Skanda Movie
-
స్కంద క్లైమాక్స్ సీన్‌పై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన రామ్
ఓపక్క ట్రోలింగ్.. మరోపక్క ట్రెండింగ్.. బోయపాటి సినిమాకే సాధ్యమైంది. సోషల్ మీడియాలో స్కంద సినిమా తప్పొప్పులను ఎత్తిచూపుతూ డైరెక్టర్‌ను ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతున్న స్కందను ఎగబడి మరీ చూస్తున్నారు జనాలు. కాగా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నవంబర్ 2న ఓటీటీలో విడుదలైంది. ఓటీటీలో ప్రతి సన్నివేశాన్ని జూమ్ చేసి మరీ చూస్తున్నారు. ప్రేక్షకులు. ఫైట్ సీన్లో బోయపాటి.. ఈ క్రమంలో ఓ ఇంటర్వెల్ ఫైట్‌లో రామ్ ఓ పోలీస్‌ను షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాతి ఫ్రేమ్‌లో ఆ సీన్‌ను చూసి షాకవుతున్న వారిలో ఆ చనిపోయిన వ్యక్తి కనిపిస్తాడు. దీంతో ఈ సీన్‌పై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. అలాగే క్లైమాక్స్ ఫైట్‌లో రామ్ దీపస్తంభాలు పట్టుకుని విలన్లను చంపుతాడు. ఈ సీన్లో తేడాను గమనించారు ఓటీటీ ఆడియన్స్. ఈ సన్నివేశంలో మొదట రామ్ పోతినేని కనిపించగా తర్వాతి షాట్లో రామ్‌కు బదులుగా బోయపాటి దర్శనమిచ్చాడు. దీంతో ఈ సీన్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై హీరో రామ్ స్పందించాడు. కాలి నుంచి రక్తం,, నడవలేని స్థితిలో.. '22 ఏప్రిల్, 2023 ఆ రోజు నాకు బాగా గుర్తుంది. వేసవి కాలంలో అత్యంత వేడిగా ఉన్న రోజుల్లో ఇది కూడా ఒకటి. మొత్తం 25 రోజుల షెడ్యూల్లో అది మూడవ రోజు.. అప్పుడు నా కాలి పరిస్థితి ఎలా ఉందో ఫోటోలో చూడొచ్చు. కనీసం నడవలేకపోయాను. కాలి పగుళ్ల నుంచి రక్తం కారింది. దర్శకుడు ఆ సన్నివేశం షూట్ అయిపోవాలన్నాడు. నా పరిస్థితి బాలేకపోవడంతో ఆ ఒకే ఒక్క సీన్లో తను నటించాడు. అందుకు దర్శకుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చెమట చిందించేందుకు ఎప్పుడూ సిద్ధం సినిమాలోని కంటెంట్ నచ్చడం, నచ్చకపోవడం అనేది మీ అభిప్రాయం. దాన్ని నేను గౌరవిస్తాను. మీకు వినోదాన్ని అందించడం కోసం నేను రక్తం, చెమట చిందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను' అని ట్వీట్ చేశాడు. దీనికి గాయపడిన కాలి ఫోటోను షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు 'మీ కష్టానికి విజయం దక్కకపోయినా పర్వాలేదు కానీ కనీసం అభినందనలైనా దక్కితే బాగుండేది' అని కామెంట్లు చేస్తున్నారు. 22.04.23 I still remember..it was one of the hottest days during the peak of summer..this was my feet after filming this episode on the 3rd day of the 25days..couldn’t walk properly..went away for a bit after it started to bleed..so My Director wanted to get the shot right n did… https://t.co/8cSOTW2H7b pic.twitter.com/4DXF0DYDFn — RAm POthineni (@ramsayz) November 4, 2023 చదవండి: శోభ సేఫ్, తేజ ఎలిమినేట్.. చేసిన పాపం ఊరికే పోతుందా? -
స్కంద సినిమాపై ట్రోల్ చేస్తున్న ఆడియన్స్
-
థియేటర్లో అట్టర్‌ఫ్లాప్.. ఓటీటీలో బ్లాక్‌బస్టర్ హిట్
మాస్ సినిమాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీను. మాస్ డైలాగులైనా, యాక్షన్ సీన్లయినా తన ఎనర్జీతో ఇరగదీసే హీరో రామ్ పోతినేని. వీరి కాంబోలో బొమ్మ పడితే బాక్సాఫీస్ దద్దరిల్లుతుందనుకున్నారంతా! కానీ అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. రామ్ పోతినేని- బోయపాటి కాంబోలో తెరకెక్కిన చిత్రం స్కంద. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో నెలలోపే ఓటీటీలోకి తీసుకురావాలని భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది. ఆ తర్వాత నవంబర్ 2న హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్కంద స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీలో స్కంద సినిమాను ఎగబడి మరీ చూస్తున్నారట! ఈ ఏడాది హాట్‌స్టార్‌లో రిలీజైన మొదటి 24 గంటల్లో ఎక్కువమంది వీక్షించిన సినిమాగా స్కంద నిలిచిందని తెలుస్తోంది. అప్పట్లో బోయపాటి.. బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా పెట్టి తీసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆడకపోయినా యూట్యూబ్‌లో మాత్రం రికార్డులు తిరగరాసింది. జయజానకి నాయక చిత్రం హిందీ డబ్బింగ్‌కు యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ వచ్చాయి. ఇప్పుడదే ట్రెండ్ హాట్‌స్టార్‌లోనూ కనిపిస్తోంది. మరోపక్క స్కంద సినిమా ఎడిటింగ్‌లో కొన్ని లోపాలున్నాయని విమర్శలూ వస్తున్నాయి. ఓ పక్క ట్రోలింగ్ జరుగుతున్నా మరోపక్క ట్రెండింగ్‌లో ఉండటం బోయపాటి సినిమాకే సాధ్యమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: భారతీయుడు 2 ఇంట్రో చూశారా? అదిరిపోయిందంతే! -
రామ్-బోయపాటి స్కంద మూవీ.. యాక్షన్ ఓకే.. రీ ఎంట్రీ ఎలా?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. జీ స్టూడియోస్‌తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇటీవలే ఓటీటీలో వచ్చిన స్కంద మూవీ ప్రేక్షకుల ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. నవంబర్ రెండో తేదీ నుంచే డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇది చదవండి: రాహుల్ సిప్లిగంజ్‌తో లవ్.. రతికా పేరేంట్స్ ఏమన్నారంటే?) సినిమా అన్నాక చిన్న చిన్న పొరపాట్లు జరగడం చూస్తుంటాం. ఎడిటింగ్‌లో అప్పుడప్పుడు కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతుంటాయి. ప్రస్తుతం రామ్ నటించిన స్కంద చిత్రంలోనూ అలాంటిదే జరిగింది. అయితే ఈ మూవీలోని ఓ సీన్ విషయంలో జరిగిన అతిపెద్ద పొరపాటు తాజాగా బయటకొచ్చింది. ఓటీటీలో సినిమా చూసిన ఓ ప్రేక్షకుడు.. ఆ సీన్‌ను కట్ చేసి ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే ఆ సీన్లో జరిగిన ఆ పెద్ద పొరపాటు ఏంటో తెలుసుకుందాం. సినిమా కథలో భాగంగా ఏపీ సీఎం కూతురిని (అజయ్ పుర్కర్) తీసుకురావడానికి.. తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి(శరత్ లోహితస్వ) వద్దకు రామ్ వెళ్తాడు. అదే సమయంలో ఫుల్ మాస్ యాక్షన్ సీన్ ఫైట్ జరుగుతుంది. అక్కడ రామ్ పవర్ఫుల్ డైలాగ్ కూడా చెబుతాడు. అయితే ఆ సీన్లో ఓ ముసలోడి పిస్టల్ తీసుకుని.. నిన్ను వదలను.. చంపేస్తా అంటూ రామ్ వైపు తుపాకి గురి పెడతాడు. అయితే రామ్ అదే తుపాకితీ అతన్ని కాల్చి పడేస్తాడు. కానీ ఆ తర్వాత వచ్చే సీన్లో చనిపోయిన ముసలోడు సీఎం వెనుక కనిపిస్తాడు. అదేంటి చనిపోయిన వ్యక్తి మళ్లీ సినిమాలో కనిపించడమేంటి? ఈ చిన్న మిస్టేక్ బోయపాటి గమనించలేకపోయాడా? అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత భారీ యాక్షన్ చిత్రంలో ఇలాంటి పొరపాటు ఏంటని సోషల్ మీడియా వేదికగా బోయపాటిని ఆడేసుకుంటున్నారు. (ఇది చదవండి: అంత అందంగా లేనన్నారు, వంక పెట్టారు: హీరోయిన్) స్కంద కాదు ఇది బోయపాటి గాడి బొంద🤦♂️ pic.twitter.com/p49ggMdbMQ — ఇవివి పంచ్ లు🤙 (@evvpunchlu333) November 2, 2023 -
నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయ్
నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాయి.. రామ్- బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'స్కంద' హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్- ఆట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్' నెట్‌ఫ్లిక్స్‌లో రన్ అవుతుంది. ఈ రెండు చిత్రాలను థియేటర్‌కు వెళ్లి చూడని వారు ఈ వీకెండ్లో ఇంట్లోనే కూర్చోని చూసి ఎంజాయ్ చేయవచ్చు. జవాన్- నెట్‌ఫ్లెక్స్ బాలీవుడ్ కలెక్షన్స్ కింగ్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కూడా వచ్చేసింది. నేడు నవంబర్ 2 షారుక్ పుట్టినరోజు సందర్భంగా 'జవాన్'ని ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. షారుక్ ఖాన్ తండ్రికొడుకుగా నటించిన 'జవాన్' సుమారు రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇందులో నయనతార,దీపికా పదుకోన్,విజయ్ సేతుపతి వంటి స్టార్స్ ఏ మాత్రం తగ్గకుండా మెప్పించారు. థియేటర్లో ఈ సినిమా చూడని వారు నెట్‌ఫ్లెక్స్‌లో చూడొచ్చు. స్కంద- హాట్‌స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ స్టూడియోస్‌తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. మొదటిరోజు నంచే ఈ చిత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేదు. తాజాగా హాట్‌స్టార్ ఓటీటీలో 'స్కంద' ఎంట్రీ ఇచ్చేసింది. అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. హిందీ వర్సెన్ కూడా ఉంటుందని ఆశించిన అభిమానులకు నిరాశే కలిగింది. థియేటర్లలో మెప్పించలేకపోయిన స్కంద.. ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో తరుణ్ భాస్కర్ 'కీడా కోలా'తో పాటు పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటి సంగతి పక్కనబెడితే ఓటీటీల్లో మాత్రం బోలెడన్ని కొత్తకొత్తగా మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే వీటిలో పలు తెలుగు స్ట్రెయిట్ చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయండోయ్. వాటిలో కొన్ని మాత్రం స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ వారం థియేటర్లలో వచ్చే సినిమాల సంగతి పక్కనబెడితే వివిధ ఓటీటీల్లో ఓవరాల్‌గా 32 సినిమాలు-వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. వీటిలో షారుక్ 'జవాన్', రామ్ 'స్కంద' చిత్రాలతో పాటు ఆర్య, స్కామ్ 2003 సిరీసులు కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని ఇంగ్లీష్, హిందీ సినిమాలు, సిరీసులు ఉన్నాయి. ఇంతకీ ఇవన్నీ ఏయే ఓటీటీల్లో ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్) OTTల్లో ఈ వారం విడుదలయ్యే మూవీస్-వెబ్ సిరీసులు (అక్టోబరు 31- నవంబరు 5) నెట్‌ఫ్లిక్స్ లాక్డ్ ఇన్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 01 న్వువో ఒలింపో (ఇటాలియన్ సినిమా) - నవంబరు 01 వింగ్ ఉమెన్ (ఫ్రెంచ్ చిత్రం) - నవంబరు 01 ఆల్ ద లైట్ వుయ్ కాంట్ సీ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 02 సిగరెట్ గర్ల్ (ఇండోనేసియన్ సిరీస్) - నవంబరు 02 హిగ్యుటా: ద వే ఆఫ్ ద స్కార్పియన్ (స్పానిష్ సినిమా) - నవంబరు 02 జవాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 02 ఒనిముషా (జపనీస్ సిరీస్) - నవంబరు 02 యూనికార్న్ అకాడమీ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 02 బ్లూ ఐ సమురాయ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 03 డైలీ డోస్ ఆఫ్ సన్‌షైన్ (కొరియన్ సిరీస్) - నవంబరు 03 ఫెర్రీ: ద సిరీస్ (డచ్ సిరీస్) - నవంబరు 03 న్యాద్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 03 సెల్లింగ్ సన్‌సెట్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 03 స్లై (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 03 ద టైలర్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - నవంబరు 03 మ్యాడ్ (తెలుగు సినిమా) - నవంబరు 03 అమెజాన్ ప్రైమ్ నకుల్ గర్ల్ (జపనీస్ సినిమా) - నవంబరు 02 తాకేషి క్యాసిల్ జపాన్ (జపనీస్ సిరీస్) - నవంబరు 02 టేక్ హిజ్ క్యాజిల్ (హిందీ సిరీస్) - నవంబరు 02 ఇన్విన్సబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 03 PI మీనా (హిందీ సిరీస్) - నవంబరు 03 (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో సందీప్ ఎలిమినేషన్.. ఆ ఒక్కటే మైనస్ అయిందా?) హాట్‌స్టార్ బిహైండ్ ద ఎట్రాక్షన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 01 ద త్రీ డిటెక్టివ్స్ (జర్మన్ సిరీస్) - నవంబరు 01 స్కంద (తెలుగు సినిమా) - నవంబరు 02 ఆర్య సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 03 ఆహా ఆర్ యూ ఓకే బేబీ? (తమిళ సినిమా) - అక్టోబరు 31 సోనీ లివ్ స్కామ్ 2003: ద తెల్గీ స్టోరీ Vol 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 03 బుక్ మై షో హాఫ్ వే హోమ్ (హంగేరియన్ మూవీ) - నవంబరు 03 మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 03 ద థీప్ కలెక్టర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 03 ఆపిల్ ప్లస్ టీవీ ఫింగర్ నెయిల్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 03 జియో సినిమా టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (హిందీ సిరీస్) - నవంబరు 03 (ఇదీ చదవండి: Bigg Boss 7: సందీప్ ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?) -
ఓటీటీకి స్కంద మూవీ.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. జీ స్టూడియోస్‌తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. (ఇది చదవండి: 40 ఏళ్ల బ్యూటీ.. లిప్‌లాక్ సీన్.. ఇంకా అవుట్ కాలేదు..!) అయితే ఈ సినిమా మొదట అక్టోబర్ 27 నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిసింది. కానీ అలా జరగలేదు. ఓటీటీకి రిలీజ్‌పై సస్పెన్ష్ నెలకొంది. స్కంద స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల కొత్త తేదీని హాట్‌స్టార్ ప్రకటించింది. నవంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను రిలీజ్ చేసింది. (ఇది చదవండి: టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్‌కు అన్ని రోజులు పట్టిందా?) View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel) -
Skanda OTT Release: ఓటీటీలోకి మరింత ఆలస్యంగా రానున్న స్కంద!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం స్కంద. జీ స్టూడియోస్‌తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. తీరా థియేటర్లలో విడుదలయ్యాక ఈ చిత్రం బొక్కబోర్లా పడింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా పేలవంగా వచ్చాయి. ఈ సినిమా అక్టోబర్ 27 నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిసింది. అనుకున్నట్లుగానే ఆమేరకు ప్రకటన సైతం వెలువడింది. అయితే అంతలోనే స్కంద ఓటీటీ విడుదల వాయిదా పడింది. ఈరోజు ఓటీటీలోకి రావాల్సిన ఈ చిత్రం మరికొద్ది రోజుల తర్వాతే హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు కొత్త డేట్‌ను ప్రకటించనున్నట్లు హాట్‌స్టార్ వెల్లడించింది. Bringing MASS like never experienced before🕺🏽 Announcement coming at 5pm today 🕔 @disneyplushstel #RapoRampageonHotstar @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake @StunShiva8 @ZeeStudios_ @lemonsprasad… pic.twitter.com/O5wcuBSE8R — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) October 27, 2023 చదవండి: హీరోయిన్‌తో ప్రేమలో ఉన్న హీరో.. ఇలా దొరికిపోతాననుకోలేదంటూ.. -
గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?
తమన్ పేరు చెప్పగానే దద్దరిల్లిపోయే పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గుర్తొస్తాయి. పలు సినిమాల్ని తన సంగీతంతో ఓ రేంజులో ఎలివేట్ చేశాడు. వాటిలో 'అఖండ' ఒకటి. బాలకృష్ణ హీరో, బోయపాటి డైరెక్టర్ అయినా సరే ఈ మూవీ విషయంలో ఎక్కువ క్రెడిట్ తమన్దేనని ప్రేక్షకుల అభిప్రాయం. కానీ మొన్నీమధ్య ఓ ఇంటర్వ్యూలో తమన్ కష్టం ఏం లేదన్నట్లు మాట్లాడాడు. ఇప్పుడు ఆ కామెంట్స్‌పై స్వయంగా తమన్ పరోక్షంగా కౌంటర్ కామెంట్స్ చేశాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా 'స్కంద' మూవీ తీశారు. గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. ఫైట్స్ తప్ప మరే విషయంలోనూ మెప్పించలేకపోయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'అఖండ'కి తమన్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది కదా అని జర్నలిస్ట్ అడగ్గా.. 'ఆ సినిమాను ఆర్ఆర్ (రీరికార్టింగ్) లేకుండా చూసినా మీరు గర్వంగా ఫీలవుతారు. దానికి అంత దమ్ము ఉంటుంది. అదే టైంలో ఆ పర్టిక్యులర్ కల్ట్ మీద తమన్ అద్భుతంగా చేయగలిగాడు' అని బోయపాటి చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఓటీటీలో 'ప్రేమ విమానం' సినిమాకు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్) ఇలా బోయపాటి కామెంట్స్ చేసిన ఒకటి రెండు రోజుల్లోనే తమన్.. 'ఐ డోంట్ కేర్' అని ట్వీట్ వేశాడు. ఇది బోయపాటిని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ అని అందరూ అనుకున్నారు. తాజాగా 'భగవంత్ కేసరి' సక్సెస్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన తమన్.. బాలకృష్ణ ముందే బోయపాటి పరువు తీసేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 'మంచి సీన్‌ని మనం చెడగొట్టం. మనం ఇంకా దాన్ని ఎలివేట్ చేయాలనే చూస్తాం. అక్కడ సీన్లో ఎమోషన్ లేకపోతే నేను ఏం చేసినా వర్కౌట్ కాదు. ఎవడి వల్ల అవ్వదు. చచ్చిన శవం తీసుకొచ్చి బతికించమంటే ఎలా? అంతే లాజిక్ ఇక్కడ. బ్యాక్ గ్రౌండ్ స్కోరు అంటారు గానీ అక్కడ మేటర్ లేకపోతే నేనేం చేయను. అక్కడ వాళ్లు(దర్శకులు) ఇవ్వాలి' అని తమన్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతా చూస్తుంటే ఈ గొడవ ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) #Thaman Comments 🤷pic.twitter.com/XDDsBF6Zk3 — CineCorn.Com By YoungMantra (@cinecorndotcom) October 25, 2023 -
ఓటీటీలో 'స్కంద' స్ట్రీమింగ్
బోయపాటి శ్రీను- రామ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం స్కంద. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించింది. గత నెల 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేయడానికి ఈ మాస్ సినిమా సిద్దమైంది. సినిమా విషయంలో మిశ్రమ స్పందన వచ్చినా బోయపాటి మార్క్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. సుమారు రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన స్కంద అక్టోబరు 27వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘స్కంద’ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలని మొదట స్కందతో ఒప్పందం కుదిరిందట. అయితే ఇప్పుడు ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు సమాచారం. స్కంద సినిమాకు థమన్ స్వరాలు సమకూర్చారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీనివాస్ చిట్టూరి, పవన్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక స్కంద తర్వాత రామ్ పోతినేని- పూరి కాంబినేషన్లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు. -
ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 28 సినిమాలు
మరోవారం వచ్చేసింది. దసరా సందర్భంగా గతవారం థియేటర్లలోకి వచ్చిన లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఈ వారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేం లేవు. దీంతో అందరూ దృష్టి ఆటోమేటిక్‌గా ఓటీటీలపై పడుతుంది. వీటిలో కొత్త మూవీస్ ఏమొచ్చాయి? వాటిలో ఏం చూద్దామనే తాపత్రయంతో ఉంటారు. అలా ఈవారం 28 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. (ఇదీ చదవండి: Bigg Boss 7: గేమ్ పేరు చెప్పి మోసం? నవ్వుతున్నారనే సోయి లేకుండా!) దాదాపు 28 వరకు ఓటీటీల్లోకి వస్తున్నాయి. అయితే వీటిలో చంద్రముఖి 2, స్కంద, చాంగురే బంగారు రాజా సినిమాలతో పాటు మాస్టర్ పీస్ అనే వెబ్ సిరీస్ ఆసక్తిగా అనిపిస్తుంది. వీటితోపాటు పలు హిందీ, ఇంగ్లీష్ మూవీస్, వెబ్ సిరీసులు కూడా పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఓవరాల్ లిస్ట్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్-వెబ్ సిరీస్ జాబితా (అక్టోబరు 23-29) అమెజాన్ ప్రైమ్ పరంపోరుల్ (తమిళ సినిమా) - అక్టోబరు 24 ఏస్ప్రింట్స్ సీజన్ 2 (హిందీ సిరీస్) - అక్టోబరు 25 ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ద బీస్ట్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 26 కన్సక్రేషన్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 27 నెట్‌ఫ్లిక్స్ బర్నింగ్ బిట్రేయల్ (పోర్చుగీస్ సినిమా) - అక్టోబరు 25 లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 25 చంద్రముఖి 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబరు 26 లాంగ్ లివ్ లవ్ (థాయ్ సినిమా) - అక్టోబరు 26 ప్లూటో (జపనీస్ సిరీస్) - అక్టోబరు 26 పెయిన్ హజ్లర్స్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 27 సిస్టర్ డెత్ (స్పానిష్ సినిమా) - అక్టోబరు 27 టోర్ (స్వీడిష్ సిరీస్) - అక్టోబరు 27 ఎల్లో డోర్: 90స్ Lo-Fi ఫిల్మ్ క్లబ్ (కొరియన్ సినిమా) - అక్టోబరు 27 కాస్ట్ ఎవే దివా (కొరియన్ సిరీస్) - అక్టోబరు 28 సోనీ లివ్ పెబ్బల్స్ (తమిళ సినిమా) - అక్టోబరు 27 ఆహా పరంపోరుల్ (తమిళ సినిమా) - అక్టోబరు 24 ఈ-విన్ చాంగురే బంగారు రాజా (తెలుగు మూవీ) - అక్టోబరు 27 జియో సినిమా ఫోన్ కాల్ (హిందీ సినిమా) - అక్టోబరు 23 జీ5 దురంగ సీజన్ 2 (హిందీ సిరీస్) - అక్టోబరు 24 నికోంజ్ - ద సెర్చ్ బిగిన్స్ (బెంగాలీ సినిమా) - అక్టోబరు 27 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మాస్టర్ పీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబరు 25 కాఫీ విత్ కరణ్ సీజన్ 8 (హిందీ టాక్ షో) - అక్టోబరు 26 స్కంద (తెలుగు సినిమా) - అక్టోబరు 27 హెచ్ఆర్ ఓటీటీ నడికలిల్ సుందరి యమున (మలయాళ సినిమా) - అక్టోబరు 23 బుక్ మై షో నైట్స్ ఆఫ్ జొడాయిక్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 24 లయన్స్ గేట్ ప్లే కాబ్ వెబ్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 27 ఆపిల్ ప్లస్ టీవీ కర్సెస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 27 ద ఎన్ఫీల్డ్ పొల్టర్గిస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 27 (ఇదీ చదవండి: చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!) -
ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
రామ్-బోయపాటి కాంబోలో వచ్చిన యాక్షన్ మూవీ 'స్కంద'. గత నెల చివర్లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. కేవలం మాస్‌ని మాత్రమే ఆకట్టుకుంది. తొలి రెండు మూడు రోజులు కలెక్షన్స్ వచ్చాయి గానీ ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా డల్ అయిపోయింది. గత వారం కొత్త సినిమాలు రాకతో పూర్తిగా సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీలకు పెళ్లి? ఈ రూమర్స్‌లో నిజమెంత?) 'స్కంద' సంగతేంటి? బోయపాటి సినిమా అంటే లాజిక్స్ అసలు వెతకాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో తీసిన సినిమాల్లో యాక్షన్, స్టోరీని బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన ఈ డైరెక్టర్.. 'స్కంద' విషయంలో దాన్ని పక్కనబెట్టేశాడు. అయితే ఈ మూవీ యాక్షన్ లవర్స్ కి నచ్చింది గానీ ఓవరాల్‌గా చూసుకుంటే యావరేజ్‌గా నిలిచింది. లాభాల కంటే నష్టాలే వచ్చాయని తెలుస్తోంది. ఓటీటీలోకి అప్పుడేనా? థియేటర్లలో రిలీజ్‌కి ముందే 'స్కంద' డిజిటల్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. ఇక సినిమా రిలీజైన నెలలోపే అంటే అక్టోబరు 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుందని అంటున్నారు. ఇది నిజమే కావొచ్చు గానీ అధికారిక ప్రకటన వస్తే గానీ క్లారిటీ రాదు. ఇదిలా ఉండగా 'స్కంద'కి సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు కానీ ఫస్ట్ పార్ట్ రిజల్ట్ చూస్తుంటే.. రెండో భాగం తీస్తారా అనే డౌట్ వస్తోంది. (ఇదీ చదవండి: గిఫ్ట్ ఇచ్చిన సమంత.. అతడు తెగ మురిసిపోయాడు!) -
యంగ్ హీరోల కొంపముంచిన బోయపాటి!
ఊరమాస్ సినిమాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీను. ఆయన మేకింగ్‌లో ఓ పవర్ ఉంటుంది. అది మాస్ ఆడియన్స్‌కు ఎక్కడలేని కిక్ అందిస్తుంది. అయితే ఇది కేవలం సీనియర్ హీరోల విషయంలోనే జరుగుతుంది. యంగ్ హీరోలకు మాత్ర బోయపాటి భారీ ఫ్లాపులను అందిస్తున్నాడు. ఒక్క అల్లు అర్జున్ తప్ప మిగతా ఏ యంగ్ హీరోలకి బోయపాటి హిట్ అందించలేదు. 2012లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ‘దమ్ము’ తీశాడు. అది బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో జయ జానకి నాయక(2017) తీస్తే..అది హిట్ కాలేదు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రం చేయగా.. అది కూడా ఫ్లాప్ అయింది. ఇక తాజాగా రామ్ పోతినేనితో ‘స్కంద’ చేయగా..అది కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. బోయపాటిపై ‘స్కంద’ ఎఫెక్ట్! బోయపాటిపై ‘స్కంద’ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. స్కంద రిలీజ్‌కు ముందు ఆయన తర్వాత సినిమా బన్నీతో ఉంటుందనే వార్తలు వినిపించాయి. మరోవైపు సూర్య కూడా బోయపాటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వచ్చింది. చిరంజీవీ కూడా బోయపాటితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే స్కంద రిలీజ్ తర్వాత మాత్రం ఈ పుకార్లు వినిపించడం లేదు. పైగా బోయపాటితో సినిమా చేయడానికి యంగ్ హీరోలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య కూడా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవి కూడా ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో బోయపాటి మళ్లీ బాలయ్యతోనే సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీ టాక్. -
స్కంద మూవీలో రామ్‌కు చెల్లెలిగా నటించిందెవరో తెలుసా?
మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను- ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే! వీరి కాంబినేషన్లో వచ్చిన తాజా ఊరమాస్ చిత్రం స్కంద. ఈ మూవీలో రామ్ నటనకు, లుక్కు అభిమానులు ఫిదా అయ్యారు. తన యాక్షన్‌కు థియేటర్స్‌లో విజిల్స్ వేస్తున్నారు. మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రంలో రామ్ పోతినేనికి చెల్లిగా ఓ కొత్త అమ్మాయి నటించింది. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఈమె ఎవరో కచ్చితంగా తెలిసే ఉంటుంది. రామ్‌కు చెల్లిగా నటించిన ఆమె పేరు అమృత చౌదరి. ఈమె పక్కా తెలుగమ్మాయి. తనది భీమవరం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అమృత చౌదరి కాలేజీ డేస్‌లోనే యాక్టింగ్‌లో తన టాలెంట్ చూపించింది. పలు షార్ట్ ఫిలింస్‌లో నటించిన ఈ బ్యూటీ కవర్ సాంగ్స్‌లోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో నటిగా ట్రై చేస్తోంది. ఈ క్రమంలో స్కంద మూవీలో హీరోకి చెల్లెలిగా నటించింది. ఈ ఛాన్స్‌తో ఆమె దశ తిరిగిపోవడం ఖాయం అంటున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ఎప్పుడూ ఏదో ఒక ఫోటో, వీడియోతో అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటోంది. హీరోయిన్‌కు తానేం తక్కువ కాదన్నట్లుగా అందాలు ఆరబోస్తోంది. View this post on Instagram A post shared by AMRUTHA CHOWDARY✨ (@__amrutha__chowdary__) చదవండి: తేజపై విరుచుకుపడ్డ నాగ్.. జైలు శిక్ష తక్కువే.. నేరుగా ఇంటికి పంపించేయడమే.. -
'స్కంద' కలెక్షన్స్.. సగానికి సగం పడిపోయాయి!
యంగ్ హీరో రామ్-బోయపాటి కాంబోలో వచ్చిన సినిమా 'స్కంద'. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని.. బోయపాటి తనదైన శైలిలోనే తీశారు. రామ్ గెటప్స్‌తో పాటు తమనే నేపథ్య సంగీతం థియేటర్లని దడదడలాడిస్తోంది. మరోవైపు తొలిరోజు కళ్లుచెదిరే వసూళ్లు రాగా, రెండో రోజు సగానికి సగం పడిపోయాయి. తాజాగా పోస్టర్ రిలీజ్ చేయడంతో ఈ విషయం క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!) స్కంద సంగతేంటి? బోయపాటి సినిమాలంటే లాజిక్స్ వెతక్కూడదు. హీరోలు లార్జర్ దేన్ లైఫ్ పాత్రల్లో కనిపిస్తుంటారు. ఇందులో హీరో పాత్ర అంతకు మించే ఉంటుంది. మిగతా వాళ్లకు పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు గానీ మాస్ ఆడియెన్స్‌కి మాత్రం ఈ సినిమా నచ్చేస్తుంది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.18.2 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. రెండోరోజు వచ్చేసరికి సగానికి పైగా వసూళ్లు పడిపోయాయి. సగానికి సగం అంటే తొలిరోజు రూ.18.2 కోట్లు వసూలు కాగా, రెండో రోజు రూ.9.4 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.27.6 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని అధికారికంగా రిలీజ్ చేశారు. అయితే వీకెండ్ అయ్యేసరికి 'స్కంద' ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి? మరోవైపు 'స్కంద' మేకింగ్ వీడియోని కూడా తాజాగా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ.. పెళ్లికి అంతా సెట్!) -
ఈ వారం నాలుగు సినిమాలు.. రివ్యూలివే
టాలీవుడ్లో ఈ వారం పెద్ద సినిమాల హవా కొనసాగింది. రామ్ పోతినినే స్కందతో పాటు లారెన్స్ ‘చంద్రముఖి -2’, శ్రీకాంత్ అడ్డాల ‘పెదకాపు’చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. వీటితో పాటు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘ది వాక్సిన్ వార్’ కూడా ఈ నెల 28నే విడుదలయ్యాయి. మరి ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ‘సాక్షి’ రివ్యూల్లో చదవండి. స్కంద: నో లాజిక్.. ఓన్లీ యాక్షన్ రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం ‘స్కంద’. బోయపాటి సినిమాలు అంటేనే హై వోల్టేజ్ యాక్షన్ కథ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్కంద కూడా అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథేంటి? ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్? ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చంద్రముఖి-2: భయపెట్టని హార్రర్ రజనీకాంత్, పీ.వాసు కాంబోలో వచ్చిన చంద్రముఖి(2005) అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తమిళ్లోనే కాదు తెలుగులో ఆ చిత్రం భారీ వసూళ్లని రాబట్టింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. పైగా చంద్రముఖిగా బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ నటించడంతో ‘చంద్రముఖి-2’పై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఏర్పడాయి. మరి ఆ అంచనాలు ఈ చిత్రం ఏ మేరకు అందుకుంది? చంద్రముఖిగా కంగనా భయపెట్టిందా లేదా? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) పెదకాపు-1..తడబడిన సామ్యానుడి సంతకం ఫ్యామిలీ సినిమాకు కేరాఫ్ శ్రీకాంత్ అడ్డాల. ఒక నారప్ప మినహా ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ కుటుంబ, ప్రేమ కథలే. అలాంటి దర్శకుడు రాజకీయ నేపథ్యంతో ‘పెదకాపు’ అనే సినిమాను తెరకెకించాడు. అది కూడా కొత్త హీరోహీరోయిన్లతో. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ‘పెద కాపు -1’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సామాన్యుడి సంతకం అంటూ వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘ది వ్యాక్సిన్ వార్’ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో వివేక్ అగ్నిహోత్రి నేషనల్ వైడ్‌గా కాంట్రవర్సీ అయ్యాడు. అంతకు ముందు పలు చిత్రాలను తెరక్కించినా.. ది కాశ్మీర్ ఫైల్స్’తోనే అతనికి గుర్తింపు వచ్చింది. తాజాగా వివేక్ అగ్నిహోత్రి తెరక్కించిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజల దుస్థితి ఎలా ఉంది? వ్యాక్సిన్ కనుగోనేందుకు భారత శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ క్రమంలో మన శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సమస్యలేంటి? అనే నేపథ్యంలో ది వ్యాక్సిన్ వార్ సాగుతుంది ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రామ్ పోతినేని స్కంద.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో వచ్చిన తాజా చిత్రం స్కంద. ఈ మూవీలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈనెల 28న థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. పక్కా మాస్ మూవీగా రూపొందించిన ఈ మూవీ తొలిరోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.18.2 కోట్ల వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.8.62 వసూళ్లు రాబట్టింది. అయితే కేవలం మాస్ ఆడియన్స్ మెప్పించేలా ఉన్న ఈ చిత్రం నైజాంలో అత్యధికంగా రూ.3.23 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఓవరాల్‌గా చూస్తే రామ్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా స్కంద నిలిచింది. కాగా.. ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రిన్స్, దగ్గుబాటి రాజా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కించబోతున్నట్లు రామ్, బోయపాటి శ్రీను ప్రకటించారు. -
స్కంద సినిమా హిట్టా..ఫట్టా..
-
'స్కంద' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
సెప్టెంబరు 28 పేరు చెప్పగానే మొన్నటివరకు 'సలార్' గుర్తొచ్చేది. కానీ అది వాయిదా పడేసరికి ఈ తేదీ కోసం మిగతా సినిమాలన్నీ పోటీపడ్డాయి. ఈ క్రమంలోనే రామ్ 'స్కంద' ఇదేరోజున అంటే తాజాగా థియేటర్లలోకి వచ్చింది. బోయపాటి మార్క్ సినిమాల తరహాలోనే ఇది ఉంది. యాక్షన్ ప్రియుల్ని అలరిస్తున్న ఈ చిత్రం అలానే ఓటీటీ పార్ట్నర్తో పాటు స్ట్రీమింగ్ టైమ్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 'స్కంద' కథేంటి? ఏపీ ముఖ్యమంత్రి (అజయ్ పుర్కన్) కూతురి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ వేడుకకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి (శరత్ లోహితస్వ) కొడుకుతో లేచిపోతుంది. దీంతో సీఎంలు ఇద్దరూ ఒకరిపై ఒకరు పగ పెంచుకుంటారు. తన కూతురిని తిరిగి రప్పించడం కోసం ఏపీ సీఎం ఓ కుర్రాడిని(రామ్ పోతినేని) తెలంగాణకు పంపిస్తాడు. తెలంగాణ సీఎంకి ఓ కూతురు (శ్రీలీల) ఉంటుంది. ఓ సందర్భంలో ఈ కుర్రాడు.. ఇద్దరు ముఖ్యమంత్రుల కుమార్తెలని తీసుకెళ్లిపోతాడు. అసలు ఈ కుర్రాడెవరు? ఎందుకు తీసుకెళ్లాడనేది 'స్కంద' స్టోరీ. (ఇదీ చదవండి: Skanda Movie Review: ‘స్కంద’ మూవీ రివ్యూ) ఎలా ఉంది? బోయపాటి గత సినిమాల్లో ఓ మాదిరిగా అయినా కథ ఉండేది. ఇందులో పెద్దగా అలాంటిదేం లేదు. కమర్షియల్ చిత్రాల్లో నలిగిపోయిన రొటీన్ రివేంజ్ డ్రామానే తీసుకున్నాడు. కానీ సినిమా మొదలైన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు తనదైన మార్క్ సన్నివేశాలతో నడిపించేశాడు. యాక్షన్ లవర్స్, మాస్ ఆడియెన్స్‌కి ఇది నచ్చేయొచ్చు కానీ మిగతా వాళ్లకు కాస్త కష్టమే. ఓటీటీ డీటైల్స్ ఇకపోతే రిలీజ్‌కి ముందే 'స్కంద' మూవీ డిజిటల్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుంది. చేసుకున్న ఒప్పందం ప్రకారం నెల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుందట. అంటే సెప్టెంబరు 28న థియేటర్లలోకి సినిమా వచ్చింది కాబట్టి అక్టోబరు చివరి వారంలో ఇందులో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రావొచ్చని సమాచారం. కొన్నిరోజులు ఆగితే దీనిపై క్లారిటీ వచ్చేస్తుందిలే! (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు) -
Skanda Movie Review: ‘స్కంద’ మూవీ రివ్యూ
టైటిల్: స్కంద నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, పృథ్వీ రాజ్, ప్రిన్స్ సిసల్, ఇంద్రజ, మురళీ శర్మ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మాత: శ్రీనివాస చిట్టూరి దర్శకుడు: బోయపాటి శ్రీను సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ: సంతోష్ డేటాకే ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: సెప్టెంబర్ 28, 2023 ‘స్కంద’ కథేంటంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయుడు(అజయ్ పుర్కర్) తన కూతరు పెళ్లి జరిపించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటాడు. గవర్నర్‌తో సహా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం పెళ్లికి హాజరవుతారు. అయితే ముహుర్తానికి కొన్ని క్షణాల ముందు ఏపీ సీఎం కూతురిని తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి(శరత్ లోహితస్వ) కొడుకు లేపుకెళ్తాడు. దీంతో ఏపీ సీఎం.. తెలంగాణ సీఎంపై పగ పెంచుకుంటాడు. తన పరువు దక్కాలంటే తన కూతురు తిరిగి రావాలని భావిస్తాడు. దాని కోసం ఓ కుర్రాడిని (రామ్ పోతినేని) తెలంగాణకు పంపిస్తాడు. ఏపీ సీఎం కుమార్తెతో తెలంగాణ సీఎం కొడుకు నిశ్చితార్థం జరిగే కొద్ది క్షణాల ముందు.. రామ్ వచ్చి ఏపీ సీఎం కూతురితో పాటు తెలంగాణ సీఎం కూతురి(శ్రీలీల)ని కూడా తీసుకెళ్తాడు. ఎందుకలా చేశాడు? అతను ఎవరు? ప్రముఖ వ్యాపారవేత్త రుద్రగంటి రామకృష్ణరాజు(శ్రీకాంత్)కు, ఇద్దరు సీఎంలతో ఉన్న వైర్యం ఏంటి? రామకృష్ణ రాజుకు, రామ్‌కు(ఈ సినిమాలు హీరో పాత్రకు పేరు లేదు) ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో 'స్కంద' చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ అనే పదానికి కేరాఫ్ అంటే బోయపాటి శ్రీను అనే చెప్పాలి. ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన 9 సినిమాలు మాస్ ఆడియన్స్‌ని మెప్పించేలా ఉంటాయి. స్కంద కూడా అదే స్థాయిలో తెరకెక్కించాడు. అయితే బోయపాటి సినిమాల్లో లాజిక్కులు ఉండవు. హీరో ఏ స్థాయి వ్యక్తినైన ఈజీగా కొట్టగలడు. కాలితో తన్నితే కార్లు సైతం బద్దలవ్వాల్సిందే. ఇదంతా గత సినిమాల్లో చూశాం. ఇక స్కందలో అయితే రెండు అడుగులు ముందుకేశాడు. లాజిక్కు అనే పదమే వాడొద్దనేలా చేశాడు. ఎంతలా అంటే.. ఒక సీఎం ఇంటికి ఓ సామాన్యుడు ట్రాక్టర్ వేసుకొని వెళ్లేంతలా. ఇద్దరు ముఖ్యమంత్రులు అతని చేతిలో తన్నులు తినేంతలా. ఒక ముఖ్యమంత్రి వీధి రౌడీ కంటే నీచంగా బూతులు మాట్లాడేంతలా. పోలీసు బెటాలియన్ మొత్తం దిగి గన్ పైరింగ్ చేస్తుంటే మన హీరోకి ఒక్కటంటే.. ఒక్క బుల్లెట్ కూడా తగలదు అంటే అది బోయపాటితోనే సాధ్యమని స్కందలో చూపించాడు. ఇవన్నీ మాస్ ఆడియన్స్‌ని ఈలలు వేయిస్తే.. సామాన్య ప్రేక్షకులను మాత్రం సిల్లీగా కనిపిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్త రుద్రగంటి రామకృష్ణరాజు(శ్రీకాంత్) జైలు సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు సంబంధించిన ఆసక్తికర సన్నివేశాలతో అసలు కథలోకి తీసుకెళ్తాడు. హీరో ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఆ తర్వాత కథ కాస్త చప్పగా సాగుతుంది. కాలేజీ సీన్స్ అంతగా ఆకట్టుకోలేవు. హీరో ఎంట్రీ, అతనికిచ్చిన ఎలివేషన్స్ బట్టి ఏదో జరుగబోతుందనే ఆసక్తి ఆడియన్స్‌లో కలుగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ట్విస్ట్ కూడా సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక బోయపాటి సినిమా గత సినిమాల మాదిరి స్కంద సెకండాఫ్ కూడా ఫ్లాష్‌బ్యాక్‌తో ప్రారంభమవుతుంది. రుద్రగంటి రామకృష్ణరాజు ఎందుకు జైలు పాలయ్యాడు? హీరో నేపథ్యం ఏంటి? తదితర సన్నివేశాలతో సెకండాఫ్ సాగుతుంది. క్లైమాక్స్ 15 నిమిషాల ముందు వచ్చే యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. అదే సమయంలో విపరీతమైన హింస, అనవసరపు సంభాషణలు ఓ వర్గం ప్రేక్షకులను ఇబ్బందిని కలిగిస్తాయి. యాక్షన్ సీన్స్ పండినంతగా ఎమోషనల్ సన్నీవేశాలు పండలేదు. క్లైమాక్స్ ట్వీస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. ఓవరాల్‌గా మాస్ ఆడియన్స్‌కి అయితే బోయపాటి ఫుల్ మీల్స్ పెట్టాడనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. మాస్ పాత్రలు రామ్‌కి కొత్తేమి కాదు. ఇంతకు ముందు జగడం, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో ఆ తరహా పాత్రలు చేశాడు. అయితే స్కందలో మాత్రం ఊరమాస్ యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. యాక్షన్స్ సీన్స్. హీరోయిన్లు శ్రీలీల, సయీ మంజ్రేకర్ పాత్రల పరిధి చాలా తక్కువ. అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించారు. శ్రీలీల తనదైన డ్యాన్స్‌తో మరోసారి ఆకట్టుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా అజయ్ పుర్కర్, శరత్ లోహితస్వ తమ పాత్రల పరిధిమేర నటించారు. వ్యాపారవేత్తగా శ్రీకాంత్ చక్కగా నటించాడు.దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సంతోష్ డేటాకే సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఎక్కడ రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Skanda Review: ‘స్కంద’ మూవీ ట్వీటర్ రివ్యూ
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘‘స్కంద’-ది ఎటాకర్’. రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు,టీజర్ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. స్కంద మూవీ ఎలా ఉంది?స్టోరీ ఏంటి? తదితర విషయాలు ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. Good First Half Sound effects could have been less in fights Boya Senseless Mass Logics pekkana petti chudandi #Skanda https://t.co/6XUAzzuu2i — ʜᴜɴɢʀʏ ᴄʜᴇᴇᴛᴀʜ (@SiddarthRoi) September 28, 2023 సాధారణంగా ఓవర్సీస్ ఏరియాల్లో సినిమా ముందుగా రిలీజ్ అవుతుంది. అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఒక్క రోజు ముందే ప్రీమియర్ షోలు పడతాయి. కానీ స్కంద టీమ్ మాత్రం ఓవర్సీస్లో ప్రీమియర్లు వేయలేదు. ఇండియాలో ఎప్పుడైతే విడుదల అవుతుందో.. అప్పుడే విదేశాల్లోనూ బొమ్మ పడుతుంది. ఈ రోజు మార్నింగ్ కొన్ని చోట్ల షో పడిపోయింది. ట్విటర్లో పలువురు షేర్ చేస్తున్న ప్రకారం సినిమాలో కథా బలం తక్కువగా ఉన్నా రామ్ పోతినేని మాస్ ఎనర్జీతో మెప్పించాడని చెబుతున్నారు. ఎక్కువగా మాస్ ఆడియన్స్‌కు బాగా నచ్చుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇందులో రామ్ ఫైట్స్ ఎలివేషన్‌తో పాటు తమన్ మ్యూజిక్ బాగా ప్లస్ అయిందని సమాచారం. ఫస్టాఫ్ కొంతమేరకు యావరేజ్‌గా ఉన్నా ఫైనల్లీ సినిమా బాగుందనే అభిప్రాయం ఎక్కువ మంది తెలుపుతున్నారు. రామ్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడా నిరుత్సాహం చెందరని.. రామ్ ఎనర్జీతో సినిమాను మరో రేంజ్‌కు తీసుకుపోయాడని ఎక్కువ మంది కామెంట్స్ చేస్తున్నారు. స్కంద ముగింపును ఆధారంగా చూస్తే పార్ట్ -2 కూడా ఉంటుందనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. #Skanda 🎬 First Half Report 📝 :#RAmPOthineni introduction & Mass Swag🔥💥#Sreeleela Scenes 💥 Action Scenes ⚡️⚡️#Thaman Songs & Bgm Music 💥🥁💥 Interval 💥 Overall a Good First Half...!!👍 Stay tuned to @Mee_Cinema for Second Half Report & Full Review ✍️ pic.twitter.com/y1sOAXYh0j — Mee Cinema (@Mee_Cinema) September 28, 2023 Just finished watching #Skanda movie #BoyapatiSreenu Thandavaam started the main asset to movie is direction The main piller to entire movie @ramsayz acting and swag never before seen This time @MusicThaman ur music and bgm will speaks in peeks 🔥@sreeleela14 dance ultimate pic.twitter.com/sa8nDUIJRO — Jaikarthiksv (@jaikarthiksv1) September 28, 2023 First half #Blockbuster #Skanda #RAPO #RAPOMass https://t.co/o3fjjWCV8u — BABA #DEVARA 🥵 (@lovelybaba9999) September 28, 2023 Pakka Mass Hittt Bomma 🤙🤙💥 Mass Euphoria In Theatres 🔥🔥🔥 Ustaad Ram in never before looks Boyapati mark massss💥💥💥💥 Thaman On Steroids 🤙🤙🤙🤙🤙#skanda #Skanda #RAmPOthineni #BoyapatiSreenu — S.Harsha (@SHarsha19085417) September 28, 2023 #Skanda Average 1st Half! Starts off interesting and has a rocking introduction for Ram but dips after that and loses track apart from a few good action sequences. — Venky Reviews (@venkyreviews) September 28, 2023 Take care sir! Don't sit near the speakers and wear helmet, if possible! Feeling sorry for you that you are going through this torture.....@ramsayz #skandareview — SATYA (@ssatyatweets) September 28, 2023 #Skanda 1st half: Best Introduction ever for @ramsayz 🔥, Narration👍, some mass scenes Worked well, Interval Massive🔥🔥 Very Good 1st half works In most parts 2nd half: Dialogues and some scenes Are Excellent, Climax is Different and Okay Good 2nd half Overall: HIT💥 — tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) September 28, 2023 All set for Boya-Thaman Sambavam 👂👂 #Skanda pic.twitter.com/jRm5uvyQpJ — Ragadi (@RagadiYT) September 28, 2023 It's official It's two parts Skanda 2 was confirmed in post credits scene#Skanda #SkandaOnSep28 — 𝙍𝙤𝙨𝙝𝙖𝙣™ (@NTR_Roshan_) September 28, 2023 Just mental mass no logic ..just mass First half #Skanda @Prabhas83932022 pic.twitter.com/Z0xPYZvm6X — Raghu (@436game) September 28, 2023 -
యాక్షన్ సినిమాలపై మరింత గౌరవం పెరిగింది
‘‘యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ‘స్కంద’. ఇందులో నా పాత్రలో సరదా, భావోద్వేగ సన్నివేశాలు ఉంటాయి. కాలేజ్ డ్రామా కూడా ఉంది. మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్‌ని అద్భుతంగా చూపించడంలో బోయపాటిగారి మార్క్ కనిపిస్తుంది. ‘స్కంద’ చేస్తున్నప్పుడు యాక్షన్ సినిమాలపై మరింత గౌరవం పెరిగింది’’ అని శ్రీ లీల అన్నారు. రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం ‘స్కంద’. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక శ్రీ లీల చెప్పిన విశేషాలు. ► ‘స్కంద’లో నా పాత్రలో మాస్, క్లాస్ రెండూ మిక్స్ అయ్యుంటాయి. ఇందులో కొన్ని సీన్స్ నా రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా మాస్ సీన్స్. ► ధమాకా’లో నా డ్యాన్స్‌లకు అంత పేరు వస్తుందనుకోలేదు. ‘స్కంద’ పాటల్లో మాస్, వెస్ట్రన్ డ్యాన్సులు అలరిస్తాయి. రామ్‌గారి డ్యాన్స్‌ని మ్యాచ్ చేయడం కష్టం. శ్రీనివాసా చిట్టూరిగారు ఈ సినిమాని గ్రాండ్‌గా నిర్మించారు. ‘స్కంద’ బోయపాటిగారి మార్క్‌లో గ్రాండ్‌గా ఉంటుంది. ఇంత మాస్ యాక్షన్ సినిమా చేయడం నాకిదే తొలిసారి. అలాగే పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పడం కూడా మొదటిసారే. ► ‘పెళ్లి సందడి’ తర్వాత ‘స్కంద’తో పాటు మరో రెండు మూడు సినిమాలు ఒప్పుకున్నాను. ఇప్పుడు దాదాపు ఎనిమిది సినిమాలు ఉన్నాయి. ఇన్ని అవకాశాలు రావడానికి కారణం ఇండస్ట్రీ, ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానమే. ఆ ప్రేమను మంచి సినిమాలు చేయడం ద్వారా తిరిగి ఇవ్వాలన్నదే నా తపన. -
బోయపాటిని వెంటాడుతున్న సెంటిమెంట్.. ‘స్కంద’తో నిరూపిస్తాడా?
టాలీవుడ్లో ఊరమాస్ డైరెక్టర్ అనగానే అందరికి గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను. నేల టికెట్ ఆడియన్స్‌కి నచ్చేలా.. వాళ్లను మెప్పించేలా భారీ మాస్ మూవీస్‌ని తెరకెక్కిస్తున్న ఏకైక తెలుగు దర్శకుడు. బోయపాటి కెరీర్లో ఇప్పటికి వరకు 9 సినిమాలు తెరకెక్కిస్తే.. అందులో 6 బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఇది ఆషామాషీ విషయం కాదు. కెరీర్ ప్రారంభంలోనే హ్యాట్రిక్ విక్టరీ సాధించిన అతికొద్ది మంది దర్శకుల్లో బోయపాటి ఒకరు. అయితే బోయపాటిని మాత్రం ఒక సెంటిమెంట్ బాగా పట్టి పీడిస్తోంది. ఆరు విక్టరీలు కానీ.. బోయపాటి కెరీర్లో ఇప్పటి వరకు తొమ్మిది సినిమాలు తెరకెక్కిస్తే.. వాటిలో ఆరు సీనియర్ హీరోలు నటించినవే. అవి మాత్రమే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. బోయపాటి తొలి చిత్రం భద్ర. రవితేజ హీరోగా నటించాడు. 2005 రిలీజైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత వెంకటేశ్‌తో తులసి(2007) చిత్రం తెరకెక్కించాడు. అది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 2010లో బాలయ్యతో సింహా తెరకెక్కించగా.. అది రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇలా వరుస హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బోయపాటి.. తన నాలుగో చిత్రం ‘దమ్ము’ని ఎన్టీఆర్‌తో చేశాడు. 2012లో వచ్చిన ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ బాలయ్యతో ‘లెజెండ్’ తీస్తే.. అది సూపర్ హిట్‌గా నిలిచింది. అదే జోష్‌లో అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ తెరకెక్కించాడు. 2016లో రిలీజ్ అయిన ఈ చిత్రం అల్లు అర్జున్‌ని రూ. 100 కోట్ల క్లబ్లో చేర్చింది. ఇక 2017లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో జయ జానకి నాయక చిత్రాన్ని తెరకెక్కించగా.. అది బాక్సాపీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రం చేయగా.. అది కూడా ఫ్లాప్ అయింది. దీంతో మళ్లీ బాలయ్యతో మూవీ చేశాడు. 2021లో రిలీజైన అఖండ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. స్కంద పరీక్షలో పాస్ అవుతాడా ? బోయపాటి కెరీర్లో హిట్ అయిన చిత్రాలన్నీ సీనియర్ హీరోలవే. బాలయ్యకు మూడు(సింహా, లెజెండ్, అఖండ), రవితేజ, వెంకటేశ్‌లకు ఒక్కొక్క(భద్ర, తులసి) హిట్ అందించాడు. అలాగే సరైనోడుతో అల్లు అర్జున్‌కి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. బన్నీ మినహా యంగ్ హీరోలతో చేసిన సినిమాలేవి విజయం సాధించలేదు. రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ తెరకెక్కిస్తే..అది డిజాస్టర్ అయింది. అలాగే మరో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘జయ జానకి నాయక’ తీస్తే..అది కూడా దారుణంగా బోల్తా పడింది. చాలా కాలం తర్వాత మరో యంగ్ హీరో రామ్ పోతినేనితో బోయపాటి సినిమా తీశాడు. మరి ఈ సారి అయినా బోయపాటి ఆ సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తాడా? స్కంద పరీక్షలో పాస్ అయి..తనపై పడిన ముద్రను తొలగింటాడో..లేదో ఈ నెల 28న తెలుస్తుంది. -
‘స్కంద’ మాస్ మూవీనే కాదు..ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి: రామ్
‘బోయపాటి గారి సినిమా అంటే ఫైట్స్ అని అంటారు. ఐతే కేవలం ఫైట్స్ మాత్రమే కాదు.. ఆ ఫైట్స్ వెనుక ఎమోషన్. ఆ ఎమోషన్ ని ఎలా బిల్డ్ చేస్తారనేది స్కంద కీ ఎలిమెంట్. స్కంద కేవలం మాస్ సినిమానే కాదు. చాలా అందమైన ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాకి సోల్ ఫ్యామిలీ ఎమోషన్స్ అని హీరో రామ్ పోతినేని అన్నారు. బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్కంద’-ది ఎటాకర్. శ్రీలీల హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ కరీంనగర్లో స్కంద కల్ట్ జాతర పేరుతో ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. బోయపాటి గారు ప్రతి సినిమాలో ఒక సోషల్ మెసేజ్ పెడతారు. ఇందులో మెసేజ్ ని కుటుంబ సభ్యులంతా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. ‘నేను సినిమా తీసేటప్పుడే టెన్షన్ పడతాను. ఒక్కసారి ఔట్పుట్ వచ్చిన తర్వాత ఇంక టెన్షన్ ఉండదు. ఎందుకంటే చాలా బాగా తీశాననే నమ్మకం. స్కంద చాలా మంచి సినిమా. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం కచ్చితంగా అందరూ మనస్పూర్తిగా ఆదరించాలని కోరుకుంటున్నాను’అని దర్శకుడు బోయపాటి అన్నారు. రామ్- బోయపాటి సినిమా అభిమానులందరికీ ఒక పండగలా ఉంటుందని హీరో శ్రీకాంత్ అన్నారు. ఈ ఈవెంట్లో హీరోయిన్ సాయి మంజ్రేకర్, ఇంద్రజ, ప్రిన్స్, శ్రవణ్, రచ్చరవితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. రింగ్ లో దిగితే రీసౌండ్ రావాలె.. కరీంనగర్లో నిర్వహించిన కల్ట్ జాతర ఈవెంట్లో స్కంద మూవీ రెండో ట్రైలర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేశారు. పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది.'నేను సంపేటపుడు వాడి తలకాయ యాడుందో చూస్తాను..ఆడి యెనకాల ఎవరున్నారో చూడను’,'రింగ్ లో దిగితే రీసౌండ్ రావాలె...చూసుకుందాం..బరాబర్ చూసుకుందాం.'' అంటూ ట్రైలర్ లో రామ్ చెప్పిన డైలాగులు పవర్ ఫుల్ గా ఉన్నాయి. మాస్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది. తమన్ నేపధ్య సంగీతం యాక్షన్ ని మరింతగా ఎలివేట్ చేసింది -
విరాట్ కోహ్లి బయోపిక్‌లో రామ్ పోతినేని?
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లికి దగ్గరి పోలికలు ఉంటాయి. ఇద్దరి హైట్‌తో పాటు ఫేస్ కట్ కూడా దాదాపు ఒకేలా అనిస్తుంది. 'ఇస్మార్ట్ శంకర్'షూటింగ్ సమయంలో రామ్ లుక్ చూసి అంతా విరాట్ కొహ్లిలా ఉన్నారని అన్నారు. అప్పట్లో రామ్ ఫోటోలు నెట్టింట తెగవైరల్ అయ్యాయి. విరాట్‌కి డూప్‌లా ఉన్నాడంటూ ట్విటర్లో కామెంట్స్ వచ్చాయి. ఇదే విషయంపై తాజాగా రామ్ స్పందించాడు. రామ్ పోతినేని నటించిన స్కంద చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో రామ్.. ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్ సంకేత్ మాత్రే(అల్లు అర్జున్, రామ్ వంటి తెలుగు స్టార్ హీరోలకు సంకేత్ హిందీలో డబ్బింగ్ చెబుతాడు) కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సంకేత్.. ‘విరాట్ కోహ్లిలా ఉన్నావని చాలా మంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ ఆయన బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే చేస్తారా?’ అని ప్రశ్నించారు. దానికి రామ్ సమాధానం ఇస్తూ.. ‘విరాట్‌లా ఉన్నారని చాలా మంది అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్' కోసం లుక్ డిసైడ్ చేశాక సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. అప్పటి నుంచి ఈ కంపేరిజన్ ఎక్కువ వస్తోంది. ఇండియన్ స్టార్ క్రికెటర్‌తో పోల్చడం చాల హ్యాపీ. తని బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే.. తప్పకుండా చేస్తా. విరాట్ బయోపిక్ అంటే ఎగ్జైటింగ్‌గా ఉంటుంది’అన్నారు. స్కంద విషయానికొస్తే.. అఖండ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న చిత్రమిది. రామ్‌కి జోడీగా శ్రీలీల నటించింది. తమన్ సంగీతం అందించాడు. -
తెలుగు టాప్ డైరెక్టర్‌తో సూర్య సినిమా.. తొందరపడ్డాడా..?
భారతీయ సినిమా ఇప్పుడు ఎల్లలు దాటి చాలా కాలమైంది. ఇంతకుముందు ఒక భాషలో నిర్మించిన పెద్ద హీరో చిత్రాలు మాత్రమే ఇతర భాషల్లో అనువాదం అయ్యేవి. ఆ తర్వాత ద్విభాషా చిత్రాల ఒరవడి మొదలైంది. అలాంటిది ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాల రూపకల్పన అధికం అవుతోంది. మరో విషయం ఏమిటంటే ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని ఒక భాషలో రూపొందిస్తే వర్కౌట్కాని పరిస్థితి. సమీప కాలంలో ద్విభాషా చిత్రాలతో నటుడు కార్తీ, విజయ్, ధనుష్ వంటి వారు సక్సెస్ అయ్యారు. తాజాగా నటుడు సూర్య కూడా ఈ బాటలో పయనించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంతకుముందు తెలుగులో రక్తచరిత్ర అనే చిత్రంలో సూర్య నటించారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. కాగా సూర్య తమిళంలో నటించిన పలు చిత్రాలు తెలుగులో అనువాదమై మంచి వసూళ్లను సాధించాయి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న కంగువ చిత్రం ఏకంగా 10 భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో ఆయన ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. తాజా సమాచారం ఏంటంటే సూర్య టాలీవుడ్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు ఇదేవిధంగా తెలుగులో ధనుష్, విజయ్, కార్తీ వంటి వారు సక్సెస్ అయ్యారు. ఒక్క శివకార్తికేయన్ నటించిన ప్రిన్స్ చిత్రం మాత్రం నిరాశపరిచింది. కాగా సూర్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో చిత్రం రూపొందడం నిజమే అయితే అది పక్కా మాస్ మసాలా చిత్రంగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. సూర్య 'స్కంద' వరకు ఆగాల్సింది బోయపాటి ప్రాజెక్ట్‌ను సూర్య ఓకే చేసే విషయంలో తొందర పడ్డాడా అనే చర్చ కూడా ఇండస్ట్రీలో జరుగుతుంది. ఎందుకంటే బోయపాటి ఎక్కువగా బాలకృష్ణతో మాత్రమే బ్లాక్బస్టర్లు ఇచ్చారు కానీ వేరే హీరోలతో అతడికి సరైన విజయాలు లేవని చెప్పవచ్చు. అఖండ సినిమాకు ముందు 'వినయ విధేయ రామ' ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు రామ్‌తో అతను చేసిన 'స్కంద' కూడా పెద్దగా బజ్ లేదు. బోయపాటి నుంచి వచ్చే ఏ సినిమా అయినా ట్రైలర్ పెద్ద సంచలనమే క్రియేట్ చేస్తుంది. కానీ స్కంద ట్రైలర్ చూసిన మెజారిటీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. సినిమా విడుదల తర్వాత అభిప్రాయం మారవచ్చేమో చూడాలి. స్కంద హిట్ అయితే సూర్య సినిమాకు మరింత క్రేజ్ పెరగడం ఖాయం అనే వార్తలు కూడా వస్తున్నాయి. -
పసిపిల్లాడికి ఆ సినిమా పేరు పెట్టారు.. కారణమదే
అభిమానులు.. ఈ పదం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ వినిపిస్తూనే ఉంటుంది. పాలిటిక్స్ లేదా సినిమాలు కావొచ్చు. యువత పిచ్చిపిచ్చిగా అభిమానిస్తుంటారు. ఇలా చెప్పుకుంటే టాలీవుడ్లో చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఓ అభిమాని చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!) యువ హీరో రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్లాస్, మాస్ సినిమాలు చేస్తూ తనదైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇతడు హీరోగా నటించిన కొత్త సినిమా 'స్కంద'. ఈ పాటికే అంటే సెప్టెంబరు 15న రిలీజ్ అయిపోవాల్సింది కానీ 'సలార్' వాయిదాతో డేట్ మార్చుకుంది. సెప్టెంబరు 28న థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పుడు ఈ మూవీ పేరుని ఓ పిల్లాడికి పెట్టేశారు. ఫ్యాన్స్ అసిసోయేషన్కి చెందిన సందీప్.. రామ్ కి అభిమాని అయిన హరిహర కొడుకు నామకరణ మహోత్సవానికి వెళ్లాడు. అయితే అతడి కొడుక్కి 'స్కంద' అని పేరు పెట్టారని ట్వీట్ చేశాడు. 'స్కంద' అనేది రామ్ హీరోగా నటించిన కొత్త సినిమా టైటిల్. ఇప్పుడు ట్వీట్ రామ్ వరకు చేరింది. దీంతో అతడు స్పందించాడు. 'ఈ విషయం నా మనసుకు హత్తుకుంది. ఆ పిల్లాడికి స్కంద దేవుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఆ అభిమానికి, అతడి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను' అని రామ్.. రీట్వీట్ చేశాడు. (ఇదీ చదవండి: ఓటీటీ హీరోయిన్గా మారిపోతున్న బ్యూటీ.. మరో కొత్త మూవీ) I’m so touched..I’m sure the blessings of lord Skanda will always be with him.. God bless you & your family.. ❤️ https://t.co/66uYUZtwVc — RAm POthineni (@ramsayz) September 16, 2023 -
గణేషా.. ఒక్క సినిమా లేదు..ఎందుకిలా?
పండగొచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడితో థియేటర్స్ కళకళలాడుతాయి. చిన్న పండుగల రోజు ఏమోగానీ సంక్రాంతి..వినాయక చవితి..దసరా..దీపావళి లాంటి పెద్ద పండగ రోజు అయితే రెండు, మూడు పెద్ద సినిమాలతో పాటు ఒకటి రెండు చిన్న చిత్రాలు కూడా రీలీజ్ అవుతుంటాయి. ప్రతి ఒక్కరు ఈ పండుగ రోజుల్లో తమ సినిమాను విడుదల చేయాలనుకుంటారు. కొన్నిసార్లు పోటీ భారీగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ బరిలోకి దిగుతారు. ఎందుకలా అంటే.. సినిమా యావరేజ్‌గా ఉన్నసరే పండుగ కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే చాన్స్ ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో వర్కౌట్ అయింది కూడా. అందుకే పండుగలపై చాలా సినిమాలు ముందే ఖర్చీఫ్ వేసుకుంటాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వినాయక చవితి లాంటి పెద్ద పండగ రోజు ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కావడంలేదు. బంగారం లాంటి గణేష్ పండుగ డేట్‌ని వదిలేసి వేరే డేట్‌కి తమ చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. ముందే ఖర్చీఫ్.. చివరల్లో అలా వాస్తవానికి ఈ వినాయక చవితికి చాలా సినిమాలు విడుదల కావాల్సింది. కొన్ని పెద్ద సినిమాలు ముందే డేట్ ఎనౌన్స్ చేయడంతో చిన్న సినిమాలు వెనక్కి తగ్గాయి. కానీ చివరి నిమిషంలో బడా చిత్రాలు సైతం చవితికి రాలేమని ప్రకటించాయి. బోయపాటి-రామ్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘స్కంద’ సెప్టెంబర్ 15న విడుదల కావాల్సింది. కానీ కారణం ఏంటో తెలియదు.. సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు. ఇక రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కలిసి నటించిన చంద్రముఖి-2 చిత్రం కూడా సెప్టెంబర్ 15న రిలీజ్ కావాల్సింది. అది కూడా వాయిదా పడింది. వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఆలస్యం కావడం వల్లే సినిమా వాయిదా పడిందని చిత్రయూనిట్ పేర్కొంది. స్కంద రిలీజ్ రోజే చంద్రముఖి-2 రానుంది. అంటే సెప్టెంబర్ 28న ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద పోటీ పడతాయి. టిల్లన్న ఇలాగైతే ఎలాగన్నా? పోటీ ఈ వినాయక చవితికి టిల్లుగాని డీజేకి చిందులేద్దామనుకుంటే.. అది కూడా జరగడం లేదు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ అది కూడా మళ్లీ వాయిదా పడింది. ‘టిల్లు స్క్వేర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్వాలిటీ ఔట్పుట్ కోసం విడుదల వాయిదా వేయక తప్పడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. డబ్బింగ్ సినిమానే దిక్కు వినాయక చవితికి ఒక్క తెలుగు సినిమా కూడా టాలీవుడ్లో విడుదల కావడంలేదు. డబ్బింగ్ సినిమాలనే తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాయి. అందులో చంద్రముఖి-2 వాయిదా పడింది. ఇప్పుడిక ఒకే ఒక్క డబ్బింగ్ మూవీ విడుదల కాబోతుంది. అదే మార్క్ ఆంటోని. విశాల్ నటిస్తున్న తమిళ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌కు పిచ్చ క్రేజ్ వచ్చింది. తెలుగులో కూడా విశాల్‌కు మంచి ఫాలోయింగ్. అందుకే ఈ చిత్రాన్నితెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన చాలు..మార్క్ ఆంటోని పంట పండినట్లే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంచి వీకేండ్ మిస్ ఈ సారి వినాయక చవితి సోమవారం వచ్చింది. ఇది సినిమా వాళ్లకు బాగా కలిసొచ్చే రోజు. ఎందుంటే.. పండగతో కలిసి మొత్తం మూడు హాలిడేస్ వస్తున్నాయి. శుక్రవారం(సెప్టెంబర్ 15)సినిమాను విడుదల చేస్తే.. శని,ఆది వారాలతో పాటు సోమవారం కూడా సెలవు దినమే. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్స్‌కి వచ్చే అవకాశం ఉంది. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన చాలు.. ఈ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ దాటొచు. ఇంత మంచి వీకెండ్‌ని టాలీవుడ్ వదులుకుంది. -
రిలీజ్ పోస్ట్ పోన్.. కొత్త డేట్ చెప్పు గురూ..
సినిమా సెట్ అనుకున్నప్పుడే చూచాయగా రిలీజ్ డేట్ కూడా సెట్ చేస్తుంటారు మేకర్స్. అలా కాకపోయినా షూటింగ్ సగం పూర్తయ్యాక సెట్ చేస్తారు. వన్ ఫైన్ డే ఆ డేట్‌ని అధికారికంగా ప్రకటిస్తారు. కానీ.. సెట్ చేసిన డేట్‌కి కొన్ని సినిమాలు విడుదల కాకపోవచ్చు. సాంకేతిక కారణాలు, ఇతర కారణాల వల్ల వాయిదా పడుతుంటాయి. అలా ప్రస్తుతం అరడజను చిత్రాల దాకా వాయిదా పడ్డాయి. ఏ సినిమా కారణం ఆ సినిమాది. ఇక అనుకున్న డేట్‌కి రాకుండా కొత్త డేట్ సెట్ చేసుకుని సిల్వర్ స్క్రీన్ పైకి రానున్న సినిమాల గురించి తెలుసుకుందాం. ‘సలార్’లో ప్రభాస్ ∙ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా ‘సలార్: పార్ట్ 1–సీజ్ఫైర్’ని ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు తొలుత మేకర్స్ ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులో ప్రభాస్ ఫ్యాన్స్‌కి, సినిమా లవర్స్‌కి పండగే. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అయితే ‘సలార్’ రిలీజ్ వాయిదాపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనేదానిపై పాన్ ఇండియా స్థాయిలో చర్చ జరుగుతోంది. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాని దీపావళి కానుకగా నవంబర్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ముందుగా అనుకున్నట్లు ఈ నెల 28న సినిమాని విడుదల చేస్తారా? లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ‘స్కంద’లో రామ్, శ్రీలీల రామ్ పోతినేని హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘స్కంద’ కూడా ముందు అనుకున్న తేదీకి కాకుండా వేరే తేదీకి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలో చిత్రబృందం ప్రకటించింది. అయితే తాజాగా మేకర్స్ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ నెల 15న కాకుండా 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే సినిమా విడుదల తేదీ ఎందుకు మార్చాల్సి వచ్చిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ‘చంద్ర ముఖి–2’లో కంగన రజనీకాంత్ హీరోగా జ్యోతిక టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి’ (2005). పి. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘చంద్రముఖి 2’. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి. వాసునే రెండో భాగాన్ని తీశారు. అయితే సీక్వెల్లో హీరో, హీరోయిన్ మారారు. రాఘవ లారెన్స్ హీరోగా, కంగనా రనౌత్ టైటిల్ రోల్లో నటించారు. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ నెల 15న కాకుండా 28న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్లే విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ‘చంద్రముఖి 2’ని తెలుగులో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి, వెంకట రత్నం శాఖమూరి రిలీజ్ చేస్తున్నారు. ‘ఆదికేశవ’లో వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. తొలుత ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేయాలనుకున్నారు.. చేయలేదు. ఆ తర్వాత ఆగస్టు 18న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత అది కూడా వాయిదా పడి చివరికి నవంబర్ 10వ తేదీకి ఫిక్స్ అయింది. ఫారిన్లో కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం వల్లే విడుదల వాయిదా వేస్తున్నట్లు ‘ఆదికేశవ’ చిత్రబృందం ప్రకటించింది. ‘టిల్లు స్క్వేర్’లో సిద్ధు సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ రూపొందింది. ఈ చిత్రానికి డైరెక్టర్, హీరోయిన్ మారారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారు. ‘డీజే టిల్లు’ని నిర్మించిన సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీని కూడా ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే విడుదల వాయిదా పడింది. ‘‘టిల్లు స్క్వేర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్వాలిటీ ఔట్పుట్ కోసం విడుదల వాయిదా వేయక తప్పడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. ‘పెద కాపు’లో విరాట్ కర్ణ ∙‘నారప్ప’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం ‘పెదకాపు–1’. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటించారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాని తొలుత ఆగస్టులో విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించినా, వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? అనేదానిపై తాజాగా చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చింది. ఈ నెల 29న ‘పెదకాపు –1’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
స్కంద రెడీ
వారాంతపు సెలవులను, గాంధీ జయంతి సెలవుని క్యాష్ చేసుకోవడానికి ‘స్కంద’ రెడీ అయ్యాడు. రామ్ హీరోగా శ్రీలీల హీరోయిన్గా బోయ΄ాటి శ్రీను దర్శకత్వంలో రూ΄÷ందిన చిత్రం ‘స్కంద’. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. రిలీజ్ డేట్‌ని బుధవారం అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ‘‘మా ‘స్కంద’ గురువారం విడుదల కానుంది. వారాంతపు సెలవులు, ఆ తర్వాత సోమవారం గాంధీ జయంతి సెలవు, ఆ తర్వాత వచ్చే దసరా సెలవులు ఇవన్నీ మా సినిమాకు కలిసి వస్తాయి. అందుకే 28 పర్ఫెక్ట్ రిలీజ్ అనుకుని ఆ డేట్‌ని లాక్ చేశాం. రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూ΄÷ందించిన చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన ΄ాటలు, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ΄ాన్ ఇండియా స్థాయిలో సినిమాని రిలీజ్ చేయనున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సంతోష్ డిటాకే, సమర్పణ: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్. -
శేఖర్ మాస్టర్ విషయంలో చాలా బాధపడ్డాను: శ్రీలీల
నటి శ్రీలీల అంటే సినీ ప్రియులకు టక్కున గుర్తుకువచ్చేది ఆమె డ్యాన్స్. పాట ఏదైనా సరే హీరోకి ఏమాత్రం తగ్గకుండా.. కొన్నిసార్లు హీరోలను మించి డ్యాన్స్ చేస్తారీ బ్యూటీ. మాస్ మహారాజ్ రవితేజ సినిమా అయిన ధమాకాలో ఈ బ్యూటీ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారని చెప్పవచ్చు. ఆ సినిమాలో వీరిద్దరూ కలిసి వేసిన డాన్స్ స్టెప్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ స్కంద సినిమాతో సెప్టంబర్ 15న రామ్ సరసన మళ్లీ రచ్చ చేయబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలను శ్రీలీల షేర్ చేసుకుంది. (ఇదీ చదవండి: ఇండస్ట్రీలో నన్నూ అలాంటి కోరికే కోరారు: ఇమ్మానుయేల్) తాను చిన్నప్పటి అమ్మ ఒత్తిడి వల్లే భరత నాట్యం నేర్చుకున్నానని శ్రీలీల తెలిపింది. అలా చిన్నతనం నుంచే చదువుతో పాటు డ్యాన్స్ కూడా తనకు ఒక భాగం అయిపోయిందని చెప్పింది. అలా తన స్కూల్లో కూడా ఏదైనా ప్రొగ్రామ్ ఉంటే మొదట తన డ్యాన్స్ ఉండేదని చెప్పుకొచ్చింది. అలా ఒక్కోసారి డ్యాన్స్ ప్రాక్టిస్ చేస్తున్న సమయంలో కాళ్లకు బొబ్బలు కూడా వచ్చేవని గుర్తుచేసుకుంది. అప్పుడు డ్యాన్స్ అపేస్తానని తన అమ్మతో చెప్పినా ఏ మాత్రం పట్టించుకోకుండా.. డ్యాన్స్ నేర్చుకోమనే ప్రోత్సహించేదని తెలిపింది. ఆ తరువాత తనకే డ్యాన్స్ మీద మక్కువ పెరిగిందని చెప్పింది. సినిమా ఎంట్రీ ఎలా జరిగిందంటే శ్రీలీల అమ్మగారు స్వర్ణలత బెంగళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్‌గా కొనసాగుతున్నారని తెలిసిందే. సినిమాల్లోకి ఎంట్రీ ఎలా జరిగిందో శ్రీలీల ఇలా షేర్ చేసింది. ' అమ్మ డాక్టర్ కావడంతో నాకు స్కూల్లో సెలవులు వస్తే నన్ను కూడా మెడికల్ కాన్ఫరెన్సులకు తీసుకెళ్తూ ఉండేది. ఈ కారణం వల్ల నాకు కూడా వైద్య వృత్తి మీద చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడింది. నా ప్రతి పుట్టినరోజు నాడు ఫోటో షూట్ చేయించడం అమ్మకు ఇష్టం.. అలా ఓ సారి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన భువన గౌడతో ఫోటో షూట్‌ను అమ్మ చేయించింది. ఫోటోలను ఆయన ఫేస్ బుక్‌లో షేర్ చేయడంతో వాటిని చూసిన కన్నడ డైరెక్టర్ ఆఫర్ ఇచ్చాడు. అలా స్కూల్ డేస్‌లోనే సినిమాల్లోకి రావడం జరిగిపోయింది.' శ్రీలీల తెలిపింది. ఆ తర్వాత తనకు డాక్టర్ కావలనే కోరిక చిన్నతనం నుంచే ఉండటంతో చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదని చెప్పింది. ప్రస్తుతం శ్రీలీల ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విషయం తెలిసిందే. శేఖర్ మాస్టర్‌కు సారీ ఒక సినిమా షూటింగ్ సమయంలో ఎక్కువ రీటేక్స్ తీసుకోవడం వల్ల చాల బాధపడినట్లు శ్రీలీల చెప్పింది. తనకు ఎక్కువ రీటేక్స్ తీసుకోవడం ఏ మాత్రం నచ్చదని తెలిపింది. షూటింగ్లో ఎక్కువ రీటేక్స్ తీసుకుంటే సమయంతో పాటు నిర్మాతకు కూడా ఖర్చు పెరుగుతుందని ఇది ఏ మాత్రం అంత మంచిది కాదని ఆమె తెలిపింది. అలా ఓ సారి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ముప్పై టేకులు తీసుకున్నట్లు ఆమె పేర్కొంది. ఆ పాట కోసం ఎన్ని సార్లు రిహార్సల్స్ చేసినా కూడా ఓకే కాలేదని తెలిపింది. అలా ముప్పై సార్లు రీటేక్స్ తీసుకోవడం చాలా బాధ అనిపించిందని చెప్పింది. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి సారీ చెబుతూ మూడు పేజీల లేఖను శేఖర్ మాస్టర్‌కు రాసిందట. అందుకు ఆయన కూడా తనకు ఫోన్ చేసి ఇందులో నీ తప్పేంలేదు.. ఈ పాటలో ఎక్కువ మంది డ్యాన్సర్స్ ఉన్నారు. వారు బ్యాక్ గ్రౌండ్లో కరెక్ట్ స్టెప్లు వేయడం లేదని చెప్పాడట. అందుకే ఇన్ని రీటేక్స్ తీసుకోవాల్సి వచ్చిందని శేఖర్ మాస్టర్ చెప్పడంతో కొంచెం సంతృప్తి అనిపించిందట. కేజీయఫ్ ఫేమ్ యశ్ని ఏమని పిలుస్తుందంటే.. శ్రీలీల కుటుంబంతో కేజీయఫ్ ఫేమ్ యశ్‌కు మంచి పరిచయాలే ఉన్నాయని తెలిసిందే. శ్రీలీల అమ్మగారు గైనకాలజిస్ట్ కావడంతో యశ్ భార్య రాధికకు రెండుసార్లు ఆమె డెలివరీ చేసింది. దీంతో వారికి మంచి పరిచయాలు ఏర్పాడ్డాయి.రాధిక డెలివరి సమయంలో ఎక్కువగా ఆస్పత్రిలో శ్రీలీలే ఉండేవారట. అలా రాధికను అక్కా అని శ్రీలీల పిలుస్తుందట. అంతేకాకుండా యశ్‌ను జీజూ (బావా) అని పిలుస్తుందట. అలా తనకు కన్నడ సినిమాలో మంచి ఇమేజ్ తెచ్చిపెట్టిందనే చెప్పవచ్చు. -
సెప్టెంబరు నెలలో విడుదల అవుతున్న ఏడు టాప్ సినిమాలు ఇవే..!
సెప్టెంబరు నెలలో సినిమా అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.. ఇదే నెలలో 7కు పైగా పెద్ద సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. సెప్టెంబరు 18న వినాయక చవితి పండుగ ఉండటంతో సెప్టెంబరు 15న ఏకంగా మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. సెప్టెంబరు 1 'ఖుషి' విజయ్ దేవరకొండ-సమంత కాంబినేషన్లో వస్తున్న సినిమా 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. 2019లో వచ్చిన మజిలీ సినిమా తర్వాత ఖుషి వస్తుండటంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. సెప్టెంబర్ 7 'జవాన్' కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'జవాన్'. పఠాన్ తర్వాత భారీ అంచనాలతో ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో నయనతార,దీపికా పదుకోన్ వంటి స్టార్స్ ఉన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 7 'మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి' యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందీ చిత్రం.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. సెప్టెంబర్ 15 'స్కంద' రామ్ పోతినేని- శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'స్కంద'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌ను పక్కా మాస్ లుక్‌లో బోయపాటి చూపించాడు. ఇందులోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. ఇందులో రామ్ రెండు కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన 'స్కంద' సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 15 'చంద్రముఖి 2' రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో ఒక సంచలన విజయం. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు 'చంద్రముఖి 2' విడుదలకు రెడీగా ఉంది. ఇందులో రాఘవ లారెన్స్-కంగనా రనౌత్ నటిస్తున్నారు. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 15 'మార్క్ ఆంథోని' హీరో విశాల్.. ఇప్పుడు 'మార్క్ ఆంథోని'గా వచ్చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తీసిన ఈ సినిమాలో విశాల్‌కి జోడీగా రీతూవర్మ నటించింది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా విడుదల కానుంది. సెప్టెంబర్ 28 'సలార్' ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సలార్' సెప్టెంబర్ 28న విడుదలకు రెడీగా ఉంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను సెప్టెంబర్ 3న విడుదల చేసేందుకు హోంబలే ఫిలిమ్స్ ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అదే రోజు నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే అతిపెద్ద సినిమా 'సలార్' అనే చెప్పవచ్చు. (ఇదీ చదవండి: చిరంజీవి 'చూడాలని ఉంది' సినిమాకు 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?) -
ఎవరైనా ప్రపోజ్ చేశారా?.. హీరోయిన్ శ్రీలీల క్రేజీ కామెంట్స్?
పెళ్లిసందడి ఫేమ్, టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా తర్వాత రవితేజ సరసన ధమాకాతో అదరగొట్టింది. ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ అయిపోయింది ముద్దుగుమ్మ. తాజాగా రామ్ సరసన స్కంద చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహించారు. శనివారం ఈ చిత్రానికి స్కంద ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొని సందడి చేశారు. అయితే ఈవెంట్‌కు యాంకర్‌గా వ్యవహరించిన సుమ హీరోయిన్ శ్రీలీలకు ఆసక్తికర ప్రశ్న వేసింది. అదేంటో ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: బాయ్ ఫ్రెండ్ వల్ల నరకం అనుభవించాను: రోహిణి) స్కంద ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్లో శ్రీలీలను యాంకర్ సుమ ప్రశ్నించింది. మీకు ఇప్పటిదాకా మీకేమైనా లవ్ ప్రపోజల్స్ వచ్చాయా అని నవ్వుతూ అడిగింది. ఆ ప్రశ్నకు తనదైన శైలిలోనే సమాధానమిచ్చింది పెళ్లిసందడి భామ. ఇప్పటి వరకైతే రాలేదు కానీ.. సెప్టెంబర్ 15న రావొచ్చేమో.. ఫన్నీగా ఆన్సరిచ్చింది. ఎందుకంటే ఆ రోజునే రామ్- శ్రీలీల స్కంద మూవీ రిలీజ్ కానుంది. బాలయ్య గురించి మాట్లాడుతూ..'అంతేకాకుండా బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించింది. ఆయన గురించి చాలా చెప్పాలని ఉంది. కానీ వచ్చేనెలలో జరిగే మరో ఈవెంట్లో వెల్లడిస్తాననని చెప్పుకొచ్చింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే నేను.. రామ్‌తో కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. హీరో శ్రీకాంత్‌కు మా ఇంట్లో వాళ్లందరు ఫ్యాన్స్. ఆయన సినిమా టైటిల్‌తోనే నేను కెరీర్ గురించి ప్రారభించా. థ్యాంక్ యూ శ్రీకాంత్.' అంటూ చెప్పుకొచ్చింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన స్కంద సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇది చదవండి: రామ్ 'స్కంద' ట్రైలర్ విడుదల.. బోయపాటి మాస్ మార్క్) -
రామ్ 'స్కంద' మూవీ స్టిల్స్
-
రామ్ 'స్కంద' ట్రైలర్ విడుదల.. బోయపాటి మాస్ మార్క్
రామ్ పోతినేని- శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'స్కంద'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్లో రామ్ చెప్పే పంచ్ డైలాగ్‌లు 'ఇయ్యాలే.. పొయ్యాలే.. గట్టిగా అరిస్తే తొయ్యాలే.. అడ్డమొస్తే లేపాలే' వంటివి బాగా పేలాయని చెప్పవచ్చు. రామ్‌పై బోయపాటి శ్రీను చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌లు మెప్పిస్తాయి. రామ్‌ను పక్కా మాస్ లుక్‌లో బోయపాటి చూపించాడు. ఇందులోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. ఇందులో రామ్ రెండు కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన స్కంద సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'గందార బాయి' అంటూ.. రెచ్చిపోయిన రామ్
రామ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘స్కంద’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. ఎస్ఎస్ తమన్ స్వర పరచిన ‘స్కంద’లోని ‘గందార బాయి..’ అంటూ సాగే రెండో పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, నకాష్ అజీజ్, సౌజన్య భాగ వతుల పాడారు. ‘‘ఈ పాటలో రామ్ డ్యాన్స్‌లో డైనమిజమ్ చూపించగా, శ్రీలీల ఎనర్జీతో మ్యాచ్ చేసింది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, కెమెరా: సంతోష్ డిటాకే. -
రామ్-శ్రీలీల.. డ్యాన్స్ ఇరగదీశారుగా!
యంగ్ హీరో రామ్ 'స్కంద' సినిమాతో సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా 'నీ చుట్టు చుట్టు తిరిగినా..' అనే లిరికల్ పాటని గురువారం రిలీజ్ చేశారు. మంచి ఫాస్ట్ బీట్తో ఉన్న ఈ సాంగ్.. మ్యూజిక్ లవర్స్ ని అలరిస్తోంది. మరోవైపు డ్యాన్స్ ప్రేమికుల్ని కూడా ఎంటర్టైన్ చేస్తోంది. ఎందుకంటే రామ్ ఎలాంటి డ్యాన్సర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడికి శ్రీలీల లాంటి ఊరమాస్ డ్యాన్సర్ కాంబో సెట్ అయితే ఎలా ఉంటుంది. ఈ పాటలానే ఉంటుంది. క్లాస్ స్టెప్పులతో ఇద్దరూ పోటీపడ్డారు. లిరికల్ సాంగ్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. సెప్టెంబరు 15న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మాస్ యాక్షన్ స్టోరీతో తీసినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్)