
హాయ్ సార్...! నేనొక అమ్మాయిని ఫోర్ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నా. రీసెంట్‌గా తనకి ప్రపోజ్ చేశా. అయితే గతంలో ఒక అబ్బాయిని లవ్ చేసి వాళ్ల డాడీకి దొరికిపోయిందట. అప్పుడు ‘మళ్లీ ఎవరినీ లవ్ చెయ్యన’ని వాళ్ల డాడీకి ప్రామిస్ చేసిందట. ఇప్పుడు కూడా వాళ్ల డాడీకి భయపడే నాకు ఓకే చెప్పడం లేదేమోనని అనిపిస్తోంది. తనంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పండి ప్లీజ్. ‘ఈ అమ్మాయిని వదిలేసి వేరే అమ్మాయిని ట్రై చేసుకో’ అని మాత్రం చెప్పకండి. నా వల్ల కాదు. నా లవ్‌కి హెల్ప్ చెయ్యండి సార్ ప్లీజ్. – కుమార్
రేపు మీ డాడీ, ప్రేమిస్తే తాట తీస్తానంటే..?‘అవును సార్! రేపు కుమార్ వాళ్ల ఫాదర్.. కుమార్ ప్రేమిస్తున్నాడని తెలిసి రెచ్చిపోయి.. ‘‘లవ్వు జివ్వు అన్నావంటే కొవ్వు తీస్తా!’’ అనంటే లవ్వు మూసి, బుక్కు ఓపెన్ చేసి బుద్ధిగా కూర్చోడా సార్!?!’ అబ్బా ఏం చెప్పావు నీలాంబరీ... యు ఆర్ బ్రిలియంట్! ‘అయితే కుమార్ ఏం చెయ్యాలి సార్???’ అమ్మాయికి ఒక నీతి.. అబ్బాయికి ఒక నీతి.. కుదరదని చెబుతున్నా!
‘మరి కుమార్ ప్రేమకు నీతి ఉండదా సార్?’ దమ్ముంటే.. ఉంటుంది! ‘ఎలాంటి దమ్ము ఉండాలి సార్?’ పోయి అమ్మాయి వాళ్ల నాన్నకు లవ్ ప్రపోజ్ చెయ్యాలి నీలూ! ‘ఛీ!! పొండి సార్! అమ్మాయిని వదిలి డాడీకి ప్రపోజ్ చేస్తే క్రాక్ అనుకుంటారేమో సార్!’ అలా కాదు నీలూ! అమ్మాయిని ప్రేమిస్తున్న విషయాన్ని డాడీకి చెబితే పోలా??? ‘పోతాడు సార్!’ దమ్ముంటే అదే చెయ్యాలి నీలూ!
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment