అది తన‌ హృదయ లోతుల్లోనే అంతమైంది: నటి | Bhumika Chawla Shares Emotional Note On Sushant Singh Suicide | Sakshi
Sakshi News home page

‘సుశాంత్‌ ఈ లోకాన్ని విడిచి వారం గడిచింది’

Published Tue, Jun 23 2020 4:00 PM | Last Updated on Tue, Jun 23 2020 5:06 PM

Bhumika Chawla Shares Emotional Note On Sushant Singh Suicide - Sakshi

ముంబై: బాలీవుడ్‌ యంగ్‌ హీరో‌ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ వెళ్లిపోయి వారం గడిచింది అంటూ నటి‌ భూమిక చావ్లా సోషల్‌ మీడియాలో భావోద్వేగ లేఖను పంచుకున్నారు. ఎంఎస్‌ ధోని సినిమాలో సుశాంత్‌కు భూమిక అక్కగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలోని ఓ సన్నివేశం ఫొటోను మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘డియర్‌ సుశాంత్‌. మీరు ఎక్కడున్నా దేవుడి ఆశీర్వాదం మీకు ఉంటుంది. మీరు ఈ లోకాన్ని విడిచి వారం గడచింది. మీతో పాటే రహస్యాన్ని కూడా తీసుకేళ్లారు. అది మీ హృదయ లోతుల్లోనే అంతమైంది’ అంటూ రాసుకొచ్చారు. (ఆ క్షణం సుశాంత్‌లో నన్ను చూసుకున్నా: క్రికెటర్‌)

Dear Sushant - wherever you are - you are in the hands of God .... it’s Been a week since you have gone ... What took you away —- THE SECRET HAS GONE WITH YOU — buried deep in your heart and mind .... I wish to tell all the people who are affected by this to pray and devote your time to things like —-Taking care of yourself , of the people around you ... There are speculations of why it happened .... THERE IS MUD SLINGING - there is wrath - there is —“ who is to be blamed “ —— there is “ industry did it “ —- “ relationship did this” ... so on and so forth .... Dear PEOPLE RESPECT A SOUL GONE ... PRAY AND LOOK AHEAD ..... SPEND THAt TIME In caring for each other / CARING FOR THE NEEDS OF kids who need education : teach them in which ever way you can / PRAY for yourselves and others around you / EXERCISE —- stay positive ... LETS NOT BLAMe PEOPLE —— LETS RESPECT Each other ... LET THE industry find a solution within itself and not do public discussions on public domains —- Prayers for him

A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) on

‘ఇది ఎలా, ఎందుకు జరిగిందనే దానిపై ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి. అదే నిజమని కోపంతో ఇతరులపై బురద జల్లడం, నిందించడం సరైనది కాదు. ‘ఇది పరిశ్రమ చేసిందా’’... లేదా ‘బంధాలు చేశాయ’’... ఎవరూ, ఎవరిని నిందించాలన్నది స్పష్టత లేదు. కాబట్టి ప్రియమైన ప్రజలారా ఇప్పుడు మనం చేసేది ఒకటే. ఇతరులను నిందించకుండా, బహిరంగ చర్చలు జరపకండి. సుశాంత్‌ ఆత్మ ప్రశాంతంగా ఉండాలని తన కోసం ప్రార్థించండి’ అని ఆమె పేర్కొన్నారు. కాగా సుశాంత్‌ గత ఆదివారం(జూన్‌ 14) ముంబైలో బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మానసిక ఒత్తిడి కారణంగా సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. దీంతో బాలీవుడ్ లో బంధుప్రీతి, స్టార్‌ కిడ్స్‌ ప్రభావం అధికంగా ఉందంటూ ప్రముఖులపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్‌ కిడ్స్‌ను, దర్శక నిర్మాతలను సోషల్‌ మీడియాలో అన్‌ఫాలో కావాలంటూ అభిమానులు, నెటిజన్లు పిలుపునిస్తున్నారు. (సుశాంత్‌ నా బిడ్డగా పుట్టబోతున్నాడు: నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement