Bhumika Chawla
-
రెండు దశాబ్దాల తర్వాత...
మహేశ్‌బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘ఒక్కడు’ (2003) సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించారు భూమిక. కాగా 20 ఏళ్ల తర్వాత మళ్లీ గుణశేఖర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు భూమిక. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘యుఫోరియా’ చిత్రంలో భూమిక ఓ పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ప్రారంభమైంది. ఈ సందర్భంగా సెట్స్ నుంచి ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘వైవిధ్యమైన, హిట్ సినిమాలకు పెట్టింది పేరైన గుణశేఖర్ ప్రస్తుతం యూత్‌ఫుల్ సోషల్ డ్రామాగా ‘యుఫోరియా’ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దురాగతాలపై ఈ చిత్రం రూపొందుతోంది. భూమిక కోసం గుణశేఖర్ ఓ పవర్ఫుల్ పాత్రను సృష్టించారు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె. పోతన్, సంగీతం: కాల భైరవ. -
గుణశేఖర్ 'యుఫోరియా' గ్లింప్స్.. ఈసారి కొత్తగా ప్లాన్ చేశాడుగా!
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ రూటు మార్చాడు. ఈసారి భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా సింపుల్‌గా ఉండేలా యూత్‌కు కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ఎంచుకున్నాడు. 'వరల్డ్ ఆఫ్ యుఫోరియా' సినిమా తెరకెక్కించాడు. ఇందులో భూమిక ప్రధాన పాత్రలో నటించగా సారా అర్జున్, నాజర్, రోహిత్, పృథ్వీరాజ్, లిఖిత కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.గ్లింప్స్‌లో డ్రగ్స్, అత్యాచారం వంటి సీరియస్ అంశాలను చూపించారు. ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందించాడు. చాలా రోజుల తర్వాత హిట్ కోసం ఆరాటపడుతున్న గుణశేఖర్‌కు యుఫోరియా తిరిగి సక్సెస్‌ను ఇచ్చేట్లు కనిపిస్తోంది. నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీన్ కె పోతన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. -
హీరోయిన్ భూమిక చావ్లా బర్త్ డే స్పెషల్.. ఫోటోలు
-
సముద్రం తీరంలో తేజస్వీ ప్రకాశ్ చిల్.. హెబ్బా పటేల్ స్మైలీ లుక్స్..!
మెక్సికోలో చిల్ అవుతోన్న తేజస్వీ ప్రకాశ్.. మంచుకొండల్లో భూమిక చావ్లా చిల్.. లైట్ బ్లూ డ్రెస్‌లో హెబ్బా పటేల్ స్మైలీ లుక్స్.. పింక్ డ్రెస్‌లో రీతూ చౌదరి హోయలు.. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) -
వ్యాపార రంగంలో అడుగుపెట్టిన భూమిక
-
బిజినెస్‌లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్!
టాలీవుడ్ సినిమాతోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ భూమిక చావ్లా. యువకుడు సినిమాతో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత ఖుషీ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. అనంతరం మిస్సమ్మ, సింహాద్రి, వాసు, ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. మిస్సమ్మ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా చేసిన భామ.. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్‌తో మెప్పిస్తోంది. ఎంఎస్ ధోని చిత్రంలో సుశాంత్‌కు అక్కగా నటించి మెప్పించింది. ప్రస్తుతం కంగనా రనౌత్ నటిస్తోన్న ఎమర్జన్సీ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉండే భూమిక చావ్లా.. తాజాగా వ్యాపారం రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. గోవాలో కొత్త హోటల్‌ను ప్రారంభించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ నటికి అభినందనలు తెలుపుతున్నారు. భూమిక హోటల్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) -
‘జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ 2023’ తారల సందడి (ఫొటోలు)
-
మన హీరోల గురించి భూమిక ఏం చెప్పిందో చూడండి..
-
బాలీవుడ్లో ఆ రెండు సినిమాల్లో నుంచి నన్ను తీసేశారు: భూమిక
తెలుగులో టాప్ హీరోయిన్గా వెలుగొందిన భూమిక సౌత్ సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ నటించింది. హిందీలో తొలి చిత్రంతోనే గుర్తింపు పొందిన తనకు ఆ తర్వాత చేదు అనుభవాలు ఎదురయ్యాయని పేర్కొంది హీరోయిన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'హిందీలో నా తొలి చిత్రం తేరే నామ్. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన నటించాను. ఈ మూవీ హిట్ కావడంతో నాకు హీరోయిన్గా మంచి మంచి అవకాశాలు వచ్చాయి. సాధారణంగానే నేను ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటాను. అలా తేరే నామ్ తర్వాత నాకు ఒక పెద్ద సినిమా ఆఫర్ వచ్చింది. ఓకే చేశా. కానీ సడన్‌గా నిర్మాతలు మారడంతో హీరోను, నన్ను మార్చేశారు. సినిమా టైటిల్ కూడా చేంజ్ చేశారు. ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదేమో! ఏది జరగాలనుంటే అది జరుగుతుందనుకున్నాను. కానీ ఆ సినిమా కోసం మరే మూవీ ఒప్పుకోకుండా ఏడాదిపాటు ఎదురుచూశాను. చివరికి నిరాశే ఎదురవడంతో వేరే సినిమాలకు సైన్ చేశాను. కానీ తేరే నామ్ వంటి పెద్ద హిట్ నాకు బాలీవుడ్లో మళ్లీ దొరకలేదు. నాకు మరీ బాధేసిన సంఘటన ఏంటంటే.. జబ్ వి మెట్ సినిమాకు మొదట నేను సంతకం చేశాను. నాకు జోడీగా బాబీ డియోల్ అన్నారు, తర్వాత షాహిద్ కపూర్ అన్నారు. కట్ చేస్తే షాహిద్ కపూర్- కరీనా కపూర్ సినిమాలో ఉన్నారు. నన్ను తీసేశారు. మున్నా భాయ్ ఎంబీబీఎస్ సినిమాకు కూడా సంతకం చేశాను, కానీ ఇక్కడ కూడా నన్ను తీసేశారు. మణిరత్నం కన్నతిల్ ముత్తమిట్టల్ సినిమాలో కూడా నేనే హీరోయిన్ అని చెప్పి చివరకు హ్యాండిచ్చారు' అని చెప్పుకొచ్చింది. కాగా భూమిక ఇటీవల రిలీజైన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది. -
చిరు పాటకు అషు స్టెప్పులు.. ముద్దుల కూతురితో ప్రణీత ఆటలు
చిరంజీవి పాటకు అషు రెడ్డి స్టెప్పులు తన కూతురితో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది హీరోయిన ప్రణీత పొట్టి దుస్తుల్లో ‘ఖుషి’ భామ భూమిక.. న్యూ ఇయర్ సందర్భంగా కొత్త ఫోటోలను అభిమానులతో పంచుకుంది View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
ఈ ఇయర్ సెకండాఫ్ నాకు బాగుంది
‘బటర్ ఫ్లై’ సినిమాలో చేసిన గీత క్యారెక్టర్ నాకు సవాల్ అనిపించింది. ఈ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది’’ అని అనుపమా పరమేశ్వరన్ అన్నారు. ఘంటా సతీష్ బాబు దర్శకత్వంలో అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘బటర్ ఫ్లై’. భూమికా చావ్లా, రావు రమేష్, నిహాల్ కోధాటి కీలక పాత్రల్లో రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువల్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 29న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ – ‘‘ఈ ఇయర్ సెకండాఫ్ నాకు చాలా బాగుంది. నేను హీరోయిన్గా నటించిన ‘కార్తికేయ 2, 18 పేజెస్’ హిట్టయ్యాయి. ఇప్పుడు ‘బటర్ ఫ్లై’ రిలీజ్ అవుతోంది’’ అన్నారు. ఘంటా సతీష్ బాబు, ప్రసాద్ తిరువళ్లూరి, నిహాల్, సంగీత దర్శకుడు అర్విజ్ తదితరులు మాట్లాడారు. -
అలా వెళ్తేనే ఆఫర్లు వస్తాయా?..భూమిక షాకింగ్ కామెంట్స్
Actress Bhumika Chawla Shocking Comments: యువకుడు చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయిన భూమిక.. ఖుషీ సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా ఒక్కడు, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. హీరోయిన్గా మాంచి ఫామ్‌లో ఉన్నప్పుడే 2007లో నిర్మాత భరత్ ఠాకూర్‌ని పెళ్లాడిన భూమిక..ఆ తర్వాత హీరోయిన్ రోల్స్‌కి గుడ్‌బై చెప్పింది. రీఎంట్రీ అనంతరం అక్క, తల్లి , వదిన వంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో అలరిస్తుంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంతవరకు ఆమెకు సరైన పాత్ర దొరకలేదనే చెప్పాలి. ’ఎం.సి.ఎ’ ‘పాగల్’, ‘సీటిమార్’ వంటి సినిమాలో ఓకే అనిపించినా సెకండ్ ఇన్నింగ్స్‌కు బూస్టప్‌ను ఇవ్వలేకపోయాయి. దీనికి ప్రధాన కారణం భూమిక ఎక్కువగా సెలబ్రిటీలతో కలవదని, ప్రైవేటు పార్టీలకు సైతం వెళ్లదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన ఆమె..'పార్టీలకు వెళ్తే తప్పా మంచి రోల్స్ రావా? అలాంటి మాటలను నేను ఎంకరేజ్ చేయను. ఫిల్మ్ మేకర్స్‌తో రోజూ టచ్‌లో ఉంటేనే అవకాశాలు వస్తాయన్నది భ్రమ మాత్రమే. నా కోసమే పాత్రలు రాసి, నా కోసం ముంబై వచ్చిన మేకర్స్ చాలా మంది ఉన్నారు' అని చెప్పుకొచ్చింది. -
Idhe Maa Katha Review: ‘ఇదే మా కథ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇదే మా కథ నటీనటులు : శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక, తాన్యా హోప్ తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ నిర్మాత : జీ మహేష్ దర్శకత్వం : గురు పవన్ సంగీతం : సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫీ : రాంప్రసాద్ ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ విడుదల తేది : అక్టోబర్ 2,2021 సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో గురు పవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇదే మా కథ’. జి. మహేష్ నిర్మించిన ఈ సినిమా శనివారం (అక్టొబర్ 2)న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ చిత్రం ఎలా ఎందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? మహేంద్ర(శ్రీకాంత్) క్యాన్సర్ బారిన పడిన ఓ బైక్ రైడర్. తన చివరి లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం బైక్‌పై లడఖ్‌కి బయలుదేరుతాడు. లక్ష్మీ (భూమిక) సాధారణ గృహిణి. భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నా ఆమె.. తన తండ్రి చివరి కోరికను తీర్చడం కోసం భర్తను ఎదురించి లడఖ్‌కి బయలుదేరుతుంది. మరోవైపు యూట్యూబర్ కమ్ బైక్ రైడర్ అజయ్(సుమంత్ అశ్విన్) ఛాంపియన్ షిప్ సాధించాలని లడఖ్ బయలు దేరుతాడు. ప్రేమ పేరుతో మోసానికి గురైన మేఘన (తాన్యా హోప్) బైక్ రైడింగ్‌కి వెళ్తుంది. వీరంతా అనుకోకుండా మార్గమధ్యలో కలుసుకుంటారు. చావు, బతుకులతో పోరాడుతున్న మహేంద్ర.. బైక్‌పైనే లడఖ్‌కి ఎందుకు వెళ్తాడు? అనుకోకుండా కలిసే ఈ నలుగురు బైక్ రైడర్స్ వారి కష్టాలను ఎలా పంచుకున్నారు? ఎలా పరిష్కరించుకున్నారు? అన్నదే ‘ఇదే మా కథ’ స్టోరీ. ఎవరెలా చేశారంటే.. భగ్న ప్రేమికుడు మహేంద్ర పాత్రలో శ్రీకాంత్ అద్భుతంగా నటించాడు. సినిమా భారాన్ని మొత్తం తన భూజాన వేసుకొని నడిపించాడు. సాధారణ గృహిణి లక్ష్మీ పాత్రలో భూమిక ఒదిగిపోయింది. కుటుంభ బాధ్యతలు మోస్తూనే.. తండ్రి ఆశయం కోసం మోటార్ రంగంలో కొత్త ఆవిష్కరణలు సాధించే మహిళగా భూమిక తనదైన నటనతో మెప్పించింది. ఇక బైక్ రైడర్ అజయ్‌గా సుమంత్ అశ్విన్ అదరగొట్టేశాడు. చాలా హూషారైన పాత్ర తనది. కొత్తలుక్‌తో చాలా కాన్ఫిడెన్స్‌గా నటించాడు. ఇక మేఘనగా తాన్యా హూప్ పర్వాలేదనిపించింది. తెరపై చాలా అందంగా కనిపించింది. సప్తగిరి, పృథ్వీ, జబర్దస్త్ రాంప్రసాద్ తమదైన కామెడీతో నవ్వించారు. శ్రీకాంత్ అయ్యంగార్,సుబ్బరాజు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? నలుగురు బైక్ రైడర్స్ జీవితాలకు సంబంధించిన ఎమోషనల్ కథే ‘ఇదే మా కథ’మూవీ. నలుగురు వ్యక్తుల జీవితంతో చోటు చేసుకున్న సమస్యలు, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఎలా తమ లక్ష్యాలను నెరవేర్చుకున్నారనే నేపథ్యంలో కథ నడుస్తుంది. కంప్లీట్ రోడ్ జర్నీగా సాగే ఈ కథకి ఎమోషనల్ టచ్ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గురు పవన్. రొటీన్ కథే అయినప్పటికీ.. కథనాన్ని ఇంట్రెస్టింగ్ నడిపించాడు. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం స్లోగా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి. ఫస్టాఫ్‌లో పాత్రలను పరిచయం చెయ్యడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. నలుగురు కలిశాక కానీ సినిమాపై ఆసక్తి పెరగదు. మధ్యలో వచ్చే సప్తగిరి, రాంప్రసాద్, పృథ్వీ ల కామెడీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సప్తగరి పంచ్‌లు.. నవ్వులు పూయిస్తుంది. ఎమోషనల్ కంటెంట్‌ని ఇంకా ఎలివేట్ చేసి ఉంటే ఈ మూవీ మరోస్థాయికి వెళ్లేది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు సందర్భోచితంగా వస్తాయి. సి. రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫి సినిమాకు హైలెట్. బైక్ విన్యాసాలతో పాటు సానా సన్నివేశాలను బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
నిర్మాతల కష్టం బాగా తెలిసింది
‘‘యాక్టర్‌గా నా జర్నీ పట్ల సంతృప్తిగానే ఉన్నాను. ప్రతి సినిమా ఓ కొత్త అనుభూతే. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నాను. ప్రొడ్యూసర్ అంటే అంతా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. నిర్మాతల కష్టం ఏంటో ఇప్పుడు నాకు ఇంకా బాగా తెలుస్తోంది’’ అన్నారు సుమంత్ అశ్విన్. గురు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. మనోరమ సమర్పణలో మహేశ్ గొల్లా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరో సుమంత్ అశ్విన్ చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో ఒక్కొక్కరికీ ఒక్కో గోల్ ఉంటుంది. శ్రీకాంత్‌గారికి లడక్‌లో ఓ స్టోరీ ఉంటుంది. పాత్ర ప్రకారం ఆయన కోరుకుంటే ప్రైవేట్ జెట్ ఫ్లయిట్లో వెళ్లొచ్చు. కానీ బైక్ రైడ్ అంటే ఇష్టంతో బైక్‌లో స్టార్ట్ అవుతారు. తండ్రి ఆశయాన్ని పూర్తి చేయడం కోసం భూమికగారు, మా గోల్స్‌ను ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం నేను, తాన్య రోడ్ జర్నీని బైక్‌పై మొదలుపెడతాం. మేమంతా ఎక్కడ కలుసుకున్నాం? మా జర్నీ ఏమైంది? గోల్స్ రీచ్ అయ్యామా లేదా? అనేది కథ. ► తెలుగులో రోడ్ ఫిలిమ్స్ చాలా తక్కువ. క్లైమాక్స్‌లో మంచుపై రైడ్ సీన్స్ ఉంటాయి. రోడ్డుపై అంటే ఓకే.. కానీ మంచుపై కష్టం. అందుకే బాగా ప్రాక్టీస్ చేశాం. భూమికగారు ధైర్యవంతురాలు. డూప్స్‌ను పెట్టుకునే వీలు ఉన్నప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. ► తాన్యాతో నా లవ్‌ట్రాక్ న్యాచురల్‌గా ఉంటుంది. డైరెక్టర్ గురు ఈ సినిమా కోసం బైక్స్‌పై చాలా పరిశోధన చేశారు. ఏ బైక్‌కు ఎంత సీసీ ఉంటుంది? బైక్ గేర్లు ఇలాంటివాటిపై ఆయనకు అవగాహన ఉంది. ► ఒకే రకమైన సినిమాలు తీయడం నాన్నగారి (నిర్మాత, దర్శకుడు ఎమ్ఎస్ రాజు)కి నచ్చదు. సినిమాకు చెందిన అన్ని కోణాలను టచ్ చేయాలనుకుంటారు. ఆయన డైరెక్షన్లో నేను హీరోగా నటించిన ‘7 డేస్ 6 నైట్స్’ షూటింగ్ పూర్తయింది. -
మందు పార్టీలో భూమిక.. ఫోటోలు వైరల్
భూమిక చావ్లా.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. చిరంజీవి, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్ లాంటి బడా హీరోల సరసన నటించి.. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూనే.. గుడ్లుక్స్తో కుర్రకారును ఎట్రాక్ట్ చేసింది ఈ సీనియర్ నటి. స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడే యోగా టీచర్ భరత్ ఠాకూర్‌ను పెళ్లి చేసుకొని, సినిమాలకు దూరమైంది. ఇక ఇటీవల ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అక్క, వదిన వంటి సపోర్టింగ్ పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఎంసీఏ చిత్రంలో హీరో నాని వదినగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు లేనప్పటికీ, సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు ఎప్పుడు టచ్‌లోనే ఉంటుంది. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు, పర్సనల్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఈ సినియర్ హీరోయిన్ మందు గ్లాసుతో దర్శనమిచ్చి అందరికి షాకిచ్చింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశానంటూ మందు తాగుతున్న ఫోటోలను తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. -
బిగ్‌బాస్ రియాల్టీ షో: భూమిక క్లారిటి!
బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ రియాలిటీ షోకున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు భాషల్లో ప్రసారమవుతున్న ఈ షోకు స్టార్ హీరోలు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో అక్కినేని నాగార్జున, కన్నడలో కిచ్చా సుదీప్, తమిళంలో కమల్ హాసన్. హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో మోహన్‌లాల్ హోస్ట్‌గా అలరిస్తున్నారు. ఇదిలా వుంటే నటి భూమిక బిగ్‌బాస్ షోలో పాల్గొనబోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్లో ఆమె ఎంట్రీ ఖాయం అన్నట్లుగా పలు వెబ్సైట్లు కథనాలు ప్రచురించాయి. దీంతో ఈ వార్తలపై స్పందించిన భూమిక వాటిని అసత్య కథనాలుగా కొట్టిపారేసింది. తాను బిగ్‌బాస్‌లో పాల్గొనడం లేదని తేల్చి చెప్పింది. 'నేను బిగ్‌బాస్ షోకు వెళ్తున్నాననేది ఫేక్ న్యూస్.. నాకు బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. ఒకవేళ షో కోసం నన్ను సంప్రదించినా నేను వెళ్లను. గతంలో 1,2,3 సహా మరికొన్ని సీజన్లకు సైతం నన్ను సంప్రదించారు. కానీ నేను అంగీకరించలేదు. భవిష్యత్తులో కూడా బిగ్‌బాస్‌కు వెళ్లే ప్రసక్తే లేదు. 24 గంటలు కెమెరాలు ముందే ఉండటం నాకిష్టం లేదు' అని భూమిక చెప్పుకొచ్చింది. FAKE NEWS -No I have not been offered Big Boss -NO WONT DO IT IF OFFERED . I was offered season 1, 2 ,3 &later some time again &refused to do all .I haven’t been offered this time & I still won’t do it . I’m a public personality -but Am very private to have cameras on me 24/7 . pic.twitter.com/xemG2HJYFu — Bhumika Chawla (@bhumikachawlat) June 6, 2021 చదవండి: బిగ్‌బాస్ ఫేమ్ నోయల్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా? 'మన్మథుడు' హీరోయిన్ ఎక్కడుందో తెలుసా? -
సోషల్ హల్చల్ : అనన్య నవ్వులు, భూమిక జ్ఞాపకాలు
నవ్వులు చిందిస్తున్న ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేసింది ‘వకీల్‌సాబ్’ ఫేమ్ అనన్య స్నేహితులను మిస్ అవుతున్నామంటూ.. గతంలో ఫ్రెండ్స్‌తో కాఫీ తాగిన ఫోటోని అభిమాలనుతో పంచుకుంది నిత్యామీనన్ 10లోపు ఇంటికెళ్లండి చెబుతున్న యాంకర్ శ్యామల నిన్ను నువ్వు ప్రేమించుకుంటేనే ఇతరును ప్రేమించగలుతావని అంటున్నాడు బిగ్‌బాస్ ఫేమ్ అఖిల్ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లింది హీరోయిన్ భూమిక. 2018లో దిగిన తన ఫొటోని అభిమానులతో పంచుకుంది View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Varsha Bollamma (@varshabollamma) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) \ View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
మహేశ్ బాబు భావోద్వేగం.. ఆరోగ్యంగా ఉండాలన్న భూమిక
ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్వో బీఏ రాజు హఠాన్మరణం పట్ల మహేశ్‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో స్పెషల్ బాండింగ్ ఉందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ ఓ ఫోటోని షేర్ చేసింది నటి భూమిక బ్లాక్ డ్రైస్‌లో అదరగొడుతన్న శివాత్మిక ఇంట్లోనే గడుపుతూ ఆరోగ్యంగా ఉండడంటున్న అమిషాపటేల్ View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
విడాకుల రూమర్లకు చెక్ పెట్టిన భూమిక
'యువకుడు' సినిమాతో తెలుగు తెరపై అడుగు పెట్టిన హీరోయిన భూమిక చావ్లా. ఖుషీ, వాసు, ఒక్కడు, సింహాద్రి వంటి సినిమాలతో ఆమె స్టార్ హీరోయిన్గా ఎదిగారు. తన పాత్రలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. కానీ ఆ పాపులారిటీని ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయారు. వరస సినిమాలు చేశారన్న మాటే కానీ కెరీర్లో డల్ అయిపోయారు. 2007లో తన యోగా టీచర్ భరత్ ఠాకూర్‌ను పెళ్లి చేసుకున్నారు. 2014లో వీరికి ఒక బాబు పుట్టారు. అయితే సోషల్ మీడియాలో భర్తతో కలిసి దిగిన ఫొటోలు పెట్టనందుకు, బయట పబ్లిక్‌లో ఒంటరిగా కనిపించినంత మాత్రానికే ఆమె విడాకులు తీసుకుందంటూ పుకార్లు మొదలయ్యాయి. (చదవండి: బాలయ్య సినిమాలో లేడీ విలన్?) తాజాగా ఈ వార్తలకు భూమిక చెక్ పట్టారు. పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. "వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది.. ఆ ఒక్క అడుగు ప్రేమే.., ఒకరి గురించి ఒకరం మరింత లోతుగా అర్థం చేసుకోవడమే. మన గురించి మనం ఇంకా తెలుసుకోవడమే. మనల్ని, మన జంట ప్రయాణాన్ని ఆ దేవుడు ఆశీర్వదించాలి. నిన్ను, నీ అంకితభావాన్ని, కష్టపడే మనస్తత్వాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది" అని రాసుకొచ్చారు. ఈ పోస్టుతోనైనా ఆమె విడాకులు తీసుకుంటుందనే రూమర్లకు స్వస్తి పలకాలని ఆశిద్దాం.. (చదవండి: అంత్యక్రియలకు కూడా అడ్డుపడుతోంది - భూమిక) View this post on Instagram A journey of a thousand miles begins with a single step .... LOVE ....... and it’s love , learning , understanding , a journey of laughter and moments .... discovering more about each other And ourselves ... Thank you for Everything 🌺 ...... may God bless us and our journey together .. Proud of you and your hard work and your dedication to whatever you do in life 😊 .. 🌸💕💐 Happy Anniversary 💐🌻 A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) on Oct 20, 2020 at 6:30pm PDT -
అది తన హృదయ లోతుల్లోనే అంతమైంది: నటి
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వెళ్లిపోయి వారం గడిచింది అంటూ నటి భూమిక చావ్లా సోషల్ మీడియాలో భావోద్వేగ లేఖను పంచుకున్నారు. ఎంఎస్ ధోని సినిమాలో సుశాంత్‌కు భూమిక అక్కగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలోని ఓ సన్నివేశం ఫొటోను మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘డియర్ సుశాంత్. మీరు ఎక్కడున్నా దేవుడి ఆశీర్వాదం మీకు ఉంటుంది. మీరు ఈ లోకాన్ని విడిచి వారం గడచింది. మీతో పాటే రహస్యాన్ని కూడా తీసుకేళ్లారు. అది మీ హృదయ లోతుల్లోనే అంతమైంది’ అంటూ రాసుకొచ్చారు. (ఆ క్షణం సుశాంత్‌లో నన్ను చూసుకున్నా: క్రికెటర్) View this post on Instagram Dear Sushant - wherever you are - you are in the hands of God .... it’s Been a week since you have gone ... What took you away —- THE SECRET HAS GONE WITH YOU — buried deep in your heart and mind .... I wish to tell all the people who are affected by this to pray and devote your time to things like —-Taking care of yourself , of the people around you ... There are speculations of why it happened .... THERE IS MUD SLINGING - there is wrath - there is —“ who is to be blamed “ —— there is “ industry did it “ —- “ relationship did this” ... so on and so forth .... Dear PEOPLE RESPECT A SOUL GONE ... PRAY AND LOOK AHEAD ..... SPEND THAt TIME In caring for each other / CARING FOR THE NEEDS OF kids who need education : teach them in which ever way you can / PRAY for yourselves and others around you / EXERCISE —- stay positive ... LETS NOT BLAMe PEOPLE —— LETS RESPECT Each other ... LET THE industry find a solution within itself and not do public discussions on public domains —- Prayers for him A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) on Jun 22, 2020 at 1:46am PDT ‘ఇది ఎలా, ఎందుకు జరిగిందనే దానిపై ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి. అదే నిజమని కోపంతో ఇతరులపై బురద జల్లడం, నిందించడం సరైనది కాదు. ‘ఇది పరిశ్రమ చేసిందా’’... లేదా ‘బంధాలు చేశాయ’’... ఎవరూ, ఎవరిని నిందించాలన్నది స్పష్టత లేదు. కాబట్టి ప్రియమైన ప్రజలారా ఇప్పుడు మనం చేసేది ఒకటే. ఇతరులను నిందించకుండా, బహిరంగ చర్చలు జరపకండి. సుశాంత్ ఆత్మ ప్రశాంతంగా ఉండాలని తన కోసం ప్రార్థించండి’ అని ఆమె పేర్కొన్నారు. కాగా సుశాంత్ గత ఆదివారం(జూన్ 14) ముంబైలో బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మానసిక ఒత్తిడి కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. దీంతో బాలీవుడ్ లో బంధుప్రీతి, స్టార్ కిడ్స్ ప్రభావం అధికంగా ఉందంటూ ప్రముఖులపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ కిడ్స్ను, దర్శక నిర్మాతలను సోషల్ మీడియాలో అన్‌ఫాలో కావాలంటూ అభిమానులు, నెటిజన్లు పిలుపునిస్తున్నారు. (సుశాంత్ నా బిడ్డగా పుట్టబోతున్నాడు: నటి) -
బోయపాటి చిత్రం: విలన్‌గా బాలయ్య?
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి చిత్రానికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లీకువీరులు ఈ సినిమా కథ, పాత్రల గురించి ఎప్పటికప్పుడు లీకులు అందిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో డ్యుయల్ రోల్ పోషిస్తున్న బాలయ్య ఓ పాత్రలో భాగంగా విలన్ పాత్రలో కనిపిస్తాడని టాలీవుడ్ హాట్ టాపిక్. ఈ సినిమాలో విలన్ పాత్రను బలంగా రూపొందిస్తున్నారట బోయపాటి. అయితే బాలయ్య వంటి హీరోను ఢీ కొట్టడానికి అవతల కూడా బాలయ్యనే ఉండాలని దర్శకుడు భావిస్తున్నాడట. దర్శకుడి ఆలోచనకు ఈ నందమూరి హీరో కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తల వచ్చాయి. అయితే తాజాగా చిత్ర యూనిట్ నుంచి వచ్చిన అనధికారిక సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలయ్య విలన్‌గా కనిపంచట్లేదట. సినిమా మొదలైన కొన్ని నిమిషాల పాటు నెగటీవ్ షేడ్స్‌లో కనిపిస్తారని కానీ విలన్ కాదని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో భూమిక చావ్లా పవర్ఫుల్ లేడీ విలన్ పాత్ర పోషిస్తున్నారని మరో వార్త ప్రచారంలో ఉంది. అయితే ఈ చిత్రంలో విలన్ పాత్ర గురించి స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు ఆడిపాడనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం అంజలి, శ్రియాలను చిత్ర బృందం ఎంపిక చేసిందని టాక్ ఆఫ్ ద టౌన్. ఇప్పటికే చిత్ర షూటింగ్ వారణాసిలో ప్రారంభమైంది. అయితే లాక్డౌన్ కారణంగా షూటింగ్ వాయిదాపడింది. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: బాలయ్య సినిమాలో లేడీ విలన్? అందుకే ఆర్ఆర్ఆర్ వచ్చేలా టైటిల్ పెట్టాం -
బాలయ్య సినిమాలో లేడీ విలన్?
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటేనే మాస్ అభిమానులకు పండగే. దాదాపుగా బోయపాటి అన్ని సినిమాల్లో హీరోయిజంతో పాటు విలనిజం కూడా ఓ రేంజ్లో ఉంటుంది. ఆయన గత సినిమాలను చూస్తే ఇది స్పష్టమవుతుంది. అయితే బాలయ్యతో తీస్తున్న సినిమాలో ఓ పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం భూమికను బోయపాటి ఎంపిక చేసినట్లు టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రతినాయకురాలి పాత్ర కోసం చిత్రబృందం ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపనట్టు సమాచారం. అయితే భూమిక కంటే ముందు సీనియర్ హీరోయిన్లను బోయపాటి సంప్రదించగా వారు సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. దీంతో భూమిక వైపు బోయపాటి మొగ్గు చూపినట్లు అందరూ భావిస్తున్నారు. భూమిక నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే బాలయ్య ‘రూలర్’ చిత్రంలో భూమిక కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పటివరకు క్లాస్, క్యూట్ లుక్స్‌లో కనిపించిన భూమిక లేడీ విలన్‌గా అందులోనూ ఊరమాస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటి చిత్రంలో ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి. ఇక ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినం చేస్తునట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వారణాసి తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోవాల్సి ఉండగా.. లాక్డౌన్ కారణంగా షూటింగ్ వాయిదాపడింది. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో వస్తోన్న ఈ మూడో చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. చదవండి: అంతా బాగుంటాం రా నన్ను రక్షించండి – ఆండ్రూ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_811248975.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వెబ్ ఇంట్లోకి...
అభివృద్ధి చెందిన టెక్నాలజీ వల్ల డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్స్ వైపు కూడా ఆడియన్స్ దృష్టి సారిస్తున్నారు. కంటెంట్ ఉన్న వెబ్‌సిరీస్‌లను బాగా ఆదరిస్తున్నారు. అందుకే యాక్టర్స్ కూడా అటువైపు ఓ కన్నేశారు. ఆసక్తికరమైన పాత్రలకు అవకాశం వచ్చినప్పుడు వెబ్ ఇంట్లో వాలిపోతున్నారు. తాజాగా ఈ జాబితాలో తన పేరును కూడా రాయించుకున్నారు నటి భూమిక చావ్లా. ‘భ్రమ్’ అనే ఓ వెబ్ సిరీస్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్ ప్రధాన పాత్రధారి. ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఎక్కువ శాతం షూటింగ్‌ను సిమ్లాలో ప్లాన్ చేశారు. సంజయ్ సూరి, ఓంకార్ కపూర్, ఐజాజ్ ఖాన్ ఈ సిరీస్‌లో కీలక పాత్రధారులు. -
రిలీజ్ కాకముందే రీమేక్ చేద్దామన్నారు!
సమంత ముఖ్య పాత్రలో పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యు టర్న్’. కన్నడ ‘యు టర్న్’కి ఇది రీమేక్. భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు చేశారు. శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించిన ఈ చిత్రం గురువారం రిలీజైంది. ఈ సందర్భంగా పవన్ కుమార్ పలు విశేషాలు పంచుకున్నారు. ► బెంగళూర్‌లో జరిగిన ఓ చిన్న సంఘటన ఆధారంగా ఈ కథను తయారు చేశా. మనందరం రోడ్ మీద యు టర్న్‌ని పట్టించుకోం. రాంగ్ రూట్లో వెళ్లిపోతుంటాం. అది పెద్ద తప్పుల్లా భావించం. అలా చేయడం వల్ల పరిణామాలు భయంకరంగా ఉంటే? అనే ఐడియానే ఈ కథ. ► ఈ సినిమాను నేను రీమేక్ అనను. ఎందుకంటే చివరి 30 నిమిషాలు చాలా మటుకు మార్చాం. కన్నడంలో తీసినప్పుడు చాలా చిన్న ప్రాజెక్ట్. బడ్జెట్, ఇంకా చాలా విషయాల్లో అప్పుడు అనుకున్నది అనుకున్నట్టు తీయడానికి వీలుపడలేదు. ఈసారి బాగా తీశాను. ► కన్నడ ‘యు టర్న్’ ట్రైలర్ రిలీజైన సాయంత్రమే సమంత నాకు మెసేజ్ చేసింది. తర్వాత స్క్రిప్ట్ పంపించమంది. నాకు భయమేసింది. సినిమా రిలీజ్ అవ్వకుండా స్క్రిప్ట్ ఎలా పంపుతాం? అని. పంపాను. సమంత, చైతన్య వచ్చి నా ఆఫీస్‌లోనే రిలీజ్ కాకముందే సినిమా చూశారు. బాగా నచ్చింది. రీమేక్ చేస్తాం అన్నారు. ► ఏదైనా భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేస్తుంటాం. కానీ రిలీజ్ కాకముందే సమంత రీమేక్ చేయాలనుకోవడం గ్రేట్. తనకున్న కమిట్మెంట్స్ వల్ల సినిమా స్టార్ట్ చేయడం ఆలస్యం అయింది. సమంత, నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. సో.. సెట్లో డైరెక్టర్–యాక్టర్ ఈక్వేషన్ కంటే కూడా ఫ్రెండ్స్‌గా ఉండేవాళ్లం. ► నా ఫస్ట్ సినిమా ‘లూసియా’ను హిందీలో రీమేక్ చేద్దాం అనుకున్నాను. కానీ కుదర్లేదు. నెక్ట్ ఏ ప్రాజెక్ట్ అని ఇంకా నిర్ణయించుకోలేదు. -
ప్రస్తుతానికి మంచోడిలా ఉందామనుకుంటున్నాను
‘‘ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ మూవీస్ బాగా వస్తున్నాయి. మెల్లిగా గేమ్ చేంజ్ అవుతోంది. ఆడియన్స్ అభిరుచులు మారుతున్నాయి. అందుకే ఏ పాత్ర చేసినా ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తాను. మంచి సినిమాలో భాగం అవ్వాలని అనుకుంటా. నా కెరీర్లో బెస్ట్ మూవీస్‌లో ‘యు టర్న్’ తప్పకుండా ఉంటుంది’’ అని ఆది పినిశెట్టి అన్నారు. సమంత మెయిన్ లీడ్‌గా ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘యు టర్న్’. కన్నడ ‘యు టర్న్’ చిత్రానికి ఇది రీమేక్. పవన్ కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించారు. ఈ సినిమా గురువారం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఆది పలు విశేషాలు పంచుకున్నారు. ► సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చిన్న పాయింట్ అయినా ఆసక్తి కలిగించేలా దర్శకుడు పవన్ చెప్పారు. సామాజిక స్పృహ ఉన్న కథను బోధించినట్టు కాకుండా కమర్షియల్‌గా చెప్పారు. ► కర్మ సిద్ధాంతం. మనం ఏదైనా తప్పు చేస్తే అది మళ్లీ మనకే వస్తుంది అన్నదే ఈ సినిమా కథ. ► ‘వైశాలి’ తర్వాత మళ్లీ పోలీస్ పాత్ర చేశాను. పోలీస్ అనగానే స్లో మోషన్ షాట్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఉండాలనుకోను. ఈ సినిమాలో ఏ ఇంట్రడక్షన్ ఉండదు. సాధారణ పాత్రలానే ఎంటర్ అవుతాను. ఇదే నా కెరీర్లో బెస్ట్ ఇంట్రడక్షన్. పవన్ నెక్ట్స్ జనరేషన్ డైరెక్టర్. తనకి చాలా ఫ్యూచర్ ఉంది. ‘రంగస్థలం’ తర్వాత సమంతతో మరో సక్సెస్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ► సినిమాను అనలైజ్ చేసే వాళ్లు కేవలం 15 శాతం మంది ఉంటారు. మిగతా వాళ్లకు బావుందా బాలేదా అన్నదే ముఖ్యం. ‘నీవెవరో’ సినిమా కూడా కామన్ ఆడియన్స్‌కు నచ్చొచ్చు అన్నాను. కానీ క్రిటిక్స్ మీద కామెంట్ చేయలేదు. క్రిటిసిజిమ్ నుంచే నేర్చుకొంటాను. ఎప్పటికప్పుడు యాక్టర్‌గా ఇంప్రూవ్ అవ్వడానికి మీరిచ్చే (క్రిటిక్స్) ఫీడ్‌బ్యాకే ముఖ్యం. పబ్లిక్ ఫీడ్‌బ్యాక్ కూడా చూస్తుంటాను. ► సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్‌గా ఉండను. కొంతమంది సంబంధం లేకుండా నెగటివిటీ షేర్ చేస్తుంటారు. అలాంటి వాళ్లను పాపం అనుకొని పక్కన పెట్టేయడమే. ► ప్రస్తుతానికి మంచోడిలా ఉందాం అనుకుంటున్నాను. మంచి స్క్రిప్ట్ వస్తే అప్పుడు చెడ్డగా (విలన్) మారతాను. నెక్ట్స్ నాలుగు ప్రాజెక్ట్‌లు అనుకుంటున్నాను.