సెప్టెంబరు 28 పేరు చెప్పగానే మొన్నటివరకు 'సలార్' గుర్తొచ్చేది. కానీ అది వాయిదా పడేసరికి ఈ తేదీ కోసం మిగతా సినిమాలన్నీ పోటీపడ్డాయి. ఈ క్రమంలోనే రామ్ 'స్కంద' ఇదేరోజున అంటే తాజాగా థియేటర్లలోకి వచ్చింది. బోయపాటి మార్క్ సినిమాల తరహాలోనే ఇది ఉంది. యాక్షన్ ప్రియుల్ని అలరిస్తున్న ఈ చిత్రం అలానే ఓటీటీ పార్ట్‌నర్‌తో పాటు స్ట్రీమింగ్ టైమ్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
'స్కంద' కథేంటి?
ఏపీ ముఖ్యమంత్రి (అజయ్ పుర్కన్) కూతురి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ వేడుకకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి (శరత్ లోహితస్వ) కొడుకుతో లేచిపోతుంది. దీంతో సీఎంలు ఇద్దరూ ఒకరిపై ఒకరు పగ పెంచుకుంటారు. తన కూతురిని తిరిగి రప్పించడం కోసం ఏపీ సీఎం ఓ కుర్రాడిని(రామ్ పోతినేని) తెలంగాణకు పంపిస్తాడు. తెలంగాణ సీఎంకి ఓ కూతురు (శ్రీలీల) ఉంటుంది. ఓ సందర్భంలో ఈ కుర్రాడు.. ఇద్దరు ముఖ్యమంత్రుల కుమార్తెలని తీసుకెళ్లిపోతాడు. అసలు ఈ కుర్రాడెవరు? ఎందుకు తీసుకెళ్లాడనేది 'స్కంద' స్టోరీ.
(ఇదీ చదవండి: Skanda Movie Review: ‘స్కంద’ మూవీ రివ్యూ)
ఎలా ఉంది?
బోయపాటి గత సినిమాల్లో ఓ మాదిరిగా అయినా కథ ఉండేది. ఇందులో పెద్దగా అలాంటిదేం లేదు. కమర్షియల్ చిత్రాల్లో నలిగిపోయిన రొటీన్ రివేంజ్ డ్రామానే తీసుకున్నాడు. కానీ సినిమా మొదలైన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు తనదైన మార్క్ సన్నివేశాలతో నడిపించేశాడు. యాక్షన్ లవర్స్, మాస్ ఆడియెన్స్‌కి ఇది నచ్చేయొచ్చు కానీ మిగతా వాళ్లకు కాస్త కష్టమే.
ఓటీటీ డీటైల్స్
ఇకపోతే రిలీజ్‌కి ముందే 'స్కంద' మూవీ డిజిటల్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుంది. చేసుకున్న ఒప్పందం ప్రకారం నెల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుందట. అంటే సెప్టెంబరు 28న థియేటర్లలోకి సినిమా వచ్చింది కాబట్టి అక్టోబరు చివరి వారంలో ఇందులో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రావొచ్చని సమాచారం. కొన్నిరోజులు ఆగితే దీనిపై క్లారిటీ వచ్చేస్తుందిలే!
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment