
ఆ యాక్షనూ వేరు..! ప్రేక్షకులూ వేరు..!!
ఇటీవల వచ్చిన రెండు పెద్ద చిత్రాల్లో అందరినీ ఆకర్షించిన నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఒకపక్క అమితాబ్ బచ్చన్ ‘పీకూ’లో దేశీయ ప్రేక్షకుల్నీ, మరోపక్క ‘జురాసిక్ వరల్డ్’లో అంతర్జాతీయ ప్రేక్షకుల్నీ ఏకకాలంలో అలరించారు
ఇటీవల వచ్చిన రెండు పెద్ద చిత్రాల్లో అందరినీ ఆకర్షించిన నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఒకపక్క అమితాబ్ బచ్చన్ ‘పీకూ’లో దేశీయ ప్రేక్షకుల్నీ, మరోపక్క ‘జురాసిక్ వరల్డ్’లో అంతర్జాతీయ ప్రేక్షకుల్నీ ఏకకాలంలో అలరించారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’, ‘ది ఎమేజింగ్ స్పైడర్‌మ్యాన్’, ‘లైఫ్ ఆఫ్ పై’ సహా పలు ఇంగ్లీషు చిత్రాల్లో ఇటీవల తరచూ కనిపిస్తున్న ఈ విలక్షణ నటుడికి ఆ హాలీవుడ్ అనుభవం కొత్త కిటికీలు తెరిచింది.
అందుకే, ఆయన ఇప్పుడు హాలీవుడ్‌లో తన అనుభవం గురించి కథలు కథలుగా చెబుతున్నారు. ‘‘హాలీవుడ్, బాలీవుడ్‌లు దేనికదే ప్రత్యేకం. ఈ రెండు భారీ సినీ పరిశ్రమల్లో పనిచేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నా. అయితే, ఎక్కడి పని తీరు అక్కడే వేరు’’ అని ఆయన అన్నారు. ‘‘హాలీవుడ్‌లో ప్రేక్షకులు వేరు. అందుకే, అక్కడ నటించడానికి విలక్షణమైన నైపుణ్యం కావాలి. ఫలితంగా కొత్త రకం పని చేసే అవకాశం నాకు వచ్చింది’’ అని వివరణ కూడా ఇచ్చారు.
‘‘ఎక్కువమంది ప్రేక్షకులకు చేరే హాలీవుడ్ సినిమాలది ఒక ప్రత్యేకమైన విశ్వజనీన భాష. అందుకే, ఆ సినిమాలు ఇక్కడి మన సినిమాల మీద ఆధిపత్యం చూపిస్తున్నాయి. ఆ సినిమాల వల్ల మన భారతీయ సినిమాల వ్యాపారం మీద కూడా ప్రభావం ఉంటోంది’’ అని ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా పేరు తెచ్చుకున్న ఈ భారతీయ నటుడు అన్నారు. మొత్తానికి, ప్రపంచం తిరిగాక నటనతో పాటు అభిప్రాయాల్లోనూ ఇర్ఫాన్ మరింత పరిణతి సాధించినట్లున్నారు.