మందు పార్టీలో భూమిక.. ఫోటోలు వైరల్‌ | Bhumika Chawla Enjoying Party With Her Friends, Pics Goes Viral | Sakshi
Sakshi News home page

మందు పార్టీలో భూమిక.. ఫోటోలు వైరల్‌

Published Wed, Aug 11 2021 3:38 PM | Last Updated on Thu, Aug 12 2021 6:59 PM

Bhumika Chawla Enjoying Party With Her Friends, Pics Goes Viral - Sakshi

భూమిక చావ్లా.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. చిరంజీవి, మహేశ్‌బాబు, పవన్‌ కల్యాణ్‌ లాంటి బడా హీరోల సరసన నటించి.. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూనే.. గుడ్‌లుక్స్‌తో కుర్రకారును ఎట్రాక్ట్‌ చేసింది ఈ సీనియర్‌ నటి. స్టార్‌ హీరోయిన్‌గా ఉన్నప్పుడే యోగా టీచర్‌ భ‌ర‌త్ ఠాకూర్‌ను పెళ్లి చేసుకొని, సినిమాలకు దూరమైంది. ఇక ఇటీవల ఈ బ్యూటీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. 



అక్క, వదిన వంటి సపోర్టింగ్ పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ​ఎంసీఏ చిత్రంలో హీరో నాని వదినగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు లేనప్పటికీ, సోషల్‌ మీడియా ద్వారా ప్రేక్షకులకు ఎప్పుడు టచ్‌లోనే ఉంటుంది. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు, పర్సనల్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఈ సినియర్‌ హీరోయిన్‌ మందు గ్లాసుతో దర్శనమిచ్చి అందరికి షాకిచ్చింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేశానంటూ మందు తాగుతున్న ఫోటోలను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement