![Boyapati Sreenu released the first look and motion poster of Case 99 - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/11/DSC_5829.jpg.webp?itok=dRD26bx6)
కీర్తీ, గౌతమ్, ప్రియదర్శిని రామ్, బోయపాటి శ్రీను, వివేక్
‘‘ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన దౌర్జన్యానికి మానవ సంబంధాలే కారణమని అందరూ ఆలోచిన్తున్న సమయంలో వస్తున్న చిత్రం ‘కేస్ 99’. ఈ చిత్రంతో సమాజంలో జరిగే చెడును బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ప్రియదర్శిని రామ్‌గారు ఏ పనిచేసినా ప్రాణం పెట్టి చేస్తారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ప్రియదర్శిని రామ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కేస్ 99’. మెలోడ్రామా కంపెనీపై చిలుకూరి కీర్తి, గౌతమ్‌రెడ్డి, వివేక్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బోయపాటి శ్రీను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రియదర్శిని రామ్ మాట్లాడుతూ– ‘‘మంచి మనసున్న వ్యక్తి బోయపాటి శ్రీను. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజా¯Œ లాంటి ఓటీటీలో విడుదలవుతున్న వాటిలో పదికి ఏడు సినిమాలు క్రైమ్ థ్రిల్లర్‌లే ఉంటున్నాయి. ఎందుకంటే సమాజంలో ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టే ఉంటున్నాయి. వాటన్నింటినీ నేను పరిష్కరించలేను కానీ నా వంతుగా చక్కని సినిమా తీయాలనిపించింది. కొత్త రక్తంతో వస్తున్న యువ నిర్మాతలు గౌతమ్, కీర్తీ, వివేక్‌లకు చాలా మంచి సినిమా తీశానని నేను మాట ఇస్తున్నా’’ అన్నారు. తిరువీర్, అనువర్ణ, నిహాల్ కోదాటి, అజయ్ ఖతుర్వార్, అపరాజిత తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: టి. సురేంద్ర రెడ్డి, సంగీతం: ఆషిక్ అరుణ్.
Comments
Please login to add a commentAdd a comment