భిన్న భాషలు, విభిన్న సంస్కృతుల మేళవింపు భారత దేశం. అయితే 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్న ఇండియా 1947లో స్వాతంత్ర్యాన్ని సాధించింది. అప్పటినుంచి మన దేశంలో ఇంగ్లీషు భాష ప్రభావం, ఆంగ్లం మాట్లాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.
భారతీయుల ఇంగ్లీషుపై హింగ్లీష్,టింగ్లీషులాంటి సెటైర్లు ఉన్నప్పటికీ, 2021 నాటి లెక్కల ప్రకారం అమెరికా తరువాత అత్యధిక సంఖ్యలో ఇంగ్లీష్ మాట్లాడే వారిలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. దాదాపు 10శాతం మంది భారతీయులు ఇంగ్లీషులో మాట్లాడతారు. రెండు లేదా మూడో భాషగా ఇంగ్లీషు మాట్లాడేవారు కూడా ఎక్కువే ఉన్నారు. గ్రామీణులతో పోలిస్తే పట్టణ, విద్యావంతులు, సంపన్నులు ఎక్కువగా ఇంగ్లీషు భాష మాట్లాడతారు.
అయితే తాజాగా చక్కటి ఇంగ్లీషు భాష ఏ భాష ప్రజలు మాట్లాడతారు అనే అంశానికి సంబంధించి ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం కన్నడిగులు మంచి ఇంగ్లీషు మాట్లాడతారట. మాతృభాష కన్నడగా ఉన్న ప్రజల యావరేజ్ ఇంగ్లీషు స్పీకింగ్ టెస్ట్ స్కోరు 74 శాతంగా నిలిచింది.
వావ్.. ఆసక్తికరమైన పరిశోధన.. ఇంగ్లీషు నేర్చుకోవాలంటే కన్నడ నేర్చుకోవాలన్నమాట, లేదంటే కన్నడ ఫ్రెండ్ అయినా ఉండాలి అంటూ చాలామంది హర్షం వ్యక్తం చేశారు. ఇంగ్లీషు మాత్రమే కాదు బహుశా కన్నడ మాట్లాడేవారు ఇతర భాషలను కూడా తేలికగా నేర్చుకుంటారు. నా దృష్టిలో కన్నడ ఇటాలియిన్ ఆఫ్ ది ఈస్ట్. అంతేకాదు కన్నడిగులు దేశంలోని ఇతర రాష్ట్ర భాషలను సులభంగా నేర్చుకుంటారు అంటూ ఒకరు కమెంట్ చేయడం విశేషం.
Guess who speaks the best English in India by mother tongue? 😊👏 pic.twitter.com/MfSlNAiGjR
— Aparajite | ಅಪರಾಜಿತೆ (@amshilparaghu) March 11, 2024
మిగిలిన భాషల ర్యాంకులు
పంజాబీ - 63 శాతం
గుజరాతీ - 65 శాతం
బెంగాల్ - 68 శాతం
హిందీ,మళయాళం, తెలుగు - 70శాతం
తమిళం - 71 శాతం
మరాఠా- 73శాతం
Comments
Please login to add a commentAdd a comment