హాయ్ సార్..! నేనొక అమ్మాయిని దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. కానీ ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పలేదు. చెప్పాలంటే చాలా భయంగా ఉంది. దీనికి సొల్యూషన్ చెప్పండి సార్ ప్లీజ్. – వెంకట రమణ
ఇవాళ మంచి రోజు..! ‘ఎందుకు సార్ తిట్లు తింటానికా?’ అంత నెగెటివ్‌గా ఆలోచిస్తే వ్యవహారం ముందుకు సాగేనా నీలూ?? ‘ఏంటి సార్..! ముందుకు సాగేది..!? అమ్మాయి లాగుద్ది. అమ్మాయి అమ్మానాన్నా లాగుతారు. వ్యవహారం సాగదు. అందరూ పట్టుకుని పీకితే వెంకటరమణ సాగిపోతాడు. అనవసరంగా డేంజర్ ఐడియాలు ఇవ్వకండి. అమాయకుడు మిమ్మల్ని నమ్మి అమ్మాయికి సీరియస్‌గా ప్రపోజ్ చేస్తే అనూహ్యమైన పరిణామాలు ఉండొచ్చు.’
ఏంటి నీలూ..? నువ్వు కూడా అధైర్యాన్ని పిండి పోస్తున్నావు. ఇంకా ప్రేమికులు ఏం కావాలి? వాళ్ల ప్రేమ ఏం కావాలి??? ‘ఏం అవ్వక్కర్లేదు సార్! తన్నులు తిని కుంటోళ్లు, గుడ్డోళ్లు, వంకరటింకరోళ్లు కాకుండా ఉంటే చాలు సార్ మన లవర్లు!’ నీవు చెప్పేది కూడా ఒక రకమైన లవ్వే నీలూ. యాక్చువల్లీ చాలా గొప్ప లవ్ నీలూ..! ‘నేనేమన్నాను సార్? అసలు నేను ఎలాంటి లవ్ గురించి చెప్పాను సార్?’ సైలెంట్ లవ్ నీలూ. మౌనరాగం నీలూ.. మాటలతో చెప్పలేనంత ప్రేమ నీలూ..చాలా డీప్ లవ్ నీలూ.. చాలా హెవీ లవ్ నీలూ. అది చెబితే చిక్కదనం తగ్గిపోద్ది. బరువు తగ్గి లైట్ అయిపోతుంది. పంచుకుంటే పూర్ అయిపోతుంది. వెంకటరమణ సైలెంట్ వర్గ చరిత్రకెక్కడమే రైట్ నీలూ!
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment