థియేట‌ర్‌లో అట్ట‌ర్‌ఫ్లాప్‌.. ఓటీటీలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ | Skanda Movie Becomes Highest Viewed Telugu Film In 2023 on Hotstar | Sakshi
Sakshi News home page

Skanda Movie: ఓ ప‌క్క ట్రోలింగ్‌.. మ‌రోప‌క్క ఓటీటీలో ట్రెండ్ అవుతున్న తెలుగు సినిమా

Nov 3 2023 8:49 PM | Updated on Nov 3 2023 8:57 PM

Skanda Movie Becomes Highest Viewed Telugu Film In 2023 on Hotstar - Sakshi

ఓ ప‌క్క ట్రోలింగ్ జ‌రుగుతున్నా మ‌రోప‌క్క ట్రెండింగ్‌లో ఉండ‌టం బోయ‌పాటి సినిమాకే సాధ్య‌మ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

మాస్ సినిమాల‌కు పెట్టింది పేరు బోయ‌పాటి శ్రీను. మాస్ డైలాగులైనా, యాక్ష‌న్ సీన్ల‌యినా త‌న ఎన‌ర్జీతో ఇర‌గ‌దీసే హీరో రామ్ పోతినేని. వీరి కాంబోలో బొమ్మ ప‌డితే బాక్సాఫీస్ ద‌ద్ద‌రిల్లుతుంద‌నుకున్నారంతా! కానీ అనుకున్న‌దొక్క‌టి.. అయినది ఒక్క‌టి.. రామ్ పోతినేని- బోయ‌పాటి కాంబోలో తెర‌కెక్కిన చిత్రం స్కంద‌. సెప్టెంబ‌ర్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో నెల‌లోపే ఓటీటీలోకి తీసుకురావాల‌ని భావించారు.

కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఓటీటీ రిలీజ్ వాయిదా ప‌డింది. ఆ త‌ర్వాత న‌వంబ‌ర్ 2న హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో స్కంద స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీలో స్కంద సినిమాను ఎగ‌బ‌డి మ‌రీ చూస్తున్నారట‌! ఈ ఏడాది హాట్‌స్టార్‌లో రిలీజైన‌ మొద‌టి 24 గంట‌ల్లో ఎక్కువ‌మంది వీక్షించిన సినిమాగా స్కంద నిలిచింద‌ని తెలుస్తోంది.

అప్ప‌ట్లో బోయ‌పాటి.. బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా పెట్టి తీసిన సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆడ‌క‌పోయినా యూట్యూబ్‌లో మాత్రం రికార్డులు తిర‌గ‌రాసింది. జ‌య‌జాన‌కి నాయ‌క చిత్రం హిందీ డ‌బ్బింగ్‌కు యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ వ‌చ్చాయి. ఇప్పుడ‌దే ట్రెండ్ హాట్‌స్టార్‌లోనూ క‌నిపిస్తోంది. మ‌రోప‌క్క స్కంద సినిమా ఎడిటింగ్‌లో కొన్ని లోపాలున్నాయని విమ‌ర్శ‌లూ వ‌స్తున్నాయి. ఓ ప‌క్క ట్రోలింగ్ జ‌రుగుతున్నా మ‌రోప‌క్క ట్రెండింగ్‌లో ఉండ‌టం బోయ‌పాటి సినిమాకే సాధ్య‌మ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

చ‌ద‌వండి: భార‌తీయుడు 2 ఇంట్రో చూశారా? అదిరిపోయిందంతే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement