ముంబయి: సీఎం ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. మరాఠా ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. రిజర్వేషన్లు కల్పించడానికి చట్టపరమైన విధానాలు పాటించడానికి ప్రభుత్వానికి సమయం అవసరమని చెప్పారు. మరాఠా రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో నేడు రాష్ట్రంలో సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగింది.
మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారుడు మనోజ్ జరాండే నిరవధిక నిరాహార దీక్షను విరమించాలని అఖిలపక్ష నేతలు కోరారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలను ఆకాంక్షించారు. ఈ అఖిలపక్ష భేటీలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన(యూబీటీ) నాయకుడు అనిల్ పరాబ్, శాసనసభా ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ తదితరులు పాల్గొన్నారు.
మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్రంలో కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో చాలాచోట్లు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఐదు మరాఠా జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ప్రభుత్వ బస్సులను రద్దు చేశారు. ఆందోళనలు వ్యాప్తి చెందకుండా ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు. బుధవారం నుంచి దీక్షను మరింత తీవ్రతరం చేస్తామని నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న మనోజ్ జరాండే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించింది.
మరాఠా రిజర్వేషన్లపై మంగళవారం తీవ్రస్థాయికి చేరాయి. ముంబయి-బెంగళూరు జాతీయ రహదారిని ఆందోళనకారులు అడ్డగించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో రైలు పట్టాలను దిగ్బంధించారు. పట్టాలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు, మరాఠా రిజర్వేషన్‌లకు మద్దతు కోరుతూ నిరసనకారులు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు పెట్టారు.
ఇదీ చదవండి: Wine Capital of India: దేశంలో మద్యం రాజధాని ఏది?
Comments
Please login to add a commentAdd a comment