Boyapati Srinivas
-
స్కంద క్లైమాక్స్ సీన్‌పై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన రామ్
ఓపక్క ట్రోలింగ్.. మరోపక్క ట్రెండింగ్.. బోయపాటి సినిమాకే సాధ్యమైంది. సోషల్ మీడియాలో స్కంద సినిమా తప్పొప్పులను ఎత్తిచూపుతూ డైరెక్టర్‌ను ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతున్న స్కందను ఎగబడి మరీ చూస్తున్నారు జనాలు. కాగా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నవంబర్ 2న ఓటీటీలో విడుదలైంది. ఓటీటీలో ప్రతి సన్నివేశాన్ని జూమ్ చేసి మరీ చూస్తున్నారు. ప్రేక్షకులు. ఫైట్ సీన్లో బోయపాటి.. ఈ క్రమంలో ఓ ఇంటర్వెల్ ఫైట్‌లో రామ్ ఓ పోలీస్‌ను షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాతి ఫ్రేమ్‌లో ఆ సీన్‌ను చూసి షాకవుతున్న వారిలో ఆ చనిపోయిన వ్యక్తి కనిపిస్తాడు. దీంతో ఈ సీన్‌పై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. అలాగే క్లైమాక్స్ ఫైట్‌లో రామ్ దీపస్తంభాలు పట్టుకుని విలన్లను చంపుతాడు. ఈ సీన్లో తేడాను గమనించారు ఓటీటీ ఆడియన్స్. ఈ సన్నివేశంలో మొదట రామ్ పోతినేని కనిపించగా తర్వాతి షాట్లో రామ్‌కు బదులుగా బోయపాటి దర్శనమిచ్చాడు. దీంతో ఈ సీన్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై హీరో రామ్ స్పందించాడు. కాలి నుంచి రక్తం,, నడవలేని స్థితిలో.. '22 ఏప్రిల్, 2023 ఆ రోజు నాకు బాగా గుర్తుంది. వేసవి కాలంలో అత్యంత వేడిగా ఉన్న రోజుల్లో ఇది కూడా ఒకటి. మొత్తం 25 రోజుల షెడ్యూల్లో అది మూడవ రోజు.. అప్పుడు నా కాలి పరిస్థితి ఎలా ఉందో ఫోటోలో చూడొచ్చు. కనీసం నడవలేకపోయాను. కాలి పగుళ్ల నుంచి రక్తం కారింది. దర్శకుడు ఆ సన్నివేశం షూట్ అయిపోవాలన్నాడు. నా పరిస్థితి బాలేకపోవడంతో ఆ ఒకే ఒక్క సీన్లో తను నటించాడు. అందుకు దర్శకుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చెమట చిందించేందుకు ఎప్పుడూ సిద్ధం సినిమాలోని కంటెంట్ నచ్చడం, నచ్చకపోవడం అనేది మీ అభిప్రాయం. దాన్ని నేను గౌరవిస్తాను. మీకు వినోదాన్ని అందించడం కోసం నేను రక్తం, చెమట చిందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను' అని ట్వీట్ చేశాడు. దీనికి గాయపడిన కాలి ఫోటోను షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు 'మీ కష్టానికి విజయం దక్కకపోయినా పర్వాలేదు కానీ కనీసం అభినందనలైనా దక్కితే బాగుండేది' అని కామెంట్లు చేస్తున్నారు. 22.04.23 I still remember..it was one of the hottest days during the peak of summer..this was my feet after filming this episode on the 3rd day of the 25days..couldn’t walk properly..went away for a bit after it started to bleed..so My Director wanted to get the shot right n did… https://t.co/8cSOTW2H7b pic.twitter.com/4DXF0DYDFn — RAm POthineni (@ramsayz) November 4, 2023 చదవండి: శోభ సేఫ్, తేజ ఎలిమినేట్.. చేసిన పాపం ఊరికే పోతుందా? -
థియేటర్లో అట్టర్‌ఫ్లాప్.. ఓటీటీలో బ్లాక్‌బస్టర్ హిట్
మాస్ సినిమాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీను. మాస్ డైలాగులైనా, యాక్షన్ సీన్లయినా తన ఎనర్జీతో ఇరగదీసే హీరో రామ్ పోతినేని. వీరి కాంబోలో బొమ్మ పడితే బాక్సాఫీస్ దద్దరిల్లుతుందనుకున్నారంతా! కానీ అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. రామ్ పోతినేని- బోయపాటి కాంబోలో తెరకెక్కిన చిత్రం స్కంద. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో నెలలోపే ఓటీటీలోకి తీసుకురావాలని భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది. ఆ తర్వాత నవంబర్ 2న హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్కంద స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీలో స్కంద సినిమాను ఎగబడి మరీ చూస్తున్నారట! ఈ ఏడాది హాట్‌స్టార్‌లో రిలీజైన మొదటి 24 గంటల్లో ఎక్కువమంది వీక్షించిన సినిమాగా స్కంద నిలిచిందని తెలుస్తోంది. అప్పట్లో బోయపాటి.. బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా పెట్టి తీసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆడకపోయినా యూట్యూబ్‌లో మాత్రం రికార్డులు తిరగరాసింది. జయజానకి నాయక చిత్రం హిందీ డబ్బింగ్‌కు యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ వచ్చాయి. ఇప్పుడదే ట్రెండ్ హాట్‌స్టార్‌లోనూ కనిపిస్తోంది. మరోపక్క స్కంద సినిమా ఎడిటింగ్‌లో కొన్ని లోపాలున్నాయని విమర్శలూ వస్తున్నాయి. ఓ పక్క ట్రోలింగ్ జరుగుతున్నా మరోపక్క ట్రెండింగ్‌లో ఉండటం బోయపాటి సినిమాకే సాధ్యమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: భారతీయుడు 2 ఇంట్రో చూశారా? అదిరిపోయిందంతే! -
రామ్-బోయపాటి స్కంద మూవీ.. యాక్షన్ ఓకే.. రీ ఎంట్రీ ఎలా?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. జీ స్టూడియోస్‌తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇటీవలే ఓటీటీలో వచ్చిన స్కంద మూవీ ప్రేక్షకుల ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. నవంబర్ రెండో తేదీ నుంచే డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇది చదవండి: రాహుల్ సిప్లిగంజ్‌తో లవ్.. రతికా పేరేంట్స్ ఏమన్నారంటే?) సినిమా అన్నాక చిన్న చిన్న పొరపాట్లు జరగడం చూస్తుంటాం. ఎడిటింగ్‌లో అప్పుడప్పుడు కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతుంటాయి. ప్రస్తుతం రామ్ నటించిన స్కంద చిత్రంలోనూ అలాంటిదే జరిగింది. అయితే ఈ మూవీలోని ఓ సీన్ విషయంలో జరిగిన అతిపెద్ద పొరపాటు తాజాగా బయటకొచ్చింది. ఓటీటీలో సినిమా చూసిన ఓ ప్రేక్షకుడు.. ఆ సీన్‌ను కట్ చేసి ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే ఆ సీన్లో జరిగిన ఆ పెద్ద పొరపాటు ఏంటో తెలుసుకుందాం. సినిమా కథలో భాగంగా ఏపీ సీఎం కూతురిని (అజయ్ పుర్కర్) తీసుకురావడానికి.. తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి(శరత్ లోహితస్వ) వద్దకు రామ్ వెళ్తాడు. అదే సమయంలో ఫుల్ మాస్ యాక్షన్ సీన్ ఫైట్ జరుగుతుంది. అక్కడ రామ్ పవర్ఫుల్ డైలాగ్ కూడా చెబుతాడు. అయితే ఆ సీన్లో ఓ ముసలోడి పిస్టల్ తీసుకుని.. నిన్ను వదలను.. చంపేస్తా అంటూ రామ్ వైపు తుపాకి గురి పెడతాడు. అయితే రామ్ అదే తుపాకితీ అతన్ని కాల్చి పడేస్తాడు. కానీ ఆ తర్వాత వచ్చే సీన్లో చనిపోయిన ముసలోడు సీఎం వెనుక కనిపిస్తాడు. అదేంటి చనిపోయిన వ్యక్తి మళ్లీ సినిమాలో కనిపించడమేంటి? ఈ చిన్న మిస్టేక్ బోయపాటి గమనించలేకపోయాడా? అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత భారీ యాక్షన్ చిత్రంలో ఇలాంటి పొరపాటు ఏంటని సోషల్ మీడియా వేదికగా బోయపాటిని ఆడేసుకుంటున్నారు. (ఇది చదవండి: అంత అందంగా లేనన్నారు, వంక పెట్టారు: హీరోయిన్) స్కంద కాదు ఇది బోయపాటి గాడి బొంద🤦♂️ pic.twitter.com/p49ggMdbMQ — ఇవివి పంచ్ లు🤙 (@evvpunchlu333) November 2, 2023 -
వైజాగ్‌లో అఖండ విజయోత్సవం
-
Akhanda: బాలయ్య బర్త్‌డే సర్ప్రైజ్.. నవ్వుతూ నటసింహం అలా..
‘సింహా’,‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఉగాది కానుకగా టైటిల్ రోర్ పేరుతో వదిలిన టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. Wishing our #Akhanda, #NandamuriBalakrishna garu A very Happy Birthday. Here's #AkhandaBirthdayRoar for you💥💥#HBDBalakrishna #HappyBirthdayBalakrishna #BoyapatiSrinu @ItsMePragya @actorsrikanth @IamJagguBhai @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation pic.twitter.com/QI9EKzYHuw — Dwaraka Creations (@dwarakacreation) June 9, 2021 తాజాగా బాలయ్య పుట్టిన రోజు (జూన్ 10) సందర్భంగా బుధవారం సాయంత్రం ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. బర్త్ డే విషెస్ తెలుపుతూ రిలీజ్ చేసిన 'అఖండ' న్యూ పోస్టర్ లో బాలకృష్ణ నవ్వుతూ స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తున్నాడు. కలర్ ఫుల్ గా ఉన్న బ్యాగ్రౌండ్ చూస్తుంటే ఇది సెలబ్రేషన్ మూడ్ లో వచ్చే సాంగ్ లోదని అర్థం అవుతోంది. కొత్త పోస్టర్ విడుదలతో ఒక్క రోజు ముందే నందమూరి అభిమానుల్లో పుట్టిన రోజు సంబరాలు మొదలయ్యాయి. ఈ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: రెమ్యునరేషన్ పెంచేసిన స్టార్ హీరోలు.. ఒక్కో సినిమాకు ఎంతంటే.. PSPK28: ఫ్యాన్ మేడ్ పోస్టర్ వైరల్.. స్పందించిన నిర్మాణ సంస్థ -
బాలకృష్ణ బీబీ3లో అమలా పాల్!
హైదరాబాద్: హీరో నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు(జూన్ 9) సందర్భంగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా బీబీ3 (బాలకృష్ణ–బోయపాటి) ఫస్ట్ రోర్ పేరుతో 64 సెకండ్ల వీడియోను విడుదల చేసిన విషయంలో తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం దక్షాణాది భామ అమలా పాల్‌ను చిత్ర నిర్మాతలు సంప్రదించినట్లు సమాచారం. అంతేగాక దర్శకుడు బోయపాటి ఇటీవల అమలాకు కాల్ చేసి సినిమా స్క్రిప్ట్‌ను వివరించగా దానికి ఆమె ఆసక్తి చూపినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. త్వరలో అమలా పాత్రను అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లు సమాచారం. (బాలయ్య అభిమానులకు మరో కానుక) అయితే ఇదే పాత్ర కోసం దర్శక, నిర్మాతలు హీరోయిన్ శ్రియా శరణ్‌ను సంప్రదించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వివిధ కారణాల వల్ల తాను అంగీకరించలేదని టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ లీడ్ రోల్ పాత్రను కూడా త్వరలో చిత్ర యూనిట్ ప్రకటించనుంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను విలన్ పాత్లో నటింపజేయాలని నిర్మాతలు చర్చించుకుంటున్నట్లు కూడా సమాచారం. ఈ సినిమా 2021 వేసవిలో విడుదల కానున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ను మార్చి మొదటి వారంలో ప్రారంభించారు. కరోనా కారణంగా ఈ షూటింగ్ ఆగిపోయింది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’ (2010), ‘లెజెండ్’ (2014) సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. (బాలయ్యా మజాకా? అందులోనూ రికార్డులే!) -
15 ఏళ్లు : జనాల గుండెల్లో ‘భద్ర’
కొన్ని సినిమాలు టీవీల్లో ఎన్ని సార్లు వచ్చినా చూస్తాం.. ఎన్నేళ్లయినా చూస్తాం. అలాంటి సినిమాల జాబితాలోకి చేరే చిత్రం ‘భద్ర’. రవితేజ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ తొలి చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత బోయపాటి రూపంలో టాలీవుడ్‌కు మరో మాస్ డైరెక్టర్ దొరికాడని అందరూ భావించిన ఈ చిత్రం విడుదలై నేటికి పదిహేనేళ్లవుతోంది. మాస్ మహారాజ్ రవితేజలోని ఓ విభిన్న ప్రేమికుడిని బోయపాటి తనదైన స్టైల్లో వైవిధ్యంగా చూపించాడు. ప్రేమ, త్యాగం, యాక్షన్, ఎమోషన్ ఇలా డిఫరెంట్ యాంగిల్స్‌లో కనిపించిన రవితేజ తన నటనతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. ఇక పాటలకు మరో ప్రధాన బలం సంగీతం. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన ప్రతీ పాట ఓ ఆణిముత్యమే. ‘తిరుమల వాసా తిరుమల వాస సుమధుర హాస ఈ హారతి గొనవయ్యా’, ‘ఏమైంది సారు ఏంటా హుషారు’, ‘ఓ మనసా’ ఇలా ఈ చిత్రంలోని అన్ని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల గుండెల్లో నిలిచిపోయాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మీరాజాస్మిన్ మన పక్కింటి అమ్మాయిగా కనిపించి తన నటనతో యువత డ్రీమ్ గర్ల్‌గా మారిపోయింది. ఇక రవితేజ, అర్జున్ బజ్వాల మధ్య సీన్స్ స్నేహితులను కట్టిపడేసేలా ఉంటాయి. ఇక ప్రకాష్ రాజ్, మురళీమోషన్, ఈశ్వరీ రావు తదితరులు తమ నటనతో సినిమాకు మరింత జీవం పోశారు. దిల్ రాజ్ నిర్మాత వ్యహరించిన ఈ చిత్రాన్ని తొలుత అల్లు అర్జున్‌తో తీయాలని దర్శకనిర్మాతలు భావించారు. అయితే కథ నచ్చినా కొత్త దర్శకుడు అనే కారణంతో బన్ని వెనకడుగు వేశాడు. దిల్ రాజ్ సూచనతో రవితేజను హీరో ఈ సినిమా పట్టాలెక్కించి ఘన విజయాన్ని అందుకున్నాడు బోయపాటి. చదవండి: దేవిశ్రీ ఫిక్స్.. ప్రకటించిన క్రేజీ డైరెక్టర్ శుభశ్రీ జీ.. మీరు ఎంతో మందికి స్పూర్తి: చిరు -
అఘోరాగా బాలయ్య.. ఇది నిజమేనంటా
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని అందులో ఓ పాత్రలో అఘోరాగా కనిపించనున్నారని లీకువీరులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చిత్ర తొలి షెడ్యూల్ షూటింగ్ వారణాసిలో జరపుకోవడంతో ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే తాజాగా ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ బోయపాటి ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ‘మా కాంబినేషన్ లో అభిమానులు ‘సింహా’ చూశారు. ఆ తర్వాత ‘లెజెండ్’ చూశారు. ఈసారి అంతకుమించి కొత్తదనం చూపించాలని అందుకే వందశాతం కష్టపడుతున్నాం. కొత్తదనం కోసం క్యారెక్టరైజేషన్ నుంచి కథ చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఈ కొత్త సినిమాలో బాలయ్య మరింత కొత్తగా కనిపిస్తారు. అభిమానులను కనువిందు చేస్తారు. ఇక అఘోరా విషయానికి వస్తే అఘోరా టైపు క్యారెక్టర్ ఉన్నమాట వాస్తవమే. అయితే దాన్ని ఎలా డిజైన్ చేశాం, ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అనేది చాలా ముఖ్యం. కొత్తదనం కావాలంటే ఈమాత్రం ట్రై చేయాల్సిందే’అంటూ బోయపాటి పేర్కొన్నారు. దీంతో ఈ కొత్త చిత్రంలో బాలయ్య అఘోరాగా కనిపించడం ఫిక్సని అర్థమయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో అంజలి ఓ హీరోయిన్గా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చదవండి: ‘ప్రభాస్-అమీర్‌లతో మల్టీస్టారర్ చిత్రం చేయాలి’ నిహారిక, యశ్‌ల డ్యాన్స్ చూశారా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_811248975.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బోయపాటి చిత్రం: విలన్‌గా బాలయ్య?
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి చిత్రానికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లీకువీరులు ఈ సినిమా కథ, పాత్రల గురించి ఎప్పటికప్పుడు లీకులు అందిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో డ్యుయల్ రోల్ పోషిస్తున్న బాలయ్య ఓ పాత్రలో భాగంగా విలన్ పాత్రలో కనిపిస్తాడని టాలీవుడ్ హాట్ టాపిక్. ఈ సినిమాలో విలన్ పాత్రను బలంగా రూపొందిస్తున్నారట బోయపాటి. అయితే బాలయ్య వంటి హీరోను ఢీ కొట్టడానికి అవతల కూడా బాలయ్యనే ఉండాలని దర్శకుడు భావిస్తున్నాడట. దర్శకుడి ఆలోచనకు ఈ నందమూరి హీరో కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తల వచ్చాయి. అయితే తాజాగా చిత్ర యూనిట్ నుంచి వచ్చిన అనధికారిక సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలయ్య విలన్‌గా కనిపంచట్లేదట. సినిమా మొదలైన కొన్ని నిమిషాల పాటు నెగటీవ్ షేడ్స్‌లో కనిపిస్తారని కానీ విలన్ కాదని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో భూమిక చావ్లా పవర్ఫుల్ లేడీ విలన్ పాత్ర పోషిస్తున్నారని మరో వార్త ప్రచారంలో ఉంది. అయితే ఈ చిత్రంలో విలన్ పాత్ర గురించి స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు ఆడిపాడనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం అంజలి, శ్రియాలను చిత్ర బృందం ఎంపిక చేసిందని టాక్ ఆఫ్ ద టౌన్. ఇప్పటికే చిత్ర షూటింగ్ వారణాసిలో ప్రారంభమైంది. అయితే లాక్డౌన్ కారణంగా షూటింగ్ వాయిదాపడింది. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: బాలయ్య సినిమాలో లేడీ విలన్? అందుకే ఆర్ఆర్ఆర్ వచ్చేలా టైటిల్ పెట్టాం -
బాలయ్య సినిమాలో లేడీ విలన్?
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటేనే మాస్ అభిమానులకు పండగే. దాదాపుగా బోయపాటి అన్ని సినిమాల్లో హీరోయిజంతో పాటు విలనిజం కూడా ఓ రేంజ్లో ఉంటుంది. ఆయన గత సినిమాలను చూస్తే ఇది స్పష్టమవుతుంది. అయితే బాలయ్యతో తీస్తున్న సినిమాలో ఓ పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం భూమికను బోయపాటి ఎంపిక చేసినట్లు టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రతినాయకురాలి పాత్ర కోసం చిత్రబృందం ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపనట్టు సమాచారం. అయితే భూమిక కంటే ముందు సీనియర్ హీరోయిన్లను బోయపాటి సంప్రదించగా వారు సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. దీంతో భూమిక వైపు బోయపాటి మొగ్గు చూపినట్లు అందరూ భావిస్తున్నారు. భూమిక నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే బాలయ్య ‘రూలర్’ చిత్రంలో భూమిక కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పటివరకు క్లాస్, క్యూట్ లుక్స్‌లో కనిపించిన భూమిక లేడీ విలన్‌గా అందులోనూ ఊరమాస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటి చిత్రంలో ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి. ఇక ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినం చేస్తునట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వారణాసి తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోవాల్సి ఉండగా.. లాక్డౌన్ కారణంగా షూటింగ్ వాయిదాపడింది. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో వస్తోన్న ఈ మూడో చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. చదవండి: అంతా బాగుంటాం రా నన్ను రక్షించండి – ఆండ్రూ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_811248975.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బాలయ్య న్యూలుక్ అదిరింది!!
నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ మధ్యనే వచ్చిన ‘రూలర్’ చిత్రంలో స్టైలీష్ లుక్‌లో ఆకట్టుకున్న బాలయ్య తాజాగా గుండుతో దర్శనమిచ్చాడు. ఖద్దర్ బట్టలతో, గుబురు మీసంతో కనిపించిన బాలయ్య లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో భాగంగానే బాలయ్య గుండు చేయించుకున్నారని టాక్. ఇక ఈ సినిమాలో బాలయ్యను డిఫరెంట్ షేడ్స్‌లో చూపించే ప్రయత్నం చేస్తున్నారట బోయపాటి శ్రీను. అంతేకాకుండా మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఇందులో భాగంగానే పూర్తి మాస్ యాంగిల్లో కనిపించే విధంగా బాలయ్య గుండుతో కనిపించనున్నారని సమాచారం. అయితే బాలయ్యకు సంబంధించి ఈ న్యూలుక్ సినిమా కోసమా లేక సాధారణంగా దిగిన ఫోటోనా తెలియాల్సి ఉంది. ఇక సినిమాల పరంగా తాను ఏ పాత్ర చేసినా అందులో లీనమవడంతో పాటు ఆ పాత్ర కోసం ఏం చేయడానికైనా బాలకృష్ణ సిద్దంగా ఉంటాడు. ‘రూలర్’ సినిమా కోసం బరువు తగ్గి ఐరన్ మ్యాన్ లుక్‌తో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇక ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో పాటు అంతకుముందు వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్‌లు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో బాలయ్యతో పాటు నందమూరి ఫ్యాన్స్ కూడా బోయపాటి శ్రీనివాస్ పైనే ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు. ఈ చిత్రంతోనైనా బాలయ్య సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్ర రిలీజ్ డేట్ గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తేదీనే(జులై 30న) ఈ చిత్రం రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే జులై 30న ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే అవకాశం లేకపోవడంతో అదే తేదీన ఈ చిత్రం రిలీజ్ చేస్తే అన్నివిధాల కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆ డేట్‌ను కూడా బుక్ చేసుకున్నట్లు టాలీవుడ్ టాక్. ఇక ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చదవండి: ‘రూలర్’ మూవీ రివ్యూ అప్పుడు ‘దొరసాని’.. ఇప్పుడు ‘విధివిలాసం’ -
హిట్.. ఫేవరెట్
2019... ప్రేక్షకులకు తెలుగు సినిమా చాలానే ఇచ్చింది. కొత్త దర్శకులు, హీరోలు, హీరోయిన్లను పరిచయం చేసింది. కొత్త తరహా చిత్రాలను తీసుకొచ్చింది. పనిలో పనిగా ప్రేక్షకుల ‘ఫేవరేట్ కాంబినేషన్’ని మళ్లీ సెట్ చేసింది. 2019లో ఇలా మళ్లీ సెట్ అయిన సక్సెస్ఫుల్ కాంబినేషన్ సినిమాలు 2020లో విడుదలవుతాయి. ఇక ఈ ఫేవరెట్ హిట్ కాంబినేషన్ల గురించి తెలుసుకుందాం.. మాస్ కాంబినేషన్ ఆడియన్స్ మాస్ పల్స్ పట్టిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. ప్రేక్షకులకు మాస్ కిక్ ఎక్కించే హీరో బాలకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అది డబుల్మాసే. బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్లో ఆల్రెడీ వచ్చిన ‘సింహా’ (2010), ‘లెజెండ్’ (2014) చిత్రాల మాస్ సక్సెస్‌లే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో మరో మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ ఏడాది ముగిశాయి. జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను డబుల్ హ్యాట్రిక్ అల్లు అర్జున్‌ని (బన్నీ) ‘జులాయి’ (2012)గా చూపించి ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు త్రివిక్రమ్. ‘జులాయి’ వచ్చిన మూడేళ్ల తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’గా బన్నీతో త్రివిక్రమ్ చెప్పించిన కుటుంబ విలువల లెక్కలు ప్రేక్షకులకు బాగా కిక్ ఇచ్చాయి. దీంతో వీరిద్దరూ హాట్రిక్ హిట్ కోసం 2018లో ‘అల... వైకుంఠపురములో..’కి వెళ్లిపోయారు. ఈ చిత్రం జవనరి 12న విడుదల కానుంది. ఇక 2004లో దర్శకునిగా సుకుమార్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఆర్య’. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటించారు. ఈ సినిమా విజయం ఇద్దరి కెరీర్‌కు మంచి మైలేజ్‌ని ఇచ్చింది. ‘ఆర్య’ సక్సెస్ క్రేజ్‌ను రిపీట్ చేయడానికి వీరిద్దరూ కలిసి ‘ఆర్య 2’ (2009) చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఈ ఏడాదిలో ప్రకటించారు. సో.. కొత్త ఏడాది అల్లు అర్జున్ అభిమానులకు డబుల్ ధమాకాయే. సుకుమార్, అల్లు అర్జున్, త్రివిక్రమ్ హిట్ కోసం క్రాక్ దర్శకునిగా గోపీచంద్ మలినేని ఇప్పటివరకు ఐదు సినిమాలు తెరకెక్కిస్తే అందులో రెండు (‘డాన్ శీను’ (2010), ‘బలుపు’ (2013)) చిత్రాలు రవితేజ హీరోగా వచ్చినవే. తాజాగా గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్లో మూడో చిత్రంగా ‘క్రాక్ ’ తెరకెక్కుతోంది. డాన్ శీను, బలుపుతో హిట్ సాధించి, ఇప్పుడు మరో హిట్ కోసం వీరు చేస్తున్న ‘క్రాక్’ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. గోపీచంద్ మలినేని, రవితేజ రూట్ మారింది రామ్ కెరీర్లో ‘నేను..శైలజ...’ (2016) సూపర్‌హిట్ మూవీ. దీంతో ఈ సినిమా దర్శకుడు కిశోర్ తిరమలతో 2017లో ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా చేశారు రామ్. ఈ ఏడాది రామ్–కిశోర్ తిరుమల కలిసి ‘రెడ్’ అనే సినిమా చేస్తున్నారు. ‘నేను...శైలజ, ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాల్లో రామ్‌ను లవర్ బాయ్‌గా చూపించిన కిశోర్ ఈసారి రూట్ మార్చి ‘రెడ్’ రామ్‌ను ఫుల్ మాస్ క్యారెక్టర్లో చూపించబోతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. రామ్–కిశోర్ తిరుమల హీరో విలనయ్యాడు! దాదాపు పదేళ్ల క్రితం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ అనే చిత్రం ప్రేక్షకులకు నాని అనే మంచి నటుడిని పరిచయం చేసింది. ఈ చిత్రం తర్వాత నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘జెంటిల్మన్’ (2016) కూడా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇప్పుడు ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నటిస్తున్న మూడో చిత్రం ‘వి’. ఇందులో సుధీర్‌బాబు మరో హీరో. ఈ సినిమాలో నానీది విలన్ రోల్. అలాగే నాని తొలిసారి విలన్ పాత్ర చేస్తున్న చిత్రం కూడా. అలా నానీని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటే ఇప్పుడు తనను విలన్‌గా చూపించబోతుండటం విశేషం. సమ్మోహనం(2018) తర్వాత సుధీర్‌బాబు, ఇంద్రగంటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం కూడా ఇదే. ఇంద్రగంటి మోహనకృష్ణ , నాని లవ్ కాంబినేషన్ ‘ఊహలు గుసగుసలాడే...’(2014) చిత్రంతో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు నాగశౌర్య. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించిన అవసరాల శ్రీనివాసే ఈ సినిమాను తెరకెక్కించారు. రెండేళ్ల తర్వాత అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ‘జ్యో అచ్యుతానంద’(2016) సినిమాలో ఒక హీరోగా నటించారు నాగశౌర్య. నారా రోహిత్ మరో హీరో. తాజాగా నాగశౌర్య–అవసరాల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి’. వీరి కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా మరో లవ్‌స్టోరీ కావడం విశేషం. అవసరాల శ్రీనివాస్, నాగశౌర్య ఈ థర్డ్ కాంబినేషన్సే కాకుండా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (2013) సినిమా తర్వాత తమిళ హిట్ ‘అసురన్’ తెలుగు రీమేక్ కోసం హీరో వెంకటేష్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రెండోసారి సెట్టయ్యారు. ‘గౌతమ్‌నంద’ (2017) తర్వాత గోపీచంద్‌ని కబడ్డీ కోచ్‌గా మార్చి, ఆయనతో రెండో సినిమా తీస్తున్నారు సంపత్‌నంది. ‘నిన్నుకోరి’(2017) హిట్ కిక్‌తో ‘టక్‌జగదీష్’ కోసం మరోసారి కలిసి సెట్స్‌కు వెళ్లడానికి రెడీ అయ్యారు హీరో నాని, దర్శకుడు శివనిర్వాణ. ‘గూఢచారి’(2018)వంటì సూపర్‌హిట్ తర్వాత ‘మేజర్’కోసం మళ్లీ కలిశారు హీరో అడవి శేష్, దర్శకుడు శశి కిరణ్ తిక్క. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ (2015) చిత్రంలో రానా ఓ కీలకపాత్ర చేశారు. ఇప్పుడు రానా–గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చే ఏడాది చివర్లో ‘హిరణ్యకశ్యప’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హిట్ దిశగా తమను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ డైరెక్షన్లో యాక్ట్ చేయడానికి మరికొందరు హీరోలు కూడా రెడీ అయ్యారు. మరికొందరు అవుతున్నారు. ఇండియన్ సినిమా దృష్టంతా ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పైనే ఉంది. ఈ సినిమాకు ముందు రాజమౌళి దర్శకత్వంలో రెండు భాగాలుగా విడుదలైన ‘బాహుబలి’ చిత్రం సృష్టించిన ప్రభంజనం ప్రభావమే ఇందుకు ఓ కారణం. అలాగే ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలసి నటిస్తున్న చిత్రం కావడంతో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. అయితే గతంలో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం 1 (2001), సింహాద్రి (2003), యమదొంగ (2007)’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి–ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న నాలుగో చిత్రం ఇది. అలాగే రామ్‌చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర (2009) అనే సూపర్‌హిట్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ రాజమౌళి–రామ్‌చరణ్ కాంబినేషన్ పరంగా రెండోది. ఇలా ఆల్రెడీ సోలోగా రాజమౌళితో హిట్ అందుకున్న ఎన్టీఆర్–రామ్‌చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో కలసి హిట్ అందుకోవడం ఖాయం అనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న పది భాషల్లో విడుదల కానుంది. –ముసిమి శివాంజనేయులు. -
పార్టీ నేతలకు శిక్షణపై బాబు సమీక్ష
పుష్కరాల ఆరంభంలోగా నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ! సాక్షి, విజయవాడ బ్యూరో : టీడీపీ నేతలకు శిక్షణపై పార్టీ రాష్ర్ట కార్యాలయ బాధ్యులతో అధినేత చంద్రబాబు బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో చర్చించారు. పార్టీ నేతలు సుమారు 500 మందికి గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని ఓ ప్రైవేటు వర్సిటీ లేదా విజయవాడ నగరంలోని ఫంక్షన్ హాల్లో శిక్షణనిచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, నాయకత్వ లక్షణాల పెంపు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై 40 మంది చొప్పున ఉండే ఒక్కో బ్యాచ్‌కు ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే ఖాళీగా ఉన్న నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీపై కూడా చర్చించారు. పుష్కరాల ఆరంభంలోగా వీటిని భర్తీ చేసి, శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. సీఎంను కలసిన దర్శకుడు బోయపాటి సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. వచ్చే నెలలో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గతేడాది గోదావరి పుష్కరాల ప్రారంభ దృశ్యాలను బోయపాటి దర్శకత్వంలో చిత్రీకరించిన విషయం తెలిసిందే. అలాగే ఈసారి కూడా కృష్ణా పుష్కరాల సందర్భంగా నది అలంకరణతో పాటు ప్రారంభ దృశ్యాలను చిత్రీకరించడం, మహా హారతి ఎక్కడ్నుంచి ఇస్తే అందరూ వీక్షించేందుకు వీలుగా ఉంటుందో ఆ స్థలాన్ని ఖరారు చేసే బాధ్యత బోయపాటికే అప్పగించినట్లు సమాచారం.