Tollywood
-
ఆదిత్య 369.. విజయశాంతి చేస్తానంది.. కానీ..: నిర్మాత
ఆదిత్య 369 (Aditya 369 Movie).. 1991లో వచ్చిన టైం ట్రావెల్ సినిమా. ది టైం మెషీన్ అనే నవల నుంచి స్ఫూర్తి పొంది తీసిన మూవీ ఇది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, మోహిని కథానాయికగా నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 4న రీరిలీజ్ అవుతోంది.విజయశాంతిని అనుకున్నాం..ఈ సందర్భంగా శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ఆదిత్య 369 సినిమా మొదటగా విజయశాంతిని అనుకున్నాం. తను కూడా సరేనంది. కానీ అప్పటికే ఆమె సినిమాలతో బిజీగా ఉంది. మీరు వేరే హీరోయిన్ను తీసుకోండి, నాకు విజయశాంతి కావాలని అడిగాను. అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. సరేలే అనుకుని రాధను సెలక్ట్ చేయాలనుకున్నాం. కానీ, ఆమె కాస్త బొద్దుగా మారటంతో మళ్లీ వేరే కథానాయికను వెతికే పనిలో పడ్డాం.నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్పెళ్లయ్యాక సినిమాలకు గుడ్బైసినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్.. తమిళంలో 'ఈరమాన రోజావే' సినిమా చేస్తున్న అమ్మాయి బాగుందని సూచించాడు. అలా ఆమెను పిలిచి స్క్రీన్ టెస్ట్ చేస్తే అందరికీ నచ్చింది. అలా మోహిని ఈ సినిమా చేసింది. తర్వాత రెండు మూడు సినిమాలు చేసిందనుకుంటాను. అనంతరం పెళ్లి చేసుకుని సినిమాలకు ముగింపు పలికింది అని తెలిపాడు. ఇకపోతే ఆదిత్య 369 వచ్చిన 34 సంవత్సరాల తర్వాత దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. కథ రెడీ అయిందని, త్వరలోనే పార్ట్ 2 ఉంటుందని బాలకృష్ణ స్వయంగా వెల్లడించాడు.చదవండి: నేనూ విన్నా.. కానీ, అది నిజం కాదు: రష్మిక మందన్నా -
నేనూ విన్నా.. కానీ, అది నిజం కాదు: రష్మిక మందన్నా
హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) చలనచిత్ర పరిశ్రమలో బిజీ హీరోయిన్గా మారిపోయింది. యానిమల్, పుష్ప 2: ద రూల్, ఛావా.. ఇలా వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకుని బాక్సాఫీస్ క్వీన్‌గానూ మారింది. అయితే రంజాన్ పండక్కి రిలీజైన హిందీ సినిమా సికందర్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.నా విషయంలో నిజం కాదుఅయితేనేం.. ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. మరో మూడు రోజుల్లో రష్మిక మందన్నా బర్త్‌డే (ఏప్రిల్ 4). ఈ సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది. 'ఇది నా బర్త్‌డే మంత్.. చాలా ఎగ్జయిట్‌గా ఉన్నాను. వయసు పెరిగే కొద్దీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలన్న ఆసక్తి సన్నగిల్లుతుందని విన్నాను.నమ్మబుద్ధి కావట్లేకానీ నా విషయంలో మాత్రం అది నిజం కాదు. ఏ యేటికాయేడు నా బర్త్‌డే జరుపుకునేందుకు మరింత సంతోషంగా, ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అప్పుడే నాకు 29 ఏళ్లు వచ్చేస్తున్నాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. గడిచిన ఏడాదిలో సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. అందుకోసమైనా ఈ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవాల్సిందే!' అని రాసుకొచ్చింది.చదవండి: హెచ్‌సీయూ వివాదం.. నేనెలాగో చనిపోతాను.. దయచేసి.. : రేణూ దేశాయ్ విన్నపం -
'శారీ' మూవీ ప్రీరిజ్లో మెరిసిన నటి ఆరాధ్య దేవి (ఫొటోలు)
-
పుష్ప-2ను మించి అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా
-
జయం మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా రష్మీనే తీసుకున్నాం : నితిన్
-
హెచ్‌సీయూ వివాదం.. రేణూ దేశాయ్ విన్నపం.. ప్రభుత్వానికి ఉపాసన సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల అడవిని మాయం చేసి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం.. ఆ భూములు మావంటూ వాటిని కాపాడుకోవడానికి పోరుబాట పట్టారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు (#HCU Protest). వందలాది జేసీబీలు అర్ధరాత్రి అడవిని ధ్వంసం చేయడానికి వెళ్తే నెమళ్ల ఆర్తనాదాలు, భయంతో పరుగులు తీస్తున్న దుప్పిల వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తున్నాయి. అడవిని కాపాడుకుందాంఅవి చూసిన సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలుష్యంతో నిండిపోతున్న నగరానికి ఆక్సిజన్ అందిస్తున్న భూముల్ని అమ్మడం అన్యాయమని మండిపడుతున్నారు. అడవి నరికివేత ఆపేయాలని, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని నినదిస్తున్నారు. హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన (Upasana Konidela) ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు ఇదే గనక చేయాలనుకుంటే అక్కడున్న మూగజీవాలు, పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు? నరికివేసిన చెట్లను తిరిగి ఎక్కడ పెంచుతారు? వీటన్నింటికీ సమాధానం చెప్పండి అని కోరింది.దయచేసి వేడుకుంటున్నా..పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ (Renu Desai) స్పందిస్తూ.. రెండు రోజుల క్రితమే నాకు విషయం తెలిసింది. అన్ని విషయాలు కనుక్కున్నాకే వీడియో చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డిగారూ.. ఒక తల్లిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా.. నాకు 44 ఏళ్లు. రేపోమాపో ఎలాగైనా పోతాను. కానీ పిల్లలు.. మన రేపటితరానికి ఆక్సిజన్, నీళ్లు అవసరం. వదిలేయండి..అభివృద్ధి అవసరం.. కాదనను. ఐటీ పార్కులు, బహుళ అంతస్తుల భవనాలు.. అన్నీ అవసరమే! కానీ ఈ 400 ఎకరాలను మాత్రం వదిలేయండి. నిర్మానుష్యంగా ఉన్న భూముల్ని వెతకండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏదో ఒకటి చేయండి. మీరు చాలా సీనియర్. ఒక తల్లిగా అడుక్కుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి అని వీడియో రిలీజ్ చేసింది. మూగజీవాల్ని అడవి నుంచి తరిమేయకండి అంటూ యాంకర్ రష్మీ గౌతమ్ సైతం వీడియో షేర్ చేసింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam)చదవండి: లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు -
హైదరాబాద్‌లో నాకు నచ్చేవి ఇవే: జూనియర్ ఎన్టీఆర్
అంతర్జాతీయ స్థాయి సక్సెస్‌లు అందుకుంటున్న టాలీవుడ్ (Tollywood)కు కేంద్ర బిందువు హైదరాబాద్. అలాంటి పరిశ్రమలో గ్లోబల్స్టార్స్గా పేరున్న అనేకమంది నటీనటులకు మన నగరం నిలయం. అయితే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న టాలీవుడ్ స్టార్స్ కూడా నగరంలోని కొన్ని రుచులకు దాసులే. వారు తమ అభి‘రుచుల్ని’ సంతృప్తి పరుచుకోడానికి నగరంలోని కొన్ని రెస్టారెంట్స్‌కి తరచూ రౌండ్స్ వేస్తుంటారు. అభిమానులకు చిక్కకుండా రహస్యంగా తమ టేస్ట్ బడ్స్‌ను శాంతింపజేస్తుంటారు. అదే విధంగా మన టాలీవుడ్ టాప్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌కి సైతం నగరంలో తనకు నచ్చిన, ఇష్టమైన వంటకాలు వడ్డించే రెస్టారెంట్స్ ఉన్నాయి.గత నెల్లో దేవర చిత్రాన్ని అంతర్జాతీయ మార్కెట్లో ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం అక్కడి థియేటర్లలో సందడి చేస్తోంది. మరోవైపు తారక్ తిరిగి నగరానికి వచ్చేశారు. అయితే తారక్ జపాన్ టూరుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఆ ఇంటర్వ్యూలో నగరంలో తాను ఇష్టపడే రెస్టారెంట్స్ రుచుల వివరాలు ఆయన వెల్లడించడమే ఇందుకు కారణం.ఫ్రెండ్.. జపనీస్ ట్రెండ్.. నగరంలోని నాగ చైతన్య అక్కినేనికి చెందిన షోయు రెస్టారెంట్ ఎన్టీఆర్ ఎంచుకున్న మొదటి ఎంపిక. ‘ఈ అద్భుతమైన కళాత్మక ప్లేస్ నా స్నేహితుడు నాగ చైతన్య సొంతం. ఈ ప్రదేశంలో కొన్ని అద్భుతమైన జపనీస్ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా జపనీస్ వంటకమైన సుషీ అక్కడ సూపర్బ్. హైదరాబాద్‌లో జపనీస్ వంటకాలకు నేను జై కొట్టే ప్లేస్ అది. ఇది నిజంగా అంతర్జాతీయ వంటకాలకు కేరాఫ్’ అంటూ ఎన్టీఆర్ కొనియాడారు. మరికొన్ని ప్రదేశాలు.. జపనీస్ వంటకాలకు సంబంధించి తన ఫేవరెట్‌ను తెలియజేయడంతో పాటు అచ్చమైన హైదరాబాదీ వంటకాలకు సంబంధించి కూడా ఎన్టీఆర్ కొన్నింటిని పేర్కొన్నారు. తాను ఆస్వాదించే మరికొన్ని రుచుల కోసం.. పాతబస్తీలోని షాదాబ్, జూబ్లీహిల్స్‌లోని స్పైస్ వెన్యూ, తెలంగాణ స్పైస్ కిచెన్, పాలమూరు గ్రిల్, అమీర్‌పేట్‌లోని కాకతీయ డీలక్స్ మెస్ కూడా ఆయన ఎంచుకున్న నచ్చే రుచుల జాబితాలో ఉన్నాయి.చదవండి: పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్‌పై ట్రోలింగ్.. నటుడి ఆగ్రహం -
రామ్ గోపాల్ వర్మ 'శారీ'మూవీ ప్రీరిజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
తమన్నా స్పెషల్ రైడ్
స్పెషల్ సాంగ్స్ చేయడంలో హీరోయిన్ తమన్నా సమ్‌థింగ్ స్పెషల్. హీరోయిన్గా చేస్తూనే, మరోవైపు వీలైనప్పుడల్లా స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు తమన్నా. ఇలా కెరీర్లో ఇప్పటికే పదికి పైగా ప్రత్యేక పాటల్లో నటించారీ బ్యూటీ. అయితే రజనీకాంత్ ‘జైలర్’లో ‘కావాలయ్యా...’, రాజ్‌కుమార్ రావు–శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కా రాత్’ సాంగ్స్‌లో తమన్నా నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా అజయ్ దేవగన్ ‘రైడ్ 2’ సినిమాలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నారని బాలీవుడ్ టాక్. అంతేకాదు... ఈ స్పెషల్ సాంగ్‌లో తమన్నాతో పాటు యో యో హనీ సింగ్ కూడా ఉంటారట. ఇంకా ‘ఆజ్ కీ రాత్..’ పాటకు కొరియోగ్రఫీ చేసిన విజయ్ గంగూలీయే ‘రైడ్ 2’లోని స్పెషల్ సాంగ్‌కూ కొరియోగ్రఫీ చేయనున్నారట. రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రైడ్ 2’ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. 2018లో వచ్చిన ‘రైడ్’కి సీక్వెల్‌గా ‘రైడ్ 2’ రూపొందుతోంది. -
కౌంట్‌డౌన్ స్టార్ట్
నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’ విడుదలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటించారు. యునానిమస్ప్రోడక్షన్స్తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. సరిగ్గా ఈ మూవీ విడుదలకు 30 రోజులు ఉండటంతో 30 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘పవర్ఫుల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ఈ చిత్రంలో నాని ఫెరోషియస్ క్యారెక్టర్లో కనిపిస్తారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని అందించేలా ఉంటుంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ ‘ప్రేమ వెల్లువ...’ పాటకు అద్భుతమైన స్పందన లభించింది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్. -
హారర్ ఆహ్వానం
శివ కంఠంనేని, ఎస్తర్, ధన్యా బాలకృష్ణ, సుప్రిత, అశోక్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ ‘అమరావతికి ఆహ్వానం’. జీవీకే దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వర రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఒక మంచి హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించేలా ఈ మూవీ కథనం ఉంటుంది. హారర్ మూమెంట్స్, థ్రిల్లింగ్ సీన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: పద్మనాభన్ భరద్వాజ్, కెమేరా: జె. ప్రభాకర్ రెడ్డి. -
ఆరోగ్యకరమైన హాస్యంతో...
‘‘సారంగపాణి జాతకం’లో నాన్ తెలుగు యాక్టర్లు లేరు. అందరూ తెలుగువారు నటించిన పరిపూర్ణమైన తెలుగు సినిమా ఇది. ఎవరి డబ్బింగ్ వాళ్లే చెప్పుకున్నారు. హీరోయిన్ అయిన తెలుగమ్మాయి రూపా కొడువాయూర్ చక్కగా నటించింది’’ అని డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పారు. ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘జెంటిల్మన్, సమ్మోహనం’ చిత్రాల తర్వాత కృష్ణప్రసాద్ కాంబినేషన్లో ‘సారంగపాణి జాతకం’ నాకు మూడో సినిమా. ఆయన నన్ను నమ్ముతారు. ఆ నమ్మకం ఇద్దరి మధ్య కొనసాగుతోంది. అన్ని వయసుల వారికి వినోదాన్ని అందించే ఆరోగ్యకరమైన హాస్యభరిత సినిమా ఇది. ఈ సినిమా చూసేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల కళ్లకు, చెవులకు చేతులు అడ్డు పెట్టాల్సిన అవసరం లేదు’’ అన్నారు. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఇది జాతకాల మీద తీసిన సినిమా. నేను భగవంతుణ్ణి, జాతకాలని నమ్ముతాను. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను’’ అని చెప్పారు. ‘‘ఇంద్రగంటిగారి దర్శకత్వంలో నటించాలన్న నా కల ‘సారంగపాణి జాతకం’తో నెరవేరింది’’ అన్నారు ప్రియదర్శి. ‘‘ఇంద్రగంటిగారి సినిమాలో నటించడం నాకు ఎప్పుడూ స్పెషల్’’ అన్నారు శ్రీనివాస్ అవసరాల. ‘‘నాకు ఇష్టమైన డైరెక్టర్ ఇంద్రగంటిగారు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాను. ఊహించని విధంగా ఆయన సినిమాలో నటించే చాన్స్ రావడం చాలా సంతోషాన్ని కలిగించింది’’ అని పేర్కొన్నారు రూపా కొడువాయూర్. సినిమాటోగ్రాఫర్ పీజీ విందా, నటీనటులు సమీరా భరద్వాజ్, నివితా మనోజ్, అశోక్‌కుమార్, ప్రదీప్, వడ్లమాని శ్రీనివాస్ మాట్లాడారు. -
వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?
ఉగాది-రంజాన్ కానుకగా థియేటర్లలోకి నాలుగైదు సినిమాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫుల్ డామినేషన్ చూపిస్తోంది. వస్తున్న కలెక్షన్సే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయిన ఈ చిత్రం.. రూ.100 కోట్లకు చేరువలో ఉంది.(ఇదీ చదవండి: దమ్ముంటే నన్ను, నా సినిమాలను బ్యాన్ చేయండి: నాగవంశీ)తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం.. 4 రోజుల్లో ఈ సినిమాకు రూ.69.4 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు పేర్కొన్నారు. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు తొలిరోజు వచ్చిన టాక్, ఇప్పుడు వస్తున్న వసూళ్లకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పొచ్చు. ఓవర్సీస్ లోనూ ఇప్పటికే మిలియన్ డాలర్ మార్క్ వసూళ్లు దాటేసింది.ప్రస్తుతం ఊపు చూస్తుంటే ఈ వీకెండ్ అయ్యేసరికి రూ.100 కోట్ల మార్క్ దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇకపోతే ఈ చిత్రానికి మూడో భాగం కూడా ఉందని చివర్లో ప్రకటించారు. మరి అది ఎప్పుడు తీసి రిలీజ్ చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: యంగ్ హీరోయిన్ చెల్లి పెళ్లి.. ఫొటోలు వైరల్!) -
టాలెంట్‌తో పనిలేదు.. అలాంటి వాళ్లకే ఛాన్సులు ఇస్తున్నారు: పాయల్ రాజ్‌పుత్
టాలెంట్ ఎంత ఉన్నా సరే చిత్రపరిశ్రమలో రాణించడం చాలా కష్టమని ఢిల్లీ బ్యూటీ 'పాయల్ రాజ్‌పుత్'(Payal Rajput) అన్నారు. 'RX 100' దర్శకుడు అజయ్ భూపతి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ హిట్ కొట్టింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు వారికి దగ్గరైంది. ఈ మూవీ తర్వాత ఆమె వరుస సినిమాలు చేసినప్పటికీ ఏదీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే, చాలారోజుల గ్యాప్ తర్వాత వచ్చిన 'మంగళవారం' సినిమాలో తన నటనతో విశ్వరూపం చూపింది. ఈ సినిమా భారీ విజయం అందుకోవడమే కాకుండా ఒక నటిగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ‘మంగళవారం’లోని నటనకు గాను జైపుర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తమ నటిగా పాయల్ అవార్డ్ అందుకుంది. అయితే, ఈ సినిమా తర్వాత ఆమెకు భారీ ఛాన్సులు వస్తాయని అందరూ ఆశించారు. కానీ, అలాంటిది ఏమీ జరగలేదు. ఈ క్రమంలో తాజాగా ఇండస్ట్రీపై పాయల్ ఒక పోస్ట్ చేసింది.ఒక నటిగా రాణించడం అనేది అన్నింటికంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం. ప్రతిరోజు కూడా అనిశ్చిత భారంతోనే మొదలౌతుంది. ఎందుకంటే నేను ప్రతిరోజూ ప్రతిభను కప్పివేసే నెపోటిజం (బంధుప్రీతి ), పక్షపాతంతో నిండి ఉన్న ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాను. నాకొక సందేహం ఉంది. నేను అంకితభావంతో ఎంతో కష్టపడుతున్నప్పటికీ వెలుగులు కనిపించడం లేదు. ఆధిపత్యం చెలాయించే ఈ ప్రపంచంలో నిజంగానే రాణించగలనా అనే సందేహం వస్తుంది. అవకాశాలు వచ్చినట్టే వచ్చే చేయి జారిపోతున్నాయి. కొందరు తమ ఇంటిపేరు ఉపయోగించుకొని ఛాన్సులు తెచ్చుకుంటే మరికొందరు సరైన ఏజెంట్స్ ద్వారా దక్కించుకుంటున్నారు. ఇలాంటివి నేను చాలా గమనించాను. ఇలాంటి ప్రదేశంలో నేను రాణించగలనా అనే సందేహం వస్తుంటుంది.' అని పాయల్ అన్నారు. మంగళవారం (2023) తర్వాత పాయల్ రాజ్‌పూత్ మరో సినిమా నటించలేదు. అంతటి భారీ విజయాన్ని అందుకున్న ఆమెకు అవకాశాలు రాకపోవడం ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. కాస్త ఓపిక పడితే తప్పకుండా మంచి ఛాన్సులు వస్తాయని సోషల్‌మీడియా ద్వారా ఆమెకు చెబుతున్నారు. పాయల్ ట్వీట్‌ను తమ అభిమాన హీరోలు, దర్శకులకు ట్యాగ్ చేస్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేయడం విశేషం. అలా పాయల్‌పై తమ అభిమానాన్ని చాటుతున్నారు. Being an actor is one of the toughest careers out there. Each day starts with the weight of uncertainty, as I step into a world where nepotism and favoritism often overshadow talent. #struggleisreal 🎞️— paayal rajput (@starlingpayal) April 1, 2025There are moments of doubt when I question whether my hard work and dedication can truly shine through in a landscape dominated by privilege. I watch as opportunities slip away to those with famous last names or a powerful agent, wondering if my talent is enough to break…— paayal rajput (@starlingpayal) April 1, 2025 -
'Mega157' రఫ్ఫాడించే గ్యాంగ్ ఇదే.. వీడియోతో పరిచయాలు
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'Mega157' నుంచి 'రఫ్ఫాడిద్దాం' పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల సమయంలో వెంకటేష్‌తో అనిల్ చేసిన ప్రమోషన్స్ కార్యక్రమాలన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా సినిమాను ప్రతి ఇంటికి తీసుకెళ్లాయి. దీంతో ఈ ఏడాదిలో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇప్పుడు ఆ ఫార్మూలానే చిరంజీవి సినిమాకు ఇంకాస్త డిఫరెంట్‌గా అనిల్ ప్లాన్ చేస్తున్నాడు.సంక్రాంతి-2026లో రఫ్ఫాడిద్దాం పేరుతో ఒక వీడియోను అనిల్ రావిపూడి క్రియేట్ చేశాడు. Mega157 ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న తన గ్యాంగ్ మొత్తాన్ని మెగాస్టార్ సినిమాలకు సంబంధించిన డైలాగ్స్‌తో చిరంజీవికి పరిచయం చేశాడు. డైరెక్షన్ టీమ్ నుంచి నిర్మాతల వరకు అందరినీ పరిచయం చేశారు. సుమారు రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియో చాలా ఫన్నీగా ఎంటర్టైన్ చేసేలా ఉంది. ఇదే వీడియోను చిరంజీవి కూడా తన సోషల్‌మీడియాలో షేర్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలో బాగా తెలిసిన దర్శకుడు అంటూ ఆయన్ను చిరంజీవి ప్రశంసించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అనిల్‌ను మెచ్చుకుంటూ కాంమెంట్లు చేస్తున్నారు. అనిల్ రావిపూడి తనదైన మార్క్‌తో అప్పుడే మొదలెట్టేశాడు రా బాబూ.. అంటూ ఫన్నీగా ట్వీట్లు చేస్తున్నారు.సంక్రాంతికి వస్తున్నాం హిట్ తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. త్వరలో షూటింగ్ పనులు ప్రారంభం అవుతాయని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందులో చిరంజీవి తన సొంత పేరైన శివ శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో కనిపించనున్నారు. 2026 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.What better way to introduce our team to the legendary Megastar @KChiruTweets Garu than by paying tribute to his timeless dialogues 😍❤️🔥Let’s celebrate MEGASTAR in his forte in #Mega157 🥳— https://t.co/KpR65ACX9L SANKRANTHI 2026 - రఫ్ఫాడిద్దాం 😎#ChiruAnil @sahugarapati7… pic.twitter.com/xGhSLaIstr— Anil Ravipudi (@AnilRavipudi) April 1, 2025 -
‘సారంగపాణి జాతకం’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
మాపై నిందలు వేస్తూ.. కుట్రలకు పాల్పడుతున్నారు: ఆర్కే. సెల్వమణి
తమిళ నిర్మాతల మండలి, దక్షిణ భాతర సినీ కార్మికుల సమాఖ్య ( ఫెప్సీ)కి మంధ్య అభిప్రాయ బేధాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు వర్గాల మధ్య కొంత కాలంగా తీవ్రమైన ఆరోపణలు ఒకరిపైమరోకరు చేసుకుంటూనే ఉన్నారు. నిర్మాతల నుంచి కార్మికులకు అందే వేతనాల విషయంలో ఈ వివాదం రాజకుంది. తాజాగా ఇవి పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో తమిళ నిర్మాతల మండలి కార్మికులలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని వార్తలు వస్తున్నాయి. దక్షిణ భాతర సినీ కార్మికుల సమాఖ్య ( ఫెప్సీ)కి పోటీగా తమిళ్ సినీ కార్మికుల సమాఖ్యను ఎర్పాటు చేస్తున్నట్లు ప్రచారం వెలుగులోకి వచ్చింది.తమిళ్ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో ఇటీవల ఒక దిన పత్రికలో ప్రకటన వెలువడింది. దీంతో దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే. సెల్వమణి చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాము నిర్మాతల మండలి కోసం ఎంతగానో దిగొచ్చామని చెప్పారు. కార్మికుల వేతనాల నుంచి చాలా విషయాల్లో నిర్మాతకు సహకరిస్తున్నామన్నారు. అయితే వారిలో ఐక్యత లేక సమస్యలను పరిష్కరించుకోలేక తమపై నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే కొత్తగా తమిళ్ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో సంఘాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగా ఇటీవల ఓ దినపత్రికలో తమిళ్ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారని అన్నారు. ఈ ప్రకటన వెనుక తమిళ్ నిర్మాతల మండలి ఉందని తెలిసిందని సెల్వమణి అన్నారు. నిర్మాతల మండిలి తెలివిగా మా మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఉందన్నారు.కుట్రలు పాల్పడుతోంది వారే.. కొందరు నిర్మాతలే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం నుంచి ఒక్క కార్మికుడు కూడా బయటకు వెళ్లడని సెల్వమణి అన్నారు. కారణం తమ సమాఖ్య అంత కట్టుదిట్టంగా ఉందని , వారి శ్రేయస్సు కోసమే తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇకపోతే నిర్మాతలు తమ చిత్రాల షూటింగ్‌లను తమిళనాడులో కాకుండా ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాల్లో చేస్తున్నారని, అందువల్ల తమిళ సినీ కార్మికులకు పని లేకుండా పోతోందని అన్నారు. తప్పని సరి అయితేనే తమిళ చిత్రాల షూటింగ్‌లను ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తే బాగుంటుందని, తమిళ చిత్రాలను నమ్ముకుని 25 వేల మంది కార్మికుల ఉన్నారని ఆర్కే.సెల్వమణి పేర్కొన్నారు. ఈ విషయంలో నటీనటులు కూడా ఆలోచించాలన్నారు. -
టిక్ టాక్ వీడియోలతో ఫేమస్..హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న దీపికా పిల్లి (ఫొటోలు)
-
బెట్టింగ్ యాప్స్‌పై మానవ హక్కుల సంఘానికి కేతిరెడ్డి ఫిర్యాదు
ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్స్ వల్ల దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘంలో తమిళనాడు తెలుగు యువశక్తి వవస్థాపక అధ్యక్షులు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఫిర్యాదు చేశారు. అందులో ఆయన ఇలా పేర్కొన్నారు. "ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఎంతో నష్టపోతుందన్నారు. 2017లోనే బెట్టింగ్ యాప్స్ నిర్మూలణ కోసం తెలంగాణలో ఒక చట్టం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా బెట్టింగ్ యాప్స్ నిర్మూలణ కోసం 2020లో చట్టాలు తీసుకొచ్చారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రలు చట్టాలు చేసినప్పటికీ సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఒక జడ్జిమెంట్‌ను ఆధారం చేసుకుని వారి ఆగడాలకు అడ్డులేకుండా పోతుందన్నారు. రమ్మీ అనేది స్కిల్ గేమ్ అంటూ ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌కు చెందిన వారు చెప్పడం.. ఆపై తమ యాప్స్‌ను ప్రముఖ క్రీడాకారులు, సినీ నటులతో ప్రకటనలు క్రియేట్ చేసి వదులుతున్నారని తెలిపారు. పక్కా ప్లాన్‌తో ఇలా ప్రజలను లూటీ చేస్తున్నారని చెప్పారు. ఇటీవల కాలంలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌లలో దాదాపు 1000 మందికి పైగానే ఆత్మహత్యలు చేసుకున్నరని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా దేశవ్యాప్తంగా ఉన్న ఈ బెట్టింగ్ యాప్స్‌ను బ్యాన్ చేయడమే కాకుండా ఈ మాఫియాను కట్టడి చేయాలన్నారు. అందు కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక నిఘా సంస్థను ఏర్పాటు చేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టేందుకు చర్యలు చేపట్టాలని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. -
OTT: సడెన్‌గా తెలుగులోకి వచ్చేసిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా'
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’.. తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) పేరుతో విడుదలైంది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండా ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చేసింది. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో ఇందులో నటించారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో తమిళ్ వర్షన్ అందుబాటులో ఉంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది.‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్స్‌లోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద యూత్‌ను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో సడెన్‌గా స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండా ఈ సినిమాను విడుదల చేయడంతో ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సింప్లీ సౌత్ ఓటీటీలో కూడా ఈ చిత్రం తెలుగులో ఉంది. ఓ భిన్నమైన రొమాంటిక్ కామెడీ కథతో ధనుష్ ఈ సినిమాని తెరకెక్కించారు. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ మూవీ ఉంటుంది. ఆర్కేప్రోడక్షన్స్‌తో కలిసి ధనుష్(Dhanush) సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ పథాకంపై ఈ సినిమాను నిర్మించారు. -
మా బాధ చూసి మమ్ముట్టి మెసేజ్.. కన్నీళ్లొచ్చాయి: పృథ్వీరాజ్ తల్లి
'ఎల్ 2: ఎంపురాన్' (L2 Empuraan) వివాదంపై మరోసారి పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తల్లి మల్లిక స్పందించారు. లూసిఫర్ సినిమా విషయంలో కేవలం తన కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కొందరు దూషిస్తున్నారని ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ గొడవలో కేవలం పృథ్వీరాజ్ సుకుమారన్‌ను మాత్రమే బలిపశువును చేస్తున్నారని ఆమె కామెంట్ చేశారు. తన కుమారుడికి చిత్ర పరిశ్రమలో చాలా మంది శత్రువులు ఉన్నారని మల్లిక తెలిపారు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా రాణిస్తుండటంతో అతని ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు ఎల్2: ఎంపురాన్ సినిమాను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని మల్లికా ఆరోపించింది.ఇలాంటి సమయంలో తమకు అండగా నిలిచిన ఏకైక స్టార్ హీరో మమ్ముట్టి మాత్రమే అని పృథ్వీరాజ్ తల్లి మల్లిక తాజాగా కామెంట్స్ చేశారు. ఆయన పంపిన సందేశం చూసి చాలా భావోద్వేగానికి గురయ్యానని ఆమె ఇలా చెప్పారు. "రంజాన్ పండుగ ఉన్నప్పటికీ, మమ్ముట్టి నాకు మెసేజ్ చేశారు. పృథ్వీరాజ్ గురించి ఫేస్బుక్లో నేను చేసిన పోస్ట్ చూసి చింతించవద్దని మమ్ముట్టి చెప్పారు. మాకు అండగా నిలబడుతానని మాట ఇచ్చారు. నా కుమారుడికి జరుగుతున్న అన్యాయం వల్ల నేను చాలా బాధలో ఉన్నానని ఆయనకు తెలుసు. మమ్ముట్టి ఒక మనస్సాక్షి ఉన్న కళాకారుడు.నా పిల్లల గురించి ఎక్కడైనా ప్రతికూలంగా ఏదైనా కనిపిస్తే.., అది నన్ను బాధపెడుతుందని అతను అర్థం చేసుకుంటారు. నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోను. నా పిల్లలకు కూడా మమ్ముట్టి చేసిన సాయాన్ని మర్చిపోవద్దని చెప్పాను. ఇంత జరుగుతున్నా చిత్ర పరిశ్రమ నుంచి మా కుటుంబం కోసం ఎవరూ మాట్లాడలేదు. కానీ, పరిశ్రమ నుండి సందేశం పంపిన ఏకైక వ్యక్తి మమ్ముట్టి మాత్రమే.. ఆయన పంపిన మెసేజ్ చూసినప్పుడు నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి.'అని మనోరమ న్యూస్‌తో మల్లిక అన్నారు.'ఎల్ 2: ఎంపురాన్' చిత్రం ఇప్పటికే ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగానే వసూలు చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో సెట్ చేయబడిన సన్నివేశాల చిత్రీకరణపై వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదం వల్ల ఈ చిత్రం నుంచి సుమారు 3 నిమిషాల నిడివిని తొలగించారు. -
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
శోభిత ధూళిపాళ టైమ్ వచ్చింది.. స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్
కోలీవుడ్ దర్శకుడు పా.రంజిత్( Pa. Ranjith) కథలే కాదు ఆయన దర్శకత్వం శైలి కూడా ఇతర చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అట్టకత్తి, మద్రాస్ చిత్రాల నుంచి సార్పట్ట పరంపర, తంగలాన్ వంటి చిత్రాలే పా.రంజిత్ వైవిధ్య దర్శక శైలికి నిదర్శనం. తంగలాన్‌లో నటుడు విక్రమ్ , నటి పార్వతీ, మాళవికా మోహన్ల వేషధారణ, హావభావాలకు మంచి పేరు వచ్చింది. కాగా పా.రంజిత్ తదుపరి సార్పట్ట పరంపర– 2 చిత్రం చేయబోతున్నట్లు, అదే విధంగా హిందీలో పర్సీ చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అవేవీ కాకుండా ప్రస్తుతం ఆయన వెట్టువన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు దినేశ్ హీరోగా,ఆర్య విలన్‌గా నటిస్తున్నారు. అట్టకత్తి చిత్రం తరువాత వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. అదే విధంగా నటుడు అశోక్ సెల్వన్, ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటి శోభిత ధూళిపాళ( Sobhita Dhulipala) నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలవడలేదన్నది గమనార్హం. కాగా ఈమె ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కీలక పాత్ర పోషించారన్నది గమనార్హం. మేడ్ ఇన్ హెవన్, మేజర్ వంటి చిత్రాల్లో శోభిత తన నటనతో మెప్పించింది. అయితే, పా.రంజిత్ లాంటి డైరెక్టర్ సినిమాలో ఒకరు నటిస్తున్నారంటే వారి పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. అందుకు వారు సెట్ అవుతారని ఆయన భావిస్తేనే ఛాన్స్ ఇస్తారు. శోభితకు సరైన పాత్ర పడితే దుమ్మురేపుతుందని పేరు ఉంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అయితే శోభిత టాలెంట్ చూపే టైమ్ వచ్చిందని చెప్పవచ్చు. నాగచైతన్యతో( Naga Chaitanya) పెళ్లి తర్వాత ఆమె ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో భాగం కానుందని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని గోల్డన్ రెయోమ్స్ సంస్థతో కలిసి దర్శకుడు .పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్ర పస్ట్‌లుక్ పోస్టర్‌ను 2022లో జరిగిన కాన్ చిత్రోత్సవాల వేదికపై ఆవిష్కరించారన్నది గమనార్హం. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
డబుల్ ధమాకా
ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు హీరోయిన్ వైష్ణవీ చైతన్య. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘జాక్’లో ఆమె తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. తెలుగమ్మాయి అయిన వైష్ణవీ చైతన్య కెరీర్ ప్రారంభంలో ‘లవ్ ఇన్ 143 అవర్స్’, ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’, ‘అరెరే మానస’, ‘మిస్సమ్మ’ వంటి షార్ట్ ఫిల్మ్స్ చేశారు.ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’, ‘వరుడు కావలెను’ చిత్రాల్లో అతిథి పాత్రల్లో నటించిన ఆమె ‘బేబీ’(2023) మూవీతో హీరోయిన్గా మారారు. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచి, రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీతో ఆడియన్స్ లో బోలెడంత క్రేజ్ సొంతం చేసుకున్న వైష్ణవీ చైతన్య ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా ఆమె నటిస్తున్న చిత్రం ‘జాక్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ మూవీలో ఆమె ఫస్ట్ టైమ్ ద్విపాత్రాభినయం చేశారు. అదేవిధంగా ‘90 ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌కి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమాలో ఆనంద్ దేవరకొండకి జోడీగా నటిస్తున్నారు వైష్ణవి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. -
నేను అందుకున్న గొప్ప ప్రశంస అదే: కల్యాణ్ శంకర్
‘‘మ్యాడ్’ సినిమా ఎక్కువగా యువతకి చేరువైంది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీని యువతతో పాటు, కుటుంబ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు.. ఎంజాయ్ చేస్తున్నారు’’ అని డైరెక్టర్ కల్యాణ్ శంకర్ తెలిపారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలైంది.ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.55 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో సోమవారం కల్యాణ్ శంకర్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘మ్యాడ్ స్క్వేర్’లో పెద్ద కథ ఆశించి సినిమాకి రాకండి, సరదాగా నవ్వుకోవడానికి రండి’ అని ముందే చెప్పడం మాకు చాలా ప్లస్ అయింది. రాజమౌళిగారు కూడా సినిమా మొదలుపెట్టే ముందే కథ ఇలా ఉండబోతుంది అని చెబుతుంటారు. అలా చెప్పడం వల్ల ప్రేక్షకులను మనం ముందే ప్రిపేర్ చేసినట్టు అవుతుంది. మా ఫ్రెండ్ వాళ్ల అమ్మ పదిహేనేళ్ల తర్వాత థియేటర్లో చూసిన సినిమా ‘మ్యాడ్ స్క్వేర్’. ‘సినిమా చూస్తున్నప్పుడు నవ్వి నవ్వి కళ్లల్లో నీళ్లు తిరిగాయి’ అని ఆమె చెప్పడం నేను అందుకున్న గొప్ప ప్రశంస. ఇతర నిర్మాతల నుంచి కూడా నాకు అవకాశాలు వస్తున్నాయి. కానీ, నాగవంశీగారితో నాకు మంచి ర్యాపో ఉండటంతో ఆయనతోనే వరుస సినిమాలు చేస్తున్నాను. రవితేజగారితో నేను చేయబోయే సినిమాలోనూ కచ్చితంగా వినోదం ఉంటుంది’’ అన్నారు. -
అందరూ గర్వపడే సినిమా కోర్ట్: చిరంజీవి
‘‘కోర్ట్’ సినిమా చూశాను.. ఎక్కడా బోర్ కొట్టలేదు. కథని ఆద్యంతం ఆసక్తిగా తీశారు. నటీనటులందరూ అద్భుతంగా నటించారు.. ప్రతి పాత్ర సహజంగా ఉంది. ఈ మూవీని కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్‌లా కాకుండా ఒక ఎడ్యుకేటివ్ కోర్ట్ డ్రామాగా భావిస్తున్నాను. అందరూ గర్వపడే సినిమా ‘కోర్ట్’’ అని హీరో చిరంజీవి తెలిపారు. ప్రియదర్శి, శివాజి, రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు.నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం మార్చి 14న విడుదలై, హిట్‌గా నిలిచింది. తాజాగా ‘కోర్ట్’ చిత్రబృందాన్ని చిరంజీవి అభినందించి, సత్కరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ–‘‘కోర్ట్’లో చాలా బలమైన సందేశం ఉంది. నాని ఒక కథపై ఆసక్తి చూపించారంటే కచ్చితంగా అందులో విషయం ఉంటుంది. ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్‌లోనే చూడాలి’’ అన్నారు. -
కుశాల్ రాజు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే?
కుశాల్ రాజు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్లో డా. లతా రాజు నిర్మిస్తున్నారు. ఇవాళ ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా..మల్లిడి వశిష్ట ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు మల్లిడి కృష్ణ మాట్లాడుతూ.. '2012లో నా జర్నీ మొదలైంది. ఎన్నోమలుపులు తిరిగి మీ ముందుకు డైరెక్టర్‌గా వచ్చాను. లత గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అలాంటి మంచి నిర్మాత దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఇదొక స్కైఫై డ్రామా మూవీ. ఓటీటీల యుగంలో ఇలాంటి కథను ఎంచుకోవాలంటే ధైర్యం ఉండాలి. రాబోయే ఈవెంట్స్‌లో మరిన్ని వివరాలు వెల్లడిస్తా' అని చెప్పారు. హీరో కుశాల్ రాజు మాట్లాడుతూ..'నా దర్శకుడు కృష్ణకు థ్యాంక్స్ చెప్పాలి. నన్ను హీరోగా పరిచయం చేయడం కోసం మా అమ్మ లత చాలా కేర్ తీసుకున్నారు. వీవీ వినాయక్, బెల్లంకొండ శ్రీనివాస్, మా టీమ్ మొత్తానికి బిగ్ థ్యాంక్స్' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో జగపతి బాబు, పృథ్వీరాజ్, వైవా హర్ష, బబ్లూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
కల్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.. 'నాయాల్దీ' వచ్చేసింది!
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్–ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అర్జున్ పాత్రలో కల్యాణ్ రామ్, వైజయంతి పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు.ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. నాయాల్ది అంటూ సాగే మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రఘు రామ్ లిరిక్స్ అందించగా.. నకాష్ అజీజ్, సోనీ కొమండూరి ఆలపించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
యాంకర్ ప్రదీప్ కొత్త సినిమా.. రిలీజైన ట్రైలర్
తెలుగులో కొన్నేళ్ల పాటు పాపులర్ యాంకర్ గా కొనసాగిన ప్రదీప్ మాచిరాజు.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాలో గతంలో హీరోగానూ నటించాడు. కానీ హిట్ కొట్టలేకపోయాడు. ఇప్పుడు యాంకరింగ్ ని పక్కనబెట్టి మరో మూవీలో హీరోగా నటించాడు. అదే 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్)ట్రైలర్ బట్టి చూస్తుంటే సివిల్ ఇంజినీరింగ్ చేసిన ఓ కుర్రాడు.. ఊహించని విధంగ ఓ పల్లెటూరికి వెళ్తాడు. ఆ ఊరిలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు? ఇందులో హీరోయిన్ పాత్రేంటి? అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది.ట్రైలర్ లో కామెడీ పర్లేదనేలానే ఉంది. ఏప్రిల్ 11న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రదీప్ సరసన దీపిక పిల్లి హీరోయిన్ కాగా.. నితిన్-భరత్ దర్శకులుగా పరిచయమవుతున్నారు. మరి ఈ సారైనా ప్రదీప్ హిట్ కొడతాడేమో చూడాలి?(ఇదీ చదవండి: విషాదం.. టాలీవుడ్ నిర్మాత కన్నుమూత) -
విషాదం.. టాలీవుడ్ నిర్మాత కన్నుమూత
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పలు చిత్రాలు తీసిన నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం (68) మృతి చెందారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన పరిస్థితి తాజాగా విషమించడంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు.(ఇదీ చదవండి: 'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?)ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు వచ్చిన తర్వాత అంటే బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముళ్లపూడి బ్రహ్మానందం.. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు బంధువు. ఈవీవీ సోదరిని ఈయన పెళ్లి చేసుకున్నారు.అల్లరి నరేశ్ 'నేను', అల్లుడు గారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా తదితర సినిమాలని బ్రహ్మానందం నిర్మించారు. ఇప్పుడు ఈయన చనిపోవడంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్) -
రాబిన్‌హుడ్‌లో డేవిడ్ వార్నర్.. లాలీ పాప్ డైలాగ్ అదిరిపోయింది!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. ఈ ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసింది. వెంకీ కుడుముల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించారు. aఅయితే ఈ సినిమా ద్వారా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ ప్రత్యేకమైన కెమియో పాత్రలో వార్నర్ మెరిశారు. ఈ సినిమాలో డ్రగ్ డీలర్‌గా కనిపించారు. అయితే కేవలం 2 నిమిషాల 51 సెకన్లపాటు మాత్రమే కనిపించారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.అయితే తాజాగా డేవిడ్ వార్నర్ పాత్రకు సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. దాదాపు 20 సెకన్ల పాటు ఉన్న వీడియోను పంచుకున్నారు. ఇందులో డేవిడ్ చెప్పిన డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'లాలీ పాప్స్ ఆర్ రెడ్.. ఎనిమీస్ ఆర్ డెడ్' అంటూ డైలాగ్ చెప్పిన తీరు వార్నర్ ఫ్యాన్స్‌కు జోష్ నింపింది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.DAVID BHAI 💥💥Enjoy @davidwarner31's MASS & SWAG on the big screens 🤩🔥Book your tickets for #Robinhood now!🎟️ https://t.co/ogblfmwZTd@actor_nithiin @sreeleela14 @VenkyKudumula @davidwarner31 @gvprakash #RajendraPrasad @vennelakishore @DevdattaGNage #SaiSriram… pic.twitter.com/PsMo0emXl4— Mythri Movie Makers (@MythriOfficial) March 31, 2025 -
రూ.3 కోట్ల ఆఫర్.. అక్కర్లేదని రిజెక్ట్ చేశాం: శివబాలాజీ దంపతులు
బెట్టింగ్ యాప్స్ (Betting Apps).. ముందు నమ్మిస్తాయి, తర్వాత ముంచేస్తాయి. అది తెలియని అమాయకులు.. అన్ని కష్టాలకు ఒకే ఒక్క పరిష్కారం ఇదేనంటూ బెట్టింగ్ యాప్స్ వలలో పడుతున్నారు. చివరకు ఉన్నదంతా కోల్పోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనుకాడం లేదు. ఇలాంటి యాప్స్‌ను బుల్లితెర సెలబ్రిటీల నుంచి సినిమా స్టార్స్ వరకు చాలామంది ప్రమోట్ చేస్తున్నారు.బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని అడిగారుఇప్పుడిప్పుడే తప్పు తెలుసుకుని కొందరు దానికి దూరంగా ఉంటున్నారు. అయితే ఈ యాప్స్ ప్రమోట్ చేయమని తనను కూడా సంప్రదించారంటున్నాడు టాలీవుడ్ నటుడు, బిగ్‌బాస్ విన్నర్ శివబాలాజీ (Shiva Balaji). శివ బాలాజీ, భార్య మధుమిత (Madhumitha)తో కలిసి ఇటీవల ఓ సాంగ్ చేశాడు. ఈ పాట రిలీజైన నేపథ్యంలో వీరిద్దరూ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.రూ.3 కోట్ల ఆఫర్ఈ సందర్భంగా శివ బాలాజీ, మధుమిత మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని రూ.3 కోట్ల ఆఫర్ ఇచ్చారు. ట్రేడింగ్, బెట్టింగ్.. ఇలా చాలావాటిని ప్రమోట్ చేయమని అడుగుతుంటారు. మమ్మల్ని ఫాలో అయే అభిమానులను ఫ్యామిలీగా భావిస్తాం. వారినెప్పుడూ సరైన దారిలోనే నడవాలని ఎంకరేజ్ చేస్తాం తప్ప పొరపాటున కూడా తప్పులు సలహాలు, సూచనలు ఇవ్వం. అందుకే అలాంటి ప్రమోషన్స్ చేయలేదు. చేయము కూడా! అని పేర్కొన్నారు.చదవండి: 'జయం' సినిమాలో హీరోయిన్ రష్మీ గౌతమ్.. చివర్లో: నితిన్ -
హోమ్ టౌన్ మూవీ టీం ఫన్నీ ఇంటర్వ్యూ
-
న్యూబిగినింగ్స్, కొత్త సంవత్సరాదికి ప్రేమతో : వైష్ణవి చైతన్య ( ఫోటోలు)
-
'లగ్గం టైమ్' షూటింగ్ పూర్తి.. వేసవిలో విడుదల
రాజేష్ మేరు, నవ్య చిత్యాల హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'లగ్గం టైమ్'. ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహిస్తున్నారు. కె.హిమ బిందు నిర్మిస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను 'భీమ్లా నాయక్' దర్శకుడు సాగర్ కె చంద్ర ఆవిష్కరించగా దానికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. (ఇదీ చదవండి: కాస్ట్ లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. రేటు ఎంతంటే?)ఇక తాజా షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా నిర్వహిస్తున్నారు. 'లగ్గం టైమ్' లో యూత్ ను మాత్రమే కాదు టైటిల్ కి తగ్గట్టు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉందని.. సినిమా చాలా బాగా వచ్చిందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే టీజర్ ను విడుదల చేయనున్నారు. వేసవి కానుకగా మూవీ రిలీజ్ ఉండబోతుందని చెప్పుకొచ్చారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే) -
'మ్యాడ్ స్క్వేర్' మూడురోజుల్లోనే కలెక్షన్ల రికార్డ్స్ క్లబ్లో ఎంట్రీ
మ్యాడ్ స్క్వేర్(Mad Square) సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. మార్చి 28 సినిమా విడుదలైన ఈ మూవీ భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తుంది. థియేటర్స్ రన్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ నవ్వులు, పంచ్ డైలాగ్స్‌తో మ్యాడ్ గ్యాంగ్ దుమ్మురేపుతున్నారు. అందరి అంచనాలను దాటేసి ఎవరూ ఊహించలేని కలెక్షన్లను ఈ సినిమా రాబడుతుంది. మ్యాడ్ స్క్వేర్ చిత్రం కేవలం మూడోరోజుల్లోనే ఫస్ట్ మైలురాయిని దాటేసింది.2023లో విడుదలైన హిట్ సినిమా ‘మ్యాడ్’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కించారు.నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరోసారి తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పిస్తున్నారు. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని సుమారు రూ. 10 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, మూడురోజుల్లోనే ఈ మూవీ రూ. 50.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొదటిరోజే రూ. 20.8 కోట్లు, రెండో రోజు రూ. 16.4 కోట్లు, మూడోరోజు రూ. 13 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, నేడు రంజాన్ ఉంది కాబట్టి మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్ మరింతగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్లో కూడా ఈ మూవీ సత్తా చాటుతుంది. అక్కడ వన్ మిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మ్యాడ్ గ్యాంగ్ పిచ్చెక్కిస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే
ఉగాది, రంజాన్ రెండు పండుగల తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో కూడా సినిమాల సందడి ఉంది. ఇప్పటికే థియేటర్స్‌లో లూసిఫర్, మ్యాడ్, రాబిన్‌హుడ్ వంటి చిత్రాలు సందడి చేస్తున్నాయి. ఇంకో వారం పాటు బిగ్ స్క్రీన్‌పై ఈ చిత్రాల హవా ఉంటుంది. అందుకే ఏప్రిల్ మొదటి వారంలో థియేటర్స్‌లోకి వచ్చే పెద్ద సినిమాలు లేవని చెప్పవచ్చు. విద్యార్థులకు దాదాపుగా పరీక్షలు ముగిశాయి. ఎండలు పెరిగాయి దీంతో ఇంట్లోనే ఉంటూ సరదాగా సినిమాలు చూసే వారికి చాలానే ఉన్నాయి. మండు వేసవిలో చల్లని వినోదాన్ని పంచడానికి ఓటీటీలో సినిమాలు సిద్ధమయ్యాయి. మరి ఏప్రిల్ మొదటి వారంలో సినీ ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న చిత్రాలేంటి..? తెలుసుకుందాం.నెట్‌ఫ్లిక్స్🎥 టెస్ట్ (తమిళ్/తెలుగు)- ఏప్రిల్ 4🎥 కర్మ కొరియన్ (ఇంగ్లీష్/తెలుగు)- ఎప్రిల్ 4అమెజాన్ ప్రైమ్🎥 బ్లాక్ బ్యాగ్- ఏప్రిల్ 1🎥 అక్టోబర్ 8- ఏప్రిల్1🎥 ది బాండ్స్‌మ్యాన్ (ఇంగ్లీష్/తెలుగు)- ఏప్రిల్ 3జియో హాట్‌స్టార్🎥 జ్యూరర్ 2 (ఇంగ్లీష్/తెలుగు) ఏప్రిల్ 1🎥 హైపర్ నైఫ్ (కొరియన్/ తెలుగు) వెబ్ సిరీస్ ఏప్రిల్ 2🎥 ఏ రియల్ పెయిన్ (ఇంగ్లీష్)- ఏప్రిల్ 3🎥 టచ్ మీ నాట్ (తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4జీ5🎥 కింగ్స్‌స్టన్ (తెలుగు/తమిళ్)- ఏప్రిల్ 4ఆహా🎥 హోం టౌన్ (తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4 -
'జయం' సినిమాలో హీరోయిన్ రష్మీ గౌతమ్.. చివర్లో: నితిన్
ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు నితిన్ (Nithiin). ఇతడు హీరోగా నటించిన తొలి చిత్రం జయం (Jayam Movie). తేజ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ మూవీలో గోపీచంద్ విలన్‌గా నటించాడు. సదా హీరోయిన్గా పరిచమైంది. అయితే ఈ సినిమాలో మొదట సదాని కథానాయికగా అనుకోలేదట!రష్మీతోనే రిహార్సల్స్ చేశా..హీరో నితిన్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఉగాది ఈవెంట్‌కు హాజరైన అతడు జయం సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. జయం సినిమాకు రష్మీ గౌతమ్ (Rashmi Gautam)తో కలిసి రిహార్సల్స్ చేసినట్లు తెలిపాడు. దాదాపు 90 శాతం సీన్లు రష్మీతో రిహార్సల్స్ చేశానని, చివర్లో ఏమైందో ఏమో కానీ హీరోయిన్ను మార్చేశారు అని పేర్కొన్నాడు.బుల్లితెరపై సెటిలైన రష్మీఒకవేళ రష్మీ గనక హీరోయిన్గా జయం సినిమా చేసుంటే అప్పట్లోనే స్టార్ అయిపోయేది. పేరుప్రఖ్యాతలతో పాటు మంచి అవకాశాలు వచ్చేవి. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో బోల్డ్ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. కానీ అవేవీ వర్కవుట్ కాకపోవడంతో బుల్లితెరపై సెటిల్ అయింది. గతంలో యువ సీరియల్లో నటించిన ఆమె ప్రస్తుతం కామెడీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.సినిమానితిన్ హీరోగా నటించిన లేటెస్ట మూవీ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయిక. వెన్నెల కిశోర్, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించాడు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: పిల్లలు వద్దనుకున్నాం.. కారణం ఇదే: హరీశ్ శంకర్ -
నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు.. లూసిఫర్‌పై 'పృథ్వీరాజ్' తల్లి
'ఎల్ 2: ఎంపురాన్' (L2 Empuraan) వివాదంపై మోహన్‌లాల్ (Mohanlal) ఇప్పటికే స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం తరఫున క్షమాపణలు చెబుతూ ఆయన ఒక పోస్టు కూడా చేశారు. తాజాగా చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తల్లి మల్లిక కూడా ఈ గొడవపై రియాక్ట్ అయ్యారు. లూసిఫర్ సినిమా విషయంలో కేవలం తన కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కొందరు దూషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ చేశారు.లూసిఫర్2 సినిమా విషయంలో తన కుమారుడిని కించపరిచేలా తప్పుడు కథనాలు రావడాన్ని మల్లిక తప్పుబట్టారు. ఈ వివాదంపై మొదట తాను రియాక్ట్ కాకూడదని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు. కానీ, ఒక తల్లిగా తన కుమారుడి కోసం రియాక్ట్ కావాల్సి వస్తుందని ఆమె ఇలా అన్నారు. 'ఎల్ 2: ఎంపురాన్' తెర వెనుక జరుగుతున్న విషయాలన్ని నాకు తెలుసు. కానీ, నా కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కథనాలు క్రియేట్ చేస్తున్నారు. నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు. మోహన్‌లాల్, చిత్ర నిర్మాతలు ఎవరూ కూడా పృథ్వీరాజ్ మోసం చేసినట్లు చెప్పలేదు. మోహన్‌లాల్ నా సోదరుడితో సమానం. నా కుమారుడిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం కూడా ఆయనకు తెలియకుండానే కొందరు చేస్తున్నారు. చాలామంది కుట్రలు పన్ని నా కుమారుడిని బలిపశువును చేస్తున్నారు. నా కుమారుడు పృథ్వీరాజ్ ఎవరినీ మోసం చేయడని బలంగా చెబుతున్నాను. ఈ మూవీ వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చాయంటే అందులో భాగమైన వారందరికీ బాధ్యత ఉంటుందని తెలుసుకోవాలి. కేవలం ఒక్కరి మీద మాత్రమే నిందలు వేయకూడదు. సినిమా కథను అందరూ చదివే కదా అందరూ ఆమోదించారు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రచయిత కూడా ఎల్లప్పుడు పక్కనే ఉన్నారు. ఇబ్బంది ఉంటే ఆయనే మార్పులు చేసేవారు. సినిమా విడుదలయ్యాక కేవలం పృథ్వీరాజ్‌ను మాత్రమే తప్పుపడుతున్నారు. పూర్తి విషయాలు తెలుసుకోకుండా కొందరు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. మోహన్‌లాల్‌కు తెలియకుండా కొన్ని సీన్లు ఈ మూవీలో కలిపారంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. సినిమా పూర్తి అయిన తర్వాత అందరూ చూసిన తర్వాతే విడుదల చేశారు. అందరి ఆమోదంతోనే మీ వద్దకు మూవీ వచ్చిందని గ్రహించండి. నా కుమారుడు ఎప్పటికీ ఎవరి వ్యక్తిగత విశ్వాసాల జోలికి వెళ్లడు.' అని మల్లిక చెప్పుకొచ్చారు.2002 సమయంలో గుజరాత్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలోని కొన్ని సీన్లు ఈ సినిమాలో చూపించారని కొందరు తప్పపట్టారు. ఆ సమయంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు అత్యంత కీరాతకంగా హత్య చేసి ఫైనల్‌గా అతనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారని చూపించటం ఒక వర్గం వారికి నచ్చలేదు. దీంతో ఈ చిత్రంపై చాలా విమర్శలు వచ్చాయి. -
బాలకృష్ణ 'ఆదిత్య 369' రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పిల్లలు వద్దనుకున్నాం.. కారణం ఇదే: హరీశ్ శంకర్
టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్( Harish Shankar) పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. నేడు ఆయన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే, మీకు ఆయన కుటుంబ నేపథ్యంతో పాటు పిలల్లను ఎందుకు వద్దనుకున్నారో తెలుసా..? కరీంనగర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన సినిమాలపై మక్కువతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. నాన్న శ్యాంసుందర్ తెలుగు ఉపాధ్యాయుడు కావడంతో హరీశ్‌కు సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. కోన వెంకట్ సహకారంతో రవితేజ నటించిన వీడే సినిమాకు సహాయకుడుగా హరీశ్ జర్నీ మొదలైంది. ఆ తర్వాత రామ్‌గోపాల్ వర్మ అతనికి రవితేజ హీరోగా షాక్ సినిమాకు దర్శకత్వం వహించమని అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం వంటి హిట్ సినిమాలను ఇండస్ట్రీకి ఇచ్చాడు.దర్శకులు హరీశ్ శంకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబ విషయాలను పంచుకున్నారు. తన భార్య పేరు స్నిగ్ధ అని ఆమెకు పెద్దగా సినిమాలంటే ఇష్టం ఉండదని ఆయన చెప్పారు. చివరకు ఒక సినిమా కోసం పనిచేసినందుకు వచ్చిన రెమ్యునరేషన్ గురించి కూడా ఆమెకు తెలియదని ఆయన అన్నారు. ఈ క్రమంలో తమకు పిల్లలు ఎందుకు వద్దనుకున్నారో హరీశ్ ఇలా చెప్పారు. నా భార్య స్నిగ్ధతో చాలా స్పష్టతతో ఉంటాం. మాది మధ్యతరగతి కుటుంబం. బడ్జెట్ విషయంలో ప్రతిదానికి లెక్కలు వేసుకునే ముందుకు సాగుతాం. కుటుంబంలో నేనే పెద్దవాడిని కావడంతో బాధ్యతలు తీసుకోవాల్సిందే.. నా చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడంతో పాటు తమ్ముడిని సెటిల్ చేయడం నా ప్రధాన కర్తవ్యం. అమ్మానాన్నలకు కూడా మంచి ఇల్లు నిర్మించాలి. ఇలా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వీటిని పూర్తి చేసే పనిలో ఉన్న నాకు స్నిగ్ధ కూడా మద్దతుగా నిలవడం మరింత బలాన్ని ఇచ్చింది. ఇంతకుమించి జీవితంలో ఎలాంటి బాధ్యతలూ వద్దనుకున్నాం. ఇద్దరం మాట్లాడుకున్న తర్వాతే పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నాం. పిల్లలు పుట్టిన తర్వాత సెల్ఫీష్‌గా తయారవుతాం అనిపించింది. దీంతో వారి ప్రపంచం కుదించుకుపోతుంది అనేది నా అభిప్రాయం.' అని ఆయన అన్నారు.హరీశ్ శంకర్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్, కేవీఎన్, మైత్రీ మూవీ మేకర్స్ వంటి భారీ బ్యానర్స్‌లో ఆయన సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌తో ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయి. త్వరలో వారిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రారంభం కానుంది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. -
'ఆదిత్య 369' రీరిలీజ్.. 4కే డిజిటలైజేషన్ వెర్షన్లో ట్రైలర్
టాలీవుడ్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్లో 'ఆదిత్య 369' సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1991లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని దక్కించుకుంది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా 4కే డిజిటలైజేషన్ వెర్షన్లో ఏప్రిల్ 4న రీరిలీజ్ కానుంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలకృష్ణ ఈ మూవీలో శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్‌గా రెండు పాత్రల్లో మెప్పించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీరిలీజ్‌తో మరోసారి టైమ్‌మిషన్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండండి. ఆదిత్య 369 సినిమా సీక్వెల్‌కి కథ సిద్ధమైందని ఇప్పటికే బాలకృష్ణ ప్రకటించారు. -
ఆదిత్య 369 సీక్వెల్‌కి కథ సిద్ధమైంది: బాలకృష్ణ
‘‘ఆదిత్య 369’ సినిమా సీక్వెల్‌కి కథ సిద్ధమైంది. పార్టు 2 సబ్జెక్ట్‌ను ఒక రాత్రిలో ఫైనలైజ్ చేశాం. నేను, సింగీతంగారు మళ్లీ మాట్లాడుకోవాలి’’ అన్నారు బాలకృష్ణ. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన చిత్రం ‘ఆదిత్య 369’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 4న రీ రిలీజ్ కానుంది. 34 సంవత్సరాల తర్వాత 4 ఓ డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ‘ఆదిత్య 369’ సినిమా రీ–రిలీజ్ ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘ఆదిత్య 369’ ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. రీ రిలీజ్ తర్వాత ఇండియన్ ఫిల్మ్ కమ్యూనిటీ అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంది. ఈ సినిమాకు ముఖ్యమైన శ్రీకృష్ణ దేవరాయల పాత్రను నేను చేయడానికి కారకులైన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంగారికి రుణపడి ఉంటాను. ఈ సినిమా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగార్లకు హ్యాట్సాఫ్’’ అన్నారు.‘‘ఆదిత్య 369’ని నిర్మించు... కొన్ని దశాబ్దాలపాటు గుర్తుంటుందని ఎస్పీ బాలుగారు అన్నారు. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవుతోందంటే అది నా పూర్మజన్మ సుకృతం’’ అని తెలిపారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘నాడు రామారావుగారు వేసిన శ్రీ కృష్ణదేవరాయల పాత్రలో (‘మహామంత్రి తిమ్మరుసు’లో) అంతే అద్భుతంగా రాణించాలంటే బాలకృష్ణకు మాత్రమే సాధ్యమౌతుందని భావించి, ఆయన్ను సంప్రదించాను.బాలకృష్ణ ఓకే అనడం... ‘ఆదిత్య 369’ స్టార్ట్ కావడం... చకా చకా జరిగిపోయాయి. ఇంత పెద్ద సబ్జెక్ట్‌ను నమ్మి, నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్‌కి ఈ సినిమా క్రెడిట్లో సింహభాగం దక్కుతుంది’’ అని వీడియో బైట్ రిలీజ్ చేశారు సింగీతం శ్రీనివాసరావు. అతిథులుగా దర్శకులు బాబీ, అనిల్ రావిపూడి పాల్గొన్నారు. -
వారంలో తొలి షాట్
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఇటీవల పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా... సినిమా టైటిల్ ప్రకటించిన రోజునే ఈ సినిమాలోని రామ్‌చరణ్ లుక్‌ని విడుదల చేశారు. ఇక ఉగాది సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే... ఈ చిత్రానికి సంబంధించిన తొలి షాట్‌ను శ్రీరామ నవమి (ఏప్రిల్ 6)కి విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది.మల్టీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమేరా: ఆర్. రత్నవేలు. -
హ్యాపీ ఉగాది.. అమ్మ చేసిన పచ్చడిని ఆస్వాదించిన జగపతి బాబు
టాలీవుడ్ నటుడు జగపతిబాబు తనదైన పాత్రలతో టాలీవుడ్లో దూసుకెళ్తున్నారు. గతేడాది పుష్ప-2లో మెప్పించిన జగపతి.. ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. వీటితో పాటు గాటి, జాట్ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు జగ్గు భాయ్.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పటికీ టచ్‌లోనే ఉంటారు. సరదా పోస్టులతో అలరిస్తుంటారు. ఇటీవల ఆమనితో కలిసి ఓ మూవీ సెట్లో సరదాగా తన సినిమా శుభలగ్నం సీన్‌ను అందరికీ గుర్తు చేశారు. మళ్లీ అమ్మేయడానికి మేకప్ వేస్తున్నావా? అంటూ ఆటపట్టించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.తాజాగా ఇవాళ ఉగాది సందర్భంగా తన మాతృమూర్తితో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. అమ్మ చేతులతో చేసిన ఉగాది పచ్చడిని ఆస్వాదించారు. అమ్మతో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు జగపతి బాబుకు ఉగాది శుభాకాంక్షలు చెబుతున్నారు.Manchivallandharikey ughaadhi subhakhankshalu… pic.twitter.com/Tc0Vq48YfT— Jaggu Bhai (@IamJagguBhai) March 30, 2025 -
మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటున్న నటి ‘అనన్య నాగళ్ల’ (ఫొటోలు)
-
కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా: కోర్ట్ టీమ్‌పై మెగాస్టార్ ప్రశంసలు
చిన్న సినిమా అయినా సరే కంటెంట్ కింగ్ అనే విషయం మరోసారి రుజువైంది. ఆ మాటను ఇటీవల విడుదలైన కోర్ట్ మూవీ మరోసారి స్పష్టం చేసింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరెకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ఊహించిన దానికంటే అధికంగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా ఈ మూవీపై పలువురు టాలీవుడ్ అగ్ర సినీతారలు ప్రశంసలు కురిపించారు.తాజాగా ఈ మూవీ టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. కోర్ట్ మూవీ టీమ్‌ను తన ఇంటికి ఆహ్వానించిన చిరు.. సినిమా తెరకెక్కించిన తీరుపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో ప్రియదర్శి ఉండడంతో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని భావించానని అన్నారు. కానీ ఈ కథను చాలా స్ట్రైట్‌గా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారని మెగాస్టార్ కొనియాడారు. ఈ సినిమాలో శివాజీ చాలా క్రూయల్‌గా నటించారని.. రోషన్, శ్రీదేవి అద్భుతంగా చేశారని చిరంజీవి ప్రశంసించారు. ఈ సందర్భంగా చిరంజీవితో ప్రియదర్శి కాసేపు సినిమా కాన్సెప్ట్ గురించి వివరించారు. ఠాగూరు మూవీ తర్వాత అంతలా చర్చించుకున్న సినిమా ఇదేనని ప్రియదర్శి అన్నారు. కాగా.. ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. ఈ -
ఉగాది స్పెషల్ లుక్‌లో మహేశ్‌బాబు గారాలపట్టి సితార (ఫోటోలు)
-
Ugadi Special: క్యూట్ కపుల్.. క్యూటెస్ట్ ఇంటర్వ్యూ
-
సూపర్ హీరో గా రవి తేజ
-
బుల్లితెర సెలబ్రిటీల ఉగాది... సోనియా అలా.. శోభా శెట్టి ఇలా..!
