english
-
ఇంగ్లిష్‌లో యశ్ ‘టాక్సిక్’
‘కేజీఎఫ్: చాప్టర్ 1, కేజీఎఫ్: చాప్టర్ 2’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో యశ్(yash). ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్(toxic): ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకుడు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్ మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని కన్నడతో పాటు గ్లోబల్ ఆడియన్స్ కోసం ఇంగ్లిష్‌లోనూ చిత్రీకరిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ– ‘‘విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యంలో రాబోతున్న ‘టాక్సిక్’ మూవీని అన్ని భాషల, ప్రాంతాల ప్రేక్షకులు ఆస్వాదించేలా రూపొందిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇంగ్లిష్‌లో చిత్రీకరిస్తున్న మొదటి భారతీయ చిత్రంగా ‘టాక్సిక్’ రికార్డుల్లోకి ఎక్కింది. మా సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లోకి డబ్ అవుతుంది’’ అని వెంకట్ కె.నారాయణ తెలిపారు. -
ఆంగ్ల భాషా నైపుణ్యం తప్పనిసరి!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన యువతకు ఆంగ్లంలో సరైన నైపుణ్యం లేకపోవడం వారి పోటీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని నీతి ఆయోగ్ వెల్లడించింది. యువతలో భాషా నైపుణ్యాలు పెంపొందించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసింది. విద్యార్థులు ఆంగ్లం, ఇతర విదేశీ భాషలపై పట్టుసాధించేలా అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఈ మేరకు ఇటీవల ‘రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్య విస్తరణ’పేరిట విడుదల చేసిన నివేదికలో ఆంగ్ల భాష అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘అనేక రాష్ట్రాల్లో, స్థానిక పరిశ్రమలలో పనిచేసే నైపుణ్యం గల వ్యక్తులు, ఇతర మానవ వనరులు ప్రధానంగా రాష్ట్రం బయటి నుంచే వస్తున్నారు. ఈ ధోరణికి ముఖ్య కారణం స్థానిక యువతకు ఆంగ్ల భాషలో నైపుణ్యం తగినంతగా లేకపోవడమే. సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉంది. విద్యార్థుల ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, తద్వారా వారు రాష్ట్రంలోనే ఉంటూ జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి తీసుకెళ్లడం అత్యవసరం’అని తన నివేదికలో పేర్కొంది. ముందున్న రెండు రాష్ట్రాలు ఆంగ్ల భాష అవసరాన్ని గుర్తించడంలో పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు ముందున్నాయని నివేదికలో పేర్కొంది. పంజాబ్ ప్రభుత్వం 2023లో బ్రిటిష్ కౌన్సిల్ సహకారంతో ఈ దిశగా ప్రయత్నాలను ప్రారంభించిందని తెలిపింది. ఆరు నెలల పాటు ఇంటెన్సివ్ 18–సెషన్ల కోర్సును నిర్వహించడం ద్వారా ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టిందని వివరించింది. దాదాపు 5వేల మంది ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఈ పైలట్ ప్రాజెక్ట్‌తో లాభం కలిగిందని వెల్లడించింది. విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో అభివృధ్ధి చెందేందుకు విద్యార్థులకు అవసరమైన భాషా సామర్థ్యాలను పెంపొందించడంలో పంజాబ్ చొరను నీతిఆయోగ్ ప్రశంసించింది. అదేవిధంగా, కర్ణాటక ప్రభుత్వం 2024లో ప్రారంభించిన కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం, భాషా నైపుణ్యాలను పెంచడం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేసింది. మైక్రోసాఫ్ట్ ఇండియాతో భాగస్వామ్యంతో ‘ఇంగ్లిష్ స్కిల్స్ ఫర్ యూత్’కార్యక్రమం ద్వారా 16 ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో 5,795 మంది విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాభివృధ్ధికి తోడ్పాటునందిస్తోంది. ‘స్కాలర్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ టాలెంట్’కార్యక్రమం ద్వారా ఆరు విశ్వవిద్యాలయాల నుంచి అర్హులైన విద్యార్థులకు లండన్‌లోని విశ్వవిద్యాలయాలకు రెండు వారాల పాటు పంపి, వారితో అభ్యసించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆంగ్ల విద్యను ప్రోత్సహించిందని నీతిఆయోగ్ ప్రశంసించింది. -
సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలి: ఎస్డీ శిబులాల్
డి.ఎస్.పవన్‌కుమార్, సాక్షి ఎడ్యుకేషన్ డెస్క్: మారుతున్న పరిస్థితుల్లో ఏ రంగంలోనైనా కాలానుగుణంగా మార్పులు సహజమని, వీటిని ఎదుర్కొనేందుకు యువత సిద్ధంగా ఉండాలని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ మాజీ సీఈఓ ఎస్డీ శిబులాల్ చెప్పారు. అవసరమైనప్పుడల్లా కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు, కెరీర్లో ముందుకు సాగేందుకు కృషి చేయాలని అన్నారు. ఇన్ఫోసిస్ లాంటి అగ్రశ్రేణి సంస్థ కూడా తొలినాళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, పాతికేళ్లు సాధారణ ఐటీ సంస్థగానే ఉందని తెలిపారు. వ్యక్తులకైనా, సంస్థలకైనా సవాళ్లు సహజం అంటూ, వాటిని ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యాన్నిసొంతం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత సహనం, ప్రణాళికలతో అడుగులు వేయాలని చెప్పారు. శిబులాల్ కుటుంబం ఫిలాంత్రఫిక్ ఇనిషియేటివ్స్ పేరుతో ఓ ఎన్జీఓను నెలకొల్పింది. ‘విద్యాధన్’ పేరుతో.. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం హైదరాబాద్‌కు వచి్చన శిబులాల్‌తో.. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం వల్లే టాప్‌లోకి.. ఇన్ఫోసిస్ తొలినాళ్లలో ఎన్నో ఒడిదుడుకులకు గురైంది. ముఖ్యంగా క్లయింట్స్‌కు ఐటీ ఆవశ్యకతను వివరించడం, వారిని మెప్పించడం, వాటికి మా సంస్థ ద్వారా సేవలకు అంగీకరింపజేయడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. పాతికేళ్ల సంస్థ చరిత్రలో దాదాపు 20 ఏళ్లు సాదాసీదా కంపెనీగానే ఉంది. కానీ అన్ని సవాళ్లను ఎదుర్కోగలిగే సమర్థవంతమైన బృందంగా పని చేయడం వల్ల ఇప్పుడు టాప్ కంపెనీగా గుర్తింపు పొందుతోంది ఇప్పుడు మనం చూస్తున్న ఇన్ఫోసిస్ ప్రస్థానాన్ని ఇన్ఫోసిస్ 2.0గా చెప్పొచ్చు. మార్పులు ఆహ్వానించాలి – ఒకే సంస్థలో ఉన్నా హోదా మారే కొద్దీ విధుల్లో మార్పులు, కొత్త సవాళ్లు, కొత్త అంశాలను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత సహజం. దీన్ని నేటి యువత గుర్తించాలి. – ఇన్ఫోసిస్‌లో మూడేళ్లకోసారి నా హోదా మారేది. అలా మారినప్పుడల్లా ఆ హోదాకు తగినట్లుగా విధులు నిర్వర్తించేందుకు వీలుగా కొత్త అంశాలు నేర్చుకున్నా. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. నాట్ ఫర్ ఎవ్రిబడీ – ప్రస్తుతం దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్కృతి పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే నా ఉద్దేశంలో ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రిబడీ’. ఈ మాట ఎందుకు అంటున్నానంటే.. – సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలంటే అత్యంత కీలకమైన లక్షణం సహనం. నేటి యువతలో అది లోపిస్తోంది. – చాలామంది ఇన్స్టంట్ ఫలితాలు ఆశిస్తున్నారు. అందుకే పలు వెంచర్స్.. ఫెయిల్యూర్ వెంచర్స్‌గా మారుతున్నాయి. – మా రోజుల్లో ఫండింగ్ సంస్థలు లేవు. కానీ ఇప్పుడు పదుల సంఖ్యలో ఏంజెల్ ఇన్వెస్టర్స్.. మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్‌ను అందించే స్టార్టప్స్‌కు ఫండింగ్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. కానీ స్టార్టప్ ఔత్సాహికుల్లో సహనం ఉండట్లేదు. సరైన ప్రణాళిక ఉండట్లేదు. ఏఐతో కొత్త ఉద్యోగాలు: – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలు పోతాయనే ఆందోళన ఏ మాత్రం సరికాదు. ఈ సాంకేతిక నైపుణ్యాన్ని పొందితే లక్షల ఉద్యోగాలు లభిస్తాయని గుర్తించాలి. – ఐటీలో నిరంతరం కొత్త టెక్నాలజీల ఆవిష్కరణ అనేది దశాబ్దాలుగా జరుగుతోంది. ఉదాహరణకు కంప్యూటర్స్నే పరిగణనలోకి తీసుకుంటే మొదట్లో కంప్యూటర్స్ అంటే కేవలం డేటా సేకరణకే వినియోగించారు. తర్వాత అవి.. డేటా క్రియేషన్, డేటా ఇంటర్వెన్షన్ ఇలా ఎన్నో విభాగాలకు విస్తరించింది. – ఐటీలో కూడా కంప్యూటర్ ఆపరేషన్స్‌తో మొదలై.. ఇప్పుడు కోడింగ్, ప్రోగ్రామింగ్‌లు ఎంత ముఖ్యంగా మారాయో మనం చూస్తున్నాం. 4‘సీ’స్ సూత్రాన్ని పాటించాలి – నేటి తరం యువత కెరీర్లో ముందుకు సాగేందుకు 4సీ సూత్రాన్ని (కరేజ్, కేపబిలిటీ, కెపాసిటీ, కమిట్మెంట్) అమలు చేసుకోవాలి. – మానసికంగా ఈ లక్షణాలు ఉంటే వృత్తి పరంగా ఎలాంటి నైపుణ్యాలనైనా ఇట్టే సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం లభిస్తుంది. – దేశంలో కెరీర్ పరంగా ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ 80 శాతం మంది ఎంప్లాయర్స్ జాబ్ రెడీ స్కిల్స్ ఉన్న యువత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ స్కిల్స్‌ను సొంతం చేసుకుంటే.. ఉద్యోగ రేటు వృద్ధి చెందుతుంది. గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లిష్‌పై పట్టు ముఖ్యం – ప్రస్తుత విద్యా వ్యవస్థలో బేసిక్ సైన్సెస్‌ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. పాఠశాల స్థాయి నుంచే దీన్ని ఆచరణలో పెట్టాలి. ఫలితంగా విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి పెరిగి, భవిష్యత్తులో పరిశోధనలు, ఆవిష్కరణలకు దారి తీస్తుంది. – నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లోని ఫ్లెక్సిబుల్ లెర్నింగ్, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, స్కిల్ ట్రైనింగ్ వంటి అంశాలు పరిశీలిస్తే.. ఈ విధానం మన యువతకు ఎంతో అవసరం అనేది అవగతం అవుతుంది. ఇంగ్లిష్ మీడియం అనేది గ్లోబల్ లాంగ్వేజ్. దానిపై పట్టు సాధించడం నేటి పరిస్థితుల్లో ఎంతో ముఖ్యం. సైన్స్ అంటే ఇష్టం.. కానీ కంప్యూటర్స్లోకొచ్చా.. వాస్తవానికి నాకు బేసిక్ సైన్స్ అంటే ఇష్టం. మా నాన్న మాత్రం నన్ను డాక్టర్ చేయాలనుకున్నారు. అయినా నా ఇష్టాన్ని కాదనలేదు. కేరళ యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ చేశా. వెంటనే అప్పటి బాంబే ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ విధులు మాత్రం కంప్యూటర్స్‌కు సంబంధించినవి. నా జీవితంలో నాకు ఏమైనా సవాళ్లు, సమస్యలు ఎదురయ్యాయి అంటే నా తొలి ఉద్యోగంలోనే. వాటిని తట్టుకోవాలనే సంకల్పంతో, కంప్యూటర్ సైన్స్ భవిష్యత్తు ఆవశ్యకతను గుర్తించి అందులో పీజీ చదవడానికి సిద్ధమయ్యా. బోస్టన్ యూనివర్సిటీలో ఎమ్మెస్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశా. పత్ని కంప్యూటర్స్‌లో సిస్టమ్స్ ఇంజనీర్‌గా అడుగు పెట్టా. అక్కడే నారాయణమూర్తితో పరిచయం ఏర్పడడం, ఇన్ఫోసిస్ స్థాపనలో పాలుపంచుకోవడం జరిగింది. ఇలా కెరీర్ అవసరాలకు అనుగుణంగా తమను తాము మలచుకోవడం నేటి యువతకు ఎంతో ముఖ్యం. అప్పుడే ఉన్నత స్థానాలు, కోరుకున్న హోదాలు లభిస్తాయి. సంపాదనలో కొంత సమాజ సేవకు కేరళలో పుట్టి పెరిగిన నాకు.. చిన్నప్పటి నుంచి చదువు విషయంలో, ఇతర విషయాల్లో ఎందరో తోడ్పాటు అందించారు. అదే స్ఫూర్తితో మా సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు, అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలకు కేటాయించాలని భావించాం. అందుకే 1998లో శిబులాల్ ఫ్యామిలీ ఫిలాంత్రఫిక్ ఇనిషియేటివ్స్ (ఎస్ఎఫ్పీఐ) పేరుతో ప్రత్యేక సంస్థను నెలకొల్పి విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. విద్యార్థులకు తోడ్పాటునందిస్తే.. వారితోపాటు, దేశం కూడా వృద్ధి చెందుతున్న ఆలోచనతో విద్యా రంగాన్ని ఎంచుకున్నాం. ప్రస్తుతం పది వేల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. డ్రాప్ అవుట్స్‌ను తగ్గించమే ప్రధాన లక్ష్యం 11, 12 తరగతుల స్థాయిలో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడమే మా లక్ష్యం. 1990లలో భారత గ్రామీణ ప్రాంతంలోని తల్లిదండ్రులు..పదో తరగతి పూర్తయ్యాక మగ పిల్లలను పనికి తీసుకెళ్లాలని, ఆడ పిల్లలైతే పెళ్లి చేయాలనే ధోరణితో ఉండేవారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఉండరనే ఉద్దేశంతోనే ఎస్ఎఫ్పీఐని ప్రారంభించాం. 11, 12 తరగతుల విద్యార్థులకు ప్రోత్సాహకం అందిస్తున్నాం. -
‘ఆంగ్లం’లో భారత్ స్థానం ఎంత? నాన్ ఇంగ్లీషులో టాప్ దేశమేది?
ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ ప్రధాన భాషగా మారింది. భారతదేశంలో కూడా హిందీతో పాటు ఇతర భాషలకన్నా ఇంగ్లీషుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఏ దేశాల్లో ఇంగ్లీషు అధికంగా మాట్లాడతారో తెలుసా? ఈ విషయంలో భారత్ ర్యాంక్ ఎంత?ఇప్పుడున్న రోజుల్లో ఆంగ్లం అన్నిరంగాల్లో ప్రధాన భాషగా ఉంది. ఇంగ్లీషు(English)వస్తే ప్రపంచంలోని ఏ దేశానికైనా వెళ్లవచ్చని, అక్కడివారితో మాట్లాడవచ్చని అంటారు. ఇంగ్లీష్ మాట్లాడే విషయంలో భారతదేశం ప్రపంచ సగటుకు మించి ఉంది. దేశంలోని ఢిల్లీ ఆంగ్ల భాషణలో ముందంజలో ఉంది. ఈ విషయాన్ని ఒక నివేదిక వెల్లడించింది.పియర్సన్ గ్లోబల్ ఇంగ్లిష్ ప్రొషిషియన్సీ(Pearson Global English Proficiency) నివేదిక ప్రకారం ఢిల్లీలోని ప్రజలకు ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యం ఉత్తమంగా ఉంది. రాజస్థాన్, పంజాబ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికంగా ఇంగ్లీష్ మాట్లాడేవారి విషయంలో ఢిల్లీకి 63 మార్కులు వచ్చాయి. ఆ తర్వాత రాజస్థాన్‌కు 60 పాయింట్లు, పంజాబ్‌కు 58 పాయింట్లు వచ్చాయి.బ్రిటన్‌లో గరిష్టంగా 98.3 శాతం మందికి ఇంగ్లీషు బాగా వచ్చు. అమెరికాలో 95 శాతం మందికి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలుసు. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుండి అందిన డేటా ప్రకారం బ్రిటన్‌లోని జిబ్రాల్టర్‌లో 100 శాతం మంది ప్రజలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడతారు. ఇక్కడి జనాభా 32,669 మాత్రమే.భారతదేశంలో 20 శాతం మంది ప్రజలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలరు. జనాభా పరంగా చూస్తే, భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వారి సంఖ్య ప్రపంచంలో టాప్ 5 దేశాలలో ఉంది. పియర్సన్స్ గ్లోబల్ ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారిలో రాజధాని ఢిల్లీ(Delhi) ముందంజలో ఉంది. కాగా చైనాలో ఇంగ్లీష్ మాట్లాడేవారి సంఖ్య చాలా తక్కువ. ఇక్కడ 0.9 శాతం మంది మాత్రమే ఇంగ్లీషులో మాట్లాడతారు. చైనీస్ ప్రజలు వారి మాతృభాషలోనే సంభాషిస్తారు. చైనాలో చైనీస్, మంగోలియన్, టిబెటన్, ఉయ్ఘర్, జువాంగ్ భాషల్లో మాట్లాడుతుంటారు.ఇది కూడా చదవండి: Winter Travel Ideas: శీతాకాలంలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు -
తెలుగు మాధ్యమంలో చెప్పేదెవరు?
సాక్షి, హైదరాబాద్: మాతృభాషకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంటోంది. ఇటీవల అన్ని రాష్ట్రాలకు దీనిపై సూచనలు చేసింది. సాంకేతిక విద్య సహా అన్ని ఉన్నత విద్య కోర్సులకు స్థానిక భాషల్లో పుస్తకాలు అందించే ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది. నూతన విద్యా విధానంలో భాగంగా ఈ మార్పులు చేస్తున్నట్టు చెబుతోంది. అయితే రాష్ట్రంలో తెలుగు మీడియం పరిస్థితిపై రెండు నెలల క్రితం రాష్ట్ర విద్యాశాఖ జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా స్కూల్ స్థాయిలో తెలుగు మీడియం పరిస్థితి అంతంత మాత్రంగానే తేలింది. తెలుగు మీడియంలో బోధించడం ఉపాధ్యాయులకు కూడా ఇబ్బందిగానే ఉందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంగ్లిష్ వాడుక భాషగా మారడం, కొత్తతరం ఉపాధ్యాయ వృత్తిలోకి రావడంతో తెలుగు బోధనలోనూ ఇంగ్లిష్ పదాలు దొర్లుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఉన్నత విద్యను తెలుగులో బోధించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై నిపుణులతో కమిటీ వేసే యోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. చూపంతా ఆంగ్ల మాధ్యమం వైపే.. రాష్ట్రంలో తెలుగు మీడియం కన్నా ఇంగ్లిష్ మీడియం వైపే ప్రజలు మొగ్గుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మీడియం అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు కేవలం 0.6 శాతం మాత్రమే. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇది 6.7 శాతమే కావడం గమనార్హం. రాష్ట్రంలో 41,628 ప్రభుత్వ, ప్రైవేటు బడులు ఉండగా.. వాటిలో 59 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.ప్రభుత్వ బడుల్లో ఒకటి పదో తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య 22,63,491 మందికాగా.. ఇందులో 4,08,662 మంది (18 శాతం) మాత్రమే తెలుగు మీడియంలో చదువుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో 34,92,886 మంది చదువుతుంటే... అందులో 20,057 మంది (0.57 శాతం) మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులు ఉండటం గమనార్హం. ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న 62,738 మందిలో 8,960 మంది మాత్రమే తెలుగు మీడియం వారు. ఇంగ్లిష్ ముక్కలొస్తే చాలంటూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదివించాలనే భావిస్తున్నారని విద్యాశాఖ పరిశీలనలో తేలింది. ప్రభుత్వ స్కూళ్లలో 2023 నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినా... ప్రైవేటుకే మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఇంగ్లిష్ నేర్చుకుని, మాట్లాడటం వస్తే చాలన్న భావన కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. మరోవైపు టెన్త్, ఇంటర్ తర్వాత దొరికే చిన్నా చితక ఉద్యోగాలకూ ఆంగ్ల భాష ప్రామాణికంగా మారిందని.. దీనితో ప్రైవేటు బడుల్లో ఆంగ్ల మాధ్యమం కోసం పంపుతున్నారని పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ బడుల్లోనూ తెలుగు మీడియం కంటే ఆంగ్ల మాధ్యమంలో చేరడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మాతృభాషలో విద్యా బోధన ఉండాలన్న కేంద్ర సూచనలపై పీటముడి పడుతోంది. తెలుగు మీడియంలో చేరేవారెవరు, బోధించేవారెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
ఇంగ్లిషే నంబర్ వన్
‘ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం ఉంటే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అంతర్జాతీయంగా ఎక్కువ మందితో కనెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉండటంతో ఇంగ్లిష్‌కే మా ప్రాధాన్యం’ అంటోంది వర్తమాన ప్రపంచం. ఏకంగా 135 దేశాల్లోని వారంతా ఇంగ్లిష్ భాషకే అగ్రస్థానం ఇస్తున్నారని ‘డ్యూలింగో లాంగ్వేజ్ నివేదిక–2024’ వెల్లడించింది.అందుకే ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు అభ్యసిస్తున్న భాషల్లో ఇంగ్లిష్ మొదటి స్థానంలో కొనసాగుతోందని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్‌గా గుర్తింపు పొందిన డ్యూలింగో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల అభ్యాసనంపై తాజా నివేదిక విడుదల చేసింది. రెండో స్థానంలో స్పానిష్ , మూడో స్థానంలో ఫ్రెంచ్ ఉన్నాయని తెలిపింది. డ్యూలింగో లాంగ్వేజ్ నివేదిక–2024లోని ప్రధానాంశాలివీ.. – సాక్షి, అమరావతిప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న భాష⇒ ప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న భాషగా ఇంగ్లిష్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. 2023 కంటే 2024లో ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిష్‌కు మొదటి స్థానం ఇచి్చన దేశాలు 10 శాతం పెరిగాయి. 2024లో 135 దేశాలు ఇంగ్లిష్‌కు మొదటి ప్రాధాన్యమిచ్చాయి. ⇒ మలేíÙయా, అల్బేనియా, మోనాకో, ఇరాన్, మంగోలియా, ఎరిత్రియా, రువాండా దేశాల్లో గత ఏడాది రెండో స్థానంలో ఉన్న ఇంగ్లిష్ ఈ ఏడాది మొదటి స్థానానికి చేరుకుంది. కాగా.. శ్రీలంక, మయన్మార్, క్రొయేషియా, ఇథియోపియా, కిరిబతి, మలావి దేశాల్లో గత ఏడాది మూడో స్థానంలో ఉన్న ఇంగ్లిష్ ఈ ఏడాది మొదటి స్థానానికి చేరుకుంది. ప్రపంచంలో అత్యధిక దేశాల్లో ప్రజలు తమ మాతృభాషతోపాటు ఇంగ్లిష్ కూడా నేర్చుకుంటున్నారు.⇒ప్రపంచంలో అత్యున్నత విద్యా సంస్థల్లో చేరేందుకు ఇంగ్లిష్ సరి్టఫికేషన్ కోర్సు చేస్తున్న వారి సంఖ్య కూడా అమాంతం పెరుగుతోంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేందుకు ఇంగ్లిష్ సర్టిఫికేషన్ కోర్సుకు ప్రాధాన్యమిస్తున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో చైనా, కెనడా, బ్రెజిల్, ఇండోనేషియా ఉన్నాయి. ⇒ అత్యధికులు అభ్యసిస్తున్న భాషల్లో హిందీ పదో స్థానంలో ఉంది. -
సామాన్యుల భాషలో... సన్నిహితమైన న్యాయం
మన దేశంలోని అన్ని హైకోర్టుల్లో అధికారికంగా వాడేది ఇంగ్లీషు భాష. కానీ కేసులో గెలిచినవాడు, ఓడిన సామాన్యుడు కూడా తమ గెలుపోటములకు కారణాలు అర్థం చేసుకోలేని పరిస్థితి. అందుకే తీర్పుల్లోని కారణాలు అర్థమయ్యే భాషలో తెలియ జేసి, సామాన్యుడికి న్యాయ వ్యవస్థ చేరువ కావాలనే సదుద్దేశ్యంతో సుప్రీంకోర్టు, దేశంలోని అన్ని హైకోర్టులు వారి తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి, ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాము ఇంగ్లీషులో వెలువరించే ముఖ్యమైన తీర్పులను తెలుగులోకి అనువాదం చేయించే ప్రక్రియను యుద్ధ ప్రాతి పదికన చేపట్టింది. తదనుగుణంగా ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేయటానికి విశ్రాంత ఉద్యోగులు, విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదుల సేవలు వినియోగించుకుంటోంది. అనువాదకుల కొరత మూలాన ప్రస్తుతానికి ముఖ్యమైన తీర్పులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అనువాదకుల సేవలు ఉచితంగా స్వీకరించటం లేదు. వారి సేవలకు గాను, హైకోర్టు ప్రతి పేజీకి మూడు వందల రూపాయలు చెల్లిస్తుంది. ఇంగ్లీషులో వెలువరించిన తీర్పుల కాపీలను వారి ఇంటి దగ్గరే అనువాదం చేసి, సహేతుకమైన సమయంలో అను వాదాన్ని హైకోర్టులోని సంబంధిత అధికారులకు స్వయంగా అందజేయడం లేదా ఆన్లైన్లో పంపించటం అనువాదకుల పని. ఈ కార్యక్రమ సక్రమ నిర్వహణ కోసం హైకోర్టు తన పరిపాలనా భవనంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో తెలుగు భాషపై పట్టున్న ఇద్దరు విశ్రాంత జిల్లా న్యాయమూర్తులను ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్‌గా; ఒక విశ్రాంత సీనియర్ సివిల్ జడ్జిని రిపోర్టర్‌గా నియామకం చేసింది. ఇంగ్లీషు నుండి తెలుగులోకి ప్రైవేటు అనువాదకులు తర్జుమా చేసిన∙ముఖ్యమైన తీర్పులను జాగ్రత్తగా పరిశీలించి, ప్రతి తీర్పుకు అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలను జోడించి, వాటిని తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో నెల వారీగా పెట్టవలసిన బాధ్యత వీరికి అప్పగించింది. వెబ్‌సైట్‌ను 2024 ఆగస్టు 15న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ముఖ్య మైన తీర్పుల తెలుగు ప్రతులను ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని చదువుకునే అవకాశం కల్పించారు. అనువాదకులను శాశ్వత ప్రాతిపదికన నియమించుకోడానికి, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అనుమతి ఇచ్చింది. 25 తెలుగు అనువాదకులు, 10 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 5 తెలుగు టైపిస్ట్ పోస్టులను కూడా మంజూరు చేసింది. త్వరలో హైకోర్టు ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం లేకపోలేదు. తెలుగు అనువాదకులు దొరకటం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే తెలంగాణ సచివాలయంలో కూడా ఈ కొరత ఉందని తెలుస్తోంది.మరో విషయమేమంటే ప్రతి పౌరుడికీ హైకోర్టు వెబ్సైట్ ద్వారా ముఖ్యమైన తెలుగు తీర్పులను డౌన్ లోడ్ చేసుకునే సౌలభ్యం ఉందనే విషయం తెలియ జేయాలనే ఆశయంతో... జిల్లా న్యాయమూర్తులు, జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థలు; సంబంధిత జిల్లా ప్రభుత్వ అధికారులు న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రచారం కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతగా ప్రచారం కల్పించినా తెలుగులో తీర్పులు చదువుకోవాలనుకునే విషయం, అది ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉందనే విషయం అంత సులువుగా సామాన్యుడికి తెలియక పోవచ్చు. అవగాహన కల్పించటానికి సకల ప్రయత్నాలు చేయటానికి న్యాయ వ్యవస్థ గట్టిగానే కృషి చేయాలి. దీనికి న్యాయవాదుల పాత్ర పరిమితమని అనుకోవద్దు. ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కక్షిదారులు తాము దాఖలు చేసిన కేసుల్లో న్యాయ మూర్తులు ఇంగ్లీషులో వెలువరించిన తీర్పులను తమ భాషలో చదివి అర్థం చేసుకొని సంతృప్తి పడాలనే దృక్పథం. అనువాదం అంటే ప్రస్తుత కాలంలో ఎవరికీ అర్థం కాని పూర్తి గ్రాంథిక భాషా ప్రయోగం చేయకుండా, వ్యవహారిక భాషను వాడాలనీ, అవసరమైతే దైనందిన ఇంగ్లీషు పదాలను అదే విధంగా వాడాలనీ హైకోర్టు సూచన చేసింది. టెక్నాలజీ అతి వేగంగా దూసుకుపోతున్న ప్రస్తుత కాలంలో, ఇప్పటికే హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్లలో రికార్డ్ చేసిన సాక్ష్యాల నకళ్ళను అప్పటికప్పుడు ఇరు పక్షాలకు ఉచితంగా అందజేసే ఏర్పాటు ఉంది. అదే విధంగా హైకోర్టు రిజిస్ట్రీ జోక్యం లేకుండా, తీర్పు చెప్పిన రోజే తీర్పు ప్రతిని ఇరుపక్షాలకు కోర్టులోనే ఉచితంగా అందజేయాలి. దిగువ కోర్టుల్లో కూడా సివిల్, క్రిమినల్ తీర్పు అనే భేదం లేకుండా, ఇదే పద్ధతి పాటించడానికి ఎటువంటి ఆటంకం ఉండకపోవచ్చు. అయితే నూటికి నూరు శాతం తీర్పుల తెలుగు అనువాదం సరైనది లేదా తప్పులు లేనిదని చెప్పలేం. ఈ తెలుగు తీర్పుల అనువాదం కేవలం చదువుకొని అర్థం చేసుకోవడానికి మాత్రమే పరిమితం. తెలుగు అనువాదం ఆధారంగా ఎవరు కూడా తప్పొప్పులు ఎంచి దానిపై అప్పీళ్ళు వేసే అవకాశం లేదు. ఇందు కోసం హైకోర్టు వెబ్సైట్లో డిస్ క్లెయిమర్ కూడా చొప్పించారు.తడకమళ్ళ మురళీధర్ వ్యాసకర్త విశ్రాంత జిల్లా జడ్జిమొబైల్: 98485 45970 -
మేమూ ఇంగ్లిష్‌లో మాట్లాడతాం!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్ సులువుగా అర్థం చేయించడం.. ఆపై మాట్లాడేలా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ‘వుయ్ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లిష్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఉన్నప్పటికీ.. విద్యార్థుల్లో భయాన్ని తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్తోపాటే విద్యార్థులు మాట్లాడేలా గతనెల 28 నుంచి జిల్లాలోని 16 ప్రభుత్వ పాఠశాలల్లో స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను నిర్వహిస్తున్నారు. 1,252 మంది విద్యార్థులకు లబ్ధి జిల్లాలోని కల్లూరు, తల్లాడ, వైరా, కొణిజర్ల, చింతకాని, ముదిగొండ, బోనకల్, ఖమ్మంఅర్బన్, రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లోని 16 పాఠశాలలను స్పోకెన్ ఇంగ్లిష్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో 6, 7 తరగతుల విద్యార్థులు 1,252 మంది ఉండగా.. 16 మంది టీచర్లకు అవగాహన కల్పించారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్లానర్ (ఐఎప్పీ) డిజిటల్ బోర్డులున్న పాఠశాలలను ఎంపిక చేశారు. హైదరాబాద్‌కి చెందిన భారత్ దేఖో, మంత్రా పర్ చేంజ్, అలోకిట్, శిక్షా లోక్ స్వచ్ఛంద సంస్థలు రోజూ 15 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను ఈ పాఠశాలలకు ఆన్లైన్లో పంపిస్తుండగా.. వీడియో చూశాక మరో 15 నిమిషాలు విద్యార్థుల నడుమ గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తున్నారు. వీడియోలోని బొమ్మలు, వాటి నడుమ సంభాషణ గుర్తుండి ఇంగ్లిష్ మాట్లాడటం సులువవుతుందని భావిస్తున్నారు. వీటిద్వారా విద్యార్థులు ఉత్సాహంగా ఇంగ్లిష్ నేర్చుకుంటున్నారు. 15 రోజులకోసారి సమీక్షిస్తున్న కలెక్టర్.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్ధికి ఇంగ్లిష్ పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థులకు మంచి అవకాశం ఇంగ్లిష్ నేర్చుకోవడానికి విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. ఆడియో, వీడియోల ద్వారా పిల్లలు ఉత్సాహంతో ఒత్తిడి లేకుండా నేర్చుకుంటారు. ఇప్పటికే చిన్నచిన్న వాక్యాలు మాట్లాడుతున్నారు. కలెక్టర్, డీఈఓ ఆదేశాలతో త్వరలోనే ఇంకొన్ని పాఠశాలల్లో ప్రారంభిస్తాం. –జక్కంపూడి జగదీష్, జిల్లా కోఆర్డినేటర్, ఉయ్ కెన్ లెర్న్ ప్రోగ్రాం ఇంగ్లిష్ అంటే భయం పోతోంది.. ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో ఇంగ్లిష్ అంటే భయం తగ్గింది. కథల ద్వారా నేర్చుకోవడం, మాట్లాడటం జరుగుతోంది. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్‌పై పట్టు సాధిస్తారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన జిల్లా విద్యాశాఖకు ధన్యవాదాలు. –బి.రామనాథం, టీచర్, జెడ్పీహెచ్ఎస్, చిన్న కోరుకొండి, కల్లూరు మండలం చక్కగా నేర్చుకుంటున్నా.. ఈ కోర్సు వల్ల ఇంగ్లిష్ నేర్చుకున్నా. ప్రస్తుతం చిన్నచిన్న వాక్యాలను మాట్లాడగలుగుతున్నా. త్వరలోనే ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడతాననే నమ్మకం ఏర్పడింది. మాలాంటి విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశం. – డి.బ్యూలా, 7వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, గుబ్బగుర్తి, కొణిజర్ల మండలం కలెక్టర్ సార్‌కు ధన్యవాదాలు.. స్పోకెన్ ఇంగ్లిష్ ప్రోగ్రాంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేర్చుకోగలుగుతున్నాం. రోజూ వినడం వల్ల కొంతకాలం తర్వాత మాట్లాడగలుగుతాం. మా పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లిష్ మొదలు పెట్టినందుకు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సార్‌కు ధన్యవాదాలు. –బి.దేవిక, 7వ తరగతి, జెడ్పీఎస్ఎస్, కల్లూరు, ఖమ్మం జిల్లా త్వరలోనే 200 పాఠశాలల్లో.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఇంగ్లిష్ మాట్లాడగలమనే విశ్వాసం కలిగించేలా ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రస్తుతం 16 పాఠశాలలను ఎంపిక చేసినా త్వరలోనే 200 పాఠశాలలకు విస్తరిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివాక డిగ్రీ, పీజీ పూర్తిచేసిన వారు ఇంగ్లిష్‌లో రాణించలేక ప్రైవేట్ ఉద్యోగాల ఇంటర్వ్యూల్లో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. దీంతో ‘వుయ్ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లిష్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. – ముజమ్మిల్‌ఖాన్, కలెక్టర్, ఖమ్మం జిల్లా చక్కగా నేర్చుకుంటున్నా.. ఈ కోర్సు వల్ల ఇంగ్లిష్ నేర్చుకున్నా. ప్రస్తుతం చిన్నచిన్న వాక్యాలను మాట్లాడగలుగుతున్నా. త్వరలోనే ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడతాననే నమ్మకం ఏర్పడింది. మాలాంటి విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశం.– డి.బ్యూలా, 7వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, కొణిజర్ల మండలం -
ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా?
ప్రపంచమంతా ఇంగ్లిష్ ప్రాధాన్యతను గుర్తిస్తోంది. యూరోపియన్ యూనియన్ ఇకనుంచీ జర్మన్‌కు బదులుగా ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి. కానీ భారతదేశం మాత్రం కాలాన్ని వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇంగ్లిష్ భాషను వలసవాదంతో ముడిపెట్టడం విధానపరమైన తప్పిదం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను నిర్వీర్యం చేసేందుకు నడుం బిగించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన ఆంధ్ర మోడల్ విద్యా ప్రయోగం దుష్ట రాజకీయ శక్తుల కుట్రవల్ల ఆగిపోకూడదు.యావత్ ప్రపంచం ఇంగ్లిష్‌ను పాఠశాల స్థాయి బోధనా భాషగా స్వీకరిస్తున్న సమ యంలో, భారతదేశం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఇంగ్లిష్ విద్యకంటే వెనుకటి రోజులకు కాలాన్ని తిప్పుతోంది. ఇంగ్లిష్ భాషను వలస వాదంతో ముడిపెట్టడం ఒక ప్రధాన విధానపరమైన తప్పిదం. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇంగ్లిష్ ఒక వలస భాష అనే సిద్ధాంతాన్ని మరింత స్పష్టంగా తీసుకొస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, భారతదేశంలోని ప్రభుత్వ పాఠశా లల్లో ఇంగ్లిష్ మాధ్యమ విద్యపై జరిగిన మొట్టమొదటి అతి పెద్ద ప్రయోగాన్ని వెనక్కి తిప్పేశాయి. ఇప్పటికే కొత్త ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి చేసిన సీబీఎస్ఈ సిలబస్‌ను ఉపసంహరించుకుంది. ‘అమ్మ ఒడి’ పేరుతో తల్లులకు సంవత్సరానికి ఇచ్చే 15,000 రూపాయల ఆర్థిక సహా యాన్ని నిశ్శబ్దంగా నిలిపివేశారు. సహజంగానే, కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన మూడు పార్టీలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. అవి ప్రైవేట్ రంగ ఇంగ్లిష్ మాధ్యమ విద్యకు గట్టిగా మద్దతు ఇచ్చాయి. ప్రభుత్వ రంగంలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను నిర్వీర్యం చేసి మళ్లీ తెలుగు మీడియం వైపు మళ్లించేందుకు అన్ని విధాలా నడుం బిగిస్తా మన్న స్పష్టమైన సంకేతంతో, ప్రైవేట్ ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, కాలేజీల యజమాని నారాయణను మళ్లీ మంత్రిని చేశారు చంద్ర బాబు. ఈ దిశ స్పష్టంగా ఉంది.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యను అనుమతించొద్దనే విషయంలో స్పష్టంగా ఉంది. ఎన్డీయేలోని ప్రధాన నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అందరూ ఈ విషయమై ఒకే మాట మీద ఉన్నారు. నితీష్ కుమార్ అయితే తన సమావేశాల్లో పార్టీ నాయ కుడైనా, అధికారి అయినా ఇంగ్లిష్‌లో మాట్లాడినా ఇష్టపడరు.సుప్రీంకోర్టులోనూ, ప్రతి హైకోర్టులోనూ అన్ని వ్యవహారాలుఆంగ్లంలో ఉండాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 348(1)(ఎ) పేర్కొన్నప్పటికీ, ప్రాంతీయ భాషను ఉపయోగించాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులను కూడా ఒత్తిడి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ రకమైన విద్యా విధానం పట్ల ఆంధ్రప్రదేశ్‌లో లేదా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మౌనంగా ఉంది. రిజర్వేషన్లు ఉన్నా లేకపోయినా, భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న యువత ప్రైవేట్ ఇంగ్లిషు మీడియంలో చదువుకున్న యువతతో పోటీపడే అవకాశం లేదని ఇది చూపుతోంది. అందరూ మాట్లాడిన ‘ఆంధ్రా మోడల్’ సృష్టించిన ఆశ నిరాశగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యా విస్తరణకు భారత కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపులు కూడా అడ్డంకిగా మారాయి.దేశంలో ఇంగ్లిష్ విద్య 1817లో ప్రారంభమైంది. ఇది భారతదేశంలో ఆ భాష ప్రవేశించిన 207వ సంవత్సరం. అక్టోబర్ 5న భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం అనే విషయం తెలిసిందే.భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక్కో భాషా దినోత్సవ వేడుకలు జరుగు తాయి. కానీ ఇంగ్లిష్‌ను ప్రపంచ, భారతీయ అవకాశాల భాషగా నేర్చుకుని, దాని నుండి ప్రయోజనం పొందినవారు... అధికారం,సంపద, ప్రపంచ చలనశీలత భాషగా దాన్ని ఉపయోగి స్తున్నప్పటికీ ఒక భాషగా ఆంగ్ల దినోత్సవాన్ని జరుపుకోరు. పైగా బహిరంగ వేదికల నుండి దాన్ని వలస భాషగా ఖండిస్తూనే ఉంటారు.ఇంగ్లిషు భాష నుండి అత్యధికంగా ప్రయోజనం పొందిన వ్యక్తులు అగ్రవర్ణాలు, ముఖ్యంగా బ్రాహ్మణులు, బనియాలు, కాయ స్థులు, ఖత్రీలు. చారిత్రకంగా భారతీయ పాలక కులమైన క్షత్రియులు ఈ భాష శక్తిని ఇటీవలే గ్రహించారు. వారి పిల్లలను ఇంగ్లిష్ మాధ్య మంలో చదివిస్తున్నారు.ఆంగ్లం వల్లే ప్రపంచ స్థాయికమలా హ్యారిస్ భారతీయ సంతతికి చెందిన బ్రాహ్మణ మహిళ. 245 సంవత్సరాల రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం ఉనికిలో ఉన్న అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షురాలిగా అవతరించే అవకాశం ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకు ఏ శ్వేతజాతీయురాలూ అధ్యక్షురాలు లేదా ఉపాధ్యక్షురాలు కాలేదు. కమల ఇప్పటికే అమెరికా తొలి ఉపాద్యక్షురాలు అయ్యారు. వలసరాజ్యాల కాలంలో ఇంగ్లిష్ భారత దేశానికి రాకపోతే, ప్రపంచ భాషగా ఇంగ్లిష్ లేకుండా ఉంటే ఇది సాధ్యమయ్యేదా? తమిళ బ్రాహ్మణ సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి అయిన ఆమె తల్లి శ్యామలా గోపాలన్ ఇంగ్లిష్ చదవకుండా ఉండి ఉంటే అమెరికా వెళ్లి తన జీవితాన్ని తీర్చిదిద్దుకుని తన ఇద్దరు కూతుళ్లు కమల, మాయలను చదివించి ఉండేవారా? ఒక సాధారణ మధ్యతరగతి ఒంటరి తల్లి కుటుంబం నుండి వచ్చిన కమల ఇంగ్లిష్ భాష లేకుండా, తన స్థాయికి తగ్గ లాయర్‌గా ఎదిగి, ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశానికి ఉపాధ్యక్షురాలిగా ఎదిగి, ఇప్పుడు అత్యంత సంపన్నుడైన శ్వేతజాతి అమెరికన్ డోనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష రేసులో సవాలు చేసే అవకాశాన్ని పొందగలదని మనం ఊహించగలమా? పశ్చిమ భారతదేశానికి చెందిన ఖత్రీ కుటుంబానికి చెందిన రిషి సునాక్ తల్లిదండ్రులు ఇంగ్లిష్ భాషలో విద్య నేర్వకపోయి ఉంటే, రెండు వందల సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పాలించినబ్రిటన్కు ఆయన ప్రధాన మంత్రి కావడం మనం ఊహించగలమా? భారతదేశం స్వాతంత్య్రం సాధించే నాటికి అగ్రవర్ణాల ఇళ్లలోనిసాంస్కృతిక వాతావరణాన్ని ఇంగ్లిష్ మార్చింది. కానీ ఆ భాష పరిధిని, శక్తిని ఉపయోగించి అనేక విధాలుగా ప్రయోజనం పొందిన అదే వ్యక్తులకు ఇప్పుడు రైతులు, కార్మికుల పిల్లలు ఆ భాష నేర్చు కోవడం ఇష్టం లేదు. ఇది వైరుధ్యం కాదా?యూరప్ కూడా ఆంగ్లం దిశగా...యూరోపియన్ యూనియన్ ఈ సంవత్సరం ఇకనుంచీ జర్మన్ కు బదులుగా ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు తమ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి.ఫ్రా¯Œ ్స, జపాన్, చైనా, రెండు కొరియన్ దేశాలు ఒకే జాతీయ భాషతో వ్యవహరిస్తున్నప్పటికీ, మొదటి నుండీ తమ పాఠశాలల్లో ఆంగ్లాన్ని బోధించడం ప్రారంభించాయి. ప్రపంచీకరణ చెందిన ప్రపంచంలో భాషతో ముడిపడి ఉన్న జాతీయవాదం తగ్గుముఖం పట్టింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర సందర్భంలో బ్రిటిషేతర దేశాలన్నీ తీవ్రమైన భాషాపరమైన మనోభావాలను కలిగి ఉండేవి. కానీ ప్రతి ఐరోపా దేశం కూడా ఇప్పుడు ఆర్థికాభివృద్ధికి ఇంగ్లిష్ తప్పనిసరి అని గ్రహించింది. మునుపటి ఫ్రెంచ్, స్పానిష్ కాలనీలు కూడా నెమ్మదిగా తమ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు మారుతున్నాయి.భావోద్రేక భరితమైన మాతృభాష సిద్ధాంతంతో భారతదేశం అనేక చిన్న భాషలు మాట్లాడే జాతులుగా విభజించబడింది. శూద్రులు, దళితులు, ఆదివాసీలు తమదైన చిన్న భాషా ప్రపంచంలో ఇరుక్కుపోయారు. ఈ రకమైన భాషాపరమైన నిర్బంధం వారిని సరైన పౌరసత్వ పాత్రలోకి ఎదగనివ్వదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించినటువంటి విద్యా ప్రయోగానికి దుష్ట రాజకీయ శక్తుల కుట్రతో చావుదెబ్బ తగలకూడదు.- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త (నేడు ఇండియన్ ఇంగ్లిష్ డే)- -
ఇంగ్లీష్‌తో అక్కినేని అనుబంధం.. ఓ నిబద్ధతకు పాఠం
అక్కినేని నాగేశ్వరావు జీవితంలో తక్కువగా తెలిసిన, కానీ ఎంతో లోతైన అంశం ఆయనకు ఇంగ్లీష్ భాషతో ఉన్న అనుబంధం. ఒకసారి అమెరికా వెళ్లినప్పుడు ఇంగ్లీష్ భాషలో ప్రవేశం లేనందుకు ఆయనని హేళన చేశారు. ఆ అవమాన భారంతో గుండెలు మండి బాత్ రూమ్‌లోకి వెళ్ళి బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సంఘటన ఆయన జీవితంలో ఓ మలుపుగా మారింది. నాగేశ్వరరావు ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లీష్ పత్రికలను ప్రధాన వనరుగా చేసుకొని, ప్రతిరోజూ పత్రిక చదువుతూ, ఆంగ్ల భాషపై ప్రావీణ్యం సంపాదించడానికి కృషి చేశారు. కొంత కాలం పిదప ఆయన తన ఆంగ్ల భాషా ప్రావీణ్యం ప్రదర్శిస్తూ, చక్కటి శైలితో ఆకట్టుకున్నారు. ఒకప్పుడు బాధ పెట్టిన విషయమే ఆయనకు విజయంగా మారింది.స్కూల్‌కు వెళ్లలేదు, కానీ తానే విశ్వవిద్యాలయం అయ్యాడుఅక్కినేని పాఠశాలకు వెళ్లలేదు. పెద్ద చదువులు చదవలేదు. కానీ సినీ కళపై ఉన్న అంకితభావంతో స్కూల్‌కు వెళ్లకపోయినా, నటన కళలో నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. సినిమాను తన తరగతి గది అనుకున్నారు. ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం ఆయనకు ఓ పాఠం. అంచలంచెలుగా ఎదిగారు. క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష, పట్టుదల, కఠోర శ్రమ, శ్రద్ధతో నేర్చుకోవడం వలన ఆయన తానే ఓ విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించారు. ఎంతో మందికి ఆదర్శవంతులయ్యారు.-సందీప్ ఆత్రేయ, సాక్షి పోస్ట్ -
మట్టిలో మాణిక్యం..! ఈ బుడ్డాడు మామూలోడు కాదు
-
ఇంగ్లిష్ యాదవ్ చాచా
ఆంగ్లంలో మాట్లాడితే ఆశ్చర్యపోయి, అబ్బురపడే రోజులు కావు ఇవి.. ఇంగ్లిష్‌లో మాట్లాడడం ఈరోజుల్లో చాలా సహజం. అయితే ఒక ఆటో డ్రైవర్ ఇంగ్లిష్‌లో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. మూడు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మహారాష్ట్రలోని అమరావతిలో యాదవ్ చాచా అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఇతడిని ‘ఆటోడ్రైవర్ యాదవ్ చాచా’ అని పిలిచే వారు చాలా తక్కువ. ‘ఇంగ్లిష్ యాదవ్ చాచా’ అనే పిలిచేవారే ఎక్కువ. దీనికి కారణం యాదవ్ ఇంగ్లిష్ బాగా మాట్లాడుతాడు. తాజా వైరల్ వీడియోలో భూషణ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ యాదవ్‌తో ఇంగ్లిష్‌లో మాట్లాడించాడు. ‘ఇంగ్లిష్ తెలిస్తే ఇంగ్లాండ్, అమెరికాలాంటి ఎన్నో దేశాలకు వెళ్లవచ్చు. ఇంగ్లిష్ నేర్చుకోండి. ఇది అంతర్జాతీయ భాష’ అంటూ మాట్లాడాడు యాదవ్. -
ఆటోవాలా ఆంగ్లం : అదుర్స్ అంటున్ననెటిజన్లు, వైరల్ వీడియో
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తూ కాదు ఇదే విషయాన్ని ఒక ఆటో ఆటోడ్రైవర్ మరోసారి నిరూపించాడు. అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేస్తున్న సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్ చక్కర్లు కొడుతోంది.మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఒక ఆటోడ్రైవర్ తన అత్యద్భుతమైన ఇంగ్లిష్ స్కిల్స్‌తో అటు ప్రయాణీకులను, ఇటు ఇంటర్నెట్ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. విదేశాల్లో చదువుకుని వచ్చినట్టుగా ఈ ఆటోవాలా ఇంగ్లీష్ భాషను దంచి పడేస్తున్నాడు. ఇది గమనించిన ఆయన ప్యాసెంజర్, ఇన్స్టాగ్రామ్ యూజర్ ఒకరు ఈ వీడియోను షేర్ చేశారు. ‘‘ఆయన ఇంగ్లిష్‌లో అంత సులువుగా మాట్లాడుతుండటం చూసి నేనే ఆశ్చర్యపోయాను.కొద్దిసేపు అలా ఉండిపోయాను’’వ్యాఖ్యానించాడు. ఇది చూసిన నెటిజన్లు ఆటోవాలా ఇంగ్లిష్‌కు ఫిదా అవుతున్నారు. వావ్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by BHUSHAN🐻🧋 (@kon_bhushan1222)అంతేకాదు ఇది ఇంటర్నేషన లాంగ్వేజ్.. ఇంగ్లీష్ వస్తే లండన్, అమెరికా, ప్యారిస్ లాంటి ప్రాంతాలకు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని కూడా ఆయన సిఫార్సు చేశారు. -
ఆంగ్ల ఆధ్యాత్మికవాది
ఒక మనిషి ఇంత రాయగలడా అని ఆశ్చర్యానికి గురిచేసే రచయిత జి.కె. చెస్టర్టన్. ఇరవయ్యో శతాబ్దపు ఈ సుప్రసిద్ధ ఆంగ్ల రచయితకు ఇది 150వ జయంతి సంవత్సరం. 1874 మే 29న లండన్‌లో జన్మించిన గిల్బర్ట్ కీత్ చెస్టర్టన్ నవలలు, కథలు, నాటికలు, కవితలు, సాహిత్య విమర్శ, కళా విమర్శ, చరిత్ర, వ్యాసాలతో సుమారు 80 పుస్తకాలను వెలువరించారు. ‘నెపోలియన్ ఆఫ్ నాటింగ్ హిల్’, ‘ద మ్యాన్ హూ వజ్ థర్స్డే’ ఆయన గొప్ప నవలలు. ‘ది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్’ పత్రికకు ఏకంగా 30 ఏళ్లపాటు; ‘డైలీ న్యూస్’కు 13 ఏళ్లపాటు వీక్లీ కాలమ్స్ రాశారు. మొత్తంగా సుమారు 4,000 వ్యాసాలు! ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తు, 130 కిలోల బరువుండే ఈ భారీకాయుడు స్టేషన్లలో కూడా రాసేవారు. రాతలో ఎంతగా మునిగిపోయేవాడంటే, ప్రతిసారీ ఎక్కాల్సిన రైలును మిస్సయ్యేవారు. పలు కార్యక్రమాల్లో తలమునకలుగా ఉంటూ, తర్వాత ఏం చేయాలో మరిచిపోయేవారు. ఒకసారైతే, ‘హార్బరో మార్కెట్లో ఉన్నాను. నేనెక్కడ ఉండాల్సింది?’ అని భార్యకు టెలిగ్రామ్ పంపారు. భర్త అన్ని వ్యవహారాలనూ చూసుకునే ఫ్రాన్సెస్ ‘ఇంటికి వచ్చెయ్యండి’ అని జవాబిచ్చారు.‘ఆయన ప్రతిదాని గురించి ఎంతో కొంత, అలాగే దాన్ని అందరికంటే మెరుగ్గా చెప్పారు’ అంటారు చెస్టర్టన్ భావజాలాన్ని ప్రచారం చేయడానికి నెలకొల్పిన ‘అమెరికన్ చెస్టర్టన్ సొసైటీ’ సహవ్యవస్థాపకుడు డేల్ అహ్లిక్విస్ట్. క్రైస్తవ మతంలోని థీమ్స్, సింబాలిజం చెస్టర్టన్ రచనల్లో ఎక్కువగా కనబడతాయి. క్రైస్తవంలోని ప్రేమ, కారుణ్యం వైపు ఎందరినో ఆయన ఆకర్షించారు. నాస్తికుడైన బ్రిటిష్ రచయిత సి.ఎస్.లూయిస్‌ను తిరిగి క్రైస్తవుడిగా మారేట్టుగా చెస్టర్టన్ రచనలే ప్రభావం చూపాయి. సతతం విశ్వాసిగా మసలుకోవడమే కాక, ఎంతోమందిని విశ్వాసం వైపు మళ్లించడం, శత్రువులను కూడా ద్వేషించకపోవడం వంటి అంశాలను చూపుతూ చెస్టర్టన్ బీటిఫికేషన్కు యోగ్యమైన కారణాలున్నాయని వాదిస్తారు క్యాథలిక్ రచయిత జోసెఫ్ పియర్సీ. భిన్న భావజాలానికి చెందిన జార్జ్ బెర్నార్డ్ షా, హెచ్.జి.వెల్స్, బెర్ట్రాండ్ రసెల్ లాంటి రచయితలతో విభేదిస్తూ చెస్టర్టన్ తీవ్రమైన వాదాలు జరిపేవారు. అయినా వాళ్ల స్నేహం చెడలేదు. శత్రువును కూడా ప్రేమించమనే భావనే ఆయన్ని అలా మసలుకునేట్టు చేసింది. ఆయన ఈ ప్రేమగుణంలోంచి పుట్టిందే ప్రీస్ట్ డిటెక్టివ్ ‘ఫాదర్ బ్రౌన్’ పాత్ర. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా కేసులను పరిశీలించే షెర్లాక్ హోమ్స్‌లా కాకుండా అనుమానం, ఆధ్యాత్మిక అవగాహనల ఊతంతో నేరస్థుల మనసుల్లోకి చొచ్చుకెళ్లి వారిని పట్టుకుంటాడు ఫాదర్ బ్రౌన్. చెస్టర్టన్ పారిశ్రామికీకరణను వ్యతిరేకించారు. ధార్మిక జీవితాన్ని ప్రవచించారు. ఐరిష్ జాతీయోద్యమానికి ఊతమిచ్చారు. ఐరిష్ ప్రజలు ఇంగ్లిష్‌వారికి భిన్నమైనవారనీ, వారు తమవైన సంప్రదాయాలను కాపాడుకుంటూ తమ సొంత దేశంలో సొంత విధానంలో స్వతంత్ర పాలనకు అర్హులనీ వాదించారు. అయితే, ఆయన్ని ఇరవయ్యో శతాబ్దపు విలువైన థింకర్‌గా పరిగణించడానికి ఒక కారణం– ‘డిస్ట్రిబ్యూటిజం’ (పంపిణీవాదం)ను ఆయన ఎత్తుకున్న తీరు! చెస్టర్టన్ సోదరుడు సీసిల్, అతడి స్నేహితుడు హిలైర్ బెల్లోక్ ‘డిస్ట్రిబ్యూటిజం’ ఆర్థిక తత్వాన్ని వృద్ధి చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో సీసిల్ చనిపోయాక చెస్టర్టన్ దీనికి ప్రధాన ప్రచారకర్తగా మారడమే కాక, ప్రధానంగా ఈ భావధార ప్రచారం కోసం ‘జీకేస్ వీక్లీ’ నడిపారు. నియంత్రణ లేని క్యాపిటలిజం, సోషలిజాలకు భిన్నమైన మూడో పంథాగా ఉంటూ, ఆస్తులు, రాజకీయాధికారాల పంపిణీ జరగాలంటుంది ఈ వాదం. ‘మూడు ఎకరాలు – ఆవు’ అనేది వీరి స్లోగన్.సూత్రప్రాయంగా జాతీయవాదానికి చెస్టర్టన్ వ్యతిరేకి కాకపోయినా, తన మూలాలను విస్మరించే జాతీయవాదానికి అర్థం లేదంటారు. అందుకే భారత జాతీయోద్యమాన్ని ‘అది భారతీయమూ కాదు, అంత జాతీయమూ కాదు’ అని నిరసించారు. 1909లో ‘ది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్’లో చెస్టర్టన్ రాసిన ఒక వ్యాసం మహాత్మా గాంధీ మీద ‘పిడుగుపాటు’లా పడింది. వెంటనే దానికి చిన్న పరిచయం రాస్తూ ‘ఇండియన్ ఒపీనియన్’లో పునర్ముద్రింపజేశారు. ‘వాళ్ల దేశానికి మన పార్లమెంట్ కావాలి, మన జ్యుడీషియరీ కావాలి, మన పత్రికలు కావాలి, మన సైన్స్ కావాలి. భారత జాతీయవాదులు ఇవన్నీ కోరుకోవడమంటే వాళ్లు ఇంగ్లిష్‌వారిలా ఉండాలనుకుంటున్నారు’ అన్నారు చెస్టర్టన్. అది సహేతుకమని గాంధీజీ బలపరుస్తూ, ‘స్వతంత్రంగా ఉండాలంటే ఇండియా తనకు తానుగా ఉండాలి, బ్రిటన్‌లా మారకూడదు. అదే పనిగా అనుకరిస్తే మన దేశం హిందుస్థాన్ కాదు, ఇంగ్లిషిస్థాన్ అవుతుంది’ అని రాశారు.విస్తృతిలో, భావధారలో తెలుగు సాహిత్య శిఖరం విశ్వనాథను కొంతవరకూ స్ఫురింపజేసే చెస్టర్‌టన్‌కు రావాల్సినంత కీర్తి రాలేదన్నది కొందరి వాదన. ఇరవయ్యో శతాబ్దపు గొప్ప రచయిత, ఆలోచనాపరుడు అయినా చెస్టర్టన్ విస్మరణకు గురికావడానికి ఆయన అన్ని రకాలుగా రాయడమే కారణమన్నది దీనికి వివరణ. ‘ఒక్కమాటలో రచయితలు ఫలానా వర్గంలోకి ఇట్టే ఒదగకపోతే వాళ్లు చీలికల్లోంచి కిందికి జారిపోయే ప్రమాదం ఉంది’ అంటారు అహ్లిక్విస్ట్. అయినా ఆయన్ని తలకెత్తుకునేవాళ్లు ఉంటూనే ఉన్నారు. చెస్టర్టన్ను ఎడ్గార్ అలెన్ పోతో పోల్చారు బోర్హెస్. ‘చెస్టర్‌టన్‌కు ప్రపంచం తగినంత కృతజ్ఞత చూపలే’దని అన్నారు జార్జ్ బెర్నార్డ్ షా. అయితే జాన్ పైపర్ వ్యాఖ్యానం చెస్టర్‌టన్‌కు తగిన నివాళి: ‘చెస్టర్టన్ కోసం నేను దేవుడికి కృతజ్ఞత చెబుతాను’ అన్నారాయన. -
న్యూజిలాండ్ వీసా నిబంధనలు కఠినతరం
వెల్లింగ్టన్: వలసలను నియంత్రించేందుకు వీసా నిబంధనలను న్యూజిలాండ్ కఠినతరం చేసింది. ఇకపై తక్కువ నైపుణ్యమున్న పనివారు కూడా ఇంగ్లిష్‌పై పట్టు సాధించాల్సి ఉంటుంది. వారికి ఐదేళ్ల నివాస పరిమితిని మూడేళ్లకు తగ్గించింది. వీసాదారులకు నైపుణ్యం, అనుభవాలకు సంబంధించి పలు నిబంధనలు విధించింది. వెల్డర్లు, ఫిట్టర్లు, టర్నర్లు తదితర 11 కేటగిరీల వారిని ఫాస్ట్ ట్రాక్ విధానంలో తీసుకోవాలనే ప్రతిపాదనను సైతం ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కనబెట్టింది. అవసరమైతే వీసా నిబంధనలను మరింత కఠినం చేయెచ్చని కూడా సంకేతాలిచ్చింది. -
మన దేశంలో బెస్ట్ ఇంగ్లీషు ఎవరు మాట్లాడతారు? ఈ వీడియో చూడండి!
భిన్న భాషలు, విభిన్న సంస్కృతుల మేళవింపు భారత దేశం. అయితే 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్న ఇండియా 1947లో స్వాతంత్ర్యాన్ని సాధించింది. అప్పటినుంచి మన దేశంలో ఇంగ్లీషు భాష ప్రభావం, ఆంగ్లం మాట్లాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. భారతీయుల ఇంగ్లీషుపై హింగ్లీష్,టింగ్లీషులాంటి సెటైర్లు ఉన్నప్పటికీ, 2021 నాటి లెక్కల ప్రకారం అమెరికా తరువాత అత్యధిక సంఖ్యలో ఇంగ్లీష్ మాట్లాడే వారిలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. దాదాపు 10శాతం మంది భారతీయులు ఇంగ్లీషులో మాట్లాడతారు. రెండు లేదా మూడో భాషగా ఇంగ్లీషు మాట్లాడేవారు కూడా ఎక్కువే ఉన్నారు. గ్రామీణులతో పోలిస్తే పట్టణ, విద్యావంతులు, సంపన్నులు ఎక్కువగా ఇంగ్లీషు భాష మాట్లాడతారు. అయితే తాజాగా చక్కటి ఇంగ్లీషు భాష ఏ భాష ప్రజలు మాట్లాడతారు అనే అంశానికి సంబంధించి ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం కన్నడిగులు మంచి ఇంగ్లీషు మాట్లాడతారట. మాతృభాష కన్నడగా ఉన్న ప్రజల యావరేజ్ ఇంగ్లీషు స్పీకింగ్ టెస్ట్ స్కోరు 74 శాతంగా నిలిచింది. వావ్.. ఆసక్తికరమైన పరిశోధన.. ఇంగ్లీషు నేర్చుకోవాలంటే కన్నడ నేర్చుకోవాలన్నమాట, లేదంటే కన్నడ ఫ్రెండ్ అయినా ఉండాలి అంటూ చాలామంది హర్షం వ్యక్తం చేశారు. ఇంగ్లీషు మాత్రమే కాదు బహుశా కన్నడ మాట్లాడేవారు ఇతర భాషలను కూడా తేలికగా నేర్చుకుంటారు. నా దృష్టిలో కన్నడ ఇటాలియిన్ ఆఫ్ ది ఈస్ట్. అంతేకాదు కన్నడిగులు దేశంలోని ఇతర రాష్ట్ర భాషలను సులభంగా నేర్చుకుంటారు అంటూ ఒకరు కమెంట్ చేయడం విశేషం. Guess who speaks the best English in India by mother tongue? 😊👏 pic.twitter.com/MfSlNAiGjR — Aparajite | ಅಪರಾಜಿತೆ (@amshilparaghu) March 11, 2024 మిగిలిన భాషల ర్యాంకులు పంజాబీ - 63 శాతం గుజరాతీ - 65 శాతం బెంగాల్ - 68 శాతం హిందీ,మళయాళం, తెలుగు - 70శాతం తమిళం - 71 శాతం మరాఠా- 73శాతం -
భాషలన్నింటిలో టాప్ ఏవో తెలుసా మీకు?
2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడిన భాషలు ఎన్నో, ఎంతమంది మాట్లాడారో తెలుసా.ప్రతి సంవత్సరం అతిపెద్ద భాషల జాబితాను ప్రచురించే ఎథ్నోలాగ్ తాజా జాబితాను వెల్లడించించింది. ఇందులో అత్యధికంగా అంటే 1.5 బిలియన్లు మంది మాట్లాడిన భాషగా ఇంగ్లీష్ నిలిచింది. అలాగే భారత దేశానికి చెందిన హిందీ భాష మూడో స్థానంలో నిలవడం విశేషం. అలాగే బెంగాలీ భాష 7, ఉర్దూ భాష 10వ స్థానంలో నిలిచాయి. భూమి మొత్తం 200కు పైగా దేశాలు ఉండగా వాటిల్లో మొత్తం 7వేలకు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ జాబితా ఆర్థిక పోకడలు, అధిక జనాభా ఉన్న దేశాలు, వలస చరిత్రను కూడా ప్రతిబింబిస్తాయంటున్నారు విశ్లేషకులు భూమిపై అత్యధికంగా మాట్లాడే 12 భాషలు ఇంగ్లీష్: 1,500,000,000 మాండరిన్: 1,100,000,000 హిందీ: 609,500,000 స్పానిష్: 559,100,000 ఫ్రెంచ్: 309,800,000 ప్రామాణిక అరబిక్: 274,000,000 బెంగాలీ: 272,800,000 పోర్చుగీస్: 263,600,000 రష్యన్: 255,000,000 ఉర్దూ: 231,700,000 ఇండోనేషియన్: 199,100,000 జర్మన్: 133,200,000 -
ఈ అన్న ఇంగ్లీష్ చూసి నోరెళ్లబెట్టిన ఫారెనర్స్
-
'జానీ జానీ యస్ పాపా" శాస్త్రీయ సంగీతంలో వింటే ఇలా ఉంటుందా?
ఆంగ్లంలో బాగా సుపరిచితమైన రైమ్ ఏదంటే ఎవ్వరైన ఠక్కున్న చెప్పే రైమ్ అది. దీనికి పేరడీగా తెలుగులో ఎన్నో రైమ్‌లు వచ్చాయి కూడా. అయితే ఈ రైమ్‌ని క్లాసికల్ మ్యూజిక్‌లో పాడితే..అస్సలు ఎవ్వరూ అలా ఆలోచించి ఉండకపోవచ్చు. కానీ శాస్త్రీయ సంగీతంలో పాడితే ఎలాం ఉంటుందో పాడి చూపించాడు ఓ వ్యక్తి. ఈ పాట నిమిషాల్లో వైరల్ కావడమే గాక అశేష ప్రజాధరణ పొందింది. నెటిజన్లు కూడా వావ్ అని కితాబిచ్చేస్తున్నారు. వివరాల్లోకెళ్తే..ఈ వీడియోని భారతీయ రైల్వే అకౌంట్స్ సర్వీస్(ఐఆర్ఏఎస్) అధికారి అనంత్ రూపనగుడి నెట్టింట షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి హార్మోనియం వాయిస్తుండగా మరొక వ్యక్తి తబల వాయిస్తూ కనిపించారు. మధ్యలో కూర్చొన్న వ్యక్తి హిందూస్తానీ సంగీతంలో ఆంగ్ల రైమ్ 'జానీ జానీ యస్ పాపా'ను ఆలపించారు. శాస్త్రీయ సంగీతంలో ఆంగ్ల సాహిత్యాన్ని చాలా శ్రావ్యంగా ఆలపించడం ఆశ్చర్యాన్ని కలిగించడమే గాక అత్యద్భుతంగా ఉంది. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది. అంతేగాదు ఇలా వందేళ్ల క్రితమే ఆలపించి ఉంటే.. దెబ్బకు బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయేవారు కదా! అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా క్లాసికల్ టచ్‌తో కూడిన ఆ రైమ్‌ని వినేయండి.! यह अगर 100 साल पहले आता, तो अंग्रेज़ अपना देश खुद छोडकर चले जाते! 😀😛😂 #English #rhymes #Music pic.twitter.com/uolJqbEwde — Ananth Rupanagudi (@Ananth_IRAS) January 20, 2024 (చదవండి: అతడి ఐదుగురు భార్యలు ఒకేసారి ప్రెగ్నెంట్..వాళ్లందరికీ..: మండిపడుతున్న నెటిజన్లు) -
12th ఫెయిల్.. అమెరికన్ యాసలో ఇరగదీసే ‘ఇంగ్లీష్’ టాలెంట్
గలగల స్పష్టమైన ఇంగ్లీష్ మాట్లాడాలని అందరికీ ఆశ ఉంటుంది. అమెరికా వాళ్లనే తలదన్నేలా మంచి అమెరికన్ యాసలో ఇంగ్లీష్ మాట్లాడితే బాగుండని కూడా కొందరు తాపత్రయ పడుతుంటారు. అలాగే ప్రయత్నం చేస్తూ.. ఓ యువకుడు అమెరికన్ యాసలో ఇంగ్లీష్‌ను స్టైలీష్‌గా మాట్లాడి ఇన్స్టాగ్రామ్ సంచలనంగా మారాడు. అతను అమెరికా యాసతో ఇంగ్లీష్ మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి. ఒడిశాకు చెందిన 21 ఏళ్ల ధీరజ్ ఠాక్రీ ఇంగ్లీష్ మాట్లాడిన వీడయోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉండేవాడు. ముందు అతను మాట్లాడే ఇంగ్లీష్, అమెరికన్ యాసపై నెటిజనన్లు విమర్శిస్తూ కామెంట్లు చేసేవారు. కానీ, ఇప్పుడు అతని అమెరికన్ ఇంగ్లీష్ యాస.. ప్రొఫెషనల్ ఇంగ్లీష్ టీచర్ల కంటే అద్భుతంగా ఉండటం విశేషం. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ధీరజ్ ‘ఇంగ్లీష్ టీచర్’గా మారిపోయాడు. View this post on Instagram A post shared by Dhiraj Takri (@dhirajtakri) 12వ తరగతి ఫెయిల్ అయిన ధీరాజ్.. ఇంగ్లీష్ కోసం ఎటువంటి కోచింగ్‌కు వెళ్లలేదు. 2019 నుంచి అతను ఇంగ్లీష్ నేర్చుకోవటం ప్రారంభించాడు. దాదాపు రెండు ఏళ్లు.. 2021 వరకు ఇంగ్లీష్ నేర్చుకోవటం కోసం తరచూ చర్చ్ పాటలు పాడేవాడినని ధీరజ్ తెలిపాడు. స్థానిక యాసతో ఇంగ్లీష్ మాట్లాడేవారి మాటలు శ్రద్ధగా వినేవాడినని చెప్పాడు. అలా తాను ఇంగ్లీష్ నేర్చుకున్నానని తెలిపాడు. అక్కడితో ఆగకుండా తనకు వచ్చిన ఇంగ్లీష్‌ను ఇతరులకు సులభంగా అర్థమయ్యే రీతిలో మీమ్స్, ఫన్నీ వీడియోల రూపంలో దేశీయ స్టైల్లో నేర్పిస్తూ ఇన్‌స్టా టీచర్ అవతారం ఎత్తాడు. మొదట్లో తాను అప్లోడ్ చేసిన విడియోలపై చాలా కామెంట్లు వచ్చేవి.. తన ఇంగ్లీష్ స్పష్టత (అమెరికన్ యాస) మెరుగుపడటంతో కామెంట్లు కూడా తగ్గిపోయినట్లు చెప్పుకొచ్చాడీ ఇన్‌స్టా ‘ఇంగ్లీష్ టీచర్’. View this post on Instagram A post shared by Dhiraj Takri (@dhirajtakri) తనది చాలా పేద కుంటుంబమని తల్లి గాజులు అమ్ముతుందని తెలిపాడు. తన సోదరుడు ఇంగ్లీష్ వీడియోల విషయంలో తనకు అండగా నిలిచాడని చెప్పాడు. ఇంగ్లీష్ భాషపై మరింత నైపుణ్యం మెరుగుపరుకుంటానని అన్నాడు. ప్రస్తుతం ఇండియన్, బ్రిటన్, అమెరికన్ మూడు యాసలను కలిపి మాట్లాడుతున్నాని చెప్పాడు. భవిష్యత్తులో వేరువేరుగా ఇంగ్లీష్‌ను మాట్లాడతానని అన్నారు. View this post on Instagram A post shared by Dhiraj Takri (@dhirajtakri) ఇక.. ఇన్‌స్టాగ్రామ్‌లో ధీరజ్ ఇప్పటివరకు 94 వీడియోలు పోస్ట్ చేశారు. అతనికి ఇప్పటివరకు సుమారు 9 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే అలస్యం ఎందుకు మీరు కూడా ధీరజ్‌లా అమెరికన్ ఇంగ్లీష్ యాసతో ఇంగ్లీష్ మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. చదవండి: Ram Janmabhoomi: ‘చావు తాకుతూ వెళ్లింది’.. కరసేవకుని నాటి అనుభవం! -
ఏపీ బాటలో కర్ణాటక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు వైఎస్ జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన పిక్టోరియల్(»ొమ్మలతో కూడిన) డిక్షనరీల విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం కూడా అమలు చేయబోతోంది. ఏపీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పరిశీలించిన కర్ణాటక రాష్ట్ర అధికారులు తమ విద్యార్థులకు కూడా ఇదే తరహా డిక్షనరీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఏపీ ఎస్సీఈఆర్టీ) సాయంతో కన్నడ–ఇంగ్లిష్ భాషల్లో డిక్షనరీల తయారీని చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ డిక్షనరీలను తమ విద్యార్థులకు అందించాలని భావిస్తోంది. పాఠాల్లోని పదాలతోనే డిక్షనరీ.. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం అమలుతో పాటు ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం ఎస్సీఈఆర్టీ ఇంగ్లిష్–తెలుగు పిక్టోరియల్ డిక్షనరీని రూపొందించింది. 2021–22లో జగనన్న విద్యా కానుకలో భాగంగా ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 23,72,560 మంది విద్యార్థులకు ఈ డిక్షనరీలను ప్రభుత్వం అందించింది. అలాగే 2022–23లో ఒకటో తరగతిలో 3,55,280 మందికి, ఈ ఏడాది కేవీకే–4లో 3,08,676 మందికి కలిపి మొత్తం 30,36,516 డిక్షనరీలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠాల ఆధారంగానే ఏపీ ఎస్సీఈఆర్టీ రంగురంగుల బొమ్మలతో పిక్టోరియల్ డిక్షనరీని రూపొందించింది. దీంతో పాటు ‘లెర్న్ ఏ వర్డ్’ పేరుతో విద్యార్థులకు కొత్త ఇంగ్లిష్ పదాలు నేర్పేలా చర్యలు తీసుకుంది. వాటిని ఎలా పలకాలో, ఎప్పుడు వాడాలో కూడా ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. ఈ విధానం కర్ణాటక అధికారులను ఆకర్షించింది. దీంతో వారు కూడా ఏపీఎస్సీఈఆర్టీ సహకారంతో తమ రాష్ట్రంలో కూడా పిక్టోరియల్ డిక్షనరీ రూపకల్పనకు చర్యలు చేపట్టారు. పూర్తి శాస్త్రీయంగా తయారీ ప్రాథమిక స్థాయి విద్యార్థులు సులభంగా ఇంగ్లిష్ నేర్చుకునేలా తగిన చర్యలు తీసుకున్నాం. ఒకటి నుంచి ఐదు తరగతులకు సంబంధించిన పాఠాల్లోని పదాలతోనే పిక్టోరియల్ డిక్షనరీని ఇంగ్లిష్–తెలుగు భాషల్లో పూర్తి శాస్త్రీయంగా రూపొందించాం. ప్రతిరోజు ఒక పదం నేర్పేలా స్కూళ్లకు ప్రణాళిక ఇచ్చాం. ఈ విధానం కర్ణాటక అధికారులకు నచ్చింది. తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామన్నారు. డిక్షనరీ రూపకల్పనకు తగిన సహకారం అందిస్తున్నాం. – డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, ఏపీ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ -
అక్క ఇంగ్లీష్ కి ఫిదా అవ్వాల్సిందే !
-
మనోనేత్రంతో ముందడుగు...
జ్యోత్స్న ఫణిజ... తెలుగమ్మాయి. ఢిల్లీ... ఏఆర్ఎస్డీలో అసిస్టెంట్ ప్రోఫెసర్. దేశవిదేశాల్లో అవార్డులందుకున్న కవయిత్రి మిస్ కాలేజ్... బెస్ట్ హాఫ్ శారీ విజేత. ర్యాంప్ వాకరే కాదు... మారథాన్ రన్నర్ కూడా. కర్ణాటక, హిందుస్థానీ సంగీత గాయని... చిన్న వయసులో డాక్టరేట్ అందుకున్న చదువరి. స్క్రైబ్ సహాయంతో పరీక్షలు రాసిన జ్యోత్స్న... ఆత్మస్థయిర్యం... ఆత్మవిశ్వాసమే నా కళ్లు అంటోంది. జ్యోత్స్న ఫణిజ సొంతూరు ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లా, కైకలూరు. ఆమె పుట్టినప్పుడు ఆమెలోని జన్యు సమస్యను డాక్టర్లు గుర్తించలేకపోయారు. కంటి సమస్య గురించి ఆరు నెలలకు తెలిసింది. మేనరికపు వివాహం కారణంగా ఇలా జరిగిందని, వైద్యచికిత్సలతో ప్రయోజనం లేదన్నారు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు. అమ్మాయి చదువు కోసం నర్సాపురంలో ఉన్న స్పెషల్ స్కూలు గురించి కూడా వాళ్లే చెప్పారు. ఊహ తెలిసినప్పటి నుంచి తన జీవనప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు జ్యోత్స్న ఫణిజ. అంతులేని ఆప్యాయత ‘‘నా సమస్య తెలిసిన తరవాత ఇంట్లో అందరూ నా గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. నా చదువు కోసం అమ్మమ్మ నర్సాపురంలో ఇల్లు తీసుకుని ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు సంరక్షించింది. అమ్మ సాహిత్యాభిలాష్. నన్ను సాహిత్యానికి దగ్గర చేయడానికి కథలు, హిందీ పాటల క్యాసెట్లు తెచ్చేది. నాకు అనేక ప్రదేశాలు తెలియడం కోసం తరచూ టూర్లకు తీసుకెళ్లేవారు. వాళ్లు కళ్లతో చూసినవన్నీ పూసగుచ్చినట్లు వివరిస్తుంటే నేను మనోనేత్రంతో చూసేదాన్ని. డిగ్రీ వరకు బ్రెయిలీలో చదివాను. డిగ్రీ విజయవాడలోని మేరిస్ స్టెల్లా కాలేజ్‌లో చదివాను. బ్రెయిలీలో త్వరగా పేజీ నిండిపోతుంది. లెక్చరర్లు నోట్స్ డిక్టేట్ చేసేటప్పుడు నన్ను గమనిస్తూ నాకు పేపర్ మార్చుకునే విరామం ఇచ్చేవారు. పరీక్ష రాయడానికి కొన్నిసార్లు లెక్చరర్లే స్క్రైబ్‌గా సహకరించేవారు. ఎగ్జామ్ రాయడానికి నాకు మామూలు వాళ్లకంటే ఎక్కువ సమయం ఇచ్చేవారు. నా పరీక్ష పూర్తయ్యే వరకు నా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేసేవాళ్లు. క్లాస్ మేట్స్ నుంచి క్లాస్ లీడర్, లెక్చరర్లు, ప్రిన్సిపల్ అందరూ ఆప్యాయంగా చూశారు. వారందరి సహకారం వల్లే ఇప్పుడు ఈ స్థాయికి చేరగలిగాను. హైదరాబాద్‌లో ఇఫ్లూలో ఎం.ఏ ఇంగ్లిష్ లిటరేచర్, పీహెచ్డీ చేశాను. పీజీకి వచ్చిన తర్వాత మొత్తం బ్రెయిలీలో రాయడం కుదరదని టైపింగ్ నేర్చుకున్నాను. దాంతో కంప్యూటర్ ఆపరేట్ చేయడం సులువైంది. చదువుతోపాటు కర్ణాటక, హిందూస్థానీ సంగీతం నేర్చుకుని టీవీ ్రపోగ్రాముల్లో పాటలు పాడాను. కాలేజ్‌లో బ్యూటీ కాంటెస్ట్‌లు, ఫ్యాషన్ ర్యాంప్ వాక్ చేశాను. ఇప్పుడు ఢిల్లీలో కూడా మారథాన్లు చేస్తున్నాను. దేనికీ ‘నో’ చెప్పను. అందరూ చర్మచక్షువులతో చూస్తే నేను మనోనేత్రంతో చూస్తాను. రన్లో మాత్రం హెల్పర్ల సహాయం తీసుకుంటాను. పాఠాలు... పేపర్లు ఢిల్లీలో ఏఎస్ఆర్డీ కాలేజ్‌లో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ కూడా సహోద్యోగులు, ప్రిన్సిపల్, స్టూడెంట్స్ ఎంతగా స్నేహపూర్వకంగా ఉంటారో చెప్పలేను. పాఠాలు చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ స్టూడెంట్స్ పేపర్లు దిద్దడంలో మాత్రం మా వారి సహకారం తీసుకుంటాను. రొటేషన్‌లో భాగంగా ఇంగ్లిష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బాధ్యతలు వచ్చాయి. అప్పుడు కొలీగ్స్ ‘చేయలేనని చెప్పకు. అది కెరీర్లో పెద్ద అడ్డంకి అవుతుంది. బాధ్యతలు తీసుకో, మేమున్నాం’ అన్నారు. ఆ భరోసాతో అడ్మినిస్ట్రేషన్బాధ్యతలు తీసుకున్నాను. ‘నువ్వు పేరుకి ఉంటే చాలు, పని మేము చేసి పెడతాం’ అన్నారు. కానీ నా మనసే అంగీకరించలేదు. టైమ్‌టేబుల్ సెట్టింగ్ నుంచి స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ వరకు స్వయంగా చేశాను. పేపర్ వర్క్ అయితే కష్టమయ్యేదేమో, టెక్నాలజీతో అప్డేట్ అవుతుంటాను కాబట్టి మొత్తం డిజిటల్‌గానే చేయగలిగాను. రాష్ట్రపతి పురస్కారం ఇంగ్లిష్ పాఠాలు చెప్పడం నా వృత్తి అయితే, ఇంగ్లిష్ సాహిత్యం నా ప్రవృత్తి అని చెప్పవచ్చు. తెలుగులో నాకు నచ్చిన సాహిత్యాన్ని ఇంగ్లిష్‌లోకి అనువాదం చేస్తున్నాను. నెల్లూరులో పెన్నా రైటర్స్ అసోసియేషన్‌కు చెందిన ప్రముఖ రచయిత మోపూరు పెంచల నరసింహం గారి ఎర్రదీపం రచనను క్రిమ్సన్ ల్యాంప్ పేరుతో, రాతిపాటను స్టోన్సాంగ్ పేరుతో అనువదించాను. వివిధ సామాజికాంశాల మీద జర్నల్స్‌లో 12 వ్యాసాలు రాశాను. రచయితల సదస్సుకు హాజరవుతుంటాను. రచయితల నుంచి ‘దృష్టిలోపం’ అనే ఇతివృత్తం ఆధారంగా రచనలను ఆహ్వనించి ప్రచురించడం, కలకత్తా రైటర్స్ వర్క్‌షాప్‌లో పోయెట్రీ కలెక్షన్‌ను ప్రచురించడంలో కీలకంగా పని చేశాను. డిసెంబర్ మూడవ తేదీ ఇంటర్నేషనల్ డిజేబులిటీ డే సందర్భంగా 2017లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్గారి చేతుల మీదుగా ‘రోల్‌మోడల్’ జాతీయ పురస్కారం అందుకోవడం, ప్రధానమంత్రి నుంచి ప్రశంసాపూర్వకమైన అధికారిక ఉత్తరం అందుకోవడం మాటల్లో చెప్పలేని ఆనందం. ఏడు కవితలకు అవార్డులు వచ్చాయి. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్, నాటా సభలకు ఆహ్వనం, దర్భంగా, మైథిలీ రీజియన్‌లో కుల అణచివేత, ఆదివాసీ సాహిత్యం, దళితుల సమస్యల మీద రాయడం... వంటివి నేను నా జీవితాన్ని ఆదర్శవంతంగా జీవిస్తున్నాననే సంతోషాన్ని కలిగించిన సందర్భాలు. స్ట్రీట్ చిల్డ్రల్డన్ గురించి రాసిన ‘వీథిచుక్క’ రచనకు తెలుగు వాళ్ల నుంచి అందుకున్న ప్రశంసలకు లెక్కలేదు. అందమైన కుటుంబం కుటుంబం విషయానికి వస్తే... డిగ్రీ కాగానే పెళ్లయింది. మా వారు బంధువులబ్బాయే. ఆయనది ఫైనాన్స్ సెక్టార్. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో కాపురం ఉన్నాం. అప్పుడు పీజీ, పీహెచ్డీ చేశాను. నాకు ఢిల్లీలో ఉద్యోగం రావడంతో ఇద్దరు పిల్లలతో ఢిల్లీలో ఉంటున్నాం. ఇక్కడకు వచ్చిన తర్వాత ఫ్రెంచ్‌లో అడ్వాన్స్డ్ డిప్లమో చేశాను. నిత్యం చదువుతూ, రాస్తూ ఉండడం ఇష్టం. అలాగే పిల్లలకు కథలు చెప్పడం ఇంకా ఇష్టం’’ అన్నారు జ్యోతి ఫణిజ. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆంగ్ల మహాసముద్రంలో ఆనంద విహారం!
‘ఇక నీకు పూర్తిగా వచ్చేసినట్లే’ అని ఆంగ్లం ఎప్పుడూ అభయం ఇవ్వదు. ఆంగ్లభాషను ఎప్పటికప్పుడూ శోధిస్తూ పట్టు సాధిస్తూనే ఉండాలి... ఈ విషయంలో స్పష్టతతో ఉన్న యువతరం ఆంగ్ల మహాసముద్రంలో కలుస్తున్న నదులు, వాగులు, వంకల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది. నిత్యావసర భాష అయిన ఆంగ్లంలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సిట్‌కామ్స్ నుంచి చాట్‌జీపీటి టూల్స్ వరకు ఎన్నో దారులలో ప్రయాణిస్తోంది... సిట్కామ్ (సిచ్యువేషనల్ కామెడీ షో)తో కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు అనేది పాత మాట. నవ్వుకోవడమే కాదు పదసంపద, నేటివ్ స్పీచ్‌పై పట్టు సంపాదించడానికి, పదాలతో ముడిపడి ఉన్న భావోద్వేగాల గురించి లోతుగా తెలుసుకోవడానికి సిట్కామ్లలోని విజువల్ ఎలిమెంట్స్ ఉపయోగపడతాయి అనేది నేటి మాట. అలాంటి సిట్కామ్స్లో కొన్ని... చీర్స్ (1982–1993) థీమ్ సాంగ్ ‘ఎవ్రీబడీ నోస్ యువర్ నేమ్’ నుంచి చివరి డైలాగ్ వరకు ఏదో ఒక కొత్తపదం పరిచయం అవుతూనే ఉంటుంది. రకరకాల సెట్లలో కాకుండా ఒకటే లొకేషన్లో చిత్రీకరించడం వల్ల ఒకేచోట పూర్తిగా దృష్టి కేంద్రీకరించవచ్చు. ‘చీర్స్’లోని హాస్యాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఫ్రైజర్ (1993–2004) చీర్స్లోని ఎపిసోడ్లను అర్థం చేసుకున్నవారికి ఫ్రైజర్ కష్టమేమీ కాదు. ఈ సిట్కామ్లోని ప్రధాన పాత్రలైన ఫ్రైజర్, నీల్ మార్టిన్ల క్లీన్ యాక్సెంట్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ‘ప్రైజర్’ నిండా ఇంటెలిజెంట్ హ్యూమర్ వినిపించి కనిపిస్తుంది. ది సింప్సన్స్ (1980) ది సింప్సన్ టీవీ సిరీస్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ యానిమేటెడ్ సిట్‌కామ్‌లో క్యారెక్టర్ల మధ్య నడిచే సంభాషణలు ఫ్యామిలీ టాపిక్స్‌పై ఉంటాయి. రియల్–లైఫ్ ఫ్రేజ్లపై అవగాహనకు ఉపయోగపడుతుంది. పుస్తకాల కంటే సహజమైన భాషను నేర్చుకోవచ్చు. ది వండర్ ఇయర్స్ (1988–93) మధ్యతరగతి కుటుంబానికి చెందిన కెవిన్ అర్నాల్డ్ అనే టీనేజర్ ప్రధాన పాత్రలో కనిపించే సిట్కామ్ ఇది. యువత మానసిక ప్రపంచానికి అద్దం పడుతుంది. కెవిన్ అతని ఫ్రెండ్స్ ఎదుర్కొనే రకరకాల సమస్యలతో యూత్ ఆటోమేటిక్‌గా రిలేట్ అవుతారు. యంగ్ పీపుల్ ఇంగ్లిష్‌లో కమ్యూనికేట్ చేసే పద్ధతిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ది ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్–ఎయిర్ (1990–1996) ఈ హిట్ కామెడీ షోలో ఎక్కువమందిని ఆకట్టుకునే క్యారెక్టర్ విల్ స్మిత్. ఫన్నీ డైలాగులు, జోక్స్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు. సోషల్ క్లాస్ స్పీకింగ్ ఇంగ్లిష్ నుంచి స్ట్రీట్ ఇంగ్లీష్ వరకు అవగాహన ఏర్పర్చుకోవచ్చు. ఫ్యామిలీ మ్యాటర్స్ (1989–1998) ఈ సిట్‌కామ్‌లో కనిపించే రకరకాల ఎక్స్ప్రెషన్లు, గెశ్చర్ లెర్నర్న్కు ఉపయోగపడతాయి. స్పష్టమైన, సంక్షిప్తమైన యాక్సెంట్ వినిపిస్తుంది. కుటుంబ జీవితానికి సంబంధించి ఇళ్లల్లో వినిపించే ఇంగ్లిష్ ఇడియమ్స్ గురించి తెలుసుకోవచ్చు. ది నానీ (1993–1999) రకరకాల యాక్సెంట్లను ఈ సిట్‌కామ్‌లో వినవచ్చు. సామాన్య ప్రజలతో పోల్చితే ధనవంతులు ఎలా మాట్లాడతారో చూడవచ్చు... ఇవి మచ్చుకు కొన్ని సిట్కమ్స్ మాత్రమే. ఎన్నో కోణాలలో భాషను మెరుగు పరుచుకునే సిట్కామ్లు ఎన్నో ఉన్నాయి. అప్–టు–డేట్ ఇంగ్లిష్ లెసన్స్ ఫ్లాట్‌ఫామ్ ‘సెన్సేషన్ ఇంగ్లిష్’పై కూడా యూత్ ఆసక్తి చూపుతుంది. ఇంటర్నేషనల్ న్యూస్ వీడియోలు, ఆర్టికల్స్ ద్వారా 5 లెవెల్స్‌లో భాషను మెరుగు పరుచుకోవచ్చు. ప్రాక్టీస్ యువర్ ఇంగ్లిష్ టుడే’ అంటోంది లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ ప్రోమోవ. మూడువేల పదాలతో కూడిన 40 థీమ్డ్ టాపిక్స్, ఇడియమ్స్, స్లాంగ్ వర్డ్స్, ఎవ్రీ డే ఎక్స్ప్రెషన్స్ ప్రోమోవలో ఉన్నాయి. లైవ్ లెసన్స్, కాన్వర్జేషన్ ఈవెంట్స్, ఏఐ ్ర΄ాక్టీస్ టాస్క్స్, సోషల్ లెర్నింగ్ గేమ్స్, లెర్నింగ్ జర్నీ తమ ప్రత్యేకతగా చెబుతుంది విజువల్ వరల్డ్స్ ఇమార్స్. లాంగ్వేజ్ లెర్నింగ్‌లో కీలక పరిణామం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). స్థానిక, స్థానికేతరులను భాష నైపుణ్యం మెరుగుపరుచుకోడానికి, పర్సనలైజ్డ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఉదా: లెర్నర్స్ బలాలు, బలహీనతల ఆధారంగా పర్సనలైజ్డ్ కరికులమ్‌ను, లాంగ్వేజ్ లెర్నింగ్ గేమ్స్‌ను రూపొందిస్తుంది. తప్పులను ఎత్తి చూపుతుంది. ఇంగ్లిష్ లిరిక్స్ వినడం ద్వారా కూడా భాషలో నైపుణ్యాన్ని పెపొందించుకునే ధోరణి పెరుగుతోంది. దీని ద్వారా ఎప్పటికప్పుడు రకరకాల యాక్సెంట్లను అర్థం చేసుకోవచ్చు. పదసంపద పెంచుకోవచ్చు. బెటర్ ప్రోనన్సియేషన్కు ఉపయోగపడుతుంది. అలనాటి ప్రసిద్ధ ఇంగ్లిష్ పాటల్లో ఎన్నో ప్రయోగాలు కనిపిస్తాయి. ఎల్విన్ ప్రెస్లీ, మైకెల్ జాక్సన్ నుంచి నిన్న మొన్నటి కుర్రకారు సంగీతకారుల వరకు ఎంతోమంది పాత పదాలను కొత్తగా ప్రయోగించారు. ‘ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపకరించే మాటలు’ అంటూ ప్రతి సంవత్సరం కొన్ని పాటలను సిఫారసు చేస్తున్నారు ఆంగ్ల భాషా నిపుణులు. ‘ఇక నాకు అంతా వచ్చేసినట్లే’ అనే మాట ఆంగ్లం విషయంలో ఎప్పటికీ వినిపించదు. ఎందుకంటే... ఆంగ్ల భాష అనగానే వినిపించే ప్రసిద్ధ మాట... వర్క్ ఇన్ప్రోగ్రెస్. అందుకే ఆంగ్లంలో ఎప్పటికప్పుడు సరికొత్త నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికి యువతరం వివిధ మార్గాలలో ప్రయాణిస్తుంది. (చదవండి: కూతురుకి మంచి ర్యాంకు రావాలని ఆ తండ్రి చేసిన పని తెలిస్తే షాకవ్వడం ఖాయం!) -
తర్ఫీదు ఇవ్వకుంటే చిక్కులే!
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్‌లో కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ సబ్జెక్టులోనూ ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించినా, ఇందుకు సంబంధించిన సన్నద్ధత ఎక్కడా కన్పించడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో దీనిపై ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోవడం సందేహాలకు తావిస్తోంది. అసలీ సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఉంటాయా? ఉండవా? అనే అనుమానం విద్యార్థులతో పాటు అధ్యాపకుల నుంచీ వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు సాధారణ క్లాసులే కొనసాగుతుండటం, ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌పై ఏ విధమైన కసరత్తు ప్రారంభం కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బోర్డు నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదని అధ్యాపకులు అంటున్నారు. మార్చి, ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలుంటాయని, మొదట్నుంచీ సరైన శిక్షణ లేకుంటే పరీక్షలు ఎలా రాస్తారని కొంతమంది అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాక్టికల్స్ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, మాక్ టెస్టులు నిర్వహించడం అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. దసరా తర్వాత కార్యాచరణ ఈ ఏడాది నుంచే ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నాం. దసరా తర్వాత అన్ని స్థాయిల్లోనూ అవగాహన కల్పించేందుకు ప్రయల్పింస్తున్నాం. అధ్యాపకులకూ దీనిపై స్పష్టత వచ్చేలా చేస్తాం. ఇంటర్ ప్రవేశాలు ఇంకా జరుగుతున్న కారణంగా ప్రాక్టికల్స్‌కు సమయం ఉంది. –జయప్రదాభాయ్ (ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి) విధివిధానాలు విడుదలైతే స్పష్టత ఇంగ్లీష్‌లో ప్రాక్టికల్స్ తీసుకురావాలన్న ప్రయోగం మంచిదే. దీనిపై అన్ని స్థాయిల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. విధివిధానాలపై బోర్డు త్వరలో స్పష్టత ఇస్తుందని భావిస్తున్నాం. – మాచర్ల రామకృష్ణగౌడ్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీల అధ్యాపకుల సంఘం రాష్ట్ర కన్వీనర్) ఆఖరులో హడావుడితో నష్టం ఆంగ్ల సబ్జెక్టులో 80 మార్కులకు థియరీ పరీక్ష ఉంటుంది. మిగిలిన 20 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. విద్యార్థి ఒక నిమిషంలో తనకు నఇంగ్లీష్ న టాపిక్‌లో మాట్లాడటం, రికార్డు రాయడం, విద్యార్థులు ఇంగ్లీష్‌లో ముచ్చటించడం, ఇంగ్లీష్ చదవడం అనే అంశాలు ప్రాక్టికల్స్‌లో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఏదైనా అంశం గురించి మాట్లాడటం అనే దానిపై తరగతి గదిలో తర్ఫీదు అవ్వాల్సి ఉంటుందని అధ్యాపకులు అంటున్నారు. లేనిపక్షంలో అప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్‌పై బట్టీ పట్టి వచ్చే అవకాశం ఉంటుందని, అందువల్ల ప్రయోజనం ఏమిటని ప్రన్పిస్తున్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్‌పై పట్టు పెరగాలంటే విద్యార్థులు పరస్పరం ఇంగ్లీష్‌లో సంభాషించుకోవడం ముఖ్యం. ఈ ఉద్దేశంతోనే దాన్ని ప్రాక్టికల్స్‌లో చేర్చారు. మరికొద్ది నెలల్లో పరీక్షలు జరగనుండగా ఇప్పటికీ ఈ తరహా ప్రయోగాలు కాలేజీల్లో జరగడం లేదు. రికార్డుల విషయంలోనూ ఇదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. తీరా పరీక్షల ముందు హడావుడి చేస్తే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. మరోవైపు చాలావరకు ప్రైవేటు కాలేజీల్లో ఇప్పటికే సిలబస్ మొత్తం పూర్తయి రివిజన్‌కు వెళ్తున్నారు. ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్‌పైనా విద్యార్థులకు శిక్షణ నడుస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. -
Rameshwar Goud: గురుబోధకుడు
తరగతి గది దేశ భవితను నిర్ణయిస్తుంది. ఇంగ్లిష్ భాష అభివృద్ధిని నిర్ణయిస్తోంది. ఇంగ్లిష్ రాకపోతే పురోభివృద్ధి దరి చేరనంటోంది. గ్రామాల్లో పిల్లలు ఇంగ్లిష్‌లో మెరికలు కావాలంటే... వాళ్లకు చదువు చెప్పే గురువులకు మెళకువలు నేర్పాలి. ‘చక్కటి ఇంగ్లిష్ వచి్చన తెలంగాణ సాధనే నా లక్ష్యం’... అంటున్నారు టీచర్లకు పాఠాలు చెప్తున్న ఈ ఇంగ్లిష్ టీచర్. ‘మంచి ఇంగ్లిష్ రావాలంటే పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదవాలి. నిజమా! నిజమే కావచ్చు. పెద్ద స్కూల్లో చదివిన పిల్లలు నోరు తెరిస్తే ఇంగ్లిషే వినిపిస్తుంది’. సమాజంలో స్థిరపడిపోయి ఉన్న ఒక అభిప్రాయం అది.‘నాకు రెండేళ్లు టైమివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి చేత చక్కటి ఉచ్చారణ, వ్యాకరణ సహితంగా మంచి బ్రిటిష్ ఇంగ్లిష్ మాట్లాడిస్తాను’ అంటున్నారు రామేశ్వర్ గౌడ్. ‘లక్షల సంఖ్యలో ఉన్న విద్యార్థులందరి దగ్గరకు నేను వెళ్లలేను, కాబట్టి ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లకు ఇంగ్లిష్‌లో బోధించడంలో మెళకువలు నేర్పిస్తాను అవకాశం ఇవ్వండి’ అన్నాడు. ఆరు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని 14 జిల్లాల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు బోధించారు. ‘నేను నిర్దేశించుకున్న సమయం మరో ఒకటిన్నర ఏడాది ఉంది. కానీ ఈ లోపే లక్ష్యాన్ని చేరగలననే నమ్మకం కలుగుతోంది’ అన్నారు రామేశ్వర్ గౌడ్ టీచర్స్ డే సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ. శ్రద్ధగా నటించాను! రామేశ్వర్ గౌడ్ సొంతూరు షాద్‌నగర్ సమీపంలో నందిగామ. పాఠశాల విద్య తర్వాత హైదరాబాద్‌కి వచ్చారు. బీఎస్సీ కంప్యూటర్స్ తర్వాత ఉన్నత చదువులకు ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నారు. ఐల్ట్స్ పూర్తి చేసి విదేశాల్లో చదవగలిగిన అర్హత సంపాదించిన తర్వాత మనసు మార్చుకున్నట్లు తెలియచేశారాయన. ‘‘చిన్నప్పటి నుంచి నేను మంచి మాటకారిని. నాకు తెలిసిన విషయాన్ని వివరంగా చెప్పగలిగిన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండేవి. ఐల్ట్స్ (ఐఈఎల్టీఎస్, ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) క్లాసులకు ఏడుగురం ఫ్రెండ్స్ కలిసి వెళ్లాం. క్లాసులో విన్న తర్వాత డౌట్స్ అడిగేవాళ్లు నా ఫ్రెండ్స్. వాళ్లకు వివరిస్తూ ఉన్న క్రమంలో చదువు చెప్పడంలో గొప్ప థ్రిల్ ఉందనిపించింది. అలాగే నన్ను వెంటాడుతూ ఉన్న మరికొన్ని అంశాలు కూడా నా నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి. అవి ఏమిటంటే... కాలేజ్‌లో చేరినప్పటి నుంచి ఒక నరకంలోనే జీవించాను. లెక్చరర్లు ఇంగ్లిష్‌లో పాఠాలు చెప్తుంటే సరిగా అర్థమయ్యేవి కావు. దిక్కులు చూస్తే ...లేపి ప్రశ్న అడుగుతారేమోననే భయంతో శ్రద్ధగా పాఠం వింటున్నట్లు నటించేవాడిని. నా కాలేజ్ చదువంతా బొటాబొటి మార్కులతోనే సాగింది. నేను ఇంటర్వ్యూలకు వెళ్లి, నా వంతు కోసం ఎదురు చూస్తున్న సమయంలో నా లాగ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లు మాట్లాడుతున్న ఇంగ్లిష్‌కి భయపడి ‘ఈ ఉద్యోగం నాకేం వస్తుంది’... అని ఇంటర్వ్యూకి హాజరు కాకుండానే వెనక్కి వచ్చిన సందర్భాలున్నాయి. భాష రాకపోవడం వల్ల ఒక జాతి మొత్తం మూల్యం చెల్లించుకుంటోందా అని ఆవేదన కలిగింది. అప్పటికే వీసా కోసం పాస్‌పోర్టును డ్రాప్ బాక్స్‌లో వేసి ఉన్నాను. అలాంటి సమయంలో మా ఐల్ట్స్ సర్ సురేందర్ రెడ్డితో ‘నేను ఆస్ట్రేలియాకి వెళ్లను. ఇక్కడే ఉండి ఇంగ్లిష్ పాఠాలు చెబుతాను’ అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. నా ఆలోచన తెలిసిన తర్వాత అభినందించారు. ఇక 2007లో తార్నాకలో చిన్న గదిలో ఆరువేల అద్దెతో నా ఇన్స్టిట్యూట్ ‘విల్ టూ కెన్, ద స్ట్రైడ్’ మొదలైంది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పించడం మొదలుపెట్టాను. తర్వాత నా ఇన్‌స్టిట్యూట్‌ని అమీర్‌పేటకు మార్చాను. అదంతా నేను ఆర్థికంగా స్థిరపడడానికి. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఉచితంగా పాఠం చెప్పడానికి అనుమతులు సంపాదించగలిగాను. వాళ్లకు ఇంగ్లిష్ వచ్చు... కానీ! నా పాఠాలు వినే ఉపాధ్యాయులందరూ ఇంగ్లిష్ వచ్చిన వాళ్లే. కానీ ఇంగ్లిష్‌లో పాఠం చెప్పడంలో శిక్షణ పొందిన వాళ్లు కాదు. మనకు ఇంగ్లిష్ భాషను నేర్పించే మెథడాలజీ రూపొందలేదు. దాంతో ఉపాధ్యాయులకు– విద్యార్థులకు మధ్య పెద్ద అగాధం ఏర్పడుతోంది. ఆ ఖాళీని నేను భర్తీ చేశాను. తెలుగు అర్థమై, ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చి ఉంటే చాలు. అనర్గళంగా మాట్లాడించగలిగిన టీచింగ్ మెథడాలజీ రూపొందించాను. టీచర్లకు నేను చెప్తున్న పాఠాలు ఆ మెథడాలజీనే. ఎనభైమూడు వేలమంది టీచర్లున్న రాష్ట్రంలో ఆరు నెలల్లో ముప్ఫైవేల మంది పూర్తయ్యారు. ఇక్కడ మరో విషయాన్ని చెప్పాలి. కరోనా కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. అప్పుడు సమాజం వర్చువల్ విధానంలోకి మారిపోయింది. నేనిప్పుడు బాచుపల్లిలో నా ఇంట్లో కూర్చుని జూమ్ ద్వారా ఏకకాలంలో వేలాదిమందికి పాఠం చెప్పగలుగుతున్నాను. నలభై ఐదు రోజుల సెషన్లో ఒకసారి మాత్రం ఆయా జిల్లాలకు వెళ్లి స్వయంగా ఇంటరాక్ట్ అవుతున్నాను. ‘రియల్ లైఫ్ ఇంగ్లిష్, స్పోకెన్ ఇంగ్లిష్’ అని రెండు పుస్తకాలు రాశాను. గురువు జ్ఞానాన్ని దాచుకోకూడదు! ఈ సందర్భంగా నేను చెప్పేదొక్కటే... ‘నేను నూటికి నూరుపాళ్లూ పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు, నాకు తెలిసిన జ్ఞానాన్ని నూరుశాతం పంచుతున్నాను. టీచర్‌కి ఉండాల్సిన ప్రథమ లక్షణం అదే’’ అన్నారు రామేశ్వర్ గౌడ్. నిజమే... గురువు జ్ఞానాన్ని తనలో దాచుకోకూడదు, విస్తరింపచేయాలి. మా వాళ్లది ధర్మాగ్రహమే! ఆస్ట్రేలియాకు వెళ్లకుండా ఇక్కడ పాఠాలు చెప్పడం వల్ల నేను కోల్పోయిందేమీ లేదు. డబ్బు పరంగా కొంత తగ్గి ఉండవచ్చు. డాక్టర్లు, డిఫెన్స్ రంగాలకు మినహా సినిమా, రాజకీయరంగం, న్యాయరంగం... అనేక రంగాల్లో నిష్ణాతులకు పాఠాలు చెప్పడంతో సెలబ్రిటీ టీచర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు ఉచిత పాఠాల ద్వారా వచ్చిన గౌరవం నాకు సంతృప్తినిస్తోంది. అలాగని నా జర్నీ అలవోకగా సాగలేదు. సక్సెస్ శిఖరానికి చేరేలోపు నేను పొందిన అవమానాలు కూడా చిన్నవేమీ కావు. నా నిర్ణయం తెలిసిన వెంటనే నా ఫ్రెండ్స్ ‘వీడు లైఫ్‌ని కరాబు చేసుకుంటుండు... ఆంటీ’ అని మా అమ్మతో అన్నారు. మా అమ్మ చాలా బాధపడింది. ఎంత చెప్పినా వినలేదని బాధపడి నాతో మాట్లాడడం మానేసింది. ఐదుగురం అన్నదమ్ములం. నలుగురూ నన్ను కోపంగా చూసేవారు. చాలా రోజులు మౌనయుద్ధం చేశారు. ఇంట్లో ఉండలేక వేరే గదిలోకి మారిపోయాను. వాళ్ల కోపం ధర్మాగ్రహమే. నా సంకల్పం అర్థమైన తర్వాత అందరూ సపోర్ట్‌గా నిలిచారు. నా భార్య రచన, పిల్లలు కూడా నా క్లాసుల నిర్వహణలో వాళ్లు చేయగలిగిన సహాయం చేస్తున్నారు. ఆ రకంగా నేను అదృష్టవంతుడిని. – ఎ. రామేశ్వర్ గౌడ్, ఫౌండర్, విల్ టూ కెన్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
బాపట్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఇంగ్లిష్ అదుర్స్
తాము చెప్పాలనుకున్న భావాన్ని వ్యక్తీకరించలేక, ఎలా వ్యక్తం చేయాలో తెలియక విద్యార్థులు సతమతమవుతుంటారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో కమ్యూనికేషనే ప్రధానం. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడంతో అనేకమంది విద్యార్థులు ఉన్నత కొలువులు సాధించడంలో విఫలమవుతుంటారు. మరికొందరు ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించలేక ఉన్నచోటే ఉండిపోతుంటారు. అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాధాన్యతను గుర్తించిన ఓ ఇంగ్లిష్ టీచర్.. విద్యార్థులు ఇకపై తమ భావాన్ని వ్యక్తపరచలేక ఇబ్బంది పడకూడదని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వినూత్నంగా ఆలోచించాడు. ఆ ఆలోచనలోంచి పుట్టిందే పెన్ పాల్ కార్యక్రమం. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోనే దర్శనమిస్తోంది. వాట్సప్ చాటింగ్, ఈ-మెయిల్స్ ద్వారానే ఒకరినొకరు కమ్యూనికేట్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో సదరు ఇంగ్లిష్ టీచర్ లెటర్ల(ఉత్తరాలు)కు పనిపెట్టారు. విద్యార్థులు తాము చెప్పాలనుకున్న భావాన్ని, విషయాన్ని ఉత్తరాల్లో రాయాలని సూచిస్తున్నాడు. ఇలా రాయడం వల్ల ఇంగ్లిప్ ప్లూయెన్సీగా రావడంతో పాటు, విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలోని ఐలవరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పచ్చారు హరికృష్ణ పనిచేస్తున్నాడు. విద్యార్థుల్లోని హ్యాండ్ రైటింగ్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వారి భావాలను స్పష్టంగా వ్యక్తీకరించాలని సూచిస్తున్నాడు. ఇందుకోసం నాలుగేళ్ల కిందట ప్రారంభించిన పెన్‌పాల్ కార్యక్రమం క్రమేణా సత్ఫలితానిస్తోంది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అమెరికాలోని Nebraska ప్రాంతంలో ఉన్న రీగాన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో కమ్యూనికేట్ అవుతున్నారు. దీంతో మన విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు గణనీయంగా మెరుగయ్యాయి. విద్యార్థులు తమ దినచర్య, పండుగలు, సెలవులు, తాము చదువుకునే పాఠాలు ఇలా.. ప్రతీ ఒక్కదాన్ని అమెరికాలోని తమ మిత్రులతో పంచుకుంటున్నారు. ఐలవరం పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న కె.రాగనందిని మాట్లాడుతూ "ఒకసారి నేను అమెరికా జెండాను చూడలేదని నా పెన్ స్నేహితుడితో చెప్పాను. అతను మాకు ఆ దేశ జెండాలను పంపాడు. అలాగే స్థానికంగా లభించే చాక్లెట్లు, టీ-షర్టులు పంపించాడు. వారికి నేను భారత జెండాలు, బిస్కెట్లు, ఇతర వస్తువులను పంపించా' అని తన అనుభవాన్ని పంచుకుంది. అమెరికా టు బాపట్లకు ఉత్తర ప్రత్యుత్తరాలు ఖర్చుతో కూడుకున్నవి. విద్యార్థులు రాసే ఉత్తరాలను కొరియర్ ద్వారా పంపడానికి రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఖర్చవుతోందని.. ఈ మొత్తాన్ని తానే పెట్టుకుంటున్నట్లు హరికృష్ణ చెబుతున్నాడు. ప్రతీ ఏటా మూడు దఫాలుగా ఉత్తరాలను పంపిస్తున్నారు. పెన్ పాల్ ప్రోగ్రామ్‌తో పాటు మన విద్యార్థులు యుఎస్, కెనడా, మెక్సికో, స్వీడన్, క్రొయేషియా, డెన్మార్క్, ఫ్రాన్స్, పోలాండ్, ట్యునీషియా, జపాన్, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్, చిలీ, టర్కీతో సహా 60 దేశాలలోని సుమారు 300 పాఠశాలల విద్యార్థులతో స్కైప్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నారు. స్పేస్ సైన్స్, సోషల్ స్టడీస్ గురించి విద్యార్థులు చర్చించుకుంటారని ఉపాధ్యాయుడు హరికృష్ణ చెబుతున్నారు. హరికృష్ణ ఇలా ఇప్పటివరకు స్కైప్ ద్వారా నాసా ప్లానెటరీ సైన్స్ విభాగంలో ప్రోగ్రామ్ సైంటిస్ట్ హెన్రీ థ్రోప్, నాసా చీఫ్ టెక్నాలజిస్ట్ జేమ్స్ ఆడమ్స్, ఎక్స్‌ఫ్లోర్ మార్స్ ప్రెసిడెంట్ జానెట్ ఐవీ, స్విట్జర్లాండ్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త క్లెయిర్ లీలతో విద్యార్థులు సంభాషించారు. ఫేస్‌బుక్‌ను ప్రధాన సాధనంగా ఉపయోగించుకుని, తాను ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు హరికృష్ణ చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులతో సంప్రదింపులు జరిపి, వారి అనుమతితో పెన్ పాల్ ఏర్పాటు చేశానని పేర్కొంటున్నాడు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులలో కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడం కోసమే తాను ఈ వినూత్న పద్ధతిని రూపొందించినట్లు చెప్పారు. తాను రూపొందించిన కార్యక్రమం వల్ల విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగయ్యాయని, స్నేహితులతో తమ భావాలను చక్కగా వ్యక్తీకరించుకోగలుగుతున్నారని... ఒక ఉపాధ్యాయుడిగా తనకు ఇతకంటే ఏంకావాలని అంటున్నారు హరికృష్ణ. -
అమ్మ కుట్టీ అమ్మ కుట్టీ... వెళ్దాం ఛలో ఎలి.కుట్టీ
అవసరమే కాదు ఆసక్తి కూడా కొత్త భాషను దగ్గర చేస్తుందని మలయాళ భాషను గడగడా మాట్లాడే ఎలిజెబెత్ కీటోన్‌ను చూస్తే అర్థమవుతుంది. జార్జియా (యూఎస్)కు చెందిన ఎలిజబెత్ ఇంగ్లీష్ టీచర్. కొత్త భాషలు నేర్చుకోవడం అంటే ఇష్టం. సౌత్‌కొరియా ఆ తరువాత యూఏఈలో ఇంగ్లీష్ పాఠాలు చెప్పింది. దుబాయ్‌లో ఉన్నప్పుడు మలయాళీ కుర్రాడు అర్జున్‌తో ఎలిజబెత్‌కు పరిచయం అయింది, ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లయింది. ఇక అప్పటి నుంచి శ్రీవారి మాతృభాషను నేర్చుకోవాలని డిసైడై పోయింది ఎలిజ బెత్. ‘30 రోజుల్లో మలయాళం’లాంటి ఔట్‌డేటెడ్ పుస్తకాలు, మార్గాలు తప్ప కొత్తవి కనిపించలేదు. దీంతో కోళికోద్లో ఉన్న ఒక టీచర్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో మలయాళం భాష నేర్చుకోవడం మొదలుపెట్టింది. అయితే సాంకేతిక కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తనదైన స్టైల్లో సొంతంగా నోట్స్ రాసుకొని, డూడుల్స్ తయారు చేసుకొని మలయాళ భాషపై పట్టు సంపాదించింది. ‘ఎలి.కుట్టీ’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తి ఉన్నవారికి మలయాళం నేర్పుతోంది. -
ఈ ఒక్క ఫీచర్ చాలు.. గ్రామర్‌లో తప్పులు ఇట్టే పట్టేస్తుంది!
Google Grammar Check Feature: ఈ రోజుకి కూడా ఇంగ్లీషులో గ్రామర్ మిస్టేక్స్ చేసేవారి సంఖ్య భారీగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ దీని కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ ఇప్పుడు తన గూగుల్ సెర్చ్‌లో వినియోగదారుల కోసం 'గ్రామర్ చెక్ ఫీచర్' తీసుకువచ్చింది. ఇది ప్రస్తుతం ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని భాషలకు అందుబాటులో ఉండనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫీచర్ ద్వారా ఒక వాక్యం గ్రామర్ పరంగా సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా నేరుగా గ్రామర్ చెక్ చేసుకోవచ్చు. అంటే వాక్యాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా? అని చెక్ చేసుకోవడానికి ప్రత్యేకించి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. ఈ ఫీచర్ ఉపయోగించడం కూడా చాలా సులభం. నిజానికి ప్రతి సారీ గ్రామర్ చెక్ కోసం పేజ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, అయితే దీనిని మీరు ఉపయోగిస్తున్నప్పుడు గ్రామర్ చెక్ అనే టూల్ పాప్ అప్ అవుతుంది. ఇదీ చదవండి: ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ! దీని ద్వారా మీరు ఒక వాక్యం ఎంటర్ చేయగానే అందులో గ్రీన్ చెక్ మార్క్ చూపిస్తుంది, అందులో ఏదైనా తప్పు ఉంటె రెడ్ మార్క్ చూపిస్తుంది. గ్రామర్ మాత్రమే కాకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేస్తుంది. ఈ లేటెస్ట్ ఫీచర్ కంప్యూటర్లలో, స్మార్ట్ఫోన్లలో ఉపయోగించుకోవచ్చు. -
78 ఏళ్ల తాతకు నైన్త్‌లో అడ్మిషన్.. స్కూలుకు ఎలా వెళుతున్నాడంటే..
మిజోరంనకు చెందిన 78 ఏళ్ల తాత భుజానికి స్కూలు బ్యాగు ధరించి, యూనిఫారం వేసుకుని క్రమం తప్పకుండా రోజూ స్కూలుకు వెళుతున్నాడు. ఇదేమీ జోక్ కాదు.. ముమ్మాటికీ నిజం. నార్త్ ఈస్ట్ లైవ్ టీవీ తెలిపిన వివరాల ప్రకారం మిజోరంలోని చమ్ఫాయి జిల్లాలోని హువాయికాన్ గ్రామానికి చెందిన లాల్‌రింగథర కథ ప్రతీ ఒక్కరికీ స్ఫూరిగా నిలుస్తుంది. ప్రస్తుతం లాల్‌రింగథర హువాయికోన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నాడు. 1945లో భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని ఖువాంగ్లెంగ్ గ్రామంలో జన్మించిన లాల్‌రింగథర తన తండ్రి మరణించిన కారణంగా 2వ తరగతిలోనే చదువును విడిచిపెట్టాల్సి వచ్చింది. వారి ఇంటిలో అతనొక్కడే సంతానం అయిన కారణంగా తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ, కూలీనాలీ చేస్తూ జీవనం కొనసాగించాడు. ఉపాధి రీత్యా ఒకచోట నుంచి మరో చోటుకు మారి, చివరకు 1995లో న్యూ హువాయికాన్ గ్రామంలో స్థిరపడ్డాడు. ఉదరపోషణ కోసం ఈ వయసులోనూ స్థానిక ప్రోస్బిటేరియన్ చర్చిలో గార్డుగా పనిచేస్తున్నాడు. తన ఆర్థిక పరిస్థితుల కారణంగా పాఠశాల విద్యను కొనసాగించలేకపోయాననే బాధ అతనిని నిత్యం వెంటాడేది. అలాగే ఆంగ్లంలో నైపుణ్యం సంపాదించాలని, ఆంగ్ల భాషలోని వివిధ దరఖాస్తులను నింపాలనేది అతని లక్ష్యం. అందుకోసమే ఈ వయసులోనూ అతను పాఠశాలకు వెళుతున్నాడు. లాల్‌రింగథర మీడియాతో మాట్లాడుతూ ‘నాకు మిజో భాష చదవడంలోనూ, రాయడంలోనూ ఎటువంటి సమస్య లేదు. అయితే చదువుకోవాలనేది నా అభిలాష. ఆంగ్ల భాష నేర్చుకోవాలనేది నా తీరని కోరిక. నేటి రోజుల్లో ఎక్కడ చూసినా ఆంగ్ల పదాలు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు నేను ఇబ్బంది పడుతుంటారు. అందుకే నేను ఆంగ్ల భాషను నేర్చుకోవాలనే తపనతో రోజూ స్కూలుకు వెళుతున్నాను’ అని తెలిపాడు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వన్లాల్‌కిమా మాట్లాడుతూ ‘లాల్‌రింగథర అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలిచాడు’ అని అన్నారు. కాగా లాల్‌రింగథర ప్రతిరోజూ ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం నడిచి, స్కూలుకు చేరుకుంటాడు. ఇది కూడా చదవండి: మరో ‘సీమా- సచిన్’.. ఆన్లైన్ గేమ్‌తో ప్రేమజంటకు రెక్కలు.. -
గురుకుల పరీక్షలకు 86.54 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 9వేల ఉద్యోగాల భర్తీకి ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీఆర్‌ఈఐఆర్‌బీ అధికారులు పక్కాగా ఏర్పాటు చేశారు. గురుకుల ఉద్యోగాల భర్తీలో ఈసారి కొత్తగా కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) విధానంలో పరీక్షలు నిర్వహించారు. గురుకుల బోర్డు ద్వారా నిర్వహిస్తున్న మొట్టమొదటి సీబీఆర్టీ పరీక్షలను టీఆర్‌ఈఐఆర్‌బీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు తొలిరోజు సజావుగా సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా 104 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభం కాగా మొదటి రోజున మూడు సెషన్లలో సగటున 86.54 శాతం అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొదటి రోజున మూడు సెషన్లలో ఆర్ట్ టీచర్ పేపర్–1, క్రాఫ్ట్ టీచర్ పేపర్–1, మ్యూజిక్ టీచర్ పేపర్–1 పరీక్షలు జరిగాయి. ఈ మూడు పరీక్షలకు మొత్తంగా 10,920 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా... కేవలం 9,450 మంది మాత్రమే హాజరయ్యారు. ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఇచ్చారని ఆందోళన మంగళవారం ప్రారంభమైన పోటీ పరీక్షల్లో మొదటిరోజు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ విభాగాలకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ప్రశ్నపత్రం పూర్తిగా ఆంగ్లంలో మాత్రమే ఇచ్చారు. నోటిఫికేషన్లో మాత్రం తెలుగు, ఆంగ్లంలో ప్రశ్నపత్రం ఇస్తామని ప్రకటించారని, ఇప్పుడు ఇలా చేయడమేమిటని పలుచోట్ల అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. పైగా సరిపడా కంప్యూటర్లు లేకుండానే ఆఫ్‌లైన్‌కు బదులు ఆన్లైన్ విధానంలో పరీక్షలు పెట్టడమేమిటని ప్రశ్నించారు. ఈ విషయాలపై తాము కోర్టుకు వెళ్లనున్నట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల కేటాయింపుపై గందరగోళం.. ఆప్షన్ ఇచ్చిన జిల్లా, చుట్టుపక్కల జిల్లాలు కాకుండా 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం పట్ల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహిళా, గర్భిణి, బాలింత అభ్యర్థులు పరీక్షలను రాయలేని పరిస్థితి నెలకొంది. ఇతర అభ్యర్థులు సైతం వేల రూపాయలు చార్జీలకోసం వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు అభ్యర్థులు డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీటికి పేపర్–1, పేపర్–2, పేపర్–3 రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు సైతం ఒక్కో పరీక్షను ఒక్కో జిల్లాలో వందల కిలోమీటర్ల దూరం వెళ్లి రాయాల్సిన విధంగా కేంద్రాలు ఇచ్చారు. -
సంస్కృతంలో వాళ్లెందుకు రాయరు?
సంస్కృతాన్ని ఇష్టపడే కొందరు భారతీయ అమెరికన్లు తమ పుస్తకాలను సంస్కృతంలో ఎందుకు రాయరు? వీరు ఆంగ్లంలో రాస్తూనే, ఆ భాషను వలసవాదమంటూ దాడి చేస్తారు. చారిత్రకంగా సంస్కృతాన్ని కొందరు రచయితలే నియంత్రించారు. వారు దాని ప్రాప్యతను, విస్తృతిని పరిమితం చేశారు. శూద్రులకు ఆ భాషలో చదవడానికి, రాయడానికి గల అవకాశాన్ని నిరాకరించారు. కానీ, ఇప్పుడు వాళ్లూ సామాజికపరమైన లేదా విద్యాపరమైన ప్రాముఖ్యం కలిగిన పుస్తకాలు రాయడానికి సంస్కృతాన్ని ఉపయోగించడం లేదు. అలా సంస్కృత అంతర్ధానానికి చైతన్యవంతంగా బాధ్యత వహిస్తున్నారు. అయినా ఆ అంతర్ధానానికి మాత్రం మిగిలిన ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు. దాదాపుగా భారతీయ అమెరికన్లతో కూడిన రాజీవ్ మల్హోత్రా నేతృత్వంలోని బృందం ఇటీవల ‘టెన్ హెడ్స్ ఆఫ్ రావణ: ఎ క్రిటిక్ ఆఫ్ హిందూఫోబిక్ స్కాలర్స్’ పుస్తకాన్ని ప్రచురించింది. ఇంగ్లిషులో రాసిన ఈ పుస్తకం... ఈ రచయితతో సహా రొమిల్లా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, శశిథరూర్, రామచంద్ర గుహ, దేవదత్ పట్నాయక్, షెల్డన్ పొలాక్, వెండీ డోనిగర్, ఆద్రీ త్రూష్కే, మైకేల్ విట్జెల్లను విమర్శించింది. మల్హోత్రా బృందం ఈ పండితులను పౌరాణిక పాత్ర అయిన రావణుడితో పోల్చింది. ఈ పండితులు ప్రాచీన సంస్కృత పుస్తకాలు ప్రబోధించిన ధర్మాన్ని చంపేశారని ఆరోపించింది. ‘చారిత్రక రావణుడికి మల్లే ఈ పండితుల రచనల్లో నేడు చాలామంది హిందువులు అధర్మంగా భావిస్తున్న అంశాలు ఉన్నాయి కాబట్టే ఈ పుస్తకంలో పది మంది సమకాలీన విద్వాంసులను లక్ష్యంగా’ ఎంచుకున్నట్లు మల్హోత్రా తన పరిచయంలో పేర్కొన్నారు. ఈ పుస్తకంలో లక్ష్యంగా ఎంచుకున్న నలుగురు విదేశీ పండితులు సంస్కృత భాషపై కృషి చేశారు. చాలాకాలం వివిధ పాశ్చాత్య విశ్వ విద్యాలయాలలో సంస్కృత భాషను బోధించారు. మరోవైపు, మల్హోత్రాకు అమెరికాలో ‘ఇన్ఫినిటీ ఫౌండేషన్’ అనే ఆర్థిక నెట్వర్క్ ఉంది. ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఢిల్లీలోని ‘గరుడ ప్రకాశన్ ’ సంస్థనూ నడుపుతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే: సంస్కృతాన్ని ఇష్టపడే ఈ భారతీయ అమెరికన్లు తమ పుస్తకాన్ని సంస్కృతంలో ఎందుకు రాయలేదు? వీరు ఆంగ్లంలో రాస్తూనే, ఆ భాషను వలసవాదమంటూ దాడి చేస్తారు. సంస్కృతాన్ని గొప్ప ప్రపంచ సజీవ భాష అంటారు, కానీ ఆ భాషలో ఏ గ్రంథాన్నీ రాయరు. సంస్కృతాన్ని మృత భాష అని షెల్డన్ పొల్లాక్ సరిగ్గానే అన్నారు. తమ దైనందిన జీవితంలో సంస్కృతాన్ని ఉప యోగించే, అందులో భావ వ్యక్తీకరణ చేసే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఒక భాషను స్థానికంగా మాట్లాడేవారు లేనప్పుడు భాష మరణిస్తుంది. ఆధిపత్య నియంత్రణను కొనసాగించడానికి సంస్కృతాన్ని ఉపయోగించే వ్యక్తుల సమూహమే ఆ భాషను చంపేసింది. చారిత్రకంగా సంస్కృతాన్ని కొందరు రచయితలే నియంత్రించారు. వారు దాని ప్రాప్యతను లేదా విస్తృతిని పరిమితం చేశారు. శూద్రులకు ఆ భాషలో చదవడానికి లేదా రాయడానికి గల అవకాశాన్ని నిరాకరించారు. సామాజికపరమైన లేదా విద్యాపరమైన ప్రాముఖ్యం కలిగిన పుస్తకాలు రాయడానికి సంస్కృతాన్ని ఇప్పుడు వాళ్లూ ఉపయోగించడం లేదు. అలా సంస్కృత అంతర్ధానానికి చైతన్యవంతంగా బాధ్యత వహిస్తున్నారు. కానీ ఆ అంతర్ధానానికి మిగిలిన ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు. ఇతర సంస్కృతులకు చెందిన యూదుల వంటివారు తమ ఆధునిక పుస్తకాలను హీబ్రూలో రాస్తున్నారు. యువల్ నోవా హరారీ ప్రభావవంతమైన రచన ‘సేపియన్స్– ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్’ను మొదట హీబ్రూలోనే రాశారు. అలాగే గ్రీకులు గ్రీకు భాషలో రాస్తారు. అరబ్బులు అరబిక్‌లోనే రాస్తారు. బ్రాహ్మణ వాదులు మాత్రం సంస్కృతంలో రాయరు. శూద్ర, దళిత, ఆదివాసీ ప్రజానీ కాన్ని మోసం చేయడానికి మాత్రమే సంస్కృతాన్ని పొగడటాన్ని నేటికీ కొనసాగిస్తున్నారా? బ్రాహ్మణవాద మేధావులకు ఆరెస్సెస్, బీజేపీ ఆర్థికంగా, సంస్థాగతంగా మద్దతు ఇస్తున్నాయి. భారతదేశ వ్యవసాయ చేతివృత్తుల చరిత్రను విస్మరిస్తూ సంస్కృత గతాన్ని మాత్రమే వీరు కీర్తిస్తున్నారు. వివిధ విభాగాలలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న జ్ఞానాన్నంతటినీ సంస్కృత గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, రామాయణం, మహాభారతాల నుండే దొంగిలించారనే భావనను ప్రచారం చేస్తారు. బ్రాహ్మణవాద శాస్త్రవేత్తలు కూడా ఆధునిక విజ్ఞాన శాస్త్రాలన్నీ ప్రాచీన సంస్కృత పుస్తకాలలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పండితుల్లో ఎంతమంది సంస్కృతంలో ఆ పుస్తకాలను చదివారు? సంస్కృతంలో ఇంత అపారమైన సృజనాత్మక శక్తి ఉన్నట్లయితే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న భారతీయ మేధావులు... ప్రపంచ తాత్విక, మే«ధాపరమైన రచనలను హరారీ వంటి వ్యక్తులకు ఎందుకు వదిలివేస్తున్నారు? భారతదేశ చరిత్ర పొడవునా సంస్కృతాన్ని ‘మాతృభాష’గా కాకుండా ‘పితృభాష’గా పరిగణిస్తూ వచ్చారు. సంస్కృతాన్ని ద్విజ కుటుంబాలలో కూడా మాతృభాషగా మారడానికి అనుమతించలేదని గుర్తుంచుకోవాలి. తల్లి, ఆమె బిడ్డల మధ్య సంభాషణతో సహా ఇంటిలో రోజువారీ జీవితంలో ఒక భాషను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మాత్రమే దానిని ‘మాతృభాష’గా పరిగణించవచ్చు. కులీన గృహాలలో కూడా సంస్కృతాన్ని మాతృభాషగా మారడానికి అనుమతించనప్పుడు, ఉత్పత్తి వర్గాల్లో దాన్ని స్వీకరించే ప్రశ్న తలెత్తదు. ఈ పరిస్థితుల దృష్ట్యా, నాగరికతకు రక్షణకర్తలుగా తమను తాము గుర్తించుకునే ఈ భారతీయ అమెరికన్ల సమూహం... సంస్కృతంలో తమ పుస్తకాలను ఎందుకు రాయడం లేదని ప్రశ్నించాల్సి ఉంది. ఈ బృందం ప్రధానంగా అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియాల్లో నివసిస్తున్న వ్యక్తులలోని భారతీయ ఆలోచనా విధానాన్ని నిర్వలసీకరించడం, ఆర్థిక వనరులను సమీకరించడం లక్ష్యంగా పెట్టు కుంది. కానీ, భారతదేశంలో స్థాపించిన సంస్కృత పాఠశాలలు,సంస్కృత విశ్వవిద్యాలయాలకు వారు తమ పిల్లలను ఎందుకు పంపరు? బదులుగా వారు తమ పిల్లలను ప్రతిష్ఠాత్మకమైన అమెరికన్ విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఎందుకు పంపాలని భావిస్తున్నారు? ‘టెన్ హెడ్స్ ఆఫ్ రావణ’ పుస్తకాన్ని రచించిన ఈ వ్యక్తులు,సంస్కృత పుస్తకాల నుండి వచ్చిన భారతదేశ నాగరికత మా లాంటి ఎవరికీ తెలియదని ఆరోపించారు. నాగరికత అంటే వారి దృష్టిలో అర్థం ఏమిటి? పుస్తకాల ద్వారా నాగరికతను నిర్మించవచ్చా? సంస్కృత పుస్తకాలకు చెందిన ఏదైనా అనువాదాన్ని చదివితే... శూద్ర, దళిత, ఆదివాసీ వర్గాల నుండి సామాజిక శక్తులు ఏవీ లేవని అది సూచిస్తుంది. ఇవి యుద్ధం, యజ్ఞాలు, క్రతువుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. ఆహార ఉత్పత్తి, సేకరణ, జంతువుల మేతకు చెందిన వ్యవస్థలను ఈ పుస్తకాలలో ఏ కోశానా పొందుపర్చలేదు. ఈ హిందూత్వ రచయితలతో సహా మానవులందరూ శూద్ర వ్యవసాయా ధారిత ప్రజానీకం ఉత్పత్తి చేసే ఆహారంతోనే జీవిస్తున్నారని గుర్తించడం ముఖ్యం. ఆ ‘సంస్కృత యుగం’లో భూమిని పండించిన వారి గురించి, జంతువుల మేత ద్వారా మాంసాన్ని, పాలను ఉత్పత్తి చేసిన వారి గురించి ఎప్పుడూ రాయలేదు. హాస్యాస్పదంగా, ఈ భారతీయ అమెరికన్ కులీన వర్గాలు, ప్రత్యేకించి అమెరికాలో కుల వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించే ఇన్ఫినిటీ ఫౌండేషన్ సభ్యులు తమను తాము ‘మేధావులైన క్షత్రియులు’గా పేర్కొంటారు. అది కులతత్వం కాదా? మరోవైపున వీరి సంస్కృత యుగం పట్ల దళితులు, ఆదివాసీలు, శూద్రులకు ఏ మాత్రం ఆసక్తి లేదు. ఇంగ్లిష్ యుగంలోకి వెళ్లాలనీ, జ్ఞానోత్పత్తికి సంబంధించిన అన్ని కేంద్రాల నుండి ఈ శక్తులను స్థానభ్రంశం చేయాలనీ, ఆహార ఉత్పత్తి, జ్ఞానోత్పత్తి మధ్య సంబంధాన్ని ప్రతిష్ఠించాలనీ వారు కోరుకుంటున్నారు. ఇది అమృత్ కాల్ కాదు; నిజానికి ఇది శూద్ర కాలం. ఈ యుగంలో సంస్కృత పుస్తకాలలో వర్ణించినట్లుగా ఉత్పత్తి అనేది లోకువైనది కాదు; ఇక్కడ ఉత్పత్తి చాలా పవిత్రమైనది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
బడిలో ‘బైలింగ్యువల్’ భళా!
గుంటూరు చౌత్ర సెంటర్లోని ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 545 మంది విద్యార్థినులు చదువుతున్నారు. గతేడాదితో పోలిస్తే 40 మంది పెరిగారు. ప్రవేశాలు ఇంకా నమోదవుతున్నాయి. గతంలో ఇక్కడ ఉర్దూ మీడియం మాత్రమే ఉండగా ఇప్పుడు ఇంగ్లిష్‌లోనూ బోధిస్తున్నారు. పాఠ్య పుస్తకాలు ఇంగ్లి ష్–ఉర్దూలో ఉండడంతో ఆంగ్ల భాషను సులభంగా ఆకళింపు చేసుకుంటున్నారు. నగరంలోని రెండు ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలల్లో ఇదే పరిస్థితి. ఇటీవల ప్రభుత్వం సమకూర్చిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల ద్వారా మరింత మెరుగ్గా బోధన కొనసాగుతోంది. గుంటూరు నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి:సంస్కరణలు చేపట్టి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలుగేతర మాతృభాష విద్యార్థులు సైతం చదువుల్లో రాణించేలా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను రూపొందించింది. రెండో అధికార భాషకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ 5,286 ఉర్దూ మీడియం పాఠశాలల్లో చదువుతున్న 62,777 మంది విద్యార్థులకు బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్‌ను సమకూర్చింది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని స్కూళ్లలో చదివే విద్యార్థుల సౌలభ్యం కోసం కన్నడ, తమిళం, ఒడియా భాషల్లో బైలింగ్యువల్ పుస్తకాలను ముద్రించి అందిస్తోంది. నాలుగు మైనర్ భాషల్లో 85,469 మంది బడికెళ్లే వయసున్న ప్రతి చిన్నారి చదువుకోవాలన్న సంకల్పంతో తెలుగేతర మాతృభాషల విద్యార్థులను సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తమిళం మాతృభాషగా ఉన్న 1,316 మంది విద్యార్థుల కోసం బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను ముద్రించారు. ఒడియా మాధ్యమంలో 8,599 మంది, కన్నడలో 10,485 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆరు నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న వీరి కోసం కూడా ప్రభుత్వం బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ, కన్నడ, ఒడియా, తమిళం భాషల్లో 85,469 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. దేశంలో మైనర్ భాషల్లో బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్‌ను అందుబాటులోకి తెచ్చిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కేంద్ర విద్యాశాఖ ప్రశంసలు అందుకుంది. కచ్చితంగా మెరుగైన ఫలితాలు.. గతంలో సైన్స్ పాఠం ఎన్నో ఉదాహరణలతో చెప్పినా చాలామందికి అంతుబట్టేది కాదు. విద్యార్థులు ఎవరికి తోచినట్లు వారు ఊహించుకునేవారు. ఇప్పుడు ఐఎఫ్‌పీ స్క్రీన్లు వచ్చాక ప్రతి అంశాన్ని విపులంగా ఆడియో, వీడియో రూపంలో చెప్పగలుగుతున్నాం. విద్యార్థులు బాగా అర్థం చేసుకుంటున్నారు. కచ్చితంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది. గతంలో మరుగుదొడ్లు లేక బాలికలు చదువులకు దూరమైన సందర్భాలున్నాయి. ఇప్పుడు అన్ని వసతులు ఉండడంతో గౌరవంగా చదువుకుంటున్నారు. – డి.యల్లమందరావు (ఫిజిక్స్ ఉపాధ్యాయుడు), ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాల, గుంటూరు వేగంగా అద్భుతమైన మార్పులు.. గతంలో ఉర్దూ మీడియం విద్యార్థులు అదే భాషలో రాసేవారు. ఇప్పుడు బైలింగ్యువల్ పుస్తకాలు ఉర్దూ–ఇంగ్లిష్‌లో ఉండడంతో బోధన, అర్థం చేసుకోవడంలో చాలా మార్పులు వచ్చాయి. ఇటీవల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడంతో ప్రతి అంశాన్ని చక్కగా గ్రహించి ఇంగ్లిష్‌లోనే నోట్స్ రాస్తున్నారు. తక్కువ సమయంలోనే అద్భుతమైన మార్పు వచ్చింది. – అబ్దుల్ కయ్యూమ్, మ్యాథ్స్ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాల, గుంటూరు ఇప్పుడెంతో బాగుంది.. మా ఇంట్లో మాకంటే ముందు చదువుతున్న వారు పుస్తకాలు కొనేందుకు చాలా ఇబ్బంది పడేవారు. మాకు అలాంటి పరిస్థితి లేదు. బ్యాగు నుంచి పుస్తకాలు, యూనిఫారం వరకు అన్నీ ప్రభుత్వమే ఇస్తోంది. మధ్యాహ్నం మంచి భోజనం పెడుతున్నారు. వాష్‌రూమ్‌లు పరిశుభ్రంగా ఉన్నాయి. బడిలో దేనికీ లోటు లేదు. కొత్తగా ఐఎఫ్‌పీ స్క్రీన్లతో పాఠాలు చెప్పడం ఎంతో బాగుంది. – మహ్మద్ తనాజ్, పదో తరగతి విద్యార్థిని, ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాల, గుంటూరు -
‘మత్స్య కన్య’గా మారిన ఇంగ్లీష్ టీచర్.. చూసేందుకు జనం పరుగులు!
ప్రపంచంలో లెక్కకుమించినంతమంది తమ ఉద్యోగాలను అయిష్టంతోనే చేస్తుంటారనే వాదన వినిపిస్తుంటుంది. అయితే వారు తమ హాబీతో ఏమైనా సాధించవచ్చని తపన పడుతుంటారు. అయినా అందుకు తగిన ప్రయత్నాలు చేయరు. కొందరు మాత్రం ఈ ప్రపంచం ఏమనుకున్నా, ఎటుపోయినా తాము అనుకున్నది చేసి చూపిస్తారు. అద్భుతాలు అందిస్తారు. ఇదే కోవలోకి వచ్చే ఒక మహిళ తన హాబీనే తన ఉద్యోగంగా మలచుకుని అత్యధికంగా సంపాదిస్తోంది. ఇందుకోసం ఆమె ఇంతవరకూ చేస్తూ వచ్చిన బోరింగ్ ఉద్యోగాన్ని విడిచిపెట్టేసింది. మత్స్య కన్యగా మారిన మాస్ గ్రీన్ మాస్ గ్రీన్ అనే యువతి స్కూలులో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేసేది. అయితే ఇప్పుడామె ‘మత్స్య కన్య’గా మారిపోయింది. ఇది వినేందుకు వింతగా అనిపిస్తుంది. ఆమె ఒక ఫుల్‌టైమ్ ‘రియల్ లైఫ్ మత్స్య కన్య’గా మారేందుకు తన ఉద్యోగాన్ని వదిలివేసింది.యూకేలోని ‘మెట్రో’తో మాట్లాడిన ఆమె ‘మత్స్య కన్య’గా ఉండటం తనకు ఎంతో ఇష్టమైన వ్యాపకమని, తన కెరియర్ మార్చుకున్నాక ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. డెవొన్కు చెందిన 33 ఏళ్ల మాస్ గ్రీన్ ఇంగ్లీషు నేర్చుకునేందుకు 2016లో సిసిలీ వెళ్లింది. మత్స్య కన్యగానే ఎందుకు.. మీడియాతో మాట్లాడిన మాస్ తాను గతంలో ఒక సాగర తీరంలో మత్స్యకన్య మేకప్‌తో ఒక వ్యక్తిని చూశానని, అప్పటి నుంచి తనకు మత్స్యకన్యగా మారాలనే ఆలోచన తరచూ వచ్చేదని తెలిపింది. అయితే అప్పుడు తాను చూసినది ఒక ఇంద్రజాలమని, అయితే తాను నిజంగా మత్స్యకన్యగా మారిపోవాలనుకున్నానని తెలిపింది. ఇది వినేందుకు అందరికీ విచిత్రంగా అనిపిస్తుంది. కానీ దీనిని తాను చేసి చూపించానని మాస్ గర్వంగా తెలిపింది. తనను చూసేందుకు జనం విపరీతంగా రావడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని పేర్కొంది. అభిరుచే ఆదాయమార్గంగా మారి.. ‘రియల్ లైఫ్ మత్స్యకన్య’గా మారాక తాను నీటిలో సయ్యాటలాడున్నప్పుడు తన తోక భాగాన్ని చూసి అందరూ ఆనందిస్తారని తెలిపింది. తనకు సముద్రంలో అధిక సమయం గడపడమంటే ఎంతో ఇష్టమని మాస్ తెలిపింది. తాను సముద్రతీర సందర్శనకు వచ్చే పర్యాటకులకు పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేస్తానని పేర్కొంది. మత్స్యకన్యగా మారేందుకు తాను అధిక సమయం ఊపిరి నిలిపివుంచే శిక్షణ పొందానని తెలిపింది. తాను తనకు ఎంతో ఇష్టమైన అభిరుచిని నెరవేర్చుకోవడంతో పాటు మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నానని మాస్ గ్రీన్ ఆనందంగా తెలిపింది. ఇది కూడా చదవండి: ఉన్నట్టుండి షాపింగ్ మాల్లో తుపాకీ కాల్పుల మోత.. టెక్సాస్‌లో ఏం జరిగిందంటే.. -
విద్యార్థుల్లో ఇంగ్లిష్ నైపుణ్యానికి మరో ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రపంచస్థాయిలో ఉన్నత ఉద్యోగాలు సాధించేలా వారికి ఆస్థాయి విద్యను అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి కంకణం కట్టుకుంది. ఇందుకోసం ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ఈ ఒప్పందం ప్రకారం ఈటీఎస్ విద్యార్థులకు టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాస్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ (టోఫెల్) పరీక్షలు నిర్వహించడంతో పాటు సర్టిఫికెట్ ఇవ్వనుంది.ఇంగ్లిష్‌లో విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. 2021–22 నుంచి 6–10 తరగతుల విద్యార్థులందరికీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందిస్తోంది. 3–5వ తరగతి వరకు ఆంగ్లం మెరుగుదల కోసం చిత్ర నిఘంటువులు ఇస్తోంది. అంతేగాకుండా 6వ తరగతికి బదులుగా (ప్రామాణిక నిబంధనల ప్రకారం) 3వ తరగతి నుంచే ఆంగ్లం కోసం సబ్జెక్ట్ టీచర్లను ఏర్పాటు చేసింది. -
స్వరరాగ మధుర తరంగాలు
‘సాధన చేయుమురా నరుడా.... సాధ్యం కానిది లేదురా!’ అన్నది పెద్దల మాట ఇంగ్లీష్ పాట విషయంలో కూడా ఆ విలువైన మాటను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాల్లో పుట్టిన వారు, ప్రవాసభారతీయులు మాత్రమే ఇంగ్లీష్ పాటను బాగా పాడగలరా? ‘సాధన చేస్తే ఎవరైనా పాడగలరు’ అని నిరూపించింది నెక్సా మ్యూజిక్ ల్యాబ్... గోవాలో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్లో యువగళాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ఎవరు వీరు?’ అని ఆరా తీసేలా చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాలు, భిన్నమైన సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన వారు, ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అని స్టూడియోలు, స్టేజ్‌ల చుట్టూ చక్కర్లు కొట్టిన గాయకులు కూడా ఇందులో ఉన్నారు. అలాంటి వారు తమ టాలెంట్‌ను ఈ మ్యూజిక్ ఫెస్టివల్లో ప్రదర్శించే అవకాశం రావడానికి ప్రధాన కారణం నెక్సా మ్యూజిక్ ల్యాబ్. నేషనల్వైడ్ టాలెంట్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ ‘నెక్సా మ్యూజిక్ ల్యాబ్’ మారుమూల ప్రాంతాల నుంచి మహా పట్టణాల వరకు మట్టిలో మాణిక్యాలను బయటకు తీసుకువచ్చి అంతర్జాతీయ స్థాయిలో మెరిపిస్తోంది. ఈ పోటీలో పాల్గొనదలచినవారు మూడు నిమిషాల నిడివి ఉన్న ఒరిజినల్ ఇంగ్లీష్ మ్యూజిక్ కంపోజిషన్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పాప్, జాజ్, ఫ్యూజన్...మ్యూజిక్ జానర్ ఏదైనా ఫరవాలేదు. దీంతో పాటు నెక్సా మ్యూజిక్ అడిషన్లో కూడా పాల్గొనవలసి ఉంటుంది. ఎంట్రీలకు మినీమం ఏజ్ లిమిట్...పద్దెనిమిది సంవత్సరాలు. సబ్మిట్ చేసిన ఎంట్రీలు నియమ, నిబంధనలకు తగినట్లుగా లేకపోతే నెక్సా గ్యాలరీలో కనిపించవు. అయినా నిరాశ చెందనక్కర్లేదు. తప్పులు సవరించుకొని ఫ్రెష్‌గా పంపవచ్చు. వ్యక్తిగత స్థాయిలోనూ, మ్యూజిక్ బ్యాండ్‌లో ఒకరిగా కూడా పాల్గొనవచ్చు. ఏఆర్ రెహమాన్ నేతృత్వంలోని జ్యూరీ 24 మందిని ఎంపిక చేస్తుంది. వీరికి నెక్సా మ్యూజిక్ సీజన్లలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ ఇరవైనాలుగు మంది నుంచి ఫైనల్‌గా నలుగురిని ఎంపిక చేసి, వారి చేత పాడించిన ఆల్బమ్‌లను అంతర్జాతీయంగా విడుదల చేస్తారు. దిల్లీకి చెందిన నిశా నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన యువ మ్యూజిక్ బ్యాండ్ ‘హీట్ సింక్’ వరకు ఎంతోమందిలో కొత్త వెలుగు తీసుకువచ్చింది నెక్సా మ్యూజిక్ ల్యాబ్. బహుముఖ ప్రతిభ నెక్సా సీజన్ 1 విజేతగా నిలిచిన దిల్లీకి చెందిన నిశా శెట్టి సింగర్, సాంగ్‌రైటర్, వాయిస్ ఒవర్ ఆర్టిస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది. చిన్నప్పటి నుంచి నాటకాలు, వాటికి సంబంధించిన వర్క్‌షాప్‌లను చూస్తూ పెరిగింది. కథక్, కూచిపూడి, హిందుస్థానీ శాస్త్రీయసంగీతం నేర్చుకుంది. చిన్న చిన్న షోలలో పాల్గొనే నిశాకు ‘నెక్సా మ్యూజిక్ ల్యాబ్’ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. ‘ఎంపికైన విజేతలలో మీరు ఒకరు’ అంటూ నిర్వాహకుల నుంచి వచ్చిన మెయిల్ నేహాకు ఎప్పుడూ గుర్తుండే తియ్యటి జ్ఞాపకం. ‘కలలు కనడం వరకు మాత్రమే పరిమితం కాకూడదు. కల సాకారం చేసుకునే శక్తి కోసం ఎక్కడెక్కడో వెదకనక్కర్లేదు. అది మన దగ్గరే ఉంది’ అంటుంది నిశా శెట్టి. -
'బ్రిటిష్-పాకిస్తానీ మగవాళ్లు ఇంగ్లీష్ అమ్మాయిలను దారుణంగా..'
లండన్: బ్రిటన్ హోంమంత్రి సుయెల్లా బ్రవర్మన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బ్రిటిష్-పాకిస్తానీ పురుషులే దేశంలో తీవ్ర నేరాల్లో భాగం అవుతున్నారని ఆమె ఆరోపించారు. ఇంగ్లీష్ మహిళలను వేధించడం, వారిపై అత్యాచారాలకు పాల్పడటం సహా డ్రగ్స్, హాని తలపెట్టే పనుల్లో పాక్ సంతతికి చెందిన బ్రిటన్ పురుషులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం చేస్తున్నారు. ముఖ్యంగా మైనర్లు, ఇంగ్లీష్ యువతులను లక్ష్యంగా చేసుకుని వీరు వికృత చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. 'మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే.. సంరక్షణ కేంద్రాలు, జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటున్న బలహీనమైన తెల్ల ఇంగ్లీష్ అమ్మాయిలు, పిల్లలను బ్రిటిష్-పాకిస్తానీ పురుషుల ముఠాల వేధిస్తున్నాయి. వారిని వెంబడించి అత్యాచారం చేయడం, మత్తుపదార్థాలు ఇవ్వడం, హాని చేయడం వంటి క్రూర చర్యలకు పాల్పడుతున్నాయి. నిందితుల్లో సంరక్షణ కేంద్రాల్లో పని చేసేవారు ఉంటున్నారు. మరికొందరికి పెద్ద నెట్వర్క్ ఉంది. చాలా మంది నేరస్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అధికారులు ఈ నేరస్థులకు భయం కల్గించేలా చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనో లేక భయంతోనో, జాత్యహంకారం, మతోన్మాదం అనుకుంటారనో అధికారులు వీరిని గుడ్డిగా వదిలేస్తున్నారు.' అని బ్రవర్న్ అన్నారు. Home Secretary @SuellaBraverman says 'vulnerable white girls are being targeted by British Pakistani grooming gangs', and people have been 'turning a blind eye out of political correctness'.#Ridge https://t.co/ZoMhCmTrtv 📺 Sky 501, Virgin 602, Freeview 233 and YouTube pic.twitter.com/vO2KSs6vEX — Sophy Ridge on Sunday & The Take (@RidgeOnSunday) April 2, 2023 'కొన్ని జాతి సమూహాల ప్రాబల్యం గురించి చాలా కాలంగా అనేక నివేదికలు ఉన్నాయి. బ్రిటిష్ పాకిస్తానీ పురుషులు బ్రిటిష్ విలువలకు పూర్తిగా విరుద్ధమైన సాంస్కృతిక విలువలను కలిగి ఉంటారు. వారు స్త్రీలను అవమానిస్తారు. కాలం చెల్లిన సంప్రదాయాలు పాటిస్తారు. కొన్నిసార్లు వారి ప్రవర్తన హేయంగా ఉంటుంది' అని హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పిల్లలు, యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నీచమైన నేరస్థుల ముఠాల పనిపట్టేందుకు కొత్తటాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. చదవండి: చైనాను రెచ్చగొట్టిన తైవాన్.. సరిహద్దులో ఉద్రిక్తత -
ఆంగ్లంతో పాటు తెలుగులోనూ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక విభాగపు పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలను ఆంగ్లంతో పాటు తెలుగులోనూ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్ణయించింది. దీనివల్ల అభ్యర్థులందరికీ మేలు జరుగుతోందని కమిషన్ భావిస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్ కుమార్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని సాంకేతిక, ప్రత్యేక అర్హతలతో కూడిన పోస్టుల నియామకాలకు ఏపీపీఎస్సీ ఇప్పటివరకు ఆంగ్లంలోనే పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. వీటిని తెలుగు మాధ్యమంలో కూడా నిర్వహించాలని గత కొంతకాలంగా గ్రామీణ, తెలుగు మాధ్యమం అభ్యర్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఈ పరీక్షలకు సంబంధించిన పేపర్–1ను ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. పేపర్–1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలుంటాయి. ఆంగ్లం ప్రశ్నలను తెలుగులో అనువదించి ఇస్తారు. అయితే ఈ రెండు మాధ్యమాల్లో ఆంగ్లంలోని ప్రశ్నలను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇక పేపర్–2లో సబ్జెక్టు పేపర్లను మాత్రం ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించనున్నారు. (చదవండి: డిస్కంలకు కాస్త ఊరట..విద్యుత్ అమ్మకం ధరలు తగ్గింపు!) -
ఆ దేశంలో ఆంగ్లంలో మాట్లాడితే రూ. 82 లక్షలు జరిమానా!
ఆంగ్ల భాష అంతర్జాతీయ భాషగా రాజ్యమేలుతున్న సంగతి తెలుసిందే. ఈ తరుణంలో ఒక దేశం మాత్రం ఆ భాషను ఉపయోగించడానికి వీలు లేదంటూ హుకూం జారీ చేసింది. అందుకోసం ఓ ముసాయిదా బిల్లును కూడా తీసుకొచ్చింది. పొరపాటున కూడా కమ్యూనికేట్ చేసేటప్పుడూ ఇంగ్లీష్ పదాలు దొర్లినా పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తానని కూడా పేర్కొంది. ఆంగ్ల భాషను పూర్తిగా బ్యాన్ చేసిన తొలిదేశం కూడా అదే కాబోలు!. వివరాల్లో కెళ్తే.. ఇటాలీ ప్రధాన మంత్రి, బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నేత జార్జియా మెలోని ఈ కొత్త ప్రతిపాదిత చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఏఇటాలియన్ అయినా కమ్యూనికేట్ చేసేటప్పుడూ .. విదేశీ పదాలను ఉపయోగిస్తే దాదాపు రూ. 82 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. ఈ బిల్లును ఛాంబర్ ఆఫ్ డిప్యూటీ సభ్యుడు ఫాభియో రాంపెల్లి ప్రవేశ పెట్టారు. దీనికి ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మద్దతు ఇచ్చారు. ఆంగ్ల పదాలు లేదా ఆంగోమానియాను లక్ష్యంగా చేసకుని మరీ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం.. ఈ ఆంగ్ల భాష ఇటాలియన్ భాషను కించపరుస్తున్నట్లు పేర్కొంది. బ్రిటన్ నిష్రమణతో బ్రెగ్జిట్‌గా పేరుగాంచిన యూరోపియన్ యూనిన్ కారణంగా ఆ పరిస్థితి దారుణంగా దిగజారిందని పేర్కొంది. అంతేగాదు ఆ బిల్లు..పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పదవిని కలిగి ఉన్నవారెవరైనా వ్రాతపూర్వకంనూ, కమ్యూనికేషన్ పరంగానూ ఇటాలియన్ భాషపై నైపుణ్యం కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఉద్యోగా స్థానాల్లో, వ్యాపార సంబంధ డాక్యుమెంట్లలోనూ, అధికారిక పత్రాలలోనూ కూడా ఆంగ్లంలో పేర్లను వినియోగించడాన్ని పూర్తిగా నిషేధించింది. ఆఖరికి ఇటాలియన్ భాష రాని విదేశీయులతో కమ్యూనికేట్ చేసే కార్యాలయ్యాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పింది. ఆర్టికల్ 2 ప్రకారం.. జాతీయ భూభాగంలో ప్రజా వస్తువుల, సేవలు వినియోగం కోసం ఇటాలియన్‌ని ప్రాథమిక భాషగా ఉపయోగించాలిని ఆ ముసాయిదా బిల్లులో స్పష్టం చేసింది. అంతేగాదు దీన్ని అతిక్రమిస్తే రూ. 4 లక్షల నుంచి దాదాపు రూ. 82 లక్షల వరకు జరిమానా విధిస్తాని బిల్లులో పేర్కొంది. అయితే ఈ బిల్లుపై పార్లమెంట్లో చర్చలు జరిపిన తదనంతరం పూర్తి స్తాయిలో అమలు చేయనుంది ఇటలీ. (చదవండి: లొంగిపోనున్న ట్రంప్..ఫుల్ బంధోబస్తుకు ప్లాన్) -
ఏపీ సర్కార్‌పై ఐరాస శాశ్వత సభ్యుడు ఉన్నావా షాకిన్ బృందం ప్రశంసలు
సాక్షి, విజయవాడ: ఐక్యరాజ్యసమితి శాస్వత సభ్యుడు ఉన్నావా షాకిన్ కుమార్ బృందం పటమట హైస్కూల్‌ను సందర్శించింది. విద్యార్ధులతో మాట్లాడిన షాకిన్ యాక్సెంట్‌ను మెచ్చుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈస్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా విధానాన్ని స్విట్జర్లాండ్ దేశాధ్యక్షుడు ఇగ్నా జియో క్యాసిస్ మెచ్చకున్నారని చెప్పారు. 'బలవంతంగా యాక్సెంట్ రుద్దుతున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులు ఈ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడటమే గొప్ప విషయం. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులు జాతీయస్థాయి వేదికలపై అంతర్జాతీయ అంశాలు మాట్లాడాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్ధుల్లోని టాలెంట్ వెలికి తీసేందుకు త్వరలో కొన్ని పరీక్షలు నిర్వహిస్తాం. ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం, జగనన్న గోరుముద్ద, పుస్తకాలు, యూనిఫాంలు అందించడం గొప్ప విషయం.' అని షాకిన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. చదవండి: ఎస్సీ హాస్టల్ ఉద్యోగుల వేతన సమస్యకు పరిష్కారం.. 411 మందికి గుడ్‌న్యూస్ -
అతిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు.. ఇదేమైనా ఇంగ్లాండా? సీఎం నితీష్ ఆగ్రహం
పాట్నా: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంగ్లీష్ మాట్లాడినందుకు ఓ అధికారిపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పాట్నాలోని బాపు సభాగర్ ఆడిటోరియంలో మంగళవారం ‘నాలుగో వ్యవసాయం రోడ్‌మ్యాప్’ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం నితీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లఖిసరాయ్‌కు చెందిన వ్యవసాయ పారిశ్రామికవేత్త అమిత్ కుమార్ సీఎం నితీశ్‌ను ప్రశంసిస్తూ మాట్లాడటం ప్రారంభించారు. ‘పుణెలో మంచి కెరీర్ కలిగిన మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నేను అన్నింటినీ వదులుకుని నా సొంత జిల్లాలో పుట్టగొడుగుల పెంపకం చేపట్టడానికి అనుకూల వాతావరణాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. అయితే అమిత్ తన ప్రసంగంలో అధికంగా ఇంగ్లీష్ పదాలనే ఉపయోగించారు. దీంతో వెంటనే సీఎం నితీష్‌కుమార్ మధ్యలో జోక్యం చేసుకున్నారు. మీరు ఎక్కువగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారంటూ అధికారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఇదేమైనా ఇంగ్లాండ్ అనుకున్నారా? ఇది భారత్.. బిహార్ రాష్ట్రం అంటూ మండిపడ్డారు. ‘‘మీరు అతిగా ఆంగ్ల పదాలు మాట్లాడటం వల్ల నేను మధ్యలో జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. మిమ్మల్ని సలహాలు ఇవ్వడానికి ఇక్కడికి ఆహ్వానించారు. కానీ మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. ఇదేమన్నా ఇంగ్లాండా? మీరు బిహార్‌లో పని చేస్తున్నారు. సామాన్యుల వృత్తి అయిన వ్యవసాయాన్ని చేస్తున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ అనే బదులు సర్కారీ యోజన అనలేరా. నేనూ ఆంగ్ల మాధ్యమంలో ఇంజనీరింగ్ చదివాను. అది వేరే విషయం. రోజూవారీ కార్యకలాపాలకు మాతృ భాషను ఉపయోగించాలి. కోవిడ్, లాక్డౌన్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అవ్వడం వల్ల చాలామంది ప్రజలు తమ మాతృ భాషలను మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇది సరికాదు. మన రాష్ట్రంలో మాట్లాడే భాషనే ఉపయోగించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం సదరు అధికారి ముఖ్యమంత్రిని క్షమాపణలు కోరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మంగళవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనే విషయం తెలిసిందే. ఇదే రోజున బిహార్ సీఎం మాతృభాషపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: ఆయిల్ లీక్.. ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ #WATCH | "Farming is being done by a common man, you are called here to give suggestions but you are speaking in English. Is it England? This is India & it's Bihar...": Bihar CM Nitish Kumar interrupts a farmer while latter was delivering a speech during an event in Patna (21.02) pic.twitter.com/AUhzAlCnfU — ANI (@ANI) February 21, 2023 -
ఈ అమ్మాయి ఇంగ్లీష్ స్పీచ్‌కి సీఎం జగన్ ఫిదా
-
కేవలం హిందీతోనే వర్క్ ఔట్ అవ్వదు! రాహుల్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంగ్ల విద్యను సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు పాఠశాలలో ఆంగ్ల విద్యను బోధించొద్దని గొడవ చేస్తున్నారు. కానీ వాళ్ల పిల్లలను మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లోనే చదివిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కానీ పేద రైతులు, కూలీలు తమ పిల్లలు మంచిగా ఇంగ్లీష్ నేర్చుకుని మంచి పొజిషన్లో ఉండాలని కలలు కంటారని రాహుల్ అన్నారు. ఈ మేరకు ఆయన రాజస్తాన్‌లో అల్వార్‌లో భారత్ జోడోయాత్రలో భాగంగా పర్యటిస్తున్నప్పుడూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కేవలం హిందీ మాత్రమే నేర్చుకుంటే..ప్రపంచంలో ఇతరులతో మాట్లాడటం సాధ్యం కాదని, కేవలం ఆంగ్ల విద్యతోనే అది సాధ్యం అవుతుందని అన్నారు. కాబట్టి మాకు రైతులు, కూలీల పిల్లలు అమెరికన్లతో పోటీపడి ఇంగ్లీష్‌ని నేర్చుకుని తాము అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాని చెప్పారు. రైతులు పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదవకూడదని కూడదని బీజేపీ కోరుకుంటోందంటూ రాహుల్ ఆరోపణలు చేశారు. అంతేగాదు ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ..హిందీ, తమిళం వంటి ఇతర భాషలను చదవకూడదని చెప్పడం లేదు. ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలంటే ఇంగ్లీష్ తెలుసుకోవాలని అన్నారు. రాజస్తాన్‌లో తాము దాదాపు 1700 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించినట్లు తెలిపారు. అమెరికన్ పిల్లలకు సవాలు విసురుతూ... విద్యార్థులు ధీటుగా ఇంగ్లీష్ చదవాలని కోరుకుంటున్నాను అని రాహుల్ గాంధీ చెప్పారు. (చదవండి: విద్యార్థులు, సెక్యూరిటీ గార్డుల మధ్య ఘర్షణ..పలువురికి గాయాలు) -
ఆంగ్ల బానిసత్వం మనకొద్దు
అదాలజ్/గాంధీనగర్: ఆంగ్ల భాష పట్ల బానిస మనస్తత్వం నుంచి నూతన విద్యా విధానంతో దేశం బయట పడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 5జీ టెలికాం సేవలు విద్యా వ్యవస్థను మరో స్థాయికి తీసుకెళ్తాయన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ సదుపాయాలు, స్మార్ట్ తరగతి గదులు, స్మార్ట్ బోధనా రీతులు అందుబాటులోకి వస్తాయన్నారు. గుజరాత్లో గాంధీనగర్ జిల్లాలోని అదాలజ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ను మోదీ బుధవారం ప్రారంభించారు. ‘‘ఇంగ్లిష్ కేవలం ఒక భావప్రసార మాధ్యమమే. అయినా ఆ భాషలో పరిజ్ఞానముంటేనే మేధావులుగా పరిగణించే పరిస్థితి ఉంది. ప్రతిభావంతులైన గ్రామీణ యువత ఇంగ్లిష్‌లో నైపుణ్యం లేదన్న కారణంతో డాక్లర్లు, ఇంజనీర్లు కాలేకపోతున్నారు’’అని వాపోయారు. ఇతర భాషల్లోనూ ఉన్నత చదువులు చదువుకొనే అవకాశం ఇప్పుడుందన్నారు. గ్రామీణ విద్యార్థులకు లబ్ధి తన స్వరాష్ట్రం గుజరాత్లో విద్యారంగంలో గత రెండు దశాబ్దాల్లో ఎనలేని మార్పులు వచ్చాయని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 1.25 లక్షల కొత్త తరగతి గదులు నిర్మించారని, 2 లక్షల మంది టీచర్లను నియమించారని ప్రశంసించారు. స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మరో 50,000 క్లాస్‌రూమ్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు. లక్ష క్లాస్‌రూమ్‌లను 5జీ టెక్నాలజీతో స్మార్ట్ తరగతి గదులుగా మార్చబోతున్నట్లు చెప్పారు. ఆన్లైన్లో పాఠాలు వినొచ్చని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎంతగానో లబ్ధి పొందుతారని వివరించారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే పోటీ పరీక్షల కోసం సన్నద్ధం కావొచ్చని, రోబోటిక్స్ వంటి కొత్త సబ్జెక్టులు నేర్చుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మార్చడానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘శాల ప్రవేశోత్సవ్, గుణోత్సవ్’ వంటి కార్యక్రమాలు ప్రారంభించానని గుర్తుచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మోదీ సంభాషించారు. రక్షణ స్వావలంబన గర్వకారణం ఇకపై దేశీయంగా ఉత్పత్తి అయిన రక్షణ పరికరాలనే కొనుగోలు చేయాలని మన రక్షణ దళాలు నిర్ణయించుకోవడం సంతోషకరమని మోదీ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది నిదర్శనమన్నారు. గుజరాత్లో ‘డిఫెన్స్ ఎక్స్పో–2022ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 2021–22లో 13,000 కోట్ల రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేశామని, రూ.40,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. భారత్–పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో బనస్కాంతా జిల్లా దీసాలో వైమానిక స్థావరం నిర్మాణానికి మోదీ పునాదిరాయి వేశారు. -
ఆస్ట్రేలియాకు పాకిన బెండపూడి విద్యార్థుల ఖ్యాతి.. యూట్యూబ్ చూసి..
కాకినాడ సిటీ: తుని నియోజకవర్గం బెండపూడి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్న వీడియోలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన వీడియోలు యూట్యూబ్‌లో చూసిన ఆస్ట్రేలియా దేశం సిడ్నీ నుంచి వినోద్, వీవీఎన్ కుటుంబ సమేతంగా గురువారం బెండపూడి పాఠశాలను సందర్శించారు. ఇంగ్లిషు ఉపాధ్యాయుడు ప్రసాద్ మాస్టర్ విద్యార్థులకు సులభంగా ఆంగ్ల భాషలో మాట్లాడించిన విధానం, అనుసరించిన మెళకువలను అడిగి తెలుసుకున్నారు. చదవండి: గ్రామీణ క్రీడల్లో నవశకం.. అనంతరం గురువారం రాత్రి కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినోద్, వీవీఎన్ దంపతులు బెండపూడి పాఠశాల విద్యార్థుల మాదిరిగా జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఇంగ్లిషులో మాట్లాడే విధంగా ప్రత్యేకంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను పైలెట్ ప్రాజెక్టుగా తుని నియోజకవర్గంలో ప్రారంభించిన రీడ్‌నెస్ ఇనిషియేటీవ్ ఫర్ సిట్యూవేషనల్ ఇంగ్లిష్ (రైజ్) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను అభినందించారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విధానాన్ని పరిశీలించేందుకు ఆస్ట్రేలియా దేశం నుంచి కాకినాడ జిల్లాకు విచ్చేసినందుకు కలెక్టర్ కృతికా శుక్లా సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన వినోద్ ఆ్రస్టేలియాలో స్థిరపడ్డారు. ఆ్రస్టేలియాకు చెందిన వీవీఎన్ను వివాహం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బెండపూడి ఇంగ్లిష్ టీచర్ రైజ్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ జి. ప్రసాద్, కె.పాల్‌రాజ్ తదితరులు ఉన్నారు. -
జీతం రూ.70 వేలు ..చదవ లేరు..రాయలేరు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నిరక్షరాస్యులు ఎక్కువైపోయారు. జీతం రూ.50వేల నుంచి రూ.70 వేలు తీసుకుంటున్నా... ఇంగ్లిష్‌లో చిన్న పదం కూడా రాయలేని పరిస్థితి. దీంతో పాలనా పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనుల్లో తీవ్ర జాప్యం ఎస్కేయూలో దాదాపు 40 మంది జూనియర్ అసిస్టెంట్లు తమ ‘డిజిగ్నేషన్’ కూడా ఇంగ్లిష్‌లో సరిగా రాయలేని దుస్థితిలో ఉన్నారు. కనీసం ఒక లెటర్‌ను టైప్ చేసి ఉన్నతాధికారులకు పంపడం కూడా వీరికి చేతకాదు. ఒకప్పుడు డైలీ వేజ్ కింద వారంతా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగాన్ని పరి్మనెంట్ చేసుకుని రికార్డు అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి దక్కించుకున్నారు. అయితే అందుకు తగ్గ నైపుణ్యాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఏదైనా ఫైల్ డ్రాఫ్టింగ్ చేసి ఉన్నతాధికారులకు పంపలేకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇటీవలే వీరందరికీ ప్రత్యేకంగా కంప్యూటర్ నైపుణ్యం పెంపొందించేలా శిక్షణ ఇచ్చినప్పటికీ, అభ్యసించలేక వెనుకబడ్డారు. దీంతో వారందరినీ నైపుణ్యం లేని విధుల్లో నియమించాలని ఉన్నతాధికారులు భావించారు. అయితే జూనియర్ అసిస్టెంట్ల కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో వారిని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై వర్సిటీ ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారు. (చదవండి: బాబు పరిటాల శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడ?) -
చంద్రబాబు ఇంగ్లీష్ పై మంత్రి పెద్దిరెడ్డి సెటైర్లు
-
పిల్లలు చెప్పిన పేరెంట్స్ కథ
తమ తల్లిదండ్రుల పెళ్లిళ్ల గురించి రాసిన ఇద్దరు రచయితల గురించి మాత్రమే నాకు ఇటీవలి వరకూ తెలుసు. ఒకరు నిగెల్ నికల్సన్. ఈయన రాసిన ‘పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ మ్యారేజ్’ పుస్తకం తన తండ్రి, రచయిత అయిన వీటా శాక్ విల్లే–వెస్ట్, హెరాల్డ్ నికల్సన్ మధ్య అస్థిరమైన, విశిష్టమైన సంబంధం గురించి చెబుతుంది. మరొకటి జరీర్ మసానీ రాసిన ‘అండ్ ఆల్ ఈజ్ సెడ్: మెమోయిర్ ఆఫ్ ఎ హోమ్ డివైడెడ్’ అనే పుస్తకం. శత్రుత్వం, పిచ్చితనం, అవిశ్వాసం వంటి కారణాల వల్ల మినూ మసానీ తన భార్య శకుంతల నుంచి విడిపోయిన ఉదంతాన్ని ఇది తెలుపుతుంది. ఆ రోజుల్లో ఆమె ఇందిరా గాంధీ కాంగ్రెస్ (ఐ)లో చేరాలని భావించారు. కాగా మినూ మసానీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉండేవారు. వీరి ఉదంతం అప్పట్లో చాలా ఆసక్తి గొలిపింది. నేను ఇప్పుడే మూడో పుస్తకం కూడా చదివాను. దానిపేరు ‘సుమిత్ర అండ్ ఎనీస్ టేల్స్: అండ్ రెసిపీస్ ఫ్రమ్ ఎ కిచిడీ ఫ్యామిలీ’. ఇది సీమా చిస్తీ తల్లిదండ్రులు, అసాధారణమైందే అయినప్పటికీ వారి ప్రగాఢమైన ప్రేమ వివాహం గురించిన కథ. ఇది చాలా కొత్తగా, వైవిధ్యపూరితంగా ఉంది. నేను సీమా చిస్తీ వల్లే ఈ మూడో పుస్తకం చదివాను. ఆమె అప్పుడే కాలేజీ విద్య పూర్తి చేసి తన తొలి ఉద్యోగాన్ని నాతోనే ప్రారంభించింది. అందుకు ఈ పుస్తకం నా టేబుల్ వద్దకు వచ్చేసరికి దాన్ని తీసుకోకుండా ఉండలేకపోయాను. సుమిత్ర, ఎనీస్ వివాహం అసాధారణమైందని చెప్పాలి. ఆమె కన్నడిగ, హిందూ వ్యక్తి. అతడు ఉత్తరప్రదేశ్‌లోని దేవిరయా నుంచి వచ్చాడు. ముస్లిం. ఆమె అతడికంటే ఏడేళ్లు పెద్దది. ఇరు కుటుంబాల్లో ఎవరికీ చెప్పకుండానే పెళ్లాడారు. అదృష్టవశాత్తూ తర్వాత వారిని రెండు కుటుం బాలు సాదరంగా ఆహ్వానించాయనుకోండి! తమ కథను చెప్పడంలో, సీమ ఒక మార్మిక శైలిని స్వీకరించింది. కొన్నిసార్లు తన తల్లితండ్రులను మా అమ్మ అనీ, మా నాన్న అనీ రాసిందామె. కానీ చాలాసార్లు మాత్రం వారిని సుమిత్ర, ఎనీస్ అంటూ థర్డ్ పర్సన్ సింగ్యులర్ (ప్రథమ పురుష)లో రాసింది. నిజాయితీగా చెప్పాలంటే, ఇలాంటి హైబ్రిడ్ శైలిని మొదటిసారి చూశాను. ఇది చాలా ప్రభావశీలంగా ఉంది. న్యూఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో మెయిన్ స్ట్రీమ్ పత్రికా కార్యాలయం బేస్మెంట్లో సుమిత్ర, ఎనీస్ కలిశారు. దట్ ఓల్డ్ స్టేపుల్, ద హౌస్హోల్డర్, దిస్, ఇన్ 1964 వంటి సినిమాలు చూస్తూ వారి మధ్య ప్రేమ వికసించిందని సీమ రాసింది. మరింత ఎక్కువగా తన గురించి తెలుసు కోవడానికి ఆమె ఎన్నటికీ విముఖత చూపదని ఎనీస్కి అది సంకేతంలా కనిపించిది. కేవలం స్నేహితులుగా మాత్రమే తాము ఉండాల్సిన అవసరం లేదని ఆ సంకేతం ఎనీస్కి సూచించింది. ఇది కాల పరీక్షకు నిలిచిన సందర్భం. అది ఫలించింది కూడా! తన తల్లితండ్రుల నేపథ్యం, జీవితం, వారి ప్రేమ గాథ గురించి సీమ చెబుతున్నప్పుడు అన్నీ వివరించి చెప్పలేని నిరాకరణ కనిపించింది. అలాంటి పరిస్థితి మీలో మరింత ఆకాంక్షను రేపుతుంది. సుమిత్ర, ఎనీస్ ఇద్దరూ ఎగువ తరగతి వారే. అత్యంత వేడిగా ఉంటూ మిత్రపూరితంగా లేని నగరంలో తమకంటూ ఒక గూడుకోసం, కనీస వనరుల కోసం ప్రయత్నిస్తూ తొలి తరం వలసవచ్చినవారి గురించిన కథ వీరిది. జీవించడానికి 1960లలో ఒక నివాసం కోసం వెతకటం అనేది ఇప్పుడు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న దంపతులు ఎదుర్కొంటున్న సమస్యలాగే ఉంటుంది. ఒక సందర్భంలో లీజుపై సంతకం పెట్టిన తర్వాత ఎనీస్ అంటే అనీష్ (హిందువు) కాదని ఇంటి యజమానురాలికి అర్థమైపోయి ఆ లీజును వెనక్కు తీసుకుంది. పెళ్లయిన సంవత్సరానికి సీమ పుట్టింది. తన పేరును అలా పెట్టడం తనకు గమ్మత్తుగా ఉండిందని సీమ ఒప్పు కుంది. ఎనీస్ తల్లి నీలిరంగు ఉత్తరంలో బోలెడన్ని సూచనలు రాసి పంపింది. సుమిత్ర ఆ సూచనలను పాటిం చింది. తన భర్త ఇంటిపేరు పెట్టుకోవడానికి ఆమె స్వచ్ఛందంగా సిద్ధపడిపోయింది. నిఖా పట్ల సంతృప్తి చెందింది. కానీ ఆమె కూతురు విషయానికి వచ్చేసరికి సీమ అనే పేరు పెట్టడంలో కాస్త సందిగ్ధత ఏర్పడింది. సీమ అనే పేరు హిందూ, ముస్లిం రెండు మతాల పేరును స్ఫురించడంతో సరిగ్గా సరిపోయింది. అయితే తన పేరు గురించి సీమ పెద్దగా పట్టించు కోలేదు కానీ, సుమిత్ర–ఎనీస్ కథలో పేర్లకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ రెండు పేర్లకూ ఒకే అర్థం ఉంది. ఎనీస్ అంటే అరబిక్‌లో మంచి మిత్రులు అని అర్థం. సుమిత్ర అనే సంస్కృత పదానికీ అదే అర్థముంది. ఈ ఇద్దరికీ సంబంధించిన ఉమ్మడి లక్షణాల్లో పేర్లు కూడా కలిసిపోయాయి. ఈ పుస్తకంలో సగంపైగా తల్లి తన కుమార్తెకు ఎంపిక చేసే వంటకాల గురించే ఉంటుంది. అయితే ఆ కుమార్తెకు వాటిని చేసేంత సమయం ఉండదు. పైగా వాటిని ఆమె ఒప్పుకోదు. అవి సబ్టైటిల్ని మాత్రమే వివరిస్తాయి. కానీ అవి దేన్నో సూచిస్తాయి. ఆమె తల్లిదండ్రుల వివాహం ఇరుమతాల సంగమం, కలిపిన కిచిడీ లాంటిది. దీనికి మించి మెరుగ్గా నేను ఈ పుస్తకం గురించి వర్ణించలేను. తొలి నామవాచకం ఇరువురూ ఒక చెంతకు వచ్చి, ఒకే అస్తిత్వంగా మారిపోవడాన్ని సూచిస్తుంది. ఇక రెండోది ఒక కొత్త ఆనందకరమైన దాన్ని రూపొందిం చేందుకు వివిధ భాగాలను తెలివిగా, ఉద్దేశపూర్వకంగా కలపడాన్ని సూచిస్తుంది. (క్లిక్: సంఘీభావమే పరాయీకరణకు మందు) మినూ, శకుంతల దంపతుల లాగా సుమిత్ర, ఎనీస్ పోరాడారా లేక వీటా, హెరాల్డ్ లాగా విభిన్న మార్గాలను అనుసరించారా అనేది నాకు తెలీదు. సీమ కథ అంతవరకూ తీసుకుపోలేదు. కానీ అది మంచిదే. తల్లితండ్రుల అసమ్మ తిని పిల్లలు ఏ మేరకు వెల్లడించవచ్చు అనే అంశంలో ఒక పరిమితి ఉంటుంది. సామరస్యపూర్వకమైన స్నేహం ఆహ్లాదకరమైన పఠనానికి తావిస్తుంది కదా! (క్లిక్: మతాలు కాదు... మనిషే ప్రధానం) - కరణ్ థాపర్ సీనియర్ పాత్రికేయులు -
రెండేళ్లకే ‘హైరేంజ్’
వేటపాలెం: బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన శివాన్ష్ నాగ ఆదిత్య(2) ఏ టూ జెడ్ వరకు క్రమబద్ధంగా ఆంగ్ల అక్షరాలు ఉచ్ఛరిస్తూ, అనుబంధ ఆంగ్ల పదాలు చెబుతూ హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాడు. గ్రామానికి చెందిన కసుమర్తి శ్రీనివాస్, సరిత దంపతుల కుమారుడైన ఆదిత్య చిన్న వయసులోనే ఆంగ్లపదాలు క్రమపద్ధతిలో పలకడం నేర్చుకున్నాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారికి బాలుడి ప్రతిభ తెలియపరుస్తూ వీడియోను 2021 ఫిబ్రవరిలో పంపించారు. బాలుడి ప్రతిభ గుర్తించి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేస్తూ సర్టిఫికెట్‌ను శుక్రవారం బాలుడి తల్లిదండ్రులకు పంపించారు. బాలుడిని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అభినందించారు. -
సమ్మర్ స్టడీస్.. ఇంట్లోనే చదవండి ఇలా!
