
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నేను ఒక అమ్మాయిని చిన్నప్పటి నుంచి (5వతరగతి నుంచి) లవ్ చేస్తున్నా. ఫస్ట్ ఆకర్షణ, ఇప్పుడు ప్రేమగా మారింది. నేను ప్రపోజ్ చేద్దామనుకున్నా. ఇంతలో మా అన్న(కజిన్) ప్రపోజ్ చేసేశాడు. వాడి ప్రపోజల్‌ను ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందట. ఆ విషయం తనే నాతో చెప్పింది. తనంటే నాకు చాలా ఇష్టం. చెప్పకుండా ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. చెప్పాలి తనకి, కానీ ఎలా చెప్పాలి. ప్లీజ్ మాస్టారూ.. కొంచెం ఫేవర్‌గా చెప్పండి. ప్లీజ్. – పూర్ణచంద్ర
‘సార్ ఈ ఆన్సర్ మీరు చెప్పకండి’ వై? ‘మీరు రఫ్‌గా చెబుతారు యంగ్ బాయ్ హర్ట్ అవుతాడు.’ నువ్వు అరటిపండు ఇచ్చినట్లు స్మూత్‌గా చెబుతావా నీలాంబరీ...? ‘మై డియర్ పూర్ణా.. అన్నయ్యను యాక్ థూ అనిందంటే మనం ఎంత చెప్పు...?’ అబ్బబ్బ! ఎంత స్మూత్‌గా చెబుతున్నావు. ఓహో.. ఆహా..! ‘మై డియర్ పూర్ణా.. అన్నయ్యను యాక్ థూ అన్న విషయం నీకే వచ్చి చెప్పిందంటే...’
అంటే...?
‘నిన్ను పీక్ థూ అంటుందని కన్ఫర్మ్..’అబ్బబ్బ ఎంత స్మూత్‌గా చెబుతున్నావు.. ఓహో.. ఆహా..!‘చెప్పి అందరి ముందు పీకించుకోవడం కంటే సైలెంట్‌గా లవ్ చేయ్యడం బెటర్..’అబ్బా... అరటిపండు వలిచి పెట్టినట్టు చెప్పావు కదా నీలాంబరీ... హాట్స్ ఆఫ్ టు యూ!‘మీరయితే ఎలా ఫేవర్‌గా చెబుతారు సార్?’ఏమి చెబుతా.. నువ్వు ఇచ్చిన ఆన్సర్ అమ్మాయికి చేరే లాగా చేస్తే.. అంతా హ్యాపీస్ అని చెబుతా!‘అంటే అమ్మాయి లవ్ డాక్టర్ చూస్తే అంతా సుఖాంతం...!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com