పండగ వచ్చిందంటే ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. పిండివంటలు, కొత్త బట్టలు.. ఇలా ఆరోజంతా సందడిగా ఉంటుంది. ముఖ్యంగా ఉగాది అనగానే సాంప్రదాయ దుస్తులే ధరిస్తుంటారు. బుల్లితెర సెలబ్రిటీలు కూడా అంతే! వారు ట్రెడిషనల్ ముస్తాబైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సోనియా ఆకుల, శోభా శెట్టి, ప్రియాంక జైన్, యష్మి గౌడ సహా పలువురు బిగ్‌బాస్ తారలు ఎలా రెడీ అయ్యారో కింద మీరూ చూసేయండి.. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Shobha Shetty (@shobhashettyofficial) View this post on Instagram A post shared by Nainika Anasuru🦋 (@_.nainikadances) View this post on Instagram A post shared by Y A S H M I G O W D A (@yashmigowda) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) -
20 ఏళ్ల కిందట విడాకులు.. అమ్మ మాటలకు డిప్రెషన్లో..: ఎస్పీ చరణ్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) తనయుడు చరణ్ సింగర్ మాత్రమే కాదు నిర్మాత, నటుడు కూడా! ఈయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లైఫ్: లవ్ యువర్ ఫాదర్. తండ్రిపై ప్రేమతో చరణ్ తన పేరును SPB చరణ్ (SPB Charan)గా మార్చుకున్నాడు. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. చరణ్ మాట్లాడుతూ.. నా జీవితంలో గెలుపు, ఓటమి.. రెండూ చూశాను. ఉదాహరణకు 2000వ సంవత్సరంలో అనుకుంటాను.. రూ.75 లక్షలు పెట్టి తొలిసారి ఓ సినిమా నిర్మిస్తే అంతా కోల్పోయాను.20 ఏళ్ల కిందటే విడాకులునా కుటుంబ విషయానికి వస్తే.. నేను అమెరికాలో ఓ అమ్మాయిని ప్రేమించాను. తనను ఇంట్లో పరిచయం చేశాను. అందరి ఆశీర్వాదంతో మేము పెళ్లి చేసుకున్నాం. మాకు జాహ్నవి, మయూక అని కవలపిల్లలు సంతానం. న్యూయార్క్‌లో చదువుకుంటున్నారు. తల్లితో కలిసి అక్కడే ఉంటున్నారు. నాకు, నా భార్యకు 2005లో విడాకులయ్యాయి. ప్రతి ఏడాది న్యూయార్క్ వెళ్లి కనీసం పది రోజులైనా పిల్లలతో కాలక్షేపం చేస్తుంటాను.డిప్రెషన్లోకి వెళ్లిపోయా..అయితే నా పెళ్లయిన కొత్తలో ఎక్కువగా ఖాళీగా ఉన్నాను. నేను కెరీర్లో స్లో అయ్యేసరికి అమ్మ తిట్టడం మొదలుపెట్టింది. ఈ వయసులో నాన్నను పనికి పంపించి నువ్వు దున్నపోతులా పడుకుంటున్నావేంట్రా అని విసుక్కునేది. ఆ మాటలు నా మనసుకు తగిలాయి. నా అంతట నేను ఏం చేయలేకపోతున్నానని డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. సరిగ్గా ఆ సమయంలో దర్శకుడు కె. బాలచందర్ ఆఫీస్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. అలా సీరియల్ ఆడిషన్‌కు వెళ్లి అందులో యాక్ట్ చేశాను. అక్కడైన పరిచయాలతో నిర్మాతగా మారిపోయాను.హీరో అజిత్, నేను క్లోజ్..నిజానికి నేను చదువుకునే రోజుల్లోనే హీరోగా ఛాన్స్ వచ్చింది. అదెలాగంటే.. అజిత్, నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఐదారేళ్లపాటు కలిసి చదువుకున్నాం. తర్వాత నేను ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాను. సరిగ్గా అప్పుడే డైరెక్టర్ వాసంత్ ఆశై సినిమా కోసం మా నాన్నను సంప్రదించాడు. నా చదువు పాడు చేయడం ఇష్టం లేక నాన్న నా స్నేహితుడు అజిత్ పేరు సూచించాడు. అలా ఆశై అజిత్ చేయడం.. అది బ్లాక్‌బస్టర్ అవడం నాకు సంతోషంగా అనిపించింది. మేము కనిపిస్తే మాట్లాడుకుంటాం తప్ప పెద్దగా టచ్‌లో లేము అని ఎస్పీ చరణ్ చెప్పుకొచ్చాడు.సినిమా పాటలుఎస్పీ చరణ్.. ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా.., చెప్పవే ప్రేమా.., నేను నేనుగా లేనే.., ఒక తోటలో ఒక కొమ్మలో.., తెలుగు భాష గొప్పదనం, మెల్లగా కరగనీ.., అవునన్నా ప్రేమే కాదన్నా ప్రేమే.., చాలు చాలు చాలు.., ఉయ్యాలో ఉయ్యాల.. ఇలా ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించాడు.చదవండి: గంట లేటైందని సెట్లో కమల్ హాసన్ తిట్టాడు: సీనియర్ హీరోయిన్ -
రాజమౌళి - మహేష్ బాటలో బడా హీరో కొత్త సినిమా
-
#MEGA157 చిరంజీవి,అనిల్ రావిపూడి కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
చిరంజీవిని కలిసిన 'కోర్ట్' మూవీ టీమ్ (ఫొటోలు)
-
'సికందర్' ట్విటర్ రివ్యూ.. ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడం బెటర్ అంటూ..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) , రష్మికా మందన్నా(Rashmika ) జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సికందర్' సినిమా థియేటర్స్‌లోకి వచ్చేసింది. రంజాన్ కానుకగా మార్చి 30న విడుదలైన ఈ చిత్రాన్ని సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. రజనీకాంత్ దర్బార్ (2020) సినిమా తర్వాత ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన చిత్రం కావడంతో సికిందర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు నటించారు. ఇప్పటికే పలుచోట్ల సినిమా చూసిన నెటిజన్లు సికిందర్‌పై తమ ఎక్స్ పేజీలలో ఇలా చెప్పుకుంటున్నారు.సికిందర్ అందరికి షాక్ ఇచ్చాడు అంటూ నెటిజన్లు పంచులు వేస్తున్నారు. సినిమా ఏమాత్రం అంచనాలకు కనీసం దగ్గర్లో కూడా లేదని చెబుతున్నారు. అవుట్ డేటెడ్ కథను ఎన్నిసార్లు మాకు చూపుతారంటూ చెబుతున్నారు. ఇందులో ఒక సాంగ్ మినహా సంగీతం చాలా దారుణంగా ఉందని చెబుతున్నారు. సినిమా చూసి ఎంజాయ్ చేయాడానికి అందులో ఏమీ లేదని చెబుతున్నారు. సల్మాన్ , AR మురుగదాస్ కాంబోకి సికిందర్ సినిమా అతిపెద్ద డిజాస్టర్ అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయం తెలుపుతున్నారు.సల్మాన్ ఖాన్ ఎంట్రీ సీన్ చాలా హైప్లో ఉంటుందని అభిమానులు సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సల్మాన్ నటించిన గత సినిమాలకు సికందర్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది అందుకే ప్రేక్షకులకు నచ్చలేదని అభిమానులు తెలుపుతున్నారు. ఇందులో యాక్షన్, ఎమోషన్స్, పాటలు అన్నీ కూడా చాలా బాగున్నాయంటున్నారు. కానీ, సాధారణ ప్రేక్షకుల మాత్రం ఇదేం సినిమా అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి కథ పట్టుకుని సల్మాన్‌ను మురగదాస్ ఎలా ఒప్పించాడు అంటూ సెటైర్స్ వేస్తున్నారు. సినిమాపై డివైడ్ టాక్ భారీగా వస్తున్నా సల్లూ భాయ్ ఫ్యాన్స్ మాత్రం సికిందర్‌ను బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్లు పెడుతున్నారు.పైసా వసూల్ బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు చెబుతున్నప్పటికీ కామన్ ఆడియెన్స్ నుంచి మాత్రం చెత్త సినిమా అంటూ రివ్యూలు ఇస్తున్నారు. మురుగదాస్ ఇకనైన సినిమాల నుంచి రిటైర్ అయిపోవడం మంచిదని తెలుపుతున్నారు. కాజల్ అగర్వాల్ పాత్రపై కూడా విమర్శలు వస్తున్నాయి. విలన్‌గా సత్యరాజ్ కూడా సెట్ కాలేదని తెలుపుతున్నారు. సల్మాన్ కనిపిస్తే చాలు బీజీఎమ్‌తో సంతోష్ నారయణ బాగా ఇబ్బంది పెట్టాడని ఒకరు కామెంట్ చేశారు. ఫస్టాఫ్ ఏదో కాస్త ఓకే అనుకుంటే సెంకండాఫ్లో స్టోరీ మరింత ఇబ్బంది పెడుతుందని అంటున్నారు. ఫైనల్‌గా సల్మాన్‌కు సికిందర్ బిగ్ డిజాస్టర్‌గా మిగిలిపోతుందని ఎక్కువమంది ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. #Sikandar is a dull action drama with a lifeless story that fails to engage. The background music is very bad, and except for a few decent action scenes, there’s nothing to enjoy. Biggest disaster for Salman and AR Murugadoss combo.— LetsCinema (@letscinema) March 29, 2025#Sikandar Public reviews are coming out and it’s disappointing .. Another mess by salman khan on eid 😢#SikandarReview pic.twitter.com/JPZkestxMs— Cheemrag (@itxcheemrag) March 30, 2025Crowd goes crazy on Megastar #SalmanKhan entry scene in #Sikandar movie.Theatre Turn Into Stadium 🔥🔥🔥 @BeingSalmanKhan #SalmanKhan #SikandarReview #Sikandar pic.twitter.com/ytTrI7CQaO— Filmy_Duniya (@FMovie82325) March 30, 2025@ARMurugadoss pls get retire.#Sikandar #SalmanKhan We appreciate your contributions to the film industry with your successful movies. However, we kindly request that you refrain from directing any further films.. Heart-full Request.— Daino (@ursrokk) March 30, 2025The audience is showering love on #Sikandar. Another blockbuster loading for @iamRashmika and @BeingSalmanKhan. 🔥🔥#RashmikaMandanna ❤️#SalmanKhan #Sikandar 🔥 pic.twitter.com/xywPwUnhFA— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) March 30, 2025Sikandar Review ⭐️⭐️⭐️⭐️⭐Blockbuster, Blockbuster, Blockbuster......Just Saw sikandar- #Sikandar is the best #SalmanKhan film after Bajrangi Bhaijaan, Yes even better than Sultan and TZH.Even I cry after Watching it, Too emotional and Action packedMany goosebump moments. pic.twitter.com/QPqlNohEGG— taran adarsh (@taran_adarsh76) March 29, 2025 -
కోటు తొలగిస్తూ 'జాన్వీ కపూర్' ర్యాంప్ వాక్.. వీడియో వైరల్
లాక్మే ఫ్యాషన్ వీక్ 2025లో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన గ్లామర్ వాక్‌తో హీట్ పెంచింది. ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రాకు నటి జాన్వీ షోస్టాపర్‌గా నిలిచింది. ఆయన డిజైన్ చేసిన దుస్తులను ఎందరో మోడల్స్ ధరించి పలు స్టేజీలపైనా ర్యాంప్ వాక్ చేశారు. ఇప్పుడు తొలిసారి జాన్వీ కూడా రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించి లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఆకట్టుకుంది.జాన్వీ కపూర్ నల్లటి దుస్తుల్లో ర్యాంప్‌పై నడిచింది. పొడవాటి నల్లటి కోటు కింద అద్భుతమైన బంధానీ బాడీకాన్ డ్రెస్‌లో స్టేజీపై ఆమె అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఆమె హీల్స్ కూడా ఎంచుకుంది. స్టేజీపై మధ్యలోనే జాన్వీ తన కోటు తీసేసి పోజులిచ్చింది. కొంతదూరం అలా తన ర్యాంప్ వాక్‌ను కొనసాగించింది. డ్రెస్ డిజైనర్ బ్రాండ్ (AFEW Rahul Mishra) కోసం జాన్వీ భాగమైంది. భవిష్యత్‌లో మరిన్ని కొత్త డిజైన్ డ్రెస్‌లతో ఆమె ఫోజులు ఇవ్వనుంది.ఆమె ఆకర్షణీయమైన దుస్తులు, డైనమిక్ స్టైల్‌తో పాటు అక్కడ వినిపించే సంగీతం అన్నీ ఒకదానికొకటి ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి. జాన్వీ ర్యాంప్ వాక్‌పై చాలా వరకు ప్రశంసలే వచ్చాయి. కానీ, కొందరు మాత్రం ఆమెను తప్పుపట్టారు. వేదికపై నిజమైన మోడల్స్ ఎక్కడ ఉన్నారంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి వేదికలపై సెలబ్రిటీలకు ఇలా ప్రాధాన్యత ఇవ్వడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని చెబుతున్నారు. ఇలా అయితే కొత్త మోడల్స్ ఎలా పరిచయం అవుతారని నిర్వాహకులను తప్పపట్టారు. View this post on Instagram A post shared by Voompla (@voompla) View this post on Instagram A post shared by Voompla (@voompla) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Bollywood Chronicle (@bollywoodchronicle) -
పిల్లలు పుట్టిన తర్వాత 'రీ ఎంట్రీ' ఇస్తానంటే ఇలాంటి మాటలన్నారు: జెనీలియా
జెనీలియా( Genelia)... పరిచయం అక్కర్లేని పేరు. ‘అంతేనా... వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కప్పు కాఫీ’ అంటూ ‘బొమ్మరిల్లు’ సినిమాలో ఆమె చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్సే. సుమంత్ హీరోగా రూపొందిన ‘సత్యం’ (2003) సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ ‘సాంబ, సై, సుభాష్ చంద్రబోస్, హ్యాపీ, ఆరెంజ్, రెడీ, బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సొంతం చేసుకున్నారు. ‘నా ఇష్టం’ (2012) తర్వాత ఆమె మరో తెలుగు చిత్రంలో నటించలేదు. బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ముఖ్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టాక సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పెళ్లి, పిల్లల కారణంగా దాదాపు పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారామె.ఆ తర్వాత కమ్ బ్యాక్ అవుదామనుకుంటే తెలిసినవారెవరూ ప్రోత్సహించలేదనీ, పైగా నిరాశపరిచారనీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు జెనీలియా. ‘‘పిల్లలు పుట్టిన తర్వాత యాక్టింగ్‌కు దూరం అయ్యాను. కమ్ బ్యాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు తెలిసినవాళ్లెవరూ ప్రోత్సహించలేదు. ‘పదేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి వస్తున్నావా? ఇది ఏమాత్రం వర్కౌట్ కాదు’ అంటూ నిరాశపరిచారు. కానీ వారి మాటలు వినకుండా ధైర్యంగా రీ ఎంట్రీ ఇచ్చాను. నా భర్త రితేశ్ దేశ్ముఖ్తో కలిసి నేను నటించిన ‘వేద్’ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో అన్ని విషయాల్లో ఇతరులను నమ్మకూడదని నాకు అనిపించింది’’ అని తెలిపారు జెనీలియా. ప్రస్తుతం ఆమె ‘సితారె జమీన్ పర్, జూనియర్’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. -
పాటకి వేళాయె
కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా, విజయశాంతి కీలకపాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్ ని ఆరంభించనున్నారు మేకర్స్.అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘నాయాల్ది...’ అంటూ సాగే తొలిపాటని ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కల్యాణ్ రామ్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ‘‘యాక్షన్ ΄ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ఇది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ని త్వరలో ప్రకటిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. శ్రీకాంత్, పృథ్వీరాజ్, సోహైల్ ఖాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: రామ్ ప్రసాద్. -
ఇదిదా సర్ప్రైజ్.. విలన్స్‌గా స్టార్ హీరోలు
కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేసి, ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్న హీరోలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కానీ హీరోగా సక్సెస్ అయిన తర్వాత కూడా విలన్ రోల్స్‌ను ప్రయత్నిస్తున్నారు కొందరు హీరోలు. ‘ఇదిదా సర్ప్రైజ్’ అంటూ ఇలా తమ నెగటివ్ షేడ్స్ ట్యాలెంట్‌తో ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసిన, సర్ప్రైజ్ చేయనున్న కొందరు హీరోల గురించి ఓ లుక్ వేద్దాం.కూలీకి విలన్?సిల్వర్ స్క్రీన్‌పై నాగార్జున నెగటివ్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ఆడియన్స్‌లో తప్పక ఉంటుంది. పూర్తి స్థాయి గ్రే షేడ్స్ క్యారెక్టర్లో నాగార్జునను స్క్రీన్‌పై చూడాలని కొందరు ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఆ తరుణం ఆసన్నమైందని, రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో నాగార్జున నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారనే టాక్ కోలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చింది. ‘కూలీ’ సినిమా చిత్రీకరణప్రారంభమైనప్పుడు నాగార్జున ఓ వ్యక్తిని క్రూరంగా కత్తితో చంపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్‌లో ఉంటుందనే వార్తలకు ఈ వీడియో రూపంలో బలం చేకూరినట్లయింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. శ్రుతీహాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ ఇతర కీలకపాత్రల్లో నటించారు. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ‘కూలీ’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది.బ్రహ్మ రాక్షస హీరోగా ప్రభాస్ కటౌట్‌కి ఉన్న బాక్సాఫీస్ స్టామినా ఏంటో ఆడియన్స్ చూశారు. మరి... ప్రభాస్‌లాంటి కటౌట్ ఉన్న హీరో క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటే ఎలా ఉంటుందో ‘బిల్లా’ సినిమాలో శాంపిల్‌గా ఆడియన్స్ చూశారు. కానీ ఈ డోస్‌ను ఇంకాస్త పెంచి ‘బ్రహ్మ రాక్షస’ సినిమాతో ఆడియన్స్‌ని తన నెగటివ్ షేడ్ యాక్టింగ్ స్కిల్‌తో సర్ప్రైజ్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట. ప్రభాస్ మెయిన్ లీడ్ రోల్లో ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘బ్రహ్మ రాక్షస’ అనే మూవీ రానుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీ చేస్తారు. ఈ ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే... ప్రశాంత్ వర్మతో ‘బ్రహ్మ రాక్షస’ సినిమాను టేకాఫ్ చేస్తారు ప్రభాస్. ఈ లోపు రిషబ్ శెట్టితో ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ను పూర్తి చేస్తారు ప్రశాంత్ వర్మ. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభాస్–ప్రశాంత్ వర్మ కాంబోలోని మూవీ 2026 చివర్లో లేదా 2027ప్రారంభంలో మొదలు కానున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ ‘బ్రహ్మ రాక్షస’ సినిమాను తొలుత రణ్వీర్ సింగ్‌తో చేయాలనుకున్నారు ప్రశాంత్ వర్మ. కానీ కొన్ని కారణాల వల్ల రణ్వీర్ సింగ్ ఈప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.బాలీవుడ్ వార్ ‘టెంపర్, జై లవకుశ’ వంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌లో ఎన్టీఆర్ స్క్రీన్‌పై ఎంత రెచ్చిపోయారో ఆడియన్స్ చూశారు. కాగా ఎన్టీఆర్లోని నెగటివ్ షేడ్ యాంగిల్ ఈసారి నార్త్ ఆడియన్స్‌కు కూడా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుందని తెలిసింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో హిందీలో ‘వార్ 2’ అనే మూవీ రానుంది. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని బాలీవుడ్ సమాచారం. ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్ వీరేంద్ర నాథ్పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారని, ఆయన క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాక్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆగస్టు 14న ‘వార్ 2’ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.తొలిసారిగా విలన్‌గా... సిల్వర్ స్క్రీన్‌పై బ్లాక్ బస్టర్ హీరోస్లో అల్లు అర్జున్ ఒకరు. కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఆర్య 2’ చిత్రంలో ఆయన క్యారెక్టర్లో కాస్త గ్రే షేడ్స్ ఉంటాయి. ఆ తర్వాత ‘పుష్ప’ వంటి ఎగ్రెసివ్ ఎనర్జీ ఉన్న క్యారెక్టర్స్ చేశారు కానీ, పూర్తి స్థాయి గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను అల్లు అర్జున్ చేయలేదు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ రానుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఈ రెండు రోల్స్‌లో ఓ రోల్లో నెగటివ్ షేడ్స్ ఉంటుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనుందట. ఈ వేసవిలో చిత్రీకరణనుప్రారంభించి, 2026 చివర్లో ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. ఈ చిత్రంపై పూర్తి స్థాయి సమాచారం అందాల్సి ఉంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.బ్లాక్ స్వార్డ్ హీరోగా తెలుగు స్క్రీన్‌పై సక్సెస్ అయ్యారు మంచు మనోజ్. ఇప్పుడు విలన్‌గా కనిపించనున్నారు. ‘హను–మాన్’ ఫేమ్ తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ ఈ మైథలాజికల్ అండ్ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్‌ను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సూపర్ యోధపాత్రలో తేజ సజ్జా నటిస్తుండగా, బ్లాక్ స్వార్డ్పాత్రలో మంచు మనోజ్ విలన్‌గా కనిపిస్తారు. ఇక ‘మిరాయ్’ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ హీరోలే కాదు... ఇంకొందరు స్టార్స్ కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌కి సై అన్నారు. – ముసిమి శివాంజనేయులుకోలీవుడ్ హీరోలు కూడా వీలైనప్పుడు విలన్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో మెయిన్ విలన్‌గా కమల్‌హాసన్ నటించారు. కమల్‌హాసన్ హీరోగా చేసిన ‘విక్రమ్’ మూవీ క్లైమాక్స్‌లో రోలెక్స్‌గా విలన్‌పాత్రలో కనిపించారు సూర్య. ఇక సూర్య హీరోగా చేసిన ‘కంగువ’ మూవీలో కార్తీ విలన్‌గా కనిపించారు. కార్తీ హీరోగా చేసిన ‘ఖైదీ’ సినిమాలో తమిళ యువ నటుడు అర్జున్ దాస్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించారు. కమల్‌హాసన్ ‘విక్రమ్’, కార్తీ ‘ఖైదీ’ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నేతృత్వంలోని ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంలోనివే. సో... ‘ఖైదీ 2’ చిత్రంలో సూర్య విలన్‌గా నటించే చాన్సెస్ ఉన్నాయి.⇒ ఇంకా శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ సినిమా కోసం తొలిసారిగా విలన్‌గా స్క్రీన్‌పై కనిపించనున్నారు రవి మోహన్ (ఇటీవల ‘జయం’ రవి తన పేరును రవి మోహన్‌గా మార్చుకున్నారు). సుధ కొంగర దర్శకత్వంలోని ఈ మూవీ వచ్చే ఏడాదిప్రారంభంలో రిలీజ్ కానుందని తెలిసింది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’లో అరుణ్ విజయ్ విలన్‌గా చేస్తున్నారన్న వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఇంకా వీలైనప్పుడల్లా విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, మాధవన్ వంటి యాక్టర్స్ కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు. ఇలా ఇంకొంతమంది ఉన్నారు.⇒ బాలీవుడ్ హీరోలు కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు. షారుక్ ఖాన్ హీరోగా చేయ నున్న నెక్ట్స్ మూవీ ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో అభిషేక్ బచ్చన్ తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా చేస్తున్న ‘రామాయణ’ సినిమాలో ‘కేజీఎఫ్’ హీరో యశ్ రావణుడిపాత్ర చేస్తున్నారు. గత ఏడాది విడుదలైన అజయ్ దేవగన్ ‘సింగమ్ ఎగైన్’లో అర్జున్ కపూర్ విలన్‌గా చేశారు. ఇంకా బాలీవుడ్లో హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్న సంజయ్ దత్, బాబీ డియోల్ (హరిహర వీరమల్లు), ఇమ్రాన్ హష్మి (ఓజీ, జీ 2), జిమ్ సర్ఫ్ (కుబేర), సోహైల్ ఖాన్ (అర్జున్ సన్నాఫ్ వైజయంతి), దివ్యేందు (పెద్ది) వంటి వారు తెలుగు సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తున్నారు. ఇలా ఇంకొందరు ఉన్నారు.⇒ కథ నచ్చితే నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసేందుకు హీరోయిన్స్ సైతం వెనకాడటం లేదు. ఈ విషయంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ముందుంటారు. హీరోయిన్గా చేస్తూనే ఎక్కువగా విలన్ రోల్స్ చేస్తుంటారామె. ఇక వెంకటేశ్ ‘సైంధవ్’లో ఆండ్రియా, విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ‘వెన్నెల’ కిశోర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’లో అనన్య నాగళ్ల, అజిత్ ‘విడాముయర్చి’ లో రెజీనా, రణ్‌బీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’లో మౌనీ రాయ్, ‘పొన్నియిన్ సెల్వన్’లో ఐశ్వర్యా రాయ్ వంటి వారు కెరీర్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న సమయంలోనే నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. ఇలా మరికొంతమంది ఉన్నారు. -
టీనేజ్ లవ్ స్టోరీ మధురం.. రిలీజ్ ఎప్పుడంటే?
యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా నటించిన చిత్రం మధురం. రాజేష్ చికిలే డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ పతాకంపై యం.బంగార్రాజు నిర్మించాడు. ఎ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్ లైన్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ.. 'మధురం.. ఇట్స్ ఎ క్లీన్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఈ సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అవుతుంది" అని అన్నారు.చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ.. '1990 నేపథ్యంలో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టినట్లు చూపించాం. సినిమా చూశాక అప్పటి వాళ్ళ స్కూల్ డేస్.. కాలేజ్ డేస్ గుర్తుకు తెచ్చేలా ఈ మూవీ ఉంటుంది" అని చెప్పారు. హీరోయిన్ వైష్ణవి సింగ్ మాట్లాడుతూ.."ఇదొక యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఇందులో నా క్యారెక్టర్ అందరిని అలరిస్తుంది. ఉదయ్ రాజ్ చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ లో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్" అని చెప్పారు. -
డొక్కా సీతమ్మగా ఆమని.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ (Andhrula Annapurna Dokka Seethamma). టి.వి. రవి నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఉషారాణి మూవీస్ బ్యానర్‌పై వల్లూరి రాంబాబు నిర్మించారు. రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరామెన్‌గా పని చేశారు. కార్తిక్ కోడకండ్ల సంగీతం అందించారు. ఎం.రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి అంబికా కృష్ణ, రేలంగి నరసింహారావు వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం..400 ఎంకరాలు అమ్మేసి..అంబికా కృష్ణ మాట్లాడుతూ.. ‘డొక్కా సీతమ్మ లాంటి మహనీయులైన కథతో సినిమా తీస్తుండటం గొప్ప విషయం. ఇలాంటి వారి గురించి జనాలకు తెలియాలి. నాలుగు వందల ఎకరాలు అమ్మేసి అందరికీ అన్నం పెట్టిన మహనీయురాలు. ఆమని గారు చేస్తున్న ఈ పాత్రతో ఆమె మీద అందరికీ గౌరవం పెరుగుతుంది’ అని అన్నారు. దర్శకుడు టి.వి. రవి నారాయణ్ మాట్లాడుతూ.. ‘అందరిలాగే చిరంజీవి గారిని చూసి అభిమానిగా మారి 2012లో ఇండస్ట్రీకి వచ్చాను. నా అదృష్టం: దర్శకుడుమొదటి సినిమానే డొక్కా సీతమ్మ లాంటి మహనీయురాలైన కథతో చేస్తుండటం నా అదృష్టం. నా మొదటి చిత్రానికి సుచిత్రమ్మతో ఓ పాట చేయించాలని అనుకున్నాను. చంద్రబోస్ గారు ఇచ్చిన మాట సాయంతోనే ఈ సినిమా స్థాయి పెరిగింది. ఆమని గారు అద్భుతంగా నటించారు. మురళీ మోహన్ గారు అందించిన సహకారాన్ని మర్చిపోలేను. ఆర్ట్ డైరెక్టర్ రవన్న అద్భుతంగా సెట్స్ వేశారు. త్వరలోనే ట్రైలర్‌తో వస్తాం’ అని అన్నారు.ఆమనికి జాతీయ అవార్డు రావాలిమురళీ మోహన్ మాట్లాడుతూ .. ‘అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. వచ్చిన ప్రతీ ఒక్కరికీ కడుపునిండా అన్నం పెట్టి పంపేవారు. ఇలాంటి గొప్ప వారి గురించి ప్రస్తుత తరానికి తెలియాలి. ఆమని చాలా మంచి ఆర్టిస్ట్. అలాంటి గొప్ప ఆర్టిస్ట్‌కు డొక్కా సీతమ్మ పాత్ర వచ్చింది. ఆమని గారికి ఈ సినిమాతో జాతీయ అవార్డు రావాలి’ అని అన్నారు. ఆమని మాట్లాడుతూ .. ‘దర్శకుడు వచ్చి డొక్కా సీతమ్మ గారి కథ చెప్పారు. నేను బెంగళూర్‌కు చెందిన వ్యక్తిని. నాకు ఆమె గురించి ఎక్కువగా తెలీదు. రాసిపెట్టి ఉండాలి: ఆమనిదర్శకుడు కథ చెప్పిన తరువాత గూగుల్‌లో ఆమె గురించి సర్చ్ చేశాను. ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి అన్నది నాకర్థమైంది. ఇలాంటి పాత్ర చేయాలంటే రాసి పెట్టి ఉండాలి. ఈ పాత్ర దొరకడం నా అదృష్టం’ అని అన్నారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ .. ‘డొక్కా సీతమ్మ లాంటి మహనీయుల కథను సినిమాగా అనుకోవడమే పెద్ద సాహసం. డొక్కా సీతమ్మ అంటే బ్రిటీష్ వారికి కూడా తెలుసు. లండన్ రాజు గారి ఆహ్వానాన్ని కూడా తిరస్కరించి ఇక్కడే ఉండి అందరికీ సేవ చేశారు. ఇలాంటి చిత్రంలో డొక్కా జోగన్న పాత్రను మురళీ మోహన్ గారు, డొక్కా సీతమ్మగా ఆమని గారు నటిస్తుండటం వారి అదృష్టం’ అన్నారు.చదవండి: నీ అభిమానం తగలెయ్య.. ఏకంగా రూ.1.72 లక్షల విలువైన టికెట్ల పంపిణీ -
ఒకేసారి మూడు సినిమాలు.. పొలిమేర బ్యూటీ ఫుల్ బిజీ (ఫోటోలు)
-
చరణ్ బర్త్‌డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ
టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ (Ram Charan) మార్చి 27న 40వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈసారి బర్త్‌డేను మెగా ఫ్యామిలీ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీతో పాటు దగ్గరి ఫ్రెండ్స్ సమక్షంలో చరణ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలను చరణ్ భార్య ఉపాసన (Upasana Konidela) సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఎంతో ప్రత్యేకం: ఉపాసనమార్చి 27.. ఎప్పటికీ గ్రేట్‌ఫుల్‌గా ఉంటాను. ఈ రోజును ఇంత ప్రత్యేకంగా మలిచిన అందరికీ కృతజ్ఞతలు అని రాసుకొచ్చింది. మొదటి ఫోటోలో చిరంజీవి- సురేఖ, రామ్ చరణ్ -ఉపాసనతో పాటు సుష్మిత కొణిదెల ఉంది. తర్వాతి ఫోటోల్లో చరణ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఫోటోలో అయితే చిరంజీవి క్లోజ్ ఫ్రెండ్ కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) ఉన్నాడు. ఈ వేడుకల్లో అల్లు ఫ్యామిలీ మాత్రం కనిపించలేదు.పార్టీలో కనిపించని 'అల్లు' కుటుంబంచరణ్ బర్త్‌డేరోజు మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం చరణ్ కోసం సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టు పెట్టలేదు. ఇప్పుడు బర్త్‌డే పార్టీలో కూడా అల్లు ఫ్యామిలీ లేకపోవడంతో ఈ రెండు కుటుంబాల మధ్య వైరం అలాగే కొనసాగుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.చరణ్ సినిమాలురామ్చరణ్ చివరగా గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించాడు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయిక. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే రంగస్థలం తర్వాత చరణ్- సుకుమార్ కాంబినేషన్లో ఇది రెండో సినిమాగా తెరకెక్కనుందన్నమాట! రంగస్థలం, పుష్ప వంటి బ్లాక్బస్టర్లు అందించిన సుకుమార్ ఈసారి అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో చరణ్‌ను చూపించే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: 'స్నేహ.. కొంచెమైనా బుద్ధుందా? చెప్పులేసుకుని గిరిప్రదక్షిణా?' -
నన్ను క్షమించండి.. తప్పట్లేదు: మంచు విష్ణు
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా (Kannappa Movie) మరోసారి వాయిదా పడింది. వీఎఫ్ఎక్స్ కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోందని విష్ణు సోషల్ మీడియాలో వెల్లడించాడు. చెప్పిన సమయానికి రావడం లేదని, అందుకు మన్నించాలని కోరాడు. 'అత్యున్నత విలువలతో కన్నప్ప సినిమాను మీ ముందుకు తీసుకురావాలని మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్..అయితే కొన్ని కీలక సన్నివేశాలకు ఇంకా వీఎఫ్ఎక్స్ చేయాల్సి ఉంది. దీనికి మరికొంత సమయం పడుతుంది. ఫలితంగా సినిమా రిలీజ్ కాస్త ఆలస్యం అవుతుంది. మీరందరూ పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము. శివ భక్తుడైన కన్నప్ప సినిమా చరిత్రను మీ ముందుకు తీసుకురావడానికి చిత్రయూనిట్ విశేషంగా కృషి చేస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని ఓ నోట్ షేర్ చేశాడు.సినిమాకన్నప్ప విషయానికి వస్తే.. మంచు విష్ణు శివ భక్తుడు కన్నప్పగా నటించాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా యాక్ట్ చేశారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, ప్రభాస్, శరత్ కుమార్, మోహన్ లాల్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మించారు. నిజానికి గతేడాది డిసెంబర్లో కన్నప్ప రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పుష్ప 2 ఆగమనంతో వెనకడుగు వేసి మార్చికి రిలీజ్ చేస్తామన్నారు. అనంతరం ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అనుకున్న సమయానికి రాలేమంటూ మరోమారు వాయిదా వేశారు. My Sincere Apologies! pic.twitter.com/WbAUJIVzHq— Vishnu Manchu (@iVishnuManchu) March 29, 2025 -
ప్రియుడితో 'అభినయ' నిశ్చితార్థం.. వివరాలు ఇవే (ఫోటోలు)
-
కృతిశెట్టి మైమరిపించే అందాలు.. సొగసులతో మైమరిపిస్తుందిగా (ఫోటోలు)
-
ప్రియుడితో 'అభినయ' పెళ్లి.. కాబోయే భర్త ఫోటో రివీల్
టాలీవుడ్లో 'నేనింతే' సినిమాతో పరిచయం అయిన నటి అభినయ తనకు కాబోయే భర్తను సోషల్‌మీడియా ద్వారా పరిచయం చేసింది. తెలుగులో కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాల్లో ఆమె నటించినప్పటికీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో చిన్ని పాత్రలో బాగా ఆకట్టుకుంది. అలా టాలీవుడ్లో చాలా సినిమాల్లో అభినయకు ఛాన్సులు వచ్చాయి.త్వరలో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నానని కాబోయే భర్తతో కలిసి గుడిగంట కొడుతోన్న ఫొటోను అభినయ పంచుకుంది. ఈ క్రమంలోనే మార్చి 9న తమ నిశ్చితార్థం జరిగినట్లు కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఆమె ఫోటోలు షేర్ చేసింది. అతని పేరు 'సన్నీ వర్మ' అని తెలిపింది. ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్లు, భవనాలు, నీటిపారుదల, ఎలక్ట్రికల్, మైనింగ్, రైల్వేల నిర్మాణంలో భాగమైన ఒక అంతర్జాతీయ సంస్థలో అతను పనిచేస్తున్నట్లు సమాచారం.కొద్దిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభినయ తన ప్రేమను మొదటిసారి ఇలా రివీల్ చేసింది. 'నా చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్లో ఉన్నాను. 15 ఏళ్లుగా మా మధ్య బంధం ఉంది. త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. నా వ్యక్తిగత విషయం ఏదైనా సరే ఎలాంటి భయం లేకుండా అతనితో పంచుకోగలను' అని పేర్కొంది. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) -
నటి రమ్య పసుపులేటి కిర్రాక్ పోజులు (ఫొటోలు)
-
అనిల్- చిరంజీవి సినిమా ముహూర్తం తేదీ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ రంగంలోకి దిగుతోంది. దర్శకుడు అనిల్ ఇప్పటికే స్క్రిప్టు వినిపించడం పూర్తయింది. ఆపై మెగాస్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక షూటింగ్ పనులు ఎప్పుడు ప్రారంభవ అవుతాయి అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.మార్చి 30న ఉగాది పండుగ సందర్భంగా చిరు-అనిల్ సినిమా గ్రాండ్‌గా పూజా కార్యక్రమంతో చిరు నవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం చుట్టనున్నారు. రామానాయుడు స్టూడియోలో జరగనున్న ఈ కార్యక్రమంలో వెంకటేష్‌తో పాటు పలువురు స్టార్స్ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ మూవీలో శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో చిరంజీవి సందడి చేయనున్నారు. ఇందులో చిరంజీవి తనలోని కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్, భావోద్వేగాలతో మంచి వినోదాన్ని పంచుతారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ పాత్ర కోసం అదితిరావు హైదరి పరిశీలనలో ఉన్నట్టు టాక్ ఉంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.అనిల్ రావిపూడి బలమే కామెడీ.. ఇక చిరంజీవి కామెడి టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఓ కామెడీ సినిమా చేస్తున్నారంటే..దానిపై కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట అనిల్. ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపించబోతున్నారట. అలాగే కథలో కూడా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. చిరు మూవీ అనగానే.. డూయెట్లు, లవ్‌ట్రాక్ మస్ట్. కానీ అనిల్ వాటి జోలికి వెళ్లడం లేదట. చిరంజీవిని కంప్లీట్ ఫ్యామిలీమెన్‌గా చూపించబోతున్నారట. చిరంజీవి వయసు తగ్గట్టుగానే పాత్రను రాసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’లో చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే.. ఆపై ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయనున్నారు. -
‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఓటీటీలో ఉపేంద్ర 'యూఐ' సినిమా..
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. ఇప్పుడు డైరెక్ట్‌గా టెలివిజన్ ప్రీమియర్‌కు రానుంది. లహరి ఫిల్మ్స్, జీ మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 20న విడుదల అయింది. ఈ సినిమాని తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను వర్చువల్ రియాలిటీ పైప్‌లైన్‌లో చిత్రీకరించడంతో బాగా హైప్ క్రియేట్ అయింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపలేదు. సుమారు రూ. 80 కోట్లతో ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మించారు. కానీ, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 47 కోట్లు మాత్రమే రాబట్టి నష్టాలను మిగిల్చింది.యూఐ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఉపేంద్ర ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘యూఐ’ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారైనట్లు ఒక ప్రకటన చేశారు. ఉగాది సందర్భంగా మార్చి 30న సాయంత్రం 4.30 గంటలకు జీ కన్నడలో ‘యూఐ’ టెలికాస్ట్ అవుతుందని తెలిపారు. కానీ, ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. టాలీవుడ్ హీట్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' మాదిరి యూఐ చిత్రం కూడా జీ5 ఓటీటీలో ఉగాది నాడే రావచ్చని చెబుతున్నారు. ఓటీటీ, టెలివిజన్ ప్రీమియర్ రెండూ కూడా ఏక కాలంలో అందుబాటులోకి రావచ్చని సమాచారం.కథేంటి?ఉపేంద్ర దర్శకత్వం వహించిన 'యూఐ' సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది చూసి జనాలు మెంటలెక్కిపోతుంటారు. మూవీ చూస్తున్నప్పుడు ఫోకస్ కుదిరినోళ్లు.. వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫోకస్ కుదరనోళ్లు మళ్లీ మళ్లీ మూవీ చూస్తుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళీశర్మ).. థియేటర్లలో ఈ మూవీ పదే పదే చూసినా సరే రివ్యూ రాయలేకపోతుంటాడు. దీంతో ఈ స్టోరీ సంగతేంటో తేలుద్దామని ఏకంగా డైరెక్టర్ ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అయితే రాసిన కథ, సినిమాలో చూపించిన కథ వేర్వేరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య (ఉపేంద్ర), కల్కి భగవాన్ ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. -
సినిమా చూస్తూ నవ్వుతూనే ఉన్నారు: హారిక సూర్యదేవర
‘మ్యాడ్ స్క్వేర్’ని కాలేజ్ స్టూడెంట్స్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తూ నవ్వుతూనే ఉన్నారు. ఇలా మా కష్టానికి తగ్గ ఫలితం దక్కడం హ్యాపీగా ఉంది’’ అని హారిక సూర్యదేవర తెలిపారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్ స్క్వేర్’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.అన్ని షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. కొన్ని ఏరియాల్లో ‘మ్యాడ్’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ‘మ్యాడ్ స్క్వేర్’కి మాత్రం మొదటి రోజే వచ్చే అవకాశం ఉంది’’ అన్నారు. ‘‘థియేటర్లో ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తుంటే... దీనికోసమే కదా మనం సినిమా తీసింది అనే అనుభూతి కలిగింది’’ అని కల్యాణ్ శంకర్ పేర్కొన్నారు. ‘‘థియేటర్లో ప్రేక్షకులు గోల చేసుకుంటూ సినిమా చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది’’ అన్నారు నార్నే నితిన్.‘‘మా సినిమాపై ఇంతటి ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అని రామ్ నితిన్ చెప్పారు. ‘‘ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల చాలా ఆనందంగా ఉన్నాం’’ అన్నారు సంగీత్ శోభన్. ‘‘ఇలాంటి విజయవంతమైన సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని ప్రియాంక జవాల్కర్ తెలిపారు. -
'హత్య' మూవీ రివ్యూ.. ఇది కదా అసలు నిజం!
టైటిల్: హత్య; నటీనటులు: ధన్యా బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్, రఘు, భరత్ తదితరులు. నిర్మాత: ప్రశాంత్ రెడ్డి; కథ–స్క్రీన్ ప్లే–దర్శకత్వం: శ్రీవిద్య బసవ; సంగీతం: నరేశ్ కుమరన్.పి సినిమాటోగ్రఫీ: అభిరాజ్ నాయర్; ఎడిటర్: అనిల్ కుమార్ .పి; ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో.అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘హత్య’ సినిమా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కల్పిత కథ అని మేకర్స్ ప్రకటించినప్పటికీ... ఈ సినిమాలోనిపాత్రలు, స్థలాలు, హత్య ఘటన, కేసు దర్యాప్తు ప్రక్రియ అన్నీ కూడా సంచలనం అయిన ప్రముఖ రాజకీయ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును పోలి ఉన్నాయి. ఈ కేసుకి సంబంధించి దర్శక–నిర్మాతలు లోతైన పరిశోధన చేసి, దాగి ఉన్న పలు విషయాలను సేకరించినట్లుగా సినిమా చూసినవారికి అనిపించడం సహజం.ఈ హత్యకు సంబంధించిన అసలు నిజాలు చెప్పేలా కథ ఉండటంతో ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన వెంటనేపాపులర్ అయింది... నిజంగా ఏం జరిగింది? అనేదానికి ఈ సినిమా నిజమైన నమూనానా? హత్య వెనక ఉన్న నిజమైన హంతకులను ఈ సినిమా బయటపెట్టిందా? జరిగిన విషయాన్ని ఎలా తారుమారు చేసి, ప్రచారం చేస్తున్నారో ఈ సినిమా చూపించిందా? ‘హత్య’ సినిమా బయటపెట్టిన నిజాలు ఏంటి? ఇంతకీ ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌ని ఇష్టపడేవారు, వివేకానంద రెడ్డి హత్య కేసుని ఫాలో అవుతున్నవారు చూడాల్సిన చిత్రం ఇది.ఇంతకీ ఈ చిత్ర కథేంటంటే...ఇల్లందులో రాజకీయ నాయకుడు ధర్మేంద్ర రెడ్డి (రవి వర్మ) దారుణ హత్యకు గురవుతాడు. అయితే తొలుత ఆయన మరణం గుండెపోటు వల్ల జరిగిందని వార్తలు వస్తాయి. కానీ ధర్మేంద్ర గొడ్డలి వేటుతో హత్యకు గురయ్యాడని నిర్ధారణ అవుతుంది. ఈ కేసును రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి (భరత్) నిజాయితీ గల ఐపీఎస్ అధికారి సుధ (ధన్యా బాలకృష్ణ)కి అప్పగిస్తాడు. ఆమె తన టీమ్‌తో కలిసి ధర్మేంద్ర రెడ్డి హత్య కేసు విచారణ మొదలుపెడుతుంది. అజాత శత్రువు అయిన ధర్మేంద్ర రెడ్డిని అంత దారుణంగా నరికి చంపింది ఎవరు? ధర్మేంద్రకు, సలీమా (పూజా రామచంద్రన్)కు ఉన్న సంబంధం ఏంటి? పొలిటికల్ ఎజెండాతో ఈ హత్య చేశారా?\ఆర్థిక సమస్యలే కారణమా? ధర్మేంద్ర కుమార్తె కవితమ్మ (హిమబిందు)ను తప్పుదోవ పట్టించింది ఎవరు? చిన్నాన్న హత్య కేసులో నిజాలను నిగ్గు తేల్చడానికి సీఎం కిరణ్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? గత ప్రభుత్వం దగ్గర అమ్ముడుపోయిన కొంతమంది అధికారులు ఈ కేసును ఎలా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు? అనేక ఒత్తిడిలను తట్టుకొని ఐపీఎస్ అధికారి సుధ ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించింది? కేసు విచారణ చివరి దశలో ఉన్న సమయంలో ఏం జరిగింది? అనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘హత్య’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా కథంతా కల్పితమే అని చిత్రబృందం పేర్కొన్నప్పటికీ.. సినిమాప్రారంభంలోనే ఇది వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. దర్శకురాలు శ్రీవిద్య బసవ ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆమె రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నాయి. సినిమాప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. జేసీ ధర్మేంద్ర ఎవరన్నది చెబుతూ కథను మొదలుపెట్టారు దర్శకురాలు. ధర్మేంద్ర హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూపించారు. సుధ విచారణలో ఒక్కో కొత్త విషయం బయటకు వస్తుంటే.. ‘ఇది కదా అసలు నిజం’ అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సలీమా, ధర్మేంద్రల మధ్య లవ్‌స్టోరీ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. దర్శకురాలు ఎంతో పకడ్బందీగా రీసెర్చ్ చేసి, లవ్‌స్టోరీ చెప్పినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మంచి ఎమోషన్ పండించారు.ఎవరెలా చేశారంటే..ధర్మేంద్ర రెడ్డిపాత్రలో రవి వర్మ ఒదిగిపోయారు. ఐపీఎస్ ఆఫీసర్‌గా ధన్యా బాలకృష్ణ తనపాత్రకు న్యాయం చేశారు. సలీమాగా ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో పూజా రామచంద్రన్ మెప్పించారు. భరత్, బిందు చంద్రమౌళి, శ్రీకాంత్ అయ్యంగార్... మిగిలిన నటీనటులు వారిపాత్రల్లో మెప్పించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నరేశ్ కుమరన్ .పి అందించిన నేపథ్య సంగీతం,పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
హీరో విజయ్ కంటే మన హీరోనే స్మార్ట్..: మల్లారెడ్డి ప్రశంసలు
దివంగత లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ చాలా ఏళ్ల తర్వాత 'లైఫ్'(లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్‌పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తున్నారు. భావన పోలేపల్లి కాస్ట్యూమ్ డిజైనర్. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మల్లా రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా హీరో శ్రీ హర్ష మాట్లాడుతూ.. 'ముందుగా ముఖ్య అతిధి మల్లా రెడ్డికి కృతజ్ఞతలు. ఆయన ఈ సినిమాలో నటించి ఉంటే, పాన్ వరల్డ్ సినిమా అయ్యేది. ఈ సినిమాని నిర్మించిన తన తండ్రి రామ స్వామి రెడ్డికి కృతజ్ఞతలు. ఇంత అద్భుతంగా తీసిన డైరెక్టర్ పవన్ కేతరాజుకి ఎంతో రుణపడి ఉంటా. మణి శర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తన సినిమాకి సంగీతం ఇవ్వడం తన అదృష్టం. అలాగే సింగర్ ఎస్పీ చరణ్, నటుడు ప్రవీణ్‌తో కలిసి పని చెయ్యడం చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు.ఎమ్మెల్యే మల్లా రెడ్డి మాట్లాడుతూ.. 'ముందుగా ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో తీశారని తెలిసి ఆశ్చర్యపోయా. హీరో శ్రీ హర్ష తమిళ హీరో విజయ్ కంటే స్మార్ట్‌గా ఉన్నారు. శ్రీ హర్ష తమ కాలేజీ స్టూడెంట్.. అతని తండ్రి తమ కాలేజీ ప్రిన్సిపాల్.. వీరు సినిమా చెయ్యడం తనకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాలో పని చేసిన నటినటులకి నా అభినందనలు. డైరెక్టర్ ప్రవీణ్ కేతరాజు ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవ్వాలి' అని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇక డైరెక్టర్ పవన్ మాట్లాడుతూ.. 'తమని దీవించడానికి వచ్చిన ముఖ్య అతిధి మల్లా రెడ్డికి నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. చరణ్ ఈ సినిమా చేయబట్టే చాలా అద్భుతంగా వచ్చింది. బాల సుబ్రహ్మణ్యం చరణ్‌ను మనకు గిఫ్ట్‌గా ఇచ్చారు. బాల సుబ్రహ్మణ్యం ఎక్కడున్నా మమ్మల్ని దీవిస్తూ ఉంటారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు' అని అన్నారు.సింగర్ ఎస్పీ చరణ్ మాట్లాడుతూ.. 'వేదిక మీద ఉన్న పెద్దలందరికి నమస్కారం. తన క్యారెక్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేసిన డైరెక్టర్ పవన్ కేతరాజుకు ధన్యవాదాలు . ఈ సినిమా హీరో శ్రీ హర్ష చాలా కష్ట పడ్డారు. వారణాసిలో ఆయన పడ్డ కష్టాన్ని గుర్తు చేశారు. ఈ సినిమా శ్రీ హర్షకి మంచి సక్సెస్ ఇవ్వాలి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినందుకు కషికకి స్పెషల్ థాంక్స్. అలాగే ఎంతో సపోర్టింగ్ యాక్ట్ చేసిన నటుడు ప్రవీణ్‌కు నా కృతజ్ఞతలు. ఇంతమంచి సినిమాలో తాను పాడేందుకు అవకాశం ఇవ్వనందుకు కోపంగా ఉన్నానని సరదాగా' అన్నారు. ఈ చిత్రంలో చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిినిమాను ఏప్రిల్ 4వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
సూర్యతో బుట్టబొమ్మ స్టెప్పులు.. బుజ్జమ్మ సాంగ్ వచ్చేసింది
సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన సినిమా ‘రెట్రో’. ఇందులోని హుషారైన గీతాన్ని టీమ్ విడుదల చేసింది. ఈ చిత్రాన్ని జ్యోతిక, సూర్యనే నిర్మిస్తున్నారు. ప్రేమ, యుద్ధం నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ చిత్రంలో బుజ్జమ్మ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. సంతోష్ నారాయణన్ ఆలపించారు. ఈ సాంగ్ విడుదలైన కొద్ది సేపటికే యూట్యూబ్‌లో దూసుకెళ్లోంది. సూర్య అభిమానులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ చిత్రంలో జోజు జార్జ్, జయరామ్, కరుణాకరన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతమందిస్తుండగా.. మే 1న మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
రాబిన్‌హుడ్‌లో డేవిడ్ వార్నర్.. రెండు నిమిషాలకే ఇంత హంగామా చేశారా?
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలోకి వచ్చేసింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా ద్వారా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీ రిలీజ్ ముందు ప్రమోషన్లలోనూ బిజీగా పాల్గొన్నారు. రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిశారు. దీంతో రాబిన్‌హుడ్‌లో డేవిడ్ రోల్‌పై అభిమానుల్లో మరింత అంచనాలు పెరిగాయి.అయితే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ పాత్రపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెమియో రోల్ అయినప్పటికీ ట్రైలర్ ఎంట్రీ ఇవ్వడం చూసిన ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఉంటుందని ఊహించారు. కానీ అభిమానులు ఊహించినంత స్థాయిలో మాత్రం డేవిడ్ పాత్ర కనిపించలేదు. కేవలం 2 నిమిషాల 50 సెకన్ల పాటు కనిపించి ఉస్సురుమనిపించారు. రాబిన్‌హుడ్‌లో కొద్దిసేపే కనిపించడంపై డేవిడ్ వార్నర్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అది కూడా కేవలం డ్రగ్ డీలర్ పాత్రలో కనిపించడం.. కథలో పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతో మైనస్‌గా మారింది.మూవీ ప్రమోషన్స్‌లో డైరెక్టర్ వెంకీ కుడుముల వార్నర్ పాత్రపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వార్నర్ రోల్ ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తుందని అన్నారు. అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కావడం, స్వయంగా అతను కూడా మూవీ ప్రమోషన్లలో పాల్గొనడంతో అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కనీసం పది నిమిషాల పాటైనా వార్నర్ స్క్రీన్‌పై సందడి చేస్తే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వార్నర్.. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం. -
కేవలం రెడీ చేసినందుకు రూ.1 లక్ష దాకా తీసుకుంటారు: రకుల్
సెలబ్రిటీల సంపాదనకు తగ్గట్లే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఏదైనా ఈవెంట్‌కు, అవార్డుల ఫంక్షన్‌కు వెళ్లాలంటే మేకప్, హెయిర్ స్టైలింగ్ చేసేవారు తప్పనిసరి. వీళ్లు సందర్భాన్ని బట్టి వేలు, లక్షల్లో తీసుకుంటారని చెప్తోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో రకుల్ మాట్లాడుతూ.. మేకప్ వేసేందుకు, డ్రెస్‌కు తగ్గట్లుగా హెయిర్ స్టైల్ చేసేందుకు ఒక టీమ్ పనిచేస్తూ ఉంటుంది.ఆరేళ్లుగా ఒకే టీమ్‌తో పని చేస్తున్నా..రెడ్‌కార్పెట్‌పై మేము అందంగా కనిపించేందుకు వీళ్లు సాయపడతారు. కేవలం ఒక్క లుక్ కోసం రూ.20 వేల నుంచి రూ.1 లక్ష వరకు తీసుకుంటారు. స్టైలిస్ట్‌కు, మేకప్ టీమ్‌కు, ఫోటోగ్రాఫర్‌కు.. ఇలా అందరికీ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. నేను ఆరేళ్లపాటు ఒకే మేకప్- హెయిర్ టీమ్‌తో కలిసి పని చేస్తున్నాను. వారు నాకు కుటుంబసభ్యుల్లానే అనిపిస్తారు.పైసా ఖర్చుండదనేది నిజం కాదు!ఈవెంట్స్ కోసం డిజైనర్స్ మాకు ఉచితంగానే దుస్తులు పంపిస్తారు. దీనివల్ల మాకు పైసా ఖర్చు ఉండదని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాళ్లు ఫ్రీగానే ఇచ్చినా దాన్ని తెచ్చినవారికి.. ఆ డ్రెస్‌కు తగ్గట్లుగా మమ్మల్ని అందంగా రెడీ చేసిన స్టైలిస్ట్‌కు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కొరియర్ చార్జీలు కూడా అందులోనే జత చేస్తారు. అందుకే అంతర్జాతీయ డిజైనర్ రూపొందించిన డ్రెస్ ధరించాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నాకైతే నచ్చదుఆ డ్రెస్‌కు తగ్గట్లుగా ఎలా రెడీ అవ్వాలన్నది స్టైలిస్ట్ చూసుకుంటాడు. డిజైనర్లు మాకు డ్రెస్‌లు ఇవ్వాలని తహతహలాడుతుంటారు. ఎందుకంటే మేము వాటిని ధరించినప్పుడు ఎక్కువ అటెన్షన్ వస్తుంది. డిజైనర్ క్రియేటివిటీ ఎక్కువమందికి తెలుస్తుంది. వారి అమ్మకాలు కూడా పెరుగుతాయి. అయితే చాలామటుకు నేను ఉచితంగా దుస్తులు తీసుకోవడానికి ఇష్టపడను అని రకుల్ చెప్పుకొచ్చింది.చదవండి: ఇక ఆపండి.. మీ తల్లి, చెల్లి, భార్య వీడియోలు చూడండి: నటి ఫైర్ -
పూరీ అడిగితే నో చెప్పా.. రకుల్ కామెంట్స్
కొన్నేళ్ల క్రితం తెలుగులో స్టార్ హీరోయిన్ గా వరస సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం పెళ్లి చేసుకుని బాలీవుడ్ కి పరిమితమైపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి.. తన వైవాహిక జీవితం, సినీ కెరీర్ గురించి చెప్పుకొచ్చింది. తెలుగు దర్శకుడు పూరీ జగన్నాథ్ కి నో చెప్పిన సందర్భాన్ని గుర్తుచేసుకుంది.'కాలేజీ టైంలో మోడలింగ్ కూడా చేసేదాన్ని. అలా నా ఫొటోలు చూసి కన్నడ ఇండస్ట్రీలో తొలి అవకాశం వచ్చింది. అప్పుడు నాకు దక్షిణాది సినిమాల గురించి పెద్దగా తెలియదు. దీంతో చాలా ఆలోచించాను. కానీ నా తండ్రికి సదరు చిత్ర యూనిట్ ఫోన్ చేసి చెప్పడంతో కన్నడలో తొలి మూవీ చేశాను. ఇందులో నటనకు మంచి పేరొచ్చింది కానీ చదువుకి సమస్య రావడంతో సినిమాలు వద్దనుకున్నాను'(ఇదీ చదవండి: కోట్లాది రూపాయల స్కాంలో 'పుష్ప 2' డబ్బింగ్ ఆర్టిస్ట్)'తొలి మూవీ రిలీజైన తర్వాత పూరీ జగన్నాథ్ నుంచి ఫోన్ వచ్చింది. 70 రోజుల కాల్ షీట్ అడిగారు. నేనేమో 4 రోజులైతేనే వస్తానని చెప్పా. నా ఇబ్బందిని ఆయన అర్థం చేసుకున్నారు. ఇదే కాదు.. ఇలా చాలా సినిమాలు కెరీర్ ప్రారంభంలో వదిలేసుకున్నా' అని రకుల్ చెప్పుకొచ్చింది.హిందీ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న రకుల్.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని బాగానే ఎంజాయ్ చేస్తోంది. కాకపోతే సినిమా అవకాశాలు గతంతో పోలిస్తే చాలా తగ్గిపోయాయి.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్) -
నా సోదరి మరణం తీవ్రంగా కలచివేసింది: మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
డైరెక్టర్ మెహర్ రమేశ్ సోదరి మరణం పట్ల మెగాస్టార్ సంతాపం వ్యక్తం చేశారు. నా తమ్ముడు మెహర్ రమేశ్ సోదరి మాదాసు సత్యవతి మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. తాను నాకు కూడా సోదరేనని ఎమోషనల్ అయ్యారు. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి, నా తమ్ముడు మెహర్ రమేశ్‌కు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు.(ఇది చదవండి: టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట తీవ్ర విషాదం)మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి స్వర్గస్థులవటం ఎంతో కలచి వేసింది. తాను నాకూ సోదరే. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు, దర్శకుడు మెహెర్ రమేష్ కు, నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ.. నా సోదరి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు.తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి స్వర్గస్థులవటం ఎంతో కలచి వేసింది. తాను నాకూ సోదరే. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు, దర్శకుడు మెహెర్ రమేష్ కు, నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ, నా సోదరి ఆత్మ కి శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను🙏— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2025 -
పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి పూజ చేసిన శోభా శెట్టి.. ఎందుకంటే?
శోభా శెట్టి (Shobha Shetty).. కొంతకాలం క్రితం వరకు ఈమెను కార్తీకదీపం మోనితగానే గుర్తుపెట్టుకున్నారు జనాలు. తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్‌తో శోభా శెట్టిగానూ గుర్తింపు తెచ్చుకుంది. షోలో తను లవ్‌లో ఉన్నట్లు తెలిపింది. యశ్వంత్ రెడ్డి (Yashwanth)తో ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. గతేడాది జనవరిలో తాంబూలాలు మార్చుకోగా మే నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. 11 నెలలు కావొస్తున్నా ఇంకా పెళ్లెప్పుడనేది చెప్పడం లేదు శోభ.తాజాగా శోభ.. ప్రియుడితో కలిసి పూజ చేసింది. దాదాపు 16 కలశాలు పెట్టి మధ్యలో శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేసింది. పూజ చేయడానికి గల కారణం గురించి శోభ మాట్లాడుతూ.. కొత్తింట్లోకి వచ్చి ఎనిమిది నెలలవుతోంది. అప్పుడు పూజ చేసి ఇంటికి గుమ్మడికాయ కట్టాం. దిష్టి తాకి అదిప్పుడు పాడైపోయింది. అందుకే పంతులుగారిని పిలిచి పూజ చేశాం. దీనివల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయి. యశ్వంత్ ఎక్కువగా నమ్మడు. కానీ మా అత్తమ్మ, నేను ఎక్కువ నమ్ముతాం. అందుకే పూజ చేశాం అని శోభా శెట్టి చెప్పుకొచ్చింది.చదవండి: 'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ -
గాయం నుంచి కోలుకోని రష్మిక.. ఇప్పుడెలా ఉంది?
పుష్ప 2, ఛావా సినిమాలతో వరస బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరోయిన్ రష్మిక.. కొన్నిరోజుల క్రితం జిమ్ లో వర్కౌట్ చేస్తూ గాయపడింది. కాలికి కట్టుతో ఉన్న ఫొటోని కూడా పోస్ట్ చేసింది. రీసెంట్ టైంలో నార్మల్ గా నడిచేస్తూ కనిపించింది. ఇప్పుడు కాలి నొప్పి తగ్గిందా లేదా అనే విషయాన్ని స్వయంగా రష్మిక చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: సల్మాన్ చేతికి 'రామ్ జన్మభూమి' వాచ్.. రేటు ఎంతంటే?)ప్రస్తుతం సికిందర్ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న రష్మిక.. మెల్లగా నడుచుకుంటూనే వస్తోంది. దీంతో రష్మిక కాలి గాయం తగ్గిందా లేదా అని ఆమె ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టాలో చాట్ సెషన్ పెట్టిన రష్మికకు.. కాలి గాయం గురించి ప్రశ్న ఎదురైంది.కాలి గాయం తగ్గిందా అని ఓ నెటిజన్, రష్మికని అడగ్గా.. కాలు పూర్తిగా నయం కావడానికి 9 నెలలు పడుతుంది. ప్రస్తుతానికి కాస్త బెటర్ గానే ఉంది. నేనైతే పనిచేయడం మొదలుపెట్టేశాను అని చెప్పుకొచ్చింది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తే జాగ్రత్తలు తీసుకుంటూనే షూటింగ్స్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్) -
స్టార్ హీరో వారసుడి నుంచి 'ఫరియా అబ్దుల్లా'కు బిగ్ ఆఫర్
ఏ రంగంలోనైనా, ఎవరినీ అంచనా వేయలేం. సినిమా తారల విషయంలోనూ అంతే. ఎవరికి ఎప్పుడు? ఏ భాషలో అవకాశాలు వరిస్తాయో చెప్పడం కష్టం. ఫరియా అబ్దుల్లా విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ తెలుగమ్మాయి జాతి రత్నాలు అనే తెలుగు చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. అందులో చిట్టి పాత్రలో ఆమె సూపర్‌గా మెప్పించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని అందుకుంది. దీంతో 'ఫరియా అబ్దుల్లా'(Faria Abdullah) పంట పండినట్లే అవకాశాలు వరుస కడతాయి అనుకున్నారు. అయితే ఆ తరువాత ఆమెకు అవకాశాలు రావడానికి చాలా కాలం పట్టింది. అలా రవితేజతో కలిసి రావణాసుర చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. కొంత గ్యాప్ తరువాత అల్లరి నరేశ్‌కు జంటగా ఆ ఒక్కటీ అడగొద్దు చిత్రంలో నటించారు. అదీ ప్రేక్షకులకు రుచించలేదు. దీంతో ఫరియా కోలీవుడ్‌పై దృష్టి సారించారు. ఇక్కడ విజయ్ ఆంటోనికి జంటగా వళ్లి మయిల్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఈ చిత్రం విడుదల కాకముందే ఈ అమ్మడిని మరో లక్కీచాన్స్ వరించిందన్నది తాజా సమాచారం. విజయ్ వారసుడు 'జసన్ సంజయ్' మెగాఫోన్ పట్టిన విషయం తెలిసిందే. ఈయన దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో విష్ణువిశాల్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.ఇందులో నటించే కథానాయకి ఎవరన్న విషయంపై పలువురు స్టార్ హీరోయిన్ల పేరు ప్రచారం అయ్యారు. అలాంటిది చివరికి తెలుగమ్మాయి ఫరియా అబ్దుల్లాకు ఆ అవకాశం దక్కిందని తెలిసింది. కాగా తొలి చిత్రం విడుదలకు ముందే మరో అవకాశం వరించడం ఫరియా అదృష్టమేనని చెప్పాలి. ఈమె నటిస్తున్న వళ్లి మయిల్, తాజాగా విష్ణువిశాల్‌కు జంటగా నటిస్తున్న చిత్రాలు కోలీవుడ్‌లో ఎలాంటి పేరు తెచ్చిపెడతాయో చూడాలి. -
'మ్యాడ్ స్క్వేర్' మూవీ ట్విటర్ రివ్యూ
మ్యాడ్ స్క్వేర్తో(Mad Square) నవ్వులు పూయించేందుకు థియేటర్స్‌లోకి నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరోసారి ఎంట్రీ ఇచ్చేశారు. 2023లో విడుదలైన హిట్ సినిమా ‘మ్యాడ్’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా ఉంది. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. నేడు (మార్చి 28) సినిమా విడుదలైంది. ఇప్పుటికే ఓవర్సీస్లో మూవీని చూసిన సినీ అభిమానులు మ్యాడ్ స్క్వేర్ సినిమా గురించి ఎక్స్ వేదికగా పోస్ట్‌లు చేస్తున్నారు. కాలేజీ నేపథ్యంతో పరిచయం అయిన కొందరు స్నేహితులు వారి చదువులు పూర్తి అయిన తర్వాత మళ్లీ ఒకచోట కలిస్తే వారి అల్లరి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి ప్రధాన బలం ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ , సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ అని తెలిసిందే.మ్యాడ్ స్క్వేర్ సినిమా ఇప్పటికే అమెరికా, లండన్, ఆస్ట్రేలియా వంటి నగరాల్లో షోలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గతంలో మ్యాడ్ సినిమా వచ్చిన పాజిటివ్ రివ్యూలే ఇప్పుడు కూడా సోషల్‌మీడియాలో కనిపిస్తున్నాయి. కానీ, ప్రస్తుతం ఇంటర్వెల్ వరకు మాత్రమే షో పూర్తి అయిందని వారు చెబుతున్నారు. ఇప్పటి వరకు అయితే బొమ్మ అదిరిపోయిందని తెలుపుతున్నారు. డీడీ, లడ్డు పాత్రలు మళ్లీ దుమ్మురేపాయని కామెంట్లు పెడుతున్నారు. ఫస్టాఫ్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. కానీ, సెకండాఫ్‌కు అంతగా రెస్పాన్స్ రావడం లేదని ట్వీట్లతో చెబుతున్నారు.'మ్యాడ్ స్క్వేర్' కథ గురించి అడగొద్దని నిర్మాత నాగవంశీ విడుదలకు ముందే చెప్పాడు. థియేటర్స్‌లో సినిమా చూసిన వారు అది నిజమే అని చెబుతున్నారు. కానీ, సినిమా ప్రారంభం నుంచే సుమారు 30 నిమిషాలకు పైగా నాన్ స్టాప్‌గా నువ్వులు తెప్పిస్తారని వారు చెప్పుకొస్తున్నారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ మరోసారి హిట్ రైడ్ చేశాడని తెలుపుతున్నారు. స్టోరీ లైన్ వరకు డైరెక్టర్ వెళ్లినా కూడా అది వర్కౌట్ కాలేదని చెబుతున్నారు. 'లడ్డు గాడి పెళ్లి' నేపథ్యంలో వచ్చే సీన్స్ అన్నీ చాలా ఎక్కువ ఫన్ అందించాయని అందరూ చెబుతున్నారు. టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తుందని చెబుతున్నారు. సెకండాఫ్ కాస్త ఇబ్బందేసినిమా డల్ అయిన ప్రతిసారి కామెడీ పంచ్‌లను ప్రేక్షకుల ముందుకు తెచ్చారట. ఫుల్ కామెడీగా ఉన్నప్పటికీ అక్కడక్కడా డల్ మూమెంట్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సినిమాలో కథ లేదంటూ కామెడీకే అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం బలవంతంగా కామెడీ రుద్దినట్లు అనిపిస్తుంది. గోవా ఎపిసోడ్ బాగా ఉంటుందని అనుకుంటే అది అంతగా వర్కౌట్ కాలేదని చెబుతున్నారు. లడ్డుగాడి కామెడీ బావుంది కానీ ఆశించిన మేరకు లేదని కొందరు డిసప్పాయింట్ అవుతున్నారు. ఫస్టాఫ్‌లో ఉన్నంత ఎనర్జీ సెకండాఫ్‌లో కనిపించదని చెబుతున్నారు. ప్రతిదానికి కామెడీ చేయాలని చూడటం అంతగా కనెక్ట్ కాలేదని చెబుతున్నారు. రెబ్బా మోనికా జాన్ స్పెషల్ సాంగ్ సూపర్ అంటున్నారు. ఈ సినిమాకు ఆశించినంత స్థాయిలో మ్యూజిక్ కూడా లేదని చెబుతున్నారు. ఓవరాల్‌గా సినిమా యావరేజ్‌గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. యూత్‌కు కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుందని చెబుతున్నారు. ఈ అభిప్రాయం నెటిజన్లది మాత్రమే.. పూర్తి రివ్యూ మరికొంత సమయంలో సాక్షి. కామ్‌లో మరికొంత సమయంలో వస్తుంది. #MADSquare Good 1st Half! The first half runs on the lead characterizations and well written dialogues. The comedy in the wedding sequence worked very well. Laddu is the show stealer so far. Apart from a few drops here and there, the comedy works well. 2nd Half awaits!— Venky Reviews (@venkyreviews) March 28, 2025Very good first half. The director infused comedy in every scene. The entire marriage sequence which lasts for 30 minutes is a LAUGH RIOT. Watch it for this segment. All the actors did well but it is LADDU who steals the show in first half. Waiting for second half!#MADSquare pic.twitter.com/1eGRZh09kH— sharat 🦅 (@sherry1111111) March 28, 2025#MadSquare Good 1st half with bad 2nd half.#Robinhood okayish 1st half with Very good 2nd half .#Mad2— Narendra News (@Narendra4News) March 27, 2025#MADSquare Hilarious Ride. 🤣🤣🤣🔥🔥Crazy first half, Laddoo being the show stealer, while DD being DD. Laughed throughout the marriage episode. 👌🏻👌🏻Every cameo worked out very well. Sunil’s part is too good in second half. Music and energy levels haven’t dropped at all.… pic.twitter.com/08WabFlIV2— appie 🎀 (@fizz_nandamuri) March 28, 2025 -
నాలుగు నెలల్లో రూ.3,000 కోట్ల కలెక్షన్స్! బాక్సాఫీస్ క్వీన్‌గా రష్మిక
రష్మిక మందన్నా (Rashmika Mandanna).. ఇండస్ట్రీ ఏదైనా ఆమె అడుగు పెడితే బ్లాక్ బస్టర్ వెల్ కమ్ చెపాల్సిందే. హీరో ఎవరైనా సరే.. ఆమె జోడి కడితే కెరీర్ లో బిగ్ హిట్ అందుకోవాల్సిందే. అలా అని మహానటి పేరు లేదు. గ్లామర్ క్వీన్ అనే క్రేజ్ కూడా లేదు. టోటల్‌గా లక్ ఫ్యాక్టర్ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తోంది. ఇండియన్ సినిమాలో తనని తిరుగులేని నటిగా నిలబెడుతోంది. రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.నాలుగు నెలల్లో మూడు వేల కోట్లు!రష్మిక కథానాయికగా నటించిన పుష్ప 2 (Pushpa 2: The Rule) గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయింది. ఈ మూవీతో 1800 కోట్ల వసూళ్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛావా రిలీజ్.. 800 కోట్ల కలెక్షన్స్. అంటే ఏడాదిలోపే, 2600 కోట్ల వసూళ్లు. ఇప్పుడు ఈద్‌కు మరో బాలీవుడ్ ఫిలిం సికిందర్ సినిమా రిలీజ్ అవుతోంది. ఎంత లేదనుకున్నా ఈద్ సమయంలో సల్మాన్ సినిమా అంటే ఈజీగా మూడు నాలుగు వందల కోట్లు కొల్లగొడుతుంది. కేవలం నాలుగు నెలల వ్యవధిలో మూడు వేల కోట్ల వసూళ్లకు రష్మిక కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది అనేది సంచలనం సృష్టిస్తోంది.దేశ సినీచరిత్రలోనే..బాలీవుడ్‌ను ఏళ్లకు ఏళ్లు ఏలిన దీపిక, ఆలియా భట్, కత్రినాకైఫ్‌కు కూడా ఇలాంటి రికార్డ్ లేదు. భవిష్యత్తులో వారు అందుకునే ఛాన్స్ కూడా లేదు. వీటికి అంతకు ముందు రష్మిక నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ యానిమల్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే హిందీ ఇండస్ట్రీలో రష్మిక కలెక్షన్స్ రికార్డ్ రూ.3500 కోట్లు దాటుతుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరే హీరోయిన్‌కు ఈ స్థాయి బ్లాక్ బస్టర్స్ లేవు. ఈ రేంజ్ కలెక్షన్స్ లేవు. అందుకే రష్మిక నేమ్ అంత స్పెషల్ గా మారింది. బాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్ క్వీన్ అనిపించుకుంటోంది.(చదవండి: మీరు లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదు.. మహాతల్లి ఎమోషనల్ పోస్ట్)కొంత కష్టం.. కొంత అదృష్టంకెరీర్ బిగినింగ్ నుంచి రష్మికకు లక్ ఫ్యాక్టర్ ఎక్కువ. పైగా కష్టపడం ఈ హీరోయిన్‌కు మరింత ఇష్టం. అందుకే ఇంత అందలం. ఆకాశమే హద్దుగా స్టార్ డమ్. ఒక్క బ్లాక్ బస్టర్ అందివస్తేనే కెరీర్ పరుగులు పెడుతుంది. అలాంటిది బాలీవుడ్లో రష్మికపై బ్లాక్ బస్టర్స్ వర్షం కురుస్తోంది. హిట్ మీద హిట్, రికార్డుల మీద రికార్డులు వస్తున్నాయి, పడుతున్నాయి. సికందర్లో తనకంటే 31 ఏళ్ల పెద్ద వయసు ఉన్న సల్మాన్ ఖాన్ (Salman Khan)తో ఆడిపాడింది రష్మిక. ఇక్కడ కూడా మంచి మార్కులే వేయించుకుంది. తనదైన నటనతో సల్మాన్ మనసు గెల్చుకుంది. అందుకే భాయ్ జాన్.. ఏజ్ గ్యాప్‌పై ఓపెన్ అయిపోయాడు.రష్మికకు, వాళ్ల ఫాదర్ కు లేని ఇబ్బంది మిగతా వాళ్లకు ఎందుకని ప్రశ్నించాడు. సికిందర్ తర్వాత కూడా మరిన్ని క్రేజీ మూవీస్ చేయబోతోందీ బ్యూటీ. అందులో స్త్రీ సిరీస్ లాంటి హారర్ కామెడీ మూవీ కూడా ఉంది. సికిందర్ బాక్సాఫీస్ రిజల్ట్ అనుకున్న స్థాయిలో ఉన్నా, లేకపోయినా ఆ తర్వాత కనిపించే హారర్ కామెడీ మెప్పించకపోయినా బాలీవుడ్లో రష్మిక కెరీర్‌కు వచ్చిన ఢోకా ఏం లేదు. ఎందుకంటే యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ లైన్లో ఉంది. ఆలాగే పుష్ప-3 పట్టాలెక్కాల్సి ఉంది. ఈ రెండు సీక్వెల్స్‌తో రష్మిక నేమ్, రష్మిక రికార్డ్స్, రష్మిక కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.చదవండి: కమెడియన్ ధనరాజ్‌తో గొడవలు- విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భార్య -
వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న 'పొలిమేర' నటి
కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) ఎంచుకునే భిన్న స్క్రిప్ట్‌లు ఎంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నవీన్ చంద్ర హీరోగా నటించిన సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీతో బిజీగా ఉంది. మరో వైపు బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజ్ పోలిమేర మూడో పార్ట్ షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. తాజాగా కామాక్షి మాట్లాడుతూ.. ‘మూడు చిత్రాలలో నేను విభిన్న పాత్రలను పోషిస్తున్నాను. ఈ మూడు ప్రాజెక్టులు నా కెరీర్‌కు చాలా కీలకం కానున్నాయి. ఇలా ఒకే టైంలో మూడు ప్రాజెక్టులకు పని చేయడం కష్టమైనప్పటికీ, సినిమా పట్ల ఉన్న ప్యాషన్, ప్రేమ వల్ల కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. నాకు సినిమా సెట్లలో ఉండటమే నచ్చుతుంది’ అని పేర్కొంది.ప్రతిసారి డిఫరెంట్ పాత్రలను పోషిస్తుండటంపై కామాక్షి స్పందిస్తూ.. ‘సినిమాలోని పాత్రకు కనెక్ట్ అవ్వడం, ఆ క్యారెక్టర్‌కు నిజాయితీగా పని చేయడం వల్ల యాక్టర్ తనలోని కొత్త కోణాలను ఆవిష్కరించుకోగలరు. సవాల్‌గా అనిపించే పాత్రలను ఎంచుకోవడం, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నటించే పాత్రలనే నేను ఎంచుకుంటూ వస్తున్నాను. స్క్రిప్ట్, డైరెక్టర్ విజన్‌కు అనుగుణంగానే పని చేస్తున్నాను. నా కోసం పాత్రలు రాసే దర్శకులకే క్రెడిట్ ఇస్తాను. నాలోని నటిని బయటకు తీసుకొచ్చేది వారే. ప్రతి పాత్ర ఒక కొత్త ప్రయాణం అని నమ్ముతాను’ అని తెలిపింది.చదవండి: బెట్టింగ్ యాప్స్.. ఏడాదికి రూ.10 లక్షలిస్తామన్నారు: వాసంతి -
కమెడియన్ ధనరాజ్‌తో గొడవలు- విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భార్య
టాలీవుడ్లో కమెడియన్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు ధనరాజ్ (Dhanraj). బుల్లితెర నుంచి వెండితెరకు సాగిన అతడి ప్రయాణంలో భార్య శిరీష వెన్నంటే నిలబడిందని ఎన్నోసార్లు ఎమోషనలయ్యాడు. తాజాగా శిరీష తొలిసారి ఓ ఇంటర్వ్యూకు హాజరై ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది. శిరీష (Dhanraj Wife Sirisha) మాట్లాడుతూ.. ధనరాజ్‌ది విజయవాడ. నాది ఖమ్మం. నేను క్లాసికల్ డ్యాన్సర్‌ను. ధనరాజ్ ఫిలిం నగర్లో ఓ డ్యాన్స్ స్టూడియో పెట్టినప్పుడు టీచర్ కోసం వెతుకుతున్నారు. అలా నన్ను కలిశాడు. క్యాన్సర్‌తో కన్నుమూసిన ధనరాజ్ తల్లిఅదృష్టమో, దురదృష్టమో తెలీదు కానీ నేను పరిచయమైన రోజే అతడి అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. ఆమె వెళ్లిపోతూ నన్ను అతడికి ఇచ్చిందని ధనరాజ్ ఫీలయ్యాడు. తల్లి అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బు లేకపోతే నా దగ్గరున్న బంగారం ఇచ్చేశాను. నవంబర్‌లో ఆమె చనిపోతే మార్చిలో మా పెళ్లి జరిగింది. మాది ప్రేమ వివాహం. అది కూడా నేనే ప్లాన్ చేశాను. రేపు మన పెళ్లి అనగానే సరేనని తలూపాడు. ఇంట్లో వాళ్లను కాదని 15 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను. మా పెళ్లయ్యాకే అతడికి పేరొచ్చిందిమా పెళ్లయిన మూడో రోజే జగడం సినిమా రిలీజైంది. అక్కడి నుంచి ధనరాజ్‌కు అవకాశాలు, ఫేమ్ మొదలైంది. అయితే ఆయన నిర్మాతగా ధనలక్ష్మి తలుపు తడితే అని ఓ సినిమా తీశాడు. అది నాకిష్టం లేదు. ఆయన మాత్రం కచ్చితంగా ఆడుతుందని నమ్మి తీశాడు. ఒకవేళ సినిమా పోతే జీరో నుంచి మొదలుపెట్టాల్సిందే! నేను అనుకున్నట్లుగానే జీరో నుంచి మళ్లీ స్టార్ట్ చేశాం.. సోషల్ మీడియాలో మా గురించి ఏవేవో పుకార్లు రాస్తుంటారు. పదిరోజులు మాట్లాడుకోంఆ మధ్య మేము రోడ్డున పడ్డామని రాశారు. ఇల్లు కూడా అమ్మేశామని ప్రచారం చేశారు. ఇప్పుడేమో విడాకులు తీసుకుంటున్నట్లు పుకార్లు! మా మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయి. వారం, పది రోజులపాటు మాట్లాడుకోం. అంతేకానీ విడాకులు తీసుకునేంత సీన్ ఏం లేదు. మేము సంతోషంగా ఉన్నాం. ఏవి పడితే అవి రాయొద్దు. ఇకపోతే ధనరాజ్ ఫ్రెండ్స్ మా ఇంటికి వస్తూ ఉంటారు. సుడిగాలి సుధీర్ నాకు ఎక్కువ క్లోజ్. ప్రస్తుతానికైతే వాడు పెళ్లే చేసుకోను అంటున్నాడు. మరి ఏం చేస్తాడో చూడాలి! అని శిరీష చెప్పుకొచ్చింది.చదవండి: ఆలియాను చూసి ఈర్ష్య పడ్డా.. ఈమెకేంటి.. లైఫ్ సెట్టు అనుకున్నా! -
బిజినెస్మెన్ కూతురితో ప్రభాస్ పెళ్లి.. స్పందించిన టీమ్
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ పెళ్లి గురించి ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి చాలాసార్లు వార్తలొచ్చాయి. కానీ అవన్నీ కేవలం రూమర్స్‌గానే మిగిలిపోయాయి. కొన్ని నెలల గ్యాప్ తర్వాత మళ్లీ ప్రభాస్ పెళ్లి గురించి మొదలైంది. త్వరలోనే ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నారని నెట్టింట తెగ వైరలవుతోంది. అంతేకాదు రెబల్ స్టార్ పెద్దమ్మ శ్యామలా దేవి అప్పుడే పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ అన్న పెళ్లి కోసం ఎంతోమంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తల నేపథ్యంలో తాజాగా ఆయన టీమ్ స్పందించింది. ప్రభాస్ మ్యారేజ్ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని కొట్టి పారేశారు. ఓ బిజినెస్మెన్ కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ వార్తలపై ఆయన టీమ్‌ను సంప్రదించగా.. ఎలాంటి ఊహగానాలు నమ్మవద్దని రెబల్ స్టార్ అభిమానులకు సూచించారు.(ఇది చదవండి: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఏర్పాట్లలో శ్యామలా దేవి)గతంలో ప్రభాస్ పెళ్లి గురించిన వచ్చిన రూమర్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అతను తన బాహుబలి నటి అనుష్క శెట్టితో రిలేషన్షిప్లో ఉన్నాడని చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత ఈ వార్తలను నటీనటులిద్దరూ ఖండించారు. తాము మంచి స్నేహితులమని క్లారిటీ ఇచ్చారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. ఆ తర్వాత దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి -2, ప్రశాంత్ నీల్‌తో సలార్ 2: శౌర్యంగ పర్వం సినిమాలను చేయనున్నారు. -
టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇక మెహర్ రమేశ్ సినిమాల విషయానికొస్తే తెలుగులో 'శక్తి', 'కంత్రి', 'షాడో', 'భోళా శంకర్' సినిమాలను తెరకెక్కించారు. అంతకుముందు 2002లో తొలుత ఇతడు నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిరంజీవికి వరసకు తమ్ముడు అయ్యే మెహర్.. మహేశ్‌బాబు 'బాబీ' మూవీ సునీల్ అనే కామెడీ రోల్ చేశాడు. ఆ సినిమా ఆడకపోవడంతో మెహర్ యాక్టింగ్ వదిలేశాడు.ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అయితే ఒకానొక సందర్భంలో అనుకోకుండా 'ఆంధ్రావాలా' కన్నడ రీమేక్ 'వీర కన్నడిగ' తీసే అవకాశం వచ్చింది. అలా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. అ తర్వాత 'ఒక్కడు' చిత్రాన్ని కన్నడలో 'అజయ్'గా రీమేక్ చేసి మరో హిట్ కొట్టాడు. ఇలా కన్నడ భాషలో సక్సెస్ అందుకున్న మెహర్ రమేశ్.. తెలుగులో మాత్రం అంతలా సక్సెస్ కాలేకపోయారు. -
బెట్టింగ్ యాప్స్.. ఏడాదికి రూ.10 లక్షలిస్తామన్నారు: వాసంతి
ఈజీ మనీ కోసం చాలామంది బెట్టింగ్ యాప్స్ (Betting Apps) వాడి నిండా మునుగుతున్నారు. అదే ఈజీ మనీ కోసం ఎంతోమంది సెలబ్రిటీలు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ జాబితాలో బుల్లితెర సెలబ్రిటీలు, బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ఎక్కువగా ఉన్నారు. అందులో వాసంతి కృష్ణన్ (Vasanthi Krishnan) కూడా ఉంది. తాజాగా ఆమె బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడింది. అవగాహన లేక చేశా..వాసంతి మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని ఆఫర్లు వస్తుంటే చేసుకుంటూ పోయాను తప్ప దీనివల్ల జనాలు ఇబ్బందిపడుతున్నారని తెలీదు. ఆ యాప్స్ గురించి నాకంత అవగాహన లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చాలామంది ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి ఇందులో తప్పే లేదనుకున్నాను. కనీస అవగాహన లేకుండానే సోషల్ మీడియాలో ప్రమోట్ చేశాను. అయితే.. ఇలాంటివి ఎందుకు చేస్తున్నావ్ అంటూ నాకు నెగెటివ్ కామెంట్లు రావడం మొదలైంది. ఫాలోవర్లు కూడా తగ్గిపోయారు. నా వల్ల జనాలకు చెడు జరుగుతుందేమోనని ప్రమోషన్స్ ఆపేశాను. ఇప్పటికీ నన్ను ప్రమోషన్స్ చేయమని అడుగుతూనే ఉన్నారు.రూ.10 లక్షల ఆఫర్ఏడాదికి ఇంత, రెండేళ్లకు అంత అని ప్యాకేజీలు ఇస్తామన్నారు. అదంతా నావల్ల కాదు అని ఒక వీడియో చేసి ఆపేశాను. అప్పట్లో ఏడాదికి రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ప్యాకేజీ ఇచ్చేవాళ్లు. మీరు సోషల్ మీడియాలో ఎలాంటి వీడియో అప్లోడ్ చేయనవసరం లేదు. కేవలం వీడియో తీసి సెండ్ చేయమనేవాళ్లు. కానీ నా అభిమానులు డబ్బు కోల్పోతున్నారని తెలిసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేశాను. అందరూ పాడైపోవాలన్న దురుద్దేశంతో అయితే ప్రమోషన్స్ చేయలేదు అని వాసంతి వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సీరియల్స్ చేస్తోంది.చదవండి: మీరు లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదు.. మహాతల్లి ఎమోషనల్ పోస్ట్ -
మీరు లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదు.. మహాతల్లి ఎమోషనల్ పోస్ట్
ట్రెండ్ మారినా ఫ్రెండు మారడే.. ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్పే.. అని పాట పాడుకుంటోంది మహాతల్లి జాహ్నవి. యూట్యూబర్‌లో ఫన్నీ వీడియోలతో నవ్వించిన మహాతల్లి ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందింది. జాహ్నవి- సుశాంత్ రెడ్డి దంపతులకు పండంటి బిడ్డ పుట్టింది. అయితే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు దిగిన ఫోటోలన్నింటినీ వరుస పెట్టి రిలీజ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తన ముగ్గురు ఫ్రెండ్స్ (నిహారిక, వితికా, భార్గవి)తో స్పెషల్‌గా దిగిన ఫోటోషూట్ పిక్స్ షేర్ చేస్తూ ఎమోషనలైంది.బాలి ట్రిప్‌తో బాండింగ్'ఫీమేల్ ఫ్రెండ్షిప్ ప్రాముఖ్యత ఎదిగే వయసులో పెద్దగా తెలీలేదు. ఇప్పటికీ మేము నలుగురం ఇంతలా ఎలా క్లోజ్ అయ్యామో అర్థం కాదు. ఎందుకంటే ఒక్కొక్కరం ఒక్కో రకం. మా అందరిదీ వేర్వేరు బ్యాక్‌గ్రౌండ్.. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చాం. మొదటిసారి కలుసుకున్నప్పుడు కూడా ఏదో కొంతకాలం కలిసుంటాంలే అనుకున్నాను. కానీ బాలి ట్రిప్‌తో మా బంధం బలపడింది. ఫ్రెండ్స్ అయ్యాక విహారయాత్రలకు వెళ్లడం మామూలే. లైఫ్‌లో చిన్న బ్రేక్ తీసుకోవాలని..కానీ మేమంతా లైఫ్‌లో ఒక బ్రేక్ తీసుకోవాలని చూస్తున్నాం. ఆ ఆలోచనతోనే ఈ ట్రిప్పుకు వెళ్లాం. నిజానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లేవరకు కూడా ఈ విహారయాత్ర నుంచి ఎలా తప్పించుకోవాలనే చూశాను. కానీ ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే ఇంత అందమైన స్నేహాన్ని, ప్రేమను మిస్ అయ్యేదాన్ని అనిపిస్తోంది. నాకంటూ ముగ్గురు, నలుగురు స్నేహితులుంటే చాలు ఇంకెవరూ వద్దు అన్నంతలా మారిపోయాను. స్నేహానికి మారుపేరులా..ఎందుకంటే ఎవరితోనైనా స్నేహం చేసినప్పుడు.. అది వర్కవుట్ కాకపోతే.. గొడవలు వస్తే.. ఎలా అన్న భయం నన్నెప్పుడూ వెంటాడుతుంది. కానీ ఈ అమ్మాయిలు స్నేహానికి కొత్త నిర్వచనంలా మారిపోయారు. ప్రతి విషయాల్లో బలవంతంగా దూరకుండా నాకంటూ టైమ్ ఇస్తూనే నా బాగోగులు చూసుకునేవారు. అందుకేనేమో వారికి అంతగా క్లోజ్ అయ్యాను. ప్రెగ్నెన్సీలో మంచి రోజుల్ని, చెడ్డ రోజుల్ని రెండింటినీ చూశాను. ఈ ఫ్రెండ్స్ లేకపోయుంటే నా జర్నీ ఇలా ఉండేదే కాదు.ఐ లవ్యూ..మీరంతా కలిసి నన్నెక్కువ ముద్దు చేసేవారు. అది చూసి నేను కొంత భయపడేదాన్ని కానీ ఇప్పుడలా కాదు. మీరు నా చుట్టూ ఉంటే అదే నా సేఫ్ ప్లేస్. నన్ను బాగా చూసుకున్నందుకు, తినిపించినందుకు, ప్రేమించినందుకు థాంక్యూ. నా కూతురికి మీరందరూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఐ లవ్యూ అని జాహ్నవి రాసుకొచ్చింది. ఫ్రెండ్స్ నిహారిక కొణిదెల, వితికా షెరు, అంబటి భార్గవిని ట్యాగ్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఇలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉండరు అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) చదవండి: RRR చూసి తెలుగు నేర్చుకున్న జపాన్ అభిమాని.. తారక్ ఎమోషనల్ -
RRR చూసి తెలుగు నేర్చుకున్న జపాన్ అభిమాని.. తారక్ ఎమోషనల్
దేవర సినిమా ప్రమోషన్స్ కోసం హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్నాడు. అక్కడి అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ఆటోగ్రాఫ్స్ ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని ప్రేమను చూసి తారక్ పొంగిపోయాడు. 'జపాన్ పర్యటించినప్పుడల్లా ఎన్నో జ్ఞాపకాలు కూడగట్టుకుంటాను. కానీ ఈసారి అంతకుమించి సంతోషమేసింది. ఆర్ఆర్ఆర్ చూసి తెలుగు నేర్చుకున్న అభిమానిజపనీస్ అభిమాని ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) చూశాక తెలుగు నేర్చుకుందని తెలిసి మనసు ఉప్పొంగిపోయింది. సినిమా చూసి ఒక అభిమాని భాష నేర్చుకోవడాన్ని సినీ, భాషా ప్రేమికుడిగా నేను ఎన్నటికీ మర్చిపోలేను. భారతీయ సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తుండటం గర్వకారణం' అని ట్వీట్ చేశాడు. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేశాడు.అతిపెద్ద ఇన్స్పిరేషన్అందులో ఓ అమ్మాయి.. అన్నా.. నేను ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను. రెండు సంవత్సరాల క్రితం తెలుగు రాత నేర్చుకునే పుస్తకాన్ని ప్రాక్టీస్ చేశాను. మీరు నాకు అతి పెద్ద ఇన్స్పిరేషన్ అని పేర్కొంది. ఆమె మాటలు విని ఆశ్చర్యపోయిన తారక్.. వావ్.. మీరే అందరికీ బిగ్ ఇన్స్పిరేషన్ అని పొగిడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.దేవర సినిమాకొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవర (Devara: Part 1). జాన్వీకపూర్ హీరోయిన్గా నటించగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. గతేడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ దాదాపు రూ.440 కోట్లు రాబట్టింది. మార్చి 28న జపాన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతోంది.ఆర్ఆర్ఆర్ మూవీఆర్ఆర్ఆర్ మూవీ విషయానికి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 మార్చి 24న విడుదలైంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించాడు. సుమారు రూ.1200 కోట్లు కొల్లగొట్టిన ఈ పాన్ ఇండియా మూవీ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకుంది. My visits to Japan always give me beautiful memories but this one hit differently. Hearing a Japanese fan tell me she learned Telugu after watching RRR truly moved me. Being a lover of cinema and languages, the power of cinema to be a bridge across cultures and encouraging a… pic.twitter.com/4bQ1v8ZZP8— Jr NTR (@tarak9999) March 27, 2025 చదవండి: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఏర్పాట్లలో శ్యామలా దేవి -
వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఏర్పాట్లలో శ్యామలా దేవి
హీరో ప్రభాస్ (Prabhas) వివాహం కోసం ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ప్రభాస్ ఉండటంతో ఆయన పెళ్లి గురించి ఎక్కువగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫలానా అమ్మాయిని ప్రభాస్ చేసుకోబోతున్నారంటూ.. ఇప్పటికే డార్లింగ్ వివాహంపై ఎన్నో రూమర్స్ సోషల్‌మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు వచ్చిన పలు సందర్భాల్లో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి వివరణ ఇస్తూనే ఉన్నారు.రెబల్‌స్టార్ కృష్ణం రాజుకు నట వారసుడిగా పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను సొంతం చేసుకున్నారు ప్రభాస్. ఆయన పెళ్లి ఏర్పాట్ల పనుల్లో పెద్దమ్మ శ్యామలా దేవి ఉన్నారని పలు ఇంగ్లీష్ వెబ్‌సైట్స్ ప్రచురించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ చేసినట్లు న్యూస్ 18, హిందూస్థాన్ టైమ్స్‌లో కథనాలు వచ్చాయి. అమ్మాయి కుటుంబం ఏపీకి చెందినప్పటికీ వారు హైదరాబాద్‌లో స్థిరపడ్డారని అందులో పేర్కొన్నారు. పెళ్లి ఏర్పాట్లు అన్నీ కూడా ప్రభాస్ పెద్దమ్మ రహస్యంగా చూసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లి గురించి రీసెంట్గా జరిగిన అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణ ప్రశ్నించగా రామ్‌చరణ్ కాస్త క్లూ ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్‌లోని గణపవరానికి చెందిన అమ్మాయిని అతడు (ప్రభాస్) పెళ్లి చేసుకోనున్నారని చరణ్ చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -ప్రభాస్ సిస్టర్స్రీసెంట్గా ప్రభాస్ బంధువుల పెళ్లిలో ఆయన ముగ్గురు చెల్లెల్లు (ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి)తో పాటు కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి సందడిగా కనిపించారు. పెళ్లిలో వారంతా కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.. ఆ వేడుకలోనే ప్రభాస్ వివాహం గురించి వార్తలు బయటకు వచ్చాయట. డార్లింగ్ పెళ్లి గురించి పలువురి బంధువులతో కొన్ని విషయాలను కూడా శ్యామల దేవి పంచుకున్నారని సమాచారం. అందుకే ఇప్పుడు ప్రభాస్ పెళ్లి వార్తలు మరోసారి ట్రెండ్ అవుతున్నాయిని కొందరు అంటున్నారు. ఈ అంశం గురించి శ్యామల దేవి వివరణ ఇస్తే కానీ ఫుల్స్టాప్ పడకపోవచ్చు.(ఇదీ చదవండి: పెళ్లి వేడుకలో ప్రభాస్ చెల్లెళ్లు.. అన్నకు మ్యారేజ్ చేయాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!) -
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్స్‌పై 'సల్మాన్ ఖాన్' రియాక్షన్
తనకు వస్తున్న హత్య బెదిరింపుల గురించి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) స్పందించారు. తను నటించిన కొత్త సినిమా సికిందర్ (Sikandar) ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొంత కాలంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi ) నుంచి చంపేస్తామని సల్మాన్‌కు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇంటి ముందు వారు కాల్పులు కూడా జరిపారు. ఎదోరోజు ఆయనపై తప్పకుండా పగ తీర్చుకుంటామని వారు గట్టిగానే హెచ్చిరించారు. అయితే, తాజాగా ఈ బెదిరింపులపై సల్మాన్ స్పందించారు.సినిమా షూటింగ్స్ వల్ల ఎప్పుడూ కూడా సల్మాన్ చాలా ప్రయాణాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయనకు ప్రభుత్వం కూడా గట్టిగానే భద్రత కల్పించింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలపై ఆయన ఇలా స్పందించారు. 'నేను ఎక్కువగా దేవుడిని నమ్ముతాను. నా జీవితం ఆయన చేతుల్లోనే ఉంది. ఆయుష్షు ఎంత వరకు ఆ దేవుడు ఇచ్చాడో అంత వరకు మాత్రమే జీవిస్తాను. ఇదంతా దేవుడి ఇష్టం. గట్టి భద్రత కల్పించారు. ఒక్కోసారి ఇది కూడా పెను సవాలుగా అనిపిస్తుంది. ఏదేమైనా ఆందోళనగా ఉన్నప్పటికీ మన చేతిలో ఏమీ ఉండదు.' అని ఆయన అన్నారు.సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో సికిందర్ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) తెరకెక్కించారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. రంజాన్, ఉగాది సందర్భంగా మార్చి 30న థియేటర్స్‌లోకి రానుంది. 2023లో విడుదలైన ‘టైగర్ 3’ తర్వాత సల్మాన్ నటించిన సినిమా ఇదే కావడంతో ఆయన ఫ్యాన్స్ సికిందర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తోన్న తరుణంలో సికిందర్ పబ్లిక్ ఈవెంట్స్‌లలో ఆయన పాల్గొనడం లేదు. -
మ్యాడ్ స్క్వేర్ మూవీలో ఐటెం సాంగ్స్ హీరోయిన్ ‘రెబా మోనికా జాన్’ (ఫొటోలు)
-
'విశాల్, సదా' మోస్ట్ వెయిటెడ్ సాంగ్ వీడియో వచ్చేసింది
కోలీవుడ్ హీరో విశాల్(Vishal ) నటించిన ‘మదగజరాజా’(Madha Gaja Raja) చిత్రం సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ ఏడాది సంక్రాంతికి కోలీవుడ్‌లో విడుదలైంది. ఆపై కొద్దిరోజులకే తెలుగులో కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఈ మూవీ సాధించి రికార్డ్ బ్రేక్ చేసింది. సినిమా రన్ టైమ్ ముగిసిపోయి చాలారోజులు అయింది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి మోస్ట్ వెయిటెడ్ సాంగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ‘మదగజరాజా’ చిత్రాన్ని జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మించింది. ఇందులో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) హీరోయిన్స్‌గా నటించారు. హీరోయిన్ సదా( Sadha) కూడా ఒక ఐటెమ్ సాంగ్‌లో కనిపించింది. ఈ పాట వీడియో వర్షన్ కోసం అభిమానులు చాలారోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్ ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేసింది. -
రామ్ చరణ్ RC16 'టైటిల్, ఫస్ట్ లుక్' విడుదల.. బుచ్చి బాబు మార్క్
రామ్ చరణ్(Ram Charan) బర్త్ డే సందర్భంగా తన కొత్త సినిమా (RC16) నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో అదిరిపోయే మాస్ గెటప్‌లో ఆయన కనిపిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu Sana) తన మార్క్ చూపించబోతున్నాడని క్లియర్‌గా అర్థం అవుతుంది. మల్టీ స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా రేంజ్లో ఈ ప్రాజెక్ట్ రానుంది. అయితే, ఈ మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్( Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్(Shiva Rajkumar), బాలీవుడ్ నటుడు దివ్యేందు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.క్రికెట్, కుస్తీ గురించే కాకుండా... మరికొన్ని ఇతర స్పోర్ట్స్ గురించిన ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది. ‘జైలర్’ ఫేమ్ కెవిన్ కుమార్ ఈ యాక్షన్ సీక్వెన్స్ కు కొరియోగ్రఫీ చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు . గేమ్‌ఛేంజర్ పరాజయంతో నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్‌కు రామ్‌చరణ్ ఫస్ట్ లుక్ ఫుల్ జోష్ నింపుతుంది. ఈసారి తప్పకుండా హిట్ కొడుతున్నాం అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 𝐀 𝐌𝐀𝐍 𝐎𝐅 𝐓𝐇𝐄 𝐋𝐀𝐍𝐃, 𝐀 𝐅𝐎𝐑𝐂𝐄 𝐎𝐅 𝐓𝐇𝐄 𝐍𝐀𝐓𝐔𝐑𝐄 ❤️🔥#RC16 is #PEDDI 🔥💥Happy Birthday, Global Star @AlwaysRamCharan ✨#HBDRamCharan#RamCharanRevolts@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli… pic.twitter.com/ae8BkshtR3— Mythri Movie Makers (@MythriOfficial) March 27, 2025 -
తెలుగు ఇండస్ట్రీలో అత్యుత్తమ మహిళలకు 'షీ తెలుగు నక్షత్రం అవార్డ్స్' (ఫోటోలు)
-
పుష్ప2 'కిస్సిక్' సాంగ్ మేకింగ్ వీడియో చూశారా..?
పుష్ప సినిమా 'ఊ అంటావా మామ' సాంగ్ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.. పుష్ప2లో కిస్.. కిస్.. కిస్సిక్ సాంగ్ వైరల్ అయింది. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం నటి శ్రీలీల (Sreeleela) తనదైన గ్లామర్, స్టెప్పులతో దుమ్మురేపింది. అయితే, ఇప్పుడు ఆ సాంగ్ మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అత్యంత వేగంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న దక్షిణాది పాటగా కిస్సిక్ రికార్డు సృష్టించింది. ఈ సాంగ్‌కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు. సింగర్ సుభ్లాషిణి ఆలపించారు. ఇప్పటికే ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో ఉంది. తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ చేయడంతో నెట్టింట ట్రెండ్ అవుతుంది. కిస్సిక్ అంటూ మీరూ చూసేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. -
అట్లీతో సినిమా ఇప్పట్లో లేదు.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
హిందీలో షారుక్ ఖాన్‌తో ‘జవాన్’ తీసి, బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు తమిళ దర్శకుడు అట్లీ ( Atlee Kumar). ‘జవాన్’ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు రూ. వెయ్యి కోట్లకు పైగా దాటాయి. ఈ క్రమంలో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న తదుపరి చిత్రం ఏంటి..? అనే చర్చలు చాలారోజుల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్(Allu Arjun), సల్మాన్ ఖాన్లలో ఒకరితో ఆయన సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ (Salman Khan) కాంబినేషన్లోనే అట్లీ సినిమా దాదాపు ఖరారైనట్లే అనే టాక్ బాలీవుడ్లో బలంగా వినిపించింది. ఈ సినిమాను దక్షిణాదిలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ నిర్మించనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వైరల్ అయింది. అయితే, తాజాగా ఈ విషయంపై సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. అట్లీతో సినిమా ఇప్పట్లో ఉండదని ఆయన తేల్చేశారు. ఇది భారీ బడ్జెట్ చిత్రం కావడంతోనే కాస్త వాయిదా వేస్తున్నట్లు సల్మాన్ ప్రకటించారు. అయితే, అట్లీతో సినిమా ఉంటుందని మాత్రం ఆయన చెప్పుకొచ్చారు.బన్నీ- అట్లీ లైన్ క్లియర్బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలతో అల్లు అర్జున్- అట్లీ మూవీ దాదాపు ఖరారైపోయిందని చెప్పవచ్చు. 'పుష్ప 2' తర్వాత లెక్క ప్రకారం త్రివిక్రమ్‌తో బన్నీ మూవీ చేయాలి. కానీ ఇది భారీ బడ్జెట్‌తో తీసే మైథలాజికల్ కావడంతో ప్రీ ప్రొడక్షన్‌కే చాలా సమయం పట్టే అవకాశముంది. దీంతో ఈ గ్యాప్‌లో మరో మూవీ చేయాలని బన్నీ అనుకున్నాడట. ఈ క్రమంలోనే అట్లీ లైనులోకి వచ్చాడు. ఈ ప్రాజెక్టుని బన్నీ పుట్టినరోజు అంటే ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. -
ఆ సినిమా తొలి రోజే అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుంది: నిర్మాత రవిశంకర్
టాలీవుడ్ నిర్మాత వై.రవిశంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్‌హుడ్ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ గురించి వ్యాఖ్యానించారు. అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మొదటి రోజే రికార్డులు కొల్లగొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కోలీవుడ్‌లోనే ఓపెనింగ్ డే ఆల్ రికార్డ్స్ సృష్టిస్తుందని మా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించిన గుడ్ బ్యాడ్ అగ్లీ వచ్చేనెల 10న విడుదల కానుంది. ఈ మూవీలో అజిత్ కుమార్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది.కాగా.. నితిన్ రాబిన్ హుడ్ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. భీష్మ సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించడం మరో విశేషం. ఇటీవల ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన సందడి చేశారు. శ్రీలీల, కేతికా శర్మతో కలిసి అది దా సర్ప్రైజ్ అంటూ స్టెప్పులు కూడా వేశారు. ఈ సినిమా ఉగాది కానుకగా ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. తమిళ ఇండస్ట్రీలో #GoodBadUgly DAY 1 రికార్డులు కొడుతుంది - #RaviShankar#AjithKumar #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/90DmdTZclA— Telugu FilmNagar (@telugufilmnagar) March 26, 2025 -
రాజేంద్రప్రసాద్ బూతు మాటలపై డేవిడ్ వార్నర్ రియాక్షన్ ఇదీ..
ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎంట్రీతో రాబిన్‌హుడ్ సినిమా (Robinhood Movie)కు కొత్త జోష్ వచ్చినట్లయింది. అతడి స్పెషల్ ఎంట్రీ సినిమాలోనే కాకుండా ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ ఉండటంతో అభిమానులు సంతోషపడ్డారు. కానీ ఇదే ఈవెంట్లో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ వార్నర్‌పై నోరు జారాడు. రేయ్ వార్నరూ.. క్రికెట్ ఆడమంటే కుప్పిగంతులు వేస్తున్నావ్.. అంటూ అతడిని వెక్కిరిస్తూ ఓ బూతు మాట కూడా అన్నాడు.క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్అంత పెద్ద క్రికెటర్‌ను పట్టుకుని ఇలాంటి చవకబారు వ్యాఖ్యలేంటని జనం మండిపడ్డారు. దీంతో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) క్షమాపణలు తెలిపాడు. వార్నర్ అంటే తనకిష్టమని, ఉద్దేశపూర్వకంగా అలాంటి మాట అనలేదన్నాడు. పొరపాటున నోరు జారానని, మరోసారి అలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. తన మాట తీరు వల్ల ఎవరైనా బాధపడుంటే క్షమించండి అని కోరాడు.వార్నర్ రియాక్షన్ ఇదీ!ఈ విషయంలో వార్నర్ (David Warner) రియాక్షన్ ఎలా ఉందో బయటపెట్టాడు దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula). వెంకీ మాట్లాడుతూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మేమందరం కలిశాం. అప్పుడు రాజేంద్రప్రసాద్‌గారు, వార్నర్ బాగా క్లోజ్ అయ్యారు. రాజేంద్రప్రసాద్‌గారు చాలా పెద్దాయన, కానీ చిన్నపిల్లాడి మనస్తత్వం. ఏదనిపిస్తే అది మాట్లాడతారు. నువ్వు యాక్టింగ్‌కు వచ్చావ్ కదా.. చూసుకుందాం అని రాజేంద్రప్రసాద్.. నువ్వు క్రికెట్‌కు రా.. చూసుకుందాం అని వార్నర్ ఒకరినొకరు టీజ్ చేసుకున్నారు.నోరు జారాడుదాన్ని స్టేజీపై ఫన్ చేసే క్రమంలో రాజేంద్రప్రసాద్ అనుకోకుండా ఓ మాట తూలారు. అందుకు ఆయన కూడా బాధపడ్డారు. ఈ విషయం గురించి వార్నర్‌తో మాట్లాడా.. కాస్త నోరు జారాడు, ఏమీ అనుకోకు అని చెప్పాను. అందుకు వార్నర్.. క్రికెట్లో పెద్ద పెద్ద స్లెడ్జింగ్‌లు (కావాలని తిట్టుకోవడం) చూశాను. మా స్లెడ్జింగ్‌లు చూస్తే మీరు చెవులు మూసుకుంటారు. ఇది యాక్టర్స్ మధ్య స్లెడ్జింగ్.. ఇట్స్ ఓకే.. అని పాజిటివ్‌గా మాట్లాడారు. ఆయన చాలా మంచి మనిషి అని వెంకీ చెప్పుకొచ్చాడు. నితిన్ హీరోగా శ్రీలీల కథానాయికగా నటించిన రాబిన్‌హుడ్ మార్చి 28న విడుదల కానుంది. ఇందులో వార్నర్ ముఖ్య పాత్ర పోషించాడు.చదవండి: 15 ఏళ్ల క్రితం పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకున్నా.. కానీ అదంతా టైం వేస్ట్ -
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బర్త్ డే స్పెషల్ అప్డేట్ వచ్చేసింది!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ16 మూవీతో బిజీగా ఉన్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈనెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఆర్సీ16 సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. చెర్రీ బర్త్ డే స్పెషల్‌గా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. గురువారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్ స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో చెర్రీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. Grit, power, and an untamed spirit from the rural lands ❤️🔥#RC16 TITLE & FIRST LOOK out tomorrow at 9.09 AM 💥💥#RamCharanRevoltsGlobal Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @IamJagguBhai @divyenndu… pic.twitter.com/ZvwUrN7fNl— Vriddhi Cinemas (@vriddhicinemas) March 26, 2025 -
15 ఏళ్ల క్రితం పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకున్నా.. కానీ అంతకంటే టైం వేస్ట్ ఇంకోటి లేదు!
50 ఏళ్లు దాటినా ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటున్నాడు నటుడు హర్ష వర్ధన్. అమృతం సీరియల్‌తో తెలుగువారికి దగ్గరైన ఈయన ఇటీవల 'కోర్ట్' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ స్టోరీని బయటపెట్టడంతో పాటు పెళ్లిపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.ఏడేళ్ల ప్రేమ..హర్షవర్ధన్ (Actor Harsha Vardhan) మాట్లాడుతూ.. వివాహబంధానికి నేను పెద్ద అభిమానిని. కానీ ఓ అమ్మాయి వల్ల లవ్ ఫెయిలై పెళ్లి జోలికి వెళ్లాలనుకోవడం లేదు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాను. ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్నాం. ఎన్నడూ ఐ లవ్యూలు చెప్పుకోలేదు. పిల్లల్ని కనకుండా అనాథాశ్రమం నుంచి ముగ్గురు, నలుగుర్ని దత్తత తీసుకోవాలనుకున్నాం. సడన్‌గా చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిందిఆ అమ్మాయికి ఇలాంటి ఆలోచనలు రావడం చూసి ఆశ్చర్యమేసింది. ఇంతకంటే మంచి జోడీ ఇంకెక్కడ దొరుకుతుంది? అనిపించింది. అయితే సడన్‌గా ఓరోజు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయి మరొకరిని పెళ్లి చేసుకుంది. నేను స్టేజీపై ఒక అవార్డు తీసుకుంటున్న సమయంలో తన పెళ్లయిపోయిందని తెలిసింది. నిజానికి రెండు నెలలుగా తన వైపు నుంచి నాకు ఫోన్ రాలేదు. పని బిజీలో పడిపోయి ఆ సంగతే మర్చిపోయాను. నేను తనకు టైం ఇవ్వకపోవడం వల్లే నన్ను వదిలేసి ఉండొచ్చు.తను వెళ్లిపోవడం వల్లే మంచి జీవితం దొరికిందేమో!కానీ నాతో ఒక్కమాటయినా చెప్పాలి కదా.. చెప్పలేదు. చాలా బాధపడ్డాను. రెండు మూడు రోజులు మందు తాగి అర్జున్‌రెడ్డిలా మారిపోయాను. అయినా నేనక్కర్లేదు అనుకున్న మనిషి నాకూ అక్కర్లేదు కదా అని రియలైజ్ అయ్యాను. వెంటనే ఆ బాధ నుంచి బయటకు వచ్చేశాను. తను వెళ్లకపోతే నాకు ఇంత మంచి జీవితం దొరికేది కాదేమో! ఎందుకంటే నేను సినిమాల్లోకి రావడం తనకిష్టం లేదు. ఏది జరిగినా మన మంచికే జరిగిందనుకున్నాను. పిల్లల్ని పెంచడం.. ఇదో టైం వేస్ట్ పని15 ఏళ్ల క్రితంవరకు పిల్లల్ని దత్తత తీసుకుంటే బాగుండనుకున్నాను. కానీ తర్వాత దీనికంటే టైం వేస్ట్ పని ఇంకోటి లేదనిపించింది. పిల్లలు అనే కాన్సెప్టే.. అన్ని అనర్థాలకు దారి తీస్తుంది. ఇలా మా నాన్నగారు అనుకుని ఉండుంటే నేను పుట్టేవాడినే కాదనుకోండి. పెళ్లి- పిల్లలు అంటే కాంప్రమైజ్ అయి బతకాలి. అడ్జస్ట్ అవ్వాలి.. అవి నా వల్ల కాదు. ఈ బంధాలు బాంధవ్యాలు వద్దు. అందుకే పెళ్లి అనే ఆలోచననే విరమించుకున్నాను అని హర్షవర్దన్ చెప్పుకొచ్చాడు.సినిమాహర్షవర్ధన్.. 3, మనం, చిన్నదాన నీకోసం, గురు, తిక్క చిత్రాలకు డైలాగ్స్ రాశాడు. గుండె జారి గల్లంతయ్యిందే మూవీకి రచయితగా పని చేశాడు. మామా మశ్చీంద్ర చిత్రంతో దర్శకుడిగానూ మారాడు. నటుడిగా.. పౌర్ణమి, 3, జోష్, లీడర్, గీతాంజలి, ఆగడు, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, అంటే సుందరానికి, హిట్: 2, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, సరిపోదా శనివారం వంటి పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తున్నాడు.చదవండి: సడన్‌గా శోభితను తీసేసి ఆమె స్థానంలో కుక్కతో షూటింగ్ -
శంకర్ వరప్రసాద్‌గా చిరంజీవి.. మెగా అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి (Anil Ravipudi) అంటేనే హాస్యానికి, విజయానికి చిరునామా. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మామూలు సక్సెస్ అందుకోలేదు. ఎవరూ ఊహించనంతగా బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాడు. ఈ సంతోషంలో వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తున్నామని మాటిచ్చేశాడు. కాకపోతే ఈసారి వెంకీమామతో కాదు.. చిరంజీవి (Chiranjeevi Konidela)తో! ఇందుకోసం వైజాగ్ వెళ్లి సినిమా కథ సిద్ధం చేసుకున్నాడు. కథకు పచ్చజెండా ఊపిన చిరుగ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు రేంజ్లో చిరంజీవిని చూస్తారని అభిమానులకు మాటిచ్చాడు. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా అప్డేట్ ఇచ్చాడు. 'కథ పూర్తయింది. చిరంజీవిగారికి ఫైనల్ స్క్రిప్ట్ చదివి వినిపించాను. నా కథలోని శంకర్ వరప్రసాద్ పాత్రను పరిచయం చేశాను. ఆయనకు చాలా బాగా నచ్చింది. ఇంకెందుకు లేటు.. త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగబొమ్మకు శ్రీకారం చుట్టేద్దాం' అని ఎక్స్(ట్విటర్)లో ట్వీట్ చేశాడు.చిరంజీవి ఒరిజినల్ పేరుతో..షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఈ సినిమా నిర్మితం కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు. ఇది చూసిన అభిమానులు ఉగాదికి ముందు ఎంత మంచి శుభవార్త చెప్పారు.. ఇంకో బ్లాక్‌బస్టర్ తథ్యం అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఇందులో శివ అనే పదాన్ని తీసేసి మిగతాది యథాతథంగా వాడేశారు. మెగాస్టార్ అసలు పేరును వాడేస్తున్న అనిల్ రావిపూడి సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో తెలియాలంటే వచ్చే సంక్రాంతిదాకా ఆగాల్సిందే! Final script narration done & locked 📝☑️🔒 చిరంజీవి గారికి నా కధ లో పాత్ర“శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను .. 😄He loved & enjoyed it thoroughly ❤️🔥ఇంకెందుకు లేటు, త్వరలో ముహూర్తంతో… ‘చిరు’ నవ్వుల పండగబొమ్మ కి శ్రీకారం 🥳#ChiruAnil MegaStar @KChiruTweets garu…— Anil Ravipudi (@AnilRavipudi) March 26, 2025 చదవండి: అర్ధరాత్రి ఫోన్.. నన్ను తీసేసి ఓ శునకాన్ని పెట్టుకున్నారు.. శోభిత హర్ట్ -
భారతీరాజా తనయుడు మృతి.. మైత్రి మూవీ మేకర్స్ కీలక నిర్ణయం
కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ గుండెపోటుతో మంగళవారం సాయంత్రం మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన మనోజ్‌కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 48 ఏళ్లు కాగా.. ఇటీవలే ఆయనకు గుండెకు శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది.అయితే ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంతాపం వ్యక్తం చేసింది. మనోజ్ మృతితో కీలక నిర్ణయం తీసుకుంది. తమ బ్యానర్లో తెరకెక్కించబోయే ప్రదీప్ రంగనాథన్ మూవీ ప్రకటనను వాయిదా వేసింది. ఇవాళ ఉదయం 11:07 నిమిషాలకు విడుదల కావాల్సిన ఫస్ట్ షాట్ బూమ్ టైమ్‌ను మార్చినట్లు ట్విటర్ ద్వారా వెల్లడించింది.(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. దర్శకుడు భారతీరాజా కుమారుడు కన్నుమూత)కాగా.. మనోజ్ భారతిరాజా ప్రముఖ లెజెండరీ ఫిల్మ్ మేకర్ భారతిరాజా కుమారుడు. మనోజ్ తొలిసారిగా తాజ్ మహల్ (1999)మూవీలో నటించారు. ఆ తర్వాత అల్లి అర్జున (2002), కాదల్ పుక్కల్ (2001), అన్నక్కోడి, పల్లవన్, లాంటి తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. గత రెండేళ్లుగా దర్శకత్వం వైపు అడుగులు వేశారు. తన తండ్రి నిర్మించిన 2023 తమిళ చిత్రం మార్గజి తింగల్‌తో దర్శకుడిగా పరిచయమయ్యారు.Due to the unfortunate passing of Manoj Bharathiraja Sir, son of legendary filmmaker Bharathiraja Sir, the #PR04 'FIRST SHOT BOOM' is postponed to a later time today. Our heartfelt condolences to the family. May the family find strength and peace in these tough times.— Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2025 -
మంచు ఫ్యామిలీలో గొడవలు.. మామయ్యకేమైనా అవుతుందేమోనని..: విరానిక
కుటుంబ గొడవలతో ముంచు ఫ్యామిలీ పరువు రోడ్డునపడింది. విష్ణు (Vishnu Manchu)- మనోజ్ (Manoj Manchu)కు మధ్య సఖ్యత కుదరట్లేదు అనుకుంటే.. మనోజ్- మోహన్‌బాబు మధ్య కూడా గొడవలు జరగడం అభిమానులనే కాదు ఇండస్ట్రీని సైతం షాక్‌కు గురి చేసింది. ఇలా వీరింట్లో ఏదో ఒకరకంగా తగవులాడుతూనే ఉన్నారు. ఈ రచ్చ వల్ల తన పిల్లలు ఇబ్బందిపడుతున్నారంటోంది మంచు మోహన్‌బాబు పెద్ద కోడలు, విష్ణు సతీమణి విరానిక (Viranica Manchu). ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతాయితాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె కుటుంబ కలహాలపై స్పందించింది. విరానిక మాట్లాడుతూ.. కుటుంబమన్నాక గొడవలు అవుతూనే ఉంటుంది. కేవలం మా ఫ్యామిలీ అనే కాదు ప్రతి ఇంట్లోనూ జరుగుతాయి. కానీ చాలావరకు బయటకు రావు. దురదృష్టవశాత్తూ మా కుటుంబంలోని గొడవలు బయటకువచ్చాయి. దానికి మనమేం చేయలేం. నాకు నా పిల్లలు ముఖ్యం. వారికోసం ఏదైనా భరిస్తాను. ఒక స్పాంజిలా అన్నింటినీ ఓపికగా స్వీకరిస్తాను. పిల్లలకన్నా నాకెవరూ ముఖ్యం కాదు. కానీ జరుగుతున్న రచ్చ వల్ల నాకన్నా నా పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. భయపడిపోతున్నారు. నాలుగో ప్రెగ్నెన్సీపై ట్రోలింగ్అసలేం జరుగుతుంది? తాతయ్యకేమైనా అవుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. అందుకే పిల్లల్ని.. వివాదాలకు చాలా దూరంగా ఉంచుతాను. నేను ధైర్యంగా ఉంటేనే వారికి ఎంతోకొంత ధైర్యం చెప్పగలను అని విరానిక చెప్పుకొచ్చింది. అలాగే తను నాలుగోసారి గర్భం దాల్చినప్పుడు కూడా చాలామంది ట్రోల్ చేశారంది. మీకేం పని లేదా? అంటూ నోటికొచ్చినట్లు తిట్టారని బాధపడింది. విష్ణుకు, తనకు పిల్లలంటే ఇష్టమని.. అందుకే నలుగుర్ని కన్నామని విరానిక పేర్కొంది.చదవండి: అర్ధరాత్రి ఫోన్.. నన్ను తీసేసి ఓ శునకాన్ని పెట్టుకున్నారు.. హర్టయిన శోభిత -
అర్ధరాత్రి ఫోన్.. నన్ను తీసేసి ఓ శునకాన్ని పెట్టుకున్నారు.. హర్టయిన శోభిత
సక్సెస్ అంత ఈజీగా రాదు. ఎన్నో ఆటంకాలు, అవమానాలు దాటుకుని వచ్చాకే విజయ ఫలాల్ని అందుకోగలరు. తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) విషయంలోనూ ఇదే జరిగింది. టాలీవుడ్ (Tollywood)లో కంటే బాలీవుడ్ (Bollywood)లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. అయితే హీరోయిన్గా నిలదొక్కుకోవడానికి ముందు చేదు అనుభవాల్ని ఎదుర్కొందట. గతంలో తనే ఈ విషయాన్ని వెల్లడించింది. రాత్రి 11.30 గంటలకు ఫోన్శోభిత మాట్లాడుతూ.. ఒక బ్రాండ్ వాళ్లు రాత్రి 11.30 గంటలకు ఫోన్ చేసి ఆడిషన్‌కు పిలిచారు. నాకు కాస్త విచిత్రంగా అనిపించింది. సర్లే అని వెళ్లాను. ఆడిషన్ పూర్తయింది. నన్ను సెలక్ట్ చేశామని తెలిపారు. యాడ్ షూటింగ్ కోసం గోవాకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అదేదో థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా కాకపోయినా గోవా అనగానే నేను ఎగ్జయిట్ అయ్యాను. గోవా వెళ్లాక మొదటిరోజు షూటింగ్ బానే జరిగింది. కానీ కెమెరాలో ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్పి మిగిలింది తర్వాత షూట్ చేద్దామన్నారు. సెట్టవట్లే అని తీసేశారుతర్వాతి రోజు నేను సెట్‌కు వెళ్లగానే.. ఈ అమ్మాయి మన బ్రాండ్ ఇమేజ్‌కు సరిపోదు అని మాట్లాడుతున్నారు. కారణమేంటో తెలుసా? నేను కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నానని వద్దన్నారు. అంత ఆత్మస్థైరంతో కనిపించే అమ్మాయి ఈ బ్రాండ్‌కు సెట్టవదని పక్కన పెట్టేశారు. నా ప్లేస్‌లో ఓ శునకాన్ని తీసుకున్నారు. కానీ ఒకరోజు పనిచేసినందుకు నాకు డబ్బులిచ్చారు అని చెప్పుకొచ్చింది. అది విన్న యాంకర్.. శోభితకు బదులు శునకాన్ని బ్రాండ్ ప్రమోషన్ కోసం వాడుకోవడమేంటని నోరెళ్లబెట్టారు.సినిమా..రామన్ రాఘవన్ 2.0 సినిమాతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభించింది శోభిత. గూఢచారితో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. మేజర్, పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో మెరిసింది. మంకీ మ్యాన్ అనే హాలీవుడ్లో మూవీలోనూ యాక్ట్ చేసింది. కల్కి 2898 ఏడీ చిత్రంలో దీపికా పదుకొణెకు తెలుగు డబ్బింగ్ చెప్పింది. శోభిత 2024 డిసెంబర్ 4న హీరో అక్కినేని నాగచైతన్యను పెళ్లాడింది. View this post on Instagram A post shared by MTV (@toni.op55) చదవండి: వాటాలు పంచుకుందాం..టాలీవుడ్ దర్శకులు ఓకే అంటారా? -
నితిన్ ‘రాబిన్ హుడ్’ HD మూవీ స్టిల్స్
-
భార్యపై ఎంత ప్రేమో.. రహస్యతో హీరో కిరణ్ అబ్బవరం (ఫొటోలు)
-
చీరలో రీతూ చౌదరి ఒయ్యారాలు (ఫొటోలు)
-
అభినవ్ సాహసాలు
‘ఆదిత్య, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్’ వంటి సందేశాత్మక బాలల చిత్రాలను తెరకెక్కించిన దర్శక–నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన తాజా చిత్రం ‘అభినవ్’. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీలక్ష్మీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ బాలల చిత్రం నవంబరు 14న విడుదల కానుంది.ఈ చిత్రం విలేకరుల సమావేశంలో భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘స్వాతంత్య్ర సమరయోధుడైన తన తాతయ్య నారాయణరావు స్ఫూర్తితో అభినవ్ అనే సాహస బాలుడు ఓ గంజాయి మాఫియాను ఎలా అడ్డుకున్నాడు? అన్నదే ‘అభినవ్’ చిత్రం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు డ్రగ్స్ రహిత సమాజం కోసం సినిమా వాళ్లు చిన్న వీడియో చేయాలని కోరారు. నేను డ్రగ్స్ రహిత సమాజం కోసం నా వంతుగా ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించాను’’ అని అన్నారు. -
ఎక్కడికెళ్లినా గర్వంగా ఇక్కడికే వస్తా!: శ్రీలీల
‘‘ఒక సినిమాతో ప్రేక్షకులకు వినోదం పంచితే, మరో సినిమాతో సందేశం ఇవ్వాలి. ఇలా నా సినిమాలను బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నాను. తెలుగు అమ్మాయిగా, హీరోయిన్గా నాపై ఆ బాధ్యత ఉంటుంది’’ అని హీరోయిన్ శ్రీలీల అన్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ అతిథి పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక శ్రీలీల పంచుకున్న విశేషాలు. ⇒ ‘రాబిన్‌హుడ్’ సినిమాలో ఫారిన్ నుంచి ఇండియాకు వచ్చిన నీరా వాసుదేవ్ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తన ప్రపంచంలో తను ఉంటుంది. ఈ ప్రపంచం అంతా తన చుట్టూనే ఉంటుందని అనుకుంటుంది. నా కెరీర్లో నీరా వాసుదేవ్ లాంటి ఫన్ రోల్‌ను ఇప్పటివరకూ చేయలేదు. నితిన్‌గారితో వర్క్ చేయడం ఇది రెండోసారి (గతంలో ‘ఎక్స్ట్రా’ మూవీలో కలిసి నటించారు). చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఓ ఫ్యామిలీ మెంబర్లా ఉంటారు. ఈ సినిమాతో మాకు హిట్ పెయిర్‌గా పేరు వస్తుంది. ‘రాబిన్‌హుడ్’ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. ⇒ నీరా వాసుదేవ్ పాత్రకు రష్మికా మందన్నాను అనుకున్నారు. రష్మికకు కూడా నచ్చిన పాత్ర ఇది. కానీ కాల్షీట్స్ విషయంలో సమస్యలు రావడం వల్ల రష్మిక తప్పుకున్నారు. ఆ సమయంలో వెంకీగారు నాకు ఫోన్ చేసి, ఈ రోల్ గురించి చెప్పారు. నాకు నచ్చి ఓకే అన్నాను. ఇటీవల ‘పుష్ప: ది రూల్’ షూటింగ్లో మేం కలుసుకున్నప్పుడు రష్మిక నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేను మైత్రీ ఫ్యామిలీలో ఉన్నానని గర్వంగా చెప్పగలను. మన ఫ్యామిలీతో సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో, వారితో మూవీ చేస్తే అలా ఉంటుంది. ⇒ ‘పుష్ప ది రూల్’ సినిమాలో ‘కిస్సిక్’ స్పెషల్ సాంగ్ చేశాను. ఈ సాంగ్ సక్సెస్ తర్వాత ఆ తరహా స్పెషల్ సాంగ్స్ చేసేందుకు నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ ‘పుష్ప: ది రూల్’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపొందిన భారతీయ సినిమా. సో... ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశాను. అయితే ఇకపై ఇలాంటి పెద్ద సినిమాల్లో సాంగ్స్‌కి బదులుగా మంచి రోల్స్ చేయాలనుకుంటున్నాను. ⇒ 2023లో నావి ఐదారు సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాంతో త్రీ షిఫ్ట్స్ కూడా వర్క్ చేశాను. అయితే గత ఏడాది హీరోయిన్గా ఒకే ఒక్క సినిమా (‘గుంటూరు కారం) లో కనిపించాను. నా ఫైనల్ ఇయర్ మెడికల్ ఎగ్జామ్స్ వల్ల ఎక్కువ సినిమాలు చేయలేదు. ఈ గ్యాప్‌లో ఎన్నో మంచి రోల్స్, మంచి చిత్రాలు వదులుకున్నాను.⇒ ప్రస్తుతం రవితేజగారితో ‘మాస్ జాతర’, శివ కార్తికేయన్గారితో ‘పరాశక్తి’, కన్నడ–తెలుగు భాషల్లో ‘జూనియర్’ సినిమా చేస్తున్నాను. ‘రాబిన్ హుడ్’లో కేతికా శర్మ చేసిన స్పెషల్ సాంగ్ ‘అదిదా సర్ప్రైజ్’లోని కొన్ని డ్యాన్స్ మూమెంట్స్‌కి భిన్నాబిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మీరు అద్భుతమైన డ్యాన్సర్. ఆ తరహా డ్యాన్స్ మూవ్స్, కొరియోగ్రఫీ గురించి ఓ హీరోయిన్గా ఏం చెప్తారు? ‘‘ఒక అమ్మాయి దృష్టి కోణంలో చెప్పాలంటే... మనం కంఫర్టబుల్‌గా ఉన్నామా? లేదా? అనేది ముఖ్యం. స్టెప్స్ అనేవి చేసేవారి కంఫర్ట్ లెవల్స్‌పై ఆధారపడి ఉంటాయి. కంఫర్ట్ జోన్ అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంది. అయితే... అమ్మాయి ఇబ్బంది పడలేదు అన్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. హీరోయిన్గా నేను ఎన్నో సాంగ్స్ చేశాను. శేఖర్ మాస్టర్‌తో కూడా చేశాను. అందరం హ్యాపీ’’ అంటున్న శ్రీలీలతో బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాలోని డ్యాన్స్ మూవ్స్, అలాగే వేరే సినిమాల్లోని ఈ తరహా డ్యాన్స్ మూవ్స్‌పై మహిళా కమిషన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. మీరేం అంటారు? అన్న ప్రశ్నకు శ్రీలీల బదులిస్తూ... ‘‘మహిళా కమిషన్‌కి మంచి స్థాయి ఉంది. ఏది సరైనదో వారికి తెలుసు. పాత సినిమాల పట్ల కూడా వారికి నాలెడ్జ్ ఉంది. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నాను’’ అన్నారు.హిందీ చిత్ర పరిశ్రమలో బిజీ అవుతున్నారు... అక్కడికే వెళ్లిపోతారని కొందరు అంటున్నారు.. అన్ని భాషల్లో సినిమాలు చేయాలనుకుంటున్నాను. కానీ శ్రీలీల అంటే ఎవరు? తెలుగింటి అమ్మాయి. తెలుగు∙చిత్ర పరిశ్రమ నాకు ఇల్లులాంటిది. ఒకవేళ బయటకు వెళ్లినా గర్వంగా ఇక్కడికే (తెలుగు) తిరిగి వస్తాను. మన పిల్లలు చదువుకోవడానికి మరొక చోటుకు వెళతారు. కానీ మళ్లీ మన ఇంటికే వస్తారు కదా! సరిహద్దులు మారినంత మాత్రాన గాలి మారదు. నేను అన్ని భాషలనూ బ్యాలెన్స్ చేస్తూ, సినిమాలు చేయాలనుకుంటున్నాను. -
మంచు విష్ణు కన్నప్ప.. మరో రెండు పాత్రలు రివీల్
టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. ఇప్పటికే రిలీజైన కన్నప్ప పోస్టర్లు, టీజర్లు, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ప్రస్తుతం కన్నప్ప మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో రెండు పాత్రలను రివీల్ చేశారు. రఘుబాబు, శివబాలాజీ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో రఘు బాబు మల్లు అనే ఓ పాత్రను పోషిస్తుండగా.. శివబాలాజీ కుమారదేవ శాస్త్రిగా కనిపించనున్నారు.కాగా.. ఈ చిత్రంలో శివయ్యగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ అగర్వాల్, రుద్రుడిగా ప్రభాస్, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు పాత్రలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు కన్నప్ప టీం సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న తెలుగు, తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Revealing Sivabalaji's enlightened transformation as #KumaradevaShastri and Raghubabu as #Mallu in #Kannappa🏹!A journey of wisdom and unwavering devotion etched in divine history. 🔱Har Har Mahadev 🔱Har Ghar Mahadev 🔥@themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas… pic.twitter.com/hRO4MPWFQ5— Mukesh Kumar Singh (@mukeshvachan) March 25, 2025 -
ఉద్యోగం కోసం ఫారిన్కే పోవాలా?.. ఆసక్తిగా హోమ్ టౌన్ ట్రైలర్
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు మరో వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన తెలుగు వెబ్ సిరీస్ హోమ్ టౌన్(Home Town). ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పడే కష్టాల నేపథ్యంలోనే ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ ఫ్యామిలీ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. తమ పిల్లలు బాగా చదివి గొప్పవాళ్లుగా ఎదిగితే చూడాలని ఆశపడే తండ్రి తపనే ట్రైలర్లో ప్రధానంగా కనిపిస్తోంది. మధ్య తరగతి కుటుంబాల పరిస్థితులు ఎలా ఉంటాయనేదే హోమ్ టౌన్లో ట్రైలర్లో చూపించారు. ఈ వెబ్ సిరీస్‌కు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. వచ్చేనెల నాలుగో తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.You can leave your hometown, but can you ever leave the memories?The streets, the friendships, the late-night dreams Srikanth’s journey is ours too.https://t.co/T4V4GXBJWL#Hometown premieres from April 4 on #aha#ahaOriginal #RajeevKanakala #Jhansi pic.twitter.com/D523DRCH1s— ahavideoin (@ahavideoIN) March 25, 2025 -
హ్యాపీ డేస్ నటుడికి సర్జరీ.. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ప్రాక్టీస్!
టాలీవుడ్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆదర్శ్ బాలకృష్ణ. తెలుగులో బిగ్‌బాస్ మొదటి సీజన్లో కంటెస్టెంట్ కూడా పాల్గొన్నారు. టాలీవుడ్లో పలు సినిమాల్లో తనదైన నటనతో ఆదర్శ్ బాలకృష్ణ అభిమానులను మెప్పించారు. గతంలో ఝాన్సీ వెబ్ సిరీస్‌తో అభిమానులను మెప్పించిన ఆదర్శ్.. ప్రస్తుతం గౌతమ్ వాసుదేవ్ మీనన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఆయనతో దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.అయితే తాజాగా ఆదర్శ్ బాలకృష్ణ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సర్జరీ తొలి రోజు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసిన వీడియోను పంచుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ మొదటి రోజు చిన్నచిన్న కసరత్తులు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తానని పోస్ట్ చేశారు. అయితే ఇంతకీ ఆదర్శ్ బాలకృష్ణకు అసలేం జరిగిందో తెలియాల్సి ఉంది. మోకాలికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నారా? లేదంటే మరేదైనా కారణాలున్నాయా? అనే వివరాలపై క్లారిటీ లేదు.సినీ కెరీర్ విషయానికొస్తే హ్యాపీ డేస్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత టాలీవుడ్ పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించారు. గత రెండేళ్లలో రంగమార్తాండ, శాకుంతలం, మిక్సప్ సినిమాలలో అభిమానులను అలరించారు. -
'నాకు శ్రీలీల తప్పితే ఎవరూ నచ్చరు'.. వార్నర్ మామ తెలుగు ప్రాక్టీస్ చూశారా?
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యారు. రాబిన్‌హుడ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ అభిమానులను మెప్పించనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా డేవిడ్ వార్నర్ సందడి చేశారు. అంతేకాదు తెలుగులోనూ ఏకంగా డైలాగ్స్ కూడా చెప్పి అలరించారు.అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డేవిడ్ వార్నర్‌కు తెలుగు నేర్పించే పనిలో ఫుల్ బిజీ అయిపోయారు నితిన్, శ్రీలీల. వార్నర్ మామకు తెలుగు నేర్పిద్దామని నితిన్ చెప్పారు. నాకు తెలుగు సినిమాలో నితిన్ అంటే పిచ్చి అని వార్నర్‌తో చెప్పించగా.. ఆ తర్వాత నాకు శ్రీలీల తప్పితే ఎవరూ నచ్చరు.. అంటూ వార్నర్‌తో శ్రీలీల తెలుగు ప్రాక్టీస్ చేయించారు. అయితే ఇదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముందు సరదాగా చేసినట్లు తెలుస్తోంది. ప్రీరిలీజ్ వేడుకకు ముందు డేవిడ్ వార్నర్‌కు తెలుగు నేర్పిస్తున్న ఈ వీడియోను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. Secret behind @davidwarner31's Telugu or actually not 😅Book your tickets for #Robinhood now!🎟️ https://t.co/ogblfmwZTd#RobinhoodTrailer TRENDING on YouTube.▶️ https://t.co/h2nhPhMrqEGRAND RELEASE WORLDWIDE ON MARCH 28th.@actor_nithiin @sreeleela14 @VenkyKudumula… pic.twitter.com/7rdEnEeoPT— Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2025 -
షాడో మిక్స్డ్ ఫోజులతో శ్రియారెడ్డి.. ఫర్పెక్ట్ ఆవుట్ఫిట్తో (ఫొటోలు)
-
ప్రీ రిలీజ్ వేడుకలో మెరిసిన సింగర్ ‘విద్యా వోక్స్’ (ఫొటోలు)
-
మరోసారి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
నటి అమీ జాక్సన్ మరోసారి తల్లయ్యారు. రెండోసారి కూడా మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె వెల్లడించారు. 2019లో జార్జ్ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసిన అమీ జాక్సన్.. వారి ప్రేమకు గుర్తుగా 'ఆండ్రూ' అనే బాబుకు జన్మనిచ్చారు. ఆయనతో విడిపోయిన తర్వాత హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ (Ed Westwick)ను నటి అమీ జాక్సన్ (Amy Jackson) ప్రేమించి గత ఏడాదిలో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. ఇప్పుడు ఈ దంపతులకు జన్మించిన బిడ్డకు 'ఆస్కార్ అలెగ్జాండర్' అని నామకరణం చేశారు.చిత్రపరిశ్రమలో ఐ, ఎవడు, రోబో 2.0 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అమీ జాక్సన్ సుపరిచితమే అని తెలిసిందే. ఆమె కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ పెళ్లికాకుండానే 'ఆండ్రూ' అనే కుమారుడికి మొదట జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత 2020లో పెళ్లి చేసుకుంటామని వారు ప్రకటించారు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా అది కాస్త వాయిదా పడింది. ఇంతలో వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ను ప్రేమించి 2024లో వివాహ బంధంలోకి ఆమె అడుగు పెట్టారు. ఇప్పుడు ఇద్దరు బిడ్డలకు తల్లిగా ఆమె జీవిత ప్రయాణం సంతోషంగా ఉంటుందని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ed Westwick (@edwestwick) -
సినిమాల్లో నటించడంపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినీరంగంలో కొనసాగుతారా..? మళ్లీ కొత్త సినిమాలు చేస్తారా..? అని అభిమానుల్లో చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ విషయంపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం రావడం కష్టమేనని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ, ఈ మూడు సినిమాల కోసం పవన్ ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారు. దీంతో నిర్మాతలకు బడ్జెట్ పెరిగి తలనొప్పిగా మారిందని కూడా చెబుతున్నారు.తమిళ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. తనకు డబ్బు అవసరం ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటానని చెప్పారు. అయితే, తాను సినిమా నిర్మాణరంగంలో మాత్రం భాగం కానన్నారు. 'నాకు ఉన్న ఏకైకా ఆదాయమార్గం నటన మాత్రమే.. నాకు డబ్బు అవసరం ఉన్నంతవరకూ నటిస్తూనే ఉంటాను.' అని పవన్ అన్నారు. 2020 ముందు వరకు పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ కేవలం రూ. 15 కోట్ల లోపు మాత్రమే అని ఇండస్ట్రీలో చెబుతున్న మాట.. అయితే, వకీల్‌సాబ్ సినిమా నుంచి ఆయన రూ. 50 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఓటీటీలో ట్విస్ట్ ఇచ్చిన ధనుష్.. తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’
కోలీవుడ్ స్టార్ హీరో డైరెక్ట్ చేసిన ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’ చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) పేరుతో తెలుగులో కూడా విడుదలైంది. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో తమిళ్ వర్షన్ అందుబాటులో ఉంది. అయితే, తెలుగు స్ట్రీమింగ్ గురించి మేకర్స్ ప్రకటించలేదు. ఈ క్రమలో తాజాగా సింప్లీ సౌత్ ఓటీటీ సంస్థ ఈ మూవీ తెలుగు రైట్స్ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే, స్ట్రీమింగ్ ఎప్పుడు అనేది తెలుపలేదు. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్స్‌లోకి వచ్చేసింది. అయితే, రీసెంట్గా తమిళ్ వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి త్వరలో తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వస్తుందని అందరూ ఆశించారు. కానీ, తెలుగు స్ట్రీమింగ్ మాత్రం సింప్లీ సౌత్ ఓటీటీ వేదికగా అందుబాటులోకి రానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇండియాలో ఈ ఓటీటీ సంస్థకు అనుమతి లేదు. కానీ, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు అందరూ ఈ చిత్రాన్ని సింప్లీ సౌత్ ఓటీటీలో చూడొచ్చు. కొద్దిరోజుల తర్వాత అమెజాన్, ఆహాలో ఈ సినిమా అందుబాటులోకి రావచ్చని సమాచారం ఉంది. -
పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు కన్నుమూత
తమిళనాడుకు చెందిన కోలీవుడ్ నటుడు, కరాటే మాస్టర్ షిహాన్ హుస్సేని (60) అనారోగ్యంతో కన్నుమూశారు. కోలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన ఆయనకు మంచి గుర్తింపే ఉంది. మార్షల్ ఆర్ట్స్‌లో చాలామందికి శిక్షణ ఇచ్చిన షిహాన్ హుస్సేనికి ఫ్యాన్స్ కూడా భారీగానే ఉన్నారు. పవన్ కల్యాణ్, దళపతి విజయ్ ఇద్దరూ కూడా ఆయన వద్దే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ముఖ్యంగా పవన్ ఆయన వద్దే మార్షల్ ఆర్ట్స్‌తో పాటు కరాటే, కిక్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు.కొన్ని నెలలుగా షిహాన్ హుస్సేని బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. అయితే, తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని అందుకోసం తను నిర్మించుకున్న మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రాన్ని అమ్మేస్తున్నట్లు ఆయన చెప్పాడు. దానిని తన శిష్యుడు పవన్ కల్యాణ్ కొనుగోలు చేస్తే సంతోషిస్తానని ఆయన చివరగా కోరాడు. తన వేదన పవన్ వరకు వెళ్తే తప్పకుండా సాయం చేస్తాడని కూడా షిహాన్ హుస్సేని ఆశించాడు. ఆయన అభ్యర్తన పవన్ కల్యాణ్ వరకు చేరిందో లేదో తెలియదు. ఇప్పుడు షిహాన్ హుస్సేని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. దీంతో ఆయన వద్ద శిక్షణ పొందిన కొందరు శిష్యులు మాట్లాడుతూ.. మాస్టర్ చివరి కోరిక తీరకుండా వెళ్లిపోయారని వాపోతున్నారు.పదిరోజుల క్రితం పవన్‌ను అభ్యర్థించిన షిహాన్ హుస్సేనికొద్దిరోజుల క్రితం షిహాన్ హుస్సేన్ తన శిష్యుడు పవన్ కల్యాణ్ తన శిక్షణా కేంద్రాన్ని కొనమని కోరారు. ఈ క్రమంలో పవన్‌తో కొన్ని విషయాలను పంచుకున్నారు ' నా వద్ద శిక్షణ తీసుకుంటున్న సమయంలో అతనికి పవన్ అని పేరు పెట్టాను. ఈ మాటలు అతని చెవులకు చేరితే అతను తప్పకుండా స్పందిస్తాడని తెలుసు. అతను ఈ మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రాన్ని కొనుగోలు చేసి భవిష్యత్ తరాల కోసం నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. అతను ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అని నాకు తెలుసు. కానీ, అతను నా దగ్గర శిక్షణ పొందిన రోజులు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. శిక్షణా కేంద్రాన్ని శుభ్రం చేయడమే కాదు.. ప్రతిరోజు నాకు టీ అందించే వాడు కూడా.. మార్షల్ ఆర్ట్స్ ను దేశవ్యాప్తంగా విస్తరింపచేయాలని ఇద్దరమూ మాట్లాడుకునే వాళ్లం. ఇప్పుడు దానిని పవన్ పూర్తి చేస్తాడని ఆశిస్తున్నాను.' అని హుస్సేని అన్నారు. ఈ శిక్షణ కేంద్రాన్ని వాణిజ్య సముదాయంగా లేదా నివాస అపార్ట్‌మెంట్‌గా మార్చే వ్యక్తికి అమ్మే బదులు, ఇది తన వారసత్వాన్ని సజీవంగా ఉంచడంలో సహాయపడుతుందని ఆయన నమ్మారు. ఆర్చరీలోనూ షిహాన్ హుస్సేని శిక్షణ ఇచ్చాడు. మార్షల్ ఆర్ట్స్ సుమారు 10 వేల మందికి పైగా ఆయన వద్ద ట్రైన్ అయ్యారు.. ఆర్చరీలో 1000 మందికి పైగా విద్యార్థులను ఆయన తయారు చేశారు.పవన్ కల్యాణ్ స్పందనమార్షల్ ఆర్ట్స్‌లో తనకు శిక్షణ ఇచ్చిన షిహాన్ హుస్సేని మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి సమయంలో హుస్సేని కుటుంబ సభ్యులకు మరింత బలాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వద్ద కరాటేలో శిక్షణ పొందానని పవన్ చెప్పుకొచ్చారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారనే వార్త తనకు తెలిసిందని, ఈనెల 29న ఆయన్ని పరామర్శించడానికి చెన్నై వెళ్లాలనుకున్నానని ఆయన అన్నారు. ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వస్తుందనుకోలేదన్నారు. -
‘రాబిన్ హుడ్’ ప్రీ రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ కేతిక శర్మ (ఫొటోలు)
-
‘ఓ భామ అయ్యో రామ’ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆస్కార్ దర్శకుడిపై దాడి.. ఆచూకీ కూడా గల్లంతు
అస్కార్ అవార్డ్ గ్రహిత దర్శకుడు హమ్దాన్ బల్లాల్‌పై ఇజ్రాయెల్ స్థిరనివాసులు దాడి చేశారు. 'నో అదర్ ల్యాండ్' డాక్యుమెంటరీ చిత్రానికి ఆయన కో-డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ చిత్రం విడుదల సమయంలో ఇజ్రాయెల్‌తో పాటు చాలా విదేశాల్లో ఉన్న ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. పాలస్తీనాకు చెందిన బల్లాల్ ఈ సినిమాలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చూపారు. దీనిని వారు జీర్ణించుకోలేకపోయారు. ఆయనపై దాడి చేస్తామని గతంలోనే వారు హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కొన్నేళ్లుగా హింస జరుగుతున్న నేపథ్యంలో 'నో అదర్ ల్యాండ్' అనే డాక్యుమెంటరీతో దర్శకుడు హమ్దాన్ బల్లాల్ సంచలనం రేపాడు. దీంతో ఆగ్రహం చెందిన ఇజ్రాయెల్‌లోని వలసదారులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. కారులో వెళ్తున్న బల్లాల్ను అడ్డగించిన ఇజ్రాయెల్ స్థిరనివాసులు సుమారు 20 మంది ముసుగులు ధరించి రాళ్ళు, కర్రలతో దాడి చేశారు. ఆపై ఇజ్రాయెల్ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుందని సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు చెప్పినట్లు ఆయన మిత్రుడు యువల్ అబ్రహం తెలిపారు. తీవ్రంగా గాయపడిన బల్లాల్ తల నుంచి అధిక రక్తస్రావం అవుతుందని ఆయన పేర్కొన్నాడు. అయితే, ఇప్పుడు అతని ఆచూకి ఎక్కడ ఉందో తెలియదని ఆయన చెప్పుకొచ్చాడు. -
హారర్ కామెడీ షురూ
వరుణ్ తేజ్ హీరోగా ‘వీటీ 15’(వర్కింగ్ టైటిల్) సినిమా షురూ అయింది. రితిక నాయక్ హీరోయిన్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లోప్రారంభమైంది.‘‘ఇండో–కొరియన్ హారర్ కామెడీగా రూపొందుతోన్న చిత్రం ‘వీటీ 15’. సోమవారం నుంచే హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్‌ప్రారంభించాం. వరుణ్ తేజ్ సరికొత్త పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రం ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
మా కెరీర్లో రాబిన్ హుడ్ బెస్ట్: వెంకీ కుడుముల
‘‘అవసరం ఉన్న వారి కోసం నిలబడే హీరో ‘రాబిన్‌హుడ్’. మా చిత్ర కథకి ఈ టైటిల్ యాప్ట్. ఈ మూవీ చాలా వైవిధ్యంగా ఉంటుంది. మంచి సందేశం కూడా ఉంటుంది. నితిన్, నా కెరీర్లో ‘రాబిన్ హుడ్’ బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ వినోదాత్మక చిత్రం ఇది’’ అని డైరెక్టర్ వెంకీ కుడుముల చెప్పారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.ఈ సందర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘భీష్మ’ సినిమా తర్వాత చిరంజీవిగారి కోసం ఒక కథ అనుకున్నాను. ఆయనకి ఫస్ట్ ఐడియా చెప్తే చాలా ఎగై్జట్ అయ్యారు. అయితే ఎక్కడో ఓ దగ్గర చిరంజీవిగారిని సంతృప్తి పరచలేకపోయాను. దీంతో మరో కథతో వస్తానని ఆయనకి చెప్పాను. కచ్చితంగా చిరంజీవిగారితో సినిమా చేస్తాను. నేను చెప్పిన ‘రాబిన్ హుడ్’ ఐడియా నితిన్‌కి నచ్చింది. ‘భీష్మ’ సినిమాతో నాకు, నితిన్‌కి మధ్య మంచి బంధం ఏర్పడింది. మైత్రీ మూవీ మేకర్స్ రాజీ పడకుండా సినిమాని నిర్మించారు’’ అని తెలిపారు.వార్నర్ సరదాగా తీసుకున్నారుఇదిలా ఉంటే... ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ గురించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మీ అబీప్రాయం ఏంటి? అని వెంకీని అడిగితే... ‘‘ఫంక్షన్ అయిపోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్‌గారి మాటలకు అర్థం ఏమిటనేది నేను వార్నర్గారికి చెప్పాను. ఆయన నవ్వి.. క్రికెట్లో కూడా ఇలాంటివి సహజమే అన్నారు. సీనియర్ ఆర్టిస్టుగా రాజేంద్ర ప్రసాద్‌గారు తన కోస్టార్స్ని చిన్న పిల్లల్లా అనుకుని, అలా సరదాగా అంటుంటారు. వార్నర్గారిని కూడా అలా సరదాగా అన్నారు’’ అని పేర్కొన్నారు. -
శివభక్తుడిగా మారిపోయా: విష్ణు మంచు
‘‘నేను ఆంజనేయస్వామి భక్తుడిని. కానీ ‘కన్నప్ప’ సినిమా ప్రయాణంతో శివభక్తుడిగా మారిపోయాను. మా చిత్రం అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని విష్ణు మంచు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా రూపొందిన సినిమా ‘కన్నప్ప’. మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, బ్రహ్మానందం, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. కాగా హైదరాబాద్‌లో జరిగిన ‘రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘కన్నప్ప’ యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘కన్నప్ప’లో ప్రభాస్ పాత్రని ఆడియన్స్ ఎంత ఊహించుకున్నా.. అంతకుమించి ఉంటుంది’’ అని తెలిపారు.‘‘2016 జనవరిలో నేను శ్రీకాళహస్తికి వెళ్లి శివుణ్ణి దర్శించుకున్నాను. ఆ శివుడే నన్ను ‘కన్నప్ప’ప్రాజెక్ట్‌లోకి పంపించాడు. అదే శివ లీల’’ అని చెప్పారు ముఖేష్ కుమార్ సింగ్. బ్రహ్మాజీ, రఘుబాబు పాల్గొన్నారు. -
'చనిపోయిన వాళ్లు మళ్లీ తిరిగొస్తారా?'.. ఆసక్తిగా 28 డిగ్రీల సెల్సియస్ ట్రైలర్
నవీన్ చంద్ర, షాలిని జంటగా నటించిన చిత్రం '28 డిగ్రీస్ సెల్సియస్'(28°C Movie). ఈ చిత్రానికి పొలిమేర సిరీస్ చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ కరోనాకు ముందే రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మించారు.ట్రైలర్ చూస్తే హారర్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒక అమ్మాయిని 28 డిగ్రీల సెల్సియస్‌లోనే కాపాడుకునే కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. ట్రైలర్లో సీన్స్ చూస్తే ఓ ఇంటి చుట్టే ఈ కథ తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించారు. -
గేమ్ ఛేంజర్‌లో ఛాన్స్.. ఎలా వచ్చినా నాకైతే గర్వంగా ఉంది: నవీన్ చంద్ర
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర నటించిన చిత్రం '28 డిగ్రీ సెల్సియస్'. ఈ మూవీకి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో షాలిని హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. కరోనాకు ముందే రావాల్సిన ఈ మూవీ పలు కారణాలతో వాయిదా పడింది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన హీరో నవీన్ చంద్ర గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ చిత్రంలో అవకాశం రావడంపై ఆయన మాట్లాడారు. అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు గర్వపడతానని నవీన్ చంద్ర అన్నారు. నన్ను ఎలా సెలెక్ట్ చేసినప్పటికీ ఆ మూవీ చేయడం నా కెరీర్లో ఓ గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు.నవీన్ చంద్ర మాట్లాడుతూ..'పెద్ద బడ్జెట్, పెద్ద సినిమా.. అందరు ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని గేమ్ ఛేంజర్ తీశారు. నేను బళ్లారి నుంచి వచ్చా. అలాంటి పెద్ద సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు గర్వంగా ఉంది. ఫలితం పక్కనపెడితే ఆ బిగ్గెస్ట్ బడ్జెట్.. బిగ్గెస్ట్ స్టార్ సినిమాలో ఛాన్స్ రావడమే చాలా గొప్పగా ఫీలయ్యా. నేను కొత్తవారితోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంటాను. అయితే నేను చేసిన మొదటి పెద్ద సినిమా నేను లోకల్.. ఆ తర్వాత అరవింద సమేత వీరరాఘవ. మధ్యలో ఎక్కువగా చిన్న చిన్న బడ్జెట్ చిత్రాలే చేశా. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌కు వాళ్లు ఎలా సెలెక్ట్ చేసినా శంకర్ సార్‌తో, దిల్‌రాజ్ ప్రొడక్షన్లో వర్క్ చేయాలనే లక్ నాకు ఉంది. అందుకే గేమ్ ఛేంజర్‌లో అవకాశం వచ్చింది' అని అన్నారు. -
జపాన్‌లో దేవర ఫీవర్.. ఆయుధ పూజ సాంగ్‌కు ఫ్యాన్స్ స్టెప్పులు
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన ఫుల్ యాక్షన్ మూవీ దేవర పార్ట్-1. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే మన టాలీవుడ్ సినిమాలకు జపాన్‌లో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను జపాన్‌లోనూ విడుదల చేయనున్నారు. ఇప్పటికే మన యంగ్ టైగర్ జపాన్ చేరుకుని ప్రమోషన్లతో బిజీ అయిపోయారు. తాజాగా అక్కడి ఫ్యాన్స్‌తో కలిసి ఓ థియేటర్లో సందడి చేశారు.ఈ సందర్భంగా దేవర మూవీలోని ఆయుధ పూజ సాంగ్‌కు జపాన్ ఫ్యాన్స్ డ్యాన్స్ చేశారు. వారితో కలిసి మన జూనియర్ ఎన్టీఆర్ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను దేవర టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. దేవరను మార్చి 28న జపాన్‌లో విడుదల కానుందని మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో దేవర-2 కూడా ఉంటుందని డైరెక్టర్ కొరటాల ఇప్పటికే ప్రకటించారు.#Devara fever grips Japan! 🌊🔥Man of Masses #NTR stuns the Japanese audience as he grooves to Ayudha Pooja with a fan! 🤙🏻@tarak9999 #デーヴァラ #KoratalaSiva @anirudhofficial @devaramovie_jp pic.twitter.com/y9ybqaAYsT— Devara (@DevaraMovie) March 24, 2025┼─映画『#デーヴァラ』ジャパンプレミア@新宿ピカデリー🔱┼─1日目 無事に終わりました🦈サプライズゲストで登場した#キンタロー 。さんと#NTRJr がダンス🕺✨お越しいただいたみなさま、ありがとうございました❗️ pic.twitter.com/QvMutZAyYB— 【公式】映画『デーヴァラ』 (@devaramovie_jp) March 24, 2025 -
సెన్సార్ పూర్తి చేసుకున్న మ్యాడ్ స్క్వేర్.. ఇక థియేటర్లలో నవ్వులే!
గతంలో బాక్సాఫీస్ వద్ద యూత్‌ను అలరించిన సినిమా మ్యాడ్. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న మ్యాడ్ స్క్వేర్తో మరోసారి కడుపుబ్బా నవ్వించేందుకు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మన యంగ్ హీరోలు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్. ఈ చిత్రాన్ని కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే మ్యాడ్ మూవీ మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. మ్యాడ్ స్క్వేర్ సెన్సార్ పూర్తయినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేషన్ వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ సినిమా మార్చి 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.Manaki yedi thinnaga jaragavu gaa…Idhi anthe …Mission Censor: Completed ☑️#MADSquare certified U/A for a fun packed theatrical ride ❤️Theatres lo kooda anni light lu velige entertainment tho siddam 😎In cinemas worldwide from MARCH 28th! 🥳@NarneNithiin… pic.twitter.com/HRDODIX4ib— Sithara Entertainments (@SitharaEnts) March 24, 2025 -
రెమ్యునరేషన్‌పై హీరోకు ప్రశ్న.. నాకు ఇదేం టార్చర్ రా బాబు!
సరికొత్త సినిమాలతో టాలీవుడ్ ప్రియులను అలరిస్తోన్న యంగ్ హీరో సుహాస్(Suhas). తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సుహాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఓ భామ అయ్యో రామా'(O Bhama Ayyo Rama). ఆ మూవీలో మాళవిక మనోజ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో సుహాస్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు యాడ్లకు ఎంత తీసుకుంటారో.. అలాగే సినిమాకు అంతే రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్ ఉంది.. దీనిపై మీరేమంటారు అని సుహాస్‌ను ప్రశ్నించారు. దీనిపై సుహాస్ కూడా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.సుహాస్ మాట్లాడుతూ..' ఇదేంటీ నాకు టార్చర్. నేను అనుకున్నంత నంబర్ అయితే లేదు. అయినా కూడా నా యాక్టింగ్ బాగుందో లేదో చూడాలి కానీ.. ఈ రెమ్యునరేషన్ గోల ఏంది? అన్నారు. అలాగే ప్రభాస్ స్పిరిట్‌లో నటిస్తున్నారా? అని ప్రశ్నించగా..అదేం లేదు అని సుహాస్ సమాధానమిచ్చారు. కాగా.. ఈ చిత్రంలో అనిత హస్సానందాని, అలీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
హీరో నితిన్‌పై హర్టయ్యా.. అవమానభారంతో షూటింగ్‌కు రానన్నా..: హర్షవర్ధన్
'అమృతం' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నటుడు హర్షవర్ధన్. (Harsha Vardhan) నటుడిగా, రచయితగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. తాజాగా ఇతడు హీరో నితిన్‌పై అలిగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. హర్షవర్ధన్ మాట్లాడుతూ.. 'గుండెజారి గల్లంతయ్యిందే సినిమా (Gunde Jaari Gallanthayyinde) ఈవెంట్లో స్టేజీపైకి వెళ్లి మాట్లాడదామనుకున్నాను. అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. యాంకర్ అందరి పేర్లు చదువుతోంది. హర్షవర్ధన్ అని పిలిచింది. నన్ను పిలవలేదునేనే అనుకుని లేచా.. ఇంతలో బాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణె టకటకా స్టేజీపైకి వెళ్లి మాట్లాడాడు. ఓర్నీ.. పిలిచింది మనల్ని కాదా అనుకుని ఎవరూ చూడలేదుగా అని కూర్చున్నాను. రైటర్ అయి ఉండి నిన్ను పిలవలేదేంటి? అని పక్కనవాళ్లు అన్నారు. అంతే.. నేను హర్టయ్యాను. నన్ను పిలుస్తారేమోనని చివరిదాకా చూశాను. కానీ పిలవలేదు. బార్‌కు వెళ్లిపోదామనుకున్నాను. సినిమాలో ఒకే ఒక్క సీన్ మిగిలిపోయి ఉంది. దాన్ని ఈవెంట్ అయ్యాక షూట్ చేద్దామన్నారు. ఈ షూటింగ్‌కు కాస్త లేట్‌గా వస్తానని నితిన్ ఫోన్ చేశాడు. సారీ చెప్తాడని వెళ్లా..అప్పటికే బాధలో ఉన్న నేను నాకేం సంబంధం లేదు, నేనే రావట్లేదు అని చెప్పా. నితిన్ ఆశ్చర్యపోతూ.. ఏమైంది? నువ్వెళ్లకపోతే ఎలా? అని ఆరా తీశాడు. వద్దులే.. ఇప్పటికే అయింది చాలు అని దిగులుగా మాట్లాడాను. అప్పుడు నితిన్‌కు నేను స్టేజీపైకి రాలేదన్న విషయం గుర్తొచ్చి రమ్మని పిలిచాడు. నాకు సారీ చెప్తాడేమో అన్న ఆశతో వెళ్లాను. ప్రాబ్లమేంటి? అన్నాడు. నన్ను పిలవకపోవడం బాధగా అనిపించిందన్నాను. నీ పేరు పిలిచారు కదా.. అంటే హర్షవర్దన్ రాణె స్టేజీ ఎక్కాడు. దానికి నాకు ఏంటి సంబంధం? అన్నాను. చదవండి: రేయ్ వార్నరూ.. క్రికెట్ ఆడమంటే డ్యాన్స్ చేస్తావా?: రెచ్చిపోయిన నటుడునీకు బాధ్యత లేదా? క్లాసు పీకిన నితిన్యాంకర్ హర్షవర్ధన్ రాణె అని పిలవలేదు.. హర్షవర్ధన్ అని పిలిచింది. నువ్వెందుకు రాలేదు? పైగా అక్కడున్న 30 మందిలో నువ్వు రాలేదన్న విషయం గుర్తించి యాంకర్‌కు చెప్పలేదనా నీ బాధ. దీనికే షూటింగ్‌కు రాను, నాతో మాట్లాడను అంటున్నావా? పేరు పిలిచింది నేను కాదు, యాంకర్. పోనీ పిలవలేదే అనుకో.. ఇది నీ సినిమా కాదా? నీ బాధ్యత కాదా? నీ అంతటగా నువ్వు స్టేజీపైకి రావాలిగా! నేను కదా నితిన్‌కు సారీ చెప్పాలి!స్టేజీపై ఉన్నవాళ్లందరినీ గుర్తుపెట్టుకుని మాట్లాడటం ఎంత కష్టమో రేపు పొద్దున నువ్వు మైక్ పట్టుకున్నప్పుడు తెలుస్తుంది. అక్కడంతా యాంత్రికంగా ఉంటుంది అని చెప్పుకుంటూ పోయాడు. విషయం అర్థమైంది. నేను కదా నితిన్‌కు సారీ చెప్పాలి అనిపించింది. ఇంత తప్పు చేశానేంటనుకున్నాను. ఈ విషయంలో నన్ను నేను ఈ రోజుకూ క్షమించుకోలేను. నితిన్ ఇదంతా ఎప్పుడో మర్చిపోయి ఉండొచ్చు' అని హర్షవర్ధన్ చెప్పుకొచ్చాడు. ఈయన చివరగా కోర్ట్ సినిమాలో న్యాయవాదిగా నటించాడు.చదవండి: ఆ బాలనటి గుర్తుందా? ఇప్పుడు పెళ్లికూతురయ్యింది! -
నాగార్జునకు ఏం మాట్లాడాలో తెలీదు
-
నాని వర్సెస్ విజయ్.. రౌడీ ఫేట్ మారేనా..!
-
అమ్మాయిల్ని నమ్మొదంటూ 'సుహాస్' కొత్త సినిమా టీజర్
టాలీవుడ్ హీరో సుహాస్(Suhas) నటించిన కొత్త సినిమా 'ఓ భామ అయ్యో రామ'(Oh Bhama Ayyo Rama) నుంచి టీజర్ వచ్చేసింది. మాళవిక మనోజ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని వీ ఆర్ట్స్ బ్యానర్‌పై హరీశ్ నల్ల నిర్మించారు. ఈ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త కథలతో ఆడియన్స్‌ను అలరిస్తోన్న సుహాస్ మరో కథతో ప్రేక్షకులను మెప్పించేలా టీజర్ ఉంది. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో అనిత హాసానందని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ , ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మోయిన్, సాథ్విక్ ఆనంద్, నాయని పావని కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రేయ్ వార్నరూ.. క్రికెట్ ఆడమంటే డ్యాన్స్ చేస్తావా?: రెచ్చిపోయిన రాజేంద్రప్రసాద్
కథల ఎంపికలో తడబడి ట్రాక్ తప్పాను. కానీ ఈసారి కచ్చితంగా హిట్ కొడతాను అని గట్టి నమ్మకంతో ఉన్నాడు హీరో నితిన్ (Nithiin). భీష్మ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood Movie). శ్రీలీల కథానాయిక. రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రలు పోషించారు. కేతిక శర్మ ఐటం సాంగ్‌లో మెప్పించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వార్నర్ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమాలో అతిథి పాత్ర చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) గెస్ట్‌గా విచ్చేశాడు. అయితే వార్నర్‌ను ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అతడి అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేసినప్పుడు లేడీస్ టైలర్ నుంచి హీరోగా నటించిన రోజులు గుర్తుకొచ్చాయి. ప్రతి ఇంట్లో ఒక రాబిన్‌హుడ్ ఉండాలనే కథ ఇది. వార్నర్‌పై సెటైర్లుసినిమాలో అదిదా సర్ప్రైజు అనే పాట ఉన్నట్లే.. మా వెంకీ కుడుముల, నితిన్ ఇద్దరూ డేవిడ్ వార్నర్‌ను పట్టుకొచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ వార్నర్‌ను.. క్రికెట్ ఆడవయ్యా అంటే డ్యాన్సులేశాడు అంటూ మూతి అష్టవంకర్లు తిప్పుతూ అతడిపై సెటైర్లు వేశాడు. చివర్లో వీడు మామూలోడు కాదు.. రేయ్ వార్నరూ.. నువ్వొక దొంగ.... అంటూ ఒక బూతుపదం కూడా వాడాడు.రాజేంద్రప్రసాద్‌పై అభిమానుల ఆగ్రహంఅది అర్థం కాని వార్నర్ నవ్వుతూ కనిపించాడు. ఇది చూసిన అభిమానులు రాజేంద్రప్రసాద్‌పై మండిపడుతున్నారు. వార్నర్ సినిమా పాటలకు స్టెప్పులేయడం చూసే కదా సినిమాలోకి తీసుకున్నారు.. అలాంటప్పుడు అతడి డ్యాన్స్ గురించి వంకరగా మాట్లాడటం దేనికని విమర్శిస్తున్నారు. వయసులో పెద్దవాడివైన నువ్వు ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదని నటుడిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: 'పుష్ప' ఫస్ట్ ఛాయిస్ సమంత కాదు.. సర్ప్రైజ్ ఇచ్చిన నిర్మాత -
ఉగాది, రంజాన్ స్పెషల్స్.. థియేటర్లో 5, ఓటీటీలో 6 క్రేజీ సినిమాలు
మార్చి చివరి వారంలో సినిమాల జాతర భారీగానే ఉండనుంది. తెలుగు సంవత్సరాది ఉగాది, రంజాన్ వరుసగా వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు సందడి చేయనున్నాయి. దీంతో థియేటర్స్ అన్నీ కూడా కళకళలాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాషల నుంచి కూడా భారీ మూవీస్ విడుదల కానున్నడంతో సినిమా అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు. ఇదే క్రమంలో ఓటీటీ నుంచి కూడా పలు హిట్ సినిమాలు స్ట్రీమింగ్కు రానున్నాయి.ధియేటర్స్‌లో విడుదలయ్యే సినిమాలు🎥 లూసిఫర్2- మార్చి 27🎥 వీర ధీర శూర- మార్చి 27🎥 రాబిన్‌హుడ్- మార్చి 28🎥 మ్యాడ్ స్క్వేర్- మార్చి 28🎥 సికందర్- మార్చి 30ఓటీటీ సినిమాలునెట్ఫ్లిక్స్🎥మిలియన్ డాలర్ సీక్రెట్ (రియాల్టీ షో) మార్చి 26🎥కాట్ (థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 26 🎥దేవా -మార్చి 29అమెజాన్ ప్రైమ్🎥హాలెండ్ (ఇంగ్లీష్) మార్చి 27🎥శబ్ధం (తెలుగు)- మార్చి 28🎥మలేనా - మార్చి 29జియో హాట్‌స్టార్🎥ముఫాసా: ద లయన్ కింగ్ (హిందీ/తెలుగు) మార్చి 26🎥ఓం కాళీ జై కాళి (తెలుగు/వెబ్ సిరీస్) - మార్చి 28జీ5🎥విడుదల పార్ట్-2 (హిందీ) మార్చి 28🎥మజాకా - మార్చి 28ఆహా🎥ది ఎక్స్టార్డనరీ జర్నీఆఫ్ ది ఫకీర్ (తెలుగు) మార్చి 26🎥మిస్టర్ హౌస్ కీపింగ్ ( తమిళ్)- మార్చి 25 -
షాప్ ఓపెనింగ్ అంటూ ట్రాప్.. నటికి చుక్కలు చూపించిన యువతి
హైదరాబాద్‌లో బాలీవుడ్ నటిని ట్రాప్ చేసి వ్యభిచారం కూపంలో దింపే ప్రయత్నం చేశారు. ఈ ఘటన మార్చి 18న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన టీవీనటి (30)ని హైదరబాద్‌లో ఉండే ఆమె స్నేహితురాలు ఆహ్వానించింది. ఇక్కడ ప్రముఖ షాప్ ప్రారంభోత్సవంలో అతిథిగా రావాలని పిలుపునిచ్చింది. అందుకు గాను విమానఛార్జీలతో పాటు తగిన రెమ్యునరేషన ఇస్తారని చెప్పింది. దీంతో ఆ నటి హైదరాబాద్‌కు వచ్చేసింది. ఆమెకు మాసబ్‌ట్యాంక్ వద్ద ఉన్న శ్యామ్‌నగర్ కాలనీలోని ఒక అపార్ట్మెంట్లో బస ఏర్పాటు చేశారు. ఆమెకు అవసరం అయ్యే పనులు చేసేందుకు ఒక వృద్ధురాలిని ఏర్పాటు చేశారు.ఇక్కడి వరకు అంతా బాగుంది. కానీ, 21న రాత్రి 9 గంటల సమయంలో నటి ఉన్న గదిలోకి వెళ్లి తమతో పాటుగా వ్యభిచారం చేయాలని, ఇద్దరు కస్టమర్స్ ఉన్నారంటూ బలవంతం చేశారు. ఆమె నో చెప్పడంతో రెండు గంటల తర్వాత ముగ్గురు వ్యక్తులు ఆమె గదిలోకి ఎంట్రీ ఇచ్చి తమతో గడపాలని బెదిరింపులకు దిగారు. ఆమె కేకలు వేయడంతో దాడి చేసి వారు పారిపోయారు. ఇంతలో వృద్ధురాలు, ఇద్దరు మహిళలు నటి గదిలోకి ప్రవేశించి ఆమెను బంధించి తన వద్ద ఉన్న రూ.50 వేల నగదుతో పారిపోయారు. ఈ క్రమంలో తన స్నేహితురాలికి ఫోన్ చేసినా స్పందించలేదని ఆ నటి పేర్కొంది. దీంతో బాధితురాలు 100కు ఫోన్ చేసి పోలీసులకు చెప్పడంతో వారు ఆమెను రక్షించారు. నటి ఫిర్యాదుతో మాసబ్‌ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం విచారణ ప్రారంభించారు. -
‘రాబిన్ హుడ్’ ట్రైలర్ రిలీజ్..డేవిడ్ వార్నర్ ఎంట్రీ అదుర్స్ (ఫొటోలు)
-
అజిత్‌ను డైరెక్ట్ చేయనున్న స్టార్ హీరో
నటుడు ధనుష్ ఇప్పుడు నటనతో పాటూ దర్శకత్వం పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పవచ్చు. ఈయన ఇటీవల వరుసగా మూడు చిత్రాలకు దర్శకత్వం వహించడం విశేషం. అందులో ధనుష్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన రాయన్ చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించింది. ఇది ఈయన కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం కావడం గమనార్హం. అదేవిధంగా కొత్త తారలతో నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోపం అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రానికీ దర్శక ,నిర్మాత బాధ్యతలను నిర్వహించారు. తాజాగా కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇడ్లీ కడై. ఇందులో నటి నిత్యామీనన్ నాయికిగా నటించారు. ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. కాగా ఈయన కథానాయకుడిగా నటిస్తున్న మరో ద్విభాషా చిత్రం కుబేర. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదేవిధంగా ప్రస్తుతం ఓ హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ నటిస్తున్నారు. కాగా త్వరలో డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కరన్ నిర్మించే చిత్రంలో కథానాయకుడుగా నటించరనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తదుపరి అజిత్ హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరందుకుంది. దీని గురించి డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆకాష్ భాస్కరన్ ధృవపరిచారు. ఆయన ఓ భేటీలో పేర్కొంటూ తాను త్వరలో ధనుష్ కథానాయకుడిగా చిత్రం నిర్మించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా అజిత్ హీరోగా ధనుష్ దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయని, అజిత్ కోసం ధనుష్ కథను సిద్ధం చేస్తున్నారని, త్వరలోనే అజిత్‌ను కలిసి కథను వినిపించనున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పాజిటివ్ రిజల్ట్ వస్తుందనే తాను భావిస్తున్నట్లు నిర్మాత ఆకాష్ భాస్కర్ పేర్కొన్నారు. ఇకపోతే అజిత్ కథానాయకుడిగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకొని ఏప్రిల్ 10వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అదేవిధంగా ఈయన నటించే తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. దీంతో ధనుష్ దర్శకత్వంలో నటించడానికి పచ్చ జెండా ఊపుతారా అన్న ఆసక్తి కూడా నెలకొంది. -
బ్రిటిష్ పాత్రలో...
సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల యేటిగట్టు’. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. నూతన దర్శకుడు కేపీ రోహిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.కాగా ఈ సినిమాలో బ్రిటిష్ అనే పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. రగ్డ్ హెయిర్, బ్లాక్ కోట్తో బ్రిటిష్ పాత్రలో శ్రీకాంత్ లుక్ వినూత్నంగా ఉంది. ఆదివారం (మార్చి 23) శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది. -
రాజకీయం... సందేశం
ఇంద్రజ, అజయ్, జయసుధ, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. గడ్డం రమణా రెడ్డి దర్శకత్వంలో బొల్లా రామకృష్ణ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో ఇంద్రజ మాట్లాడుతూ– ‘‘మీ రియల్ లైఫ్‌లో చూసినవి, విన్నవి, జరిగిన కొన్ని సంఘటనలను ఈ సినిమాలో దర్శకుడు చక్కగా చూపించారు. ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఆలోచింపజేసే చిత్రం ఇది’’ అన్నారు.‘‘ఈ సినిమాలో నేను సీఎంగా నటిస్తే, నా భార్య పాత్రలో ఇంద్రజ నటించారు. ఈ ప్రమోషనల్ సాంగ్ చూసి ఎమోషనల్ అయ్యాను’’ అని తెలిపారు అజయ్. ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే సందేశాత్మక చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు బొల్లా రామకృష్ణ. ‘‘మన నగరం ఎలా ఉంది? అనేది ఈ పాటలో చూపించాను. నేను అమెరికాలో ఉంటాను. కుండపోత వర్షం వచ్చినా చుక్క నీరు నిలవదు. ఇక్కడ వర్షం వస్తే అంతే. నేను ఎవరినీ విమర్శించడం లేదు. నగరం బాగుండాలనే తపనతో చెబుతున్నాను. సామాజిక నేపథ్యం ఉన్న చిత్రం ‘సీఎం పెళ్లాం’’ అని అన్నారు గడ్డం రమణారెడ్డి. -
అందాల సిరి
‘మా అందాల సిరి మీద పడనీకు ఏ కళ్లు... ఆ చిరునవ్వే పచ్చంగా ఉండాలి నూరేళ్లు... వేయాలి పరదాలు... చేయాలి సరదాలు... అమ్మా... నీ దీవెనలు తోడుంటే అంతే చాలు... మా ఊరి పొలిమేర దాటవుగా సంతోషాలు’ అంటూ సాగుతుంది ‘పరదా’ సినిమాలోని ‘మా అందాల సిరి’ పాట. అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత లీడ్ రోల్స్‌లో నటించిన ‘పరదా’ సినిమాలోని పాట ఇది.‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఆనంద మీడియా పతాకంపై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ ఈ సినిమాను నిర్మించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘మా అందాల సిరి...’ పాట లిరికల్ వీడియోను ఆదివారం రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు గోపీసుందర్ స్వరపరచిన ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా, శ్రీ కృష్ణ, రమ్య బెహరా పాడారు. -
మీ ఫ్యామిలీలోకి ఆహ్వానించినందుకు థ్యాంక్స్: డేవిడ్ వార్నర్
‘‘నమస్కారం... ‘రాబిన్ హుడ్’లో నటించే చాన్స్ రావడాన్ని గౌరవంగా ఫీలవుతున్నా. మీ ఫ్యామిలీలోకి నన్ను ఆహ్వానించినందుకు థ్యాంక్స్. ఈ సినిమాలోని నా కోస్టార్స్ చాలా కష్టపడ్డారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ‘రాబిన్ హుడ్’ పెద్ద సక్సెస్ కావాలి’’ అని ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పేర్కొన్నారు. నితిన్ , శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రల్లో నటించారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రీలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సినిమాలో అతిథి పాత్ర చేసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ వేడుకకు అతిథిగా హాజరై, ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ– ‘‘రాబిన్ హుడ్’ విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఒక సినిమాకు రియల్ హీరోలు నిర్మాతలే. ఇండియాలో మైత్రీ టాప్ ప్రొడక్షన్ హౌస్ అని ‘పుష్ప’ సినిమాతో నిరూపితమైంది. ‘రాబిన్ హుడ్’ని మైత్రీ వాళ్లు కాబట్టే ఇంత భారీగా తీశారు. నాపై ఉన్న ప్రేమను వెంకీ ఈ సినిమా రూపంలో చూపించాడు. డేవిడ్ వార్నర్గారి వల్ల ఈ సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. ప్రపంచ క్రికెట్లో ఆయన పెద్ద లెజెండ్ క్రికెటర్. కానీ తెలుగువారికి వార్నర్గారు.. డేవిడ్ భాయ్... వార్నర్ మామానే’’ అన్నారు.‘‘రాబిన్ హుడ్’ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ ట్రైలర్ చూడగానే ఈ సినిమా ష్యూర్ షాట్ బ్లాక్‌బస్టర్ అని వెంకీతో చెప్పాను’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘నితిన్ , డేవిడ్ వార్నర్గార్లు, చాలా బిజీగా ఉండి కూడా ఈ సినిమా చేసిన శ్రీలీల, ‘అదిదా సర్ప్రైజ్’ పాట చేసిన కేతికా, ఇతర టీమ్‌కి థ్యాంక్స్’’ అని తెలిపారు వై. రవిశంకర్. ‘‘భీష్మ’ తర్వాత నితిన్ అన్న, నేను ‘రాబిన్ హుడ్’తో వస్తున్నాం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం నితిన్ అన్న, బాగా తీయడానికి కారణం నవీన్ , రవిగార్లు. ఈ సినిమాకు బజ్ రావడానికి ఒక కారణం కేతికా ‘అదిదా సర్ప్రైజ్’ సాంగ్.. రెండోది డేవిడ్ వార్నర్గారు ఇండియన్ సినిమాకు రావడం’’ అని చెప్పారు వెంకీ కుడుముల.‘‘రాబిన్ హుడ్’తో హీరోగా కమర్షియల్ స్పేస్‌లో నితిన్ మరో లెవల్‌కి వెళ్తాడు. ఇలాంటి మరిన్ని సినిమాలు చేసి, వెంకీ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. మైత్రీ మూవీ మేకర్స్ లిస్ట్‌లోని పెద్ద హిట్స్ మూవీలో ‘రాబిన్ హుడ్’ ఉండాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు రాజేంద్రప్రసాద్. ‘‘ఆల్మోస్ట్ ఏడాది తర్వాత నేను హీరోయిన్గా వస్తున్న ‘రాబిన్ హుడ్’ని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు శ్రీలీల. ఈ వేడుకలో ‘పుష్ప’ సినిమాలోని ఫుట్ స్టెప్, ‘రాబిన్ హుడ్’లోని ‘అదిదా సర్ప్రైజ్’ పాట హుక్ స్టెప్స్ ట్రై చేసి, అలరించారు డేవిడ్ వార్నర్. -
సన్‌రైజర్స్ మ్యాచ్‌లో వెంకటేశ్ సందడి.. జెండా పట్టుకుని హుషారు
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‌కు క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం. గతంలో చాలాసార్లు టీమిండియా మ్యాచ్‌ల్లోనూ సందడి చేశారు. తాజాగా ఐపీఎల్ సీజన్లో మరోసారి స్టేడియంలో మెరిశారు. ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు ఆయన హాజరయ్యారు. ఎస్ఆర్హెచ్ జెండాను పట్టుకుని టీమ్‌కు మద్దతుగా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోను సన్‌రైజర్స్ హైదరాబాద్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది.కాగా.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు మన హీరో విక్టరీ వెంకటేశ్. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. పొంగల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు.Anytime, Uppal center lo Single handedly support chese our Victory Venkatesh is here 💪🧡#PlayWithFire | #SRHvRR | #TATAIPL2025 pic.twitter.com/2v4qDKh4bI— SunRisers Hyderabad (@SunRisers) March 23, 2025 -
హైదరాబాద్ లో వేడుకగా జరిగిన కీరవాణి కన్సర్ట్
ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి నిర్వహించిన కన్సర్ట్.. హైదరాబాద్ లో శనివారం రాత్రి వేడుకగా జరిగింది. హైటెక్స్ గ్రౌండ్ లో దాదాపు 10 వేల మంది ఆహుతుల ఈ ప్రోగ్రామ్ చూసి ఎంజాయ్ చేశారు. దాదాపు మూడు గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది.(ఇదీ చదవండి: వెంటిలేటర్ పై అల్లు అర్జున్ నానమ్మ!)ఇటీవలే ఒడిశాలో షూటింగ్ ముగించుకుని వచ్చేసిన రాజమౌళి.. 'నా టూర్ ఎమ్ఎమ్ కే' పేరుతో నిర్వహించిన ఈ కన్సర్ట్ లో పాల్గొన్నారు. ఇకపోతే ఈ సంగీత కార్యక్రమంలోనే కీరవాణి.. తన స్వరపరిచిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్ర గీతాలని ఆలపించారు. ఈయనతో పాటు 83 మంది సింగర్స్-టెక్నీషియన్స్ కన్సర్ట్ జరిగే ప్రాంతాన్ని సంగీతమయం చేశారు. ఈ కన్సర్ట్ ని నా జీవితంలో మర్చిపోనని కీరవాణి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: లేడీ కమెడియన్ కొడుక్కి పేరు పెట్టిన కమల్ హాసన్) -
ఖరీదైన బెంజ్ కొన్న 'విరూపాక్ష' నటి.. రేటు ఎంతో తెలుసా?
యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి ఓవైపు రియాలిటీ షోలు.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న సోనియా సింగ్ (Soniya Singh) ఇప్పుడు ఖరీదైన బెంజ్ కారు కొనేసింది. తాజాగా హైదరాబాద్ లో తన ప్రియుడితో కలిసి కొత్త కారులో షికారు వేసింది. ఇంతకీ కారు మోడల్ ఏంటి? ఖరీదెంత?(ఇదీ చదవండి: వీడియో: దుబాయిలోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్)యూట్యూబర్ గా పవన్ సిద్ధు అనే కుర్రాడితో ఎక్కువగా వీడియోలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సోనియా సింగ్.. 2023లో వచ్చిన 'విరూపాక్ష' (Virupaksha Movie) మూవీతో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. నితిన్ 'ఎక్స్ ట్రా' మూవీలోనూ కామెడీ రోల్ చేసింది. ప్రస్తుతం ఢీ షోలో యాంకర్ గా చేస్తోంది.ప్రియుడితో కలిసి రెండు చేతులా సంపాదిస్తున్న సోనియా.. మెర్సిడెజ్ బెంగ్ సీ క్లాస్ కారుని కొనుగోలు చేసింది. దీని ఖరీదు మార్కెట్ లో రూ.60-80 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: లేడీ కమెడియన్ కొడుక్కి పేరు పెట్టిన కమల్ హాసన్) View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)