నాలుగేళ్ల షెడ్యూల్‌.. ప్రభాస్‌ 'స్పిరిట్‌' రిలీజ్‌పై సందీప్‌ ప్రకటన | Sandeep Reddy Vanga Comments On Prabhas Spirit Movie | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల షెడ్యూల్‌.. ప్రభాస్‌ 'స్పిరిట్‌' రిలీజ్‌పై సందీప్‌ ప్రకటన

Published Tue, Aug 27 2024 7:33 AM | Last Updated on Tue, Aug 27 2024 9:05 AM

Sandeep Reddy Vanga Comments On Prabhas Spirit Movie

అర్జున్‌ రెడ్డి నుంచి యానిమల్‌ సినిమా వరకు బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా. రీసెంట్‌గా యానిమల్‌ సినిమాతో తన సత్తా ఏంటో బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఈ సినిమాతో ఆయన పేరు భారీగా ట్రెండ్‌ అయింది. ఈ సినిమా తర్వాత ఆయన ప్రభాస్‌తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. ప్రభాస్‌తో హీరోగా తాను తెరకెక్కించనున్న 'స్పిరిట్‌'కు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించినట్లు ఓ ఇంటర్వ్యూలో సందీప్‌ రెడ్డి వంగా తెలిపారు.

'ప్రస్తుతం తన చేతిలో రెండు కీలక ప్రాజెక్ట్‌లు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ సినిమాలకు సంబంధించిన ప్రణాళికలు పూర్తి అయినట్లు తెలిపారు. వచ్చే నాలుగేళ్లు తన పూర్తి షెడ్యూల్‌ ఈ రెండు ప్రాజెక్ట్‌లకే సరిపోతుందని అన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాదిలోనే స్పిరిట్‌ సెట్స్‌పైకి తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. అయితే, సినిమా విడుదలకు మాత్రం రెండేళ్లు పట్టవచ్చని తెలిపాడు. అంటే స్పిరిట్‌ 2026లో విడుదల కానుందని రివీల్‌ చేశాడు. స్పిరిట్‌ సినిమా తర్వాతనే  'యానిమల్‌ పార్క్‌'పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన చేతిలో ఈ రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయని సందీప్‌ రెడ్డి చెప్పాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఖాకీ డ్రెస్‌లో తొలిసారి ప్రభాస్‌
'స్పిరిట్‌' పాన్‌ ఇండియా రేంజ్‌లో టీ సిరీస్‌ బ్యానర్‌పై తెరకెక్కనుంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్‌ మొదలుపెట్టే అవకాశముందని ఇప్పటికే నిర్మాత భూషణ్‌ కుమార్‌ తెలిపారు.  ప్రభాస్‌ కెరీర్‌లో తొలిసారి ఈ సినిమాలో ఖాకీ డ్రెస్‌ వేసుకోబోతుండటంతో ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని భారతీయ భాషలతోపాటు చైనీస్, కొరియన్ భాషలో విడుదల చేయనున్నారు.  ఈ చిత్రంలో  సౌత్ కొరియన్ పాపులర్ యాక్టర్ మడాంగ్‌సియోక్‌  విలన్‌గా కనిపించబోతున్నాడని ప్రచారం ఉంది. 'యానిమల్‌ పార్క్‌' విషయానికి వస్తే.. గతేడాది విడుదలైన 'యానిమల్‌'కు సీక్వెల్‌గా రానున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement