హీరో, హీరోయిన్ సిద్ధార్థ్ , అదితిరావు హైదరీ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. అయితే వీరిద్దరికి కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం.
(ఇది చదవండి: అదితి-సిద్ధార్థ్ పెళ్లి.. వీరి ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?)
తాజాగా అదితిరావు హైదరీ న్యూ ఇయర్ సందర్భంగా పోస్ట్ చేసింది. గతేడాది జరిగిన మధుర జ్ఞాపకాలను షేర్ చేసింది. హీరామండిలో నటన, సిద్ధార్థ్ ప్రపోజల్ ఫోటోతో పాటు అతనితో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంది. ఓ వీడియో రూపంలో తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఇందులో తన ఎంగేజ్‌మెంట్, పెళ్లి ఫోటోలు కూడా ఉన్నాయి. థ్యాంక్యూ యూ 2024.. వెల్‌కమ్-2025 అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment