
సందీప్ రెడ్డి పేరు చెప్పగానే 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలే గుర్తొస్తాయి. రా అండ్ రస్టిక్ స్టోరీలతో తీసిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం 'స్పిరిట్' పనుల్లో బిజీగా ఉన్న సందీప్.. సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు ధోనీతో కలిసి ఓ యాడ్ లో కనిపించాడు.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్' పాటల్ని పక్కనపడేసిన తమన్)
ఎలక్ట్రిక్ సైకిల్ కోసం ఓ ప్రముఖ కంపెనీ యాడ్ తాజాగా రిలీజ్ చేసింది. 'యానిమల్' సినిమాలో ధోనీ నటిస్తే ఎలా ఉంటుందో.. అచ్చుగుద్దినట్లు ఈ యాడ్ ని అలానే రూపొందించారు. బ్లూ కోట్ లో బ్లాక్ కలర్ కార్ నుంచి దిగే సీన్, సినిమా ప్రారంభంలో హీరోయిన్ ఇంటికి హీరో వెళ్లే సీన్, క్లైమాక్స్ లో హీరో చేతితో సైగ చేసి చూపించే సీన్.. ఇలా ఫుల్ సీరియస్ గా ఉంటే మూడు సీన్స్ తీసుకుని వాటితో యాడ్ చేశారు.
'యానిమల్' సీరియస్ మూవీ కాగా.. ఈ యాడ్ ఏమో ఫుల్ నవ్వు తెప్పిస్తోంది. ఇందులో ధోనీతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కనిపించడం విశేషం. ఏదేమైనా మూవీ స్ఫూప్ లా తీసిన ఈ యాడ్.. ఇప్పుడు వైరల్ అయిపోయవడం గ్యారంటీ.
(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?)
Comments
Please login to add a commentAdd a comment