Irfan Khan
-
ఈ శతాబ్దపు ఉత్తమ నటీనటులు వీళ్లే.. ఇండియా నుంచి ఓకే ఒక్కడు!
ఈ శతాబ్దపు ఉత్తమ నటీనటుల జాబితాను ప్రముఖ ఆంగ్ల పత్రిక ది ఇండిపెండెంట్ వెల్లడించింది. 21 వ శతాబ్దంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దాదాపు 60 మందితో కూడిన సినీ నటుల పేర్లను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటుల పేర్లను ఇందులో చేర్చింది. అయితే భారత్ నుంచి ఏ ఒక్క స్టార్ హీరో లేకపోవడం గమనార్హం. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కూడా ఈ లిస్ట్‌లో చోటు లభించలేదు.అయితే ఈ 60 ఉత్తమ నటీనటుల జాబితాలో ఇండియా నుంచి ఒక్క నటుడు మాత్రం స్థానం దక్కించుకున్నాడు. అతను మరెవరో కాదు.. విభిన్నమైన పాత్రలతో మెప్పించిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మాత్రమే ఈ జాబితాలో నిలిచాడు. అయితే ప్రస్తుతం ఆయన ఈ ప్రపంచంలో లేరు. 2020లో ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు. ఆయన చనిపోయాక అరుదైన జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.ఇర్ఫాన్ ఖాన్ సినీ ప్రయాణం..రాజస్థాన్‌లోని పఠాన్ ముస్లిం కుటుంబంలో జన్మించారు ఇర్ఫాన్ ఖాన్. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి నటన నేర్చుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ముంబయికి వెళ్లిపోయారు. ఇర్ఫాన్ ఖాన్ తన కెరీర్లో లైఫ్ ఇన్ ఎ మెట్రో, ది డార్జిలింగ్ లిమిటెడ్, స్లమ్‌డాగ్ మిలియనీర్, పాన్ సింగ్ తోమర్, లైఫ్ ఆఫ్ పై, ది లంచ్‌బాక్స్, కిస్సా, హైదర్, పికు, తల్వార్, హిందీ మీడియం, ది సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్, ఖరీబ్ ఖరీబ్ సింగ్లే, కార్వాన్, ఆంగ్రేజీ మీడియం లాంటి సినిమాల్లో తనదైన నటనతో మెప్పించారు. తను చివరగా నటించిన ‘అంగ్రేజీ మీడియం’ షూటింగ్‌లోనూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో కొన్నాళ్లపాటు విరామం తీసుకుని మళ్లీ చిత్రీకరణ పూర్తి చేశారు.టాప్ 10 నటులు వీళ్లే..2014లో మరణించిన మరో దివంగత నటుడు ఫిలిప్ సేమౌర్ హాఫ్మన్ 21వ శతాబ్దపు ఉత్తమ నటుడిగా నిలిచారు. నటీమణుల్లో ఎమ్మా స్టోన్ 2వ స్థానం దక్కించుకుంది. క్రేజీ, స్టుపిడ్, లవ్, లా లా ల్యాండ్, ది ఫేవరెట్, పూర్ థింగ్స్ లాంటి చిత్రాల్లో నటనకు ఆమె ప్రశంసలు అందుకుంది. 2016లో రిటైర్మెంట్ ప్రకటించిన డేనియల్ డే-లూయిస్ 3 స్థానంలో నిలిచాడు. ది గ్లాడియేటర్ II నటుడు డెంజెల్ వాషింగ్టన్ 4వ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత నికోల్ కిడ్మాన్, డేనియల్ కలుయుయా, సాంగ్ కాంగ్ హో, కేట్ బ్లాంచెట్, కోలిన్ ఫారెల్, ఫ్లోరెన్స్ పగ్ వరుసగా స్థానాల్లో నిలిచారు. ఇండియా నుంచి కేవలం ఇర్ఫాన్ ఖాన్‌కు మాత్రమే ప్లేస్ దక్కింది. -
అదొక జబ్బు! బయటపడాలని కోరుకుంటున్నా.. కోహ్లి పోస్ట్ వైరల్
Virat Kohli: ‘‘పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకోవడం కూడా ఓ జబ్బులాంటిదే! అయితే, ఏదో ఒకరోజు నేను ఈ జబ్బు నుంచి బయటపడాలి.. ఈ కోరికల వలయం నుంచి విముక్తి పొందాలని ఆశిస్తున్నా. కీర్తిప్రతిష్టలు పెద్ద విషయమేం కాదు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతున్నామా లేదా? ఉన్నదాంతో సంతృప్తి పడుతున్నామా లేదా అన్నదే ముఖ్యం’’.. బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఒకానొక సందర్భంలో చెప్పిన మాటలు ఇవి. జీవిత పరమార్థాన్ని తెలియజేసే ఈ కోట్‌ను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. కాగా అరంగేట్రం చేసిన అనతికాలంలోనే భారత జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన కోహ్లి.. సారథిగానూ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఆటగాడిగా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో 72 సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ రన్‌మెషీన్.. కెప్టెన్‌గానూ తనదైన ముద్ర వేయగలిగాడు. ఇక బంగ్లాదేశ్ పర్యటన తర్వాత విశ్రాంతి తీసుకున్న కోహ్లి.. శ్రీలంకతో స్వదేశంలో వన్డే సిరీస్‌తో మంగళవారం నాటి తొలి మ్యాచ్‌తో మళ్లీ మైదానంలో దిగనున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఈ మేరకు ఇర్ఫాన్ ఖాన్ మాటలు కోట్ చేస్తూ పోస్టు పెట్టాడు. అంతేకాదు.. ‘‘ఈ కఠిన సమయం కూడా గడిచిపోతుంది. ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదా? నీ పని అయిపోయిందనిపిస్తోందా? పరిస్థితులపై కోపం వస్తోందా? ఇలాంటి గడ్డు పరిస్థితులూ కాలంతో పాటే మారిపోతాయి. నీకెదురైన ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. నీకే కాదు నిన్ను విమర్శించిన వాళ్లకూ నువ్వు జవాబు చెప్పినట్లే అవుతుంది’’ అని హాలీవుడ్ యాక్టర్ టామ్ హాంక్స్ చెప్పిన స్ఫూర్తిదాయక మాటలను ప్రస్తావించడం విశేషం. కాగా వన్డే సిరీస్‌కు ముందు కోహ్లి ఈ మేరకు పోస్ట్ చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. కోహ్లి పోస్ట్ వెనుక అర్థం ఏమిటంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చదవండి: Suryakumar Yadav: సూర్య ఇండియన్ కాబట్టి సరిపోయింది.. అదే పాకిస్తాన్లో ఉంటేనా: పాక్ మాజీ కెప్టెన్ Suryakumar Yadav: సూర్య కెరీర్‌పై గంభీర్ ట్వీట్! నీకు అతడు మాత్రమే కనిపిస్తున్నాడా? ఫ్యాన్స్ ఫైర్ -
నాన్న మరణం.. నెలన్నర రోజులు గదిలో బందీగా ఉన్నా: నటుడు
దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ బర్త్‌డే నేడు (జనవరి 7). తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్న ఆయన 2020లో కన్నుమూశారు. క్యాన్సర్ మహమ్మారితో చేసిన దీర్ఘకాలం పోరాటంలో తనువు చాలించారు. ఆ సమయంలో ఇర్ఫాన్ కుటుంబం, అభిమానులు పడ్డ బాధ మాటల్లో చెప్పలేనిది. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని ఇర్ఫాన్ పెద్ద కొడుకు బాబిల్ ఖాన్ కొంతకాలం డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. 'నాన్న మా మధ్య లేడన్న విషయాన్ని నేను నమ్మలేకపోయాను. కానీ వారం రోజుల తర్వాత నాన్న లేని ఎడబాటు మమ్మల్ని కుంగదీసింది. నేనైతే ఆ బాధతో నెలన్నర రోజుల పాటు గదిలోకి వెళ్లి తాళం వేసుకుని అందులోనే ఉండిపోయాను. మామూలుగా నాన్న లాంగ్డేస్ షూటింగ్ షెడ్యూల్స్కు వెళ్తూ ఉండేవాడు. ఇది కూడా అలాంటిదేనేమో.. వచ్చేస్తాడేమో అనిపించేది.. కానీ ఎప్పటికీ తిరిగి రాడని అర్థమయ్యాక నా బెస్ట్ ఫ్రెండ్‌ను కోల్పోయాననిపించింది. ఎంతో నరకం అనుభవించాను' అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. క్వాలా సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు బాబిల్. ప్రస్తుతం అతడు 'ద రైల్వే మెన్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఆర్.మాధవన్, కేకే మీనన్, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. భోపాల్ గ్యాస్ విషాద ఘటన ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇకపోతే శూజిత్ సర్కార్‌తో మరో సినిమా కూడా చేస్తున్నాడు బాబిల్. View this post on Instagram A post shared by Babil (@babil.i.k) చదవండి: విక్రమార్కుడు తర్వాత నన్ను ఇంట్లో దారుణంగా చూశారు: అజయ్ నా తండ్రితోనే పెళ్లి చేస్తున్నారు.. ఎంత ఘోరం?: శ్రీముఖి -
కస్టడీకి ‘అమరావతి’ సూత్రధారి
అమరావతి(మహారాష్ట్ర): అమరావతికి చెందిన కెమిస్ట్ ఉమేశ్ కోల్హె హత్య కేసులో ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్(35)కు కోర్టు ఈ నెల 7వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. శనివారం నాగపూర్‌లో అరెస్ట్ చేసిన ఇర్ఫాన్‌ఖాన్‌ను ఆదివారం ఎన్ఐఏ బృందం కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ప్రశ్నించింది. అనంతరం అతడిని డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో హాజరుపరచగా 7వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించినందుకు ఉమేశ్ కోల్హెను దుండగులు జూన్ జూన్ 21వ తేదీన హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇర్ఫాన్ ఖాన్ ఏడో నిందితుడు. అమరావతికి చెందిన ఉమేశ్‌కు వెటరినరీ మందుల దుకాణం ఉంది. ఈయన వెటరినరీ వైద్యులతో కూడిన వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఇర్ఫాన్ ఖాన్ సభ్యుడు. ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఇర్ఫాన్ రాహ్బర్ అనే స్వచ్ఛంద సంస్థను కూడా నిర్వహిస్తున్నాడు. వాట్సాప్ గ్రూప్‌లో నుపుర్ శర్మకు అనుకూలంగా ఉమేశ్ పెట్టిన పోస్టుపై ఇర్ఫాన్ ఆగ్రహంతో ఉన్నాడు. ఇతడే ఉమేశ్ హత్యకు పథకం వేసి, కొందరికి బాధ్యతలు అప్పగించాడు. వీరిలో నలుగురు ఇతడి స్వచ్ఛంద సంస్థకు చెందిన వారే. ఉమేశ్ హత్య అనంతరం అంత్యక్రియల్లో కూడా ఇర్ఫాన్ పాల్గొన్నాడు. కన్హయ్యాలాల్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఏకే ఈ కేసును కూడా అప్పగిస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన సమాచారం అధికారంగా అందాల్సి ఉందని అమరావతి పోలీస్ కమిషనర్ ఆర్తి సింగ్ చెప్పారు. దర్జీ హత్యపై భారీ నిరసన ర్యాలీ ఉదయ్‌పూర్‌లో కన్హయ్యాలాల్ అనే దర్జీ దారుణ హత్యకు నిరసనగా జైపూర్‌లో ఆదివారం భారీ ర్యాలీ జరిగింది. -
తొలి అడుగే అదరగొట్టేశాడుగా : వైరల్ పిక్స్
సాక్షి, హైదరాబాద్: దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ తండ్రి మరణం తరువాత తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నాడు. త్వరలోనే బాలీవుడ్ మూవీ ద్వారా ఫ్యాన్స్ ముందుకు రానున్న బాబిల్ ఒక ఫోటోషూట్ చేశాడు. డెబ్యూకు ముందు చేసిన ఫోటోషూట్తోనే అదరగొట్టేశాడు. ఈ ఫోటోలు విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. నాసిక్‌లో ఫామ్‌హౌస్ తన కుటుంబానికి ప్రత్యేకమైన ప్రదేశమని, ముఖ్యంగా తండ్రి ఇర్ఫాన్ ఖాన్ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినప్పుడల్లా ఇక్కడికే వచ్చేవారని తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు బాబిల్. చదువుకు స్వస్తి చెప్పి నటుడిగా కరియర్‌ను ప్రారంభించ నున్నట్టు ప్రకటించిన బాబిల్ ఈ అద్భుత ఫోటోషూట్‌తో హల్చల్ చేస్తున్నాడు. ఇషా భన్సాలీ స్టైల్, శివాజీ సేన్ ఫోటోగ్రఫీలో తన తండ్రికిష్టమైన ఫామ్‌హౌస్‌లో చేసుకున్న మొదటి ఫోటోషూట్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాబిల్ తన ఫాలోవర్స్‌తో తన అభిప్రాయాలను షేర్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా తనకే మతమూ లేదని తానూ అందరి లాంటి వాడినేని ప్రకటించుకున్నాడు. దేశంలో అందరి పౌరుల్లాగానే తాను కూడా ఒక భారతీయుడినని చెప్పుకొచ్చిన బాబిల్ ప్రజల్ని ప్రేమిస్తాను, ప్రజల కోసం నిలబడతానని ఇన్స్టాగ్రామ్ తన ఫ్యాన్‌కు సమాధానం ఇచ్చాడు. లండన్, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్న బాబిల్ యాక్టింగ్‌వైపు వస్తున్నట్టు ఇటీవల ప్రకటించాడు. -
తిక్క కుదిరింది: సోషల్ మీడియా స్టార్ ‘ఆత్మహత్య నాటకం’
ముంబై: సోషల్ మీడియాలో స్టార్‌గా ఎదిగేందుకు కొందరు పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేస్తారు. అందరి దృష్టిలో పడేందుకు వెర్రి వేషాలు వేస్తుంటారు. తాజాగా ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి పోలీసుల వరకు చేరింది. దీంతో ప్రస్తుతం ఆ యువకుడు కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇర్ఫాన్‌ఖాన్ (28) ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నాడు. ఇప్పీఖాన్ అనే పేరిట ఇన్‌స్టా, యూట్యూబ్ ఖాతాలు ఉన్నాయి. అతడికి 44 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మరింత మందిని పెంచుకునేందుకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియో రూపొందించాడు. ఓ అమ్మాయి తనను ప్రేమించి మోసం చేసిందని.. ఇది తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెబుతూ ఖార్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై కూర్చున్నాడు. ఈ సమయంలో తనకు రైలు ఢీకొట్టినట్లు వచ్చేలా ఎడిట్ చేశాడు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన బాంద్రా పోలీసులు ఇర్ఫాన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను ఆత్మహత్య చేసుకోకూడదని ఉద్దేశంతో అవగాహన కల్పించేందుకు ఆ వీడియో రూపొందించినట్లు పోలీసులకు ఇర్ఫాన్ తెలిపాడు. దీనిపై అతడు క్షమాపణలు చెప్పి ఆ వీడియోను డిలీట్ చేశాడు. ఏది ఏమైనా అతడిపై పోలీసులు కేసు మాత్రం తప్పలేదు. -
‘నవ్వుతూనే ఓ మాట చెప్పాడు. నేను చనిపోతున్నాను’
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించి నేటికి(గురువారం) ఏడాది పూర్తవుతోంది. గతేడాది ఏప్రిల్ 29న ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అప్పటికి కొంతకాలంగా ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయన లండన్‌లో వైద్యం కూడా తీసుకున్నారు. అయినప్పటికీ మాయదారి క్యాన్సర్ నటుడిని బలితీసుకుంది. నేడు ఆయన మొదటి వర్ధంతి. ఈ సందర్భంగా ఇర్ఫాన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బాలీవుడ్ ప్రముఖులు, నివాళులర్పిస్తున్నారు. కాగా ఇర్ఫాన్‌కు భార్య సుతాపా సిక్దార్, ఇద్దరు కుమారులు బాబిల్ ఖాన్, అయాన్ ఖాన్ ఉన్నారు. ఇటీవల వారు ఓ ఇంటర్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా తండ్రి చివరి మాటలను గుర్తుచేసుకున్నాడు బాబిల్. ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చేర్చాము. నాన్న చనిపోయే చివరి రెండు రోజులు తనతోనే ఉన్నాను. స్పృహ కోల్పోతున్నట్లు కనిపించాడు. నా వైపు చూస్తూ.. నవ్వుతూనే ఓ మాట చెప్పాడు. నేను చనిపోతున్నాను. కాదని వారిస్తున్న వినకుండా నవ్వుతునే ఉన్నాడు.. ఆ తర్వాత అలాగే నవ్వుతూ నిద్రలోకి వెళ్లాడు’ అని తండ్రి చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నాడు. ఇక ఇర్ఫాన్ ఖాన్.. ది నెమ్సేక్, పాన్ సింగ్ తోమర్, హైదర్, సలామ్ బాంబే, పీకూ, హిందీ మీడియం వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు. స్లమ్ డాగ్ మిలియనీర్, లైఫ్ ఆఫ్ పై వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించి మన్ననలు అందుకున్నాడు. అలాగే తెలుగులోనూ సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో నటించాడు. చదవండి: ఇర్ఫాన్‌ను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చిన కుమారుడు -
ఇర్ఫాన్‌ను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చిన కుమారుడు
తండ్రిని తలుచుకుని ఆనందబాష్పాలు రావాలి. అశ్రువులు కాదు. కాని తండ్రి జీవించి ఉంటే ఆనంద బాష్పాలు వచ్చేవే. తాజాగా జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ – 2021 ఫంక్షన్లో తండ్రి ఇర్ఫాన్ ఖాన్‌కు వచ్చిన అవార్డును అతడి తరఫున కుమారుడు బాబిల్ ఖాన్ అందుకుంటూ తండ్రిని తలచుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. ఇటీవల ముంబైలో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ జరిగింది. ఆ వేడుకలో ఇర్ఫాన్ ఖాన్‌ను మరణానంతర ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ ప్రకటించారు. అలాగే ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. దానిని అందుకోవడానికి ఇర్ఫాన్ కుమారుడు బాబిల్‌ను స్టేజ్ మీదకు నటులు ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావ్ పిలిచారు. ఆ సమయంలో ఆయుష్మాన్ మాట్లాడుతూ ‘ఇర్ఫాన్ ఖాన్ నుంచి మేమందరం ఎంతో నేర్చుకున్నాం’ అన్నాడు. అప్పుడు అవార్డు అందుకున్న బాబిల్ తండ్రిని తలచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. అది చూసి రాజ్‌కుమార్ రావ్ కూడా కన్నీరు కార్చాడు. చాలామంది భావోద్వేగానికి లోనయ్యారు. ‘నేనేమి ప్రత్యేక ఉపన్యాసం తయారు చేసుకుని రాలేదు. నన్ను మీ అందరూ అక్కున చేర్చుకున్నారు. అది చాలు’ అన్నాడు బాబిల్. ఈ ఈవెంట్ ప్రసారం కావాల్సి ఉంది. -
అందుకే అవార్డు ఫంక్షన్‌కు నాన్న దుస్తుల్లో వెళ్లా: బాబిల్
బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ చివరి చిత్రం ‘అంగ్రేజీ మీడియం’. ఈ మూవీకి గాను ఆయన ఉత్తమ నటుడిగా ఫిలీం ఫేర్ అవార్డుతో పాటు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి అవార్డులను తీసుకునేందుకు ఇర్ఫాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ఆయన దుస్తుల్లో హజరయ్యాడు. అయితే అది చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఈ సందర్బంగా బాబిల్ నేను ఆయన నటనకు సరితూగకపోవచ్చు కానీ ఆయన దుస్తులకు సరిపోతానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. అయితే అవార్డు కార్యక్రమానికి వెళ్లేముందు తల్లి సుతాప సిక్ధార్ ఇర్ఫాన్ సూట్ వేసి ముస్తాబు చేస్తున్న వీడియోను బాబిల్ షేర్ చేశాడు. తల్లి సుతాప తన తండ్రి షూట్‌నే ఎందుకు వేయించింది, అలాగే ఆమె అవార్డు ఫంక్షన్స్‌కు రాకపోవడానికి కారణం ఎంటో బాబిల్ తన పోస్టులో చెప్పుకొచ్చాడు. ‘నాన్నకు(ఇర్ఫాన్ ఖాన్) ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్‌లో పాల్గొనడం అస్సలు నచ్చదు. కానీ ఆయన కొన్ని సార్లు చేయాల్సి వచ్చేది. అందుకే తన సౌకర్యాన్ని బ్రేక్ చేసుకునేందుకు ఇలాంటి నీలి రంగు దుస్తులనే ధరించేవారు. నిన్న రాత్రి నేను చేసింది కూడా అదే. నేను కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అసౌకర్యానికి గురవుతుంటాను’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. అలాగే ఈ వీడియో చివరలో బాబిల్ తన తల్లిని నువ్వు కూడా అవార్డు ఫంక్షన్‌కు రావచ్చు కదా అని అడగ్గా ఆమె ‘నేను రాలేను.. ఎందుకంటే అక్కడ మనుషులను ఫేస్ చేయలేను’ అంటూ ఆమె సమాధానం ఇచ్చింది. కాగా గతేడాది ఏప్రిల్ 29న ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బాబిల్ తండ్రికి సంబంధించిన విషయాలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్యేగానికి లోనవుతుంటాడు. View this post on Instagram A post shared by Babil (@babil.i.k) చదవండి: Filmfare Awards 2021: విజేతలు వీరే.. సీబీడీ ఆయిల్‌ను లీగల్ చేయాలి: ఇర్ఫాన్ భార్య -
Filmfare Awards 2021: విజేతలు వీరే..
ముంబై: ఇటీవలే జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్రం తాజాగా అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌ను కూడా ప్రకటించింది. 2021కి గాను 66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను శనివారం ముంబైలో ప్రకటించారు. ఉత్తమ నటుడిగా ఇర్ఫాన్‌ఖాన్ ( ఆంగ్రేజీ మీడియం)ను ఎంపిక చేశారు. అంతే కాకుండా ఇర్ఫాన్ ఖాన్‌కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించారు. కాగా గత ఏడాది ఏప్రిల్ 29 న ఇర్ఫాన్ ఖాన్ కేన్సర్‌తో మరణించిన విషయం తెలిసిందే. తాప్సీ నటించిన థప్పడ్ సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. తాప్సీ పణ్ణును ఉత్తమ నటిగా ప్రకటించారు. ఈ 'థప్పడ్' చిత్రం మొత్తం ఏడు అవార్డులను గెలుచుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మరో వైపు అయుష్మాన్ ఖురానా, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన 'గులాబో సితాబో' చిత్రం ఆరు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ డైరెక్టర్ గా ఓం రావత్ నిలిచారు. ఆయన డైరెక్ట్ చేసిన హిస్టారికల్ మూవీ 'తానాజీ: ది అన్సంగ్ వారియర్' బాక్సాఫీస్ వద్ద ఘనమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 2021 ఫిల్మ్ ఫేర్ అవార్డు విజేతలు: ఉత్తమ చిత్రం- థప్పడ్ ఉత్తమ దర్శకుడు- ఓం రావత్ (తానాజీ: ది అన్సంగ్ వారియర్) ఉత్తమ చిత్రం(క్రిటిక్స్ ఛాయిస్)-ప్రతీక్ వాట్స్ (ఈబ్ అల్లే ఓహ్!) ఉత్తమ నటుడు-ఇర్ఫాన్ ఖాన్ (ఆంగ్రేజీ మీడియం) ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్)-అమితాబ్ బచ్చన్ (గులాబో సితాబో) ఉత్తమ నటి-తాప్సీ పన్నూ (థప్పడ్) ఉత్తమ నటి (క్రిటిక్స్ ఛాయిస్)-తిలోత్తమా షోమ్ ( సర్) ఉత్తమ సహాయ నటుడు-సైఫ్ అలీ ఖాన్ (తానాజీ: ది అన్సంగ్ వారియర్) ఉత్తమ సహాయ నటి- ఫరోఖ్ జాఫర్(గులాబో సితాబో) ఉత్తమ కథ- అనుభవ్ సిన్హా , మృన్మయి లగూ వైకుల్ (థప్పడ్) ఉత్తమ స్క్రీన్ ప్లే-రోహేనా గెరా (సర్) ఉత్తమ సంభాషణ-జుహి చతుర్వేది (గులాబో సితాబో) ఉత్తమ తొలి దర్శకుడు-రాజేష్ కృష్ణన్ (లూట్కేస్) ఉత్తమ సంగీతం-ప్రీతమ్(లూడో) ఉత్తమ సాహిత్యం-గుల్జార్ (చప్పక్) లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు- ఇర్ఫాన్ ఖాన్ బెస్ట్ యాక్షన్-రంజాన్ బులుట్, ఆర్పి యాదవ్ (తానాజీ: ది అన్సంగ్ వారియర్) ఉత్తమ నేపథ్య స్కోరు-మంగేష్ ఉర్మిలా ధక్డే (థప్పడ్) ఉత్తమ సినిమాటోగ్రఫీ-అవిక్ ముఖోపాధ్యాయ్ (గులాబో సితాబో) ఉత్తమ కొరియోగ్రఫీ-ఫరా ఖాన్ (దిల్ బెచారా) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్-వీర కపూర్ ఈ (గులాబో సితాబో) ఉత్తమ ఎడిటింగ్-యషా పుష్ప రామ్‌చందాని (థప్పడ్) -
సీబీడీ ఆయిల్‌ను లీగల్ చేయాలి: నటుడి భార్య
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన తరువాత నార్కోటిక్స్ డ్రగ్స్ పై తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా కన్నాబిడియోల్ లేదా సీబీడీ ఆయిల్ వినియోగం చట్టవిరుద్ధమా, కాదా అనే విషయం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ భార్య సుతాపా సికదర్ సంచలన విజ్ఞప్తి చేశారు. సీబీడీ ఆయిల్‌ను ఇండియాలో చట్టబద్ధం చేయాలనే హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు. ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ చికిత్స తీసుకున్న లండన్ ఆసుపత్రి ఫోటోను సుతాపా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షేర్ చేశారు. దాదాపు రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ ఇర్ఫాన్ ఈ ఏడాది ఏప్రిల్ 29న కన్ను మూశారు. మరోవైపు ఇప్పటికే గాయని సోనా మోహపాత్రా కూడీ సీబీడీ ఆయిల్ ప్రయోజనాలపై ఫేస్బుక్లోఒక పోస్ట్ పెట్టారు. గత ఏడాది తన సోదరి క్యాన్సర్ చికిత్స సందర్భంగా పలు, శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పుడు నొప్పి నివారణకు, త్వరగా కోలుకోవటానికి ఈ డ్రగ్ మాజిక్ లా పనిచేసిందని పేర్కొనడం విశేషం. కాగా ఆన్ లైన్ ద్వారా నటి శ్రధ్ధాకపూర్ కి తానే సీబీడీ ఆయిల్ ఆర్డర్ చేశానని సుశాంత్ మాజీ మేనేజర్ జయాసాహా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో తెలిపారు. సుశాంత్ కి ఎలా ఇవ్వాలో రియా చక్రవర్తికి వాట్సాప్ ద్వారా వివరంగా తెలియజేశానని వెల్లడించింది. సీబీడీ ఆయిల్ కోసం సాహాతో చాట్ చేసినట్లు ఆరోపణలు రావడంతో శ్రద్ధాను ఎన్సీబీ విచారిస్తోంది. దీంతోపాటు బాలీవుడ్ డ్రగ్గిస్టులపై అధికారులు కూపీ లాగుతున్నారు. (చదవండి: డ్రగ్స్ కేసులో ముగ్గురు బడా హీరోలు!) సీబీడీ ఆయిల్ అంటే ఏమిటి ? సీబీడీ ఆయిల్‌ను గంజాయి ఆకుల నుంచి తయారు చేస్తారు. గంజాయి ఆకుల నుంచి పలు పదార్థాలను వెలికి తీసి వాటితో సీబీడీ ఆయిల్‌ను తయారు చేస్తారు. సీబీడీ ఆయిల్‌ను కన్నాబిడియోల్ అని కూడా పిలుస్తారు. గంజాయి మోతాదు 40 శాతం వరకు ఉంటుందట. అయితే ఇతర దేశాల్లో వైద్యులు పలువురు రోగులకు సీబీడీ ఆయిల్‌ను ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. మానసిక సమస్యలు, జాయింట్ పెయిన్స్, నిద్రలేమి, గుండె సంబంధ సమస్యలకు ఔషధంగా వాడతారు. ఇండియా సహా పలు దేశాల్లో ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి నిషేధం లేదు. అంతేకాదు దీన్ని ఎక్కువగా వినియోగించే దేశాలలో భారత్ కూడా ఒకటి. అమెజాన్ లాంటి ఆన్లైన్ సైట్ల ద్వారా దేశంలో అందుబాటులో ఉన్నట్టు సమాచారం. View this post on Instagram London revist looking at his hospital room from outside like everytime I did while he was there#walkingalone#wishyouwerethere#cancerpain#LegalizeCBDoilinindia A post shared by Sutapa Sikdar (@sikdarsutapa) on Sep 29, 2020 at 5:22am PDT -
ఈ వర్షం మనల్ని కలుపుతుంది: ఇర్ఫాన్ భార్య
ముంబై: బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు వర్షం, కలువ పూలు (తామర పువ్వు) అంటే చాలా ఇష్టమంటూ ఆయన భార్య సుతాప సిక్ధార్ సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేశారు. అదే విధంగా ఇర్ఫాన్ కలువ పూల కోసం సృష్టించిన లోటస్ పాండ్ ఫొటోలను ఆదివారం తన ఫేస్బుక్లో షేర్ చేసి భావోద్వేగ లేఖను పంచుకున్నారు. ‘ఈ కలువలు మిమ్మల్ని గుర్తు చేస్తున్నాయి ఇర్ఫాన్. వీటిని వికసించేలా చేయడానికి మీరు ఎంతగా తపించారో నాతో పాటు అవి కూడా చూశాయి. ఎండిపోతున్న కలువు పూలను సీసాలో తీసుకువచ్చి వాటి కోసం పాండ్‌ను నిర్మించడానికి ఎంతగా కష్టపడ్డారో’ అంటూ రాసుకొచ్చారు. (నా భర్త నాతోనే ఉన్నాడు: ఇర్ఫాన్ భార్య) మరో పోస్టులో వర్షం పడుతున్న వీడియోతో పాటు ఇర్ఫాన్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘మీకు ధన్యవాదాలు.. ఈ చినుకుల శబ్థంలో నేను మిమ్మల్ని విన్నాను. అవును ఇది మీకు, నాకు మధ్య వారధి అని నాకు తెలుసు. అది నా శరీరాన్ని, ఆత్మను తాకింది. రెండు లోకాలలో ఉన్న మనిద్దరినీ ఈ వర్షం కలుపుతుంది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. విలక్షణ నటుడు ఇర్ఫాన్ న్యూరో ఎండోక్రిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఏప్రిల్ 29న మరణించిన విషయం తెలిసిందే. (ఇర్ఫాన్ ఖాన్ వీడియో షేర్ చేసిన బాబిల్) -
బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు
ముంబై : బాలీవుడు నటుడు కమల్ ఆర్ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల మృతిచెందిన బాలీవుడ్ దిగ్గజ నటులు రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌లను అవమానించే రీతిలో సోషల్ మీడియాలో కామెంట్లు చేశారనే ఫిర్యాదుతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌లపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కమల్‌పై చర్యలు తీసుకోవాలని యువసేన కోర్ కమిటీ మెంబర్ రాహుల్ కనాల్ బాంద్రా సబ్అర్బన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. రిషీ కపూర్ హాస్పిటల్ చేరిన రోజున.. ‘త్వరలోనే వైన్ షాప్‌లు తెరుచుకోనున్నాయి.. అప్పటివరకు ఆయన మరణించకూడదు’ అని కమల్ ట్వీట్ చేశారు. మరోవైపు ఇర్ఫాన్ ఖాన్‌ను కూడా అవమానపరిచేలా కమల్ వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ..‘ ఇటీవ మరణించిన ఇద్దరు బాలీవుడ్ నటులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కమల్ ఆర్ ఖాన్‌పై సెక్షన్ 294 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది’ అని తెలిపారు.(చదవండి : నా భర్త ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో కదా??) -
నాకెంతో ఇష్టమైన వ్యక్తి ఆయన: దీపిక
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ భౌతికంగా దూరమైనా, ఆయన పోషించిన పాత్రలు ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నాయి. ఇర్ఫాన్ నటించిన అపురూపమైన చిత్రం పీకూ. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ లతో కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. పీకూ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా ఐదేళ్లవుతుంది. ఈ సందర్భంగా ఇర్ఫాన్‌తో ఉన్న మధుర స్మృతులను దీపిక సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇర్ఫాన్.. అద్భుతమైన వ్యక్తి. నాకెంతో ఇష్టమైన వ్యక్తి అంటూ పోస్ట్ చేశారు. దీపికా పదుకొణె నటించిన మొదటి హాలీవుడ్ చిత్రానికి సంబంధించి ఓ వేడుకలో ఇర్ఫాన్, దీపిక హాజరైన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వి మిస్ యూ ఇర్ఫాన్ అంటూ పలువురు ఆయన్ని గుర్తుచేసుకుంటున్నారు. క్యాన్సర్‌తో ఏప్రిల్ 29న ఇర్ఫాన్‌ఖాన్ తుది శ్వాస విడిచారు. (మనిషిగా పుట్టడం వరం.. శాశ్వతం కాదు! ) View this post on Instagram Those special moments ❤ #irrfankhan with #deepikapadukone 🎼 @hrithikroshan . . . #viralbhayani @viralbhayani A post shared by Viral Bhayani (@viralbhayani) on May 7, 2020 at 1:14am PDT -
మనిషిగా పుట్టడం వరం.. శాశ్వతం కాదు!
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ చనిపోయి రోజులు గడుస్తున్నా జ్ఞాపకాలతో తమ వెంటే ఉన్నాడని భావిస్తోంది కుటుంబం. ఏదో ఒక విషయంలో ఆయన్ని గుర్తు చేసుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలో చిన్న కుమారుడు అయాన్ తండ్రి ఇర్ఫాన్‌తో కలిసి దిగిన చిన్ననాటి ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. తండ్రి బైక్ నడుపుతుండగా అయాన్ తలపై టోపీతో ముందు కూర్చుని ఉన్న ఫొటో అది. ఫొటోతో పాటు తండ్రి బ్రతికుండగా ... ‘‘మనిషిగా ఈ భూమ్మీద పుట్టడం ఓ వరం.. అదేమీ శాశ్వతం కాదు’’ అన్న మాటల్ని కూడా అయాన్ గుర్తు చేసుకున్నాడు. గురువారం ఇర్ఫాన్ భార్య సుతాపా సిక్దర్ స్పందిస్తూ.. భర్త మరణంపై భావోద్వేగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయాన్ తల్లి లేఖను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. చదవండి : నేను ఒంటరిని ఎలా అవుతా? View this post on Instagram The flesh we roam this earth in is a blessing, not a promise. A post shared by ayAAn khan (@arkane_7) on May 1, 2020 at 9:36am PDT -
నేను ఒంటరిని ఎలా అవుతా?
‘‘ఇర్ఫాన్ మరణాన్ని ప్రపంచం మొత్తం తమ సొంత మనిషిని కోల్పోయినట్టు భావిస్తుంటే, ఈ లేఖను కేవలం కుటుంబ సభ్యులు విడుదల చేసింది అని ఎలా పేర్కొనగలను? ప్రపంచం మొత్తం నాతో పాటే బాధలో ఉంటే నేను ఒంటరిని అని ఎలా అనుకోగలను?’’ అన్నారు ఇర్ఫాన్ భార్య సుతాపా. ఇర్ఫాన్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భార్య ఓ లేఖను రాసుకొచ్చారు. అందులోని సారాంశం ఈ విధంగా. ‘‘అందరూ మనం ఏదో కోల్పోయాం అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఆయన నేర్పిన ఎన్నో విషయాలను అనుసరించేందుకు, అనుసరించి సరైన మార్గంలో ప్రయాణించేందుకు మంచి అవకాశం. ఇర్ఫాన్ మీద నాకున్న ఒకే ఒక్క ఫిర్యాదు ఏంటంటే, ఇర్ఫాన్ జీవితం మొత్తం పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించారు. అదే నన్నూ పాడు చేసింది. దాంతో జీవితంలో సాధారణమైన వాటికి పరిమితం కావడానికి ఇష్టపడేదాన్ని కాదు. ఆయన ప్రతి దాంట్లో ఒక రిథమ్ చూసేవారు. దానికి తగ్గట్టు నడుచుకోవడం నేను అలవాటు చేసుకున్నాను. ఏ ఆహ్వానం లేకుండా మా ఇంటికి వచ్చిన అతిథిలోనూ (క్యాన్సర్) ఒక రిథమ్ చూశారాయన. నేను డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులను స్క్రిప్ట్ లాగా భావించేదాన్ని. అందులోనూ ఆయన పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉండాలనుకునేదాన్ని. ఈ ప్రయాణంలో ఎంతోమంది వైద్యుల సహకారం మరువలేనిది. మా కుటుంబ ప్రయాణాన్ని పడవలో ఉన్నట్టు ఊహిస్తుంటా. మా పిల్లలు బబిల్, అయాన్ ముందు ఉండి నడిపిస్తున్నట్టు వెనక నుంచి ఇర్ఫాన్ అటు కాదు ఇటు అని వాళ్లను గైడ్ చేస్తునట్టు అనుకుంటా. కానీ జీవితం సినిమా కాదు, సినిమాలో ఉన్నట్టు జీవితంలో రీటేకులు ఉండవు కదా. నాన్న లేకుండానే మా పిల్లలు ఈ ప్రయాణాన్ని సాగిస్తారనుకుంటున్నాను. ‘అనూహ్యమైన సంఘటనలు జరిగినా వాటికి అనుగుణంగా మారుతూ నువ్వు నీ నమ్మకంతో ముందు వెళ్లాలి’ బబిల్. ‘నీ మనసు చెప్పినట్టు నువ్వు వినకుండా, నువ్వు చెప్పినట్టు అది వినేలా చేసుకో’ అయాన్. ఆయనను మేము దాచిపెట్టిన చోటులో ఆయనకు నచ్చిన మొక్కను నాటుతుంటే కంట్లో నీళ్లు ఆగలేదు. అది చిగురిస్తుంది. ఆ సువాసన ఆయన్ను ప్రేమించిన అందరికీ వెదజల్లుతుంది అనుకుంటున్నాను’’ అని ఎమోషనల్ గా రాసుకొచ్చారు సుతాపా. -
ఉద్వేగానికి లోనైన ఇర్ఫాన్ కుమారుడు
‘‘మాకు సానుభూతి తెలియజేసిన స్నేహితులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో మీ అందరికీ నేను బదులివ్వలేనన్న విషయం మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నా గొంతు పెగలడం లేదు. మాటలు తడబడుతున్నాయి. త్వరలోనే అందరితో మాట్లాడతాను. మాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు! ఐ లవ్ యూ’’ అంటూ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ఉద్వేగానికి లోనయ్యాడు. విషాద సమయంలో తమకు తోడుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపాడు. కాగా బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (53) నిన్న ఉదయం ముంబైలో మరణించిన విషయం విదితమే. (దేశ ప్రతిష్టను పెంచిన నటుడు.. పోరాడి ఓడిపోయాడు) గత రెండేళ్లుగా కేన్సర్‌తో పోరాడి విదేశాల్లో చికిత్స పొంది.. భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన.. పేగు సంబంధిత ఇన్ఫెక్షన్ వల్ల మంగళవారం కోకిలాబెన్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఇర్ఫాన్ బుధవారం ఉదయం మరణించాడని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. ఇర్ఫాన్ కుటుంబానికి సంతాపం ప్రకటించారు. ఇక లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో కేవలం 20 మంది కుటుంబ సభ్యులు, మిత్రులను మాత్రమే ఇర్ఫాన్ అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతించారు. ముంబైలోని వెర్సోవా కబ్రస్థాన్‌లో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా ఇర్ఫాన్‌కు భార్య సుతాప, ఇద్దరు కుమారులు బాబిల్, అయాన్ ఉన్నారు. (ప్రపంచ సినిమాకు తీరని లోటు..) -
బాలీవుడ్లో మరో విషాదం
సాక్షి, ముంబై: బాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రిషీకపూర్ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషి కపూర్‌ను కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ చేర్పించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా రిషీకపూర్ మృతిపై అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. మరోవైపు బాలీవుడ్ ప్రముఖులు రిషీకపూర్ మృతి పట్ల సంతాపం తెలిపారు. అలాగే విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. (‘వీ ఆల్ సో లవ్ యూ’) 1952, సెప్టెంబర్ 4న ముంబైలో జన్మించిన రిషీకపూర్ మేరా నామ్ జోకర్ చిత్రంలో బాల నటుడుగా ‘బాబీ’ చిత్రంతో హీరోగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. మేరానామ్ జోకర్, బాబీ, జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గమ్, పతీపత్నీఔర్ ఓ..,కర్జ్, కూలీ, దునియా, నగీనా, దూస్రా ఆద్మీ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. రిషీ కపూర్‌కు భార్య నీతూ కపూర్,పిల్లలు రిద్దిమా కపూర్, రణ్‌భీర్ కపూర్ ఉన్నారు. 1980లో హీరోయిన్ రీతూకపూర్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. నటుడుగానే కాకుండా దర్శక, నిర్మాతగా రాణించిన ఆయన పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. (ప్రియమైన మిత్రులారా.. శత్రువులారా...) Actor Amitabh Bachchan announces on Twitter that veteran actor Rishi Kapoor has passed away. pic.twitter.com/pwc7Pht68k — ANI (@ANI) April 30, 2020 -
ఇర్ఫాన్‌ఖాన్ మృతి పట్ల సినీ ఇండస్ట్రీ నివాళి
ఇర్ఫాన్ ఖాన్ మరణవార్త విని సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు తమ బాధను వ్యక్తం చేశారు. ఆ ట్వీట్స్ ఈ విధంగా.. ► ఇర్ఫాన్ ఖాన్ లేరనే వార్త నన్ను ఎంతో బాధించింది. ప్రపంచ వ్యాప్తింగా పాపులారిటీ సాధించిన అద్భుతమైన నటుడు ఇర్ఫాన్. ఆయన లోటుని ఎవ్వరూ భర్తీ చేయలేరు. ఇర్ఫాన్ నటన మన అందరి గుండెల్లో నిలిచిపోతుంది. ఇర్ఫాన్. మేమందరం నిన్ను మిస్ అవుతాం. – చిరంజీవి ► ప్రపంచ సినిమా ఓ గొప్ప నటుడిని కోల్పోయింది. ఇర్ఫాన్‌తో కలసి నటించే అవకాశం రాలేదు. ఆయన సినిమాలన్నీ చూసి, చెప్పగలిగేది ఏంటంటే ఆయనో అద్భుతమైన నటుడు. మీ సినిమాల ద్వారా మిమ్మల్ని చిరకాలం గుర్తుంచుకుంటాం. – వెంకటేష్ ► ఇర్ఫాన్ ఖాన్ నటన నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. నాకు తెలిసిన గొప్ప నటుల్లో ఇర్ఫాన్ ఒకరు. మనల్ని విడిచి ఆయన చాలా తొందరగా వెళ్లిపోయారు. ఇంకొంతకాలం జీవించి ఉండాల్సింది. – కమల్‌హాసన్ ► ఇర్ఫాన్‌ఖాన్ మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. – మోహన్‌లాల్ ► గొప్ప నటుడు. చాలా త్వరగా మనందర్నీ విడిచి వెళ్లిపోయారు. ఆయన తో పని చేయడం ఓ మంచి అనుభవం, ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి. ఆయన కుటుంబ సభ్యులకు, ప్రేమించిన వారికి నా హుదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను . – మహేష్ బాబు ► ప్రపంచ సినిమా ఒక ఆణిముత్యం లాంటి నటుడిని కోల్పోయింది. ఇర్ఫాన్‌గారు అత్యద్భుతమైన నటులు. సినిమా ఇండస్ట్రీ ఈ లెజెండ్ ను కచ్చితంగా మిస్ అవుతుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. – రామ్ చరణ్ ► మన దేశంలోనే ఉన్న గొప్ప నటుల్లో ఇర్ఫాన్ గారు ఒకరు. ఆయన చనిపోయారనే వార్త వింటుంటే చాలా బాధగా ఉంది. ఎన్నో మర్చిపోలేని పాత్రలను పోషించారాయన. ï్రÜ్కన్ మీద ఆయన్ను మిస్ అయినా, ఆయన సినిమాల ద్వారా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. – విష్ణు మంచు ► చాలా బాధగా ఉంది. చాలా త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయావు ఇర్ఫాన్. ప్రపంచ కళా రంగానికి నువ్వు చేసిన కృషికి ధన్యవాదాలు. – ప్రకాష్ రాజ్ ► మీరు (ఇర్ఫాన్ ఖాన్) ఇంటర్నేషనల్ స్టార్. ఒక లెజెండ్. గొప్ప ప్రతిభావంతులు. మీతో కలిసి ‘కర్వాన్’ సినిమాలో నటించడాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు అందరినీ సమానంగా చూశారు. మీ కుటుంబసభ్యులుగా భావించారు. ఒక అభిమానిగా, ఒక విద్యార్థిగా ఆ క్షణాలను నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మీ నవ్వును నేను మర్చిపోలేను. మీరు లేరన్న వార్తను భరించలేకపోతున్నాను. – దుల్కర్ సల్మాన్ ► ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందారన్న దుర్వార్త నన్నెంతగానో కలచివేసింది. ఇండస్ట్రీకి ఇర్ఫాన్ లేని లోటు తీరనిది. అద్భుతమైన నటుడు. ప్రపంచ సినిమాకు తన వంతు సేవ చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మనల్ని చాలా తొందరగా వదిలి వెళ్లిపోయాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. – అమితాబ్ బచ్చన్ ► నా సహచర నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. చాలా బాధగా ఉంది. ప్రతిభావంతుడు. తన నటనతో ఆయన మనందరికీ ఎప్పుడూ గుర్తుంటారు. ప్రేమతో మిమ్మల్ని (ఇర్ఫాన్ ఖాన్) గుర్తుపెట్టుకుంటాం. – ఆమిర్‌ఖాన్ ► ఈ కాలంలోనే గొప్ప నటుడు, నా ప్రేరణ, నా మిత్రుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం నన్ను ఎంతో బాధించింది. మీరు కనబర్చిన అద్భుత నటనతో మా జీవితాల్లో ఎప్పటికీ మీరు (ఇర్ఫాన్ ఖాన్) భాగమయ్యే ఉంటారు. – షారుక్ ఖాన్ ► ఇర్ఫాన్ ఇక లేరన్నది ఫిల్మ్ ఇండస్ట్రీకి తీరని లోటు. అతని కుటుంబం, అభిమానులకు కూడా. మనందరి హృదయాల్లో ఇర్ఫాన్ ఎప్పటికీ బతికే ఉంటారు – సల్మాన్ ఖాన్ ► ఇర్ఫాన్గారితో నేను ఎక్కువ సందర్భాల్లో మాట్లాడి ఉండకపోవచ్చు. కానీ ఈ ట్వీట్ టైప్ చేసేప్పుడు నా కళ్లు కన్నీటితో నిండిపోయాయి. అరుదైన మానవతావాది. మిమ్మల్ని (ఇర్ఫాన్) చాలా మిస్ అవుతున్నాను. అవుతున్నాను. – హృతిక్ రోషన్ ► ఇర్ఫాన్ మరణించారన్న వార్త విని చాలా కలత చెందాను. మా తరంలోనే చాలా గొప్ప నటుడు. ఈ కష్టకాలంలో ఆ దేవుడు అతని కుంటుంబానికి తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను – అక్షయ్ కుమార్ ► గొప్ప నటుడిని మనం కోల్పోయాం. ఇర్ఫాన్ చివరి వరకు పోరాడుతూనే ఉన్నాడు. ఆయన్ను చాలా మిస్ అవుతాం. ఇర్ఫాన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – బోనీకపూర్ ► ఇర్ఫాన్ నా ప్రియమైన స్నేహితుడు. జీవితంతో ఇర్ఫాన్ పోరాడిన తీరుకు ఆయన స్నేహితుడిగా నేను గర్వపడుతున్నాను. ఇర్ఫాన్‌కు నా సెల్యూట్ – సుజిత్ సర్కార్ ► మీ (ఇర్ఫాన్‌ఖాన్) శకాన్ని ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. నా స్నేహితుడు ఇర్ఫాన్ జీవితంతో ఓ యోధుడిలా పోరాడారు. – ప్రియాంకా చోప్రా ► మీతో (ఇర్ఫాన్) నాకు అంతగా పరిచయం లేదు. కానీ నా శోకాన్ని ఆపుకోలేకపోతున్నాను.. ఎందుకంటే మీ నటన నా వృత్తి జీవితంపై చూపిన ప్రభావం అలాంటిది. నటనలో మీరు చేసిన మ్యాజిక్ మిమ్మల్ని మాకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది. – విద్యాబాలన్ ► నా ప్రియమిత్రుడు ఇర్ఫాన్‌ఖాన్ మరణం నన్ను బాధించింది. ఇర్ఫాన్ ప్రతిభా వంతుడు, నిజాయితీపరుడు, ధైర్యవంతుడు. – ఐశ్వర్యారాయ్ ► ఈ రోజు(బుధవారం) చాలా ధుర్ధినం. స్వయంకృషితో బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి లీడ్ యాక్టర్‌గా ఆస్కార్ స్థాయి నటన కనబరచారు. – కంగనా రనౌత్ ► ఇర్ఫాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నా హృదయం బద్దలైపోయింది. – దీపికా పదుకోన్ ► ఇర్ఫాన్గారితో కలిసి పనిచేయడాన్ని ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. – కరీనా కపూర్ ► నాలో ఆత్మవిశ్వాసం తగ్గిన సమయంలో మీరు నాకు చెప్పిన మాటలు నాలో ఎంత ధైర్యాన్ని నింపాయో మాటల్లో చెప్పలేను ఇర్ఫాన్ సర్. ఇకపై మీరు లేరన్న విషయం నన్ను ఎంతగానో బాధిస్తోంది – సోనమ్ కపూర్ ► ఇర్ఫాన్‌గారు వెండితెర ఇంద్రజాలికులు. మాలాంటి వారికి స్ఫూర్తి. ఆయనతో కలిసి నటించడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. – శ్రద్ధాకపూర్ ► నాకు తెలిసిన స్ట్రాంగెస్ ్టపీపుల్లో ఇర్ఫాన్‌గారు ఒకరు. ఆయన ఒక ఫైటర్. ఇర్ఫాన్‌గారు నటించిన కాలంలోనే మా జర్నీ కూడా సాగిందని గర్వంగా చెప్పుకుంటాం. – రాధికా మాధన్ (‘అంగ్రేజీ మీడియం’ సినిమాకు ఇర్ఫాన్ కో స్టార్) ► ఇర్ఫాన్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. బాధలోనూ సానుకూలంగా ఆలోచించగల వ్యక్తి. చివరిసారిగా మేం కలిసినప్పుడు మానవాళి ఉనికికి సంబంధించిన విషయాలను చర్చించుకున్నాం. – కొలిన్ (జురాసిక్ వరల్డ్ 2015 డైరెక్టర్) వీరితో పాటు మహేశ్ భట్, అలీ అబ్బాస్ జాఫర్, అనురాగ్ బసు, అర్జున్‌కపూర్, ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావు, కార్తీక్ ఆర్యన్ వంటి సినీ ప్రముఖులు ఇర్ఫాన్‌ఖాన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. -
పోరాడి పోరాడి మరణించాడు
అతని కోసం హాలీవుడ్ దర్శకులు పాత్రలు రాశారు. అతన్ని ప్రశంసించడానికి ఆస్కార్ స్థాయి నటీనటులు క్యూలలో వేచి చూశారు. భారతదేశంలో పెద్ద హీరోల సినిమాలకు ఎంత కలెక్షన్ వస్తుందో అతనికీ అంతే వస్తుంది. కొన్ని సినిమాలు అతను నటించడం వల్ల ఇలా కూడా బాగున్నాయే అనిపించింది. ఇర్ఫాన్ ఖాన్ జీవితానికి దగ్గరగా ఉన్న నటుడు. జీవితం అంత అందమైన నటుడు. జీవితంలో మృత్యువు ఒక భాగం అయినప్పుడు ఆ మృత్యువుకు తల వొంచుతాను అని అనుకున్నాడు. అతను పలికిన వీడ్కోలు కొన్ని జ్ఞాపకాలపాటు మనల్ని తప్పక వెంటాడుతుంది. జైపూర్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు ‘టోంక్’లో బతికి చెడ్డ నవాబుల కుటుంబంలో పుట్టి పెరిగిన ఇర్ఫాన్‌ఖాన్ అక్కడి నుంచి ఢిల్లీ దాకా వెళ్లి ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో నటన నేర్చుకోవాలనుకున్నప్పుడు అతని తల్లి అడిగింది– ‘ఏమిటి... ఇక నువ్వు గట్లమ్మట పుట్లమ్మట ఆడుతూ పాడుతూ కనిపించే పనే చేస్తావా?’ అని. ఎందుకంటే అప్పటివరకూ వాళ్ల కుటుంబాలలో నటన పేరు ఎత్తినవారు లేరు. సినిమాలు పెద్దగా చూసినవారూ లేరు. ఒకవేళ చూసినా హీరో అంటే పార్కుల్లో పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ కనిపించేవాడనేదే అభిప్రాయం. తల్లికి ఇర్ఫాన్ మాటిచ్చాడు– ‘అమ్మా... నేను ఆడటం పాడటంతో పాటు ఇంకా మంచి పని కూడా చేస్తాను. నువ్వు నన్ను చూసి సిగ్గుపడేలా చేయను’. ఇర్ఫాన్ ఖాన్ తన మాట నిలబెట్టుకున్నాడు. తన పూర్తి కెరీర్లో ఎప్పుడూ స్టెప్పులేస్తూ పాటలు పాడుతూ కనిపించలేదు. నటన చేస్తూ కనిపించాడు. నటన కూడా మాటతో కాకుండా ముఖంతో ఎక్కువ చేస్తూ కనిపించాడు. ముఖం కన్నా కళ్లతో ఇంకా ఎక్కువ చేస్తూ కనిపించాడు. ప్రేక్షకుడి చెవి కంటే కంటికి ఎక్కువ దృష్టి కల్పించబట్టే ఇర్ఫాన్ ఖాన్ ఈ దేశంలో ఎంతో ముఖ్యమైన నటుడు అయ్యాడు. బయటి దేశాలలో కూడా ముఖ్యమైన నటుడు అనిపించుకున్నాడు. వెస్ ఆండర్సన్ వంటి ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు, మైఖేల్ వింటర్బాటమ్ వంటి ప్రసిద్ధ బ్రిటిష్ దర్శకుడు కేవలం ఇర్ఫాన్ నటించడం కోసం తమ సినిమాల్లో ఏదో ఒక పాత్ర అయినా రాశారు. ‘లైఫ్ ఆఫ్ పై’లో నటించి మహామహులు ఒకసారి కలిస్తే చాలనుకునే చైనిస్ దర్శకుడు ఆంగ్ లీని మెప్పించాడు ఇర్ఫాన్. ‘జురాసిక్ వరల్డ్’ వంటి బ్లాక్‌బస్టర్‌లో చోటు సంపాదించి ప్రపంచమంతా సాధించిన కలెక్షన్లకు తన వంతు ప్రతిభ జోడించాడు. టామ్ హ్యాంక్స్ గొప్ప నటుడు. అతడికి సరిజోడుగా నటించి ‘ఇన్ఫెర్నో’ లో కాలర్ ఎగురవేయగలిగాడు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ అతడి కెరీర్‌ని మరింత విస్తృతపరిచింది. భారతదేశంలో చాలామంది గొప్ప నటులు ఉన్నారు. కాని ప్రపంచ దృష్టికి వెళ్లినవారు బహు కొద్ది. ఇర్ఫాన్ ఖాన్ ఆ వెలితి చెరిపేసి భారతీయులూ గొప్పగా నటించగలరు అని బాహ్య ప్రపంచానికి నిరూపించగలిగాడు. భారతదేశం అంటే గంగ, యమున, తాజ్‌మహల్... ఇర్ఫాన్ కూడా. చదవండి: ఇర్ఫాన్ మృతిపై స్పందించిన యువీ కష్టాల ప్రయాణం అయితే ఈ ప్రయాణం అంత సులువు కాదు. ఘన విజయాల వెనుక చేదు చీకట్లు, మసక వెలుతురులు మాత్రమే ఉంటాయి. ఇంటర్ చదివే సమయంలో హిందీ సినిమాలలో మిథున్ చక్రవర్తి అంటే క్రేజ్ ఉండేది. ఇర్ఫాన్ ఖాన్ మిథున్ చక్రవర్తి పోలికలతో ఉండటంతో స్నేహితులందరూ అతణ్ణి సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించారు. అప్పటికి అతను క్రికెట్లో మంచి ప్రతిభ ఉన్న ఆటగాడు. రంజి స్థాయికి చేరుకున్నాడు కూడా. కాని నటన కోసం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరాడు. అయితే యాక్టింగ్ కోర్సు పూర్తయ్యాక ముంబై చేరుకున్న ఇర్ఫాన్ ఖాన్‌కు అవకాశాలు ఏమీ రాలేదు. ‘సలామ్ బాంబే’ (1998)లో ఒక చిన్న పాత్ర దొరికింది కాని ఎడిటింగ్‌లో దర్శకురాలు మీరా నాయర్ దానిని కత్తిరించేసింది. ఆల్బమ్స్ పట్టుకుని నిర్మాతలు దగ్గరకు వెళితే ఇర్ఫాన్ ధోరణి, నటనా పద్ధతి ఆ కాలానికి అర్థం కాక తిరస్కారాలు ఎదురయ్యేవి. దాంతో చాలాకాలం టీవీ సీరియల్స్ చేస్తూ పొట్టపోసుకున్నాడు ఇర్ఫాన్. ఒక దశలో తీవ్రమైన డిప్రెషన్‌కు వెళ్లి మానసిక చికిత్స కూడా తీసుకోవాల్సి వచ్చింది. అయితే ‘చంద్రకాంత’, ‘బనేగి అప్నీ బాత్’ వంటి సీరియల్స్ అతనికి పేరు తెచ్చాయి. స్టార్ ప్లస్‌లో హోస్ట్‌గా చేసిన షోస్ హిట్ అయ్యాయి. 2001లో ఆసిఫ్ కపాడియా అని బ్రిటిష్ దర్శకుడు ఒక రాజస్థాన్ కత్తియోధుడి జీవితాన్ని ‘ది వారియర్’గా తీయడంతో మొదటిసారి అంతర్జాతీయ ప్రేక్షకులకు ఇర్ఫాన్ పరిచయమయ్యాడు. ‘మేక్బెత్’ ఆధారంగా విశాల్ భరద్వాజ్ తీసిన ‘మక్బూల్’ (2003)లో లీడ్‌రోల్ చేసి నేనొచ్చాను అని భారతీయ ప్రేక్షకులకు హెచ్చరిక చేశాడు. ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’ (2007)తో అతనికి ‘స్టార్డమ్’ వచ్చింది. భార్య సుతప, కుమారులు బాబిల్, అయాన్లతో ఇర్ఫాన్ అద్భుతమైన ప్రతిభ ఇర్ఫాన్ ఖాన్ కేవలం మేకప్ వేసుకున్నాకే పాత్ర కోసం ఆలోచించే నటుడు ఎంత మాత్రం కాదు. విపరీతంగా హోమ్‌వర్క్ చేస్తాడు. సిద్ధమవుతాడు. గతంలో ఎవరైతే చిన్న పాత్ర ఇచ్చి కత్తిరించేసిందో ఆ మీరా నాయరే జుంపా లాహిరి నవల ఆధారంగా ‘నేమ్‌సేక్’ (2007) సినిమా తీయాలనుకున్నప్పుడు లీడ్ రోల్ ఇర్ఫాన్కే ఇచ్చింది. అమెరికాకు వెళ్లిన తొలితరం బెంగాలీ జంట తన పిల్లలు భారతీయ–అమెరికా మిశ్రమ సంస్కృతితో ఎలా సంఘర్షణ పడ్డారనేది ఈ కథ. ఇందులో బెంగాలీ పాత్రను పోషించడానికి ఇర్ఫాన్ దాదాపుగా బెంగాలీ నేర్చుకున్నాడు. ఎంతగా నేర్చుకున్నాడంటే అతడు పలికిస్తున్న యాస మరీ లోతుగా ఉందని తేలిక పర్చడానికి దర్శకురాలు అవస్థ పడాల్సి వచ్చింది. ‘నేమ్‌సేక్’ ఇర్ఫాన్‌కు అమెరికాలో మంచి పేరు తెచ్చింది. ఆ పేరు వల్ల అతనికి ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’, ‘అమేజింగ్ స్పైడర్‌మేన్’, ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమాలు వరుస కట్టాయి. ఇక బాలీవుడ్లో అతడు సోలో హీరోగా సినిమాలు చేయడానికి ‘బిల్లు’ (2009) దారి వేసినా ‘పాన్‌సింగ్ తోమార్’ (2012) జాతీయ ఉత్తమ నటుడు అవార్డుతో పాటు ఆకాశానికెత్తింది. ‘లంచ్ బాక్స్’, ‘పికూ’, ‘మదారి’, ‘కరీబ్ కరీబ్ సింగిల్’... ఈ సినిమాలన్నీ థియేటర్ల వద్ద కాకపోయినా అభిమానుల గుండెల్లో కటౌట్ సైజ్‌ను పెంచుకుంటూ పోయాయి. 14 కోట్లతో తీసిన ‘హిందీ మీడియమ్’ సినిమా 300 కోట్ల కలెక్షన్లు సాధించి ఈ ఖాన్ కూడా ఏ ఖాన్లకు తక్కువ కాదని నిరూపించింది. పెద్దవారూ సమ ఉజ్జీలే ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘నేమ్‌సేక్’ చూసి షర్మిలా టాగోర్ ‘నిన్ను కన్నందుకు మీ అమ్మానాన్నలకు థ్యాంక్స్ చెప్పాలి’ అంది. షబానా ఆజ్మీ ఇర్ఫాన్ నటనకు ఫిదా అయిపోయింది. ఏంజలీనా జోలీ, జూలియా రాబర్ట్స్ అతని నటనకు బాహాటంగా తమ అభిమానం వ్యక్తపరిచారు. ఇర్ఫాన్ తన కెరీర్లో గొప్ప గొప్ప నటులతో కలిసి నటించాడు. అమితాబ్ బచ్చన్, పంకజ్ కపూర్, నసీరుద్దిన్ షా, ఓంపురి, షారూక్ ఖాన్, టబు, అనుపమ్‌ఖేర్ తదితరులు ఉన్నారు. అమితాబ్‌తో కలిసి ‘పికూ’లో అతడు చేసిన నటన అమితాబ్‌ను ముగ్ధుణ్ణి చేసేలా చేసింది. ఇర్ఫాన్‌తో పోటీ పడేలా చేసింది. ఇర్ఫాన్ వ్యక్తిగా, నటుడిగా అందరికీ ఆత్మీయుడైపోయాడు. కెరీర్లో ఇంకెన్నో ఎత్తులు చూస్తాడని అందరూ ఆశిస్తున్న సమయం. కాని హఠాత్తుగా పేకప్ చెప్పేశాడు. ఇర్ఫాన్ మరణాన్ని విని నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ ‘అవర్ లాస్, హెవెన్స్ గెయిన్’ అని ట్వీట్ చేశాడు. తమ వద్దకు ఇర్ఫాన్ చేరుకున్నందుకు స్వర్గం మిడిసిపడుతుండవచ్చు. కాని ఇంత అర్థం లేని స్క్రిప్ట్ రాసి అతణ్ణి తన వద్దకు తెచ్చుకున్నవారు అక్కడ గొప్ప స్క్రిప్టు ఇస్తారని ఏ కోశానా ఆశించలేము. వందలాది నటీనటులు అతని స్ఫూర్తితో దీప్తినొంది భూలోకాన అతడి కీర్తికి చిరంజీవిత్వం తెస్తారనేది తథ్యం. చదవండి: ఇర్ఫాన్ కాల్ కోసం ఎదురు చూస్తా – సాక్షి ఫ్యామిలీ పోరాడి పోరాడి మరణించాడు సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (53) బుధవారం ఉదయం ముంబైలో మరణించాడు. గత రెండేళ్లుగా బ్రెయిన్ కేన్సర్‌తో పోరాడుతూ, లండన్‌లో వైద్యం తీసుకోవడం ద్వారా కోలుకొని భారత్‌కు వచ్చిన ఇర్ఫాన్ ఖాన్ పేగు సంబంధిత ఇన్ఫెక్షన్ వల్ల మంగళవారం కోకిలాబెన్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఐ.సి.యులో ఉంచి వైద్యం జరుగుతుండగా బుధవారం ఉదయం మరణించాడని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఆయనకు భార్య సుతాప, ఇద్దరు కుమారులు బాబిల్, అయాన్ ఉన్నారు. సుతాప అతని సహ విద్యార్థిని. ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో యాక్టింగ్ నేర్చుకుంటూ ఉండగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇర్ఫాన్ ఖాన్ బాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్, బ్రిటిష్ సినిమాలలో నటించాడు. బంగ్లాదేశ్, ఫ్రాన్స్ దేశాలు కూడా అతనితో చెరి ఒక సినిమా నిర్మించాయి. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’, ‘లైఫ్ ఆఫ్ పై’, ‘జురాసిక్ వరల్డ్’ సినిమాలు, ‘ఇన్ ట్రీట్మెంట్’ వంటి టివి సిరీస్ అతణ్ణి దేశదేశాల ప్రేక్షకులకు చేరువ చేశాయి. 2007లో అనురాగ్ బాసు తీసిన ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’తో ఇర్ఫాన్ స్టార్డమ్లోకి వచ్చాడు. ఆ తర్వాత పెద్ద హీరోలు హీరోయిన్లు అతడితో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చారు. అతడి చివరి సినిమా ‘అంగ్రేజీ మీడియమ్’ లాక్‌డౌన్‌కు ముందురోజు విడుదలయ్యి సినిమాహాళ్ల మూత కారణాన ఎక్కువమందికి చేరలేదు. ప్రస్తుతం ఆ సినిమా ‘డిస్నీహాట్‌స్టార్’లో స్ట్రీమ్ అవుతూ ఉంది. 2018 ఫిబ్రవరిలో ఇర్ఫాన్‌ఖాన్ అస్వస్థత వార్త ప్రపంచానికి తెలిసింది. మార్చిలో అతనికి ‘న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్’ (బ్రెయిన్ కేన్సర్) అని చెప్పారు. వైద్యం కోసం లండన్ వెళ్లిన ఇర్ఫాన్ సినిమా ప్రపంచంతో దాదాపు దూరంగా ఉంటూ వైద్యానికి సహకరించాడు. షారూక్ ఖాన్ అతడి కోసం లండన్‌లోని తన ఇల్లు ఇచ్చి సాయపడ్డాడు. అతను కోలుకోవడం గురించి పెద్దగా వార్తలు బయటకు రాకపోయినా ఇటీవల ‘అంగ్రేజీ మీడియమ్’లో నటించడంతో అంతా బాగున్నట్టేనని అభిమానులు ఆనందించారు. ఇంతలోనే అతడి మరణవార్త శరాఘాతంలా తాకింది. చదవండి: ఇర్ఫాన్, సుతాప అపూర్వ ప్రేమకథ దర్శకుడు సూజిత్ సర్కార్ ఇర్ఫాన్‌ఖాన్‌కు దగ్గరి మిత్రుడు. ఇర్ఫాన్ ఖాన్ మరణవార్తను అతడు లోకానికి తెలియచేస్తూ ‘ఇర్ఫాన్ నువ్వు పోరాడి పోరాడి పోరాడి మరణించావు. సుతాప (ఇర్ఫాన్ భార్య) నువ్వు చేయవలసిందంతా చేశావు’ అని ట్వీటర్లో రాశాడు. అనారోగ్యంతో పోరాడుతూ మృత్యువును ఆమడదూరంలో గమనిస్తున్న ఇర్ఫాన్ ‘జీవితపు అసలు రుచి ఇప్పుడు చూస్తున్నాను’ అన్నట్టుగా పేర్కొన్నారు. ‘లైఫ్ ఆఫ్ పై’లో ఇర్ఫాన్ ధరించిన పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో ఒక చిన్న పడవలో సముద్రం మధ్యన చిక్కుకుంటుంది. పైగా ఆ పడవలో పులి కూడా ఉంటుంది. అయినప్పటికీ ఆ పాత్ర బతికి బట్టకడుతుంది. కాని నిజ జీవితంలో కేన్సర్ అనే పెద్దపులి ఇర్ఫాన్‌ను కోరలు దింపి కబళించడం మాత్రం అభిమానులకు బాధాకరం. సినీ జగత్తుకు విషాదం. కాగా, ఇర్ఫాన్ ఖాన్ అంత్యక్రియలు బుధవారం ముంబైలో ముగిశాయి. కరోనా లాక్డౌన్ కారణంగా కేవలం 20 మంది కుటుంబ సభ్యులు, మిత్రులను మాత్రమే అనుమతించారు. -
‘సోనంను ఆయన బాగా చూసుకునేవారు’
ముంబై : విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తీవ్ర విచారం వెలిబుచ్చారు. థ్యాంక్యూ మూవీలో కలిసి పనిచేసే సందర్భంలో తన కుమార్తె సోనం కపూర్‌ను ఆయన జాగ్రత్తగా చూసుకున్నారని కొనియాడారు. ఇర్ఫాన్ మరణ వార్త తనను కలించివేసిందని, ఆయన విలక్షణ నటుడని, గొప్పమానవతావాది అని ప్రస్తుతించారు. తన కుమార్తె సోనంను ఆయన చూసకున్న తీరు, మార్గదర్శకంగా వ్యవహరించిన వైనం మరిచిపోలేనిదని అన్నారు. ఇర్ఫాన్ ప్రతిఒక్కరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని అనిల్ కపూర్ వ్యాఖ్యానించారు. 2011లో సోనం కపూర్, ఇర్ఫాన్‌లు థ్యాంక్యూ మూవీ కోసం కలిసిపనిచేశారు. ఇక అనిల్ కపూర్ ఇర్ఫాన్ ఖాన్లు స్లమ్‌డాగ్ మిలియనీర్, డీ-డే, చాకొలెట్ : డీప్ డార్క్ సీక్రెట్స్ వంటి పలు సినిమాల్లో కలిసి నటించారు. కాగా, ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో ముంబై కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చదవండి : పోరాడే శక్తినిచ్చిన ప్రయాణం ఇది -
ఇర్ఫాన్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ మరణం సినిమా, నాటక రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన మరణం భారతీయ సినిమాకే కాకుండా ప్రపంచ సినీ రంగానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. ఇర్ఫాన్ తన నటనతో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నారని అన్నారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో పెద్దపేగు సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన మరణించారు. చిన్న వయసులోనే బాలీవుడ్ విలక్షణ నటుడు మరణించడం బాధాకరమని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇర్ఫాన్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. చదవండి : ఇర్ఫాన్ మరణం.. మహేశ్ సంతాపం -
ఇర్ఫాన్ మరణం.. మహేశ్ సంతాపం
ముంబై : బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక తెలివైన నటుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నానని మహేశ్ ట్వీట్ చేశారు. కాగా,ఇర్ఫాన్, మహేష్ కలిసి సైనికుడు చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. (చదవండి : ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత) Deeply saddened by the news of #IrrfanKhan's untimely demise. A brilliant actor gone too soon. He will be truly missed... My heartfelt condolences to his family and loved ones. RIP 🙏🏻 — Mahesh Babu (@urstrulyMahesh) April 29, 2020 ‘ఇర్ఫాన్ ఖాన్ మృతి నన్ను షాక్‌కి గురి చేసింది. మా కాలంలోని అసాధారణమైన నటులలో ఆయన ఒకరు. ఆయన సినిమాలు, నటన ఎల్లకాలం గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. Shocked to hear of the demise of Irrfan Khan, one of the most exceptional actors of our time. May his work always be remembered and his soul rest in peace — Arvind Kejriwal (@ArvindKejriwal) April 29, 2020 ‘నేటి తరంలో చెప్పుకోతగ్గ నటుడైన ఇర్ఫాన్ మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది నన్ను షాక్ నకు గురి చేసింది. ఆయన కుటుంబానికి ఈ సమయంలో తట్టుకుని నిలిచే బలాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి" రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ‘ఇర్ఫాన్ ఖాన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన మరణవార్త విని చలించిపోయాను. ఆయన కుటుంబీకులకు, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను... ఓమ్ శాంతి’ అని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ ట్వీట్ చేశారు. నా ప్రియమైన స్నేహితుడు ఇర్ఫాన్. మీరు పోరాడారు, పోరాడారు, పోరాడారు. నేను మీ గురించి ఎప్పుడూ గర్వపడతాను .. మళ్ళీ మనం కలుద్దాం .. సుతాపా మరియు బాబిల్ కు సంతాపం .. మీరు కూడా పోరాడారు, సుతాపా మీరు ఈ పోరాటంలో సాధ్యమైనవన్నీ ఇచ్చారు. శాంతి మరియు ఓం శాంతి. ఇర్ఫాన్ ఖాన్‌కి వందనం’అని ప్రముఖ డైరెక్టర్, నిర్మాత సూజిత్ సర్కార్ ట్వీట్ చేశారు. -
బాలీవుడ్ నటుడి తల్లి కన్నుమూత
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం(95) శనివారం ఉదయం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. కాగా నవాబుల కుటుంబానికి చెందిన ఆమె జైపూర్‌లోని బెనివల్‌కంత కృష్ణ కాలనీలో నివసిస్తున్నారు. మరోవైపు ఇర్ఫాన్ ఖాన్ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా అతను తల్లి అంత్యక్రియలకు వెళ్లలేకపోయాడు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లిని కడసారి కళ్లారా చూసుకొని నివాళులు అర్పించాడు. (వీల్‌చైర్‌లో నటుడు.. ముఖం దాచుకొని..!) ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుండగా రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఇర్ఫాన్ ఈ మధ్యే కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఆయన ప్రధాన పాత్రలో నటించిన "ఆంగ్రేజీ మీడియం" ఇటీవలే విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఇందులో కరీనా కపూర్, రాధినా మదన్, డింపుల్ కపాడియా, కికూ శారద, రణ్వీర్ షోరే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. (క్యాన్సర్ కదా.. అందుకే: ఇర్ఫాన్ ఖాన్ భావోద్వేగం!) -
పోరాడే శక్తినిచ్చిన ప్రయాణం ఇది
‘‘నా కోసం ఇంత ప్రేమను, ఇన్ని ప్రార్థనలను, ఇన్ని శుభాకాంక్షలను అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నేను, నా కుటుంబం మీ ప్రేమకు రుణపడి ఉంటాం’’ అని ఇర్ఫాన్ ఖాన్ అన్నారు. న్యూరో ఎండోక్రైన్ డిజార్డర్‌తో ఇర్ఫాన్ బాధపడిన సంగతి తెలిసిందే. లండన్‌లో ట్రీట్మెంట్ తీసుకుని ఇండి యా తిరిగొచ్చి, మళ్లీ సినిమాలు చేస్తున్నారాయన. తాను తిరిగి రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలంటూ ప్రేమతో ఓ లేఖ రాశారు. ‘‘క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి గడిచిన కొన్ని నెలల ప్రయాణంలో సాగింది. ఈ ప్రయాణంలో మళ్లీ జీవితంతో తిరిగి పోరాటం చేసే శక్తిని, రియల్, రీల్ లైఫ్‌ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని తిరిగి తెచ్చుకున్నాను. నా జర్నీని అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారని నాకు తెలుస్తూనే ఉంది. కానీ ఈ ప్రయాణాన్ని నేనే ఇంకా అర్థం చేసుకుంటూనే ఉన్నాను. ఈ జర్నీ తాలూకు బాధను నా పనితో నయం చేయాలనుకుంటున్నాను. నా జర్నీని మీరు గౌరవించి నేను నయం కావడానికి నాకు సమయం ఇచ్చారు. మీ ఓపికకు, ఓదార్పుకు థ్యాంక్స్. నా లైఫ్‌ని ఎప్పటికప్పుడు భూమి నుంచి ఆకాశం వరకూ విస్తరింపజేసుకోవాలని కోరుకునే వ్యక్తిని నేను. ఆకాశంలో కూడా విస్తరించగలనో లేదో నాకు తెలియదు కానీ ప్రయత్నమైతే చేస్తాను. చేస్తూనే ఉంటాను’’ అంటూ ‘నాకింకా తెలియదు నేను గద్దనో, తుఫానునో, ఇంకా పూర్తి కాని పాటనో’ (‘వైడనింగ్ సర్కిల్స్’ అనే కవిత నుంచి తీసుకున్న వాక్యాలు)’’ అని పేర్కొన్నారు ఇర్ఫాన్‌ఖాన్. -
డ్యూటీకి వేళాయె
‘హిందీ మీడియం’ (2017) సీక్వెల్ ‘అంగ్రేజీ మీడియం’ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాకీ డ్రెస్ వేసి లాఠీ పట్టుకున్న సంగతి తెలిసిందే. ఆఫీసర్‌గా కరీనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లే టైమ్ దగ్గరైంది. ఈ నెల 15న ఆమె ముంబైలో చార్జ్ తీసుకోనున్నారని తెలిసింది. కెరీర్లో తొలిసారి పోలీస్ పాత్ర చేస్తున్నారు కరీనా కపూర్. ‘అంగ్రేజీ మీడియం’ చిత్రానికి హోమి ఆదజానియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇర్ఫాన్‌ఖాన్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. అయితే కథ పరంగా ఇర్ఫాన్‌కు కరీనా జోడీగా నటించడం లేదని తెలిసింది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మొదలైంది. ఆ తర్వాత ముంబైలో ఓ వారం రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేసి, ఆ తర్వాత షూటింగ్ షెడ్యూల్ కోసం లండన్ ఫ్లైట్ ఎక్కుతారట ఈ టీమ్. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. -
మళ్లీ మీ ముందుకు వస్తున్నా
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ తిరిగి ముంబై చేరుకున్నారు. న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ కారణంగా ఆయన కొంతకాలంగా అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిగా లండన్‌లో చికిత్స తీసుకుంటున్న ఇర్ఫాన్ ఆరోగ్యం బాగా మెరుగుపడిందట. ఈ సందర్భంగా ఆయన ఓ భావోద్వేగభరితమైన పోస్ట్‌ను ట్వీటర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘‘బహుశా జీవితంలో గెలవాలనే తాపత్రయంలో మనల్ని ప్రేమిస్తున్న, అభిమానిస్తున్న వారిని గుర్తుపెట్టుకోం. మనం జీవితంలో అసహాయులమైనప్పుడు వారందరూ జ్ఞప్తికి వస్తారు. సాగిపోతున్న నా ఈ జీవితంలో ఒక్క క్షణం ఆగి నన్ను ప్రేమిస్తున్న, అభిమానిస్తున్న వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ప్రేమ, అభిమానమే నన్ను కోలుకునేలా చేశాయి. మళ్లీ మీ ముందుకు రాబోతున్నాను’’ అని ఇర్ఫాన్‌ఖాన్ పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... హిందీ మూవీ ‘హిందీ మీడియం’ (2017) సీక్వెల్లో ఇర్ఫాన్ నటించబోతున్నారన్న వార్తలు బీటౌన్‌లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
‘మీ ప్రేమే నాకు ఉపశమనం కల్గించింది’
గత కొంతకాలంగా ఎండోక్రైన్ క్యాన్సర్ చికిత్స నిమిత్తం విదేశాల్లో ఉన్న బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇండియాకు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఇర్ఫాన్ చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ‘గెలుపు ముసుగులో ఒక్కోసారి ప్రేమించబడటం అనే విషయం మనకు పెద్దదిగా తోచదు.. దాన్ని పట్టించుకోం..మర్చిపోతుంటాం. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ విషయం గుర్తుకు వస్తుంది. అందుకే నేను వెనక్కి రావాలనుకుంటున్నాను. మీ అపారమైన ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలపడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా అనారోగ్యాన్ని నయం చేసుకునే క్రమంలో మీ ప్రేమ, మద్దతు నాకు ఉపశమనాన్ని కల్గించాయి. మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలపడానికి మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను’ అంటూ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు ఇర్ఫాన్. pic.twitter.com/d4Osol3NvP — Irrfan (@irrfank) April 3, 2019 ఇర్ఫాన్ ఖాన్ నిన్ననే ఇండియా వచ్చారు. త్వరలోనే ఆయన ‘హిందీ మీడియం’ సీక్వేల్లో నటిస్తారని సమాచారం. ఎండోక్రైన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్ చికిత్స నిమిత్తం లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. (చదవండి : నా స్టేషన్ ఇది కాదే!) -
ఇర్ఫాన్ రిటర్న్స్
న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్. దానికోసం ఆయన లండన్‌లో చికిత్స కూడా పొందుతున్నారు. అయితే ఆయన దీపావళికి ఇండియా తిరిగి రానున్నారనే వార్త షికారు చేస్తోంది. తిరిగి రాగానే ‘హిందీ మీడియం’ సీక్వెల్ ‘హిందీ మీడియం 2’ షూట్లో పాల్గొంటారని బాలీవుడ్లో చెప్పుకుంటున్నారు. తొలి భాగంలో ఆయనే నటించారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇర్ఫాన్ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ఖండించాయి. ‘‘డిసెంబర్ నుంచి ఇర్ఫాన్ మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొంటాడన్నది అవాస్తవం. కానీ దీపావళి తర్వాత ఇర్ఫాన్ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారట. తిరిగి వచ్చేస్తున్నారంటే ఇర్ఫాన్ ఆరోగ్యం మెరుగుపడినట్టే అని ఆయన అభిమానులు, సన్నిహితులు సంతోషపడుతున్నారు. -
టెన్షన్ లేదు!
