
వారాంతపు సెలవులను, గాంధీ జయంతి సెలవుని క్యాష్ చేసుకోవడానికి ‘స్కంద’ రెడీ అయ్యాడు. రామ్ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా బోయ΄ాటి శ్రీను దర్శకత్వంలో రూ΄÷ందిన చిత్రం ‘స్కంద’. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. రిలీజ్ డేట్‌ని బుధవారం అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ‘‘మా ‘స్కంద’ గురువారం విడుదల కానుంది.
వారాంతపు సెలవులు, ఆ తర్వాత సోమవారం గాంధీ జయంతి సెలవు, ఆ తర్వాత వచ్చే దసరా సెలవులు ఇవన్నీ మా సినిమాకు కలిసి వస్తాయి. అందుకే 28 పర్ఫెక్ట్ రిలీజ్ అనుకుని ఆ డేట్‌ని లాక్ చేశాం. రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూ΄÷ందించిన చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన ΄ాటలు, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ΄ాన్ ఇండియా స్థాయిలో సినిమాని రిలీజ్ చేయనున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సంతోష్ డిటాకే, సమర్పణ: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్.