Skanda Song Nee Chuttu Chuttu: Ram Pothineni And Sreeleela Dance Moves - Sakshi
Sakshi News home page

Skanda Movie Song: స్టెప్పులతో కేక పుట్టించారు.. ఎవరూ తగ్గలేదు!

Published Thu, Aug 3 2023 10:36 AM | Last Updated on Thu, Aug 3 2023 11:21 AM

Skanda Movie Song Sreeleela Dance - Sakshi

యంగ్ హీరో రామ్ 'స్కంద' సినిమాతో సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా 'నీ చుట్టు చుట్టు తిరిగినా..' అనే లిరికల్ పాటని గురువారం రిలీజ్ చేశారు. మంచి ఫాస్ట్ బీట్‌తో ఉన్న ఈ సాంగ్.. మ్యూజిక్ లవర్స్ ని అలరిస్తోంది. మరోవైపు డ్యాన్స్ ప్రేమికుల్ని కూడా ఎంటర్‌టైన్ చేస్తోంది.

ఎందుకంటే రామ్ ఎలాంటి డ్యాన్సర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడికి శ్రీలీల లాంటి ఊరమాస్ డ్యాన్సర్ కాంబో సెట్ అయితే ఎలా ఉంటుంది. ఈ పాటలానే ఉంటుంది. క్లాస్ స్టెప్పులతో ఇద్దరూ పోటీపడ్డారు. లిరికల్ సాంగ్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. సెప్టెంబరు 15న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మాస్ యాక్షన్ స్టోరీతో తీసినట్లు తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement