లేవన్నారు. భద్రతాపరమైన అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాం. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగడంతో ఈ ఎన్నికల్లో ఎడమ చేతి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలని నిర్ణయించామన్నారు. 22న తొలి నోటిఫికేషన్ పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక... ఈ నెల 22న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల తొలి నోటిఫికేషన్‌ను ఎస్ఈసీ విడుదల చేయనుంది. దీనికి అనుగుణంగా వచ్చే నెల 6న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలుంటాయి. 26న రెండో నోటిఫికేషన్‌ను విడుదల చేశాక.. మే 10న ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 30న తుది విడత నోటిఫికేషన్‌ను జారీచేయనుంది. వచ్చేనెల 14న తుది విడత ఎన్నికలతో పోలింగ్ ముగియనుంది. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రకటించాకే పరిషత్ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాతే 32 జెడ్పీ చైర్పర్సన్లు, 5,187 ఎంపీపీ అధ్యక్షులను పరోక్ష పద్ధతుల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నుకుంటారు. -
‘పరిషత్’ ఎన్నికలకు కసరత్తు
సాక్షి, కొత్తకోట : ఓ వైపు పార్లమెంట్ ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించడానికి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుండగా... మరో వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు వెనువెంటనే ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. ఈ ఏడాది జూన్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీల పదవికాలం ముగియనుంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియతో పాటుగా ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేశారు. జాబితాను గ్రామ పంచాయితీ కార్యాలయాలు, తహాసీల్దార్ కార్యాలయాలం ఎదుట ప్రదర్శించారు. ఇంతకు ముందే ఎంపీటీసీ స్థానాల ఏర్పాట్లపై అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మండలంలో 59పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. గతంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్న కొత్తకోట గ్రామ పంచాయితీ ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో అయిదు స్థానాలకు ఎన్నికలు లేకుండా పోయాయి. మండలంలో రిజర్వేషన్లు ఇలా.. మండలంలో 22గ్రామ పంచాతీలకు గానూ 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ సైతం ముగిసింది. అమడబాకుల(జనరల్), అప్పరాల (బీసీ మహిళ), కానాయపల్లి (బీసీ జనరల్), కనిమెట్ట (జనరల్), మిరాషిపల్లి (జనరల్ మహిళ), నాటవెళ్లి (ఎస్టీ జనరల్), నిర్వేన్ (జనరల్ మహిళ), పాలెం (ఎస్సీ జనరల్), పామాపురం (బీసీ మహిళ), రాయిణిపేట (జనరల్ మహిళ), సంకిరెడ్డిపల్లి (జనరల్), వడ్డెవాట (ఎస్సీ మహిళ)కు కేటాయించారు. 40,289మంది ఓటర్లు.. మండలంలో 23 పంచాయతీల్లో ఓటర్ల లెక్క తేలింది. మొత్తం 40,289మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 20,458, మహిళలు 19,831మంది ఉన్నారు. పైరవీలు షురూ.. ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయాలనుకునే అశావహులు తమ పార్టీ పెద్దల వద్ద పైరవీలు మొదలు పెట్టారు. సర్పంచ్ సీటు కోల్పోయిన వారు, గతంలో సీటు కోసం యత్నం చేసి విఫలం చెందిన వారు ఎంపీటీసీ స్థానాల సీటు కేటాయించాలని ఆయా పార్టీల పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ప్రత్యర్థులకు ధీటుగా ఆర్థికంగా తట్టుకునే వారిని నిలబెట్టేందుకు పార్టీ పెద్దలు చూస్తున్నారు. కసరత్తు చేస్తున్నాం స్థానిక ఎంపీటీసీ ఎన్నికలకు సంబందించి ఓటురు లిస్టును ప్రర్శించాం. అధికారుల అదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ చేస్తున్నాం. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుందో సమాచారం లేదు. ఎన్నికలు ఎప్పడు వచ్చిన ఎదుర్కొవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. – కతలప్ప, ఎంపీడీఓ, కొత్తకోట -
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై 17న జాతీయ సదస్సు
హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన పేదల(ఈడబ్ల్యూఎస్) కోసం తెచ్చిన రిజర్వేషన్ల అమలు కోసం ఈ నెల 17న జైపూర్‌లో జాతీయ స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చట్టబద్ధత చేసి 2 నెలలు అవుతున్నా.. అనేక రాష్ట్రాలు ఇప్పటికీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం మిగిలిన అగ్రవర్ణాలకు 5 శాతం కల్పిస్తామని ప్రకటించి రిజర్వేషన్ల అమలుకు గండికోట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఇప్పటివరకు ఓసీ రిజర్వేషన్ల అమలుపై నిర్లక్ష్యం వహిస్తూ పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. నిరుపేదల ఓసీల రిజర్వేషన్లు కేవలం 14 రాష్ట్రాలే ఇప్పటివరకు అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమలు చేసేలా ఒత్తిడి చేస్తూ లక్నో, ఫరీదాబాద్, బెంగుళూరు, భోపాల్ తదితర నగరాల్లో జాతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణలకు చెందిన బీజేపీ నాయకులు గ్రూపు తగాదాలతో సతమతం అవుతూ రిజర్వేషన్ల అమలు కోసం గవర్నర్, సీఎంలకు విజ్ఞప్తులు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఓసీలకు కల్పించిన రిజర్వేషన్లను తెలుగు రాష్ట్రాలతోపాటు మిగతా రాష్ట్రాల్లో తక్షణం అమలు చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
‘బీసీ’ల నారాజ్..!
సాక్షి, జనగామ: జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లలో ఒక్కో స్థానం మాత్రమే బీసీలకు దక్కాయి. జిల్లావ్యాప్తంగా 12 జెడ్పీటీసీ స్థానాల్లో బచ్చన్నపేట మాత్ర మే బీసీ మహిళకు కేటాయిం చారు. 12 ఎంపీపీ స్థానాల్లో బచ్చన్నపేట మాత్రమే బీసీలకు కేటాయించారు. రెండు మండలాల్లో నిల్.. జిల్లా వ్యాప్తంగా 140 ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు 18 మాత్రమే దక్కాయి. నర్మెట, కొడకండ్ల మండలాల్లో బీసీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు. నర్మెటలో ఏడు, కొడకండ్లలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఒక్కటి కూడా బీసీలకు దక్కలేదు. దీంతో ఈ రెండు మండలాల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేకుం డాపోయింది. చిల్పూర్, రఘునాథపల్లి, దేవరుప్పుల, తరిగొప్పుల మండలాల్లో ఒక్కో స్థానం మాత్రమే బీసీలకు రిజర్వయ్యాయి. బచ్చన్నపేట మండలంలో మాత్రం బీసీలకు ఎక్కువ స్థానాలు దక్కాయి. బచ్చన్నపేటలో జెడ్పీటీసీ, ఎంపీపీ రెండు బీసీలకే దక్కాయి. అత్యధికంగా నాలుగు ఎంపీటీసీ స్థానాలు బీసీలకు దక్కడం విశేషం. బీసీలకు కేటాయించిన స్థానాలు బచ్చన్నపేట జెడ్పీటీసీ బీసీ మహిళ బచ్చన్నపేట ఎంపీపీ బీసీ మహిళ బీసీలకు కేటాయించిన ఎంపీటీసీ స్థానాలు.. చిల్పూర్ (బీసీ మహిళ) బచ్చన్నపేట–1(చిల్పూర్) (బీసీ జనరల్) కేశిరెడ్డిపల్లి(చిల్పూర్) (బీసీ జనరల్) కొన్నె(చిల్పూర్) (బీసీ మహిళ) లింగంపల్లి (చిల్పూర్) (బీసీ మహిళ) కోలుకొండ(దేవరుప్పుల) (బీసీ మహిళ) స్టేషన్ ఘన్పూర్–1(దేవరుప్పుల) (బీసీ జనరల్), ఇప్పగూడెం(దేవరుప్పుల) (బీసీ మహిళ) గానుపహాడ్(జనగామ) (బీసీ మహిళ) పెంబర్తి(జనగామ) (బీసీ జనరల్) నవాబుపేట(జనగామ) (బీసీ జనరల్) మాణిక్యపురం(జనగామ) (బీసీ మహిళ) జఫర్‌గఢ్–1(జనగామ) (బీసీ మహిళ) తమ్మడపల్లి (జి)(జనగామ) (బీసీ జనరల్) అబ్ధుల్నాగారం(తరిగొప్పుల) (బీసీ మహిళ) గబ్బెట(రఘునాథపల్లి) (బీసీ మహిళ) పాలకుర్తి–1(రఘునాథపల్లి) (బీసీ మహిళ) లక్ష్మీనారాయణపురం(రఘునాథపల్లి) (బీసీ జనరల్) నిరాశలో బీసీ నేతలు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు రిజర్వేషన్లలో తక్కువ స్థానాలు రిజర్వు కావడంతో బీసీ నాయకులను నిరాశ పర్చింది. ప్రధాన పార్టీల్లో బీసీలు ద్వితీయ శ్రేణి నాయకులుగా రాణిస్తున్నారు. గ్రామ, మండల స్థాయిల్లో ప్రజాప్రతినిధులు ఎన్నికై ప్రజలకు సేవ చేద్దామని ఆలోచించిన బీసీ నాయకులకు రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో ఆశ నిరాశగా మారింది. దీంతో మెజార్టీ బీసీ నాయకులు పోటీకి దూరం కావాల్సి రావడంతో నారాజ్ అవుతున్నారు. -
రిజర్వేషన్లపై ఉత్కంఠ
సాక్షి, వరంగల్ రూరల్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తుం దో లేదోననే టెన్షన్లో ఉన్నారు. త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నందున ఇప్పటికే గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కాయి. కొన్నిచో ట్ల విందు రాజకీయాలు కూడా ప్రారంభమయ్యా యి.రిజర్వేషన్లు ఖరారైతే మరింత వేగంగా పరి ణామాలు మారే అవకాశం ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో 16 జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గ్రామీణ ఓటర్లు 4,31,778 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 2,16,008 మంది, స్త్రీలు 2,15,770 మంది ఉన్నారు. బీసీలు 2,53,384 మంది, ఎస్టీలు 64,058 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 77,076 మంది, ఓసీలు 37,277 మంది ఉన్నారు. 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం.. రిజర్వేషన్లు 2011 గ్రామీణ జనాభా లెక్కల ప్రకారం, నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని అనుసరిస్తూ ఖరారు చేయనున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్ర యూనిట్‌గా, జెడ్పీటీసీలకు జిల్లాను, ఎంపీటీసీలకు మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటారు. ఎంపీటీసీల రిజర్వేషన్లను ఎంపీడీఓలు తయారుచేస్తే కలెక్టర్ ఫైనల్ చేయనున్నారు. రాష్ట్రం, జిల్లా, మండల యూనిట్‌గా రిజర్వేషన్ల కేటాయింపుల్లో ముందుగా ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. తొలుత ఎస్సీలకు, తరువాత ఎస్టీలకు రిజర్వేషన్లను కేటాయించి మిగిలినవి బీసీలకు కేటాయిస్తారు. తర్వాత జనరల్ స్థానాలను ప్రకటిస్తారు. జిల్లా నుంచి నేడు(మంగళవారం) రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో అధికారులు రిజర్వేషన్ల ప్రకటనల కోసం తర్జనబర్జన అవుతున్నారు. మండలం ఎంపీటీసీ స్థానాలు ఆత్మకూరు 09 చెన్నారావుపేట 11 దామెర 08 దుగ్గొండి 12 గీసుకొండ 09 ఖానాపురం 09 నడికూడ 10 నల్లబెల్లి 11 నర్సంపేట 11 నెక్కొండ 16 పరకాల 05 పర్వతగిరి 14 రాయపర్తి 16 సంగెం 14 శాయంపేట 12 వర్దన్నపేట 11 మొత్తం 178 తమకు అనుకులంగా కావాలని.. జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లు తమకు అనుకులంగా వచ్చే విధంగా చేయాలని ఇప్పటికే ఆశావహులు ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జిల్లా, మండల నాయకుల వద్దకు ప్రదక్షిణలు చేస్తున్నారు. అనుకులంగా రిజర్వేషన్ తీసుకవస్తే గెలుపించుకుని వస్తామని జిల్లా, మండల నాయకులు ఆఫర్లు సైతం ఇస్తున్నారు. పార్టీ ఫండ్ సైతం ఏమీ లేకుండానే స్వంత డబ్బులు పెట్టుకుని గెలుస్తాడని హామీలు ఇస్తున్నారు. ఎంపీలు, శాసన సభ్యులు సైతం గ్రామంలో బలమైన నాయకులకు అనుగుణంగా రిజర్వేషన్ వచ్చే విధంగా పావులు కదుపుతున్నారని సమాచారం. బలమైన నాయకుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అయితే పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్తారని అధికార పార్టీ నేతలు రిజర్వేషన్లు అనుకులంగా ఉండే విధంగా చూస్తున్నారని తెలుస్తోంది. -
లింక్ రైలు మిస్సయితే డబ్బులు వాపస్
సాక్షి, హైదరాబాద్: వందల కిలోమీటర్ల ప్రయాణం చేసేటప్పుడు కనీసం రెండు రైళ్లయినా మారాల్సి వస్తుంది. ఆ సమయంలో ఒక రైలు ప్రయాణం ముగిసే సమయానికి మరో రైలు వెళ్లిపోవచ్చు. దీంతో రెండో రైలు కోసం బుక్ చేసుకున్న రిజర్వేషన్ చార్జీలు నష్టపోయే అవకాశం ఉంది. ఇక మీదట అలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రయాణికుల రెండు టిక్కెట్ల పీఎన్ఆర్ (పాసింజర్ నేమ్ రికార్డ్) నంబర్లను అనుసంధానం చేస్తారు. దీంతో కనెక్టింగ్ రైలు మిస్సయితే రెండో ప్రయాణానికి సంబంధించిన రిజర్వేషన్ చార్జీలను రైల్వే శాఖ తిరిగి చెల్లించనుంది. ఈ సదుపాయం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. దూరప్రాంత ప్రయాణికులు తాము అనుకున్న కనెక్టింగ్ రైలును అందుకోలేకపోతే అప్పటి వరకు పూర్తిచేసిన ప్రయాణ చార్జీని మినహాయించి.. రెండో రైలులో రద్దయిన ప్రయాణానికి సంబంధించిన చార్జీలను ఎలాంటి మినహాయింపులు లేకుండా పూర్తిగా తిరిగి ఇస్తారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, రిజర్వేషన్ కేంద్రాల్లో బుక్ చేసుకున్నా ఈ సదుపాయం కల్పిస్తారు. అయితే టికెట్లపై రీఫండ్ కోరే ప్రయాణికులు తాము వచ్చిన రైలు నుంచి స్టేషన్లో దిగిన మూడు గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. సాధారణంగా దూర ప్రాంతాలకు వెళ్లే వారు కనెక్టింగ్ రైళ్లకు ముందే రిజర్వేషన్ చేసుకుంటారు. కానీ మొదటి రైలు ఆలస్యంగా నడవడం వల్ల రెండో రైలు మిస్సయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో టికెట్ల లింకింగ్ సదుపాయం ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలిగించనుంది. -
12ఏళ్లుగా ఆందోళన: వారి డిమాండ్ ఎందుకు నెరవేరలేదు?
సాక్షి, న్యూఢిల్లీ : విద్యా, ఉద్యోగ రంగాల్లో తమకూ ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ గత ఐదు రోజులుగా రాజస్థాన్‌లోని మలర్నా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుజ్జర్లు ఆందోళన చేస్తున్నా రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు ? గుజ్జర్లకు తప్పకుండా ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామంటూ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుజ్జర్ల విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు? 2006 నుంచి, అంటే పన్నెండేళ్లుగా గుజ్జర్లు ఆందోళన చేస్తున్నా వారి డిమాండ్ ఇప్పటి వరకు ఎందుకు నెరవేరలేదు? ఎస్టీల్లాగా తమకు విద్యా, ఉద్యోగ రంగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ 2006లో కరౌలి ప్రాంతంలోని రైలు పట్టాలపై పదవీ విరమణ చేసిన సైనికుడు కిరోరి సింగ్ భైన్సాలా నాయకత్వాన గుజ్జర్లు ఆందోళన చేశారు. అప్పుడు ఎలాంటి ఫలితం రాలేదు. వారు ఆ మరుసటి సంవత్సరం కూడా రైలు పట్టాలపై ఆందోళన చేయగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో 26 మంది గుజ్జర్లు చనిపోయారు. అప్పుడు గుజ్జర్ల డిమాండ్‌ను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ జస్రాజ్ చోప్రా ఆధ్వర్యాన ఓ కమిటీని వేసింది. ఇతర వెనకబడిన వర్గాల వారికి కేటాయించిన 21 శాతం రిజర్వేషన్ల కారణంగా గుజ్జర్లు లబ్ధి పొందుతున్నందున వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు అవసరం లేదని తేల్చింది. ఎస్టీల కింద రిజర్వేషన్లు కల్పించడం కుదరకపోతే ప్రత్యేక వెనకబడిన తరగతుల కేటగిరీ కింద ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ భైన్సాలా మళ్లీ 2008 రైలు రోకో ఆందోళన చేపట్టారు. అప్పుడు కూడా అది హింసాత్మకంగా మారడంతో ఓ పోలీసు సహా 36 మంది మరణించారు. 2010లో ఇదే అశోక్ గెహ్లాట్, బైన్సాలాతో చర్చలు జరిపి గుజ్జర్లకు ఒక శాతం రిజర్వేషన్లు కల్పించారు. దాంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు యాభై శాతానికి చేరుకోవడంతో అంతకుమించి ఆయన రిజర్వేషన్లు ఇవ్వలేకపోయారు. తమకు ఐదు శాతం రిజర్వేషన్లు కావాల్సిందేనంటూ గుజ్జర్లు 2015లో మరోసారి రైలు రోకో ఆందోళన చేపట్టారు. దాంతో అప్పటి వసుంధర రాజె నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేక వెనకబడిన తరగతుల చట్టాన్ని తీసుకొచ్చింది. రిజర్వేషన్లు అప్పటికే యాభై శాతం ఉన్నాయన్న కారణంగా ఆ చట్టాన్ని రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత వారిని మెప్పించేందుకు 2017లో వసుంధర రాజె ప్రభుత్వం ఇతర వెనకబడిన తరగతుల రిజర్వేషన్లను 21 శాతం నుంచి 26 శాతానికి పెంచుతూ చట్టం తెచ్చింది. దాన్నీ హైకోర్టు కొట్టివేసింది. మొన్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గుజ్జర్లకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సచిన్ పైలట్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారు. గుజ్జర్లతోపాటు మరికొన్ని సామాజిక వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో 20 రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించాలంటూ గెహ్లాట్ ప్రభుత్వానికి భైన్సాలా అల్టిమేటం జారీ చేశారు. 20 రోజుల గడువు కాలం పూర్తవడంతో ఐదు రోజుల క్రితం గుజ్జర్లు మళ్లీ ఆందోళన చేపట్టారు. ఇప్పటికే దేశంలో యాభై శాతం రిజర్వేషన్లు మించిపోయినప్పటికీ దేశంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్టం తీసుకొచ్చినప్పుడు తమ డిమాండ్‌ను మాత్రం ఎందుకు నెరవేర్చలేదని ‘గుజ్జార్ అరక్షన్ సంఘర్ష్ సమితి’ ప్రధాన కార్యదర్శి షైలేంద్ర సింగ్ ప్రశ్నిస్తున్నారు. గుజ్జర్ల విషయంతో తామేమి చేయలేమని, కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని గెహ్లాట్ ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విషయాన్ని తన మేనిఫెస్టోలో పేర్కొందని బీజేపీ ప్రశ్నిస్తోంది. అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి సిఫార్సు చేయాల్సిందిగా ప్రస్తుతం గెహ్లాట్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. -
గుజ్జర్ల ఆందోళన హింసాత్మకం
జైపూర్: ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్ కోరుతూ రాజస్తాన్‌లో గుజ్జర్లు ప్రారంభించిన ఆందోళన మూడో రోజైన ఆదివారం హింసాత్మకంగా మారింది. రాజస్తాన్ మంత్రి విశ్వేంద్ర సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతినిధుల బృందం గుజ్జర్లతో జరిపిన చర్చలు సఫలం కాని నేపథ్యంలో ధోల్పూర్ జిల్లాలో ఆందోళనకారులు ఆగ్రా–మొరేనా రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా కొందరు గుర్తుతెలియని దుండగులు తుపాకీతో 8–10 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు 3 పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీస్ సిబ్బందిపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపైకి బాష్పవాయువును ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అల్లర్లు వ్యాపించకుండా ధోలాపూర్, కరౌలీ జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఆందోళనకారులు వేర్వేరు నగరాల్లో జాతీయ రహదారులపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో ఆందోళనలను నిలిపివేసేందుకు గుజ్జర్ ఆరక్షన్ సంఘర్షణ్ సమితి చీఫ్ కిరోరీ సింగ్ బైంస్లా నిరాకరించారు. రైకా–రెబారీ, గడియా లుహార్, బంజారా, గదరియా, గుజ్జర్ సామాజికవర్గాలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 5 శాతం రిజర్వేషన్ కల్పించేవరకూ వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. కాగా, ఆందోళనకారులు రైలు పట్టాలపై ధర్నాకు దిగడంతో రాజస్తాన్‌లో 20 సర్వీసులను అధికారులు రద్దుచేశారు. ఈ ప్రాంతంలో మరో 250 రైళ్లను దారి మళ్లించారు. కాగా, గుజ్జర్ల ఆందోళనలోకి సంఘవిద్రోహక శక్తులు చొరబడ్డాయని సీఎం అశోక్ గెహ్లోత్ ఆరోపించారు. -
రైలు పట్టాలపైనే టెంట్ వేసి ఆందోళన
ఢిల్లీ/రాజస్థాన్ : రిజర్వేషన్ల కోసం గుజ్జర్ల ఆందోళన రైల్వే వ్యవస్థపై ప్రభావం చూపింది. గుజ్జర్ల ఆందోళన నేపథ్యంలో 15 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయగా, మరో అయిదు రైళ్లను దారి మళ్లించింది. రాజస్థాన్ ప్రభుత్వం అయిదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ గుజ్జర్లు రైలు పట్టాలపై టెంట్లు వేసి నిరసన తెలుపుతున్నారు. విద్యా, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ గుజ్జర్లు నిన్నటి నుంచి సవాయి మాదోపూర్ జిల్లాలో మలర్నా దుంగార్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌లపై టెంట్లు వేసుకుని ధర్నాకు దిగారు. దీంతో వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో కొన్ని రైళ్లు రద్దు కాగా, మరికొన్ని రద్దు అయ్యాయి. ఐదు శాతం రిజర్వేషన్ కోసం తాము చాలా కాలంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాము తిరిగి ఆందోళన చేపట్టామని, తమ కోటాను ప్రభుత్వం ఎలాగైనా ఇచ్చి తీరాల్సిందేనని గుజ్జర్ల నేత కిరోరి సింగ్ భైంస్లా స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం గుజ్జర్లు సహా గొదియా లొహర్, బంజారా, రైకా, గదారియా కులాల వారికి 50 శాతం కోటాలోనే అత్యంత వెనుకబడిన వర్గాల కింద ప్రత్యేకంగా ఒక శాతం రిజర్వేషన్ అమలవుతోంది. అయితే తమ కులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్ధల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ గుజ్జర్లు జనవరిలో రాజస్ధాన్ సర్కార్‌కు ఇరవై రోజుల గడువిస్తూ అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్‌లైన్ ముగియడంతో సవాయి మధోపూర్ జిల్లాలో గుజ్జర్లు ఆందోళన బాట పట్టారు. -
రిజర్వేషన్లపై కుట్ర: కృష్ణయ్య
హైదరాబాద్: రిజర్వేషన్ మూలసూత్రాలను దెబ్బ కొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సేన తెలంగాణ ఆధ్వర్యం లో మోదీ సర్కార్ అక్రమ రిజర్వేషన్ల కల్పనపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ.. సామాజిక వెనుకబాటు, అంటరానితనం తదిత ర అంశాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి కానీ, పేదరికం ఆధారంగా కాదని చెప్పారు. అగ్రకులాల్లో పేదలుంటే వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి తప్ప రిజర్వేషన్లు కల్పించడమేంటని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అగ్రకులాల వారి కి రిజర్వేషన్ కల్పించారని బీసీ సంఘర్షణ సమి తి అధ్యక్షుడు వీజీఆర్ నారగోని ఎద్దేవా చేశారు. అణగారిన వర్గాలను తొక్కిపెట్టేందుకే రిజర్వేషన్ కల్పించారన్నారు. బహుజన సేన తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కదిరే కృష్ణ అధ్యక్షతన నిర్వ హించిన ఈ సభలో ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, సమాజ్‌వాది పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి, టీమాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య, సొగరా బేగం తదితరులు పాల్గొన్నార -
రిజర్వేషన్ల స్ఫూర్తికి ఆటంకం
రిజర్వేషన్లను చాలామంది దానధర్మంగానూ, భిక్షగానూ భావిస్తున్నారు. కానీ భారత ప్రజాస్వామిక సూత్రంలో ప్రాతినిధ్యం కీలకమైనది. ఏ కులాలకైతే ప్రాతినిధ్యం లేదో, ఆయా కులాలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ, విధానాలను రూపొందించాలి. మూడువేల ఏళ్ళుగా వివక్షకు, అణచివేతకు కారణమైన అగ్రకులాల ఆధిపత్యాన్ని కొత్తగా తెచ్చిన కోటా మరింత పటిష్ట పరుస్తుందన్నది నగ్న సత్యం. అగ్రకులాల పేదలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకూడదని ఎవ్వరూ అనడం లేదు. చదువుల విషయంలో ఇప్పటికే వారికి స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఇంకా వాటిని అందరికీ అందేవిధంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ రిజర్వేషన్ల స్ఫూర్తిని దెబ్బతీయకూడదు. ‘‘అధికారానికీ, అవకాశాలకూ అవతల ఉన్న సమూహాలకూ, కులాలకూ ప్రత్యేకమైన అవకాశాలూ, హక్కులూ కల్పించాలి. వారి కోసం ప్రత్యేక చట్టాలు చేయాలి. అందుకు గాను ప్రాథమిక హక్కులలో దానికి చోటు కల్పిస్తున్నాము’’ ప్రాథమిక హక్కులలో భాగమైన ఆర్టికల్ 16పైన జరిగిన చర్చలో పాల్గొంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన వ్యాఖ్యలివి. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న అంశాలు కూడా దీనిని ధృవ పరుస్తున్నాయి. మన దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం సాధిం చడానికి ఒక ప్రణాళిక అవసరం. అందులో భాగంగానే అన్యాయానికీ, అసమానతలకూ, అణచివేతకూ, వివక్షకూ గురైన వర్గాల కోసం కొన్ని ప్రత్యేక అవకాశాలూ, చట్టాలూ చేశాం. చేస్తున్నాం. కానీ, ఆర్థికంగా వెను కబడిన వర్గాల కోసం పార్లమెంటులో ఆమోదించిన చట్టం రాజ్యాంగ విలువలనూ, ప్రాథమిక లక్ష్యాలనూ విస్మరించింది. భారతదేశ కుల వ్యవస్థలో ఆధిపత్య స్థానంలో ఉన్న వర్గాలకు విద్య, ఉపాధి రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఈ చట్టం చేశారు. సమాజంలో ఉన్న ఏ అంతరాలైతే పోవాలని మనం కోరుకుంటున్నామో అవే అంతరాలను అంతకంతకూ అధికం చేసేదే ఈ చట్టం అని నా అభిప్రాయం. అసలు రిజర్వేషన్లు ఎవరికివ్వాలి? ఎందుకివ్వాలి? అర్థం చేసుకోవాలంటే చరిత్ర అడుగడుగునా చెరగని దళితుల నెత్తుటి జాడలను తడిమి చూడాలి. తరతరాల అవమాన భారాన్ని పెంటతట్టలా నెత్తిన మోసిన వేన వేల దళితులకు పరిహారంగా వచ్చిందే రిజర్వేషన్ల ప్రక్రియ. చరిత్ర పరి ణామ క్రమంలో జరిగిన మానవ భావజాల తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశాన్ని అంబేడ్కర్ రిజర్వేషన్ల పేరుతో కల్పించారు. కానీ ఈరోజు చేసిన చట్టం ద్వారా కల్పిస్తున్న ఈబీసీలకు పదిశాతం రిజర్వేషన్లు మాత్రం ఆధిపత్య చరితను పునఃప్రతిష్టించడానికే. నిజానికి గత రెండు వేల సంవత్సరాలకు పైగా జ్ఞానం, చదువు, సంపద మీద కొంత మంది తరతరాల గుత్తాధిపత్యం కొనసాగుతోంది. ఈ ఆధిపత్య భావజాలమే సమాజాన్ని పిడికిట బిగించి అణగారిన వర్గాలను అందులో బంధిం చింది. దీన్ని జయించడానికి రిజర్వేషన్లు ఓ చిన్న ప్రయత్నం మాత్రమే. భారత సమాజంలో వర్ణవ్యవస్థను నిర్మించి, కొన్ని వర్గాలకు, కొన్ని ప్రత్యేకమైన అవకాశాలను కల్పించారు. చదువు జ్ఞానం, సంపద మీద అధికారాన్నీ, ఆధిపత్యాన్నీ బ్రాహ్మణులు సంపాదించడం అందులో భాగమే. ఆ తరువాత క్షత్రియులు అధికారాన్ని సాగించారు. వైశ్యులు వ్యవసాయం, వ్యాపారం మీద అజమాయిషీ పొందారు. శూద్రులు వృత్తుల ద్వారా, ఇతర పరిచర్యల ద్వారా సేవకులుగా ఉన్నారు. ఇప్పుడు మనం ఎస్సీ, ఎస్టీలుగా పిలుస్తున్న నూటికి 25 శాతం మంది ఈ ఆధి పత్య సమాజం అంచులను కూడా తాకలేకపోయారు. ఈ ఆధిపత్య వ్యవస్థపై పడిన మొదటి సమ్మెట దెబ్బ 1902లో బ్రాహ్మణులతోపాటు బ్రాహ్మణేతర కులాలకు విద్య, ఉద్యోగాల్లో అవ కాశాలు కల్పించడానికి కొల్లాపూర్ సంస్థానాధీశుడు సాహుమహారాజ్ రిజర్వేషన్లు కల్పించడంతో పడింది. దీనితో ఆ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మ ణేతరులైన మరాఠాలతోపాటు, అనేకమందికి ప్రభుత్వంలో భాగ స్వామ్యం లభించింది. అటువంటి నిర్మాణాత్మక చర్యలలో భాగంగానే అంబేడ్కర్‌లాంటి వారికి సాహుమహారాజ్ సహాయ, సహకారాలు లభిం చాయి. కొల్లాపూర్ సంస్థానం మరాఠాల అధికారంలో ఉన్నప్పటికీ, మెజారిటీ ఉద్యోగాలు బ్రాహ్మణుల చేతుల్లోనే ఉండేవి. అప్పటికే మహా రాష్ట్రలో పుణె పట్టణం కేంద్రంగా జ్యోతిబాఫూలే నాయకత్వంలో సాగిన సత్యశోధక సమాజ్ ఉద్యమం ఆనాటి సమాజం మీద తీవ్రమైన ప్రభా వాన్ని కలుగజేసింది. అక్కడ మొదలైన సామాజిక పరివర్తన మైసూర్ సంస్థానంలో, మద్రాసు రెసిడెన్సీలో కూడా ప్రతిధ్వనించింది. 1919 నుంచి బాబాసాహెబ్ అంబేడ్కర్ సాగించిన పోరాటాన్ని దీని కొనసాగింపుగానే చూడాలి. రాజకీయ హక్కుల కోసం సౌత్‌బరో కమిటీ ముందు నినదిస్తే, భారతదేశంలో అమలు చేయాల్సిన సంస్క రణల గురించి సైమన్ కమిషన్‌కు వినిపించారు. భారతదేశానికి అవసర మైన ప్రభుత్వ వి«ధానాలేవి అనే అంశాలపై 1930, 1931 సంవత్సరాల్లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లలో అంటరాని కులాల హక్కుల కోసం అంబేడ్కర్ ఒంటరిపోరాటం చేశారు. అప్పటికే తిరుగులేని నాయ కుడుగా ఉన్న మహాత్మాగాంధీని కూడా ఎదిరించి, అంటరాని కులాల హక్కుల కోసం పోరాడి విజయం సాధించారు. అయితే గాంధీ అంట రాని కులాలను ప్రత్యేక వర్గంగా చూడడానికి నిరాకరించారు. ప్రత్యేక ఓటింగ్ విధానం ద్వారా తమ అభ్యర్థులను తామే ఎన్నుకునే ఒక అవ కాశాన్ని గాంధీ దెబ్బకొట్టారు. దానిపేరే పుణె ఒడంబడిక. దాని ద్వారా అంటరాని కులాలకు అంటరాని కులాల ప్రజలు మాత్రమే ఓటువేసే అవకాశం కోల్పోయి, అంటరాని కులాలకు అందరం ఓటు వేసే రిజ ర్వుడు నియోజకవర్గాల పద్ధతి అమలులోకి వచ్చింది. ఆ తర్వాత 1946 నుంచి 1950 వరకు సాగిన రాజ్యాంగ సభలో అనేక పరిణామాలు జరిగాయి. ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచిన అనేక అవకాశాలకు గాంధీకి అత్యంత సన్నిహితుడైన సర్దార్ పటేల్ మోకాలడ్డారు. 1950 వరకు ముస్లింలకు, క్రిస్టియన్లకు, ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్లు ఉండేవి. పరిమిత ప్రయోజనంలోనైనా అవి కొనసాగాయి. అయితే భారత రాజ్యాంగంలో వాటిని కొనసాగించడానికి సర్దార్ పటేల్ ఒప్పుకోలేదు. అసలు రిజర్వేషన్ల విధానమే అవసరం లేదని మొండికేశారు. అంబేడ్కర్ దానిని ఒప్పుకోలేదు. తరతరాలుగా వివక్షకూ, అవ మానాలకూ గురౌతోన్న ఎస్సీ, ఎస్టీలకు మాత్రం రిజర్వేషన్లు కల్పిం చారు. అంబేడ్కర్ దూరదృష్టితో తీసుకొచ్చిన ఆర్టికల్ 46 వల్ల స్వాతం త్య్రానంతరం వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం వచ్చింది. ‘‘సమాజంలోని బలహీన వర్గాలకు విద్య, ఆర్థికపరమైన అవ కాశాలను మెరుగుపరచడానికి కృతనిశ్చయంతో ఉంటుంది. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తుంది’’ అనేది ఆర్టికల్ 46 ఉద్దేశ్యం. ఆ తర్వాతనే అనేక కమిటీలు, కమిషన్లను ఏర్పాటు చేశారు. చివరకు మండల్ కమిషన్ సిఫారసుల అమలు ద్వారా దేశంలోని వెనుకబడిన కులాలు విద్య, ఉద్యోగావకాశాలను పొందుతున్నారు. ఇప్పటికే భారత సుప్రీంకోర్టు ఆర్థిక ప్రాతిపదికన తీసుకొచ్చే రిజర్వేషన్ల విషయంలో తన వ్యతిరేకతను ప్రకటించింది. చరిత్రలో తరతరాలుగా అణచివేతకు, వివ క్షకూ గురైన కులాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో సమానావకాశాలు అందించేందుకే రిజర్వేషన్లు కల్పించారని తేల్చి చెప్పింది. రిజర్వేషన్లను చాలామంది దానధర్మంగానూ, భిక్షగానూ భావిస్తు న్నారు. కానీ భారత ప్రజాస్వామిక సూత్రంలో ప్రాతినిధ్యం కీలకమైనది. ఏ కులాలకైతే ప్రాతినిధ్యం లేదో, ఆయా కులాలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ, విధానాలను రూపొందించాలి. కానీ నేడు దేశంలో అగ్రకులాల ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో వారి జనాభాకు మించి ఉన్నది. భారత ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కేడర్–1, కేడర్–2లలో అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతున్నది. కేవలం కేడర్–4లో మాత్రం ఇతర కులాలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. కేడర్–4 పోస్టులు కేవలం అటెండర్లు, డ్రైవర్లు, స్వీపర్లు, స్కావెంజర్లు ఉంటారు. ఐఏఎస్, ఐపీఎస్ లతో పాటు ఇతర ఉన్నతోద్యోగులలో అగ్రవర్ణాలు దాదాపు 50 నుంచి 60 శాతం ఉన్నారు. దేశంలో వారి జనాభా కేవలం 15 నుంచి 20 శాతా నికి మించదు. కొన్ని రాష్ట్రాల్లో కేవలం పది శాతంగా కూడా వారు లేరు. రిజర్వేషన్లకు ప్రాతిపదికగా ఉండే వివక్ష, అణచివేత, దోపిడీ అగ్ర కులాలు ఎదుర్కోవడం లేదు. వారి పేదరికానికి వేరే ఎవ్వరూ కారణం కాదు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర మైనారిటీ వర్గాల పేదరికానికి, వెనుకబాటుతనానికీ కుల వివక్ష, అణచివేత ప్రధాన కారణాలు. నిజానికి ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభ్యున్నతికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం ఉన్న చట్టాలు ఏవీ కూడా ఆశించిన స్థాయిలో అమలు జరగడం లేదు. మూడువేల ఏళ్ళుగా వివక్షకు, అణచివేతకు కారణమైన అగ్రకులాల ఆధిపత్యాన్ని కొత్తగా తెచ్చిన కోటా మరింత పటిష్ట పరుస్తుందన్నది నగ్న సత్యం. బీజేపీ ఈ దేశంలో అగ్రకులాల ఆధిçపత్యం కొనసాగించాలనుకుంటోంది. తమ రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తు న్నట్టు కనిపిస్తున్నది. మిగతా పార్టీల నాయకత్వాలు కూడా అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి. దానివల్ల ఏ పార్టీ కూడా ఈబీసీ రిజర్వేషన్లను వ్యతి రేకించలేదు. అయితే అగ్రకులాల పేదలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకూడదని ఎవ్వరూ అనడం లేదు. చదువుల విషయంలో ఇప్పటికే వారికి స్కాలర్ షిప్స్ ఉన్నాయి. ఇంకా వాటిని అందరికీ అందేవిధంగా చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే అన్ని స్థాయిల్లో అందరికీ ఉచిత విద్య కల్పించవచ్చు. అంతేకానీ చారిత్రక అవ సరంగా వచ్చిన రిజర్వేషన్ల స్ఫూర్తిని దెబ్బతీసే కుట్రకు ఈచట్టం సాధనం కాకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగ ప్రాతిపదిక ఉంది. అదే సామాజిక అంతరాలూ, వివక్ష. అంత రాలను అధిగమించడం కేవలం కొన్ని వర్గాల అభివృద్ధికే కాదు, అది సామాజిక అభ్యున్నతికి అవసరం కూడా. అదే న్యాయం కూడా. కానీ ఈ రోజు బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు అనే అంశం రాజ్యాంగ స్ఫూర్తికీ, సామాజిక న్యాయానికీ, సామాజిక విలువలకూ విరుద్ధమైనది. వివక్షాపూరిత విష చరితకు ఇది నాంది కాబోతోంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ఈబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు. జనాభాలో 70 శాతానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకుండా, ఈబీసీ రిజర్వేషన్లు కల్పించడంతో తీవ్ర అన్యాయం జరిగినట్లేనని ఆయన బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యం లో ఓట్లు రాబట్టేందుకు బీజేపీ ప్రభుత్వం చేసిన ఎత్తుగడ అని అన్నారు. అగ్రకుల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ.. పార్లమెంటులో బిల్లు పెట్టడాన్ని మాలమహానాడు తీవ్రంగా ఖండించింది. -
రిజర్వేషన్లు బూమరాంగ్ అయితే...
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల ప్రజలకు ఉద్యోగ, విద్యావకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించడం నేడు చర్చోపచర్చలకు తెరలేపింది. దీనికి సంబంధించిన బిల్లును మంగళవారమే పార్లమెంట్‌లోని లోక్‌సభ ఆమోదించగా, నేడు రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించిన తర్వాత కూడా వెంటనే అమల్లోకి రాకపోవచ్చు. దీన్ని సవాల్ చేస్తూ ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లవచ్చు, న్యాయ ప్రక్రియ ముగిసి అమల్లోకి రావడానికి కొన్ని ఏళ్లే పట్టవచ్చు. అయినప్పటికీ ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారికి ఇది ప్రయోజనకరమేనా? అయితే ఎంత మేరకు? అసలు అగ్రవర్ణాల వారు ఎవరు ? బ్రాహ్మణులు, రెడ్లు, కోమట్లే కాకుండా కులాల నిచ్చెనపై మధ్యలో ఉండే పటేళ్లు, జాట్లు, మరాఠాలు, కాపులు, కమ్మలందరు అగ్రవర్ణాల కిందకే వస్తారు. జనరల్ కేటగిరీ కింద పోటీ ఎక్కువై తమకు రిజర్వేషన్లు కావాలని ఇంతకాలం డిమాండ్ చేస్తూ వస్తున్న వర్గాల ప్రజలు కూడా వీరే. ముఖ్యంగా పటేళ్లు, జాట్లు, మరాఠాలు గత రెండు, మూడేళ్లుగా 20 శాతం రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు వీరందరికి కలిపి కేవలం పది శాతం రిజర్వేషన్లంటే అది ఏ మేరకు సరిపోతుందన్నది ప్రధాన ప్రశ్న. ఈ వర్గాల ప్రజల్లో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల వారు ఎవరు లేని కారణంగా రేపు ఉద్యోగ, విద్యావకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చినా జనరల్ కేటగిరీకి, ఈ పది శాతం కోటా కేటగిరీకి పోటీలో పెద్ద తేడా ఉండకపోవచ్చు. అప్పుడు ఈ వర్గాల మధ్య చిచ్చు రేగుతుంది. మొత్తం జనాభాలో తమ జనాభా నిష్పత్తి ప్రకారం పది నుంచి 30 శాతం వరకు రిజర్వేషన్లు కావాలంటూ పటేళ్లు, జాట్లు, మరఠాలు, బ్రాహ్మణులు, రెడ్లు వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించవచ్చు. అది సామాజిక అశాంతి పరిస్థితులకు దారితీయవచ్చు. మరోపక్క ఈ అగ్రవర్ణాల పది శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎస్సీ,ఎస్టీలు, ఓబీసీలు మరింత సంఘటితం కావచ్చు. అగ్రవర్ణాల పెత్తందారి విధానానికి వ్యతిరేకంగానే ఈ వర్గాల వారు రిజర్వేషన్ల కోసం పోరాటాలు జరిపారు. ఫలితంగా ఎస్సీ,ఎస్టీలకు 22.5 రిజర్వేషన్లు, మండల కమిషన్ ద్వారా ఓబీసీలకు 27 రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడం అంటే వారికి పెత్తనాన్ని తిరిగి అప్పగించడంగానే వారు భావించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అగ్రవర్ణాల వారు పార్టీకి దూరం అవడం వల్లనే పార్టీ ప్రభుత్వాలు కూలిపోయాయని బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీలు భావిస్తున్నారు. దూరమవుతున్న ఈ వర్గాలను దగ్గర చేసుకోవడం ద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే మోదీ ప్రభుత్వం అనూహ్యంగా ఈ పదిశాతం కోటాను తీసుకొచ్చింది. ఓట్ల కోసం రిజర్వేషన్ల నాటకాలు దేశానికి ఇదే కొత్త కాదు. 2014 సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జాట్లకు రిజర్వేషన్లు ప్రకటించారు. దాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన పెద్ద నోట్ల రద్దు లాగా ఈ పది శాతం రిజర్వేషన్లు కూడా బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది. -
ఇదీ ఈబీసీ కోటా కథ
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈబీసీ) ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో పదిశాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎన్నో ఏళ్ల నేపథ్యం ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల కిందకు రాని అగ్రవర్ణ పేదలకు కోటా ఇవ్వాలనే డిమాండ్ 30 ఏళ్ల క్రితమే వచ్చింది. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే అగ్రకులాల పేదలకు రిజర్వేషన్ ఇస్తామని మొదట హామీ ఇచ్చిన రాజకీయ నేత బీఎస్పీ స్థాపకుడు కాన్షీరామ్. తర్వాత ఈ పార్టీ అధ్యక్షురాలు మాయావతి, ఎస్పీ నేత ములాయంసింగ్ యాదవ్ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు పలికారు. కేంద్రమంత్రి, ఆర్పీఐకి చెందిన రాందాస్ అఠావలే కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రతిపాదనను సమర్థించారు. సిన్హో కమిషన్ సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందని.. అగ్రవర్ణ పేదల కోసం యూపీఏ సర్కారు ‘జాతీయ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కమిషన్’ను 2006లో నియమించింది. ఈ వర్గాల జీవన స్థితిగతుల అధ్యయనానికి మేజర్ జనరల్ (రిటైర్డ్) ఎస్ఆర్ సిన్హో చైర్మన్‌గా, మహేంద్రసింగ్ సభ్యులుగా కమిషన్ ఏర్పాటు చేశారు. 2008 జనవరి నాటికి ఈ కమిషన్ నివేదిక ఇవ్వాల్సిఉండగా, అనేక పొడిగింపుల తర్వాత, చివరికి యూపీఏ–2 హయాంలో 2010లో నివేదిక ఇచ్చింది. కోటి కుటుంబాలు ఎనిమిదేళ్ల క్రితం అగ్రవర్ణ పేదల సంఖ్య ఆరు కోట్లుగా ఈ కమిషన్ అంచనా వేసింది. దాదాపు కోటి కుటుంబాలున్నాయంది. అగ్రవర్ణ పేదలకు కోటా కల్పించడానికి తొలి అడుగుగా యూపీఏ ఈ కమిషన్‌ను నియమించింది. కమిషన్ సభ్యులు 28 రాష్ట్రాల్లో పర్యటించి సామాజికంగా బలహీనవర్గాలకు(ఎస్సీ, ఎస్టీ, బీసీ) చెందని కులాల జీవన స్థితిగతులను అధ్యయనం చేశారు. ఆదాయ పన్ను కట్టని అగ్ర కులాలకు చెందిన పేదలను ఓబీసీ(అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్)లతో సమానంగా పరిగణించాలనే ప్రతిపాదన మొదట ఈ కమిషన్ చేసింది. ఆర్థికంగా బలహీనులైన ఈ వర్గాలు బీసీల స్థాయిలో ఉన్నారని కూడా తెలిపిందని వార్తలొచ్చాయి. ఓబీసీలతో సమానంగా ఈ అగ్రవర్ణ పేదలను ప్రభుత్వం చూడాలని కమిషన్ కోరింది. ఈ కమిషన్ నివేదికలోని విషయాలను ఇంత వరకూ అధికారికంగా ప్రభుత్వం వెల్లడించలేదు. రాజ్యాంగ సవరణ అవసరం సామాజికంగా వెనుకబడని వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలంటే రాజ్యాంగంలోని 15, 16 అధికరణల సవవరణ అవసరం. అలాగే ప్రస్తుత అన్ని కోటాల పరిమితిని 50% నుంచి 60 శాతానికి పెంచడానికి కూడా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల రిజర్వేషన్ల మొత్తం 50 శాతం దాటకూడదనే సుప్రీంకోర్టు ఉత్తర్వులను అధిగమించాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త కోటా అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. అలా చేర్చాక కూడా దాన్ని పరిశీలించే అధికారం తమకు ఉంటుందని 2007లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1992లో ఇందిరా సహానీ వర్సెస్ కేంద్రం కేసులో అన్ని కోటాలకు 50% గరిష్ట పరిమితి విధించింది. తొలిసారి ఈ పదప్రయోగం అంబేడ్కర్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ప్రకటనలో తొలిసారి ఈబీసీ పద ప్రయోగం చోటు చేసుకుంది. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో 2014–15 నుంచి అమల్లోకి వచ్చిన డా.అంబేడ్కర్ పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ది ఇకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ స్టూడెంట్స్ అనే పథకంలో తొలిసారి ఆర్థికంగా వెనుకడిన వర్గం (ఈబీసీ) అనే పదం ఉపయోగించారు. జనరల్ కేటగిరీకి చెందిన విద్యార్థులకు ఈ పథకం అమలు చేయడం ప్రారంభించారు. జాతీయ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కమిషన్ తన నివేదికను 2010లో సమర్పించాక ఈ స్కాలర్షిప్ పథకం అమలు మొదలైంది. అమలు అంత తేలిక కాదు ఈబీసీ కోటా అమలుకు లబ్ధిదారులను గుర్తించడం చాలా కష్టమని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ దళిత ఐఏఎస్ అధికారి చెప్పారు. ఈబీసీ అనే ప్రత్యేక వర్గాన్ని సృష్టించడం ద్వారా జనరల్ కేటగిరీని విభజించడం వల్ల ప్రయోజనం లేదన్నారు. కోటా విషయంలో ఓబీసీ(అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్)లను వర్గీకరించడానికి నియమించిన ఐదుగురు సభ్యుల కమిషన్ ఏడాదిన్నర దాటినా ఆ పని పూర్తి చేయలేదు. రిజర్వేషన్‌కు సంబంధించి ఎలాంటి మార్పు చేయాలన్నా జాప్యం జరుగుతుందనడానికి ఇదే తార్కాణం. మతం ప్రాతిపదికన కోటా కుదరదు జాతీయస్థాయిలో మతం ప్రాతిపదికన రిజర్వేషన్‌కు అవకాశం లేకున్నా కొన్ని రాష్ట్రాల్లో మతపరమైన మైనారిటీలకు కోటాలు ఇస్తున్నారు. అలాగే ప్రస్తుతం తమిళనాడు, మహారాష్ట్రలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. సగానికి మించి కోటా అవసరమని తగినన్ని సాక్ష్యాధారాలు అందజేస్తే అందుకు అనుమతిస్తామని సుప్రీంకోర్టు 2010లో ప్రకటించింది. -
పేదలకు కోటా!
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎవరూ ఊహించని రీతిలో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ నిరుపేదలు లబ్ధి పొందే విధంగా విద్య, ఉద్యోగావకాశాల్లో వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర మంత్రివర్గం తీర్మానించింది. నిజానికి కేంద్రం అగ్రవర్ణ పేదలు అనే మాట వాడలేదు. జనరల్ కేటగిరీలోని నిరుపేద వర్గాలకు కోటా సదుపాయం ఇస్తున్నట్టు మాత్రమే ప్రకటించింది. ఈ నిర్ణయం అగ్రవర్ణాల్లోని పేదలతోపాటు ఇతర మతాల్లోని పేదలకు కూడా వర్తిస్తుంది. ఆ సంగతలా ఉంచి ఇది సాకారమైతే ఇప్పుడున్న రిజర్వేషన్లు 60 శాతానికి చేరు తాయి. కోటా పరిమితి 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది గనుక ఈ నిర్ణ యాన్ని సవాలు చేస్తూ ఎవరైనా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. మన రాజ్యాంగం ఆర్థిక వెనుకబాటుతనాన్ని రిజర్వేషన్లకు ప్రాతిపదికగా తీసుకోవటం లేదు. దాన్ని అధి గమించటం కోసం రాజ్యాంగంలోని 15, 16 అధికరణలను కూడా సవరించాల్సి ఉంటుంది. మంగ ళవారం ముగియాల్సిన పార్లమెంటు శీతాకాల సమావేశాలను మరో రోజు పొడిగించాలని నిర్ణయిం చారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం ప్రవేశపెట్టాలని కేబినెట్ తీర్మానించింది. అయితే ప్రస్తుత సమావేశాల్లో ఇది ఆమోదం పొందే అవకాశాలు లేవనే చెప్పాలి. పార్లమెంటు లోపలా, వెలు పలా ఎంతో లోతుగా చర్చించాల్సిన అంశం అలా ఒక్కరోజులో ఆమోదం పొందాలని భావించడం కూడా పొరపాటు. రిజర్వేషన్లు ఉండటం అవసరమా కాదా అన్న చర్చ ఈనాటిది కాదు. స్వాతం త్య్రానికి ముందూ, తర్వాత కూడా ఆ విషయంలో చర్చలు సాగాయి. సాగుతున్నాయి. రిజర్వేషన్లు ఉండరాదని గతంలో ఉద్యమాలు సాగించిన అగ్ర కులాలు తమను కూడా బీసీలుగా పరిగణించి ఆ సదుపాయం వర్తింపజేయాలని గత కొన్నేళ్లుగా కోరుతున్నాయి. రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితరచోట్ల అందుకోసం ఉద్యమాలు సాగాయి. ఇతర కారణాలతోపాటు అగ్రవర్ణాల్లో ఉండే ఈ అసంతృప్తి కూడా ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో తమ పార్టీ వైఫల్యానికి దారి తీసి ఉండొచ్చునని బీజేపీలో అంతర్మథనం మొదలైందని మీడియా కథనాలు చెబుతున్నాయి. విప క్షాలు ఆరోపిస్తున్నట్టు దాని పర్యవసానంగానే ఈ నిర్ణయం వెలువడి ఉండొచ్చు కూడా. పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ల సదుపాయం కల్పిస్తూ 1991లో పీవీ నరసిం హారావు నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చింది. ఇది రాజ్యాంగంలోని 16వ అధికరణాన్ని ఉల్లంఘిస్తున్నదని తెలిపింది. ఆ తర్వాత ఏ ప్రభుత్వమూ దాని జోలికి పోలేదు. ఆర్థిక సంస్కరణల పర్యవసానంగా అప్పట్లో పెల్లుబికిన నూతన అవకాశాల వల్ల కావొచ్చు... రాజ్యాంగాన్ని సవరించి అయినా ఆ కోటా అమలు చేసి తీరాలని ఎవరూ ఉద్యమించ లేదు. కానీ ఏళ్లు గడిచేకొద్దీ సంస్కరణల కారణంగా పుట్టుకొచ్చిన కొత్త సమస్యలు అన్ని వర్గాలనూ తాకడం మొదలైంది. చేతివృత్తులు దెబ్బతిని అట్టడుగు కులాలు, సాగు సంక్షోభం ఏర్పడి వ్యవ సాయంపై ఆధారపడే కులాలు ఒడిదుడుకుల్లో పడటం ప్రారంభించాయి. అందువల్లే తమకు రిజ ర్వేషన్ల ఫలాలు అందటం లేదని ఎస్సీ కులాల్లో, ఓబీసి కులాల్లోని అత్యంత వెనకబడిన వర్గాల్లో అసం తృప్తి రాజుకుంది. పర్యవసానంగా కొత్తగా రిజర్వేషన్లు కావాలనేవారూ, ఉన్న రిజర్వేషన్లను వర్గీకరిం చాలని కోరేవారు రంగంలోకొచ్చారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వీటిని దృష్టిలో ఉంచుకునే నిరుపేద వర్గాల పిల్లలు చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్మెంట్, వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ, నెలనెలా పింఛన్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇవి ఆచరణలో మంచి ఫలితాలనిచ్చాయి. అలాంటి పథకాలు లేనిచోట, ఉన్నా సమర్థవంతంగా అమలుకాని చోట రిజర్వేషన్ల డిమాండ్ బలంగా ముందుకొచ్చింది. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రాతిపదిక వేరు. తరతరాలుగా సామాజిక అణచివేతకు, వివక్షకూ గుర వుతూ అన్నివిధాలా వెనకబడి ఉన్న కులాలకు రిజర్వేషన్ల సదుపాయం కల్పించాలని మన రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించారు. మొదట్లో ఎస్సీ, ఎస్టీలకు ఉండే ఈ సదుపాయం అనంతరకాలంలో ఓబీ సీలకు కూడా అమలుకావడం మొదలైంది. తాజాగా కల్పిస్తామంటున్న కోటాకు ప్రాతిపదిక పేదరికం అంటున్నారు. పేదరికం కారణంగా ఎవరైనా సామాజిక వెనకబాటుకు గురయ్యారని ఎలా నిరూ పిస్తారో, ఆ నిర్ణయానికి దారితీసిన సర్వే ఏమిటో, దాని డేటా ఏమిటో తెలియాల్సి ఉంది. ఇవి లేన ప్పుడు తాజా నిర్ణయం న్యాయసమీక్షకు నిలిచే అవకాశం లేదు. దాని సంగతలా ఉంచి పేదరికాన్ని నిర్ణయించేందుకు ప్రభుత్వం నిర్ధారించిన ప్రాతిపదికలు గమనిస్తే ఎంతమంది ఆ కోటాకు అర్హుల వుతారో చెప్పలేం. వార్షికాదాయం రూ. 8 లక్షలు లేదా 5 ఎకరాల లోపు సాగుభూమి లేదా 1,000 చదరపు అడుగుల లోపు నివాస స్థలం, మున్సిపల్ ప్రాంతాల్లో 200 చదరపు అడుగుల లోపు నివా సస్థలం ఉన్నవారే నిరుపేదలుగా పరిగణనలోకి వస్తారు. ఒకపక్క మన ఆర్థిక వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉన్నదని చెప్పుకుంటాం. జీడీపీ అంత కంతకూ పెరుగుతున్నదని మురుస్తుంటాం. కానీ క్షేత్ర స్థాయిలో వాటి ఫలాలు ఎవరికీ చేరటం లేదని వివిధ వర్గాల అసంతృప్తిని చూస్తే అర్ధమవుతుంది. అగ్రవర్ణ పేదలకు సైతం లబ్ధి చేకూరుస్తామంటే కాదనే వారుండరు. కానీ నిజంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలున్నాయా? రిటైరయ్యేవారు అవు తుండగా లక్షలాది ఖాళీలను అలాగే ఉంచుతున్నారు. కొన్నిచోట్ల కాంట్రాక్టు ఉద్యోగాలతో కానిస్తు న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోటా విస్తరణ నిరుద్యోగాన్ని, పేదరికాన్ని సమూలంగా తుడిచి పెడుతుందా? వివిధ వర్గాల అసంతృప్తికి, ఆర్ధిక సంక్షోభానికి ఉన్న మూలకారణాలను స్పృశించ కుండా, వాటికి పరిష్కారాలను వెదక్కుండా...ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచ కుండా రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం ఏముంటుంది? తాజా నిర్ణయం సమాజంలో కొత్త వైషమ్యాలకు దారితీయరాదని ఆశిద్దాం. -
ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం అనుమతించదు : ఓవైసీ
-
‘ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే రిజర్వేషన్లు’
-
ఇది మోదీ ఇచ్చే చివరి లాలీపాప్ : హార్ధిక్ పటేల్
అహ్మదాబాద్ : ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణ కులాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలనే కేంద్ర కేబినేట్ నిర్ణయాన్ని పాటిదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ తప్పుబట్టారు. ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అందుకే తన అమ్ములపొదిలోని చివర అస్త్రాన్ని ఈ రకంగా వదిలారన్నారు. ఈ రిజర్వేషన్ లాలీపాప్ ప్రజలకు అందిస్తే అది పెద్ద పొరబాటు అవుతుందని, సరిగ్గా అమలు చేయకపోయినా ప్రజలు తిరగబడతారని వ్యాఖ్యానించారు. మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇక వెనకబడిన అగ్రవర్ణకులాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మోదీ సర్కార్ రాజ్యాంగ సవరణను చేపట్టనుంది. అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించేలా మంగళవారం ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 16, 17లకు సవరణను ప్రతిపాదించనుంది. -
‘ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే రిజర్వేషన్లు’
సాక్షి, హైదరాబాద్ : అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రిజర్వేషన్ల మూల సిద్ధాంతానికి విరుద్ధంగా ఉందన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలు రిజర్వేషన్లు అడగటం లేదని, వారిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రయత్నించాలని సూచించారు. పేదరిక నిర్మూలనకు రిజర్వేషన్లు ప్రాతిపదిక కాదన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఓపెన్ కేటగిలో వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం అనుమతించదు : ఓవైసీరి ఈబీసీ రిజర్వేషన్లను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం అనుమతించదన్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు అనేక పథకాలు తేవొచ్చాని సూచించారు. దళితులకు సామాజిక న్యాయం కోసమే రిజర్వేషన్లు కల్పించారన్నారు. దేశంలో ఇప్పటి వరకు 49.5 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5శాతం, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు అవుతోంది. 10శాతం పెంపుతో మొత్తం రిజర్వేషన్లు 59.5 శాతంకు చేరనుంది. -
అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్
-
అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అగ్రవర్ణాల్లో రూ 8 లక్షల వార్షికాదాయం మించని వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్ర కేబినెట్ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా,ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మోదీ సర్కార్ రాజ్యాంగ సవరణను చేపట్టనుంది.అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించేలా మంగళవారం ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 16, 17లకు సవరణను ప్రతిపాదించనుంది.ఇక కేబినెట్ నిర్ణయంతో జనరల్ కేటగిరిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి. కాగా మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అగ్రవర్ణాల్లో తమ పట్టును మరింత పెంపొందించుకునేందుకు మోదీ సర్కార్ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ, రాందాస్ అథవలే నేతృత్వంలోని ఆర్పీఐ వంటి పలు ఎన్డీఏ మిత్రపక్షాలు అగ్రవర్ణాల పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని గతంలోనూ డిమాండ్ చేశాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీం కోర్టు పరిమితి విధించింది. -
ఇక ప్రకటనే తరువాయి!
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు పూర్తయింది. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒకట్రెండు రోజుల్లో షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నాయి. మండల, వార్డు స్థాయిల్లో సర్పంచ్, వార్డుసభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన జిల్లాల వారీ గెజిట్లను సోమవారం పంచాయతీరాజ్ శాఖ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. ఈ ఎన్నికల్లో 1,49,73,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రోజూ సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం నిర్వహించుకునేందుకు అభ్యర్థులను అనుమతించనున్నారు. సర్పంచ్ అభ్యర్థుల కోసం 30, వార్డు సభ్యుల కోసం 20 ఎన్నికల గుర్తులను ఎన్నికల సంఘం సిద్ధం చేసి ఉంచింది. ఒక గుర్తును పోలి మరో గుర్తు లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల వ్యయ లెక్కలను సమర్పించని కారణంగా 12,716 మందిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో రేషన్ డీలర్లు సైతం పోటీ చేయొచ్చని స్పష్టతనిచ్చింది. బలవంతపు ఏకగ్రీవాలపై చర్యలు ప్రజాస్వామ్యబద్ధంగా సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఇబ్బంది లేదని, ఈ పదవులను వేలం వేయడం లేదా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తే సంబంధిత జిల్లా కలెక్టర్‌తో విచారణ జరిపించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేయనుంది. ఎన్నికల ఖర్చులపై స్పష్టత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల వ్యయ పరిమితులపై ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. 5 వేలకు పైగా జనాభా గల గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.5 లక్షలు, వార్డు సభ్యుడు రూ.50 వేల వరకు ఖర్చు చేయొచ్చని తెలిపింది. 5 వేల లోపు జనాభా ఉంటే రూ.1.5 లక్షల లోపు, వార్డు సభ్యుడు రూ.30 వేల వరకు మాత్రమే వ్యయం చేయాలని తెలిపింది. ఎన్నికల నిర్వహణకు 95 వేల బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసింది. -
ఉత్కంఠకు తెర
కరీంనగర్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ మరో అడుగు ముందుకు పడింది. గత కొన్ని రోజులుగా రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠకు గురువారం రాత్రి తెరపడింది. రిజర్వేషన్ల ప్రక్రియకు తుది రూపునిస్తూ అధికార యంత్రాంగం పచ్చజెండా ఊపింది. జెడ్పీ సమావేశ మందిరం వేదికగా అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషాతో పాటు ఆర్డీవో ఆనంద్‌కుమార్, డీపీవో మనోజ్‌కుమార్‌లతో పాటు వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకుల సమక్షంలో జిల్లాలోని 313 గ్రామపంచాయతీలకు ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ విధానాన్ని అమలు చేశారు. కరీంనగర్ జిల్లాలో 16 మండలాలు ఉండగా కరీంనగర్ అర్బన్ మండలాన్ని మినహాయించి 15 మండలాల్లోని 313 గ్రామాలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. వందశాతం ఎస్టీ జనాభా ఉన్న సైదాపూర్ మండలం రాయికల్ తండాను పూర్తిగా వారికే కేటాయించారు. మిగతా 312 గ్రామ పంచాయతీల్లో ఎస్టీలకు 3, ఎస్సీలకు 80, బీసీలకు 73 చొప్పున కేటాయించారు. మిగిలిన 156 స్థానాలను జనరల్ కేటగిరీ కింద రిజర్వేషన్లు ప్రకటించారు. సగానికి పైగా మహిళలకే.... మహిళలకు అన్ని వర్గాల్లో 50 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఈ లెక్కన జిల్లాలో మహిళలకు 158 స్థానాలు లభిస్తున్నాయి. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న సైదాపూర్ మండలం రాయికల్ తండాను మొదటిసారి మహిళలకు కేటాయించారు. ఎస్టీలకు మొత్తం మూడు పంచాయతీలు కేటాయిస్తే మహిళలకు రెండు రిజర్వే చేశారు. ఎస్సీలకు 80 పంచాయతీలు కేటాయించగా మహిళలకు 40, బీసీలకు కేటాయించిన 73 పంచాయతీల్లో మహిళలకు 37 గ్రామపంచాయతీల్లో రిజర్వేషన్లు సమకూరాయి. మొత్తానికి జిల్లాలో 313 పంచాయతీలు ఉంటే మహిళలు 158 పంచాయతీల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కానున్నారు. అదేవిధంగా రిజర్వేషన్లలో జనరల్ స్థానాలకు సైతం మహిళలు పోటీ చేసే అవకాశం ఉండడంతో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య మరింత పెరగనుంది. గ్రామాల్లో నెలకొన్న రాజకీయ సందడి.... గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో పంచాయతీ పోరుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఆయా గ్రామాల్లో చోటామోటా నాయకుల్లో రాజకీయ సందడి నెలకొంది. అనుకూలమైన రిజర్వేషన్లు వచ్చిన ప్రాంతాల్లో నాయకులు తాను పోటీలో ఉంటున్నానని, అందరూ సహకరించాలని అప్పుడే ప్రచారం సైతం మొదలుపెట్టారు. కుల సంఘాల వారీగా పెద్ద మనుషులను కలుస్తూ తనకు మద్దతు పలుకాలని, ఆశీర్వదించాలని అభ్యర్థిస్తూ మందు పార్టీలకు తెరలేపుతున్నారు. ప్రలోభాలకు గురిచేసే ప్రక్రియ మొదలు కానుండడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వెడేక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తు కాకుండా సాధారణ గుర్తులే ఇవ్వనుండడంతో అభ్యర్థుల మంచి చెడులే ప్రామాణికంగా ఓట్లు పడే అవకాశం ఉండడంతో ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు. 313 పంచాయతీలు, 2,966 వార్డులు... జిల్లాలోని 328పంచాయతీల్లో 15 విలీన గ్రామపంచాయతీలు మినహా మిగతా 313 పంచాయతీలకు, 2966 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు అవసరమయ్యే బ్యాలెట్ బా క్సులు 3,985 జిల్లాకు ఇప్పటికే చేరుకున్నాయి. సరిపడా బ్యాలెట్ పత్రాలను సైతం సిద్ధం చేసి ఉంచారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవ్వడంతో 15 విలీన గ్రామపంచాయతీల్లో ఎన్నికల నిర్వహణ ప్రస్తుతానికి లేనట్లే అని చెప్పవచ్చు. మూడు విడతల్లో ఎన్నికలు... జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ప్రతి విడతలో ఐదు మండలాల్లో ఎన్నికలు నిర్వహించేలా జిల్లా అధికారులు కసరత్తును పూర్తి చేశారు. 5వేల జనాభాకు ఒకరు చొప్పున 124 మంది రిటర్నింగ్ అధికారులను, ప్రతి పంచాయతీకి ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని నియమించేందుకు 334 మందిని ఎంపిక చేసి ఇప్పటికే వారికి శిక్షణ ఇచ్చారు. జిల్లాలో కరీంనగర్ అర్బన్ మినహా మిగతా 15 మండలాల్లో ప్రతి ఐదు మండలాలకు ఓసారి ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ తయారు చేసినట్లు సమాచారం. మొదటి విడతలో గంగాధర, రామడుగు, చొప్పదండి, కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి(హెచ్) మండలాల్లోని 97 గ్రామ పంచాయతీల్లో, రెండవ విడతలో తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లోని 107 గ్రామపంచాయతీల్లో, మూడవ విడతలో హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, సైదాపూర్ మండలాల్లోని 109 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తును పూర్తి చేసినట్లు సమాచారం. -
పంచాయతీ కోటా ఖరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ ఈ మేరకు ఎస్టీ, ఎస్సీ, బీసీ కోటాను జిల్లాలవారీగా ఖరారు చేసింది. పంచాయతీల్లో 50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో బీసీలకు 22.8 శాతం, ఎస్సీలకు 20.5 శాతం, ఎస్టీలకు 6.7 శాతం రిజర్వేషన్లు నిర్ధారిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏజెన్సీ, వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలు, సాధారణ రిజర్వేషన్లతో కలిపి ఈసారి ఎస్టీలకు ఎక్కువ సంఖ్యలో సర్పంచ్ స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఇక అన్ని కేటగిరీల్లోనూ 50 శాతం పంచాయతీలను మహిళలకు కేటాయించారు. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో గిరిజన ప్రాంతాల(షెడ్యూల్)కు సంబంధించిన 1,281 పంచాయతీలను ఎస్టీలకు కేటాయించారు. అలాగే వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న 1,177 సర్పంచ్ స్థానాలను కూడా వారికే రిజర్వ్ చేశారు. ఇవి తీసేయగా మిగిలిన 10,293 పంచాయతీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటా ప్రకారం రిజర్వేషన్లు నిర్ధారించారు. దీంతో ఎస్టీలకు 688, ఎస్సీలకు 2,113, బీసీలకు 2,345 సర్పంచ్ స్థానాలు రిజర్వ్ అయ్యాయి. మొత్తమ్మీద అందరి కంటే అత్యధికంగా ఎస్టీలకు 3,146 పంచాయతీలు దక్కాయి. ఇక 50 శాతం అన్రిజర్వ్డ్ కోటా కింద 5,147 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. వీటిలో అన్ని వర్గాలవారు పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వుడ్.. అన్ని కేటగిరిల్లోనూ సగం స్థానాలను(6,378) మహిళలకు కేటాయించారు. అలాగే జనరల్‌కు కేటాయించిన 6,373 స్థానాల్లో కూడా మహిళలు పోటీచేసే అవకాశం ఉంటుంది. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారి గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా మహిళలకు అన్ని కేటగిరీల్లో 50 శాతం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను ఖరారు చేశారు. బీసీలకు తగ్గిన కోటా... గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే వెనుకబడిన వర్గాలకు ఈసారి రిజర్వేషన్లు తగ్గాయి. గత ఎన్నికలలో బీసీలకు 34 శాతం కోటా ఉండగా.. ఈసారి అది 22.8 శాతానికి మాత్రమే పరిమితమైంది. తమకు రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదని బీసీ సంఘాలు, బీసీ ప్రజాప్రతినిధులు హెచ్చరించినప్పటికీ, సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగానే వారికి రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీంతో ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బీసీ సంఘాలు చెబుతున్నాయి. కాగా, జిల్లాలవారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వుడ్ కోటా ఖరారైన నేపథ్యంలో ఒకటిరెండు రోజుల్లో మండలాలవారీగా రిజర్వేషన్లు నిర్ధారించనున్నారు. సర్పంచ్ స్థానాలతోపాటు వార్డు సభ్యుల రిజర్వేషన్లును ఇదే పద్ధతిలో నిర్ణయిస్తారు. ఆయా జిల్లాల్లోని మండలాలవారీగా వివిధ కేటగిరీల వివరాలను కలెక్టర్లు ప్రకటిస్తారు. అనంతరం ఏ గ్రామపంచాయతీ ఏ వర్గానికి రిజర్వు అవుతుందనేదీ వెల్లడిస్తారు. ఈ వివరాలన్నీ సిద్ధం కాగానే సదరు జాబితాను పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ప్రభుత్వం ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేస్తుంది. ఈ జాబితా అందగానే ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేస్తుంది. నల్లగొండలోనే ఎక్కువ... ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల విశ్లేషిస్తే నల్లగొండ జిల్లాలోనే ఎక్కువ పంచాయతీలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. ఈ జిల్లాలో ఎస్సీలకు అత్యధికంగా 136, ఎస్టీలకు 69 పంచాయతీలు దక్కాయి. అలాగే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల కంటే ఇక్కడే అత్యధికంగా 421 పంచాయతీలు మహిళలకు లభించాయి. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో బీసీలకు అత్యధికంగా 170 పంచాయతీలు రిజర్వ్ కాగా, ఇదే జిల్లాలో 307 పంచాయతీలు అన్ రిజర్వ్డ్ కోటాలోకి వెళ్లాయి. రాష్ట్రంలో గ్రామపంచాయతీ రిజర్వేషన్ వివరాలివీ... -
పురపాలికల్లో రిజర్వేషన్ల సందడి
అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఇది కొనసాగుతుండగానే మున్సిపాలిటీల్లో జరగబోయే ఎన్నికల కోసం అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలకు జూన్ వరకు సమయం ఉన్నా అప్పటిలోగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల గణన ప్రారంభించారు. నల్లగొండ : జిల్లాలో కొత్త వాటితో కలుపుకొని 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపాలిటీలు పాతవి కాగా, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హాలియా, నందికొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ పట్టణాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసింది. వీటిలో కొన్నింటిని నగర పంచాయతీలనుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసింది. నకిరేకల్ మున్సి పాలిటీలో అప్పట్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యంగా జరిగినందున 2020 వరకు అక్కడ పంచాయతీ పాలన కొనసాగనుంది. మిగిలిన మున్సిపాలిటీలకు పాలక వర్గాల కాల పరిమితి జూన్ వరకు ఉంది. మిగతా వాటిలో ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ ఆలోగా వార్డుల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ,మహిళా ఓటర్లను గుర్తించాలనేది ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగానే ఓటర్ల గణన ప్రారంభించింది. 29వ తేదీ వరకు గణన ఈనెల 23న వార్డుల వారీగా ప్రారంభమైన ఓటర్ల గణన 29వ తేదీ వరకు కొనసాగనుంది. 29, 30న ఓటర్ల జాబితా తయారీ, జనవరి 1వ తేదీన ముసాయిదా జాబితా ప్రకటన, 2 నుంచి 4 తేదీల మధ్య ఆ జాబితాపై ఫిర్యాదులను స్వీకరించనున్నారు. 5, 6 తేదీల్లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంతోపాటు మహిళా ఓటర్లను గుర్తిస్తారు. 7,8 తేదీల్లో తుది జాబితా తయారు చేస్తారు. 9వ తేదీన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితా ప్రకటన, జనవరి 10వ తేదీన తుది జాబితాను సమర్పించనున్నారు. నల్లగొండ మున్సిపాలిటీలో 40 వార్డులు ఉండగా, మిర్యాలగూడలో 36, హాలియా, నందికొండలో 9 వార్డుల చొప్పున ఉన్నాయి. అదే విధంగా దేవరకొండలో 20 వార్డులుండగా, చండూరు, చిట్యాల మున్సిపాలిటీలలో 7 చొప్పున వార్డులున్నాయి. ప్రారంభమైన ఓటర్ల గణన అన్ని మున్సిపాలిటీల్లో ఓటర్ల గణన ప్రారంభమైంది. ఒక్కో వార్డుకు మున్సిపల్ బిల్ కలెక్టర్ ఇన్చార్జ్గా, వారికి సహాయకులుగా బీఎల్ఓ లేదా అంగన్వాడీ టీచర్‌ను ఉంచుతున్నా రు. పూర్తిస్థాయిలో బిల్ కలెక్టర్ లేని చోట ము న్సిపల్ ఉద్యోగులను ఇన్‌చార్జ్‌లుగా ఉంచి ప్రతి వార్డులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా ఓటర్లను విభజించి ఆయా వార్డుల్లో గణన ప్రారంభించారు. ఓటర్ల గుర్తింపు ఇలా.... బీసీ,ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణన జరిపే సందర్భంలో ఆ ఇంటికి సంబంధించిన వారు బీసీ అయితే బ్లాక్ పెన్‌తో మార్క్ చేయాల్సి ఉంటుంది. ఎస్టీ అయితే గ్రీన్ పెన్‌తో, ఎస్సీ అయితే రెడ్ పెన్‌తో మార్క్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో అధికారి మూడు పెన్నులతో వెళ్లి కేటగిరీల వారీగా గణన చేయాల్సి ఉంది. మహిళలు ఉంటే మహిళలు ఉన్నచోట ఆ అంకెకు రౌండ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఎవరెవరు ఎంతెంత మంది అనేది సులభంగా తెలిసిపోతుంది. ఏ రోజుది అదే రోజు అప్పగింత ఓటర్ల గుర్తింపుకు సంబంధించి ఆయా మున్సిపల్ ఉద్యోగి ఏ రోజు చేసిన గణన అదే రోజు మున్సిపల్ కమిషనర్, సహాయ కమిషనర్‌కు అప్పగించాలి. సాయంత్రం 5గంటలకు ఆ రోజు వార్డుల్లో ఎంత వరకు ఓటర్ల గణన జరిగిందో లెక్క తేల్చాలి. గణన ఆధారంగానే రిజర్వేషన్లు మున్సిపల్ ఉద్యోగులు నిర్వహించే వార్డుల వారీగా ఓటర్ల గణన ఆధారంగానే ఆ వార్డు రిజర్వేషన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా కేటగిరీలో ఉంటారో దానిని బట్టి రిజర్వేషన్‌ను నిర్ణయిస్తారు. గణన ప్రారంభం కావడంతో తాజా మాజీ కౌన్సిరల్లతో పాటు పోటీ చేయాలనుకునే వారు తమ వార్డులో ఏ కేటగిరీలో వారు ఎక్కువగా ఉన్నారనేది అంచనాలు వేసుకుంటున్నారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు జూన్ వరకు గడువు ఉన్నా మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికల సందడి నెలకొన్నట్లుగా ఉంది. ఏ వార్డు ఏ వర్గానికి రిజర్వేషన్ అవుతుందోననే ఉత్కంఠతతో ఆశావహులు ఉన్నారు. -
‘పుర’ ఎన్నికలకు శ్రీకారం!
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు రాష్ట్ర పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకు తొలి అడుగుగా, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 71 మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలోని 5 మున్సిపల్ కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లో 136 గ్రామాలు విలీనమైన నేపథ్యంలో ఆయా చోట్ల డివిజన్లు/వార్డుల పునర్విభజన చేపట్టింది. మున్సిపాలిటీలను వార్డులుగా విభజించేందుకు స్థానిక ప్రజల నుంచి 7 రోజుల్లోగా సలహాలు, సూచనలు ఆహ్వానిస్తూ మునిసిపల్ కమిషనర్లు బహిరంగ ప్రకటన జారీ చేయనున్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నుంచి సైతం సలహాలు, సూచనలను స్వీకరించనున్నారు. వార్డుల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి గురువారం ఈ కింద పేర్కొన్న మార్గదర్శకాలను జారీ చేశారు. 1 సమాన సంఖ్యలో ఓటర్లు,జనాభా ఉండేలా వార్డుల విభజనకు ప్రతిపాదనలు తయారు చేయాలి. 2 ఒక వార్డుకు, మరో వార్డుకు మధ్య ఓటర్ల సంఖ్యలో 10 శాతానికి మించి తేడా ఉండరాదు. 2011 జనాభా లెక్కల ఆధారంగా వార్డుల పునర్విభజన జరపాలి. 3 ప్రస్తుత వార్డులు, కొత్తగా ప్రతిపాదిస్తున్న వార్డుల రూపురేఖలు కనిపించేలా వేర్వేరు రంగులతో మ్యాప్‌ను తయారు చేయాలి. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సలహాలు, సూచనల మేరకు తీసుకున్న చర్యలను పురపాలక శాఖ డైరెక్టరేట్‌కు నివేదించాలి. 4 వార్డులకు నంబర్ల కేటాయింపును ఉత్తర దిక్కు నుంచి ప్రారంభించి వరుసగా తూర్పు, దక్షిణ, పడమర దిక్కుల క్రమంలో ముగించాలి. వార్డుల సరిహద్దులను నిర్ణయించే సమయంలో సహజ సిద్ధమైన సరిహద్దులకు ప్రాధాన్యతనివ్వాలి. సహజసిద్ధమైన సరిహద్దులు లేని చోట సర్వే నంబర్లు, ముఖ్యమైన జంక్షన్లను ప్రామాణికంగా తీసుకోవాలి. 5 వార్డుల విభజనకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి. 6 ముసాయిదా ప్రతిపాద నలపై ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను ఆహ్వానిస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేస్తుంది. త్వరలో కులగణన... మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లలో భాగంగా వార్డుల పునర్విభజన ప్రక్రియ ముగిసిన వెంటనే పురపాలక శాఖ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించేందుకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో సర్వే జరపనుంది. ఈ సర్వే గణాంకాల ఆధారంగా మున్సిపల్ ఎన్నికల్లో ఆయా వర్గాల వారీకి రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో జారీ చేసే అవకాశముంది. -
‘రేపు బీసీ బహిరంగసభ దద్దరిల్లాలి’
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సమగ్రాభివృద్ధిని కోరుతూ ఈ నెల 4న సరూర్‌నగర్ స్టేడియంలో తలపెట్టిన బీసీ బహిరంగసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ సభకు 112 బీసీ కులసంఘాలు మద్దతు తెలిపాయని చెప్పారు. బీసీలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీసభప్లాన్, బీసీ అట్రాసిటీ యాక్ట్ లాంటి అంశాలపై సభలో చర్చించి తీర్మానాలు చేస్తామన్నారు. ఈ సమావేశ నిర్ణయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని తెలిపారు. -
వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామకాల్లో వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 3 శాతం రిజర్వేషన్లు ఉండగా.. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రిజర్వేషన్లు ఒక శాతం పెరిగాయి. ఈ మేరకు వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు శాతం రిజర్వేషన్లకు సంబంధించి రోస్టర్ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రతి వంద పోస్టుల్లో 6, 31, 56, 82వ సంఖ్యలోని ఉద్యోగాలను వికలాంగులకు కేటాయించాలని పేర్కొంది. ఉద్యోగాల భర్తీలో వికలాంగుల రిజర్వేషన్లలో సమస్యలు తలెత్తితే వాటిని వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్, జీఏడీ కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ సభ్యులుగా ఉన్న కమిటీ ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంధ, దృష్టిలోపం ఉన్న వారికి 1 శాతం, మూగ, చెవిటిలోపాలున్న వారికి 1 శాతం, కదల్లేకపోవడం, నరాల బలహీనతతో నడవలేకపోవడం, మరుగుజ్జులు, కండరాల పెరుగుదల లోపించిన వారికి 1 శాతం, బుద్ధి మాంద్యం, మానసిక వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబులిటీ, మానసిక రుగ్మత, బహుళ వైకల్యం ఉన్న వారికి 1 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. -
జడ్జీల నియామకంలో రిజర్వేషన్లు కల్పించాలి
హైదరాబాద్: హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కోటా కల్పించాల ని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సభ్యులుగా గెలుపొందిన బీసీలకు అభినందన సత్కార సభ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. గత 70 ఏళ్లుగా న్యాయస్థానాల్లో మెజారిటీ తీర్పులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా వస్తున్నాయన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఈ వర్గాల అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీస్తున్నారని విమర్శించారు. చట్టసభల్లో రిజ ర్వేషన్లు లేకపోవడం వల్ల ఈ కులాలకు న్యాయం జరగడం లేదని అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. పంచా యతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెంచాలని, ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకురావాలని డిమాండ్ చేశారు. బార్ కౌన్సిల్‌కు ఎన్నికైన సిరికొండ సంజీవరావు, చలకాని వెంకట్ యాదవ్, శంకర్, డి.జనార్దన్, సునీల్ గౌడ్, ఫణీంద్ర భార్గవ్‌లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అడ్వకేట్ నాగుల శ్రీనివాస్ యాదవ్, కొండూరు వినోద్‌కుమార్, జనార్దన్ గౌడ్, విజయ్ ప్రశాంత్, కోల జనార్దన్, వేల్పుల బిక్షపతి, నర్సింహ గౌడ్, నీల వెంకటేశ్ జి.అంజి, అనంతయ్య, జైపాల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన మేరకు రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ గిరిజన జేఏసీ డిమాండ్ చేసింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను విడదీసి ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ధరావత్, గిరిజన నేతలు శంకర్ నాయక్, ఆంగోత్ గణేశ్ నాయక్‌ల ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ వద్ద జేఏసీ నేతలు ధర్నా చేశారు. ఎన్నో ఆశయాలతో సాధించుకున్న తెలంగాణలో గత నాలుగేళ్లుగా గిరిజనులకు హక్కుగా దక్కాల్సిన రిజర్వేషన్ ఫలాలు దక్కడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గోండు, కోయ, కోలాం, లంబాడీ తెగల మధ్య విభేదాలు సృష్టిస్తూ గిరిజనుల నిజమైన సమస్యలను పట్టించుకోవడం లేదని నేతలు విమర్శించారు. గిరిజన జనాభా 99 శాతం ఉన్న గిరిజన తాండాలు, గూడాల అభివృద్ధికి జిల్లా పరిషత్తుల ద్వారా వివిధ పద్దుల కింద నాలుగేళ్లుగా విడుదల కావాల్సిన రూ.20 వేల కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
‘రిజర్వేషన్ల విషయంలో నాటకాలాడింది మీరే’
వైఎస్సార్ జిల్లా : కాపు రిజర్వేషన్ల విషయంలో నాటకాలు ఆడింది చంద్రబాబేనని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చి ఓట్లు దండుకున్న చంద్రబాబు.. ప్రస్తుతం ఎల్లో మీడియాలో డిబేట్లు నిర్వహించి ప్రతిపక్షంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘కాపులకు రిజర్వేషన్లు వస్తున్నాయి. పండుగ చేసుకోండంటూ’ ప్రచారం చేసుకుంది చంద్రబాబు కాదా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎకిల నాయుడులను, మైనార్టీలను బీసీల్లో చేర్చిన మహానేత వైఎస్సార్ ఎప్పుడూ కూడా ప్రచారం చేసుకోలేదన్నారు. చంద్రబాబు మాత్రం.. ప్రకటనల కోసం కోట్లు ఖర్చు పెడుతూ, ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబు నాటకాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. -
రిజర్వేషన్లపై అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు
-
రిజర్వేషన్లపై మంత్రి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : రిజర్వేషన్లపై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్‌లుగా ఎస్సీ, ఎస్టీ ఎవరున్న పెత్తనమంతా నాయకులదే అని రిజర్వేషన్లను కించపరిచే విధంగా మాట్లాడారు. గడువు ముగిసిన సర్పంచ్‌లతో బుధవారం విశాఖపట్నంలో ఆయన సమావేశమై మాట్లాడారు. పంచాయతీలో రిజర్వేషన్ల అమలు మామూలు విషయమే అని అన్నారు. మంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడం ఏంటని స్థానికులు ఆశ్చర్యపోయారు. ఎస్సీ, ఎస్టీలను కించపరిచే విధంగా మాట్లాడడం టీడీపీ ప్రభుత్వానికి ఇదేం తొలిసారి కాదు. గతంలో సీఎం చంద్రబాబు ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఎస్సీ, ఎస్టీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నేటితో గ్రామపంచాయతీ సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
గిరిజనుల రిజర్వేషన్ వివాదంలో సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : గిరిజనుల రిజర్వేషన్ వివాదంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లో సుప్రీంకోర్టు సోమవారం ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. ఎస్సీ, ఎస్టీ ఉత్తర్వుల సవరణ చట్టం–1976 మేరకు బంజారా, లంబాడా, సుగాలీలను ఎస్టీలుగా గుర్తించడం రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టికల్ 342ని ఉల్లంఘించడమేనని, వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ వివాద పరిష్కారం న్యాయస్థానం పరిధిలో లేదని, పార్లమెంటరీ వ్యవస్థ పరిధిలో ఉందని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ గోండ్వానా వెల్ఫేర్ సొసైటీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం ఈ పిటిషన్‌తో పాటు మరికొన్ని పిటిషన్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు ఎం. ఎన్.రావు, వికాస్ సింగ్, అల్లంకి రమేశ్ వాదనలు వినిపించారు. బంజారా, లంబాడాలు, సుగాలీ లు గిరిజనులు కాదని, 1976 వరకు పాత ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ జిల్లాల్లో వారిని ఎస్టీలుగా పరిగణించలేదని, ఇతర రాష్ట్రాల నుంచి వారు తెలంగాణకు వలస వచ్చి అక్కడి అసలైన గిరిజనులకు ఉద్దేశించిన హక్కులను కొల్లగొట్టారని పిటిషన్లో పేర్కొన్నారు. అంతకుముందు వారు బీసీ జాబితాలో ఉన్నారని వివరించారు. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన సందర్భంలో ఆంధ్రా ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో ఉందని, ఆ సమయంలో లంబాడా, సుగాలీలను ఆంధ్రా ప్రాంతంలో ఎస్టీలుగా గుర్తించారని, కానీ హైదరాబాద్ స్టేట్‌లో కాదని పిటిషనర్ల తరఫు లాయర్లు వివరించారు. బంజారా సేవా సమితి తరఫున సీనియర్ న్యాయవాదులు రాజీవ్‌ధావన్, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి తమ వాద నలు వినిపిస్తూ.. పిటిషనర్లు 42 ఏళ్ల అనంతరం ఈ అంశంపై కోర్టును ఆశ్రయించారని, పిటిషన్‌ను తోసిపుచ్చాలని విన్నవించారు. వాదనల అనంతరం పిటిషన్‌పై స్పందించాలంటూ ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ,ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీచేసింది. అనంతరం విచారణ వాయిదా వేసింది. -
రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌నిచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలందరికీ కలిపి ఇచ్చే రిజర్వేషన్లు 50% దాటడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ రిజర్వేషన్లకు మాత్రం ఇది వర్తించదని, ఆ ప్రాంతాల్లో 50% మించి ఎస్టీ రిజర్వేషన్లు కల్పించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ల ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్లు 50% దాటకూడదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం ఉత్తర్వుల్లో ప్రముఖంగా ప్రస్తావించింది. పంచాయతీ ఎన్నికల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లు 50% దాటుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమేగాక సుప్రీంకోర్టు తీర్పునకు సైతం విరుద్ధమంటూ సంగారెడ్డి జిల్లా పోసానిపేట సర్పంచ్ వి. సప్నారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే రిజర్వేషన్ల మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 396తోపాటు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని పలు నిబంధనలను సవాల్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఎ. గోపాల్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. రిజర్వేషన్లు 50% దాటాయన్న పిటిషనర్లు ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వేదుల శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు 50% దాటుతున్నాయని వివరించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, కొన్ని చోట్ల ఎస్సీ, ఎస్టీలకు 100% రిజర్వేషన్లు ఇస్తున్నారని వివరించారు. మొత్తం 61 శాతం ఇస్తున్నామన్న ప్రభుత్వం ఈ వాదనపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ. సంజీవ్ కుమార్ స్పందిస్తూ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34%, ఎస్సీలకు 20%, ఎస్టీలకు 7% రిజర్వేషన్లు కలిపి మొత్తం 61% రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో బీసీల జనాభా 52% ఉందని ఆయన వివరించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మొదట బీసీ జనాభాను లెక్కించి ఆ తర్వాతే రిజర్వేషన్లు ఖరారు చేయాలని సింగిల్ జడ్జి చెప్పారని, ఉప వర్గీకరణ అంశం జోలికి ఆయన వెళ్లలేదన్నారు. ఈ ఆదేశాల మేరకు బీసీ జనాభాను లెక్కించాలన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్లకు ప్రాతిపదికేదీ? ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించింది. గతంలో కోర్టులిచ్చిన ఆదేశాలతోపాటు ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాలను పరిగణనలోకి తీసుకుని బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చామని సంజీవ్ చెప్పగా బీసీ జనాభా లెక్కించినా, లెక్కించకపోయినా రిజర్వేషన్లు 50% దాటకూడదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందంటూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు వ్యాజ్యాలను విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులుగా ఉన్న పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థంగా వాదనలు వినిపించేందుకు ఇప్పటివరకు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) నియామకం జరగకపోవడమే ప్రభుత్వానికి ఈ ఎదురుదెబ్బ తగలడానికి కారణమని న్యాయవాద వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. -
‘డిజిలాకర్’లో ఉన్నా చాలు!
న్యూఢిల్లీ: ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డులు వెంట లేకుండా రైలు ప్రయాణం చేస్తున్న వారు రిజర్వేషన్, రాయితీలను వినియోగించుకోవడానికి ఇక ఇబ్బందిపడనక్కర్లేదు. డిజిలాకర్‌లో భద్రపరచిన గుర్తింపు కార్డుల సాఫ్ట్ కాపీలను కూడా అనుమతిస్తామని తాజాగా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రెండు కాపీలను చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రాలుగా భావించాలని అన్ని జోన్ల ప్రిన్సిపల్ కమర్షియల్ మేనేజర్లకు లేఖలు పంపింది. డిజిలాకర్ ఖాతాలోని ‘ఇష్యూడ్ డాక్యుమెంట్స్’ సెక్షన్లో పొందుపరచిన ఆధార్, డ్రైవింగ్ లైసెన్సులను చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రాలుగా పరిగణించాలని సూచించింది. అయితే ప్రయాణికుడు స్వయంగా అప్లోడ్ చేసిన ‘అప్లోడెడ్ డాక్యుమెంట్స్’ విభాగంలోని సాఫ్ట్ కాపీలను అనుమతించమని స్పష్టం చేసింది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్రం ప్రారంభించిన క్లౌడ్‌బేస్డ్ ‘డిజిలాకర్’లో ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్లను భద్రపరచుకోవచ్చు. -
కేటగిరీలవారీగా ఇవ్వడం లేదేం?
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ఏ, బీ, సీ, డీ కేటగిరీలవారీగా రిజర్వేషన్లు అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. వివరణ ఇవ్వాలంటూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరీలవారీగా రిజర్వేషన్లు కల్పించని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9(4)ను సవాలు చేస్తూ తెలంగాణ ఎంబీసీ సంఘం ప్రధాన కార్యదర్శి ఆశయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బీసీలకు కేటగిరీలవారీగా రిజర్వేషన్లు కల్పించొద్దని సుప్రీంకోర్టు చెప్పలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదించారు. దీనిపై జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టుకు సుప్రీంకోర్టు తిరిగి పంపిందని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 15(4) ప్రకారం కేటగిరీలవారీగా రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సి అవసరం ఉందని పేర్కొంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
మరో ‘సామాజిక’ నాటకం!
సాక్షి, అమరావతి: ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం మరో సామాజిక డ్రామాకు తెరతీసింది. రాష్ట్రంలో సామాజిక వర్గాల హోదా మార్పుపై అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చేందుకు ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి మంగళవారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా అర్హత ఉన్న సామాజిక వర్గాలను ఎస్సీలుగా, ఎస్టీలుగా గుర్తించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత టీడీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై సామాజికవేత్తలు, ఉద్యమకారులు, అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాపులు, వాల్మీకులకు టీడీపీ దగా తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో 600లకుపైగా హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక అందులో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా అన్ని వర్గాలనూ మోసం చేసింది. రజకులు, నాయీ బ్రాహ్మణులు, కురుబలను ఎస్సీల్లో.. వడ్డెరలు, మత్స్యకారులు, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించి, న్యాయం చేస్తామని వాగ్దానం చేశారు. తమకు రిజర్వేషన్లు కల్పించాలని కాపులు ఉద్యమించడంతో రెండున్నరేళ్ల క్రితం జస్టిస్ మంజునాథ నేతృత్వంలో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ ఛైర్మన్ మంజునాథ నివేదిక ఇవ్వకుండానే కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపారు. వెనుకబడిన తరగతికి చెందిన వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని కేంద్రానికి సిఫార్సు చేస్తూ శాసనసభలో తీర్మానం చేశారు. ఆ తర్వాత ఏనాడూ కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని గానీ.. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని గానీ టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. నిన్నమొన్నటి వరకూ కేంద్రంలో బీజేపీతో అంటకాగిన టీడీపీ.. కాపులు, వాల్మీకులకు ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చేలా చేయడంలో ఘోరంగా విఫలమైంది. తాజాగా ఇతర సామాజిక వర్గాలను సైతం వంచించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నాటకం ప్రారంభించింది. ఎన్నికలు దగ్గర్లో ఉండడంతో కేవలం ఆ సామాజిక వర్గాలను సంతృప్తిపర్చడం కోసమే టీడీపీ సర్కారు ఈ డ్రామా ఆడిందని అప్పట్లో ఆయా సామాజికవర్గాల ఉద్యమకారులు స్పష్టం చేశారు. ఈ నాలుగేళ్లూ ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? తమను ఎస్సీల్లో చేర్చాలని రజకులు, నాయీ బ్రాహ్మణులు.. ఎస్టీల్లో చేర్చాలని మత్స్యకారులు, వడ్డెరలు డిమాండ్ చేస్తున్నారని, ఈ నేపథ్యంలో సామాజిక హోదా మార్పుపై అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చేందుకు ప్రత్యేకంగా కమిషన్ వేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు ప్రసార, సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రజకులు, నాయీ బ్రాహ్మణులు, మత్స్యకారులు, వడ్డెర్లకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే.. నాలుగేళ్లపాటూ ఆ దిశగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని సాక్షాత్తూ ఆయా సామాజిక వర్గాలే ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ఆ సామాజిక వర్గాలను మళ్లీ మోసం చేయడానికే కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాలిటెక్నిక్, డి–ఫార్మసీ కాలేజీల్లో ఫీజుల పెంపు సాగునీటి ప్రాజెక్టుల పనుల కోసం ఏపీడబ్ల్యూఆర్డీసీ ద్వారా భారీ ఎత్తున రుణాలను సమీకరించాలని ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ పాలిటెక్నిక్, డి–ఫార్మసీ కాలేజీల్లో ఫీజుల పెంపునకు అనుమతి ఇచ్చింది. మంగళవారం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కాలువ శ్రీనివాసులు విలేకరులకు వెల్లడించారు. మంత్రివర్గం నిర్ణయాలు... - తిరుపతిలో ఎలక్ట్రానిక్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ) విస్తరణకు ఆమోదం. రూ.2,827.5 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా 52,930 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా. ఈఎంసీ రెండో దశకు రూ.30.27 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన. - కాకినాడ వద్ద వాణిజ్య ఓడరేవును అభివృద్ధి చేయడానికి కాకినాడ సెజ్‌కు అనుమతి. కాకినాడ సెజ్, ఓడరేవుల అభివృద్ధికి రూ.200 కోట్లతో మౌలిక సదుపాయాలు. - మచిలీపట్నం పోర్డుకు అనుబంధంగా పారిశ్రామికవాడను అభివృద్ధి చేసేందుకు మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ(ముడా)కు రూ.1385 కోట్ల రుణం తీసుకోవడానికి అంగీకారం. - ఒంగోలు డెయిరీ పునరుద్ధరణకు రూ.35 కోట్ల రుణం ఇవ్వడానికి ఆమోదం. - సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరతను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి సంస్థ ద్వారా భారీ ఎత్తున రుణాలు సమీకరించాలి. ఈ ప్రాజెక్టులను బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద తనఖా పెట్టి రుణాలు తీసుకోవాలి. - భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం గూడెపువలసలో 27.87 ఎకరాల సేకరణ. ఎకరానికి రూ.33 లక్షల చొప్పున పరిహారం. - సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్ఎంఎస్)కు పూర్తిస్థాయి పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. - రాష్ట్రంలో 2019 జనవరి నాటికి పట్టణాలు, గ్రామాల్లో 19 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి. వివాదం లేని ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, నిర్మించుకున్న ఇళ్ల స్థలాలను క్రమద్ధీకరించడానికి ఆమోదం. - ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఫీజులను రూ15,500 నుంచి రూ.25,000 వరకూ, ఎంట్రెన్స్ ఫీజును రూ.3,800 నుంచి రూ.4,700 వరకూ పెంచుకోవడానికి యాజమాన్యాలకు అనుమతి. డి–ఫార్మసీ కాలేజీల్లో ఫీజులను రూ.17,000 నుంచి రూ.25,000కు పెంచుకోవడానికి అంగీకారం. - వేతన సవరణ సంఘానికి(పీఆర్సీ) 16 మంది సిబ్బంది కేటాయింపు. - వెలిగొండ ప్రాజెక్టు కాలువలో అదనపు పనులకు అదనంగా రూ.38.78 కోట్లు చెల్లించేందుకు అంగీకారం. - కియా కార్ల పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో కొత్తగా పోలీసు స్టేషన్ ఏర్పాటు. - ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్, డెంటల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్–2007 రద్దు. దీనివల్ల సెమీ అటానమస్ కాలేజీలు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. వాటిలో పని చేస్తున్న వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్ అవుతాయి. - భూములు రిజిస్ట్రేషన్ అయిన 45 రోజుల్లోగా ఆటోమాటిక్ మ్యూటేషన్ చేయడానికి అనుమతి. - రెవెన్యూ రికార్డులను పకడ్బందీగా నిర్వహించడానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలి. మంత్రి గంటా డుమ్మాపై దాటవేత సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ సమావేశానికి మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరు కాకపోవడంపై మంత్రి కాలువ శ్రీనివాసులు సమాధానం దాటవేశారు. గురువారం విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేసేందుకు గంటా అక్కడే ఉండిపోయారని చెప్పారు. కానీ, అదే జిల్లాకు చెందిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు కదా అని విలేకరులు ప్రస్తావించగా.. మంత్రి కాలువ సమాధానం దాటవేశారు. ప్రభుత్వ సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ చేసిన రాజీనామాను ఆమోదించబోమని చెప్పారు. -
బీసీలకు 3,440 పంచాయతీలు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన రిజర్వేషన్ల ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలోని మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్, కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులను పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని.. అన్ని కేటగిరీల్లోనూ 50 శాతం పదవులను ఆయా కేటగిరీల మహిళలకు కేటాయించాలని సూచించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వెనుకబడిన వర్గాలకు 34 శాతం, జనాభా ఆధారంగా ఎస్సీలకు 20.46 శాతం సర్పంచ్ పదవులను కేటాయించాలని స్పష్టం చేశారు. ఇక మైదాన ప్రాంతాల్లో ఎస్టీ జనాభా 5.73 శాతం లెక్కన ఆ వర్గానికి 580 సర్పంచ్ పదవులు దక్కుతాయని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులన్నింటినీ ఆ వర్గం వారికే కేటాయించాలని సూచించారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా ఎస్టీలకు 3,214 సర్పంచ్ పదవులు రిజర్వు అయ్యాయి. కొత్త చట్టం.. కొత్త రిజర్వేషన్లు.. రాష్ట్రంలో మొత్తం సర్పంచ్ స్థానాలు 12,751. అన్ని గ్రామ పంచాయతీల్లో కలిపి 2.02 కోట్ల జనాభా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్సీ మహిళ, ఎస్టీ, ఎస్టీ మహిళ, బీసీ, బీసీ మహిళ, జనరల్, జనరల్ మహిళ కేటగిరీలుగా రిజర్వేషన్లు ఉంటాయి. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల ఖరారు విధానం ప్రస్తుత ఎన్నికలతోనే మొదలుకానుంది. అంటే 1995, 2001, 2006, 2013 ఎన్నికలలో ఖరారైన రిజర్వేషన్లతో సంబంధం లేకుండా (జీరో రిజర్వేషన్) ప్రస్తుతం కొత్తగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. రాష్ట్రం యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుని బీసీలకు 34 శాతం పదవులను కేటాయిస్తున్నారు. బీసీ ఓటర్ల సంఖ్య ఆధారంగా.. జిల్లాల వారీగా బీసీలకు ఖరారు చేసే పదవుల సంఖ్యలో మార్పులు ఉంటాయి. 2011 లెక్కల ఆధారంగా తాజా రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించనున్నారు. సర్పంచ్ల రిజర్వేషన్ సంఖ్యలను జిల్లాల వారీగా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, మండలాల వారీగా జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు. గ్రామ పంచాయతీల వారీగా సర్పంచ్ పదవులు ఏ వర్గానికి అనేదాన్ని ఆర్డీవో, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీవో నిర్ణయిస్తారు. మొత్తానికి మండలం యూనిట్‌గా తీసుకుని జనాభా ఆధారంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు వరుసగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. మిగిలిన పంచాయతీలను జనరల్ కేటగిరీగా నిర్ధారిస్తారు. గ్రామాల్లోని మొత్తం ఓటర్లు, అందులో బీసీ ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటూ రిజర్వేషన్లను నిర్ణయిస్తారు.