Maratha
-
మరాఠా కోటా.. ‘జూలై 20 నుంచి మళ్లీ నిరాహారదీక్ష చేపడతా’
ముంబై: మరాఠా రిజర్వేషన్ సమస్యకు రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, మంత్రి ఛగన్ భుజ్‌బల్ ఒత్తిడి కారణంగా పరిష్కారం లభించటం లేదని మరాఠా ఉద్యమ నాయకుడు మనోజ్ జరాంగే పాటిల్ ఆరోపణలు చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘ప్రభుత్వం మారాఠా రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వటంలేదు. మేము పెట్టిన డెడ్‌లైన్ జూలై 13 కూడా దాటిపోయింది. మరాఠా రిజర్వేషన్లకు పరిష్కారం లభించకుండా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, మరో మంత్రి ఛగన్ భుజ్‌బల్ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రి, మారాఠా సబ్ కోటా కమిటీ మెంబర్ శంభూరాజ్ దేశాయ్ మమ్మల్ని సంప్రదించటం లేదు. మాకు ఆయనపై పూర్తి నమ్మకం ఉంది. కానీ, ఇప్పటికి ఆయన మమ్మల్ని సంప్రదించలేదు. ఆయనపై కూడా మారాఠా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసే కార్యకర్తలను కలవకూడదని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. మారాఠా రిజర్వేషన్ల కార్యకర్తలము జూలై 20న సమావేశం అవుతాము. తదుపరి కార్యచరణపై నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వం నుంచి స్పష్టత వెలువడకపోతే వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 మంది కార్యకర్తలు పోటీ చేస్తాం లేదా ముంబై పెద్ద ఎత్తును నిరసన మార్చ్ చేపడతాం. మా హక్కులను సాధించుకోవడానికి మేము ముంబై వెళ్తాం. శాంతియూతంగా నిరసన తెలపటం మాకు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు’’ అని అన్నారు.మరోవైపు.. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే జూలై 20 నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపడతామని మనోజ్ జరాంగే పాటిల్ శనివారం ప్రకటించారు. ఫిబ్రవరిలో మరాఠా రిజర్వేషన్ బిల్లకు మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మరాఠా సామాజికవర్గానికి విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏక్నాథ్ షిండే ప్రభుత్వం అసెంబ్లీలో సంబంధిత బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసింది. సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించే బిల్లు-2024 అమలులోకి వస్తే.. దశాబ్దం తర్వాత సమీక్షించబడుతుంది. -
మన దేశంలో బెస్ట్ ఇంగ్లీషు ఎవరు మాట్లాడతారు? ఈ వీడియో చూడండి!
భిన్న భాషలు, విభిన్న సంస్కృతుల మేళవింపు భారత దేశం. అయితే 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్న ఇండియా 1947లో స్వాతంత్ర్యాన్ని సాధించింది. అప్పటినుంచి మన దేశంలో ఇంగ్లీషు భాష ప్రభావం, ఆంగ్లం మాట్లాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. భారతీయుల ఇంగ్లీషుపై హింగ్లీష్,టింగ్లీషులాంటి సెటైర్లు ఉన్నప్పటికీ, 2021 నాటి లెక్కల ప్రకారం అమెరికా తరువాత అత్యధిక సంఖ్యలో ఇంగ్లీష్ మాట్లాడే వారిలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. దాదాపు 10శాతం మంది భారతీయులు ఇంగ్లీషులో మాట్లాడతారు. రెండు లేదా మూడో భాషగా ఇంగ్లీషు మాట్లాడేవారు కూడా ఎక్కువే ఉన్నారు. గ్రామీణులతో పోలిస్తే పట్టణ, విద్యావంతులు, సంపన్నులు ఎక్కువగా ఇంగ్లీషు భాష మాట్లాడతారు. అయితే తాజాగా చక్కటి ఇంగ్లీషు భాష ఏ భాష ప్రజలు మాట్లాడతారు అనే అంశానికి సంబంధించి ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం కన్నడిగులు మంచి ఇంగ్లీషు మాట్లాడతారట. మాతృభాష కన్నడగా ఉన్న ప్రజల యావరేజ్ ఇంగ్లీషు స్పీకింగ్ టెస్ట్ స్కోరు 74 శాతంగా నిలిచింది. వావ్.. ఆసక్తికరమైన పరిశోధన.. ఇంగ్లీషు నేర్చుకోవాలంటే కన్నడ నేర్చుకోవాలన్నమాట, లేదంటే కన్నడ ఫ్రెండ్ అయినా ఉండాలి అంటూ చాలామంది హర్షం వ్యక్తం చేశారు. ఇంగ్లీషు మాత్రమే కాదు బహుశా కన్నడ మాట్లాడేవారు ఇతర భాషలను కూడా తేలికగా నేర్చుకుంటారు. నా దృష్టిలో కన్నడ ఇటాలియిన్ ఆఫ్ ది ఈస్ట్. అంతేకాదు కన్నడిగులు దేశంలోని ఇతర రాష్ట్ర భాషలను సులభంగా నేర్చుకుంటారు అంటూ ఒకరు కమెంట్ చేయడం విశేషం. Guess who speaks the best English in India by mother tongue? 😊👏 pic.twitter.com/MfSlNAiGjR — Aparajite | ಅಪರಾಜಿತೆ (@amshilparaghu) March 11, 2024 మిగిలిన భాషల ర్యాంకులు పంజాబీ - 63 శాతం గుజరాతీ - 65 శాతం బెంగాల్ - 68 శాతం హిందీ,మళయాళం, తెలుగు - 70శాతం తమిళం - 71 శాతం మరాఠా- 73శాతం -
మహారాష్ట్రలో మళ్లీ రిజర్వేషన్ ‘మంటలు’
మహారాష్ట్రలో మరోమారు రిజర్వేషన్ ‘మంటలు’ రాజుకున్నాయి. అంబాద్ తాలూకాలోని తీర్థపురి పట్టణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద మరాఠా నిరసనకారులు రాష్ట్ర రవాణా బస్సును తగులబెట్టారని ఒక అధికారి తెలిపారు. దీనిపై మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్టీసీ) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపధ్యంలో జల్నా ప్రాంతంలో బస్సు సేవలను నిలిపివేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మరాఠా ఆందోళనకారులు బస్సును తగులబెట్టారని ఆరోపిస్తూ ఎంఎస్ఆర్టీసీ అంబాద్ డిపో మేనేజర్ స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మరాఠా రిజర్వేషన్ బిల్లును మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ప్రకారం మరాఠాలకు 50 శాతం పరిమితిని మించి అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఫిబ్రవరి 20న అసెంబ్లీలో కోటా బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ తన దీక్షను విరమించలేదు. పైగా ఈ ఆర్డినెన్స్ నోటిఫికేషన్‌ను రెండు రోజుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 24న రాష్ట్రంలో మరో ఉద్యమం ప్రారంభమయ్యింది. తాజాగా మనోజ్ జరంగే మాట్లాడుతూ మరాఠా కమ్యూనిటీకి అందిస్తాన్న రిజర్వేషన్ సంతృప్తికరంగా లేదని అన్నారు. -
ఛత్రపతి శివాజీ శౌర్యానికి మారుపేరని ఎందుకంటారు?
ఛత్రపతి శివాజీ భారతదేశాన్ని మొఘలుల బారి నుండి విముక్తి చేసి, మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. మొఘలులకు వ్యతిరేకంగా యుద్ధానికి దిగిన శివాజీ శౌర్య పరాక్రమాలు చరిత్రలోని బంగారు పుటలలో నిక్షిప్తమయ్యాయి. భారతదేశంలో శివాజీ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. నేటికీ ఛత్రపతి శివాజీని శౌర్యానికి ప్రతీకగా చెబుతుంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ప్రతియేటా ఫిబ్రవరి 19 న జరుపుకుంటారు. శివాజీ 1630, ఫిబ్రవరి 19న శివనేరి కోటలోని మరాఠా కుటుంబంలో జన్మించాడు. శివాజీ పూర్తి పేరు శివాజీ భోంస్లే. అతని తండ్రి పేరు షాజీ భోంస్లే, తల్లి పేరు జిజియాబాయి. శివాజీ తండ్రి అహ్మద్‌నగర్ సుల్తానేట్‌లో పనిచేసేవారు. శివాజీ తల్లికి మతపరమైన గ్రంథాలపై అమితమైన ఆసక్తి ఉండేది. ఇదే శివాజీ జీవితంపై ప్రభావం చూపింది. మహారాజ్ శివాజీ జన్మించిన కాలంలో దేశంలో మొఘలుల దండయాత్ర కొనసాగుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన 15 ఏళ్ల వయసులో మొఘలులపై తన మొదటి దాడిని చేశాడు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసమే ఈ దాడి జరిగింది. దీనినే గెరిల్లా వార్ఫేర్ విధానం అంటారు. శివాజీ ఈ కొత్త తరహా యుద్ధానికి ప్రాచుర్యం కల్పించారు. గెరిల్లా వార్ఫేర్ సూత్రం ‘హిట్ అండ్ రన్‌వే’. శివాజీ బీజాపూర్‌పై తన గెరిల్లా యుద్ధ నైపుణ్యంతో దాడిచేసి అక్కడి పాలకుడు ఆదిల్షాను ఓడించి, బీజాపూర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1674లో పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. ఈ సమయంలోనే శివాజీ అధికారికంగా మరాఠా సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఛత్రపతి శివాజీని ‘మరాఠా గౌరవ్’ అని కూడా పిలిచేవారు. శివాజీ తీవ్ర అనారోగ్యంతో 1680 ఏప్రిల్ 3న కన్నుమూశాడు. అనంతరం ఆయన కుమారుడు శంభాజీ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. -
కరోనాతో ప్రముఖ నటి మాధవీ మృతి
Actress Madhavi Gogate Died Due To Coronavirus: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో ప్రముఖ సినీ, టీవీ నటి మాధవీ గోగటే(58) కన్నుమూశారు. మరాఠి చిత్ర పరిశ్రమకు చెందిన నటి మాధవి ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె మృతికి బాలీవుడ్ టీవీ, సినీ పరిశ్రమకు చెందని పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. చదవండి: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి కాగా మాధవీ పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో తల్లి పాత్రలు పోషించి మంచి గుర్తింపు పొందారు. అశోక్ సరాఫ్ సరసన మరాఠీ చిత్రం ‘ఘన్ చక్కర్’లో నటించి తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల ‘తుజా మాజా జంటాయ్’ అనే మరాఠీ సీరియల్ బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. ఇక ‘ఐసా కభీ సోచా నా థా, కహిన్ తో హోగా, కోయి అప్నా సా’ వంటి సీరియల్స్ నటించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. చదవండి: కరోనాతో ఆసుపత్రిలో చేరిన అగ్ర హీరో కమల్ హాసన్ -
Maratha Reservation: ఏక్ మరాఠా.. లాఖ్ మరాఠా
సాక్షి ముంబై: రిజర్వేషన్ కోసం మరాఠా క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో ముంబైలో బైక్ ర్యాలీ జరిగింది. వందాలది బైక్‌లతో నిర్వహించిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో మరాఠా సమాజం ప్రజలు పాల్గొన్నారు. యువకులతోపాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. శాంతియుతంగా నిర్వహించిన ఈ ర్యాలీలో ప్రారంభం నుంచి చివరి వరకు ‘ఏక్ మరాఠా.. లాఖ్ మరాఠా..’, ‘జై శివాజీ... జై భవానీ’, ‘హరహర మహదేవ్’ తదితర నినాదాలతో సాగింది. దీంతో పరిసరాలన్ని మారుమ్రోగాయి. ముంబై సైన్‌లోని సోమయ్య మైదానం నుంచి ఆదివారం ఉదయం సుమారు 11.30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ ర్యాలీ సైన్, మాటుంగా, దాదర్, పరెల్, భైకల్లాల మీదుగా ఛత్రపతి శివాజీ మహారాజు టెర్మినస్ (సీఎస్ఎంటీ) వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న యువతి, యువకులు ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. వివిధ రకాల బైక్‌లపై వందలాది మంది నినాదాలు చేస్తు మందుకు సాగారు. కాషాయ జెండాలు చేతపట్టుకొని తలపై తెల్ల టోపీలు ధరించారు. ఇలా ప్రత్యేక వేషాధారణతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. మరాఠా సమాజం నిర్వహించిన ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు ఆశీష్ శెలార్, ప్రవీణ్ దరేకర్‌లతోపాటు పలువురు నేతలు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. ముంబైలోని ఓ ఫ్లైఓవర్‌పై ర్యాలీగా వెళుతున్న మరాఠాలు సహనాన్ని పరీక్షించొద్దు.. మరాఠా సమాజానికి రిజర్వేషన్ తొందరగా ఇవ్వాలని లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని మరాఠా క్రాంతి సంఘర్స్ మోర్చా కన్వీనర్ రాజన్ శివసంగ్రామ్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ వినాయక్ రావ్ మెటే హెచ్చరించారు. సీఎస్ఎంటి వద్ద ఉన్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదేవిధంగా తమ సహనాన్ని పరీక్షించ వద్దని హెచ్చరించారు. తొందర్లో ఈ అంశంపై నిర్ణయం వెలువడకపోతే ముంబైలో లక్ష మందితో కలిసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. మరాఠా క్రాంతి మోర్చా బైక్ ర్యాలీ కారణంగా సైన్– భైకళా–సీఎస్ఎంటీ ప్రధాన మార్గంపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలతో ముఖ్యంగా అంబేడ్కర్ నగర్‌పై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జరిగిన ర్యాలీలో సీఎస్ఎంటీ వద్ద శివాజీ ముఖచిత్రం కలిగిన జెండా ఊపుతూ వెళుతున్న ఓ మరాఠా యువకుడు ఈ ర్యాలీని పురస్కరించుకుని పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును మోహరించారు. మరోవైపు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఈ ర్యాలీలో వందలాది మంది పాల్గొన్నారు. 2018లో బీజేపీ, శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేస్తూ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ, మరాఠాలు వెనకబాటుతనంలో లేరని పలువురు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడంతో విచారించిన కోర్టు మరాఠాలకు రిజర్వేషన్ రద్దు చేసింది. మే 5న రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో రగడ మొదలైంది. కాగా, ఇప్పటివరకు జరిగిన ఎలాంటి నియామకాలకైనా ఈ ఉత్తర్వులు అడ్డుకోలేవని తెలిపింది. దీంతో కోటాను రద్దు చేయడానికి ముందే ఎంపీఎస్సీ పరీక్షలకు హాజరైన 2,200 మంది మరాఠా అభ్యర్థులను ఆర్థికంగా బలహీనమైన విభాగంలో లేదా ఓపెన్ కేటగిరీలో చేర్చాలని ప్రభుత్వం రాష్ట్ర ప్రజా సేవా కమిషన్‌ను కోరింది. కాగా, గతంలోనే ప్రస్తుతం అమలులో ఉన్న 50 శాతం రిజర్వేషన్ పరిమితి (లిమిట్)ను ఎత్తివేయాలని ప్రధానితో డిమాండ్ చేసినట్లు ఉద్ధవ్ పేర్కొన్నారు. ఇక్కడ చదవండి: మావోయిస్టులకు చెందిన రూ.5కోట్లు స్వాధీనం Devendra Fadnavis: మీ భార్యలు కొట్టినా మోదీ బాధ్యతేనా? -
నేడు రాష్ట్ర బంద్
సాక్షి, బెంగళూరు: మరాఠ ప్రాధికార ఏర్పాటును వ్యతిరేకిస్తూ కన్నడ ఒక్కూట నేడు (శనివారం) రాష్ట్ర బంద్‌కు సర్వం సిద్ధం చేసుకుంది. బంద్‌కు ట్యాక్సీ, ఆటో, ఓలా, ఉబర్ సంఘాలు మద్దతు పలకడంతో రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశం ఉంది. ఫుట్‌పాత్ వ్యాపారులు, ఏపీఎంసీ వ్యాపారులు నైతిక మద్దతు ఇస్తున్నారు. బార్, మాల్స్ యాజమాన్యాల సంఘం కూడా కన్నడ సంఘాల పోరాటానికి మద్దతు ఇచ్చింది. బంగారు నగల దుకాణాల యజమానులు బంద్‌కు నైతిక మద్దతును ప్రకటించింది. చిక్కమగళూరు, ధార్వాడ, విజయపుర, బళ్లారి, కొప్పళ, మైసూరు, కోలారు, చిక్కబళ్లాపురతో పాటు వివిధ జిల్లాల్లో కన్నడ సంఘాలు ధర్నా, ర్యాలీలకు సమాయత్తమయ్యాయి. బస్సులను అడ్డుకోవడంతోపాటు రైల్‌రోకో చేపట్టాలని కర్ణాటక రక్షణా వేదిక నిర్ణయించింది. బస్సులు తిరుగుతాయి కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులు యధా ప్రకారం తిరుగుతాయని రవాణా శాఖ తెలియజేసింది. బంద్‌కు అనుమతి కోరలేదు శివాజీనగర: శనివారం కర్ణాటక బంద్‌కు ఎవరూ అనుమతి కోరలేదని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్‌పంత్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. తాము కూడా కర్ణాటక బంద్‌కు అనుమతిని ఇవ్వలేదన్నారు. శనివారం బెంగళూరులో ఎలాంటి ర్యాలీలకు అవకాశం కల్పించేది లేదన్నారు. బంద్‌పై భయపడాల్సిన అవసరం లేదన్నారు. శాంతిభద్రతలకు అంతరాయం కలిగించినవారిపై చర్యలు తీసుకొంటామన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా వహించామని తెలియజేశారు. చదవండి: (న్యూ ఇయర్ జోష్‌కు బ్రేక్) బెదరం, భయపడం శివాజీనగర: మరాఠ అభివృద్ధి ప్రాధికారను వ్యతిరేకిస్తూ చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త బంద్‌ను భగ్నం చేయడానికి యత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కన్నడ చళవళి పక్ష అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్, డాక్టర్ రాజ్‌కుమార్ అభిమానుల సంఘం అధ్యక్షుడు సా.రా.గోవిందు హెచ్చరించారు. శుక్రవారం మైసూరు బ్యాంక్ సర్కిల్లో పొర్లు దండాలు పెట్టిన కన్నడ ఒక్కూట నాయకులు శనివారం బంద్‌కు మద్దతునివ్వాలని విన్నవించారు. 15వేల మంది పోలీసులతో భద్రత రాష్ట్ర బంద్ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ అప్రమత్తమైంది. దాదాపు 15 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. 33 కేఎస్ఆర్పీ, 32 సీఏఆర్ బెటాలియన్లను బందోబస్తుకు నియమించారు. దుకాణాలు మూయిస్తే చర్యలు దొడ్డబళ్లాపురం: శనివారం రాష్ట్ర బంద్ సందర్భంగా బలవంతంగా దుకాణాలు మూయిస్తే ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీవైఎస్పీ రంగప్ప హెచ్చరించారు. బలవంతంగా దుకా ణాలు, ఫ్యాక్టరీలు,కార్యాలయాలు, హోటళ్లు మూయిస్తే అది చట్టవిరుద్ధమవుతుందన్నారు.శాంతియుతంగా బంద్ ఆచరించాలన్నారు. మద్దతు ఇవ్వొద్దు: సీఎం శివాజీనగర : రాష్ట్ర బంద్‌కు ప్రజలు మద్దతు ఇవ్వరాదని ముఖ్యమంత్రి బీ.ఎస్.యడియూరప్ప విన్నవించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ బలవంతంగా బంద్ చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. కన్నడ అభివృద్ధికి మరిన్ని సలహాలు ఇస్తే అమలుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బంద్ విరమించుకోవాలని తాను ప్రజా పోరాట నాయకుడు వాటాళ్ నాగరాజుకు విన్నవిస్తున్నట్లు చెప్పారు. -
మరాఠా కోటా బిల్లుకు మహా అసెంబ్లీ ఆమోదం
సాక్షి, ముంబై : ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా రంగంలో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్ కల్పించే మరాఠా కోటా బిల్లును గురువారం మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మరాఠాలకు రిజర్వేషన్ బిల్లును ఆమోదం కోసం ఎగువ సభకు పంపారు. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందిన అనంతరం బిల్లు ఆమోదానికి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ధన్యవాదాలు తెలిపారు. మరాఠా కోటా అంశానికి సంబంధించి బీసీ కమిషన్ సిఫార్సులపై తీసుకున్న చర్యలను వివరిస్తూ రెండు పేజీల నివేదికను సైతం రాష్ట్ర ప్రభుత్వం సభ ముందుంచింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మరాఠాలు కొద్దినెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇక ధంగర్ వర్గీయులకు రిజర్వేషన్ల కోటాపై సబ్ కమిటీని నియమించామని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు. -
రగులుతున్న మరాఠాల ఎద
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ ముంబై నగరానికి మూడున్నర లక్షల మందితో మహా ర్యాలీని మరాఠాలు నిర్వహించి ఏడాది గడిచింది. 2019, ఆగస్టు 9వ తేదీన మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి ప్రారంభమైన 58 మౌన, అహింసా ర్యాలీలు ముంబై నగరంలో మిళితమై అది మెఘా ర్యాలీగా మారింది. నాడు ఒక్క రిజర్వేషన్ల అంశంపైనే కాకుండా రైతులకు పలు రాయితీలు కల్పించాలని, 2016లో 15 ఏళ్ల మరాఠా బాలికపై జరిగిన మూకుమ్మడి అత్యాచార ఘటనలో సత్వర న్యాయం జరగాలని నాడు మరాఠాలు డిమాండ్ చేశారు. అత్యాచారం కేసును విచారించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 2017, నవంబర్‌లో ముగ్గురు దోషులకు మరణ శిక్ష విధించింది. లక్షలాది మంది మరాఠాలు రోడ్డెక్కడానికి ప్రధాన కారణం ఈ రేప్ సంఘటన. ఈ సంఘటనలో దోషులు దళితులవడం వల్ల రిజర్వేషన్లతో వారు విర్రవీగుతున్నారన్న ఆక్రోశంతో మరాఠాలు కూడా రిజర్వేషన్ల కోసం పోరుబాట పట్టారు. అదే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వివిధ పంటలకు కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల రుణాల మాఫీకి చర్యలు చేపట్టింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని సుప్రీం కోర్టు నిర్దేశించిన నేపథ్యంలో అప్పటికే రాష్ట్రంలో రిజర్వేషన్లు యాభై శాతం దాటడంలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. అయినప్పటికీ రిజర్వేషన్ల అంశం పరిష్కారానికి న్యాయపరంగా ఉన్న అన్ని మార్గాలను అన్వేషించి సత్వర చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంతో మరాఠాలు తమ పోరాటానికి విరామం కల్పించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశం ముంబై హైకోర్టుకు వెళ్లింది. సుప్రీం కోర్డు మార్గదర్శకాల మేరకు హైకోర్టు కూడా రిజర్వేషన్ల విషయమై ఏం చేయక పోవచ్చు. అయినప్పటికీ కోర్టు తీర్పు కోసం నిరీక్షిద్దామని, నవంబర్ నెల వరకు నిరీక్షించాల్సిందిగా మరాఠాలకు ఫడ్నవీస్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎందుకోగానీ గత జూలై నెలలో మరాఠాలు రిజర్వేషన్లంటూ రెండో పర్యాయం రోడ్డుమీదకు వచ్చారు. గతంలోలాగా కాకుండా వారు ఈసారి విధ్వంసకాండకు పాల్పడ్డారు. ఇప్పుడు కూడా పాల్పడుతున్నారు. తాజాపోరులో భాగంగా 500 మంది మరాఠాలు గురువారం నాడు ముంబైలోని బంద్రా–కుర్లా కాంప్లెక్స్‌లోని సబర్బన్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయింపు ప్రారంభించారు. విషయం కోర్టులో ఉన్నప్పుడు మీరు ఆందోళన చేసి ఏం లాభం అంటూ మీడియా కొందరిని ప్రశ్నించగా, తామేమి 50 శాతం మించి రిజర్వేషన్లు ఇమ్మని డిమాండ్ చేయడం లేమని, 50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఇమ్మని కోరుతున్నామని వారు అన్నారు. కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు తగ్గిస్తే తమకు రిజర్వేషన్లు కల్పించవచ్చని వారు సూచిస్తున్నారు. మీడియా మాట్లాడించిన వారిలో 57 దత్తాత్రేయ్ థామ్‌కర్ ఒకరు. తన ఇద్దరి కూతుళ్లు ఇంజనీరింగ్ చదవుతున్నారని, వారి చదవుల కోసం రెండేళ్ల క్రితం 9 లక్షల రూపాయలు అప్పుచేశానని చెప్పారు. వారి పెళ్లికి అయ్యే ఖర్చు గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుందని అన్నారు. ఆ అప్పును ఎలా తీర్చాలో కూడా ప్రస్తుతానికి తనకు తెలియదని అన్నారు. చదువు పూర్తయినా ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదని అన్నారు. ఇదివరకు జౌళి మిల్లులో పనిచేసిన థామ్‌కర్ అది మూత పడడంతో రోజు కూలీగా మారారు. మరాఠాల సంప్రదాయం ప్రకారం మరాఠా మహిళలు భైఠాయింపునకు ముందు వరుసలో ప్రత్యేకంగా కూర్చున్నారు. వారిలో 45 ఏళ్ల ప్రేర్నా రాణె మీడియాతో మాట్లాడుతూ ‘నా పిల్లల చదువు పూర్తయింది. వచ్చేతరం పిల్లల రిజర్వేషన్ల కోసం పోరాటంలో పాల్గొంటున్నాను. మా సమాన హక్కుల కోసం మేం పోరాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ రోజు కాకున్నా రేపైనా ప్రభుత్వం దిగొచ్చి తమకు న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకుందని అక్కడ బైఠాయించిన మరాఠాలందరూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. చదవండి: మరాఠాలకు రిజర్వేషన్లు ఎందుకు ? -
మహారాష్ట్రలో మరోసారి మరాఠాల ఆందోళన
-
ముంబైలో మరాఠాలు, దళితుల మధ్య ఘర్షణలు
-
మరాఠా నేలపై ఆరని బావుటా
కొత్త కోణం ‘మీరు సిపాయి అయినా, సైనికాధికారి అయినా గ్రామస్తులకూ, రైతులకూ భారం కాకూడదు. గడ్డిపోచ కూడా వారి నుంచి గుంజుకోకూడదు. మీ అవస రాలకు రాజ భాండాగారం నుంచి నిధులు పంపిస్తున్నాం. ఎటువంటి అవస రాలున్నా ఆ డబ్బునే వాడండి. ఆహారంతోపాటు కూరగాయలు, వంట సామగ్రి, వంటచెరకు, చివరకు పశుగ్రాసం కూడా డబ్బులు చెల్లించే తీసు కోవాలి. బలవంతంగా లాక్కోగూడదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే రైతాంగం మనల్నందర్నీ దూషిస్తుంది. అర్థం చేసుకోండి. రైతాంగం, సామాన్య ప్రజలెవ్వరూ కూడా మన వల్ల ఇబ్బందులు పడకూడదు’. మే 19, 1673న భవానీశంకర్ అనే సైనికాధికారికి ఛత్రపతి శివాజీ మహరాజ్ రాసిన లేఖలోని అంశాలివి. శివాజీ... ఈ పేరు వినగానే పౌరుషాగ్ని గుర్తుకొచ్చి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వీర శివాజీ అనే నినాదం మన చెవుల్లో మార్మోగుతున్నట్టుంటుంది. ఆయన సాహసం, వీరత్వం, ధీరత్వం, సమయ స్ఫూర్తి, యుద్ధతంత్రం పుస్తకాల నిండా మనకు కనిపించేవే. ఆయన గెరిల్లా యుద్ధ తంత్రం చరిత్రలో మరపురాని ఘట్టం. వక్రీకరించిన చరిత్ర కానీ, ఆయన పాలనాదక్షత, ప్రజల పట్ల ఆయన చూపిన ప్రేమ, ఆర్థికా భివృద్ధికి వేసిన మార్గం, సామాజిక రంగంలో అందించిన సమాన గౌరవం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఆయనను ఒక మతానికి వ్యతిరేకిగా, మరొక మతానికి రక్షకుడిగా పరిమితం చేసే అసత్యాలు ఎక్కువగా ప్రచార మయ్యాయి. వీర శివాజీ ధీరత్వాన్ని వెన్నంటి ఉన్న మరో పార్శ్వం, భారత ప్రజల మనోఫలకం మీద పడిన బలవంతపు ముద్ర–హిందూత్వం. అది ఎంతమాత్రం నిజం కాదని చరిత్రకారులు రుజువు చేశారు. ఆయన పాలన లోని ఎన్నో విషయాలు నేటికీ అనుసరణీయమనిపిస్తుంది. పైన పేర్కొన్న లేఖ అందులో భాగమే. ఫిబ్రవరి 19, 1630న పుణేకు సమీపంలోని శివనేరు దుర్గంలో శివాజీ జన్మించాడు. తల్లిదండ్రులు జిజియాబాయి, షాహాజ్రాజ్ బోంస్లే. దాదాజీ కొండదేవ్ ద్వారా శివాజీ అన్ని విధాలా శిక్షణను పొందాడు. ఒక జాగీరుగా పుణేను శివాజీకి తండ్రి అప్పగించారు. చిన్నప్పటి నుంచే పేదలు నివసించే ప్రాంతాలను పరిశీలించడం శివాజీ జీవితంలో భాగమయింది. పాలకులైన సుల్తాన్‌లే కాకుండా, పటేళ్లు, దేశ్‌ముఖ్‌లు, జమీందార్లు, గ్రామీణ ప్రజలపై; ప్రత్యేకించి రైతులపై జరిపే దౌర్జన్యాలంటే శివాజీకి మొదటి నుంచి ఏవగింపే. ఆయన స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన తరువాత రైతుల పరిస్థి తులను మార్చడానికి కంకణబద్ధుడయ్యాడు. అందుకు పాలనాపరమైన మార్పులను తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో రాజుల పేరుతో సామంతులు, ఇతర పెత్తందార్లు సాగించే దోపిడీకి అంతులేదు. రాజుల ప్రభావం ప్రత్యక్షంగా ప్రజలమీద చాలా తక్కువ. ఏ రాజు వచ్చినా గ్రామాల పరిస్థితుల్లో మార్పు వచ్చేది కాదు. ఆనాడు గ్రామీణ వ్యవస్థ స్వయం పోషకంగా ఉండేది. కానీ గ్రామీణ పాలనా వ్యవస్థ దుర్మార్గంగా ఉండేది. ప్రతి గ్రామాన్ని పాటిల్, కులకర్ణితో కలసి పన్నెండు మంది వివిధ హోదాల్లో నడిపించేవారు. రైతుల నుంచి ఈ అధికార వ్యవస్థ అందినంత దండుకొని, రాజుకు కొంత కప్పం రూపంలో చెల్లించే వారు. రైతుల బాధలు చెప్పుకుందామన్నా వినేవాళ్లు లేరు. తీర్చే వారు అంత కన్నా లేరు. రాజులు రావచ్చు, పోవచ్చు. కానీ కులకర్ణిలు దేశ్‌ముఖ్‌లు అలాగే ఉండేవారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ ఈ దీన గాథలను మార్చాలని సంకల్పించారు. అప్పటిదాకా అడ్డూ అదుపూ లేకుండా విచ్చలవిడిగా రైతులను పీడనకు, హింసకు గురిచేసిన వాళ్లను కట్టడి చేశాడు. వారంతా రైతులకు సేవకులుగా ఉండాలనీ, నెత్తినెక్కి అధికారం చలాయించ కూడదనీ ఆదేశాలిచ్చాడు. భారతదేశంలో వేలయేళ్లుగా కొనసాగిన వ్యవ సాయ విధానాలను సమూలంగా మార్చి, రైత్వారీ విధానాన్ని శివాజీ ప్రవేశ పెట్టాడు. అప్పటి వరకు రైతుల మీద అడ్డూ అదుపూ లేని పన్నుల విధానాన్ని రద్దు చేసి, పంటలోని ఐదు భాగాల్లో రెండవ వంతు ప్రభుత్వానికి ఇస్తే సరిపోతుందని ప్రకటించాడు. అంతకు ముందు ఇది మూడు వంతులుండేది. ఒక్కొక్క చోట ఎంతివ్వాలన్న లెక్క సైతం ఉండేది కాదు. నిర్ణయం చేయడమే కాదు, రైత్వారీ విధానాన్ని పటిష్టంగా అమలు చేసిన ఘనత శివాజీకే దక్కు తుంది. ఇది రైతుల్లో విశ్వాసాన్ని పెంచింది. జమీందార్ల కోరలు తీసేసింది. పన్నులను క్రమపద్ధతిలో వసూలు చేయడం తప్ప దౌర్జన్యాలు చేసే వీలు లేని వ్యవస్థను శివాజీ నెలకొల్పారు. ప్రజలమీద దౌర్జన్యాలు జరిగితే తనకు వెంటనే తెలిసే విధంగా గూఢచార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు శివాజీ. ఆయన రైతు బాంధవుడు దీంతో పాటు పడావుగా ఉన్న భూములను సాగులోనికి తీసుకొచ్చే ప్రయత్నం మహత్తరమైనది. ఎవరైనా కొత్తగా వ్యవసాయం చేయాలను కుంటే వారికి ఎడ్లతోపాటు వ్యవసాయ పనిముట్లను ఉచితంగా అందించే వారు. వాటితో పాటు విత్తనాలు ఇతర అవసరాలకు నగదు అప్పుగా ఇచ్చి ఆదుకునేవారు. నాలుగు సంవత్సరాల తరువాతే బాకీ తీర్చే ప్రక్రియ మొదల య్యేది. వందలాది ఎకరాలను ఇనాంగా ఇచ్చే సంప్రదాయాన్ని శివాజీ రద్దు చేశాడు. కరువు పరిస్థితులు ఏర్పడితే పన్నులు ఉండేవి కావు. అంతేకాకుండా కరువు సహాయక చర్యలను చేపట్టేవారు. భూములను సర్వే చేయించి హద్దు లను నిర్ణయించడంతో పాటు నిర్ణీత స్థాయిలోనే భూములు కలిగి ఉండే విధా నానికి అంకురార్పణ చేశారు. గ్రామంలో జరిగే నేరాలను గతంలో లాగా పెత్తందార్లు విచారించే పద్ధతికి స్వస్తి పలికి ప్రత్యేక న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కొత్తగా గ్రామాలను నిర్మించడంతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి వలస రావడానికి ఇష్టపడితే వారికి వ్యవసాయ భూమి ఇచ్చి ప్రోత్సహించేవారు. ఈ విధానాల వల్ల శివాజీ పాలనలో వ్యవసాయా భివృద్ధి ఎంతో వేగంగా జరిగింది. రెగ్యులర్‌గా ఉండే సైనికులతో పాటు రైతులు కూడా ఆరు నెలలు సైన్యంలో పనిచేసేవారు. గతంలో లాగా దోపిడీలలో వచ్చిన సొమ్మును సైని కులకు పంచడం కాకుండా వేతనాలు ఇవ్వడం ద్వారా శివాజీ తన సైనిక బలగాన్ని బాధ్యాతయుతమైన మార్గంలో నిర్మించాడు. ఇటు గ్రామాలనూ, అటు రాజ్యాన్నీ కాపాడుకునే తత్వం రైతుల్లో కల్పించాడు. అందువల్లనే సాధారణ సైన్యం చేసే తప్పులు జరిగేవి కావు. యుద్ధాల సమయంలో గ్రామాల మీద పడి మహిళలపై అత్యాచారాలు జరపడం కూడా నిషిద్ధం. అంతకు ముందు గ్రామాల్లో మహిళలకు రక్షణ లేదు. పెత్తందార్లు తలు చుకుంటే ఏ మహిళనైనా లొంగదీసుకునేవారు. శివాజీ అటువంటి పెత్తం దార్లను శిక్షించినట్టు ఆధారాలున్నాయి. రాంజా గ్రామం పాటిల్ కథ చాలా పుస్తకాల్లో ప్రచురితమైంది. ఆ గ్రామాధికారి పాటిల్ పట్టపగలు ఒక పేదరైతు కూతురిని ఎత్తుకుపోయి అత్యాచారం జరిపాడు. అవమాన భారంతో ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఊరు ఊరంతా కన్నీటి సంద్రమౌ తుంది. ఈ విషయం శివాజీకి తెలిసిన వెంటనే సైనికులను పంపి, పాటిల్‌ను అదుపులోనికి తీసుకున్నాడు. ఆ అధికారి కాళ్లూ చేతులూ నరికి వేయాలని ఆజ్ఞ జారీ చేశాడు. వెంటనే శిక్ష అమలైంది. సైన్యాధిపతులు తప్పు చేసినా కూడా శివాజీ వదిలి పెట్టలేదు. 1678లో సైన్యాధిపతి శకూజీ గైక్వాడ్ నాయకత్వంలో చేలావది దుర్గం మీద దండెత్తి ఆక్రమించుకున్నారు. అప్పటి వరకు ఆ దుర్గం అధిపతిగా ఉన్న సావిత్రీబాయి దేశాయ్ చాలా రోజులు యుద్ధం చేసి ఓడిపోయింది. విజయ గర్వంతో శకూజీ గైక్వాడ్ సావిత్రీ బాయి దేశాయ్‌పై అత్యాచారం జరిపాడు. ఇది తెలిసిన శివాజీ సైన్యాధ్యక్షుడని కూడా చూడకుండా గైక్వాడ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు. ఈ రెండు సంఘటనలు మహిళల రక్షణకు శివాజీ ఎంచుకున్న మార్గాన్ని వెల్లడిస్తాయి. ఈ సంఘటనలు నాటి సమాజాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. దేశవాళీ కుటీర పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి చెందడానికి శివాజీ ఎన్నో మార్పులు ప్రవేశపెట్టాడు. అందులో ఆక్ట్రాయ్ తరహా పన్ను ఒకటి. 1671 డిసెంబర్ 6న కుదాల్ సర్ సుబేదార్ నరహరి ఆనందరావుకు శివాజీ ఒక లేఖ రాస్తూ ‘బయటి నుంచి వచ్చే వస్తువుల మీద పన్ను భారీగా ఉండాలి, లేనట్లయితే బయటి వాళ్లు స్థానిక వ్యాపారాన్ని గంపగుత్తగా తన్ను కుపోతారు.’ అని సూచించాడు. ఈ నిర్ణయం శివాజీ పాలనలో స్థానిక వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడింది. అప్పటికి కొనసాగు తున్న బానిస వ్యాపారానికి కూడా స్వస్తి పలికాడు. డచ్ నుంచి వచ్చే వ్యాపా రులు ఇక్కడి నుంచి పురుషులను, స్త్రీలను కొనుగోలు చేసి తీసుకుపోయే వ్యవస్థను శివాజీ రద్దు చేశాడు. మహమ్మదీయులకు ఉన్నత స్థానాలు శివాజీనీ హిందూ రాజుగా చిత్రించడమే కాకుండా, ముస్లిం వ్యతిరేకిగా చూపే ప్రయత్నం జరిగింది. జరుగుతున్నది. నిజానికి అదే హిందూ వ్యవస్థ మొదట శివాజీని అవమానపరిచింది. ఆయనకు పట్టాభిషేకం చేయడానికి కూడా స్థానిక పూజారి వర్గం నిరాకరించింది. అప్పుడు కాశీ నుంచి గాగాభట్టు అనే పూజారిని రప్పించి పట్టాభిషేకం జరిపించారు. శివాజీ సైన్యంలో ఎంతో మంది ముస్లిం సైన్యాధికారులున్నట్టు వాస్తవాలు చెపుతున్నాయి. ఇందులో 13 మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఇబ్రహీంఖాన్ అనే ముస్లింని శివాజీ తన ఆయుధాగారానికి అధిపతిగా నియమించుకున్నాడు. దౌలత్ ఖాన్‌కు నౌకాదళాధిపతి లాంటి కీలక బాధ్యతనప్పగించాడు. అందువల్ల శివాజీకి ముస్లిం వ్యతిరేకత అంటగట్టడం సరికాదు. శివాజీ హిందూ మతాన్ని విశ్వసించిన మాటనిజమే. కానీ మిగతా మతాలను ద్వేషించలేదు. ఆ«ధునిక సామాజిక న్యాయ పోరాటానికి పునాదులు వేసిన ఫూలే లాంటి వాళ్లు శివాజీని ‘కుల్వాడి భూషణ్’ అని పొగిడారు. అంటే కర్షక మకుటం అని అర్థం. శివాజీ వారసత్వం ఈ దేశ సామాజిక విప్లవాలకు ఊతమిచ్చింది. ఆయన ముని మనమడు ఛత్రపతి సాహు మహరాజ్ 1902లో మొదటి సారిగా భారతదేశంలో రిజర్వేషన్లు ప్రారంభించి శివాజీ మార్గాన్ని కొనసాగిం చడం మనం అందరం గుర్తుచేసుకోవాలి. (ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ జయంతి) - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 97055 66213 -
రిజర్వేషన్ల ఫైలుకు త్వరలోనే మోక్షం
సాక్షి, ముంబై: మరాఠా, ముస్లిం వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు త్వరలోనే అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రూపొందించిన ఫైలు ప్రస్తుతం గవర్నర్ కె.శంకర నారాయణన్ వద్ద ఉంది.ఆయన ఎప్పుడైనా సంతకం చేసే అవకాశాలున్నాయి. వెనువెంటనే రిజర్వేషన్లు అమలు చేస్తారని అధికారవర్గాలు బుధవారం తెలిపాయి. రాష్ట్రంలో మరాఠాలకు 16 శాతం, ముస్లిమ్‌లకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఇటీవలే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఆమోదముద్ర కోసం గవర్నర్ వద్దకు పంపించారు. మరాఠాల ప్రజలను విద్య, సామాజిక వెనుకబాటుతనం తదితర అంశాలవారీగా విభజించి రిజర్వేషన్లు కల్పించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వెనకబడిన వర్గాల కమిషన్ సిఫార్సుల ప్రకారం రిజర్వేషన్లు కల్పించేందుకు పృథ్వీరాజ్ చవాన్ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో సిఫార్సుల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం 32 శాతం రిజర్వేషన్లు పొందుతున్న కులాల్లో మరాఠాలు ఉన్నారు. వీరిని వేరు చేసిన ఇక నుంచి 16 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రిజర్వేషన్లు ఉద్యోగ అవకాశాలకే వర్తిస్తాయని, ఎన్నికల్లో సీట్ల కేటాయింపునకు వర్తించకపోవచ్చని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే రిజర్వేషన్ల అమలు కోసం ప్రత్యేకంగా ఆర్డినెన్సు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు బుధవారం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ డేరియస్ కంబాటా న్యాయమూర్తి అభయ్ ఓకా నేతృత్వంలోని బెంచ్‌కు పైవిషయం తెలిపారు. ఈ కేసుపై తుదుపరి విచారణ ఆగస్టు ఐదుకు వాయిదా పడింది.