సాక్షి,బలిజిపేట(పార్వతిపురం మన్యం): వేసవి సెలవుల్లో కూడా విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం, నేర్చుకునే తత్వం పెంచేవిధంగా ఏపీ విద్యాశాఖ కొత్త తరహాలో యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పాఠశాలల్లో అమలవుతున్న ‘ఉయ్ లవ్ రీడింగ్’ సెలవుల్లో కొనసాగించేలా సమగ్ర శిక్ష అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా గూగుల్ సంస్థతో ఏపీ సమగ్ర శిక్ష అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. గూగుల్ సంస్థ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రవేశపెట్టిన ‘గూగుల్ రీడ్ అలాంగ్’ యాప్‌ను ఏపీ విద్యార్థులు వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. స్మార్ట్ఫోన్లు ఉన్న తల్లిదండ్రులు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులకు ఇస్తే వారు చదువుకునే అవకాశం ఉంది. తెలుగు, ఇంగ్లిష్‌పై పట్టు.. వినోదాత్మక ప్రసంగ ఆధారిత రీడింగ్ యాప్‌లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఉపయోగపడే విధంగా పదాలు, కథలు, ఆటలు రూపొందించారు. వీటిని రోజూ చదివితే ఆయా భాషల్లో పఠనా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. ఆసక్తి కలిగిన కథనాలను చదవమని, ‘దియా’ పేరుతో ఉన్న యానిమేషన్ బొమ్మ విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. ఈ యాప్‌లో స్వరాన్ని గుర్తించే సదుపాయం ఉంది. పిల్లలు పదాలు, కథలు చదివినప్పుడు తప్పులు దొర్లితే యాప్ ద్వారా గుర్తించబడి తప్పులు సవరించే సదుపాయం ఉంది. దీనిని ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే చాలు నెట్ అవసరం లేకుండా ఆఫ్‌లైన్‌లో పనిచేస్తుంది. దీనిలో ఎటువంటి ప్రకటనలు ఉండవు. పుస్తకాలు, పిల్లల కథలు, చోటా భీమ్ నుంచి వివిధ పఠన స్థాయిలో వెయ్యికి పైగా పుస్తకాలతో లైబ్రరీ ఉంటుంది. విద్యార్థులు యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని మంచి కథలు నేర్చుకుంటున్నారు. పఠనా సామర్థ్యం పెరుగుతుంది.. యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మంచి పాఠాలు, భాష నేర్చుకోవచ్చు. తద్వారా పఠనా సామర్థ్యం పెరుగుతుంది. వేసవిలో విద్యార్థులకు మంచి మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. – శ్రీనివాసరావు, ఎంఈఓ, బలిజిపేట -
ఆంగ్లం చదవలేక ఆత్మహత్యాయత్నం
తుమకూరు: ఆంగ్లం చదవలేక 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. తుమకూరు తాలూకా ఉర్గిగెరె గ్రామానికి చెందిన అజయ్(12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదవుతున్నాడు. ఆంగ్లం కష్టంగా ఉందని, పాఠశాలకు వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. అయితే తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చి పాఠశాలకు పంపుతున్నారు. దిక్కుతోచని స్థితిలో బాలుడు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. విద్యార్థినిని చిదిమేసిన స్కూల్ బస్ బనశంకరి: ద్విచక్రవాహనాన్ని స్కూల్‌బస్ ఢీకొని విద్యార్థిని మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈఘటన బనశంకరి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. నాయండహళ్లి నివాసి కీర్తన(16) తన అక్క హర్షితతో కలిసి కనకపుర వద్ద ఉన్న హారోహళ్లికి వెళ్లారు. గురువారం ఉదయం నాయండహళ్లికి వెళ్లేందుకు దేవెగౌడ పెట్రోల్ బంక్‌వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆలస్యమైందని భావించి స్నేహితుడు దర్శన్‌తో కలిసి బైక్‌పై ఇంటికి బయల్దేరారు. కిత్తూరురాణిచెన్నమ్మ జంక్షన్ నుంచి కామాక్య వైపు వెళ్తుండగా పై వంతెన వద్ద ప్రైవేటు స్కూల్ బస్ ఢీకొంది. దీంతో ముగ్గురూ కిందపడిపోయారు. ఆ సమయంలో వెనుకనుంచి వస్తున్న బస్సు కీర్తన తలపై దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కీర్తన ఎస్ఎస్ఎల్సీ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది. హర్షితా ద్వితీయ పీయూసీ పరీక్ష రాసి ఫలితాలు కోసం వేచిచూస్తోందని బనశంకరి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. నీళ్ల ట్యాంకర్ ఢీకొని చిన్నారి.. బనశంకరి: వాటర్ ట్యాంకర్ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన హెచ్ఎస్ఆర్.లేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సర్జాపుర రోడ్డులోని శ్వేతా రెసిడెన్సీ అపార్టుమెంట్ ఎదురుగా గురువారం వాటర్ ట్యాంకర్ నీటిని అన్లోడ్ చేసి రివర్స్ తీసుకుంటున్న సమయంలో వెనుక ఉన్న బాలికపై దూసుకెళ్లింది. దీంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక పేరు ప్రతిష్టగా పోలీసులు గుర్తించారు. బాలికను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. హెచ్ఎస్ఆర్.లేఔట్ పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ఆసుపత్రి బిల్లు రూ.9.5 కోట్లు) -
బెండపూడి విద్యార్థుల ప్రతిభకు సీఎం జగన్ ఫిదా
తొండంగి: కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని బెండపూడి జెడ్పీ హైస్కూలు విద్యార్థులు విదేశీ శైలిలో అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడి అబ్బురపరచిన వైనం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి వెళ్లింది. ‘ఇంగ్లిష్‌పై బెండపూడి జెండా’ శీర్షికతో ఇటీవల ‘సాక్షి’లో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం స్పందించారు. తనను కలవాల్సిందిగా సీఎం నుంచి తమకు సమాచారం అందిందని బెండపూడి జెడ్పీ హైస్కూలు హెడ్మాస్టర్ జి.రామకృష్ణారావు, ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు జి.వి.ప్రసాద్ తెలిపారు. గురువారం విద్యార్థులను తోడ్కొని వెళ్లి సీఎంను కలవనున్నట్టు వారు వివరించారు. -
ఆంగ్లంతోనే అనుసంధానం
సుమారు 1500 సంవత్సరాల క్రితం ప్రపంచ వ్యాప్తంగా మూడు తెగలు మాత్రమే ఆంగ్లాన్ని మాట్లాడేవి. ఈ రోజు అనేక దేశాలలో ఆంగ్లం అధికార భాషగా చలామణి అవుతోంది. పది దేశాలలో ఇది ప్రత్యేక భాష హోదా పొందింది. దాదాపు వందకు పైగా దేశాలలో ఇంగ్లిష్ ప్రథమ భాషగా ఉంది. కోట్లాది మంది ప్రజలు ఇంగ్లిష్‌ను మాతృభాషగా కలిగి ఉన్నారు. ఒకప్పుడు గ్రీకు, లాటిన్, ఫ్రెంచ్, సంస్కృతం గొప్ప భాషలుగా, రాజ భాషలుగా చలామణి అయ్యాయి. బ్రిటిష్ వారు అనుసరించిన వలస విధానం వలన ఆంగ్లం అంతర్జాతీయ భాషగా ఎదిగింది. షేక్స్పియర్, జీబీ షా, టీఎస్ ఇలియట్ వంటి ఎందరో రచయితలు ఆంగ్లంలో గొప్ప రచనలు చేసి ఆంగ్లభాషకి వన్నె తెచ్చారు. ఆక్స్ఫర్డ్ నిఘంటవులో ప్రతి సంవత్సరం 1000కి పైగా పదాలు కొత్తగా చేరతాయి. మధ్యయుగంలో సామ్రాజ్య వాదానికీ, మత వ్యాప్తికీ ఆంగ్లం దోహదపడగా; ఆధునిక కాలంలో ఉపాధి అవకాశాలకు ఊతం ఇచ్చింది. రవీంద్రనాధ్ టాగూర్, ఆర్కే నారాయణన్, సరోజినీ నాయుడు వంటి భారతీయ రచయితలు ఇంగ్లిష్‌లో రచనలు చేసి ఆ భాషని సుసంపన్నం చేశారు. ఏ భాషకైనా రచనలే ఊపిరి. (క్లిక్: ప్రపంచానికి దిక్సూచి.. పుస్తకం) అయితే ఆంగ్ల భాషా ప్రవాహంలో ప్రాంతీయ భాషలు కొట్టుకుపోకుండా చూడాలి. పేద విద్యార్థులకు ఆంగ్లంలో నాణ్యమైన విద్య అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులకు నిఘంటువులని పంపిణీ చేస్తున్నది. ‘నాడు–నేడు’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ఇంగ్లిష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. అలాగే ఆంగ్లాన్ని ఉద్యోగ ఉపాధి వనరులని కల్పించే భాషగానే చూడకుండా ప్రపంచ చరిత్ర, వర్తమాన పరిస్థితులు తెలుసుకునేందుకు ఉపయోగపడే అనుసంధాన భాషగా చూడాలి. – ఎం. రాంప్రదీప్ ఆంగ్ల భాషా ఉపాధ్యాయ సంఘ కన్వీనర్, తిరువూరు (ఏప్రిల్ 23న ప్రపంచ ఆంగ్ల భాషా దినోత్సవం) -
ఒక్క భాషకు పెత్తనమా?
దేశంలో హిందీకి పెద్ద పీట వేయాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. దీనికి వ్యతిరేకంగా 1970 లలో పెద్ద ఉద్యమమే సాగింది. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ తెరపైకి తేవడంతో వాతా వరణం వేడెక్కింది. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య అనుసంధాన భాషగా ఇంగ్లిష్‌కు ప్రత్యామ్నాయంగా హిందీని వాడాలని అమిత్ షా చేసిన ప్రతిపాదనపై సానుకూలత కంటే వ్యతిరేకతే ఎక్కువగా కనిపించింది. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలలో హిందీని అనుసంధాన లేదా ‘అధికార భాష’గా అంగీకరించడానికి ప్రజలు సానుకూలంగా లేరు. డీఎంకే అధినేత దివంగత కరుణానిధి నాయకత్వంలో మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఉద్యమ ప్రభావం సమసి పోలేదు. నేటి అవసరాలకు అనుగుణంగా ఇంగ్లిష్‌పై శ్రద్ధ వహించాలన్న ఆకాంక్ష తల్లిదండ్రులలోనూ వ్యక్తమవుతోంది. ఉన్నతస్థాయి చదువులు చదివినా తగిన ఉద్యోగాలు స్వదేశంలో లభించడం లేదని భావిస్తున్న యువత విదేశాలలో ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంగ్లిష్ అంతర్జాతీయ అనుసంధాన భాషగా ప్రపంచమంతటా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాఠశాల స్థాయి నుండే ఇంగ్లిష్ బోధించాలనీ, తద్వారా అణగారిన తరగతుల ప్రజలకూ, యువతకూ ఉద్యోగావకాశాలు పెరుగు తాయనీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. గతంలో ‘త్రిభాషా సూత్రా’న్ని ప్రవేశపెట్టారు. దక్షిణాది రాష్ట్రాల్లో దీన్ని అమలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో హిందీకే ప్రాధాన్యత ఇచ్చారు కానీ త్రిభాషా సూత్రంపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. దేశ వ్యాప్తంగా 57 శాతం మంది హిందీని మొదటి భాషగా చదువు తున్నారు. బహుశా ఈ కారణం వల్లనే హిందీని అను సంధాన భాషను చేయాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చి ఉండవచ్చు. భిన్న సంస్కృతులూ, భాషలూ, జీవన విధానాలూ విలసిల్లుతున్న మన దేశంలోని చాలా ప్రాంతాల్లో హిందీ పట్ల వ్యతిరేకత ఉంది. కేంద్రమంత్రి హిందీని ప్రతిపాదించిన తర్వాతనే గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలో సైన్ బోర్డులన్నింటినీ గుజరాత్ భాషలో రాయాలని నిర్ణయించింది. అలాగే ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో 15 వేల ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనా భాషగా ఉంటుందని యోగి ప్రభుత్వం ప్రకటించిన విషయమూ గమనార్హం. ఇంగ్లిష్‌కు చైనా, తదితర దేశాలు కూడా ప్రాధాన్యమివ్వడాన్నీ గమనించవచ్చు. ఇంగ్లిష్ చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తాయి. ఫలితంగా ఆయా కుటుంబాల ఆర్థిక స్థోమత పెరుగుతుంది. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వృద్ధి జరుగుతుంది. (క్లిక్: ఆలస్యమే! అయినా అభిలషణీయమే!) అయితే మాతృభాషలను నిర్లక్ష్యం చేయకూడదు. కేవలం ఇంగ్లిష్‌కు ప్రాధాన్యత ఇచ్చి మాతృభాషలను వదిలేస్తే ఆయా భాషలు అంతరించే ప్రమాదం ఉంది. ఇప్పటికే అనేక భాషలు అంతరించాయని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. హిందీని బలవంతంగా అమలు చేయాలని భావిస్తే హిందీ మాట్లాడేవారు, హిందీ మాతృభాష కాని వారి మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రజలు వ్యతిరేకించే విధానాలను అమలు చేయకపోవడమే మంచిది. (క్లిక్: లెక్కల్లో లేదు వాస్తవంలో ఉంది) – టి. సమత, సీనియర్ పాత్రికేయులు -
అభివృద్ధిని అడ్డుకునే ఇంగ్లిష్ వ్యతిరేకత
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇంగ్లిష్‌కు బదులుగా హిందీలో మాట్లాడాలని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అన్నారు. కానీ ఇంగ్లిష్ రాజ్యమేలుతున్న ప్రైవేట్ రంగాన్ని ఆయన సౌకర్యవంతంగా విస్మరించారు. ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్‌ని అడ్డుకుంటే, దేశంలోని శూద్ర, దళిత, ఆదివాసీ కమ్యూనిటీలు ఎదుర్కొనే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. హిందీని అధికార భాషగా అమలు చేయాలనుకున్నప్పుడు... ఇంగ్లిష్ స్కూళ్లు, కాలేజీలను ఏం చేస్తారు? శూద్ర, దళిత, ఆదివాసీలు ఇప్పుడిప్పుడే ఇంగ్లిష్‌ను అలవర్చుకోవడం ప్రారంభిస్తున్నారు. అంతర్జాతీయ జాబ్ మార్కెట్లో ప్రవేశించాలనే కనీస ఆశను కూడా వారిలో తుంచేయాలని చూస్తే ఎలా? ఇంగ్లిష్ నేర్చుకోవడానికి వ్యతిరేకంగా నిలిచిందంటే... భారత్ మళ్లీ అనివార్యంగా వెనక్కు వెళుతుంది. ఒకే దేశం, ఒకే భాష అని ప్రబోధిస్తున్న ఆరెస్సెస్, బీజేపీల ఎజెండా మళ్లీ ముందు కొచ్చింది. హిందీని జాతీయ, అధికారిక భాషగా ఆమోదించాలంటూ దక్షిణ భారతదేశంపై, ఈశాన్య భారతదేశంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వ పథకం కూడా ముందుకొచ్చింది. అయితే ఇది అంతటితో ఆగిపోలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలి ప్రకటన చూస్తే మరింత సీరియస్ అంశాన్ని అది సూచిస్తోంది. అధికార భాషా కమిటీ చైర్మన్ హోదాలో కేంద్ర హోంమంత్రి 2022 ఏప్రిల్ 7న ఒక డేరింగ్ ప్రకటన చేశారు. ‘దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇంగ్లిష్‌కు బదులుగా హిందీలో మాట్లా డాలి’ అనేశారాయన. గుర్తించాల్సింది ఏమిటంటే, సాధారణంగా ఇంగ్లిష్‌ని ప్రధానమైన భావవ్యక్తీకరణ భాషగా కలిగి ఉంటున్న ప్రైవేట్ రంగాన్ని ఆయన పూర్తిగా విస్మరించేశారు. అమిత్ షా ప్రకటనకు సరిగ్గా ఒకరోజు ముందు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్పర్సన్ ఎం.జగదీష్ కుమార్ మాట్లాడుతూ, భారత దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌లు నెలకొల్పు కోవడానికి ఒక పథకాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈ క్యాంపస్‌లలోని విద్యార్థులు, టీచర్లు హిందీ మాట్లాడతారా? ‘అశోకా’ లేదా ‘ఎమిటీ’ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లిష్‌కి బదులుగా హిందీలో బోధించాలని అమిత్ షా కోరగలరా? ఒకటి మాత్రం నిజం. కేంద్ర హోంమంత్రి జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీలను హిందీ మీడియం విద్యాసంస్థలుగా మార్చాలని చూస్తున్నారు. భారతదేశ భాషా బాహుళ్యవాదం భవిష్యత్తు గురించి ఆందోళన చెందడానికి ముందు, ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్‌ని వ్యతిరేకించడం ద్వారా దేశంలోని శూద్ర, దళిత, ఆదివాసీ కమ్యూనిటీలు ఎదుర్కొనే పర్యవసానాలను చూడటం ముఖ్యం. ప్రభుత్వ రంగం లోని పరిశ్ర మలను, విద్యాసంస్థలను ప్రైవేటీకరించాలని బలంగా ప్రభోధిస్తున్న వారిలో అమిత్ షా ఒకరు. అయితే దేశంలోని దాదాపు అన్ని ప్రైవేట్ రంగ విద్యాసంస్థలూ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్ని, కళాశాలలనే నడుపుతున్నాయన్న విషయాన్ని అమిత్ షా విస్మరిస్తున్నారు. హిందీని బోధనా భాషగా, అధికార భాషగా అమలు చేయాలనుకున్నప్పుడు ఇంగ్లిష్ స్కూళ్లు, కాలేజీలను ఏం చేస్తారు? భారతీయ ఆర్థిక వ్యవస్థకు భారీ రాబడిని తెచ్చిపెడుతున్న ప్రధాన వనరు అయిన సాఫ్ట్వేర్ కంపెనీలలో హిందీని అమలు చేయడానికి అమిత్ షా ప్లాన్ ఏమిటి? దక్షిణ భారత, ఈశాన్య భారత రాష్ట్రాలను హిందీ మాట్లాడాలని నిర్బంధిస్తే, వాటి భాషలు, వాటి వ్యక్తీకరణ సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతింటాయి. హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాలపై హిందీని రుద్దాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం ఇదే మొదటిసారి కాదు. అంతర్గతంగా, బాహ్యాంగా ఆర్థిక సంబంధాలలో ఇంగ్లిష్ ఒకే విధమైన స్థాయిని పొందని కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే దేశవ్యాప్తంగా హిందీ అమలు కోసం ఎంతగానో ప్రయత్నిం చింది. తమిళనాడు ప్రథమ ముఖ్యమంత్రిగా సి.రాజగోపాలాచారి పాలిస్తున్నప్పుడు 1937–1940 మధ్యకాలంలో రాష్ట్ర జనాభాపై హిందీని రుద్దాలని ప్రయత్నించారు. దీంతో హిందీ వ్యతిరేక ఉద్యమం అక్కడ తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ శిబిరంలో రాజ గోపాలాచారి ఒక మెతకస్వభావం కలిగిన హిందుత్వ వాదిగా ఉండే వారు. హిందీపై ఆయన వైఖరి కాంగ్రెస్‌లోని బ్రాహ్మణ సిద్ధాంత కర్తలను విభజించి వేసింది. ఉదాహరణకు టి.టి. కృష్ణమాచారి పక్కా హిందీ వ్యతిరేకిగా, ఇంగ్లిష్ సమర్థకుడైన నేతగా ఉండేవారు. అయితే తమిళనాడుపై హిందీని నిర్బంధంగా రుద్దడానికి వ్యతిరేకంగా శూద్ర, దళిత ప్రజానీకాన్ని కూడగట్టిన ఘనత పెరియార్ రామస్వామి నాయకర్‌కే దక్కాలి. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం చేసిన హిందీని రుద్దాలనే ప్రయత్నం తమిళనాడులో భారీ స్థాయి ఆందోళనలకు, కాల్పులకు దారితీయడమే కాదు... చాలా మంది ఆత్మాహుతికి కూడా కారణమైంది. ఈ క్రమంలో హిందీ వ్యతిరేక పోరాటంలో 70 మంది ప్రజలు చనిపోయారు. ఫలితంగా 1967 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పొందింది. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత అన్నాదురై తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత చరిత్ర తెలిసిందే. అయితే తమిళ ప్రజల ఇంగ్లిష్ అనుకూల ఆందోళనల వల్ల ఎవరు లబ్ధి పొందారు అంటే తమిళ బ్రాహ్మణులే. వీరు చాలావరకు ప్రైవేట్ క్రిస్టియన్ మిషనరీ పాఠశాలల్లో చదువుకున్నారు. బ్రాహ్మ ణిజంపై తిరుగుబాటు చేసిన తమిళ బ్రాహ్మణ మహిళ గీతా రామ స్వామి... ఇటీవల రాసిన తన జ్ఞాపకాల్లో (ల్యాండ్, గన్స్, క్యాస్ట్, విమెన్) ఇంట్లోనూ, తాను చదువుకున్న ఇంగ్లిష్ మీడియం పాఠశాల లోనూ పరస్పర వ్యతిరేకమైన విశ్వాసాల మధ్య తన బాల్యం గడిచి పోయిందని చెప్పారు. ఇంట్లో బ్రాహ్మిన్గానూ, పాఠశాలలో కేథలిక్ గానూ తాను గడిపానని ఆమె చెప్పారు. రుతుస్రావం అనేది భయంకరమైన కాలుష్యమని, రజస్వలగా ఉన్నప్పుడు దేవతా విగ్రహాలను తాకితే అవి మైలపడిపోతాయనీ, విరిగిపోతాయనీ బ్రాహ్మణ భావజాలంతో కూడిన ఇల్లు ఆమెకు నేర్పింది. కానీ ఆమె చదివిన పాఠశాల మాత్రం రుతుస్రావం అంటే తనలోని సంతాన శక్తిని చాటే ప్రక్రియ అని ఆమెకు బోధించింది. ఈ విధంగా సమాజంలోని అన్ని ఇతర కులాల వారికంటే బ్రాహ్మణు లను, వైశ్యులను ఇంగ్లిష్ విద్య విముక్తి చేసి పడేసింది. ఈరోజు దేశంలోని బడా బడా బనియా పారిశ్రామిక వేత్తలు ఇంగ్లిష్‌లోనే వ్యవ హరాలు నడిపిస్తున్నారు. పైగా ప్రపంచ స్థాయి ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు, కళాశాలలను నడుపుతున్నారు. మరి హిందీ సమర్థకులైన అమిత్ షా వాటిని మూసివేయాలని ప్లాన్ చేస్తున్నారా? భారతదేశంలోని శూద్ర, దళిత, ఆదివాసీలు ఇప్పుడిప్పుడే ఇంగ్లిష్‌ను అలవర్చుకోవడం ప్రారంభిస్తున్నారు. కానీ వారిలో అంత ర్జాతీయ జాబ్ మార్కెట్లో ప్రవేశించాలనే కనీస ఆశను కూడా తుంచే యాలని అమిత్‌షా కోరుకుంటున్నారు. దేశం లోపల కూడా ఇంగ్లిష్‌ను మాట్లాడే, రాసే సామర్థ్యం లేకపోవడం కారణంగానే ఈ కమ్యూని టీలకు ప్రైవేట్ రంగం ఉద్యోగాల్లో స్థానం లేకుండా పోతోంది. వీరు ఇంగ్లిష్‌ను మాట్లాడలేకపోతే, వారు దాన్ని ఎలా నేర్చుకోగలు గుతారు? ఈ ఇంగ్లిష్ విద్య కారణంగానే తమిళ బ్రాహ్మణ మూలాలు కలిగిన కమలా హారిస్ ఏకంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ కాగలిగారు. సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ కాగలిగారు. ఇది మాత్రమే కాదు... వారిలో పటిష్టంగా ఉన్న ఇంగ్లిష్ మీడియం విద్య కారణంగానే తమిళ బ్రాహ్మణులు చారిత్రకంగా కేంద్ర ప్రభుత్వాల్లో అత్యున్నత స్థానాలను చేజిక్కించుకోగలిగారు. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉంటున్న నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉంటున్న ఎస్.జైశంకర్ ఆ ఇంగ్లిష్ విద్యా వారసత్వానికి కొనసాగింపు గానే నిలుస్తున్నారు. ఇంతేకాదు. అమిత్‌షా దేశాన్నే దహించివేయగల మరొక ఎజెండాపై కూడా కృషి చేస్తున్నారు. విస్తరించిన ఇంగ్లిష్ భాషా పునాది సహాయం తోనే భారత్, చైనా దేశాలు నేడు అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడుతు న్నాయి. జాతీయవాద వాగాండబరం ఎలా ఉన్నా, అది ఇంగ్లిష్ నేర్చుకోవడానికి వ్యతి రేకంగా ప్రభావం కలిగించిందంటే... భారతదేశం మళ్లీ అనివార్యంగా వెనక్కు వెళ్తుంది. జాగ్రత్త! కంచె ఐలయ్య షెపర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
‘సారీ’లు ఇన్ని రకాలుగా చెప్పవచ్చు!
ఏదో ఒక సమయంలో ఎవరికో ఒకరికి సారీ చెబుతూనే ఉంటాం మనం. ‘ఐయామ్ సారీ’ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఇది మాత్రమే కాదు.. సందర్భాన్ని బట్టి ఇలా రకరకాలుగా సారీ చెప్పవచ్చు... ఐ అపాలజీస్: ఉదా: ఐ అపాలజీస్ ఫర్ ది డిలే ఇన్ రిప్లైంగ్ టు యువర్ ఇమెయిల్ ఐ బెగ్ యువర్ పర్డన్: ఉదా: పర్డన్ మై ఇగ్నోరెన్స్ మెయ కుల్ప: ‘మెయ కుల్ప’ అనేది లాటిన్ మాట. మోడ్రన్ ఇంగ్లీష్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మై బ్యాడ్: లైట్‌గా సారీ చెప్పాల్సిన సందర్బంలో వాడుతారు. ఉదా: మై బ్యాడ్. ఇట్ వోన్ట్ హ్యాపెన్ అగేన్ వూప్స్: మైల్డ్ సారీ, సర్ప్రైజ్... ఉదా: వూప్స్! ఐ బ్రోక్ యువర్ కాఫీ మగ్ -
ది ఎండ్ ఆఫ్ ది రెయిన్బో.. దీని వెనుక కథ ఇదే!
మనకు ఒక బలమైన కోరిక లేదా లక్ష్యం ఉండవచ్చు. అయితే దాన్ని నిజం చేసుకోవడం చాలా కష్టం కావచ్చు. ఇలాంటి సందర్భంలో ఉపయోగించే ఇడియమ్... ది ఎండ్ ఆఫ్ ది రెయిన్బో. ఉదా: ఎట్ ది మూమెంట్, ఫైండింగ్ ఏ గుడ్ ప్లంబర్ ఈజ్ లైక్ ఫైండింగ్ ఏ పాట్ ఆఫ్ గోల్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది రెయిన్బో. ఇక దీని కథ విషయానికి వస్తే... అనగనగా ఐర్లాండ్‌లో పేద దంపతులు ఉంటారు. ఒకరోజు వీరు పొలంలో పనిచేస్తుండగా ‘లెప్రికాన్’ ప్రత్యక్షమౌతాడు. కోటు, హ్యాట్, గెడ్డంతో కనిపించే ఈ వృద్ధుడికి ఇతరులను ఇబ్బందుల్లోకి నెట్టి తమాషా చూడడం అంటే ఇష్టం. ఈ విషయం తెలియక చాలామంది బోల్తా పడుతుంటారు. (నయా ఇంగ్లిష్: ఘోస్ట్ కిచెన్ అంటే?) ‘మీకు ఏంకావాలో కోరుకోండి’ అని ఆ దంపతులను అడుగుతాడు. ఇక అంతే. వెనకా ముందు ఆలోచించకుండా తమలోని దురాశను బయటపెట్టుకుంటారు ఆ దంపతులు. ఖరీదైన బట్టలు, బంగ్లాల నుంచి బంగారుగనుల వరకు అన్నీ కోరుకుంటారు. (క్లిక్: క్యాచ్–22 సిచ్యువేషన్ అంటే ఏంటో తెలుసా?) ‘మీరు కోరినవన్నీ తీరుతాయి. అయితే ఒక విషయం. మీరు ఎప్పుడైతే ఇంద్రధనసు చివర దాగున్న బంగారునాణేల పాత్రను చూస్తారో... అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది’ అని చెప్పి మాయమవుతాడు లెప్రికాన్. రెయిన్బో చివర ఎప్పుడు కనిపించాలి, అక్కడ బంగారం ఎప్పుడు కనిపించాలి!! (క్లిక్: ఉత్త ప్యాంగసియన్ ఆశ.. ఇంతకీ ఎవరు ఇతను?) -
క్యాచ్–22 సిచ్యువేషన్ అంటే ఏంటో తెలుసా?
జీవితంలో మనకు అప్పుడప్పుడూ కొన్ని రకాల సందర్భాలు ఎదురవుతుంటాయి. కింద ఇచ్చిన పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదురైతే ‘క్యాచ్–22 సిచ్యువేషన్’లో ఉన్నట్లు. ► ఏదైనా ఒక సందర్భంలో ఒక అడుగు ముందుకు వేయబోతే సమస్యల్లో చిక్కుకునే పరిస్థితి ఎదురుకావడం. (క్లిక్: ఉత్త ప్యాంగసియన్ ఆశ.. ఇంతకీ ఎవరు ఇతను?) ► మీరు మీ కళ్లజోడును ఎక్కడో పెట్టి మరిచిపోతారు. అయితే అవి ఎక్కడున్నాయో వెదకాలంటే కళ్లజోడు తప్పనిసరి. ఇదొక విచిత్ర పరిస్థితి. ∙మీరు కారు డ్రైవ్ చేస్తూ ఒక సైకిలిస్ట్‌ను ఢీకొట్టారు. ‘నువ్వు సైకిలిస్ట్‌ను చూశావా?’ అని జడ్జి అడుగుతాడు. ‘చూశాను’ అని అంటే ‘చూస్తూ కూడా ఎందుకు ఢీకొట్టావు?’ అని అడుగుతాడు. ‘చూడలేదు’ అని చెబితే ‘అంత నిర్లక్ష్యమా!’ అంటాడు. ఇదొక సంకట పరిస్థితి. (నయా ఇంగ్లిష్: ఘోస్ట్ కిచెన్ అంటే?) జోసెఫ్ హెలీ రాసిన క్యాచ్–22 సెటైరికల్ నవలతో ఈ ‘క్యాచ్–22’ అనే ఎక్స్ప్రెషన్ మొదలైంది. రెండో ప్రపంచయుద్ధ నేపథ్యం తీసుకొని రాసిన ఈ నవలలో యుద్ధంలో ఉండే క్రూరత్వం, వినాశనాన్ని వ్యంగ్యాత్మకంగా చెబుతారు రచయిత. (క్లిక్: అక్కడి పరిస్థితి హెలైసియస్గా ఉంది..!) -
హేమ్లెట్ విత్ఔట్ ది ప్రిన్స్.. ఫ్లాష్‌బ్యాక్ ఏంటో తెలుసా?
జాతీయాలు అంటే వాక్యాలు, మాటలు కాదు. జీవితసత్యాలు. మాట్లాడే భాషకు ఇడియమ్స్ కూడా తోడైతే ఎంతో బాగుంటుంది. ఈవారం మచ్చుకు ఒకటి... ఒక కార్యక్రమం లేదా ప్రదర్శనలో ప్రధానమైన వ్యక్తి రాకపోతే, కనిపించకపోతే ‘హేమ్లెట్ విత్ఔట్ ది ప్రిన్స్’ అంటారు. దీని ఫ్లాష్‌బ్యాక్ ఏమిటో తెలుసుకుందాం... అది 1775 సంవత్సరం. లండన్ కేంద్రంగా వచ్చే ‘ది మార్నింగ్ పోస్ట్’ దినపత్రికలో ఒక వార్త ప్రచురితమయ్యింది. ‘హేమ్లెట్ విత్ఔట్ ది ప్రిన్స్’ ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు. చదివితే అసలు విషయం బోధపడింది. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే... లండన్‌లో ఒక థియేటర్లో షేక్స్పియర్ ‘హేమ్లెట్’ నాటకం ప్రదర్శనకు సిద్ధమయ్యింది. ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పుడు ఒక ఎనౌన్స్మెంట్ వినిపించింది.. (క్లిక్: అక్కడి పరిస్థితి హెలైసియస్గా ఉంది..!) ‘ప్రేక్షకమహాశయులకు ముఖ్య విజ్ఞప్తి. ఈరోజు కూడా నాటకం ప్రదర్శించబడుతుంది. అయితే ఈ ఒక్కరాత్రి మాత్రం నాటకంలో హేమ్లెట్ పాత్ర ఉండదు’ ‘హేమ్లెట్ లేని నాటకం ఏమిటి!’ అని ప్రేక్షకులు తిట్టుకున్నారా, అడ్జస్టైపోయారా అనేది వేరే విషయంగానీ ఒక కార్యక్రమంలో ముఖ్యమైన వ్యక్తి రాకపోతే ఈ ఇడియమ్‌ను ఉపయోగించడం పరిపాటి అయింది. (క్లిక్: డూ యూ వన్నా హ్యాంగవుట్?) -
డూ యూ వన్నా హ్యాంగవుట్?
మనం రెగ్యులర్‌గా మాట్లాడే ఇంగ్లీష్‌కు, నేటివ్ ఇంగ్లీష్‌కు ఎంతో కొంత తేడా ఉంటుంది. నేటివ్ స్పీకర్స్ రకరకాల స్లాంగ్స్ను ఉపయోగిస్తుంటారు. వాటన్నింటినీ పట్టుకోవడం కష్టం కావచ్చుగానీ బాగా ఉపయోగించే కొన్ని పదాలు, వాక్యాలు అనుసరించడం వల్ల కాస్త వెరైటీగా ఉంటుంది. ఉదా: వొనా (వాంట్ టు), గోనా (గోయింగ్ టు) హ్యాంగ్ ఔట్ (స్పెండ్ టైమ్ టు గెదర్) ‘డూ యూ వాంట్ టు స్పెండ్ సమ్‌టైమ్ టుగెదర్’ అనే మాటను నేటివ్ ఇంగ్లీష్‌లో ఇలా అంటారు... ‘డూ యూ వొనా హ్యాంగవుట్?’ బొమ్మ అదుర్స్ బొమ్మలు వేయడం అంటే మీకు ఇష్టమా? మీరు ఇప్పుడిప్పుడే బొమ్మలు వేయడాన్ని ప్రాక్టిస్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు మీకు కావాలి linea sketch ఇదొక డ్రాయింగ్ యాప్. స్కెచ్చింగ్ను దృష్టిలో పెట్టుకొని సింపుల్‌గా ఈ యాప్‌ను రూపొందించారు. బ్లెండ్ టూల్, వైబ్రెంట్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఆపిల్ పెన్సిల్ లేదా మీ చేతి వేలును ఉపయోగించి స్కెచ్చింగ్ చేయవచ్చు. డ్రాయింగ్ ప్రాసెస్‌ను రికార్డ్ చేసే సౌకర్యం ఉంది. ఆ తరువాత దీన్ని తీరిగ్గా చూసుకోవచ్చు. చదవండి: రెండే రెండు నిమిషాల్లో బాద్షా సాంగ్, స్పందించిన ర్యాపర్ -
ఉత్త ప్యాంగసియన్ ఆశ.. ఇంతకీ ఎవరు ఇతను?
ఆశావాదం మంచిదే కాని అతి ఆశావాదంతోనే సమస్య. అతి ఆశావాదం వాస్తవాలను చూడనివ్వదు. భ్రమజనిత ప్రపంచంలో పెడుతుంది. ఏదైనా ఐడియా లేదా ప్లాన్‌లో వాస్తవం తక్కువై, ఆశావాదం మరీ ఎక్కువైంది అనుకోండి ‘ఉత్త ప్యాంగసియన్ ఐడియా’ అంటారు. అతి ఆశావాదులను ‘ప్యాంగసియన్’ అంటారు. ఇంతకీ ఎవరు ఇతను? ఫ్రెంచ్ ఫిలాసఫర్, రైటర్, హిస్టారియన్ వొల్టేర్ 1759 లో ‘కాండీడ్’ అనే నవల రాశాడు. అనేక దేశాల్లో ఈ పుస్తకం నిషేధానికి గురైంది. ఆ కాలంలో ఎలా ఉన్నప్పటికీ ప్రపంచ సాహిత్యంలోని గొప్ప పుస్తకాల్లో ఒకటిగా పేరుగాంచింది. (చదవండి: పురోహితురాలు.. అమెరికాలో పెళ్లిళ్లు చేస్తున్న సుష్మా ద్వివేది) ఈ నవలలో ‘ప్యాంగ్లాస్’ అనే తత్వవేత్త అతిఆశావాది. నెత్తి మీద బండ పడినా, కొండ పడలేదు కదా! అని సర్దుకుపోయే తత్వం. తన అతి ఆశావాదాన్ని నెగ్గించుకోవడానికి వాస్తవాలతో సంబంధం లేని ఎన్ని వాదనలైనా చేస్తాడు. చివరికి తాను బిచ్చమెత్తుకునే విషాదపరిస్థితి వచ్చినప్పటికీ తన ఆతిఆశావాదాన్ని మాత్రం వదలడు! తన కంటే సీనియర్ అయిన ఒక జర్మన్ తత్వవేత్తను దృష్టిలో పెట్టుకొని వొల్టేర్ సెటైరికల్‌గా ఈ పాత్రను సృష్టించాడు. (చదవండి: లెట్స్ సీ వాట్ ఐ కెన్ డూ.. అదే ఆమె మంత్రం!) -
నయా ఇంగ్లిష్: ఘోస్ట్ కిచెన్ అంటే?
కస్టమర్ల కోసం ఇండోర్ సీటింగ్ ఉండదు. వెయిటర్లు ఉండరు. డైనింగ్ రూమ్ ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఫుడ్ డెలివరీ వోన్లీ తరహా రెస్టారెంట్లను ‘ఘోస్ట్ కిచెన్’ అంటారు. truthiness అంటే? అమెరికన్ టెలివిజన్ కమెడియన్ స్టిఫెన్ కోల్బర్ట్ ఈ టెర్మ్‌ను కాయిన్ చేశాడు. సాక్ష్యాలు, ఆధారాలతో సంబంధం లేకుండా ఒక విషయాన్ని గట్టిగా నమ్మడం... ట్రూతినెస్. sobercurious అంటే? ఆల్కహాల్ ముట్టకుండా ఒక నిర్ణితమైన కాలాన్ని ప్రయోగాత్మకంగా గడపడం. (చదవండి: పూజను 70 లక్షల మంది ఫాలో అవుతున్నారు.. ఎందుకంటే!) హైపర్బొలి అనగా... ఏదైనా విషయాన్ని కాస్త అతిశయంగా చెప్పడమే హైపర్బొలి. భావాన్ని యథాతథం గా తీసుకోవద్దు. కవితల్లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. ఉదా: అతని కళ్లు కన్నీటి సముద్రాలు అయ్యాయి. convolution అంటే ఒక విషయం కష్టంగా, సంక్లిష్టంగా ఉండడం. ‘మనం సృష్టించకపోతే పదాలు ఎలా పుడతాయి!’ అనేది ఒక పాలసీ. పాత పదాలనే కొత్తగా కాయిన్ చేయడం అనేది మరో పద్ధతి. ‘ఒరిజనల్ సెన్స్ ఆఫ్ ది వర్డ్’కు దగ్గరగా తమాషా పదాలను సృష్టించడమే aptagram -
ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడిన యాచకురాలు.. ఆమె గతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
సాధారణంగా ఏ ఆధారం లేని వాళ్లు, పనిచేయలేని స్థితిలో ఉన్నవారు, వృద్ధులు బిక్షాటన చేసుకోవడం చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో అన్నీ బాగున్నా సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్ధేశంతో కూడా భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే గతంలో దర్జాగా బతికిన కొంతమంది అనుకోని కారణాల వల్ల ఒంటరి వారుగా మారి భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీసే పరిస్థితి వస్తుంటుంది. ఇలా ఇతరులను వేడుకుంటూ యాచించే వారి గత అనుభవాలు తెలిస్తే ఎంతో భాదేస్తుంది. తాజాగా ఓ యాచకురాలు ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతుండటం విని స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఆమె గురించి తెలుసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: బిచ్చగాడి అంతిమయాత్రకు ఊరూ-వాడా కదిలింది! వివరాల్లోకి వెళితే.. యూపీలోని వారణాసికి చెందిన స్వాతి అనే యాచకురాలు ఇంగ్లీష్‌లో అవలీలగా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దక్షిణ భారత్క చెందిన స్వాతికి పెళ్లయి ఓ బాబు కూడా ఉన్నాడు. తన డెలివరీ సమయంలో ఆమె కుడి కాలు, కుడి చేతికి పెరాలసిస్ వచ్చి నడవలేని స్థితికి చేరుకోడంతో తనను ఇంట్లో నుంచి గెంటేశారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న స్వాతి చివరకు వారణాసికి చేరుకుంది. గత మూడేళ్ల నుంచి వారణాసిలోనే భిక్షాటన చేస్తూ తన జీవితాన్ని వెళ్లదీస్తోంది. అయితే స్వాతి బాగా చదువుకుంది. తను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివింది. అందుకే ఇంగ్లీష్‌లో అంత బాగా మాట్లాడుతోంది. కాగా స్వాతి వీడియోను రికార్డు చేసిన వ్యక్తి.. తనకు మంచి ఉద్యోగం చూస్తానని హామీ కూడా ఇచ్చాడు. స్వాతి ఇంగ్లీష్‌లో మాట్లాడిన వీడియోను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక నెటిజన్లు అయితే.. స్వాతి మాట్లాడే ఇంగ్లీష్‌కు ఫిదా అయిపోతున్నారు. -
గూగుల్‌లో సూపర్ ఫీచర్, ఇక ఇంగ్లీష్‌లో అదరగొట్టేయొచ్చు
ఇంగ్లీష్..! ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అవసరమైన లాంగ్వేజ్. ఎడ్యుకేషన్ లేకపోయినా, డిగ్రీలు చదవకపోయినా ఇంగ్లీష్ మాట్లాడడం, చదవడం, రాయడం వస్తే చాలు అవకాశాలు దానంతటే అవే మనల్ని వెతుక్కుంటూ వస్తుంటాయి. అందుకే ఇంగ్లీష్ నేర్పించేందుకు ఇనిస్టిట్యూట్లు, యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సైతం యూజర్లకు ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించేందుకు సిద్ధమైంది. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే ఔత్సాహికులకు ఇంగ్లీష్ ల్వాంగేజ్ను నేర్పించాలనే ఉద్దేశంతో గూగుల్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో ప్రతిరోజూ కొత్త ఇంగ్లీష్ అర్ధాన్ని నేర్చుకోవచ్చు. యూజర్లు తమ ఫోన్లలో ఈ ఫీచర్‌ను యాక్టివేషన్ చేసుకుంటే గూగుల్ ప్రతిరోజూ ఒక కొత్త అర్ధాన్ని నేర్పిస్తుంది. ఇందుకోసం సెర్చ్ ఇంజిన్ ఇంగ్లీష్‌లో ప్రావీణ్యులైన అధ్యాపకుల్ని నియమించినట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. తద్వారా ఇంగ్లీష్ భాషపై పట్టుసాధించవచ్చని గూగుల్ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఇటీవల విడుదలైన ఓ రిపోర్ట్ ప్రకారం..ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో గూగుల్ ట్రెండ్స్‌లోని టాప్ సెర్చ్‌లో కొన్ని ఇంగ్లీష్ అర్ధాల్ని తెలుసుకునేందుకు ఎక్కువగా సెర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది. వాటిలో ఇంట్రోవర్ట్, ఇంటిగ్రిటీ అనే పదాలు ఉన్నాయని, అందుకే యూజర్ల రోజూవారి జీవితాల్లో అవసరమైన ఇంగ్లీష్‌లో నైపుణ్యం సాధించేలా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ వెల్లడించింది. గూగుల్ ఫీచర్‌ను ఎలా యాక్టీవ్ చేసుకోవాలి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తరువాత సెర్చ్బార్లో ఉదాహరణకు ఇంటిగ్రిటీ అనే పదం అర్ధం తెలుసుకోవాలని ఉంటే..ముందుగా define అని టైప్ చేయాలి. ఆ వర్డ్ పక్కనే ఇంటిగ్రిటీ (define integrity) అని టైప్ చేస్తే ఆ పదం అర్ధం వస్తుంది. పైన ఇమేజ్‌లో చూపించినట్లుగా సెర్చ్ బార్ పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని మీరు యాక్టివేషన్ చేసుకుంటే గూగుల్ ప్రతిరోజు ఓ కొత్త అర్ధాన్ని నేర్పించేలా మీ మొబైల్‌కి నోటిఫికేషన్ పంపిస్తుంది. చదవండి: Facebook: పేరు మారిస్తే ఫేస్బుక్ ఇమేజ్ దెబ్బతినదా? -
‘ఆంగ్ల బోధనపై చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటు’
-
మున్సిపల్ ఫలితాలు: ఇంగ్లిష్ మహాలక్ష్మి!
కళ్యాణదుర్గం రూరల్: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ మహిళా కౌన్సిలర్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేయడం అందర్నీ ఆకట్టుకుంది. మున్సిపల్ కార్యాలయంలో గురువారం ప్రమాణ స్వీకారం సందర్భంగా 18వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన చలపాది మహాలక్ష్మి ఇంగ్లిష్‌లో ప్రమాణ పత్రం చదివి ప్రత్యేకంగా నిలిచారు. ఇంటర్ చదివి టీటీసీ పూర్తి చేసిన మహాలక్ష్మికి అధికారులు తెలుగులో ఉన్న ప్రమాణ పత్రాన్ని అందించారు. ఆమె దాన్ని సొంతంగా ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసుకుని మరీ ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. చదవండి: తోపుడుబండి వ్యాపారి.. మునిసిపల్ చైర్మన్ మామ అటెండర్‌గా పనిచేసిన చోట..నేడు కోడలు మేయర్ -
ఆంగ్లంలో అనర్గళంగా..
కూసుమంచి: ఆంగ్లం (ఇంగ్లిష్) సబ్జెక్టు అంటే విద్యార్థులకు ఓ పక్క భయం, ఆందోళన. కానీ, ఈ చిన్నారి నిషిత ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటం, వ్యాకరణంపై ఎంతోపట్టు కలిగి ఉండటం, తనపై తరగతుల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు సైతం వ్యాకరణాన్ని సుులభతర పద్ధతుల్లో ఎలా నేర్చుకోవచ్చో వివరిస్తున్న తీరు ను చూసి అందరూ ఔరా అనాలి్సందే. పిట్ట కొంచెం కూత ఘనం అనే దానికి నిర్వచనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని జుజ్జుల్‌రావుపేట గ్రామానికి చెందిన దాసు భాస్కర్, పద్మజ దంపతుల ఏకైక కుమార్తె దాసు నిషిత. నిషిత ఖమ్మంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు విద్యాశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు. కాగా, నిషిత చిన్ననాటి నుంచే చదువులో రాణిస్తోంది. ఆమెకు చదువుపై ఉన్న ఆసక్తిని వారు గమనించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సహించారు. చిన్నారికి ఇంగ్లిష్ సబ్జెక్టులో మంచి మార్కులు వస్తుండటంతో ఆ సబ్జెక్టులో మరింత ప్రోత్సహించారు. దీంతో నిషిత ఇతర సబ్జెక్టులతో పాటు ఇంగ్లిష్‌లో ప్రత్యేక ప్రతిభను కనబరుస్తూ వచ్చింది. నాలుగో తరగతి నుంచే ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడుతూ అబ్బుర పరుస్తోంది. ఇంగ్లిష్ వ్యాకరణంపై పట్టు బిగించింది. తాను చదువుతున్న తరగతి సామర్థ్యాన్ని మించి ఆపై తరగతుల వారికి ఇంగ్లిష్ వ్యాకరణంలో మెళకువలు వివరిస్తూ శెభాష్ అనిపించుకుంటోంది. చక్కని చేతిరాతతో బోర్డుపై రాస్తూ కఠిన పదాలను సులభంగా వివరిస్తోంది. నిషిత ప్రతిభను మరింత బయటకు తీసుకువచ్చేందుకు తల్లిదండ్రులు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల వారిని సంప్రదించగా వారి అనుమతితో అక్కడి విద్యార్థులకు ఇంగ్లిష్ వ్యాకరణాన్ని సులభ పద్ధతుల్లో వివరించి ఔరా అనిపించింది. ఇంగ్లిష్‌ను సులభంగా నేర్చుకునే విధానంపై కూడా అవగాహన కల్పిస్తోంది. ఇటీవల ఖమ్మంలోని డైట్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో సైతం పాల్గొని ప్రాథమిక ఇంగ్లిష్ వ్యాకరణం, వాక్య ప్రయోగం అనే అంశాలపై అవగాహన కల్పించి ప్రశంసలు అందుకుంది. యూట్యూబ్‌లో పాఠాలు.. ఆంగ్ల భాషలో దూసుకెళ్తున్న నిషిత తన తండ్రి ప్రోద్బలంతో సొంతంగా యూట్యూబ్ చానెల్ ఏర్పాటు చేసింది. ఇంగ్లిష్ వ్యాకరణం సులభంగా నేర్చుకునే విధానంపై పలు పాఠ్యాంశాలను రూపొందించి వాటిని యూట్యూబ్‌లో పొందుపరిచింది. లాక్డౌన్ కారణంగా ఇంటి వద్ద ఉంటున్న విద్యార్థులెందరికో ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని అందిస్తోంది. తాను చదువుకుంటూ, సమయాన్ని సద్వినియోగ పర్చుకుంటూ తనలోని జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా చిన్నారి నిషిత చేస్తున్న సాహసం, అందిస్తున్న సహకారం అభినందనీయం. ఇది నేటి తరం విద్యార్థులకు ఆదర్శనీయం. -
వైర్లు లేని స్మార్ట్ సిగ్నల్ వ్యవస్థ
సౌతాంప్టన్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ఎప్పటికప్పుడు వస్తోన్న మార్పులను అందిపుచ్చుకొని ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోయినప్పుడే నిజమైన పురోభివృద్ధి మానవ జాతి సాధించగలదన్నది తెల్సిందే. కాలుష్యం నియంత్రణలో భాగంగా ఇంగ్లండ్ ప్రభుత్వం గత కొంత కాలంగా మోటారు వాహనాల స్థానంలో సైకిళ్లను ప్రోత్సహిస్తూ వస్తోన్నది. అయినప్పటికీ వాహనాల సంఖ్య తగ్గక పోగా, ప్రతి కూడలి వద్ద రద్దీగా పెరుగుతుండడంతో సైకిళ్లపై ప్రయాణించడమన్నది సైక్లిస్టులకు భారంగా తయారయింది. ఈ నేపథ్యంలో ప్రతి కూడలి వద్ద వారికి అనుకూలమైన సిగ్నలింగ్ వ్యవస్థ తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. ఒకప్పుడు పాదాచారులకు ప్రాధాన్యమిచ్చిన తీరులో ఇప్పుడు సైక్లిస్టులు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఇంగ్లండ్ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత. గతంలో పాదాచారుల కోసం నిర్దిష్ట సమయంలో గ్రీన్ సిగ్నల్ వెలగ్గా, ఇప్పుడు నిర్దిష్ట సంఖ్యలో సైకిళ్లను చూసి వెంటనే వాటికి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రభుత్వం ప్రవేశ పెడుతోన్న స్మార్ట్ సిగ్నలింగ్ వ్యవస్థ లక్ష్యం. ఇందుకు విద్యుత్ వైర్లు అవసరం లేని ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ను ఉపయోగిస్తోంది. ఈ స్మార్ట్ వ్యవస్థను ముందుగా ప్రయోగాత్మకంగా లండన్‌తోపాటు వోల్వర్హామ్టన్, కోవెంట్లీ, సౌతాంప్టన్‌లో ముందుగా ప్రవేశపెడుతున్నారు. తర్వాత దీన్ని అన్ని నగరాలకు విస్తరించనున్నారు. ఈ స్మార్ట్ వ్యవస్థను ఇంతకుముందే అమల్లోకి తీసుకరావాలనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. (చదవండి: ఒక్కసారిగా ఏడ్చేసిన కిమ్) -
ఇంగ్లిష్ వస్తే ఇలాంటి విజయం వస్తుంది..
రెండో కాన్పు అయ్యాక పుట్టింటికి వచ్చిన అనురాధకు ఇరుగు పొరుగు ఆడవాళ్లు ‘కొంచెం ఇంగ్లిష్ నేర్పించమ్మా’ అని అడిగారు. ఆమె నేర్పడం మొదలెట్టింది. ఒకరా ఇద్దరా... ఇలాంటి వారు దేశంలో దాదాపు 46 కోట్ల మంది ఉన్నారని గ్రహించింది. సొంత భాషలతో ఇంగ్లిష్ నేర్పే యాప్‌ను మొదలెట్టింది. ఇప్పుడామె ‘మల్టీభాషి’ యాప్ ద్వారా 15 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఇంగ్లిష్ వస్తే ఏమవుతుంది అని కొందరు అడుగుతుంటారు. ఇంగ్లిష్ వస్తే ఇలాంటి విజయం వస్తుందని అనురాధ నిరూపిస్తోంది. ఇంటి భాషను ఎవరు ప్రేమించరు? అమ్మ నోటి నుంచి మొదటిగా వినే భాషను ఎవరైనా కాదనుకుంటారా? కాని ఇంగ్లిష్ వంటి అన్యభాష ప్రపంచానికి చుక్కానిగా మారినప్పుడు అది నేర్చుకోవాలి కదా. అది కూడా మన నోటికి రావాలి కదా. అది రాక, అది రావాల్సిన సమయాల్లో నోరు పెగలక, ముందుకు పడాల్సిన అడుగు వెనక్కు పడడటం పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన భారతీయులందరికీ తెలుసు. ఇక చదువు, అన్యభాషలు మగవారికే అన్న భావజాలం ఉన్న చోట స్త్రీలకు అది మరింత దూరంగా ఉండే గమ్యంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అనురాధా అగర్వాల్ ఇంగ్లిష్ టీచర్‌గా మారి దేశానికి ఆ భాష నేర్పే పనిలో పడింది. ఆమె తయారు చేసిన ‘మల్టీభాషి’ యాప్ 11 భారతీయ భాషల ద్వారా ఇంగ్లిష్ నేర్పిస్తోంది. అలాగే ఇంగ్లిష్ ద్వారా ఆ భారతీయ భాషలను నేర్చుకునేలా చేస్తోంది. ఇప్పుటికి 15 లక్షల మంది ఆమె తయారు చేసిన పాఠాలను వింటున్నారు. పెళ్లి తప్పించుకున్న అమ్మాయి అనురాధా అగర్వాల్‌ది జైపూర్. మార్వాడీ కుటుంబం. అక్కడి సామాజిక పరిస్థితుల వల్ల ఆడపిల్ల పదో తరగతి పాస్ అవడంతోటే పెళ్లి చేయడం ఆనవాయితీ. అనురాధ తల్లిదండ్రులు కూడా ఆమెకు 15 ఏళ్లు రావడంతోటే అదే ఆలోచించారు. అయితే అనురాధా అదృష్టం ఏమిటంటే వాళ్లకు సంతృప్తిస్థాయి వరుడు దొరకలేదు. దాంతో ఇంటర్ చదవింది. ఇంకా వరుడు దొరక్క పోయేసరికి కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ చేసి ఎంబిఏ కూడా చేసింది. 2013లో పెళ్లయ్యాక భర్తతో కలిసి గుర్గావ్ చేరుకుంది. వాళ్లిద్దరూ కలిసి ఒక ఫైనాన్స్ సంస్థను ప్రారంభించారు. అది భర్త ఆలోచన. అక్కడికి పెట్టుబడి కోసం స్టార్టప్ ఐడియాలతో వచ్చే వారిని ఆమె గమనించేది. ఐడియా ఇచ్చిన పుట్టిల్లు రెండవ కాన్పు అయ్యాక విశ్రాంతి కోసం అనురాధ జైపూర్ చేరుకుంది. అక్కడ ఆమెను కలిసిన ఇరుగు పొరుగు ఆడవాళ్లు ‘మాకు కాస్త ఇంగ్లిష్ నేర్పించమ్మా’ అని అడిగారు. వారు రకరకాల ఆర్థిక స్థాయులు ఉన్నవారు. కాని ఇంగ్లిష్ భాష రాకపోవడంలో సరిసమానంగా ఉన్నారు. ఎలాగూ ఖాళీగా ఉన్నాను కదా అని ఆమె ఒక వాట్సప్ గ్రూప్ పెట్టి కొన్ని పాఠాలు రికార్డు చేసి అందులో పెట్టడం మొదలెట్టింది. అయితే వారందరూ ‘మాకు గ్రామర్ వద్దు. మాట్లాడటం రావాలి. హోటల్‌కు వెళ్లినప్పుడు, సరుకుల అంగడికి వెళ్లినప్పుడు అవసరమైన ఇంగ్లిష్ కావాలి. అది మా మాతృభాష ద్వారా మాకు అర్థమయ్యేలా చెప్పాలి’ అన్నారు. అనురాధ ఆ అభ్యర్థనను దృష్టిలో పెట్టుకుని పాఠాలు మొదలెట్టింది. రాజస్థానీ భాషలో ఇంగ్లిష్‌ను వివరిస్తూ సంభాషణలు రికార్డ్ చేసింది. ఇవి అందరికీ నచ్చాయి. ఈ పని అనురాధాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. ఇవి మరింత మందికి ఉపయోగపడాలని ఒక ఫేస్బుక్ పేజీ తెరిచి వాటిలో ఆ పాఠాలను పోస్ట్ చేసింది. అక్కడా ఆదరణే. అప్పుడే ఒక వ్యక్తి ఆమెకు ‘మా అమ్మ బెంగాలీ. బెంగాలీ భాషలో ఇంగ్లిష్ పాఠాలు తయారు చేస్తే ఆమెకు ఉపయోగపడతాయి’ అని మెసేజ్ చేశాడు. ఒక్కసారిగా ఆమెకు మబ్బు తొలిగిపోయింది. దేశమంతా ఇంగ్లిష్ కావాల్సినవారు ఉన్నారు అని గ్రహించింది. వారందరికీ జన్మతః మాతృభాష వచ్చు. ఆ మాతృభాషతో వారికి ఇంగ్లిష్ నేర్పించాలి అని గ్రహించింది. అలా వచ్చిన ఆలోచనే ‘మల్టీభాషి’ యాప్. బెంగళూరు లో ఇందుకోసం ఆఫీస్‌ను స్థాపించింది. మల్టీభాషి మన దేశం బహుభాషల దేశం. ఒక్కో భాషలో ఒక్కోదేశానికి సరిపడినంతమంది ఉన్నారు. వీరందరికీ వారి వారి మాతృభాషల్లో పాఠాలు చెప్పాలని ‘మల్టీభాషి’ స్టార్టప్ మొదలెట్టింది. దేశంలో దాదాపు 46 కోట్ల మంది భారతీయులు ఇంగ్లిష్ భాష అవసరంలో ఉన్నారని ఆమె అంచనా. అందుకే పదకొండు భాషల్లో ఇంగ్లిష్ భాషను నేర్పించేలా ఈ యాప్‌ను తయారు చేసింది. అలాగే ఇంగ్లిష్ ద్వారా ఆ భాషలు నేర్చుకునే పాఠాలు కూడా ఈ యాప్ సమకూరుస్తుంది. అయితే భాషను నేర్పించడం అనేది పెద్ద పని. పైగా ఇన్ని భాషల ద్వారా అంటే ఇంకా పెద్ద పని. అనురాధ తన యాప్ కోసం 25 మంది కోర్ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. వీరిలో ఎక్కువమంది మహిళలే. ఇక పాఠాలు తయారు చేసేపని లో దేశవాప్తంగా 600 మంది ఉన్నారు. వీరిలో కూడా ఎక్కువమంది స్త్రీలకే అవకాశం వచ్చింది. ‘వారి కుటుంబ జీవనానికి భంగం కలగకుండా పని చేసే గంటల్లో సౌలభ్యం ఇస్తాను’ అంటుంది అనురాధ. ఈ యాప్ ద్వారా ఇప్పటికి 15 లక్షల మంది పాఠాలు వింటున్నారు. కేవలం 200 చెల్లించి పాఠాలు పొందవచ్చు. గరిష్టంగా 5 వేలు ఫీజు ఉంటుంది. స్త్రీలు పని చేయాలి ‘స్త్రీలు పిల్లల్ని పెంచడానికే ఎక్కువ ఇష్టపడతారు. అయితే వారు పని చేయడాన్ని కూడా ఇష్టపడతారు. ఈ రెంటిని సమన్వయం చేసుకోవాలి. పిల్లలు కూడా తమ పని చేసే తల్లిని తప్పక గౌరవిస్తారు. స్త్రీలు కలలు కనడం ఆపేయడం, అడ్డంకులతో ఆగిపోవడం సరి కాదు. కలలు కని సాధించుకోవడంలో తృప్తిని నేను అనుభవిస్తున్నాను’ అంటుంది అనురాధ. అనురాధ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు జపాన్‌వంటి దేశాల నుంచి కూడా ప్రతిపాదనలు వస్తున్నాయి. – సాక్షి ఫ్యామిలీ -
ఇటు తెలుగు.. అటు ఇంగ్లిష్
సాక్షి, అమరావతి: విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు పలు సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇటు మాతృభాషతోపాటు అటు ఆంగ్లభాషలోనూ విద్యార్థులు రాణించేలా ప్రోత్సహిస్తూ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ మార్పు ప్రక్రియ సరళంగా జరిగేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి పాఠశాల విద్యలో ఎలిమెంటరీ స్థాయిలో ’మిర్రర్ ఇమేజ్ పాఠ్య పుస్తకాలు’ అందించేందుకు సిద్ధమైంది. రెండు మాధ్యమాల్లో పాఠ్యాంశాలు ఉండటం ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బోధన సులభం కానుంది. ఇప్పటికే మనబడి నాడు–నేడు ద్వారా సరికొత్తగా తీర్చిదిద్దిన పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు సిలబస్‌ను మార్చింది. విద్యార్థులకు సులభంగా ఉండేలా విద్యారంగ నిపుణులతో సరికొత్తగా పాఠ్యాంశాలను రూపొందించింది. ఈ పుస్తకాలను సరికొత్తగా మిర్రర్ ఇమేజ్ తరహాలో ఒక పేజీలో తెలుగు, ఎదుటి పేజీలో ఇంగ్లిష్‌లో పాఠ్యాంశాలుండేలా రూపొందించారు. ►రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ నిపుణుల సహకారంతో తెలుగు–ఇంగ్లిష్ భాషల్లో తొలిసారిగా రూపొందించిన మిర్రర్ ఇమేజ్ పాఠ్య పుస్తకాలను ఈ ఏడాది నుంచి విద్యార్థులకు అందించనున్నారు. ►ఒకటి నుంచి ఆరో తరగతి వరకు తెలుగు,ఇంగ్లీష్, గణితం సిలబస్‌లో మార్పులు చేశారు. ►ఈవీఎస్ (ఎన్విరాన్ మెంటల్ సైన్స్) ఇకపై 3వ తరగతి నుంచి ఉండేలా సిలబస్ రూపకల్పన. ►ఆరో తరగతిలో సోషల్, హిందీ పాఠ్యాంశాల్లో మార్పులు చేశారు. ►ఈఏడాది తొలిసారిగా ప్రభుత్వపాఠశాలల్లో చదివే విద్యార్థులకు వర్క్ బుక్స్ అందించనున్నారు. ►గతంలో కేవలం 25 మంది కవుల రచనలే ఉండగా ఈసారి అన్ని ప్రాంతాలు, మాండలికాలు, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ 116 మందికిపైగా కవుల రచనలను పాఠ్యాంశాలుగా చేర్చారు. ►రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రాధమిక విద్యలో సెమిస్టర్ విద్యా విధానం అమలులోకి తెస్తున్నారు. పాఠ్యపుస్తకాలను కూడా సెమిస్టర్ల వారీగానే విద్యార్థులకు అందచేస్తారు. దీనివల్ల పుస్తకాల బరువు భారం చాలావరకు తగ్గుతుంది. ప్రాథమిక విద్య చరిత్రలోనే తొలిసారిగా.. ‘రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ పలువురు విద్యారంగ నిపుణులతో చర్చించి 1 నుంచి 6వ తరగతి వరకు పాఠ్యాంశాల్లో మార్పులు చేసింది. నూతన పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించి 116 మంది కవుల రచనల నుంచి అంశాలను చేర్చాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నత ఆలోచనలతో పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. తొలిసారిగా 1వ తరగతి నుంచి పిల్లలకు వర్క్ బుక్స్‌ను ప్రవేశపెట్టడంతోపాటు టీచర్స్ హ్యాండ్‌బుక్ కూడా ఇస్తున్నాం. ప్రాథమిక విద్య చరిత్రలోనే తొలిసారిగా సెమిస్టర్ విధానాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్నాం’ – డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ -
ఇంగ్లిష్ ఫోబియాతో అసలుకే మోసం
మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) కొన్ని రంగాల్లో ఆహ్వానించదగిన మార్పును తీసుకొచ్చింది. ఉన్నత విద్యారంగంలో అది వివిధ శాస్త్రాలను నేర్చుకునేందుకు అవకాశం కల్పించింది. లెక్కకు మించిన పరీక్షల అపస్వరాల స్థానంలో కళాశాల స్ధాయిలో ఉమ్మడి ప్రవేశపరీక్షకు తెర తీసింది. అలాగే దేశ జీడీపీలో 6 శాతం మేరకు విద్యకు కేటాయిస్తానని హామీ ఇచ్చింది కూడా. అయితే వీటన్నిటినీ కాస్త పక్కనబెట్టి ఇంగ్లిష్ బోధన అనే తీవ్ర సమస్య గురించి మాట్లాడుకుందాం. భాషాపరమైన జాతీయవాదం పట్ల తన అనురక్తికి అనుగుణంగా కేంద్రప్రభుత్వం 5వ తరగతి వరకు విద్యార్థి మాతృభాష (లేక స్థానిక, ప్రాంతీయ భాష)ను బోధనా మాధ్యమంగా కొనసాగించనున్నట్లు తెలిపింది. అయితే ఇది కొత్తదేమీ కాదు. అనేక సంవత్సరాలుగా, జాతీయ అభిమానం, వలసవాద వ్యతిరేక ఆగ్రహం వంటివాటితో సహా అవాంఛనీయమైన మనోభావాల ప్రాతిపదికన ఇంగ్లిష్‌కి వ్యతిరేకంగా దేశంలో సుదీర్ఘ యుద్ధం కొనసాగడాన్ని చూస్తూ వచ్చాం. ఇటీవల కాలంలో కూడా ఇంగ్లిష్‌పై యుద్ధం అనేది ప్రజాకర్షక రాజకీయాలకు కేంద్రబిందువై నిలిచింది. భాషాపరమైన యుద్దం 1950ల ప్రారంభం నుంచే మన దేశంలో కొనసాగుతూ వస్తోంది. ఆ రోజుల్లో ఇంగ్లిషు పట్ల పేరుకుపోయిన ఆగ్రహానికి వ్యతిరేకంగా నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భారతీయ అధికారిక భాషల్లో ఇంగ్లిష్‌ను కూడా ఒకటిగా చేర్చాలని పోరాడారు. దశాబ్దాలపాటు ఆ విధానం మంచి ఫలితాలను తీసుకొచ్చింది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రజలు తీవ్రంగా ద్వేషించినంత స్థాయిలోనే ఈరోజు ఇంగ్లిష్ ఒకే ఒక నిజమైన ప్రపంచ భాషగా మారిపోయింది. ప్రపంచ వాణిజ్యాన్ని, రాజకీయాలను, చివరకు విజ్ఞాన సృష్టిని కూడా ప్రస్తుతం ఇంగ్లిష్ భాషే నిర్దేశిస్తోంది. అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలు తమ సంపదను వస్తూత్పత్తి రంగం ద్వారా సృష్టించుకోగా, భారత్‌లో ఆలస్యంగా వచ్చిన ఆర్థిక వికాసం.. సమాచార సాంకేతికత, పార్మాసూటికల్స్, చివరకు రిటైల్, ఆతిథ్య రంగాలలో అత్యున్నత సేవల ఎగుమతిపై ఆధారపడుతోంది. భారతదేశం స్వాతంత్య్రం సిద్ధించిన తొలి దశాబ్దాల్లో సాంకేతిక విద్యలో పెట్టిన భారీ పెట్టుబడి వల్ల ప్రతిభావంతులైన ఇంజినీర్లను సమృద్ధిగా రూపొందించింది. వీరు చౌకగా లభించే శ్రామికుల కోసం చూస్తున్న బహుళ జాతి కంపెనీలనుంచి విదేశీ పెట్టుబడిని దేశంలోకి ఆకర్షించగలిగారు. అదేవిధంగా భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో అత్యంత విజయవంతమైన అంతరిక్ష సంస్థను (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ–ఇస్రో) అభివృద్ధి చేశారు. ఈ అన్ని అంశాల్లో ఇంగ్లిష్ నిర్వహించిన పాత్రను తొలినుంచి చాలా చిన్న చూపు చూస్తూ వచ్చారు. భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞానాన్ని అతి సులువుగా పొందడాన్ని ఇంగ్లిష్ సుసాధ్యం చేసింది. ప్రపంచంలోని ప్రతి చోటా వాణిజ్య వర్గాలతో కలిసి పనిచేయడంలో, ప్రపంచ మార్కెట్లలో తమ వస్తు సేవలను పోటీపడుతూ విక్రయించడంలో భారతీయులకు ఇంగ్లిష్ ఎంతగానో సహకరించింది. జనరల్ ఎలెక్ట్రిక్ సంస్థ దివంగత చైర్మన్ జాక్ వాలెచ్ మాటల్లో చెప్పాలంటే, ‘భారత్ అభివృద్ది చెందిన మేధో సామర్థ్యం కలిగిన అభివృద్ది చెందుతున్న దేశం’. ప్రవాస భారతీయుల అభివృద్ధికి కూడా ఇంగ్లిష్ ఎంతగానో దోహదపడింది. ఇతర ఆసియన్ దేశాల ప్రజల్లాగ కాకుండా, భారతీయులు ఇంగ్లిష్ భాషాజ్ఞానంలో, అనేక భాషల్లో తమ సమర్థత కారణంగా ఎక్కడకు వెళ్లినా, నివసించడంలో, పనిచేయడంలో స్వల్పకాలంలోనే, సులువుగా సమీకృతమై ముందుకు నడిచేవారు. వస్తువుల ఉత్పత్తిపై మనుగడ సాగించే దేశాలు విద్యలో భాషాపరమైన జాతీయవాదాన్ని భరాయించుకోగలవు. ఫ్యాక్టరీ ఉద్యోగాలలో ఉండే వారు విదేశీ సంస్కృతులకు చెందిన వ్యక్తులతో రోజువారీగా వ్యవహారాలు నడపాల్సిన అవసరం లేదు. కానీ భారత్ వస్తూత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేసుకునే మార్గంలో ఎన్నడూ పయనించి నట్లు కనిపించదు. వస్తూత్పత్తికి అత్యవసరమైన వనరుల సులభ కేటాయింపు, సమర్థవంతమైన ఉన్నతాధికార వర్గాన్ని రూపొందించే విషయంలో భారత రాజకీయవర్గాలు సంక్లిష్టంగా ఉంటూవచ్చాయి. అయినప్పటికీ సేవారంగాలు కల్పించిన వికాసంలో భారత్ వెనుకబడిలేదు. ఒక తరంలోపే భారత్ సామాజిక చలనపు నిచ్చెనమెట్లపైకి వివిధ వర్గాల వ్యక్తులను పంపించగలిగింది. ఉదాహరణకు ఇస్రో ప్రస్తుత చైర్మన్ కె. శివన్ ఒక రైతు కుమారుడు. అయితే భారత్ తన సేవలపై ఆధారపడిన అభివృద్ధి గాథను మరింత ముందుకు తీసుకెళ్లలేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఇంగ్లిష్‌తోపాటు నాణ్యమైన విద్యను ప్రజారాశులకు అందించడంలో దాని వెనుకబాటుతనమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో, భవిష్యత్ తరాలకు ఇంగ్లిష్ ప్రావీ ణ్యతను దూరం చేయడం అనేది అర్ధరహితం. ఇంగ్లిష్‌పై సరికొత్త యుద్ధాన్ని ప్రారంభించడం ద్వారా జనాభాపరమైన అనుకూలతను భారత్ దూరం చేసుకోవడమే కాకుండా దాని యువతకు ప్రపంచస్థాయి అవకాశాలను దక్కకుండా చేస్తోంది. పిల్లలు తమ మాతృభాషలోనే ఉత్తమంగా నేర్చుకోగలరని కొంతమంది వాదిస్తున్నారు. కానీ వాస్తవానికి మాతృభాషలు అనేవి జన్యుపరంగా తరం నుంచి తరానికి బదిలీ అయ్యేవి కావు. ఏ సమాజంలో అయినా 3–4 సంవత్సరాల ప్రాయంలోనే పిల్లలు భాషలను నేర్చుకుంటారు. అంటే ఇంగ్లిష్ ప్రావీణ్యతను పెంచుకోవాలంటే పిల్లలకు ప్రీ స్కూల్ స్థాయిలోనే ఇంగ్లిష్ నేర్పాల్సి ఉంది. ప్రాథమిక పాఠశాల దశలో ప్రాంతీయ భాషలనే నేర్పాలని నూతన విద్యావిధానం చెబుతుందంటే అది ఈ శాస్త్రసంబంధ అంశాన్ని ఎదుర్కొనలేక పలాయనం చిత్తగిస్తోందని అర్థం. పిల్లలు పెద్దవారయ్యే కొద్దీ కొత్త భాషలను నేర్చుకునే ప్రావీణ్యం వారికి కష్టమవుతుంది. ఇలాంటి పిల్లలే యూనివర్శిటీ స్థాయి విద్యలో గణనీ యంగా వెనుకబడిపోతుంటారు. ఎందుకంటే వారు ఆ దశలో తమ ఇంగ్లిష్ భాషను మెరుగుపర్చుకోడానికి, ఇంగ్లిష్‌లో ఉంటున్న సబ్జెక్టును నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, వీరు యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకుని బయటపడిన తర్వాత ప్రపంచ మార్కెట్లో ఉద్యోగాలకు పోటీ పడాలన్నా, విదేశాల్లో ఉన్నత విద్య సాగించాలన్నా చాలా కష్టమైపోతోంది. వీటన్నింటి ఫలితంగా దేశంలో వర్గప్రాతిపదికపై అసమానత్వం పెరిగిపోతోంది. నగరాల్లో ఖర్చుతో కూడిన ఇంగ్లిష్ మీడియం విద్యను పొందగలుగుతున్న వారు ప్రతిభ విషయంలో గ్రామీణ విద్యార్థులను సునాయాసంగా దాటి ముందుకెళుతున్నారు. ఇటీవల సంవత్సరాల్లో చైనీయులు సైతం ఈ సత్యాన్ని అంగీకరించడం మొదలెట్టారు. చరిత్రలో చూస్తే, భూమ్మీద సాంస్కృతికంగా స్వీయ రక్షణ విధానాన్ని అమలు చేస్తున్న దేశాల్లో చైనా అగ్రగామిగా ఉంటూ వచ్చింది. పైగా ఇంగ్లిష్ పట్ల దాని వైఖరిలో కూడా పెద్దగా తేడా ఉండేదికాదు. కానీ 2017లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం చైనా ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం ఇంటర్నేషనల్ స్కూల్స్‌ని ప్రపంచంలోనే ఎక్కువగా కలిగి ఉంటున్న దేశాల్లో అగ్రస్థానంలో ఉంటున్నట్లు వెల్లడయింది. ప్రాథమిక పాఠశాల స్థాయిలో కూడా ఇంగ్లిష్ విద్య పట్ల డిమాండ్ చైనీయుల్లోనే అత్యధికంగా ఉంటోందని పై నివేదిక సారాంశం. ఎందుకంటే ఇంగ్లిష్ విద్య అంతర్జాతీయ అవకాశాలను కొనితెస్తోందని వారికి అవగతమైంది. ఇతర సబ్జెక్టులను ఇంగ్లిష్‌లో నేర్పడానికి తగిన నాణ్యమైన ఇంగ్లిష్ టీచర్లను వెదికిపట్టుకోవడం చాలా కష్టం కాబట్టి ప్రాంతీయ భాషలకే ప్రాధాన్యత ఇవ్వాలని కొద్దిమంది విమర్శకులు వాదిస్తున్నారు. అయితే చైనా ఇప్పుడు పశ్చిమ దేశాలనుంచి యువ గ్రాడ్యుయేట్లను ఒకటి లేక రెండు సంవత్సరాలు ఆహ్వానించి యువ చైనీయులకు ఇంగ్లిష్ బోధిం చడం ద్వారా ఈ అంతరాన్ని పూడ్చాలని ప్రయత్నిస్తోంది. ఈ విధానాన్నే భారత్ కూడా అమలు పర్చాలి. పైగా ఈ విషయంలో తక్కిన ఆసియా దేశాల కంటే భారత్ ఇప్పటికే చాలా ముందుంది. పట్టణ మధ్యతరగతి ప్రజల బాగు కోసం భారత్ యువ టీటర్లను బయటి నుంచి రప్పించుకోవచ్చు. ఇది అమలులోకి వచ్చేలా భారతప్రభుత్వం ఒక నిర్దిష్ట కార్యక్రమాన్ని రూపొందించాల్సి ఉంది. ఇంగ్లిష్‌పై యుద్ధం అనేది రాజకీయంగా అర్ధవంతంగానే కనిపించవచ్చు కానీ అది భారతీయ సహజ ఆర్థిక బలాలను వెన్నుపోటు పొడుస్తుంది. జనాభా పరంగా భారత్ ప్రయోజనాలకు ఇది నిజంగా దుర్వార్తే మరి. (ఫ్రీడమ్ గెజెట్ సౌజన్యంతో) వ్యాసకర్త చీఫ్ ఎడిటర్, ఫ్రీడమ్ గెజెట్ మహమ్మద్ జీషాన్ -
ఇంగ్లిష్‌లో ‘శతక సానెట్స్’
చేర్యాల(సిద్దిపేట): వివిధ సంస్థలు గత మే నెల 2వ తేదీ నుంచి నేటి వరకు నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ ఇంగ్లిష్ పద్యాల పోటీల్లో మండల పరిధిలోని గుర్జకుంట ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రేణుకుంట్ల మురళి శతక సానెట్స్ పూర్తి చేసి 50కి పైగా అవార్డులు సాధించాడు. గురువారం మురళి విలేకరులతో మాట్లాడుతూ.. పీబీ పబ్లిషర్స్ కమ్యూనిటీ, అన్టచ్డ్ ఎమోషన్స్, వ్రైటర్స్ యునైట్, నాజ్మేహయత్ సంస్థలు ఆన్లైన్లో నిర్వహించిన ఇంగ్లిష్ పద్యాల పోటీల్లో పాల్గొని కన్స్టాలేషన్, మదర్ గాడ్డెస్, స్మైల్ చైల్డ్‌హుడ్ మెమొరీస్, గస్టీ విండ్స్, విల్టెడ్ రేయిన్బో మొదలైన అంశాలపై 100కు పైగా పద్యాలు రాసినట్లు చెప్పారు. అందుకుగాను 50కి పైగా అవార్డులను ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గెలుచుకున్నట్లు తెలిపారు. తాను రాసిన పద్యాలలో కొన్నింటిని ఇన్సెంటివ్, ఇన్పినిటీ, బియాండ్, ఎంబర్, అరోరా, డియర్డాడ్, ఫోర్జెన్ ఫోలెన్, ఇంక్ పాబ్లెస్ లాంటి 20 ఆంథోళజీ పుస్తకాల్లో ముద్రించినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు స్పోకెన్ ఇంగ్లిష్, గ్రామర్ పుస్తకం రచించానని, ప్రచురణ జరుగుతుందన్నాడు. తాను రచించిన పుస్తకాలు అమేజాన్, అమేజాన్ కిండ్లే, నేషన్ ప్రెస్, పిబి పబ్లిషర్స్ వంటి ప్రముఖ పుస్తక విక్రయశాలల్లో లభిస్తాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన మురళిని కవులు, కళాకారులు, సాహితీ వేత్తలు అభినందించారు. -
ప్రాంతీయ భాషల బాట పట్టండి
న్యూఢిల్లీ: పెద్ద సంఖ్యలో వినియోగదారులకు మరింత చేరువ కావాలంటే కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే సర్వీసులు అందిస్తే కుదరదని, ప్రాంతీయ భాషల వైపు మళ్లాలని ఫిన్‌టెక్ సంస్థలకు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సూచించారు. అనేక భాషలు, యాసలు ఉన్న భారత్ వైవిధ్యాన్ని పట్టించుకోకపోతే చాలా మందికి చేరువ కాలేని రిస్కు ఉందని ఆయన పేర్కొన్నారు. ‘ఇంగ్లిష్ మర్చిపోండిక. ప్రాంతీయ భాషల బాట పట్టండి. ప్రస్తుతం అదొక్కటే మార్గం. వివిధ భాషల్లో స్థానికంగా సేవలు అందించడం ద్వారానే అందర్నీ ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకురావడం సాధ్యపడుతుంది. ఫిన్‌టెక్ సంస్థలు అలా చేయకపోతే ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలకు ఊతం లేకుండా పోతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ వర్చువల్ సెమినార్లో పాల్గొన్న సందర్భంగా అమితాబ్ కాంత్ ఈ విషయాలు చెప్పారు. క్యాపిటల్ మార్కెట్ల విషయానికొస్తే మార్కెటింగ్ కార్యకలాపాలన్నీ కూడా పట్టణ ప్రాంతాల్లోనే ఉంటున్నాయని, దీంతో గ్రామీణ ప్రాంతాల వారికి వీటి గురించి తెలియకుండా పోతోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల వారు కూడా పాలుపంచుకుంటేనే వీటిలో ప్రజల భాగస్వామ్యం మరింతగా పెరుగుతుందన్నారు. అపార అవకాశాలు..: రాబోయే రోజుల్లో ఫిన్‌టెక్ కంపెనీలకు మరిన్ని వ్యాపార అవకాశాలు లభించగలవని కాంత్ చెప్పారు. కస్టమర్ల వివరాల సేకరణకు సంబంధించి కేవైసీ నిబంధనలను మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉందని, ఈ ప్రక్రియ వ్యయాలు మరింతగా తగ్గించాల్సి ఉందన్నారు. -
తల్లిభాష నిలవాలి ఇంగ్లిష్తో గెలవాలి!
తల్లి భాషమీద తెలుగువారికి భావోద్వేగం ఉన్నంత పట్టుదల లేదు. వీరభక్తి పొంగి పొర్లేపాటి వివేకం లేదు. విధిగా ఏం చేసి భాషను బతికించుకోవచ్చో వివేచన లేదు. పాలకుల్లోనూ గాలి మాటలు చెప్పడము న్నంత కార్యాచరణ లేదు. తల్లి భాషగా తెలుగు బాగుకు, భాషాభివృద్ధికి ప్రభుత్వాల పరంగా చేస్తున్నది పెద్ద బండిసున్న. రెండు వేల ఏళ్లకు పైన వాడుకలో, వెయ్యేండ్లకు పైబడి సాహిత్యంలో తెలుగు నిలిచిందంటే... కవి–పండితులు, ఇతర సాహిత్యకారులు, భాషాభిమానులు, సామాన్యుల నిరంతర కృషి, సాధన, వ్యాప్తి, వ్యవహారమే తప్ప పనిగట్టుకొని ప్రభుత్వాలు చేసిన గొప్ప మేళ్లేమీ లేవు. నిర్దిష్ట కార్యాచరణే లేదు. సర్కార్లు చేసిన మేలు లేకపోగా... అధికారుల ఆంగ్ల ఆధిపత్యధోరణి వల్ల ఇన్నాళ్లు తెలుగుకు జరిగిన ద్రోహమే ఎక్కువ! ఇక భాష వివిధ రూపాల్లోకి, మాండలి కాల్లోకి మారుతూ కూడా మౌలికంగా తన స్వభావాన్ని నిలుపుకొని ఈ నేలపై మనుగడ సాగిస్తోందంటే, అందుకు తెలుగు సమాజపు అవస రాలే కారణం. సామాన్యుల నుంచి సంపన్నులు, మహా విద్యావంతుల వరకు రోజువారీ వాడుక, వ్యవహారం వల్ల, అంతో ఇంతో వారి సాహితీ సృజన, ఆసక్తి వల్ల తెలుగు నిలిచింది. ఇప్పుడు తల్లి భాష గురించి తల్లడిల్లే వారిది, ఆంగ్ల భాషను తిట్టిపోసుకునే వారిదీ ఆవేశమే తప్ప సమగ్ర ఆలోచన కాదు. అసలు తెలుగుకు గడ్డుకాలం దాపురిం చడంలో లోపమెక్కడుందో గుర్తించే తెలివిడీ కాదు. తెలుగుపై సాను భూతి ప్రకటనలో ఆడంబరమే తప్ప కనీసం తమ పిల్లలకు తెలుగు నేర్పించడంలోనూ ఆచరణ శూన్యం! తెలుగు మాతృభాషలోనే ప్రాథ మిక విద్యాబోధన జరగాలనే వాదనలో హేతువుంది. మామూలుగా చూసినపుడు ఆ ప్రతిపాదన బాగానే కనిపిస్తున్నా... అలా చదివిన వారు ప్రాథమిక విద్యో, మాధ్యమిక విద్యో ముగిశాక ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతున్నారో చూడాలి. తర్వాతి కాలంలో వారెంతగా ఆంగ్లంపై ఆధారపడాల్సి వస్తున్నదో పరిశీలించాలి. అప్పటిదాకా తెలుగులో సాగించిన విద్యాభ్యాసం తమ తదనంతర ఉన్నత విద్యకు, ఉద్యోగం–ఉపాధి పొందడానికి ఎలా ప్రతిబంధకమౌతోందో గమనిం చాలి. పదో తరగతి, ఇంటర్మీడియట్ దాటాక కూడా తెలుగు మాధ్య మంలోనే కొనసాగడానికున్న అవకాశాలు–పరిధులు, వనరులు–పరి మితులు, ఇతర సాధన సంపత్తి–కొరత ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించాలి. వాటన్నిటికీ మించి, ఉన్నత–వృత్తి విద్యా కోర్సుల్లో విధి లేని పరిస్థితుల్లో ఇంగ్లీషు మాధ్యమంలోకి మారడం వల్ల వారు ఎదు ర్కొంటున్న కష్ట–నష్టాలు బేరీజు వేయాలి. అప్పుడుగాని, మన వాళ్ల భావావేశంలో కొరవడుతున్న సంబద్ధత, తెలుగే కావాలంటూ ఇంగ్లీషు ను ఈసడించుకోవడంలో లోపిస్తున్న హేతుబద్ధత అర్థం కావు. పోటీకి సమస్థితి కల్పించాలి జర్మనీ, జపాన్, చైనా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ... ఇలా అభివృద్ధి చెందిన దేశాలను ఉటంకిస్తూ, వారంతా తల్లిభాషలో ప్రాథమిక విద్య బోధన వల్లే అత్యంత సృజనతో ఎదుగుతున్నారనే వాదన ఉంది. అది నిజమే! ప్రాథమిక విద్య తల్లి బాషలోనే సాగాలన్నప్పుడు, ఇతరేతర సదుపా యాలు, వనరుల కల్పన, సన్నద్ధత ఎంతో అవసరం. పోటీదారుల మధ్య సమ, సానుకూల వాతావరణమూ ముఖ్యమే! ఆంగ్ల–తెలుగు మాధ్యమ విద్యార్థులకు విద్య–ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వ్యత్యాసా లకు తావులేని సమస్థితి ప్రభుత్వాలు కల్పించాలి. అవసరమైతే తెలుగు మాధ్యమ విద్యార్థులకు ప్రోత్సాహకాలివ్వాలి. రిజర్వేషన్ కల్పించాలి. ఆయా దేశాల్లో లేని ఒక విచిత్ర పరిస్థితి బ్రిటీష్ వలస దేశాల్లో ఉంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో కొఠారీ విద్యా విధాన ప్రభావం వల్ల ఇంగ్లీషు చదువులొక పార్శ్వంలో వృద్ధి చెందుతూ వచ్చాయి. తెలుగు, తమిళ, కన్నడ వంటి స్థానిక భాషలకు, విశ్వ భాషగా పరిగణించే ఇంగ్లీషుకు మధ్య పోటీ వాతావరణం ఉంటుంది. పైన పేర్కొన్న అభివృద్ధి సమాజాల్లో ఈ పంచాయతీ లేదు. వారికి తల్లి భాషలోనే అన్నీ ఉంటాయి. ఆంగ్ల మాధ్యమంతో పోటీ పడే వారెవరూ ఉండరు. దేశంలోని అన్ని స్థాయిల వారికీ తల్లి భాషలోనే పోటీ! ఇక భాషాపరమైన వ్యత్యాసాలు, వివక్షకు తావెక్కడ? మన దగ్గర ఇప్పటికీ సంపన్నులు, ఎగువ మధ్య తరగతి, అంతో ఇంతో ఆర్థిక స్తోమత కలి గిన వారు తమ పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమంలో విద్యా బోధన జరిపిస్తుంటారు. అది సైన్స్–టెక్నాలజీ అయినా, సామాజిక శాస్త్రా లైనా, వృత్తి కోర్సులయినా... ప్రపంచ స్థాయి విషయ వనరులు, ఆధు నిక సమాచారం, కొత్త పరిభాష ఆంగ్లంలోనే లభిస్తుంది. కానీ, తెలుగు వంటి స్థానిక భాషల్లో శాస్త్రీయ పరిశోధనల లేమి, భాష ఎదుగుదల లేకపోవడం, భాషాంతరీకరణలు, అనువాదాలు ఎప్పటికప్పుడు జర గకపోవడం, పారిభాషక పదకోశాలు, నిఘంటువులు సరిగా నిర్మాణం కాకపోవడం వల్ల విషయ వనరుల కొరత ఉంటుంది. బోధన కూడా ఆ స్థాయిలో ఉండదు. భావ ప్రసరణ నైపుణ్యాల్లోనూ వెనుకబాటుత నమే! దాంతో, ఉన్నత విద్యా ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలప్పుడు ఆంగ్ల మాధ్యమ విద్యార్థులతో పోటీ పడలేని స్థితి తెలుగు మాధ్యమ విద్యార్థులకుంటుంది. ఇందుకు నేపథ్యం... పేద, దిగువ మధ్య తర గతి పిల్లలు ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన దొరకని సర్కారీ బడుల్లో, తెలుగులోనే చదువుకోవాల్సి రావడం. ఒక స్థాయి దాటిన తర్వాత వారికి కష్టాలు ఎదురవుతున్నాయి. అవకాశపు తలుపులు మూసుకు పోతున్నాయి. తెలివి, చొరవ, ఆసక్తి, వాటన్నిటికీ మించి అవసరం ఉండి కూడా పోటీని తట్టుకోలేక చతికిలపడుతున్నారు. అందుకే, ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమ విద్యాబోధ నను వారు స్వాగతిస్తున్నారు. ఇవేవీ ఆలోచించకుండా సర్కారు బడుల్లో తెలుగే మాధ్యమంగా ఉండాలని, ఇంగ్లీషు మాధ్యమంగా ఉండకూడదనే వాదన సరికాదు. అది కడకు ఉన్నవారికి–లేనివారికి మధ్య దూరం పెంచడమే! అవకాశాల్లో వివక్షను పెంచి పోషించడమే అవుతుంది. పేదవర్గాలకు చెందిన తెలుగు మాధ్యమ విద్యార్థుల అవ కాశాల్ని కర్కశంగా నలిపేయడమే అవుతుంది. బతికుంచుకునే ఏ యత్నమూ జరగట్లే! భాష ఎన్నో ప్రయోజనాలు కలిగిన మానవ పనిముట్టు. ఇతర జీవుల నుంచి మనిషిని వేరుపర్చే ప్రత్యేక లక్షణం భాషది. మరే జీవీ మనిషి లాగా భాషనొక సాధనంగా మార్చుకొని తన రోజువారీ అవసరాలు తీర్చుకున్నది లేదు. భాషలెన్ని ఉన్నా... తల్లి భాష ఎంతో ముఖ్య మైంది. రోజువారీ వ్యవహారాల్లోనే కాక మనసు ప్రకటించడం, బంధా లల్లుకోవడం, వక్తిత్వ వికాసం, ఊహ పరిధి విస్తరణ, మానవ సంబం ధాల వృద్ధి... ఇలా ఎన్నెన్నో ప్రయోజనాలు భాష వల్లే సాధ్యం. ఇలా పరస్పర భావ ప్రసరణకే కాకుండా వారసత్వంగా వస్తున్న సంప్ర దాయ విజ్ఞానాలను భవిష్యత్తరాలకు అందించడానికి, భద్రపరచడా నికీ భాష సాధనం. ఐక్యరాజ్య సమితి ఫిబ్రవరి 21 అంతర్జాతీయ తల్లి భాషా దినోత్సవంగా ప్రకటించడానికి ప్రేరణ మన బెంగాలీలే! తూర్పు పాకిస్తానీయులు తమ తల్లి భాష బంగను జాతీయ భాషగా గుర్తించాలని 1952 ఫిబ్రవరి 21న ఢాకాలో ఆందోళన చేస్తున్నపుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు యువకులు బలయ్యారు. దాంతో కదిలిపోయిన పాక్ ప్రభుత్వం బంగను ఒక జాతీయ భాషగా ప్రకటించింది. తర్వాత 1971లో బంగ్లాదేశ్ ఏర్పడ్డపుడు బంగ భాషే అక్కడ అధికార భాషయింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తల్లి భాషను కాపాడుకునే నిర్మాణాత్మక ప్రయత్నమేదీ తెలుగు సమాజంలో జరగటం లేదు. రాను రాను తెలుగు చదివే, రాసే వారి సంఖ్య రమా రమి తగ్గిపోతోంది. తెలుగుపట్ల కొత్తతరం ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. తెలుగు నేర్చుకొండని తలిదండ్రులూ తమ పిల్లల్ని ఒత్తిడి చేయడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ప్రతి తరగతిలో తెలుగు ఒక తప్పనిసరి ‘విషయం’గా నిర్బంధం చేస్తూ ఆదేశాలి చ్చారు. ఇదివరకు అలా లేదు. తెలుగు, హిందీ, సంస్కృతం, ఇంకా ఫ్రెంచ్ తదితర భాషల్లోంచి ఏదైనా ఒకటి ఎంపిక చేసుకునే అవ కాశమిస్తూ వచ్చారు. దాంతో, తేలిగ్గా ఉంటుందని, ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చని ఏ హిందీనో, సంస్కృతమో, ఫ్రెంచో ఎంపిక చేసు కోవడం మన పిల్లలకు అలవాటయింది. దాంతో తెలుగుకు పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు తెలుగును నిర్బంధం చేయడం వల్ల విధిగా చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తల్లి భాష పరిరక్షణలో ఇదో ముందడుగు. ఇంకెంతో చేయాలి ఉన్నత విద్య ప్రవేశాల్లో, ఉద్యోగ–ఉపాధి అవకాశాల కల్పనలోనూ తెలుగులో అభ్యర్థులకుండే ప్రావీణ్యానికి అదనపు వెయిటేజీ మార్కు లివ్వాలి. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆధునిక పరిశోధనలు, పరిణామాల సమాచారం నిరంతరం తెలుగులోకి తర్జుమా అయ్యేట్టు చూడాలి. ఇంటర్నెట్తో పాటు ఇతర సామాజిక మాధ్యమ వేదికల్లో తెలుగు అందుబాటులో ఉండేట్లు ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవాలి. తెలుగును ఓ ఆధారపడదగ్గ భాషగా నేటి యువతరానికి విశ్వాసం కల్పించాలి. అధికార భాషా చట్టం నిర్దేశిస్తున్నట్టు, ప్రభుత్వ ఉత్త ర్వులు, ఆదేశాలు, నివేదికలు, విధివిధానాలు, నిత్య వ్యవహారాలు... ఇలా అన్నీ తెలుగులోనే జరిగేలా కట్టడి చేయాలి. స్థానిక న్యాయ స్థానాల్లో తెలుగులోనే తీర్పులు వెలువడేలా చూడాలి. వారికెంత ఇంగ్లీష్ వచ్చినా, తెలుగువాళ్లు పరస్పరం తెలుగులోనే మాట్లాడు కోవాలి. తల్లి భాషలో మాట్లాడటాన్ని తక్కువ చేసి చూడకూడదు. మాండలికాల్ని ఆదరిస్తూనే ఓ ప్రమాణభాష రూపొందించుకోవాలి. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు తెలంగాణ ప్రభుత్వం ‘ప్రతి ఒకరు మరొకరికి నేర్పండి’ (ఈచ్ వన్ టీచ్ వన్) అంటోంది. తల్లిభాష వ్యాప్తికి ఇదొక చక్కని అవకాశం. తల్లి భాష తెలుగును కాపాడుకోవ డమంటే ప్రపంచపు కిటికీ ‘ఇంగ్లీషు’ను వ్యతిరేకించడం కాదు. తెలు గును విని, మాటాడి, చదివి, రాయగలిగితే చాలు. మహా కథకుడు కొడవటిగంటి కుటుంబరావు అన్నట్టు ‘తల్లిభాషలో ఒక ఉత్తరం రాయటం చాతగాని వాడు ఎన్ని డాక్టరేట్లు సంపాదించినా నిరక్షరుడే!’ (నేడు అంతర్జాతీయ తల్లిభాషా దినోత్సవం) ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
ఆక్స్‌ఫర్డ్‌లో ఆధార్, డబ్బా, హర్తాళ్, షాదీ!
న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ తన లేటెస్ట్ ఎడిషన్ డిక్షనరీలో 26 కొత్త భారతీయ ఆంగ్ల పదాలను చేర్చింది. అందులో ఆధార్, చావల్, డబ్బా, హర్తాళ్, షాదీ వంటి పదాలకు చోటు కల్పించింది. శుక్రవారం విడుదల చేసిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 10వ ఎడిషన్‌లో 384 భారతీయ ఆంగ్ల పదాలతో పాటు 1,000కి పైగా చాట్‌బోట్, ఫేక్ న్యూస్, మైక్రోప్లాస్టిక్ వంటి కొత్త పదాలను చేర్చినట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఓయూపీ) తెలిపింది. ఈ కొత్త ఎడిషన్ ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ వెబ్సైట్, యాప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్సైట్లో ఆడియో–వీడియో ట్యుటోరియల్స్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లున్నాయి. ఈ ఎడిషన్‌లో చేర్చిన 26 కొత్త భారతీయ ఆంగ్ల పదాల్లో 22 పదాలను డిక్షనరీలో ప్రచురించామని, మిగతా నాలుగు పదాలు డిజిటల్ వర్షన్లో ఉన్నాయని పేర్కొంది. -
నన్ను ఎగతాళి చేశారు
సినిమా: హిందీ భాషపై నటి కంగనారనౌత్ ప్రేమను ఒలకబోస్తోంది. ఆంగ్లం వద్దు హిందీనే ముద్దు అని అంటోంది. ఏదో ఇక చర్చనీయాంశ వ్యాఖ్యలతో వార్తల్లో ఉండడం ఈ అమ్మడి నైజంగా మారింది. బాలీవుడ్లో ప్రముఖ కథానాయకిగా వెలిగిపోతున్న ఈ జాణ ఇప్పటికే కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో నటించేసింది. తాజాగా హిందీ చిత్రం పంగాతో తెరపైకి రానుంది. కాగా త్వరలో మరోసారి తలైవి చిత్రం ద్వారా ఉత్తరాదితో పాటు దక్షిణాది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. అవును ప్రఖ్యాత నటీమణి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో నటిస్తోంది. ఇందుకోసం తగిన శిక్షణ కూడా తీసుకున్నట్లు కంగనారనౌత్ పేర్కొంది. కాగా ఇటీవల హిందీ భాషాదినోత్సం సందర్భంగా ఒక వీడియోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. धन्यवाद करते है उन सब का जिन्होंने हमारे साथ अंग्रेज़ी से #पंगा लिया। ये रहे उन प्रश्नों के जवाब! कितने सही मिले आपको? हमें बताये!#KanganaRanaut #PangaStories #Panga#विश्व_हिंदी_दिवस pic.twitter.com/5g7P3v68NP — Team Kangana Ranaut (@KanganaTeam) January 11, 2020 అందులో హిందీ మన జాతీయ భాష అని అయితే ఈ భాషలో మాట్లాడడానికి మన దేశం చాలా సంకోచిస్తోందని పేర్కొంది. ఆంగ్ల భాషకు చెందిన ఏబీసీడీలను నమ్మకంగా చెబుతున్నారని, అదే హిందీ భాషలో మాట్లాడడానికి సంకట పడుతున్నారని అంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఆంగ్ల భాషను బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారని ఆనందపడుతున్నారని, మరి కొందరు తమ ఆంగ్ల భాష బలహీనంగా ఉందని అవమానంగా భావిస్తున్నారని అంది. అయితే అలాంటి పరిస్థితే హిందీ భాషలో ఉంటే కించిత్ కూడా చింతించడం లేదని అంది. సినిమా వర్గం తన ఆంగ్ల భాష ఉచ్చారణను చూసి ఎగతాళి చేశారని చెప్పింది. తాను మాత్రం హిందీ భాషకే ప్రాముఖ్యతనిస్తున్నానని చెప్పింది. తద్వారా తాను ఉన్నత స్థాయికి చేరుకోగలనని, సక్సెస్‌లు అందుకోగలనని చెప్పింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు తాను చెప్పేదొక్కటేనని మీ పిల్లలకు హిందీ భాషను నేర్పించండి అని చెప్పింది. దేశీయ నూనెతో చేసే పరోటా రుచి పిజ్జా, బర్గర్లలో ఉండదని అంది. అదేవిధంగా మా (అమ్మ)లో ఉన్న మాధుర్యం మామ్‌లో ఉండదని కంగనారనౌత్ పేర్కొంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఇంగ్లిష్ నైపుణ్యాలకు ప్రాధాన్య పాయింట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు కావాలంటున్నారు. తమ పిల్లలకు ఇంగ్లిష్ చదువులు చెప్పించాలని కోరుతున్నారు. దీనికి అనుగుణంగా విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఇంగ్లిష్ మీడియం బోధించే నైపుణ్యాలు ఎంతమందిలో ఉన్నాయి.. నైపుణ్యాలు గలవారిని ఎలా గుర్తించాలి? వారు ఇంగ్లిష్ స్కూళ్లలో బోధించేందుకు ఏ చర్యలు చేపట్టాలని తర్జనభర్జన పడుతోన్న విద్యా శాఖకు ఓ ఆలోచన తట్టింది. టీచర్లకు ఇంగ్లిష్‌లో బోధించే నైపుణ్యాలపై పరీక్ష నిర్వహించి, ఆ నైపుణ్యాలు కలిగిన వారిని గుర్తించి ముందుకుసాగితే ఉపయోగంగా ఉంటుందన్న ఆలోచనకు వచ్చింది. అంతేకాదు వారిని ప్రోత్సహించి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో బోధించేలా చేసేం దుకు వారికి ప్రా«ధాన్య పాయింట్లు ఇస్తే బాగుంటుందని భావిస్తోంది. విద్యా శాఖ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే పాయింట్లను (రెగ్యులర్‌గా వారికి వచ్చే పాయింట్లకు అదనంగా) వారి బదిలీలు, పదోన్నతుల్లో ఉపయోగించుకునేలా చూడటం ద్వారా ఆయా టీచర్లకు ప్రయోజనం చేకూరనుంది. దీంతో వారు బాగా పనిచేస్తారని, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో వారి సేవలను సద్వినియోగపరచుకోవచ్చని, మెరుగైన విద్యను అందించవచ్చని యోచి స్తోంది. త్వరలోనే దీనిపై ఉన్నతస్థాయి భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తోంది. ప్రైమరీ స్కూళ్లు ఇంగ్లిష్ వైపు.. రాష్ట్రంలో 26,754 ప్రభుత్వ పాఠశాలల్లో 1,21,657 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వారిలో ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్లు 14,170 మంది ఉండగా, సబ్జెక్టు కాకపోయినా మరో 20వేలమంది వరకు ఇంగ్లిష్‌లో బోధిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల టీచర్లు ఇంగ్లిష్ నేర్పించాల్సిందే. దీంతో ఇంగ్లిష్ టీచర్లు కాకుండా మిగతా వారిలో ఎంతమందికి ఇంగ్లిష్‌లో బోధించే నైపుణ్యాలున్నాయో తెలుసుకునే చర్యలకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో 18,230 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, అందులో 2018 నుంచి 6వేల ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైంది. 4 వేల కు పైగా ఉన్నత పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం సక్సెస్ స్కూళ్లలో 2008లోనే ప్రారంభమైంది. ఇంగ్లిష్ మీడియం కావాలన్న డిమాండ్ దృష్ట్యా ఇప్పుడున్న స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం సెక్షన్ ప్రారంభించడం లేదా ఇంగ్లిష్ మీడియానికి మార్పు చేసే అధికారాన్ని డీఈవోలకు ఇచ్చేలా ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ఇంగ్లిష్ మీడియంలో 37 శాతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 26,87,563 మంది విద్యార్థులు చదువుతుండగా, అందులో 10,16,334 మంది (37.82 శాతం) విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. ఇక తెలుగు మీడియంలో చదువుతున్న విద్యార్థులు 15,44,208 మంది ఉన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 31,22,927 మంది విద్యార్థులు ఉండగా, అందులో 30,27,459 మంది ఇంగ్లిష్ మీడియం వారే. -
ఇంగ్లిష్ మాధ్యమంపై ఎందుకీ అభ్యంతరం?
ఏ మంచి పని చేసినా దానిని వక్రీకరించి మాట్లాడటం ఇటీవల చాలా మందికి అలవాటైపో యింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టనున్నట్లు ఆం్ర«ధ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటిం చగానే ఏదో అన్యాయం జరిగిపోయినట్లు శోకాలు పెట్టడం వక్ర బుద్ధి అనిపి స్తుంది తప్ప, భాషాభిమానం అనిపించుకోదు. వ్యవహార భాష తెలుగుకు, మాధ్యమంగా తెలు గుకు, రెండవ భాషగా చదివే తెలుగుకు, ఇతర సబ్జెక్టుల మాదిరిగా చదివే ఆప్షనల్ తెలుగుకు తేడా తెలియని అజ్ఞానులను... తెలిసీ తెలియనట్లు మాట్లాడుతూ, తెలుగు భాషకు వీరాభిమానులుగా చెప్పుకుని ఇంగ్లిష్ మీడియం అనగానే వీరంగం వేసే వెర్రివాళ్లను చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. భాషాభిమానం ఉన్న వాళ్లు భాష కోసం తాము చేసిన ఘనకార్యం ఏమిటో చెప్పి, ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఈ భాషాభిమానులంతా తెలుగు యూనివర్సిటీ విభజన గురించి, ప్రాచీన భాషా తెలుగు హోదా అమలు గురించి ఏ ప్రయత్నం చేశారో? ఈ వీరాభిమానం అప్పుడు ఎందుకు పొంగి ప్రవహించలేదో అర్థం కావట్లేదు. మాతృభాష తెలుగుకు విద్యావ్యవస్థలోని తెలుగుకు సంబంధం లేదు. మాతృభాషను ఉద్ధ రించే మార్గాలెన్నో ఉన్నాయి. అందుకు తెలుగు... మీడియంగా ఉండి తీరాల్సిన అవసరం లేదు. ఇంగ్లిష్ మీడియం వల్ల తెలుగు భాషకు కలిగే అపకారం ఏమీ లేదు. ప్రస్తుతం జ్ఞాన వాహిని ప్రపంచీకరణ దిశగా సాగుతోంది. ఆ ప్రవాహాన్ని తట్టుకోవాలంటే ఆ వాహినికి వాహకమైన భాషనే వాడుకోవాలి. అప్పుడు విద్యావంతులంతా ప్రపం చవ్యాప్తంగా ఉన్న జ్ఞానాన్ని పొందినవారవుతారు. అందుకే ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ప్రశంసించదగినది. ధనవంతులు లక్షల కొలది ఫీజులు కట్టి ఇంగ్లిష్ మీడియంలో చదువు తున్నారు. వాళ్లకు భాషాభిమానం లేకపోయినా ఫర్వాలేదా? వాళ్లు విదేశాలకెళ్లి ఉన్నతంగా జీవిస్తున్నారని గొప్పగా తెలుగు తేజాలని చెప్పుకుంటే సరిపో తుందా? అలాంటి ఉన్నత స్థితిని పేద పిల్లలు కూడా సాధించాలనుకోవడం పాలకుల ఉన్నతాశయం కాదా? దీనికి భాషాభిమానం పేరుతో గగ్గోలు పెట్టాలా? తమ పిల్లలను గొప్ప వాళ్లుగా చేయా లనుకున్న పేద తల్లిదండ్రుల ఆశలు ఫీజులు కట్టలేని కారణంగా అడియాసలుగానే మిగిలిపోవాలా? డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప ఆశయంతో పేద పిల్లలు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో, పట్టణాలలో కోచింగ్‌లు పెట్టించుకో లేని, గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల కోసం ఆర్జియూకేటీ యూనివర్సిటీని స్థాపించారు. అందులో ఇంటర్మీడియట్ వరకు తెలు గును తప్పనిసరిగా చదవవలసిన సబ్జెక్టుగా పెట్టిం చారు. ఇంజనీరింగులో కూడా తెలుగును ఒక సబ్జె క్టుగా చదివించారు. సాంకేతిక నిపుణులకు భాషా నైపుణ్యం, అందులోనూ విద్యార్థులకు మాతృ భాషలో నైపుణ్యం ఉంటే మంచిదని భావించి తెలుగును ఇంజనీరింగులోనూ చేర్చి భాషాపరంగా పరిశోధనలు, సాంకేతికంగా తెలుగును ఉపయోగిం చడం, మన సాహిత్యం– సంస్కృతి పట్ల మంచిపట్టు కల్పించారు. వైఎస్సార్ తెలుగుకు ప్రాచీన భాషా హోదాను సాధించారు. మాతృభాషలో అందరినీ ‘అక్క, అన్న, అమ్మ, అవ్వ, తాత’ అని ఆత్మీయంగా పలకరించే వైఎస్ జగన్‌కి మాతృభాష మీద మమకారంతోపాటు పట్టు కూడా ఉంది. అలాగే ఆంగ్లంలోనూ చక్కటి వాగ్ధాటి ఉంది. ఆంగ్ల మాధ్యమం వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్న వ్యక్తి ఆయన. పేదపిల్లలు ఉన్నత విద్యావంతులై ప్రపంచవ్యాప్తంగా గొప్ప స్థితిలో ఉండాలనే సదుద్దేశంతో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవే శపెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. దీనిని ప్రతి ఒక్కరూ హర్షించాలి. ఈ నిర్ణయం తీసుకున్న నాయకుడిని అభినందించాలి, అంతేగాని ఆంగ్ల మాధ్యమం అనగానే తెలుగుకు ఏదో అన్యాయం జరిగినట్లు గగ్గోలు పెట్టడం విజ్ఞత కాదు. తెలుగును ఇంటర్మీడియట్ వరకు తప్పని సరి చేశారు కాబట్టి ముఖ్యమంత్రి తెలుగు భాషకు ప్రాధాన్యం ఇచ్చినట్లే కదా! తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నంలో ప్రాచీన భాషా హోదా ఉపయోగ పడుతుంది. ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగు తున్నాయి. అదే జరిగితే వైఎస్ జగన్ పాలనలో పాడిపంటలతోపాటు, భాషాసాహితీ సంస్కృతీ వికాసాలతో శ్రీకృష్ణదేవరాయల స్వర్ణయుగాన్ని తలపింపచేస్తుందనడంలో సందేహం లేదు. కె. కుసుమారెడ్డి వ్యాసకర్త, తెలుగు ప్రొఫెసర్ -
ఇంగ్లిష్, హిందీల్లోనే జేఈఈ మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే నిర్వహిస్తున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్ ద్వారా ఆయా రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టేందుకు అంగీకరించిన, తమ ప్రాంతీయ భాషలో పరీక్షను నిర్వహించాలని కోరిన రాష్ట్రాల భాషల్లో మాత్రమే (ఇంగ్లిష్, హిందీతోపాటు) జేఈఈ మెయిన్స్ నిర్వహి స్తున్నామని తెలి పింది. 2013లో జేఈఈ మెయిన్స్ ప్రారంభమయ్యాక గుజరాతీలో పరీక్ష నిర్వహిం చాలని గుజ రాత్ కోరిందని తెలిపింది. 2014లో మహారాష్ట్ర కూడా మరాఠీతోపాటు ఉర్దూలో పరీక్ష నిర్వహించాలని కోరిందని పేర్కొంది. దాంతో గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్స్ ప్రశ్న పత్రం ఇస్తున్నామని వెల్లడించింది. మిగతా రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషల్లో ప్రశ్న పత్రం ఇవ్వాలని తమను అడగలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్ ప్రశ్నపత్రం ఏ భాషలో ఇచ్చినా మూల్యాంకనంలో మాత్రం ఇంగ్లిష్ ప్రశ్నపత్రాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని వెల్లడించింది. -
లీవ్ కావాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే
బలరామ్‌పూర్ : మనకు ఎప్పుడైనా లీవ్ కావాలంటే ఏం చేస్తాం ! వెంటనే మెయిల్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో సమాచారాన్ని అందిస్తాం. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరాంపూర్ పోలీసులు మాత్రం తమకు లీవ్ కావాలంటే దరఖాస్తును ఇంగ్లీష్‌లోనే పెట్టుకోవాలని జిల్లా ఎస్పీ రంజన్ వర్మ కోరారు. బలరాంపూర్ జిల్లాలో పనిచేస్తున్న పోలీసులు అందుకోసం ప్రతిరోజు వీలైనన్ని ఇంగ్లీష్ దినపత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీస్ హెడ్‌క్వార్టర్స్ లో వర్క్‌షాప్‌లు నిర్వహించినట్లు తెలిపారు. తన ఆదేశాల ప్రకారం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పలువురు పోలీసు అధికారులు డిక్షనరీలు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. 'ఈ నిర్ణయం తీసుకోవడానికి నా దగ్గర ఒక బలమైన కారణం ఉంది. సైబర్ క్రైమ్, నిఘా సంస్థల నుంచి మాకు వస్తున్న ఫిర్యాదులు అన్నీ ఇంగ్లీష్‌లోనే వస్తాయి. మా పోలీసులకు ఇంగ్లీష్ మీద కనీస పరిజ్ఞానం లేకపోవడంతో వచ్చిన ఫిర్యాదులను తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లు తేలింది. అందుకే మా పోలీసులు ఇంగ్లీష్ మీద కనీస అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో సెలవు కావాలంటే దరఖాస్తును తప్పనిసరిగా ఇంగ్లీష్‌లోనే పెట్టుకోవాలన్న కండీషన్ పెట్టినట్లు' ఎస్పీ రంజన్ వర్మ చెప్పుకొచ్చారు. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రంజన్ వర్మ విధుల్లో చేరినప్పటి నుంచి తాను పని చేసిన ప్రతీ చోట ఇంగ్లీష్‌ను నేర్చుకోవాలనే నిబంధనను అమలు చేసేవారు. ' ఇప్పుడిప్పుడే మా కానిస్టేబుళ్లు గూగుల్ సహాయంతో తమ లీవ్‌కు సంబంధించిన దరఖాస్తును ఇంగ్లీష్‌లోనే చేసుకుంటున్నారని, ఇది ఇతర ప్రాంతాల పరిధిలోని పోలీస్స్టేషన్లలో అమలు అయ్యే విధంగా చూస్తానని' ఆయన తెలిపారు. రంజన్ వర్మ తీసుకున్న నిర్ణయం పట్ల పోలీసు ఉన్నతాధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు దీన్ని అమలు చేసే విషయమై సీఎం యోగి ఆదిత్యానాథ్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు లక్నోకి చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.