proposal
-
అదితిరావు- సిద్ధార్థ్ పెళ్లి.. ప్రపోజల్ ఫోటో వైరల్
హీరో, హీరోయిన్ సిద్ధార్థ్ , అదితిరావు హైదరీ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. అయితే వీరిద్దరికి కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం.(ఇది చదవండి: అదితి-సిద్ధార్థ్ పెళ్లి.. వీరి ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?)తాజాగా అదితిరావు హైదరీ న్యూ ఇయర్ సందర్భంగా పోస్ట్ చేసింది. గతేడాది జరిగిన మధుర జ్ఞాపకాలను షేర్ చేసింది. హీరామండిలో నటన, సిద్ధార్థ్ ప్రపోజల్ ఫోటోతో పాటు అతనితో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంది. ఓ వీడియో రూపంలో తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఇందులో తన ఎంగేజ్మెంట్, పెళ్లి ఫోటోలు కూడా ఉన్నాయి. థ్యాంక్యూ యూ 2024.. వెల్కమ్-2025 అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
నీతా.. నిన్నే పెళ్లాడుతా! ట్రాఫిక్ సిగ్నల్‌లో ప్రపోజ్
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ జీవిత భాగస్వామి నీతా అంబానీ తన 60వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవితంలో ఎంతో ముఖ్యమైన ముఖేష్ అంబానీతో ప్రేమ కథ ఎలా ప్రారంభమైందో ఈ కథనంలో తెలుసుకుందాం..ధీరూభాయ్‌ని మెప్పించి..ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ.. నీతా హుందాతనం, ప్రతిభను చూసి తన కోడలుగా ఎంచుకున్నారు. ఓసారి నీతా భరతనాట్యం ప్రదర్శనను తిలకించిన ధీరూభాయ్ తన కొడుకు ముఖేష్ ఆమే సరిజోడని భావించారు. వారిద్దరికీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది వారి మధ్య స్నేహాన్ని క్రమంగా పెంచింది.చెబితేనే కారు కదిలేది..మీడియా నివేదికల ప్రకారం.. ఒకరోజు ముఖేష్ అంబానీ, నీతాతో కలిసి కారులో వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపి నీతా వైపు తిరిగి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగారు. నిశ్చేష్టురాలైన ఆమె ఆశ్చర్యంతో ఏమీ చెప్పలేక కొద్దిసేపు అలాగే ఉండిపోయింది. సమాధానం చెప్పే వరకూ కారు కదలదని ముఖేష్ అంబానీ చెప్పారు. దీంతో తరువాత ఆమె అంగీకరించారు. అలా వారు కలిసి జీవితాన్ని ప్రారంభించారు. -
తెలంగాణ: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన తిరస్కరణ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. డిస్కమ్‌ల ప్రతిపాదనలను సోమవారం ఈఆర్సీ తిరస్కరించటంతో సామాన్య వినియోగదారులకు ఊరట లభించింది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీలు రూ. 10 నుంచి రూ. 50 పెంచాలనే డిస్కమ్‌ల ప్రతిపాదనలను కమిషన్ ఆమోదించలేదు. డిస్కమ్‌ల 8 పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించిందని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. ‘‘అన్ని పిటిషన్లపై ఎలాంటి లాప్స్ లేకుండా వెల్లడించాలని నిర్ణయించింది. 40 రోజుల తక్కువ సమయంలో నిర్ణయం వెలువరిస్తున్నాం. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఎనర్జీ చార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేదు. స్థిర చార్జీలు రూ.10 యధాతధంగా ఉంటాయి. పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్‌లను కమిషన్ ఆమోదించలేదు. హెచ్‌టీ కేటగిరిలో ప్రతిపాదనలు రిజక్ట్ చేశాం.132కేవీఏ, 133కేవీఏ, 11కేవీలలో గతంలో మాదిరిగానే ఛార్జీలు ఉంటాయి. లిఫ్ట్ ఇరిగేషన్‌కు కమిషన్ ఆమోదించింది. టైమ్ ఆఫ్ డేలో పీక్ అవర్‌లో ఎలాంటి మార్పు లేదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలకు నాన్ పీక్ ఆవర్‌లో రూపాయి నుంచి రూపాయిన్నర రాయితీ పెంచాం. చేనేత కార్మికులకు హార్స్ పవర్‌ను పెంచాం. హెచ్‌పీ 10 నుంచి హెచ్‌పీ 25కి పెంచాం.గృహ వినియోగదారులకు మినిమమ్ చార్జీలు తొలగించాం. గ్రిడ్ సపోర్ట్ చార్జీలు కమిషన్ ఆమోదించింది. ఆర్ఎస్పీ ఇవి కేవలం ఐదు నెలల వరకే ఉంటాయి. రూ.11,499.52 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. రూ.1,800 కోట్లు ప్రపోజల్స్ ఇచ్చారు. డిస్కంలు రూ.57,728.90 పిటిషన్ వేస్తే.. ఈఆర్సీ రూ.54,183.28 కోట్లు ఆమోదించింది’ అని వివరాలు వెల్లడించారు.చదవండి: కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఆధారాలు -
ప్యారిస్ ఒలింపిక్స్ : రొమాంటిక్ లవ్ ప్రపోజల్, వైరల్ వీడియో
సిటీ ఆఫ్ లవ్.. ప్యారిస్. తన ఇష్టసఖి మనసు గెల్చుకునేందుకు విశ్వక్రీడావేదికను ఎంచుకున్నాడు. ఈ రొమాంటిక్ స్టోరీ ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఈ చైనీస్ జంట వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో చైనీస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హువాంగ్ యాకియోంగ్, జెంగ్ సివీ స్వర్ణం గెలిచి తమ కలను సాకారం చేసుకున్నారు. కానీ బోయ్ ఫ్రెండ్ డైమండ్ రింగ్‌ను సొంతం చేసుకుంటానని ఊహించలేదు..హువాంగ్. స్టోరీ ఏంటంటే..:తన లవ్ ప్రపోజల్‌కు ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది అనుకున్నాడో ఏమో గానీ చైనీస్ షట్లర్ లియు యుచెన్, తన ప్రేయసి విజయ సంబరాల్లో మునిగి తేలుతున్న వేళ మోకాళ్లపై వంగి ‘జీవితాంతం నిన్ను ప్రేమిస్తా.. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ హువాంగ్ యాకియోంగ్కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేశాడు. దీంతో సిగ్గుల మొగ్గ అవ్వడం ఆమె వంతైంది. సోషల్ మీడియాలో ఈ ప్రేమికులకు అభినందనలు వెల్లువెత్తాయి. లియు యుచెన్ ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలవలేదు కానీ ఒలింపిక్ బంగారు పతక విజేతను గెల్చుకున్నాడు అంటూ అభినందించారు. పురుషుల డబుల్స్‌లో టోక్యో-2020 రజత పతకాన్ని గెల్చుకున్నాడు లియు."I’ll love you forever! Will you marry me?""Yes! I do!" OMG!!! Romance at the Olympics!!!❤️❤️❤️Huang Yaqiong just had her "dream come true", winning a badminton mixed doubles gold medal🥇with her teammate Zheng SiweiThen her boyfriend Liu Yuchen proposed! 🎉🎉🎉 pic.twitter.com/JxMIipF7ij— Li Zexin (@XH_Lee23) August 2, 2024శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ బ్యాడ్మింటన్‌లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ వోన్ హో- జియోంగ్ నా-యూన్ (21-8, 21-11)పై చైనాకు చెందిన జెంగ్ సివీ మరియు హువాంగ్ యా కియోంగ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నారు.కాగా అర్జెంటీనాకు చెందిన హ్యాండ్‌బాల్ స్టార్ పాబ్లో సిమోనెట్, మహిళల ఫీల్డ్ హాకీ క్రీడాకారిణి మరియా పిలార్ కామ్పోయ్ లవ్ స్టోరీ కూడా ప్యారిస్ ఒలింపిక్స్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమెకు పెళ్లి ప్రతిపాదన తెచ్చేందుకు తొమ్మిదేళ్లు వెయిట్ చేసిన మరీ ఆమె మనసు దోచుకున్నాడు -
గాజా సంక్షోభంలో కీలక పరిణామం
వేల ప్రాణాలు బలిగొని.. లక్షల మందిని నిరాశ్రయులిగా మార్చేసి.. తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న గాజా సంక్షోభంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందంపై హర్షం వ్యక్తం చేసిన హమాస్.. ఇప్పుడు ఇజ్రాయెల్ బందీల విడుదల చర్చలకు అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. ‘‘తొలి దశ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మా దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయిలను విడుదల చేస్తాం. అయితే ఒప్పందంలోకి ప్రవేశించేముందు ఒక షరతు. శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ తప్పకుండా సంతకం చేయాలి’’ అని హమాస్ సీనియర్ కమాండర్ ఒకరు చెప్పినట్లు రాయిటర్స్ కథనం ఇచ్చింది. మరోవైపు.. ఇజ్రాయెల్ ఓ అడుగు ముందుకు వేస్తే గాజా యుద్ధానికి తెర పడుతుందని ఇజ్రాయెల్-హమాస్ మధ్య దౌత్యం వహిస్తున్న పాలస్తీనా అధికారి ఒకరు తెలిపారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందం ఇదే.. మొదటి దశ.. ఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్-హామాస్ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి. రెండో దశలో.. సైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి. మూడో దశలో.. గాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రూపొందించిన ఈ ప్రతిపాదనలో తాత్కాలిక కాల్పుల విరమణ, మానవతా సాయానికి అనుమతి, ఒప్పందంలో రెండో దశలోకి ప్రవేశించేంత దాకా ఇజ్రాయెల్ తన బలగాల్ని వెనక్కి తీసుకోవడం లాంటి అంశాలున్నాయి. దీంతో ఇజ్రాయెల్, హమాస్ తాజా ప్రతిపాదనకు ఎలా స్పందిస్తుందో చూడాలి. అక్టోబర్ 7న హమాస్ బలగాలు ఇజ్రాయెల్ దక్షిణ సరిహద్దులోని నగరాలపై అన్ని మార్గాల నుంచి మీదుగా దాడులకు దిగడం.. ప్రతిగా గాజాపైకి ఇజ్రాయెల్ రక్షణ దళం దండెత్తడంతో ఈ సంక్షోభం మొదలైంది. గాజాలో ఇప్పటిదాకా ఇజ్రాయెల్ బలగాలకు దాడులకు 38వేల మంది చనిపోయారు. సురక్షిత ప్రాంతాల పేరిట లక్షల మంది వలసలు వెళ్లారు. గాజా యుద్ధం ముగిసేందుకు.. ఇజ్రాయెల్ బలగాలు వెనక్కి మళ్లేందుకు ఎలాంటి ఒప్పందానికైనా సిద్ధమని హమాస్ ప్రకటించింది. అయితే హమాస్‌ను శాశ్వతంగా తుడిచిపెట్టేంతదాకా యుద్ధం ఆపేది లేదని, కావాలంటే తాతల్కాలిక విరామం మాత్రమే ఉంటుందని చెబుతోంది. -
ఇజ్రాయెల్‌పై అడ్డుకట్టకు ఖతార్‌తో జోబైడెన్ భేటీ
గత ఆరు నెలలుగా హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. హమాస్‌ను నిర్మూలించాలనే ఇజ్రాయెల్ లక్ష్యం.. గాజా స్ట్రిప్‌లోని ప్రజలను కష్టాలపాలు చేస్తోంది. గాజాలో తలెత్తుతున్న విధ్వంసకర పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.అమెరికాలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇది అధ్యక్షుడు జో బైడెన్‌కు కొత్త సమస్యలను తెచ్చిపెట్టేదిగా మారింది. దీంతో బైడెన్ గాజాలో యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ ప్రతిపాదనను బైడెన్ ఇటీవలే ప్రకటించాడు.తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరోసారి ఈ ఒప్పందానికి సంబంధించి ఖతార్ ఎమిరేట్స్‌తో మాట్లాడారు. కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆమోదించేలా హమాస్‌పై ఒత్తిడి తేవాలని కోరారు. గాజాలో సంక్షోభాన్ని అంతం చేయడానికి, కాల్పుల విరమణ, బందీ ఒప్పందాన్ని అమలు చేయడంపై ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో చర్చించారు.‘నేను ఈ రోజు ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో మాట్లాడాను’ అని బైడెన్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. కాల్పుల విరమణ, బందీ ఒప్పందానికి సంబంధించిన ప్రణాళికను ఎలా రూపొందించాలనే దానిపై చర్చించానన్నారు. హమాస్ ఒప్పందాన్ని ఆమోదించేలా అన్ని తగిన చర్యలను తీసుకోవాలని తాను అమీర్ తమీమ్‌ను కోరానన్నారు. గాజాలో బందీలుగా ఉన్న వారిని విడుదల చేయడానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపానన్నారు. ఈ ఒప్పందం అమలుకు ఈజిప్ట్, ఖతార్‌లతో కలిసి యునైటెడ్ స్టేట్స్ పని చేస్తుందని బైడెన్ పేర్కొన్నారు.ఐదు వేలకు పైగా రాకెట్లను ప్రయోగిస్తూ హమాస్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్ నగరాలపై దాడి మొదలుపెట్టింది. అనంతరం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి అక్కడి ప్రజలపై దాడులు జరిపారు. దీనికి ప్రతిగా గాజాలోని హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో గాజాలోని హమాస్ స్థావరాలపై భారీ బాంబు దాడులు జరిగాయి. ఫలితంగా గాజాలోని పలు ప్రాంతాలు శిథిలమయ్యాయి. ఇజ్రాయెల్,గాజాలలో ఇప్పటివరకు మొత్తం 34,622 మంది మృతి చెందారు. The United States has worked relentlessly to support Israelis’ security, to get humanitarian supplies into Gaza, and to get a ceasefire and a hostage deal to bring this war to an end. pic.twitter.com/eGXgV3KSbV— President Biden (@POTUS) June 1, 2024 -
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
టాలీవుడ్లో మురారి, ఇంద్ర లాంటి సూపర్ హిట్ సినిమాలతో మెప్పించిన భామ సోనాలి బింద్రే. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై మెరిసింది. ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2 తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తన వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా సోనాలికి ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది. గతంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ మీపై విపరీతంగా ప్రేమించాడని వార్తలొచ్చాయి.. అంతేకాదు పెళ్లికి ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేస్తానని అన్నట్లు తెగ వైరలయ్యాయి.అయితే తాజా ఇంటర్వ్యూలో వీటిపై సోనాలి బింద్రే స్పందించింది. ఆ ప్రశ్న వినగానే సోనాలి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీని గురించి మాట్లాడుతూ.. 'అతను నిజంగా చెప్పాడో లేదో నాకు తెలియదు.. అయితే ఇది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు.. ఇప్పటికీ ఆ ఫేక్ న్యూస్ ఉందని ఆమె కొట్టిపారేశారు. అయితే అతను తన అభిమాని కావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.అయితే 2019లో సోనాలికి సంబంధించి తాను ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదని షోయబ్ స్పష్టం చేశాడు. షోయబ్ తన సొంత యూట్యూబ్ ఛానెల్లో దీనిపై వీడియో పోస్ట్ చేశారు. ఇంతటితో ఈ రూమర్స్‌కు స్వస్తి చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు. నేను ఆమెను సినిమాల్లో చూశాను.. తన అందమైన నటి కూడా అని అన్నారు. అయితే ఆమె క్యాన్సర్‌తో పోరాడిన తీరు చూసి అభిమానించడం మొదలుపెట్టానని షోయబ్ వెల్లడించారు. -
Israel-Hamas war: స్వతంత్ర పాలస్తీనాకు నెతన్యాహు నో
టెల్ అవీవ్: గాజాలో యుద్ధం ముగిశాక స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు చేయాలన్న అగ్ర రాజ్యం అమెరికా ప్రతిపాదనను తిరస్కరించానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హమాస్ నిర్మూలన, బందీల విడుదలతో సంపూర్ణ విజయం లభించేదాకా గాజాలో యుద్ధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు మరికొన్ని నెలలు పడుతుందని చెప్పారు. గాజాలోని 25 వేల మంది ప్రజలు మృత్యువాత, 85% మంది ప్రజలు వలసబాట పట్టిన నేపథ్యంలో యుద్ధం విరమించుకునేలా చర్చలు జరపాలంటూ ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా సహా పలు దేశాలు ‘రెండు దేశాల’విధానాన్ని పునరుద్ధరించాలంటూ కోరుతున్నాయి. అయితే, నెతన్యాహు తాజా ప్రకటనతో యుద్ధం విషయంలో ఇజ్రాయెల్ నిర్ణయంలో మార్పులేదని స్పష్టమైంది. నెతన్యాహు వ్యాఖ్యలపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు ప్రతినిధి జాన్ కిర్బీ స్పందిస్తూ.. ఇజ్రాయెల్, అమెరికాలు ఒకే అంశంపై భిన్నంగా ఆలోచించడం సహజమేనన్నారు. -
వచ్చే ఏడాది 43% మిగులు విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: అవసరానికి మించి విద్యుత్ కొనుగోళ్ల కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు భారీ ఎత్తున చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలు... వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారబోతున్నాయని విద్యుత్‌రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో భారీ ఎత్తున మిగులు విద్యుత్ ఉండనుందని, దీంతో అవసరం లేని విద్యుత్‌కు పెద్ద మొత్తంలో స్థిర చార్జీలు (ఫిక్స్డ్ చార్జీలు) చెల్లించక తప్పదని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రాలను బ్యాకింగ్ డౌన్ చేసి ఉత్పత్తిని తగ్గించుకోవడం, పూర్తిగా నిలుపుదల చేయడం తప్పదని స్పష్టం చేశారు. 2024–25లో ఏకంగా 43.24 శాతం, 2025–26లో 41.97 శాతం, 2026–27లో 34.13 శాతం, 2027–28లో 26.29 శాతం, 2028–29లో 15.22 శాతం మిగులు విద్యుత్ ఉండనుందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వినర్ ఎం.వేణుగోపాల్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2024–29, 2029–34 మధ్య కాలంలో రాష్ట్రంలో ఉండనున్న విద్యుత్ డిమాండ్ అంచనాలు, విద్యుత్ విక్రయాల అంచనాలు, ఆ మేరకు సరఫరా చేసేందుకు విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళికలు, పెట్టుబడి ప్రణాళికలతో కూడిన తమ వనరులు, వ్యాపార ప్రణాళికలను ఇటీవల రాష్ట్ర డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాయి. దీనిపై ఈఆర్సీ అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించగా ఎం.వేణుగోపాల్‌రావు రాతపూర్వకంగా అభ్యంతరం తెలియజేశారు. కొత్త ఎత్తిపోతల పథకాల విద్యుత్ అవసరాలు ఏటేటా క్రమంగా పెరగనున్నందున మిగులు విద్యుత్ సమస్యే ఉండదంటూ డిస్కంలు సమరి్థంచుకోవడాన్ని కొట్టిపడేశారు. ఎత్తిపోతల పథకాలకు ఎంత విద్యుత్ అవసరమో డిస్కంలు ప్రతిపాదించలేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు అనుమతులు జారీ చేసే ముందు ఈఆర్సీ సమగ్ర పరిశీలన జరపాలని సూచించారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ధర ఎంత? వ్యవసాయం మినహా అన్ని కేటగిరీల కనెక్షన్లకు 2025 నుంచి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించాలని కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్)లో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు డిస్కంలు ఈఆర్సీకి తమ వనరుల ప్రణాళికలో వెల్లడించాయి. 2024–29 మధ్య కాలంలో ఎల్టీ మీటర్లకు ప్రీపెయిడ్ మీటర్లకు రూ. 348 కోట్లు, హెచ్‌టీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు రూ. 305 కోట్లు అవసరమని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీసీఎల్) నివేదించింది. ఎల్టీ మీటర్లకు రూ.116 కోట్లు, హెచ్‌టీ మీటర్లకు రూ.10.94 కోట్లు అవసరమని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) ప్రతిపాదించింది. ఈ మీటర్ల ధర ఎంత? ఏ విధంగా ఈ ధరలను ఖరారు చేశారో తెలపాలని వేణుగోపాల్‌రావు డిస్కంలను ప్రశ్నించారు. కాగా, ఈఆర్సీ గత శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు సరైన సమాచారంతో డిస్కంలు రాకపోవడంతో పలువురు నిపుణులు చేసిన వి జ్ఞప్తి మేరకు ఈ నెల 22న విచారణ నిర్వహించాలని ఈఆర్సీ నిర్ణయించింది. ఆలోగా పూర్తి వివరణలను సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. -
రూ. 8,200 కోట్లతో మేఘా ఈవీ ప్లాంటు! బీవైడీతో కలిసి ఏర్పాటు యోచన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంటు ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. చైనాకు చెందిన బీవైడీ భాగస్వామ్యంలో తెలంగాణలో ఈ ఫెసిలిటీని స్థాపించాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే ప్లాంటుకు కావాల్సిన స్థలం, ఇతర సౌకర్యాల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంఈఐఎల్, బీవైడీ సంప్రదించనున్నాయి. ప్రతిపాదిత ప్రణాళిక కార్యరూపం దాలిస్తే ప్లాంటు కోసం ఇరు సంస్థలు కలిసి సుమారు రూ.8,200 కోట్లు వెచ్చించనున్నాయి. మేఘా అనుబంధ కంపెనీ అయిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఇప్పటికే బీవైడీ సాంకేతిక భాగస్వామ్యంలో ఎలక్ట్రిక్ బస్‌లను తయారు చేస్తోంది. అలాగే తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్‌ల తయారీకై 150 ఎకరాల స్థలాన్ని ఒలెక్ట్రా కొనుగోలు చేసింది. (తక్కువ ధరలో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్) అత్యాధునిక రీతిలో ఏటా 10,000 ఈ–బస్‌లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యంతో ఇది రానుంది. ఎలక్ట్రిక్ టిప్పర్ల తయారీలోకి సైతం ఒలెక్ట్రా ఎంట్రీ ఇచ్చింది. తేలికపాటి వాణిజ్య వాహనాలు, త్రిచక్ర, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలనూ పరిచయం చేయాలన్నది కంపెనీ ప్రణాళిక. ఇది కూడా చదవండి: Koushik Chatterjee: కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం -
Love Proposal: ఇలాంటి ఐడియాలు ఎక్కడ్నుంచి వస్తాయో.. ప్రేయసికి వెరైటీగా ప్రపోజల్
ప్రేమ అనేది మధురానుభూతి. ప్రేమించడం సులువే కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడం అంత ఈజీ కాదు. నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయికి ప్రపోజ్ చేయడానికి నానా తిప్పలు పడుతుంటారు. గ్రీటింగ్ కార్డ్స్ ద్వారానో, బహుమతుల ద్వారానో, సర్‌ప్రైజ్‌లతోనే వెరైటీగా లవ్ ఎక్ప్రెస్ చేస్తుంటారు. ఇంకొందరు అబ్బాయిలైతే సినిమా హీరోల్లా తమ ప్రేయసికి ప్రపోజ్ చేస్తుంటారు. అయితే రీసెంట్గా ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్ కోసం డిఫరెంట్‌గా ప్రపోజ్ చేశాడు. ఈ వెరైటీ ప్రపోజల్‌కి నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. దీంతో వీరి ప్రేమకథ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటివరకు బోలెడన్ని లవ్ ప్రపోజల్స్ గురించి విన్నాం,చూశాం. కానీ ఓ యువకుడు ఇంకాస్త వెరైటీగా తన ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రేయసి కోసం ప్రత్యేకంగా ఓ కీబోర్బ్నే డిజైన్ చేసి ఆమెకు ప్రపోజ్ చేశాడు. ‘బీ మై గర్ల్ ఫ్రెండ్ సెయాంగ్?’ ( Be my girlfriend Seyang ) అనే వాక్యం వచ్చేలా ఇంగ్లీష్ అక్షరాలతో కొన్ని బటన్స్‌ను అమర్చి ఆమెకు ప్రజెంట్ చేశాడు.ఈ వినూత్న ప్రపోజల్‌కి ఆ యువతి ఫిదా అవ్వడమే కాక, ఆనందంతో ఎగిరి గంతేసింది. 'నా బాయ్ ఫ్రెండ్ చాలా అద్భుతమైన రీతిలో ప్రపోజ్ చేశాడు. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను' అంటూ బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీరి ప్రేమ కహానీ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఈ కపుల్‌కి కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. i’ll never shut up about this, he proposed me to be his girlfriend with a keyboard. https://t.co/G8GDpsD62z pic.twitter.com/iPbCZ1zEdA — 에이미 (@amymaymacc) April 29, 2023 -
కేదార్నాథ్ ఆలయంలో ప్రపోజల్స్... యూట్యూబర్‌పై నెటిజన్స్ ఫైర్..
కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో ప్రేమికులు ప్రపోజ్ చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రేమికురాలు విశాఖ ఫల్సంగే ఆ వీడియోను పోస్టు చేయగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఈ వీడియోలో ప్రేమికురాలు విశాఖ ఫుల్సంగే తన ప్రియుడి ముందు మోకాలిపై కూర్చుంటుంది. ఇద్దరు కూడా ఒకే రకమైన ఎల్లో కలర్లో దుస్తులు ధరించారు. ఆలయం బయట కేదార్నాథ్ మహాదేవునికి దండం పెట్టుకున్న తర్వాత ప్రియురాలు విశాఖ తన ప్రియునికి ప్రపోజ్ చేస్తుంది. అనంతరం ఇద్దరు కౌగిలించుకుంటారు. ఈ దృశ్యాలను మరో వ్యక్తి వీడియో తీస్తుంటాడు. View this post on Instagram A post shared by Vishakha Fulsunge || India🇮🇳 (@ridergirlvishakha) ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇలాంటివి అవసరమా? అని ఫైరయ్యారు. 11,750 అడుగుల ఎత్తులో కష్టమైన యాత్రను పూర్తి చేసి ఇలా హగ్ చేసుకోవడాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఇందుకు భిన్నంగా ప్రమికులు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. మహాదేవుని సన్నిధిలో ప్రపోజ్ చేసుకున్నందుకు మెచ్చుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయంలో పెళ్లి చేసుకోవడం తప్పు కానప్పుడు.. పవిత్రమైన కేదార్‌నాథ్‌లో కలిసి ఉంటామని ప్రామిస్ తీసుకోవడంలో తప్పు ఏముందని కామెంట్ చేశారు. ఇదీ చదవండి: కుక్కను కారులోనే వదిలి వెళ్లారు.. తిరిగొచ్చేసరికి.. -
హీరోయిన్ ఆషికకు ప్రపోజ్ చేసిన కల్యాణ్ రామ్!
బింబిసార బ్లాక్ బస్టర్ తర్వాత కల్యాణ్ రామ్ నటిస్తోన్న తాజా చిత్రం అమిగోస్. ఆషిక రంగనాథ్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. రాజేంద్ర రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ క్రమంలో బుల్లితెరపై ఓ షోకు గెస్టుగా విచ్చేసిన కల్యాణ్ రామ్ ఓ ఫన్నీ టాస్క్‌లో భాగంగా హీరోయిన్ ఆషికకు లవ్ ప్రపోజ్ చేశారు.‘మీకోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను’ అంటూ రెడ్ రోజ్ ఇచ్చి క్యూట్‌గా ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత సుమ అప్పుడే రావడంతో.. మీరు ఇంకా బాగున్నారు అంటూ ఆమె చేతికి అందమైన రోజా పువ్వును ఇచ్చారు కల్యాణ్ రామ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
మోకాళ్లపై కూర్చొని సోహైల్‌కు ప్రపోజ్ చేసిన ఇనయా
బిగ్‌బాస్ షోలో లేడీ టైగర్‌గా పాపులర్ అయిన కంటెస్టెంట్ ఇనాయా సుల్తానా. ఆర్జీవీ బ్యూటీ అనే ట్యాగ్ లైన్‌తో హౌస్‌లోకి ఎంటర్ అయిన ఇనయా సివంగిలా బయటకు వచ్చింది. బిగ్‌బాస్‌తో బోలెడం పాపులారిటీని దక్కించుకుంది. ఇక తాజాగా మరోసారి ఇనాయా పేరు నెట్టింట చక్కర్లు కొడుతుంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ సోహైల్ తన క్రష్ అని ఎన్నోసార్లు చెప్పిన ఇనాయా ఇప్పుడు ఏకంగా అతడికి ప్రపోజ్ చేసేసింది. రెడ్ డ్రెస్‌లో గులాబీ చేతిలో పట్టుకొని మోకాళ్లపై కూర్చొని మరీ సోహైల్‌కు తన ప్రేమను వ్యక్తపరిచింది. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా అంటూ రొమాంటిక్‌గా ప్రపోజ్ చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లోనే చెబుదాం అనుకున్నా నువ్వు అంటే నాకు పిచ్చి. ఇప్పుడు చెబుతున్నా ఐ లవ్యూ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు మరి హౌస్‌లో ఆర్జే సూర్య అంటే ఇష్టమన్నావ్ కదా మరి ఇప్పుడేంటి? అని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Inaya Sultan (@inayasulthanaofficial) -
నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే..
సాక్షి, వెబ్ డెస్క్: వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటైన జంటల్లో మహేశ్‌బాబు-నమ్రత కూడా ఒకరు. టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌గా వీరికి పేరుంది. వీరిద్దరిని కలిపింది వంశీ సినిమానే. 2000లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్‌ఫీస్ వద్ద అంతగా మెప్పింపలేకపోయింది. కానీ వీరి ప్రేమకు మజిలీగా మారింది. వంశీ షూటింగ్ సమయంలోనే నమ్రత-మహేశ్ ప్రేమలో పడ్డారు. ఓసారి ఈ సినిమా అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది. నమ్రత మహేశ్ కంటే నాలుగేళ్లు పెద్ద. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. వంశీ సినిమా షూటింగు తొలిచూపులోనే మహేశ్‌ను ఇష్టపడింది. న్యూజిలాండ్ షెడ్యూల్ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారు. కానీ వీరి ప్రేమను మహేష్ తొలుత కుటుంబం అంగీకరించలేదట. దీంతో మహేశ్ తన సోదరి మంజుల సహాయం తీసుకున్నారట. అలా నమ్రత-మహేశ్‌ల పెళ్లి జరగడంలో మంజుల కీలక పాత్ర పోషించిందట. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 2005లో తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా వీరి పెళ్లి జరిగింది. అంతేకాకుండా పెళ్లికి ముందు రోజు రాత్రి వరకు కూడా షూటింగ్లో పాల్గొని ముంబై వెళ్లి పెళ్లి చేసుకున్నారు మహేశ్. ఇక పెళ్లి తర్వాత మహేశ్ కెరీర్ మరింత స్పీడ్ అందుకుంది. సినిమా ప్రమోషన్స్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ నమ్రతే దగ్గరుండి చూసుకుంటుందని మహేశ్ ఓ సందర్భంగా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు మీడియాకు చాలా తొందరగా లీకవుతుంటాయి. కానీ మహేశ్-నమ్రతల రిలేషన్ మాత్రం ఎక్కడా బయటపడకపోవడం విశేషం. ఇక పెళ్లి అనంతరం నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే యాక్టింగ్ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేసింది. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ.. 'టాప్ హీరోయిన్ అవ్వాలన్న కోరిక ఎప్పుడూ లేదు. మహేశ్‌ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడే సినిమాలను వదులుకోవాలనుకున్నా. పెళ్లయి ఇన్నేళ్లయినా ఒక్కసారి కూడా ఈ విషయంలో రిగ్రేట్‌గా అనిపించలేదు. మహేశ్ కుటుంబం కోసం ఏదైనా చేస్తారు. ఎంత బిజిగా ఉన్నా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. వీటన్నింటికీ మించి గొప్ప మానవతా వాది. అందుకే మహేశ్ అంటే నాకు ఎంతో ప్రేమ, ఆరాధన. ఆయన్ను పెళ్లిచేసుకోవడం నాకు లభించిన అత్యంత ప్రత్యేకమైన బహుమతిగా ఫీల్ అవుతుంటా' అని నమ్రత పేర్కొంది. -
తన ప్రేమను తిరస్కరించిందని...కర్కశంగా కత్తితో పొడిచి ఆ తర్వాత...
ఇటీవల యువతీ యువకులు ప్రేమ కోసం చనిపోవడం లేదా తమ ప్రేమను ఒప్పుకోవడం లేదని చంపేయడం వంటి దారుణాలకు ఒడిగడ్డుతున్నారు. చదువకుకునే వయసులో కలిగే ప్రేమలకు, ఆకర్షణలకు లొంగిపోయి బంగారంలాంటి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. అదే కోవకు చెందినవాడు తమిళనాడుకు చెందిన ఒక యువకుడు. చక్కగా తన మానాన తాను చదుకుంటున్న ఒక బాలికను ప్రేమ పేరుతో ఆ యువకుడి వెంటపడి వేధించాడు. చివరికి జైల్లో పెట్టించినా మారకపోగా ఆ బాలికను చంపేందుకు యత్నించాడు. వివరాల్లోకెళ్తే...తమిళనాడులోని తిరుచ్చిలో 16 ఏళ్ల బాలిక పరీక్షలు అయిపోయాయని తన బంధువుల ఇంటికి ఆనందంగా వెళ్తోంది. ఇంతలో కేశవన్ అనే వ్యక్తి వచ్చి ఆమె వెళ్తున్న దారిలో అడ్డగించి అడ్డుకుని తన ప్రేమను అంగీకరించమంటూ వేధించాడు. ఆమె నిరాకరించడంతో కోపంగా కత్తితో 14 సార్లు కిరాతకంగా పొడిచి పారిపోయాడు. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఐతే ఈ కేశవన్ పై ఆ బాలిక గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు పోలీసులు కేశవన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటీవలే బెయిల్ పై విడుదలై వచ్చి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటనపై కరూర్ కాంగ్రెస్ ఎంపీ జోతిమణి స్పందిచడమే కాకుండా నిందుతుడి పై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)ని కోరారు. ఈ మేరకు పోలీసులు కేశవన్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు కూడా. అయితే కేశవన్ మణప్పరై సమీపంలో రైలు పట్టాలపై శవమై కనిపించాడు. మృతదేహం వద్ద ఉన్న వస్తువులు, కేశవ తండ్రి ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా చనిపోయిన వ్యక్తిని కేశవన్ పోలీసులు నిర్థారించారు. (చదవండి: ప్రియునితో సహజీవనం.. వారిమధ్య ఏం జరిగిందో గానీ..) -
భారత్‌పై అమెరికా, ఆస్ట్రేలియా విమర్శలు!
Deeply Disappointing India For Russia Proposals: ఉక్రెయిన్ పై దురాక్రమణకు దిగుతున్న రష్యాకు అడ్డుకట్టవేసేలా ప్రపంచ దేశాలన్ని ఆంక్షలతో రష్యాని ఒంటరిని చేయాలని చూస్తున్నాయి. అయితే దానికి విరుద్ధంగా రష్యాతో వ్యూహాత్మక సంబంధాలను నెరుపుకుంటున్నందుకు భారత్‌పై అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు నిప్పులు చెరుగుతున్నాయి. అదీగాక ఇటీవలే చైనా విదేశాంగ మంత్రి వాంఘీ, భారత్ పర్యటనకు వచ్చి చర్చలు జరపడంతో అమెరికా దాని మిత్రదేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. మరొకవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్..భారత్ పర్యటనకు రావడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై అమెరికాతో సహా దాని మిత్ర దేశాలు గుస్సా అవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా, దాని మిత్ర దేశాలు ఉక్రెనియన్ మద్దతుగా నిలబడే సమయం ఆసన్నమైందని, రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధానికి ఎలాంటి సాయం చేయవద్దు అని యూఎస్ వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో వాషింగ్టన్లో పిలుపినిచ్చారు. అలాగే ఆస్ట్రేలియా వాణిజ్యమంత్రి డాన్ టెహన్ రెండోవ ప్రపంచ యుద్ధం నుంచి కలిగి ఉన్న నిబంధనల ఆధారిత విధానాన్ని కొనసాగించడానికి ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయడం అత్యంత ముఖ్యం అని నొక్కి చెప్పారు. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో చైనా ప్రభావాన్ని ఎదుర్కొవడానికి ప్రయత్నిస్తున్న క్వాడ్‌లోని సభ్యదేశాలు యూఎస్ , ఆస్ట్రేలియా, జపాన్‌లు భారత్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అదీగాక రష్యా ఆయుధాలను ప్రపంచంలోనే అత్యధికంగా కొనుగోలు చేసే దేశం భారతదేశం. పైగా ఇంధన ధరలు పెరగడంతో రష్యా నుంచి చవకగా చమురును కొనుగోలు చేయాలని కూడా చూస్తోంది. దీంతో భారత్ పట్ల అగ్రదేశం దాని మిత్రదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ దేశాలు అంతర్జాతీయపరంగా రష్యాని ఆర్థికంగా దెబ్బతీసేలా స్విఫ్ట్ నుంచి రష్యా బ్యాంకులను తొలగించింది. అంతేగాక బెల్జియం ఆధారిత క్రాస్-బోర్డర్ చెల్లింపు సిస్టమ్ ఆపరేటర్‌ను ఉపయోగించకుండా యూఎస్, యూరోపియన్ యూనియన్ ఏడు రష్యన్ బ్యాంకులను నిషేధించింది. అయితే భారత్ మాత్రం స్విఫ్ట్‌కి ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించే రూపాయి-రూబుల్-డినామినేటెడ్ చెల్లింపులు చేసే ప్రణాళికను భారత్ పరిశీలిస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఉక్రెయిన్‌లో పరిస్థితి గురించి భారత్ ప్రధాని మోదీతో చర్చించారు కూడా. అంతేగాక బుధవారం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ భారత విదేశంగా కార్యదర్శి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో ఫోన్లో ఉక్రెయిన్‌లో నానాటికి దిగజారుతున్న పరిస్థితిపై ఫోన్లో సంభాషించారు కూడా. ఇటీవల చైనా విదేశాంగ మంత్రి భారత్ పర్యటన విషయమై బ్రిటన్ విదేశంగ మంత్రి రష్యాపై వ్యూహాత్మకంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటూ భారత్‌కి చురకలంటించింది. (చదవండి: యుద్ధం ఆపేలా పుతిన్‌ని భారత ప్రధాని ఒప్పిస్తే సంతోషిస్తాం: ఉక్రెయిన్ మంత్రి) -
బిగ్‌బాస్ విన్నర్ సన్నీకి మ్యారేజ్ ప్రపోజల్.. 100 కోట్ల కట్నం!
Bigg Boss 5 Winner Vj Sunny gets Marriage Proposal With 100 Cr Dowry: బిగ్‌బాస్ సీజన్-5 విజేతగా నిలిచిన సన్నీకి సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన సన్నీ తన ఆటతీరుతో, ఎంటర్టైన్మెంట్తో ట్రోపీని సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్ టైటిల్ విన్నర్‌గా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా సన్నీకి ఓ ఎన్నారై మహిళ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. అమెరికా నుంచి ఉష అనే మహిళ సన్నీకి వీడియో కాల్ చేసి తన కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేసింది. అంతేకాకుండా కట్నంగా 100కోట్లు ఇస్తానని పేర్కొంది. దీంతో 'నన్ను భరించాలంటే చాలా ఓర్పు ఉండాలి. మీరు ఆ మాట అన్నారు చాలు' అంటూ సన్నీ ఆన్సర్ ఇవ్వగా.. నేను సీరియస్‌గా అడుగుతున్నా అంటూ ఆమె లైవ్‌లోనే పెళ్లి సంబంధం మాట్లాడింది. ప్రస్తుతం సన్నీకి వచ్చిన ఈ పెళ్లి ప్రపోజల్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
టిక్‌టాక్ స్టార్‌కి ప్రపోజ్ చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
Bigg Boss 4 Fame Mehaboob Dil Se Proposed To Swetha Naidu: బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యూట్యూబ్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన మెహబూబ్ గతేడాది బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. ఇటీవలె 'గుంటూరు మిర్చి' అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించాడు. ప్రస్తుతం కవర్ సాంగ్స్, వెబ్‌సిరీస్‌లు చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా యూట్యూబర్, టిక్‌టాక్ స్టార్ శ్వేత నాయుడుకు ప్రపోజ్ చేశాడు. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ కలిసి కవర్ సాంగ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మెహబూబ్ ఎక్కువగా శ్వేత నాయుడుతోనే రీల్స్ అప్లోడ్ చేస్తుంటాడు. తాజాగా ఆమెకు తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు. 'ఎప్పటి నుంచో చెబ్దాం అనుకున్నా. కానీ ఎప్పుడు ఎలా అయ్యిందో తెలియదు. ఎందుకు ఇష్టం అన్నదానికి ఆన్సర్ తెలియదు. నువ్వు నా తోడుంటే బెటర్, సక్సెస్ఫుల్ పర్సన్‌ని అవుతా. నాతో జీవితాంతం తోడుంటావా' అంటూ తన మనసులో మాటను రివీల్ చేశాడు. దీంతో శ్వేత సైతం సిగ్గుపడుతూ మెహబూబ్ ప్రేమను అంగీకరించింది. దీనికి సంబంధించిన వీడియోను మెహబూబ్ తన సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. మరి ఈ ఇది రియల్ వీడియోనా లేక యూట్యూబ్ కోసం చేసిన ఫ్రాంక్ వీడియోనా అన్నది తెలియాల్సి ఉంది. -
Dalit Bandhu: కారు... లేకుంటే ట్రాక్టరు!
సాక్షి, హైదరాబాద్: దళితబంధు యూనిట్ ఏర్పాటుపై లబ్ధిదారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకేసారి రూ.10 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ కాగా, ఆ నిధితో ఎలాంటి వ్యాపారం చేయాలనే దానిపై స్పష్టత లేక అయోమయంలో పడ్డారు. యూనిట్ ప్రతిపాదనలు సంబంధిత కమిటీల ద్వారా జిల్లా కలెక్టర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. కలెక్టర్ ఆమోదించిన తర్వాత యూనిట్ సంబంధిత వస్తువులు, పరికరాల కొనుగోలుకు అనుమతి లభిస్తుంది. అనంతరం లబ్ధిదారు ఖాతా నుంచి నగదును చెక్కురూపంలో విక్రేత ఖాతాకు బదిలీచేస్తారు. పథకాన్ని పారదర్శకంగా, పక్కాగా అమలు చేసేవిధంగా ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలు విధించింది. దళితబంధు కింద హూజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంతోపాటు ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఇప్పటివరకు 18,064 మంది బ్యాంకుఖాతాల్లో నగదు జమచేశారు. ఈ క్రమంలో సగానికిపైగా లబ్ధిదారులు కొత్త యూనిట్లకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించగా, ఇందులో అత్యధికులు కార్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. దాదాపు 8 వేల ప్రతిపాదనల్లో 5,440 మంది కారుగానీ, ట్రాక్టర్గానీ కొనుగోలు చేస్తామని చెప్పారు. కొందరు కార్లు కొని అద్దెకు ఇచ్చుకుంటామని తెలపగా, మరికొందరు క్యాబ్రంగంలో పనిచేస్తామని వివరించారు. వ్యవసాయపనుల కోసం ట్రాక్టర్లు కొనుగోలు చేసుకుని సొంతంగా నడిపిస్తామని వివరించారు. కార్లు, ట్రాక్టర్లకు డిమాండ్ ఉన్నప్పటికీ, ఒకేచోట పెద్దసంఖ్యలో వాహనాలుంటే వాటికి పనిదొరికే అవకాశాలు తగ్గుతాయనే అభిప్రాయం అధికార వర్గాల్లో కనిపిస్తోంది. దీంతో పరిమితసంఖ్యలోనే ఇలాంటి యూనిట్లకు అవకాశం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కార్లు, ట్రాక్టర్లు మాత్రమే కాకుండా ఇతర డిమాండ్ ఉన్న రంగాలపై అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు దళితబంధు నోడల్ అధికారులు సూచనలు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్‌లో భారీ వర్షం.. హై అలర్ట్ -
నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే..
సాక్షి, వెబ్ డెస్క్: వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటైన జంటల్లో మహేశ్‌బాబు-నమ్రత కూడా ఒకరు. వీరిద్దరిని కలిపింది వంశీ సినిమానే. 2000లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్‌ఫీస్ వద్ద అంతగా మెప్పింపలేకపోయింది. కానీ వీరి ప్రేమకు మజిలీగా మారింది. వంశీ షూటింగ్ సమయంలోనే నమ్రత-మహేశ్ ప్రేమలో పడ్డారు. ఓసారి ఈ సినిమా అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది. షూటింగ్ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారు. కానీ వీరి ప్రేమను మహేష్ తొలుత కుటుంబం అంగీకరించలేదట. దీంతో మహేశ్ తన సోదరి మంజుల సహాయం తీసుకున్నారట. అలా నమ్రత-మహేశ్‌ల పెళ్లి జరగడంలో మంజుల కీలక పాత్ర పోషించిందట. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు మీడియాకు చాలా తొందరగా లీకవుతుంటాయి. కానీ మహేశ్-నమ్రతల రిలేషన్ మాత్రం ఎక్కడా బయటపడకపోవడం విశేషం.ఇక పెళ్లి అనంతరం నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే యాక్టింగ్ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేసింది. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ.. 'టాప్ హీరోయిన్ అవ్వాలన్న కోరిక ఎప్పుడు లేదు. మహేశ్‌ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడే సినిమాలను వదులుకోవాలనుకున్నా. పెళ్లయి ఇన్నేళ్లయినా ఒక్కసారి కూడా ఈ విషయంలో రిగ్రేట్‌గా అనిపించలేదు. మహేశ్ కుటుంబం కోసం ఏదైనా చేస్తారు. ఎంత బిజిగా ఉన్నా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. వీటన్నింటికీ మించి గొప్ప మానవతా వాది. అందుకే మహేశ్ అంటే నాకు ఎంతో ప్రేమ, ఆరాధన. ఆయన్ను పెళ్లిచేసుకోవడం నాకు లభించిన అత్యంత ప్రత్యేకమైన బహుమతిగా ఫీల్ అవుతుంటా' అని నమ్రత పేర్కొంది. -
ప్రిలిమ్స్‌కు స్వస్తి: ఏపీపీఎస్సీ కీలక ప్రతిపాదన
సాక్షి, అమరావతి: గ్రూప్ -1 పోస్టుల్లో మినహా మిగతా క్యాడర్ పోస్టుల భర్తీ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. ఇతర క్యాడర్ పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షల విధానాన్ని రద్దు చేయాలని యోచిస్తోంది. గ్రూప్ – 1 సహా అన్ని కేటగిరీల పోస్టుల భర్తీకి ప్రస్తుతం తొలుత ప్రిలిమ్స్/స్క్రీనింగ్ టెస్టు చేపట్టి అందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై గ్రూప్ – 2, గ్రూప్ – 3 సహా ఇతర క్యాడర్ పోస్టులకు ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని కమిషన్ తలపోస్తోంది. కేవలం ఒక పరీక్షనే నిర్వహించి మెరిట్ అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు కమిషన్ వర్గాలు వివరించాయి. ఒత్తిడి నుంచి అభ్యర్థులకు ఊరట... ప్రిలిమ్స్ నిర్వహణతో అభ్యర్థులు ఆర్థిక భారం, వ్యయప్రయాసలకు గురవుతుండగా కోచింగ్ పేరిట కొన్ని సంస్థలు భారీగా వసూలు చేస్తున్నాయి. గతంలో గ్రూప్–1 పోస్టులకే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల విధానం ఉండేది. గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులకు ఒక పరీక్ష ద్వారానే ఎంపికలు జరిగేవి. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక తమ వారి కోచింగ్ సెంటర్లకు మేలు జరిగేలా పోస్టుల భర్తీ విధానాన్ని మార్చింది. గ్రూప్ –1 సహా అన్ని పోస్టులకూ ప్రిలిమ్స్/స్క్రీనింగ్ టెస్టు నిర్వహించేలా ఉత్తర్వులిచ్చింది. దీనివల్ల అభ్యర్థులు పరీక్షల సన్నద్దత కోసం ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చేది. కోచింగ్ కేంద్రాల దోపిడీకి చెక్‌పెట్టేలా ఏపీపీఎస్సీ సమూల మార్పులపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రిలిమ్స్/ స్క్రీనింగ్ విధానాన్ని రద్దు చేయాలని భావిస్తోంది. తద్వారా అభ్యర్థులకు మేలు జరగడంతోపాటు కోచింగ్ సెంటర్ల దందాకు అడ్డుకట్ట పడుతుందని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
వెరైటీ లవ్ ప్రపోజల్ : వైరల్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ప్రపంచంలో తమ ప్రేమ చాలా ప్రత్యేకం అని ప్రతీ ప్రేమికుడు భావిస్తాడు. అంతేకాదు తమ ప్రేమను ప్రకటించేందుకు నానా తంటాలు పడతారు. లవ్ ప్రపోజల్ ఎప్పటికీ గుర్తిండిపోయేలా వెరైటీగా ఉండేలా లవర్స్ చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తూ ఉంటారు. రకరకాల ఫీట్లతో విభిన్నంగా ప్రయత్నిస్తారు . తాజాగా లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అనే మాటలను అక్షరాలా ఆచరించి చూపించాడో లవర్. ఏకంగా స్కైడైవింగ్ సమయంలో తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను వింగ్ మ్యాన్స్కైడైవ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశారు. "స్కైడైవ్ వివాహ ప్రతిపాదన" అనే క్యాప్షన్‌తో పంచుకున్న ఈ వీడియో నెటిజనులను, ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రే అనే ప్రేమికుడు, తన గర్ల్‌ఫ్రెండ్ కేటీతో కలిసి స్కైడైవింగ్ చేస్తున్నప్పుడు "ఐ లవ్ యూ" అంటూ తన ప్రేమను ప్రకటించాడు. ఈ హఠాత్పరిణామానికి కేటీ సర్ప్రైజ్ అవుతూ థ్యాంక్స్ చెప్పింది. ఇంతలో తన నోటిలో దాచుకున్న ఉంగరాన్ని తీసి మరీ తన ప్రేమను వ్యక్తంచేశాడు. ‘రోజు రోజుకు నీ ప్రేమలో మరింత మునిగిపోతున్నాను. నన్నుపెళ్లి చేసుకుంటావా’ అంటూ మెరిసిపోతున్న మబ్బుల నడుమ రే ముద్దుగా అడిగాడు. దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన ఆమె కూడా ఓకే చెప్పేసింది. ఇక ఏ ప్రేమికుడు ఎగిరి గంతేయకుండా ఉంటాడు. రే ఆల్రడీ గాల్లోనే ఉన్నాడుగా..అందుకే మరింత ఉత్సాహంగా కేకలు వేశాడు. దీనిపై సోషల్ మీడియా యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ లవ్ బర్డ్స్‌కు అభినందనలు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదకర ఫీట్‌పై కొంతమంది నెటిజన్లు కోపాన్ని ప్రదర్శించడం విశేషం. View this post on Instagram A post shared by Wingman (@wingmanskydive) -
మిస్త్రీకి మరోసారి షాకిచ్చిన టాటా సన్స్
సాక్షి, న్యూఢిల్లీ: వాటాలకు సంబంధించి టాటా సన్స్, షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ మధ్య వివాదంపై సుప్రీం కోర్టులో తుది వాదనలు కొనసాగుతున్నాయి. హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్‌లో తమకున్న 18.37 శాతం వాటాలకు బదులుగా టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో షేర్లను కేటాయించాలంటూ ఎస్పీ గ్రూప్ ప్రతిపాదించింది. అయితే, ఇది అర్థరహితమైన ప్రతిపాదనంటూ టాటా సన్స్ తోసిపుచ్చింది. అలా చేస్తే టాటా గ్రూప్‌లో భాగమైన ఇతర లిస్టెడ్ కంపెనీల్లో ఎస్పీ గ్రూప్ మళ్లీ మైనారిటీ వాటాలు తీసుకున్నట్లవుతుందే తప్ప పెద్ద తేడా ఉండబోదని పేర్కొంది. టాటా సన్స్ తరఫున సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే, ఎస్పీ గ్రూప్‌నకు సంబంధించిన సైరస్ ఇన్వెస్ట్మెంట్ తరఫున సీనియర్ అడ్వకేట్ సీఏ సుందరం వాదనలు వినిపించారు. దీనిపై విచారణ సోమవారం కూడాకొనసాగనుంది. టాటా సన్స్‌తో విభేదాల నేపథ్యంలో అందులో వాటాలు విక్రయించి వైదొలగాలని ఎస్పీ గ్రూప్ భావిస్తోంది. అయితే, వేల్యుయేషన్ విషయంలో సమస్య వచ్చి పడింది. టాటా సన్స్‌లో తమకున్న 18.37 శాతం వాటాల విలువ రూ. 1.75 లక్షల కోట్లుగా ఉంటుందని ఎస్పీ గ్రూప్ వాదిస్తుండగా, ఇది కేవలం రూ. 70,000-80,000 కోట్ల మధ్య ఉంటుందని టాటా సన్స్ చెబుతోంది. -
‘డబుల్ పాయింట్’కూ టీఎస్ ససేమిరా
సాక్షి, అమరావతి: అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరకపోవడంతో పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చేద్దామన్న ఏపీఎస్ఆర్టీసీ మరో ప్రతిపాదనను కూడా తెలంగాణ ఆర్టీసీ తిరస్కరించింది. ఒప్పందం కుదిరేవరకు డబుల్ పాయింట్ ట్యాక్స్ పర్మిట్ల విధానంలో హైదరాబాద్‌కు బస్సులు తిప్పేందుకు ఏపీఎస్ఆర్టీసీ.. టీఎస్ఆర్టీసీకి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలకు అంగీకరించబోమని టీఎస్ఆర్టీసీ తేల్చిచెప్పింది. తాము నష్టపోయినా టీఎస్ఆర్టీసీకి ఆదాయం పెరిగేలా కిలోమీటర్లను పెంచుకోమని ఏపీఎస్ఆర్టీసీ సూచించినా ససేమిరా అంది. దీంతో రెండు రాష్ట్రాల ప్రయాణికులకు పండుగ ప్రయాణం భారంగా మారింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీల తకరారు ఈ విధంగా ఉంటే ప్రైవేటు ఆపరేటర్లు జోరు పెంచారు. ప్రైవేటు ఆపరేటర్లు ఇష్టం వచ్చిన రేట్లకు టికెట్లు అమ్మి బస్సులు నడిపితే సీజ్‌చేస్తామని రవాణాశాఖ హెచ్చరించింది. ఏపీఎస్ఆర్టీసీ తాజా ప్రతిపాదనలివే... ►ఏపీఎస్ఆర్టీసీ లాక్‌డౌన్‌కు ముందు నడిపే 1,009 బస్సుల వల్ల ఏడాదికి రూ.575 కోట్ల ఆదాయం వచ్చేది. 322 బస్సులు తగ్గించడం వల్ల ఆ ఆదాయంలో రూ.260 కోట్లు తగ్గుతుంది. ►టీఎస్ఆర్టీసీ ఏపీ భూభాగంలో 50 వేల కి.మీ. పెంచుకుంటే తెలంగాణ భూ భాగంలో మరో 50 వేల కి.మీ. పెరుగుతుంది. అంటే మొత్తం లక్ష కి.మీ. బస్సుల్ని తిప్పితే కి.మీ.కి రూ.30 వంతున రోజుకు రూ.30 లక్షలు.. నెలకు రూ.9 కోట్లు.. ఏడాదికి రూ.108 కోట్ల మేర ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో ఏపీఎస్ఆర్టీసీ ఆదాయం తగ్గిపోతుంది. ►రోజూ ఏపీ నుంచి హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు ఆర్టీసీ ద్వారా 70 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. వీరంతా ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ►ఏపీఎస్ఆర్టీసీ విభజన ఇంకా జరగలేదు. ఆస్తుల పంపిణీ పూర్తికాలేదు. అంటే సాంకేతికంగా టీఎస్ఆర్టీసీ మనుగడలో లేదు. టీఎస్ఆర్టీసీ సైతం కర్ణాటక, మహారాష్ట్రలతో అంతర్రాష్ట్ర ఒప్పందాలను ఏపీఎస్ఆర్టీసీ పేరిటే చేసుకోవాలి. డబుల్ పాయింట్ ట్యాక్స్ విధానం అంటే.. అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరకపోవడంతో ఆర్టీసీ రెండు రాష్ట్రాల్లో పన్ను చెల్లించి పర్మిట్లు పొందడమే డబుల్ పాయింట్ ట్యాక్స్ విధానం. బస్సులో సీట్ల సంఖ్యనుబట్టి ఒక్కో సీటుకు మూడు నెలలకు రూ.3,750 రూపాయల వంతున రెండు రాష్ట్రాల్లోనూ పన్ను చెల్లించాలి. ఒక్కో బస్సుకు సుమారు రూ.1.5 లక్షల వరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఒప్పందం కుదిరేవరకు ఈ విధానంలో బస్సులు నడుపుదామని, కనీసం పండుగ సీజన్లు పూర్తయ్యేవరకైనా ఈ విధానం అమలు చేద్దామని ఏపీఎస్ఆర్టీసీ ప్రతిపాదించింది. -
ఐటీ, పారిశ్రామిక రంగాలకు నిరాశే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటీ రంగాల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిం చేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలకు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు నిరాశను మిగిల్చాయి. ఆహారశుద్ధి, ఎయిరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, ఐటీ తదితర రంగాలను ప్రోత్స హించడం ద్వారా ఆర్ధికాభి వృద్ధి, ఉద్యోగ కల్పన సాధ్యమని రాష్ట్ర ప్రభు త్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్‌లో మౌలిక సౌకర్యాలకు నిధులు, ఆహారశుద్ధి, టెక్స్టైల్ పార్కులకు నిధులు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, విభజన చట్టం హామీ మేరకు బయ్యారంలో స్టీల్ ప్లాంటు, ఐటీఐఆర్ ప్రాజెక్టు తదితరాల కోసం కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఆశించింది. హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 16,375 కోట్లు కాగా, మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.6వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించినా బడ్జెట్ ప్రతిపాదనల్లో ఈ ప్రస్తావన లేదు. ఐటీ రంగానికి గాను 2013లో ఐటీఐఆర్ ప్రాజెక్టుకు రూ.3,275 కోట్లు అవసరమవు తాయని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం ఏళ్ల తరబడి కేంద్రానికి లేఖలు రాస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌లో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో 6 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించగా, తొలి దశలో హైదరాబాద్–వరంగల్ కారిడార్ అభివృద్ధిని త్వరితగతిన చేపట్టాలని రాష్ట్రం భావిస్తోంది. శనివారం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్–2020–21లో వీటి ఊసు లేకపోవడంపై పరిశ్రమల శాఖ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ‘ఎలక్ట్రానిక్స్’కు ఊతం ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని ప్రోత్సహించి సిలికాన్ వ్యాలీ తరహాలో హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. తాజా కేంద్ర బడ్జెట్లో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు ఓ విధానం ప్రకటిస్తామన్న నేపథ్యంలో కొంత లబ్దిచేకూరనుంది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో 250 ఎకరాల్లో ఇప్పటికే మెడికల్ డివైజెస్ పార్కును ఏర్పాటు చేయగా, బడ్జెట్లో దానికి ఊతమిస్తామని కేంద్రం ప్రకటించింది. బడ్జెట్లో నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ ద్వారా వచ్చే నాలుగేళ్లలో రూ.1480 కోట్లు ఖర్చు చేస్తామని ప్రతిపాదించారు. దీంతో కాకతీయ టెక్స్టైల్ పార్కు అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం నామమాత్రంగా లభించే సూచనలున్నాయి. ఆరు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి వచ్చే నాలుగేళ్లలో రూ.1.03లక్షల కోట్లతో వివిధ రంగాల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్న కేంద్రం.. ఉడాన్ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 2024 నాటికి వంద ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని బడ్జెట్లో పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే 6 ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించింది. జక్రాన్‌పల్లి (నిజామాబాద్), అడ్డాకుల (మహబూబ్‌నగర్), పునుకుడుచెర్ల (భద్రాద్రి కొత్తగూడెం)లో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుతో పాటు బసంత్‌నగర్ (పెద్దపల్లి), మామునూరు (వరంగల్), ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధి పనులు వేగవంతమయ్యే అవకాశం ఉంది. -
అమరావతి నిర్మాణంలో కనీస పురోగతి లేదు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో వెయ్యి పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పేందుకు అనువైన పరిస్థితులు లేవని ఇండో యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఐయూఐహెచ్) టీడీపీ సర్కారు అధికారంలో ఉండగానే తేల్చి చెప్పింది. ఆస్పత్రి ఏర్పాటు ప్రతిపాదనను తాము ఎందుకు విరమించుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ ఐయూఐహెచ్ ఎండీ అండ్ సీఈవో డాక్టర్ అజయ్ రంజన్‌గుప్తా 2019 మే 29వ తేదీన అప్పటి సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌కు సుదీర్ఘ లేఖ రాశారు. 2016 మార్చి 12 నుంచి 2019 జనవరి 19 వరకు సీఆర్డీఏ, ఐయూఐహెచ్ మధ్య జరిగిన 41 ఉత్తరప్రత్యుత్తరాలన్నింటినీ దీనికి జత చేశారు. హామీలు, రాయితీలపై నిర్లక్ష్యం.. అమరావతిలో ప్రతిష్టాత్మకమైన తమ సంస్థ ఏర్పాటుకు ముందుకొస్తే టీడీపీ ప్రభుత్వం తీవ్ర వేధింపులకు గురి చేసిందని లేఖలో స్పష్టం చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పేందుకు మూడేళ్లుగా చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. అమరావతిని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో కనీస పురోగతి కూడా లేకపోవడంతో తమ వాటాదారులు, పెట్టుబడిదారులు ఈ ప్రాజెక్టు నుంచి వెనక్కి రావాలని ఒత్తిడి చేశారని అందులో పేర్కొన్నారు. అమరావతిలో సరైన రహదారులు, మురుగునీటి వ్యవస్థ లేదని, అలాంటి చోట ప్రతిష్టాత్మకమైన తమ సంస్థ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయడం సరికాదని తమ భాగస్వామ్య సంస్థలు, స్టేక్ హోల్టర్లు పదేపదే సూచించినట్లు వెల్లడించారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ప్రవేశమార్గం లేదని, దీనివల్ల తమకు కేటాయించిన ప్రాంతానికి చేరుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని చాలాసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. తమకు ఇచ్చిన హామీలు, రాయితీల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించారని తెలిపారు. తుది ఒప్పందం చేసుకునేందుకు తమ ప్రతినిధులు 2017 జనవరి వరకు సీఆర్డీఏ అధికారులతో ఏడుసార్లు సమావేశమైనా పురోగతి లేదన్నారు. ప్రతీసారి అగ్రిమెంట్లో మార్పులు చేశారని, రకరకాల సాకులతో ఇబ్బందులు పెట్టారని తెలిపారు. లీగల్‌గా సంక్రమించని భూమిని తమలాంటి ప్రైవేట్ కంపెనీకి కేటాయించకూడదన్నారు. నిజమైన యాజమాన్య, విక్రయ హక్కులు లేకుండా భూమి కేటాయించడం, ప్రారంభ సొమ్మును చెల్లించాలని కోరడం తీవ్రమైన లీగల్ చర్యలకు దారి తీస్తుందని అందులో పేర్కొన్నారు. వీటన్నింటి నేపథ్యంలో తాము అమరావతిలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నామని, తాము చెల్లించిన రూ.25 కోట్లను తిరిగి వెనక్కి ఇవ్వాలని అజయ్ రంజన్ గుప్తా లేఖలో పేర్కొన్నారు. దీని ద్వారా ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సంస్థలతో చంద్రబాబు ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో, కమీషన్లు, వాటాల కోసం ఎంత ఇబ్బందులు పెట్టిందో స్పష్టమవుతోంది. -
మ్యాచ్‌కు ముందే పెళ్లి ప్రపోజల్
ప్రేమకు కులం, మతం, భాష, సరిహద్దులతో సంబంధం లేదని ,రెండు మనసులు కలిస్తే చాలని మరోసారి నిరూపితమైంది. 2018 చెస్ ఒలంపియాడ్ టోర్నీ సందర్భంగా ఓ భారత జర్నలిస్ట్.. కొలంబియన్ చెస్ ప్లేయర్‌ను పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేయడం చర్చనీయాంశమైంది. సరిగ్గా టీమ్‌మ్యాచ్ మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుందనగా.. భారత జర్నలిస్ట్ నిక్లేష్ జైన్.. కొలంబియా చెస్ స్టార్ విమ్ ఎంజెలా లోపెజ్కు తన మనసులోని మాటను బయటపెట్టాడు. దీంతో ఎంజెలాతో పాటు అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. నిక్లేష్ మోకాళ్ల పై కూర్చోని మరి రింగ్‌ను బహుమతిగా ఇస్తూ ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ఎంజెలాకు హిందీలో ప్రపోజ్ చేయడం ఎంజెలాతో పాటు అక్కడున్న వారిని ఆకట్టుకుంది. తన ప్రపోజల్‌కు ముగ్దురాలైన ఎంజెలా అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ‘వాస్తవానికి ఆమెలా నేను ఓ చెస్ ప్లేయర్. గతంలోనే తనముందు పెళ్లి ప్రస్తావన తేవాలనుకున్నాను. కానీ చెస్ ఒలింపియాడే సరైనదని భావించాను. ఈ టోర్నీలో 189 దేశాల ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఇది మా ఇద్దరికి దేవాలయం వంటిది. అందుకే ఇక్కడ ప్రపోజ్ చేయాలని నిర్ణియించుకొని.. తన చెల్లి సాయం తీసుకున్నాను. గతేడాదిన్నరగా మేం ప్రేమించుకుంటున్నాం. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రధాన సమస్య భాష. ఆమె స్పానిష్ తప్ప ఇంగ్లీష్ మాట్లాడలేదు. మొబైల్ ట్రాన్స్లెట్ యాప్ సాయంతో మాట్లాడుకునేవాళ్లమని’ తెలిపాడు. అమెరికా చెస్ గ్రాండ్ మాస్టర్ సుసాన్ పొల్గర్... ‘అతను హిందీ మాట్లాడుతాడు(భారత్).. ఆమె స్పానిష్ మాట్లాడుతుంది(కొలంబియా). వీరిద్దరని చెస్ లవ్‌లో పడేసింది. 2018 చెస్ ఒలంపియాడ్ టోర్నీ సందర్భంగా ఆమెకు ప్రపోజ్ చేశాడు. అతని ప్రపోజల్‌కు ఆమె అంగీకరించింది. వారిప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అభినందనలు.. ఇది ఒలంపియాడ్ లవ్’ అంటూ అద్భుత వ్యాఖ్యలతో వర్ణిస్తూ ట్వీట్ చేశారు. ఈ ప్రపోజల్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. Olympiad LOVE! He speaks Hindi (India). She speaks Spanish (Colombia). But they found love through chess! He popped the question at @BatumiChess2018 playing hall before round 2. She said yes! ... And they are learning English, quick! 😂 Congratulations! @WOMChess @FIDE_chess pic.twitter.com/wtqmW26f6P — Susan Polgar (@SusanPolgar) September 25, 2018 -
పబ్లిగ్గా ఆమెకు ప్రపోజ్ చేశాడు.. కానీ!
-
భావోద్వేగం.. సభలోనే ‘గే మ్యారేజ్’ ప్రపోజల్!
మెల్బోర్న్ : గే చట్టాలకు ఇటీవల పలు దేశాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఓ బిల్లును ప్రవేశపెట్టింది. తాజాగా దీనిపై చర్చ జరుగుతుండగా.. సభలో ఓ ఎంపీ చేసిన పని విపరీతంగా వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన బిల్లుపై చర్చిస్తున్న సమయంలో ఎంపీ టిమ్ విల్సన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఎందుకంటే అతని భాగస్వామి అయిన ఎంపీ రాయన్ ప్యాట్రిక్ బోల్జర్ అక్కడే ఉన్నాడు కాబట్టి. చర్చలో ప్రసంగించిన అనంతరం చివరకు... ‘‘ఇక మిగిలింది ఒక్కటే. ప్యాట్రిక్... నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని భావోద్వేగంతో అడిగాడు. అంతే సభలోని సభ్యులంతా హర్షధ్వానాలు చేశారు. సంతోషంతో బోల్జర్ అవును అని చెప్పటంతో కరతాళ ధ్వనులతో సభ మారుమోగిపోయింది. ఆపై డిప్యూటీ స్పీకర్ రాబ్ మిచెల్ల్ ఆ జంటకు అభినందనలు తెలియజేస్తూ ఇది ఎంతో అరుదైన క్షణం అని వ్యాఖ్యానించాడు. గత ఏడేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కానీ అక్కడ స్వలింగ వివాహాలపై నిషేధం ఉండటం కారణంగా పెళ్లి చేసుకోలేక పోయారు. త్వరలో ఆ నిషేధం ఎత్తివేయనున్న నేపథ్యంలో టిమ్ ఇప్పుడు ప్రపోజ్ చేశాడన్న మాట. గత వారం ఎగువ సభ ఈ బిల్లును ఆమోదించగా.. ఇప్పుడు దిగువ సభ కూడా ఆమోదించింది. త్వరలోనే ఆ చట్టం అమలులోకి రానుంది. -
సభలోనే ‘గే మ్యారేజ్’ ప్రపోజల్!
-
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నేను ఒక అమ్మాయిని చిన్నప్పటి నుంచి (5వతరగతి నుంచి) లవ్ చేస్తున్నా. ఫస్ట్ ఆకర్షణ, ఇప్పుడు ప్రేమగా మారింది. నేను ప్రపోజ్ చేద్దామనుకున్నా. ఇంతలో మా అన్న(కజిన్) ప్రపోజ్ చేసేశాడు. వాడి ప్రపోజల్‌ను ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందట. ఆ విషయం తనే నాతో చెప్పింది. తనంటే నాకు చాలా ఇష్టం. చెప్పకుండా ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. చెప్పాలి తనకి, కానీ ఎలా చెప్పాలి. ప్లీజ్ మాస్టారూ.. కొంచెం ఫేవర్‌గా చెప్పండి. ప్లీజ్. – పూర్ణచంద్ర ‘సార్ ఈ ఆన్సర్ మీరు చెప్పకండి’ వై? ‘మీరు రఫ్‌గా చెబుతారు యంగ్ బాయ్ హర్ట్ అవుతాడు.’ నువ్వు అరటిపండు ఇచ్చినట్లు స్మూత్‌గా చెబుతావా నీలాంబరీ...? ‘మై డియర్ పూర్ణా.. అన్నయ్యను యాక్ థూ అనిందంటే మనం ఎంత చెప్పు...?’ అబ్బబ్బ! ఎంత స్మూత్‌గా చెబుతున్నావు. ఓహో.. ఆహా..! ‘మై డియర్ పూర్ణా.. అన్నయ్యను యాక్ థూ అన్న విషయం నీకే వచ్చి చెప్పిందంటే...’ అంటే...? ‘నిన్ను పీక్ థూ అంటుందని కన్ఫర్మ్..’అబ్బబ్బ ఎంత స్మూత్‌గా చెబుతున్నావు.. ఓహో.. ఆహా..!‘చెప్పి అందరి ముందు పీకించుకోవడం కంటే సైలెంట్‌గా లవ్ చేయ్యడం బెటర్..’అబ్బా... అరటిపండు వలిచి పెట్టినట్టు చెప్పావు కదా నీలాంబరీ... హాట్స్ ఆఫ్ టు యూ!‘మీరయితే ఎలా ఫేవర్‌గా చెబుతారు సార్?’ఏమి చెబుతా.. నువ్వు ఇచ్చిన ఆన్సర్ అమ్మాయికి చేరే లాగా చేస్తే.. అంతా హ్యాపీస్ అని చెబుతా!‘అంటే అమ్మాయి లవ్ డాక్టర్ చూస్తే అంతా సుఖాంతం...!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
ఢిల్లీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో కొత్త విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోయిడాలో జెవెర్ లో ఈ కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రతిపాదను కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఇది రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం కానుంది. గ్రేటర్ నోయిడాలో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లభించిందని కేంద్ర విమానాయానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు శనివారం ప్రకటించారు. తద్వారా తదుపరి 10-15 సంవత్సరాల్లో సంవత్సరానికి 30-50 మిలియన్ ప్రయాణీకులకు సేవలు అందించనున్నామని చెప్పారు. 3వేల హెక్టార్లలో దీన్ని నిర్మించనున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చిన ఈ ప్రాంతంలో తొలిదశలో 1000 హెక్టార్లలో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ .20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన వివరించారు.పబ్లిక్ అండ్ ప్రయివేట్ పార్టనర్షిప్తో (పీపీపీ) తో దీన్ని నిర్మించనున్న ఈ విమానాశ్రయాన్ని అయిదేళ్లలో పూర్తి చేయనున్నట్టు చెప్పారు. మరోవైపు దేశీయ, అంతర్జాతీయంగా వస్తున్న డిమాండ్ నేపథ్యంలో కార్పోరేట్ హబ్ గా జెవెర్ విమానాశ్రయం నిలవనుందని ఉత్తర ప్రదేశ్ మంత్రి ఎస్ సింగ్ పేర్కొన్నారు. -
భారీ నిధుల సమీకరణ దిశగా టాటా స్టీల్
ముంబై: ప్రముఖ దేశీయ స్టీల్ సంస్థ టాటా స్టీల్ భారీ నిధుల సమీకరణపై దృష్టిపెట్టింది. ఫండ్ రైజింగ్ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ వారంలో భేటీ నిర్వహించనున్నట్లు టాటా స్టీల్ సోమవారం ప్రకటించింది. ఏప్రిల్ 20 న గురువారం జరుగనున్న కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిధుల పెంపుదల ప్రతిపాదనపై చర్చించనున్నట్టు సంస్థ బిఎస్ఇకి తెలిపింది. 28 మిలియన్ టన్నుల స్టీల్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో అంతర్జాతీయ స్టీల్ కంపెనీల్లో టాప్ కంపెనీల్లో ఒకటిగా టాటా స్టీల్ కొనసాగుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో టాటా స్టీల్ వార్షిక టర్నోవర్ 17.69 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారుగా ఉన్న టాటాస్టీల్ 26 దేశాలలో కార్యకలాపాలను, 50 పైగా దేశాలలో వాణిజ్యకార్యకలాపాలను నిర్వహిస్తోంది. -
తుదిదశకు ‘డిండి’ అలైన్మెంట్!
సాక్షి, హైదరాబాద్: డిండి ప్రాజెక్టు అలైన్‌మెంట్‌కు వ్యాప్కోస్ సూచించిన రెండో ప్రతిపాదన దాదాపు ఖాయమైంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో అంత ర్భాగంగా ఉండే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునే ఈ ప్రక్రియకు నీటి పారుదల శాఖ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే, ఈ అలైన్ మెంట్ కారణంగా కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టుకు కలిగే నష్టాన్ని పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం చేయనుంది. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్మెంట్తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వేల ఎకరాల ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉంటుందని మహబూబ్‌నగర్ జిల్లా నేతలు అభ్యంత రాలు లేవనెత్తారు. దీంతో కల్వకుర్తి ఆయకట్టుకు నష్టంలేకుండా నీటిని తీసుకెళ్లే ప్రత్యామ్నాయాలపై నివేదిక ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు వ్యాప్కోస్ సంస్థకు ఆదేశాలిచ్చారు. వ్యాప్కోస్ 5 ప్రత్యామ్నాయాలను చూపింది. రెండో ప్రతిపాదనలో రంగాయపల్లి పంప్‌హౌస్‌లో పంపింగ్ మెయిన్ తగ్గించి, గ్రావిటీ టన్నెల్ ఏర్పాటు చేయాలని, దీనికి 3,384.47కోట్లు అవుతుందని తెలిపింది. నార్లాపూర్ నుంచి డిండికి 50 కి.మీ. దూరం కాల్వల ద్వారా 7 వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా దీన్ని ప్రతిపాదించారు. -
9 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం
రూ. 659 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు న్యూఢిల్లీ: దాదాపు రూ. 659 కోట్ల విలువ చేసే 9 విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. వొడాఫోన్, నెట్‌మ్యాజిక్ సొల్యూషన్స్ మొదలైన సంస్థల ప్రతిపాదనలు వీటిలో ఉన్నా యి. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) సిఫార్సుల మేరకు ఫిబ్రవరి 21న జరిగిన సమావేశంలో ప్రభుత్వం తొమ్మిది ప్రతిపాదనలను ఆమోదించామని, మూడు ప్రతిపాదనలను ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి (సీసీఈఏ) పంపామని కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆమోదం పొందిన వాటిలో నెట్‌మ్యాజిక్ సొల్యూషన్స్‌కి చెందిన రూ. 534 కోట్లు, వొడాఫోన్ ఇండియా 55 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్‌కు సంబంధించి రూ.750 కోట్లు, స్టార్ టెక్నాలజీస్ (రూ. 900 కోట్లు) ఫ్లాగ్ టెలికం సింగపూర్ (రూ. 789 కోట్లు) ప్రతిపాదనలను సీసీఈఏకి పంపినట్లు కేంద్రం వివరించింది. మరోవైపు గ్లాండ్ ఫార్మా, క్రౌన్ సిమెంట్ మాన్యుఫాక్చరింగ్ ఇండియా, పవర్విజన్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఇండియా తదితర ఆరు ప్రపోజల్స్‌పై నిర్ణయం వాయిదా పడింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్, స్పెక్ట్రంల్యాబ్స్ ఇండియా, పీఎంఐ ఇంజినీరింగ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రతిపాదనలు ఆటోమేటిక్ మార్గానికి సంబంధించినవి కావడంతో ఎఫ్ఐపీబీ పరిశీలనకు రాలేదు. -
బడ్జెట్ ప్రసంగంలో మాల్యా ఎఫెక్ట్
న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరో కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లధనం వెలికి తీతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్న జైట్లీ బిగ్ టైం అఫెండర్స్ ఆస్తులను జప్తు చేయాలనే ప్రతిపాదను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. దీంతో వేలకోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాకు పరోక్షంగా గట్టి హెచ్చరికనే చేశారు. ఆర్థిక నేరస్తులకు శిక్ష తప్పదనే సంకేతాలిచ్చారు. ఈ మేరకు వారి ఆస్థులను స్వాధీనంకోసం కొత్త చర్యలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. భారతదేశం విదేశాల్లో వున్న అక్రమ ధనాన్ని వెనక్కి రప్పించేందుకు కేంద్రం అనేక క్షమాభిక్ష పథకాలు అమలు చేసింది. అయితే ఈ కొత్త ప్రతిపాదన ఆర్థిక నేరస్థులపై మరింత ఒత్తిడి పెంచనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే స్విట్జర్లాండ్, సింగపూర్ బ్యాంకుల్లో దాగి వున్న అప్రకటిత ఆదాయం, ఆభరణాల, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులపై పెట్టుబడుల ద్వారా పన్ను ఎగవేస్తున్నవారిపై విమర్శకులు, నిపుణులు ప్రశ్నించారు. కాగా లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యా రూ.6,000 కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి లండన్ కు చెక్కేసిన సంగతి విదితమే. మరో వైపు సీబీఐ కూడా మాల్యా చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అతడిని స్వదేశం రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఐడీబీఐ లోన్ డిఫాల్ట్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేయడంతోపాటు, ఐడీబీఐ అధికారులను, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సిబ్బందిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో అఫిడవిల్ సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. దీంతో మంగళవారం మాల్యా మరోసారి నాన్ బెయలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
ఆరు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఆరు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. వీటిల్లో సనోఫి సింథ్‌ల్యాబొ ఇండియా, స్టార్ డెన్ మీడియా సర్వీసెస్, ఐడియా సెల్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ తదితర సంస్థల ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిల్లో నెదర్లాండ్స్‌కు చెందిన రెసిఫ్రామ్ పార్టిసిపేషన్ బీవీ ఎఫ్‌డీఐ ప్రతిపాదనే(రూ.950 కోట్లు) పెద్దది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన గల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్ఐపీబీ) పలు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలపై చర్చించింది. మూడు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను తిరస్కరించగా, మరో ఆరు ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆమోదం పొందిన వాటిల్లో రూ.157 కోట్ల బోహిన్‌గిర్ ఇంగెలిహిమ్ ఇండియా, రూ.80 కోట్ల మెనరిని ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదనలు ఉన్నాయి. వాయిదా పడిన ప్రతిపాదనల్లో క్రెస్ట్ ప్రెమీడియా సొల్యూషన్స్, యు బ్రాడ్‌బాండ్ ఇండియా, సైంటిఫిక్ పబ్లిషింగ సర్వీసెస్ ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) 27 శాతం వృద్ధితో 2,187 కోట్ల డాలర్లకు పెరిగాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో 3,094 కోట్లు, గత ఆర్థిక సంవత్సరంలో 4,000 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. -
92 ఏళ్ల సంప్రదాయానికి చరమగీతం
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లోనే కలిపే ప్రతిపాదనకు నరేంద్ర మోదీ సర్కార్ ఆమోద ముద్ర వేసింది. బుధవారం ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. ఫిబ్రవరి 1న ఒకే బడ్జెట్‌గా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు ప్రకటించాయి. దీంతో ప్రత్యేక రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టే సంస్కృతితోపాటు, 92ఏళ్ల నుంచి యూనియన్ బడ్జెట్‌కు ముందు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆచారానికి ఎన్డీయే సర్కార్ తిలోదాకాలు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 25 , 2017నుంచి ప్రారంభించేందుకు యోచిస్తోందని తెలిపాయి. అయితే విలీనం తర్వాత రైల్వే శాఖ ఎప్పటిలాగానే స్వతంత్రంగా వ్యవహరించేలా ఫంక్షనల్ స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇకమీదట రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో డివిడెండ్ చెల్లింపు, తదితర అంశాలను సమీక్షించే రైల్వే కన్వెన్షన్ కమిటీ రద్దవుతుంది. ఇతర విభాగాలకు మాదిరిగానే, మూలధన వ్యయం కోసం రైల్వేలకు బడ్జెట్ సహాయాన్ని అందిస్తుంది. వివిధ వర్గాలకు అందించే అన్ని వాస్తవ రైల్వే పాస్ లు ఆధార్ నంబరుకు అనుసంధానం చేయబడతాయి. ఏప్రిల్ నెలకల్లా ద్రవ్యబిల్లు, డిమాండ్లు-గ్రాంట్లపై పార్లమెంటులో చర్చలను పూర్తిచేయాలని, మే నెల నుంచే రాష్ర్టాలకు నిధులను విడుదల చేయాలని భావిస్తున్నది. ఈ విషయమై ఇప్పటికే ప్రధాని మోదీతో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చర్చించి ఆమోదం పొందినట్టు సమాచారం. -
ఫేస్బుక్ ఫ్రెండ్ పెళ్లికి ఒప్పుకోలేదని..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తనతో పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో యువతిని బాల్కనిలోంచి కిందకు తోశాడు. తీవ్ర గాయాలపాలైన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మొంగొల్పురి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమిత్(28), బాధిత యువతి రెండేళ్లుగా ఫేస్బుక్ ఫ్రెండ్స్. గత కొంతకాలంగా యువతిని పెళ్లి చేసుకుంటానని అమిత్ వేదిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం అవంతికా ఎన్‌క్లేవ్‌లోని యువతి ఇంటికి వెళ్లిన అమిత్.. ఆమె కుటుంబసభ్యులతో గొడవకు దిగాడు. ఘర్షణలో భాగంగా యువతిని బలంగా నెట్టడంతో బాల్కనిలోంచి కిందపడిన ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. యువతిని వెంటనే బాబా సాహెబ్ అంబేడ్కర్ అసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన అమిత్‌ను పట్టుకొని ఇరుగుపొరుగువారు పోలీసులకు అప్పగించారు. కాగా.. సదరు యువతి తనకు డబ్బులు చెల్లించాల్సి ఉందని.. అందులో భాగంగానే గొడవ జరిగిందని అమిత్ పోలీసులతో తెలిపాడు. -
కాటారంను రెవెన్యూ డివిజన్ చేయాలి
హన్మకొండ అర్బన్ : భూపాలపల్లి జిల్లాలో కలిపేందుకు ప్రతిపాదించిన మహాదేవపూర్, మహాముత్తారం, మలా్హర్, కాటారం మండలాలను కలిపి కాటారం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు శనివారం వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో శోభకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ, తాడిచర్ల జెన్కో భూసేకరణ పూర్తి చేయా ల్సి ఉన్నందున భవిష్యత్ అవసరాలు, అభివృద్ధి, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాటారం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు పంపాలని కోరారు. గుండాల శ్రీనివాస్, అందె భాస్కరాచారి, అయితనేని నవీన్‌రావు, సోమ శాంతకుమార్ సమ్మయ్య, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
నిజాంపట్నంలో త్వరలో మెరైన్ పోలీస్‌స్టేషన్
జెట్టీ నిర్మాణం కూడా.. రాష్ట్రంలో 21 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.. మెరైన్ ఐజీ సూర్యప్రకాశరావు నిజాంపట్నం : రాష్ట్రంలో 21 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని మెరైన్ ఐజీ జి.సూర్యప్రకాశరావు తెలిపారు. బొర్రావారిపాలెంలోని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐజీ మాట్లాడారు. గతంలో ఐజీ కార్యాలయం హైదరాబాద్‌లో ఉండేదని గత ఏడాది డిసెంబర్లో విశాఖపట్నానికి మార్చినట్లు తెలిపారు. మెరైన్ బోట్లను నిలిపేందుకు ఫేజ్–1 కింద రాష్ట్రంలో 7 జెట్టీలు మంజూరయ్యాని చెప్పారు. వీటి నిర్మాణం త్వరలో చేపట్టడం జరుగుతుందన్నారు. ఫేజ్–2 కింద మరో 14 జెట్టీలు మంజూరు కావాల్సిఉందని పేర్కొన్నారు. ఫేజ్–1 కింద రాష్ట్రంలో 18 మెరైన్ బోట్లు మంజూరయ్యాయని, ఫేజ్–2 కింద మరో 30 మెరైన్ బోట్లు రావాల్సి ఉందన్నారు. సముద్రంలో 25 కిలోమీటర్ల దూరం వరకూ మెరైన్ సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. త్వరలో మచిలీపట్నంలో 250 ఎకరాల స్థలంలో మెరైన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.త్వరలో నిజాంపట్నంలో మెరైన్ పోలీస్‌స్టేషన్ నిర్మాణం రూ.70 లక్షలతో త్వరలో నిజాంపట్నంలో మెరైన్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని ఐజీ సూర్యప్రకాశరావు తెలిపారు. స్టేషన్ నిర్మాణానికి అవసరమైన 15 సెంట్ల స్థలాన్ని దాతలు ఇచ్చారని చెప్పారు. మెరైన్ బోట్లు ఆగేందుకు నిజాంపట్నంలో రూ.50 లక్షలతో జెట్టీని త్వరలో నిర్మిస్తామని పేర్కొన్నారు. నిజాంపట్నానికి త్వరలో రెండు మెరైన్ బోట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. -
ఓలా, ఉబర్ క్యాబ్ లకు మీటర్లు తప్పనిసరి!
న్యూఢిల్లీః ఓలా, ఉబర్ వంటి టాక్సీ అగ్రిగేటర్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. ఇష్టారాజ్యంగా రేట్లను పెంచి, అనైతికంగా వినియోగదారులను నిలువుదోపిడీ చేస్తున్న ప్రైవేట్ క్యాబ్ లపై దృష్టి సారించింది. ఇప్పటికే ఉబర్, ఓలా ట్యాక్సీల ధరల పెంపుపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. త్వరలో అటువంటి నిబంధనలను మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి తేనుంది. ఆయా అగ్రిగేటర్లను 'ఇంటర్మీడియరీస్' పేరున రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రత్యేక వర్గంగా గుర్తించనుంది. ఓలా, ఉబర్ ట్యాక్సీలు అమాంతం రేట్లను పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో కేజ్రీవాల్ ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రైవేట్ క్యాబ్ ల దోపిడీ రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రభుత్వం స్పందించింది. వారిని కూడ మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి తెచ్చి ధరలపై నిబంధనలు విధించేందుకు కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాలు సూచించిన ధరలను అనుసరించే విధంగా చట్టం రూపొందనుంది. భారత ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించనున్న 'ఇంటర్ మీడియరీస్' వర్గం ఇంన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 పరిధిలోకి కూడ వస్తుంది. ఈ విషయంలో చివరి నిర్ణయం తీసుకునేందుకు ఎనిమిది రాష్ట్రాల రవాణా మంత్రులు జూన్ చివర్లో ధర్మశాలలో సమావేశం కానున్నారు. అనుకున్న ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఓలా, ఉబర్ క్యాబ్ లు కూడ ఆటోల్లాగే ఆయా నగరాల నిబంధనలను బట్టి మీటర్లు, డ్రైవర్ల డ్రస్ కోడ్.. వంటివి పాటించాల్సి ఉంటుంది. -
పెళ్లికి ఒత్తిడి చేసిందనీ..
-పియురాలిని చంపిన యువకుడి రిమాండు - కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ అశోక్ కుమార్ మేడ్చల్: పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి చేయడంతో మృగంగా మారిన ప్రియుడు ఆమెను చంపేశాడు. కేసు మిస్టరీని ఛేదించిన మేడ్చల్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఏసీపీ అశోక్ కుమార్ మాట్లాడుతూ వుండలంలోని శ్రీ రంగవరం గ్రామానికి చెందిన స్వప్న(19) అదే గ్రామానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి మహేందర్(23) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కొన్నాళ్లకు స్వప్న గర్భం దాల్చింది. మరదలంటే ఇష్టం ఉన్న మహేందర్ ఆమెను పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని స్వప్నకు తెలియజేశాడు. ఇందుకు తిరస్కరించిన స్వప్న తాను గర్భవతినయ్యానని త్వరగా పెళ్లి చేసుకోవాలని మహేందర్ పై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. దీంతో స్వప్నను కలిసి మాట్లాడటం మానేసిన మహేందర్ ఫోన్ ద్వారా సంభాషణలు సాగించాడు. ఈ నెల 17న బాబాయి ఫోన్ నుంచి మహేందర్ కు ఫోన్ చేసిన స్వప్న మహేందర్ ను కలవాలని చూడాలని ఉన్నట్లు చెప్పింది. దీంతో స్వప్నను ఎలాగైనా వదిలించుకోవాలని పక్కా ప్లాన్ వేసుకున్న మహేందర్ ఆమెను అంతం చేయాలని పథకం వేసుకున్నాడు. ఈ క్రమంలో దర్గా దగ్గర పొదల్లో కర్రను దాచి ఉంచాడు. తర్వాత స్వప్న రాక కోసం ఎదురుచూస్తుండగా ఆమె రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కల్లు కాంపౌండ్ వద్దకు ఒంటరిగా చేరుకుంది. ప్రియురాలిని తన బైక్ పై ఎక్కించుకున్న మహేందర్ దర్గా దగ్గరున్న పొదల వద్దకు తీసుకువెళ్లాడు. స్వప్న పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆగ్రహానికి గురైన ప్రియుడు ఆమె గొంతు నులిమేశాడు. అనంతరం చున్నీతో గొంతుకు బిగించి ఉరి వేశాడు. ఆమె మృతి చెందిందని నిర్థారించుకున్న తర్వాత ఇంటికి వెళ్లిపోయినట్లు ఏసీపీ వివరించారు. మరుసటి రోజు స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టారు. మహేందర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే స్వప్నను చంపేసినట్లు వెల్లడించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికి పట్టుబడుతున్న.. కేసీఆర్ దత్తపుత్రిక
సాక్షి, హైదరాబాద్: సొంత తండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన ప్రత్యూష త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందా..? తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు పలకరించడానికి వచ్చిన యువకుడితో చిగురించిన ప్రేమ, పెళ్లి వరకు వెళ్లబోతోందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కన్నతల్లి మరణంతో, సవతి తల్లి పెంపకంలో నిత్యం నరకాన్ని అనుభవిస్తున్న సమయంలో ప్రత్యూషను మీడియా, బాలల హక్కుల సంఘాలు చొరవతో ఆస్పత్రిలో చేర్పించటం, ఆపై ముఖ్యమంత్రి కేసీఆర్, హై కోర్టుల స్పందనతో ప్రభుత్వ ఆధీనంలోని సంరక్షణ కేంద్రంలో నివసిస్తున్నఆమె యోగక్షేమాలను అధికారుల ప్రత్యేకంగా చూస్తూవస్తున్నారు. ప్రత్యూష ఇటీవలే ఇంటర్ వోకేషనల్ పరీక్ష సైతం పాసైయ్యారు. అయితే, బీఎస్సీ నర్సింగ్ చేయటమే లక్ష్యంగా చెబుతూ వచ్చిన ప్రత్యూష.. తాజాగా తాను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వెంకట మద్దిలేటి రెడ్డిని ప్రేమించానని, అతన్ని పెళ్లి చేసుకున్నాకే చదువుకుంటానంటూ తన న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించారు. ఈ విషయాన్ని మహిళ సంక్షేమ శాఖ డెరైక్టర్ విజయేంద్రకు కూడా ప్రత్యూష తెలిపారు. ఈ విషయమై ఆమె న్యాయవాది ప్రత్యూషకు పలు మార్లు కౌన్సెలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నపటికీ.. ప్రస్తుతం తనకు ఇరవై ఏళ్లని, మేజర్‌నంటూ.. నా ఇష్టప్రకారం నేను కోరుకున్నది చేయాలంటూ ప్రత్యూష పట్టుపడుతున్నట్లు తెలిసింది. ఎవరీ మద్దిలేటి రెడ్డి.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఆచారీకాలనీకి చెందిన మద్దిలేటి రెడ్డి(27) బీఎస్సీ చదివి ఓ ఆటోమొబైల్ షాపులో స్టోర్ కీపర్‌గా పనిచేస్తున్నారు. గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిత్రుని పరామర్శకు హైదరాబాద్‌కు వచ్చి అక్కడే చికిత్స పొందుతున్న ప్రత్యూషను పలకరించాడు. ఏ ఇబ్బంది ఉన్నా తనకు ఫోన్ చేయాలంటూ నంబర్ ఇచ్చాడు. నగరంలో ఉన్న రెండు రోజుల ప్రత్యూష వద్దకు వెళ్లి యోగ క్షేమాలు తెలుసుకుని ఆళ్లగడ్డకు వెళ్లిపోయాడు. తర్వాత ప్రత్యూష ప్రభుత్వ సంరక్షణ గృహంలో చేరింది. అప్పటినుంచి మద్దిలేటికి ఫోన్లు చేస్తుండటంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. హాస్టల్లో ఉండలేను.. పెళ్లి చేసుకుంటా ప్రత్యూష ప్రస్తుతం తాను హాస్టల్లో ఉండలేకపోతున్నానని, హాస్టల్ భోజనంలో సోడా ఉప్పు వేస్తున్నారని, ఉడకని బియ్యంతో అన్నం తినడం వల్ల ఆరోగ్యం ఇబ్బంది పెడుతోందని బాలల హక్కుల కమిషన్ సభ్యులు అచ్యుతరావుకు ఆమె ఫోన్ చేసి చెప్పారు. మద్దిలేటిని పెళ్లి చేసుకున్నాకే తాను బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేస్తానని వివరించారు. తాను ప్రేమించిన మద్దిలేటితోనే వివాహం జరిపించాలని కోరారు. ఆమెనే పెళ్లి చేసుకుంటా: మద్దులేటిరెడ్డి అవును.. ప్రత్యూషను ప్రేమించాను. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని మా ఇంట్లో కూడా చెప్పి అమ్మ తులసమ్మను ఒప్పించాను. నేను పేదవాడినైనా, మాట తప్పే వాడిని కాదు. ఆమే తొలుత నాకు ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అందుకు మేమంతా అంగీకరించాం. కోర్టు, ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తే అందరి సమక్షంలో ప్రత్యూషను పెళ్లి చేసుకుంటానని మద్దిలేటి తెలిపారు. ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాలి : అచ్యుతరావు, బాలల హక్కుల కమిషన్సభ్యులు ప్రత్యూషను ఆస్పత్రి నుండి తీసుకెళ్లి సంరక్షణ కేంద్రంలో పెట్టిన తర్వాత, ఆమెకు మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించ లేదు. పరిసరాలు, చుట్టూ ఉన్న వాతావరణం కారణంగా ఆమె వాటన్నింటి నుంచి ఇప్పటికిప్పుడు బయటపడాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆమెకు నిపుణులైన మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ అవసరమని అభిప్రాయపడ్డారు. -
ఆస్తుల అమ్మకంపై సహారా కొత్త ప్రతిపాదన
న్యూఢిల్లీ: తమ చీఫ్ సుబ్రతా రాయ్‌ని జైలు నుంచి విడిపించడానికి సహారా కొత్త ప్రతిపాదనను సుప్రీంకోర్టుకు వివరించింది. బెయిల్ మొత్తానికి సంబంధించి ఆస్తుల విక్రయంపై సహారా సమర్పించిన తాజా ప్రతిపాదనపై చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఆర్ దావే, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం మార్కెట్ రెగ్యులేటర్ సెబీ స్పందనను కోరింది. నాలుగు వారాల్లో దీనికి సమాధానం తెలపాలని సూచించింది. తాజా ప్రతిపాదనను సహారా తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు ముందు ఉంచారు. దీని ప్రకారం ముంబైలో హోటల్- సహారా స్టార్, అలాగే ఫార్మూలా 1లో 42 శాతం వాటాలు, నాలుగు విమానాల అమ్మకానికి చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో లండన్‌లోని గ్రాసోవర్ హౌస్ హోటల్, న్యూయార్క్ ప్లాజా, డ్రీమ్ న్యూయార్క్ హోటల్స్ విక్రయాలకూ చర్చలు జరుగుతున్నాయి. గ్రాసోవర్ హౌస్ హోటల్ విక్రయ చర్చలు స్టార్ ఆఫ్ కతార్‌తో జరుగుతున్నాయని, రూ.2,300 కోట్లు వెచ్చించడానికి ఆ సంస్థ సిద్ధమవుతోందని సిబాల్ కోర్టుకు తెలిపారు. అమెరికాలో హోటళ్ల రీఫైనాన్స్ విషయంపై ఒక రష్యా బ్యాంకుతో చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. బెంగళూరులో తన ఆస్తుల అమ్మకానికి కూడా సహారా కోర్టు అనుమతి కోరుతోంది. 2014 మార్చి 4 నుంచీ సహారా చీఫ్ తీహార్ జైలులో ఉన్నారు. ఇన్వెస్టర్లకు రూ.36,000 కోట్ల పునఃచెల్లింపుల కేసులో ఆయన బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. రాయ్‌తో పాటు రెండు కంపెనీల డెరైక్టర్లు రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు కూడా జైలులో గడుపుతున్నారు. -
జిల్లాకో సైన్స్ సెంటర్
ప్రతిపాదనలు సిద్ధం చేయండి: అధికారులకు మంత్రి జోగు ఆదేశం సాక్షి, హైదరాబాద్: శాస్త్ర, సాంకేతిక అంశాలు క్షేత్రస్థాయి వరకు చేరేందుకు జిల్లాకో సైన్స్ సెంటర్ , రీజినల్ సైన్స్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించారు. హైదరాబాద్‌లో రూ.176 కోట్లతో నెలకొల్పనున్న సైన్స్ సిటీలో అంతరిక్ష, భూతల కేంద్రం, ఐమాక్స్ 9-డీతో పాటు ఎనర్జీ, శాస్త్ర, సాంకేతిక, మానవ, వృక్ష, జంతు, శాస్త్రీయ అంశాల నమూనాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి అంశాలపై మంత్రి శుక్రవారం సమీక్షించారు. ప్రతిష్టాత్మక సైన్స్ సిటీ హైదరాబాద్‌కు ల్యాండ్‌మార్క్‌గా నిలవనుందన్నారు. బిర్లా ప్లానిటోరియం తరహాలో సంచార ప్లానిటోరియంలు, సంచార సైన్స్ వ్యాన్లు ఏర్పాటు చేయాలని సూ చించారు. హైదరాబాద్‌లో 5-డీ థియేటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డే జరపాలన్నారు. -
డైమండ్ 'చిన్నది'... పెళ్ళి వద్దంది!
పెళ్ళి నిశ్చితార్థానికి గుర్తుగా ఉంగరాలు మార్చుకుంటారు. అలాగే ఓ యువతిని పెళ్ళికి ప్రపోజ్ చేసిన యువకుడు ఉంగరం చేయిస్తానని మాటిచ్చాడు. అన్నట్టుగానే చేయించాడు కూడా. కానీ ఉంగరంలోని డైమండ్ చిన్నదైందంటూ ఏకంగా పెళ్ళికే ససేమిరా అందా మగువ. ఎంగేజ్ మెంట్ రింగ్ లో డైమండ్ చిన్నదైనందుకు పెళ్ళినే నిరాకరించింది. చైనా సిచువాన్ ప్రావిన్స్ లో చోటు చేసుకున్న ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. పాపం ఆ ప్రేమికుడు... ప్రేయసిని ఉంగరంతో ఆశ్చర్యపరచాలనుకున్నాడు. పార్టీకి పిలిచి డైమండ్ రింగ్ బహూకరించి పెళ్ళి చేసుకుందామన్న ప్రపోజల్ తో సిద్ధంగా వచ్చాడు. తీరా ఆమె ఉంగరంలో చిన్న డైమండ్ ఉందంటూ పెళ్ళినే నిరాకరించడంతో వందలమంది డ్యాన్సర్లు ముందే మోకరిల్లాడు. ఎంతగానో బతిమలాడాడు. అయితేనేం వజ్రంలాంటి కుర్రాడికన్నా ఉంగరంలోని వజ్రానికే ఆ చిన్నది ప్రాముఖ్యతనిచ్చింది. పెళ్ళి గిళ్ళి జాంతానై.. అంటూ అక్కడినుంచీ వెళ్ళిపోయింది. నైరుతి చైనా రాజధాని, సుచియాన్ ప్రావిన్స్ నగరంలో ఆమె చేస్తున్న చెంగ్డూ నృత్యాన్ని చూసి ఆ ప్రేమికుడు ఫిదా అయిపోయాడు. ఆమె వెంటపడి తన ప్రేమను తెలిపాడు. అలాగే పెళ్ళికి కూడ ప్రపోజ్ చేశాడు. వజ్రం ఉంగరం ఇస్తామని ప్రామిస్ చేశాడు. అన్నట్లుగానే తన బాయ్ ఫ్రెడ్ వజ్రం ఉంగరాన్ని తెచ్చివ్వడాన్ని చూసి ఆమె ఎంతో సంతోషపడిపోయింది. అతడు తన ప్రేమను వ్యక్తం చేస్తూ.. బాక్స్ నుంచి ఉంగరం బయటకు తీశాడు. అంతే.. ఆమె ముఖం మాడిపోయింది. ఏంటీ ఇంత చిన్న వజ్రమా అంటూ ఉంగరంతోపాటు అతడి ప్రపోజల్ నూ తిప్పి కొట్టింది. అతడితో మరో మాట మాట్లాడకుండా అక్కడినుంచీ వెళ్ళిపోయింది. జరిగిన తతంగంపై ఆ ప్రియురాలు 'వియ్ ఛాట్' లో తన స్నేహితురాలితో సంభాషించింది. ఆ తర్వాత ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ గా మారి... ఆన్ లైన్ లో లీకయింది. ఓ కథలా పబ్లిష్ అయ్యింది. తనకు ప్రపోజ్ చేసినప్పుడు వన్ కేరెట్ వజ్రంతో ఉంగరం చేయిస్తానన్నాడని, తీరా నిశ్చితార్థానికి అంత చిన్న వజ్రం ఉంగరం ఇవ్వడంలో అతని ఉద్యేశ్యం ఏమిటంటూ ఆమె తన అభద్రతా భావాన్ని మెసేజ్ లో వ్యక్త పరిచింది. అతడు తనగురించి ఎప్పుడూ ఆలోచించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆమె ఫ్రెండ్ ''బాధపడకు నీకోసం మరో పెద్ద రింగ్ ఎదురు చూస్తూ ఉండి ఉంటుందిలే'' అంటూ ఆమెకు సర్ది చెప్పింది. ఇలా మెసేజ్ ల ద్వారా విషయం లీక్ అవడంతో ఆ ప్రేమికుల కథ బట్టబయలైంది. సో అబ్బాయిలూ ప్రపోజ్ చేసేంముందు కాస్ల ఆలోచించి మరీ వాగ్దానాలు చేయాలని మర్చిపోకండి. -
GHMC ఆస్తి పన్ను రాయితీ ప్రతిపాదన
-
ప్రత్యేక హోదా'పై దాగుడుమూతలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహార శైలి చూస్తుంటే ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా రాష్ట్రానికి వచ్చే అవకాశముందా? ప్రత్యేక హోదాకు సంబంధించిన విధివిధానాలు ఏమిటి? ఇటు రాష్ట్రంలోని తెలుగుదేశం, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు చెబుతున్న మాటల్లో వాస్తవమెంత? లేదంటే రెండు ప్రభుత్వాలు కలిసి దోబూచులాడుతున్నాయా? అన్న అనేక ప్రశ్నలు ప్రజలను అయోమయంలోకి నెడుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగి ఒకటికాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది నెలలు దాటిపోతున్నా ఇప్పటివరకు ప్రత్యేక హోదాపై కనీసం ఒక స్పష్టత రాకపోవడం, మొత్తంగా ఈ వ్యవహారం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ వ్యూహంగా అనుమానాలు కలుగుతున్నాయి. 1969 నుంచి ప్రత్యేక హోదా కలిగిన అస్సాం సైతం ఇటీవలి కాలంలో తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కొనసాగించాలని ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేయడాన్ని గమనించినా అనేక సందేహాలకు తావిస్తోంది. నాడు ఘనంగా ప్రకటనలు... రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో అవశేషాంధ్రప్రదేశ్ ఆదాయ వనరులు కోల్పోతున్నందున వాటిని భర్తీచేసేందుకు, రెవెన్యూ లోటును పూడ్చేందుకు ప్రత్యేక హోదాను కల్పించనున్నామని గత యూపీఏ-2 ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటన చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి వీలుగా ప్రత్యేక ప్రాజెక్టును అమలు చేస్తామని లోక్‌సభలో ప్రకటించింది. ప్రత్యేక హోదా, రాయితీలను ఐదేళ్లుగా అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రకటనచేస్తే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పదేళ్లపాటు ఉంచాలని డిమాండ్ చేసింది. అధికారంలోకి వ చ్చాక పక్కనపెట్టిన బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ అంశాలను బీజేపీ నేతలు పక్కనపెట్టేశారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న యూపీఏ ప్రభుత్వం ఆ విషయాన్ని పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఎందుకు చేర్చలేకపోయిందంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం సైతం ఆనాటి బీజేపీ నేతల మాటలను గుర్తుచేసి ప్రత్యేక హోదా సాధించే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో సాగించిన ఢిల్లీ పర్యటనలు చూస్తే ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న భావన కల్పించేలా సాగింది. ఎనిమిది నెలల్లో ఎనిమిదిసార్లు కేంద్రం వద్దకు వెళ్లినా ఏ రోజూ ప్రత్యేక హో దా విషయంలో గట్టిగా మాట్లాడలేకపోయారని ఆయన పర్యటన పర్యవసనాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతూ రోజుకో ప్రకటన చేస్తున్నారు. ఒకవైపు సీఎం, మంత్రులు మరోవైపు కేంద్ర మంత్రులు తలోరకంగా మాట్లాడుతున్నారు. చట్టపరమైన హామీలకే వర్తింపు: ప్రత్యేక హోదాను ప్రకటించాలంటే ప్రణాళికా సంఘం నిర్ణయం తీసుకోవాలి. ప్రధాని అధ్యక్షతన ఉండే ప్రణాళికా సంఘాన్ని ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసింది. ప్రణాళికా సంఘమే రద్దయినప్పుడు ప్రత్యేక హోదాపై నిర్ణయం ఎలా అన్నది ప్రశ్న? నీతి ఆయోగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నా దానికి సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారుకాలేదు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు న్యాయం చేస్తామని ఇటీవల పార్లమెంటు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ‘ప్రత్యేక హోదా ఉన్న, లేని రాష్ట్రాల మధ్య 14 వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసాన్ని చూపించలేదు. ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల అధికంగా లబ్ధి పొందే రాష్ట్రాల్లో బిహార్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. వేగంగా అభివృద్ధి చెందడానికి ఈశాన్య రాష్ట్రాలకు అవకాశం కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ తరహాలో పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం అందించాలని ప్రతిపాదిస్తున్నా. ఏపీ, తెలంగాణకు సంబంధించి నంత వరకు... రాష్ట్ర విభజన సమయంలో చట్ట పరంగా ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. చట్టంలో లేకుంటే అంతేనా?: విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశమే లేదని, కేవలం విభజన బిల్లు ఆమోదం సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ లోక్‌సభ వేదికగా ప్రత్యేక హోదాపై ప్రకటన మాత్రమే చేశారు తప్ప దాన్ని చట్టంలో చేర్చలేదని రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెబుతున్నారు. అయినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఇద్దరు మంత్రులు మాటలు విన్నవారికి అసలు ఏపీకి ప్రత్యేక హోదా దక్కుతుందా? లేదా? అన్న సందిగ్థంలో పడక తప్పదు. అరుణ్‌జైట్లీ లోక్‌సభలో చేసిన ప్రసంగం ప్రకారం చూస్తే, రాష్ట్రాలకు ప్రత్యేక హోదా భవిష్యత్‌లో కొనసాగిస్తారా? అనే విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రణాళికా సంఘం, దాని అనుబంధ జాతీయ అభివద్ధి మండలిని ఇప్పటికే రద్దుచేశారు. ఈ తరుణంలో రద్దయిన ప్రణాళికా సంఘం రాష్ట్రాలకు అదనపు ప్రణాళికా గ్రాంట్లు ఇవ్వడానికి వీలుగా రూపొందించిన ‘ప్రత్యేక హోదా’ విధానం కొనసాగుతుందా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. 13వ ఆర్థిక సంఘం వరకు.. ప్రణాళికేతర రెవెన్యూ లోటుకు ఆ సంఘం గ్రాంట్లు ఇచ్చేలా సిఫార్సులు ప్రతిపాదిస్తుండగా, ప్రణాళికా వ్యయానికి ప్రణాళికా సంఘం గ్రాంట్లు ఇచ్చేది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తూ ఏయే రాష్ట్రానికి ఎంతెంత లోటు ఏర్పడుతుందో స్పష్టీకరించింది. అయితే ఆమేరకు ప్రణాళికా వ్యయానికి గ్రాంట్లు ఇవ్వాలని సిఫార్సు చేసేందుకు ప్రణాళికా సంఘం ఇప్పుడు ఉనికిలోనే లేదు. 14వ ఆర్థిక సంఘం నివేదికలోని పేరా 2.29లో పేర్కొన్న సిఫార్సు.. ‘మేం సిఫార్సులు చేయడంలో, విధానాలు తయారు చేయడంలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు, సాధారణ రాష్ట్రాలు అని బేధాన్ని పరిగణలనలోకి తీసుకోలేదు. పన్నుల రాబడి పంపిణీ ద్వారా రాష్ట్రాల వనరుల లోటును వీలయినంతమేర తగ్గించాలనే లక్ష్యంతో పనిచేశాం. పన్నుల పంపిణీ ద్వారా లోటు ను తగ్గించడానికి వీలు కాకపోతే, రెవెన్యూ లోటు భర్తీకి గ్రాంట్లు ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. ‘వాస్తవంగా రాష్ట్రాలకు ఉన్న ఖర్చు-అవసరాలు, రాబడిని అంచనా వేశాం’ అని తర్వాత పేరాలో రాశారు. మరి హోదా ఉన్న రాష్ట్రాల సంగతేంటి? ప్రణాళికా సంఘం రద్దయినందున ప్రత్యేక హోదా అంశం కూడా రద్దు జాబితాలో చేరిందన్నట్లుగా కేం ద్రంలోని నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక హోదా అన్న దాని ఉనికే ఇపుడు లేనప్పుడు మరి దేశంలో కొన్నేళ్లుగా ప్రత్యేక హోదాలో ఉన్న రాష్ట్రాల్లో అది కొనసాగుతుందా? రద్దవుతుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే జమ్మూకశ్మీర్‌తోపాటు మరికొ న్ని ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదాను పొందుతున్నాయి. ప్రత్యేక హోదా విధానాన్ని కేంద్రం రద్దు చేసినట్లుగా అనిపించకపోతే, తమ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదాను కొనసాగించాలని ఈశాన్య రాష్ట్రమైన అస్సాం అసెంబ్లీ మార్చి 4న ఏకగ్రీవ తీర్మానం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అస్సాంకు 1969 నుంచి ప్రత్యేక హోదా ఉన్న విషయం విదితమే. కింకర్తవ్యం?: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు, ప్రత్యేకంగా రాయితీలేవీ రాష్ట్రానికి ప్రకటించనప్పుడు, ప్రత్యేక హోదా కల్పించడమన్నది చట్టంలో లేదని చెబుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చిత్తుశుద్ధితో అన్ని పక్షాలతో కలసి ఇప్పటికే కేంద్రాన్ని ఒప్పించే పని చేయాలి. కేంద్రంపై ఒత్తిడి చేస్తే తప్ప ప్రయోజనం ఉండదన్న విషయం అందరూ చెబుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రంలోని మిత్రపక్షంపై నోరు మెదపడానికి ఏమాత్రం సిద్ధంగాలేదు. సినీనటులతో లాబీయింగ్ చేయిస్తే సరిపోతుందన్న ధోరణితో వెళితే మాత్రం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాదు కదా... కనీసం రాయితీలను కూడా సాధించలేమని నిపుణులు చెబుతున్నారు. -
అమృతం ఎక్కడో లేదు...
పోల్కంపల్లి శాంతాదేవి ‘‘దివ్య వెడ్స్ శ్రీకాంత్’’ అన్న అక్షరాలు విద్యుద్దీపాల వెలుగులో జిగేల్మని మెరిసిపోతుంటే, చక్కగా అలంకరించుకొన్న అమ్మాయిలు లోపలికి వస్తూన్న ఆహూతుల మీద పన్నీరు చిలకరించి అరవిచ్చిన గులాబీపువ్వులను చిరునవ్వులు చిందిస్తూ అందిస్తున్నారు. సౌండ్ బాక్సుల్లోంచి సినిమా పాటలు హుషారుగా వినిపిస్తున్నాయి. కొంచెం లోపలికి వెడితే యుద్ధ వాతావరణాన్ని తలపించే సన్నివేశం ఒకటి నడుస్తోందక్కడ. అటు వధువూ వధువు తరఫు బంధుమిత్రులు వరుని తరఫు వాళ్ళని ఎదుర్కోలు సన్నివేశం రసవత్తరంగా సాగుతోంది! ఇరువురి మధ్య పదిపన్నెండడుగుల దూరం ఉంది; అరగంట గడిచినా ఎవరూ ఒక్క అడుగూ ముందుకు వేయడం లేదు. ఏదో పోనీలే అని ఒక్కడుగు ముందుకు వేసినా రెండడుగులు వెనక్కి లాగివేస్తున్నారు వెనుకున్న పరివారం, ‘‘నువ్వుండు! వాళ్ళే రానీ’’ అంటూ. ఇరుపక్షాల వారికి ఇది ప్రెస్టేజీ ప్రశ్న అయిపోయింది. అటు పెళ్ళికూతురు దివ్య అన్న హర్ష పెద్దరికం వహిస్తే ఇటు పెళ్ళికొడుకు శ్రీకాంత్ చెల్లెలు శిరీష అన్నను కదలనివ్వడం లేదు! ‘‘వాళ్ళకే అంత బింకముంటే మనకేనా లేంది?’’ అంటూ నడుంకి చీరకొంగు చుట్టేసి అన్న చెయ్యి పట్టేసింది! వాళ్ళని రెచ్చగొడుతూ కుర్రకారు ఈలలూ, పాటలూ, అరుపులూ.... ‘‘పెళ్ళితంతు ఇంకా చాలా ఉంది! ఇక్కడే ఆగిపోతే ఎలా? తొందరగా కానివ్వండి.’’ పురోహితులవారు గట్టిగా చెప్పడంతో మెల్లిమెల్లిగా పట్టుసడలింది. గంధపురంగు పట్టుచీరలో సింఫుల్‌గా చుక్కల్లో చంద్రుడిలా కనిపిస్తున్న శిరీష మీదే చక్కర్లు కొట్టసాగాయి హర్ష చూపులు. పెళ్ళికొడుకు చెల్లెలని ఎవరో అనుకొంటుండగా విన్నాడు. బ్రాహ్మలు మంత్రాలు చదువుతుంటే వధూవరులు పరస్పరం పూలదండలు మార్చుకొంటుంటే మెల్లగా శిరీష పక్కకి చేరాడు హర్ష. ‘‘మీ పేరు, సత్యభామా?’’ నవ్వుతూ అడిగాడు. శిరీష తెల్లబోయింది. ‘‘ఎవరు చెప్పారు, సత్యభామ అని?’’ ‘‘నడుంకి చెంగుచుట్టి మీ అన్నగారిని ముందుకు కదలనివ్వకపోతే... ఆ ఫోజూ... అదీ... నాకు సత్యభామలా కనిపించారు!’’ ‘‘మీరు మాత్రం మీ చెల్లెలిని కదలనిచ్చారా? మీరు శిఖండిలా కనిపించారు!’’ అందామనుకొని బాగుండదేమోనని ఆపుకొంది. ‘‘ఖర్జూరాలు, బాదంకాయలు పెట్టిన కవరు దొరకడం లేదు. చూసిద్దువురా, శిరీ’’ అని తల్లి పిలిస్తే పరిగెత్తింది. ఇంకాస్సేపు మాట్లాడే అవకాశం లేకుండా పోయినందుకు నిట్టూర్చాడు. ‘‘శిరి’’ పేరు బాగుందనుకొన్నాడు. ఎదుర్కోళ్ళ దగ్గర తప్ప ఎవరూ ఎక్కడా బెట్టుకుపోలేదు. మర్యాదలూ, లాంఛనాలూ... సక్రమంగా జరిగాయి. ‘‘మాంగల్యం తంతునానేనా...’’ వేదమంత్రాలు... అందరి ఆశీర్వచనాల మధ్య భార్యాభర్తలయ్యారు దివ్య, శ్రీకాంత్. ఆహుతులంతా భోజన తాంబూలాలు స్వీకరించి వెళ్ళిపోతుంటే దగ్గర బంధువులు మాత్రం ఆగిపోయారు. వివాహం తరువాత జరిగే తంతు పూర్తి అయ్యి ఉదయం నుండి ఉపవాసంతో ఉన్నవాళ్ళకు భోజనాలు పెట్టి అప్పగింతలకు రెడీ అవుతున్నారు. మనస్సంతా బరువెక్కగా కూతురి వెంట పంపడానికి సారె చీరలు రెడీ చేస్తోంది దివ్య తల్లి పద్మావతమ్మ. కూతురితో పంపడానికి పెద్దకోడలు రాధికను, అక్క వరుసైన శారదమ్మను, ఆమె భర్తనూ పంపడానికి నిర్ణయమైపోయింది. గదిలో రెండు సూట్‌కేసులు ముందేసుకుని తన చీరలూ, ఆడపడుచు చీరలూ సర్దుతోంది రాధిక. ‘‘వదినా, ఏం చేస్తున్నావు?’’ అంటూ వచ్చాడు హర్ష. మనసులో మాట చెప్పి, ‘‘అక్కడికి వెడుతున్నావు కదా? విషయం కదిపి వాళ్ళ అభిప్రాయం కనుక్కుని రావాలి!’’ అన్నాడు. రాధిక ఆశ్చర్యంతో మాట్లాడడానికి టైం పట్టింది. ‘‘నీకు ఆమె గురించి ఏం తెలుసునని ఒక నిర్ణయానికి వచ్చేశావు, హర్షా!?’’ ‘‘భార్యగా ఎలాంటి అమ్మాయిని ఊహించుకున్నానో... ఆ లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయనిపించింది.’’ ‘‘ఆమె అమ్మాయికాదు! అమ్మ... ఇద్దరు పిల్లలకి అమ్మ! విడో! భర్తపోయి ఏడాదవుతోంది!’’ కోపం, చిరాకు మిళితంకాగా అంది రాధిక. హర్ష ముఖం పాలిపోయింది. శిరీష బాగా నచ్చింది. తొలిప్రేమ అంటారేమో! ఆమె చుట్టూ ఎన్నెన్నో ఆశలు అల్లుకున్నాడు. అక్కడితో ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికే నిర్ణయించుకున్నాడు. ‘‘పెళ్ళయింది కాని భర్తలేడు కదా? వితంతు పునర్వివాహం ఆదర్శమౌతుంది కూడా.’’ ‘‘కొట్టానంటే ఆంజనేయుడు ముఖంలా వంకరపోతుంది తెలుసా?’’ కొడతానన్నట్లుగా చెయ్యెత్తింది కాని కొట్టలేదు రాధిక. మరిది దగ్గర ఆమెకా చనువుంది. ‘‘వట్టి వితంతువు కాదు! ఇద్దరు పిల్లలున్న వితంతువు!’’ ‘‘మరీ మంచిది; పెళ్ళితోటే ప్రమోషన్ కూడా దొరుకుతుందన్న మాట ఇద్దరు పిల్లల తండ్రిగా.’’ ‘‘ఇదేం తలతిక్క?’’ నుదురు మీద కొట్టుకొంది. ఈ నిప్పును ఎంతోసేపు తన కొంగున కట్టుకోలేననుకుంది. గబగబా అత్తగారి దగ్గరికి పరిగెత్తి గుసగుసగా విషయం చేరవేసిగాని తేలికపడలేదు. కూతుర్ని ఓ అయ్య చేతిలోపెట్టి గుండెల మీది బరువు దింపుకొన్న సంతోషం కకావికలైపోయింది పద్మావతమ్మకు. ఆవిడ ఏడవడం మొదలుపెట్టింది. ‘‘పెళ్ళి ఇంట్లో ఇదెక్కడి ముసలం పుట్టిందే? ఎంత పరువు తక్కువ? అంతటి మహాసౌందర్యవతి ఇంకెక్కడా దొరకదన్నట్టు మొగుడు చచ్చినదానిమీద మోజుపడ్డం ఏమిటి?’’ ఎంత గొంతు తగ్గించి మాట్లాడాలనుకొన్నా కోపంతో స్వరం అదుపు తప్పి హెచ్చిపోయింది. చుట్టుప్రక్కలున్న వాళ్ళు బిలబిల్లాడుతూ వచ్చేశారు. దగ్గరి బంధువులే కాబట్టి సంగతి దాచాలనుకోలేదు పద్మావతమ్మ. ‘‘వాడు అమెరికాలో డాక్టరు! ఎంతో మంది పిల్లనిస్తామన్నా ఒప్పుకోలేదు! చివరికి ఎటువంటి దాన్ని వలచాడో చూడండి!’’ ‘‘అయ్యో రామ! ఇదెక్కడి చోద్యం?’’ వాళ్ళు ముక్కున వేలేసుకొన్నారు. ‘‘తావలచిన రంభ అంటారు దీన్ని!’’ ‘‘కిందటిసారి నీ కొడుకు అమెరికా నుండి వచ్చినప్పుడు మా ప్రియాంకనిద్దామని ఫొటో చూపిస్తే పిల్లని చూడకుండానే తిరస్కరించాడు కదా? నీ కొడుక్కి కొంచెం నచ్చజెప్పి ఒప్పించరాదా అంటే ‘‘వాడికి నచ్చకపోతే నేనేం చేస్తాను?’’ అన్నావు! ఏదో ఒకటి చేసి ఆ రోజు నీ కొడుకుని ఒప్పించి ఉంటే ఈ రోజు ఈ కష్టం దాపురించేది కాదు కదా?’’ అంది వదిన వరుసైన సుమిత్రమ్మ. ఈ శిరీష నా కూతురి కంటే అందగత్తె అంటే నేనొప్పుకోను. ఏం చూసి వలచాడో నీ కొడుకు మరి!’’ ‘‘చెప్పడానికి సందు దొరికిందా? ఆపద నుండి గట్టెక్కే మార్గం చెబుతావనుకొంటే...’’ కొంగుతో ముక్కుతుడుచుకొంటూ అంది పద్మావతమ్మ. ‘‘ఇంకా నా బిడ్డకు సంబంధం కుదరలేదు. నీ కొడుకును ఒప్పించు! ఆలస్యం లేకుండా పెళ్లి జరిపిద్దాం! సమస్య తీరిపోతుంది!’’ ‘‘అప్పుడొప్పుకోని వాడు ఇప్పుడొప్పుకొంటాడా?’’ ‘‘ఒప్పుకొంటే సరే... లేదంటే చస్తానని చెప్పు!’’ ‘‘మా హర్ష పట్టుదల సంగతి నాకు తెలుసు! వాడొకసారి ఒక నిర్ణయం తీసుకొన్నాడంటే అది నెగ్గేదాకా వదలడు.’’ ‘‘ఇంకేం? చేసుకో! కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే బిడ్డ పుడతాడని... ఒక్కరు కాదు... ఇద్దరు పిల్లల్తో సంతానలక్ష్మిలా అడుగుపెడుతుంది కోడలు! ఇంత అదృష్టానికి మురవాలి గాని ఏడుపెందుకు, పద్మావతొదినా!’’ గదిలోకి పిలిచి తల్లి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినా నిరాశపడలేదు హర్ష. ఇది ఊహించిందే. ఇద్దరు పిల్లలున్న వితంతువును పెళ్ళాడతానంటే ఏ తల్లైనా ఆనందంతో హారతులివ్వదు కదా? కాని, ఏ తల్లికైనా కొడుకు సంతోషాన్ని మించింది లేదు. ఈ బలహీనతను ఆధారం చేసుకొనే తల్లి మనసు గెలుచుకోవాలనుకొన్నాడు. ముందు శిరీష ఒప్పుకొంటే అమ్మను ఎలాగైనా ఒప్పించుకొంటానన్న ధీమాతో ఉన్నాడు. అమ్మ తిడుతుందన్న భయంతో వదిన అడగలేకపోవచ్చు! తనే రంగంలోకి దిగాలి అనుకొన్నాడు. అప్పగింతలయ్యి నూతన వధువుతో కారెక్కబోతున్న బావగారిని పక్కకి పిలిచి తన మనసులో మాట చెప్పేశాడు. ‘‘నా చెల్లి విడో అని, ఆమెకిద్దరు పిల్లలున్నారని తెలుసా?’’ తెలుసునన్నట్టుగా తలాడించాడు హర్ష. ఆశ్చర్యమూ, ఆనందమూ ముప్పిరిగొన్నాయి శ్రీకాంత్ ముఖంలో. ‘‘ఈ విషయం మీ ఇంట్లో తెలుసా? ఒప్పుకొన్నారా?’’ ‘‘ఒప్పిస్తాను! ఆ నమ్మకం నాకుంది!’’ ‘‘మా శిరికి పెళ్ళి చేయాలని నాకెప్పటి నుండో ఉంది. నువ్వే అడగడం వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా ఉంది! థాంక్యూ, బావా! ఈ పెళ్ళి తప్పకుండా జరగాలి! మా శిరి కళ్ళలో మళ్ళీ వెలుగులు చూడాలి!’’ ‘‘నువ్వు మనస్ఫూర్తిగా కోరుకొంటే మా పెళ్ళి తప్పకుండా జరుగుతుంది, బావా! శిరీషను ఒప్పించే భారం నీదే! కాని, ఒక రిక్వెస్ట్ ఏమిటంటే...’’ ప్రశ్నార్థకంగా చూశాడు శ్రీకాంత్. ‘‘వచ్చే నెల్లోనే నేను అమెరికా వెళ్ళిపోతాను కాబట్టి ఈలోగానే మా పెళ్ళి జరిగిపోవాలి! మళ్ళీ ఆరునెలల తరువాత వస్తాను శిరీషను తీసుకుపోవడానికి. ఈలోగా వీసా, పాస్‌పోర్ట్... అంతా రెడీ కావాలి! పిల్లల్ని ఇప్పుడే నాతో తీసుకుపోలేను. మీరు ఎలాగోలా మేనేజ్ చెయ్యాలి కొంత కాలం. వాళ్ళని నాతో తీసుకుపోవడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేనుగాని కచ్చితంగా తీసుకుపోతాను. వాళ్ళ భారం నాదే! వాళ్ళు ఇక్కడ ఉన్నా వాళ్ళ ఖర్చు నేనే పెట్టుకొంటాను. ఈలోగా అమ్మావాళ్ళు కూడా సెట్టవుతారు. అమెరికాలో అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. విడాకులు, పిల్లులున్న వాళ్ళని పెళ్ళాడడం అక్కడ కామన్. మన దగ్గర ఆ మార్పు ఎప్పుడొస్తుందో తెలియదు.’’ ‘‘తరువాత వాళ్లు మారుతారో లేదో తెలియదు గాని ఇప్పుడు వాళ్ళ అంగీకారం లేకపోతే ఎలా, బావా? నలుగురు ఆశీర్వదిస్తేనే అది పెళ్ళవుతుంది!’’ ‘‘ఆశీర్వదిస్తే సంతోషమే! మా కాపురం అమెరికాలో ప్రారంభమౌతుంది కాబట్టి అదొక అడ్డంకి కానేకాదు!’’ బావా బావమరిది దూరంగా వెళ్ళి మాట్లాడుకోవడం చూస్తున్నారు బస్సు దగ్గర నిలబడ్డ బంధువులు. ‘‘దుర్ముహూర్తం వస్తుంది. వచ్చెయ్యండి’’ కేకేశాడు ఓ పెద్దాయన. హర్షతో వీడ్కోలు తీసుకొని కదిలాడు శ్రీకాంత్. అతడికి చెప్పలేనంత సంతోషంగా ఉంది! ‘‘శిరీ... కూల్‌గా ఆలోచించు: ఒకసారి తలుపు తట్టిన అదృష్టం మళ్ళీ మళ్లీ తడుతుందనుకోకు! అమెరికా వెళ్ళిపోయేలోగా నీ జవాబు పాజిటివ్‌గా వస్తుందన్న ఆశాభావంతో ఉన్నాడు.’’ ఎప్పటిలా కయ్మనలేదు శిరీష. చేస్తున్నపని ఆపకుండా ఉదాసీనంగా ఉండిపోయింది. ఆమె మౌనం శ్రీకాంత్‌లో ఆశపొటమరించేలా చేసింది. ‘‘శిరి కొద్దికొద్దిగా మెత్తబడుతోంది!’’ అనుకొన్నాడు. ఈ పెళ్లి ప్రపోజల్ విషయమై మూడు రోజులుగా తర్జనల భర్జనల జరుగుతోంది. ఎవరెవరో వచ్చి బుద్ధి చెబుతున్నారు అమ్మ.... అన్నయ్య... దగ్గరి బంధువులు.... ఈసారి ఆ డ్యూటీ మేనత్త తీసుకొంది. ‘‘నీకెంతని? పాతిక దాటని వయసు! నీ వయసు వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళే కాలేదు. నువ్వు డిగ్రీలో ఉండగానే మంచి సంబంధం వచ్చిందికదా అని రవికిచ్చి పెళ్ళి చేశారు. వాడింత అల్పాయుష్కుడై నిన్నన్యాయం చేసిపోతాడని ఎవరూహించారు? పోతూపోతూ నీ మెడకు రెండు గుదిబండల్ని కట్టి మరీపోయాడు కదా?...’’ అంతదాకా పేపరు చదివి, స్నానం చేసొచ్చి, ‘‘శిరీ! ఆఫీసుకి టైం అవుతూంది. టిఫిన్ తీసుకురా!’’ అని కేకేసినవాడు టిఫిన్ ప్లేట్ పట్టుకొచ్చేసరికే. ‘‘అబ్బా! నొప్పి!..’’ అంటూ గుండెల మీద నొక్కుకొంటూ కిందపడి మరీ లేవకపోతే ఎలా నమ్మాలి ఆ చావును? దువ్వుకొన్న క్రాఫు చెరగలేదు. రాసుకొన్న పౌడరు మాయలేదు. అప్పుడే పూసిన తాజా పువ్వులా ఉన్న ఆ ముఖం ఇంకా కళ్ళ ముందు కదులుతున్నట్టుగా ఉంది. భర్త చావు గుర్తొచ్చి శిరీష కళ్ళు చెమర్చడం మొదలుపెట్టాయి. ‘‘నా తలరాత ఇంతేనని భారంగా బ్రతుకు వెళ్ళదీయడానికి వెనుకటి కాలం కాదుగా? వితంతు స్త్రీకి మళ్ళీ పెళ్ళిని తప్పుపట్టడం లేదుకదా, అదొక అభ్యుదయంగా హర్షించే మార్పు వచ్చింది సమాజంలో. నీకు మళ్ళీ పెళ్లి చేయాలని ఎప్పటినుంచో అనుకొంటున్నాడు మీ అన్నయ్య. హర్ష నిన్ను చూసిన మొదటి క్షణంలేనో నువ్వే తన భార్యవని నిర్ణయించేసుకొన్నాడట! నీకిద్దరు పిల్లలున్నారని తెలిశాక కూడా అతడి నిర్ణయంలో మార్పురాలేదు. ఆ పిల్లల బాధ్యత తను సంతోషంగా తీసుకొంటానన్నాడు. ఇప్పటికిప్పుడు ఆ పిల్లలను తీసుకుపోవడానికి వీసా అదీ ఇప్పుడే దొరకడం కష్టం కాబట్టి కొంత కాలంపాటు ఇక్కడే ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్లో ఉంచి ఆ ఖర్చు తను భరిస్తానన్నాడు. నీకింతకంటే ఏం కావాలి శిరీ?’’ ‘‘నా నుండి నా పిల్లల్ని దూరం చేసే ఆలోచన మీకెలావచ్చిందో... దానికి నేనొప్పుకొంటానని ఎలా అనుకొన్నారో నాకు అర్థం కావడం లేదు. నా పిల్లలు ఎక్కడో అనాథల్లా పడివుంటే నేను పెళ్ళి చేసుకొని సుఖంగా ఉండగలనా?’’ అక్కడే ఉన్న శ్రీకాంత్ అన్నాడు: ‘‘పిల్లల్ని హాస్టల్స్ ఉంచి చదివించడం అనాథల్ని చేయడమని ఎందుకనుకొంటున్నావో నాకర్థం కావడం లేదు. ఎందరు కరోడ్‌పతులు పిల్లల్ని మంచి చదువు, మంచి నడవడిక రావాలని బోర్డింగు స్కూళ్ళలో, అమెరికా... లండన్ పంపించి చదివించడం లేదు? బయట ఉంచి చదివించడం ఇష్టం లేకపోతే పిల్లల్ని చూసుకోవడానికి మేము లేమా? నీకు పెళ్ళి చేసి మేం చేతులు దులుపుకొంటామని ఎలా అనుకొన్నావు? నువ్వు ఒడ్డున పడడం ఒక్కటే మాకు కావాలి! పెద్దాడిని నేను తీసుకుపోయి చదివిస్తాను. చిన్నా అమ్మ దగ్గరుంటాడు. నేను దివ్యని తీసుకొని ఢిల్లీ వెళ్ళిపోతే అమ్మా వాళ్ళు ఒంటరివాళ్ళు కాకుండా వాడుంటాడు. వాడితో అమ్మావాళ్ళకి మంచి కాలక్షేపం అవుతుంది.’’ ‘‘అమ్మకి మోకాళ్ళ నొప్పులు. పిల్లల్ని పెంచి పెద్ద చేసే వయసా ఆమెది? పెద్దాడిని నువ్వు తీసుకుపోతానంటున్నావు; నీ భార్య ఒప్పుకోవద్దా? నీ బలవంతం వల్ల ఒప్పుకొన్నా ఎంతకాలమని భరిస్తుంది? ఇదెక్కడి తద్దినమని విసుక్కోదా?’’ ‘‘అన్నీ నువ్వే అనుకొంటే ఎలా? నువ్వు దివ్య అన్నయ్యనే కదా చేసుకొంటున్నది? నా మేనల్లుడు ఆమెకీ అల్లుడే అవుతాడు’’ ‘‘అతడిని పెళ్ళి చేసుకొని... అతడొక్కడు నావాడైతే సరిపోతుందా? అతడి కుటుంబం కూడా నాకు కావాలి! అది అసాధ్యం కాబట్టి మళ్ళీ మళ్ళీ పెళ్ళి చేసుకొని నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నాకు లేదు. ఈ జీవితానికీ అనుభవాలు చాలు! ఆయన నన్నెంతో ప్రేమించారు. ఆయన స్మృతులను తోడు చేసుకొని నా పిల్లల్ని నేను పెంచుకోగలను. ఎల్లకాలం మీకు బరువుగా ఉంటానని అనుకోవద్దు! ఏదో ఒక పని చూసుకుని నా పిల్లల్ని తీసికెళ్ళిపోతాను. నా బతుకు నేను బతుకుతాను’’. శ్రీకాంత్ మనసు గాయపడింది. ‘‘ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు, శిరీ? నువ్వు మాకు భారమా? మోడుగా మారిన నీ జీవితంలో మళ్ళీ వసంతం రావాలని కోరుకోవడం తప్పా? నీ జీవితం కలకలలాడాలని కోరిక తప్ప నిన్ను వదిలించుకోవాలని కాదు. ఇంకోసారి ఆ మాట అనకు!’’ ‘‘నా జీవితం మోడు కాదు! రామలక్ష్మణుల్లా ఇద్దరు పిల్లలు! వాళ్ళని పెంచి పెద్దజేయాల్సిన కర్తవ్యం నాముందుంది!’’ ‘‘నీ పిల్లల కోసమే నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదనుకొంటే - నీ పిల్లలకు ఓ మంచి దారి భగవంతుడు చూపుతున్నాడే, శిరీ! మా బావగారి అమ్మాయి రుక్మిణికి పిల్లలు లేరన్న సంగతి నీకు తెలుసుననుకొంటాను. కాంట్రాక్టరుగా వాళ్ళాయన కోట్లకు కోట్లు సంపాదించాడు. నీ చిన్న కొడుకును దత్తత ఇస్తే తీసుకోవాలని ఆశపడుతోంది మా రుక్మిణి. ఊరికే కాదు. నీ పెద్దకొడుకు పేరు మీద బ్యాంక్‌లో కోటి రూపాయలు వేస్తారట. వాడి భవిష్యత్తుకు రాచబాటలు వేసుకోవచ్చు! నిన్నడగమని ఎప్పటినుంచో నన్ను పోరుపెడుతుంది మా రుక్మిణి. హఠాత్తుగా నీ మొగుడుపోయి నీ ఆపదలో నువ్వుంటే ఎలా అడగాలో పాలుపోక అడగలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నీ చిన్న కొడుకు కోటీశ్వరుల ఇంటిలో దర్జాగా పెరుగుతాడు. దత్తు ఇచ్చినా నీకు బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు...’’ ‘‘అత్తా!’’ అరిచింది శిరీష. ‘‘వాళ్ళేదో ఆశకొద్దీ అడిగారే అనుకో! అది మోసుకొచ్చి నాకు చెప్పబుద్ధి ఎలా అయింది? ఏ తల్లికైనా పిల్లలు బరువా?’’ ‘‘బరువని కాదు! నువ్వేదో చిన్న ఉద్యోగమో, పాచిపనో చేసి పిల్లల్ని సాక్కోవచ్చు! వాళ్ళ కనీస అవసరాలైనా తీర్చలేక నీ తల్లి మనసు యాతనపడదా? నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచన తోటే చెబుతున్నాను. నువ్వు కొంచెం మనసు దిటవు చేసుకొంటే చిన్నా కోటీశ్వరుడవుతాడు!’’ ‘‘నా చీకటి బతుకులో నా పిల్లలిద్దరూ నా రెండు కళ్ళు అత్తా! వాళ్ళు నాకు రెండు దీపాలు! పెద్దవాడి భవిష్యత్తు కోసం చిన్నవాడిని అమ్ముకొమ్మని చెప్పడం న్యాయమా? ఇంకోసారి నా దగ్గర ఈ సంగతి ఎత్తకు అత్తా! అన్నయ్యా, నీకు చెబుతున్నాను. మళ్ళీ పెళ్ళని నావెంటపడకు! ’’ దూరంగా పెళ్ళికి వచ్చిన చుట్టం ఒకాయన చిన్నాని ఎత్తుకొని ఉన్నాడు. ఆయన్ని గిచ్చుతూ, పీకుతూ కొడుతున్నాడు పెద్దవాడు వేణు. ‘‘మా తమ్ముణ్ణి మాకివ్వు!’’ అని ఏడుస్తున్నాడు. శిరీష పరిగెత్తింది. ‘‘భలే ఉన్నాడమ్మా, నీ పెద్దకొడుకు. తమాషాకి నీ తమ్ముడిని తీసుకుపోతానని ఎత్తుకొన్నానో లేదో ‘‘మా తమ్ముడు మాకే కావాలి! దించు!’’ అంటూ నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. తమ్ముడంటే ఎంత ప్రేమో చూడు వాడికి!’’ ‘‘తమ్ముణ్ణి తీసుకో, అమ్మా! ఆయన తీసికెళ్ళిపోతానంటున్నాడు!’’ ఇంకా ఏడుస్తున్నాడు వేణు. ‘‘తాతయ్య తమాషాకి అన్నాడు లేరా! ఏం తీసుకుపోడు!’’ ఆ ముసలాయన దగ్గర నుండి పిల్లాడిని తీసుకొనేదాకా వదల్లేదు వేణు. ‘‘నీ తమ్ముణ్ణి నువ్వే ఉంచుకో! నాకేం వద్దు! మా ఇంట్లోనే బోల్డెంత మంది మనుమలూ, మనుమరాళ్ళూ ఉన్నారు...’’ ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు. ‘‘నన్నూ ఎత్తుకో!’’ పోటీగా చేతులు చాచాడు వేణు. వాడిని మరో చంకనేసుకొని, ఇద్దరికీ ముద్దులు పెడుతూ గదిలోకి వెళ్ళిపోయిన చెల్లెల్ని చూసి అన్నాడు శ్రీకాంత్: ‘‘అమృతం ఎక్కడో లేదత్తా! పూలగుండెలో సుధ ఉన్నట్టు అమ్మ గుండెలో మమకారంగా ఉందది! అణువంత పిండానికి ఊపిరులూది, దానికి ఆకృతినివ్వడానికి తన రక్తమాంసాలు ధారబోసి, దాన్ని ఈ లోకంలోకి తీసుకురావడానికి ప్రాణమే పణంగా పెట్టి, ప్రాణాలన్నీ దానిమీదే పెట్టి పెంచి పెద్దజేసి నిలువెత్తు మనిషిగా తీర్చిదిద్ది ఎన్నో చేసే అమ్మ అమృతకలశం కాక ఇంకేమౌతుంది? శిరికి పిల్లల మీద ఆ మమకారమే లేకపోతే హర్ష ప్రపోజల్ సంతోషంగా అంగీకరించేది కదా? ఈ పెళ్ళి ప్రస్తావన తెచ్చి శిరిని అనవసరంగా హర్ట్ చేశాననిపిస్తోందత్తా! ఇంకోసారి శిరి మనసు నొప్పించే పని చేయను!’’ జేబులో ఫోన్ రింగయితే చేతిలోకి తీసుకొని చూశాడు. హర్ష! ‘‘సారీ, బావా!’’ ఇంకేం చెప్పాలో తోచక ఫోన్ కట్ చేశాడు శ్రీకాంత్. -
అటవీ డివిజన్‌గా చింతపల్లి?
ఐదు రేంజ్‌లతో ఏర్పాటుకు ప్రతిపాదన పెద్దదైన నర్సీపట్నాన్ని విభజించే యోచన సిబ్బంది పదోన్నతుల్లో చిక్కులు? జిల్లాలో నాలుగో అటవీ డివిజన్‌గా చింతపల్లిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ముందుకు కదులుతున్నాయి. జిల్లాలోనే నర్సీపట్నం అతిపెద్ద అటవీ డివిజన్. ఎనిమిది రేంజ్‌లు, 116 బీట్లు, 47 సెక్షన్లతో రెండు లక్షల 34 వేల హెక్టార్ల పరిధిలో విస్తరించి ఉంది. నర్సీపట్నానికి 200 కిలోమీటర్ల దూరంలో కూడా రేంజ్‌లున్నాయి. ఇంత పెద్ద డివిజన్‌ను పర్యవేక్షణ చేయడం ఒక డీఎఫ్‌వోతో సాధ్యం కాదు. దీంతో పరిపాలన సౌలభ్యం కోసం చింతపల్లి కేంద్రంగా మరో డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన తయారైంది. ఉద్యోగుల పునర్నిర్వహణ కమిటీ చేస్తున్న ప్రతిపాదనకు ఈసారైనా మోక్షం కలుగుతుందో లేదో వేచి చూడాల్సిందే. కొయ్యూరు : జిల్లాలో పాడేరు, విశాఖపట్నం, నర్సీపట్నంలో అటవీ డివిజన్లున్నాయి. ముగ్గురు డీ ఎఫ్‌వోలు ఉన్నారు. నర్సీపట్నం డివిజన్లో నర్సీపట్నం, కేడీపేట, చింతపల్లి, లోతుగెడ్డ, పెదవలస, ఆర్.వీ నగర్, సీలేరు, మర్రిపాకల రేంజ్‌లున్నాయి. మర్రిపాకల రేంజ్ నర్సీపట్నానికి 200 కిలోమీటర్ల పరిధి వరకు విస్తరించి ఉంది. అటు సీలేరు కూడా ఎక్కువ దూరంలో విస్తరించింది. అంతదూరంలో ఉన్న అడవిని ఒక డీఎఫ్‌వో పర్యవేక్షించడం సాధ్యం కాదు. దీంతో చింతపల్లిని డివిజన్‌గా చేస్తే దాని పరిధిలోకి సీలేరు, ఆర్.వీ నగర్, పెదవలస, చింతపల్లి, లోతుగెడ్డ రేంజ్‌లను తీసుకువచ్చే అవకాశం ఉంటుందని ప్రతిపాదించారు. నర్సీపట్నం డివిజన్‌లోకి నర్సీపట్నం, కేడీపేట, మర్రిపాకల రేంజ్‌లను ఉంచుతారు. కిందటేడాది పెదవలసను కొత్త రేంజ్‌గా చేశారు. 52 బీట్లను 116కు పెంచారు. ఫలితంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు అంకురార్పణ చేశారు. ఇప్పటి వరకు చింతపల్లిలో ఒక సబ్- డీఎఫ్‌వో ఉంటున్నారు. డివిజన్ అయితే డీఎఫ్‌వో వస్తారు. పదోన్నతులపై చిక్కులొచ్చే అవకాశం ఫారెస్టు సెక్షన్ అధికారి స్థాయి వరకు బదిలీలను డివిజన్ స్థాయిలో చేయాల్సి ఉంటుంది. అటవీ శాఖలో బదిలీలకు జిల్లాను కాకుండా డివిజన్‌ను యూనిట్‌గా పరిగణిస్తారు. కొత్త డివిజన్ ఏర్పాటు చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకే తరహా సీనియారిటీ కలిగి ఉంటే ఎవరికి పదోన్నతి ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఉద్యోగుల పంపకాల విషయంలోను వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీనిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కొత్త డివిజన్ ఏర్పాటయితే రేంజ్‌లు వేరు అవుతాయి. రేంజ్ ల్లో పనిచేసే వారు డివిజన్ మారేందుకు ఇష్టపడతారో లేదో చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇష్టపడకుంటే వారి కేటాయింపును ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంటుంది. -
లైంగిక విద్యను నిషేధించాలని ప్రతిపాదించలేదు
న్యూఢిల్లీ: లైంగిక విద్యను నిషేధించాలని తానెప్పుడూ ప్రతిపాదించలేదని కేంద్ర ఆరో్గ్య మంత్రి హర్షవర్ధన్ అన్నారు. పాఠశాలల్లో లైంగిక విద్యను నిషేధించాలంటూ ప్రతిపాదన చేసినట్టు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. తన వెబ్సైట్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతమని హర్షవర్ధన్ చెప్పారు. కౌమార దశ విద్యా పథకాన్నియథారూపంలో ప్రవేశపెట్టాలన్న యూపీఏ ప్రభుత్వ నిర్ణయంపై తన అభిప్రాయాలను తెలియజేశానని అన్నారు. శాస్త్రీయంగా, సాంస్కృతికంగా ఆమోదయోగ్యమైన లైంగిక విద్యకు ఓ మెడికల్ ప్రొఫనల్గా మద్దతు తెలుపుతానని చెప్పారు. -
స్కూల్ క్యాంటిన్లలో చిరుతిళ్లు నిషేధించే యోచన
న్యూఢిల్లీ: పాఠశాలల్లో విద్యార్థుల ఆహార భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల క్యాంటిన్లలో అనారోగ్యమైన లేదా చిరుతిళ్లను నిషేధించాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ యోచిస్తున్నారు. పిల్లలకు ఈ విషయంపై అవగాహన కల్పించడంతో పాటు క్యాంటిన్లలో నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలతో మేనకా గాంధీ ఈ విషయంపై చర్చించనున్నారు. మధ్యాహ్న భోజన పథకం మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తుంది. -
నేడు YSR కాంగ్రెస్ శాసనసభ పక్షం భేటీ
-
మళ్లీ రాయల తెలంగాణ !