టీచర్‌గా మారిన టాప్‌ హీరోయిన్‌ | Rakul preet singh turns teacher for teach for change | Sakshi
Sakshi News home page

టీచర్‌గా మారిన టాప్‌ హీరోయిన్‌

Published Sat, Apr 15 2017 10:57 AM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

Rakul preet singh turns teacher for teach for change

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టీచర్‌ అవతారం ఎత్తింది. ఆమె ఒక వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు సోషల్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటుంది. తాజాగా మంచు లక్ష్మీ స్థాపించిన ‘టీచ్ ఫర్ చేంజ్’ సంస్థ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్ధులకు రకుల్ ప్రీత్‌ ఇంగ్లీష్ పాఠాలను భోధించింది. ఇంగ్లీష్లో వ్యతిరేక పదాల గురించి చెప్పడంతో పాటు విద్యార్ధులకు ఇంగ్లీష్ స్పీకింగ్ యాక్టివిటీ గురించి వివరించిందట.

బీ ద చేంజ్, టీచ్ ఫర్ చేంజ్ అనే సందేశాన్ని ఇచ్చేందుకు రకుల్ ఆ పాఠశాలకు వెళ్లింది. టీచ్‌ ఫర్‌ చేంజ్‌ సంస్థకు తాను పూర్తి మద్దతిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా తాను చదువుకున్న రోజులను ఆమె గుర్తు చేసుకొని మురిసిపోయింది. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగింది. విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన లక్ష్మీ మంచు, చైతన్యకు థ్యాంక్స్‌ అంటూ రకుల్‌ ట్విట్‌ చేసింది.  మరోవైపు రకుల్‌ రాకతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement