హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ కావడంతో ప్రస్తుం ఆ సినిమాకు సీక్వెల్ పనులు నడుస్తున్నాయి. ఈ చిత్రానికి ‘డబుల్ ఇస్మార్ట్’ అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించడం విశేషం. ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. దీని తరువాత రామ్ ఎవరితో సినిమా చేయనున్నాడో అనేది ఇంకా వెల్లడి కాలేదు. అయితే తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో రామ్ ఒక వెబ్‌సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన డీల్ కుదుర్చకున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి చర్చలు కూడా పూర్తి అయ్యాయి అని తెలుస్తోంది. త్వరలో ప్రకటన కూడా రావచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రామ్ పుట్టినరోజు ఈనెల 15న ఉంది. ఆరోజునే ఈ ప్రకటన విడుదల కావచ్చని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
మరోవైపు రామ్ రెండు ప్రాజక్ట్‌లపై గురి పెట్టినట్లు తెలుస్తోంది. గౌతమ్ మీనన్ కథను ఆయన ఇప్పటికే ఓకే చేసినట్లు సమాచారం. అంతేకాకుండా త్రివిక్రమ్ కూడా రామ్‌కు ఒక కథ చెప్పారట. మంచి లవ్ స్టోరీ కావడంతో రామ్ ఆసక్త చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment