మహారాష్ట్రలో మరోమారు రిజర్వేషన్ ‘మంటలు’ రాజుకున్నాయి. అంబాద్ తాలూకాలోని తీర్థపురి పట్టణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద మరాఠా నిరసనకారులు రాష్ట్ర రవాణా బస్సును తగులబెట్టారని ఒక అధికారి తెలిపారు.
దీనిపై మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్టీసీ) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపధ్యంలో జల్నా ప్రాంతంలో బస్సు సేవలను నిలిపివేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మరాఠా ఆందోళనకారులు బస్సును తగులబెట్టారని ఆరోపిస్తూ ఎంఎస్‌ఆర్టీసీ అంబాద్ డిపో మేనేజర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో పోలీసు ఫిర్యాదు చేశారు.
ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మరాఠా రిజర్వేషన్ బిల్లును మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ప్రకారం మరాఠాలకు 50 శాతం పరిమితిని మించి అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఫిబ్రవరి 20న అసెంబ్లీలో కోటా బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ తన దీక్షను విరమించలేదు. పైగా ఈ ఆర్డినెన్స్ నోటిఫికేషన్‌ను రెండు రోజుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 24న రాష్ట్రంలో మరో ఉద్యమం ప్రారంభమయ్యింది. తాజాగా మనోజ్ జరంగే మాట్లాడుతూ మరాఠా కమ్యూనిటీకి అందిస్తాన్న రిజర్వేషన్ సంతృప్తికరంగా లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment