
హీరో సిద్ధార్థ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అవును మీరు సరిగానే విన్నారు. హీరోయిన్ అదితీతో గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఇతడు.. సెప్టెంబరులో ఈమెని పెళ్లి చేసుకున్నాడు. తెలంగాణలోని వనపర్తిలోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన రంగనాథ స్వామి దేవాలయం దీనికి వేదికైంది. ఇప్పుడు మరోసారి వివాహమాడాడు.
(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే)
సెప్టెంబరులో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా పెళ్లి జరగ్గా.. ఇప్పుడు రాజస్థాన్‌లోని అలీలా ఫోర్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని అదితీ, సిద్ధార్థ్ తమ తమ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. దీంతో తోటీ నటీనటులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
'మహాసముద్రం' సినిమా షూటింగ్ టైంలో సిద్దార్థ్-అదితీకి పరిచయం ఏర్పడింది. అలా కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. హీరోయిన్ అదితీ రావు హైదరీ పూర్వీకులది వనపర్తి. అందుకే రంగనాథ్ స్వామి ఆలయండో నిశ్చితార్థం, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తమ కోరిక ప్రకారం రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.
(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)




Comments
Please login to add a commentAdd a comment