Film Fare Awards
-
కాబోయే భర్తకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు.. పిక్స్ షేర్ చేసిన హీరోయిన్!
హీరోయిన్ అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ ఈ ఏడాదిలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ ఆలయంలో నిశ్చితార్థ వేడుక జరుపుకున్నారు. అయితే తాజాగా తనకు కాబోయే భర్తకు అవార్డులు రావడం పట్ల ఆదితిరావు సంతోషం వ్యక్తం చేసింది. ఈ గెలుపు మీకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిన్నా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.తాజాగా సిద్ధార్థ్ తన ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పక్కన పెట్టుకుని నిద్రిస్తున్న ఫోటోను అదితి రావు హైదరి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఇటీవల జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌లో సిద్ధార్థ్ నటించిన చిత్తా(చిన్నా) సినిమా ఏకంగా ఏడు అవార్డులు సాధించింది. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్తా మూవీకి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (క్రిటిక్స్), లీడ్రోల్లో ఉత్తమ నటి (మహిళ), ఉత్తమ సహాయ పాత్ర (ఫీమేల్), ఉత్తమ సంగీత ఆల్బమ్, ఉత్తమ నేపథ్య గాయని (ఫీమేల్) విభాగాల్లో అవార్డులు దక్కాయి. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
Filmfare Awards South: ఆ సినిమాకు ఏకంగా ఆరు అవార్డులు
69వ ఫిలింఫేర్ సౌత్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం జరిగింది. ప్రతిభావంతులైన నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్స్‌ను పురస్కారంతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి సౌత్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. తమిళంలో చిత్త (తెలుగులో చిన్నా) మూవీ ఏకంగా ఏడు అవార్డులు సొంతం చేసుకుంది. మరి ఏయే కేటగిరీలో చిత్త పురస్కారాలు అందుకుంది? ఇంకా ఎవరెవరు అవార్డులు గెలుచుకున్నారో చూసేద్దాం..ఫిలింఫేర్ సౌత్ 2024 (తమిళ) అవార్డుల విజేతలు* ఉత్తమ చిత్రం - చిత్త* ఉత్తమ దర్శకుడు- ఎస్.యు. అరుణ్ కుమార్ (చిత్త)* ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - విడుదలై: పార్ట్ 1* ఉత్తమ నటుడు - విక్రమ్ (పొన్నియన్ సెల్వన్: పార్ట్ 2)* ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - సిద్దార్థ్ (చిత్త)* ఉత్తమ నటి - నిమిషా సజయన్ (చిత్త)* ఉత్తమ నటి (క్రిటిక్స్) - ఐశ్వర్య రాజేశ్ (ఫర్హానా), అపర్ణ దాస్ (దాదా)* ఉత్తమ సహాయ నటుడు - ఫహద్ ఫాజిల్ (మామన్నన్)* ఉత్తమ సహాయ నటి - అంజలి నాయర్ (చిత్త)* ఉత్తమ సంగీతం - దిబు నినన్ థామస్ & సంతోష్ నారాయణన్ (చిత్త)* ఉత్తమ లిరిక్స్ - ఇలంగో కృష్ణన్ (అగ నగ- పొన్నియన్ సెల్వన్: పార్ట్ 2)* ఉత్తమ గాయకుడు - హరిచరణ్ (చిన్నన్‌జిరు నిలవే.. : పొన్నియన్ సెల్వన్: పార్ట్ 2* ఉత్తమ గాయని - కార్తీక వైద్యనాథన్ (కంగల్ ఎదో.. : చిత్త)* ఉత్తమ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియన్ సెల్వన్: పార్ట్ 2)* ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : తోట ధరణి (పొన్నియన్ సెల్వన్: పార్ట్ 2)చదవండి: ఫిలిం ఫేర్ అవార్డ్స్-2024.. తెలుగులో ఎవరెవరికి వచ్చాయంటే? -
సాయిపల్లవికి తండేల్ టీమ్ సన్మానం.. ఎందుకో తెలుసా?
నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని తండేల్ టీమ్ ఘనంగా సత్కరించింది. నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు చందూ మొండేటి తనతో కేక్ కట్ చేయించి తినిపించారు. ఈ సందర్భంగా సెట్లోని వారంతా ఆరు సింబల్స్ చూపించారు. అవును.. సాయిపల్లవికి ఇప్పటివరకు ఆరు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకుంది. అందులో భాగంగానే తన విజయాలను ఇలా సెలబ్రేట్ చేశారు. ఎన్ని అవార్డులంటే?కాగా సాయిపల్లవి ప్రేమమ్ సినిమాతో హీరోయిన్గా మారింది. ఈ మూవీకి గానూ బెస్ట్ ఫీమేల్ డెబ్యూగా ఫిలింఫేర్ సౌత్ అవార్డు గెలుచుకుంది. ఫిదా, లవ్ స్టోరీ చిత్రాలకు ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. ఇటీవల ప్రకటించిన ఫిలింఫేర్ సౌత్ అవార్డుల జాబితాలోనూ సాయిపల్లవి మరోసారి సత్తా చాటింది. గార్గి, విరాటపర్వం (క్రిటిక్స్ విభాగంలో) చిత్రాలకుగానూ మరో రెండు అవార్డులు అందుకుంది. వీటితో కలిపి సాయిపల్లవి అందుకున్న ఫిలింఫేర్ పురస్కారాల సంఖ్య ఆరుకు చేరింది. ఇలా ఆరు ఫిలింఫేర్లు అందుకున్న ఏకైక నటిగా ఈ బ్యూటీ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే తన విజయాన్ని చిత్రబృందం కేక్ కటింగ్‌తో సెలబ్రేట్ చేసింది.తండేల్ సంగతులు..తండేల్ విషయానికి వస్తే.. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో చై, సత్యభామ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Team #Thandel celebrated the twin wins of @Sai_Pallavi92 at the Filmfare Awards on the sets of the film ❤️🔥'Satya' from #Thandel will be another memorable role from the talented actor ✨#Dhullakotteyala 💥💥Yuvasamrat @chay_akkineni @chandoomondeti @ThisIsDSP @GeethaArts… pic.twitter.com/4qdrMUtaqH— Geetha Arts (@GeethaArts) July 17, 2024 చదవండి: కోపంతో ఆ హీరోయిన్ చెంప చెళ్లుమనిపించా..: హీరో -
సాయి పల్లవికి అవార్డ్స్ తెచ్చిపెట్టిన సినిమాలు ఎన్నో తెలుసా..?
మలయాళీ బ్యూటీ సాయి పల్లవి టాలెంట్‌కు సినీ అభిమానులు ఫిదా అవుతారు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఆమె స్టార్‌గా ఎదిగింది. మర్ పాత్రల కన్నా కథలో బలం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటూ సత్తా చాటింది. తొమ్మిదేళ్ల కెరీర్లో ఆమె 19 సినిమాల్లో నటించింది. అయితే, ప్రతి చిత్రం కూడా ఒక ప్రత్యేకమనే చెప్పాలి. అలా మలయాళం, తెలుగు, తమిళంలోనూ ఆమెకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు.తాజాగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2023లో సాయిపల్లవికి అవార్డ్ దక్కింది. అయితే, సాయి పల్లవి అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. 68 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో గార్గి చిత్రానికి తమిళంలో ఉత్తమ నటిగా అవార్డు దక్కితే.. తెలుగులో విరాటపర్వం చిత్రానికి గాను క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా అవార్డ్ దక్కించుకుంది. ఇలా రెండు భాషల్లోనూ ఒకే ఏడాదిలో ఈ ఘనత సాధించిన హీరోయిన్గా ఆమె గుర్తింపు పొందింది.ప్రేమమ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత తెలుగులో ఫిదాలో భానుమతిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఫిలింఫేర్ అవార్డ్స్‌లో ఓ అరుదైన ఘనతను కూడా ఆమె అందుకుంది. సౌత్ ఇండియాలో అతి తక్కువ కాలంలోనే ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకున్న హీరోయిన్గా సాయి పల్లవి నిలిచింది.సాయి పల్లవి అవార్డులు అందుకున్న సినిమాలుప్రేమమ్ (2015) – ఉత్తమ నటి (డెబ్యూ)ఫిదా (2017) – ఉత్తమ నటిలవ్ స్టోరీ (2021) – ఉత్తమ నటిశ్యామ్ సింగరాయ్ (2021) – ఉత్తమ నటి (క్రిటిక్స్)గార్గి (2022) – ఉత్తమ నటివిరాటపర్వం (2022) – ఉత్తమ నటి (క్రిటిక్స్) -
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ -2023.. ఉత్తమ చిత్రాలు ఏవో తెలుసా?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ మరో ఘనతను దక్కించుకుంది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్- 2023లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇవాళ ప్రకటించిన 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ యాక్టర్స్‌గా ఎన్టీఆర్, రామ్‌చరణ్ సంయుక్తంగా ఆవార్డ్ అందుకోనున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల విజేతలను కూడా ప్రకటించారు. ఏయే సినిమాకు అవార్డులు దక్కాయో ఫుల్ లిస్ట్ చూసేయండి.68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2023 విజేతలు వీళ్లే..తెలుగు..ఉత్తమ చిత్రం- ఆర్ఆర్ఆర్ఉత్తమ దర్శకుడు- ఎస్ఎస్ రాజమౌళిఉత్తమ నటుడు- రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్(ఆర్ఆర్ఆర్)ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సీతారామం (హను రాఘవపూడి)ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్ఉత్తమ నటి - మృణాళ్ ఠాకూర్ (సీతారామం)ఉత్తమ నటి (క్రిటిక్స్) -సాయి పల్లవి( విరాట్ పర్వం)ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)ఉత్తమ సహాయ నటి - నందితాదాస్ (విరాట్ పర్వం)ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - ఎం.ఎం.కీరవాణి (ఆర్ఆర్ఆర్)ఉత్తమ సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రి (సీతారామం)ఉత్తమ నేపథ్య గాయకుడు - కాలభైరవ (కొమురం భీముడో.. ఆర్ఆర్ఆర్)ఉత్తమ నేపథ్య గాయని - చిన్మయి శ్రీపాద (ఓ ప్రేమ -సీతారామం)ఉత్తమ కొరియోగ్రఫీ -ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు.. ఆర్ఆర్ఆర్)బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - సాబు శిరిల్ (ఆర్ఆర్ఆర్)తమిళంఉత్తమ చిత్రం - పొన్నియిన్ సెల్వన్- 1ఉత్తమ నటుడు- కమల్ హసన్ (విక్రమ్)ఉత్తమ నటి- సాయి పల్లవి (గార్గి)ఉత్తమ దర్శకుడు- మణి రత్నం (పొన్నియిన్ సెల్వన్ -1)ఉత్తమ సంగీత దర్శకుడు- ఏఆర్ రెహమాన్ (పొన్నియన్ సెల్వన్- 1)ఉత్తమ సహాయ నటుడు -(మేల్) కాళి వెంకట్ఉత్తమ సహాయ నటి - ఊర్వశిఉత్తమ చిత్రం క్రిటిక్స్- కదైసి వ్యవసాయిఉత్తమ యాక్టర్ క్రిటిక్స్ - ధనుష్ (తిరు), మాధవన్(రాకెట్రీ)ఉత్తమ నటి క్రిటిక్స్- నిత్యా మీనన్ (తిరు)ఉత్తమ గేయ రచయిత- తమిరైఉత్తమ గాయకుడు- సంతోష్ నారాయణ్ (తిరు)ఉత్తమ గాయని - అంతనా నందిఉత్తమ తొలి చిత్ర నటుడు- ప్రదీప్ రంగనాథ్ఉత్తమ తొలి చిత్ర నటి - అదితి శంకర్ (విరుమన్)ఉత్తమ సినిమాటోగ్రఫీ- సెంథిల్, రవి వర్మన్ కన్నడఉత్తమ చిత్రం -కాంతారఉత్తమ నటుడు- రిషబ్ షెట్టి (కాంతార)ఉత్తమ నటి - చైత్ర జే అచార్ఉత్తమ దర్శకుడు - కిరణ్ రాజ్ (777 ఛార్లీ)ఉత్తమ సహాయ నటుడు- అచ్యుత్ కుమార్ఉత్తమ సహాయ నటి - మంగళఉత్తమ సంగీత దర్శకుడు - అజనీష్ఉత్తమ గేయ రచయిత - నాగేంద్ర ప్రసాద్ఉత్తమ గాయకుడు - సాయి విగ్నేశ్ఉత్తమ గాయని- సునిధి చౌహాన్ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)- ధరణి మండలఉత్తమ నటుడు క్రిటిక్స్- నవీన్ శంకర్ఉత్తమ నటి క్రిటిక్స్- సప్తమి గౌడమలయాళంఉత్తమ చిత్రం- నా తన్ కేస్ కోడుఉత్తమ నటుడు- కుంచకో బోబన్ ( నా థన్ కేస్ కోడు)ఉత్తమ నటి - దర్షన రాజేంద్రన్ (జయజయజయజయహే)ఉత్తమ దర్శకుడు- రతీస్ బాలకృష్ణన్ (నా థన్ కేస్ కోడు)ఉత్తమ సహాయ నటుడు- ఇంద్రాన్స్ (ఉడల్)ఉత్తమ సహాయ నటి -పార్వతి తిరువోతు (ఫుజు)ఉత్తమ సంగీత దర్శకుడు- కైలాష్ మీనన్ (వాషి)ఉత్తమ గేయ రచయిత- అరుణ్ అలత్ (హృదయం)ఉత్తమ ప్లేబాక్ సింగర్ - ఉన్ని మీనన్ (భీష్మ పర్వం)ఉత్తమ ప్లేబాక్ సింగర్ - మృదుల వారియర్ (పాథోన్పథం నోట్టండు)ఉత్తమ ఫిలిం (క్రిటిక్స్)- అరిఇప్పుఉత్తమ నటుడు (క్రిటిక్స్)- అలెన్సియర్ లే లోపెజ్ (అప్పన్)ఉత్తమ నటి (క్రిటిక్స్) -రేవతి (భూతకాలం) -
అవార్డును వేలం వేసిన విజయ్ దేవరకొండ.. దక్కించుకున్నది ఎవరంటే?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్ యూత్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. 2017లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన అర్జున్ రెడ్డితో విజయ్ జీవితం మారిపోయింది. అందులో ఆయన నటనకు గుర్తింపుగా ఫిల్మ్‌ఫేర్‌లో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. అయితే ఆ వార్డును 2018లో వేలం వేశాడు. తాజాగా ఈ విషయం మరోసారి వైరల్ అవుతుంది. ఏప్రిల్ 5న ఆయన నటించిన ఫ్యామిలీస్టార్ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రస్థావన మరోసారి తెరపైకి వచ్చింది. ఫ్యామిలీస్టార్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ పాల్గొన్నాడు. అర్జున్ రెడ్డి సినిమాకు గాను ఉత్తమ నటుడిగా వచ్చిన ఫిలింఫేర్ అవార్డును భారీ మొత్తానికి వేలం వేసినట్లు విజయ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తనకు ఎలాంటి అవార్డులంటే ఇష్టం లేదని చెప్పిన విజయ్.. ఇప్పటి వరకు తనకు వచ్చిన అవార్డ్స్లలో కొన్ని ఆఫీసులో ఉంటే, మరికొన్ని ఇంట్లో ఉన్నాయని చెప్పాడు. 2018లో ఏం జరిగిందంటే.. అర్జున్ రెడ్డి సినిమాకు గాను ఫిలింఫేర్ నుంచి ఉత్తమ నటుడిగా విజయ్‌కు అవార్డు దక్కింది. దానిని 2019లో ఆయన వేలం వేశారు. మొదట రూ. 5లక్షలు వస్తే చాలు అనుకుని ఆన్లైన్లో వేలం ప్రక్రియ ప్రారంభించారు. ఆ సమయంలో దివి ల్యాబ్స్ కుటుంబానికి చెందిన శ్యామలాదేవి రూ. 25 లక్షలకు దక్కించుకున్నారు. అందుకోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ ఫిలింఫేర్ అవార్డును ఆమెకు అందించారు విజయ్. అనంతరం ఆమె ఇచ్చిన రూ. 25 లక్షల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMRF) అందించారు. The 1st @TheRowdyClub Sundowner Party. Filmfare given away. 25 lakhs raised for CMRF 😁 Divi labs you are now a part of my journey. This blacklady is special to all of us. I shall show my appreciation by visiting you all :) pic.twitter.com/OgqA8Q0P3U — Vijay Deverakonda (@TheDeverakonda) July 15, 2018 -
పుష్ప మూవీకి అవార్డుల పంట.. డేవిడ్ వార్నర్ తగ్గేదేలే..!
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ సినిమా పాటలకు తన స్టెప్పులతో అభిమానులను అలరిస్తుంటాడు. ఐపీఎల్ టీం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అతనికున్న అనుబంధం వల్ల తెలుగు రాష్ట్రాల్లోనూ అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా డేవిడ్ వార్నర్ చేసిన ఓ ట్వీట్ వైరలవుతోంది. అంతలా వైరలవుతున్న ట్వీట్లో ఇంతకీ ఏముందో ఓ లుక్కేద్దాం. తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ 'పుష్ప' క్లీన్ స్వీప్ చేయడంతో డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 'ఫిల్మ్ ఫేర్ అవార్డులకు అల్లు అర్జున్ పుష్ప ఎంపికవ్వడం సంతోషం. ఈ సినిమా అంటే మాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో భాగమైన అందరికీ అభినందనలు' అంటూ పుష్ప గెటప్‌లో వార్నర్ ఉన్న ఫోటోను షేర్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. How good that @alluarjunonline took out the @filmfare awards for #Pushpa such an amazing achievement and we loved it soo much. Well done and congrats to all involved. https://t.co/uGJIrXsBpy — David Warner (@davidwarner31) October 10, 2022 -
తగ్గేదేలే.. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో 'పుష్ప' క్లీన్‌స్వీప్..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' సినిమా అవార్డుల్లోనూ తగ్గేదేలె అంటోంది. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది. తాజాగా ప్రతిష్టాత్మక 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ పుష్ప క్లీన్ స్వీప్ చేసేసింది. ఏకంగా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకుని సత్తాచాటింది. ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ నిర్మాత, ఉత్తమ మేల్ సింగర్, ఉత్తమ ఫిమేల్ సింగర్, ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ విభాగాల్లో పుష్ప చిత్రానికి అవార్డుల పంట పండింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో పుష్ప క్లీన్ స్వీప్.. థ్యాంక్యూ అంటూ ట్వీట్ చేశాడు. ఫిల్మ్‌ఫేర్ అవార్డులో..;పుష్ప;కి అవార్డు పంట ♦ ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ ♦ ఉత్తమ దర్శకుడు: సుకుమార్ ♦ఉత్తమ చిత్రం: పుష్ప - ది రైజ్ ♦ ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ ♦ఉత్తమ గాయకుడు: సిద్ద్ శ్రీరామ్ (శ్రీవల్లి..) ♦ఉత్తమ గాయని: ఇంద్రావతి చౌహాన్ ( ఊ అంటావా మావ) ♦ ఉత్తమ సినిమాటోగ్రాఫర్: మిరోస్లా బ్రొజెక్ (పుష్ప - ది రైజ్) THANK YOU 🖤 pic.twitter.com/1zlOcNx2sS — Allu Arjun (@alluarjun) October 10, 2022 #PUSHPA CLEAN SWEEP AT @filmfare . BEST ACTOR , BEST DIR , BEST MUSIC DIR , BEST CINEMATOGRAPHY , BEST MALE SINGER , BEST FEMALE SINGER & BEST FILM . THANK YOU ALL . HUMBLED 🙏🏽 — Allu Arjun (@alluarjun) October 10, 2022 -
ఘనంగా ప్రారంభమైన టాలీవుడ్ ఫిలిం అవార్డ్స్..
Tollywood Film Fare Awards 2022: హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో టాలీవుడ్ ఫిలింఫేర్ అవార్డ్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్ కె. కళా సాంసృతిక ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను ఆర్. కె.రంజిత్ చేపడుతున్నారు. అయితే నేషనల్ గా సైమా అవార్డ్స్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఉన్నట్టు తెలుగు సినిమారంగానికి ఎటువంటి అవార్డ్స్ లేవని గుర్తించిన ఆయన ఈ అవార్డ్స్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. సినిమారంగంలో ఉత్తమ ప్రతిభను కనబరచిన వారికి ఈ బహుమతి అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దైవజ్ఞ శర్మ, దర్శకుడు సముద్ర, జస్టిస్ డా. బి. మధు సూదన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, సీనియర్ ఆర్టిస్ట్ హేమలత చౌదరి చేతులమీదుగా అవార్డ్స్‌ను ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమంలో అనేక మంది నటీనటులకు మెమోంటోలను ప్రదానం చేసి శాలువాతో సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు నగేష్ నారదాసి,నటుడు కె. యల్ నరసింహారావు, నిర్మాత మూస అలీ ఖాన్, నటుడు ఆర్. మాణిక్యం, నటులు సమ్మెట గాంధీ, షేకింగ్ శేషు, చిత్రం బాషా లతో పాటు అనేక మంది నటీ నటులు పాల్గొన్నారు. చదవండి: పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్ షూటింగ్స్ బంద్‌పై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''టాలీవుడ్ ఫిలిం అవార్డ్స్ 2022 పేరు మీదుగా అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మేము కూడా రెండు రాష్టాల ప్రభుత్వ సహకారం తీసుకొని రెండు సంవత్సరాలకు సంబందించిన సినిమాలకు టి.యఫ్.సి.సి నంది అవార్డ్స్ పేరుతో.. డిసెంబర్లో అవార్డ్స్ కార్యక్రమం చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇందులో సినిమా రంగానికే కాకుండా ఇతర రంగాలలో ప్రతిభ చూపిన వారికీ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాము. ఇప్పటివరకు తెలంగాణలో నంది అవార్డ్స్ లేవు కాబట్టి ఇప్పుడు చేసే అవార్డ్స్ ఫంక్షన్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నాము. అమితాబచ్చన్‌తో మాట్లాడాము. ఆయనకు కూడా లైఫ్ టైమ్ ఆచీవ్ మెంట్ అవార్డ్ ఇస్తున్నాం'' అని పేర్కొన్నారు. చదవండి: పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ -
అందుకే అవార్డు ఫంక్షన్‌కు నాన్న దుస్తుల్లో వెళ్లా: బాబిల్
బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ చివరి చిత్రం ‘అంగ్రేజీ మీడియం’. ఈ మూవీకి గాను ఆయన ఉత్తమ నటుడిగా ఫిలీం ఫేర్ అవార్డుతో పాటు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి అవార్డులను తీసుకునేందుకు ఇర్ఫాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ఆయన దుస్తుల్లో హజరయ్యాడు. అయితే అది చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఈ సందర్బంగా బాబిల్ నేను ఆయన నటనకు సరితూగకపోవచ్చు కానీ ఆయన దుస్తులకు సరిపోతానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. అయితే అవార్డు కార్యక్రమానికి వెళ్లేముందు తల్లి సుతాప సిక్ధార్ ఇర్ఫాన్ సూట్ వేసి ముస్తాబు చేస్తున్న వీడియోను బాబిల్ షేర్ చేశాడు. తల్లి సుతాప తన తండ్రి షూట్‌నే ఎందుకు వేయించింది, అలాగే ఆమె అవార్డు ఫంక్షన్స్‌కు రాకపోవడానికి కారణం ఎంటో బాబిల్ తన పోస్టులో చెప్పుకొచ్చాడు. ‘నాన్నకు(ఇర్ఫాన్ ఖాన్) ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్‌లో పాల్గొనడం అస్సలు నచ్చదు. కానీ ఆయన కొన్ని సార్లు చేయాల్సి వచ్చేది. అందుకే తన సౌకర్యాన్ని బ్రేక్ చేసుకునేందుకు ఇలాంటి నీలి రంగు దుస్తులనే ధరించేవారు. నిన్న రాత్రి నేను చేసింది కూడా అదే. నేను కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అసౌకర్యానికి గురవుతుంటాను’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. అలాగే ఈ వీడియో చివరలో బాబిల్ తన తల్లిని నువ్వు కూడా అవార్డు ఫంక్షన్‌కు రావచ్చు కదా అని అడగ్గా ఆమె ‘నేను రాలేను.. ఎందుకంటే అక్కడ మనుషులను ఫేస్ చేయలేను’ అంటూ ఆమె సమాధానం ఇచ్చింది. కాగా గతేడాది ఏప్రిల్ 29న ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బాబిల్ తండ్రికి సంబంధించిన విషయాలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్యేగానికి లోనవుతుంటాడు. View this post on Instagram A post shared by Babil (@babil.i.k) చదవండి: Filmfare Awards 2021: విజేతలు వీరే.. సీబీడీ ఆయిల్‌ను లీగల్ చేయాలి: ఇర్ఫాన్ భార్య -
ఫిల్మ్‌ఫేర్‌లో ఆస్కార్ గౌను
ఆస్కార్ వేడుకల్లో ఎరుపు రంగు తివాచీ రిచ్‌గా కనిపిస్తుంది. ఆ తర్వాతి ‘రిచ్’దనమంతా నటీమణుల ఎర్ర గౌన్లదే. ఇటీవలి మన ఫిల్మ్‌ఫేర్ సినిమా అవార్డుల వేడుకల్లో కూడా ఆస్కార్ కళ కనిపించింది! కొంచెం వాళ్లని ఫాలో అయినట్లున్నారు మనవాళ్లు. గౌహతిలోని ఇందిరాగాంధి అథ్లెటిక్ స్టేడియంలో జరిగిన ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవానికి నటి ఊర్వశీ రౌటేలా ఎర్రరంగు గౌను వేసుకుని వచ్చారు. ఒక్కక్షణం అక్కడివారికి ఇది హాలీవుడ్డో, బాలీవుడ్డో అర్థం కాలేదు. ఊర్వశి వేసుకొచ్చిన గౌను వేదికకు ఆస్కార్ కళను తెప్పించింది. ఆ గౌనుతో ఆడియెన్స్ మధ్యలో కూర్చోడానికి ఆమెకు నాలుగు సీట్లు అవసరం అయ్యాయి. ఆమెకు ఒక సీటు, ఆమె గౌను అంచులు మడతలు పడకుండా ఉండేందుకు మూడు సీట్లు! కూర్చున్నాక అంతపెద్ద గౌను ఎక్కడో ఒకచోట మడత పడకుండా ఉంటుందా? ఆ మడతల్ని సరిచేయడానికి ఒక టీము. గౌనుకు ఎంత ఖర్చయిందో తెలీదు కానీ.. గౌన్ కుట్టడానికి మాత్రం 730 గంటలు పట్టిందట! అంటే నెలకు పైగానే. ఈ వివరాలన్నీ అప్పుడు బయటికి రాలేదు. ఈవెంట్ అయ్యాక కాస్త ఆలస్యంగా బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో గౌను విశేషాలన్నిటినీ కుప్పపోశారు ఊర్వశి. ఊర్వశి హరిద్వార్ అమ్మాయి. వయసు 25. ఏడేళ్లుగా సినిమాల్లో ఉన్నారు. తొలి సినిమా ‘సింగ్ సాబ్ ది గ్రేట్’. ఇటీవలి సినిమా ‘పాగల్‌పంతీ’. మధ్యలో ఏడు సినిమాలు. ఈసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానంలో ప్రతిభను పక్కన పెట్టారన్న విమర్శలు చాలా వచ్చాయి. వాటి గురించి ఊర్వశి ఏమీ మాట్లాడడం లేదు. అవార్డొచ్చి, ఆ అవార్డును తీసుకోడానికి వెళ్లలేదు ఆమె. ఆహ్వానం వస్తే వెళ్లింది. కాసేపు అలా కూర్చొని వచ్చింది. వివాదాలకు దూరంగా ఉండేవాళ్లెప్పుడూ సంతోషంగా ఉంటారు. నాలుగు కుర్చీలలో ఊర్వశీ రౌటేలా -
పిచ్చి అవార్డులు ఆశించను: సల్మాన్
ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ ఆవార్డుల కార్యక్రమం అస్సాంలోని గువాహటిలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రతిభ వంతులను కాదని.. అనర్హులకు 65వ ఫిలింఫేర్ అవార్డులు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘బైకాట్ ఫిలింఫేర్ అవార్డ్స్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ గతంలో ఫిలింఫేర్ అవార్డులకు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను ఫిలింఫేర్ అవార్డును తీసుకోనని సల్మాన్ ఖాన్ అందులో పేర్కొన్నాడు. ఈ వీడియోకు అభిమానుల నుంచి ప్రశంసలు వస్తుంటే మరికొందరి నుంచి విమర్శలు వస్తున్నాయి. ఫిల్మ్‌ఫేర్ అవార్డులపై మండిపడ్డ రంగోలీ ‘ఎవరికైతే వారిపై వారికి నమ్మకం ఉండదో అలాంటి వారు మాత్రమే అవార్డులను ఆశిస్తారని నా అభిప్రాయం. కానీ.. నేను ఫలింఫేర్, ఇతర ఎలాంటి పిచ్చి ఆవార్డులను తీసుకోను. కేవలం గౌరవప్రదమైన జాతీయ అవార్డును మాత్రమే ఆశిస్తాను. దాన్ని మాత్రమే తీసుకుంటాను’ అని చెప్పాడు. దీంతో భాయిజాన్ వీడియోకు అభిమానులు ‘మీకు మా అభినందలు సల్మాన్ జీ’ అంటూ ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తుంటే మరి కొంతమంది.. ‘మరీ డబ్బుల కోసం ఈ అవార్డుల కార్యాక్రమాలకు హాజరవుతున్నారు కదా!, అదే విధంగా ఈ ఫంక్షన్స్‌కు హాజరై డ్యాన్స్‌లు ఎందుకు చేస్తున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 'గల్లీ బాయ్'కి అవార్డుల పంట ఇక ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డుల్లో బాలీవుడ్ రణ్వీర్ సింగ్, అలియా భట్లు నటించిన ‘గల్లీబాయ్’ చ్రితానికి అవార్డుల పంట పండింది. ఈ ఒక్క సినిమాకే పలు విభాగాల్లో మొత్తం 13 అవార్డులు వచ్చాయి. కాగా ఈ సినిమాకు గాను ఉత్తమ నటిగా అలియాను ఫిలింఫేర్ వరించింది. అదే విధంగా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ 2’కు గాను బెస్ట్ డెబ్యూ నటి అవార్డు అనన్య పాండేకు లభించింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలైన అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి’, హృతిక్ రోషన్ ‘సూపర్ 30’ సినిమాలకు ఏ కేటగిరీలోనూ ఒక్క అవార్డ్ కూడా దక్కకపోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డులపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
విజయ్ దేవరకొండ.. రౌడీ బ్రాండ్
జూబ్లీహిల్స్: యువ హీరో విజయ్ దేవరకొండ సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ‘రౌడీ’ పేరుతో సొంతంగా రూపొందించిన క్లొతింగ్ బ్రాండ్‌ను ఆదివారం జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్ పబ్‌లో ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు. అందరికీ అందుబాటులో ధరల్లో దుస్తులను అందించే లక్ష్యంతో సరికొత్త విభాగంలోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. తనను చిన్నప్పుడు స్కూల్లో, ఇంట్లో అందరూ రౌడీ అని ప్రేమగా పిలిచేవారని, ఈ రోజు తనకు నచ్చిన పని, వృత్తి చేయగలుగుతున్నానంటే కేవలం మొండితనంతో కూడిన రౌడీయిజమే కారణమన్నారు. రౌడీగానే జీవించాలనుంటున్నాను అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అనంతరం ఇటీవల తాను పెళ్లిచూపులు చిత్రానికిగాను సాధించిన ఫిలిమ్‌ఫేర్ అవార్డును వేలం వేయగా దివీస్ ల్యాబ్స్‌కు చెందిన శకుంతల దివీ రూ.25 లక్షలతో దక్కించుకున్నారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం www.rowdyclub.in పేరుతో రూపొందించిన వెబ్సైట్, యాప్‌లను ఆవిష్కరించారు. -
వేలంలో అమ్ముడుపోయిన ‘అర్జున్ రెడ్డి’ అవార్డు
అర్జున్ రెడ్డి సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్నా.. దీని ఫీవర్ మాత్రం అంత ఈజీగా తగ్గడం లేదు. ఈ మధ్య వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా అర్జున్ రెడ్డిలా ఉందంటూ పోల్చేస్తున్నారు. అంతగా ‘అర్జున్ రెడ్డి’ టాలీవుడ్‌పై తన ముద్రను వేశాడు. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండ నటించిన తీరుకు ఆశ్చర్యపోవాల్సిందే. అర్జున్ రెడ్డి పాత్రకు గాను ఉత్తమ నటుడిగా తను అందుకున్న మొదటి ఫిలింఫేర్ అవార్డను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ అవార్డును వేలం వేయగా దివి ల్యాబరేటరీస్ సొంతం చేసుకుంది. వేలం వేయగా వచ్చిన 25లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేశారు విజయ్ దేవరకొండ. గతకొన్ని రోజులుగా ఒంటిపై షర్ట్ లేకుండా కేవలం జీన్స్ వేసుకుని ఉన్న ఫోటోలను షేర్ చేస్తోన్న విజయ్.. ‘రౌడీ వియర్స్’ బ్రాండెడ్ జీన్స్‌ను ఆదివారం లాంచ్ చేశారు. -
అందుకు గర్వంగా ఉంది!
డ్రెస్ చాలా బాగుంది.. ఎవరు డిజైన్ చేశారో! డ్రెస్ స్టైల్ కూడా అదుర్స్! ఇలాంటి మాటలే మాట్లాడుకున్నారు. రీసెంట్గా హైదరాబాద్‌లో జరిగిన ఫిల్మ్‌ఫేర్ ఫంక్షన్లో నటి అమలాపాల్‌ని చూసి. ఇంతకీ ఆ డ్రెస్‌ను డిజైన్ చేసింది ఎవరో చెప్పలేదు కదూ. అమలాపాల్‌నే డిజైన్ చేసుకున్నారు. పైన ఉన్న ఫొటోలో అమలాపాల్ ఉన్నది ఆ డ్రెస్‌లోనే. ‘‘ప్రతి మహిళలో రెడ్ షేడ్ ఉంటుంది. నేను నా రెడ్ను ధరించాను. నా డ్రెస్ డిజైనర్ పేరు చెప్పమని నన్ను చాలా మంది అడిగారు. అది నేనే అని చెప్పడానికి గర్వంగా ఉంది. టాలెంటెడ్ టైలర్ స్ట్రిచ్చింగ్ చేశారు’’ అన్నారు అమలాపాల్. నిజానికి ఫుల్ లెంగ్త్ డ్రెస్ చూస్తే ఈ బ్యూటీ ఎంతమంచి డిజైనరో అర్థమవుతుంది. భవిష్యత్తులో మరిన్ని వెరైటీ డ్రెస్సులు డిజైన్ చేసుకుంటారేమో. -
ఫస్ట్‌లుక్ 21st June 2018
-
ఫస్ట్ లుక్ 18th June 2018
-
ఫిలింఫేర్లో పాల్గొనరాదని విన్నపం..
తమిళసినిమా: సినిమా వేడుకలు వ్యాపారంగా మారుతున్నాయి. ఇకపై అలాంటి కార్యకమాల్లో పాల్గొనే నటీనటులకు ప్రయోజనం కలగాలని, లేని పక్షంలో అలాంటి వేడుకల్లో పాల్గొనరాదని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నిర్వాహకులు శనివారం తీర్మానం చేశారు. దీనిపై సంఘం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ చాలా కాలంగా చిత్రసీమలో సినీ కార్యక్రమాలు, అవార్డు వేడుకలు, డాన్స్ ప్రొగ్రాంలు, టీవీ అవార్డుల వేడుకలు అంటూ పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయా కార్యక్రమాల్లో నటీనటులు పాల్గొంటున్నారు. అయితే సమీప కాలంలో అలాంటి వేడుకలు వ్యాపారంగా మారాయి. వాటి ద్వారా నటీనటులు ప్రయోజనం పొందాలన్న విషయం గురించి సంఘం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇలాంటి వేడుకల్లో పాల్గొనే నటీనటులు ఆర్థిక ప్రయోజనం పొందే విధంగానూ, లేకపోతే నిర్మాతల మండలి, నటీనటుల సంఘం సంక్షేమానికి నిధిని అందించే వారి వేడుకల్లోనే పాల్గొనాలి. ఈ నిర్ణయం తీసుకున్న తరువాత జరిగిన కలర్స్ టీవీ, విజయ్ టీవీ, గలాట్టా డాట్‌కామ్ అవార్డుల కార్యక్రమాలకు ఈ విధానాన్ని అవలంభించి విరాళాన్ని తీసుకుని సంఘ ట్రస్ట్ కార్యక్రమాలు వినియోగిస్తున్నాం. త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ విధానాన్ని ఆ వేడుక నిర్వాహకులకు వివరించాం. అయితే వారు సహకరించలేదు. ఆ కార్యక్రమంలో నటీనటులు పాల్గొనరాదని విన్నపం చేస్తున్నాం. ఇందుకు సహకరించిన నటి నయనతార, కుష్బూ, సుందర్, విజయ్‌సేతుపతి, కార్తీ వంటి వారికి నటీనటుల సంఘం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. ఇకపై ఇతర నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు సహకరించగలరని కోరారు. -
ఫిలింఫేర్ అవార్డ్స్ హంగామా
జియో 65 సౌత్ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దక్షణాది ఇండస్ట్రీలకు సంబంధించిన పలువురు తారలు పాల్గొని అవార్డులను అందుకున్నారు. ఈ ఈవెంట్‌ను సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ హోస్ట్ చేశారు. రకుల్ ప్రీత్‌సింగ్, రెజీనా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు హైలైట్‌గా నిలిచాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’, ఉత్తమ దర్శకుడు : రాజమౌళి (బాహుబలి: ది కన్‌క్లూజన్) ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి), విమర్శకుల ఉత్తమ నటుడు వెంకటేశ్ (గురు), ఉత్తమ నటి: సాయి పల్లవి (ఫిదా), విమర్శకుల ఉత్తమ నటి : రితికా సింగ్ (గురు), ఉత్తమ సహాయ నటుడు : రానా దగ్గుబాటి (బాహుబలి: ది కన్‌క్లూజన్ ), ఉత్తమ సహాయ నటి : రమ్యకృష్ణ (బాహుబలి: ది కన్‌క్లూజన్), ఉత్తమ సంగీత దర్శకుడు, సాహిత్యం : కీరవాణి (బాహుబలి: ది కన్‌క్లూజన్), ఉత్తమ తొలి చిత్ర కథానాయిక : కల్యాణి ప్రియదర్శన్, ఉత్తమ ఛాయాగ్రాహకుడు: సెంథిల్ కుమార్ (బాహుబలి: ది కన్‌క్లూజన్), ఉత్తమ కొరియోగ్రాఫర్: శేఖర్ (ఖైది నెం:150, ఫిదా), జీవిత సాఫల్య పురస్కారాన్ని కైకాల సత్యనారాయణ అందుకున్నారు. తమిళం ఉత్తమ చిత్రం: ఆరమ్, మలయాళంలో ఉత్తమ నటుడిగా ఫాహిద్ ఫాజల్, కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ అవార్డులను కైవసం చేసుకున్నారు. రానా, విజయ్, శోభు యార్లగడ్డ -
65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినేషన్లు..
సినీ రంగంలో ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, అందుకు సంబంధించిన నామినేషన్ల కార్యక్రమం పూర్తి అయినట్లు సమాచారం. 65వ సౌత్ భారత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కాన్వెన్షన్ సెంటర్లో జూన్16, 2018 జరగనుంది. వివిధ విభాగాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయినట్లు నిర్వాహకులు తెలిపారు. టాలీవుడ్‌కు సంబంధించిన నామినేషన్ల వివరాలు.. ఉత్తమ చిత్రం : అర్జున్ రెడ్డి, బాహుబలి 2, ఫిదా, గౌతమీపుత్ర శాతకర్ణి, ఘాజీ, శతమానం భవతి చిత్రాలు ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడు : చిరంజీవి - ఖైదీ నెంబర్ 150, జూనియర్ ఎన్టీఆర్ - జై లవకుశ, నందమూరి బాలకృష్ణ - గౌతమీపుత్ర శాతకర్ణి, ప్రభాస్ - బాహుబలి 2, వెంకటేష్ - గురు విజయ్ దేవరకొండ - అర్జున్ రెడ్డి లు ఉత్తమ నటుల క్యాటగిరీలో ఎంపికయ్యారు. ఉత్తమ నటి : అనుష్క - బాహుబలి2, నివేధా థామస్ - నిన్నుకొరి, రకుల్ ప్రీత్ సింగ్ - రారండోయ్ వేడుక చూద్దాం, రితికా సింగ్ - గురు, సాయి పల్లవి - ఫిదాలు ఉత్తమ నటి విభాగంలో ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడు క్రిష్ - గౌతమీపుత్ర శాతకర్ణి రాజమౌళి - బాహుబలి 2 సందీప్ వంగ - అర్జున్ రెడ్డి సంకల్ప్ రెడ్డి - ఘాజీ సతీష్ వేగేష్న - శతమానం భవతి శేఖర్ కమ్ముల - ఫిదా ఉత్తమ సహాయ నటుడు: ఆది పినిశెట్టి - నిన్నుకోరి ప్రకాష్ రాజ్ - శతమానం భవతి రాణా - బాహుబలి2 ఎస్జే సూర్య - స్పైడర్ సత్యరాజ్ - బాహుబలి2 ఉత్తమ సహాయ నటి భూమిక - ఎంసీఏ కాథరీన్ థ్రెసా - నేనే రాజు నేనే మంత్రి జయసుధ - శతమానం భవతి రమ్యకృష్ణ - బాహుబలి 2 శరణ్య ప్రదీప్ - ఫిదా ఉత్తమ గీత రచయిత చైతన్య పింగాలి: ఊసుపోదు (ఫిదా) చంద్రబోస్ - నువ్వేలే నువ్వేలే (జయ జానకి నాయక) చంద్రబోస్ - రావణ (జై లవకుశ) ఎం ఎం కీరవాణి - దండాలయ్య (బాహుబలి2) రామజోగయ్య శాస్త్రి - శతమానం భవతి (శతమానం భవతి) శ్రేష్ఠ - మధురమే (అర్జున్ రెడ్డి) బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) అనురాగ్ కులకర్ణి - మెల్లగా తెల్లారిందోయ్ అర్మాన్ మాలిక్ - హలో హేమచంద్ర - ఊసుపోదు ఎల్వి రేవంత్ - తెలిసెనే నా నువ్వే సిద్ శ్రీరామ్ - అడిగా అడిగా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (ఫీమేల్) గీతా మాధురి & మాన్షి - మహానుభావుడు మధుప్రియ - వచ్చిండే నేహా భాసిన్ - స్వింగ్ జరా సమీరా భరద్వాజ్ - మదురమే సోని, దీపు - హంసనావ -
విద్యాబాలన్ మళ్లీ ఎగరేసుకుపోయిందిగా..
సాక్షి, ముంబయి : జియో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2018 వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది. 2017 సంవత్సరానికి గాను 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రధానోత్సవాన్ని శనివారం రాత్రి (జనవరి 20) నిర్వహించారు. బాలీవుడ్ సినీ రంగానికి చెందిన చిత్రాలు, నటులు ఇతర విభాగాలకు ఈ అవార్డులు అందజేశారు. అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ఆయన మిత్రుడు నిర్మాత కరణ్ జోహార్ ఆతిథ్యం నిర్వహించారు. 2017 సంవత్సరానికిగాను అందించిన ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ‘హిందీ మీడియం’ ఎంపికైంది. కాగా, ఉత్తమ నటుడు అవార్డును ఇర్ఫాన్ ఖాన్ అందుకున్నారు. అలాగే, ఉత్తమ నటిగా విద్యాబాలన్ నిలిచారు. ఆమెకు ఇది ఆరో ఫిల్మ్‌ఫేర్ అవార్డు. ‘తుమ్హారి సులు’ చిత్రంలో నటనకు గాను విద్యాబాలన్‌కు ఈ అవార్డును అందించారు. కాగా, ఉత్తమ దర్శకత్వం అవార్డును అశ్వినీ అయ్యర్ తివారీ అందుకున్నారు. ఇక క్రిటిక్స్ అవార్డ్స్ కింద ఉత్తమ చిత్రంగా న్యూటన్ నిలవగా ఉత్తమ నటుడిగా రాజ్‌కుమార్ రావ్ (ట్రాప్డ్), ఉత్తమ నటిగా జైరా వాసిం (సీక్రెట్ సూపర్‌స్టార్) నిలిచారు. దీంతోపాటు పలు విభాగాల్లో కూడా అవార్డులు అందజేశారు. -
ఫిలింఫేర్ బెస్ట్ మూమెంట్స్!
-
ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విజేతలు వీరే..
చూడ్డానికి కళ్లు సరిపోవేమో అనేంత అందంగా ఉన్న వేదికపై ఉల్లాసం, ఉత్తేజానిచ్చే ఆట-పాటలు కలగలిసి కళ్లు తిప్పుకోనివ్వని అందాలు,మిరమిట్లు గొలిపే మెరుపులు. ఇక చివరగా.. కళ్లింత చేసి, ఉత్కంఠగా చూస్తుండగా 'ద అవార్డ్ గోస్ టూ..' అనే సందర్భంలో ఏర్పడే నిశ్శబ్ధం.. వీటన్నింటికీ వేదికైంది 'ఫిల్మ్‌ఫేర్ అవార్డ్- 2013' వేడుక. చిత్రపరిశ్రమలో జాతీయ అవార్డుల తర్వాత, ఆస్థాయి పేరు గాంచిన ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక ఫిల్మ్‌ఫేర్. ప్రతీ యేటా హిందీ చిత్రాలకు, దక్షిణ భారత దేశంలోని వివిధ పరిశ్రమలకు వేర్వేరుగా ప్రకటించే ఈ అవార్డుల్లో.. 2013 సంవత్సరానికి హిందీ పరిశ్రమకు సంబంధించిన అవార్డు వేడుకను జనవరి నెలలో నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా దక్షిణ భారత చలనచిత్రాలకు సంబంధించిన అవార్డు వేడుకను నిన్న (12-07-2013) న చెన్నైలో నిర్వహించారు. ఈ అవార్డుల్లో తెలుగు పరిశ్రమకు గానూ, 2013లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'అత్తారింటికి దారేదీ' నాలుగు అవార్డులను సొంతం చేసుకోగా.. అదే సంవత్సరం విడుదలై మల్టీస్టారర్ చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రెండు అవార్డులను ఎగరేసుకెళ్లింది. తెలుగు పరిశ్రమకు చెందిన అవార్డుల విశేషాలివీ.. ఉత్తమ చిత్రం : అత్తారింటికి దారేదీ ఉత్తమ నటుడు : మహేశ్ బాబు (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు) ఉత్తమ దర్శకుడు : త్రివిక్రమ్ (అత్తారింటికి దారేదీ) ఉత్తమ నటి : నిత్యామీనన్ (గుండెజారి గల్లంతయిందే) ఉత్తమ సహాయ నటుడు : సునీల్ (తడాఖా) ఉత్తమ సహాయ నటి : మంచు లక్ష్మి(గుండెల్లో గోదారి) ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీశ్రీ ప్రసాద్ (అత్తారింటికి దారేదీ) ఉత్తమ నేపథ్య గాయకుడు : కైలాష్ కేర్ (పండగలా దిగివచ్చావు.. మిర్చి) ఉత్తమ నేపథ్య గాయని : చిత్ర (సీతమ్మ వాకిట్లో.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు) ఉత్తమ గీత రచయిత : శ్రీమణి (ఆరడుగుల బుల్లెట్.. అత్తారింటికి దారేదీ) మరిన్ని చిత్రాల కోసం క్లిక్ చేయండి In English: Mahesh Babu wins Filmfare best actor south award -
ఉత్తమ నటుడిగా మహేష్ బాబు
చెన్నై:టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాలకు ఆదర్శంగా నిలిచిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. 2013లో విక్టరీ వెంకటేష్, పాల బుగ్గల చిన్నోడు మహేష్ బాబు కలిసి నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పడు ఆ చిత్రం ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకుని టాలీవుడ్ కు మరింత అందం తీసుకొచ్చింది. 61వ దక్షిణాది ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి గాను మహేష్ బాబు ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్నాడు. శనివారం ప్రకటించిన ఈ అవార్డుల్లో 'రాజా రాణి' తమిళ చిత్రంలో నటించిన నయన తార ఉత్తమ నటిగా ఎంపికయ్యింది. దక్షిణాదిలో ఉన్న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చలన చిత్ర పరిశ్రమల మధ్య జరిగిన అవార్డుల ఎంపికలో పలు చిత్రాలు ఒకటి కంటే ఎక్కువ అవార్డులు దక్కించుకున్నాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన 'కాదల్' ఏకంగా నాలుగు అవార్డులను కైవసం చేసుకుంది. మరో ప్రముఖ దర్శకుడు బాల తెరకెక్కించిన 'పరదేశీ' మరియు 'తంగా మీంగల్ ' చిత్రాలు చెరో మూడు అవార్డులను దక్కించుకున్నాయి. తమిళ చిత్రం 'రాజా రాణి'కి రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. 'కాదల్ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని అందించిన ఏఆర్ రెహ్మాన్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు దక్కింది.