‘పద్మావత్’ సినిమా రిలీజ్ అయి పది నెలలు కావస్తున్నా ఇంకా ముఖానికి మేకప్ వేసుకోలేదు దీపికా పదుకోన్. విశాల్ భరద్వాజ్ సినిమాలో యాక్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యం కారణంతో ఆ సినిమా ఆగిపోయింది. మేఘన్ గుల్జర్ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రారంభం అవుతుందట. ఇప్పుడు మరో సినిమాకు దీపిక ‘యస్’ చెప్పినట్టు సమాచారం. లవ్ రంజన్ దర్శకత్వంలో అజయ్ దేవగన్, రణ్‌బీర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న ఓ చిత్రంలో రణ్‌బీర్‌తో కలసి యాక్ట్ చేయనున్నారట. ఆల్రెడీ ఈ ఇద్దరూ ‘బచ్నా ఏ హసీనో, ఏ జవానీ హే దివానీ, తమాషా’ సినిమాల్లో కలసి నటించిన సంగతి తెలిసిందే. రణ్వీర్తో పెళ్లి తర్వాత దీపిక సెట్లోకి అడుగుపెట్టబోయేది ఈ సినిమానే అట. ఇది వరకు రణ్‌బీర్, దీపిక ప్రేమలో పడి విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ సంగతలా ఉంచితే రణ్వీర్, దీపికల పెళ్లి నవంబర్ లేక రానున్న జనవరిలో ఉంటుందట. ప్రస్తుతానికి దీపిక ఖాళీగా ఉన్నారు కాబట్టి టెన్షన్ లేకుండా పెళ్లి పనులు చూసుకుంటున్నారట. -
ఆస్కార్‌కి ఇర్ఫాన్ నో బెడ్ ఆఫ్ రోజెస్
ఏ పాత్రకైనా ప్రాణం పోసే సత్తా ఉన్న నటుడు ఇర్ఫాన్‌ఖాన్. అలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఇర్ఫాన్‌ఖాన్ ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన ఫారిన్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే వృత్తిపరంగా ఆయన ఒక శుభవార్త విన్నారు. ఇర్ఫాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘నో బెడ్ ఆఫ్ రోజెస్’ అనే బంగ్లాదేశ్ సినిమా ఆస్కార్ వరకూ వెళ్లింది. 91వ ఆస్కార్ అవార్డ్స్‌కి నామినేషన్ ఎంట్రీగా బంగ్లాదేశ్ తరఫున ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఈ చిత్రం ఎంపికైంది. ముస్త్తఫా సర్వార్ ఫరూకీ దర్శకత్వంలో బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన సినిమా ‘నో బెడ్ ఆఫ్ రోజెస్’. బెంగాలీలో ‘దూబ్’ అనే టైటిల్ పెట్టారు. ఇందులో జావెద్ హాసన్ అనే క్యారెక్టర్లో ఇర్ఫాన్ కనిపిస్తారు. బంగ్లా దేశీ ఫిల్మ్‌మేకర్ అండ్ రైటర్ హుమాయూన్ అహ్మద్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిందన్న కారణంతో మొదట్లో ఈ మూవీపై నిషేధం విధించారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో గత ఏడాది అక్టోబర్ 27న ఈ చిత్రం బంగ్లాదేశ్, ఇండియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలో రిలీజైంది. ‘‘యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఇర్ఫాన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ సినిమాను ఊహించుకోలేను. ఆన్ సెట్స్, ఆఫ్ సెట్స్‌లో ఆయనతో మంచి ఎక్స్పీరియన్సెస్ను షేర్ చేసుకున్నా’’ అని పేర్కొన్నారు ఫరూకీ. ఇంతకుముందు ఫరూకీ దర్శకత్వంలోనే వచ్చిన ‘థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ (2009), టెలివిజన్ (2012) చిత్రాలు ఆస్కార్ ఎంట్రీకి. పరిగణించబడటం విశేషం. 90వ అకాడమీ అవార్డ్స్‌కి బంగ్లాదేశీ చిత్రం ‘ఖఛ’ వెళ్లింది. మొదట నిషేధం విధించిన ‘నో బెడ్ ఆఫ్ రోజెస్’ సినిమాకు ఇప్పుడు అగ్రతాంబూలం దక్కడం విశేషమే కదా. ఇక ఇండియా తరఫున విదేశీ విభాగంలో అస్సామీ చిత్రం ‘విలేజ్ రాక్‌స్టార్స్’ ఎంపికైంది. -
తప్పక తప్పుకున్నా
ఇర్ఫాన్ ఖాన్ హెల్త్ కండీషన్ సడెన్‌గా అప్సెట్ అవ్వడంతో ఇండస్ట్రీ జనాలతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. చాలా ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి. న్యూరో ఎండోక్రైమ్ ట్యూమర్ ట్రీట్మెంట్ నిమిత్తం ప్రస్తుతం ఇర్ఫాన్ ఖాన్ లండన్‌లో ఉన్నారు. ఈ కారణంగా తాను అప్పటికే నటిస్తోన్న ఓ వెబ్ సిరీస్ ఆగిపోయిందని ఇర్ఫాన్ పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఇర్ఫాన్ మాట్లాడుతూ – ‘‘గోర్మింట్’ అనే సెటైరికల్ వెబ్ సిరీస్ కోసం కొన్ని నెలలు షూటింగ్ చేశా. ప్రస్తుతం నేనున్న పొజిషన్ చూస్తుంటే ఈ వెబ్ సిరీస్‌లో ఇక భాగం అవ్వలేనని అర్థం అయింది. చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆ సిరీస్ ఐడియా నన్ను చాలా థ్రిల్ చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తప్పక తప్పుకుంటున్నా. ఫైనల్ ప్రొడక్ట్ చూడాలని చాలా ఆత్రుతగా ఉన్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు. -
భాష ఏదైనా బెస్ట్ ఇవ్వాలనుకుంటా
‘‘యాక్టర్‌గా వేరే వేరే భాషల్లో సినిమాలు చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంటుంది. ‘మహానటి’ సినిమాలో నన్ను తెలుగు ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు’’ అని మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ అన్నారు. దుల్కర్ సల్మాన్ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న చిత్రం ‘కార్వాన్’. ఇర్ఫాన్ ఖాన్, మిథిలా పాల్కర్ ముఖ్య పాత్రల్లో దర్శకుడు ఆకర్ష్ కురానా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ఆగస్ట్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ – ‘‘మలయాళంలో హీరోగా చేస్తున్నాను కాబట్టి బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సినిమాలోనూ నేనే లీడ్ రోల్ చేయాలి అనుకోలేదు. కథతో పాటు క్యారెక్టర్ ఉండాలి అనుకుంటాను. ఇర్ఫాన్ సార్ ఓకే అన్నారంటే స్క్రిప్ట్ కచ్చితంగా బావుంటుందని అనుకున్నాను. ఏ భాషలో సినిమా చేసినా నా బెస్ట్ ఇవ్వాలనుకుంటాను’’ అన్నారు. దర్శకుడు ఆకర్ష్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకి కీలకంగా నిలిచే ఓ పాత్రకు దుల్కర్ సరిపోతాడని మా క్యాస్టింగ్ డైరెక్టర్ చెప్పారు. అప్పుడే దుల్కర్ సినిమాలు చూశాను. అవినాష్ అనే పాత్రకు అతనే సరిపోతాడని ఫిక్స్ అయ్యాను. కథ చెప్పినప్పుడు దుల్కర్ కూడా బాగా ఎగై్జట్ అయ్యారు. స్క్రిప్ట్ నచ్చి ఒప్పుకున్నారు. 34 రోజుల్లో సినిమా కంప్లీట్ చేశాం. అలా అయితే యాక్టర్స్ అందరూ క్యారెక్టర్స్‌కు స్టిక్ అయ్యి ఉంటారు. ఎనర్జీస్ సేమ్‌గా ఉంటాయి అని నా నమ్మకం. ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఇర్ఫాన్ ఖాన్‌గారు బాగానే ఉన్నారు. ఫస్ట్ కాపీ కూడా చూశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయనకు కేన్సర్ వ్యాధి ఉందని బయటపడింది. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటారనుకుంటున్నాను’’ అన్నారు. మిథిలా పాల్కర్ మాట్లాడుతూ – ‘‘ఈ షూటింగ్ అంతా ఓ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌లా ఉంది. ఇర్ఫాన్, దుల్కర్ వంటి యాక్టర్స్‌తో వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్. కేవలం సినిమాలే అని నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకోను. యూ ట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, సినిమాలు, థియేటర్... ఎక్కడ ఎగై్జటింగ్ కాన్సెప్ట్ ఉంటే అక్కడ చేస్తాను’’ అన్నారు. -
వైరలవుతున్న నటుడి ఫోటో
బాలీవుడ్ క్లాసిక్ హీరో ఇర్ఫాన్ ఖాన్ అరుదైన ‘న్యూరో ఎండోక్రైనో’ అనే క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్‌లో చికిత్స పొందుతున్న ఈ హీరో ఆదివారం తన డీపీ(డిస్ప్లే పిక్చర్)ని చేంజ్ చేశారు. అయితే ఈ ఫోటో అభిమానులను విపరీతంగా కదిలించడమే కాక తెగ వైరల్ అవుతుంది. సాధరణంగా క్యాన్సర్ వ్యాధికి చికిత్స అంటే ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది. కానీ ఇర్ఫాన్ ఫోటో చూసిన వారికి కూడా ఆ బాధ ఎలా ఉంటుందో బాగానే అర్ధం అవుతుంది. ఇర్ఫాన్ ఖాన్ షేర్ చేసిన ఈ ఫోటోలో అతను బాగా నీరసించి, బక్కచిక్కపోయి ఉన్నట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. కానీ ఇంతటి విచారాన్ని కూడా ఈ నటుడు చిరునవ్వుతో భరిస్తున్నాడు. శరీరం ఎంత బలహీన పడినా ఇర్ఫాన్ ధైర్యం మాత్రం తగ్గలేదు. అందుకు నిదర్శనం అతని మోముపైన చిరునవ్వే. ఇర్ఫాన్ న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఈ ఏడాది మార్చిలో తెలిసింది. దాంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తనకొచ్చిన అరుదైన వ్యాధి గురించి ఇర్ఫాన్ ఖాన్ ఒక భావోద్వేగపూరితమైన లేఖను రాశారు. ఈ లేఖలో ‘ఊహించని ఉపద్రవాలతో కూడిందే జీవితం. మనం ఏదో అనుకుంటాం, కానీ మనం అనుకోనిదేదో జరుగుతుంది. ఇలాంటి అనుకోని సంఘటనలే మన జీవితాన్ని మార్చివేస్తాయి. గత కొన్ని రోజుల్లోనే ఈ విషయం నాకు బాగా అర్ధమయ్యింది. నేను అరుదైన న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. కానీ నా చుట్టూ ఉన్న వారి ప్రేమ, ఆశీస్సులే నాకు బలానిస్తున్నాయి. అవే నాకు నమ్మకాన్ని కల్గిస్తున్నాయి. ఈ ప్రయాణంలో భాగంగా(చికిత్స కోసం) నేను దేశం దాటి వెళ్తున్నాను. నేను ప్రతి ఒక్కరిని కోరేది ఒక్కటే మీ ఆశీస్సులను నిరంతరం నాకు అందిస్తూనే ఉండండి. త్వరలోనే వచ్చి నా ఈ ప్రయాణానికి సంబంధించిన మరిన్ని కబుర్లు మీకు చెబుతాను అంటూ లేఖలో తెలిపారు. లండన్ వెళ్లిన తర్వాత ఈ నటుడు కర్వాన్‌లో తనతో పాటు నటించిన దుల్కర్ సల్మాన్, మిథిలా పాకర్‌కు శుభాకాంక్షలు తెలిపడం కోసం తొలిసారి సోషల్ మీడియాలోకొచ్చారు. ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది. -
బర్త్‌డేకి బండొచ్చింది
ఈనెల 28న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ బర్త్ డే. 28 రాకముందే బాలీవుడ్ డైరెక్టర్ ఆకర్ష్ ఖురానా నుంచి అడ్వాన్స్ బర్త్‌డే ప్రజెంట్ అందుకున్నారట దుల్కర్. ‘కార్వానా’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు ఈ మలయాళ హీరో. ఇందులో ఇర్ఫాన్ ఖాన్, మిథిలా పాల్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ట్రావెల్ బేస్డ్ మూవీలో ఎక్కువ శాతం వ్యాన్ మీదే ప్రయాణిస్తారు దుల్కర్, ఇర్ఫాన్. ఇప్పుడు అదే వ్యాన్‌ను దుల్కర్‌కి గిఫ్ట్‌గా ఇవ్వదలిచారట దర్శకుడు ఆకర్ష్. ‘‘సినిమా షూటింగ్ ఎక్కువ శాతం ఈ వ్యాన్లోనే జరిగింది. దుల్కర్, నేను ఈ వ్యాన్‌తో ఎమోషనల్‌గా అటాచ్ అయ్యాం. అలాగే ఆటోమొబైల్స్ మీద దుల్కర్‌కు ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే ఈ బహుమతి అయితే బావుంటుందని భావించాను’’ అని ఆకర్ష్ పేర్కొన్నారు. -
కార్వాన్ ట్రైలర్ విడుదల
-
‘మూడు ఆత్మలు, రెండు శవాలు..’
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్, మాలీవుడ్ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్‌లు కలిసి చేస్తోన్న చిత్రం కర్మాన్. ఈ మధ్యే బ్లాక్ మెయిల్, హిందీ మీడియమ్ చిత్రాలతో సక్సెస్ సాధించారు. హిందీ మీడియమ్ సినిమా చైనాలో కూడా విజయవంతమైంది. మహానటి సినిమాతో తెలుగు, తమిళ్లో కూడా ఫేమస్ అయిన దుల్కర్ సల్మాన్ గతవారం ‘అతడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. మహానటి తెచ్చిన గుర్తింపుతో ఇక్కడ కూడా తన మార్కెట్ పెరిగింది. దుల్కర్, ఇర్ఫాన్‌లు లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘కర్వాన్’ సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ‘మూడు ఆత్మలు, రెండు శవాలు.. ఓ జీవిత కాలపు ప్రయాణం’ అంటూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 3న విడుదలకానుంది. Irrfan, Dulquer Salmaan and Mithila Palkar... First look poster of #Karwaan... Trailer out tomorrow... Akarsh Khurana directs... 3 Aug 2018 release. pic.twitter.com/ia54uOrNvY — taran adarsh (@taran_adarsh) June 26, 2018 -
ఐఫా అవార్డులు-2018
ప్రతిష్టాత్మక ఐఫా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. గత రాత్రి(ఆదివారం) బ్యాంకాక్‌లో జరిగిన 19వ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల(ఐఫా) కార్యక్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. తుమ్హారి సులు చిత్రం అత్యధికంగా ఆరు కేటగిరీల్లో నామినేట్ కాగా, ఐదు అవార్డులతో తర్వాతి స్థానంలో రాజ్‌కుమార్ రావ్ నటించిన న్యూటన్ నామినేట్ అయ్యింది. పెద్ద చిత్రాలేవీ అవార్డులను కొల్లగొట్టకపోగా.. చిన్న చిత్రాలు సత్తా చాటాయి. అవార్డుల విషయానికొస్తే... ఉత్తమ చిత్రంగా తుమ్హారి సులు, ఉత్తమ దర్శకుడిగా సాకేత్ చౌదరి(హిందీ మీడియం), ఉత్తమ నటిగా మామ్ చిత్రానికి గానూ దివంగత నటి శ్రీదేవి(భర్త బోనీకపూర్ అందుకున్నారు), ఉత్తమ నటుడిగా ఇర్ఫాన్ ఖాన్(హిందీ మీడియం) అవార్డులు దక్కించుకున్నారు. అవార్డుల పూర్తి జాబితా... ఉత్తమ చిత్రం- తుమ్హారి సులు ఉత్తమ దర్శకుడు- సాకేత్ చౌదరి(హిందీ మీడియం) ఉత్తమ నటుడు- ఇర్ఫాన్ ఖాన్ (హిందీ మీడియం) ఉత్తమ నటి-శ్రీదేవి(మామ్) ఉత్తమ సహయ నటుడు-నవాజుద్దీన్ సిద్ధిఖీ (మామ్) ఉత్తమ సహయ నటి-మెహర్ వీఐజే (సీక్రెట్ సూపర్‌స్టార్) ఉత్తమ కథ- న్యూటన్ చిత్రం(అమిత్ వీ మసూర్కర్) ఉత్తమ సంగీత దర్శకుడు -అమాల్ మాలిక్, తనిష్క్ బాగ్చి, అఖిల్ సచ్దేవ-బద్రీనాథ్ కీ దుల్హానియా బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ -ప్రీతమ్ (జగ్గా జసూస్ చిత్రానికి) బెస్ట్ స్క్రీన్ ప్లే -నితీశ్ తివారీ, శ్రేయస్ జైన్ (బరేలీ కీ బర్ఫీ) ఉత్తమ కొరియోగ్రఫీ-విజయ్ గంగూలీ, రూలె దౌసన్ వరిందని (జగ్గా జసూస్ చిత్రంలోని గల్తీ సే మిస్టేక్ పాటకు) ఉత్తమ డైలాగులు-హితేష్ కేవల్య(సుభ మంగళ్ సావధాన్) ఉత్తమ సినిమాటోగ్రఫీ-మార్కిన్ లస్కవైక్, యూఎస్సీ(టైగర్ జిందా హై చిత్రానికి గానూ...) ఉత్తమ ఎడిటింగ్- శ్వేత వెంకట్ మాథ్యూ (న్యూటన్) ఉత్తమ సింగర్(మహిళా)- మేఘనా మిశ్రా(సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రంలోని మైన్ కౌన్ హూ పాటకు) ఉత్తమ సాహిత్యం - మనోజ్ ముంటషిర్ (బాద్షావో చిత్రంలోని మెరే రష్కే ఖమర్ పాటకు...) ఉత్తమ సింగర్ (మేల్)- అర్జిత్ సింగ్( జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రంలోని హవాయెన్ పాటకు) ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ - కోంకణ్ సేన్ శర్మ అవుట్‌స్టాండింగ్ అఛీవ్మెంట్ అవార్డు- సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఉత్తమ స్టైల్ ఐకాన్- నటి కృతి సనన్ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు - ఎన్వై వీఎఫ్‌ఎక్స్‌వాలా (ప్రసాద్ వసంత్ సుటార్ -జగ్గా జసూస్ చిత్రం) ఉత్తమ సౌండ్ డిజైన్ - దిలీప్ సుబ్రమణియమ్-గణేశ్ గంగాధరన్(వైఆర్ఎఫ్ స్టూడియోస్).. టైగర్ జిందా హై చిత్రం ఇక ఈవెంట్ మధ్యలో రణ్‌బీర్ కపూర్, వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, లూలియా వంటూర్, కృతి సనన్, బాబీ డియోల్, అర్జున్ కపూర్ తమ ఫెర్ఫార్మెన్స్‌తో ఆహతులను ఆకట్టుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సీనియర్ నటి రేఖ స్టేజీపై నృత్య ప్రదర్శన ఇవ్వటం కార్యక్రమానికే హైలెట్‌గా నిలిచింది. -
ఇంటి తాళం ఇచ్చేశాడు
న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్‌తో ఇర్ఫాన్ ఖాన్ బాధపడుతున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ను ప్రస్తుతం లండన్‌లో తీసుకుంటున్నారు. అయితే ట్రీట్మెంట్ కోసం ఇర్ఫాన్ లండన్‌లో ఎన్ని నెలలుంటారో తెలియదు. కానీ లండన్‌లో ఆయనకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని షారుక్ లండన్‌లోని తన ఇంటి తాళాలను స్నేహితుడు ఇర్ఫాన్ చేతికి అందించారట. ట్రీట్మెంట్కి ప్రయాణమయ్యే కొన్ని రోజుల ముందు షారుక్‌ని ఇంటికి ఆహ్వానించారట ఇర్ఫాన్ భార్య సుతపా. రెండు గంటలు మాట్లాడుకున్న ఈ స్నేహితులు, సంభాషణ ఆఖర్లో షారుక్ తన లండన్ ఇంటి కీస్‌ని ఇర్ఫాన్‌కి అందించారట. లండన్‌లో స్నేహితుడు ఎటువంటి ఇబ్బంది పడకూడదని, ఇంటి వాతావరణం మిస్ అవ్వకూడదని షారుక్ ఇలా చేసి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
ప్రముఖ నటుడి భావోద్వేగపూరిత లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : మనిషి జీవితం నీటిలో తేలియాడుతున్న బెండు లాంటిది. కెరటాల ధాటికి దాని ఉనికి ప్రశ్నార్థమవుతుంటే.. ప్రకృతి ప్రసాదించిన జీవితాన్ని నేర్పుతో తీర్చిదిద్దుకోవాలే గానీ, కెరటాల్నే అదుపు చేస్తామని భ్రమపడటం మూర్ఖత్వమే అవుతుందంటున్నారు బాలీవుడ్ క్లాసిక్ హీరో ఇర్ఫాన్‌ఖాన్. ఒక్క సంఘటనతో జీవితం తల్లకిందులు కావొచ్చని చెప్తున్నారు. అరుదైన న్యూరో ఎండోక్రైన్ అనే క్యాన్సర్ వ్యాధి బారిన పడిన ఆయన లండన్‌లో చికిత్స పొందుతున్నారు. తన జీవితం ముగుస్తుందనే భయానక పరిస్థితుల నుంచి తెలుసుకున్న కొన్ని విషయాలను ఇర్ఫాన్ సోదాహరణంగా ఒక లేఖలో పేర్కొన్నారు. ఒక జాతీయ పత్రికకు ఇర్ఫాన్ రాసిన భావోద్వేగపూరిత లేఖలో ఏముందంటే.. ‘రైలులో ప్రయాణిస్తున్నాను. నేను చేరుకోవాల్సిన గమ్యం మరెంతో దూరం ఉంది. జర్నీలో నా గతాన్ని, ఆశలతో కూడిన నా భవిష్యత్తును తలచుకుంటూ హాయిగా ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను. అనుకోకుండా నా ఊహాలోకంలో అలజడి. ఎవరిదో చేయి నా భుజంపై పడింది. తిరిగి చూస్తే.. టికెట్ కలెక్టర్..! ‘నువ్వు దిగాల్సిన స్టేషన్ వచ్చింది. సర్దుకో అని సూచన’. అదెలా..! నేను ప్రయాణించాల్సిన దూరం మరెంతో ఉంది అన్నాను. అయినా అతను వినిపించుకోవడం లేదు. ‘మీరు దిగాల్సిందే అంటూ నన్ను బలవంతంగా రైలులోంచి తోసేసే పరిస్థితి తలెత్తింద’ని పేర్కొన్నారు. ఊహించని ఉపద్రవాలతో కూడిందే జీవితం అని లేఖలో చెప్పుకొచ్చారు. దేవుడి దయ వల్ల, ఎందరో అభిమానుల ఆశిస్సుల వల్ల ఇంకా ప్రాణాలతో ఉన్నానని తెలిపారు. ‘ప్రసిద్ధ మక్కా పుణ్యక్షేత్రాన్ని దర్శించాలనేది నా చిన్ననాటి కల. కానీ, ఈ పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉన్నాను. ఆస్పత్రి నుంచి బయటికి చూసినప్పుడు.. లార్డ్స్ స్టేడియంలో వేలాడుతున్న వివిఎన్ రిచర్డ్స్ పోస్టర్ కనిపించింది. అందులో చిరునవ్వు చిందిస్తున్న రిచర్డ్స్‌ను చూసినప్పుడు అనిపించింది. భూమ్మీద నూకలు ఉంటే అంతా మంచే జరుగుతుందనే సత్యం బోధపడింది. చావు బతుకుల మధ్య పోరాటం ఎప్పటికీ ఉండేదే’ అంటూ క్యాన్సర్‌పై తన స్వీయ పోరాటాన్ని తెలిపారు ఇర్ఫాన్. -
మిడిల్ క్లాస్ మేల్ బ్లాక్‌మేల్
ఒకరి బలహీనత ఇంకొకరికి ఆసరా. అవసరాన్ని తీర్చే మార్గం. మరీ మధ్యతరగతి వర్గన్ని బతికిస్తున్నవి ఇలాంటి బలహీనతలే! ఇదే బ్లాక్‌మేల్ సినిమా! చాలా సీరియస్ విషయాన్ని హాస్యాన్ని జోడించి ఎంతో చతురంగా చెప్పిన చిత్రం! కథ... దేవ్ (ఇర్ఫాన్ ఖాన్) టిష్యూ పేపర్స్ తయారు చేసే కంపెనీలో సేల్స్ మ్యాన్. బాధ్యతలు తప్ప సుఖం, సంతోషం లేని మిడిల్‌క్లాస్ హజ్బెండ్. ముద్దుముచ్చటా లేని కాపురం. ఆఫీస్‌లో అందరూ వెళ్లిపోయే వరకు ఉండి, వీడియో గేమ్ ఆడి, భార్య నిద్రపోయాక ఇంటికెళ్తాడు. డైనింగ్ టేబుల్ మీద చల్లారిన భోజనాన్ని ఓవెన్లో పెట్టి, డైనింగ్ హాల్కీ బెడ్రూమ్కీ మధ్య ఉన్న తలుపు కన్నంలోంచి... ఆదమరిచి నిద్రపోతున్న భార్య అందాన్ని ఆస్వాదిస్తాడు. ఈలోపు ఓవెన్లో భోజనం వేడి అయిపోయినట్టు అలారమ్ వస్తుంది. నిట్టూర్చి భోజనం అయిందనిపించి వెళ్లి పడుకుంటాడు. ఇంచుమించు ఇదే దిన చర్య దేవ్ది. గులాబీపూలు... నిజాల ముళ్లు దేవ్ ఉదాసీనతను చూసి అతని కొలీగ్ ఆనంద్.. ‘‘కొన్నాళ్లుగా చూస్తున్నా. ఎందుకింత ఉదాసీనంగా ఉంటున్నావ్? అసలు కొత్త కాపురంలోని మొగుడులాగా ఉన్నావా? ఎందుకు ఏమైంది? కలహాలా?’’ అంటూ స్నేహితుడిని అడుగుతాడు. ముభావంగా ఉంటాడు దేవ్. ‘‘పువ్వులు ఇష్టపడని భార్య ఉండదు. సో.. ఈ రోజు పువ్వులు తీసుకొని త్వరగా ఇంటికెళ్లి నీ భార్యకు సర్ప్రయిజ్ ఇవ్వు’’ అని దేవ్‌ను ఉత్సాహపరుస్తాడు ఆనంద్. అన్నట్టుగానే పువ్వులు తీసుకొని త్వరగా ఇంటికొస్తాడు దేవ్. ఎప్పటిలాగే డైనింగ్ హాల్, బెడ్రూమ్కి మధ్యనున్న కన్నంలోంచి చూస్తాడు. షాక్... రీనా (కీర్తి కుల్హరి) ఇంకో వ్యక్తితో కనిపిస్తుంది. ఆవేశం పొంగుతుంది. వెళ్లి భార్య పక్కనున్న అతణ్ణి చంపేయాలనుకుంటాడు. ఏమీ చేయలేక.. భార్యనూ నిలదీయలేక నిస్సహాయంగా వెనుదిరుగుతాడు. తన ఇంట్లోంచి ఆ వ్యక్తి బయటకు వచ్చే వరకు అపార్ట్మెంట్ కాంపౌండ్‌లో నిరీక్షించి ఆ వ్యక్తి బయటకు వచ్చాక అతణ్ణి ఫాలో అవుతాడు. బ్లాక్‌మెయిల్స్... భార్య స్నేహితుడి పేరు రంజిత్ అని, ఓ బడా వ్యాపారి అల్లుడని తెలుసుకుంటాడు ఆ ఇంటి వాచ్‌మన్ ద్వారా. నిజానికి రంజిత్ (అరుణోదయ్ సింగ్), రీనా (దేవ్ భార్య)పెళ్లికి ముందే ప్రేమికులు. కాని డబ్బు కోసం డాలీ (దివ్య దత్తా)ను పెళ్లిచేసుకుంటాడు. జిమ్ ట్రైనర్ అయిన రంజిత్ వేరే పనేమీ లేకుండా అత్తింటి సొమ్ము మీద బతుకుతుంటాడు. దాంతో భర్తంటే చాలా చులకన డాలీకి. ఇంచుమించు పెంపుడు కుక్కలా ట్రీట్ చేస్తుంటుంది అతనిని. దాంతో ఆత్మాభిమానం దెబ్బతిని మళ్లీ పాత స్నేహితురాలు రీనాతో సంబంధం పెట్టుకుంటాడు రంజిత్. అలా వాళ్లిద్దరి స్నేహం కొనసాగుతుంది. ఈలోపు దేవ్‌కు నెల తిరిగేసరికల్లా ఇంటి ఈఎమ్ఐ, కార్ ఈఎమ్ఐ, కేబుల్ పేమెంట్.. ఎట్సెట్రా తడిసిమోపెడవుతాయి. ఆఫీస్‌లో ఆ నెల ఇంక్రిమెంట్ ఉంటుంది కదా.. అన్నీ తీర్చేయొచ్చు అనుకుంటే.. ‘‘కంపెనీ సేల్స్ మందగించాయి, పైగా కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం ఇన్వెస్ట్ చేస్తోంది. అందుకే ఇంక్రిమెంట్స్ లేవు’’ అంటూ చావు కబురు చల్లగా చెప్తారు. టెన్షన్లో పడ్తాడు దేవ్. అప్పుడు ఒక బేసిక్ మోడల్ ఫోన్ కొని, దాన్లో ప్రీపెయిడ్ సిమ్ వేసి, రాత్రి దొంగతనంగా భార్య ఫోన్లోంచి రంజిత్ ఫోన్ నంబర్ తస్కరించి ‘‘పెళ్లయిన మహిళతో అఫైరా?’’ అంటూ బ్లాక్ మెయిల్ మెస్సేజ్ పంపిస్తాడు రంజిత్‌కు. భయపడ్డ రంజిత్.. ‘‘ఏం కావాలి?’’ అని అడుగుతాడు. ఈఎమ్ఐల లెక్కలు వేసుకొని లక్ష రూపాయలు డిమాండ్ చేస్తాడు. క్రాస్‌బ్రీడ్ డాగ్స్ బిజినెస్ చేస్తున్నాను, ఒక లక్ష రూపాయలివ్వమని అబద్ధం చెప్పి భార్య దగ్గర డబ్బులు తీసుకొని దేవ్కిస్తాడు రంజిత్. అలా భార్య ఎఫైర్‌ను మనీ సంపాదన వనరుగా మార్చుకుంటాడు దేవ్. మధ్యతరగతి విలువలు అతనిని కుళ్లబొడుస్తుంటాయి. ఆ అపరాధ భావనను ఓ రోజు బార్లో కొలీగ్ ఆనంద్‌తో పంచుకుంటాడు. ఆనంద్ ఆ విషయాన్ని తన ఆఫీస్‌లోని కొత్త ఫీమేల్ కొలీగ్ ప్రభకు చెప్తాడు. ఆ విషయాన్ని అడ్డం పెట్టుకొని ప్రభ మళ్లీ దేవ్‌ను బ్లాక్మెయిల్ చేస్తుంది. అయితే బిజినెస్ పేరుతో కూతురు దగ్గర అల్లుడు డబ్బు తీసుకున్నాడని తెలిసి డాలీ తండ్రి రంజిత్‌ను బెదిరిస్తాడు రెండు రోజుల్లో లక్ష రూపాయలు తిరిగి ఇవ్వమని. ఏం చేయాలో పాలుపోక ఒక డూప్లికేట్ మెయిల్ ఐడీ క్రియేట్ చేసి గర్ల్ ఫ్రెండ్ రీనాకు బ్లాక్ మెయిల్ మెస్సేజ్ పంపిస్తాడు రంజిత్– ‘‘పెళ్లయిన వాడితో ఎఫైరా?’’అంటూ. ఈ విషయం నీ భర్తకు తెలియకుండా ఉండాలంటే లక్షా 30 వేల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. రీనా తండ్రి కిడ్నీ జబ్బుతో బాధపడ్తుంటాడు. డబ్బు కోసం తల్లి దగ్గరకు వెళ్తుంది రీనా. ఉన్న డబ్బంతా మీ నాన్న కోసం హాస్పిటల్ చుట్టూ తిరగడానికే అయిపోయిందంటుంది తల్లి. దాంతో రీనా తన భర్తనే అడుగుతుంది తండ్రి వైద్య పరీక్షల కోసమని. రంజిత్ దగ్గర తీసుకున్న సొమ్మును తిరిగి భార్యకు ఇచ్చేస్తాడు. మళ్లీ రంజిత్‌ను బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇలా ఈ సైకిల్ అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ల, ఆ విషయం తెలిసిన వాళ్ల చుట్టూ తిరుగుతుంటుంది. ప్రైవేట్ డిటెక్టివ్.. ఈ బ్లాక్మెయిల్ బెడద తొలగించుకోవాలని రంజిత్ ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌ను మాట్లాడుకుంటాడు. ఆ డిటెక్టెవ్ రంజిత్‌కు ఫోన్ చేస్తున్న నంబర్ రీనా భర్తదేనని తెలుసుకుంటాడు. రంజిత్‌కు చెప్పకుండా పరిశోధన పేరుతో డ్రాగ్ చేస్తూ దేవ్‌ను బ్లాక్మెయిల్ చేస్తుంటాడు.. ‘‘నీ బాయ్‌ఫ్రెండ్‌ను బ్లాక్మెయిల్ చేస్తుంది నీ భర్తనేని నీ భార్యతో చెప్తాన’’ంటూ. ఖంగు తింటాడు దేవ్. ఈలోపు ప్రభ ఒత్తిడి ఎక్కువవుతుంది దేవ్‌కి. ఆమెను కన్విన్స్ చేయడానికి వాళ్లింటికి వెళ్దామనుకొని ఆమె ఇంటి అడ్రస్ కోసం ఆనంద్‌ను అడుగుతాడు. ఆ రాత్రి ప్రభ వాళ్లింటికి వెళ్తాడు దేవ్. వాదోపవాదాలు జరిగి దేవ్ వెళ్లిపోతుంటే ఆయనను ఆపడానికి వెళ్లి బాటిల్ మీద కాలు పడి జారి వెనకాల అల్మారాకు కొట్టుకుంటే అల్మారా మీద పడి ప్రభ చనిపోతుంది. భయపడి పారిపోతాడు దేవ్. కాలనీ వాసులు ఆయనని తరుముతాడు. అయినా తన అనవాలు చిక్కనివ్వకుండా తప్పించుకుంటాడు. మర్నాడు ఆఫీస్‌కు పోలీస్‌లు వస్తారు ఎంక్వియిరీ కోసం. ఆనంద్‌కు దేవ్ మీద డౌట్ వస్తుంది. ప్రభ అంటే ఆనంద్ ఇష్టపడుతున్నాడని పోలీసులకు చెప్పి డౌట్ ఆనంద్ మీదకు మళ్లేట్టు చేస్తాడు దేవ్. ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్చేస్తారు. అప్పుడు తన భార్య ఎఫైర్ విషయం తెలిసి ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఆ విషయం ప్రభకు తెలిసి... దేవ్‌ను ప్రభ బ్లాక్మెయిల్ చేసిందని అందుకే దేవే ఆమెను చంపి ఉంటాడని పోలీసులకు చెప్తాడు ఆనంద్. ఇన్స్పెక్టర్ దేవ్‌ను బెదిరిస్తాడు. ఈ లోపు ప్రైవేట్ డిటెక్టివ్ పోరు ఎక్కువవుతుంది దేవ్‌కి. అటు రంజిత్‌కు మామ పోరూ ఎక్కువవుతుంది. డాలీకి భర్త ఎఫైర్ విషయం తెలిసి, భర్తను చంపేయాలనుకుంటుంది. కాని అంతకుముందే రంజిత్ ప్రైవేట్ డిటెక్టివ్ చెప్పిన వ్యక్తి దగ్గర ఒక నాటు తుపాకీ కొనుక్కుంటాడు. కత్తితో తన వెనకాల పొడిచిన భార్యను తుపాకితో కాల్చి చంపేస్తాడు. డబ్బు కోసం మళ్లీ రీనాను బ్లాక్మెయిల్ చేస్తాడు రంజిత్ అపరిచిత మెయిల్ ద్వారా. రీనా మళ్లీ దేవ్‌ను డబ్బులు అడుగుతుంది తండ్రి వైద్యం కోసం. ఇవ్వనంటాడు. అపాలజీ చెప్పడానికి రీనా తల్లికి ఫోన్ చేస్తే రీనా అబద్ధం చెప్పిందని అర్థమవుతుంది దేవ్‌కి. అప్పుడు మొత్తం విషయం తెలుస్తుంది. తను డబ్బు కోసం రంజిత్‌ను బ్లాక్మెయిల్ చేయడం, రంజిత్ రీనాను బ్లాక్ మెయిల్ చేయడం. ఆ నిజాన్ని సాక్ష్యాలతో సహా రీనాకు పంపిస్తాడు దేవ్. రియౖలైజై రంజిత్ స్నేహానికి స్వస్తి చెప్పి అతని నంబర్ డిలీట్ చేస్తుంది రీనా. ఆనంద్‌కూడా దేవ్‌ను బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. ఆలోచించి ఓ ప్లాన్ వేస్తాడు దేవ్. ‘‘నువ్వు అడిగినంత డబ్బిస్తాను. కాని నిన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది ఆనంద్ అని రంజిత్‌తో చెప్పు’’అంటాడు దేవ్.. ప్రైవేట్ డిటెక్టివ్‌తో. అలాగే చెప్తాడు ప్రైవేట్ డిటెక్టివ్. ఈ బ్లాక్‌మెయిలర్‌కు గుణపాఠం చెప్పాలనే ఆవేశంతో ఉన్న రంజిత్... ప్రైవేట్ డిటెక్టివ్ ఇచ్చిన సమాచారంతో ఆనందే అసలు బ్లాక్‌మెయిలర్ అనుకొని అతనిని చంపేస్తాడు. ఈ క్రమంలో తన కూతురిని చంపింది అల్లుడే అన్న నిజమూ తెలుస్తుంది రంజిత్ మామకు. అలా రంజిత్ దోషిగా దొరికిపోతాడు. దేవ్ కోసం రీనా ఆ రాత్రి భోజనం వండి టేబుల్ మీద సర్ది ఎదురు చూస్తుంటుంది. ఎప్పుడొస్తావ్ ఇంటికి అని మెస్సేజ్ పెట్టి. ఆ మెస్సేజ్ వచ్చేటప్పటికీ దేవ్ ఎప్పటిలా రాత్రి ఆఫీస్‌లో వీడియో గేమ్ ఆడ్తుంటాడు. చిత్రంగా విన్ అవుతాడు. భార్య మెస్సేజ్ చూసి ఆమె నంబర్ డిలిట్ చేసేస్తాడు. సామాన్యుడు తనే సమస్యలను సృష్టించుకుని ఆ సుడిగుండంలో కొట్టుకుపోతాడు అనే సారాంశం ఈ బ్లాక్మెయిల్. దేవ్‌గా ఇర్ఫాన్ అద్భుతం. రంజిత్‌గా అరుణోదయ్ కూడా సూపర్బ్. ఇక కీర్తి కుల్హరి గురించి వేరేగా చెప్పక్కర్లేదు. సున్నితమైన హాస్యంతో గొప్ప సమస్యను చిత్రీకరించిన తీరు అద్భుతం. మల్టీప్లెక్స్‌ల్లో ఆడుతోంది. తప్పక చూడండి. – శరాది -
ఇర్ఫాన్ ఖాన్‌కు అరుదైన కేన్సర్
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (51) అత్యంత అరుదైన న్యూరోఎండోక్రైన్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం చికిత్స కోసం తాను విదేశాల్లో ఉన్నానని ఇర్ఫాన్ చెప్పారు. కేన్సర్‌ను తట్టుకోవడం చాలా కష్టంగా ఉందనీ, కానీ తన చుట్టూ ఉన్నవారు వ్యాధితో పోరాడటానికి అవసరమైన మద్దతును తనకు ఇచ్చి ఆశలు నింపుతున్నారని ఆయన పేర్కొన్నారు. మార్గరెట్ మిచెల్ రాసిన ‘గాన్ విత్ ద విండ్’ పుస్తకంలోని ‘మనం ఏది కోరుకుంటే అది ప్రసాదించాల్సిన బాధ్యత జీవితానికి లేదు’ అన్న మాటలతో ఆయన తన మీడియా ప్రకటనను ప్రారంభించారు. అభిమానులు తమ దీవెనలను పంపుతూనే ఉండాలని ఇర్ఫాన్ ఖాన్ కోరారు. న్యూరోఎండోక్రైన్ కేన్సర్ కణతులు ఊపిరితిత్తులు, జీర్ణాశయం సహా శరీరంలోని ఏ భాగంలోనైనా మొదలవుతాయి. ఎక్కువగా పేగుల్లో ఇవి ఏర్పడతాయి. ఆ తర్వాత క్రమక్రమంగా ఇతర భాగాలకు విస్తరిస్తాయి. హార్మోన్లను ఉత్పత్తి చేసే నాడీ కణాలపై క్రమరహితంగా కణతులు పెరగడమే ఈ కేన్సర్. ఇది అత్యంత అరుదైన కేన్సర్ రకం. ఈ కేన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్సతో నయం చేయవచ్చు. -
తన వ్యాధి పేరు బయటపెట్టిన ఇర్ఫాన్ ఖాన్
సాక్షి, ముంబయి : ముందు చెప్పినట్లుగానే ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తన వ్యాధి గురించి బయటపెట్టారు. తనకు నాడీ సంబంధమైన అంత:స్రావి గ్రంధిలో ట్యూమర్ (న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్) ఉందని, ఇది అత్యంత అరుదైనదని పేర్కొన్నారు. దీనికోసం తాను విదేశాల్లో వైద్యానికి వెళుతున్నట్లు కూడా చెప్పారు. ఇర్ఫాన్ ఖాన్ తన అధికారిక ట్విటర్ పేజీలో ఈ మేరకు పోస్ట్ చేశారు. అత్యంత అరుదైన వ్యాధితో ఇర్ఫాన్ బాధపడుతున్నారని, అదొక క్యాన్సర్ అంటూ విపరీతమైన ఊహాగానాలతో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో న్యూరో అంటే బ్రెయిన్‌కు సంబంధించినది మాత్రమే ఉండబోదని తెలిపారు. అంతకుముందు ఇదే నెల (మార్చి) 5న సోషల్ మీడియా ద్వారానే ఇర్ఫాన్ తనకు అరుదైన వ్యాధి ఉందని, దీనిపై అందరూ వేరే ప్రచారం చేయొద్దని, ఆ వ్యాధి ఏమిటనే వివరాలు పది రోజుల్లో వెల్లడిస్తానని చెప్పారు. అన్న ప్రకారమే ఆయన నేడు తన ట్విటర్ ఖాతా ద్వారా తనకు న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ అనే వ్యాధి ఉందని తెలిపారు. ‘మనం ఊహించినదేది జీవితం మనకు ఇవ్వదు’ అంటూ మార్గరెట్ మిచెల్ చెప్పిన కొటేషన్‌ను చెబుతూ.. ‘ఒక్కోసారి మనం ఊహించనిది మనల్ని పెద్ద వాళ్లను చేస్తుంది. నాకు న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ ఉందని తెలుసుకున్నప్పుడు అంగీకరించేందుకు కష్టంగా అనిపించింది. భరించలేకపోయాను. కానీ, నా చుట్టూ ఉన్న వారి ప్రేమ, బలం నన్ను కొత్త ఆశలోకి తీసుకొచ్చాయి. ఈ ప్రయాణం నన్ను దేశం వెలుపలికి తీసుకెళుతోంది. మీ అందరి దీవెనలు నాకు పంపిస్తునే ఉండండి. నా మాటలకోసం ఎదురుచూసేవారందరికి మరిన్ని విషయాలు చెప్పేందుకు తిరిగొస్తానని ఆశిస్తున్నాను’ -- ఇర్ఫాన్ న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ అంటే ఏమిటీ? ఈ నాడీకి సంబంధమైన కణితి (ట్యూమర్) వేగంగా లేదా నెమ్మదిగా లేదా ఊహించని విధంగా పెరగొచ్చు. శరీరంలోని ఇతర భాగాలకు కూడా పాకొచ్చు. చాలామందికి దీని లక్షణాలు అంత త్వరగా తెలియవు గుర్తించలేరు. ఏదైన సంఘటన జరిగి దాని ద్వారా పరీక్షలు చేస్తే బయటపడుతుంది. చర్మం కందిపోయినట్లుగా కనిపించడం, లేదా రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోవడం జరుగుతాయి. ఇక వైద్యం అనేది కణితి తీవ్రతను బట్టి ఉంటుంది. రేడియేషన్ లేదా కీమోథెరపీ ద్వారా మాత్రమే చికిత్సకు వెళ్లాల్సి ఉంటుంది. 🙏🏻 pic.twitter.com/IDThvTr6yF — Irrfan (@irrfank) March 16, 2018 -
‘ఇర్ఫాన్‌ఖాన్ చాంపియన్‌లా తిరిగివస్తాడు’
విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయ్, బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ అనారోగ్యంపై మీడియాలో వస్తున్న కథనాలపై ట్విటర్ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఏదో తెలియని జబ్బుతో బాధపడుతున్నఇర్ఫాన్ ఆ వ్యాధి గురించి తెలిసిన తరువాత తనే చెబుతానని సోమవారం ట్విటర్లో పేర్కొన్నాడు. అరుదైన వ్యాధి అని, దాని గురించి ఇంకా వివరాలు తెలియలేదని, ఇంకో వారం పది రోజుల్లో వివరాలు ప్రకటిస్తానని పోస్ట్ చేశాడు. అయితే దీనిపై మీడియా తనకు తోచిన విధంగా కథనాలు ప్రచురిస్తుండటంతో నటుడు మనోజ్ బాజ్‌పేయ్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ...‘‘అందరినీ దయ చేసి వేడుకుంటున్నాను, మీరు ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేయకండి. తన వైపు నుంచి అధికారికంగా విషయం వెల్లడించేవరకు వేచి చూడండి. తను ఆ వ్యాధిని కనిపెట్టి, ఎదురించి చాంపియన్‌లా తిరిగివస్తాడు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. మనమంతా అతని ప్రైవసీని గౌరవిద్దాం’’ అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. -
బడికి వేళాయెరా
మళ్లీ స్కూల్‌కి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు ఇర్ఫాన్ ఖాన్. ఆ వయసు దాటిపోయింది కదా అనుకుంటున్నారా? ఇది రీల్ స్కూల్. గతేడాది ‘హిందీ మీడియమ్’ సినిమా కోసం స్కూల్‌కి వెళ్లారు ఇర్ఫాన్. ఆ సినిమాలో ఆయన టీచర్ కాదు. బిజినెస్‌మేన్. కూతురిని ఇంగ్లిష్ మీడియమ్ స్కూల్లో చేర్పించడానికి నానా పాట్లు పడతారు. సాకేత్ చౌదరి దర్శకత్వంలో ఇర్ఫాన్ ఖాన్, సబా కమర్, దీపక్ దోబ్రియాల్ ముఖ్య తారలుగా రూపొందిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేశారు. అంటే.. ఇర్ఫాన్ ఖాన్‌కు స్కూల్‌కు వెళ్లేందుకు టైమ్ అయ్యిందన్న మాట. ఈ సినిమాలోనూ తండ్రి రాజ్ బాత్రా పాత్రలోనే ఇర్ఫాన్ కనిపించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఆగస్టులో సెట్స్‌పైకి వెళుతుందట. ఇక హీరోయిన్గా సబా కమర్నే తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. అంతేకాదు ఈసారి కొంచెం డోస్ పెంచి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీసేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట చిత్రబృందం. -
ఐ యామ్ అవినాష్
అవినాష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐదంకెల జీతం. వీకెండ్ పార్టీలు, పబ్‌లు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో అవుటింగ్‌లు. పుల్ బిందాస్ లైఫ్. ఎప్పుడూ ఒకేలా ఉంటే అది లైఫ్ ఎందుకవుతుంది? సడన్‌గా లైఫ్‌లో బిగ్ టర్న్. అంతే ఆల్ చేంజ్. జాబ్‌లోనే కాదు అతని లైఫ్‌లో కూడా. హిందీ చిత్రం ‘కర్వాన్’ స్టోరీ లైన్ ఇదేనట. దుల్కర్ సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, కృతి కర్భందా, మిథిలా పాల్కర్, రోనీ స్క్రూవాలా ముఖ్య తారలుగా ఆకాశ్ ఖురానా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతోనే మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ‘‘ఇర్ఫాన్ ఖాన్, రోనీ స్క్రూవాలాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ. ఈ సినిమా జర్నీలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. స్టార్టింగ్ డే నుంచి షూటింగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇంత మంచి టీమ్, ఇలాంటి మంచి సినిమాతో హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు దుల్కర్ సల్మాన్. రోడ్ జర్నీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుందట. అది సరే.. ఇంతకీ అవినాష్ ఎవరో చెప్పలేదు కదూ. తెలుగులో అయితే.. అఖిల్ గుర్తుకు రావొచ్చు. ‘హలో’లో తను చేసిన పాత్ర పేరది. బట్... ‘కర్వాన్’లో మై నేమ్ ఈజ్ అవినాష్ అంటున్నారు దుల్కర్ సల్మాన్. -
విద్యాబాలన్ మళ్లీ ఎగరేసుకుపోయిందిగా..
సాక్షి, ముంబయి : జియో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2018 వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది. 2017 సంవత్సరానికి గాను 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రధానోత్సవాన్ని శనివారం రాత్రి (జనవరి 20) నిర్వహించారు. బాలీవుడ్ సినీ రంగానికి చెందిన చిత్రాలు, నటులు ఇతర విభాగాలకు ఈ అవార్డులు అందజేశారు. అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ఆయన మిత్రుడు నిర్మాత కరణ్ జోహార్ ఆతిథ్యం నిర్వహించారు. 2017 సంవత్సరానికిగాను అందించిన ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ‘హిందీ మీడియం’ ఎంపికైంది. కాగా, ఉత్తమ నటుడు అవార్డును ఇర్ఫాన్ ఖాన్ అందుకున్నారు. అలాగే, ఉత్తమ నటిగా విద్యాబాలన్ నిలిచారు. ఆమెకు ఇది ఆరో ఫిల్మ్‌ఫేర్ అవార్డు. ‘తుమ్హారి సులు’ చిత్రంలో నటనకు గాను విద్యాబాలన్‌కు ఈ అవార్డును అందించారు. కాగా, ఉత్తమ దర్శకత్వం అవార్డును అశ్వినీ అయ్యర్ తివారీ అందుకున్నారు. ఇక క్రిటిక్స్ అవార్డ్స్ కింద ఉత్తమ చిత్రంగా న్యూటన్ నిలవగా ఉత్తమ నటుడిగా రాజ్‌కుమార్ రావ్ (ట్రాప్డ్), ఉత్తమ నటిగా జైరా వాసిం (సీక్రెట్ సూపర్‌స్టార్) నిలిచారు. దీంతోపాటు పలు విభాగాల్లో కూడా అవార్డులు అందజేశారు. -
ఏబీసీడీల సూప్ హిందీ మీడియం
‘‘ఇస్ దేశ్ మే అంగ్రేజ్ జుబాన్ నహీ.. క్లాస్ హై (ఇంగ్లిష్ అనేది ఈ దేశంలో భాష మాత్రమే కాదు.. ఉన్నతవర్గాన్ని సూచించే మాధ్యమం)... ‘‘హిందీ మీడియం’’ సినిమాలోని డైలాగ్ ఇది! నిజ జీవితంలోని ప్రాక్టికాలిటీ కూడా! కులం, మతం, డబ్బే కాదు ఇంగ్లిష్ భాష కూడా సమాజాన్ని ఎలా వర్గీకరించిందో చెప్పే చిత్రం. హిందీ చోట దేశంలోని ఆయా భాషలను చేర్చుకుంటే అన్ని మెట్రోల పరిస్థితే హిందీ మీడియం. మన భాషను మనం గౌరవించుకుంటే ఆ మాధ్యమంలో నడుస్తున్న ప్రభుత్వ సంస్థలు ముఖ్యంగా స్కూళ్లు బాగుంటాయని హెచ్చరించే సినిమా! అసలు కథ... : రాజ్భత్రా (ఇర్ఫాన్ ఖాన్), మీతా (సబా ఖమర్) భార్యాభర్తలు. ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో రాజ్ ఒక ష్యాషన్ స్టూడియో (బట్టల దుకాణం)నడుపుతుంటాడు. అతని మాట చాతుర్యం, మెళకువలతో వ్యాపారం చక్కగా సాగుతుంటుంది. తనని తాను లోకల్ టైకూన్‌గా అభివర్ణించుకుంటుంటాడు. పెద్దల ద్వారా సంక్రమించిన ఇల్లూ ఉంటుంది. వీళ్లకు ఒక పాప. పేరు పియ. ప్రేమానురాగాల కుటుంబం. చాలామంది లాగే ఈ ఇల్లాలికీ ఇంగ్లిష్ అంటే మహా మోజు. ఒక్కగానొక్క బిడ్డను ఢిల్లీలోని హైఫై ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చేర్పించాలనే ఆరాటం. అక్కడి నుంచే కథ మొదలు. పేరున్న ప్రైవేట్ స్కూల్లో సీట్ రావాలంటే ముందు తాముంటున్న చాందినీ చౌక్ నుంచి మకాం మారాలని చెప్తుంది భర్తతో. తాతలనాటి ఇల్లు.. వదిలేదెలా?’’ అంటాడు భర్త. ‘‘బిడ్డ భవిష్యత్ కోసం’’ సెంట్మెంట్ బాణం వదులుతుంది భార్య. వెంటనే సౌత్ ఢిల్లీలోని వసంత్ విహార్‌కు మారుతుంది వాళ్ల నివాసం. పరోటా పోయి పాస్తా: రాజ్ తన భార్యను ‘‘మీతూ’’ అని పిల్చుకుంటుంటాడు ముద్దుగా. పాష్ లొకాలిటీలోకి వచ్చాక కూడా ఇంకా ఆ పాచి పేరెందుకు ‘‘హనీ’’ అని పిలవండి అంటుంది గారాలు పోతూ. మాటామంతి, కట్టూబొట్టు,తిండీతీరూ అంతా ఆ స్థాయిలోనే ఉండాలి అంటూ ఆర్డర్ వేస్తుంది భార్య. అయోమయంగా తలాడిస్తాడు రాజ్. పరోటా స్థానంలో పాస్తా వస్తుంది... భాంగ్రాకి బదులు వెస్ట్రన్ డాన్స్ స్టెప్స్ పడ్తుంటాయి. సల్వార్ కమీజ్ పోయి మోడర్న్ అవుట్‌ఫిట్స్ కనపడుతుంటాయి. నమస్తేని మరిచిపోయి ‘‘హలో.. హాయ్.. హౌ ఆర్ యూ’’ ప్రాక్టిస్ మొదలవుతుంది. ఆ కాంప్లెక్స్‌లో ఇరుగుపొరుగు వాళ్లకు తామూ సోషల్లీ హైక్లాస్ విత్ హై ఇంగ్లిష్ హాబిట్స్ అని చూపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది మీతా. పేరెంట్స్‌కి మ్యానర్స్ ఉంటేనే వాళ్ల పిల్లలను తమ బిడ్డతో ఫ్రెండ్షిప్ చేయనిస్తారు.. ఆడుకోనిస్తారు అన్నమాట ఆ సొసైటీలో. అడ్మిషన్ ప్రహసనం: అదంతా ఒకెత్తయితే అమ్మాయి కోసం మంచి స్కూల్‌ను వెదకడం, అందులో అడ్మిషన్ కోసం పాటుపడడం ఒకెత్తు. ఒక్కో స్కూల్ ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలపిస్తుంటుంది. ఆశ్చర్యపోతుంటాడు రాజ్. తప్పదు అని తరుముతుంటుంది భార్య. అడ్మిషన్ ఫారాల కోసం క్యూలో నిలబడ్డం.. మంచి ఇంగ్లిష్ కోసం కోచింగ్ సెంటర్లకు వెళ్లడం.. అనే పరీక్షలను ఎదుర్కొ్కంటారు ఆ దంపతులు. అయినా తమ గారాల పట్టికి టాప్ స్కూల్లో సీట్ దొరకదు. నిరాశ చెందుతున్న సమయంలో సోకాల్డ్ ఓ మంచి స్కూల్లో గరీబ్కోటాలో సీట్లు ఉంటాయని తెలుస్తుంది. కొంతమంది ధనవంతులు ఆ గరీబ్కోటాలో తమ బిడ్డను చేర్పించడం కోసం పేదవాళ్లుగా నటించి గరీబు పిల్లల సీట్‌ను కాజేస్తున్నారని యాజమాన్యం కఠినంగా వ్యవహరిస్తుందీ విషయంలో. గరీబ్ బస్తీలకు వెళ్లి ఎంక్వయిరీ చేసి మరీ గీరబ్ కోటా సీట్‌ను కేటాయిస్తుందనే సమాచారం అందుతుంది రాజ్ కపుల్‌కి. తక్షణమే వసంత్ విహార్ నుంచి స్లమ్‌కి వచ్చేస్తారు. జీవితం అర్థమవుతుంది..: దోమలు, ఎలుకలతో కుస్తీ పట్టలేక.. దోస్తీ కూడా చేయలేక నిద్రలేని రాత్రులను గడుపుతుంటుంది ఆ కుటుంబం. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా.. కనీస అవసరాలైన నీళ్లు, కరెంట్, బాత్రూమ్ వంటి వాటికి ఆ జనం ఎన్ని కష్టాలు పడుతున్నారో కళ్లారా చూస్తారు. డబ్బులు ఉండీ ఖర్చుపెట్టలేని కర్మను కలిగించిన గరీబ్ కోటాను మనసులో తిట్టుకుంటూ.. వెంటనే సీట్ అనే వరాన్నిచ్చే అదే కోటాను ప్రార్థించుకుంటూ గడుపుతుంటారు. అంతలోకే ఎంక్వయిరీకి వస్తారు స్కూల్ సిబ్బంది. రాజ్ అండ్ ఫ్యామిలీని చూస్తే సిబ్బందికి అనుమానం వస్తుంది వాళ్లు పేదవాళ్లు కాదేమోనని. ఆ ఇంటి పక్కనే శ్యామ్ ప్రకాష్ (దీపక్ దోబ్రియాల్) అనే కూలీ కుటుంబమూ ఉంటుంది. ‘‘వాళ్లు నిజంగానే గరీబులు’’ అని స్కూల్ వాళ్లను నమ్మిస్తాడు శ్యామ్. సీట్ వచ్చాక స్కూల్ ఫీ కోసం రాజ్ ఏటీఎమ్‌లో డబ్బులు డ్రా చేస్తుంటే చూసి ‘‘అయ్యో డబ్బుల్లేక దొంగతనం చేస్తున్నావా.. తప్పు’’ అని అతనిని ఆపి, ఓ కార్ కిందకు వెళ్లి గాయాలు చేసుకుంటాడు. ఆ గాయం కింద కారు ఓనర్ దగ్గర పాతికవేలు డిమాండ్ చేసి మరీ రాజ్‌కి ఇస్తాడు శ్యామ్ ప్రకాష్. అయితే ఆ స్కూల్లో తన కొడుక్కోసమూ దరఖాస్తు చేస్తాడు శ్యామ్ గరీబ్ కోటాలో. చివరకు అతని కొడుకు స్థానంలోనే తన రాజ్ కూతురికి సీట్ ఖాయం అవుతుంది.ఇది రాజ్, అతని భార్యకు మాత్రమే తెలుసు. తెలియని శ్యామ్ తమను మంచివాళ్లుగా నమ్ముతూ సహాయంగా ఉండడం రాజ్‌కు గిల్ట్‌గా అనిపిస్తుంటుంది. కార్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్‌తో చాలా బాధపడ్తాడు. మోసం చేస్తున్నానే భావన అతనిని నిలవనివ్వదు. సీట్ ఖాయం కావడంతో మళ్లీ తమ ఇంటికి వెళ్లిపోతారు. ఇంకోవైపు శ్యామ్ ప్రకాష్ తన కొడుకును గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తాడు. శ్యామ్ ప్రకాష్ కొడుకు చదువుతున్న ఆ స్కూల్ ఏదో తెల్సుకొని దానికి ఆర్థిక సహాయం చేస్తాడు రాజ్. ఆ స్కూల్ బాగవుతుంది. పేద పిల్లలకు విద్యాభిక్ష పెట్టిన ఆ వ్యక్తిని కలుసుకోవాలని అడ్రస్ కనుక్కొని అతని ఇంటికి వెళ్తాడు శ్యామ్. చూస్తే రాజ్. అవాక్కవుతాడు శ్యామ్. అప్పుడు తెలుస్తుంది తన కొడుకు సీట్ లాక్కుంది అతనే అని. మోసం చేశావని తిడ్తాడు శ్యామ్. కోపంగా వెళ్లిపోతాడు. ఆఖరికి ఓ డ్రమటిక్ సన్నివేశంతో తన కూతురినీ అదే గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తాడు రాజ్. అప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది ఆ జంట. ఆద్యంతం హాస్యంతో మన విద్యావ్యవస్థ, ప్రైవేట్ స్కూళ్ల మీద విసిరిన వ్యంగ్యాస్త్రం ఈ చిత్రం. ముగింపు: భాష.. భావప్రకటనా సాధనం. మాతృభాష.. ఆ స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. నచ్చినట్టు బతికే అవకాశాన్ని కల్పిస్తుంది. కుల,మత, కలిమి,లేముల వర్గ సమాజాన్ని సమసమాజంగా మారుస్తుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి పరభాషా పరిజ్ఞానం అవసరమే. మనుషులను కలిపి ఉంచడానికి మాతృభాష మరీ అవసరం అని చూపించే సినిమా! ఏబీసీడీల సూప్ కన్నా అఆఇఈల గంజే అమృతం అని చెప్తుంది హిందీ మీడియం. సాకేత్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ మూవీ అమేజాన్ ప్రైమ్‌లో దొరుకుతుంది. -
ఒంటరి జీవితాల్లో లవ్ వెలుతురు కరీబ్ కరీబ్ సింగిల్
ఒంటరి మగవాళ్ల గురించి లోకం ఆలోచించదు. ఎక్కడో తింటాడు. ఎక్కడో నిద్రపోతాడు. సరే. ఒంటరి ఆడవాళ్ల గురించి లోకం ఆలోచిస్తుందా? భర్త చనిపోయి ఉండవచ్చు. లేదా విడాకులు తీసుకుని ఉండవచ్చు. లేదా పెళ్లి ఆలస్యమై ఉండవచ్చు. వారి మనసులో ఏముంది? వారి శరీరం ఏమంటోంది? వారు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? వారు ఏమని మాట్లాడాలనుకుంటున్నారు? ఎవరికి పట్టింది... పద్ధతిగా ఉంటూ సంఘానికి ప్రమాదం తెచ్చిపెట్టకుండా మర్యాదకరంగా జీవించాలనే అగోచర హద్దు గీసి లోకం తన పనుల్లో తాను బిజీగా ఉంటుంది. మరి వారి గోడు? ఈ సినిమాలో హీరోయిన్ విడో. భర్త మిలటరీలో మరణించి ఉంటాడు. గతం గతః అనుకోలేకపోతోంది. వయసు 35. చక్కటి రూపం. ఆరోగ్యవంతమైన దేహం. కాని సింగిల్‌గా ఉంటోంది. తమ్ముడు ఎక్కడో అమెరికాలో చదువుకుంటున్నాడు. తల్లి ఏదో ఊళ్లో ఉంది. తను ముంబైలో. మంచి ఉద్యోగమే. మంచి ఇల్లే. మంచి కారే. సరా? తనకు కావలసినవన్నీ ఉన్నట్టేనా? ఒంటరితనం ఆమెను బాధిస్తూ ఉంది. కాని భర్త జ్ఞాపకాల పట్ల లాయల్‌గా ఉండాలన్న సగటు భారతీయ అభిప్రాయం ఆమెలో ఉంది. గతం తాలూకు లగేజ్ ఆమెను వదల్లేదు. అలాంటి హీరోయిన్ ఒక డేటింగ్ సైట్లో తన వివరాలు పోస్ట్ చేస్తే ఇర్ఫాన్ ఖాన్ పరిచయం అవుతాడు. హీరోయిన్ వాలకం గమనిస్తాడు. ‘మీ అరేంజ్డ్ మేరేజ్ వాళ్లంతా ఇంతే. భర్తలకు అవసరానికి మించి ప్రాధాన్యం ఇస్తారు’ అంటాడు. ‘ప్రేమలో అలా కాదు. ప్రేమ ఒక కవిత్వం’ అంటాడు. తనకు ముగ్గురు మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్లంతా తనను తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంటారని చెబుతాడు. హీరోయిన్ ‘నీ మొహం’ అన్నట్టు చూస్తుంది. తన మాట నిరూపించుకోవడానికి ఆమెను ఆ ముగ్గురూ ఉన్న మూడు ఊర్లు– డెహరాడూన్, జైపూర్, గాంగ్టక్ తీసుకువెళతాడు. ఆ ప్రయాణమే ఈ కథ. సినిమాలో ఇర్ఫాన్ చాలా భోళామనిషి. వాగుడుకాయ. మనసులో అనిపించింది చెప్పి, అనుకున్నది చేసేయాలనుకునే రకం. కాని ఆడవాళ్లంటే గౌరవం. ‘ఈ క్షణంలో ఈ నిమిషంలో జీవితాన్ని ఎలా ఉంటే అలా ఎంజాయ్ చేయ్’ అనేది అతడి ఫిలాసఫీ. అందుకే మొదటి ట్రిప్పులోనే ఆమెను ఫ్లయిట్ ఎక్కించి, తను ఫ్లయిట్ మిస్సయినా హాయిగా తర్వాతి ఫ్లయిట్లో వస్తాడు. ఆమె మాత్రం టెన్షన్‌తో చస్తుంది. ఢిల్లీలో కూడా అంతే. జైపూర్ ట్రైన్ ఎక్కించి, తను పొరపాటున వేరే ట్రైన్ ఎక్కేస్తాడు. ఆమెకు మళ్లీ టెన్షన్. అతను మాత్రం ఏ ట్రైన్లో ఎక్కాడో ఆ ట్రైన్లో హాయిగా పేకాటలో కూర్చుంటాడు. ఇది ఆమెకు నచ్చదు. కాని ఇది ఆమెకు బాగుంది కూడా. నిజానికి ముందు ట్రిప్పు ముగిసే టైముకే ఆమె అతడి ప్రేమలో పడుతుంది. రెండో ట్రిప్పులో అతడు రెండో మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను కలవాలని అనుకున్నప్పుడు అసూయతో రగిలి నానా గోల చేస్తుంది. మూడో ట్రిప్‌లో అసలు అతడి గర్ల్‌ఫ్రెండ్‌నే చూడదు. అతణ్ణి ఉడికించాలని తనకో మాజీ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడంటూ ఎవరినో చూడటానికి వెళుతుంది. కాని ఆశ్చర్యం ఏమిటంటే అతడు కూడా తన మూడో మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడు. ఎందుకంటే అప్పటికే హీరోయిన్ ప్రేమలో మునిగిపోయాడు కాబట్టి. ఈ మూడు ప్రయాణాల్లో వాళ్లు ఒకరినొకరు తెలసుకుంటారు. తమను తాము తెలుసుకుంటారు. పాత బ్యాగేజ్ వదిలించుకుని పరస్పరం కొత్త గమ్యం వైపు అడుగు వేయడానికి నిశ్చయించుకుంటారు. కథ అందంగా ముగుస్తుంది. మెచ్యూర్ లవ్ స్టోరీలు సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే నీరసంగా ఉంటాయి. కాని ఈ సినిమా మొదలైనప్పటి నుంచి పెదాల మీద నవ్వులతో హాయిగా సాగిపోతుంది. ‘జీవితం ఆగిపోవడానికి కాదు. ముందుకు సాగిపోవడానికే. గతంలో ఏవో జరుగుతాయి. వర్తమానంలో ఏవో జరుగుతుంటాయి. ఎన్ని జరిగినా ముందుకు నడవాల్సిందే’ అని ఈ సినిమా చెబుతుంది. ఇర్ఫాన్ గతంలో ప్రేమించిన ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ వాళ్ల వాళ్ల జీవితాల్లో స్థిరపడి ఉంటారు. ఆగిపోలేదు. అలా ఆగిపోయి ఉంటారనుకోవడం, ఆగిపోయి ఉండాలనుకోవడం తప్పు అని ఈ సినిమా చెబుతుంది. అంతేనా? మన చుట్టూ ఉండేవాళ్లలో సింగిల్‌గా ఉంటున్న వాళ్లను అలాగే ఆపకుండా ఆపేయకుండా వాళ్ల జీవితాల్లో ‘ప్రేమ’, ‘బంధం’ అవసరాన్ని గ్రహించమని మనకు హితబోధ చేస్తుంది. ఇర్ఫాన్ సంగతి తెలిసిందే కాని ఇందులో హీరోయిన్గా చేసిన మలయాళ నటి పార్వతి కూడా చాలా బాగా చేసింది. డైలాగ్స్ చాలా క్యాజువల్‌గా, విట్టీగా ఉంటాయి. జోక్ మీద జోక్ పడుతుంటుంది. హిందీ తెలిస్తే మజా. సినిమాలో ఒకసారి ఫ్లయిట్ ఒకసారి ట్రైన్ మిస్సయిన ఇర్ఫాన్ హీరోయిన్‌తో తాను ప్రేమలో పడ్డానని రూఢీ చేసుకున్నాక ఆమె ఉన్న రోప్ వేను మాత్రం మిస్ కాకుండా పట్టుకుంటాడు. అంతవరకూ తన వాటర్ బాటిల్‌ను అతడితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడని ఆమె క్లయిమాక్స్‌లో అతడి వాటర్ బాటిల్‌ను పెదాలకు అంటించుకుని తాగుతుంది. చిన్న సజెషన్. ప్రేక్షకులకు మాత్రం వాళ్ల ప్రేమ కన్ఫర్మ్ అయినందుకు సంతోషం వేస్తుంది. ఉమన్ డైరెక్టర్ తనూజా చంద్ర తీసిన ఈ సినిమా చక్కటి ముచ్చటైన సినిమా. చూడటం ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’లో వేడి వేడి పకోడి తినడం లాంటిది. ఈ రిఫరెన్స్ ఏమిటో తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. – కె -
లేడీ డాన్‌గా దీపిక
బాలీవుడ్ లో వరుస విజయాలతో స్టార్ హీరోలకు పోటి ఇస్తున్న దీపిక పదుకొణె మరో ఆసక్తికరమైన సినిమాలో నటించనుంది. ముంబైని గడగడలాండించిన లేడీ డాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో దీపిక నటించనుంది. 80లలో ముంబయికి చెందిన మాఫియా క్వీన్ సప్నా దీదీ జీవితాధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో సప్నా దీదీగా దీపిక నటించనుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. పీకు సినిమాతో సక్సెస్ఫుల్ పెయిర్ అనిపించుకున్న దీపిక పదుకొణె, ఇర్ఫాన్ ఖాన్ లు ఈ బయోపిక్ కోసం మరోసారి జోడికడుతున్నారు. ప్రస్తుతం పద్మావతి ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న దీపిక, ఆ పనులు పూర్తయ్యాక బయోపిక్ షూటింగ్లో పాల్గొననుంది. ఈ సినిమాకు విశాల్ టీంలో చాలా కాలంగా దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న హనీ దర్శకత్వం వహించనున్నాడు. -
బాలీవుడ్ బాటలో సౌత్ హీరో..!
ఓకె బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టీ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్, తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సౌత్ లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న బాలీవుడ్ సినిమాతో నార్త్ లో అడుగుపెడుతున్నాడు దుల్కర్ సల్మాన్. ఎక్కువ భాగం కేరళలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్, మిథిలా పాల్కర్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రావెల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆకర్ష్ ఖురానా దర్శకుడు. ప్రస్తుతం సోలో సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న దుల్కర్ త్వరలో బాలీవుడ్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు. -
హాట్ సాంగ్‌లో..
హాట్ గాళ్ ఊర్మిళా మాతోండ్కర్ పేరు చెబితే.. ‘రంగీలా’ (తెలుగులో ‘రంగేళి’) గుర్తుకు రాక మానదు. ఆ చిత్రంలో హాట్ హాట్‌గా నటించిన ఊర్మిళ ఆ తర్వాత కూడా పలు చిత్రాలు చేశారు. కానీ, ‘రంగీలా’ ఆమె కెరీర్లో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. ఈ హాట్ స్టార్ తాజాగా ఓ హాట్ ఐటమ్ సాంగ్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇర్ఫాన్ ఖాన్ లీడ్ రోల్లో అభినయ్ డియో దర్శకత్వం వహిస్తున్న ‘రైతా’ అనే చిత్రంలోనే ఊర్మిళ ప్రత్యేక పాట చేయనున్నారట. అన్నట్లు.. ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేయడం ఇది మొదటిసారి కాదు. 1998లో వచ్చిన ‘చైనా గేట్’ చిత్రంలో ‘చమ్మా.. చమ్మా..’ అనే ఐటెమ్ సాంగ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
మా కూతురంటే నమ్మలేకపోతున్నాం హిందీ మీడియం : ట్రైలర్ నిడివి : 2 ని. 42 సె. ::: హిట్స్ : 80,27,124 ఇంగ్లిష్ ఒక భాష కాదు. ఒక హోదా! రైట్? ఇర్ఫాన్‌ఖాన్ కొత్త సినిమా ‘హిందీ మీడియం’ ట్రైలర్ ఈ సంగతే చెబుతోంది. ఇందులో ఇర్ఫాన్ పక్కన పాకిస్థానీ నటి సబా ఖమర్ జమన్ నటిస్తున్నారు. ప్రపంచంలో ఎన్ని వర్గాలైనా ఉండనివ్వండి. వాటి అన్నిటిపైనా ఉన్నవి రెండే రెండు వర్గాలు. ఇంగ్లిష్ మాట్లాడే వర్గం ఒకటి. ఇంగ్లిష్ మాట్లాడలేని వర్గం ఒకటి. ఈ రెండున్నర నిముషాల ట్రైలర్లో... హిందీ మాత్రమే వచ్చిన ఇర్ఫాన్‌ఖాన్, ఇంగ్లిష్‌ను అనర్ఘళంగా మాట్లాడే ఆయన భార్య సబా... కూతురికి మంచి ఇంగ్లిష్ ఎడ్యుకేషన్‌ను ఇప్పించే విషయమై పడే తపన హాస్యభరితంగా ఉంటుంది. సాకేత్ చౌదరి దర్శకత్వంలో వస్తున్న ఈ మలయాళీ రీ మేక్ (సాల్ట్ మ్యాంగో ట్రీ) మూవీ మే 12న విడుదల అవుతోంది. ‘ఈ రోజు నుంచి నేను ఇంగ్లిషులోనే మాట్లాడతానని ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే ఇంగ్లిషే ఇండియా, ఇండియానే ఇంగ్లిష్’ అనే సెటైర్‌తో వీడియో ముగుస్తుంది. మరి ప్రారంభం ఎలా ఉంటుంది? ‘ఈ అమ్మాయి మా కూతురంటేనే నమ్మలేకపోతున్నాం సార్. అంత తెలివైన అమ్మాయి’ అంటాడు ఇర్ఫాన్ ప్రిన్స్‌పాల్‌తో! తన కూతురికి ఎలాగైనా ఇంగ్లిష్ మీడియం స్కూల్లో సీటు సంపాదించడం అతడి లక్ష్యం. అలా నాలుగైదు స్కూళ్లకు దరఖాస్తు చేస్తాడు. ఈలోపు తను కూడా ఇంగ్లిషు నేర్చుకోడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంటర్వూ్యలలో పేరెంట్స్ కూడా ఇంగ్లిష్‌లో మాట్లాడాలి కదా. అందుకు. మధ్య మధ్య భార్య అతడి ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంటుంది. ఇంగ్లిష్‌లో మాట్లాడలేకపోతే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఫ్రీక్వెంట్‌గా కన్నీళ్లు పెట్టుకుని మరీ చెబుతుంది. ఇర్ఫాన్ నలిగిపోతాడు. ఇంగ్లిష్ స్కూల్లో కూతురు నలిగిపోతుంటుంది. ఈ వైనాన్నంతా హాస్యానికి వ్యంగ్యాన్ని జోడించి చూపించారు. సో... జీవితానికి దగ్గరగా ఉండే మరొక మంచి బాలీవుడ్ మూవీ మన కోసం ఎదురుచూస్తూ ఉందన్నమాట. ఆట పాటైంది... పాట ఆటైంది! సచిన్స్ క్రికెట్ వాలీ బీట్ నిడివి : 3 ని. 44 సె. ::: హిట్స్ : హిట్స్ : 25,66,013 సచిన్ మొబైల్ యాప్ ‘100 ఎంబి’ కోసం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మ్యూజిక్ రాక్ స్టార్ సోనూ నిగమ్ కలిసి పాడిన జుగల్బందీ ‘నాచో నాచో నాచో సారె.. క్రికెట్ వాలి బీట్ పె..’ క్రికెట్ లవర్స్‌ని, సచిన్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. వరుణ్ లిఖాటే, షామీర్ టాండన్ ఈ పాటను రాశారు. మ్యూజిక్‌ను షామిర్ టాండన్ అందించారు. ఇక ఈ వీడియోకి డైరెక్షన్ నిషాంత్ నాయక్. ఈ పాటలో సచిన్ ప్రసిద్ద క్రికెట్ సెలబ్రిటీలను, తను ఆడిన ఆరు ప్రపంచ కప్‌లలోని ప్లేయర్లను తలచుకున్నాడు. ప్రవీణ్, రవి, సుబ్రోతో, కపిల్, కిరణ్, వినోద్, అజార్, అనిల్ కృష్ణమాచారి, అశీష్ కపూర్, సంజయ్, నయాన్, మనోజ్, సలీల్; అజయ్, జవగళ్, వెంకటేశ్, రాజు, సౌరవ్, సడగోపన్, సిద్ధు, రాహుల్, రాబిన్, దేబశీష్, నిఖిల్, అజిత్, అమేయ్, అశీష్; జహీర్, బంగర్, దినేశ్, వీరు, పార్థివ్, భజ్జీ, యువీ, కైఫ్, ఉతప్ప, కార్తీక్, మునాఫ్, శ్రీశాంత్, గౌతమ్, ఇర్ఫాన్, యూసప్ పఠాన్; సురేశ్, పీయూష్, విరాట్ కొహ్లీ, అశ్విన్, ఎం.ఎస్.ధోనీ.. లవ్ యూ గైస్ అంటూ... పాటలో ఈ పేర్లను ఓ చరణంలో రాగయుక్తంగా పాడతాడు సచిన్. బాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఊగుతూ పాడడం చూస్తుంటే వింతైన అనుభూతి కలుగుతుంది. క్రికెట్లోని కొన్ని అద్భుత క్షణాల నిశ్చల చిత్రాలను కూడా వీడియో మధ్యలో మిక్స్ చేశారు. అభిమానులు తట్టుకోలేని విషాద చిత్రం వినోద్‌ఖన్నా షాకింగ్ లుక్ నిడివి : 2 ని. 57 సె. ::: హిట్స్ : హిట్స్ : 18,30,003 తీవ్రమైన డీ హైడ్రేషన్‌తో ఈ నెల 2న ఆసుపత్రిలో చేరిన పూర్వతరం నటుడు వినోద్ ఖన్నా ఆరోగ్య స్థితిపై గత రెండు రోజులుగా ఆందోళనకరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలోని సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వినోద్‌ఖన్నాను పరామర్శించేందుకు ముంబై ప్రముఖులంతా వెళ్లివస్తున్నారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. 1968–2013 మధ్య కాలంలో వినోద్‌ఖన్నా 140కి పైగా చిత్రాలలో నటించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బి.జె.పి. అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసిన ఖన్నా తన ప్రత్యర్థిపై లక్షా 36 వేల 65 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. మేరే అప్నే, మేరా గావ్ మేరా దేశ్, ఇంతిహాన్, ఇన్కార్, అమర్ అక్బర్ ఏంథోనీ, లహు కె దొ రంగ్, ఖుర్బానీ, దయవాన్, జుర్మ్ చిత్రాలతో అసమాన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ఈ హీరో... ప్రస్తుతం ఆసుపత్రి పడకపై ఎలా ఉన్నారో ‘లెహ్రెన్ రెట్రో’ అనే సైట్.. ఖన్నా గతాన్ని, ప్రస్తుతాన్ని గుదిగుచ్చిన చిత్రాలతో ఈ వీడియోను రూపొందించి యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేసింది. వినోద్ ఖన్నా కొంతకాలంగా బ్లాడర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారన్న వదంతికి బలం చేకూర్చే ఈ వీడియోలో ఖన్నా క్లిప్పింగ్ కనిపిస్తుంది. ఏదైనా ఇది సినీ అభిమానులు తట్టుకోలేని విషాదమే. -
కలాం పాత్రలో ఇర్ఫాన్
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరో ఛాలెంజింగ్ పాత్రకు రెడీ అవుతున్నాడు. మిసైల్ మ్యాన్‌గా భారత రక్షణ వ్యవస్థ విశేష సేవలు అందించటంతో పాటు భారత రాష్ట్రపతిగా సేవలందించిన అబ్దుల్ కలాం పాత్రలో నటించనున్నాడు. మరాఠీ నిర్మాత ప్రమోత్ గోరె, కలాం జీవితంపై సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కలాం సాధించిన విజయాలతో పాటు ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్పటికే కలాం జీవితంపై ఎంతో రీసెర్చ్ చేసిన ప్రమోద్, ఆయన కుటుంబసభ్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఏపీజే అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను జూలై లేదా ఆగస్టులో ప్రారంభించి 2017లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇర్ఫాన్ ఖాన్ ను కలాం పాత్రకు ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్న నిర్మాత ప్రమోద్, ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయనున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. -
హిందీ వర్షన్‌కు టాప్ స్టార్స్ డబ్బింగ్
ప్రస్తుతం అంతర్జాతీయ సినీ అభిమానులను ఆకర్షిస్తున్న సినిమా 'ద జంగిల్ బుక్'. 90లలో కార్టూన్ టివి సీరీస్‌గా అలరించిన ఈ అడ్వంచరస్ యాక్షన్ స్టోరీని ఇప్పుడు సినిమాగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాను ఇండియాలోనూ అదే స్థాయిలో భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమాలోని పాత్రలకు బాలీవుడ్ టాప్ స్టార్స్‌తో డబ్బింగ్ చెప్పిస్తున్నారు నిర్మాతలు. ఇర్ఫాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, ఓం పురి, నానాపటేకర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు 'ద జంగిల్ బుక్' సినిమాలోని ఫైతాన్, బాలూ, భగీరా, షేర్ ఖాన్ పాత్రలకు గాత్రధానం చేస్తున్నారు. ఈ సినిమాలో మోగ్లీ పాత్రలో నటించిన బాలనటుడు నీల్ సేతీ కూడా భారతీయ మూలాలు కలిగిన నటుడు కావటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. జాన్ ఫ్వారూ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8న భారత్ లో రిలీజ్ అవుతోంది. -
సూపర్ స్టార్లతో ఏలేటి సాహసం
రెగ్యులర్ కమర్షియల్ జానర్‌కు భిన్నంగా కొత్త తరహా సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలను తీస్తూ వస్తున్న ఈ డైరెక్టర్, ఇంతవరకు ఒక్క భారీ కమర్షియల్ సక్సెస్ కూడా అందుకోలేకపోయినా, దర్శకుడిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. సాహసం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న చంద్రశేఖర్ ఏలేటి ప్రస్తుతం ఓ మల్టీ లింగ్యువల్ సినిమాకు రెడీ అవుతున్నాడు. వారాహి చలనచిత్ర బ్యానర్‌పై సాయి కొరపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్రోల్లో నటిస్తుండగా చాలాకాలం తరువాత గౌతమి హీరోయిన్గా నటిస్తుంది. తెలుగు, తమిళ్‌తో పాటు ఈ సినిమాను కన్నడలో కూడా తెరకెక్కించాలని భావిస్తున్న ఏలేటి, కన్నడ వర్షన్లో హీరోగా సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ను ఒప్పించాలని ట్రై చేస్తున్నాడు. బాలీవుడ్ ఆర్టిస్ట్ ఇర్ఫాన్ ఖాన్ మరో లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
సౌత్ సినిమాలో ఇర్ఫాన్
విలక్షణ నటుడిగా బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఇర్ఫాన్ ఖాన్ మరోసారి సౌత్ సినిమాలో కనిపించనున్నాడు. గతంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సైనికుడు సినిమాలో విలన్‌గా కనిపించిన ఇర్ఫాన్, చాలా కాలం తరువాత మరోసారి సౌత్ సినిమాలో నటిస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న త్రిభాషా చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్ నటించనున్నాడన్న టాక్ వినిపిస్తుంది. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, గౌతమి జంటగా నటిస్తున్నారు. అభిరుచి గల నిర్మాతగా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి, వారాహి చలనచిత్ర బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇర్ఫాన్ క్యారెక్టర్ పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా. ఈ సినిమాలో నటించడం ఖాయం అన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. -
'జెజ్‌బా' మూవీ రివ్యూ
టైటిల్ : జెజ్‌బా జానర్ ; థ్రిల్లర్ యాక్షన్ డ్రామా తారాగణం ; ఐశ్వర్యరాయ్, ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మీ, జాకీ ష్రాఫ్, అతుల్ కులకర్ణీ దర్శకత్వం ; సంజయ్ గుప్తా సంగీతం ; సచిన్ జిగార్ నేపథ్య సంగీతం ; అమర్ మొహిలే నిర్మాత ; వైట్ ఫెదర్ ఫిలింస్, వీకింగ్స్ మీడియా & ఎంటర్టైన్మెంట్ ఐదేళ్ల విరామం తరువాత ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ సినిమాగా విడుదలకు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది జెజ్‌బా. 2007లో రిలీజ్ అయిన సౌత కొరియన్ ఫిలిం 'సెవెన్‌డేస్' ఆధారంగా ఈ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇండియన్ నేటివిటికి తగ్గట్టుగా అన్ని రకాల మార్పులతో థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే తో తెరకెక్కిన జెజ్‌బా ఆడియన్స్ ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథ : ముంబైలో లీడింగ్ క్రిమినల్ లాయర్ అయిన అనురాధ వర్మ (ఐశ్వర్యరాయ్) పరిచయంతో సినిమా మొదలవుతుంది. తన కెరీర్లో వంద శాతం సక్సెస్‌లతో నెంబర్ వన్ లాయర్ అనిపించుకుటుంది. భర్త నుంచి విడాకులు తీసుకొని విడిగా ఉంటున్న అనురాధ తన కూతురు సాన్యా (సారా అర్జున్) ఆలనాపాలనా కూడా తనే చూసుకుంటుంది. కూతురు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంటుంది. ఒకరోజు స్కూల్లో ఆటల పోటీలు జరుగుతున్న సందర్భంలో సాన్యా కిడ్నాప్ అవుతుంది. అయితే కిడ్నాపర్స్ డబ్బులు అడగటానికి బదులు జైలులో ఉన్న నవాజ్ తరపున కేసు వాదించాల్సిందిగా డిమాండ్ చేస్తారు. సియా(ప్రియాబెనర్జీ) అనే అమ్మాయిని రేప్ చేసి హత్య చేసిన నేరం మీద నవాజ్ జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. ఇక చేసేదేమిలేక నవాజ్ తరపున కేసు వాదించటానికి అంగీకరిస్తుంది అనురాధ. అదే సమయంలో అనురాధ స్నేహితుడు, సస్పెండ్ అయిన పోలీస్ అధికారి యోహన్( ఇర్ఫాన్ ఖాన్) ఆమెకు సాయం చేయడానికి అంగీకరిస్తాడు. ఈ ఇద్దరు కిడ్నాపర్స్ నుంచి సాన్యాను ఎలా బయటికి తీసుకువచ్చారు అన్నదే మిగతా కథ. నటీనటులు : రీ ఎంట్రీ లో ఐశ్వర్యరాయ్ తన వయసుకు తగ్గ కథను ఎంచుకుంది. నటిగా తనలో ఏ మాత్రం పట్టు తగ్గలేదని ఈ సినిమాతో నిరూపించుకుంది. కూతురు కిడ్నాప్ అయిన తరువాత బలవంతంగా ఓ కేసు వాదిస్తున్న లాయర్‌గా అండర్ కరెంట్ ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించింది. లాయర్ అనురాధకు సాయం చేసే పాత్రలో ఇర్ఫాన్ ఖాన్ మెప్పించాడు. కొన్ని సీన్స్‌లో ఇర్ఫాన్ నటన ఆ పాత్రకు తనే అల్టిమేట్ చాయిస్ అనిపించేలా ఉంది. ఇక హత్యకు గురైన యువతి తల్లిగా షబానా అజ్మీ ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో ఐశ్వర్యతో పోటీపడి నటించిన షబానా తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో నటించిన జాకీ ష్రాఫ్, సారా అర్జున్, అతుల్ కులకర్ణీ, సిద్ధాంత్ కపూర్ తన పాత్ర పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం సంజయ్ గుప్తా స్క్రీన్ ప్లే. క్రైం థ్రిల్లర్లను తెరకెక్కించటంలో మంచి అనుభవం ఉన్న సంజయ్ మరోసారి ఆ జానర్లో ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాలు అభిమానులను రెప్పవేయకుండా చూసేలా చేస్తాయి. ప్రథమార్థం చివరలో సినిమా కాస్త స్లో అయినట్టుగా అనిపించినా సెకండాఫ్ మాత్రం అద్భుతంగా వచ్చింది. సినిమాకు ప్రాణం పోసిన మరో సాంకేతిక నిపుణుడు డైలాగ్ రైటర్ కమలేష్ పాండే. ఎమోషనల్ సీన్స్‌తో పాటు కోర్ట్ సీన్స్‌లోనూ కమలేష్ డైలాగ్స్ చాలా బాగా పేలాయి. ఆడియో పరంగా ఆకట్టుకోకపోయినా అమర్ మొహిలే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన రేంజ్ లో పండించాడు. సమీర్ ఆర్య సినిమాటోగ్రఫి ఆశించిన స్థాయిలో మెప్పించింది. విశ్లేషణ : ఒక మామూలు క్రైమ్ డ్రామాను థ్రిల్లర్‌గా మలిచిన సంజయ్ గుప్త మంచి విజయం సాధించాడు. ఐదేళ్ల విరామం తరువాత వెండితెర మీద దర్శనమిచ్చిన ఐశ్వర్య తన అద్భుతమైన నటనతో మరోసారి అభిమానుల మనసు గెలుచుకుంది. గ్లామర్ షో కోరుకునే వారిని నిరాశపరిచినా, నటన పరంగా మాత్రం బెస్ట్ అనిపించుకుంది. ఇక ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మీలు డైరెక్టర్స్ బెస్ట్ ఛాయిస్ అనిపించుకున్నారు. అవార్డ్ ఇన్నింగ్ పర్ఫామెన్స్‌లతో సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. అయితే ఫస్టాఫ్ చివరలో వచ్చిన కొన్ని సీన్స్ మాత్రం ఆడియన్స్‌కు బోర్ కొట్టిస్తాయి. సాంకేతిక విభాగం నుంచి చిన్న చిన్న పొరపాట్లు కనిపించినా జెజ్‌బా సక్సెస్ ఫుల్ సినిమాగా ఆకట్టుకుంది. ప్లస్ పాయింట్స్ ఐశ్వర్యరాయ్, ఇర్ఫాన్‌ఖాన్, షబానా అజ్మీల నటన స్క్రీన్ ప్లే డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ మ్యూజిక్ ఓవరాల్ గా జెజ్‌బా ఐశ్వర్యరాయ్‌కి సక్సెస్ఫుల్ కంబ్యాక్ -
'తల్వార్' మూవీ రివ్యూ
టైటిల్ : తల్వార్ జానర్ ; క్రైమ్ థ్రిల్లర్ తారాగణం ; ఇర్ఫాన్ ఖాన్, కొంకన్సేన్శర్మ, నీరజ్ కబీ, సోహమ్ శర్మ దర్శకత్వం ; మేఘన గుల్జార్ సంగీతం ; విశాల్ భరద్వాజ్ నిర్మాత ; వినీత్ జైన్, విశాల్ భరద్వాజ్ బాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలు మంచి విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో అదే తరహాలో తెరకెక్కిన మరో సినిమా తల్వార్. పరువు హత్యగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఇప్పటికీ మిస్టీరియస్‌గానే మిగిలిన ఆరుషి తల్వార్ హత్య కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ కేసును దర్యాప్తు చేసే పోలీస్ అధికారిగా ఇర్ఫాన్ ఖాన్ నటించిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది. నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన తల్వార్ వెండితెర మీద ఎలాంటి రిజల్ట్ సాధించిందో చూద్దాం. కథ : అశ్విన్ కుమార్ ( ఇర్ఫాన్ ఖాన్ )ను సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్టర్గా పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమవుతుంది. డిపార్ట్మెంట్ అధికారులు అతనికి శృతి టాండన్ హత్య కేసు విచారణ బాధ్యతలు అప్పగిస్తారు. 2008 మార్చ్ 15 రాత్రి శృతి టాండన్ (అయేషా ప్రవీణ్) నోయిడాలోని సమీర్ విహార్ ప్రాంతంలో హత్యకు గురవుతుంది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు రమేష్ (నీరజ్ కబీ), నూతన్ ( కొంకణా సేన్ శర్మ)లు పోలీసులకు సమాచారం అందిస్తారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎన్నో అనుమానాల తర్వాత శృతిది పరువు హత్యగా భావించి, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేస్తారు. ఈ సమయంలో కేసు విచారణ బాధ్యతలు తీసుకున్న ఇన్స్పెక్టర్ అశ్విన్ కుమార్ ఆ హత్య కేసును ఎలా పరిష్కరించాడన్నదే సినిమా కథ. నటీనటులు, సాంకేతిక నిపుణులు : సినిమా అంత వన్ మేన్ షోలా ఇర్ఫాన్ ఖాన్ చూట్టూ తిరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే ఇర్ఫాన్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా కనిపించిన ఇర్ఫాన్ తనకు బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టుగా ఎందుకు గుర్తింపు వచ్చిందో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక ఇతర పాత్రల్లో నటించిన వారికి పెద్దగా పర్ఫామెన్స్ స్కోప్ లేకపోయినా ఎవరి పరిధి మేరకు వారు ఆకట్టుకున్నారు. హత్యకు గురైన శృతి తల్లి పాత్రలో కొంకణా సేన్ శర్మ మెప్పించింది. ఒకవైపు కూతురు మరణం, మరోవైపు ఆ హత్యకు తనే కారణం అంటూ ఆరోపణలు రావటం మధ్య ఓ తల్లి ఎలాంటి మానసిక వేదన అనుభవిస్తుందో చాలా బాగా చూపించింది. దేశవ్యాప్తంగా ఎంతో ప్రచారం కలిగిన ఓ హత్య కేసును కథ ఎంచుకొని చాలా పెద్ద సాహసమే చేసింది దర్శకురాలు మేఘన గుల్జార్. వివాదాలకు అవకాశం ఉన్న సబ్జెక్ట్ అయినా, కథా కథనాల్లో పూర్తి పట్టు కనబరించింది. ముఖ్యంగా ఓ థ్రిల్లర్ సినిమాను నడించడానికి స్క్రీన్ ప్లే లో తీసుకున్న జాగ్రత్తలు, పాత్రల ఎంపికలో ఆమె తీసుకున్న కేర్ సినిమా సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేశాయి. నిర్మాణ బాధ్యతలతో పాటు సంగీతం అందించిన విశాల్ - భరద్వాజ్ ఆకట్టుకున్నారు. సినిమాకు ప్రాణం లాంటి చాలా సీన్స్ కు తమ సంగీతంతో మరింత లైఫ్ తీసుకొచ్చారు. పంకజ్ కుమార్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. విశ్లేషణ : సున్నితమైన అంశమే అయినా ఎక్కడా వివాదాలకు తావివ్వకుండా సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కించటంలో దర్శకురాలు మేఘన గుల్జార్ మంచి విజయం సాదించింది. మర్డర్ మిస్టరీ సినిమాను థ్రిల్లింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అద్భుతంగా తెరకెక్కించి అందరినీ ఆకట్టుకుంది. తొలి భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించిన మేఘన, సెకండ్ హాఫ్ లో మాత్రం కాస్త పట్టు కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. అయితే అప్పటికే ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్ అవ్వటంతో స్క్రీన్ ప్లే స్లో అయినా బోర్ అనిపించదు. నటీనటుల పర్ఫామెన్స్ తో పాటు ఇతర సాంకేతిక నిపుణుల పనితనంతో తల్వార్ కమర్షియల్ సక్సెస్ గానే కాక విమర్శకులు ప్రశంసలు అందుకునే ఉత్తమ చిత్రంగా రూపొందింది. ప్లస్ పాయింట్స్ ఇర్ఫాన్ ఖాన్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్ సెకండ్ ఆఫ్ స్లో నారేషన్ ఓవరాల్ గా తల్వార్ పక్కా కమర్షియల్ వాల్యూస్ తో తెరకెక్కిన రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ -
జపనీస్ - అమెరికన్ టీవీ షోలో ఇర్ఫాన్?
ఇర్ఫాన్ ఖాన్... ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్‌లలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్. ఓ పక్క బాలీవుడ్ చిత్రాల్లో నటి స్తూనే, హాలీవుడ్లో కూడా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అక్కడ కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఎంత బిజీ అంటే.... తాను నటించిన చిత్రాల ప్రచారానికే సమయం కేటాయించలేని పరిస్థితిలో ఉన్నారు. సినిమాలతో బిజీగా ఉన్న ఇర్ఫాన్‌ఖాన్‌కు జపాన్-అమెరికా దేశాలు జాయింట్ వెంచర్‌గా రూపొందించనున్న ఓ టీవీ షోలో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. ఆ షో ప్రతినిధులు ఇర్ఫాన్‌కు ఇటీవలే స్క్రిప్ట్ వినిపించారట. ఆ స్క్రిప్ట్, పాత్ర నచ్చడంతో మరో ఆలోచనకు తావు ఇవ్వకుండా ఇర్ఫాన్ ఖాన్ ఆ షోలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కే ఈ ధారావాహికలో ఇర్ఫాన్‌ది చాలా కీలకమైన పాత్ర అని బోగట్టా. -
ఆ యాక్షనూ వేరు..! ప్రేక్షకులూ వేరు..!!
ఇటీవల వచ్చిన రెండు పెద్ద చిత్రాల్లో అందరినీ ఆకర్షించిన నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఒకపక్క అమితాబ్ బచ్చన్ ‘పీకూ’లో దేశీయ ప్రేక్షకుల్నీ, మరోపక్క ‘జురాసిక్ వరల్డ్’లో అంతర్జాతీయ ప్రేక్షకుల్నీ ఏకకాలంలో అలరించారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’, ‘ది ఎమేజింగ్ స్పైడర్‌మ్యాన్’, ‘లైఫ్ ఆఫ్ పై’ సహా పలు ఇంగ్లీషు చిత్రాల్లో ఇటీవల తరచూ కనిపిస్తున్న ఈ విలక్షణ నటుడికి ఆ హాలీవుడ్ అనుభవం కొత్త కిటికీలు తెరిచింది. అందుకే, ఆయన ఇప్పుడు హాలీవుడ్లో తన అనుభవం గురించి కథలు కథలుగా చెబుతున్నారు. ‘‘హాలీవుడ్, బాలీవుడ్‌లు దేనికదే ప్రత్యేకం. ఈ రెండు భారీ సినీ పరిశ్రమల్లో పనిచేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నా. అయితే, ఎక్కడి పని తీరు అక్కడే వేరు’’ అని ఆయన అన్నారు. ‘‘హాలీవుడ్లో ప్రేక్షకులు వేరు. అందుకే, అక్కడ నటించడానికి విలక్షణమైన నైపుణ్యం కావాలి. ఫలితంగా కొత్త రకం పని చేసే అవకాశం నాకు వచ్చింది’’ అని వివరణ కూడా ఇచ్చారు. ‘‘ఎక్కువమంది ప్రేక్షకులకు చేరే హాలీవుడ్ సినిమాలది ఒక ప్రత్యేకమైన విశ్వజనీన భాష. అందుకే, ఆ సినిమాలు ఇక్కడి మన సినిమాల మీద ఆధిపత్యం చూపిస్తున్నాయి. ఆ సినిమాల వల్ల మన భారతీయ సినిమాల వ్యాపారం మీద కూడా ప్రభావం ఉంటోంది’’ అని ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా పేరు తెచ్చుకున్న ఈ భారతీయ నటుడు అన్నారు. మొత్తానికి, ప్రపంచం తిరిగాక నటనతో పాటు అభిప్రాయాల్లోనూ ఇర్ఫాన్ మరింత పరిణతి సాధించినట్లున్నారు. -
ఇర్ఫాన్ can
ఈయన స్టార్ కాడు స్వామీ. యాక్టర్. తేడా ఏంటో? స్టార్ అంటే ఎన్ని కోట్ల కలెక్షన్ అయిందో చెబుతారు. యాక్టరంటే ఎన్ని కోట్ల ఫ్యాన్సో చెప్పుకుంటారు. ఇర్... ఫాన్‌కు ఫ్యాన్లే ఫ్యాన్లు. డైలాగ్‌లో వాల్యూమ్ ఉండదు. వాల్యూ ఉంటుంది. ముఖ కవళికలు మినిమమ్, ఇంపాక్ట్ మాక్జిమమ్. కదిలినట్టు ఉండడు... కదిలిస్తాడు. పాత్ర పరిగెడుతుంది. కీప్స్ యువర్ హార్ట్ రేసింగ్. ఎస్! హి ఈజ్ ఇర్ఫాన్ can. ఎడారిలో ఒంటె నీరు, ఆహారం లేకుండా దాదాపు నలభై రోజులు ప్రాణాలు నిలబెట్టుకుంటుంది. నలభయ్యో రోజు నీళ్లు దొరికితే రెండు మూడు నిమిషాల్లోనే రెండు డ్రమ్ముల నీళ్లు తాగేస్తుంది. ఇర్ఫాన్ ఖాన్ కథ సరిగ్గా ఇలాంటిదే. హాలీవుడ్లో మహామహులు కోరితే అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా నిరాకరించే ‘గ్లాడియేటర్’ దర్శకుడు రిడ్లే స్కాట్ ఆమధ్య ఇండియాకు కాల్ చేశాడు. తన తాజా సినిమా ‘ది మార్షియన్’కు ఇర్ఫాన్ డేట్స్ కావాలి. ‘మీకేమైనా వీలవుతుందా ఇర్ఫాన్’- అవతలి వైపు నుంచి అంత పెద్ద దర్శకుడు చాలా వినయంగా అడుగుతున్నాడు. ఏం చెప్పాలి? ఇర్ఫాన్‌కు డైరీ చూడాల్సిన అవసరం లేదు. అందులో ఒక్క పేజీ కూడా ఖాళీ లేదని తెలుసు. కాని చెప్పకతప్పదు. ‘సారీ స్కాట్... వెరీ సారీ’. ఇర్ఫాన్‌తో కలిసి పని చేసిన ‘అమేజింగ్ స్పైడర్‌మేన్’ దర్శకుడు మార్క్ వెబ్‌కు ఒకటే కోరిక. మళ్లీ ఇర్ఫాన్‌తో కలిసి పని చేయాలని. ఎందుకంటే ఒక పాత్రను దాని అంతరాత్మకు సరిపోయేలా నటించే నటుణ్ణి అతడు అంతదాకా చూడలేదు. రేపో మాపో రిలీజ్ కాబోతున్న ‘జురాసిక్ వరల్డ్’ దర్శకుడు కాలిన్ ట్రెవెరోకు హాలీవుడ్ గొడ్డుపోలేదని తెలుసు. అతడి ఎదుట వందలమంది యోగ్యులైన నటుల లిస్ట్ ఉంది. కాని ఆ సినిమాలో కీలకమైన జురాసిక్ పార్క్ ఓనర్ పాత్రను ఇర్ఫాన్‌తో సైన్ చేయిస్తే తప్ప అతడు స్థిమిత పడలేదు. టామ్ హ్యాంక్స్ నటనను ప్రపంచం గౌరవించింది. అతడు హీరోగా ఇటీవలే ‘ఇన్ఫెర్నో’ అనే సినిమా మొదలైతే అందులో అంతకు సమానమైన మరోనటుడి అవసరం ఏర్పడింది. ఇర్ఫాన్‌ఖాన్‌కు బుడాపెస్ట్‌కు పిలుపొచ్చింది. స్లమ్‌డాగ్ మిలియనీర్, లైఫ్ ఆఫ్ పై... ఇర్ఫాన్ ఏమిటో ప్రపంచానికి చూపాయి. అమెరికాలో అత్యంత ఆదరణ పొందిన టెలివిజన్ సిరీస్ ‘ఇన్ ట్రీట్మెంట్’ ఇర్ఫాన్ ప్రెజెన్స్‌తో కొత్త స్టేటస్‌ను పొందాయి. అందరికీ ఇర్ఫాన్ కావాలి. ఇర్ఫాన్‌కు అన్ని మంచి పాత్రలూ కావాలి. ఇంతకాలం అతడు చుక్క నీళ్లు, గుప్పెడు మెతుకులు కనిపించక పోయినా ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇప్పటికి ఒయాసిస్కు చేరుకున్నాడు. ఇక జిహ్వకి తిన్నంత. మనసుకు తాగినంత. రాజస్థాన్‌లో ‘టోంక్’ అనే ప్రాంతం ఉందని చాలామందికి తెలియదు. ఇర్ఫాన్‌ఖాన్ వల్లే తెలిసింది. జైపూర్‌కు దాదాపు 60 మైళ్ల దూరంలో ఉన్న ఆ చిన్న పట్టణం ఇర్ఫాన్ తల్లిది. ఇర్ఫాన్ బాల్యం అక్కడి ఇసుక దిబ్బల మీద కొంత గడిచింది. తండ్రి సొంత వూరైన జైపూర్‌లో మరి కొంత. సంప్రదాయ ముస్లిం కుటుంబం. సినిమాలను పాపహేతువులుగా చూసే కుటుంబం. పైగా పూర్వికులు నవాబులు కావడం వల్ల ఇప్పుడు ఆ సంపద లేకపోయినా డాబూ దర్పం మాత్రం కాపాడుకోవాల్సిందే. అందుకే తండ్రి అతడికి ‘సాహబ్జాదే ఇర్ఫాన్ అలీఖాన్’ అని పేరు పెట్టాడు. ‘సాహబ్జాదే’ అంటే యువరాజు అని అర్థం. కాని ఈ యవరాజు తల మీద పగిడీ కట్టి, అలంకారంగా కరవాలం ధరించి ఊళ్లేలాలని అనుకోలేదు. ముఖానికి రంగు రాసుకోవాలని అనుకున్నాడు. అంతా చేసి అతడు కోరుకుంది ఎవరైనా అడిగితే పెట్టడానికి ఒక్క ఆటోగ్రాఫ్. ‘మృగయా’ అతడి మీద మొదటగా ప్రభావం వేసిన సినిమా. ఆ తర్వాత నసీరుద్దీన్ షా కూడా. నటించాలి అని తీర్మానించుకున్నాడు. ఆ రోజుల్లో దూరదర్శన్ ఊపు మీద ఉంది. సినిమాలంటే బాంబేకు వెళ్లాలి కాబట్టి కనీసం టీవీలో కనిపిద్దామని జైపూర్‌లో కొండ మీద ఉన్న టీవీ టవర్‌కు చేరుకున్నాడు. అక్కడ షూటింగ్స్ జరుగుతుంటాయని ఎవరో ఒకరు వేషం ఇస్తారని అతడి ప్లాన్. తీరా చేరుకున్నాక అక్కడ మనిషి లేడు. పురుగు కూడా. ట్రాన్స్మిషన్ టవర్ అతణ్ణి చూసి దయగా నవ్వింది. తర్వాత ఎవరో చెప్పారు ఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఉంటుంది.. అక్కడ చేరు.. యాక్టింగ్ నేర్పిస్తారు అని. ఇంట్లో ఒప్పుకోలేదు. తల్లికి తన కొడుకు లెక్చరర్ కావాలని కోరిక. కొడుకు కూడా అదే చెప్పాడు. నేను వెళ్తున్నది యాక్టింగ్ చదువుకు. అది పూర్తయితే జైపూర్‌లో లెక్చరర్ ఉద్యోగం వస్తుంది అని. అబద్ధమే. కాని తల్లికి చెప్పకపోతే ఎవరికి చెప్తాం. ‘సలామ్ బాంబే’.... ఇర్ఫాన్ మొదటి సినిమా. దాదాపు 30 ఏళ్ల క్రితంది. ఏ ముహూర్తాన ఆ సినిమా చేశాడోకాని బాంబే అతడి చేత అన్ని సలాములూ చేయించింది. ఎక్కే గడప దిగే గడప... ఇస్తామన్న హామీ ఇవ్వకుండా పొడిచే పోటు... తిండి గడవడానికి టివి కొంత దారి చూపించింది. ‘చంద్రకాంత’ సీరియల్లో ఇర్ఫాన్ పాత్ర పెద్ద హిట్. ఆ తర్వాత వరుసపెట్టి అవే పాత్రలు. గంగవెల్లువకు చిన్న కమండలం. డిప్రెషన్. యాంగ్జయిటీ. కొన్నాళ్లు మందులు వాడాడు. కాని తప్పదు. ఎలాగైనా ప్రాణాలు కాపాడుకొని నిలబడాల్సిందే. ఎడారి నుంచి వచ్చినవాణ్ణి. ఎండలో బతకడం తెలియదా? అప్పుడు రెండు వింతలు జరిగాయి. ఒకటి ఆసిఫ్ కపాడియా అనే బ్రిటిష్ ఇండియన్ డెరైక్టర్ వచ్చి ఇర్ఫాన్‌తో ‘వారియర్’ అనే సినిమా తీశాడు. రాజస్థాన్‌లో కత్తి యుద్ధాన్ని ఒక పరంపరగా చేసుకున్న వీరుడికథ అది. చాలా ఫెస్టివల్స్‌లో ప్రశంసలు పొందింది. ఆ వెంటనే ‘రోడ్ టు లడాఖ్’ అనే ఒక షార్ట్‌ఫిల్మ్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇంతమంచి నటుడు ఇండియాలో ఏం చేస్తున్నట్టు? అందరికీ ఆశ్చర్యం. ఆ వెంటనే ‘ది మైటీ హార్ట్’, ‘ది నేమ్‌సేక్’... హాలీవుడ్ సినిమాల ఆఫర్స్ తలుపు తట్టడం మొదలుపెట్టాయి. బ్రిటిష్ ఫిల్మ్ ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’... ఒక పెద్ద గుర్తింపు. ‘ది అమేజింగ్ స్పైడర్‌మేన్’, ‘లైఫ్ ఆఫ్ పై’తో ఇర్ఫాన్ ఒక ఇంటర్నేషనల్ స్టార్‌గా ఆవిర్భవించాడు. రచ్చ గెలవడం అయ్యింది. మరి ఇంట? ‘పాన్‌సింగ్ తోమార్’. సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు దేశంలోనూ విదేశంలోనూ ఇర్ఫాన్ ది బెస్ట్. నటుడి పని ఏమిటంటే నటించడం. డబ్బు సంపాదించడం కాదు. నటన వల్ల డబ్బు వస్తే రావచ్చు. కాని డబ్బు సంపాదించడానికే నటన కాదు అనేది ఇర్ఫాన్ ఉద్దేశ్యం. అందుకే అతడు ఇటీవల ‘ఖాన్’ను తన పేరు నుంచి తొలగించాడు. షారూక్, ఆమిర్, సల్మాన్ ఈ ఖాన్‌లతో తనకు పోలిక ఏమిటి? వాళ్లు స్టార్లు. తాను? నటుడు. వాళ్ల స్టార్డమ్ వంద కోట్లు, రెండు వందల కోట్లు, ఆమిర్ ‘పికె’ 500 కోట్లు సంపాదించిందట. ఇదే కొలమానం అయితే ఇర్ఫాన్ నటించిన ‘లైఫ్ ఆఫ్ పై’ 5000 కోట్లు సంపాదించింది. ఇర్ఫాన్‌కు కోట్లతో పని లేదు. సీన్లతోనే పని. ఆ సీన్లో ఆ క్షణాన తానెంత మెరిశాడు. పాత్రను ఎంత మెరిపించాడు. ‘పికూ’ వచ్చింది. అమితాబ్, దీపికా, ఇర్ఫాన్ కలిసి ఇప్పటికి వంద కోట్లు వసూలు చేశారు. చిన్న సినిమా. పెద్ద విజయం. ఇర్ఫాన్ కోసం ఇప్పుడు భారతదేశంలోని ప్రతి మంచి దర్శకుడు ఒక పాత్రను రాసే ప్రయత్నంలో ఉన్నాడు. ఎందుకంటే సినిమాలో అతడుంటే గౌరవం. ప్రతికూల క్షణాల్లో ఒంటె తాను బతకడమే కాక తన వీపున ఉన్న మనిషిని కూడా తన ఒంట్లోని కొవ్వు ఇచ్చి బతికిస్తుంది. చెత్త సినిమాల ధోరణిలో ఇర్ఫాన్ తాను బతకడమే కాదు- భారతీయ సినిమాను కూడా బతికించనున్నాడు. నిజజీవితంలో అతడు ‘సాహబ్జాదా’ కాలేకపోవచ్చు. కాని- నవ్య సినిమాల్లో మాత్రం అతడే సాహబ్జాదా! - సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి చాలా ఫాస్ట్ యాక్టర్! అటు అమ్రిష్‌పురి, ఇటు ఇర్ఫాన్‌ఖాన్ - ఇద్దరితో సినిమా చేసిన అనుభవం నాది. ఒక సీన్ చెబితే అమ్రిష్ చాలా టైమ్ తీసుకొని, బాగా ఆలోచించి, దాన్ని పండించేవారు. కాని ఇర్ఫాన్ ఫాస్ట్ యాక్టర్. ఏదైనా చెప్పగానే చాలా వేగంగా ఆ సీన్‌ను నటించి చూపేవారు. ‘సైనికుడు’లో ఇర్ఫాన్‌ఖాన్‌ను తొలిసారిగా దక్షిణాది వెండితెరపైకి తెచ్చే అదృష్టం నాకు దక్కింది. ఆ క్రెడిట్ గుణశేఖర్‌ది. సినిమా అంటే ఇర్ఫాన్‌కు అమిత ప్రేమ. ఎక్కడో కొడెకైనాల్లో ‘సైనికుడు’ షూటింగ్ అయితే, ముంబయ్ నుంచి వేళకాని వేళలో దిగినా, పొద్దున్నే ఠంచన్‌గా టైమ్‌కు సెట్స్‌కు వచ్చేవారు. అఇవాళ ఇర్ఫాన్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు. మా సినిమా ఆల్బమ్స్ ఎప్పుడైనా తిరగేస్తూ వాటిలో ఇర్ఫాన్ ఫోటోలు చూసినప్పుడు అంత గొప్ప ఆర్టిస్టును తెలుగు తెరకు పరిచయం చేసినందుకు చాలా గర్వపడుతుంటా. - సి. అశ్వినీదత్, ప్రసిద్ధ నిర్మాత -
'ఆ సినిమా కోసం ఆతృతగా ఉన్నా'
ముంబై: ఐదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం మరోసారి అభిమానుల్ని అలరించడానికి వస్తున్న బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ తన తదుపరి చిత్రం జజ్బాపై భారీ ఆశలు పెట్టుకుంది. ఆ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఇటీవల కేన్స్ లో జరిగిన 68వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో విడుదల చేసిన జజ్బా ఫస్ట్ లుక్ పై ఐశ్వర్యారాయ్ సంతోషం వ్యక్తం చేసింది. ఆ చిత్రోత్సవాల్లో జజ్బా ఆకట్టుకుందని పేర్కొంది. అయితే ఈ చిత్రం తనకు పునరాగమనం మాత్రం కాదని స్పష్టం చేసింది. ఇది కేవలం తన కొత్త చిత్రం మాత్రమేనని తెలిపింది. జజ్భా చిత్రాన్ని పాత ఫార్ములతో కాకుండా మంచి కథా బలంతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని పేర్కొంది. సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ న్యాయవాది పాత్రలో అలరించబోతోంది. ఇందులో ఇర్ఫాన్‌ఖాన్, షబానాఅజ్మీ, సిద్ధాంత్ కపూర్, అనుపమ్‌ఖేర్, అతుల్ కులకర్ణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. -
మరో హాలీవుడ్ ఆఫర్
బాలీవుడ్లో విభిన్న నటుడిగా పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్‌ఖాన్‌ను మరో హాలీవుడ్ అవకాశం వరించింది. టామ్ హాంక్స్ హీరోగా నటిస్తున్న ‘ఇన్ఫెర్నో’ చిత్రంలో ఇర్ఫాన్ నటించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత రచయిత డాన్బ్రౌన్ రాసిన క్రైమ్ థ్రిల్లర్ నవల ‘ఇన్ఫెర్నో’కి ఇది తెరరూపం. ఇప్పటికే ఇర్ఫాన్ ‘స్లమ్‌డాగ్ మిలీనియర్’, ‘లైఫ్ ఆఫ్ పై’, ‘అమేజింగ్ స్పైడర్ మేన్’ చిత్రాలలో నటించారు. ఆయన తాజాగా నటించిన ‘జురాసిక్ వరల్డ్’ జూలై 12న విడుదల కానుంది. -
ఇక బిజీ బిజీ...
దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఐష్ చేయనున్న చిత్రం ‘జజ్బా’. ఈ మంగళవారం ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంజయ్ గుప్తా దర్శకుడు. ఈ షూటింగ్ సజావుగా జరగడానికి, పాత్రధారులు తమ తమ పాత్రల గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఇటీవల ఓ వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో హీరోయిన్ ఐశ్వర్యా రాయ్, కీలక పాత్రలు పోషిస్తున్న ఇర్ఫాన్‌ఖాన్, షబానాఅజ్మీ, సిద్ధాంత్ కపూర్, అనుపమ్‌ఖేర్, అతుల్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు. -
హాలీవుడ్లో మనవాళ్లు..!
పంచామృతం: అమెరికా కేంద్రంగా ఉండే హాలీవుడ్ చిత్ర పరిశ్రమపై ప్రపంచంలోని అనేక దేశాల నటీనటులు, దర్శకులు తమదైన ప్రభావాన్ని చూపుతున్నారు. మరి హాలీవుడ్‌పై భారతీయుల ప్రభావం ఎంత? హాలీవుడ్ సినిమాలను అమితంగా ఆదరించే భారతీయుల్లో ఎంతమంది అక్కడ ప్రముఖ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు అంటే అలాంటి వారి సంఖ్య స్వల్పమేనని చెప్పాలి. అలా హాలీవుడ్ సినీ పరిశ్రమలో గుర్తింపు సంపాదించుకున్న భారతీయుల్లో ముఖ్యమైన వాళ్లు... ఏఆర్ రెహమాన్ ‘ఇండియాస్ ఫస్ట్ డబుల్-ఆస్కార్ విన్నర్’ గుర్తింపు ఉన్న ఏఆర్ రెహమాన్ ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’కు ముందు, తర్వాత కూడా కొన్ని హాలీవుడ్ సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు. ‘ఎలిజబెత్: ది గోల్డెన్ఏజ్’తో రెహమాన్ హాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత అనేక సినిమాలకు నేపథ్య సంగీతాన్ని, స్వరాలను సమకూర్చారు. ఆస్కార్ అవార్డులను కూడా అందుకుని హాలీవుడ్‌పై భారతీయ ముద్రను వేశారు. ఇర్ఫాన్ ఖాన్ హాలీవుడ్ సినిమాల్లో నటుడిగా భారతదేశం ఆవల మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి ఇర్ఫాన్‌ఖాన్. ప్రత్యేకించి భారతనేపథ్యంలో నడిచే హాలీవుడ్ సినిమాల్లో ఇర్ఫాన్‌ఖాన్ తప్పనిసరి పాత్రధారి. అకాడమీ అవార్డులు పొందిన స్లమ్డాగ్మిలియనీర్, లైఫ్ ఆఫ్ పైలలో ఈ నటుడు కీలక పాత్రలు వేశారు. ఇంకా ‘ ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్’ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. అనిల్ కపూర్ బాలీవుడ్లో అనిల్ కపూర్‌కు హీరోగా కాలం చెల్లిపోయిందేమో కానీ... హాలీవుడ్లో మాత్రం ఈ హీరోగారి ప్రభ క్రమంగా పెరుగుతోంది. స్లమ్‌డాగ్ మిలియనీర్‌తో అనిల్ కపూర్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడిప్పుడే భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా అనిల్‌కు ప్రముఖపాత్రలు దక్కుతున్నాయి. టామ్క్రూజ్తో కలిసి ‘మిషన్ ఇంపాజిబుల్: ఘోస్ట్ ప్రొటోకాల్’ సినిమాలో అనిల్ కపూర్ నటించారు. అశోక్ అమృత్‌రాజ్ హాలీవుడ్లో దాదాపు వంద సినిమాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు అశోక్అమృత్రాజ్. ఒకనాడు భారతదేశం తరపున వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో పాల్గొన్న ఈ టెన్నిస్ ఆటగాడు ఆ తర్వాత హాలీవుడ్ సినీ నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. అనేక హిట్స్‌ను సాధించారు. ఈయన నిర్మాతగా వ్యవహరించిన ‘ఘోస్ట్‌రైడర్’ వంటి సినిమాలు ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఎమ్.నైట్ శ్యామలన్ స్క్రీన్‌రైటర్, డెరైక్టర్, ప్రొడ్యూసర్‌గా హాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న భారతీయుడు మనోజ్ నైట్ శ్యామలన్. ఈయన కేరళకు చెందిన వ్యక్తి. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా పొందారు. హాలీవుడ్లో ‘ద సిక్త్‌సెన్స్’ ‘అన్బ్రేకబుల్’ ‘లేడీ ఇన్ ద వాటర్’ ‘ఆఫ్టర్ ఎర్త్’వంటి సినిమాలతో శ్యామలన్ తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. -
‘డివైన్ లవర్స్’గా కంగనా, ఇర్ఫాన్
మొన్న ‘క్వీన్’గా..., నిన్న ‘రివాల్వర్ రాణీ’గా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించిన ‘ఫ్యాషన్ డాల్’ కంగనా రనౌత్ మరో ప్రత్యేక చిత్రంతో అభిమానులకు కనువిందు చేయనుంది. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో దూసుకుపోతున్న కంగనా ఈసారి మాత్రం నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌తో జతకడుతోంది. తాను తెరకెక్కిస్తున్న ‘డివైన్ లవర్స్’ సినిమాలో వీరిద్దరు నటిస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు సాయి కబీర్ మంగళవారం మీడియాకు తెలిపారు. ఈ విషయమై దర్శకుడు సాయి కబీర్ మాట్లాడుతూ... ‘కంగనా రనౌత్, ఇర్ఫాన్‌ఖాన్‌లతో కలిసి ‘డివైన్ లవర్స్’ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నాను. ఇప్పటికే ఈ పేరుతో వచ్చిన సినిమాలు మంచి ప్రేక్షకాదరణను సంపాదించుకున్నాయి. ‘క్వీన్’ సినిమా తర్వాత దాదాపుగా కథానాయిక ప్రధాన్యమున్న చిత్రం ‘రివాల్వర్ రాణీ’లోనే కంగనా నటించింది. మరోసారి అటువంటి చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకొస్తుందని అందరూ భావించారు. అయితే కంగనా మాత్రం అటువంటి కట్టుబాట్లతో గిరిగీసుకోకుండా ఇర్ఫాన్‌తో కలిసి తెరను పంచుకోవడానికి పచ్చజెండా ఊపింది. కంగనా నటించిన మిగతా చిత్రాలకు ఇది భిన్నంగా ఉంటుంది. భారతీయ కళకు అద్దం పట్టేలా చిత్రాన్ని నిర్మిస్తాం. ముంబై, అలీగఢ్ వంటి ప్రదేశాల్లో సినిమాను తెరకెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మధ్యతరగతి జీవితాల్లోని నీతి, నిజాయతీలను కథావస్తువుగా తీసుకున్నామ’ని చెప్పారు. కంగనాతో భవిష్యత్తులో భారీ చిత్రాలు నిర్మిస్తానని చెప్పిన కబీర్ అంతవరకు వచ్చిన ఈ గ్యాప్‌లో ‘డివైన్ లవర్స్’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. సయీద్ మీర్జా, కుందన్ షాల తాను ఎంతో స్ఫూర్తిని పొందానని, అదే స్ఫూర్తితో సినిమాలను తెరకెక్కిస్తున్నానని చెప్పాడు. -
రచన, దర్శకత్వం కూడా..
ఇంతకుముందు విడుదలైన క్వీన్ సినిమా హిట్ కొట్టడం, తాజాగా విడుదలవుతున్న రివాల్వర్ రాణిపైనా భారీ అంచనాలు ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టీ కంగనా రనౌత్‌పైనే ఉంది. ఈ బ్యూటీ మనసు మాత్రం వేరే వాటిపై ఉంది. కేవలం కెమెరా ముందుకు వచ్చి ఆడిపాడటానికి బదులు రచన, దర్శకత్వం కూడా చేయాలని ఈమె అనుకుంటోంది. ‘నా జీవితమంతా నటనకే పరిమితం కాను. ఆమిర్‌ఖాన్, ఇర్ఫాన్‌ఖాన్ వంటి వాళ్లతో పని చే సిన తరువాత రచన, దర్శకత్వం చేస్తాను’ అని చెప్పిన కంగన ప్రస్తుతం అమెరికాలో స్క్రీన్‌ప్లే కోర్సు నేర్చుకుంటోంది కూడా. బాలీవుడ్ రేసులో ముందున్నప్పటికీ, దానిపై తనకు పెద్దగా పట్టింపులేవీ లేవని చెప్పింది. నంబర్‌వన్‌పై మోజు లేదని, ఎక్కడ సుఖంగా ఉంటే అదే రంగంలో ఉంటానని వివరించింది. రివాల్వర్ రాణి ఇంకా విడుదల కాకున్నా, దీనిపై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఈ సినిమా దాదాపుగా హిట్ సాధించినట్టేనని కంగన నమ్మకంగా చెబుతోంది. ‘మేం స్క్రిప్టు దశలో ఊహించినదానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా పండితులు ఏమనుకున్నా, నాకు మాత్రం ఈ సినిమా భారీ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. చిత్రం యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతగానో శ్రమించారు. సినిమా ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. బాలీవుడ్లో ఇంత వరకు ఇలాంటి సినిమా రాలేదని నేను కచ్చితంగా చెప్పగలను’ అని ఈ 27 ఏళ్ల బ్యూటీ తెలిపింది. హీరోయిన్ ఆధారిత సినిమా అయిన రివాల్వర్ రాణి ఈ శుక్రవారమే థియేటర్లకు వస్తోంది. ఇది అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని, ఫలానా రకం సినిమాగా వర్గీకరించడం సాధ్యం కాదని కంగనా రనౌత్ చెప్పింది. సాయి కబీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వీర్‌దాస్ కూడా ముఖ్యపాత్రలో కనిపిస్తాడు.