Boyapati Sreenu
-
Akhanda 2 Release Date: బాలయ్య యాక్షన్ తాండవం.. బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం అఖండ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ మేరకు అఖండ-2 తాండవం పేరుతో ప్రోమోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో బాలయ్య డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. ఇందులో బాలయ్య యాక్షన్ ఉగ్రరూపం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. The protector of Dharma will rage a powerful battle 🔱#Akhanda2 - Thaandavam shoot begins 💥💥Grand release worldwide for Dussehra on SEPTEMBER 25th, 2025 ❤🔥▶️ https://t.co/l2WnhFjwRj'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @14ReelsPlus… pic.twitter.com/oZeJPHNwQR— 14 Reels Plus (@14ReelsPlus) December 11, 2024 -
నిర్మాతగా బాలకృష్ణ కూతురు.. సినిమా ప్రకటించిన బోయపాటి
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. నేడు 65వ పుట్టినరోజును ఆయన జరపుకోనున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో 3 చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. నేడు (జూన్ 10) బాలయ్య పుట్టినరోజు సందర్భంగా BB4 పేరుతో ఒక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ రామ్ ఆచంట,గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.2014లో లెజెండ్ చిత్రాన్ని ఇదే నిర్మాణ సంస్థ నిర్మించింది. సింహా,లెజండ్, అఖండ చిత్రాల తర్వాత బోయపాటి శ్రీను మరోసారి బాలయ్యతో ప్రాజెక్ట్ ఫిక్స్ చేశాడు. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాలకృష్ణ కూతురు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లో ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నట్లు ఆమె పేరు ఉంది. తొలిసారిగా ఆమె చిత్రనిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. The Lethal Combo that sets the screens on fire is Back 🔥🔥The two Forces - 'GOD OF MASSES' #NandamuriBalakrishna & #BoyapatiSreenu reunite for #BB4 🌋🌋Happy Birthday Balayya Babu ❤️🔥Produced by @RaamAchanta #GopiAchanta under @14ReelsPlus banner ❤️Presented by… pic.twitter.com/Oj9b1j9bvS— 14 Reels Plus (@14ReelsPlus) June 10, 2024 -
ఘనంగా బాలకృష్ణ ‘లెజెండ్’ మూవీ పదేళ్లు వేడుక (ఫొటోలు)
-
మళ్లీ మాస్ కాంబో
ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ‘సరైనోడు’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ పక్కా మాస్ మూవీని అల్లు అరవింద్ నిర్మించారు. కాగా ‘సరైనోడు’ తర్వాత నిర్మాత అల్లు అరవింద్– దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ మాస్ కాంబో గురించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తారా? లేక మరో హీరో ఎవరైనా నటిస్తారా? అనే విషయంపై సరైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. -
స్కంద సినిమాపై ట్రోల్ చేస్తున్న ఆడియన్స్
-
డైరెక్టర్ బోయపాటికి నెటిజన్ల చురకలు
స్కిల్ స్కామ్ కేసులో ఇరుక్కుని రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుకు సంఘీభావం అంటూ టీడీపీ ఏవో కార్యక్రమాలు చేపడుతున్నా అవి అట్టర్‌ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి.. మొన్న కంచాలు,గరిటెలు మోగించాలని పిలుపు ఇచ్చినా దాన్ని జనం పట్టించుకోలేదు. నిన్న కాంతితో క్రాంతి అంటూ ఇంట్లో విద్యుత్ లైట్లు ఆర్పి క్యాండిల్స్ వెలిగించాలని టీడీపీ పెద్దలు సూచించారు. దానికి కూడా ప్రజాదరణ కరువైంది. ఏపీ వ్యాప్తంగా ఎవరూ కూడా టీడీపీ ఇచ్చిన ఈ పిలుపును సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో ఇది కూడా ఫ్లాప్ అయ్యింది కాగా, టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాత్రం క్యాండిల్స్ వెలిగించి ఏదో బిల్డప్ ఇచ్చే యత్నం చేశారు. కానీ అది విమర్శల పాలైంది. గతంలో గోదావరి పుష్కరాలప్పుడు 29 మంది చనిపోతే, అది కూడా చంద్రబాబు డైరెక్షన్లో బోయపాటి చెప్పిన ‘యాక్షన్’ సీనుకు 29 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఏదో ఘనకార్యం చేసినట్లు చూపిద్దామనుకున్న చంద్రబాబు చేసిన పనికి తొక్కిసలాట జరిగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు కనీసం వారికి సంతాపంగా కనీసం క్యాండిల్స్ కూడా వెలిగించని బోయపాటి.. ఈరోజు మాత్రం చంద్రబాబుకు సంఘీభావం అంటే క్యాండిల్స్ వెలిగించడం నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. ‘ ఏం బోయపాటి.. ఆరోజు అమాయక ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదా.. కనీసం అప్పుడు వారికి సానుభూతి కూడా చెప్పలేదు. ఇప్పుడు మాత్రం క్యాండిల్స్ చేతిలో పట్టుకుని ఫోజులిస్తున్నావ్’ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ‘ఆనాడు ఇలా ఒక కొవ్వొత్తి కూడా పట్టుకోలేదే... ఈనాడు మీ కుల పెద్ద లోపల ఉండేసరికి కొవ్వొత్తులతో బాగానే రంజింప చేస్తున్నావ్’ అంటూ విమర్శిస్తున్నారు. ‘సాక్షి’ తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి -
రామ్ పోతినేని స్కంద.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో వచ్చిన తాజా చిత్రం స్కంద. ఈ మూవీలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈనెల 28న థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. పక్కా మాస్ మూవీగా రూపొందించిన ఈ మూవీ తొలిరోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.18.2 కోట్ల వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.8.62 వసూళ్లు రాబట్టింది. అయితే కేవలం మాస్ ఆడియన్స్ మెప్పించేలా ఉన్న ఈ చిత్రం నైజాంలో అత్యధికంగా రూ.3.23 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఓవరాల్‌గా చూస్తే రామ్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా స్కంద నిలిచింది. కాగా.. ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రిన్స్, దగ్గుబాటి రాజా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కించబోతున్నట్లు రామ్, బోయపాటి శ్రీను ప్రకటించారు. -
రామ్ 'స్కంద' ట్రైలర్ విడుదల.. బోయపాటి మాస్ మార్క్
రామ్ పోతినేని- శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'స్కంద'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్లో రామ్ చెప్పే పంచ్ డైలాగ్‌లు 'ఇయ్యాలే.. పొయ్యాలే.. గట్టిగా అరిస్తే తొయ్యాలే.. అడ్డమొస్తే లేపాలే' వంటివి బాగా పేలాయని చెప్పవచ్చు. రామ్‌పై బోయపాటి శ్రీను చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌లు మెప్పిస్తాయి. రామ్‌ను పక్కా మాస్ లుక్‌లో బోయపాటి చూపించాడు. ఇందులోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. ఇందులో రామ్ రెండు కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన స్కంద సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రామ్-శ్రీలీల.. డ్యాన్స్ ఇరగదీశారుగా!
యంగ్ హీరో రామ్ 'స్కంద' సినిమాతో సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా 'నీ చుట్టు చుట్టు తిరిగినా..' అనే లిరికల్ పాటని గురువారం రిలీజ్ చేశారు. మంచి ఫాస్ట్ బీట్తో ఉన్న ఈ సాంగ్.. మ్యూజిక్ లవర్స్ ని అలరిస్తోంది. మరోవైపు డ్యాన్స్ ప్రేమికుల్ని కూడా ఎంటర్టైన్ చేస్తోంది. ఎందుకంటే రామ్ ఎలాంటి డ్యాన్సర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడికి శ్రీలీల లాంటి ఊరమాస్ డ్యాన్సర్ కాంబో సెట్ అయితే ఎలా ఉంటుంది. ఈ పాటలానే ఉంటుంది. క్లాస్ స్టెప్పులతో ఇద్దరూ పోటీపడ్డారు. లిరికల్ సాంగ్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. సెప్టెంబరు 15న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మాస్ యాక్షన్ స్టోరీతో తీసినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) -
రామ్-బోయపాటి సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి 'స్కంధ' అనే టైటిల్‌ను బోయపాటి ఫిక్స్ చేశాడు. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 15న సినిమాను విడుదల చేయనున్నారు. టైటిల్ గ్లింప్స్‌లో మ్యూజిక్‌తో థమన్ దుమ్ములేపాడు. (ఇదీ చదవండి: ఆమెకు దూరంగా ఉండాలంటూ సోనూసూద్‌కు సలహాలిస్తున్న ఫ్యాన్స్) -
'కొట్టర కొట్టు.. బొక్కలు చూర అయ్యేటట్టు..' అదిరిపోయిన టీజర్
‘నీ స్టేటు దాటలేనన్నావ్... దాటా!’, ‘నీ గేటు దాటలేనన్నావ్... దాటా!’, నీ పవర్ దాటలేనన్నావ్...దాటా!’, ‘ఇంకేంటి దాటేది...!’ అనే డైలాగ్స్‌తో విడుదలైంది రామ్ కొత్త సినిమా టీజర్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పవన్ కుమార్, జీ స్టూడియోస్ సౌత్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. సోమవారం (మే 15) హీరో రామ్ బర్త్ డే సందర్భంగా ‘ఫస్ట్ థండర్’ పేరుతో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. సదర్ ఉత్సవాల నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీన్ విజువల్స్‌లో ‘కొట్టర కొట్టు... నరాలు కట్టు! బొక్కలు చూర అయ్యేటట్టు..’ అనే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ టీజర్లో వినిపించింది. ‘‘మా హీరో రామ్ మేకోవర్, యాక్టింగ్, బోయపాటి శ్రీనుగారి డైరెక్షన్, తమన్ రీ రికార్డింగ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో టైటిల్, ఇతర వివరాలు వెల్లడిస్తాం. దసరా సందర్భంగా అక్టోబర్ 20న తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
రామ్ ఫ్యాన్స్‌కి డబల్ బోనాంజా
-
ప్రపంచ రికార్డ్ సృష్టించిన టాలీవుడ్ మూవీ!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన చిత్రం జయ జానకి నాయక. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజై ఇప్పటికీ ఐదేళ్లు దాటిపోయినా కూడా క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 709 మిలియన్ల వ్యూస్‌తో ప్రపంచ రికార్డ్ సృష్టించింది. తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమా హిందీలో రికార్డులు సృష్టిస్తోంది. ఏకంగా హిందీ వర్షన్ కేజీఎఫ్ సినిమాను అధిగమించేసింది. ఇప్పటి వరకు కేజీఎఫ్ 702 మిలియన్ల వ్యూస్‌తో రెండోస్థానంలో నిలిచింది. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ఆగస్ట్ 11వతేదీ 2017లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
రామ్ పోతినేని సినిమాలో విలన్‌గా ప్రిన్స్.. !!!
తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు హీరో ప్రిన్స్. బస్ స్టాప్, నేను శైలజ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ప్రిన్స్ రామ్, బోయపాటి శ్రీను సినిమాలో విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. అఖండ బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమాలో రామ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రిన్స్ విలన్ రోల్లో నటిస్తున్నాడు. పవర్ ఫుల్ విలనిజాన్ని తెరమీద చూపించడంలో దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. రామ్, బోయపాటి సినిమాలో ప్రిన్స్ రోల్ సినిమాకు హైలెట్ కానుందని తెలుస్తోంది. -
రామ్- బోయపాటి మూవీ దసరా సర్ప్రైజ్.. హీరోయిన్ ఎవరంటే?
రామ్ పోతినేని- బోయపాటి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రంపై క్రేజీ అప్డేట్ వచ్చింది. దసరా కానుకగా చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్స్ ఇచ్చింది చిత్రబృందం. ఈ చిత్రం షూటింగ్ రేపటి నుంచే ప్రారంభిస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించింది. ఈ సినిమాలో హీరోయిన్గా పెళ్లిసందడి కథానాయిక శ్రీ లీలను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ సినిమాకు బీజీఎం మాస్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతమందించనున్నారు. (చదవండి: రామ్ - బోయపాటి కాంబినేషన్.. క్రేజీ అప్ డేట్ ఆరోజే..!) శ్రీనివాస సిల్వర్ స్కీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ చిత్రబృందం ఏకంగా సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని సమాచారం. ముఖ్యంగా రామ్ మాస్ యాక్షన్‌కు సరిపోయే స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. Excited to share this good news on this auspicious day.A big thank you to the entire team!! Wishing #HappyDussehra to you all 🔱#BoyapatiRAPO@ramsayz #BoyapatiSreenu @SS_Screens @srinivasaaoffl https://t.co/HeHL8FZdci — sreeleela (@sreeleela14) October 5, 2022 The Master of Chartbusters 🎹🎶 Welcoming the Sensational Musician and dear @Musicthaman Onboard for #BoyapatiRAPO 🥁🔥 We are so happy to have you as a part of our team ❤️@ramsayz #BoyapatiSreenu @sreeleela14 @SS_Screens @srinivasaaoffl pic.twitter.com/E57iMyDBxi — Srinivasaa Silver Screen (@SS_Screens) October 5, 2022 On this auspicious day of Dussehra, We are super excited to announce 📢 The Massive Energetic Combo of Ustaad @ramsayz and Mass Director #BoyapatiSreenu on sets from Tomorrow 🔥⚡#BoyapatiRAPO starts rolling with High Adrenaline Action Sequence 🎥🎬 pic.twitter.com/ooQk3ICmYv — Srinivasaa Silver Screen (@SS_Screens) October 5, 2022 -
బోయపాటి సినిమా కోసం రామ్ పోతినేని షాకింగ్ నిర్ణయం
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం హీరో రామ్ తన లుక్‌ని పూర్తిగా మార్చబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం సుమారు 11కిలోల బరువు పెరగనున్నట్లు టాక్ వినిపిస్తుంది. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు రామ్ కూడా ఈ కండిషన్‌కి వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రెండు పాత్రల్లో వేరియేషన్స్ కోసం రామ్ కొత్తగా మేకోవర్ అవనున్నారట.కాగా అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, అందులోనూ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సెట్స్‌పైకి రానున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘నీది యాక్టింగ్ కాదురా.. సర్దేస్తున్నావ్.. ’అంటూ రానాకు క్లాస్ పీకిన సూర్య..!
‘‘కరోనా టైమ్‌లో ‘అఖండ’, ‘పుష్ప’, ‘బంగార్రాజు’, ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు హిట్ చేశారు. మిగతా ఇండస్ట్రీలకు సినిమాలను విడుదల చేయాలనే ఆత్మవిశ్వాసం టాలీవుడ్ వల్లే కలిగింది’’ అని సూర్య అన్నారు. సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఈటీ’. ఈ చిత్రం ఈ నెల 10న విడుదలవుతోంది. నారాయణ్‌దాస్ నారంగ్, డి. సురేష్‌బాబు, ‘దిల్’ రాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతిథులుగా పాల్గొన్న హీరో రానా, దర్శకుడు బోయపాటి శ్రీను, దర్శకుడు గోపీచంద్ మలినేని ‘ఈటీ’ బిగ్ టికెట్‌ను విడుదల చేశారు. సూర్య మాట్లాడుతూ – ‘‘ఇటీవల నా ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. మంచి సినిమాకు హద్దు లేదని నిరూపించారు. ఆ రెండు చిత్రాల్లా ‘ఈటీ’ కూడా స్పెషల్ ఫిల్మే. ఇక నా అగరం ఫౌండేషన్‌కు స్ఫూర్తి చిరంజీవిగారు. సినిమాల వల్ల మంచి స్థాయికి వెళ్లిన నేను ఏదో ఒకటి చేయాలని ఈ అగరం ఫౌండేషన్‌ని స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరూ మార్పు తీసుకురాగలరు. మనసు ఏం చెప్పిందో దాన్నే ధైర్యంగా చేయండి. కంఫర్ట్ జోన్లో ఉంటే ఎదుగుదల ఉండదు. అందుకే కంఫర్ట్ జోన్లో ఉండకండి’’ అన్నారు. రానా మాట్లాడుతూ – ‘‘నా సినిమా ఒకటి ఎడిటింగ్ రూమ్‌లో చూసిన సూర్యగారు ‘‘నీది యాక్టింగ్ కాదురా.. సర్దేస్తున్నావ్.. (స్టేజ్ పై నవ్వులు)’ అని క్లాస్ పీకారు. ఆ క్లాసే నన్ను భల్లాలదేవుడిని చేసింది. డేనియల్ శేఖర్ని చేసింది (సూర్య మైకు తీసుకుని ఇప్పుడు రానాను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు). ‘ఈటీ’ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘రజనీకాంత్‌గారి తర్వాత సూర్యని ‘మన’ అని తెలుగు ఆడియన్స్ అనుకుంటున్నారు. అలాంటి సూర్యగారు చేసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ‘ ‘సూర్యగారు మాస్ ఫిల్మ్ చేస్తే షేకే. ఓ యునిక్ స్టైల్ ఉన్న డైరెక్టర్ పాండిరాజ్‌గారు’’ అన్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ‘‘హైదరాబాద్‌లో జరిగిన కార్తీ ‘చినబాబు’ సినిమా ఫంక్షన్‌కు వచ్చినప్పుడు సూర్యగారి పేరు ప్రస్తావనకు రాగానే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ రెస్పాన్స్ చూస్తున్నాను. సూర్యగారు స్ట్రయిట్‌గా తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు పాండిరాజ్. ‘‘ప్రేక్షకులు గర్వపడే సినిమాలు చేస్తుంటారు సూర్య. ‘ఈటీ’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత డి. సురేష్‌బాబు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘‘ప్రతి కథను డిఫరెంట్‌గా సెలెక్ట్ చేసుకునే ఇండియన్ హీరోల్లో సూర్య ఒకరు. ఆయన ఏ సినిమా చేసినా అందులో ఓ కొత్తదనం ఉంటుంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో సౌత్ ఇండియా సినిమాల పట్ల, ముఖ్యంగా తెలుగు సినిమాల పట్ల ముంబైలో మరింత గౌరవం పెరిగింది. సూర్యగారు చేసిన ‘ఈటీ’ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాత జ్ఞానవేల్‌రాజా. నిర్మాత రాజశేఖర్ పాండియన్, కెమెరామేన్ రత్నవేలు, నటులు వినయ్ రాయ్, మధుసూదన్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ కామెంట్లు విని నన్ను నేను మార్చుకున్నా: పూర్ణ
‘‘సెలబ్రిటీలు పబ్లిక్ ప్రాపర్టీ అని నా ఫీలింగ్. ప్రజల వల్లే సెలబ్రిటీలు అవుతాం. వారు పాజిటివ్, నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారు.. వాటిని నేను ఒకేలా తీసుకుంటాను. నెగెటివ్ కామెంట్లు విని నన్ను నేను మార్చుకున్నాను’’ అని పూర్ణ అన్నారు. బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 2న విడుదల కానుంది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన పూర్ణ మాట్లాడుతూ– ‘‘బాలకృష్ణ–బోయపాటిగార్ల కాంబినేషన్లో ఇంత పెద్ద సినిమాలో అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో పద్మావతి అనే పాత్ర చేశాను. కథలో ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇది. నా లక్కీ నంబర్ 5. 2021ని కూడితే 5 వస్తుంది. నాకు ఈ ఏడాది మంచి పాత్రలు వచ్చాయి. హీరోయిన్‌గానే చేయాలని ఫిక్స్ అవ్వలేదు. సినిమాలో నాలుగైదు సీన్లు చేసినా ప్రాధాన్యత ఉండాలనుకుంటాను. శోభన, రేవతి, సుహాసినిగార్లలా ఎలాంటి పాత్రలైనా చేయాలనుకుంటున్నాను. ‘దృశ్యం 2’లో లాయర్‌గా బాగా నటించావని చాలామంది అభినందించారు. కేరళ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అయింది. ఇండస్ట్రీకి సింగిల్‌గా వచ్చాను. కానీ ఇంతదాకా ప్రయాణించాను. డబ్బే కావాలంటే ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. కెరీర్ చాలాకాలం సాగాలంటే మాత్రం మంచి చిత్రాలనే ఎంచుకోవాలి. ముందు నేను కొన్ని తప్పులు చేశాను.. కానీ ఇప్పుడు జాగ్రత్తగా మంచి పాత్రలనే ఎంచుకుంటున్నాను’’ అన్నారు. -
కేస్ 99 పెద్ద విజయం సాధించాలి
‘‘ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన దౌర్జన్యానికి మానవ సంబంధాలే కారణమని అందరూ ఆలోచిన్తున్న సమయంలో వస్తున్న చిత్రం ‘కేస్ 99’. ఈ చిత్రంతో సమాజంలో జరిగే చెడును బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ప్రియదర్శిని రామ్‌గారు ఏ పనిచేసినా ప్రాణం పెట్టి చేస్తారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ప్రియదర్శిని రామ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కేస్ 99’. మెలోడ్రామా కంపెనీపై చిలుకూరి కీర్తి, గౌతమ్‌రెడ్డి, వివేక్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బోయపాటి శ్రీను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని రామ్ మాట్లాడుతూ– ‘‘మంచి మనసున్న వ్యక్తి బోయపాటి శ్రీను. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజా¯Œ లాంటి ఓటీటీలో విడుదలవుతున్న వాటిలో పదికి ఏడు సినిమాలు క్రైమ్ థ్రిల్లర్లే ఉంటున్నాయి. ఎందుకంటే సమాజంలో ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టే ఉంటున్నాయి. వాటన్నింటినీ నేను పరిష్కరించలేను కానీ నా వంతుగా చక్కని సినిమా తీయాలనిపించింది. కొత్త రక్తంతో వస్తున్న యువ నిర్మాతలు గౌతమ్, కీర్తీ, వివేక్‌లకు చాలా మంచి సినిమా తీశానని నేను మాట ఇస్తున్నా’’ అన్నారు. తిరువీర్, అనువర్ణ, నిహాల్ కోదాటి, అజయ్ ఖతుర్వార్, అపరాజిత తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: టి. సురేంద్ర రెడ్డి, సంగీతం: ఆషిక్ అరుణ్. -
హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్న బాలయ్య, బోయపాటి
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ రెండు సూపర్ హిట్స్ అందించిన విషయం అందరికీ తెలిసిందే. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా రూపొందనుంది. నందమూరి బాలకృష్ణ కోసం దర్శకుడు బోయపాటి శ్రీను మరో పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రస్తుతం సమాజంలోని ప్రధానమైన సమస్య ఆధారంగా బోయపాటి శ్రీను ఈ కథను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 2020 వేసవి చివరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తమ సంస్థ నుంచి మూడో సినిమాగా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ, కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
బోయపాటితో మహేష్ మూవీనా..?
వినయ విధేయ రామతో విధ్వంసం సృష్టించిన బోయపాటి శ్రీను.. సూపర్‌స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ‘వీవీఆర్’లో రామ్ చరణ్‌తో నానా ఫీట్లు చేయించిన బోయపాటి మహేష్‌ను కూడా త్వరలోనే డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. అయితే మహేష్ ప్రస్తుతం మహర్షి షూటింగ్లో బిజీగా ఉండగా.. అటుపై సుకుమార్ డైరెక్షన్లో ఓ మూవీని చేయనున్నాడు. ఇటు బోయపాటి బాలయ్యతో ఓ సినిమాను కమిట్ అయి ఉన్నాడు. అసలే వీవీఆర్ ఎఫెక్ట్‌తో ఉన్న బోయపాటికి మహేష్ చాన్స్ ఇస్తాడా? ఇంత బిజీ షెడ్యుల్‌లో వీరి చిత్రం రావడానికి అవకాశాలు ఉన్నాయా? కానీ బోయపాటి మహేష్‌తో సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. -
వీవీఆర్ : మాస్‌ను పీక్స్‌లో చూపించేశాడు!
రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మాస్ పల్స్‌కు తగ్గట్టుగా చిత్రాన్ని తెరకెక్కించే బోయపాటి శ్రీను డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ టీజర్, సాంగ్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. గురువారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. సరైన సింహం తగలనంతవరకు ప్రతీ వేటగాడు మగాడేరా.. అంటూ చెర్రీ చెప్పిన డైలాగ్ మాస్కు పిచ్చేక్కించేలా ఉంది. ఇప్పటివరకు యాక్షన్ సీన్స్‌ను తనదైన శైలిలో చూపించిన బోయపాటి.. చెర్రీలోని విశ్వరూపాన్ని చూపించేశారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతమందించారు. భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీ హీరోయిన్గా నటించారు. స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, వివేక్ ఒబేరాయ్ కీలకపాత్రల్లో నటించారు. జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. -
‘వినయ విధేయ రామ’ నుంచి ఫ్యామిలీ సాంగ్!
‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత రామ్ చరణ్.. బోయపాటి శ్రీను డైరెక్షన్లో రాబోతోన్న సంగతి తెలిసిందే. మాస్, యాక్షన్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న బోయపాటి.. ఈసారి తన మార్క్‌ను మిస్ కాకుండా.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా టచ్ చేయబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. ఇక టీజర్లో రామ్‌చరణ్ చెప్పిన రామ్.. కొ..ణి..దె..ల డైలాగ్ ఎంత పాపులర్ అయిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి ఫ్యామిలీ సాంగ్‌ను రిలీజ్చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సోమవారం (డిసెంబర్ 3) సాయంత్రం 4గంటలకు ఆ పాట (తందానే తందానే)ను విడుదల చేయనున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా విడుదలకానుంది. The wait is over! Releasing #VVRFirstSingle "Thandaane Thandaane" on 3rd December at 4PM#VinayaVidheyaRama #RamCharan @Advani_Kiara @vivekoberoi A Rockstar @ThisisDSP Musical... A Boyapati Sreenu Film... @DVVMovies pic.twitter.com/HgvuT6VQoC — DVV Entertainment (@DVVMovies) December 1, 2018 -
చెర్రీకీ అన్నీ ఆయన లక్షణాలే..!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీపావళికి చెర్రీ ఫస్ట్‌లుక్‌ను, టైటిల్‌ను ప్రకటించబోతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో చెర్రీ యుద్ధం చేయబోయేది (విలన్) బాలీవుడ్ విలక్షణ నటుడు వివేక్ ఒబేరాయ్‌తో అన్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా వివేక్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తైయిన సందర్భంగా ట్వీట్ చేస్తూ.. ‘కెమెరా ముందు యోధులం.. కెమెరా వెనక అన్నదమ్ములం.. ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించి ఇది నా చివరి రోజు.. ఇదొక ఎపిక్ ఎక్స్పీరియన్స్. ప్రతీ మూమెంట్‌ను ప్రేమించాను. నా బ్రదర్ రామ్‌చరణ్‌తో పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. నువ్వు చూపించిన ప్రేమకు, ఇచ్చిన గౌరవానికి, ఆతిథ్యానికి ధన్యవాదాలు. లెజెండరీ అయిన మీ నాన్నకు ఉన్న గొప్ప లక్షణాలన్నీ నీకూ ఉన్నాయి’ అంటూ చెర్రీని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. Camera on “WARRIORS” camera off “BROTHERS”! Last day of shoot for the film, epic experience! Loved every moment. My brother #RamCharan you are a delight to work with. Thank you for the love, respect & hospitality. You have all the great qualities of your legendary father! #RC12 pic.twitter.com/PCHdRickWt — Vivek Anand Oberoi (@vivekoberoi) November 3, 2018 -
డబుల్ హ్యాట్రిక్‌పై గురి
మాస్ ప్లస్ మాస్ ఈక్వెల్ టు ఊరమాస్. అదేనండి... బోయపాటి శ్రీను మార్క్ మాస్. ఇప్పటివరకూ ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలే అందుకు నిదర్శనం. ఇప్పుడు రామ్‌చరణ్‌తో మాంచి మాస్ మూవీ తీయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను జనవరి 19న స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అంతేకాదు మేజర్ షూట్‌ను రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్ బ్యాక్‌డ్రాప్‌లో జరపనున్నారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘‘లెజెండ్, సరైనోడు, జయజానకి నాయక విజయాలతో హ్యాట్రిక్ కంప్లీట్ చేశాను. రామ్‌చరణ్‌తో చేయబోయే సినిమా నా డబుల్ హాట్రిక్కు నాంది అవుతుంది. ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ మాస్ ఆడియన్స్‌కు సూపర్ కిక్ ఇస్తుంది’’ అన్నారు బోయపాటి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో హీరోయిన్గా నిన్నమొన్నటి వరకు రకుల్ ప్రీత్‌సింగ్, పూజా హెగ్డే పేర్లు వినిపించాయి. తాజాగా కియరా అద్వాని పేరు రేస్‌లోకి వచ్చింది. మరి.. ఈ రేస్‌లో ఫైనల్‌గా విన్ అయ్యేది ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న ‘రంగస్థలం’ చిత్రం మార్చి 30న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.