Priyadarshini Ram
-
కేస్ 99 పెద్ద విజయం సాధించాలి
‘‘ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన దౌర్జన్యానికి మానవ సంబంధాలే కారణమని అందరూ ఆలోచిన్తున్న సమయంలో వస్తున్న చిత్రం ‘కేస్ 99’. ఈ చిత్రంతో సమాజంలో జరిగే చెడును బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ప్రియదర్శిని రామ్‌గారు ఏ పనిచేసినా ప్రాణం పెట్టి చేస్తారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ప్రియదర్శిని రామ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కేస్ 99’. మెలోడ్రామా కంపెనీపై చిలుకూరి కీర్తి, గౌతమ్‌రెడ్డి, వివేక్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బోయపాటి శ్రీను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని రామ్ మాట్లాడుతూ– ‘‘మంచి మనసున్న వ్యక్తి బోయపాటి శ్రీను. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజా¯Œ లాంటి ఓటీటీలో విడుదలవుతున్న వాటిలో పదికి ఏడు సినిమాలు క్రైమ్ థ్రిల్లర్లే ఉంటున్నాయి. ఎందుకంటే సమాజంలో ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టే ఉంటున్నాయి. వాటన్నింటినీ నేను పరిష్కరించలేను కానీ నా వంతుగా చక్కని సినిమా తీయాలనిపించింది. కొత్త రక్తంతో వస్తున్న యువ నిర్మాతలు గౌతమ్, కీర్తీ, వివేక్‌లకు చాలా మంచి సినిమా తీశానని నేను మాట ఇస్తున్నా’’ అన్నారు. తిరువీర్, అనువర్ణ, నిహాల్ కోదాటి, అజయ్ ఖతుర్వార్, అపరాజిత తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: టి. సురేంద్ర రెడ్డి, సంగీతం: ఆషిక్ అరుణ్. -
విభిన్న కథాంశంతో ప్రియదర్శిని రామ్ 'కేస్ 99'
సాక్షి , హైదరాబాద్ : సాక్షి టీవీ సీఈవోగా , ఫ్యామిలీ ఫీచర్స్ ఎడిటర్‌గా, లవ్ డాక్టర్‌గా మనకు సుపరిచితులయిన ప్రియదర్శిని రామ్ మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాస్, మనోడు లాంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించి రామ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మనోడు సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డుల్లో స్ఫెషల్ జ్యరీ నందీ అవార్డు కూడా రామ్ సొంతం చేసుకున్నారు. తాజాగా హత్యలు, బలవన్మరణాలు, కిడ్నాప్‌లు,అత్యాచారాలను వెనక ఉన్న హ్యూమన్ ఎమోషన్ కీపాయింట్ ఆధారంగా చేసుకొని ప్రియదర్శిని రామ్ 'కేస్ 99' అనే ఇన్వస్టిగేషన్ డ్రామాను తెరకెక్కించారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారులో ఓఆర్ఆర్లు ఏర్పడ్డాకా సిటీ అంచుల్లో భూ తగాదాలు, దందాలు, మాఫియా పేరిట జరుగుతున్న నేరాలను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా 'కేస్ 99' సినిమాకు సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్‌ను ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను శనివారం రిలీజ్ చేయనున్నారు. 115 నిమిషాల నిడివి ఉన్న కేస్ 99 సినిమా దీపావళికి సందడి చేయనుందని ఫిలింనగర్లో టాక్. తిరువీర్, అనువర్ణ, నిహాల్, అజయ్, అపరాజిత, అశోక్ రావు, విజయ్ గోపరాజు, క్రిష్ రాజ్, మనోజ్ ముత్యం, నితిన్ ప్రసన్న, ప్రియదర్శిని రామ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని కీర్తి చిలుకూరి, గౌతమ్ రెడ్డి, వివేక్ రెడ్డి నిర్మిస్తుండగా, ఆషిక్ అరుణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
జగన్ మాటే ప్రమాణం
ముప్పై ఐదేళ్ల వయసులో.. నల్లకాలువ దగ్గర జగన్ ఒక మాట ఇచ్చాడు. తన తండ్రి వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదారుస్తానని!ఆ మాట మీద నిలబడకపోయుంటే..జగన్‌పై ఇన్ని కక్ష సాధింపులు ఉండేవి కాదు. ఇన్ని కేసులు ఉండేవి కాదు. ఆ కుటుంబానికి ఇన్ని వేధింపులు ఉండేవి కాదు.అయినా మాట మీద నిలబడ్డాడు. ఏ కష్టమొచ్చినా మాట నిలబెట్టుకున్నాడు. విలువలకు కట్టుబడి ఉన్నాడు. వై.ఎస్.రాజశేఖరరెడ్డికి గానీ, జగన్‌కి గానీమాటే ప్రమాణం. ‘‘నాన్న గానీ, అన్న గానీ మాట ఇవ్వడం అంటే ప్రమాణం చెయ్యడమే’’ ననిపశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోప్రియదర్శిని రామ్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోవై.ఎస్. షర్మిల స్పష్టం చేశారు. రామ్: చాలా కాలం తర్వాత మళ్లీ జగన్ అన్న బాణంలా దూసుకుంటూ వచ్చారు. ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తోంది? షర్మిల: ఇట్స్ గుడ్. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అన్నది మీ ప్రశ్న అయితే.. బేసిక్‌గా అన్న నేను కష్టపడకూడదు అనుకుంటాడు. నాన్న ఉన్నప్పుడు కూడా నేను కష్టపడకూడదు అనుకునేవాడు. నా టెన్త్ అయిపోయిన తర్వాత నాన్నలా డాక్టర్ అవ్వాలని చాలా మంది ఒత్తిడి చేశారు. కానీ డాక్టర్ అయితే చాలా కష్టపడాలి అని నాన్న ఒప్పుకోలేదు. నేను కష్టపడకూడదని ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు రావాల్సి వచ్చింది ఎందుకంటే.. ఒకప్పుడు నాన్న ఎంతగానో ప్రేమించిన రాష్ట్రమిది. ఒకప్పుడు కళకళలాడిన రాష్ట్రాన్ని ఇప్పుడు ఈ దుస్థితిలో చూస్తే నాన్న కూతురిగానే కాదు, సామాన్యురాలిగా కూడా గుండె బరువు ఎక్కుతుంది. కనుక ఇప్పుడు రాకపోతే, ఇప్పుడు చెప్పకపోతే, ఈ ఎన్నికల సందర్భంలో ప్రజల దృష్టికి తీసుకురాకపోతే అభివృద్ధిలో మళ్లీ 25 ఏళ్లు వెనక్కు వెళ్తాం అని నాకే అనిపించింది. రామ్: జగన్ అన్న బాణం అని సంబోధించినా కూడా నాన్నతోనే పోల్చుకుంటున్నారు? ఆ గాయం ఇంకా మానినట్లు లేదు! షర్మిల: నాన్న పోయిన గాయం ఎప్పటికీ మానదు. నాకు, అమ్మకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకూ ఎప్పటికీ మానదనే నేను అనుకుంటున్నాను. కానీ, సూర్యుడు అస్తమిస్తే మళ్లీ ఉదయిస్తాడు. అదే ఆశ అదే జీవితాన్ని నడిపిస్తుంది. మళ్లీ రాజన్న రాజ్యం రావాలి. మళ్లీ ప్రజలు సంతోషంగా ఉండాలి. ఉండగలిగితే అదే తృప్తి. రామ్: చాలా సుదీర్ఘమైన ప్రయాణం. నాన్నగారిని మీరు పోగొట్టుకుని ఈ సెప్టెంబర్‌కు పదేళ్లు కాబోతోంది. జగన్ గారి ప్రస్థానం అక్కడి నుంచి.. ఇట్స్ బీన్ ఏ లాంగ్ హార్డ్ జర్నీ! షర్మిల: ఈ పదేళ్లు నిజంగానే టెస్టింగ్ పీరియడ్. నాన్న ఉన్నప్పుడు ఏ రోజూ మాకు కష్టం తెలియనివ్వలేదు. నాన్నే పెద్ద కొండలా అడ్డు నిలబడినట్టు.. మాకు ఏ కష్టమూ అనిపించలేదు. నాన్న చనిపోయినప్పుడు 700 మందికి పైగా నాన్న లేడన్న బాధ భరించలేక, నిజం జీర్ణించుకోలేక చనిపోయారు. ఒకవేళ మాకంటే నాన్నను వాళ్లే ఎక్కువగా ప్రేమించారా అనిపించేది. మేం ఒక కుటుంబంగా కూర్చున్నప్పుడు ప్రతి కుటుంబానికి వెళ్లాలి, పరామర్శించాలి, నాన్నను అంతగా ప్రేమించారు కదా, మన కృతజ్ఞత తెలుపుకోవాలి అనుకున్నాం. ఆ తర్వాత అన్న నల్లమలకు వెళ్లడం జరిగింది. లక్షల మంది ముందర మాటివ్వడం జరిగింది. మాటిచ్చినప్పుడు మాకు తెలియలేదు. మా నాన్న కోసం మేము చేయాలనుకున్న పరామర్శకు ఇంకొకరి సమ్మతి.. సోనియా గాంధీ గారి పర్మిషన్ అవసరం అని మాకు అనిపించలేదు. కాంగ్రెస్ వాళ్లు ‘వీలులేదు మేం పర్మిషన్ ఇవ్వం’ అన్నారు. ఆ తర్వాత మేం అపాయింట్మెంట్స్ అడిగాం. లెటర్స్ రాశాం. ఫోన్లు చేశాం. ఆ తర్వాత ఎప్పుడో అపాయింట్మెంట్ ఇచ్చారు. అమ్మ, నేను, అన్నా వెళ్లి కలిశాం. కలసినప్పుడు సోనియాగాంధీ గారేమో అందర్నీ ఒకచోటుకి పిలిచి ఒకటేసారి అవ్వజేయండీ అన్నారు. ‘‘అలా కాదమ్మా, నాన్న చనిపోయినప్పుడు మీరు మా ఇంటికి వచ్చి పరామర్శించారు. అదే పద్ధతి. అదే సంప్రదాయం. మేమే వాళ్ల ఇంటికి వెళ్లాలి. మేం మాట ఇచ్చాం’’ అని వాళ్లకు ఎంత చెప్పినా అర్థం కాలేదు. ఒప్పించలేక వచ్చేశాం. కాంగ్రెస్ వాళ్లు వచ్చి, వాళ్ల మాట వింటే సెంట్రల్ మినిస్ట్రీ ఇస్తాం అన్నారు. టెర్మ్ అయిపోయాక ముఖ్యమంత్రిని కూడా చేస్తాం అన్నారు. వాళ్ల మాట వినకపోతే కేసులు కూడా పెడతాం అని బెదిరించారు. ఆ తర్వాత ప్రేయర్ రూమ్‌లో మేం అంతా కూర్చున్నప్పుడు అన్న అన్నాడు. ‘‘మనకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మనం ఇచ్చిన మాట మర్చిపోయి వాళ్లు చెప్పినట్టు వింటే పదవులు ఇస్తామంటున్నారు. రెండు మనకు కష్టమైనా మనని ఇబ్బంది పెట్టినా కూడా మన మాట నిలబెట్టుకుంటే ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాళ్లం అవుతాం. నాకైతే నాన్న బాటలో, ఇచ్చిన మాట మీద నిలబడాలని ఉంది. పరామర్శకు పోవాలనే ఉంది’’ అని అన్నాడు. అమ్మేమో.. ‘‘లేదు నాన్నా.. చాలా కష్టపడతావు’’ అని చెప్పింది. ‘‘లేదమ్మా ఇదే కరెక్టు’’ అని అమ్మను ఒప్పించాడు. ‘‘మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే తండ్రికి తగ్గ కొడుకుని అనిపించుకోలేను నేను’’ అన్నాడు. ఆ తర్వాత ఓదార్పు యాత్ర చేశాడు. రెండు రోజులకే కేసులు పెట్టారు. బయటకు వచ్చాం. అన్నను జైల్లో కూడా పెట్టారు. ఆ పీరియడ్ కూడా చాలా కష్టంగా అనిపించింది. అసలు ఏం అర్థం కాలేదు. ఊపిరి ఆడనట్టు అయిపోయింది. ఇంటికి నాన్న తర్వాత అన్న పెద్ద. అలాంటిది అన్నను తీసుకెళ్లి జైల్లో పెట్టడం అంటే మమ్మల్ని అనాథను చేసినట్టు. సోనియా గాంధీగారు కూడా భర్తను పోగొట్టుకున్నారు. తనకూ ఓ కొడుకు ఉన్నాడు. తన కొడుకుని జైల్లో పెడితే ఎలా ఉండేదో, విజయమ్మగారి కొడుకుని జైల్లో పెడితే కూడా అలాగే ఉంటుందని కనీసం ఆలోచించలేకపోయారు. రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చారు రాజశేఖరరెడ్డిగారు. ఆ కృతజ్ఞత కూడా ఉన్నట్టు అనిపించలేదు. మానవత్వం ఉన్నట్టు కూడా కనిపించలేదు. ఎన్ని చేసినా మేం ఓర్చుకున్నాం. ఆ తర్వాత నేను పాదయాత్ర చేయాల్సి వచ్చింది. దేవుడి దయ వల్ల అన్న బయటకు వచ్చాడు. పదహారు నెలల తర్వాత! ఆ తర్వాత మీకు తెలుసు అన్న ఎంత కష్టపడ్డాడో. ఎలక్షన్ వచ్చింది. చాలా మైనర్ మార్జిన్‌తో తెలుగుదేశం పార్టీకి కోటీ 35 లక్షల ఓట్లు వస్తే వైఎస్ఆర్సీపీకి కోటీ 30 లక్షల ఓట్లు వచ్చాయి. మైనర్ మార్జిన్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అప్పుడు కూడా అన్న బాధపడలేదు. అప్పుడు కూడా అన్న చెప్పింది ఒకటే. ‘‘నిలబెట్టుకోలేని వాగ్దానాలు ఇచ్చి అధికారంలో ఉండడం కన్నా ఇచ్చిన మాట మీద నిలబడి విశ్వసనీయత, విలువలు కలిగినవాడిగా అపోజిషన్‌లో ఉన్నా’’ అన్నాడు. ఈ ఐదు ఏళ్లు కష్టపడ్డాడు. రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా కోసం చేయని ప్రయత్నం లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో రోజుల తరబడి నిరాహార దీక్ష చేశాడు. బంద్‌లు, రాస్తారోకోలు.. ఆఖరికి వైసీపీ ఎంపీలందరూ కూడా రాజీనామాలు చేసి పదవీ త్యాగం చేశారు. ఆ తర్వాత అన్న పాదయాత్ర చేశారు... 3,500 కిలోమీటర్లు. చాలా దూరం, చాలా కష్టం. ప్రజల కష్టం విన్నాడు. తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. రామ్: మీరు చేసిన పాదయాత్రకు, జగన్‌గారు చేసిన పాదయాత్రకు వ్యత్యాసం ఏంటి? షర్మిల: నేను చేసిన పాదయాత్ర.. వైఎస్ఆర్ కుటుంబం ప్రజలకు ఎప్పుడూ అండగానే ఉంటుంది. అందుబాటులోనే ఉంటుంది. ఎన్ని కష్టాలొచ్చినా కూడా అవైలబుల్గా ఉంటుంది అని ఒక ధైర్యం నింపడంకోసం చేసింది. జగన్ అన్న చేసిన పాదయాత్ర.. మార్పు కోసం పోరాటం చేయాలి, నేను మీకు అండగా నిలబడతాను అని ధైర్యం చెప్పడానికి, భరోసా నింపడానికి చేసింది. మనమందరం కలసి మార్పుని సాధించుకుందాం అని చెప్పడం కోసం చేసిన పాదయాత్ర. రామ్: అంత కొద్ది మార్జిన్‌తో టీడీపీ ప్రభుత్వం రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఆ తర్వాత జగన్‌గారు.. ప్రజలు అబద్ధపు వాగ్దానాల కంటే కూడా విశ్వసనీయతను నమ్మడంతో ప్రజల తరఫున మళ్లీ పోరాటం మొదలుపెట్టారు. ఈ ఐదేళ్ల కాలంలో చంద్రబాబుగారి పాలన ఎలా ఉందని అనుకుంటున్నారు? షర్మిల: ఈ ఐదేళ్ల కాలంలో చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ప్రతి విషయంలోనూ విఫలం అయ్యారు. అన్నింటికంటే ముఖ్యం మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్. బీజేపీతో పొత్తు పెట్టుకొని నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేస్తూ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించుకోకపోవడం చంద్రబాబుగారి గ్రేటెస్ట్ ఫెయిల్యూర్. హోదా వద్దూ, ప్యాకేజీలతోనే తనకు కమీషన్లు వస్తాయి అనుకుని కేవలం డబ్బుల కోసం ప్రజలను ముంచేశాడు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టేశాడు. కేవలం తన స్వార్థం కోసం. నాకు చాలా అనుభవం ఉంది. రాజధానిని కట్టేస్తాను అని చెప్పారు. కానీ ఒక్క ఫ్లై ఓవర్ కట్టలేదు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు. కేంద్ర ప్రభుత్వమేమో రూ. 2,500 కోట్లు ఇచ్చాం కొత్త రాష్ట్రం కోసం అంటుంది. ఆ డబ్బంతా ఏమైనట్టు? రాజధాని విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. పోలవరంలో కూడా అంతే. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్ట్ అది. ఆయనను ఎవరు తీసుకోమన్నారు. ఆ తర్వాత పర్మిషన్లు ఇవ్వడం లేదని సాకులు చెబితే అసలు ముందు మిమ్మల్ని ఎవరు తీసుకోమన్నారు. 15 వేల కోట్ల ప్రాజెక్ట్‌ను కమీషన్ల కోసం 60 వేల కోట్లకు పెంచారు. అంత భారీగా బడ్జెట్ పెంచాల్సిన అవసరం లేదు. ఆ పెద్ద విషయాలన్నీ పక్కన పెడితే రైతులకు రుణమాఫీ అని వాగ్దానం చేశారు. మొత్తం రైతుల రుణం 85 వేల కోట్లు ఉంది ఆ రోజు. దాన్ని కాస్తా కమిటీ వేసి, సాకులు చూపించి 24 వేల కోట్లకు కుదించి, అది కూడా ఇంతవరకూ ఇవ్వలేదు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు. అది కూడా ఒక్క రూపాయి మాఫీ చేయలేదు. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అన్నారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులను తొలగించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తాం అన్నారు. ఇలా ప్రతి విషయంలోనూ ఫెయిల్ అయ్యారు. చేశానని చెప్పుకోడానికి ఒక్కటీ లేకపోయినా, నేను ఇది చేశాను, అది చేశాను అంటున్నారు. ‘మాట నిలబెట్టుకున్నాను కనుక నాకు ఓట్లు వేయండి’ అని చెప్పే ధైర్యం మాత్రం లేదు చంద్రబాబు గారికి. ఎంతసేపు జగన్మోహన్రెడ్డి గారిని తిట్టడం, ఎంతసేపున్నా అబద్ధపు హామీలు ఇవ్వడం. అదే చెబుతుంది కదా. ప్రజలకు ఆయనేమీ చేయలేదని. షర్మిలను ఇంటర్వ్యూ చేస్తున్న ప్రియదర్శిని రామ్ రామ్: పొత్తుల విషయం.. బీజేపీతో పొత్తులోఉండి, గెలిచి నాలుగున్నరేళ్ల తర్వాత దీన్ని వదిలేసి అటు తెలంగాణాకు వెళ్లి కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసి.. ఈ మధ్యలో టీఆర్ఎస్ను కూడా పొత్తుకు అడిగారని..! షర్మిల: ఏదైనా చేస్తాడు చంద్రబాబుగారు. ఎవ్వరితో అయినా పొత్తు పెట్టుకుంటాడు. ఫారుక్ అబ్దుల్లా ఎవరండీ? మమతా బెనర్జీ ఎవరు? ఏం అవసరం? రామ్: చంద్రబాబు నాయుడు మాయమాటల వల్ల ఈ ఎన్నికల్లో కూడా ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందని అనుకుంటున్నారా? షర్మిల: ఒకరు ఇంకొకర్ని ఒకసారి మోసం చేయొచ్చు. కానీ అందర్నీ అన్నిసార్లు మోసం చేయడం అసాధ్యం. ప్రజలు 5 ఏళ్లు చంద్రబాబుగారి పాలన చూశారు. ఏం డెలివర్ చేశారో వాళ్లకు తెలుసు. రైతులు మోసపోయారు. మహిళలు మోసపోయారు. విద్యార్థులు మోసపోయారు. యువకులు మోసపోయారు. బీసీలు, దళితులు, ఇలా అన్ని వర్గాల వారు మోసపోయారు. చంద్రబాబుగారు మోసం చేసేవాడని, మాట మీద నిలబడని వాడని ప్రజలకు అర్థం అయిందని నేను అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్లినా అదే చెబుతున్నాను. ఈసారి మోసపోయే చాన్స్ లేదని నేననుకుంటున్నాను. రామ్: జగన్‌గారిని ఒక బలమైన ప్రతిపక్షనేతగా చూశారు. ముఖ్యమంత్రి అయితే అతని పాలన ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? షర్మిల: జగన్ గారిని ప్రతిపక్షనేతగా కంటే కూడా ముందే చూశాం. ప్రజలు జగన్ గారిని దాదాపు పదేళ్లుగా చూస్తూనే ఉన్నారు. నాన్న చనిపోయినప్పుడు ఎంత ధైర్యంగా నిలబడ్డాడో చూశారు. ఓదార్పుకు ఇచ్చిన మాట కోసం.. సోనియా గాంధీగారు ఆరోజుల్లో గ్రేట్ ఫోర్స్.. అంతటి ఫోర్స్‌నీ ఎదిరించారు. ఎదురు నిలబడ్డారు. ఇచ్చిన మాటే ముఖ్యం అని నిలబడ్డారు. ఓదార్పు యాత్ర చేశాడు. కేసులు పెట్టినా భయపడలేదు. జైలుకు వెళ్లినా భయపడలేదు. ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా చూశాం. ఇక ప్రత్యేక హోదా కోసం జగన్ అన్న చేసిన ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. జగన్‌గారు అంత పోరాటం చేసుండకపోతే చంద్రబాబుగారు ఈ పాటికి ఆ ఉద్యమాన్ని చంపేసుండేవారు. ఈ రోజు ప్రత్యేక హోదా బతికి ఉందంటే జగన్‌గారి వల్లనే. చంద్రబాబు నాయుడుగారు యుటర్న్ తీసుకొని మళ్లీ హోదా కావాలి అంటున్నారు. అంటే అది కేవలం జగన్‌గారి వల్ల. ప్రతిపక్షనేతగా ఎంత సమర్థవంతంగా చేశాడో చూశాం. ముఖ్యమంత్రిగా కూడా చాలా సమర్థవంతంగా, తపనతో మనసున్నవాడిగా నాన్నలా చేస్తాడు అనుకోవడంలో, అనడంలో నాకు ఏ మాత్రం అనుమానంలేదు. రాజశేఖరరెడ్డిగారికి తగిన కొడుకు అనిపించుకుంటాడు. రామ్: బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని, కాసేపు టీఆర్ఎస్తోఉందని అంటున్నారు. షర్మిల: బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేసింది చంద్రబాబుగారు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టింది ఆయన. ఇప్పుడు మాకు బీజేపీతో పొత్తు ఉందనడంలో అసలు అర్ధమే లేదు. మాకు బీజేపీతో పొత్తు ఉంటే జగన్‌గారి కేసులన్నీ మాఫీ చేయించుకునేవారు కాదా? దేర్ ఈజ్ నథింగ్ టు రీడ్ బిట్వీన్ ది లైన్స్. అసలు లాజిక్ లేదు. టీఆర్ఎస్తో పొత్తుకోసం వెంపర్లాడింది చంద్రబాబుగారు. హరికృష్ణగారి మృతదేహం పక్కన ఉందనే ఇంగితం కూడా లేకుండా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలనుకుంది చంద్రబాబుగారు. టీఆర్ఎస్తో పొత్తు అని ఆయన అంటే అయిపోతుందా? ప్రజలు గమనిస్తున్నారు. పొత్తుల కోసం వెంపర్లాడింది ఎప్పుడూ చంద్రబాబే. జగన్‌గారు మొదటి రోజు నుండి సింగిల్‌గానే పోరాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సింగిల్‌గానే బయటకు వచ్చారు. సింగిల్‌గానే వైఎస్ఆర్ పార్టీ స్థాపించారు. ఆరోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఎవ్వరితోనూ పొత్తులు లేవు. మాకు అవసరం కూడా లేదు. మా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో ద్రోహం చేసింది. రాష్ట్రాన్ని విభజించిన వాళ్లు అనుకుంటే ప్రత్యేక హోదా కూడా ఆ రోజే ఇచ్చి ఉండచ్చు. ఆ రోజే పోలవరం ఇచ్చేసి ఉండచ్చు. ఆ రోజే రాజధాని కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చి ఉండచ్చు. అంత అన్యాయంగా విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ. అంత అన్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తే బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్పినా కూడా ఇవ్వకుండా వాళ్లూ మనకు అంతే అన్యాయం చేశారు. మాకు ఎవ్వరితోనూ పొత్తులు లేవు. ఆ అవసరం కూడా లేదు. రామ్: ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యేకహోదా ఇస్తాను అంటోంది? షర్మిల: ఇచ్చే మనసే ఉంటే ముందే ఇచ్చే ఉండొచ్చు కదా అన్నది నా పాయింట్. ఇచ్చేవాళ్లే అయితే విభజన చేసిందే వాళ్లు కదా. పేపర్లు రాసేదే వారు కదా. చట్టాలు చేసింది వాళ్లు కదా. ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు అంటున్నాను నేను. ఆ రోజు ఏమైంది మీ తెలివి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఎందుకు చేయలేదు. మీకు చిత్తశుద్ధి అప్పుడు లేనప్పుడు ఇప్పుడు ఉంది అని చెబుతుంటే ఎలా నమ్మడం. రామ్: జగన్‌గారి ప్రయాణంలో చాలా ముఖ్యమైన ఘట్టం. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయన మీద జరిగిన దాడి. దాన్ని చంద్రబాబునాయుడు ప్రభుత్వం నీరుగార్చి ఇంకోలా మాట్లాడటం, కించపరచడం..! షర్మిల: జగన్మోహన్రెడ్డి గారిమీద హత్యాప్రయత్నం చాలా ప్లాన్డ్గా జరిగింది. ఎందుకంటే కత్తి ఉన్నది ఒకరి చేతిలో అయితే.. ఆ కుట్రను పన్నింది ఇంకొకరు. కుట్ర పన్నిన వారు నిజమైన నేరస్తులు. కత్తి పట్టినవాడికి డబ్బులు ఇచ్చారు. వాళ్ల ఊరిలో స్థలాలు, ఇళ్లు ఇచ్చారు. టీడీపీ వారి క్యాంటీన్ ఎయిర్‌పోర్ట్‌లో ఉంటే అక్కడ ఉద్యోగం ఇచ్చారు. కత్తిని లోపలికి తెప్పించారు. సీసీ కెమెరాలను బంద్ చేశారు. ఆ వ్యక్తి నేను వైసీపీ అభిమానిని, మీ ఫ్యాన్ అని చెప్పి మెడమీద ఎటాక్ చేయబోయాడు. అప్పుడు జగన్ అన్న చేసిందల్లా... ఇలా భుజం ఎత్తి వెనక్కి వెళ్లడం. అది భుజంపై తగిలింది. ఎంత లోతుగా తెగిందంటే కత్తి అక్కడే ఉండిపోయింది. రామ్: భుజం ఎత్తకపోయుంటే..!! షర్మిల: భుజం ఎత్తకపోతే నరం తెగేది. నరం తెగితే రక్తం ఆగకుండా కారేది. ఆపాలని ప్రయత్నిస్తే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలిగి ఉండేది. ప్రాణం పోయి ఉండేది. అంత సీరియస్‌గా ఉన్న దాన్ని వీరు హేళన చేస్తున్నారంటే అది రాక్షస ఆనందం. ఒకవేళ లోకేశ్‌కే మెడమీద తగిలి ఉంటే అప్పుడు చంద్రబాబునాయుడుకి తెలిసేది. ఈ చిన్న కోడి కత్తి ఏం చేస్తుంది అంటున్నారంటే.. ఏం అంటామండీ.. దిగజారుడు రాజకీయం కాకపోతే చంద్రబాబుగారిది! రామ్: నవరత్నాలు మూడేళ్ల ముందే ప్రకటించారు మీ అన్నయ్యగారు. వాటిని పట్టుకుని రీ ప్యాకేజ్ చేసి కొంచెం ప్రజల్లోకి పంపించి ఇన్ఫ్లుయన్స్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. దాని వల్ల మీకు నష్టమే కదా. షర్మిల: కాపీ చేయడం చంద్రబాబుగారికి ముందునుంచి అలవాటు. ప్రజల కోసం ఏవైనా పథకాలు ఉన్నాయి అంటే అవి ఆయన నిజమైన ఆలోచనలై ఉండి ఉండవు. ప్రజలకు చూపించే పథకాలు అన్ని కాపీ కొట్టిన పథకాలే. రాజశేఖరరెడ్డిగారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే... బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికీ పనికిరాదని చంద్రబాబుగారు హేళన చేశాడు. ఉచిత విద్యుత్తు అయినా, ఆరోగ్యశ్రీ అయినా, రుణమాఫీ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, శాచురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే ఆలోచన అయినా.. అన్నీ రాజశేఖరరెడ్డిగారి పథకాలు. ఆయన అద్భుతంగా అమలు చేసి చూపించిన పథకాలు. ఆయన బతికి ఉంటే... ఈ రోజు వరకూ ఈ పథకాలు అమలు అవుతుండేవి. అలాంటి పథకాలను కాపీ కొట్టాలని ఈ ఐదేళ్లలో చంద్రబాబు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. రాజశేఖరరెడ్డిగారు క్లాసులో ముందు బెంచ్‌లో కూర్చొని పథకాలను రాస్తుంటే చంద్రబాబుగారు వెనకాల బెంచ్‌లో కూర్చొని కాపీ కొట్టాలని ప్రయత్నించారు. ఆఖరికి కాపీ కొట్టే విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు. ఈయన అదే క్లాసులో కూర్చొంటే జగన్మోహన్రెడ్డిగారు ప్రమోట్ అయి ఆ క్లాసుకు వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డిగారు ముందు బెంచ్లోకూర్చొని ఉన్నారు. మళ్లీ జగన్మోహన్రెడ్డిగారి వెనక బెంచ్‌లో కూర్చొని, జగన్మోహన్రెడ్డిగారి పథకాలను మళ్లీ కాపీ కొట్టాలని చూస్తున్నారు. మళ్లీ ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే చంద్రబాబుగారికి పాస్ అయ్యే క్వాలిఫికేషన్ లేదు. రామ్: అంత కచ్చితంగా ఎలా చెబుతున్నారు.. జగన్‌గారి పథకాలను చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్లలేరు అని? షర్మిల: ఫెయిల్ అవుతాడని ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే పథకాలను కాపీ కొట్టవచ్చు కానీ క్యారెక్టర్‌ను ఎవరూ కాపీ కొట్టలేరు. చంద్రబాబుగారు మాయ చేసో, మసి పూసో మోసంతోనే మతలబులు పెట్టుకుని, పొత్తు పెట్టుకున్న పార్టీతోనే మళ్లీ ఛీ కొట్టించుకుని అధికారంలో కూర్చోవడానికి ఎన్నో అవకాశవాద రాజకీయాలు చేశారు. అది చంద్రబాబు క్యారెక్టర్. ఇంకోవైపు జగన్‌గారు.. ఇచ్చిన ఓదార్పు అనే మాట కోసం రాజ్యాభిలాషనే వదులుకుని సోనియాగాంధీలాంటి వారిని కూడా ఎదిరించి నిలబడ్డాడు. అదీ క్యారెక్టర్ అంటే. అదీ కరేజ్ అంటే. అదీ పౌరుషం అంటే. అదీ రోషం అంటే. చంద్రబాబుగారిలా అధికారం కోసం నిలబెట్టుకోలేని వాగ్దాలను ఇవ్వలేదు. చంద్రబాబుగారిలా ఇంకొక పార్టీలో గెలిచిన వారిని తన పార్టీలో చేర్చుకోలేదు. ఆ రోజు మా వెనకాల 18 మంది ఎమ్మెల్యేలు వచ్చారంటే.. కాంగ్రెస్ పార్టీలో వారి చేత రాజీనామాలు చేయించి మళ్లీ ఎన్నికలు వస్తే మళ్లీ నిల్చోబెట్టి అన్న జైలులో ఉన్నా కూడా నేను, అమ్మ తిరిగి గెలిపించుకున్నాం. అదీ జగన్మోహన్రెడ్డిగారి లీడర్షిప్. అదీ జగన్మోహన్రెడ్డిగారి క్యారెక్టర్. అసలు.. జగన్మోహన్రెడ్డి గారికి, చంద్రబాబునాయుడుగారికి పోలికే లేదు. పురుషుల్లో పుణ్యపురుషులు వేరయా అన్నారు. చంద్రబాబుగారు విల్ నెవర్ క్యాచ్ అప్ ఇట్. నిప్పు నిప్పే. తుప్పు తుప్పే. రామ్: మీ కుటుంబంలో చాలామందిని రాజకీయాల వల్ల పోగొట్టుకున్నారు. ఆ భయం, ఆ బాధను ఎలా మేనేజ్ చేస్తున్నారు? షర్మిల: బాధ అనిపిస్తోంది. బంధువులను, బంధాలను పోగొట్టుకున్నాం. చంద్రబాబు గారు.. మా తాత రాజారెడ్డిగారు మా నాన్న రాజశేఖరరెడ్డిగారికి చాలా బలమని.. బాంబ్‌బ్లాస్ట్‌లో ఆయన్ను చంపించేశారు. తెలుగుదేశం పార్టీవాళ్లు చేశారని తెలుసు. వారికి ఆశ్రయం ఇచ్చింది చంద్రబాబుగారే. ఆ తర్వాతే రాజశేఖరరెడ్డిగారు సీఎం అయ్యారు. ఆయన మనసులో పగ కన్నా ప్రేమే ఎక్కువగా ఉంది. తర్వాత కూడా నాన్నను చంద్రబాబు మళ్లీ అసెంబ్లీకి ఎలా వస్తావో? చూస్తాను అన్నారు. నాన్న చనిపోకముందు రోజు! అందులోనూ చంద్రబాబుగారి హస్తం ఉందేమో. ఆ తర్వాత మా చిన్నాన్నను కూడా దారుణంగా చంపేశారు. అన్నైనా.. నాన్నయినా నేర్పించింది పగకన్నా.. ప్రగతే ముఖ్యం అని. పగ కన్నా ప్రేమే ముఖ్యం అని. జీవితాన్ని పగలమీద వృథా చేయకూడదు. అదే జీవితాన్ని ప్రజాసేవకు ఉపయోగిస్తే మన జీవితం సార్థకం అవుతుంది. రామ్: దూషణలు జగన్‌గారి దగ్గర ఆగలేదు. మీ వ్యక్తిగత విషయాల గురించి కూడా రకరకాలుగా మాట్లాడారు. అవి మిమ్మల్ని డెస్ట్రాయ్ చేస్తున్నాయా? షర్మిల: అవి డెస్ట్రాయ్ అని కాదు. బాధ కలిగించాయి. ఎప్పుడో 2014 ఎన్నికలకు ముందు నా పై దుష్ప్రచారం మొదలుపెట్టారు. అప్పట్లో చిల్లర పుకార్లు అని పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు కూడా దగ్గరి వాళ్లు సోషల్ మీడియాలో చాలా పోస్టింగ్‌లు ఉన్నాయని చెబుతూనే ఉన్నారు. ఈ ఎన్నికలు దగ్గరకి వచ్చేసరికి మళ్లీ మొదలుపెట్టారు. ఇది ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ఎవరో చేస్తున్నారని అర్థం అయ్యింది. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు చేయగలరు అంటే తెలుగుదేశం పార్టీ అని అర్థం అయ్యింది. తెలుగుదేశం పార్టీవాళ్లే చేస్తుంటే వాళ్లు ఎన్నికలు దగ్గరికి వచ్చే సరికి ఇంకా నాపై ఈ దుష్ప్రచారం ఎక్కువే చేస్తారు తప్ప తక్కువ చేయరని అర్థం అయ్యింది. కనుక వ్యక్తిగతంగా నాకు దీని గురించి మాట్లాడటం ఇబ్బందికరమైనప్పటికీ, బయటకు వచ్చి పోలీస్ కేసు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు పోలీసు వారు చెబుతున్నదాన్ని బట్టి హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఎన్బీకే అనే బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ నందమూరి బాలకృష్ణ గారిది అని, ఆ బిల్డింగ్ నుంచే నాపై దుష్ప్రచారం జరిగిందని, ఆ ఐపీ అడ్రస్‌లను బట్టి పోలీసులు చెబుతున్నారు. బాలకృష్ణగారి బిల్డింగ్ నుంచి జరిగినవే కాకుండా...ఈ వెబ్సైట్లు.. యూట్యూబ్‌లు, ప్రో టీడీపీ అంటే... టీడీపీని ప్రమోట్ చేసేవి, ప్రత్యర్థులను కించపరిచేవి అవి కూడా నాపై కామెంట్స్ చేశాయి. సో.. ఈ పోస్టింగ్‌లు అన్నీ బాలకృష్ణగారి బిల్డింగ్ నుంచి ప్రో–టీడీపీ సైట్స్ నుంచి జరిగాయి అంటే.. బాలకృష్ణగారికి దీంతో సంబంధం లేదు అని నేను ఎలా అనుకోను? సంబంధం ఉండటమే కాదు. స్వయంగా బాలకృష్ణగారే నాపై ఈ నీచమైన పుకార్లు పుట్టించారని, ప్రచారం చేశారని నేను విశ్వసిస్తున్నాను. బాలకృష్ణగారు ఇంత దిగజారుడుతనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే సమాధానం చెప్పాలి. నాన్న బతికి ఉన్నప్పుడు బాలకృష్ణగారికి వ్యక్తిగతంగా చాలా పెద్ద సమస్య వచ్చినప్పుడు నాన్న చాలా పెద్ద సాయం చేశారు. నాకు తెలుసు. బాలకృష్ణగారికి కూడా తెలుసు. అయినా.. వైఎస్సార్ కూతురికి... అంటే తనకు మేలు చేసినవారి కూతురికి ఇంత ద్రోహం చేశారు అంటే ఏమి అనుకోవాలి. కృతజ్ఞత లేదు అనుకోవాలి. బాలకృష్ణగారికి ఆడపిల్లలు ఉన్నారట. ఇతరుల పిల్లలపై ఇంత నీచమైన పుకార్లను ప్రచారం చేశారు అంటే ఏమి అంటాం. వ్యక్తిత్వం. విలువలు లేవు అంటాం. బాలకృష్ణగారి స్థాయిలో ఇది జరిగింది అంటే లోకేశ్‌కి చంద్రబాబుగారికి కూడా ఈ పాపంలో భాగం ఉందనే నమ్మాలి. తెలుగుదేశంపార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత దిగజారిపోయారో అర్థమైపోతుంది. నాకే కాదు ఏ మహిళకైన తన గౌరవం తనకు చాలా ముఖ్యం. అంతకుమించిన ఆభరణం లేదు. దాని మీద దెబ్బకొట్టడం అంటే.. అంత నీచం అంత దిగజారుడుతనం ఇంకొకటి ఉండదు. తొడ కొట్టినవాడు మగాడు అయిపోడు. మంచి మనసు ఉన్నవాడే అసలైన మగాడు. మహిళను గౌరవించనివాడు మనిషి కాదు. మృగం. ఈ మృగాలకు క్షమాపణ చెప్పే గుణం ఉంటుందని నేను అనుకోను. దేవుడు ఉన్నాడు. ఏదో ఒకరోజు వీరి పాపం పండుతుంది. ఏదో ఒక రూపంలో శిక్ష పడుతుంది. ఒక మహిళ గౌరవాన్ని పణంగా పెటై్టనా సరే అధికారం దక్కించుకోవాలనుకోవడం హేయం. అలాంటివారు చంద్రబాబుగారు, బాలకృష్ణగారు. అంటే ఒక మహిళ గౌరవం మీద తొక్కి నడుచుకుంటూ వెళ్లి సింహాసనం మీద కూర్చోవాలి అనుకోవడం దుర్మార్గం. ఇది చాలా దిగజారుడుతనం. రామ్: అమ్మకు ఎన్నో పరీక్షలు....నాన్న చనిపోయినప్పుడు ఓ ఇంటర్వ్యూలో నాతో అన్నారు. ‘రాజశేఖరరెడ్డిని అంతగా ప్రేమించి, ఆయన చనిపోతే గుండె ఆగి చనిపోయారు. నేను ఇంకా బతికే ఉన్నాను’ అని కుమిలి కుమిలి ఏడ్చారు. ఇవాళ మళ్లీ మొత్తం జర్నీలో...ప్రతిసారి మీ కోసం కానీ, జగన్ కోసం కానీ ఆవిడ కష్టపడుతూనే ఉన్నారు. పోరాడుతూనే ఉన్నారు. ఎండల్లో తిరుగుతూనే ఉన్నారు. షర్మిల: నేను, అన్న చిన్నవాళ్లం. తిరిగాం. తిరుగుతున్నాం అంటే అర్థం ఉంది. కానీ అమ్మ ఈ వయసులో ఇంత ఎండలో తిరుగుతున్నారు అంటే మాకు బాధగానే ఉంది. కానీ అమ్మా.. నాన్న ఉన్నప్పుడు కూడా నాన్న అంతగా ప్రేమించే ఆంధ్రరాష్ట్ర ప్రజలకోసం రోజూ ప్రార్థన చేసేది. నాన్న పోయిన తర్వాత అమ్మ ప్రార్థన మానలేదు.. ఈరోజుæ వరకు. మన రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలని, ఒకప్పుడు రాజశేఖరరెడ్డిగారి హయాంలో అంత సుభిక్షంగా ఉన్న రాష్ట్రానికి ఇంత దుస్థితి వచ్చిందని మళ్లీ ఆంధ్రరాష్ట్రానికి ఆ గ్లోరీ రావాలని నేటికీ ప్రే చేస్తూనే ఉన్నారు. తన కొడుకు ముఖ్యమంత్రి అయితే.. ప్రజలకు తండ్రి చేసిన మంచి పనులన్నీ తనూ చేస్తాడనీ, అందుకే ప్రజల్ని ఒక అవకాశం ఇమ్మని కోరడానికి తనే స్వయంగా ప్రజల్లోకి వచ్చింది. తన కొడుక్కి అవకాశం ఇవ్వమని కోరుతోంది. ►ఒక మహిళ గౌరవాన్ని పణంగా పెటై్టనా సరే అధికారం దక్కించుకోవాలనుకోవడం హేయం. ఒక మహిళ గౌరవం మీద తొక్కి నడుచుకుంటూ వెళ్లి సింహాసనం మీద కూర్చోవాలి అనుకోవడం దుర్మార్గం. ఇది చాలా దిగజారుడుతనం. ►చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ప్రతి విషయంలోనూ విఫలం అయ్యారు. అన్నింటికంటే ముఖ్యం స్పెషల్ కేటగిరీ స్టేటస్. బీజేపీతో పొత్తు పెట్టుకొని, నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేస్తూ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించుకోలేక పోవడం చంద్రబాబుగారి గ్రేటెస్ట్ ఫెయిల్యూర్. ►రైతులు మోసపోయారు. విద్యార్థులు మోసపోయారు. బీసీలు, దళితులు.. ఇలా అన్ని వర్గాల వారు మోసపోయారు. చంద్రబాబుగారు మోసం చేసేవాడని, మాట మీద నిలబడని వాడని ప్రజలకు అర్థమైపోయింది. ►‘మాట నిలబెట్టుకున్నాను కనుక నాకు ఓట్లు వేయండి’ అని అడిగే ధైర్యం లేదు చంద్రబాబు గారికి. ఎంతసేపూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, నిరంతరం అబద్ధపు హామీలు ఇవ్వడం... ఇదే చెబుతోంది కదా.. ఈ ఐదేళ్లలో ప్రజలకు ఆయనేమీ చేయలేదని! -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! నేనొక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నాను. మాది టూ సైడ్ లవ్. మా సమస్య ఏంటంటే... మా ఇద్దరిదీ సేమ్ ఏజ్. ఈ కారణంతో మా పేరెంట్స్ మా పెళ్లికి ఒప్పుకుంటారో లేదోనని చాలా భయంగా ఉంది. నేను లేకపోతే తను, తను లేకపోతే నేను ఉండలేమన్నయ్యా! కాబట్టి మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. –ప్రవీణ్ తెల్ల రంగు డై దొరుకుతుందన్నా.. పూసేసుకో...!! ‘ఇదేమైనా సినిమానా సార్? తెల్లరంగు పూసుకుని నటించడానికి...!? ఇది లైఫ్ సార్...!! పుట్టిన డేట్.. టైమ్.. ఇయర్.. ఇవన్నీ రంగుతో మార్చలేం సార్!’ రంగుతో మార్చలేనిది... ఆలోచనతో మార్చవచ్చు నీలూ..! ‘అంటే లవ్‌కి ఏజ్.. గేజ్.. అంతగా అడ్డు రావంటారు. చక్కగా ఒకే ఏజ్ కాబట్టి.. ఒకరు పెద్ద, ఒకరు చిన్న అనిపించదు. ఇద్దరూ ఈక్వల్‌గా ఫీల్ అవ్వచ్చు. మ్యారీడ్ లైఫ్ – ఫ్రెండ్లీ లైఫ్ అనిపిస్తుంది కదా సార్?’ అవును నీలూ! పేరెంట్స్‌కి కూడా ఇదే చెప్పి కన్విన్స్ చెయ్యాలి!! ‘చెబుతాడు సార్! ప్రవీణ్ చాలా స్మార్ట్ సార్..!! వెరీ బ్రేవ్ సార్..!! చెబుతాడు... నాకు తెలుసు..!!’ ఆల్ ద బెస్ట్ ప్రవీణ్!! - ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. కానీ ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పలేదు. చెప్పాలంటే చాలా భయంగా ఉంది. దీనికి సొల్యూషన్ చెప్పండి సార్ ప్లీజ్. – వెంకట రమణ ఇవాళ మంచి రోజు..! ‘ఎందుకు సార్ తిట్లు తింటానికా?’ అంత నెగెటివ్‌గా ఆలోచిస్తే వ్యవహారం ముందుకు సాగేనా నీలూ?? ‘ఏంటి సార్..! ముందుకు సాగేది..!? అమ్మాయి లాగుద్ది. అమ్మాయి అమ్మానాన్నా లాగుతారు. వ్యవహారం సాగదు. అందరూ పట్టుకుని పీకితే వెంకటరమణ సాగిపోతాడు. అనవసరంగా డేంజర్ ఐడియాలు ఇవ్వకండి. అమాయకుడు మిమ్మల్ని నమ్మి అమ్మాయికి సీరియస్‌గా ప్రపోజ్ చేస్తే అనూహ్యమైన పరిణామాలు ఉండొచ్చు.’ ఏంటి నీలూ..? నువ్వు కూడా అధైర్యాన్ని పిండి పోస్తున్నావు. ఇంకా ప్రేమికులు ఏం కావాలి? వాళ్ల ప్రేమ ఏం కావాలి??? ‘ఏం అవ్వక్కర్లేదు సార్! తన్నులు తిని కుంటోళ్లు, గుడ్డోళ్లు, వంకరటింకరోళ్లు కాకుండా ఉంటే చాలు సార్ మన లవర్లు!’ నీవు చెప్పేది కూడా ఒక రకమైన లవ్వే నీలూ. యాక్చువల్లీ చాలా గొప్ప లవ్ నీలూ..! ‘నేనేమన్నాను సార్? అసలు నేను ఎలాంటి లవ్ గురించి చెప్పాను సార్?’ సైలెంట్ లవ్ నీలూ. మౌనరాగం నీలూ.. మాటలతో చెప్పలేనంత ప్రేమ నీలూ..చాలా డీప్ లవ్ నీలూ.. చాలా హెవీ లవ్ నీలూ. అది చెబితే చిక్కదనం తగ్గిపోద్ది. బరువు తగ్గి లైట్ అయిపోతుంది. పంచుకుంటే పూర్ అయిపోతుంది. వెంకటరమణ సైలెంట్ వర్గ చరిత్రకెక్కడమే రైట్ నీలూ! - ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నాకొక అమ్మాయితో పరిచయం అయ్యింది. ఒక రాంగ్ మెసేజ్‌లతో కొన్ని రోజులు మాటల తర్వాత తను నాకు ప్రపోజ్ చేసింది. మా కులాలు వేరు కావడంతో వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని తనంటే నాకిష్టమున్నా ‘నో’ అని చెప్పాను. కానీ తనే నన్ను ఒప్పించింది. ఒకరంటే ఒకరికి ప్రాణమిచ్చేంత ప్రేమ ఏర్పడింది. ఆరు నెలల వరకు నాతో బాగానే ఉంది. అప్పుడప్పుడు మన విషయం మా ఇంట్లో తెలిసిందని చెప్పేది. పెళ్ళి చేసుకుందామంటే ఇప్పుడే వద్దని చెప్పేది. ఒక రోజు ఏడుస్తూ ఫోన్ చేసి ‘మా అన్నయ్య నన్ను కొట్టాడు. నితో మాట్లాడొద్దంటున్నాడు’ అని చెప్పింది. బయటికెళ్లి పెళ్లి చేసుకుందామంటే.. ‘మా నాన్న చనిపోతారు’ అని చెప్పింది. ఇప్పటికి నాకు అర్థం కానీ విషయం ఏమిటంటే.. తనకు ముందు తెలియదా!? మొదట్లో నేను చెప్పింది కూడా అదే కదా!? ఇది జరిగి సంవత్సరం పైనే అవుతోంది. చనిపోదామనుకున్నా. ఎందుకంటే తప్పు తనది కాదు సార్ నాదే. కానీ.. నా తల్లిదండ్రులు నా మీద పెంచుకున్న ఆశల కోసం చస్తూ బతుకుతున్నా. నేను మీకు పెద్ద అభిమానిని సార్ నాకు ఒక సలహా ఇవ్వండి. తనని మర్చిపోలేకపోతున్నా. తనని మర్చిపోయే మార్గం చెప్పండి సార్. – సంతోష్ ప్రేమించినప్పుడు కలిసుండాలని ఉండదా? అమ్మాయి అదే అనుకుంది. ఎలా అయినా పేరెంట్స్ ఒప్పుకుంటారని. అన్నయ్య కొట్టి మరీ వారిస్తే కూడా నీకు ఫోన్ చేసి విషయం చెప్పింది. తండ్రి ప్రాణం వదిలేస్తానంటే... మనం దూరంగా ఉండటమే నయమన్నది. ఎంత మంచి అమ్మాయి సంతోష్..! నువ్వు బాధపడకూడదని నీకు తోడుగా ఉంది. నాన్న కష్టపడకూడదని ప్రాణం లాంటి నిన్ను దూరముంచింది. తన మనస్తాపాన్ని నువ్వు అర్థం చేసుకుని దూరంగా ఉండటం మంచి నిర్ణయం. ‘ఏంటి సార్..? అప్పుడు నుంచి చూస్తున్నాను. అందరిని దూరం..దూరం..దూరం... అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు చాలా శాడిస్ట్ అయిపోతున్నారు సార్? సంతోష్‌ని పోయి అమ్మాయి పేరెంట్స్‌తో మాట్లాడమని చెప్పచ్చు కదా! దగ్గర చెయ్యొచ్చు కదా! ఎట్ ద మోస్ట్ అవమానిస్తారు. లేదంటే రెండు చివాట్లు పెడతారు. ఇంకా కోపమొస్తే అమ్మాయి వాళ్ల అన్న రెండు పీకుతాడు సార్!’ కానీ అంతా అల్లరైపోదా నీలూ!? ఆ కుటుంబం కుమిలిపోదా నీలూ? ఆ అమ్మాయి లైఫ్ పూర్తిగా స్పాయిల్ అయిపోదా నీలూ..? ప్రేమలో అంత స్వార్థం పనికిరాదు నీలూ..!! అమ్మాయి చల్లగా ఉండాలంటే... కుటుంబం చక్కగా ఉండాలంటే..... ‘సార్..! మీరిచ్చిన ఆన్సర్ అమ్మాయి పేరెంట్స్‌కి చూపిస్తే బెస్ట్ సార్..! పేరెంట్స్ బాధపడరు. సంతోష్ దెబ్బలు తినడు. మంచి ఎఫర్ట్ చేశాడు కాబట్టి ఆ తర్వాత అమ్మాయిని మరచిపోవడంలో ప్రాబ్లమ్ ఉండదు!’ - ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! మా ఫ్రెండ్ బైక్ తీసుకొని ఒక అమ్మాయిని పడగొట్టాను. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. మా లవ్ చిగురించి ఇప్పటికి రెండు సంవత్సరాలు పూరై్తంది. నేను రోజూ కాలేజ్ దగ్గరికి వెళ్లి తనని కలుస్తాను. తనని చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. అంత గొప్ప ప్రేమ నాది. కానీ మా ఫ్రెండ్స్ ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదంటున్నాడు. నాకూ నమ్మబుద్ధి కావట్లేదు. ఆ అమ్మాయి నన్ను వదిలేస్తుందని నాకు డౌట్‌గా ఉంది. వాళ్ల అన్నయ్య నన్ను చాలాసార్లు ‘మా చెల్లి వెంట తిరగవద్దు’ అని బెదిరించాడు. ఆ అమ్మాయి మాత్రం నాతో ఉండడానికే ఇష్టపడుతోంది. నేను ఏ పనీ చేయను, ఖాళీగా తిరుగుతూ ఉంటాను. ఆ అమ్మాయి నాతో ఉంటుందా? ఉండదా? మీరే చెప్పండి. – మధు బైక్ వెనక్కి ఇవ్వక తప్పదు...! అమ్మాయి నిన్ను వదలక మానదు...!! అరువు బైక్‌లు, అరువు ప్రేమలు వర్కౌట్ కావు...!!! మనలో వర్త్ ఉంటే.. వాకింగ్ చేస్తున్న అమ్మాయి టాకింగ్ చేస్తుంది...!!! ‘అబ్బా సార్..!! ఏం ప్రాస కలిపారు. వాకినా టాకచ్చని.. బైకినా లైకకపోవచ్చని..!’ - ప్రియదర్శిని రామ్, లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హలో అన్నయ్యా. నేను ఒక అమ్మాయిని టూ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నాను. నెలరోజుల క్రితం ప్రపోజ్ చేశాను. తనకు ఇష్టం లేదని చెప్పింది. మా అమ్మను బాధ పెట్టడం ఇష్టం లేదంటోంది. రీసెంట్గా మళ్లీ ప్రపోజ్ చేశాను. అప్పుడు ‘నేను ఎవరినీ లవ్ చెయ్యను’ అంటోంది. తనకి నేనంటే ఇష్టం ఉందని తన ప్రవర్తనలో తెలుస్తుంది కానీ, ఎప్పుడూ ఏదో ఒక రీజన్ చెప్పి వెళ్లిపోతుంది. మొన్న తనే కాల్ చేసి.. ‘నువ్వు బాధపడకు, నీకు నాకంటే బెటర్ అమ్మాయి దొరుకుతుంది’ అని చెప్పింది. నేను జాబ్ తెచ్చుకుని మీ మమ్మీని ఒప్పిస్తాను అని చెబితే.. ‘నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. తనని బాధపెట్టను’ అంటోంది. ఏం చెయ్యాలో అసలు అర్థం కావట్లేదు. దయచేసి మంచి సలహా ఇవ్వండి. – పవన్ ‘నీకు తాను చెప్పినట్లే మంచి అమ్మాయి దొరుకుతుంది..! ఎంత రఫ్ అయిపోయారు సార్ మీరు.. పవన్ ఏమో ఫుల్‌గా ఫీల్ అయిపోయి మీకు రాస్తే... మీరు హార్ట్ లేకుండా రఫ్ ఆన్సర్ ఇస్తున్నారు..! బాధలో ఉన్న ప్రేమికుడికి కొంచెం చల్లటి నీళ్లు ఇవ్వాల్సింది.! మీరేంటి సార్ పెట్రోల్ పోస్తున్నారు?’ అమ్మాయే చెప్పింది కదా నీలూ..! తన కంటే మంచి అమ్మాయి దొరుకుతుందని!? ‘ఏమో తప్పించుకోవడానికి చెబుతోందేమో..!’ ఆ మాట నేను చెబితే ‘రఫ్ అని.. గిఫ్ అని’ నన్ను అంటావు కదా నీలూ.. అమ్మాయికి నచ్చకో.. కష్టం చెప్పలేకో.. సంస్కారం ఉన్న నా చెల్లెలు కాబట్టి తిట్టకుండా.. ప్రేమగా దీవిస్తుంది. ‘ఇంకో మంచి అమ్మాయి దొరుకుతుందని భలే చెబుతారు సార్..! కానీ పవన్‌కైతే ఆ అమ్మాయే కావాలి!’ అయితే చాలా సింపుల్..! అమ్మాయి వాళ్ల అమ్మకు... ‘పవన్ నచ్చితే.. అమ్మాయికి కూడా నచ్చుతాడు కదా సార్???’ అబ్బబ్బబ్బబ్బా.. నీలూ యు ఆర్ టూ గుడ్! - ప్రియదర్శిని రామ్ , లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నేను మా బావని లవ్ చేస్తున్నాను. తనకి కూడా నేనంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకుందామనుకున్నాం. కానీ మా బావ వాళ్ల అమ్మ.. నాతో మాట్లాడినా, నన్ను పెళ్లి చేసుకున్నా చచ్చిపోతాన ంటోంది. దాంతో తను వాళ్ల అమ్మ మాటను కాదనలేక, ఆమెని ఒప్పించలేక చాలా బాధపడుతున్నాడు. ‘మా అమ్మకు ఇష్టంలేకుండా నిన్ను పెళ్లి చేసుకోలేను, ఒకవేళ చేసుకున్నా నిన్ను హ్యాపీగా ఉంచలేను. సారీ’ అంటున్నాడు. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. అందుకే మీకు రాస్తున్నాను. దయచేసి మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా! – యువర్ సిస్టర్ మై డియర్ సిస్టర్...! నిన్ను ప్రేమించే ముందు ఎంకమ్మ వాళ్ల అమ్మ పర్మిషన్ తీసుకున్నాడా? ‘ఏంటి సార్..? పిచ్చి క్వశ్చన్..? అబ్బాయిలంటే మగాళ్లు సార్..! వాళ్లకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు! వాళ్లు ఒక్కసారి డిసైడ్ చేసుకుంటే... దేవుడు దిగివచ్చినా....mపూజారి రిక్వెస్ట్ చేసినా... మొత్తం హోల్ విలేజ్ కాదన్నా... ఎవరు చెప్పినా వినడు ఈ మగాడు... నాన్న చెప్పినా.. అత్త చెప్పినా.. బాబాయి చెప్పినా.. పిన్ని చెప్పినా...అక్క చెప్పినా.. చెల్లి చెప్పినా.... సార్ అర్థమయ్యింది సార్..! ఎవడు చెప్పినా వినని మగాడు మెగా లవర్..! కానీ ఈ కేసులో అమ్మ మాట వింటున్నాడు కదా సార్..??’ అంతా ఎక్స్క్యూజెస్ నీలూ...! వాడు అమ్మాయిని మోసం చెయ్యాలని డిసైడ్ చేసుకున్నాడు. అందుకే.. అమ్మకొట్టుద్ది, నాన్న తిడతాడని స్టోరీస్ చెబుతున్నాడు. వెంటనే నా బంగారు సిస్టర్ ఈ డర్టీ ఫెలోని మర్చిపోయి హ్యాపీగా జీవించడం మంచిది..! ‘మంచిది..!!’ - ప్రియదర్శిని రామ్ , లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నేను త్రీ ఇయర్స్‌గా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. మొదట్లో ఒకసారి ఫోన్ చేస్తే.. ‘నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు’ అంది. వాళ్ల ఫ్రెండ్స్‌తో బాగా చాట్ చేసేది. నా మెసేజ్‌కి మాత్రం లేట్‌గా రిప్లై ఇచ్చేది. దాంతో నేను లైట్ తీసుకున్నాను. కానీ ఆ తర్వాత తను నన్ను చూసి నవ్వడం, నావైపు చూసేది. దాంతో చాట్ చెయ్యడం, మాట్లాడటం మొదలుపెట్టాను. ఇప్పుడు కూడా సేమ్. ‘నా మెసేజ్‌కి లేట్ రిప్లై ఏంటి?’ అని అడిగితే ‘నా ఇష్టం’ అని చెప్పి బ్లాక్ చేస్తోంది. మళ్లీ నేను బతిమిలాడితేనే అన్‌బ్లాక్ చేస్తోంది. తన కోసం నా ఫ్రెండ్స్, నా డ్రీమ్స్ అన్నీ వదిలేశాను. కానీ తను మాత్రం నన్ను అర్థం చేసుకోదు. ‘నాకు మీ ఫ్యామిలీ నచ్చదు. మీ ఫ్యామిలీకి నన్ను ఇవ్వరు. నా మీద హోప్స్ పెట్టుకోకు’ అంటోంది. వాళ్ల ఇల్లు మా ఇంటి ముందే. తనని చూసిన ప్రతిసారీ ఏడుపు వస్తోంది. చచ్చిపోవాలనిపిస్తోంది. ప్లీజ్ అన్నయ్యా! మంచి సలహా ఇవ్వండి. – సన్నీ చెప్పింది కదా సన్నీ ‘ఫీలింగ్ లేదని’..!? ‘మరి ఎందుకు సార్ చూడటం, నవ్వడం, కవ్వించడం..?’ నీలూ... నీలూ... నీలూ....! మార్నింగ్ లేచి సూర్యుడిని చూడరా?? ‘సూర్యుడి పేరు పెట్టారని సన్నీని చూస్తుందా సార్? మరీ వెటకారం ఎక్కువైపోయింది సార్ మీకు..! చెప్పేవాడికి అడిగేవాడు లోకువ సార్..! పాపం సన్నీని చూసింది, నవ్వింది, కవ్వింది.. ఇప్పుడు వద్దంది..!’ కవ్విందేంటి నీలూ?? ప్రాస కలిసిందని తెలుగును ఖూనీ చేస్తున్నావ్!? ‘సార్.. మీరు ప్రేమను ఖూనీ చేస్తున్నారు. సన్నీ సన్లైట్ని ఖూనీ చేస్తున్నారు. ఒక మెగా లవర్ హార్ట్‌ని ఖూనీ చేస్తున్నారు సార్!’ అది కాదు సన్నీ..! అమ్మాయికి మనమంటే ఇష్టం లేనప్పుడు.. ఊరికే వెంట పడి, నువ్వే కావాలని సాంగ్స్ సింగి..(పాడి..) మనం చీప్ కాకూడదని చెబుతున్నాను... ఆ అమ్మాయి మన ఫ్యామిలీ గురించి కూడా ఒకలాగ మాట్లాడింది.. మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి.. రెస్పెక్ట్ లేని చోట లవ్ ఉండదు. నేను నీ లవ్‌ని ఖూనీ చెయ్యడం లేదు..!! ‘అవును సార్.. మీరు సన్నీ ఆత్మాభిమానం ఖూనీ కాకుండా చూస్తున్నారు సార్!’ - ప్రియదర్శిని రామ్ , లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నాకో పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య బతికుండగానే నాకు నరకం చూపిస్తోంది. దయచేసి నన్నూ నా ప్రేమనూ మీరే కాపాడాలి. నేనొక అమ్మాయికి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మూడేళ్ల క్రితం నాకు ప్రపోజ్ చేసింది. అప్పటి నుంచి నాకు రోజూ ఫోన్ చేసేది. నేను మాట్లాడకపోతే చచ్చిపోతా అనేది. ‘‘ఏ క్షణమైతే నా నుంచి దూరమవుతావో ఆ క్షణమే నేను ప్రాణాలతో ఉండను’’ అనేది. తనకు ఫోన్ లేకుంటే కొనిచ్చాను. ఇదిలా ఉండగా నా ఫ్రెండ్ తన గురించి ఓ విషయం చెప్పాడు. ‘‘తనకి ఇంతకు ముందే ఒక లవర్ ఉండేవాడని. వాడితో ఇప్పటికీ ఫోన్లో మాట్లాడుతోంది’’ అని. నేను నమ్మలేదు. గమనిస్తే నిజమని తేలింది. దాంతో తనని ఒంటరిగా బయటికి వెళ్లొద్దని చెప్పాను. గొడవ పడ్డాను. చాలా కోపగించాను. ఆ మరుసటి రోజే నాకు ఫోన్ చేసి.. ‘‘సెల్ చార్జింగ్ లేదు, నా ఫ్రెండ్‌తో బ్యాటరీ పంపించు’ అంది. నేను కాస్త కోపంలో ఉండి పంపించలేదు. వారం రోజులు ఫోన్ చెయ్యడం మానేసింది. నిజంగానే చార్జింగ్ లేదేమోనని ఫ్రెండ్‌తో బ్యాటరీ పంపించాను. అయినా ఫోన్ రాలేదు. ఏమైందని తన ఫ్రెండ్‌ని అడిగితే తెలియదంటోంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. దయచేసి సలహా ఇవ్వండి అన్నయ్యా ప్లీజ్..! – అభిమాని నీవు లేక వీణ పలకలేనన్నది... నువ్వు లేక రాధ నిలువలేనన్నది...‘సార్...............................!!’ ఏమైంది నీలూ అంత గట్టిగా కేక వేశావు??? ‘లవ్ డాక్టర్‌కి లెటర్ రాస్తే డాక్టర్ చక్రవర్తి సినిమాలో పాట పాడతారేంటి సార్???????’ చూడు నీలూ నీ ‘అభిమాని’ ఒక్క క్షణం కూడా..... మాట్లాడకపోతే ఉండలేనన్నది... నువ్వు లేకపోతే లైఫ్ నడపలేనన్నది... నిన్ను చూడకపోతే ఐస్ ఓపెన్ చెయ్యలేనన్నది... ఫోన్ కొనివ్వకపోతే ‘టాక్’లేనన్నది.... సెకండ్ ఫ్రెండ్ లేకపోతే నీ విలువ తెలుసుకోలేనన్నది... వీడు లేని వీణా పలుకలేనన్నది... బ్యాటరీ లేక రాధ నిలువలేనన్నది... ఆ...ఆ...ఆ...ఆ...ఆ................ ‘అర్థమయ్యింది సార్..! అన్ని చెప్పిన అమ్మాయి వన్ వీక్ ‘టాక్’కుండా ఉందంటే మనోడికి బాగానే బటర్ పూసిందన్నమాట. ‘అభిమాని’ ఇంకొకరి ‘అభిమాని’ అయితే బెటర్ దెన్ దిస్ బటర్ అంటున్నారు కదా సార్?’ అబ్బబ్బబ్బబ్బా... నీలూ నువ్వు చాలా స్మార్ట్! - ప్రియదర్శిని రామ్ , లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ రామ్ అన్నయ్యా, నేను ఒక అమ్మాయిని 3 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాను. కొన్నిరోజులు చాలా హ్యాపీగా ఉన్నాం. సడెన్‌గా ఒకరోజు కాల్చేసి ‘మీ మమ్మీ మంచిది కాదు. చాలా బ్యాడ్ టాక్ వుంది. నీకు నాకు సెట్ కాదు’ అని చెప్పి మాట్లాడడం మానేసింది. నాకు మాత్రం తన మెమరీసే గుర్తొస్తున్నాయి. నరకం కనిపిస్తోంది. నేనేం చెయ్యాలో మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా, ప్లీజ్. – నితీష్ ఏమి నరకంరా నితీష్. అమ్మను అంత మాట అంటే ఇంకా హెల్ అని బెల్ కొడుతున్నావు. ఆ పొట్టను చింపుకునే పుట్టావు కదరా తండ్రీ. మూడేళ్ల ఫ్రెండు కోసం ముక్కోటి అమ్మలకు అమ్మ.. నీ బంగారు అమ్మను అంత మాట అంటే పౌరుషం రాకపోగా.. పిల్లకోసం బెంగపెట్టుకుంటావేంట్రా బడుద్ధాయి. మనస్సు ఇచ్చిన పిల్ల, జన్మ ఇచ్చిన తల్లికంటే ఎక్కువారా మొద్దబ్బాయి. వెంటనే అమ్మ కాళ్లకు నమస్కారం చేసి, ‘మమ్మీ యూ ఆర్ ద గ్రేటెస్ట్’ అని చెప్పి, ప్రాయశ్చిత్తం చేసుకోరా డింభకా! ‘సార్... మరి లవ్వో..!?!’ కొవ్వు తక్కువున్న పిల్లతో చేసుకోమను.. లవ్వు! - ప్రియదర్శిని రామ్ , లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నేను మా బావని లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. బట్ మా నాన్నకు మా పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే... మా బావ నాకంటే ముందు మా అక్కని లవ్ చేశాడు. అందుకే మా నాన్న నన్ను తనకిచ్చి పెళ్లి చెయ్యడానికి ఒప్పుకోవట్లేదు. నాన్నకి ఇష్టం లేకుండా నేను తనని పెళ్లి చేసుకోలేను. పైగా మా బావ మా అక్కని లవ్ చేశాడన్న విషయాన్ని నాదగ్గర దాచలేదు. ప్రపోజ్ చేసేటప్పుడే చెప్పాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి. మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – శ్రీభాను శ్రీ...! నీకు ఇంకా చెల్లెళ్లూ... కజిన్ సిస్టర్స్ ఉన్నారా తల్లీ..? ‘ఎందుకు సార్ అంత వెటకారం? ఏదో ముందు అక్కయ్యను ప్రేమించాడు. ఇప్పుడు చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు. అంత మాత్రాన శ్రీభానూకి ఇంకో సిస్టర్ ఉంటే... శ్రీభానుకి కూడా థాంక్యూ వెరీమచ్ చెప్పి... సిస్టర్స్‌కి లైన్ వేస్తాడనేగా మీ ఫీలింగ్?? అంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తారు సార్? లవ్ అంటే మీకు అంత లోకువా సార్? అసలు ఇంత చీప్‌గా ఎలా ఆలోచిస్తున్నారు సార్ మీరు? మీరు శ్రీభాను వాళ్ల డాడీ కంటే దుర్మార్గంగా చేస్తున్నారేంటి సార్? ప్లీజ్ రిమెంబర్ యు ఆర్ శ్రీభానూస్ బ్రదర్..! మిమ్మల్ని ఒక బ్రదర్‌గా రెస్పెక్ట్ చేసి మీ సలహా అడిగితే... ‘‘నీకు ఇంకా సిస్టర్స్ ఉన్నారా తల్లీ..?’’ అని జోకులు వేస్తారా? పోనీ వాడు తింగరోడు కావచ్చు. అక్కను చిక్కించుకోలేక చెల్లెల్ని లైన్లో పెట్టాడని అనుకోవచ్చు. చెల్లెల్ని వలలో వేసుకుని అక్క మీద రివెంజ్ తీర్చుకోవాలనే అనుకోవచ్చు. ఒక మేనిప్యులేటర్గా ఇంట్లోకి దూరడానికి చెల్లెల్ని తాళం చెవిగా వాడుకునే యూజ్లెస్ ఫెలో కావచ్చు. రేపు అల్లుడిగా అదే ఇంట్లో.. కాలు మీద కాలు వేసుకుని మామయ్యగారిని ఇన్సల్ట్ చెయ్యాలనే అనుకోవచ్చు. ఇవన్నీ మనకెందుకు సార్? అమ్మాయి చూసుకుంటుంది. మీరు బ్రదర్‌గా గివ్ అడ్వయిజ్ అండ్ టేక్ రెస్పెక్ట్ సార్!!’ అబ్బబ్బబ్బబ్బా.. నీలూ! యు ఆర్ టూ గుడ్ ఐ సే!! నీ మాటలు విని నాకు బుద్ధి వచ్చింది. శ్రీభానుకి వచ్చిందో లేదో చూద్దాం!! - ప్రియదర్శిని రామ్ , లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హలో లవ్ డాక్టర్ గారు..! ఎలా ఉన్నారు..? ఈ సమస్య నాది కాదు సార్, మా అన్నయ్యది. మా అన్నయ్య త్రీ ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. రీసెంట్గా ఆ అమ్మాయి మా అన్నయ్యకు ఓకే చెప్పిందట. ఆ విషయం తెలిసి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఉన్నట్టుండి ఏదో గొడవ జరిగింది. ‘రిలేషన్షిప్లో గొడవలు కామన్ కదా’ అని నేను వాళ్ల మధ్యకి వెళ్లలేదు. ఆ అమ్మాయి ఇప్పుడు మా అన్నయ్యకి బ్రేకప్ చెప్పేసిందట. ఏమైందని ఆరాతీస్తే... ‘నేను మా నాన్నకు మాటిచ్చాను, ఎవరినీ లవ్ చెయ్యనని’ అంటోంది. ‘మరి ఈ విషయం మొదట్లోనే చెబితే మా అన్నయ్య నిన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదుగా’ అని అడిగితే ఆ అమ్మాయి సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చెయ్యమంటారు సార్. మా అన్నయ్య ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. తను మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – నవ్య యూత్......!! మైండ్ నిలకడగా ఉండదు.....!! ఉండదు కాబట్టే ఎవరో ఒకరు నచ్చుతూ ఉంటారు....!! ఆ తర్వాత నిలకడ ఉండదు కాబట్టి వద్దనుకుంటారు....!! మళ్లీ కావాలనుకుంటారు....!! కొంతమంది మైండ్‌లో ఉన్నది చెప్పకుండా గేమ్స్ ఆడుతూ ఉంటారు...!! కానీ మీ అన్నయ్యను ప్రేమించిన అమ్మాయి గేమ్స్ ఆడటం లేదు..!! ‘ఏంటి సార్..!? నోటికొచ్చినట్లు చెబుతున్నారు..!??? ముందు లవ్వు అంది. ఇప్పుడు పో అంటోంది. దీనికంటే గేమ్స్ ఏముంటాయి సార్? మీరు ఆ అమ్మాయిని వెనకేసుకొస్తున్నారు. మీకు రాసింది కూడా అమ్మాయే అని గుర్తించడం లేదు. యు డూ జస్టిస్ టూ నవ్య సార్!’ చెప్పానుకదా నీలూ! అమ్మాయికి నవ్య వాళ్ల అన్నయ్య ఫ్రెండ్‌గా ఓకే అనిపించాడు. అందుకే త్రీ ఇయర్స్ ఏం కమిట్ కాలేదు. మనోడు ఉండలేక చాలా సెంటిమెంటల్ అయిపోయి.. ఆ అమ్మాయిని లవ్వులోకి దించాడు. ఆ అమ్మాయికి తన లవ్ గురించి తెలియదు. తనకి అబ్బాయి లవ్వే తెలుసు. ఆ అబ్బాయి లవ్వే తన లవ్ అనుకుంది. బుట్టలో పడింది. ఇప్పుడు మైండ్ ఓపెన్ అయ్యి తుర్రుమంది. ‘అంటే అబ్బాయిలు లవ్ గురించి ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు అంటారు!! వాళ్ల లవ్వే అమ్మాయిలు రిప్లెక్ట్ చేసి పుసుక్కున ఓకే చెప్పి, తర్వాత నిలకడగా ఆలోచించి టాటా–బైబై చెబుతురన్నమాట. అర్థమైందా నవ్యా..! అన్నయ్యకు చెప్పు లవ్ నాచురల్‌గా ఇద్దరికీ కలగాలి. ప్రెజర్ మంచిది కాదు అని. నెక్ట్స్ టైమ్ బెటర్ లక్!! కరెక్ట్‌గా చెప్పానా సార్?????’ అబ్బబ్బబ్బబ్బా.. నీలూ యూ ఆర్ గ్రేట్!!!!!! - ప్రియదర్శిని రామ్ , లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నేనొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి కూడా నా వంక చూసేది. అలా రోజూ గమనించాను. ఓ రోజు ధైర్యం చేసి తన ఫ్రెండ్ సహాయంతో తనకి లవ్ లెటర్ ఇప్పించాను. తను ఆ లెటర్ని మా అమ్మకు చూపించి, నన్ను తిట్టించింది. ఆ తర్వాత నుంచి తను నా వైపు కోపంగా చూస్తోంది. నన్ను చూడటం మాత్రం మానలేదు. ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఒకసారి నవ్వుతూ ఇంట్లోకి వెళ్లిపోయింది. అసలు నా గురించి తను ఏం అనుకుంటోందో అర్థం కావట్లేదు. తనని ఫస్ట్ టైమ్ ఒక జాతరలో చూశాను. అప్పుడు ఆ అమ్మాయి ఒకసారి నా వంక, మరోసారి పక్కకు ఫేస్ తిప్పింది. అసలు తన మనసు ఏంటో తెలియట్లేదు. నాకైతే వాళ్ల అమ్మని ‘మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను’ అని అడిగెయ్యాలని ఉంది . కానీ నాకు ఇంకా జాబ్ లేదు. జాబ్ లేకుండా అడిగితే ఏమని అడగాలి అన్నయ్యా, చెప్పండి ప్లీజ్! – కుమార్ అడుక్కో అన్నయ్యా..! అడుక్కో....!మనసారా అడుక్కో...!తనివితీరా అడుక్కో....!తడబడకుండా అడుక్కో....!వెనుకంజ వేయకుండా అడుక్కో....!నాన్‌స్టాప్‌గా అడుక్కో....!‘ఏమనుకున్నారు.. తన్నేమనుకున్నారు.. పిచ్చివాడనుకున్నారా.. ప్రేమ బిచ్చగాడనుకున్నారా.. ఏమనుకున్నారు..????????? ఏంటి సార్..!? బిచ్చగాడికి చెప్పినట్లు చెబుతున్నారు అడుక్కో...!అడుక్కో....!! అని. ఏంటి సార్..!? ఒక సిన్సియర్ ప్రేమికుడిని మీరు అంత చీప్‌గా చూస్తున్నారు..????’లవ్వాడినప్పుడు లేని సిగ్గు.. లవ్వు అడుక్కునేటప్పుడు ఎందుకు...?? ఛీ – పో అన్నప్పుడు లేని సిగ్గు.. తనే కావాలని అనుకున్నప్పుడు ఎందుకు?? ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి గిళ్లి అనుకున్నప్పుడు లేని సిగ్గు.. కాబోయే అత్తగారిని అడుక్కునేటప్పుడు ఎందుకు??? ఏమో అత్తగారికి నచ్చితే.. పెళ్లి చేసి, ఇల్లరికం ఉంచుకుని, రాజాలాగ చూసుకుంటారేమో..!?! మనమెందుకు అడ్డం చెప్పడం నీలూ????‘సార్!! పెళ్లీ అడుక్కుని.. ఇల్లరికమూ అడుక్కుని.. ఉద్యోగమూ అడుక్కుని.. అత్తగారి దగ్గర ఏం రెస్పెక్ట్ మిగులుతుంది సార్???’ఇవన్నీ అత్తని అడిగేముందు డిసైడ్ చేసుకోమను.. సొంత లెగ్స్ మీద స్టాండ్ అయ్యి పెళ్లికి అమ్మాయిని ఇవ్వమని అత్తగారిని డిమాండ్ చేసే పొజిషన్‌కి ముందు రమ్మను నీలూ!! ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
అన్నయ్యా.. చాలా పెద్ద ప్రాబ్లమ్..! నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. తను నాకు ఏడేళ్లుగా తెలుసు. మూడేళ్ల నుంచి లవ్ చేసుకుంటున్నాం. తను చాలా మంచిది. నన్ను బాగా చూసుకునేది. నాతో లవ్‌లో ఉంటూనే తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడేది. ఫ్రెండ్‌గా మాట్లాడుతుంటే నేను మొదట్లో వద్దని చెప్పలేదు. కానీ తర్వాత వాళ్లు లిమిట్స్ క్రాస్ చేశారు. దాంతో మాట్లాడొద్దని చెప్పాను. వినలేదు. పైగా ‘కేవలం ఫ్రెండ్‌గానే మాట్లాడుతున్నా’ అనేది. అడ్జెస్ట్ అవడానికి చాలా ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. అదే కారణంగా మా మధ్య చాలా గొడవలు జరిగాయి. ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. అయినా ఆ అమ్మాయి ‘నీకంటే వాడే ఎక్కువ’ అంది. అప్పుడు పేరెంట్స్ కోసం ఆలోచించాను. తనని మరిచిపోవాలని నిర్ణయించుకున్నాను. అయితే కొన్నిరోజులకి ఆ అమ్మాయి వాళ్ల కజిన్ నాకు మెసేజ్ చేసింది. మా బ్రేకప్ తర్వాత వాళ్లిద్దరూ కలిసి హ్యాపీగా ఉన్నారట. నాకు వాళ్లు హ్యాపీగా ఉండటం నచ్చలేదన్నయ్యా. అందుకే ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాను. ఇప్పుడు మళ్లీ తను నాతో లవ్‌లో ఉంది. నేను చేసింది కరెక్టా? రాంగా? చెప్పండి అన్నయ్యా..!? – విజయ్ ఎందుకిలా అయిపోయావు బ్రో...??? నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి..! ఉంది కూడా..!! కానీ కొంచెం మైండ్ దొబ్బింది...! లవ్ వల్ల మైండ్ రాంగ్ డైరెక్షన్లో మూవ్ అవుతోంది..! నువ్వు లైఫ్ కంటే ఎక్కువగా ప్రేమించావు..! అయినా అమ్మాయి రెస్పాండ్ కాలేదు..!! అదర్‌సైడ్ లవ్ కంటిన్యూ చేసింది..!! అప్పుడైనా విషయం అర్థం చేసుకుని ఈ లవ్ నుంచి ఎగ్జిట్ రూట్ కొట్టాల్సింది. కానీ రాంగ్ రూట్ తీసుకున్నావు.. అమ్మాయి మీద ప్రెజర్ పెట్టి లాగుతున్నావు. మొత్తం పెంట పెంట చేసుకుంటున్నావు..!! లవ్ నేచురల్‌గా ఉండాలి. ఫోర్స్డ్గా ఉండకూడదు..!! అలాంటి లవ్ నిలవదు..!! నీ లవ్ గ్రేట్..! దాన్ని షిట్ చేసుకోవద్దు..!! వదిలేసెయ్యి.. బీ ఎ హీరో. మైండ్ క్లియర్ చేసుకో...! లివ్ న్యూ లైఫ్.. అప్పుడు నువ్వే విజయ్..! నీదే విజయం..!! ‘కరెక్ట్‌గా చెప్పారు సార్..!! ఈ అడ్వయిజ్ ఫాలో అయిపో.. ఇదే నీకు బెస్ట్ రూట్ విజయ్!!’ - ప్రియదర్శిని రామ్ -
నన్నడగొద్దు ప్లీజ్
హలో రామ్ అన్నయ్యా..! నేను నా లైఫ్‌లో అసలు పెళ్లే చేసుకోవద్దనుకున్నాను. కానీ నా లైఫ్‌లోకి ఒక మంచి అబ్బాయి వచ్చాడు. తను నన్ను అర్థం చేసుకున్నట్లు ఈ ప్రపంచంలో ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. తను నాకు ప్రపోజ్ చేసినప్పుడు ‘మా పేరెంట్స్ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటా’ అని చెప్పాను. మేం ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అయితే ఇప్పుడు మా పేరెంట్స్ మా పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఎందుకని అడిగితే ‘కులాలు వేరు’ అంటున్నారు. తను ఇప్పుడు కెనడాలో జాబ్ చేస్తున్నాడు. వాళ్ల పేరెంట్స్‌కి మా గురించి అంతా తెలుసు. వాళ్ల పేరెంట్స్ వచ్చి మా పేరెంట్స్‌ని కన్విన్స్ చేసినా ఒప్పుకోవట్లేదు. నా లైఫ్‌లో తనని వదులుకోలేకపోతున్నాను. మా పేరెంట్స్ అయితే ‘లైఫ్‌లో మేం కావాలా? ఆ అబ్బాయి కావాలా?’ అని అడుగుతున్నారు. తనైతే ‘కెనడా వదిలి వచ్చి ఇక్కడ దగ్గరల్లోనే జాబ్ చూసుకుంటాను. మీ అమ్మాయిని నాకు ఇవ్వండి’ అని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు. అయినా సరే మా పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు అన్నయ్యా. ప్లీజ్.. మంచి సలహా ఇవ్వండి. – లలిత ప్రియమైన లలిత తల్లిదండ్రులకు సూపర్ లవ్..! లలిత సంతోషం కన్నా మనకేమైనా.. మరేమైనా కావాలా? కూతురుకంటే అపురూపంగా చూసుకునే అత్తమామలకంటే ఎక్కువ ఏం ఇవ్వగలం మన బిడ్డకు?? సహచరుడే కాదు.. స్నేహితుడిగా.. రక్షకుడిగా.. కాపాడుకునే అల్లుడికంటే ఏం ముఖ్యం??? మీరు అనుకుంటున్న సంప్రదాయాలు కూడా అవసరమే కానీ మీరిచ్చిన ప్రేమలో సగమైనా ఇవ్వగల భర్త దొరకడం ఎంత కష్టమో మీకు తెలియనిదా? లలితకు మిమ్మల్ని మించిన శ్రేయోభిలాషులు ఇంకెవరు ఉంటారు? మీతో చెప్పుకోలేక.. నాలాంటి ఒక అన్నయ్యకు చెప్పుకుంటుంది కానీ.. మీరు దగ్గరకు తీసుకుని ప్రేమగా మాట్లాడితే తన బాధ మీతోనే పంచుకుంటుంది కదా? ఒకపక్క అబ్బాయీ, వాడి తల్లిదండ్రులూ అమ్మాయిని స్వాగతిస్తున్నారు. లలిత సంస్కారవతి కాబట్టి.. మిమ్మల్ని అనంతంగా ప్రేమిస్తోంది కాబట్టి... మీ ఆరోగ్యం గురించి తపన చెందుతోంది కాబట్టి... మీకు కించిత్తు కష్టం కలగకూడదు కాబట్టి.. తానే బాధపడుతూ, మథనపడుతూ మీ గౌరవం కోసం, మీ క్షేమం కోసం తన ప్రేమను త్యాగం చేస్తోంది కదా??? ఇంటి పెద్దలుగా కాకుండా.. మీ బంగారుతల్లి అమ్మానాన్నలుగా ఆలోచించి, మంచి నిర్ణయం తీసుకోండి. లలిత సంతోషంగా ఉండేలా చూడండి..! సమాజంలో మార్పుకోసం ముందడుగు వెయ్యండి..!! దానికి మేమందరం సాక్షి!! - ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నేనంటే ఆ అమ్మాయికి ఇష్టముందో లేదో తెలుసుకోవడం ఎలా? ఆ అమ్మాయి పేరు మహాలక్ష్మి. మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం. నేను చూసినప్పుడల్లా నన్ను తనూ చూస్తోంది. అసలు ఆ అమ్మాయికి నా మీద ఇంట్రెస్ట్ ఉందా? లవ్ ప్రపోజ్ చేస్తే ఓకే చేస్తుందా? లేక ఫ్రెండ్షిప్ చెయ్యాలా? ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఇది ప్రేమో లేక ఆకర్షణో తెలుసుకోవడం ఎలా? ఒకవేళ నా ప్రపోజల్‌ని ఓకే చెయ్యకపోతే చదువు మీద దృష్టి పెట్టలేనేమోనని భయంగా ఉంది. ఏం చేస్తే బాగుంటుందో వీలైనంత త్వరగా చెప్పండి సార్. దగ్గరలో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, చదువుకుంటాను. దయచేసి మంచి సలహా ఇవ్వండి సార్! – మల్లికార్జున్ మల్లి.. మల్లి.. మల్లి..... ‘మళ్లీ మళ్లీ ప్రేమించాలా సార్?’ నీలూ..! మల్లి.. మల్లి.. మల్లి... ‘అమ్మాయి ఒప్పుకోకపోయినా మళ్లీ మళ్లీ ప్రేమిస్తూనే ఉండాలా సార్???’ అది కాదు నీలూ..! మల్లి.. మల్లి.. మల్లి... ఓహో! అర్థమయ్యింది సార్..! మల్లికార్జున్ పేరు చెబుతుంటే నత్తిగా అనిపిస్తుంది కదా సార్??? ఎక్కడ రాంగ్ అడ్వైజ్ ఇస్తే పాపం మల్లి.. మల్లి.. మల్లికార్జున్ డిప్రెస్ అయిపోతాడేమోనని భయంగా ఉంది కదా సార్?? మళ్లీ.. మళ్లీ.. మళ్లీ.. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిపోతాడేమోనని మీరు వర్రీడ్ కదా సార్?? మళ్లీ ప్రేమలో.. మళ్లీ కెరీర్లో.. మళ్లీ లైఫ్‌లో ఫెయిల్ అవ్వకూడదని ఆలోచిస్తున్నారు కదా సార్??? నేను సింపుల్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తాను సార్! చెప్పమంటారా????’ చె.. చె.. చె... ‘చెబుతా సార్..! ఈ క్వశ్చన్, ఆన్సర్ రెండూ అమ్మాయిని చదవమంటే పోలా???’ - ప్రియదర్శిని రామ్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని వన్ ఇయర్ నుంచి ట్రూగా లవ్ చేస్తున్నాను. తనూ నన్ను లవ్ చేస్తోంది. తనకోసం నేను చాలా వదులుకున్నాను. తనకి వాట్సాప్, ఫేస్బుక్లంటే ఇష్టం ఉండవని తెలిసి, వాటిని కూడా డిలిట్ చేశాను. ఎప్పుడూ ‘నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రపంచం’ అని చెబుతూ ఉంటుంది కానీ ఇంటికి వెళ్తే ఫోన్ చెయ్యదు. ఎక్కడైనా బయట కనిపిస్తే మాట్లాడదు. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందామని అడిగితే.. ‘మా ఇంట్లో అసలు ఒప్పుకోరు, అడిగినా వేస్ట్’ అని చెబుతోంది. నాకేమో తను కావాలి. కానీ తను నన్ను అర్థం చేసుకోవడం లేదు సార్! ఏం చెయ్యాలో మీరే చెప్పండి ప్లీజ్! – శ్రీ నీది ట్రూ లవ్ బ్రో...!! ‘సార్..! మరి అమ్మాయిది ఏం లవ్ సార్???????’ వాట్సాప్, ఫేస్బుక్ లాంటి లవ్..! ‘అంటే అంతా డిజిటల్..! నథింగ్ రియల్..!! అంటున్నారా సార్...?!’ జస్ట్ టైమ్‌పాస్ లవ్ నీలూ....!! ‘మరి శ్రీ... వాట్సాప్, ఫేస్‌బుక్‌లు డిలిట్ చేసేశాడు కదా సార్...! ఇప్పుడు ఎలా సార్????’ అమ్మాయిని కూడా మెమరీ నుంచి డిలిట్ చేయాలి నీలూ...! ‘ఏంటి సార్..! ఇవాళ అబ్బాయిలకి ఫేవర్‌గా మాట్లాడుతున్నారు.. మీకు సిస్టర్స్ మీద లవ్ తగ్గిందా సార్????’ అది కాదు నీలూ..! అమ్మాయికి శ్రీ అంతగా నచ్చలేదు..! ‘అంటే ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేసేలాంటి లవ్ అమ్మాయికి కలగలేదా సార్?’ కలగలేదు కాబట్టి... శ్రీ కూడా...... ‘టేక్ ఇట్ ఈజీ పాలసీ.. అంటారా సార్..!’ అని నవ్వింది నీలాంబరి! - ప్రియదర్శిని రామ్ , లవ్ డాక్టర్ -
ఈ పురస్కారం నాకు గర్వకారణం..
సాక్షి, హైదరాబాద్: ‘‘గత శనివారం సైరా షూటింగ్ చాలా ముమ్మరంగా జరుగుతుండటం వల్ల నేను అవార్డ్ ఫంక్షన్‌కు హాజరుకాలేకపోయాను. కానీ నా మీద ఎంతో అభిమానంతో ‘సాక్షి’ చైర్పర్సన్ భారతీగారు అవార్డుని నాకు అందజేయాలనుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డును అందజేయటానికి ‘సాక్షి’ సంస్థ ప్రతినిధులు పెద్దలు శ్రీ రామచంద్రమూర్తిగారు, సోదరుడు రామ్‌గారు వచ్చి కలవటం సంతోషంగా ఉంది’’అని నటుడు చిరంజీవి అన్నారు. ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్–2017’కు సంబంధించి బెస్ట్ హీరో అవార్డును చిరంజీవి స్వగృహంలో ఆయనకు బుధవారం అందజేసింది ‘సాక్షి’ మీడియా. ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, సాక్షి ఫీచర్స్ ఎడిటర్ ప్రియదర్శిని రామ్‌ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ..‘‘భారతీ గారు నాకు సోదరి లాంటి వారు. నా మీద ఎంతో అభిమానంతో అవార్డుతోపాటు ఓ చాక్లెట్ బాక్స్ పంపారు. ఇది ఆమె తియ్యని మనసుకు నిదర్శనం. ‘సాక్షి’ గ్రూప్ వారు గత నాలుగేళ్లుగా ఈ ఎక్స్‌లెన్స్ అవార్డులు ఇస్తున్నారు. గతంలో నేను కూడా ఈ అవార్డు వేడుకల్లో పాల్గొన్నాను. ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వాళ్లందరినీ గుర్తించి వారిని ఇలా ప్రోత్సహించటం చాలా గొప్ప విషయం. అవార్డు గ్రహీతలందరికీ నా అభినందనలు. అలాగే జీవిత సాఫల్య పురస్కారాన్ని స్వీకరించిన కృష్ణ, విజయనిర్మల గార్లకు, ఇదే అవార్డును స్వీకరించిన చుక్కా రామయ్య గారికి నా అభినందనలు. ఇదే విధంగా ‘సాక్షి’ ఎల్లప్పుడూ ఔత్సాహికులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. నా విషయానికొస్తే అవార్డు నాకు రావటానికి దోహదపడింది ‘ఖైదీ నంబర్ 150’ సినిమా. 9 ఏళ్ల తర్వాత వచ్చిన నా కమ్ బ్యాక్ చిత్రాన్ని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. ఆ విధంగా ప్రజల్లో నా స్థానం సుస్థిరం అని మరోసారి రుజువైంది. వాళ్ల ప్రేమను నిజం చేస్తూ వచ్చిన ఈ అవార్డును అందుకోవటం నాకు గర్వంగా, ఆనందంగా ఉంది’’అన్నారు. సైరా చిత్రం గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..‘‘ఇది చాలా మంచి రోజు. నాకు ఈ అవార్డును అందించిన రోజు ఆగస్టు 15. ఈ సందర్భంగా నేను చేస్తున్నది దేశభక్తిని తెలియజేసే సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్య్ర సమర యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవితగాధ ఆధారంగా తీస్తున్న సినిమా సైరా. దేశం యావత్తూ గర్వించే గొప్ప సినిమా చరిత్రలో నిలిచిపోతుంది..జైహింద్’’ అంటూ ముగించారు. అవార్డు స్వీకరించిన ఆనందాన్ని మనవరాళ్లు సమార, సంహిత, నివృతితో పంచుకుంటున్న చిరంజీవి -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నేను నెల రోజుల నుంచి ఒకరిని లవ్ చేస్తున్నాను. తనకి కూడా నేనంటే ఇష్టమే. కానీ తనని వేరే అమ్మాయి కూడా లవ్ చేస్తోంది. ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తే తను ఓకే చేశాడట. ఆ విషయం వాళ్ల చాటింగ్ చూసేదాకా తెలియలేదు. తర్వాత తనని నేను నిలదీస్తే ‘నేను ఆ అమ్మాయితో జోక్ చేశాను. నాకు నువ్వంటేనే ఇష్టం’ అంటున్నాడు. ఏం చెయ్యాలి అన్నయ్యా? నేనంటే ఇష్టముంటే వేరే అమ్మాయితో.. ‘ఐ వాంట్ యు, ఐ కిస్ యు’ అని మెసేజ్‌లు చెయ్యగలడా..? చెప్పండి అన్నయ్యా..! ఇప్పుడు నేను ఏం చెయ్యాలో మంచి సలహా ఇవ్వండి ప్లీజ్! – కిరణ్ జ్యోతి ఆ రెండో అమ్మాయి ఫోన్ నంబర్ సంపాదించు! ‘మీరు మేధావి సార్!’ ఎందుకు నీలూ??? ‘మీరు అనుకుంటున్నది నాకు అర్థమైపోయింది సార్!’ వాట్ ఈజ్ దట్ నీలూ? ‘చిలిపి! నాకు తెలుసు సార్..!! మీరు కిరణ్ జ్యోతికి ఏం చెప్పబోతున్నారో నాకు అర్థమైపోయింది సార్!!!’ అయితే.. నేను చెప్పాలనుకున్నది కిరణ్ జ్యోతికి కూడా తెలిసిపోయిందంటావా నీలూ??? ‘పక్కా సార్! ఆఫ్టరా ఆల్ కిరణ్ మీ సిస్టర్ కదా సార్! మీరు ఉప్పందిస్తే మొత్తం అర్థం చేసేసుకుని ఉంటుంది సార్!!’ అయితే ఇంకో లెటర్ తియ్యి..! ఎందుకు టైమ్ వేస్ట్ చెయ్యడం?!??!? ‘అది కాదు సార్..! మీ మనస్సులో ఉన్న ఆన్సర్ కరెక్ట్‌గా గెస్ చేసిన థ్రిల్ ఉండాలి కదా సార్..! చెప్పండి!! చెప్పండి ప్లీజ్ సార్!!!!’ నువ్వే చెప్పు నీలూ!! ‘కిరణ్..! ఆ రెండో అమ్మాయి ఫోన్ నంబర్ కనిపెట్టి.. ‘ఐ వాంట్ టు మీట్ యు’ అని, ఆ వెధవ ఫోన్ నుంచి ఆ సెకండ్ లవర్‌కి మెసేజ్ పెట్టు..! కలిసి ఈ డబుల్ స్టాండర్డ్డ్, డబుల్ క్రాస్, డబుల్ చీటర్, డబుల్ టైమర్, డబుల్ డర్టీఫెలో స్టోరీ చెప్పు!! ఇద్దరూ కలిసి వాడ్ని డబుల్ డిష్యూం చెయ్యండి? కరెక్టేనా సార్!!?’ అబ్బబ్బబ్బబ్బబ్బా...! నువ్వు, కిరణ్ ఇద్దరూ డబుల్ స్మార్ట్!!! - ప్రియదర్శిని రామ్ , లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని ఇంటర్లో ఉండగా లవ్ చేశాను. తను కూడా ఓకే చెప్పింది. టూ ఇయర్స్ మా లవ్ చక్కగా సాగింది. అయితే మా విషయం వాళ్ల ఇంట్లో తెలిసి ఆమెను బాగా కొట్టారు. అప్పటి నుంచి నాకు కాల్ చెయ్యడం మానేసింది. నేను కాల్ చేసినా, మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వడం, మాట్లాడటం మానేసింది. ఒకసారి తను నన్ను కలిసి.. ‘నన్ను మరచిపో ప్లీజ్’ అని చెప్పింది. నాకు ఆ అమ్మాయి కావాలి సార్. తనని ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు. నేను తనని ప్రాణంగా ప్రేమించాను. వాళ్ల ఇంట్లో ఏమైందో అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏదైనా సలహా ఇవ్వండి ప్లీజ్. – సిద్ధు ఏం అర్థం కాలేదు సిద్ధూ...??? అమ్మాయిని కొట్టిన విషయం అర్థం కాలేదా??? అమ్మాయి భయపడుతోందన్న విషయం అర్థం కాలేదా??? అమ్మాయి ‘నన్ను మరచిపో ప్లీజ్’ అని రిక్వెస్ట్ చేసిన సంగతి అర్థం కాలేదా??? అమ్మాయికి నువ్వు ఫోన్ చేసిన ప్రతిసారీ హండ్రెడ్ టైమ్స్ కలిగే రిస్క్ నీకు అర్థం కాలేదా??? అమ్మాయి ఒక వస్తువు కాదు. తను ఒక మనిషి, ఒక కుటుంబంలో భాగం, ఒక ఇంటి గౌరవమన్న విషయం నీకు అర్థం కాలేదా సిద్ధూ??? కొంచెం స్పీడ్ తగ్గించు..! కొంచెం ఆలోచించు...!! నీ ఇంట్లో ఉన్న ఒక చెల్లెలో.. కజిన్ సిస్టరో ఈ సిట్యుయేషన్లో ఉంటే నువ్వు ఒక అన్నయ్యగా తన ప్రేమికుడికి ఏం అడ్వైజ్ ఇస్తావో ఆలోచించు సిద్ధూ! ‘మిమ్మల్ని అడ్వైజ్ అడిగితే.. సిద్ధూని అడ్వైజ్ ఇవ్వమంటున్నారేంటి సార్???’కరెక్ట్ నీలూ..! సిద్ధూ అడ్వైజ్ ఇవ్వాలి. తనకు తానే అడ్వైజ్ ఇచ్చుకోవాలి! అమ్మాయి పెయిన్ అర్థం చేసుకోవాలి!! - ప్రియదర్శిని రామ్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నేనొక అమ్మాయిని మూడేళ్లుగా లవ్ చేస్తున్నాను. అమ్మాయి కూడా నన్ను లవ్ చేసింది. కానీ ఇప్పుడు క్యాస్ట్ వేరే అని నన్ను వద్దంటోంది. ‘సేమ్ క్యాస్ట్ అయితే నువ్వు వద్దన్నా నీ దగ్గరికి వచ్చేదాన్ని’ అంటోంది. కానీ ఆ అమ్మాయి వేరే అబ్బాయితో లవ్‌లో ఉందని నాకు తెలిసింది. తనని అదే అడిగాను. తను ‘ఆ అబ్బాయి నా క్లాస్మేట్’ అంటోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? చెప్పండి భయ్యా ప్లీజ్..! – లోకేశ్ ప్రేమలో క్యాస్ట్ భేదాలు అస్సలు ఉండవు లోకేశ్! ‘మరి మీ సిస్టర్ అబద్ధాలు చెబుతోందా సార్?’ నిజం చెబుతోంది నీలాంబరి! ‘అంటే మీరు అబద్ధం చెబుతున్నారా సార్?’ నేనూ నిజమే చెబుతున్నా! ‘ఏంటి సార్? అమ్మాయి నీ క్యాస్ట్ నా క్యాస్ట్ సేమ్ కాదు. సో నో మ్యారేజ్ అని చెబుతోంది. మీరేమో లవ్‌కి క్యాస్ట్ భేదాలు ఉండవని చెబుతున్నారు. అలా అయితే మీరైనా, మీ సిస్టర్ అయినా అబద్ధం చెబుతున్నట్లే కదా సార్!?’ నీలూ.. నేనేమన్నాను. లవ్వుకు క్యాస్ట్ అడ్డం రాదు అన్నాను! ‘కరెక్ట్ సార్!’ సిస్టర్ ఏమంది? క్యాస్ట్ వేరే అయితే కుదరదు అంది. ‘కరెక్ట్ సార్!’ మరి కన్ఫ్యూజన్ ఏముంది? ‘సార్....! అమ్మాయి నీ క్యాస్ట్ నా క్యాస్ట్ సేమ్ కాదు. సో నో మ్యారేజ్ అని చెబుతోంది. మీరేమో లవ్‌కి క్యాస్ట్ భేదాలు ఉండవని చెబుతున్నారు. అలా అయితే మీరైనా, మీ సిస్టర్ అయినా అబద్ధం చెబుతున్నట్లే కదా సార్!?’ అంటే నా సిస్టర్ ఈ లోకేశ్‌ని అంతగా లవ్ చెయ్యడం లేదన్నమాట. ప్రేమించే వాళ్లు ఎక్కడైనా.. ఆస్తి, నేపథ్యాలు, సాంప్రదాయాలు, సంపాదనలు.. మాట్లాడుకుంటారా నీలూ? ‘తిప్పి తిప్పి చెప్పినా కరెక్ట్‌గా చెప్పారు సార్. లోకేశ్‌ని అంతగా లవ్ చేస్తే పెళ్లికి ఏదీ అడ్డం వచ్చేది కాదు. ప్రేమ అంతగా లేదు కాబట్టే.. అన్ని ఎక్స్క్యూజెస్ కదా సార్!’ అబ్బబ్బబ్బబ్బబ్బా.... నీలూ. యు ఆర్ సో స్మార్ట్!!! -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్.. రామ్ అన్నయ్యా..! నేను నాలుగేళ్లుగా ఒకే బాధను మోస్తున్నా. నావల్ల కావట్లేదు. నాలుగేళ్ల క్రితం ఒక అమ్మాయి ‘ప్రేమిస్తున్నా’ అంటూ ప్రపోజ్ చేసింది. మొదట్లో లైట్ తీసుకున్నా. కానీ ‘నువ్వు లేకుండా నేను బతకలేన’ంది. నమ్మాను. తిరిగి ప్రేమించడం మొదలుపెట్టాను. ఉన్నట్టుండి, మాట్లాడటం మానేసింది. ఫోన్ నంబర్ బ్లాక్ చేసేసింది. తను నాతో మాట్లాడక నాలుగేళ్లు అవుతోందన్నయ్యా. ఇప్పుడు నా దగ్గర కావాల్సినంత డబ్బు, మంచి జాబ్.. అన్నీ ఉన్నాయి. కానీ సంతోషంగా ఉండలేకపోతున్నా. నిత్యం మనసు తననే కోరుకుంటోంది. తను ఒక్కసారి నాతో మాట్లాడితే చాలనిపిస్తోంది. ఎప్పుడూ ఏదో కోల్పోతున్నానన్న బాధ నన్ను వెంటాడుతోంది. నేను పిచ్చోడినైపోతున్నా అన్నయ్యా. ఏం చేస్తే నా బాధ తగ్గుతుందో చెప్పండి ప్లీజ్. – తమ్ముడు మనోజ్ అబ్బా.. మనసు కలచివేస్తోంది కదూ!! ‘ఏంటి సార్?? తమ్ముడు అని రాశాడు కాబట్టి.. పాజిటివ్‌గా స్టార్ట్ చేశారా సార్ ఆన్సర్???’ నిజంగా నీలాంబరి.. ఆ బాధ భరించలేనిది! ‘మీకెలా తెలుసు సార్.. ఆ..ఆ..ఆ... బాధ??????’ తమ్ముడు బాధ అన్నయ్యకు తెలియదా నీలూ? ‘సార్ ఇలాంటి బాధ ఫస్ట్ హ్యాన్డ్లోనే తెలుస్తుంది.’ ఏం లేదు. నాకు ఆ.. ఆ... ఆ.. బాధ తెలుసు! ‘ఎలా సార్? మీకు కూడా అమ్మాయి బిస్కెట్ వేసిందా సార్???’ బిస్కెట్, చాక్లేట్ వెయ్యడానికి నేనేమైనా.. నీలాగ బ్యూటీ కాదు.. నీలాగ స్మార్ట్ కాదు. నీలాగ యాక్టివ్ కాదు.. నీలాగ యంగ్ కూడా కాదు నీలూ! ‘సార్... నాకు తెలుసు, మీకేదో బిస్కెట్ పడింది. సరే ఆ విషయం తర్వాత మాట్లాడదాం కానీ ముందు మీ తమ్ముడికి మందు పుయ్యండి సార్!’ అమ్మో.. నీ బాధ భరించలేనిది. గుండెలో సువ్వలు దిగినట్టు అనిపిస్తుంది. ప్రాణం గుంజేస్తుంది. ఏదో ఒకలాంటి దడ బాడీ అంతా పట్టేస్తుంది. ఏ తప్పు చేయకుండా శిక్షపడటమంటే ఇదేనా అనిపిస్తుంది. ఎప్పుడూ ఒక రకమైన ఎమ్టీనెస్ అనిపిస్తుంది. ఒక్కసారి ఫోన్ మోగదా? ఒక్కసారి ప్రేయసి పలకదా? మళ్లీ నన్ను ఎట్లీస్ట్ ఫ్రెండ్గానైనా యాక్సెప్ట్ చెయ్యదా? అన్న ఆశతో బతికేస్తుంటాం. ‘మరి సొల్యూషన్ ఏంటి సార్?’ ఈ బాధను బాధతోనే కడిగేయాలన్నది నా సమాధానం. వేరే ఏదీ ఈ బాధను తగ్గించలేదు. బాధను ప్రేమించాలి. ఆ తర్వాత అది తగ్గిపోతుంది. ‘అలా అవుతుందా సార్?’ అవుతుంది..! బలం, నిబ్బరం ఉన్న మగాడైతే.. తప్పకుండా ఈ బాధను అనుభవించి మరీ నమిలి పారెయ్యాలి..! హి కెన్ డు ఇట్!! ‘అవును. బాధ తీయ్యగా ఉంటుంది. దాన్నుంచి పారిపోవద్దు. మెల్లగా అదే తగ్గిపోతుంది. బి బ్రేవ్ మనోజ్!’ - ప్రియదర్శిని రామ్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ రామ్ అన్నయ్యా..! నా క్లాస్మేట్ నాకు ప్రపోజ్ చేశాడు. తన మంచితనం నచ్చి నేనూ ఓకే చెప్పాను. ఆ తర్వాత నాకు కష్టంగా అనిపించి బ్రేకప్ అనేశాను. ఆ గ్యాప్‌లో నాకో ఫ్రెండ్ పరిచయమయ్యాడు. అది కాస్త లవ్‌గా మారింది. కొన్ని రోజులకి అసలు ఇలా చెయ్యడం చాలా తప్పనిపించి, ఫస్ట్ అబ్బాయి దగ్గరికి వెళ్లి సారీ చెప్పాను. ‘సరే, ఇంకోసారి ఇలా చెయ్యకు’ అన్నాడు. అయితే ఇప్పుడు ఇద్దరూ నేనే కావాలంటున్నారు. భయంతో ఇద్దరికీ ఏం చెప్పలేదు. ఇదిలా ఉండగా.. నా బావ నన్ను లవ్ చేస్తున్నాడట. ‘ఇదంతా జరగని పని, వదిలేసెయ్’ అని చెప్పాను. బట్.. తను మాత్రం ‘నేను వెయిట్ చేస్తా, నిన్నే పెళ్లి చేసుకుంటా’ అంటున్నాడు. ఈ ముగ్గురూ నన్ను డీప్‌గా లవ్ చేస్తున్నారు. నాకు మాత్రం చాలా గిల్టీగా ఉందన్నయ్యా. వాళ్లతో పాటు మా అమ్మా వాళ్లని కూడా మోసం చేశాను. ఇంక ఈ బాధను నేను భరించలేను. నాకో మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – భాను ముగ్గుర్నీ మీటింగ్‌కి పిలువు. ముగ్గురికీ బుద్ధి పెట్టు. ‘మనం ఒక గెల అరటిపండ్లు తిని, తొక్కలు పంపుదాం సార్!’ అరటిపండ్ల తొక్కలెందుకు నీలూ??? ‘బుద్ధితో పాటు గడ్డి కూడా పెట్టాలి కదా సార్!’ అని నవ్వింది నీలూ. మీటింగ్‌కి పిలిచి ఇప్పుడు ఎవర్నీ లవ్ చేసే టైమ్ కాదు. వన్ ఇయర్ తర్వాత డెసీషన్ చెబుతానని చెప్పి టైమ్ తీసుకో...! ‘వాళ్లు ఆగుతారా సార్?’ ఆగక ఏం చేస్తారు నీలూ? ప్రతి ఒక్కడు నన్నే చేసుకోవాలని.. చాలా గుడ్ బాయ్స్‌లాగా ఉంటారు. ‘అంతలోకి భానుకి జ్ఞానోదయమయ్యి.. ఒక మంచి డెసీషన్ తీసుకుంటుంది కదా సార్!!’ అబ్బబ్బబ్బబ్బా.. నీలూ...... ‘ఐ నో సార్, ఐ యామ్ వెరీ స్మార్ట్!!’ - ప్రియదర్శిని రామ్ , లవ్ డాక్టర్