చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే | Truth Behind Chay & Sobhita Wedding Rumours On OTT | Sakshi
Sakshi News home page

Chay-Sobhita: ప్రముఖ ఓటీటీతో రూ.50 కోట్ల డీల్? ఇది అసలు నిజం

Published Wed, Nov 27 2024 10:28 AM | Last Updated on Wed, Nov 27 2024 10:43 AM

Truth Behind Chay & Sobhita Wedding Rumours On OTT

హీరో నాగచైతన్య మరో వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు. హీరోయిన్ శోభితతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఈ శుభకార్యం జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలైపోయాయి. సరిగ్గా ఈ టైంలో ఓ పుకారు బయటకొచ్చింది. చైతూ-శోభిత పెళ్లిని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.50 కోట్లకు డీల్ మాట్లాడుకుందని అన్నారు. కానీ అందులో నిజం లేదు.

(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)

చైతూ-శోభితకు సన్నిహితుడైన ఓ వ్యక్తి.. ఓటీటీ డీల్ అనేది కేవలం రూమర్ మాత్రమే అని తేల్చేశారు. పెళ్లి.. చాలా ప్రైవేట్‌గా జరగనుందని క్లారిటీ ఇ‍చ్చారు. ఈ రూమర్లు రావడానికి ఓ కారణముంది. రీసెంట్‌గా 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరిట ఈమె జీవితాన్ని డాక్యుమెంటరీగా తీసి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. దీనిపై నెగిటివ్ కామెంట్సే వినిపించాయి.

ఇదే డాక్యుమెంటరీలో నయన పెళ్లి వీడియోని కూడా చూపించారు. ఈ క్రమంలోనే చైతూ-శోభిత పెళ్లిని కూడా నెట్‍‌ఫ్లిక్స్ సంస్థ ఓటీటీలో ప్రసారం చేయనుందనే రూమర్ పుట్టుకొచ్చింది. ఇదంతా అబద్ధమని తేలింది. ప్రస్తుతం చైతూ 'తండేల్' మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత 'విరూపాక్ష' దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నాడు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు.

(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement