drink party
-
పార్టీ చేసుకున్న ప్రధాని... స్టెప్పులతో హల్చల్: వీడియో వైరల్
ఫిన్లాండ్ ప్రధాని వీడియో పెద్ద వివాదస్పదంగా మారింది. ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ కొందరూ నాయకులు, సినీ ప్రముఖులతో కలిసి పార్టీ చేసుకుంది. ఈ వీడియో లీక్ అవ్వడంతో... నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఆ పార్టీలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యురాలు ఇల్మారి నూర్మినెన్, ప్రముఖ గాయకులు, ప్రముఖ యూట్యూబర్, టీవీ యాంకర్లు తదితరులు ఉన్నారు. ఆ వీడియోలో ఫిన్లాండ్ ప్రధాని డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టింది. ఐతే ఈ పార్టీ ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కానీ నెటిజన్ల ఈ వీడియోను చూసి విభిన్నంగా స్పందించారు. కొందరూ ప్రధానమంత్రికి కూడా పార్టీలు సర్వసాధారణమైనని అంటూ మారిన్‌కి మద్దతు ఇవ్వగా .... మరికొందరూ ప్రధాని హోదాలో ఇవేమి పనులు అంటూ మండిపడుతున్నారు.. Finland’s Prime Minister @MarinSanna is in the headlines after a video of her partying was leaked today. She has previously been criticized for attending too many music festivals & spending too much on partying instead of ruling. The critics say it’s not fitting for a PM. pic.twitter.com/FbOhdTeEGw — Visegrád 24 (@visegrad24) August 17, 2022 (చదవండి: విదేశాంగ మంత్రి కొడుకుతో యూఎస్ రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడూ ఏం జరిగిందంటే....) -
మందు పార్టీలో భూమిక.. ఫోటోలు వైరల్
భూమిక చావ్లా.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. చిరంజీవి, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్ లాంటి బడా హీరోల సరసన నటించి.. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూనే.. గుడ్లుక్స్తో కుర్రకారును ఎట్రాక్ట్ చేసింది ఈ సీనియర్ నటి. స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడే యోగా టీచర్ భరత్ ఠాకూర్‌ను పెళ్లి చేసుకొని, సినిమాలకు దూరమైంది. ఇక ఇటీవల ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అక్క, వదిన వంటి సపోర్టింగ్ పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఎంసీఏ చిత్రంలో హీరో నాని వదినగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు లేనప్పటికీ, సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు ఎప్పుడు టచ్‌లోనే ఉంటుంది. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు, పర్సనల్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఈ సినియర్ హీరోయిన్ మందు గ్లాసుతో దర్శనమిచ్చి అందరికి షాకిచ్చింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశానంటూ మందు తాగుతున్న ఫోటోలను తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. -
రైలు పట్టాలపైనే మందుపార్టీ
- మద్యం మత్తులో యువకుల దుస్సాహసం - దూసుకెళ్లిన రైలు - ఇద్దరు దుర్మరణం నంద్యాల: ఆటోలు తోలుతూ జీవనం సాగిస్తున్న ఓ ఇద్దరు యువకులు ఏకంగా రైలు పట్టాలపైనే మందుపార్టీ పెట్టుకుని మత్తులో రైలు కింద పడి చనిపోయారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నంద్యాలలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. ఎన్జీఓ కాలనీకి చెందిన దూదేకుల హుసేన్(22), ఎస్బీఐ కాలనీకి చెందిన షేక్‌రహీం(21) స్నేహితులు. వీరికి ఇంకా పెళ్లి కాలేదు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరితో పాటు స్నేహితులు అక్రమ్, భూపాల్ కలిసి పొన్నాపురం కాలనీ వద్ద ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలో తప్పతాగారు. తర్వాత హుసేన్, షేక్‌రహీం తూలుతూ రైల్వే ట్రాక్‌పై వెళ్లి మద్యం సేవించడం ప్రారంభించారు. అక్రమ్, భూపాల్ వారిని ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంతలో రైలు దూసుకెళ్లిపోవడంతో హుసేన్, రహీం ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రైల్వే అధికారులు ఆదివారం తెల్లవారుజామున మృతదేహాలను గుర్తించి పోస్టుమార్టంకు తరలించారు. -
ప్రభుత్వ అతిథి గృహంలో అధికారుల మందు పార్టీ