నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటేనే మాస్ అభిమానులకు పండగే. దాదాపుగా బోయపాటి అన్ని సినిమాల్లో హీరోయిజంతో పాటు విలనిజం కూడా ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆయన గత సినిమాలను చూస్తే ఇది స్పష్టమవుతుంది. అయితే బాలయ్యతో తీస్తున్న సినిమాలో ఓ పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం భూమికను బోయపాటి ఎంపిక చేసినట్లు టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రతినాయకురాలి పాత్ర కోసం చిత్రబృందం ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపనట్టు సమాచారం. అయితే భూమిక కంటే ముందు సీనియర్ హీరోయిన్లను బోయపాటి సంప్రదించగా వారు సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది.
దీంతో భూమిక వైపు బోయపాటి మొగ్గు చూపినట్లు అందరూ భావిస్తున్నారు. భూమిక నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే బాలయ్య ‘రూలర్’ చిత్రంలో భూమిక కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పటివరకు క్లాస్, క్యూట్ లుక్స్‌లో కనిపించిన భూమిక లేడీ విలన్‌గా అందులోనూ ఊరమాస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటి చిత్రంలో ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి. ఇక ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినం చేస్తునట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వారణాసి తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోవాల్సి ఉండగా.. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదాపడింది. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూడో చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.
చదవండి:
అంతా బాగుంటాం రా
నన్ను రక్షించండి – ఆండ్రూ
బాలయ్య సినిమాలో లేడీ విలన్?
Published Sun, Apr 12 2020 11:57 AM | Last Updated on Sun, Apr 12 2020 11:57 AM
Comments
Please login to add a commentAdd a comment