Skanda OTT Release: ఓటీటీలోకి మరింత ఆలస్యంగా రానున్న స్కంద! | Sakshi
Sakshi News home page

Skanda OTT Release: స్కంద ఓటీటీ రిలీజ్‌ వాయిదా.. రామ్‌ ఫ్యాన్స్‌కు నిరాశ..

Published Fri, Oct 27 2023 11:03 AM

Ram Pothineni Skanda Movie OTT Release Postponed - Sakshi

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని, యంగ్‌ హీరోయిన్‌ శ్రీలీల జంటగా నటించిన చిత్రం స్కంద. జీ స్టూడియోస్‌తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. తీరా థియేటర్లలో విడుదలయ్యాక ఈ చిత్రం బొక్కబోర్లా పడింది. సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంది. దీంతో కలెక్షన్స్‌ కూడా పేలవంగా వచ్చాయి. 

ఈ సినిమా అక్టోబర్‌ 27 నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిసింది. అనుకున్నట్లుగానే ఆమేరకు ప్రకటన సైతం వెలువడింది. అయితే అంతలోనే స్కంద ఓటీటీ విడుదల వాయిదా పడింది. ఈరోజు ఓటీటీలోకి రావాల్సిన ఈ చిత్రం మరికొద్ది రోజుల తర్వాతే హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు కొత్త డేట్‌ను ప్రకటించనున్నట్లు హాట్‌స్టార్‌ వెల్లడించింది.

చదవండి: హీరోయిన్‌తో ప్రేమలో ఉన్న హీరో.. ఇలా దొరికిపోతాననుకోలేదంటూ..

Advertisement
 
Advertisement
 
Advertisement