ఎంగేజ్‌మెంట్‌ సీక్రెట్‌గా జరగలేదు, మా పెళ్లెప్పుడంటే? | Siddharth Comments About his Wedding Date with Aditi Rao Hydari | Sakshi
Sakshi News home page

Siddharth: ఆమె ఎక్కడ నో చెప్తుందోనని టెన్షన్‌ పడ్డా.. పెళ్లి ముహూర్తం..

Published Sun, Apr 7 2024 1:01 PM | Last Updated on Sun, Apr 7 2024 1:39 PM

Siddharth Comments About his Wedding Date with Aditi Rao Hydari - Sakshi

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు హీరో సిద్దార్థ్‌. ఒకప్పుడు సూపర్‌ హిట్లతో అలరించిన ఇతడికి ఈ మధ్య తెలుగులో విజయాలే కరువయ్యాయి. సినిమాల సంగతి ఎలా ఉన్నా తెలుగు హీరోయిన్‌ అదితిరావు హైదరితో డేటింగ్‌ చేస్తూ, షికార్లకు వెళ్తూ అందరి కంట్లో పడ్డాడు. కానీ తన ప్రేమ విషయాన్ని అందరితో పంచుకోవడానికి ఇష్టపడలేదు.

పెళ్లి కాస్తా ఎంగేజ్‌మెంట్‌ అయింది!
ఈ క్రమంలో మార్చి 17న సడన్‌గా వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురంలో ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నాడు. తమిళనాడు నుంచి పురోహితులను తీసుకొచ్చి మరీ ఎంగేజ్‌మెంట్‌ కానిచ్చేశారు. కానీ ఆలయ అధికారులకు, పండితులకు అది సినిమా షూటింగ్‌ అని చెప్పి బురిడీ కొట్టించారు. తర్వాత ఆ డెకరేషన్‌, సెలబ్రేషన్స్‌ చూస్తే అది పెళ్లని అందరూ పొరబడ్డారు. దీంతో సిద్దార్థ్‌ సోషల్‌ మీడియా వేదికగా తానింకా పెళ్లి చేసుకోలేదని, జరిగింది ఎంగేజ్‌మెంట్‌ మాత్రమేనని వెల్లడించాడు.

సీక్రెట్‌ కాదు..
తాజాగా ఓ ఈవెంట్‌కు వెళ్లిన అతడికి ఎందుకు సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు? పెళ్లి ముహూర్తాలు పెట్టించారా? అని వరుస ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి సిద్దార్థ్‌ స్పందిస్తూ.. చాలామంది మేమేదో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నామంటున్నారు. సీక్రెట్‌, ప్రైవేట్‌ అనే పదాలకు చాలా వ్యత్యాసం ఉంది. మేము మా కుటుంబసభ్యులతో కలిసి ప్రైవేట్‌ ఫంక్షన్‌ చేసుకున్నాం. ఏ ఒక్కరినీ పిలవకుండా, చెప్పాపెట్టకుండా చేసుకుంటే అది సీక్రెట్‌ అంటారు. మరి మా వాళ్లందరి సమక్షంలో జరిగిన నిశ్చితార్థం సీక్రెట్‌ ఎలా అవుతుంది?

పెళ్లి వారి చేతుల్లోనే..
ఇకపోతే అదితికి ప్రపోజ్‌ చేసినప్పుడు ఏం సమాధానం వస్తుందా? అని ఎదురుచూశాను. నా టెన్షన్‌ పోగొడుతూ తను నాతో జీవితాన్ని పంచుకోవడం సమ్మతమే అని అంగీకరించడంతో సంతోషపడిపోయాను. పెళ్లి విషయానికి వస్తే అది మా పెద్దలు నిర్ణయిస్తారు. నేను డిసైడ్‌ చేయడానికి ఇదేమీ షూటింగ్‌ డేట్‌ కాదు కదా.. పెద్దవాళ్లే ముహూర్తాలు చూసి ఓ మంచిరోజు డిసైడ్‌ చేస్తారు. అప్పుడే పెళ్లి జరుగుతుంది అని చెప్పాడు.

చదవండి: అతడిని ఎంతో ప్రేమించా.. పెళ్లి దగ్గర్లో ఉందనగా నేనంటే ఇష్టం లేదన్నాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement