
హీరోయిన్ అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ ఈ ఏడాదిలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ ఆలయంలో నిశ్చితార్థ వేడుక జరుపుకున్నారు. అయితే తాజాగా తనకు కాబోయే భర్తకు అవార్డులు రావడం పట్ల ఆదితిరావు సంతోషం వ్యక్తం చేసింది. ఈ గెలుపు మీకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిన్నా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
తాజాగా సిద్ధార్థ్ తన ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పక్కన పెట్టుకుని నిద్రిస్తున్న ఫోటోను అదితి రావు హైదరి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఇటీవల జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌లో సిద్ధార్థ్ నటించిన చిత్తా(చిన్నా) సినిమా ఏకంగా ఏడు అవార్డులు సాధించింది. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్తా మూవీకి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (క్రిటిక్స్), లీడ్‌రోల్‌లో ఉత్తమ నటి (మహిళ), ఉత్తమ సహాయ పాత్ర (ఫీమేల్), ఉత్తమ సంగీత ఆల్బమ్, ఉత్తమ నేపథ్య గాయని (ఫీమేల్) విభాగాల్లో అవార్డులు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment