
సాక్షి, ముంబయి : జియో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2018 వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది. 2017 సంవత్సరానికి గాను 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రధానోత్సవాన్ని శనివారం రాత్రి (జనవరి 20) నిర్వహించారు. బాలీవుడ్ సినీ రంగానికి చెందిన చిత్రాలు, నటులు ఇతర విభాగాలకు ఈ అవార్డులు అందజేశారు. అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, ఆయన మిత్రుడు నిర్మాత కరణ్ జోహార్ ఆతిథ్యం నిర్వహించారు.
2017 సంవత్సరానికిగాను అందించిన ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ‘హిందీ మీడియం’ ఎంపికైంది. కాగా, ఉత్తమ నటుడు అవార్డును ఇర్ఫాన్ ఖాన్ అందుకున్నారు. అలాగే, ఉత్తమ నటిగా విద్యాబాలన్ నిలిచారు. ఆమెకు ఇది ఆరో ఫిల్మ్‌ఫేర్ అవార్డు. ‘తుమ్హారి సులు’ చిత్రంలో నటనకు గాను విద్యాబాలన్‌కు ఈ అవార్డును అందించారు. కాగా, ఉత్తమ దర్శకత్వం అవార్డును అశ్వినీ అయ్యర్ తివారీ అందుకున్నారు. ఇక క్రిటిక్స్ అవార్డ్స్ కింద ఉత్తమ చిత్రంగా న్యూటన్ నిలవగా ఉత్తమ నటుడిగా రాజ్‌కుమార్ రావ్ (ట్రాప్డ్), ఉత్తమ నటిగా జైరా వాసిం (సీక్రెట్ సూపర్‌స్టార్) నిలిచారు. దీంతోపాటు పలు విభాగాల్లో కూడా అవార్డులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment