
ప్రభాస్(Prabhas) హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘సీతా రామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt) ఓ కీలక పాత్రలో అతిథిగా మెరవనున్నారనే టాక్ వినిపిస్తోంది.
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆలియా ఓ యువరాణి పాత్ర చేయనున్నారని భోగట్టా. సినిమాలో కీలకంగా ఉండే ఈ పాత్ర కోసం చిత్రయూనిట్ ఆమెను సంప్రదించగా, ఆమె కూడా పచ్చజెండా ఊపారని బాలీవుడ్ టాక్. మరి ‘ఫౌజి’లో ఆలియా భట్ అతిథి పాత్రలో నటిస్తారా? లేదా అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (2022) చిత్రంలో రామ్‌చరణ్‌కి జోడీగా ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఇక జయప్రద, మిధున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఫౌజి’కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.